Karthi (actor)
-
ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి: కార్తీ
‘‘కె.విశ్వనాథ్‌గారి సినిమాలంటే నాకు ఇష్టం. కానీ, ఇప్పుడు అలాంటి కథలు రావడం లేదు. అయితే ‘సత్యం సుందరం’ కథ చదివినప్పుడు ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. ఇలాంటి స్క్రిప్ట్ ఎలా రాస్తారా? అనిపించింది. ఈ సినిమా తప్పకుండా కె.విశ్వనాథ్‌గారి తరహా లాంటి ఒక మంచి చిత్రం అవుతుందనిపించింది’’ అని కార్తీ అన్నారు. ‘96’ మూవీ ఫేమ్ సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో కార్తీ, అరవింద్ స్వామి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సత్యం సుందరం’. 2డి ఎంటర్టైన్ మెంట్‌పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఈ సినిమా తెలుగులో ఈ నెల 28న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్స్ ఎల్ఎల్పీ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో కార్తీ విలేకరులతో పంచుకున్న విశేషాలు...⇒ మనలోని చాలా ప్రశ్నలకు సమాధానం ఇచ్చే కథ ‘సత్యం సుందరం’. నాకు కథ బాగా నచ్చడంతో అన్నయ్యకి(హీరో సూర్య) చె΄్పాను. ఆయనకు కూడా చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత అన్నయ్య, వదిన(జ్యోతిక) నిర్మించారు. ఇలాంటి మంచి సినిమాకి పారితోషికం ఎక్కువ అడగొద్దు అంటూ నా మార్కెట్ కంటే కొంచెం తగ్గించి ఇచ్చారు(నవ్వుతూ). నా తొలి చిత్రం ‘పరుత్తి వీరన్’ సినిమా చూసి ఆ΄్యాయంగా హత్తుకున్న అన్నయ్య మళ్లీ ఇన్నేళ్లకు ‘సత్యం సుందరం’ లో చాలా బాగా నటించానంటూ గర్వంగా హత్తుకున్నారు. ⇒ బ్రదర్స్ లాంటి రెండు క్యారెక్టర్స్ మధ్య నడిచే కథ ఇది.‘సాగర సంగమం’ సినిమా చూసినప్పుడు ఎలాంటి అద్భుతమైన అనుభూతి కలిగిందో ‘సత్యం సుందరం’ చూస్తున్నప్పుడు కూడా అలాంటి ఓ మంచి అనుభూతిని ప్రేక్షకులు ఆస్వాదిస్తారు. అయితే కె.విశ్వనాథ్‌గారి సినిమాలు కమర్షియల్ బ్లాక్ బస్టర్సే. మా సినిమా కూడా అలాంటిదే. ఈ చిత్రం చూశాక అందరికీ తమ బాల్యం గుర్తొస్తుంది. ⇒ చిన్న పల్లెటూరిలో చీరల దుకాణం నడిపే అమాయకమైన వ్యక్తిత్వం ఉండే పాత్ర నాది. ఈ మూవీలో అరవింద్ స్వామిగారు కాకుండా ఆయన పాత్రలో మరొకర్ని ఊహించలేం. ‘ఊపిరి’ సినిమాలో ఉన్నట్లు సంతోషకరమైన భావోద్వేగాలున్న కథ ఇది. మా సినిమా తమిళంలో ఈ నెల 27న విడుదలవుతోంది.అయితే అదేరోజు తెలుగులో ‘దేవర’ లాంటి పెద్ద సినిమా ఉంది. అందుకే మా సినిమాని 28న రిలీజ్ చేస్తున్నాం. ‘దేవర’ ఒక యుద్ధంలా ఉంటుంది. మాది ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమా(నవ్వుతూ). ⇒ ‘సత్యం సుందరం’ కి గోవింద్ వసంత్ పాటలు, నేపథ్య సంగీతం బాగుంటాయి. సునీల్, సురేశ్ బాబుగార్లు మా సినిమా రిలీజ్ చేయడం హ్యాపీ. ‘ఊపిరి’ తర్వాత తెలుగులో నేరుగా సినిమా చేయలేదు. కథలు వింటున్నాను. తప్పకుండా చేస్తాను. ప్రస్తుతం ‘సర్దార్ 2’ షూటింగ్ జరుగుతోంది. అలాగే ‘వా వాతియారే’ సినిమా ఉంది. ‘ఖైదీ 2’ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. -
పీరియాడికల్ ఫిల్మ్‌లో...
కార్తీ హీరోగా నటించనున్న కొత్త సినిమా ప్రకటన ఆదివారం వెలువడింది. ఈ భారీ పీరియాడికల్ ఫిల్మ్‌కు ‘టానాక్కారన్’ ఫేమ్ తమిళ్ దర్శకత్వం వహించనున్నారు. ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు, ఇషాన్ సక్సేనా, సునీల్ షా, రాజా సుబ్రమణియన్ ఈ సినిమాను నిర్మించనున్నారు.కార్తీ కెరీర్లో 29వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ‘‘భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలయ్యాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తాం. 2025లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రానికి చెందిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
కార్తీతో.. ముగ్గురు భామలు?
దక్షిణాది స్టార్స్‌లో నటుడు కార్తీ ఒకరు. ఇప్పటికి 25 చిత్రాలను పూర్తి చేసిన ఈయన ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. వాటిలో మెయ్యళగన్ చిత్రం, వా వాద్ధియార్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. కాగా ప్రస్తుతం సర్ధార్– 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఈయన ఇంతకు ముందు నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన సర్ధార్ చిత్రానికి సీక్వెల్. సర్ధార్ చిత్రం 2022లో విడుదలై సూపర్‌హిట్ అయ్యింది. కాగా కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన ఆ చిత్రంలో నటి రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగానూ నటి లైలా ముఖ్య పాత్రలోనూ నటించారు.ఆ చిత్ర దర్శకుడు పీఎస్.మిత్రన్‌నే సర్ధార్– 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సర్ధార్ చిత్రాన్ని నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ అధినేత ఎస్.లక్ష్మణన్‌నే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా పోతే ఇందులో సర్ధార్ చిత్రంలో నటించిన రాశీఖన్నా, గానీ, రజీషా విజయన్ గానీ,లైలా గానీ నటించడం లేదు. ఇందులో ముగ్గురు కథానాయికలు నటించనున్నట్లు సమాచారం. ఈ పాత్రల కోసం నటి ప్రియాంక మోహన్, మాళవిక మోహన్, ఆషికా రఘునాథ్‌ను నటింపజేయడానికి వారితో చర్చలు జరుపుతున్నట్లు తాజా సమాచారం. ఇకపోతే ఇందులో నటుడు ఎస్జే సూర్య ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని, జార్జ్ సీ.విలియమ్స్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. దీంతో సర్ధార్ చిత్రం కంటే మరింత భారీగా సర్ధార్– 2 రూపొందుతోందన్నమాట. కాగా నటుడు కార్తీ ఈ మూడు చిత్రాల్లోనూ ఒకదానికొకటి సంబంధం లేని వైవిధ్యభరిత కథా పాత్రల్లో కనిపిస్తుండడం గమనార్హం. -
కంగువలో కనిపించనున్న కార్తీ..
