Hero Karthi
-
సినిమాటోగ్రాఫర్ పెళ్లికి హాజరైన స్టార్ హీరో కార్తీ (ఫోటోలు)
-
ఖైదీ తిరిగొస్తున్నాడోచ్..! గుడ్ న్యూస్ చెప్పిన కార్తీ
-
యాంకర్ సుమతో నాని మరియు కార్తీ జోకులు
-
ఖైదీ 2 త్వరలో మీ ముందుకీ..!
-
తెలుగు హీరోలు ఎందుకు అలా చేస్తారు..?
-
తెలుగు ప్రజలకు నా మీద ప్రేమ ఎక్కువ : హీరో కార్తీ
-
హీరో కార్తీ లేటెస్ట్ మూవీ 'జపాన్' రిలీజ్ డేట్ ఫిక్స్
కార్తీ హీరోగా నటిస్తున్న అడ్వెంచరస్ థ్రిల్లర్ ఫిల్మ్ జపాన్. అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సునీల్, విజయ్ మిల్టన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజు మురుగన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ఆర్ ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. గురువారం(మే25)న కార్తీ బర్త్‌డే. ఈ సందర్భంగా జపాన్ సినిమా గ్లింప్స్ వీడియోను విడుదల చేసి, ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది. -
హీరో కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్.. ట్వీట్ వైరల్
తమిళ స్టార్ హీరో కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని హీరో తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. టాలీవుడ్‌లోనూ కార్తికి భారీగా అభిమానులు ఉన్నారు. తెలుగులోనూ పలు చిత్రాల్లో ఆయన నటించారు. ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురి కావడంతో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని పంచుకున్నారు. (చదవండి: ఓటీటీలో కార్తీ బ్లాక్ బస్టర్ మూవీ 'సర్దార్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్) ఆయన ట్విటర్లో రాస్తూ..' హలో గాయ్స్. నా ఫేస్ బుక్ పేజీ హ్యాక్ చేయబడింది. దీనిపై మేం ఫేస్ బుక్ బృందంతో పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. కాగా ఇటీవలే కార్తీ హీరోగా నటించిన చిత్రం సర్దార్ సూపర్ హిట్‌గా నిలిచింది. అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. కార్తీ కెరీర్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లతో బెస్ట్ మూవీగా నిలిచింది. Hello guys, my Facebook page has been hacked. We are trying to restore it with Fb team. — Karthi (@Karthi_Offl) November 14, 2022 -
కార్తీ కొత్త మూవీ జపాన్.. పూజా కార్యక్రమాలు ప్రారంభం (ఫొటోలు)
-
ఆ సంఘటనే సర్దార్కు స్ఫూర్తి
హీరో కార్తీ, దర్శకుడు పీఎస్ మిత్రన్ కాంబినేషన్లో రూపొందిన తమిళ చిత్రం ‘సర్దార్’. ఇందులో రాశీఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదల కానుంది. కాగా అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ‘సర్దార్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తోంది. ‘సర్దార్’ రిలీజ్ సందర్భంగా దర్శకుడు పీఎస్ మిత్రన్ మాట్లాడుతూ– ‘‘నా దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం ‘ఇరుంబుదురై’ (2018) (తెలుగులో ‘అభిమన్యుడు’) డబ్బింగ్ వర్క్స్ సమయంలో నాకు ‘సర్దార్’ ఐడియా వచ్చింది. కథ సిద్ధమైన తర్వాత నిర్మాత లక్ష్మణ్‌గారికి చెప్పినప్పుడు ఆయన హీరో కార్తీగారిని కలవమన్నారు. ఆయనకూ కథ నచ్చడంతో ‘సర్దార్’ మొదలైంది. వర్తమాన కాలంతో పాటు 1980లో నడిచే కథ ‘సర్దార్’. ఇండియన్ ఇంటెలిజెన్స్ విభాగం 1980లో ఓ స్పై (గూఢచారి)ని తయారు చేయాలని ప్రయత్నించింది. అయితే సైన్యంలో పని చేసే వ్యక్తిని గూఢచారిగా మార్చడం అంత సులువు కాదు. గూఢచారికి నటించడం రావాలి, మారు వేషాలు వేయగలిగి తప్పించు కోవడం తెలిసుండాలి. దీంతో ఓ రంగస్థల నటుడిని గూఢచారిగా మార్చారు. ఇది వాస్తవంగా జరిగింది. ఈ సంఘటనే ‘సర్దార్’ కథకు స్ఫూర్తి. కానీ ‘సర్దార్’ కథ పూర్తిగా వాస్తవం కాదు.. కొన్ని సంఘటనలు కల్పితం. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా కార్తీ ద్విపాత్రాభినయం చేశారు. ఒకరు గూఢచారిగా ఏ గుర్తింపును కోరుకోని వారైతే, మరొకరు పబ్లిసిటీని ఇష్టపడేవారు. ఈ రెండు పాత్రలు ఆడియన్స్‌కు ఆసక్తికరంగా అనిపిస్తాయి. కార్తీ అద్భుతంగా నటించారు. నాగార్జునగారి అన్నపూర్ణ స్డూడియోస్ ‘సర్దార్’ను తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అఖిల్‌తో ఓ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను’’ అని అన్నారు. -
మళ్లీ గ్రామీణ కథ అనగానే.. భయపడ్డా: కార్తీ
నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విరుమాన్. డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ కథానాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ముత్తైయ్య దర్శకత్వంలో 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య-జ్యోతిక నిర్మించిన ఈ చిత్రానికి రాజశేఖర్ కర్పూర పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, సెల్వం కుమార్ ఛాయాగ్రహణంను అందించిన ఈ త్రం ఆగస్ట్ 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది. చదవండి: తెరపై హీరో, తెర వెనక రియల్ హీరో.. గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’ ఈ సందర్భంగా సోమవారంలో చెన్నైలో మూవీ యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు ముత్తైయ్య మాట్లాడుతూ.. ఇది కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రమని తెలిపారు. రాబోయే కాలంలో కుటుంబంలో బాబాయిలు, పెదనాన్నలు ఉండరేమో అన్నారు. ఇప్పుడే కొడుకు, కూతురు చాలంటున్నారన్నారు. పెరుగుతున్న వ్యయం కారణంగా భవిష్యత్తులో అసలు పిల్లలే వద్దనుకుంటారమోనన్నారు. అందుకే తాను కుటుంబ అనుబంధాల నేపథ్యంలో చిత్రాలను తెరకెక్కిస్తున్నాని తెలిపారు. ఈ విరుమాన్ చిత్రం ఆ కోవలోకే వస్తుందని పేర్కొన్నారు. చదవండి: ఆ యువ నటి శంకర్ కూతురిని టార్గెట్ చేసిందా? ఆ ట్వీట్ అర్థమేంటి! కార్తీ మాట్లాడుతూ ఇంతకు ముందు పరుత్తివీరన్, కడైకుట్టి సింగం వంటి గ్రామీణ నేపథ్యంలో చిత్రాల్లో నటించడంతో ఈ విరుమాన్ చిత్రం అదే తరహాది కావడంతో మొదట భయపడ్డానన్నారు. అయితే చిత్ర ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి భయం పోయి సంతోషం కలిగిందన్నారు. దర్శకుడు ముత్తైయ్య అంత అద్భుతంగా కథను తయారు చేసే తెరకెక్కించారన్నారు. రాజ్ కిరణ్, ప్రకాష్ రాజ్, వడివుక్కరసి, శరణ్య పొన్ వన్నన్ తదితర పలువురు ప్రముఖలు నటించారనీ, ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందన్నారు. యువన్ శంకర్ రాజా చాలా మంచి సంగీతాన్ని అందించారన్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ రాజీ పడకుండా భారీగా ఖర్చు చేసి రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. -
ఫిలిం జర్నలిస్ట్‌తో ప్రముఖ డైరెక్టర్ నిశ్చితార్థం, కొత్త జంటకు స్టార్ హీరో విషెస్
ప్రముఖ స్టార్ డైరెక్టర్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఓ ఫిలిం జర్నలిస్ట్‌తో ఆయన ఏడడుగులు వేయబోతున్నాడు. తమిళ చిత్రం హీరో ఫేం పీఎస్ మిత్రాన్ ఫిలిం జర్నలిస్ట్ ఆశామీరా ఆయప్పన్ల నిశ్చితార్థం శుక్రవారం(జూన్ 24న) ఘనంగా నిర్వాహించారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరి ఎంగేజ్మెంట్ వేడుక కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియా వైరల్‌గా అవుతున్నాయి. దీంతో డైరెక్టర్ మిత్రాన్కు కోలీవుడ్ సినీ ప్రముఖులు, స్టార్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చదవండి: 7/G బృందావన్ కాలనీ హీరోయిన్‌తో ఎస్పీ చరణ్ పెళ్లా?, ఫొటో వైరల్ Dear @psmithran and @aashameera many congratulations on your engagement! Let the love❤️ grow stronger😊. — Actor Karthi (@Karthi_Offl) June 25, 2022 హీరో కార్తీ, డైరెక్టర్ రవి కుమార్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు ట్విటర్ వేదికగా ఈ కొత్త జంటగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆశామీరా సైతం దర్శకుడు మిత్రాన్తో తన నిశ్చితార్థం జరిగినట్లు వెల్లడిస్తూ.. తమపై ఇంత ప్రేమ కురిపిస్తున్న ప్రతి ఒక్కరి థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేసింది. కాగా మిత్రాన్ హీరో విశాల్ అభిమన్యుడు(తమిళంలో ఇరుంబుతిరై) మూవీతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. అయితే కొన్ని కారణాల వల్ల మిత్రాన్ ఈ మూవీ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. అనంతరం శివ కార్తికేయన్‌తో హీరో మూవీని తెరకెక్కించి తన మార్క్‌ను చూపించాడు. ప్రస్తుతం మిత్రాన్ కార్తీ హీరో సర్దార్ మూవీని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. చదవండి: ‘కార్తికేయ 2’ ట్రైలర్ ఈవెంట్, వేదికపైనే ఫ్యాన్‌కి నిఖిల్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ Happy Engagement! Congrats @Psmithran @aashameera 💐💐 pic.twitter.com/8ZlasqXlc9 — Ravikumar R (@Ravikumar_Dir) June 23, 2022 .@Psmithran and I are humbled and a tad overwhelmed by all the love pouring in. Thank you so much for making our day much more special. ☺️😁♥️ — Ashameera Aiyappan (@aashameera) June 24, 2022 -
అలనాటి స్టార్ హీరోయిన్ రీఎంట్రీ, 16 ఏళ్ల తర్వాత వెండితెరపై సందడి
Laila Returns To Movies After 16 Years: ‘ఎగిరే పావురమా..’ మూవీతో టాలీవుడ్ వెండితెరపై మెరిసిన అలనాటి తార, సొట్టబుగ్గల బ్యూటీ లైలా రీఎంట్రీ ఇవ్వబోతోంది. వివాహం అనంతరం సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె దాదాపు 16ఏళ్ల తర్వాత కోలీవుడ్ రీఎంట్రీ ఇస్తోంది. హీరో కార్తీ తాజా చిత్రం సర్ధార్ మూవీలో లైలా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఆమె షూటింగ్లో పాల్గొందని, ఆమెకు సంబంధించిన 15 రోజుల షూటింగ్ షెడ్యుల్ కూడా అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో లైలా పాత్ర కీలకంగా ఉండబోతోందని సినీ వర్గాల నుంచి సమాచారం. కాగా ‘దుష్మన్ దునియా కా’ అనే హిందీ మూవీతో మొదట సినీరంగ ప్రవేశం ఇచ్చిన లైలా ఎగిరేపావురంతో టాలీవుడ్‌కు పరిచయమైంది. చదవండి: సౌత్ ఇండస్ట్రీపై రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్ ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన సినిమాలు తక్కువే అయిన తన క్యూట్ స్మైల్‌తో కుర్రకారు మనసులను దొచుకుంది. ‘నా హృదయంలో నిదురించే చెలి’, ‘పెళ్లి చేసుకుందాం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన లైలా చివరిగా ‘నువ్వే కావాలి’ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో మెప్పించింది. తెలుగులో నటిస్తూనే తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చింది. తక్కువ కాలంలో లైలా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి టాప్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో పెళ్లి చేసుకుని నటకు బ్రేక్ ఇచ్చి ముంబై వెళ్లిపోయిన లైలా వెండితెరపై కనిపించి 16 ఏళ్లు గడిచిపోయింది. చదవండి: రాధేశ్యామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ ఈ నేపథ్యంలో హీరో కార్తీ సినిమాతో లైలా కోలీవుడ రీఎంట్రీ ఇస్తుండంతో ఆమె ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ విషయం తెలిసి టాలీవుడ్‌కి కూడా ఆమె త్వరలోనే రీఎంట్రీ ఇవ్వాలని తెలుగు ప్రేక్షకులు, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా లైలా తమిళంలో చివరిగా అజిత్ హీరోగా 2006లో వచ్చిన ‘తిరుపతి’ సినిమాలో కనిపించింది. సర్ధార్ మూవీలో మొదట లైలా పాత్రకు నటి సిమ్రాన్ అనుకున్నారట. ఆమె వేరే ప్రాజెక్ట్స్‌తో బిజీ ఉండటంతో తన స్థానంలో లైలాను పరిశీలించి సంప్రదించారట దర్శక-నిర్మాతలు. కథ నచ్చడంతో లైలా వెంటనే గ్రీన్ సిగ్నిల్ ఇచ్చిందని సమాచారం. కాగా ఈ సినిమాలో కార్తీకి జోడిగా రాశీ ఖన్నా నటిస్తుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి పీఎస్ మిత్రాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. -
శివశంకర్ మాస్టర్ సేవలు మరువలేనివి : హీరో కార్తి
Hero Karthi Condolences To Late Shivashankar Master: నృత్య దర్శకుడు, నటుడు శివ శంకర్ భారతీయ సినిమాకు చేసిన సేవలు అపారమని నటుడు కార్తీ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూసిన శివ శంకర్ మాస్టర్ భౌతిక కాయానికి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతి యావత్ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ‘శివశంకర్ భారతీయ సినిమాకు చేసిన సేవలు అపారం..ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం’ అని సోమవారం ట్వీట్ చేశారు. అదేవిధంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు తంగుటూరి రామకృష్ణ శివశంకర్ మాస్టర్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాస్టర్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పలు చిత్రాలకు శివశంకర్ మాస్టర్‌తో కలిసి పని చేసే అవకాశం తనకు కలిగిందని పేర్కొన్నారు. ఆయన మరణం భారతీయ సినిమాకు తీరని లోటు అని అన్నారు. My heartfelt condolences to the family and friends of Shivashankar master. A man of immense talent and decades of contribution to Indian cinema. pic.twitter.com/rsG45Dbwy0 — Actor Karthi (@Karthi_Offl) November 29, 2021 -
వ్యాక్సిన్ వేయించుకున్న హీరో కార్తి
చెన్నై: కరోనా వ్యాక్సిన్ వేసుకునేందుకు చాలామంది భయపడుతున్నారు. దీంతో పలువురు సెలబ్రటీలు వ్యాక్సిన్ వేయించుకుని ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటుడు కార్తీ శుక్రవారం వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ దశ్యాన్ని ఆయన తన ట్విట్టర్లో పోస్టు చేశారు. అందులో తాను మొదటి డోస్ వేసుకున్నానని పేర్కొన్నారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
'రష్మిక..కొంచెం ఓవరాక్షన్ తగ్గించుకుంటే మంచిది'
సాక్షి, హైదరాబాద్: 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో స్టార్ హీరోయిన్గా ఎదిగిన కన్నడ భామ రష్మిక మందన్నా. ప్రస్తుతం కార్తీ హీరోగా 'సుల్తాన్' చిత్రంతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీ ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన ముద్దు ముద్దు మాటలతో సందడి చేసింది. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ..చాలా రోజుల తర్వాత ఫ్యాన్స్‌ని కలవడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. 'కరోనా ఎలా ఉంది? అందరూ మాస్క్‌లు పెట్టుకున్నారా..నాకేం కనిపించట్లేదు జాగ్రత్తలు పాటించి థియేటర్‌కి వచ్చి సినిమాను చూడండి' అని రష్మిక తెలిపింది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఈ సందర్భంగా ఒక్కసారిగా సూర్య..సూర్య అని అభిమానులు గోల చేస్తూ ఆమెను మాట్లాడకుండా చేశారు. దీంతో రష్మిక సైతం సూర్య..కార్తీ అని అరుస్తూ...'చుప్..ఆపండెహే. నన్ను మాట్లాడనివ్వండి. నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది.. ప్లీజ్ రా మాట్లాడనీయండ్రా' అని ముద్దుముద్దు మాటలతో ఫ్యాన్స్‌ని బతిమాలింది. ఈ సందర్భంగా ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన వంశీ పైడిపల్లికి కృతఙ్ఞతలు చెప్పిన రష్మిక..మహర్షి మూవీకి జాతీయ అవార్డు వచ్చినందుకు కంగ్రాట్స్ చెబుతూ..తనకు పార్టీ కావాలని అడిగింది. ఇక కోలీవుడ్‌లో తాను డెబ్యూగా నటించిన సుల్తాన్ సినిమాను హిట్ చేయాలని, ఇదే నాకు మీరిచ్చే బర్త్‌డే గిఫ్ట్ అని ఫ్యాన్స్‌ను కోరింది. సాధారణంగా స్టేజ్‌పై మాట్లాడాలంటే పెద్ద హీరోలు సైతం తడబడుతుంటారు. కానీ రష్మిక స్టైలే డిఫరెంట్ అంటూ అభిమానులు ఫిదా అవుతుంటే, మరోవైపు ప్రతీసారి స్టేజ్‌పై రష్మిక ఓవరాక్షన్‌ను తట్టుకోలేకపోతున్నాం...కొంచెం తగ్గించుకుంటే మంచిది అంటూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు. చదవండి : రష్మికను డిన్నర్ డేట్‌కి తీసుకెళ్లిన విజయ్.. ఫోటోలు వైరల్ 'సల్మాన్‌ఖాన్ నన్ను మోసం చేశాడు.. అందుకే విడిపోయా' -
అమ్మానాన్నలూ.. పిల్లలకు ధైర్యం చెప్పండి..
