హీరో గారి మీసం ఊడిపోయింది! | hero karthi moustache falls in middle of kashmora movie press meet | Sakshi
Sakshi News home page

హీరో గారి మీసం ఊడిపోయింది!

Published Thu, Oct 27 2016 3:39 PM | Last Updated on Mon, Sep 4 2017 6:29 PM

హీరో గారి మీసం ఊడిపోయింది!

హీరో గారి మీసం ఊడిపోయింది!

తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా భారీగా అభిమానులను సంపాదించుకున్న కోలీవుడ్ హీరో.. కార్తీ. తాజాగా ఊపిరి సినిమాతో స్ట్రెయిట్ సినిమా ద్వారా కూడా మరింత దగ్గరయ్యాడు. కార్తీ తాజాగా చేస్తున్న సినిమా కాష్మోరా. ఈ సినిమా తమిళనాడులో కంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ థియేటర్లలో విడుదల అవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్ బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడేటప్పుడు ఒక విచిత్రమన ఘటన జరిగింది. ఉత్తరాది హీరోలైతే మీసాలు ఉంచుకోరు. కానీ దక్షిణాదిలో.. అదికూడా తెలుగులో అయితే హీరోయిజానికి మీసం కూడా ఒక ప్రధాన అంశం అవుతుంది. 
 
అందుకోసం స్వతహాగా తనకు మీసం లేకపోయినా, హైదరాబాద్ వస్తున్నాను కదా అని కార్తీ ఒక పెట్టుడు మీసం పెట్టుకుని వచ్చాడు. మైకు పట్టుకుని సినిమా గురించి ఉత్సాహంగా చెప్పుకుంటూ వెళ్లిపోయాడు. అంతలో ఉన్నట్టుండి ఎడమవైపు మీసం కొంచెం కిందకు జారింది. ఆ విషయం ముందు పట్టించుకోలేదు. కాసేపు ఆగిన తర్వాత మరికొంత ఊడి.. ఇంకా కిందకు జారింది. నోటికి అడ్డం రావడంతో ఆ విషయాన్ని గుర్తించిన కార్తీ.. దాన్ని సరిచేసుకుని, మళ్లీ ప్రెస్‌మీట్ కొనసాగించాడు. సొంత మీసం లేకపోతే హీరోల పరిస్థితి అంత దయనీయంగా ఉంటుందన్న మాట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement