
హీరో దళపతి విజయ్.. ముస్లింలని అవమానించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు తమిళనాడు సున్నత్ జమాత్.. చెన్నై పోలీసులకు కంప్లైంట్ చేశారని వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ ఇచ్చిన ఇఫ్తార్ విందు దీనికి కారణమని పేర్కొన్నారు.
తమిళంలో హీరోగా స్టార్ డమ్ ఉన్న విజయ్.. గతేడాది రాజకీయ అరంగ్రేటం చేశారు. తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా తన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్)
అలా గత శుక్రవారం రాయపేట వైఎంసీఏ గ్రౌండులో ముస్లింల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ ఉపవాస దీక్ష విరమించే ముందు ప్రార్థనల్లో పాల్గొన్న విజయ్.. హాజరైన వారితో కలిసి విందు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి.
అయితే విజయ్ పై తమిళనాడు సున్నత్ జమాత్ ఫిర్యాదు చేసింది. ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులతో సంబంధం లేని తాగుబోతులు, రౌడీలు పాల్గొనడం ముస్లింలను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏర్పాట్లు సక్రమంగా చేయలేదని, విజయ్ తెచ్చిన విదేశీ గార్డులు ప్రజలను అగౌరవపరిచారని తమిళనాడు సున్నత్ జమాత్ కోశాధికారి సయ్యద్ కౌస్ మీడియాతో చెప్పారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)
Comments
Please login to add a commentAdd a comment