Tamil Actor Karthi’s Facebook Account Hacked, Informs Fans on Twitter
Sakshi News home page

Karthi Facebook:హీరో కార్తీ ఫేస్‌ బుక్ అకౌంట్ హ్యాక్.. ట్వీట్ వైరల్

Published Mon, Nov 14 2022 12:04 PM | Last Updated on Mon, Nov 14 2022 12:39 PM

Tamil Hero Karthi Facebook Account Hacked - Sakshi

తమిళ స్టార్ హీరో కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని హీరో తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. టాలీవుడ్‌లోనూ కార్తికి భారీగా అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ పలు చిత్రాల్లో ఆయన నటించారు. ఫేస్‌ బుక్‌ అకౌంట్ హ్యాకింగ్‌కు గురి కావడంతో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు.

(చదవండి: ఓటీటీలో కార్తీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ 'సర్దార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్)

ఆయన ట్విటర్‌లో రాస్తూ..' హలో గాయ్స్‌. నా ఫేస్ బుక్ పేజీ హ్యాక్ చేయబడింది. దీనిపై మేం ఫేస్‌ బుక్ బృందంతో పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. కాగా ఇటీవలే కార్తీ హీరోగా నటించిన చిత్రం సర్దార్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. అక్టోబర్‌ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.  కార్తీ కెరీర్‌లోనే రూ.100 కోట్ల గ్రాస్‌ వసూళ్లతో బెస్ట్‌ మూవీగా నిలిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement