కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్’. ఇందులో అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్‌ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దీపావళి సందర్భంగా నవంబర్ 10న థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. తమిళనాడులోని ఒక దొంగ జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది.
విడుదలై నెలరోజులు కాకముందే ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 1 న లేదా 8న నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే దీనిపై మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓటీటీ రిలీజ్ డేట్‌పై మేకర్స్ త్వరలోనే ప్రకటన చేయనున్నారు. కాగా.. ఇప్పటికే ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
అసలు కథేంటంటే..
జపాన్ ముని అలియాస్ జపాన్(కార్తి) ఓ గజదొంగ. గోడలకు కన్నం వేసి దొంగతనం చేయడం.. గుర్తుగా అక్కడ ఓ బంగారు కాయిన్‌ను పెట్టి వెల్లడం అతని స్పెషాలిటీ. ఓ సారి హైదరాబాద్‌లోని రాయల్ అనే నగల దుకాణం నుంచి రూ. 200 కోట్ల విలువ చేసే గోల్డ్‌ని కొట్టేస్తారు. ఆ గోల్డ్ షాపులో తెలంగాణ హోమంత్రి సత్యమూర్తి(కేఎస్ రవికుమార్) షేర్ కూడా ఉండడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.
ఈ కేసు విచారణకై స్పెషల్ ఆఫీసర్స్ భవాని(విజయ్ మిల్టన్), శ్రీధర్(సునీల్) రంగంలోకి దిగుతారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం వెతుకుతుంటారు. అసలు ఆ దొంగతనం ఎవరు చేశారు? జపాన్ దొంగగా మారడానికి గల కారణం ఏంటి? దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు? శ్రీధర్‌తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు జపాన్‌కి ఎందుకు సహాయం చేశారు? పోలీసులకు చెందిన రహస్యాలు జపాన్ దగ్గర ఏం ఉన్నాయి? చివరకు జపాన్ జీవితం ఎలా ముగిసింది? అనేది తెలియాలంటే జపాన్ సినిమా చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment