Iftar dinner
-
వైట్ హౌస్‌లో ట్రంప్ ఇఫ్తార్ విందు
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంజాన్ సందర్బంగా గురువారం వైట్ హౌస్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం వర్గం నేతలు, దౌత్య సిబ్బంది, ప్రభుత్వాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ ముస్లిం సోదరులకు రంజాన్ ముబారక్ తెలిపారు. 2024 ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన లక్షలాది మంది అమెరికన్ ముస్లింలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. చారిత్రక అబ్రహాం ఒడంబడికల ప్రాతిపదికగా పశ్చిమాసియాలో శాశ్వత శాంతిని నెలకొల్పేందుకు అవిశ్రాంతంగా పనిచేస్తున్నామని చెప్పారు. గత బైడెన్ ప్రభుత్వం ఈ విషయంలో ఏమీ చేయలేకపోయిందని విమర్శించారు. ఇజ్రాయెల్, ఏడు అరబ్ దేశాల మధ్య సంబంధాలను సాధారణ స్థితికి తీసుకువచ్చే లక్ష్యంతో గతంలో ట్రంప్ ప్రభుత్వం హయాంలో కుదిరిన అబ్రహాం ఒప్పందాలను ఆయనీ సందర్భంగా గుర్తు చేశారు. కాగా, అమెరికా, ఖతార్, ఈజిప్టు మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రశ్నార్థకంగా మారడం, గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతున్న వేళ ట్రంప్ ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం గమనార్హం. -
ప్రభుత్వ ఇఫ్తార్‌ను బహిష్కరిస్తున్నాం
కృష్ణలంక (విజయవాడ తూర్పు): వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలన్నీ బహిష్కరిస్తున్నట్లు జమాతే ఇస్లామీ హింద్ (జేఐహెచ్) రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మద్ ప్రకటించారు. విజయవాడలోని జమాతే ఇస్లామీ హింద్ కార్యాలయంలో బుధవారం ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఫీక్ అహ్మద్ మాట్లాడుతూ, కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఇఫ్తార్‌లను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 27న ఇచ్చే ఇఫ్తార్‌ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ముస్లింలపై ప్రేమ చూపిస్తూ, మరోపక్క బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం నల్ల చట్టాలకు జైకొట్టడం సమర్థనీయం కాదన్నారు. సీఎం చంద్రబాబు వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం కాకుండా తిరస్కరించాలని, రాష్ట్ర శాసనసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ అంశంపై ఈ నెల 29న ధర్నా చౌక్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ ప్రకటించింది. బుధవారం గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ సమావేశం జరిగింది. వక్ఫ్ ప్రొటెక్షన్ జేఏసీ నేతలు అబ్దుల్ రహమాన్, సూఫీ ఇమ్మాన్, ఎంఏ చిష్టి మాట్లాడుతూ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన మతోన్మాద అజెండాను మరింత దూకుడుగా అమలు చేస్తోందని విమర్శించారు. -
ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విజయవాడ: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కల్యాణ మండపంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్లొన్నారు. ‘‘ఈద్ ముబారక్’’ అంటూ ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరి ప్రార్థనలు సఫలం కావాలని ఆకాంక్షించారు. అల్లా చల్లని ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకున్నారు. విజయవాడలో బుధవారం ఇఫ్తార్ విందులో పాల్గొన్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి టోపీ, కండువా ధరించి నమాజ్ ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన వైఎస్ జగన్ ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ , మాజీ మంత్రులు అంజాద్ బాషా, జోగి రమేష్, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలశిల రఘరాం, లేళ్ల అప్పిరెడ్డి, రుహూల్లా, డాక్టర్ మొండితోక అరుణ్‌కుమార్, కల్పలతారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు శైలజారెడ్డి, బెల్లం దుర్గా, మాజీ ఎంపీ నందిగం సురేష్, మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు, పార్టీ నేతలు పూనూరు గౌతంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.విజయవాడలోని ఎన్ఏసీ కల్యాణ మండపం వద్ద జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్ ఉప్పొంగిన అభిమానంవిజయవాడలో ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్‌కు ముస్లింలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. సాయంత్రం 5 గంటలకే ఎన్ఏసీ కళ్యాణ మండపం ఉండే గురునానక్ కాలనీ రోడ్డు, వీధులు అభిమానులతో కిక్కిరిశాయి. కళ్యాణ మండపం పూర్తిగా నిండిపోవడంతో గేట్లు మూసివేయాల్సి వచ్చింది. వైఎస్ జగన్ అభివాదం చేయగానే సీఎం, సీఎం నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. జై జగన్ అంటూ ప్రజలు కేరింతలు కొట్టారు. ఊహించనంతగా ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు కష్టంగా మారింది. -
ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ (ఫోటోలు)
-
ఇఫ్తార్ విందుకు హాజరైన వైఎస్ జగన్
సాక్షి, విజయవాడ: రంజాన్ సందర్భంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. విజయవాడ ఎన్ఏసీ కల్యాణ మండపంలో జరుగుతున్న ఇఫ్తార్ విందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు వైఎస్ జగన్ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. -
ఏపీ సర్కార్ ఇఫ్తార్ విందు మాకొద్దు!
సాక్షి, విజయవాడ: వక్ఫ్ సవరణ బిల్లును ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రేపు(గురువారం) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బహిష్కరించాలని చేయాలని నిర్ణయించింది. వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్‌ను బాయ్ కాట్ చేస్తున్నామని.. రాష్ట్రంలోని అన్ని ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్‌ను బాయ్ కాట్ చేయాలని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. ‘‘సనాతనధర్మం బోర్డులో ఇతర మతాలను కలపాలని చూస్తే మొదటగా పోరాడేది మేమే. ముస్లింల హక్కులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కోరుతున్నాం...వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యంగా భావిస్తున్నాం. రాజ్యాంగం కల్పించిన హక్కుల ఉల్లంఘన ఇది. మతపరమైన నిర్వహణ ఆయా మతాలే చూసుకుంటాయి. బిల్లులో పారదర్శకత లేదు. ముస్లింలపై జరుగుతున్న కుట్ర ఇది’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు పేర్కొంది.‘‘వక్ఫ్ సవరణ బిల్లు కుట్రపూరితంగా చేస్తున్నారు. ప్రతీ మతానికి వారికి సంబంధించిన భూములను రక్షించుకునేందుకు బోర్డులు ఉన్నాయి. ముస్లింలకు మాత్రమే బోర్డు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం సరికాదు. భవిష్యత్తులో అన్నిమతాలకు ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతాయి. ఈ నెల 29న విజయవాడ ధర్నాచౌక్‌లో భారీ నిరసన చేపడతాం’’ అని ఆల్ ఇండియా ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు సభ్యులు తెలిపారు. -
దళపతి విజయ్ పై పోలీసులకు ఫిర్యాదు
హీరో దళపతి విజయ్.. ముస్లింలని అవమానించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు తమిళనాడు సున్నత్ జమాత్.. చెన్నై పోలీసులకు కంప్లైంట్ చేశారని వార్తలొస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ ఇచ్చిన ఇఫ్తార్ విందు దీనికి కారణమని పేర్కొన్నారు.తమిళంలో హీరోగా స్టార్ డమ్ ఉన్న విజయ్.. గతేడాది రాజకీయ అరంగ్రేటం చేశారు. తమిళ వెట్రి కళగం (టీవీకే) పేరుతో పార్టీని స్థాపించారు. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయంగా తన ముద్ర వేసే ప్రయత్నాల్లో ఉన్నారు.(ఇదీ చదవండి: తమ్ముడి పెళ్లిలో సాయిపల్లవి డ్యాన్స్.. వీడియో వైరల్)అలా గత శుక్రవారం రాయపేట వైఎంసీఏ గ్రౌండులో ముస్లింల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ ఉపవాస దీక్ష విరమించే ముందు ప్రార్థనల్లో పాల్గొన్న విజయ్.. హాజరైన వారితో కలిసి విందు కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు కొన్ని వైరల్ అయ్యాయి.అయితే విజయ్ పై తమిళనాడు సున్నత్ జమాత్ ఫిర్యాదు చేసింది. ఉపవాస దీక్షలు, ఇఫ్తార్ విందులతో సంబంధం లేని తాగుబోతులు, రౌడీలు పాల్గొనడం ముస్లింలను అవమానించడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఏర్పాట్లు సక్రమంగా చేయలేదని, విజయ్ తెచ్చిన విదేశీ గార్డులు ప్రజలను అగౌరవపరిచారని తమిళనాడు సున్నత్ జమాత్ కోశాధికారి సయ్యద్ కౌస్ మీడియాతో చెప్పారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
బంజారాహిల్స్ : ముస్లింలకు ఘనంగా ఇఫ్తార్ విందు (ఫొటోలు)
-
ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
రాష్ట్రాభివృద్ధికి అందరూ ప్రార్థించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధి కోసం అందరూ ప్రార్థించాలని, దేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఆత్మీయత, స్నేహభావాలను పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చింది. విజయవాడ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేలాది మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఉర్దూలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ రంజాన్ మాసంలో మీరంతా సంతోషంగా ఉండాలి, మీ అందరి ప్రార్థనలు ఫలించాలి, మీకు అంతా శుభం కలగాలి’ అని సీఎం జగన్ ఆకాంక్షించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని మైనార్టీలకు సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎంతో మేలు జరిగిందన్నారు. ముస్లింల సంక్షేమం కోసం అత్యధిక నిధులిచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. ముస్లింలకు ఉపముఖ్యమంత్రి పదవి, శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్, ఎమ్మెల్సీలు ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని.. రాజకీయ, ఆర్థిక, సామాజికంగా ముస్లిం మైనార్టీలకు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వివరించారు. గత ప్రభుత్వం మైనార్టీలకు తీవ్ర ద్రోహం చేసిందని, ముస్లింలకు మంత్రి పదవి కూడా ఇవ్వని చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చి మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని అంజాద్ బాషా గుర్తుచేశారు. పలువురు ముస్లిం ప్రతినిధులు మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పాలన ముస్లింలకు స్వర్ణయుగమని, మరో మూడు పర్యాయాలు వైఎస్ జగన్ సీఎంగా ఉండేలా అల్లాను ప్రార్థించాలన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) టోపీ, కండువా ధరించి సీఎం నమాజ్ ఇక ముస్లిం సంప్రదాయం ప్రకారం టోపీ, పవిత్ర కండువా ధరించిన సీఎం వైఎస్ జగన్ ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ ఆచరించారు. అనంతరం వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు హాఫీజ్‌ఖాన్, ముస్తఫా, నవాజ్ బాషా, వెలంపల్లి శ్రీనివాస్, కె. రక్షణనిధి, ఎమ్మెల్సీలు రుహుల్లా, లేళ్ల అప్పిరెడ్డి, పోతుల సునీత, ప్రభుత్వ సలహాదారులు హబీబుల్లా, ఎస్ఎం జియాఉద్దీన్, అలీ, వైఎస్సార్సీపీ ముస్లిం మైనార్టీ విభాగం చైర్మన్ వి.ఖాదర్‌బాషా, ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కృష్ణాజిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికారాము తదితరులతో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. -
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యం లో నేడు విజయవాడలో ఇఫ్తార్ విందు
-
ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపు ముస్లింలకు ఇఫ్తార్ విందు
-
గంగాజమున సంస్కృతిని ఎవరూ మార్చలేరు