-
సూపర్ హిట్ మూవీ.. 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్
హీరో కార్తీ సూపర్ హిట్ చిత్రాల్లో పైయ్యా ఒకటి. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి లింగుసామి దర్శకత్వం వహించారు. తిరుపతి బ్రదర్స్ ఫిలిం మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుభాష్‌చంద్రబోస్ నిర్మించారు. మది ఛాయాగ్రహణం, యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు. రోడ్ ట్రావెల్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం 2010లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఇందులోని పాటలన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. ఇది తెలుగులో ఆవారాగా రిలీజై ఇక్కడ కూడా హిట్ అందుకుంది. 12 ఏళ్ల తర్వాత రీరిలీజ్ తాజాగా పైయ్యా చిత్రాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెల 11వ తేదీన తమిళనాడు వ్యాప్తంగా విడుదల చేయడానికి తిరుపతి బ్రదర్స్ సంస్థ అధినేత సుభాష్ చంద్రబోస్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్ చేయనున్నట్లు దర్శకుడు లింగుసామి ఇంతకు ముందే చెప్పారన్నది గమనార్హం. తాజాగా పైయ్యా చిత్రం రీ రిలీజ్ గురించి ఆయన మాట్లాడుతూ.. కార్తీకి ఒక హోటల్లో కథ చెప్పడం మొదలు పెట్టిన కొద్ది సేపటికే చాలా బాగుంది.. మనం చిత్రం చేస్తున్నాం అని చెప్పారన్నారు. ఆయనకు కథలపై చాలా నాలెడ్జ్ ఉందన్నారు. కెమిస్ట్రీ వర్కౌట్ అయింది సినిమాలో లవ్, యాక్షన్, చేజింగ్స్, కామెడీ ఇలా అన్ని అంశాలు బాగా కుదిరాయన్నారు. కార్తీ, తమన్నాల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందన్నారు. ఇకపోతే పైయ్యా చిత్రానికి సీక్వెల్ చేస్తానని, కథ కూడా సిద్ధం చేశానన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. అయితే దీనికంటే ముందు ఒక పాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్నట్లు చెప్పారు. ఇది మహాభారతంలోని శ్రీకృష్ణుడు, అర్జునుడు పాత్రల నేపథ్యంలో ఉంటుందని చెప్పారు. ఆ వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని లింగుసామి పేర్కొన్నారు. చదవండి: హీరోయిన్ అరుంధతి ప్రస్తుతం ఎలా ఉందో చెప్పిన సోదరి -
కార్తీ సరసన తెలుగమ్మాయికి హీరోయిన్గా ఛాన్స్
నటి శ్రీదివ్యకు మరో లక్కీచాన్స్ తలుపు తట్టింది. శివకార్తికేయన్‌కు జంటగా వరుత్తపడాద వాలిబర్ సంఘం చిత్రం ద్వారా కథానాయకిగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన తెలుగు నటి శ్రీదివ్య. తెలుగులోనూ నటిగా పరిచయమైన ఈ బ్యూటీ ఇక్కడ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకోవడంతో వరుసగా అవకాశాలు వరించాయి. అలా ఈమె ఇక్కడ నటించిన చిత్రాలన్నీ హిట్ అయ్యాయి కూడా. అలాంటిది ఆ మధ్య అవకాశాలు ముఖం చాటేశాయి. చాలా గ్యాప్ తరువాత విక్రమ్‌ప్రభు సరసన నటించిన రైడ్ చిత్రం ఇటీవల తెరపైకి వచ్చింది. అలా మళ్లీ వార్తల్లోకి వచ్చిన శ్రీదివ్య అవకాశాలపై దృష్టిపెట్టింది. మొత్తం మీద తాజాగా లక్కీచాన్స్ ఈ అమ్మడిని వరించింది. కార్తీతో రొమాన్స్ చేయబోతోంది. 96 చిత్రం ఫేమ్ ప్రేమ్‌కుమార్ దర్శకత్వంలో కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయకి ఎవరన్నది ఇప్పుటి వరకూ ప్రకటించలేదు. తాజాగా గురువారం శ్రీదివ్య పేరును అధికారికంగా యూనిట్ వర్గాలు ప్రకటించాయి. ఈ అమ్మడు ఇంతకుముందు కార్తీ సరసన కాశ్మోరా చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్రంతో మరోసారి ఈ జంట తెరపై మెరవనున్నారన్నమాట. మొత్తం మీద శ్రీదివ్య మళ్లీ దారిలో పడిందన్నమాట. -
హిట్ డైరెక్టర్ తో కార్తీ.. కొత్త సినిమా క్రేజీ అప్డేట్స్
-
సోనీ స్పోర్ట్స్ చిత్రాలకు WWE రింగ్‌లోకి దిగిన హీరో కార్తీ..
భారతదేశంలో డబ్ల్యుడబ్ల్యుఇ అధికారిక ప్రసారకర్త అయిన సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ WWE ఫ్యాన్స్‌కు మరింత దగ్గర కానుంది. డబ్ల్యుడబ్ల్యుఇ అభిమాని, సౌత్ సినీ సూపర్ స్టార్ కార్తీ నటించిన రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలను సోనీ స్పోర్ట్స్ ప్రారంభించింది. ఇది దక్షిణాది మార్కెట్లలో డబ్ల్యుడబ్ల్యుఇ చుట్టూ కస్టమైజ్డ్, స్థానికంగా క్యూరేటెడ్ కంటెంట్‌కు దాని నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుంది. డబ్ల్యుడబ్ల్యుఇ కోసం కార్తి తన గొంతును అందించడమే కాకుండా ఆ కార్యక్రమానికి ప్రచారకార్యకర్తగా కూడా ఉన్నారు. 'హీరోలు vs విలన్లు, అనే టైటిల్‌తో పాటు 'బలం vs విన్యాసాలు' అనే రెండు కాన్సెప్ట్‌లతో ఇవి రానున్నాయి. డబ్ల్యుడబ్ల్యుఇని అభిమానులు సాదరంగా స్వాగతిస్తున్నారు. దీనిని చాలామంది ప్రేక్షకులు ఆధరిస్తున్నారు. దక్షిణాది మార్కెట్లో సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ WWE ప్రసారాలు మాత్రమే కాకుండా ఇంకా చాలా ఎక్కువ ప్రోగ్రామ్‌లు అందించడానికి కట్టుబడి ఉంది. ఈ చిత్రాలు ప్రేక్షకులు వారి అభిమాన డబ్ల్యుడబ్ల్యుఇ స్టార్లకు దగ్గరగా ఉంచడంలో పాటుపడుతుంది. ప్రతి వారం వారు తీసుకువచ్చే అన్ని మైండ్ బ్లోయింగ్ యాక్షన్లకు అదనంగా ఈ చిత్రాలు ఉన్నాయి. సోనీ నెట్ వర్క్ ఛానల్స్‌లలో WWE లైవ్ ద్వారా ప్రసారం అవుతుంది. ఈ సందర్భంగా సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా డిస్ట్రిబ్యూషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్, స్పోర్ట్స్ బిజినెస్ విభాగాధిపతి రాజేష్ కౌల్ మాట్లాడుతూ, 'డబ్ల్యుడబ్ల్యుఇకి దక్షిణ భారతదేశంలో చాలా బలమైన అభిమానులు ఉన్నారు. ఇక్కడ దీని కోసం భారీగా రీచ్ ఉంది. సుమారు 41% వాటా ఉంది. భారతదేశంలో డబ్ల్యుడబ్ల్యుఇ నివాసంగా, కార్తీతో కలిసి పనిచేయడానికి, ప్రేక్షకులను ప్రతిధ్వనించే తమిళ, తెలుగులలో అసాధారణ కథలను అందించడానికి మా ప్రయత్నాలను కొనసాగించడానికి మేము ఎంతో ఉత్సుకతతో ఉన్నాము. ఈ చిత్రాలు డబ్ల్యుడబ్ల్యుఇ ఆకర్షణను పునఃసమీక్షిస్తాయి. ఇది హై-ఆక్టేన్ విన్యాసాలతో పాటు ఆకర్షణీయమైన పాత్రలతో నడుస్తుంది. మా ప్రేక్షకులకు ఉత్తమమైన, స్వచ్ఛమైన స్పోర్ట్స్ వినోదాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాము.' అని చెప్పారు. ఈ సందర్భంగా దక్షిణాది సూపర్ స్టార్ కార్తీ మాట్లాడుతూ.. 'డబ్ల్యుడబ్ల్యుఇలో హీరోలు, విలన్ల పాత్రలను పోషించడం ఖచ్చితంగా నాకు మరపురాని అనుభవం. వారిని యాక్షన్ లో చూడటం చాలా ఆనందంగా ఉంది. డబ్ల్యుడబ్ల్యుఇకి భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణాది మార్కెట్లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఒక అభిమానిగా, సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్, డబ్ల్యుడబ్ల్యుఇతో కలిసి పనిచేయడం నాకు థ్రిల్లింగ్ గా ఉంది.' అని తెలిపారు. ఇంతకుముందు భారతీయ సినిమాల్లో హీరోలు, విలన్ల పాత్రలు పోషించిన కార్తీ.. ఆ పాత్రల్లో పర్ఫెక్ట్ గా సరిపోయాడు. డబ్ల్యూడబ్ల్యూఈలో కూడా హీరోలు, విలన్ల శక్తిని పూర్తిగా చూపించాడు. కార్తీ తన అభిరుచి, మచ్చలేని రోల్ ప్లేతో, సౌత్ మార్కెట్లో డబ్ల్యుడబ్ల్యుఇకి అంకితమైన అభిమానుల కోసం సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ ప్రచారానికి జీవం పోశాడు. క్రియేటివ్ కాన్సెప్ట్, సినిమాలకు దర్శకత్వం సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ నిర్వహించింది. -
విజయ్‌కాంత్ లేరనే వార్త జీర్ణించుకోలేకపోతున్నా: కార్తీ
దివంగత నటుడు, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కాంత్‌కు దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం తరపున ఈ నెల 19న సంస్మరణ సభను నిర్వహించనున్నట్లు హీరో, ఆ సంఘం కోశాధికారి కార్తీ తెలిపారు. గత నెల 28న విజయ్‌కాంత్ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ సమయంలో పలువురు సెలబ్రిటీలు ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించగా.. కొందరు ఇతర ప్రాంతాల్లో ఉండటం కారణంగా సంతాపం తెలుపలేకపోయారు. అందులో హీరో కార్తీ ఒకరు. గురువారం చైన్నెకి చేరుకున్న ఆయన తన తండ్రి శివకుమార్, సోదరుడు సూర్యతో కలిసి స్థానిక కోయంబేడులోని డీఎండీకే పార్టీ కార్యాలయ ఆవరణలో విజయకాంత్ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయ్‌కాంత్ మన మధ్య లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని వాపోయారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆయన్ని కలిసినప్పుడు చాలా ఉత్సాహంగా మాట్లాడారని పేర్కొన్నారు. అధ్యక్షుడు అంటే మార్గదర్శిగా నిలవాలన్నది విజయ్‌కాంత్ నుంచే నేర్చుకున్నట్లు తెలిపారు. కాగా జనవరి 19న తమ సంఘం తరపున విజయ్‌కాంత్‌కు సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు. • Exclusive - #Sivakumar Sir, @Karthi_Offl Anna At Captain #Vijayakanthsir 's Home For Grieving The Loss Of Their Loved One | @prabhu_sr #Karthi pic.twitter.com/pzMldSMoez — Yogesh Yogi (@YogeshY16480498) January 5, 2024 చదవండి: ఒక కన్నులో ధైర్యం, మరో కన్నులో కరుణ.. అంటూ బోరున ఏడ్చిన సూర్య -
మా గుండెల్లో ఉంటావ్ అంటూ.. కన్నీళ్లు పెట్టుకున్న సూర్య
గతేడాది చివర్లో కోలివుడ్ నటుడు కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తమిళనాడును విషాదంలో ముంచెత్తింది. నటుడిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా ప్రజల మనసు గెలుచుకున్న విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు. తమ ప్రియతమ సహ నటుడికి నివాళులు అర్పించేందుకు సామాన్య ప్రజలతో పాటు తమిళ సినీ ప్రపంచం కూడా తరలి వచ్చింది. ఆ సమయంలో రాలేని వారు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. ప్రస్తుతం హీరో సూర్య విజయకాంత్‌కు నివాళులు అర్పించిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది. విజయకాంత్ స్మారక స్థూపం వద్దకు చేరుకోగానే సూర్య తీవ్రమైన భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఏడుస్తూ ఆ వీడియోలో ఉన్నారు. విజయకాంత్ ఇంటికి చేరుకున్న సూర్య ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్తీ కూడా అక్కడే ఉన్నాడు. విజయకాంత్ మరణించే సమయంలో సూర్య విదేశాల్లో ఉన్నారు. ఆ సమయంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఒక వీడియో ద్వారా విజయకాంత్ పై తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. సూర్య కెరీర్ తొలి చిత్రం విజయకాంత్తోనే మొదలైంది. వారిద్దరూ కలిసి నటించిన పెరియన్నలో సూర్య టైటిల్ క్యారెక్టర్‌గా నటించాడు. మొదటి చిన్న పాత్ర అని సూర్యను తీసుకున్నారు.. కానీ సూర్య టాలెంట్‌ను గుర్తించిన విజయకాంత్ అతని రోల్ మరింత సమయం ఉండేలా డైరెక్టర్ ఎస్.ఏ చంద్రశేఖర్‌కు చెప్పారట. అలా అతిధి పాత్రలో అనుకున్న సూర్య ఆ సినిమాలో ప్రధాన పాత్రధారిగా కనిపించారు. అలా వారిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలుండేవి. కానీ ఈ సినిమా సూర్య కెరీయర్లో 4వ చిత్రంగా వచ్చింది. విజయకాంత్ స్మారక స్థూపం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సూర్య ఇలా మాట్లాడారు.. 'ఆయనతో కలిసి పని చేస్తూ, మాట్లాడి, తింటూ గడిపిన రోజులు ఎప్పటికీ మరువలేను.. సాయం అడిగిన ఎవ్వరికీ నో చెప్పలేదు. లక్షలాది మందికి సాయం చేసి వారందరికీ పురట్చి కలైంజర్గా మారిన నా సోదరుడు విజయకాంత్ మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఇక లేరనే బాధ నాలో ఎప్పటికీ ఉంటుంది. ఒక కన్నులో ధైర్యం, మరో కన్ను కరుణతో జీవించిన అరుదైన కళాకారుడు. ఎలాంటి తారతమ్యం లేకుండా అందరికి సాయం చేశాడు. పిరాట్చి కలైంజర్ మా గుండెల్లో కెప్టెన్ అయ్యాడు. అన్న విజయకాంత్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని సూర్య సంతాపం తెలిపారు. View this post on Instagram A post shared by Galatta Media (@galattadotcom) View this post on Instagram A post shared by Galatta Media (@galattadotcom) -
సీక్వెల్స్ పై ఫోకస్ పెట్టిన కార్తీ
-
ఖాకి చిత్రానికి సీక్వెల్ రెడీ.. !
సౌత్ ఇండియా చిత్ర పరిశ్రమలో ఇటీవల హిట్ చిత్రాలకు సీక్వెల్స్ రూపొందించడంపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా కోలీవుడ్‌లో ఈ తరహా చిత్రాలు అధికం అవుతున్నాయి. అలా ఇటీవల కమలహాసన్ నటించిన విక్రమ్, పొన్నియిన్‌సెల్వన్ చిత్రానికి సీక్వెల్‌తో పాటు జిగర్ తండ మూవీకి కూడా సీక్వెల్‌గా 'జిగర్ తండ డబుల ఎక్స్' చిత్రం మంచి విజయాన్ని సాధించాయి. కాగా నటుడు కార్తీ హీరోగా నటించిన ఖైదీ, సర్ధార్ చిత్రాలకు సీక్వెల్స్ రూపొందించనున్నట్లు ఆ చిత్రాలు దర్శక, నిర్మాతలు ఇప్పటికే అధికారికంగా వెల్లడించారు. తాజాగా నటుడు కార్తీ మరో సీక్వెల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈయన ఇంతకు ముందు హెచ్. వినోద్ దర్శకత్వంలో 'ఖాకి' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. నటి రకుల్ ప్రీత్‌సింగ్ నాయకిగా నటించిన ఈ చిత్రం 2018లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. కాగా ఐదేళ్ల తరువాత కార్తీ హెచ్. వినోద్ కాంబోలో ఖాకి చితత్రానికి సీక్వెల్‌ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. కార్తీ నటించిన జపాన్ చిత్రం ఇటీవలే తెరపై వచ్చి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన వాద్దియారే (టైటిల్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు) అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఖైదీ–2, సర్ధార్ –2 చిత్రాలు చేయాల్సి ఉంది. ఇదేవిధంగా హెచ్ వినోద్ ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తరువాత కార్తీ హీరోగా 'ఖాకి' సీక్వెల్‌పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
Japan OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న జపాన్.. వారం రోజుల్లో..