తెలిసి...తెలియని వయసు... మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు. దీంతో చిన్న విషయానికే బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదని, ఫెయిల్ అయ్యామని కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు. ఇదే విషయంపై ప్రముఖ హీరో కార్తీ స్పందించారు. ‘అమ్మానాన్నలూ.. పిల్లలకు ధైర్యం చెప్పండి.. మంచి మార్కులు సాధించడమే జీవితం కాదు’. అంటూ కార్తీ ఆదివారం ట్వీట్ చేశాడు. గడిచిన రెండు రోజుల నుంచి ఇంటర్మీడియెట్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలను పురస్కరించుకొని అతడు ట్విటర్లో స్పందించారు. దేశవ్యాప్తంగా వెలువడుతున్న ఇంటర్, ప్లస్–2 ఫలితాలతో ఫెయిలైన వారు మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు కార్తీని తీవ్రంగా కలిచివేశాయి. తాజాగా టీడీపీ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ మేనల్లుడు ధర్మారామ్ 6 అంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన అతడిని కదిలిచింది. Dear parents, This is the most stressful time for the kids. Please give them strength and make them believe that no matter what, you are with them. Good grades are not everything in life. #Results #12thExam — Actor Karthi (@Karthi_Offl) 21 April 2019 ఈ నేపథ్యంలో తాము కోరుకున్న మార్కులు రాలేదని చాలా మంది విద్యార్ధులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఈ విషయమై కార్తీ స్పందిస్తూ... ఇలాంటి ఒత్తిడితో కూడుకున్న సమయంలో తల్లిదండ్రులంతా పిల్లలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మంచి మార్కులే జీవితం కాదని వ్యాఖ్యానిస్తూ...పిల్లలకు అండగా ఉండి వారి ఒత్తిడి దూరం చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులేనన్నారు. ట్విటర్లో కార్తీ స్పందిస్తూ... ప్రియమైన తల్లిదండ్రులకు.. ఇది పిల్లలకు చాలా ఒత్తిడితో కూడుకున్న సమయం.. ఏది ఏమైనా మీరు వారు వెంటనే ఉన్నామని ధైర్యం చెప్పండి.. మంచి మార్కులు సాధించడమే జీవితం కాదని ట్వీట్ చేశాడు. దీనికి #results#12th exam అనే హ్యాగ్‌ట్యాగ్‌లను జత చేశాడు. -
గజ తుఫాన్: హీరో సూర్య కుటుంబం విరాళం
సాక్షి, చెన్నై: దక్షిణ తమిళనాడుపై గజ తుపాను తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు ఏడు జిల్లాల్లో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఇప్పటికే నష్టనివారణ చర్యలకై రంగంలోకి దిగిన తమిళనాడు ప్రభుత్వానికి ఆర్థికంగా భరోసా కల్పించడానికి ఒక్కొక్కరు కదిలి వస్తున్నారు. కోట్ల రూపాయలను నష్టపోయిన తమిళనాడుకు ఆపన్నహస్తం అందించేందుకు సినీ తారలు, రాజకీయ పార్టీలు, స్వచ్చంద సంస్థలు, కార్పోరేట్ కంపెనీలు తమ వంతు బాధ్యతను తీసుకుంటున్నాయి. తాజాగా గజా తుఫాన్‌తో ఉక్కిరిబిక్కిరైన తమిళనాడులో సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం కోలీవుడ్ టాప్ హీరో సూర్య కుటుంబం 50 లక్షల భారీ విరాళాన్ని ప్రకటించింది. హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతిక, తండ్రి శివకుమార్, సోదరుడు కార్తీ నలుగురు కలిసి వారి తరఫున ఈ డబ్బును సీఎం సహాయనిధికి ఇవ్వనున్నారు. కేరళ వరదల సమయంలోనూ హీరో సూర్య, ఆయన తమ్ముడు కార్తిలు అందరికంటే ముందుంగా స్పందించి విరాళాలు అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా గజ తుఫాన్‌తో నష్టపోయిన తమిళనాడుకు తమ వంతుగా ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ముందుగా స్పందించి విరాళాన్ని ప్రకటించారు. అదేవిధంగా మరో హీరో విజయ్ సేతుపతి తన వంతు సహాయంగా 25 లక్షల విరాళాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అందజేశారు. డీఎంకే ట్రస్ట్ కోటి రూపాయలను, ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి నెల జీతాన్ని ప్రకటించారు. గతంలో కూడా కేరళ వరదలు, తిత్లీ తుఫాన్ సమయంలో చాలా మంది తమిళ, తెలుగు సినీ తారలు విరాళాలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
కేరళ వర్షాలు : భారీ విరాళం ప్రకటించిన హీరోలు
భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరైన కేరళను ఆదుకునేందుకు ప్రముఖ సినీ నటులు స్పందిస్తున్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాలకోసం విరాళాలివ్వమని కేరళ ముఖ్యమంత్రి ఇలా విజ్ఞప్తి చేశారో లేదో సౌత్ సూపర్ స్టార్ సూర్య, ఆయన సోదరుడు, మరో హీరో కార్తి వేగంగా స్పందించారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే కేరళకు భారీ విరాళాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షల అందించనున్నామని తమిళ, తెలుగు సినీరంగంలో హీరోలుగా వెలుగొందుతున్న ఈ సోదర బృందం వెల్లడించింది. మరోవైపు కేరళను భారీ వర్షాలు, వరదలు మరోసారి అతలాకుతలం చేస్తున్నాయి. మూడు రోజులుగా భారీ వర్షాలు అక్కడి జనజీవనాన్ని స్థంభింపజేశాయి. కొన్నిచోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. నదులు, ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో కేరళవాసులను ఆదుకునేందుకు ప్రముఖ తమిళ హీరో విశాల్ ముందుకు వచ్చారు. కేరళ రెస్క్యూ పేరుతో విరాళాలు సేకరించాలని నిర్ణయించినట్టు ట్విటర్ ద్వారా ప్రకటించారు. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న కేరళ ప్రజలను ఆదుకుందాం. వయనాడ్ ప్రాంతంలో ప్రజలకు సహాయం అందించేందుకు రేపు చెన్నైలోని మహాలింగపురంలో విరాళాలు సేకరిస్తున్నాం. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు రిలీఫ్ మెటీరియల్స్‌ను తీసుకుంటాం. వర్షాలతో ఇబ్బందులు పడుతున్న కేరళ వాసులను ఆదుకుందాం. కష్టసమయంలో ఉన్న వాళ్లకి అండగా ఉందాం. అత్యవసర వస్తువులను ప్రజలు అందజేయాల్సిందిగా నటుడు విశాల్ కోరారు. కాగా కేరళలో వరద పరిస్థితిని సమీక్షించిన ముఖ్యమంత్రి పినరయి విజయన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని ప్రకటించారు. ఈ సందర్భంగా మృతులకు, గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నట్టు వెల్లడించారు. అంతేకాదు కేరళ ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధిగా విరాళాలివ్వాల్సింగా శనివారం సాయంత్రం విజ్ఞప్తి చేశారు. -
ఖమ్మంలో కార్తీ సందడి
ఖమ్మంకల్చరల్ : ప్రముఖ తమిళ హీరో, సూర్య సోదరుడు, కార్తీ ఖమ్మంలో సోమవారం సందడి చేశారు. ఆయన నటించిన చినబాబు చిత్రం ప్రదర్శితమవుతున్న ఆదిత్య థియేటర్‌కు విచ్చేయడంతో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి సినిమా హాల్ లోపల అభిమానులందరికీ కార్తీ అభివాదవం చేస్తూ పలకరించారు. ఈ సందర్భంగా కార్తీ మాట్లాడుతూ..కళాకారుల గుమ్మం ఖమ్మంలో విజయోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. సినిమాను, తనను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకునేందుకు ఇక్కడికి వచ్చానన్నారు. ఎల్లప్పుడూ ఇదే ఆదరాభిమానాలను కొనసాగించాలని కోరారు. అనంతరం థియేటర్ వారు ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేశారు. మహిళలకు హీరోకార్తీ చీరలు పంపిణీ చేశారు. తమ హీరోతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు అంతా ఉత్సాహం చూపారు. కార్యక్రమంలో చిత్ర సహ నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, థియేటర్ యజమాని కాంపాటి పిచ్చయ్య, మేనేజర్ బెల్లంకొండ శ్రీనివాస్, హీరో కార్తీ అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు. -
హీరోయిన్లకు ఆ హీరో లక్కీ ..!
బాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు తాజాగా దిగుమతి అయిన ఏంజల్ నటి సాయేషా సైగల్. కోలీవుడ్‌లో హీరోయిన్లకు లక్కీ హీరో జయంరవి అనే పేరుంది. మొదటిసారి ఆయనతో రొమాన్స్ చేసిన హీరోయిన్లకు అదృష్టం తేనె తుట్టెలా పడుతుందని అంటారు. రవి తొలి చిత్ర హీరోయిన్ సదా, శ్రియ, అశిన్ ఇలా చాలామంది ప్రముఖ హీరోయిన్లుగా రాణించారు. ప్రస్తుతం ఈ వరుసలో నటి సాయేషా సైగల్ చేరింది. ప్రముఖ సినీ కుటుంబం నుంచి వచ్చిన ఈ బాలీవుడ్ బ్యూటీ జయం రవికి జంటగా వనమగన్ చిత్రం ద్వారా కోలీవుడ్ రంగప్రవేశం చేసింది. ఈ చిత్రం యాజరేజ్ అనిపించుకున్నా సాయేషాకు మాత్రం బోలెడంత పేరు వచ్చింది. ఆ వేంటనే ప్రభుదేవా దర్శకత్వంలో విశాల్, కార్తీతో నటించడానికి సిద్ధమైన కరుప్పరాజా- వెళ్లరాజా చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆ చిత్ర నిర్మాణం వాయిదా పడింది. అది సాయేషాకు చిన్న షాక్ అనే చెప్పాలి. అయితే ఆమెకు అదృష్టం చేజారలేదు. ప్రస్తుతం విజయ్‌సేతుపతి హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న భారీ బడ్జెట్ కథా చిత్రం ‘జూంగా’లో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పుడు మరో స్టార్ హీరో కార్తీతో రొమాన్స్ చేసే అవకాశం తలుపు తట్టిందన్నది తాజా సమాచారం. కార్తీ నటించిన తాజా చిత్రం ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 17న విడుదలకు ముస్తాబవుతోంది. ఆ తరువాత పసంగ పాండిరాజ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అన్నయ్య, నటుడు సూర్య తన 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో కార్తీకి జంటగా ఇంతకు ముందు నటి ప్రియ భవానీశంకర్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఆ పాత్ర హీరోయిన్ సాయేషాసైగల్‌ను వరించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రానికి డి. ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ అమ్మడు హీరో అక్కినేని అఖిల్ మొదటి చిత్రం అఖిల్‌లో నటించిన విషయం తెలిసిందే. -
మణిరత్నంగారు నన్ను పూర్తిగా మార్చేశారు!
హీరో కార్తీ ‘‘ఏ స్కూల్లో నేను సినిమా గురించి నేర్చుకున్నానో ఆ స్కూల్లో మళ్లీ యాక్టింగ్ నేర్చుకున్నా. అన్నయ్య (సూర్య) లేదా లియోనార్డో డికాప్రియో చేయాల్సిన పాత్ర. నాకెందుకు సార్? అనడిగా. కానీ, మణిరత్నంగారు నన్ను పూర్తిగా మార్చేశారు. హీరోగా ఓ పదేళ్ల తర్వాత నాకు క్యారెక్టర్ మీద కొంచెం కమాండ్ వచ్చినట్టుంది’’ అన్నారు కార్తీ. మణిరత్నం దర్శకత్వంలో కార్తీ, అదితీరావ్ హైదరి జంటగా నటించిన తమిళ సినిమా ‘కాట్రు వెలియిడై’ను తెలుగులో ‘చెలియా’ పేరుతో ‘దిల్’ రాజు విడుదల చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ సినిమా ఆడియో సీడీలను చిత్రపాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి విడుదల చేశారు. కార్తీ మాట్లాడుతూ – ‘‘మణిరత్నంగారు ఎంతో పరిశోధన చేసి, ఈ కథ రాశారు. నేనూ ఫ్లయింగ్ క్లాసులకు వెళ్లాను. ఇందులో ఫైటర్ పైలట్‌గా నటించా. 200 కోట్ల మెషీన్, 72 పారామీటర్స్... ఆర్మీ ఎయిర్‌ఫోర్స్‌ను కంట్రోల్ చేయడం ఎంతో కష్టం. పైలట్ షార్ప్‌గా ఉండాలి. ఈ పాత్రకు కనీసం పది శాతం న్యాయం చేసినా.. నేను గొప్ప ఘనత సాధించినట్టే. ఇది వార్ ఫిల్మ్ కాదు... ప్రేమకథే’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి రెహమాన్, సీతారామశాస్త్రిగారు స్ట్రాంగ్ పిల్లర్స్. ఈ మ్యూజిక్ ఇంత స్పెషల్‌గా ఉందంటే వీళ్లే కారణం’’ అన్నారు మణిరత్నం. ‘‘తమిళ చిత్రాన్ని తెలుగులో అనువదించినప్పుడల్లా ఇక్కడి పాటలే నచ్చుతాయి. బహుశా.. తెలుగు భాష గొప్పదనం అనుకుంటా’’ అన్నారు ఏఆర్ రెహమాన్. సుహాసిని మాట్లాడుతూ – ‘‘మణిరత్నాన్ని ‘మీకు కథ, డైలాగులు రాయడం.. షాట్ పెట్టడం వచ్చా?’ అని అడుగుతాను. నేను ఆయన్ను ప్రశంసించడం కష్టం. కానీ, ప్రేక్షకులు ప్రశంసిస్తారు. ఆయన మళ్లీ మళ్లీ ప్రేమకథలే ఎందుకు తీస్తారో తెలీదు. దానికి కారణం మాత్రం నేను కాదు. ఆయనెప్పుడూ హీరోకి ఈజీ క్యారెక్టర్ ఇవ్వరు. ఎన్ని హింసలున్నాయో అన్నీ పెడతారు. అవన్నీ దాటుకుని నటించాలి. ఈ సినిమాలో కార్తీ, అదితీలు ఆయన్ను డామినేట్ చేశారు’’ అన్నారు. అదితీరావ్ హైదరీ మాట్లాడుతూ – ‘‘నేను హెదరాబాదీ అమ్మాయినే. చిన్నప్పుడు ‘బొంబాయి’లో ‘కెహనాహై క్యా..’ పాట చూసేదాన్ని. అలాంటి పాటలో నటించాలనే నా కల ఈ సినిమాతో నెరవేరింది’’ అన్నారు. ఇటీవల ‘దిల్’ రాజు సతీమణి అనితారెడ్డి మరణించడంతో ఆయన ఈ వేడుకకు రాలేదు. కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ‘దిల్’ రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వంశీ పైడిపల్లి, కార్తీ, అదితీరావ్ హైదరి, సుహాసిని, మణిరత్నం, ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, ఎ.ఆర్. రెహమాన్, కిరణ్ -
హీరో గారి మీసం ఊడిపోయింది!
తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్ హీరో.. కార్తీ. తాజాగా ఊపిరి సినిమాతో స్ట్రెయిట్ సినిమా ద్వారా కూడా మరింత దగ్గరయ్యాడు. కార్తీ తాజాగా చేస్తున్న సినిమా కాష్మోరా. ఈ సినిమా తమిళనాడులో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడేటప్పుడు ఒక విచిత్రమన ఘటన జరిగింది. ఉత్తరాది హీరోలైతే మీసాలు ఉంచుకోరు. కానీ దక్షిణాదిలో.. అదికూడా తెలుగులో అయితే హీరోయిజానికి మీసం కూడా ఒక ప్రధాన అంశం అవుతుంది. అందుకోసం స్వతహాగా తనకు మీసం లేకపోయినా, హైదరాబాద్ వస్తున్నాను కదా అని కార్తీ ఒక పెట్టుడు మీసం పెట్టుకుని వచ్చాడు. మైకు పట్టుకుని సినిమా గురించి ఉత్సాహంగా చెప్పుకుంటూ వెళ్లిపోయాడు. అంతలో ఉన్నట్టుండి ఎడమవైపు మీసం కొంచెం కిందకు జారింది. ఆ విషయం ముందు పట్టించుకోలేదు. కాసేపు ఆగిన తర్వాత మరికొంత ఊడి.. ఇంకా కిందకు జారింది. నోటికి అడ్డం రావడంతో ఆ విషయాన్ని గుర్తించిన కార్తీ.. దాన్ని సరిచేసుకుని, మళ్లీ ప్రెస్‌మీట్ కొనసాగించాడు. సొంత మీసం లేకపోతే హీరోల పరిస్థితి అంత దయనీయంగా ఉంటుందన్న మాట. -
హీరో గారి మీసం ఊడిపోయింది!
-
కార్తీరా
-
హైదరాబాద్‌లో హీరో కార్తీ సందడి
-
పాప పుట్టిందని స్వామి దర్శనానికొచ్చా
తిరుమల : తనకు పాప పుట్టాలనే కోరిక నెరవేరడంతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినట్లు తమిళ సినీ హీరో కార్తీ తెలిపారు. ఆయన నిన్న నైవేద్య విరామ సమయంలో భార్య రంజని, కుమార్తెతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల కార్తీ మీడియాతో మాట్లాడుతూ పదేళ్ల తర్వాత శ్రీవారిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. త్వరలోనే ఒక మందచి సినిమాతో అభిమానుల ముందుకు వస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కార్తీని చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఆయనతో కలిసి ఫోటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న హిరో కార్తీ
-
కార్తి బిరియాని టీమ్‌తో చిట్‌చాట్