సాక్షి, హైదరాబాద్: ‘ఈ దేశం మనందరిది. ఇక్కడి గంగాజమున సంస్కృతిని, ఆచార, సంప్రదాయాలను ఎవరూ మార్చలేరు. అలా ప్రయత్నించిన వారు అంతమవుతారు. దేశం మాత్రం నిలిచే ఉంటుంది’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉద్ఘాటించారు. సమయం వచ్చి నప్పుడు దేశాన్ని రక్షించుకోవడానికి శక్తిని కాకుండా యుక్తిని ప్రయోగించాలని పిలుపునిచ్చారు. ప్రతియేడు తరహాలోనే రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున నగరంలోని ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఉర్దూలో మాట్లాడుతూ, తెలంగాణ కోసం పోరాడినట్లుగానే ఉజ్వల భారతం కోసం చివరి రక్తపు బొట్టువరకు పోరాడితే విజయం తథ్యమన్నారు. ‘అల్లా కే ఘర్ దేర్ హై, లేకిన్ అంధేర్ నహీ’(దేవుడి ఆశీస్సులు ఆలస్యం కావచ్చు.. అంధకారం ఉండదు) అని ముక్తాయించారు. గట్టి సంకల్పంతో కార్యాన్ని ప్రారంభిస్తే గమ్యం చేరుకోవడానికి కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యం అవ్వొచ్చుగానీ, గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. ‘దేశం అగమ్యగోచర స్థితిలో ఉన్నది. సరైన నాయకుని కోసం, పార్టీ కోసం వేచి చూస్తున్నది. దేశాన్ని రక్షించుకునేందుకు శాయశక్తులా కృషి చేద్దాం. మీ సహకారం ఉంటే చివరి వరకు పోరాడగలం. ఇది తాత్కాలిక దశ. తుదకు న్యాయమే గెలుస్తుంది. ప్రస్తుత దేశ రాజకీయాలను మార్చేందుకే నేను దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాను. బీఆర్ఎస్ పారీ్టకి మహారాష్ట్ర ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. నా అంచనాలకు మించి ప్రజాధారణ లభిస్తున్నది’అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అనాథ విద్యార్థులతో సీఎం ముచ్చట్లు ఇఫ్తార్ విందుకు ముందు సీఎం కేసీఆర్ అనాథ పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఇంగ్లిష్‌లో సంభాషిస్తున్న విద్యార్థులను ఆయన అభినందించారు. బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలని భుజం తట్టారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌అలీ, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, క్రీడాకారులు సానియా మీర్జా, నిఖత్ జరీన్ పాల్గొన్నారు రాష్ట్రం పురోగమనంలో.. దేశం తిరోగమనంలో.. ‘తొమ్మిది, పదేళ్ళ కింద మనల్ని వెనుకబడినవారిగా పరిగణించేవారు. కానీ నేడు అల్లా దయతో, మీ అందరి ప్రార్థనలతో మన రాష్ట్రానికి దేశంలోనే పోటీ లేదు. పార్ల మెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వమే ఈ విషయాన్ని వెల్లడించింది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 3,17,115కు, తలసరి విద్యుత్ వినియోగం 2,100 యూనిట్లకు పెరిగింది. పరిశ్రమలు, ఐటీ రంగంలో పురోగమిస్తున్న తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారు. అసదుద్దీన్ ఒవైసీ తదితరులు కోరిన మేరకు అనీస్ ఉల్ గుర్బా(అనాథశ్రమం) ను అత్యద్భుతంగా నిర్మించుకున్నాం. మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ పదేళ్లలో రూ.1,200 కోట్లను ఖర్చు చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.12,000 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు లేవు. వలస వెళ్లిన రైతులు ఊళ్లకు తిరిగొచ్చారు. రాష్ట్రంలో 94 లక్షల ఎకరాల్లో వరి పంటను పండించుకుంటున్నామని గర్వంగా చెప్తున్నా. మొత్తం దేశంలో వరి సాగు విస్తీర్ణం కంటే ఒక్కతెలంగాణ వరి సాగు విస్తీర్ణం చాలా ఎక్కువ. తాగునీరు, కరెంటు సమస్యలు నేడు లేవు. నిరుద్యోగ సమస్యను కూడా మెల్లమెల్లగా అధిగమిస్తున్నాం. రాష్ట్రం ముందుకు సాగుతోంది. దేశం వెనుకబడిపోతున్నది. తెలంగాణ ప్రభుత్వం తీరుగా కేంద్రం శ్రమిస్తే దేశ జీడీపీ కనీసం మరో 3 లక్షల నుంచి 4 లక్షలు పెరిగేది’అని సీఎం కేసీఆర్ అన్నారు. -
ఇఫ్తార్ విందులో పాల్గొన్న సీఎం కేసీఆర్.. ఏమన్నారంటే?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, సీఎం కేసీఆర్ ప్రసంగించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 9 ఏండ్ల కిందట తెలంగాణ అంటే వెనుకబడింది అనేవారు. ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. తెలంగాణతో దశ మారింది. తలసరి ఆదాయం పెరిగింది. పారిశ్రామిక రంగంలో అనూహ్య ప్రగతి సాధించాం. మంచినీళ్లు, కరెంట్ సమస్యలు తీరాయి. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు పదేండ్లలో కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ. 1200 కోట్లు మాత్రమే. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మైనార్టీల కోసం గత 9 ఏండ్లలో రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం అని తెలిపారు. ఈ దేశం మనందరిది.. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడాలి. ఆవేశంతో కాదు.. ఆలోచనతో ఈ దేశాన్ని కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు న్యాయమే గెలుస్తుంది. ఇక, ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు మహముద్ అలీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా మీర్జా, ముస్లిం మతపెద్దలతో పాటు 13 వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. -
కేంద్రానికి చికిత్స చేయాలి
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్రంలో గడబడ ఉంది. దానికేదో రోగం సోకింది. చికిత్స చేయాల్సి ఉంది. దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. దేశం నాశనం అవుతుంటే, కావాలని మరీ దేశంలో దుష్ట పరిస్థితులను సృష్టిస్తుంటే .. దేశవాసులుగా ఆపాల్సిన బాధ్యత మనపై ఉంది. దేశాన్ని కాపాడుకోవాలి. దేశ ప్రయోజనాల కోసం అందరూ నడుం బిగించాలి. ఏవిధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించామో, ప్రగతి బాట పట్టించామో..అదే తరహాలో దేశం కోసం మేము నడుం బిగిస్తాం. ఈ విషయంలో అనుమానాలకు తావు లేదు..’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దేశానికి ప్రయోజనం చేకూర్చేందుకు వీలుగా తమకు మంచి స్థానమే లభిస్తుంది అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో ముస్లింలకు సీఎం ఇఫ్తార్ విందు ఇచ్చి మాట్లాడారు. బుద్ధి జీవులు గళం విప్పుతారు.. ‘భూమిపై దుష్ట శక్తుల ఆటలు అన్ని రోజులూ సాగవు. నిర్మాణాత్మక పాత్ర పోషించే శక్తులే తుదకు విజయం సాధి స్తాయి. మానవత్వం ఎన్నటికీ అంతం కాదు. కొన్ని శక్తులు పని చెడగొట్టడానికి, అల్లర్లు చేయడానికి ప్రయత్ని స్తాయి. వాళ్లు ఎప్పుడూ విజయం సాధించలేరు. విరగ్గొట్టడం, పగలగొట్టడం చాలా సులువు. కానీ దేన్నైనా నిర్మించడం కష్టం. సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో విషాన్ని ఎలా వ్యాప్తి చేస్తున్నారో చూస్తున్నాం. దేశమం తటా ఇదే జరుగుతోంది. ఇది మంచిది కాదు. ప్రజలు అర్థం చేసుకో వాలని మేము కోరుతున్నాం. బుద్ధి జీవులు అర్థం చేసుకుం టున్నారు. మున్ముందు బయటకు వచ్చి బహిరంగంగా గళం విప్పుతారు..’ అని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్రంలో గడబిడుంటే రాష్ట్రంలో కూడా ఉంటుంది.. ‘కేంద్రం బలహీనంగా ఉంటే రాష్ట్రాలూ బలహీనం అవు తాయి. కేంద్రంలో గడబిడ ఉంటే రాష్ట్రాల్లో కూడా గడబిడ అవుతుంది. 2014లో రూ.1.24 లక్షలున్న రాష్ట్ర తలసరి ఆదాయం 2021లో రూ.2.78 లక్షలకు పెరిగింది. రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.5 లక్షల కోట్లు. రాష్ట్రంతో పోల్చితే కేంద్రం సగం కూడా సాధించలేక పోయింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంతో సమానంగా పనిచేసి ఉంటే మన జీఎస్డీపీ రూ.14.5 లక్షల కోట్లు ఉండేది. ఏడేళ్ల కిందట తెలంగాణలో తీవ్ర దుర్భర పరిస్థితులుండేవి. తాగేందుకు నీళ్లు, కరెంట్, రైతులకు సాగునీరు ఉండేది కాదు. భగవంతుడి దయ, ప్రజల సహకారంతో ఏడున్నరేళ్లలో ఈ సమస్యలను అధిగమించాం. రాష్ట్రం ఎన్నో రంగాల్లో నిర్మాణాత్మక కృషి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. విద్యుత్ సమస్యను అధిగమించి అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. నేడు యావత్ దేశం అంధకారంలో ఉంటే, తెలంగాణ రాష్ట్రం వెలిగిపోతోంది. తాగునీరు, సాగునీరు, పంటల దిగుబడి.. అన్ని రంగాల్లో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించింది..’ అని కేసీఆర్ తెలిపారు. ఇంకా చాలా చేయాల్సి ఉంది.. ‘ఇప్పుడే మైనారిటీ గురుకుల పాఠశాల విద్యార్థులను కలిసి వచ్చిన. తెలంగాణ రాష్ట్రం తరహాలో యావత్ దేశంలో మైనారిటీ గురుకుల విద్యా సంస్థలను నిర్వహిం చాలనే చర్చ జరుగుతోంది. ఇంతటితో సరిపెట్టుకోకుండా ఇంకా మేము చాలా చేయాల్సి ఉంది. రాష్ట్రంలో మంచి పరిస్థి తులున్నాయి..’ అని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ సహా దేశంలోని ముస్లింలకు హృదయపూర్వక రంజాన్ శుభా కాంక్షలు తెలిపారు. మెరిట్ ఆధారంగా ఎంపిక చేసిన మైనా రిటీ గురుకుల విద్యార్థులకు సీఎం రంజాన్ కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లా రెడ్డి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ సల హాదారులు ఏకే ఖాన్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్‌రెడ్డి, ఇరాన్, టర్కీల దౌత్య అధికారులు పాల్గొన్నారు. -
Hyderabad: ట్రాఫిక్ ఆంక్షలు... వాహనాలు మళ్లింపు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీ స్టేడియంలో శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. జమాతుల్ విదాగా పిలిచే రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో పాతబస్తీలోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో, నిర్ణీత సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధిస్తూ ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనచోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఇఫ్తార్ విందుకు ప్రముఖులు, ఆహూతులు భారీ సంఖ్యలో హాజరుకానున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి. ఆయా సమయాల్లో సాధారణ వాహనచోదకులను ఏఆర్ పెట్రోల్ పంప్–బీజేఆర్ విగ్రహం–బషీర్‌బాగ్ మార్గాల్లోకి అనుమతించరు. చాపెల్ రోడ్, నాంపల్లి వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి మళ్లిస్తారు. వీటిని కంట్రోల్ రూమ్ వైపు అనుమతించరు. గన్‌ఫౌండ్రీ ఎస్బీఐ నుంచి బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా, రవీంద్రభారతి, హిల్‌ఫోర్ట్ రోడ్ వైపు నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు వచ్చే వాహనాలను సుజాత హైస్కూల్ మీదుగా, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్ మీదుగా మళ్లిస్తారు. నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్‌బాగ్ వైపు వచ్చే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద, కింగ్ కోఠి, బొగ్గులకుంట వైపు నుంచి భారతీయ విద్యా భవన్స్ మీదుగా వచ్చే వాహనాలను కింగ్ కోఠి చౌరస్తా నుంచి తాజ్ మహల్ హోటల్ మీదుగా మళ్లిస్తారు. బషీర్‌బాగ్ నుంచి కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాటిని లిబర్టీ మీదుగా పంపిస్తారు. జమాతుల్ విదా ప్రార్థనల నేపథ్యంలో... శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చార్మినార్–మదీన, చార్మినార్–ముర్గీ చౌక్, రాజేష్ మెడికల్ హాల్–శాలిబండ మధ్య ఎలాంటి వాహనాలను అనుమతించరు. వీటిని మదీన జంక్షన్, హిమ్మత్‌పుర, చౌక్ మైదాన్ ఖాన్, మోతీగల్లీ, ఈదీ బజార్ చౌక్, షేర్ బాటిల్ కమాన్, ఓల్డ్ కమిషనర్ కార్యాలయం చౌరస్తాల నుంచి అవసరాన్ని బట్టి మళ్లిస్తారు. ప్రార్థనలకు హాజరయ్యే వారి కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్, ముఫీదుల్ అమాన్ గ్రౌండ్స్, చార్మినార్ బస్ టెర్మినల్, ఆయుర్వేదిక్ యునానీ హాస్పిటల్, ఖిల్వత్ గ్రౌండ్స్, చౌమొహల్లా ప్యాలెస్ ఎదురుగా ఉన్న ఓల్డ్ పెన్షన్ ఆఫీస్, సర్దార్ మహల్‌ల్లో (ఇక్కడ కేవలం విధుల్లో ఉన్న అధికారుల వాహనాలు) పార్కింగ్ సదుపాయం కల్పించారు. సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగే ప్రార్థనల నేపథ్యంలో మహంకాళి పోలీసుస్టేషన్ నుంచి రామ్‌గోపాల్ పేట్ రోడ్ జంక్షన్ మధ్య మార్గాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసేస్తారు. బాటా చౌరస్తా నుంచి సుభాష్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను లాలా టెంపుల్ మీదుగా పంపిస్తారు. ఈ మళ్లింపులు ఆర్టీసీ బస్సులకు సైతం వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. (చదవండి: ట్విట్టర్లో పెట్రో వార్ !) -
29న సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు
సాక్షి, హైదరాబాద్: రంజాన్ మాసం సందర్భంగా ఈ నెల 29న సాయంత్రం 6.10 గంటలకు ఎల్బీ స్టేడి యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఇఫ్తార్ విందును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుందని సీఎం తెలిపారు. ‘తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్‌కు వేదికగా నిలిచింది. సర్వ మతాల సంప్రదాయాలు.. ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తోంది. ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తోంది. లౌకికవాదాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది’ అని ఒక ప్రకటనలో తెలిపారు. -
విజయవాడలో ఇఫ్తార్ విందు.. హాజరుకానున్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ఈ నెల 26న ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టేడియాన్ని మంత్రి అంజాద్ బాషా, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అధికారులు పరిశీలించారు. చదవండి: ఏపీకి ఐఎండీ చల్లని కబురు.. -
