Aditi Shankar
-
తెలుగు సినిమాలపై ప్రేమలో పడుతున్న హీరోయిన్లు
దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు ప్రేక్షకాదరణ దక్కుతోంది. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలైతే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. ఆడియన్స్‌ను మెప్పిస్తున్నాయి. దీంతో టాలీవుడ్లో సినిమాలు చేయాలని చాలామంది హీరోయిన్స్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇలా ఇక్కడ అవకాశం దక్కించుకుని, ఈ ఏడాది తెలుగు ఇండస్ట్రీలో తొలి అడుగు వేస్తున్న హీరోయిన్స్‌పై కథనం.డబుల్ ధమాకాకన్నడ ‘కేజీఎఫ్’ మూవీలతో తెలుగు ప్రేక్షకులనూ మెప్పించారు హీరోయిన్ శ్రీనిధీ శెట్టి. ఈ బ్యూటీ ఈ ఏడాది తెలుగు తెరపై కనిపించనున్నారు. శ్రీనిధీ శెట్టి ప్రస్తుతం రెండు స్ట్రయిట్ తెలుగు మూవీస్ చేస్తున్నారు. ‘హిట్’ మూవీ ఫ్రాంచైజీలో రూపొందుతున్న తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్ 3 (హిట్ 3)’. ఇందులో పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్‌గా నాని నటిస్తున్నారు. ఈ చిత్రంలో మృదులగా హీరోయిన్ పాత్రను శ్రీనిధీ శెట్టి చేస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రోడక్షన్స్ పతాకాలపై డా. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్న ఈ హిట్ 3 మూవీ మే 1న విడుదల కానుంది.ఇక శ్రీనిధి ఓ హీరోయిన్ గా చేస్తున్న మరో మూవీ ‘తెలుసు కదా’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీతో ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. ‘హిట్ 3, తెలుసు కదా’... ఇలా ఒకేసారి రెండు సినిమాలతో డబుల్æధమాకాగా శ్రీనిధీ శెట్టి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు.పదేళ్ల తర్వాత...నటిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన పదేళ్ల తర్వాత టాలీవుడ్‌కు వస్తున్నారు హీరోయిన్ మాళవికా మోహనన్ . ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ‘రాజా సాబ్’ అనే హారర్ కామెడీ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మాళవికా మోహనన్ , నిధీ అగర్వాల్ హీరోయిన్స్‌గా చేస్తున్నారు. మాళవికాకు ఇదే తొలి తెలుగు సినిమా. ఈ సినిమాలో మాళవిక ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నారు. ఆమె పాత్రకు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా ఉంటాయని తెలిసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ఇటీవల మేకర్స్ ప్రకటించారు. కానీ ‘రాజా సాబ్’ మూవీ ఏప్రిల్ 10న రిలీజ్ కావడం లేదని, కొత్త విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే వెల్లడిస్తారని తెలిసింది. కాగా విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్‌లో చేయాల్సిన ఓ స్పోర్ట్స్ డ్రామా ‘హీరో’ (అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన టైటిల్)లో మాళవికా మోహనన్ హీరోయిన్ గా చేయాల్సింది. 2019 వేసవిలో ఈ మూవీ ఓపెనింగ్ కూడా జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల క్యాన్సిల్ అయ్యింది. ఇలా... టాలీవుడ్‌కి మాళవిక రాక ఆలస్యమైంది.రీమేక్‌తో ఎంట్రీప్రముఖ తమిళ దర్శక–నిర్మాత శంకర్ కుమార్తె అదితీ శంకర్ ఈ ఏడాది తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న మూవీ ‘భైరవం’. ఈ మూవీలో అదితీ శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్‌గా చేస్తున్నారు. కాగా అదితీ శంకర్‌కు ‘భైరవం’ తెలుగులో తొలి చిత్రం. డా. జయంతి లాల్ గడ సమర్పణలో విజయ్ కనకమేడల దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. గత ఏడాది మేలో రిలీజైన తమిళ హిట్ మూవీ ‘గరుడన్ ’కు తెలుగు రీమేక్‌గా ‘భైరవం’ మూవీ తెరకెక్కుతున్నట్లు టాక్.ఫౌజీకి జోడీగా...స్టార్ హీరో ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న భారీ మూవీ ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) తో హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అవడం అనేది చిన్న విషయం కాదు. ఈ అవకాశం యంగ్ హీరోయిన్ ఇమాన్వీకి దక్కింది. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో ఓ పీరియాడికల్ లవ్ అండ్ పేట్రియాట్రిక్ మూవీగా ‘ఫౌజి’ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రీమూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తున్నారు.ఇమాన్వీకి ఫస్ట్ మూవీ ఇదే. హైదారాబాద్ శివార్లలో జరుగుతున్న ఈ మూవీ చిత్రీకరణలో ఇమాన్వీ పాల్గొంటున్నారు. ప్రభాస్, ఇమాన్వీలతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్న ఈ షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. జయప్రద, మిథున్ చక్రవర్తి ఈ సినిమాలో కీలక పాత్రలు చేస్తున్నారు. ఇలా కెరీర్ స్టార్టింగ్‌లోనే ప్రభాస్, జయప్రద, మిథున్ చక్రవర్తి వంటి పెద్ద యాక్టర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇమాన్వీకి కచ్చితంగా ప్లస్ పాయింటే. ఇక సోషల్ మీడియా మాధ్యమాల్లో ఇమాన్వీ యాక్టింగ్ అండ్ డ్యాన్సింగ్ స్కిల్స్ చూసి, దర్శకుడు హను రాఘవపూడి ఆమెకు ‘ఫౌజీ’ మూవీలో అవకాశం కల్పించారట.కాంతార అమ్మాయికన్నడ బ్లాక్‌బస్టర్ ‘కాంతార’ సినిమాలో హీరోయిన్ గా చేసిన సప్తమీ గౌడ తెలుగు ప్రేక్షకులకు గుర్తుండే ఉంటారు. ఈ బ్యూటీ ‘తమ్ముడు’ మూవీతో తెలుగు పరిశ్రమకు వస్తున్నారని తెలిసింది. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం ‘తమ్ముడు’. ఈ సినిమాలో నితిన్ సరసన సప్తమీ గౌడ హీరోయిన్ నటిస్తున్నారు. లైలా మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ మూవీని ఈ శివరాత్రికి థియేటర్స్‌లో రిలీజ్ చేయనున్నట్లుగా అప్పట్లో మేకర్స్ ప్రకటించారు. అయితే ‘తమ్ముడు’ సినిమా విడుదలపై మరోసారి స్పష్టత రావాల్సి ఉంది.మ్యూజికల్ మ్యాజిక్ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘΄పొన్నియిన్ సెల్వన్ ’ మూవీలో ఐశ్వర్యా రాయ్ యంగ్ రోల్ చేసిన నటి సారా అర్జున్ గుర్తుండే ఉంటారు. ఈ యంగ్ హీరోయిన్ స్ట్రయిట్‌గా తెలుగులో చేస్తున్న మూవీ ‘మ్యాజిక్’. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మ్యూజికల్ డ్రామా మూవీలో సారా అర్జున్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ కానుంది.కాలేజ్ ఫెస్టివల్ కోసం నలుగురు టీనేజర్లు ఓ ఒరిజనల్ సాంగ్‌ను కంపోజ్ చేయాలనుకునే ప్రయత్నంలో వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయన్నది ఈ సినిమా కథాంశమని సమాచారం. ఈ మూవీలో ఎనిమిది పాటలు ఉంటాయట. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ స్వరాలు సమకూర్చు తుండటం విశేషం. ఈ మూవీ ఈ ఏడాదిలోనే రిలీజ్ కానుంది.అచ్చ తెలుగు అమ్మాయిప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి డైరెక్షన్ లోని సినిమాలతో ఇలియానా వంటి హీరోయిన్ ్స తెలుగు తెరకు పరిచయం అయ్యారు. కాగా ఆయన డైరెక్షన్ లో రానున్న తాజా చిత్రంతో వీణా రావు అనే తెలుగు అమ్మాయి హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ లవ్‌స్టోరీ మూవీలో నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామరావు హీరోగా పరిచయం అవుతున్నారు. న్యూ టాలెంట్ రోర్స్ పతాకంపై ఈ మూవీని గీత నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ ఏడాదే రిలీజ్ కానుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన వీణా రావుకు కూచిపూడి డ్యాన్స్‌లోనూ ్రపావీణ్యం ఉందని, మేకర్స్ ఇటీవల ఓ సందర్భంగా వెల్లడించారు.ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘లైలా’. రామ్ నారాయణ్ డైరెక్షన్ లో షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ ‘లైలా’ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ కన్నడ బ్యూటీకి తెలుగులో ఇదే తొలి సినిమా. ఈ నెల 14న ‘లైలా’ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు ఈ ఏడాదే బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇవ్వనున్నారు ఆకాంక్ష. ‘తేరా యార్ హూ మై, కేసరి వీర్’ చిత్రాలతో పాటు దర్శకుడు మిలిప్ జవేరి డైరెక్షన్ లోని మరో మూవీలో నటిస్తున్నారు ఆకాంక్ష. ఈ చిత్రాల్లో ఏది ముందు రిలీజ్ అవుతుందో చూడాలి. ఇలా ఇటు తెలుగు అటు బాలీవుడ్లో ఒకే టైమ్‌లో ఆకాంక్ష ఎంట్రీ ఖరారు కావడం విశేషమనే చెప్పుకోవాలి.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న హీరోయిన్స్ మరికొందరు ఉన్నారు. ఇంకొంత మంది హీరోయిన్స్ తెలుగుకు వచ్చేందుకు కథలు వింటున్నారు. – ముసిమి శివాంజనేయులు -
‘ప్రేమిస్తావా’ మూవీ రివ్యూ
ఆకాష్ మురళి, అదితి శంకర్(డైరెక్టర్ శంకర్ కూతురు) జంటగా ‘పంజా’ఫేం విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు.మరి సినిమా ఎలా ఉంది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..దియా(అదితి శంకర్)ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు అర్జున్(ఆకాష్ మురళీ). ఆమె చదువుతున్న కాలేజీలోనే చేరి.. ప్రేమ విషయాన్ని చెబుతాడు. మొదట్లో ఆమె ఒప్పుకోకపోయినా..కొన్నాళ్లకు అర్జున్‌ని ఇష్టపడుతుది. ఇద్దరు కలిసి సహజీవనం కూడా చేస్తారు. అయితే జాబ్ విషయంలో తన కంపెనీ నుంచి పోర్చుగల్‌కి వెళ్లే అవకాశం వస్తుంది దియాకి. అర్జున్ కూడా వస్తానంటే.. నో చెబుతుంది. ఈ విషయంపై ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి బ్రేకప్ చెప్పుకుంటారు. కట్ చేస్తే.. పోర్చుగల్‌కి వెళ్లిన దియా.. ఓ హత్య కేసులో అరెస్ట్ అవుతుంది. ఈ విషయం తెలిసి.. అర్జున్ పోర్చుగల్ వెళ్తాడు. ఎలాగైన ఈ కేసు నుంచి తన ప్రియురాలిని బయటపడేయాలనుకుంటాడు. అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? దియా ఆ వ్యక్తిని ఎందుకు హత్య చేసింది? దియా కోసం పోర్చుగల్ వెళ్లిన అర్జున్‌కి తెలిసిన అసలు విషయం ఏంటి? హత్యకు గురైన వ్యక్తికి శరత్ కుమార్, ఖుష్బూలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు దియా, అర్జున్ ఎలా ఒక్కటయ్యారు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ప్రేమ కథలకు టాలీవుడ్లో ఎప్పుడు మంచి ఆదరణ ఉంటుంది. అందుకే ఇతర భాషలోని లవ్‌స్టోరీ మూవీస్ కూడా ఇక్కడ డబ్బింగ్ అతుంటాయి. ఇలా తమిళ్లో హిట్టయిన ప్రేమ కథే ‘ ప్రేమిస్తావా’. నేటి యువతకు బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్‌తో ఈ ప్రేమ కథను తీర్చి దిద్దారు. కథ ప్రజెంట్ నుంచి పాస్ట్‌లోకి వెళ్తుంది. ప్రైవేట్ కంపేనీలో ఉద్యోగం చేసే అర్జున్.. రియా అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే పోర్చుగల్ వెళ్లడంతో అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే గతంలో వీరిద్దరు ఎలా కలిశారు? ప్రేమలో ఎలా పడ్డారు? ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనేని రొమాంటిక్ వేలో యూత్‌ని ఆకట్టుకునేలా చూపించారు. ఫస్టాఫ్ అంతా వీరిద్దరి లవ్‌స్టోరీని చూపించి..సెకండాఫ్‌లో వారి మధ్య జరిగే ఘర్షణ, విడిపోవడానికి దారి తీసిన పరిస్థితలు చూపించారు. ద్వితియార్థం మొత్తం పోర్చుగల్‌లోనే సాగుతుంది. దియా కోసం అర్జున్ పడే బాధ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. ఇక క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది. అంత వరకు కథనం రొటీన్‌గా సాగినా.. క్లైమాక్స్ ట్విస్ట్ కొత్తదనాన్ని అందిస్తుంది. ఎమోషన్స్ విషయంలో ఇకాంస్త దృష్టిపెట్టి.. కథను మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.ఎవరెలా చేశారంటే.. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంతకైన తెగించే యువకుడు అర్జున్ పాత్రలో ఆకాశ్ మురళి ఒదిగిపోయాడు. హీరోగా తొలి చిత్రమే అయినా.. కెమెరా ముందు ఆ విషయం తెలియకుండా ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. రొమాంటిక్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఇక దియా పాత్రలో అదితి శంకర్ ఒదిగిపోయింది. తెరపై అందంగా కనిపిస్తూనే తనదైన నటనతో ఆకట్టుకుంది. శరత్ కుమార్, ఖుష్బులు మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. దగ్గుబాటి రాజా, కల్కి కొచ్లిన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. చిన్న సినిమానే అయినా..తెరపై చాలా రిచ్‌గా కనిపించేలా చేశారు. ఖర్చు విషయంలో నిర్మాతలు వెనకడుగు వేయలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -
ఆహా అనిపించేలా అదితి శంకర్ క్యూట్ లుక్స్...