కోలీవుడ్ హీరో కార్తీ నటించిన లేటెస్ట్ మూవీ జపాన్. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు రాజు మురుగన్ దర్శకత్వం వహించాడు. నవంబర్ 10న భారీ అంచనాల మధ్య బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఈ సినిమాకు అంతంతమాత్రమే స్పందన లభించింది. దీంతో తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిందీ మూవీ.. డిసెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. హిందీ వర్షన్ గురించి మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. జపాన్ కథేంటంటే.. జపాన్ ముని (కార్తీ) ఓ గజదొంగ. అతడు కన్నాలు వేసేచోట గుర్తుగా ఓ బంగారు కాయిన్‌ను పెట్టి వెళ్తుంటాడు. అలా ఓసారి హైదరాబాద్‌లోని రాయల్ అనే నగల దుకాణం నుంచి రూ.200 కోట్లు విలువ చేసే బంగారం కొట్టేస్తాడు. ఆ బంగారు ఆభరణాల దుకాణంలో తెలంగాణ హోమంత్రి సత్యమూర్తి(కేఎస్ రవికుమార్) షేర్ కూడా ఉండడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. స్పెషల్ ఆఫీసర్స్ భవాని(విజయ్ మిల్టన్), శ్రీధర్(సునీల్) రంగంలోకి దిగుతారు. మరోవైపు కేరళ, కర్ణాటక పోలీసులు కూడా జపాన్ కోసం వెతుకుతుంటారు. అసలు జపాన్ దొంగగా మారడానికి గల కారణం ఏంటి? దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు? శ్రీధర్‌తో పాటు మరికొంతమంది పోలీసు అధికారులు జపాన్‌కి ఎందుకు సహాయం చేశారు? చివరకు జపాన్ జీవితం ఎలా ముగిసింది? అన్న వివరాలు తెలియాలంటే ఓటీటీలో చూడాల్సిందే! Intha kadhai-la thimingalam sikkuma sikkadha nu paaka neenga ready ah? #Japan, coming to Netflix in Tamil, Telugu, Malayalam and Kannada on 11 Dec! pic.twitter.com/rLWRBVyL6N — Netflix India South (@Netflix_INSouth) December 4, 2023 చదవండి: సిల్క్ స్మితపై కమల్ హాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మరోసారి వైరల్.. -
కార్తి సినిమాలో హీరోయిన్గా సీరియల్ నటి
కోలీవుడ్ హీరో కార్తి ఇటీవల నటించిన జపాన్ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం ఆయన వరుసగా పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా వున్నారు. అందులో కార్తి 26 చిత్రం ఇప్పటికే సెట్స్‌పైకి వెళ్లింది. ఇందులో ఆయనకు జోడీగా నటి కీర్తిసురేష్ నటిస్తున్నారు. కార్తి 27వ చిత్రం కూడా లైన్లో ఉంది. దీనికి 96 చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మరో ప్రధాన పాత్రలో అరవింద్‌స్వామి నటిస్తున్నారు. ఇది కుటుంబ నేపథ్యంలో సాగే అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందని యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. కాగా ఇందులో నటుడు కార్తికి హీరోయిన్ ఉండదనే ప్రచారం జరిగింది. తాజాగా ఆయనకు జోడీ ఉంటుందని సమాచారం. ఇంతకుముందు ఒక కన్నడ చిత్రంలో కథానాయకిగా నటించిన స్వాతి కొండెకు ఈ ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. ఆ సినిమా తరువాత అవకాశాలు రాకపోవడంతో బుల్లితెరపై ఆమె దృష్టి సారించింది. తీరమాన రోజావే అనే సీరియల్లో ప్రధాన పాత్రతో మెప్పిస్తుంది. ఈ సీరియల్‌తో స్వాతి కొండె బాగా పాపులర్ అయ్యింది. అలా ఇప్పుడు మళ్లీ హీరోయిన్గా కార్తితో నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్లు టాక్. -
కార్తి హిట్ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న డైరెక్టర్
తమిళంలో కెరీర్ ప్రారంభించిన కార్తి.. కొన్నాళ్లకే టాలీవుడ్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో యుగానికొక్కడు, నాపేరు శివ,ఊపిరి,సుల్తాన్,సర్దార్, ఖాకీ, ఖైదీ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తెలుగువారికి ఆయన ఎంతో దగ్గరయ్యాడు. తాజాగా కార్తి కెరియర్లో 25వ సినిమా అయిన జపాన్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. దీంతో తర్వాతి ప్రాజెక్ట్‌ను ఆయన చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు. 2017లో కార్తి కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచిన ఖాకి చిత్రానికి సీక్వెల్‌ను దర్శకుడు ప్రకటించారు. 1995-2006 మధ్యకాలంలో జరిగిన 'ఆపరేషన్ బవారియా' మిషన్ ఆధారంగా ఖాకి సినిమాను తెరకెక్కించారు. తమిళనాడు పోలీసుల నిజ జీవిత ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రం థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఖాకీ సినిమా స్క్రీన్ ప్లే ఎడ్జ్ ఆఫ్ యువర్-సీట్ అనేలా ఉంటుంది. సినీ విమర్శకుల నుంచి కూడా ఖాకీ మూవీపై ప్రశంసలు వచ్చాయి. ఖాకి సినిమాకు దర్శకుడు హెచ్ వినోద్ ఈ చిత్రానికి సీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. డైరెక్టర్ వినోద్ ప్రస్తుతం కమల్ హాసన్ KH233 పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత కార్తితో ఖాకి సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తాడని తెలుస్తోంది. ఇదే విషయాన్ని అక్కడి సినీ జర్నలిస్ట్‌లతో వినోద్ తెలిపారట. ఈ సినిమా సీక్వెల్ కోసం ఇప్పటికే కథ కూడా రెడీగా ఉన్నట్లు సమాచారం. దానిని కార్తికి కూడా చెప్పాడని తెలుస్తోంది. కమల్ హాసన్‌తో తన ప్రస్తుత చిత్రం KH233 పూర్తి చేసిన తర్వాత మాత్రమే తాను ఖాకి- 2 కథను పూర్తి చేస్తానని హెచ్ వినోద్ తెలియజేశాడట. ఈ ఏడాదిలో అజిత్‌తో తెగింపు సినిమాను వినోద్ తెరకెక్కించి హిట్ కొట్టాడు. As per Vikatan,#TheeranAdhigaramOndru Sequel Oncards 🔥 - HVinoth has written the one liner and narrated to #Karthi🤝 - After completing #KH233, HVinoth will complete the entire story of TheeranAdhigaram-2 & going to be filmed soon🎬⌛ - Part 1 has been one of the best cop… pic.twitter.com/SEKagwzSkm — AmuthaBharathi (@CinemaWithAB) November 17, 2023 -
జపాన్ డిజాస్టర్‌తో కీలక నిర్ణయం తీసుకున్న కార్తి
కోలివుడ్లో కార్తి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే గుర్తింపు ఉంది. తాజాగా ఆయన నటించిన జపాన్ సినిమా దీపావళి కానుకగా విడుదలైంది. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అభిమానుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. స్క్రీన్‌ప్లే, మేకింగ్ విషయంలో సినిమా పూర్తిగా ఫెయిల్ అయిందని టాక్ రావడం వల్ల జపాన్‌కు వ్యతిరేక రివ్యూలు వచ్చాయి. దీంతో జపాన్ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో కార్తీ కీలక నిర్ణయం తీసుకుని తదుపరి దశకు సిద్ధమయ్యాడు. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన టైగర్ నాగేశ్వరరావు) నవంబర్ 10వ తేదీన విడుదలైన జపాన్ ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ. 23.34 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 12.15 కోట్లు షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. సుమారు రూ. 27 కోట్లకు పైగా నష్టం రావచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కార్తి కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా జపాన్ నిలిచింది. కార్తికి 25వ సినిమాగా జపాన్ విడుదలైంది. మొదటి ఆట నుంచే నెగిటివ్‌గా ట్రోల్స్ రావడంతో కార్తీ కూడా కీలక నిర్ణయం తీసుకుని అందుకు తగ్గట్టుగానే తన 27వ సినిమా షూటింగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కోలివుడ్ బిగ్గెస్ట్ హిట్ సినిమా అయిన '96'తో ఫేమస్ అయిన డైరెక్టర్ ప్రేమ్‌కుమార్‌తో సినిమా షూటింగ్‌ను నేడు ప్రారంభించనున్నాడు. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డి సంస్థ నిర్మిస్తోంది. ఈ సందర్భంలో, కార్తీ 27 షూటింగ్ నేటి నుంచి కుంభకోణంలో ప్రారంభమవుతుంది. ఇందులో కార్తీతో పాటు అరవింద్ సామీ కూడా నటించనున్నాడని సమాచారం. ఈరోజు ప్రారంభం కానున్న షూటింగ్ కూడా శరవేగంగా జరగనుందని అంటున్నారు. అదే సమయంలో ఈ సినిమాలో కార్తీ సరసన ఎవరు నటిస్తారనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరోవైపు నలన్ కుమారస్వామి దర్శకత్వంలో కార్తీ 26లో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకేసారి రెండు సినిమాల్లో నటిస్తున్న కార్తీ.. జపాన్‌తో వచ్చిన డ్యామేజిని కంట్రోల్ చేసే పనిలో కార్తి ఉన్నాడని తెలుస్తోంది. -
ఢిల్లీ తర్వాతే రోలెక్స్.. కార్తికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన సూర్య
రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ నటించిన చిత్రం జపాన్. ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఎస్ఆర్ ప్రభు నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అక్టోబర్ 28 చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కార్తీ, దర్శకులు రాజు మురుగన్, కెఎస్ రవికుమార్, పా.రంజిత్, లోకేష్ కనగరాజ్, సత్యరాజ్, తమన్నా తదితరులు పాల్గొన్నారు. నటుడు సూర్య ప్రత్యేక అతిథిగా విచ్చేసి జపాన్ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం వేదికపై నటుడు సూర్య మాట్లాడుతూ.. 'ఈ రోజును అందమైన రోజుగా మార్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా తమ్ముడు కార్తీకి అన్నివిధాలా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ప్రపంచ తమిళులందరూ కార్తీకి అందమైన ప్రయాణంతో పాటు జీవితాన్ని అందించారు. అది 20 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. కార్తి నటించిన మొదటి సినిమా పరుత్తివీరన్.. అది కమల్ పూజతో మొదలైంది. సినిమా విడుదలయ్యాక కార్తీని సరిగ్గా ఉపయోగించుకున్నారని రజనీకాంత్ గారు ప్రశంసించారు. ఒక సోదరుడిగా నేను కార్తీ కంటే ఎక్కువగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కార్తీ జీవితంలో కీలకంగా ఉన్న మణిరత్నం, జ్ఞానవేల్ రాజా, అమీర్, నిర్మాత ప్రభులకు నా ధన్యవాదాలు. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి షెడ్యూల్ ఇదే.. వేడుకలకు ఆమె దూరం) కార్తి కాలేజీ రోజుల్ని వదిలిపెట్టి 25 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ తన స్నేహితులను కలుస్తూనే ఉన్నాడు. మా తల్లిదండ్రులతో కనీసం సంవత్సరానికి 2 సార్లు విదేశాలకు వెళ్తాడు. అతను తన పిల్లలతో ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు. పని, తల్లిదండ్రులు, స్నేహితులు, సమాజాం ఇవన్నీ మనుకు కావాల్సినవి అని ఎప్పుడూ అంటుంటాడు. అందుకే మాకందరికి ఉజావన్ ఫౌండేషన్ చాలా ముఖ్యమైంది. దీంట్లో కార్తి రోల్ ఎక్కువగా ఉంటుంది. జీవితంలో నా చుట్టూ కనీసం నలుగురు ఉంటే చాలనుకున్నాను.. అయితే అభిమానుల ద్వారా ఆ కోరిక తీరింది. మా అభిమానులకు ధన్యవాదాలు. తంబి (తమ్ముడు) కొత్త సినిమా వస్తే అభిమానులు మొదటిరోజే చూస్తారు. నాకంటే తమ్ముడు అంటేనే వారికి చాలా ఇష్టం.. ఇదే మాట నాతోనే చాలమంది అభిమానులు చెప్పారు. అప్పుడు ఒక అన్నగా ఎంతో గర్వంగా ఉంటుంది అంటూనే సూర్య ఎమోషనల్ అయ్యాడు. కార్తీ తనకు నచ్చినదాన్ని మాత్రమే ఎంచుకుని దాని కోసం కష్టపడ్డాడు. ఆలోచిస్తే చాలా సినిమాల్లో నటించి ఉండేవాడు.. కానీ అతను 25 చిత్రాలలో మాత్రమే నటించాడు.. ఎన్నో ప్రాజెక్ట్‌లు కార్తి కోసం వచ్చినా రిజక్ట్ చేశాడు.. వాడికి నచ్చితేనే చేస్తాడు.. అవి మా అభిమానులను కూడా మెప్పిస్తాయి. జపాన్ అనేది మనుషులు ఎలా ఉంటారో తెలుపుతుంది. వాళ్ళు మహా మూర్ఖులు అనేదే సినిమా. అదృష్టవశాత్తూ లోకేష్ అని ఒకరు నా జీవితంలోకి పరిచయం అయ్యారు. నాపేరును అతను రోలెక్స్‌గా చేశాడు. అది నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. రోలెక్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. త్వరలో మిమ్మల్ని రోలెక్స్ కలుస్తాడు. మీరు ఓపికగా ఉండటం మంచిది. కార్తీకి జపాన్ 25వ చిత్రం. సింగం నా 25వ సినిమా. ఢిల్లీ తర్వాతే రోలెక్స్ వస్తాడు.. అప్పుడు కలుద్దాం.' అంటూ కార్తికి స్వీట్ (నవ్వుతూ) వార్నింగ్ ఇచ్చాడు సూర్య. -
జపాన్‌తో వస్తోన్న కార్తీ.. మేకర్స్ భారీ ప్లాన్!
పరుత్తివీరన్ చిత్రంతో నటుడిగా సినీకెరీర్ ప్రారంభించిన హీరో కార్తీ. కథల ఎంపికలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇటీవల విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్ధార్ చిత్రాలతో వరుసగా విజయాలు అందుకున్న ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం జపాన్. ఇది ఆయన కెరీర్లో 25వ చిత్రం కావడం విశేషం. కాగా నటుడిగా కార్తీ 20 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రాన్ని రాజుమురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్స్ పతాకంపై ఎస్ఆర్.ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మించారు. ఈ మూవీలో అను ఇమ్మాన్యుయేల్ నాయకిగా నటిస్తోంది. ఇందులో దర్శకుడు కేఏస్.రవికుమార్, విజయ్ మిల్టన్, వాగై చంద్రశేఖర్, టాలీవుడ్ నటుడు సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా.. జపాన్ చిత్రాన్ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర ఆడియో రిలీజ్ వేడుకను ఈనెల 28న భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు నిర్మాతల్లో ఒకరైన ఎస్ఆర్.ప్రభు వెల్లడించారు. కార్తీ నటించిన 25వ చిత్రం కావడంతో ఈ వేడుకను ప్రత్యేకంగా అభిమానుల సమక్షంలో స్థానిక నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్తీ ఇప్పటి వరకూ నటించిన 24 చిత్రాల్లో 19 చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయన్నారు. అందులో 6 చిత్రాలు తమ సంస్థలో నిర్మించడం విశేషమన్నారు. కాగా కార్తీ 25వ చిత్రం జపాన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు ఆయన్ని గౌరవించే విధంగా ఈ వేడుక ఉంటుందన్నారు. ఇందులో కార్తీ నటించిన చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. ఆ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ ఈ చిత్రానికి రవివర్మన్ సినిమాటోగ్రఫీ, జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
కార్తీ 'జపాన్' సినిమా కోసం నాగార్జున కీలక నిర్ణయం
కార్తీ హీరోగా రాజు మురుగన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘జపాన్’. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో దీపావళికి విడుదల కానుంది. కార్తీకి జపాన్ 25వ చిత్రం. తన కెరీయర్లో ఇదొక బెంచ్‌మార్క్ లాంటి మూవీ. ఈ చిత్రాన్ని తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుంది. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) నాగార్జున అక్కినేని కాంపౌండ్ నుంచి ఈ సినిమా తెలుగులో విడుదల కానున్నడంతో మార్కెట్‌కు ఎలాంటి సందేహం అక్కర్లేదని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఒక అజ్ఞాత వ్యక్తి 200 కోట్ల దోపిడీకి పాల్పడే కథాంశంతో ఉంటుందని టీజర్‌తో ఒక క్లారిటీ వచ్చింది. అంతేకాకుండా ఇండియా అంతటా జపాన్‌పై (కార్తీ పాత్ర పేరు) 182 కేసులున్నాయని, అతనొక గజదొంగ అంటూ పాత్రను రివీల్ చేశారు. తమిళనాడులోని ఒక దొంగ జీవితాన్ని బేస్ చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాగార్జున- కార్తీ ఇద్దరూ కలిసి ఊపిరి సినిమాలో మెప్పించారు. ఆ సినిమా నుంచే వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. జపాన్ సినిమాను అన్నపూర్ణ సంస్థ విడుదల చేయనున్నడంతో కార్తీ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. సినిమా విడుదల తప్పకుండా భారీ ఎత్తున ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
హిట్ కాంబో రిపీట్ చేస్తున్న కార్తీ
కోలీవుడ్ నటుడు కార్తీ వరుసగా చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. పొన్నియిన్ సెల్వన్, సర్దార్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న ఈయన చిత్రాల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. కాగా నటుడు కార్తీ, రాజ్‌కిరణ్ సక్సెస్ఫుల్ కాంబినేషన్‌గా ముద్ర వేసుకుంది. ఇంతకు ముందు నటుడు రాజ్‌కిరణ్ తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటించడానికి సమ్మతిస్తారు. అలా ఇంతకు ముందు నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన కొంబన్, విరుమాన్ వీటిలో విరుమాన్ మాత్రమే పసలపూడి వీరబాబు పేరుతో తెలుగులో రిలీజ్ అయింది. ఈ రెండు చిత్రాల్లో రాజ్‌కిరణ్ ముఖ్య భూమికను పోషించారు. అంతేకాకుండా ఈ రెండు చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. దీంతో కార్తీ తాజాగా నటిస్తున్న చిత్రంలో కూడా రాజ్‌కిరణ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారని సమాచారం. కార్తీ హీరోగా నటించిన జపాన్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యమాలు జరుపుకుంటోంది. ప్రస్తుతం కార్తీ దర్శకుడు నలన్ కుమారసామి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇది ఆయన నటించే 26వ చిత్రం. ఇందులో నటి కృతీశెట్టి నాయకిగా నటిస్తున్నారు. స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో నటుడు సత్యరాజ్ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీంతో ఆ చిత్రంపై సినీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. -
తెలుగు హీరోలకు దీటుగా నన్ను ప్రేమిస్తున్నారు.. ఏం ఇచ్చి ఈ రుణం తీర్చుకుంటా..
-
ఆవారా సీక్వెల్ లో నటిస్తున్న కార్తీ
-
లలితా జ్యువెలరీలో దోపిడి, చివరకు ఎయిడ్స్‌తో.. ఆ దొంగ కథే జపాన్?
కార్తి, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన చిత్రం ‘జపాన్’. రాజా మురుగన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కార్తి ఇంట్రో వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో కార్తి క్రేజీ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా నిజ జీవిత దొంగ ఆధారంగా రూపొందించబడింది అని తెలుస్తోంది. (ఇదీ చదవండి: ఎంత టార్చర్ పెట్టారంటే.. చచ్చిపోదామనుకున్నా) తమిళనాడులోని చెన్నైలో లలితా జ్యువెలరీ దుకాణంలో తిరువారూర్ ముర్గన్ అనే వ్యక్తి 13 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, వజ్రాలను దోచుకున్నాడు. 2019లో జరిగిన ఈ దోపిడీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అంతేకాకుండా దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాల్లో అతను దోపిడీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అయితే, మురుగన్ 2020లో జైలులో ఎయిడ్స్‌తో మరణించాడు. ఈ రియల్ దొంగోడి కథ ఆధారంగానే జపాన్ సినిమా తీస్తున్నారని ప్రచారం జరుగుతోంది. (ఇదీ చదవండి: ఐటం పాప బాగా రిచ్.. నైట్ డ్రెస్సుకు ఎన్ని వేలు పెట్టిందంటే?) కానీ కథలో కొన్ని మార్పులను కార్తి సూచించాడట. మురుగన్ ఎందుకు దొంగగా మారాడు? అనేక ప్రతిష్టాత్మకమైన బంగారు ఔట్లెట్లలో నగలను ఎలా దోచుకున్నాడు? అనే కమర్షియల్ ఎలిమెంట్స్‌ని మేకర్స్ జోడిస్తున్నారని తెలుస్తోంది. క్లైమాక్స్ విషయంలో చిత్ర సభ్యులు పలు జాగ్రత్తలు తీసుకున్నారట. నిజజీవితంలో జరిగిన సంఘటనలను చూపించాలని కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు సుఖాంతంతో కథను ముగించాలని అభిప్రాయపడ్డారట! మరి జపాన్‌కు ఫినిషింగ్ టచ్ ఏమిచ్చారో తెలియాలంటే? ఈ దీపావళి వరకు ఆగాల్సిందే! -
హీరో కార్తీకి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
హీరో కార్తీకి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు వరించింది. కథానాయకుడిగా వరుస విజయాలను సాధిస్తున్నాడు హీరో కార్తీ. పరుత్తివీరన్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తొలి చిత్రంతోనే అమోఘ విజయాన్ని, ప్రశంసలను అందుకున్నాడు. గతేడాది విరుమాన్, పొన్నియిన్ సెల్వన్, సర్ధార్ చిత్రాల్లో నటించి వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించాడు. ఉళవన్ ఫౌండేషన్ అనే సేవా సంస్థను ప్రారంభించి పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా రాష్ట్రంలోని వ్యవసాయదారులను ప్రోత్సహించే విధంగా వారికి వెలుగునిచ్చే కార్యక్రమాలను చేపడుతున్నాడు. వీటన్నింటిని గుర్తించిన ప్రముఖ టీవీ నిర్వాహకులు కార్తీకి మ్యాన్ ఆఫ్ ది ఇయర్–2022 అవార్డును ప్రకటించారు. కాగా నటుడు కార్తీ ప్రస్తుతం విహారయాత్రలో భాగంగా స్పెయిన్ దేశంలో ఉండడంతో ఈ అవార్డును ఇటీవల జరిగిన కార్యక్రమంలో ఆయన తరఫున సర్ధార్ చిత్ర నిర్మాత, కార్తీ స్నేహితుడు లక్ష్మణన్ అందుకున్నాడు. ఈ సందర్భంగా కార్తీ నటనను, ఆయన సేవా కార్యక్రమాలను లక్ష్మణన్ కొనియాడాడు. కార్తీ తరపున ఈ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. కార్తీ ప్రస్తుతం జపాన్ చిత్రంలో నటిస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో నటించిన పొన్నియిన్‌సెల్వన్–2 ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. చదవండి: పఠాన్‌కు ఎంత తీసుకున్నావేంటి? షారుక్ రిప్లై ఏంటో తెలుసా? నాటు నాటు.. ఆ పాటేంది? ఆ యాసేంది? ట్రోలింగ్‌పై నటి ఫైర్ -
భారీ అంచనాలు పెంచేస్తున్న కార్తీ 'జపాన్' చిత్రం
తమిళసినిమా: వరుస విజయాలతో రైజింగ్‌లో ఉన్న నటుడు కార్తీ. కథల ఎంపిక విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నఆయన సర్ధార్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నటిస్తున్న చిత్రం జపాన్. కుక్కూ, జోకర్ వంటి వైవిధ్యంతో కూడిన విజయవంతమైన చిత్రాల దర్శకుడు రాజుమురుగన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం జపాన్. నటి అను ఇమ్మాన్యుయేల్ నాయకిగా నటిస్తోంది. ఈ బ్యూటీ ఇంతకుముందు తమిళంలో విశాల్ కథానాయకుడిగా నటించిన తుప్పరివాలన్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత శివకార్తికేయన్‌కు జంటగా నమ్మ వీటి పిళ్లై చిత్రంలో నటింంది. జపాన్ చిత్రం ఈమెకు ఇక్కడ మూడోది అవుతుంది. కాగా ఇందులో తెలుగు నటుడు సునీల్, చాయాగ్రాహకుడు, దర్శకుడు విజయ్ మిల్టన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి రవివర్మన్ చాయాగ్రహణం, జీవీ ప్రకాష్ కువర్ సంగీతాన్ని అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. నటుడు కార్తీ నటిస్తున్న 25వ చిత్రం ఇది. చిత్ర తొలి షెడ్యూల్ తూత్తుక్కుడి జిల్లా పరిసర ప్రాంతాల్లో నిర్వహింగ్రాహకుడు, దర్శకుడు విజయ్ మిల్టన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి రవివర్మన్ చాయాగ్రహణం, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్. ప్రకాశ్ బాబు, ఎస్ఆర్.ప్రభు నిర్మిస్తున్నారు. నటుడు కార్తీ నటిస్తున్న 25వ చిత్రం ఇది. చిత్ర తొలి షెడ్యూల్ తూత్తుక్కుడి జిల్లా పరిసర ప్రాంతాల్లో నిర్వహించి పూర్తిచేసినట్లు యూనిట్ వర్గాలు పేర్కొన్నారు. కాగా రెండవ షెడ్యూల్ చిత్రీకరణ కోసం బుధవారం చిత్ర యూనిట్ కేరళకు వెళ్లినట్లు సమాచారం. కాగా ఇటీవల జపాన్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చిందని నిర్మాతలు పేర్కొన్నారు. కాగా కార్తీ, దర్శకుడు రాజుమురుగన్‌ల కాంబినేషన్లో రూపొందుతున్న జపాన్ చిత్రంపై కోలీవుడ్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.