ఇఫ్తార్ విందుకు హాజరైన సీఎం వైఎస్ జగన్
-
నాన్న గారి తరహాలోనే మీ అందరికి మేలు చేస్తాను
-
దేవుడు అద్భుతమైన ఫలితం ఇచ్చాడు : సీఎం
సాక్షి, గుంటూరు: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తారు విందు ఏర్పాటు చేసింది. సోమవారం సాయంత్రం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరైన తొలి అధికారిక కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో భారీగా ముస్లింలు పాల్గొన్నారు. అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘ఈ ఎన్నికల ద్వారా దేవుడు అద్భుతమైన ఫలితం ఇచ్చారు. గత ఐదేళ్లలో చంద్రబాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను అన్యాయంగా ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా స్పీకర్ దాటవేత ధోరణితో వ్యవహరించారు. 9 మంది వైఎస్సార్ సీపీ ఎంపీలు గెలిస్తే ముగ్గురుని ఇదే మాదిరిగా లాక్కున్నారు. మే 23న రంజాన్ మాసంలోనే ఫలితాలు వచ్చాయి. టీడీపీ గెలిచింది కూడా 23 స్థానాల్లో మాత్రమే. అలాగే టీడీపీకి ముగ్గురు ఎంపీలు మాత్రమే మిగిలారు. దేవుడు స్ర్కిప్ట్ రాస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఎన్నికల ఫలితాలకు మించిన ఊదాహరణ ఏముంటుంది?. నేను ఈ రంజాన్ మాసంలోనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాను. నాన్న గారి తరహాలోనే మీ అందరికి మేలు చేస్తాను. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నలుగురు ముస్లిం ఎమ్మెల్యేలున్నారు. ఈ ఎన్నికల్లో ఐదుగురికి టికెట్ ఇస్తే.. నలుగురు గెలుపొందారు. ఓడిపోయిన ఇక్బాల్‌ను కూడా త్వరలోనే ఎమ్మెల్సీగా చేస్తామ’ని తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : నాన్న గారి తరహాలోనే మీ అందరికి మేలు చేస్తాను -
ఇఫ్తార్ విందుకు సర్వం సిద్ధం
పట్నంబజారు(గుంటూరు): పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుంటూరు వేదికగా ముస్లింలకు సోమవారం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో ఆదివారం పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ఏర్పాట్లును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం కోసం దివంగత నేత రాజశేఖర్‌రెడ్డి ఎంతో కృషి చేశారని, ఆయన మాదిరిగానే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కూడా పాటుపడతారన్నారు. కార్యక్రమంలో మంగళగిరి, గుంటూరు తూర్పు, ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముస్తఫా, సుచరిత, రోశయ్య, వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి, సమన్వయకర్త మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, నగర అ«ధ్యక్షుడు రమేష్‌గాంధీ, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నంతో పాటు పార్టీ నేతలు ఏర్పాట్లును పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పటిష్ట బందోబస్తు.. గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సారి గుంటూరులో జరిగే ఈ కార్యక్రమంలో సోమవారం పాల్గొననున్నారు. ఇఫ్తార్ విందుకు వేదికైన పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌ను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. తొలుత బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా, శనివారం కురిసిన వర్ష కారణంగా వేదికను పోలీస్ పురేడ్ గ్రౌండ్స్‌కు మార్పు చేయాలని కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాలన్నీ దాదాపుగా అటువైపు ఉండటంతో పోలీసులు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేలా నిఘా వర్గాల సూచనలు, సలహాలతో కలెక్టర్ పర్యవేక్షణలో అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను చేయిస్తున్నారు. అధికారులతో సమావేశం.. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని కాన్ఫరెన్స్‌హాలులో బందోబస్తు విధులకు కేటాయించిన అధికారులతో ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు పాటించాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిఘా వర్గాల సూచనల అమలుపై సుదీర్ఘంగా చర్చజరిగింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు.. బందోబస్తు విధులకు మొత్తం 820 మంది అధికారులు, సిబ్బందిని కేటాయించారు. వారిని పర్యవేక్షించేందుకు ముగ్గురు ఏఎస్పీలను నియమించారు. ఆదివారం ఉదయం నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో బాంచ్ అండ్ డాగ్ స్క్వాడ్లు రంగంలోకి దిగాయి. అణువణువునా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఏరియా డామినేషన్ పార్టీలు, రూఫ్ టాప్ పార్టీలు, హైవే పెట్రోలింగ్, రోప్ పార్టీలను సిద్ధంగా ఉంచారు. నిరంతరం అధికారుల పర్యవేక్షణతో పాటుగా డ్రోన్ల ద్వారా కార్యక్రమం ముగిసే వరకూ ఆయా ప్రాంతాలను సునిశితంగా పరిశీలించేందుకు రెండు డ్రోన్ కెమేరాలను సిద్ధం చేశారు. ఇప్పటికే స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. కేటగిరీల వారీగా పాసులను కేటాయించారు. పాసులు ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతించనున్నారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి వచ్చి వెళ్లే మార్గాల్లోని ట్రాఫిక్‌ను దారిమళ్లించనున్నారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు: కలెక్టర్ గుంటూరు వెస్ట్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఇవ్వనున్న ఇఫ్తార్ విందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చెప్పారు. ఆదివారం రాత్రి కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో అధికారులు, వైఎస్సార్ సీపీ ముఖ్య నాయకులతో సమీక్ష నిర్వహించారు. సుమారు 5 వేల మంది ఈ విందులో పాల్గొంటున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ముస్లిం మత పెద్దల కోసం ప్రత్యేక ఆహ్వానాలను సిద్ధం చేశామన్నారు. సోమవారం రాత్రి జరగనున్న కార్యక్రమానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రాక సందర్భంగా ట్రాఫిక్, భద్రత, మంచినీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై ఆయా విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు ముస్తఫా, అర్బన్ ఎస్పీ విజయరావు, జాయింట్ కలెక్టర్ హిమాన్షు శుక్లా, జాయింట్ కలెక్టర్–2 సత్యనారాయణ, డీఆర్వో శ్రీలత, గుంటూరు ఆర్డీవో వి.వీరబ్రహ్మం పాల్గొన్నారు. నాలుగు వైద్య బృందాల ఏర్పాటు గుంటూరు మెడికల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం గుంటూరులో ఇఫ్తార్ విందులో పాల్గొంటున్న దృష్ట్యా నాలుగు ప్రత్యేక వైద్య బృందాలను జిల్లా వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. సూపర్‌స్పెషాలిటి వైద్యులతో కూడిన రెండు ప్రత్యేక వైద్య బృందాలు ముఖ్యమంత్రి కాన్వాయ్ వెంట ఉంటాయని, రెండు వైద్య బృందాలు పోలీస్ పరేడ్ గ్రౌండ్ వద్ద ఉంటాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్ తెలిపారు. -
మతసామరస్యంలో మన రాష్ట్రం ఆదర్శం
సాక్షి, హైదరాబాద్ :దేశంలోనే తెలంగాణ ‘గంగా, జమునా తెహజీబ్’ ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరాన్ని చూసి మతసామరస్యం గురించి నేర్చుకోవాలని మహాత్మాగాంధీ పేర్కొన్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రంజాన్ మాస పవిత్ర ఉపవాసాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఆదివారం సాయంత్రం ఇక్కడి ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌విందు ఇచ్చారు. ఈ కార్యక్రమం లో సీఎం పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో అన్ని మతాలు, కులాలు సమానమేనని, గత ఐదేళ్ల నుంచి మత సామరస్యం మరింత వెల్లివిరుస్తోందని అన్నారు. అన్ని వర్గాలను సమానంగా గౌరవిస్తూ వారి పండుగలను సైతం ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని వివరించారు. భవిష్యత్తులో సైతం గంగా జమునా తెహజీబ్ మరింత ఆదర్శంగా కొనసాగే విధంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని మైనార్టీల పిల్లలకు గురుకుల విద్యాలయాల (టెమ్రీస్) ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నామని, వారు అంతర్జాతీయస్థాయిలో పోటీపడటం సంతోషదాయకమన్నారు. మైనారిటీ గురుకులాలను మరింత అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ముస్లింలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని, వారి అభ్యున్నతికి మరిన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్ సమస్యను జయించాం... రాష్ట్రం ఏర్పడే నాటికి 2014లో విద్యుత్ కష్టాలు తీవ్రంగా ఉండేవని, ఈ ఐదేళ్లలో విద్యుత్ సమస్య లేకుండా విజయం సాధించగలిగామని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది ఉండకూడదనేది తమ ఉద్దేశమని, మిషన్ భగీరథ పథకం ద్వారా 23 వేల గ్రామాల్లో నల్లా ద్వారా తాగునీరు ఇవ్వబోతున్నామని కేసీఆర్ వెల్లడించారు. కేవలం రెండు, మూడు శాతం పనులు మాత్రమే పూర్తి కావల్సి ఉందని అన్నారు. మారుమూల గ్రామాల్లోని ప్రతి ఇంటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని చెప్పారు. కాళేశ్వరం ద్వారా సాగునీరు.. జూలైలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ తెలిపారు. రైతు కుటుంబాలన్నీ సుఖశాంతులతో ఉండాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను నివారించేందుకు సాగునీటి ప్రాజెక్టు పనులు అంకితభావంతో చేపట్టామని చెప్పారు. ఇఫ్తార్ విందులో మంత్రులు మహమూద్ అలీ, తల సాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, బీబీ పాటిల్, మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ సలీం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనారిటీ గురుకుల టెన్త్టాపర్కు, అనీసుల్ గుర్భా విద్యార్ధులకు సీఎం బహుమతులు అందజేశారు. -
ఇఫ్తార్ విందులో పాల్గొన్న హారీష్ రావు
-
3న గుంటూరుకు సీఎం రాక
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరులో ఈ నెల 3వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ఇఫ్తార్ విందులో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటారని కలెక్టర్ కోన శశిధర్ శుక్రవారం తెలిపారు. నగరంలో ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
ఇఫ్తార్ విందుతో గిన్నిస్ రికార్డు
దుబాయ్: ముస్లింల ప్రధాన పండుగల్లో రంజాన్ ఒకటి. ఈ మాసంలో ముస్లింలు ఆచరించే ఉపవాసం తర్వాత ఇచ్చే విందునే ఇఫ్తార్‌గా పిలుస్తారు. తాజాగా ఈ ఇఫ్తార్ విందుతో భారత్‌కు చెందిన ఓ సేవా సంస్థ గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించింది. అబుదాబిలోని దుబాయ్ పారిశ్రామిక పార్కులో భారతీయులు నడిపిస్తున్న పీసీటీ హ్యుమానిటీ చారిటీ సంస్థ ఏడు రకాల శాఖాహార వంటలతో కిలోమీటర్ పొడవున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ విందు గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించినట్లు ‘గల్ఫ్ న్యూస్’ తెలిపింది. ఈ సందర్భంగా చారిటీ వ్యవస్థాపకులు జోగిందర్ సింగ్ సలారియా మాట్లాడుతూ... ‘శాఖాహారం ఆరోగ్యానికి మంచిదే కాకుండా, దీన్ని తీసుకోవడం వల్ల జంతు వధను అరికట్టవచ్చు. ఈ రికార్డు సాధించడంలో సాయపడిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు’ తెలిపారు. -
ట్రంప్ ఇఫ్తార్ విందు
వాషింగ్టన్: ముస్లింలకు రంజాన్ మాసం చాలా ప్రత్యేకమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. వైట్‌హౌస్‌లో సోమవారం రాత్రి అధికారులకు, వివిధ దేశాల దౌత్యవేత్తలకు ఆయన ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా న్యూజిలాండ్, శ్రీలంక, కాలిఫోర్నియా, పిట్స్‌బర్గ్‌లో జరిగిన ఉగ్రవాద దాడులపై ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. రంజాన్ మాసం కుటుంబాలను, పొరుగువారిని, సమాజాన్ని మరింత చేరువ చేస్తుందని చెప్పారు. రంజాన్‌లో శాంతి, సహనంతో ఉండాలని ప్రజలు కోరుకుంటారని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని, ప్రజలందరూ భయపడకుండా భవగంతున్ని ప్రార్థించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాలో ప్రజలు కలిసి కట్టుగా, స్వేచ్ఛగా, భద్రతతో జీవిస్తున్నారని ట్రంప్ వెల్లడించారు. -
ఆ రెండు పార్టీలు ఒక్కటే: కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు వేర్వేరు కాదని.. రెండూ కలిసే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండింటిలో ఏ పార్టీకి ఓటు వేసినా అది మరో పార్టీకి పడ్డట్టేనని చెప్పారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల కలయిక నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి చెప్పిన మాటే దీనికి నిదర్శనమన్నారు. కేసీఆర్, చంద్రబాబు సూచన మేరకే ఈ కలయిక ఏర్పడిందన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ఖమ్మం, జగిత్యాల, కార్వాన్లకు చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు మంగళవారం బీజేపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు మజ్లిస్‌కు తొత్తులుగా మారి ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని.. మతోన్మాద శక్తులకు గుణపాఠం చెప్పాలంటే బీజేపీ గెలవాల్సిందేనన్నారు. మోదీ పాలనను గుర్తించి ప్రజలు బీజేపీ వైపు మళ్లుతున్నారని, తెలంగాణలో బీజేపీ గెలిచేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తామని తెలిపారు. దీనిపై ఈ నెల 22న అమిత్ షా హైదరాబాద్‌లో పార్టీ నేతలతో భేటీలు నిర్వహిస్తారని చెప్పారు. పార్టీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు.. బీజేపీ జాతీయ మైనార్టీ సెల్ సభ్యుడు అనీప్‌అలీ, లాయక్ అలీల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మైనారిటీల సంక్షేమం అద్భుతంగా ఉందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింలకు కాంగ్రెస్ ఇఫ్తార్ విందు