-
‘ప్రేమిస్తావా’ మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
యాక్షన్... థ్రిల్
ఆకాశ్ మురళి(Akash Murali), అదితీ శంకర్ జంటగా ‘పంజా’ ఫేం విష్ణువర్ధన్ దర్శకత్వం వహించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ‘నేసిప్పాయా’ పేరుతో తమిళంలో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో ‘ప్రేమిస్తావా’(Premistava) పేరుతో ఈ నెల 30న విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్‌లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ శశి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా మేకింగ్, ఆర్ఆర్ చాలా బాగున్నాయి’’ అని చెప్పారు.‘‘ప్రస్తుతం సమాజంలో బంధాలు ఎలా ఉన్నాయి? అనేది మా చిత్రం చూపిస్తుంది’’ అన్నారు విష్ణువర్ధన్. ‘‘ప్రేమిస్తావా’ని అందరూ సపోర్ట్ చేయాలి’’ అని సహ నిర్మాత స్నేహ బ్రిట్టో కోరారు. ‘‘నా తొలి సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడం నా అదృష్టం’’ అని చెప్పారు ఆకాశ్ మురళి. ‘‘ఈ చిత్రంలో ప్రేమ, యాక్షన్, రొమాన్స్ ఉన్నాయి’’ అని తెలిపారు అదితీ శంకర్. -
లవ్, రిలేషన్ షిప్, గొడవలు..ఆసక్తికరంగా ‘ప్రేమిస్తావా’ ట్రైలర్
ఆకాష్ మురళి, అదితి శంకర్ జంటగా ‘పంజా’ఫేం విష్ణు వర్ధన్ తెరకెక్కించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రేమిస్తావా’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా తమిళంలో ‘నేసిప్పాయా’ పేరుతో విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మైత్రీమూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేసేందుకు ముందుకొచ్చింది. జనవరి 30న ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్. ఈ నేపథ్యంలో తెలుగు ట్రైలర్ లాంచ్ వేడుకను మంగళవారం ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.ట్రైలర్ విషయానికి వస్తే ప్రేమజంట మధ్య లవ్, రిలేషన్ షిప్, గొడవలు ఇలా ఎంతో ఆసక్తికరంగా ట్రైలర్‌ను డిజైన్ చేశారు. ఇప్పటి వరకు వచ్చిన లవ్ స్టోరీస్‌కు డిఫరెంట్‌గా ఈ సినిమా ఉందని చెప్పేలా ట్రైలర్ ఉంది. ఆకాష్ మురళి ఎంతో అనుభవం ఉన్న నటుడిగా తొలి సినిమాతోనే అదరగొట్టాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక అదితి శంకర్ విషయానికి ప్రేమికురాలిగా తనలోని కొత్త కోణాన్ని చూపించారు. శరత్ కుమార్, ఖుష్బూ ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా సినిమాపై అంచనాలు పెంచేలా ట్రైలర్‌ను కట్ చేశారని తెలుస్తోంది.ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో డైరెక్టర్ విష్ణు వర్ధన్ మాట్లాడుతూ..‘‘ఏడెనిమిదేళ్ల తర్వాత తెలుగువారిని కలుస్తున్నా. నేను తెలుగులో మాట్లాడితే మా అమ్మ సంతోషపడుతుంది. మా సినిమాను సపోర్ట్ చేసి రిలీజ్ చేస్తున్నందుకు మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌కు చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఆకాష్-అదితి మధ్య ప్రేమ గురించి చెబుతుంది. ప్రస్తుతం సమాజంలో రిలేషన్ షిప్స్ ఎలా ఉన్నాయి అనేది చూపిస్తుంది. అదితి, ఆకాష్ చాలా చక్కగా నటించారు. కొన్ని సీన్స్‌లో వాళ్ల నటన చూసి ఎమోషనల్ అయ్యాను. లవ్ స్టోరీలో సాలిడ్ డ్రామా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ డ్రామాని సపోర్ట్ చేస్తూ మిగతా క్యారెక్టర్స్ చేసిన శరత్ కుమార్, ఖుష్బూ, ప్రభుగారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇలాంటి స్క్రిప్ట్‌ను నిర్మాతలు ఒప్పుకోవడం సాహసమనే చెప్పాలి. యువన్ శంకర్ రాజా నా స్కూల్ మేట్. అప్పటి నుంచి అతని సంగీతం తెలుసు. నా సినిమాలన్నింటికీ ఆయనే సంగీతం చేస్తారు. యువన్ సంగీతం కోసమే సినిమాకు వచ్చే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. ఈ సినిమా కోసం ఎంతోమంది గొప్ప టెక్నీషియన్స్ పని చేశారు. ఎప్పటిలాగే మీ అందరి సపోర్ట్ నాకు, ఈ సినిమాకు ఇవ్వాలని కోరుకుంటున్నా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు ఇప్పటికీ అంతే ఎనర్జీతో ఉన్నారు. ఆయన చాలా ఎత్తుకు ఎదుగుతారని పంజా సినిమా టైమ్‌లోనే నాకు అర్థమైంది. ఆయన మనసు నిజంగా చాలా మంచిది. ఆప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అవడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది’’ అని చెప్పారు.హీరో ఆకాష్ మురళి మాట్లాడుతూ..‘‘నా ఫస్ట్ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేయడం నిజంగా నా అదృష్టం. ప్రేమిస్తావా సినిమాకు అందరి సపోర్ట్ కావాలి. అదితి నిజంగా బెస్ట్ కోస్టార్. డైరెక్టర్ హర్ష వర్ధన్ గారు ఈ సినిమాను చాలా బాగా తీశారు. అందరూ తప్పకుండా ప్రేమిస్తావా సినిమాను చూడండి’’ అని చెప్పారు.హీరోయిన్ అదితి శంకర్ మాట్లాడుతూ..‘‘ప్రేమిస్తావా సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది నా ఫస్ట్ లవ్ స్టోరీ. ఇందులో లవ్ ఉంది.. యాక్షన్ ఉంది.. రొమాన్స్ ఉంది.. డైరెక్టర్ విష్ణు వర్ధన్ గారి స్టైలిష్ మేకింగ్ ఉంది. ఈ సినిమాను అందరూ తప్పకుండా చూడండి. మా నాన్నగారికి ఇస్తున్న ప్రేమను నాకు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని తెలిపారు. -
400 ఏళ్ల నాటి గుడి కాన్సెప్ట్‌తో సినిమా.. గ్లింప్స్‌తోనే భారీ అంచనాలు
హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. తొలి సినిమా ‘అల్లుడు శీను’తోనే హిట్ కొట్టి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు . ఆ తర్వాత జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. అయితే ఈ యంగ్ హీరో ఇటీవల నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. అల్లుడు అదుర్స్ మూవీ తర్వాత తెలుగులో ఆయన మరే సినిమాలో నటించలేదు. అయితే, ఛత్రపతి హిందీ రీమేక్ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ చాలా కష్టపడ్డాడు. ఆ ప్రాజెక్ట్ కోసం భారీగా ఖర్చు పెట్టాడు కూడా.. కానీ, ఫలితం దక్కలేదు. దీంతో ఆయన టాలీవుడ్ వైపే సీరియస్‌గా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు. అందులో 'హైందవ' (Haindava Movie) చిత్రం నుంచి తాజాగా టైటిల్ గ్లింప్స్ (Glimpse) విడుదల చేశారు.(ఇదీ చదవండి: 'డాకు మహారాజ్' ప్రీరిలీజ్ ఈవెంట్ రద్దు)బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Srinivas) హీరోగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో హైందవ చిత్రాన్ని మహేశ్ చందు నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నాలుగువందల ఏళ్ల క్రితం నాటి గుడి కాన్సెప్ట్‌తో ఈ మూవీని చిత్రీకరిస్తున్నారు. హిందూ పురాణాల ఆధారంగా వచ్చిన చాలా సినిమాలు ఈ మధ్య కాలంలో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు శ్రీ మహా విష్ణువు దశావతారాల నుంచి హైందవ చిత్రం రానుందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే చాలా ఆసక్తిగా ఉంది. 2.40 నిమిషాలు ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. పురాతన ఆలయాన్ని కొందరు దుండగలు నాశనం చేసేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అడ్డుకోవడానికి ఓ బైకులో హీరో శ్రీనివాస్ పెద్ద సాహసమే చేస్తుంటాడు. ఇదే సమయంలో సింహం, వరాహం, గద్ద కూడా అతని బైకు వెంట వెళ్తూ ఉంటాయి. ఈ విజువల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కావచ్చింది. కమర్షియల్ అంశాలతో కూడిన శక్తివంతమైన, ఆసక్తికరమైన కథను లుధీర్ సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంగీతం లియోన్ జేమ్స్ అందిస్తున్నారు.'భైరవం'లో శంకర్ కుమార్తె హీరోయిన్బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి ఒక సాంగ్ కూడా విడుదలైంది. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ మంచి బజ్‌ను క్రియేట్ చేశాయని చెప్పవచ్చు. -
బెల్లంకొండ బర్త్ డే స్పెషల్.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం భైరవం. ఈ చిత్రంలో ఆదితి శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాకు విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఇవాళ సాయి శ్రీనివాస్ పుట్టిన రోజు కావడంతో ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియోను విడుదల చేశారు. టాలీవుడ్ హీరో నాని చేతుల మీదుగా ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన హీరోకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఓ వెన్నెల అంటూ సాంగే పాట ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన సాంగ్ ఓ వెన్నెల సాంగ్‌కు తిరుపతి జావన లిరిక్స్ అందించారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, యామిని ఆలపించారు. శ్రీచరణ్ పాకాల సంగీతమందిస్తోన్న ఈ చిత్రంలో మంచు మనోజ్, నారా రోహిత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అదితి శంకర్‌తో పాటు దివ్యా పిళ్లై, ఆనంది కూడా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.Happy to launch this soothing melody #OoVennela from #Bhairavam ▶️ https://t.co/BvAn6n84rt Happy Birthday @BSaiSreenivas, wish you all the luck and success this year.All the best @AditiShankarofl, @KKRadhamohan Garu , @DirVijayK, @sricharanpakala & Team pic.twitter.com/eZ9lNclFkK— Nani (@NameisNani) January 3, 2025 -
దర్శకుడు శంకర్ కూతురు ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తుందా..?
సినిమా రంగంలో సెంటిమెంట్ ఎక్కువేనని చెప్పక తప్పదు. ఒక్క హిట్ వస్తే చాలు సినిమా పరిశ్రమ నెత్తికెక్కించుకుంటుంది. అదే ఒక్క ప్లాప్ వచ్చినా, ఐరన్‌లెగ్ ముద్ర వేసేస్తారు. దర్శకుడు శంకర్ వారసురాలిగా సినీ రంగప్రవేశం చేసిన అదితి శంకర్ కథానాయకిగా తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకున్నారు. ఆమె నటించిన మొదటి చిత్రం కార్తీకు జంటగా 'విరుమాన్'లో నటించి హిట్ అందుకున్నారు. అందులో ఆమె గాయనిగానూ పరిచయం అయ్యారు. అదే విధంగా అదితి శంకర్ నటించిన రెండవ చిత్రం మహావీరన్ (మహావీరుడు) కూడా హిట్ అయ్యింది. దీంతో ఈమెను గోల్డెన్ లెగ్ అంటున్నారు. ప్రస్తుతం ఆకాశ్ మురళికి జంటగా కోలీవుడ్‌లో నేశిప్పాయా అనే చిత్రంతో పాటు అర్జున్‌దాస్‌కు జంటగా మరో చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. వీటి తరువాత నటుడు అధర్యకు జంటగా ఇంకో చిత్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే నేశిప్పాయా చిత్రం ద్వారా దివంగత నటుడు మురళి రెండవ వారసుడు ఆకాశ్ మురళి కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. దీనికి విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రంపైనే ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. నేశిప్పాయా చిత్రంతో నటి అదితి శంకర్ తన సక్సెస్‌ను కొనసాగిస్తారా? హ్యాట్రిక్ కొడతారా? అన్నదే ప్రస్తుతం జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు చిత్రాలు ఉన్నాయి. వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయగా మంచి స్పందన తెచ్చుకుంది. కాగా ఇందులోని తొలంజ మనసు అనే పల్లవితో సాగే పాటను తాజాగా విడుదల చేశారు. కాగా ఇందులో ప్రభు, శరత్‌కుమార్, కుష్భూ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీనికి యువన్‌శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. -
ఫైనల్‌గా తండ్రి దర్శకత్వంలో కూతురు?
కోలీవుడ్‌లో స్టార్ దర్శకుల లిస్ట్ తీస్తే అందులో ముందుండే పేరు శంకర్. భారీ సినిమాలని తీసి రికార్డులు కొల్లగొట్టే ఈయన.. రీసెంట్ గా వచ్చిన 'భారతీయుడు 2'తో ఘోరమైన డిజాస్టర్ అయింది. దీంతో శంకర్ తీసిన 'గేమ్ ఛేంజర్'పై లేనిపోని సందేహాలు వస్తున్నాయి. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా.. క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి రానుంది. దీని పోస్ట్ ప్రొడక్షన్ చేస్తూనే.. 'భారతీయుడు 3'పైన శంకర్ ఫోకస్ పెట్టాడు. మరికొన్ని సీన్స్ తీసే ప్రయత్నాల్లో ఉన్నాడట.(ఇదీ చదవండి: హీరోయిన్‌తో పెళ్లి రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన మెగాహీరో)వీటన్నింటి తర్వాత శంకర్ ఏం సినిమా చేస్తాడా అనేదే సస్పెన్స్‌గానే ఉంది. 'వేలప్పారి' నవలను భారీ బడ్జెట్‌తో శంకర్ తీయాలనుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇందులోనే తన కూతురిని కూడా నటింపజేసే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం తమిళంలో యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్న అదితీకి.. తండ్రి శంకర్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ వస్తే జాక్‌పాట్ కొట్టేసినట్లే!(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 20 సినిమాలు.. ఆ నాలుగు స్పెషల్) -
పెళ్లికి రెడీ అయిన మరో హీరోయిన్!
తమిళ సినిమా: కోలీవుడ్‌లో లక్కీయస్ట్ కథానాయకి ఎవరంటే ప్రస్తుతం నటి అదితి శంకర్ పేరే వినిపిస్తోంది. స్టార్ దర్శకుడు శంకర్ వారసురాలైన ఈమె డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన విషయం తెలిసిందే. ఆ విధంగా విరుమాన్ చిత్రంలో కార్తీకి జంటగా నటించి తొలి విజయాన్ని అందుకున్నారీమె. అదే చిత్రంలో పాట పాడి గాయనిగాను ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత శివ కార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూడా ఈమెకు సక్సెస్ అందించింది. అలా ఇప్పటికీ నటించింది రెండు చిత్రాలు అయినా పలు చిత్రాల్లో నటించిన ప్రచారాన్ని పొందారు. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో నవ నటుడు ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్నారు. ఈయన దివంగత ప్రముఖ నటుడు మురళి రెండవ కొడుకు. కాగా నటి అదితి శంకర్‌ను త్వరలో నటుడు సూర్యతో జతకట్టే అవకాశం వరించబోతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. కాగా అదితి శంకర్ పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు చాలా కాలంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే నటనను పెద్ద ఫ్యాషన్‌గా భావించే ఈమె అంత త్వరగా పెళ్లి పీటలు ఎక్కుతారని భావించలేం. కాగా సమీపకారంలో అదితి శంకర్ అక్క రెండవ వివాహం ఇటీవలే జరిగిన విషయం తెలిసింది. ఇకపోతే అదితి శంకర్ తరచూ ఫొటో సెషన్లను నిర్వహించుకొని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఆమె పెళ్లి కూతురుగా తయారైన ఒక అందమైన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో అక్క పెళ్లి అయ్యింది.. తర్వాత అదితి శంకర్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారా? అనే కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
లక్కీ హీరోయిన్ రెమ్యునరేషన్ ఇంత తక్కువా..?
ఏ రంగంలోనైనా విజయాల ప్రభావం చాలానే ఉంటుంది. అందుకు ప్రతిభ, శ్రమ మాత్రమే సరిపోదని, అదృష్టం తోడవ్వాలన్నది వాస్తవం. ఒక్కోసారి హీరోహీరోయిన్లు నటించిన చిత్రాలు విజయం సాధించినా, తదుపరి అవకాశాలు రావడం కష్టంగా మారుతుంది. అయితే నటి అదితి శంకర్ పరిస్థితి ఇందుకు విరుద్ధం అనే చెప్పాలి. ప్రముఖ దర్శకుడు శంకర్ ఇద్దరు కూతుళ్లలో చిన్న కూతురు అదితి శంకర్. వైద్య విద్యను అభ్యసించిన ఈ భామ నటనపై ఆసక్తితో సినీ రంగప్రవేశం చేశారు. అలా 2022లో కార్తీకి జంటగా విరుమాన్ అనే చిత్రం ద్వారా కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంతో గాయనిగానూ పరిచయం కావడం విశేషం. ఈ చిత్రంలో ఆమె పాడిన పాట హిట్ కావడంతో అదితి శంకర్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయి. ఈమె నటించిన రెండో చిత్రం మావీరన్. శివకార్తికేయన్ హీరోగా నటించిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. దీంతో కోలీవుడ్‌లో లక్కీ హీరోయిన్ అనే ముద్ర వేసుకున్నారు. కాగా ప్రస్తుతం విష్ణువర్థన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దివంగత నటుడు మురళీ రెండో కొడుకు, నటుడు అధర్వ తమ్ముడు ఆకాశ్ మురళీ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే నటుడు సూర్య సరసన జత కట్టే అవకాశం అదితి శంకర్‌ను వరించిందన్న టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నటుడు సూర్య నిర్మించనున్న ఈ చిత్రానికి సుధా కొంగర దర్శకత్వం వహించనున్నారు. ఇకపోతే నటుడు అధర్వ సరసన కూడా అదితి శంకర్ నటించనున్నారనేది తాజా సమాచారం. ఇలా రెండేళ్లలో ఈమె నటించిన రెండు చిత్రాలు విడుదలై సక్సెస్ కాగా, మరో మూడు చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం విశేషం. ఇకపోతే అదితి శంకర్ పారితోషికం విషయానికి వస్తే ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ.25 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు విజయం సాధిస్తే ఈ అమ్మడి పారితోషికం కోటికి పెంచే ఆలోచనలో ఉన్నట్లు ఆమె వర్గం టాక్. అంతా లక్కు ప్రభావం. కాగా అదితి శంకర్ ఇప్పటికే రూ.80 లక్షల వరకూ కూడబెట్టినట్లు సమాచారం. ఇకపోతే ఈమె తండ్రి దర్శకుడు శంకర్ ఆస్తి రూ.250 కోట్లకు పైనేనట. -
తమ్ముడు తరువాత అన్నయ్యతో అదితి
ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ విరుమాన్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. నటుడు కార్తీతో జతకట్టిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అదితి శంకర్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయి. విరుమాన్ చిత్రం తర్వాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం విజయవంతం అయ్యింది. ప్రస్తుతం దివంగత నటుడు మురళి రెండో కొడుకు మురళీ ఆకాశ్‌తో జత కడుతున్నారు. విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. కాగా త్వరలో నటుడు సూర్య సరసన నటించడానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తొలుత కార్తీతో నటించిన అదితి శంకర్ తదుపరి ఆయన అన్నయ్యతో జత కట్టనున్నారన్నమాట. అయితే సూర్య సరసన నటించే విషయమై ఇంకా అధికారిక ప్రకటన రాలేదన్నది గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో అదితి శంకర్‌ను తాజాగా మరో అవకాశం వరించింది. శ్రీవారి ఫిలిం పతాకంపై పి రంగనాథన్ నిర్మిస్తున్న చిత్రంలోని నటుడు అధర్వ మురళి కథానాయకుడుగా నటించనున్నారు. దీనికి ఎం రాజేష్ దర్శకత్వం వహించనున్నారు. ఇందులో అదితి శంకర్ కథానాయకిగా నటించనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించారు. దీని గురించి మీడియాతో నటుడు అధర్వ పేర్కొంటూ శ్రీవారి ప్రిలిమ్స్ సంస్థ అధినేత పి రంగనాథన్ చిత్ర పరిశ్రమలో ఎంతో అనుభవం గడించిన నిర్మాత, పంపిణీదారుడు అని అన్నారు. ప్రేక్షకులకు నచ్చేలా చిత్రాలను నిర్మించడంలో ఈయనకు అందేవేసిన చెయ్యి అని అన్నారు. అలాంటి నిర్మాత వద్ద పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. మంచి జనరంజకమైన కథనం ఎంపిక చేసి, అందుకు అవసరమైన ఖర్చు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. దర్శకుడు ఎం రాజేష్ దర్శకత్వంలో పి రంగనాథన్ నిర్మిస్తున్న చిత్రంలో తాను నటించడం గర్వంగా భావిస్తున్నట్లు నటుడు అధర్వ మురళి పేర్కొన్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రాలను ఆశించే ప్రేక్షకులకు ఈ చిత్రం కచ్చితంగా నిరాశ పరచదనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. లేకపోతే విష్ణువర్ధన్ దర్శకత్వంలో మురళీఆకాష్ సరసన నటిస్తున్న నటి అదితి శంకర్ ఇప్పుడు ఆయన అన్నయ్య అధర్వ మురళితో జతకట్టబోతున్నారన్నమాట. -
అదితి శంకర్ కొత్త సినిమా.. షూటింగ్ పూర్తి!
దర్శకుడు విష్ణు వర్ధన్ పేరు చెప్పగానే పట్టియల్, బిల్లా, ఆరంభం వంటి విజయవంతమైన చిత్రాలు గుర్తుకొస్తాయి. ఆమధ్య బాలీవుడ్ వెళ్లి పేర్షా సినిమాను డైరెక్ట్ చేయగా ఈ మూవీ ఏకంగా జాతీయ అవార్డు గెలుచుకుంది. ప్రస్తుతం ఇతడు సల్మాన్‌ఖాన్ హీరోగా పెట్టి ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం విష్ణువర్ధన్‌కు బాలీవుడ్లో మరింత గుర్తింపును తీసుకురానుందట. తాజాగా ఈయన కోలీవుడ్‌పై దృష్టి సారించారు. దివంగత నటుడు మురళి వారసుడు ఆకాష్ మురళిని కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఎక్స్ బీ ఫిలిమ్స్ పతాకంపై సేవియర్ బిట్టో నిర్మిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సంస్థ ఇంతకుముందు విజయ్, విజయ్ సేతుపతి కలిసి నటించిన మాస్టర్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించింది. ఇక లేటెస్ట్ మూవీలో ఆకాష్ మురళి సరసన దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్గా నటించటం విశేషం. ఇందులో నటుడు శాంతకుమార్, ప్రభు గణేశన్, నటి కుష్భు సుందర్, కల్కి కొచ్లిన్ ముఖ్యపాత్రలు పోషించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ మూవీ మనసులను హత్తుకునే రొమాంటిక్ ప్రేమ కథా చిత్రంగా ఉండబోతుందని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్ర షూటింగ్ పోర్చుగల్, స్పెయిన్ దేశాల్లోని అందమైన నగరాలతో పాటు ఇండియాలోని బెంగళూరు, చైన్నె ప్రాంతాల్లో నిర్వహించినట్లు పేర్కొన్నారు. చిత్రీకరణ పూర్తయినట్లు తెలిపారు. కాగా ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారని, ఇంతకు ముందు దర్శకుడు విష్ణు వర్ధన్ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా కాంబోలో రూపొందిన చిత్రాల్లోని పాటలు సూపర్ హిట్ అయ్యాయని, అదే కోవలో సంగీత ప్రియులను ఈ చిత్రం అలరిస్తుందని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. Tamil hero, Akash Murali, son of late actor Murali. The filming has been completed & the film has been shot extensively across different cities in Portugal, Spain & India. Starring @_akashmurali @AditiShankarofl @realsarathkumar #PrabhuGanesan @khushsundar — XB Film Creators (@XBFilmCreators) February 9, 2024 చదవండి: ఫైనల్లీ గుడ్‌న్యూస్ చెప్పిన సమంత -
లక్కీ హీరోయిన్‌కు భారీగా ఛాన్స్‌లు .. పెళ్లికి ఫుల్స్టాప్
ఆదితిశంకర్కు అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు అయిన ఈమె వైద్య విద్య చదివి సినిమాపై మక్కువతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. అలా కార్తీ సరసన దుర్మార్ చిత్రంలో కథానాయకిగా పరిచయమైన అదితి శంకర్ తొలి చిత్రంలోనే గాయనిగా కూడా తనను పరిచయం చేసుకున్నారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత శివకార్తికేయన్ సరసన నటించిన మావీరన్ చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. దీంతో అదితి శంకర్ లక్కీ హీరోయిన్ అనే ముద్రను వేసుకున్నారు. ఎప్పుడు చలాకీగా ఉండే ఈమె తరచూ స్పెషల్‌గా తీయించుకున్న తన గ్లామరస్ ఫొటోలతో నెటిజన్లను అలరిస్తూ వుంటారు. ప్రస్తుతం విష్ణువర్దన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆకాష్ మురళీకి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. చిత్రం తరువాత చిత్రం చేసుకుంటూ సక్సెస్ఫుల్ బాటలో పయనిస్తున్న అదితిశంకర్ నటనకు స్వస్తి పలికి పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ఆ మధ్య ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తోంది. త్వరలో సూర్య నటించనున్న నూతన చిత్రంలో ఆయనకు జంటగా అదితి శంకర్ నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా ఇప్పుడు ఈ బ్యూటీని మరో లక్కీచాన్స్ వరించింది అన్నది తాజా సమాచారం. చేసింది రెండు చిత్రాలు అయినా ఈమెకు హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దీనిని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నట్లు సమాచారం. -
స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ కూతురు!
