![Ajith Kumar Vidaamuyarchi full movie In online after theatrical release](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/6/vida.jpg.webp?itok=nxUhD6Iq)
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ విదాముయార్చి అనే సరికొత్త యాక్షన్-థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. త్రిష హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అజిత్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. ఒక పక్కా అభిమానులు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటుంటే.. మరోపక్క పైరసీ కేటుగాళ్లు చిత్ర బృందానికి షాకిచ్చారు. విడుదలైన కొన్ని గంటల్లోనే నెట్టింట్లో అప్‌లోడ్ చేసేశారు. దీంతో నిర్మాతలతో పాటు అజిత్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది గంటల్లోనే నెట్టింట ప్రత్యక్షం..
అయితే ఈ సినిమాను కూడా పైరసీ భూతం వదల్లేదు. విదాముయార్చి థియేటర్లలో రిలీజైన కొన్ని గంటల్లోనే నెట్టింట దర్శనమిచ్చింది. కొన్ని పైరసీ వెబ్ సైట్స్‌లో ఈ సినిమా కనిపించింది. దాదాపు నాలుగైదు వెబ్‌సైట్స్‌లో విదాముయార్తి ఫుల్ మూవీని అప్‌లోడ్ చేశారు. దీంతో చిత్ర నిర్మాతలు అందోళన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి పైరసీని ప్రోత్సహించవద్దని.. టికెట్ కొని సినిమా చూడమని వేడుకుంటున్నారు. సినిమా రిలీజ్‌కు ముందే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విజ్ఞప్తి చేసినప్పటికీ పైరసీదారులు అస్సలు పట్టించుకోలేదు.
కలెక్షన్లపై తీవ్ర ప్రభావం..
విదాముయార్చి పైరసీ బారిన పడడంతో మూవీ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడనుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం కావడంతో నిర్మాతలు ఆందోళనకు గురవుతున్నారు. నిర్మాణ సంస్థ ముందే విజ్ఞప్తి చేసిన పైరసీకి గురి కావడంతో అజిత్ ఫ్యాన్స్ కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. భారీ అంచనాలతో రికార్డ్ వసూళ్లు సాధిస్తుందనుకున్న విదాముయార్చికి పైరసీ భూతం అడ్డంకిగా మారింది. కాగా.. ఈ చిత్రంలో అర్జున్ సర్జా, రెజీనా కాసాండ్రా కీలక పాత్రల్లో నటించారు. తెలుగులో ఈ మూవీని పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు.
Every effort counts! 💪 Say NO to piracy and watch VIDAAMUYARCHI only in theatres! 🤩
FEB 6th 🗓️ in Cinemas Worldwide 📽️✨#Vidaamuyarchi #Pattudala #EffortsNeverFail#AjithKumar #MagizhThirumeni @LycaProductions #Subaskaran @gkmtamilkumaran @trishtrashers @akarjunofficial… pic.twitter.com/WigarpFJ34— Lyca Productions (@LycaProductions) February 5, 2025
Comments
Please login to add a commentAdd a comment