పెళ్లికి రెడీ అయిన మరో హీరోయిన్‌! | Aditi Shankar Gets Ready For Marriage | Sakshi
Sakshi News home page

Aditi Shankar : పెళ్లికి రెడీ అయిన మరో హీరోయిన్‌!

Published Mon, May 13 2024 1:27 PM | Last Updated on Mon, May 13 2024 1:46 PM

Aditi Shankar Gets Ready For Marriage

తమిళ సినిమా: కోలీవుడ్‌లో లక్కీయస్ట్‌ కథానాయకి ఎవరంటే ప్రస్తుతం నటి అదితి శంకర్‌ పేరే వినిపిస్తోంది. స్టార్‌ దర్శకుడు శంకర్‌ వారసురాలైన ఈమె డాక్టర్‌ కాబోయి యాక్టర్‌ అయిన విషయం తెలిసిందే. ఆ విధంగా విరుమాన్‌ చిత్రంలో కార్తీకి జంటగా నటించి తొలి విజయాన్ని అందుకున్నారీమె. అదే చిత్రంలో పాట పాడి గాయనిగాను ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత శివ కార్తికేయన్‌ సరసన మావీరన్‌ చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూడా ఈమెకు సక్సెస్‌ అందించింది. 

అలా ఇప్పటికీ నటించింది రెండు చిత్రాలు అయినా పలు చిత్రాల్లో నటించిన ప్రచారాన్ని పొందారు. ప్రస్తుతం విష్ణువర్ధన్‌ దర్శకత్వంలో నవ నటుడు ఆకాష్‌ మురళికి జంటగా నటిస్తున్నారు. ఈయన దివంగత ప్రముఖ నటుడు మురళి రెండవ కొడుకు. కాగా నటి అదితి శంకర్‌ను త్వరలో నటుడు సూర్యతో జతకట్టే అవకాశం వరించబోతున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం.

 కాగా అదితి శంకర్‌ పెళ్లికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు చాలా కాలంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అయితే నటనను పెద్ద ఫ్యాషన్‌గా భావించే ఈమె అంత త్వరగా పెళ్లి పీటలు ఎక్కుతారని భావించలేం. కాగా సమీపకారంలో అదితి శంకర్‌ అక్క రెండవ వివాహం ఇటీవలే జరిగిన విషయం తెలిసింది. ఇకపోతే అదితి శంకర్‌ తరచూ ఫొటో సెషన్లను నిర్వహించుకొని ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటారు. అలా ఆమె పెళ్లి కూతురుగా తయారైన ఒక అందమైన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. దీంతో అక్క పెళ్లి అయ్యింది.. తర్వాత అదితి శంకర్‌ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారా? అనే కామెంట్స్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement