ఆదితిశంకర్‌కు అవకాశాలు వరుస కడుతున్నాయి. ప్రముఖ దర్శకుడు శంకర్ వారసురాలు అయిన ఈమె వైద్య విద్య చదివి సినిమాపై మక్కువతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. అలా కార్తీ సరసన దుర్మార్ చిత్రంలో కథానాయకిగా పరిచయమైన అదితి శంకర్ తొలి చిత్రంలోనే గాయనిగా కూడా తనను పరిచయం చేసుకున్నారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తరువాత శివకార్తికేయన్ సరసన నటించిన మావీరన్ చిత్రం కూడా సక్సెస్ అయ్యింది. దీంతో అదితి శంకర్ లక్కీ హీరోయిన్ అనే ముద్రను వేసుకున్నారు. ఎప్పుడు చలాకీగా ఉండే ఈమె తరచూ స్పెషల్‌గా తీయించుకున్న తన గ్లామరస్ ఫొటోలతో నెటిజన్లను అలరిస్తూ వుంటారు.
ప్రస్తుతం విష్ణువర్దన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో ఆకాష్ మురళీకి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. చిత్రం తరువాత చిత్రం చేసుకుంటూ సక్సెస్‌ఫుల్ బాటలో పయనిస్తున్న అదితిశంకర్ నటనకు స్వస్తి పలికి పెళ్లికి సిద్ధమవుతున్నట్లు ఆ మధ్య ప్రచారం జోరుగా సాగింది. అయితే ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని తెలుస్తోంది. త్వరలో సూర్య నటించనున్న నూతన చిత్రంలో ఆయనకు జంటగా అదితి శంకర్ నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
కాగా ఇప్పుడు ఈ బ్యూటీని మరో లక్కీచాన్స్ వరించింది అన్నది తాజా సమాచారం. చేసింది రెండు చిత్రాలు అయినా ఈమెకు హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. దీనిని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం కాబోతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment