నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విరుమాన్. డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ కథానాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ముత్తైయ్య దర్శకత్వంలో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూర్య-జ్యోతిక నిర్మించిన ఈ చిత్రానికి రాజశేఖర్ కర్పూర పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, సెల్వం కుమార్ ఛాయాగ్రహణంను అందించిన ఈ త్రం ఆగస్ట్ 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది.
చదవండి: తెరపై హీరో, తెర వెనక రియల్ హీరో.. గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’
ఈ సందర్భంగా సోమవారంలో చెన్నైలో మూవీ యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు ముత్తైయ్య మాట్లాడుతూ.. ఇది కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రమని తెలిపారు. రాబోయే కాలంలో కుటుంబంలో బాబాయిలు, పెదనాన్నలు ఉండరేమో అన్నారు. ఇప్పుడే కొడుకు, కూతురు చాలంటున్నారన్నారు. పెరుగుతున్న వ్యయం కారణంగా భవిష్యత్తులో అసలు పిల్లలే వద్దనుకుంటారమోనన్నారు. అందుకే తాను కుటుంబ అనుబంధాల నేపథ్యంలో చిత్రాలను తెరకెక్కిస్తున్నాని తెలిపారు. ఈ విరుమాన్ చిత్రం ఆ కోవలోకే వస్తుందని పేర్కొన్నారు.
చదవండి: ఆ యువ నటి శంకర్ కూతురిని టార్గెట్ చేసిందా? ఆ ట్వీట్ అర్థమేంటి!
కార్తీ మాట్లాడుతూ ఇంతకు ముందు పరుత్తివీరన్, కడైకుట్టి సింగం వంటి గ్రామీణ నేపథ్యంలో చిత్రాల్లో నటించడంతో ఈ విరుమాన్ చిత్రం అదే తరహాది కావడంతో మొదట భయపడ్డానన్నారు. అయితే చిత్ర ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి భయం పోయి సంతోషం కలిగిందన్నారు. దర్శకుడు ముత్తైయ్య అంత అద్భుతంగా కథను తయారు చేసే తెరకెక్కించారన్నారు. రాజ్ కిరణ్, ప్రకాష్ రాజ్, వడివుక్కరసి, శరణ్య పొన్ వన్నన్ తదితర పలువురు ప్రముఖలు నటించారనీ, ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందన్నారు. యువన్ శంకర్ రాజా చాలా మంచి సంగీతాన్ని అందించారన్నారు. 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ రాజీ పడకుండా భారీగా ఖర్చు చేసి రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment