
కార్తి - అరవింద్ స్వామి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'సత్యం సుందరం'. ఫీల్‌గుడ్ చిత్రంగా ప్రేక్షకుల నుంచి మించి రివ్యూస్‌నే దక్కించుకుంది. సూర్య-జ్యోతిక తక్కువ బడ్జెట్‌లో ఈ మూవీని నిర్మించారు. సెప్టెంబర్ 28న థియేటర్‌లోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దీంతో 'సత్యం సుందరం' అభిమానుల్లో సంతోషం కనిపిస్తుంది.
తమిళంలో '96' వంటి ఫీల్ గుడ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్‌కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదికైన నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. అక్టోబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ, కన్నడ బాషల్లో అందుబాటులో ఉండనుంది. థియేటర్‌లో చూడలేకపోయిన వారు తమ ఫ్యామిలీ, స్నేహితులతో తప్పక చూడాల్సిన సినిమాగా నెటిజన్లు చెప్పుకొచ్చారు.

కథ అయితే, చాలా నెమ్మదిగా కొనసాగుతుంది. ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా సుమారు 3 గంటలపాటు ప్రేక్షకులను దర్శకుడు మెప్పించాడు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య, జ్యోతికలు దీనిని నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 60 కోట్లు రాబట్టిన 'సత్యం సుందరం' మంచి లాభాలను అందించారు. చిత్రంలో అరవింద్ స్వామి, కార్తి.. బావ-బావమరిదిగా నటించడం విశేషం.
Comments
Please login to add a commenttest comment
Add a comment
test comment