వైద్య విద్య చదివి హీరోయిన్గా సినీ రంగప్రవేశం చేసిన నటి ఆదితి శంకర్. అంతే కాదు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఆదితి శంకర్ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. అందులో ఈ చైన్నె చంద్రం పక్కా పల్లెటూరి యువతిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా తొలి చిత్రంలోని పాటను కూడా పాడి సింగర్‌గా కూడా పరిచయమయ్యారు. ఆ తరువాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూడా అనూహ్య విజయాన్ని అందుకుంది. కాగా.. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్నారు. నటుడు అధర్వ తమ్ముడు ఆకాష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. ఈ చిత్ర నిర్మాణంలో ఉండగానే ఆదితి శంకర్ మరో లక్కీచాన్స్ తలుపు తట్టినట్టు తాజా సమాచారం. విరుమాన్ చిత్రంలో కార్తీతో జత కట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరో సూర్య సరసన నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. కాగా... నటుడు సూర్య ప్రస్తుతం కంగువా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. శివ దర్శకత్వంలో ఈ భారీ చారిత్రక కథా చిత్రం త్రీడీ ఫార్మెట్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది. కాగా వెట్రిమారన్ దర్శకత్వంలో వాడి వాసల్ చిత్ర షూటింగ్లో సూర్య 10 రోజులు పాల్గొననున్నారు. ఆ తరువాత సుధా కొంగర దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఇందులో దుల్కర్ సల్మాన్ ,విజయ్‌వర్మ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. అదేవిధంగా ఇందులో నజ్రియా నాయకిగా నటిస్తున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానంలో ఆదితి శంకర్‌ను తీసుకున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
స్టార్ డైరెక్టర్ కూతురు షాకింగ్ నిర్ణయం.. నిజమేనా?
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలు అదితి శంకర్. చాలా చలాకీగా ఉండే ఈమె మల్టీ టాలెంటెడ్. చదివింది వైద్య విద్య అయినా నటనపై ఆసక్తితో సినిమాల్లో అడుగు పెట్టింది. దీంతో ఎలాగైనా కథానాయకిగా నటించాలనే పట్టుదలతో తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా వారిని ఒప్పించారు. అలా విరుమాన్ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. కార్తీ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో పల్లెటూరి యువతిగా నటించి మెప్పించారు. మరో విషయం ఏమిటంటే తొలి చిత్రంతోనే గాయని అవతారం ఎత్తి తన మల్టీ టాలెంటెడ్‌ను నిరూపించుకున్నారు. ఆ చిత్రం తరువాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఈ రెండు సూత్రాలు సక్సెస్ అయ్యి అదితి శంకర్‌ను లక్కీ హీరోయిన్ చేశాయి. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. తదుపరి రాక్షసన్ చిత్రం ఫేమ్ రాంకుమార్ దర్శకత్వంలోనూ నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అదితి శంకర్ నటనకు గుడ్ బై చెప్పనున్నారనే టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆమె డాక్టర్ దుస్తులు ధరించిన ఆపరేషన్ థియేటర్లో ఉన్న ఫొటోలు వైరల్ అవ్వడమే ఇందుకు కారణం కావచ్చు. అయితే ఆమె నిజంగానే నటనకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా? లేక ఏదైనా చిత్రంలోని ఫొటోలను సామాజి మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కథానాయకగా సక్సెస్ బాటలో పయనిస్తున్న అదితి శంకర్ నటనకు గుడ్ బై చెబుతున్నారన్న వార్త అభిమానులకు నమ్మశక్యంగా లేదు. అయితే ఈ విషయమై ఆమె సైతం మౌనం వహిస్తున్నారు. అయితే ఎప్పుడూ సామాజిక మాధ్యమాల్లో ఉండటానికి ఇష్టపడే అదితి శంకర్ చేస్తున్న కొత్తరకం పబ్లిసిటీ స్టంట్‌గా కొందరు భావిస్తున్నారు. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
డాక్టర్‌గా మారిన హీరోయిన్... సినిమాలకు గుడ్‌బై?
ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలే దక్కించుకుంటోంది. స్టార్ హీరో కార్తీకి జంటగా విరుమాన్ చిత్రంతో వెండితెరకు కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ తొలి మూవీతోనే ప్రశంసలను అందుకుంది. ఆ తర్వాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించి మెప్పించింది. రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలతో ఇండస్ట్రీలో మరింత దూసుకుపోయింది. వరుస అవకాశాలు అందుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలున్నట్లు తెలుస్తోంది. డాక్టర్‌గా మారిన అదితి అయితే అదితిని డాక్టర్‌గా చూడాలన్నది శంకర్ దంపతుల కోరిక అని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమె వైద్య విద్య కూడా పూర్తి చేసింది. కానీ తనకు నటన అంటే ఇష్టం ఉండటంతో హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. తన ప్రయత్నంలో సక్సెస్ అయింది కూడా! తాజాగా ఈ బ్యూటీ డాక్టర్‌గా మారి షాకిచ్చింది. సర్జరీ చేయడానికి వైద్యులు కోట్ వేసుకుని, గ్లౌజులు ధరించి, తలకు క్యాప్ పెట్టుకుని ఎలాగైతే రెడీ అవుతారో అచ్చంగా అలాగే తయారైంది. సినిమాలు మానేస్తుందా? ఈ ఫోటోను 'డాక్టర్. A' అన్న క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు 'డాక్టర్ ఎ' అంటే వైద్యురాలు అదితి శంకర్ అని అభిప్రాయపడుతున్నారు. అంటే సినిమాలకు గుడ్ బై చెప్పి వైద్యవృత్తి మీద ఫోకస్ చేయనుందా? అని అనుమానిస్తున్నారు. లేదంటే ఈ డాక్టర్ వేషం సినిమా కోసమా? అని డౌట్ పడుతున్నారు. రీల్ అయినా రియల్ అయినా అదితి డాక్టర్ అయితే పేషెంట్ల గుండె జారి గల్లంతవడం ఖాయం అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) చదవండి: అలాంటి వాళ్లు ఇండస్ట్రీకి రావొద్దన్న విశాల్.. కౌంటరిచ్చిన దర్శకుడు -
కారులో రచ్చ చేసిన హీరోయిన్.. నెక్స్ట్ టార్గెట్ విజయ్?
అదితి శంకర్ పేరు ఈ మధ్య తరచూ ట్రెండింగ్‌లో ఉంటోంది. దర్శకుడు శంకర్ వారసురాలు అయిన ఈమె నటనపై ఆసక్తితో తల్లిదండ్రులను ఒప్పించి మరీ హీరోయిన్గా పరిచయం అయిన విషయం తెలిసిందే. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన అదితి శంకర్ ఆ తరువాత మావీరన్ చిత్రంలో శివకార్తికేయన్ సరసన నటించింది. ఈ రెండు చిత్రాలతో విజయాలను, వరుసగా అవకాశాలను అందుకుంటోంది. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాశ్ మురళికి జంటగా నటిస్తోంది. తాజాగా హీరో విష్ణువిశాల్ సరసన నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. దీనికి రాక్షసన్ చిత్రం ఫేమ్ రామ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. తదుపరి సుధా కొంగర దర్ళకత్వంలో సూర్యతో జత కట్టనున్నట్లు టాక్. ఇలా అదితి శంకర్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ చలాకీ చిన్నదాని నెక్స్ట్ టార్గెట్ దళపతి అంటున్నారు. అదితి తాజాగా రోల్స్ రాయిస్ కారులో వెళ్తూ విజయ్ 'లియో' చిత్రంలోని నా వరువా పాటకు ఆడి రచ్చ చేశారు. ఆ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో అదితి శంకర్ తదుపరి టార్గెట్ విజయా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ఇది మరీ ఓవర్ గా లేదూ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైనా అదితి శంకర్ కి ఇది కూడా ఒక రకమైన పబ్లిసిటీ అవుతోంది. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) చదవండి: హౌస్ అంతా గరంగరం.. ఆ ఎనిమిది మంది నామినేట్ -
శంకర్ కూతురు.. సూపర్ ఛాన్స్ కొట్టేసింది!
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరో సూర్యకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘సూరరై పొట్రు’(తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమా హిట్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్లో మరో చిత్రం ‘సూర్య 43’(వర్కింగ్ టైటిల్) రూపొందనుంది. ఈ మూవీలో అదితీ శంకర్ హీరోయిన్గా ఫిక్స్ అయ్యారని టాక్. -
రెడ్ డ్రెస్‌లో అదితి పోజులు.. వీకెండ్ మూడ్‌లో బుట్టబొమ్మ!
►యషిక ఆనంద్ హాట్ లుక్స్! ►రెడ్ డ్రెస్‌లో ఆదితిశంకర్ పోజులు! ►జిమ్‌లో కసరత్తులు చేస్తోన్న ప్రగతి! ►కాఫీ తాగుతూ చిల్ అవుతోన్న కాజోల్! ►వీకెండ్ మూడ్‌లో బుట్టబొమ్మ! View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Pragathi Mahavadi (@pragstrong) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
టాప్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన శంకర్ కూతురు
దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ ఎదుగుదల మామూలుగా లేదు. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రంతో కథానాయకగా పరిచయమైన ఈ బ్యూటీ తొలి చిత్రంతోనే ప్రశంసలను అందుకున్నారు. ఆ తర్వాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో అధర్వ తమ్ముడు ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్నారు. కాగా తదుపరి రాక్షసన్, చిత్రం ఫేమ్ రామ్‌కుమార్ తాజా చిత్రంలో నటించడానికి అదితి శంకర్ ఒప్పందం కుదుర్చుకున్నారు. (ఇదీ చదవండి: తన 'కొత్త ప్రేమ'ని వెల్లడించిన సమంత) ఇప్పుడు నటుడు సూర్యతో జతకట్టడానికి సిద్ధమవుతున్నారన్నది తాజా సమాచారం. సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువ అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. కాగా ఇంతకుముందు సుధా కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు చిత్రంలో నటించిన సూర్య ఆ చిత్రంతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. కాగా ఈ సూపర్ హిట్ కాంబినేషన్లో మరో చిత్రం తెరకెక్కబోతోందనే విషయం తెలిసిందే. ఇది సూర్య నటించే 43వ చిత్రం అవుతుంది. ఇందులో ఆయనకు జంటగా నటి అదితి శంకర్ నటించబోతున్నట్లు తాజా సమాచారం. దీనికి జీవి. ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. కాగా కార్తీతో నటించి విజయాన్ని అందుకున్న నటి అదితి శంకర్ ఇప్పుడు ఆయన అన్నయ్య సూర్యతో నటించడానికి రెడీ అవుతున్నారన్నమాట. మరో విషయం ఏమిటంటే నటుడు సూర్య దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
కూతురికి కండీషన్ పెట్టిన డైరెక్టర్ శంకర్.. పెళ్లి కోసమే!
హీరోయిన్ అదితి శంకర్.. స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలిగా సినీ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఇప్పటికి కథానాయికగా చేసింది రెండు చిత్రాలే అయినా బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రంతో హీరోయిన్గా రంగప్రవేశం చేసిన అదితి శంకర్ తొలి చిత్రంతోనే హిట్ కొట్టింది. తర్వాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాశ్ మురళి హీరోగా పరిచయం అవుతున్న చిత్రంలో నటిస్తోంది. సేవియర్ బ్రిట్టో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. మరోవైపు రాక్షసన్ చిత్రం ఫేమ్ రామ్ కుమార్ దర్శకత్వంలో నటించడానికి కమిట్ అయినట్లు సమాచారం. ఇందులో విష్ణు విశాల్‌తో జత కట్టనుంది. కాగా ఎంబీబీఎస్ చదివిన అదితి శంకర్‌కు డాక్టర్ కావాలన్నది ఆమె తల్లిదండ్రుల ఆకాంక్ష అని తెలుస్తోంది. చాలా చలాకీగా ఉండే అదితి శంకర్‌కు సినిమాలపై ఆసక్తి ఏర్పడడంతో తన తల్లిదండ్రులను ఒప్పించి కథానాయికగా ఎంట్రీ ఇచ్చిందని సమాచారం. అయితే అదితి శంకర్ నటించడానికి అంగీకరించిన ఆమె తండ్రి శంకర్ ఓ కండిషన్ పెట్టారట. రెండేళ్ల వరకూ నువ్వు ఎన్ని చిత్రాల్లో అయినా నటించు.. ఆ తరువాత కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని తేల్చిచెప్పారట. అందుకనే ఈ తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ చిత్రాలు చేయాలని అదితి తహతహలాడుతోందనే ప్రచారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే డైరెక్టర్ శంకర్ ఇలాంటి కండీషన్ పెట్టాడంటే నమ్మలేకపోతున్నామంటున్నారు నెటిజన్లు. బహుశా ఇది వుట్టి పుకారు మాత్రమే అయి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. లేదంటే తన ప్రతిభను చూశాకైనా శంకర్ ఈ కండీషన్ ఉపసంహరించుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. చదవండి: కోర్టు గొడవల్లో భోళా శంకర్ -
శంకర్ తనయ అతిధి ఫ్యాషన్ రేంజ్ మాములుగా ఉండదు!
అదితి శంకర్.. ప్రముఖ దర్శకుడు శంకర్ తనయగానే పరిచయం చేయాల్సిన అవసరం లేని ఐడెండిటీ ఆమెది. నటనపై నాకున్న ఆసక్తిని నాన్నకు చెప్పినప్పుడు, ఆయన నా పేరు వాడుకోకుండా అవకాశాల కోసం ప్రయత్నించు.. ఏడాదిలోపు అవకాశం వస్తే ఒకే.. లేదంటే ఇండస్ట్రీ పేరెత్తకూడదు అని చెప్పారు. ఆ కండిషన్‌కు ఎస్ చెప్పే ప్రయత్నించాను.. సాధించాను అంటోంది అదితి శంకర్. ఇక డాక్టర్‌గా, సింగర్‌గా, యాక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు. ఆ ప్రత్యేకతతో మ్యాచ్ అవడానికి పోటీ పడుతోన్న ఫ్యాషన్ బ్రాండ్స్‌లో ఇవీ ఉన్నాయి.. రుబీనా రుబీనా అఫ్రోజ్.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేసి సొంతంగా తన పేరుమీద చెన్నైలో ‘రుబీనా వోగ్’ ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించారు. ఎక్కువగా కొత్తతరం డిజైన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ బ్రాండ్ డిజైన్స్‌కి యూత్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. అదే దీని బ్రాండ్ వాల్యూ. వివాహాది శుభకార్యాలకు ముందుగా ఆర్డర్ ఇచ్చి డిజైన్ చేయించుకోవచ్చు కూడా. కాస్త సరసమైన ధరల్లోనే లభిస్తాయి. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ బ్రాండ్‌కి స్టోర్స్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేసే వీలు ఉంది. అదితి ధరించిన రుబీనా వోగ్ చీర ధర రూ. 8,500 జేసీఎస్.. జ్యూయల్ క్రియేషన్స్.. పేరుకు తగ్గట్టుగానే ప్రత్యేకమైన డిజైన్స్‌ను అందించే స్టోర్. 2013లో అరవింద్ కట్రేలా దీనిని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరి డిజైన్స్ అన్నింటిలోనూ న్యూస్టైల్ ప్రతిబింబిస్తోంది. అదే దీని బ్రాండ్ వాల్యూ. సింపుల్ డిజైన్స్‌తో గ్రాండ్ లుక్‌నిచ్చే అందమైన ఆభరణాలన్నీ ఇక్కడ లభిస్తాయి. పేరుకు దేశీ బ్రాండ్ అయినా ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయొచ్చు. ప్రీ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. (చదవండి: ఫ్యాషన్ టాక్: స్టైలు మారింది, డిజైన్ అదిరింది) -
చేసింది రెండే సినిమాలు.. క్యూ కడుతోన్న ఆఫర్లు!
కోలీవుడ్ భామ అదితి శంకర్‌కు అవకాశాలు క్యూ కడుతున్నాయి. డైరెక్టర్ శంకర్ కూతురిగా విరుమాన్ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్ర సక్సెస్ అదితి శంకర్‌కు బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత శివ కార్తికేయన్‌తో జతకట్టిన మావీరన్ చిత్రం కూడా విజయాన్ని అందుకుంది. (ఇది చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. అలాంటి పద్ధతిలో?) తాజాగా ఈ భామ అధర్వ తమ్ముడు ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్న చిత్రం షూటింగ్ దశలో ఉంది. దీనికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సెల్వరాగం దర్శకత్వంలో తెరకెక్కనున్న 7జి రెయిన్బో కాలనీ–2లో ఈ చిన్నదే నటించే అవకాశాలు ఉన్నట్లు కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కాగా అదితి శంకర్‌కు మరో అవకాశం తలుపు తట్టిందన్నది తాజా అప్డేట్. ఇంతకుముందు రాక్షసన్ వంటి పలు సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్ కుమార్ తాజాగా నటుడు విష్ణు విశాల్ హీరోగా చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలోనూ అదితి శంకర్ నటించబోతున్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని సత్య జ్యోతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఆయన తెలుపుతూ నటి అదితి శంకర్ తమ చిత్ర కథను విన్నారని ఆమె ఇందులో కథానాయకగా నటించనున్నారని తెలిపారు. కాగా ఇంతకుముందు విష్ణు విశాల్, దర్శకుడు రామ్ కుమార్ కాంబినేషన్లో రూపొందిన ముండాసు పట్టి, రాక్షసన్ చిత్రాలు సూపర్ హిట్ కావడంతో తాజాగా ఈ కాంబో హ్యాట్రిక్‌కు సిద్ధం అవుతోందన్నమాట. (ఇది చదవండి: భర్తకి ప్రముఖ నటి విడాకులు.. ప్రాణం పోయిన ఫీలింగ్! ) View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
సూపర్ హిట్ లవ్ స్టోరీకి సీక్వెల్ రెడీ.. హీరోయిన్ ఎవరంటే..?
కోలీవుడ్‌లో 'తుళ్లువదో ఇళమై' చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సెల్వరాఘవన్ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత కాదల్‌కొండేన్, 7జీ రెయిన్బో కాలనీ వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం నటుడిగా బిజీ అవుతున్న ఈయన మళ్లీ దర్శకత్వం వహించడానికి సిద్ధం అయ్యారు. ఈయన ఇంతకుముందు కోలీవుడ్‌లో దర్శకత్వం వహించిన సక్సెస్ఫుల్ చిత్రం 7జీ రెయిన్బో కాలనీ తెలుగులో 7/G బృందావన్ కాలనీగా విడుదలైంది. (ఇదీ చదవండి: చిత్తూరు నుంచి బాలీవుడ్‌నే ఏలిన అంకుశం రామిరెడ్డి ఎలా మరణించారో తెలుసా?) తెలుగు వెండితెరపై ఎన్నో సూపర్ హిట్ లవ్ స్టోరీస్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. అందులో 7/G బృందావన్ కాలనీ ఒకటి. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన ఈ మూవీ 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అప్పట్లో ఈ సినిమాకు యువతలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్‌కు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌ను తెరకెక్కించేందకు ప్లాన్ చేస్తున్నారు సెల్వరాఘవన్. తొలి భాగంలో నిర్మాత ఏఎం.రత్నం వారసుడు రవికృష్ణ కథానాయకుడిగా పరిచయం అయ్యారు. తరువాత ఆయన నటించిన పలు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో నటనకు దూరంగా ఉంటున్నారు. అలాంటిది 7/G బృందావన్ కాలనీ చిత్రం ద్వారా రీ ఎంట్రీకి సిద్ధం అవుతున్నాడు. (ఇదీ చదవండి: BRO Twitter Review ‘బ్రో’ మూవీ ట్విటర్ రివ్యూ) కాగా ఇందులో నటించే కథానాయకి పాత్ర కోసం నటి అదితి శంకర్, ఇవనాలలో ఒకరిని నటింపజేయడానికి దర్శకుడు సెల్వరాఘవన్ చర్చలు జరుపుతున్నట్లు టాక్. వీరిలో ఆ లక్కీ నటి ఎవరనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అదితిశంకర్ నటించిన మావీరన్ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అధర్వ తమ్ముడు ఆకాశ్ మురళీకి జంటగా నటిస్తున్నారు. ఇకపోతే లవ్ టుడే చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న నటి ఇవనా నటుడు హరీశ్ కల్యాణ్‌కు జంటగా నటించిన ఎల్జీఎం చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. కాగా 7/G బృందావన్ కాలనీ చిత్రానికి సీక్వెల్ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
Aditi Shankar: పోర్చుగల్‌లో అదితి శంకర్ హల్చల్!
దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ కథానాయికగా రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పటికే కార్తీ, శివకార్తీకేయన్‌కు జంటగా నటించారు. ఈ రెండు చిత్రాలు ప్రేక్షక ఆదరణ పొందాయి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అతిథి శంకర్ తన ఫొటోలను తరచూ పోస్ట్ చేస్తూ ఇటు చిత్ర పరిశ్రమల దృష్టిని తనవైపు పడేలా చూసుకుంటూ, అటు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కాగా ఇటీవల విధులైన మావీరన్ చిత్రంలో కథానాయికగా అదితి శంకర్ మంచి పాత్ర పోషించారు. తాజాగా ఈమె తన మూడో చిత్రానికి సిద్ధమయ్యారు నటుడు అధర్వ తమ్ముడు ఆకాష్ మురళి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రంలో అదితి శంకర్ నాయకిగా నటిస్తున్నారు. దీనికి విష్ణువర్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎక్స్ బీ ఫిలిమ్ క్రియేటర్స్ పతాకంపై సేవియర్ బ్రిట్టో నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై తొలి షెడ్యూల్‌ను చైన్నెలో పూర్తి చేసుకుంది. ప్రస్తుతం లిస్బన్లో రెండో షెడ్యూల్‌ను జరుపుకుంటోంది. కాగా ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనటానికి నటి అది శంకర్ సోమవారం పోర్చుగల్ దేశానికి బయలుదేరారు. అక్కడ వచ్చే నెల చివరి వరకు షూటింగ్ జరుగుతుందని సమాచారం. -
‘మహావీరుడు’ మూవీ రివ్యూ
టైటిల్: మహావీరుడు నటీనటులు: శివకార్తికేయన్, అదితి శంకర్, మిస్కిన్, సరిత, సునీల్, యోగిబాబు నిర్మాత:అరుణ్ విశ్వ దర్శకత్వం:మడోన్ అశ్విన్ సంగీతం: భరత్ శంకర్ సినిమాటోగ్రఫీ: విషు అయ్యన్న విడుదల తేది: జులై 14, 2023 మహావీరుడు కథేంటంటే.. సత్య(శివకార్తికేయన్) ఓ కార్టూనిస్ట్. మహావీరుడు పేరుతో కామిక్ కథలు రాస్తుంటాడు. నిజ జీవితంలో భయస్తుడు. కానీ తన కథలు మాత్రం సమాజం కోసం పోరాడే ఓ మహావీరుడి గురించే ఉంటాయి. తను ఉండే స్లమ్ ఏరియా నుంచి అందరిని వేరే ప్రాంతానికి తరలిస్తుంది ప్రభుత్వం. ఆ ఏరియా ప్రజలందరికి ఓ అపార్ట్మెంట్కి తరలిస్తారు. మంత్రి ఎమ్ ఎమ్ సూర్య(మిస్కిన్) మనుషులు నాసిరకం సిమెంట్‌తో ఆ అపార్ట్‌మెంట్‌ని నిర్మిస్తారు. పైకి అందంగా, అద్భుతంగా కనిపించినప్పటికీ.. ఇంట్లోకి వెళ్లిన తొలిరోజు నుంచి కిటికీలు పడిపోవడం, గోడలకు పగుళ్లు రావడం జరుగుతుంటాయి. ఇదేంటని ప్రశ్నిస్తే మంత్రి మనుషులు బెదిరిస్తారు. తన తల్లిని, సోదరిని అవమానించినా..సత్య ఎదురు తిరగడు. అయితే ఓ సందర్భంలో చనిపోవాలని అపార్ట్మెంట్ పైకి దూకేందుకు ప్రయత్నిస్తాడు సత్య. దెబ్బలు తగిలినా ప్రాణాలతో భయటపడతాడు. (చదవండి: ‘బేబీ’ మూవీ రివ్యూ) అప్పటి నుంచి అతనికి మాత్రమే ఓ అజ్ఞాత వ్యక్తి వాయిస్ వినిస్తుంది(హీరో రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చాడు). అతను సత్యని ఓ మహావీరుడిగా, మంత్రి సూర్యని యముడిగా వర్ణిస్తుంటాడు. అంతేకాదు మంత్రి నాసిరకంగా కట్టించిన ప్రజా భవనం కూలిపోతుందనే విషయాన్ని ఆ గొంతు అతనికి తెలియజేస్తుంది. అప్పుడు సత్య ఏం చేశాడు? ఆ అజ్ఞాత గొంతు కారణంగా సత్య జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అతని ప్రయాణంలో జర్నలిస్ట్ చంద్ర(అదితి శంకర్) పాత్ర ఏంటి? చివరకు మంత్రిని ఎదురించి ప్రజల ప్రాణాలకు ఎలా కాపాడాడు? అనేదే ‘మహావీరుడు’ కథ. ఎలా ఉందంటే.. ఓ రాజకీయ నాయకుడు ప్రజలను మోసం చేయడం.. హీరో వారికి అండగా నిలిచి, ఆ రాజకీయ నాయకుడి అవినీతిని భయటపెట్టడం, ప్రాణాలకు తెగించి ప్రజలను కాపాడడం.. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. మహావీరుడు కథ కూడా ఇదే. కానీ ఇక్కడ హీరో భయస్తుడు. ఓ పిరికివాడు ప్రజల కోసం ఎలా ధైర్యవంతుడిగా మారడనేదే ఈ మూవీ కథ. అయితే ఇదంతా సీరియస్ కాకుండా.. సెటిల్డ్ కామెడీతో ఎంటర్టైన్గా సాగుతుంది. రవితేజ వాయిస్ ఓవర్ సినిమాకు చాలా ప్లస్ అయింది. అలాగే యోగిబాబు కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. హీరో క్యారెక్టర్, వాయిస్ ఓవర్.. కొన్ని చోట్ల మర్యాద రామన్న సినిమాను గుర్తు చేస్తుంది. అలాగే హీరో భయస్తుడు అని చెప్పించడానికి వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సినిమా ప్రారంభంలోనే హీరో క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో చూపించాడు. హీరోకి అజ్ఞాత గొంతు వినిపించేంత వరకు కథంతా సోసోగా సాగుతుంది. ఆ తర్వాత సినిమా మొత్తం కామెడీ ట్రాక్ ఎక్కుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తికరంగా ఉంటుంది. అయితే సెకండాఫ్ మాత్రం కథ సాగదీతగా అనిపిస్తుంది. హీరో విలన్ దగ్గరకి వెళ్లి లొంగిపోయిన తర్వాత వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అలాగే హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా అంతగా ఆకట్టుకోలేవు. సినిమా నిడివి కూడా ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తుంది. సింపుల్‌గా చెప్పాల్సిన విషయాలను కూడా డీటైల్డ్‌గా చూపించి నిడివి పెంచేశారు. అలాగే నాసిరకంగా కట్టించిన బిల్డింగుల కారణంగా ప్రజలు పడే ఇబ్బందులను కూడా బలంగా చూపించలేకపోయారు. వాటిని మరింత ఎమోషనల్‌గా తీర్చిదిద్దింటే బాగుండేది. ఫస్టాఫ్ మాదిరే సెకండాఫ్ కామెడీ కూడా వర్కౌట్ అయితే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఈ మహావీరుడు కాస్త నవ్విస్తాడు. ఎవరెలా చేశారంటే.. మధ్యతరగతి కుటుంబానికి చెందిన సత్య పాత్రలో శివకార్తికేయన్ ఒదిగిపోయాడు. ఇలాంటి పాత్రలు చేయడం అతనికి కొత్తేమి కాదు. భయస్తుడిగా ఆయన చేసే కామెడీ నవ్వులు పూయిస్తుంది. జర్నలిస్ట్ చంద్రగా అదితి శంకర్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. ఈ చిత్రంలో ఆమె నిడివి చాలా తక్కువనే చెప్పాలి. భవన కార్మికుడిగా యోగిబాబు చేసే కామెడీ సినిమాకు చాలా ప్లస్ అయింది. మంత్రిగా మిస్కిన్ , అతని సహాయకుడిగా సునీల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. భరత్ శంకర్ సంగీతం జస్ట్ ఓకే. పాటలకు తెలుగు ప్రేక్షకులను నచ్చవు. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ పనితీరు బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. -
శివ కార్తికేయన్ ‘మహావీరుడు’మూవీ స్టిల్స్
-
హీరోయిన్గా డైరెక్టర్ కూతురు.. మరీ ఇంత చీప్ రెమ్యునరేషనా?
అందం, తెలివి, చలాకీతనం ఉన్న నటి అదితిశంకర్. ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు, విద్యావంతురాలు, గాయని అన్నవి అదనపు అర్హతలు..ఈమె వైద్య వృతి చదివి నటిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. విరుమాన్ చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసి తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రథమ చిత్రంతో పాస్ అయిన అదితిశంకర్ ఇప్పుడు ద్వితీయ విజ్ఞాన్ని అధికమించడానికి సిద్ధమయ్యారు. (ఇది చదవండి: ఆయన వల్లే కొత్త ప్రపంచాన్ని చూస్తున్నా.. కంటతడి పెట్టుకున్న హీరోయిన్) తాజాగా నటుడు శివకార్తికేయన్‌కు జంటగా నటించిన మావీరన్ చిత్రం రేపు తెరపైకి రానుంది. మండేలా చిత్రం ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శాంతి పిక్చర్స్ పతాకంపై అరుణ్ నిర్మించారు. ఇందులో నటి అదితి శంకర్ పాత్రికేయరాలిగా చురుకైన పాత్రలో నటించినట్లు ఇటీవల ఓ భేటీలో దర్శకుడు తెలిపారు. కాగా నటి అదితి శంకర్ గురించి మీడియాలో ఒక విషయం వైరల్ అవుతోంది. అదేమిటంటే ఈమెకు తన తండ్రి శంకర్ సిఫార్సుతోనే అవకాశాలు వస్తున్నాయని.. దీనిపై స్పందించిన అదితి శంకర్ ఆ ప్రచారంలో నిజం లేదన్నారు. ఇంత వరకూ నాన్న ద్వారా ఒక్క చిత్రం కూడా రాలేదని చెప్పారు. అదితి చేయగలదని భావించి కథలతో దర్శక నిర్మాతలు వస్తున్నారనీ.. తాను మొదట కథ విన్న తరువాత నాన్నకు చెబుతానన్నారు. ఆయన అనుమతితోనే ఆ చిత్రంలో నటించే విషయం గురించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. (ఇది చదవండి: క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న రష్మిక.. ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్!) తనకు నాన్న సపోర్టు ఉంటుందని పేర్కొన్నారు. మీ నాన్న పెద్ద దర్శకుడు ఆయన దర్శకత్వంలో నటిస్తారా? అన్న ప్రశ్నకు అలాంటి ఆశ తనకూ ఉందని చెప్పారు. దర్శకత్వం వహించే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు లేదని స్పష్టం చేశారు. అయితే మ్యూజిక్ ఆల్బం చేయాలన్న ఆలోచన ఉందని చెప్పారు. కాగా ఈ బ్యూటీ తదుపరి విష్ణువర్థన్ దర్శకత్వంలో నటించనున్నట్లు చెప్పారు. అయితే ఆమె చిత్రానికి తీసుకుంటున్న పారితోషికం ఎంతో తెలుసా? కేవలం రూ. 25 లక్షలు మాత్రమేనట. దీనిపై కొందరు ఆమేకేంటి తండ్రి కోట్లు సంపాదిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
'మహావీరుడు'ని తెలుగువారు ఇష్టపడతారు: అడివి శేష్
'మహావీరుడు’ సినిమా ట్రైలర్, విజువల్స్ గొప్పగా ఉన్నాయి. ఈ మూవీలో గ్రేట్ వైబ్ కనిపిస్తోంది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నారు. శివ కార్తికేయన్ హీరోగా ‘మండేలా’ ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మహావీరన్’. అదితీ శంకర్ హీరోయిన్. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ సినిమాని ఏషియన్ సినిమాస్ ఈ నెల 14న తెలుగులో విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరో అడివి శేష్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అడివి శేష్ మాట్లాడుతూ–'నా గురువు శేఖర్ కమ్ముల ముందు మాట్లాడటం గౌరవంగా ఉంది. శివ కార్తికేయన్‌తో పని చేయాలని ఉంది' అన్నారు. 'రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్’ సినిమాల్లా ‘మహావీరుడు’ ని తెలుగువారు ఇష్టపడతారు' అన్నారు శివ కార్తికేయన్. ‘‘మహావీరుడు’ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు మడోన్ అశ్విన్. ‘‘మా అమ్మగారి పేరుతో ఈ సంస్థ మొదలుపెట్టి, శివ కార్తికేయన్‌తో తొలి మూవీ చేయడం హ్యాపీ’’ అన్నారు అరుణ్ విశ్వ. -
డైరెక్టర్ శంకర్ కూతురు గురించి ఈ విషయాలు తెలుసా?
ప్రముఖ డైరెక్టర్ శంకర్ వారసురాలు ఆదితి శంకర్. ఆమెకు ఒక అక్క ఐశ్వర్య శంకర్, ఒక తమ్ముడు అర్జిత్ శంకర్ ఉన్నారు. ఈమె శ్రీరామచంద్ర యూనివర్సిటీలో వైద్య విద్య చదివింది. కానీ రాణిస్తోంది మాత్రం సినీ రంగం. మధ్యలో సంగీతంలో కూడా శిక్షణ తీసుకున్నారు. ఈమెలోని గాయని చలాకీ తనానికే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: ఆ యాడ్ చేస్తే.. రూ. కోట్లలో ఇస్తామన్నారు: స్మృతి ఇరానీ) నటనపై ఆసక్తితో హీరోయిన్గా మారి తొలి చిత్రం కోలీవుడ్‌లో విరుమాన్లో గ్రామీణ యువతిగా జీవించారు. ఆ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తాజాగా వస్తున్న చిత్రం మావీరన్. ఇందులో పాత్రికేయురాలిగా నటించారు. శివకార్తికేయన్ కథానాయకుడు. జాతీయ ఉత్తమ అవార్డు దర్శకుడు అశ్విన్ మడోనా దర్శకుడు. చిత్రం ఈ నెల 14వ తేదీన తెరపైకి రానుంది. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్ కే' టీషర్ట్ కావాలంటే ఉచితంగా ఇలా బుక్ చేసుకోండి) ఇది 'మహావీరుడు' పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. అలా రెండవ చిత్రంతోనే ఆదితి శంకర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. కాగా ఈ బ్యూటీ జులై 6వ తేదీన తన 26వ పుట్టినరోజును ప్రత్యేకంగా జరుపుకున్నారు. ఆ ఫొటోలను తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందులో ఇది తనకు ప్రత్యేక పుట్టిన రోజు అని పేర్కొన్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా మావీరన్ చిత్రంలో ఆదితి శంకర్ పాడిన బంగారుపేటలోనా... అనే పాట నెట్టింట్లో ట్రెండింగ్‌గా మారింది. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
శివ కార్తికేయన్ 'మహావీరుడు' ట్రైలర్ విడుదల
రెమో, డాక్టర్, డాన్ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయిన శివ కార్తికేయన్ కథానాయకుడిగా... మడోనా అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మావీరన్'. తెలుగులో 'మహావీరుడు'గా రానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ ఇందులో హీరోయిన్. అరుణ్ విశ్వ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా బ్యాక్ గ్రౌండ్ వర్క్ చివరి దశకు చేరుకుందని దర్శకుడు మడోనా అశ్విన్ తెలిపారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను వారు విడుదల చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జులై 14న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీని తీసుకొస్తోంది. యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. శివ కార్తికేయన్, అదితి మధ్య కెమిస్ట్రీ అందరినీ మెప్పిస్తుందని మేకర్స్ తెలిపారు. కొద్దిరోజుల క్రితమే బంగారు పేటలోన... అంటూ సాగే ఓ పాటను విడుదల చేశారు. భరత్ శంకర్‌తో కలిసి అదితి శంకర్ ఆలపించిన ఈ పాటను సంగీత దర్శకులు రెహమాన్ రచించడం విశేషం. ఈ పాట విడుదలైన రోజు నుంచి మంచి క్రేజ్ తెచ్చుకుంది. -
ఛాన్స్ అడిగి మరీ సినిమాలో పాట పాడిన హీరోయిన్
ప్రతిభ ఉంటే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా అవకాశాలు వాటంతటవే వస్తాయి. ఇక్కడ రెండవ స్ట్రాటజీ ఉపయోగించింది హీరోయిన్ అదితి శంకర్. ఈమె స్టార్ దర్శకుడు శంకర్ వారసురాలు అన్న విషయం తెలిసిందే కదా! వైద్య విద్యను చదివి, చిత్ర రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఇప్పటికే విరుమాన్ సినిమాతో కథానాయకిగా పరిచయమై సక్సెస్ కూడా అందుకుంది. అంతేకాకుండా ఆ చిత్రంలో ఒక పాట కూడా పాడి తనలో మంచి గాయని ఉన్నారని నిరూపించుకుంది. విశేషం ఏమిటంటే ఈమె పాడిన ఆ పాటను ముందు వేరే గాయనితో పాడించారు. అది దర్శక, నిర్మాతలకు సంతృప్తి కలిగించకపోవడంతో మళ్లీ ఆదితిశంకర్తో పాడించారు. అలా అది ఓకే అయింది. కాగా ప్రస్తుతం ఆదితిశంకర్ శివకార్తికేయన్‌కు జంటగా మావీరన్ చిత్రంలో నటిస్తోంది. అశ్విన్ మడోనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇందులోనూ ఆదితిశంకర్ ఒక పాట పాడడం విశేషం. శివకార్తికేయన్‌తో కలిసి పాడిన 'వణ్ణార్ పైట్టెయిల్..' అనే పల్లవితో సాగే ఈ పాటను బుధవారం విడుదల చేయగా సంగీత ప్రియుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. దీని గురించి ఆదితిశంకర్ మాట్లాడుతూ.. ఇది తాను పాడిన రెండవ పాట అని పేర్కొంది. ఇంతకుముందు విరుమాన్ చిత్రంలో మదురై వీరన్ అనే పల్లవితో సాగే గ్రామీణ టచ్ వున్న పాటను పాడానని, అందులో తన గొంతు డిఫరెంట్‌గా ఉంటుందని తెలిపింది. తాజాగా మావీరన్ చిత్రంలో చక్కని రొమాంటిక్ పాటను పాడినట్లు చెప్పారు. ఈ పాటను శివకార్తికేయన్‌తో కలిసి పాడడం మంచి అనుభవం అని చెప్పుకొచ్చింది. ఈ పాట పాడే అవకాశాన్ని తానే కోరానని చెప్పింది. తాను చిన్న వయసు నుంచే సంగీతాన్ని నేర్చుకుంటున్నానని, పాడడంపై ఆసక్తి ఉండడంతో తాను నటించే చిత్రాల్లో ఒక్క పాటైనా పాడే అవకాశం కలిగించాలని అడుగుతానని తెలిపింది. అందులో భాగంగానే ఈ చిత్రంలో పాట పాడానంది. అయితే ఇకపై నటించే చిత్రాలలో కంటిన్యూగా పాడతానా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేనంది ఆదితిశంకర్. చదవండి: సినిమా బాలేదన్నందుకు చితక్కొట్టిన ఫ్యాన్స్ -
ప్రమోషన్స్‌కు సిద్ధమైన మహా వీరుడు, అప్పుడే ఆడియో లాంచ్
శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మావీరన్. దర్శకుడు శంకర్ వారసురాలు ఆదితిశంకర్ హీరోయిన్గా నటిస్తున్న ఇందులో యోగిబాబు, దర్శకుడు మిష్కిన్, సరిత ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత, మండేలా చిత్రం ఫేమ్ మడోనా అశ్విన్ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తిస్తుండగా శాంతి టాకీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో జూలై 14న విడుదల చేయనున్నట్లు నిర్మాత అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగులో మహావీరుడు పేరుతో విడుదల కానుంది. ఈ చిత్రానికి డబ్బింగ్‌ను శివకార్తికేయన్ ఇటీవలే పూర్తి చేశారు. కాగా చిత్ర విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందడం విశేషం. భరత్ శంకర్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని జూలై 2న భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు సమాచారం. చైన్నెలోని సాయిరాం కాలేజీలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నటుడు శివకార్తికేయన్ ఇంతకుముందు నటించిన రెండు చిత్రాల ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇదే కాలేజీలో నిర్వహించారన్నది గమనార్హం. చదవండి: సీఎం జగన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు: పంచ్ ప్రసాద్ -
గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటున్న అదితి శంకర్
ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్. వైద్య వృత్తి చేపట్టాల్సిన ఈమె.. నటిగా రంగప్రవేశం చేయడానికి సిద్ధమయ్యారు. ఆమె ఇష్టానికి తండ్రి దర్శకుడు శంకర్ కూడా ఓటేశారు. ఇంకేముంది వెంటనే అదితి శంకర్ కార్తీకి జంటగా విరుమాన్ చిత్రంతో కథానాయకిగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం మంచి సక్సెస్ ఇవ్వడంతో పాటు, ప్రశంసలను అందించింది. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా మా వీరన్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ పరిచయం కాబోతోంది. మావీరన్ చిత్రం తెలుగులోనూ మహావీరుడు పేరుతో విడుదల కానుంది. ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం జులై 24న తెరపైకి రానుంది. కాగా నటి ఆదితి శంకర్ మరో రెండు తమిళ చిత్రాలలో కమిట్ అయ్యింది. అందులో ఒకటి నటుడు విష్ణువిశాల్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం. మరొకటి నటుడు అధర్వ సోదరుడు ఆకాశ్ మురళి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం. ఈ రెండు త్వరలో సెట్‌పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాయి. ఇకపోతే నటి ఆదితి శంకర్ తరచూ సామాజిక మాధ్యమాల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. తద్వారా సినీ దర్శక నిర్మాతలను ఆకర్షించడంతో పాటు అభిమానులను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక గ్లామర్ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. ప్రత్యేకంగా ఫొటో షూట్ నిర్వహించుకుని మరి ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తోంది. అలా తాజాగా యాష్ కలర్ లెహంగా ధరించి అందాలను మెరుగుపరచుకుని తీయించుకున్న ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: ఆర్య సినిమా చేయనన్న శివబాలాజీ, ఎందుకో తెలుసా? -
ఇలియానా పాటకు అదిరిపోయిన స్టెప్పులేసిన అదితి శంకర్
ఇతర రంగాల కంటే సినీ రంగంలో వారసత్వం అనేది కాస్త ఎక్కువే అని చెప్పక తప్పదు. ఇక్కడ నటీనటుల వారసులే కాకుండా దర్శకుడు, నిర్మాతల వారసులు కూడా రంగ ప్రవేశం చేస్తున్నారు. అలా ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలిగా ఆయన కూతురు అదితి శంకర్ కథానాయకిగా విరుమాన్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. తొలి చిత్రంతోనే ఈ హైటెక్ సిటీ బ్యూటీ పక్కా గ్రామీణ యువతి పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. అలా చిత్ర పరిశ్రమ దృష్టిని తన వైపుమల్లేల చేసుకుంది. ప్రస్తుతం శివకార్తికేయన్‌కు జంటగా మా వీరన్ చిత్రంలో నటిస్తోంది. (చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్) విశేషం ఏంటంటే ఈ చిత్రం తెలుగులోనూ మహావీరుడు పేరుతో విడుదల కానుంది. అలా నటి ఆదితి శంకర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది. తాజాగా మరికొన్ని కొత్త చిత్రాలను కమిట్ అయిన ఈమె తరచూ సోషల్ మీడియాలో కనిపించే ప్రయత్నం చేస్తోంది. అలా తాజాగా ఆమె తన తండ్రి దర్శకత్వం వహించిన చిత్రంలోని ఓ పాటకు డాన్స్ చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. దర్శకుడు శంకర్ ఇంతకుముందు విజయ్, శ్రీకాంత్, జీవ హీరోలుగా నన్భన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అందులో నటి ఇలియానా కథానాయకి. కాగా ఆ చిత్రంలో విజయ్ ఇలియానాలపై చిత్రీకరించిన చిల్లీ టెల్లీ అనే పాట మంచి హిట్ అయ్యింది. కాగా ఆ పాటకు నటి అదితి శంకర్ చాలా ఫాస్ట్‌గా డాన్స్ చేసింది. దాన్ని వీడియోగా చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసింది. అది ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
జర్నలిస్ట్‌గా అలరించబోతున్న అదితి శంకర్
ఇటీవల ఎక్కువగా వార్తల్లో ఉన్న నటి ఆదితి శంకర్. ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు. ఎప్పుడైతే గట్టిగా సినీ రంగ ప్రవేశం చేసిందో అప్పటి నుంచి ఈమె గురించి తెగ వార్తలు ప్రచారం అయ్యాయి. ఈమె తొలిసారిగా కార్తీతో విరువన్ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అందులో గ్రామీణ యువతిగా దుమ్మురేపిన ఆదితి శంకర్ నటనకు ప్రశంసల వర్షం కురిసింది. అంతేకాకుండా ఆ చిత్ర విడుదలకు ముందే మరో చిత్రం ఈ బ్యటీని వరించింది. శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న ‘మా వీరన్’ చిత్రం. డాక్టర్, డాన్ చిత్రాల తరువాత శివకార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం ఇది. చదవండి: ఉత్కంఠభరితంగా ‘పొన్నియన్ సెల్వన్’ ట్రైలర్ మండేలా చిత్రం ఫేమ్ మండేన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో దర్శకుడు మిష్కిన్, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే తొలి షెడ్యల్ పూర్తి చేసుకుంది. తాజాగా చెన్నై పరిసర ప్రాంతాలలో షెడ్యూల్ జరుపుకుంటోంది. కారణం ఈయన తొలి చిత్రం మండేలా పలు అవార్డులను గెలుచుకోవడమే. కాగా ఈ చిత్రంలో నటి ఆదితి శంకర్ ఒక పత్రిక కార్యాలయంలో పని చేసే పాత్రికేయురాలి పాత్రలో నటిస్తున్నట్లు తాజా సమాచారం. తొలి చిత్రంలో గ్రామీణ యువతిగా నటింన తాను రెండవ చిత్రంలోనే దానికి పూర్తి కాంట్రాస్ట్ పాత్రలో నటించడం సంతోషంగా ఉందని ఆదితి శంకర్ పేర్కొన్నారు. గ్లామరస్ పాత్రలో నటించడానికి వెనుకాడనని ముందే స్పష్టం చేసింది ఈ అమ్మడు. చదవండి: పుష్ప 2పై అప్డేట్ ఇచ్చిన రష్మిక, ‘అప్పుడే సెట్లో అడుగుపెడతా’ -
కుటుంబంలో సర్దుబాటుతనం చాలా ముఖ్యం: హీరో సూర్య
ప్రతి పురుషుడి విజయం వెనుక కుటుంబంలోని మహిళల త్యాగం ఉంటుందని నటుడు సూర్య పేర్కొన్నారు. ఈయన నిర్మాతగా 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై కార్తీ నటించిన చిత్రం విరుమాన్. దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ కథానాయికగా పరిచయమైన ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకత్వం వహించారు. గత 12వ తేదీ విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా నడుస్తోంది. దీంతో చిత్ర యూనిట్ మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆటపాటలతో సరదాగా గడిపారు. చెన్నై శివారు ప్రాంతంలోని వీజీపీ గార్డెన్ రిసార్ట్‌లో జరిగిన ఈ వేడుకలో విరుమాన్ చిత్రానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. కామెడీ నటుడు జగన్ అందరితో ఆటపాటలు, వివిధ పోటీలు నిర్వహించి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు కార్తీ మాట్లాడుతూ కుటుంబంలో సర్దుబాటుతనం చాలా ముఖ్యమన్నారు. అందుకు చాలా సహనం కావాలని, మనకంటే మనవాళ్లు ముఖ్యమని భావించాలన్నారు. ఈ విషయాన్ని విరుమాన్ చిత్రంలో చెప్పామన్నారు. నటుడు సూర్య మాట్లాడుతూ తమ వెనుక మహిళా శక్తి ఉందన్నారు. తాము పైకి ఎదగడానికి తమ కుటుంబ మహిళల శ్రమ ఎంతో ఉందన్నారు. తన తల్లి, భార్య, కూతురు ఇలా మహిళలు ఎంతో త్యాగం చేస్తున్నారన్నారు. మగవాళ్లు జయించడం సులభం అని, అదే ఆడవాళ్లు జయించాలంటే పది రెట్లు శ్రమించాలని సూర్య అన్నారు. మహిళలు ఎన్నో త్యాగాలు చేస్తుంటారని తమ పిల్లలను ముందు నెలబెట్టి వారు వెనుక ఉంటారని.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నారు. -
సినిమాకు మిశ్రమ స్పందన.. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్
Karthi Viruman Movie Unit Celebrates Success: కోలీవుడ్ హీరో కార్తీ కథానాయకుడిగా 2డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించిన చిత్రం 'విరుమాన్'. 'కొంబన్' చిత్రం తరువాత ముత్తయ్య దర్శకత్వంలో కార్తీ నటించిన చిత్రం ఇది. దర్శకుడు శంకర్ వారసురాలు అదితి శంకర్ కథానాయికగా పరిచయం అయిన ఈ చిత్రంలో రాజ్‌కిరణ్ , ప్రకాష్‌రాజ్, సూరి, కరుణాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రాన్ని తమిళనాడులో శక్తి ఫిలింస్ సంస్థ విడుదల చేసింది. గత శుక్రవారం (ఆగస్టు 12) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ అనుబంధాల నేపథ్యంలో ముఖ్యంగా రాగద్వేషాల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం మిశ్రమ స్పందనతో ప్రదర్శింపబడుతోంది. అయితే టాక్‌కు అతీతంగా ఈ చిత్రం తొలిరోజే రూ. 7 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో 'విరుమాన్' చిత్ర యూనిట్ శనివారం (ఆగస్టు 13) చిత్ర కార్యాలయంలో సక్సెస్ పార్టీని జరుపుకుంది. చిత్ర కథానాయకుడు కార్తీ, దర్శకుడు ముత్తయ్య, శక్తి ఫిలింస్ శక్తివేల్, చిత్ర సహ నిర్మాత రాజశేఖర్, కర్పూర సుందర పాండియన్ తదితరులు కేక్ కట్ చేసి సంతోషం పంచుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ విజయానందంలో మునిగి తేలుతోంది. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీకి లైంగిక వేధింపులు.. ఆవేదనతో పోస్ట్ 1947లో పుట్టుక.. స్వాతంత్య్ర దినోత్సవం రోజునే మరణించిన నటి థియేటర్లలో 4 చిత్రాలు, ఓటీటీలో ఎన్నో.. -
'ఆ హీరోతో నటించొద్దు'.. కూతురికి డైరెక్టర్ శంకర్ వార్నింగ్
పెళ్లై అత్తవారింటికి వెళ్లే వరకు కూతుళ్లకు తమ రక్షణ అవసరమని తల్లిదండ్రులు భావిస్తుంటారు. ఎవరు అవునన్నా, కాదన్నా ఇది నిజం. స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా ఇలానే భావించారన్న విషయం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. ఈయనకు ఇద్దరు కూతుళ్లు, ఓ కొడుకు. ఇద్దరు కూతుళ్లు డాక్టర్ విద్యను అభ్యసించారు. అందులో పెద్ద కూతురు అదితి శంకర్. ఈమెకు సినిమా హీరోయిన్ కావాలన్నది చిరకాల వాంఛ. ఎంబీబీఎస్ పూర్తి చేసిన తరువాత తన కలను నెరవేర్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇది ఆమె తండ్రి దర్శకుడు శంకర్‌కు ఏమాత్రం ఇష్టం లేదు. ఈ విషయాన్ని అదితి శంకర్‌నే విరుమాన్ చిత్ర ఆడియో విడుదల వేదికపై స్వయంగా పేర్కొన్నారు. అయితే హీరోయిన్గా సక్సెస్ కాకపోతే మళ్లీ వైద్య వృత్తిని చేపడుతానని తండ్రికి నచ్చజెప్పి, ఒప్పించి నటిగా విరుమాన్ చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. ఈ చిత్రానికి ముత్తయ్య దర్శకుడు, హీరో కార్తీ కావడంతో అదితి అందులో నటించడానికి శంకర్ అంగీకరించాట. అయితే ఆయనకు అసలు టెన్షన్ ఆ తరువాతే మొదలైందట. తొలి చిత్రాన్ని పూర్తి చేసిన అదితి శంకర్ తర్వాత శింబు కథానాయకుడుగా నటించే కరోనా కుమార్ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందట. ఇది దర్శకుడు శంకర్‌కు ఏమాత్రం ఇష్టం లేకపోవడంతో ఆ చిత్రంలో నటించరాదని కూతురికి చెప్పినట్లు సమాచారం. అందుకు కారణం నటుడు శింబుపై ప్రేమ వివాదాలతో సంచలన నటుడిగా ముద్ర పడడమే అట. ఈ నేపథ్యంలో కరోనా కుమార్ చిత్రం అనేక సమస్యల కారణంగా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. దీంతో దర్శకుడు శంకర్ టెన్షన్ పోయిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. -
మళ్లీ గ్రామీణ కథ అనగానే.. భయపడ్డా: కార్తీ
నటుడు కార్తీ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం విరుమాన్. డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ కథానాయికగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ముత్తైయ్య దర్శకత్వంలో 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య-జ్యోతిక నిర్మించిన ఈ చిత్రానికి రాజశేఖర్ కర్పూర పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని, సెల్వం కుమార్ ఛాయాగ్రహణంను అందించిన ఈ త్రం ఆగస్ట్ 12వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది. చదవండి: తెరపై హీరో, తెర వెనక రియల్ హీరో.. గొప్ప మనసున్న ‘శ్రీమంతుడు’ ఈ సందర్భంగా సోమవారంలో చెన్నైలో మూవీ యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు ముత్తైయ్య మాట్లాడుతూ.. ఇది కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే కథా చిత్రమని తెలిపారు. రాబోయే కాలంలో కుటుంబంలో బాబాయిలు, పెదనాన్నలు ఉండరేమో అన్నారు. ఇప్పుడే కొడుకు, కూతురు చాలంటున్నారన్నారు. పెరుగుతున్న వ్యయం కారణంగా భవిష్యత్తులో అసలు పిల్లలే వద్దనుకుంటారమోనన్నారు. అందుకే తాను కుటుంబ అనుబంధాల నేపథ్యంలో చిత్రాలను తెరకెక్కిస్తున్నాని తెలిపారు. ఈ విరుమాన్ చిత్రం ఆ కోవలోకే వస్తుందని పేర్కొన్నారు. చదవండి: ఆ యువ నటి శంకర్ కూతురిని టార్గెట్ చేసిందా? ఆ ట్వీట్ అర్థమేంటి! కార్తీ మాట్లాడుతూ ఇంతకు ముందు పరుత్తివీరన్, కడైకుట్టి సింగం వంటి గ్రామీణ నేపథ్యంలో చిత్రాల్లో నటించడంతో ఈ విరుమాన్ చిత్రం అదే తరహాది కావడంతో మొదట భయపడ్డానన్నారు. అయితే చిత్ర ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూసి భయం పోయి సంతోషం కలిగిందన్నారు. దర్శకుడు ముత్తైయ్య అంత అద్భుతంగా కథను తయారు చేసే తెరకెక్కించారన్నారు. రాజ్ కిరణ్, ప్రకాష్ రాజ్, వడివుక్కరసి, శరణ్య పొన్ వన్నన్ తదితర పలువురు ప్రముఖలు నటించారనీ, ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందన్నారు. యువన్ శంకర్ రాజా చాలా మంచి సంగీతాన్ని అందించారన్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ రాజీ పడకుండా భారీగా ఖర్చు చేసి రూపొందించిన చిత్రం ఇదని చెప్పారు. -
ఆ యువ నటి శంకర్ కూతురిని టార్గెట్ చేసిందా? ఆ ట్వీట్ అర్థమేంటి!
నెపోటిజం(బంధుప్రీతి) ఈ పేరు వినగానే మొదట గుర్తోచ్చేది బాలీవుడ్. దివంగత నటుడు సుశాంత్ సింగ్ మరణానంతరం బాలీవుడ్లో నెపోటిజంపై ఎంతటి దూమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కువగా బాలీవుడ్లో వినిపించే ఈ పేరు ఇప్పుడు దక్షిణాదిలో సైతం వినిపిస్తోంది. తాజాగా యువ నటి చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. సౌత్‌లో సైతం నెపోటిజం ఎఫెక్ట్ ఉన్నా ఇప్పటివరకు దీనిపై మాట్లాడే సాహసం ఎవరు చేయలేదు. తాజాగా ఈ యంగ్ బ్యూటీ ధైర్యం చేసి ఈ అంశాన్ని లెవనెత్తినట్లు కనిపిస్తోంది. ‘సౌకర్యం ఉన్నవాళ్లు నిచ్చెన ఎక్కేసి సులువైన మార్గంలో పైకి వెళ్లడం చూస్తే చాలా బాగుంటుంది కదా. మరి మిగతావాళ్ల సంగతేంటి’ అంటూ ఆమె ట్వీట్ చేసింది. చదవండి: క్రేజీ ఆఫర్.. మహేశ్-త్రివిక్రమ్‌లో చిత్రంలో వేణు? ఆమె ట్వీట్ చూస్తుంటే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్‌ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. కోలీవుడ్ బంధుప్రీతిపై తొలిసారి నోరు విప్పిన ఈ బ్యూటీ పెద్ద స్టార్ ఏమీ కాదు. ఈమధ్యే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఓ యువ నటి. ఇప్పటి వరకు ఆమె చేసింది ఒకట్రెండు సినిమాలు మాత్రమే. ఇంతకి ఈ బ్యూటీ పేరు ఏంటంటే ఆత్మిక. ‘మిసాయి మురుకు’ అనే తమిళ చిత్రంతో ఆమె కోలీవుడ్‌లో హీరోయిన్గా పరిచయమైంది. ఈ మూవీ మంచి విజయం సాధించినప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఆత్మికకు ప్రస్తుతం ఆఫర్లు కరువయ్యాయి. దీంతో మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఆత్మిక తరచూ సోషల్ మీడియాలో తన హాట్ ఫొటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. చదవండి: లోకేశ్ కనకరాజు-విజయ్ చిత్రం, ‘విక్రమ్’ను మించిన స్క్రిప్ట్! అదిరిపోయిందిగా.. ఈ నేపథ్యంలో ఇటీవలే నటిగా తెరంగేట్రం చేసిన డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్‌కు పరోక్షంగా ఆమె చురకలు వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం అదితి.. స్టార్ హీరోల సరసన వరుస ఆఫర్లు అందుకుంటోంది. అంతేకాదు సింగర్‌గా కూడా రాణిస్తోంది. ఆమె నటించింది ఒకటే సినిమా అయిన ఆ వెంటనే పెద్దపెద్ద ఆఫర్లు రావడంతో ఆత్మికకు కన్ను కుట్టినట్లు ఉందని, అందుకే పరోక్షంగా ఆమెను టార్గెట్ చేసి ఈ ట్వీట్ చేసిందంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా ఆత్మిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం కోలీవుడ్‌లో పెద్ద చర్చకు దారితీసేలా కనిపిస్తోంది. కాగా అదితి ఇప్పటికే హీరో కార్తి సరసన హీరోయిన్గా చాన్స్ కొట్టేయగా.. తాజాగా ఆమె శివ కార్తికేయన్ సినిమాలో మరో క్రేజీ ఆఫర్ అందుకుంది. It’s good to see privileged getting easy way through the ladder while the rest 🥲 Paathukalam 🙌🏽 — Aathmika (@im_aathmika) August 4, 2022 -
ఆ హీరోతో జోడి కట్టనున్న డైరెక్టర్ శంకర్ కుమార్తె
Sivakarthikeyan Aditi Shankar Maaveeran Goes On Floors In Chennai: వరుసగా హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'మావీరన్'. తెలుగులో 'మహవీరుడు'గా రాబోతుంది. తమిళ చిత్రం 'మండేలా' చిత్రానికి దర్శకత్వం వహించిన మడోనా అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ మూవీలో ప్రముఖ డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. అదితి ఇదివరకే కార్తీ హీరోగా నటించిన 'విరుమన్' చిత్రంతో హీరోయిన్గా తెరంగేట్రం చేసింది. ఈ సినిమా ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ శుక్రవారం (ఆగస్టు 5) చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేడుకకు శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగిబాబు, సరిత, దర్శకుడు మిస్కిన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు భరత్ శంకర్ సంగీతం అందిస్తున్నారు. ఇక శివ కార్తికేయన్ నటిస్తున్న ద్విభాషా (తెలుగు, తమిళ్) చిత్రం ‘ప్రిన్స్’ ఈ ఏడాది దీపావళి సందర్భంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘జాతి రత్నాలు’ ఫేమ్ కేవీ అనుదీప్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.