కోలీవుడ్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ జపాన్. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహించాడు. నవంబర్ 10న భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఈ సినిమాకు అంతంతమాత్రమే స్పందన లభించింది. దీంతో తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిందీ మూవీ.. డిసెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. హిందీ వర్షన్ గురించి మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.
జపాన్ కథేంటంటే..
జపాన్ ముని (కార్తీ) ఓ గజదొంగ. అతడు కన్నాలు వేసేచోట గుర్తుగా ఓ బంగారు కాయిన్‌ను పెట్టి వెళ్తుంటాడు. అలా ఓసారి హైదరాబాద్‌లోని రాయల్ అనే నగల దుకాణం నుంచి రూ.200 కోట్లు విలువ చేసే బంగారం కొట్టేస్తాడు. ఆ బంగారు ఆభరణాల దుకాణంలో తెలంగాణ హోమంత్రి సత్యమూర్తి(కేఎస్ రవికుమార్) షేర్ కూడా ఉండడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు.
స్పెషల్ ఆఫీసర్స్ భవాని(విజయ్ మిల్టన్), శ్రీధర్(సునీల్) రంగంలోకి దిగుతారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం వెతుకుతుంటారు. అసలు జపాన్ దొంగగా మారడానికి గల కారణం ఏంటి? దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు? శ్రీధర్‌తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు జపాన్‌కి ఎందుకు సహాయం చేశారు? చివరకు జపాన్ జీవితం ఎలా ముగిసింది? అన్న వివరాలు తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే!
Intha kadhai-la thimingalam sikkuma sikkadha nu paaka neenga ready ah? #Japan, coming to Netflix in Tamil, Telugu, Malayalam and Kannada on 11 Dec! pic.twitter.com/rLWRBVyL6N
— Netflix India South (@Netflix_INSouth) December 4, 2023
చదవండి: సిల్క్ స్మితపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మరోసారి వైరల్..
Comments
Please login to add a commentAdd a comment