హైదరాబాద్: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముస్లిం మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చింది. నాంపల్లిలోని రెడ్‌రోజ్ ఫంక్షన్ హాలులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి అధ్యక్షతన సాగిన ఈ విందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసి డెంట్ భట్టి విక్రమార్క, శాసన సభాపక్ష నేత జానా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, సీనియర్ నాయ కులు మర్రి శశిధర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్రవణ్ కుమా ర్, షేక్ అఫ్జలుద్దీన్, మల్రెడ్డి రంగారెడ్డి, జాఫర్ జావేద్, ఆమేర్ జావేద్, ఖలీఖుర్ రెహ్మాన్, ఖాజా ఫకృద్దీన్, మాజీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ ఖాజా ఖలీలుల్లా, అంజన్‌కుమార్ యాదవ్, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. -
గవర్నర్ ఇఫ్తార్ విందు
హైదరాబాద్: గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రంజాన్‌ను పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఆదివారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇచ్చారు. పలువురు ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఇతర ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. -
ఇఫ్తార్‌కు ఎల్జీని పిలవని స్పీకర్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్నివాస్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) అనిల్ బైజల్‌కు షాకిచ్చారు. ఢిల్లీ∙అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు బైజల్‌కు ఆహ్వానం పంపలేదు. గతేడాది ఇఫ్తార్ విందుకు ఆహ్వానించినప్పటికీ ఎల్జీ రాలేదనీ, అందుకు ఎలాంటి కారణం చెప్పలేదని, అందుకే ఈసారి ఆయనకు ఆహ్వానం పంపలేదని స్పీకర్ చెప్పారు. విందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్, సామాజిక సంక్షేమ మంత్రి రాజేంద్రపాల్ గౌతమ్, పర్యావరణ మంత్రి ఇమ్రాన్ హుస్సేన్, ఆప్ శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్యేలు రాలేదు. -
మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
-
రేపు రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు
సాక్షి, హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ఆది వారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంట ల వరకు రాజ్‌భవన్ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండనున్న దృష్ట్యా వాహనదారులు ప్రత్యా మ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫి క్ చీఫ్ అనిల్‌కుమార్ సూచించారు. ఇఫ్తార్ విందు కు హాజరయ్యే వారి వాహనాలకు రాజ్‌భవన్, ఎంఎంటీఎస్ స్టేషన్, మెట్రో రెసిడెన్సీ–నాసర్ స్కూల్ మధ్య, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదురుగా పార్కింగ్ ప్రాంతాలు కేటాయించామన్నారు. -
నా రోడ్లపై నడుస్తూ.. నా పింఛన్లు తీసుకుంటూ..నాకు ఓటేయరా?
సీఎం చంద్రబాబునాయుడు వింత వ్యాఖ్యలు నంద్యాల: ‘‘నేను ఇచ్చే పెన్షన్, రేషన్ తీసుకుంటున్నారు, మేం వేసిన రోడ్లపైన తిరుగుతున్నారు. కానీ నాకు ఓటు వేయకపోతే ఎలా? లేకపోతే పెన్షన్లు, రేషన్ తీసుకోవద్దు. ఓటెయ్యని గ్రామాలను పక్కన పెట్టాల్సి వస్తుంది.’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఓటుకు రూ.వెయ్యి నుండి రూ.5 వేలు ఇవ్వగలనని, కాని ఇందుకు అవినీతికి పాల్పడాల్సి వస్తుందని, దరిద్రం గొట్టు రాజకీయాలు చేయలేనన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు వచ్చిన చంద్రబాబు గురువారం తనను కలిసిన ప్రజలు, పలు సంఘాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. తాను రూ.వెయ్యి పింఛన్ ఇస్తున్నానని, రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేశానని గుర్తు చేశారు. అయినా కొందరు నేతలు ఓటుకు ఇచ్చే రూ.500 ఎందుకు తీసుకుంటున్నారని, దీనివల్ల ఏమొస్తుందని ప్రశ్నించారు. తానూ ఓటుకు రూ.వెయ్యి నుండి రూ.5వేలు ఇవ్వగలనని, ఇందుకోసం అవినీతికి పాల్పడాల్సి వస్తుందన్నారు. తాను పింఛన్, రేషన్ ఇస్తున్నానని, తాను వేసిన రోడ్లపైన తిరుగుతున్నప్పుడు తనకే ఓటు వేయాలని ఆయన వ్యాఖ్యానించారు. తనకు ఓటు వేయని గ్రామాలను పక్కన పెట్టాల్సి వస్తుందని బెదిరించారు. అశ్లీల కామెంట్‌కు బాబు కితాబు: తనవల్ల లబ్ధి పొందినప్పుడు తనకు ఓటు వేయాలని బాబు వ్యాఖ్యానించినప్పుడు టీడీపీ నేత ఒకరు నినాదాలు చేస్తూ.. ‘‘ఒక అబ్బ, ఒక అమ్మకు పుట్టిన వాడు ఓటెయ్యాలని’’ అన్నారు. చంద్రబాబు అతని వైపు చూసి కరెక్ట్ అని వ్యాఖ్యానించారు. సాక్షి పత్రిక చదవద్దు.. టీవీ చూడొద్దు: సాక్షి దినపత్రికను చదవవద్దని, టీవీని చూడొద్దని చంద్రబాబు పార్టీ నేతలు, కార్యకర్తలకు చెప్పారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌లో బుధవారం రాత్రి ఆయన కౌన్సిలర్లతో, పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు సాక్షి మీడియాలో వ్యతిరేకత వార్తలు వస్తున్నాయన్నారు. -
ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మతీన్ మజాద్దాది నివాసంలో జరిగిన ఇఫ్తార్ విందులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌కి పార్టీ నేతలు, కార్యకర్తలు, మైనార్టీ సోదరులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బుధవారం రాత్రి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని మతీన్ నివాసంలో ఇఫ్తార్ సందర్భంగా ఉపవాస దీక్ష ముగించిన మతీన్‌కు జగన్ ఖర్జూరం తినిపించారు. మతీన్ కూడా గౌరవ సూచకంగా జగన్‌కు ఖర్జూరం తినిపించి, ముస్లిం సంప్రదాయ టోపీని, శాలువను అందజేశారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్, పార్టీ ఏపీ నాయకులు పుత్తా ప్రతాప్‌రెడ్డి, పార్టీ తెలంగాణ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు , కొండా రాఘవరెడ్డి, శివకుమార్, జిన్నారెడ్డి మహేందర్ రెడ్డి, ఇంకా మతీన్ సోదరుడు ముబీన్, మాజీ ఎంపీ బాలశౌరి, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ జిల్లా పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తోనే మైనార్టీ సంక్షేమం
ఇఫ్తార్ విందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీ సంక్షేమం సాధ్యమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి జహీరాబాద్‌లోని ఫ్రెండ్స్ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే జె.గీతారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలను ఉద్దేశించి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ముస్లిం మైనార్టీల భద్రత, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షానే ఉందన్నారు. ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ 4శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తు చేశారు. తాము ఇచ్చిన రిజర్వేషన్ల మూలంగానే ముస్లిం మైనార్టీలు విద్య, ఉద్యోగాల్లో లబ్ధిపొందుతున్నారన్నారు. ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీలకు మేలు జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను ఎన్నడూ విస్మరించలేదన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు మేఘనారెడ్డి, తాలూకా అధ్యక్షుడు ఎం.డి.జాఫర్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మంకాల్ సుభాష్, ఆత్మ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కండెం నర్సింహులు, రామలింగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి
- ఇఫ్తార్ విందులో గవర్నర్ నరసింహన్ - హాజరైన సీఎం కేసీఆర్, ఇరు రాష్ట్రాల స్పీకర్లు, మంత్రులు సాక్షి, హైదరాబాద్: ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు గవర్నర్ నరసింహన్ చెప్పారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ప్రజల మధ్య శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షిం చారు. రంజాన్ మాసం నేపథ్యంలో శుక్రవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఇఫ్తార్ విందు ఇచ్చారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనాచారి, తెలంగాణ, ఏపీ మం డలి చైర్మన్లు స్వామిగౌడ్, ఎ.చక్రపాణితో పాటు ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం కొనసాగేందుకు అందరూ సహకరించాలన్నారు. అనంతరం రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో మగ్రీబ్ నమాజ్‌కు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్‌లో శాకాహార హలీం, బిర్యానీ, షీర్ఖుర్మా, కద్దుకి ఖీర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు టి.హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నరసింహారెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు, డి.శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఫారూక్‌హుస్సేన్, బీజేపీఎల్పీ నేత కిషన్‌రెడ్డి, ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అచ్చెన్నాయుడు, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. ప్రొటోకాల్ ఎప్పుడూ తప్పలేదు... ఇఫ్తార్ విందుకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరు కాలేదు. చంద్రబాబును ఆహ్వానించారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా గవర్నర్ తనదైన శైలిలో చమత్కరించారు. చంద్రబాబుతో సహా ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమైన వారందరినీ ఆహ్వానించానని, ప్రొటోకాల్ విషయంలో తానెప్పుడూ విఫలం కాలేదని బదులిచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదంలో జోక్యం చేసుకుంటారా? అని ప్రశ్నించగా.. మీరెలా చెబితే అలా చేస్తానని సరదాగా వ్యాఖ్యానించారు. -
'26న నిజాం కాలేజీలో ఇఫ్తార్ విందు'
హైదరాబాద్: రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈ నెల 26న నిజాం కాలేజీలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనున్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం ఆయన రంజాన్ పండుగపై సమీక్ష నిర్వహించారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాని సూచించారు. రంజాన్ సందర్భంగా 2 లక్షల పేద ముస్లిం కుటుంబాలకు దుస్తుల పంపిణీ చేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు. -
వైఎస్సార్సీపీ ఇఫ్తార్ విందు
పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిలూరి ఆధ్వర్యంలో... ఎర్రుపాలెం : మండల కేంద్రంలోని ముస్లిం సోదరులకు శుక్రవారం రాత్రి వైఎస్సార్సీపీ మండల నాయకులు వేమిరెడ్డి మల్లారెడ్డి, శీలం జనార్దన్‌రెడ్డి ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా హాజరైన వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి అయిలూరి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ముస్లిం, హిందువుల మత సామరస్యానికి రంజాన్ దీక్షలు ప్రతీక అని అన్నారు. ఇలాంటి పర్వదినాల సందర్భంగా మతసామరస్యం పెంపొందుతుందని చెప్పారు. కార్యక్రమంలో మసీదు పీష్మా షేక్ షంషుద్దీన్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ అంకసాల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి లక్కిరెడ్డి నర్సిరెడ్డి, నాయకులు గుర్రాల పుల్లారెడ్డి, షేక్ హుస్సేన్, దేవరకొండ భూషణం, పోతురాజు కొండ, దేవరకొండ రవి, కృష్ణారెడ్డి తదితరులున్నారు. -
12న ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలి
రాంనగర్ : ఈ నెల 12వ తేదీన అన్ని శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లోని మసీదుల వద్ద దావత్-ఏ- ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పి.సత్యనారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం తన ఛాంబర్లో శాసనసభ నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశములో ఆయన మాట్లాడారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మసీదుల వద్ద 1,000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసేందుకు ఇమామ్, మసీద్ మేనేజ్మెంటు సభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, స్థానిక ఎమ్మెల్యేలతో సంప్రదించి దావత్-ఏ- ఇఫ్తార్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 1000 మంది పేద కుటుం బాలకు ఒక్కొక్క కుటుంబానికి రూ.500 విలువైన దుస్తులు పంపిణీ చేయతలపెట్టామని, ఈ దుస్తులను వక్ఫ్ బోర్డు సీఈఓ ద్వారా జిల్లాలకు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జేసీ సత్యనారాయణ, ఏజేసీ వెంకట్రావు, డీఆర్ఓ రవి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ మహేందర్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీధర్, పులిచింతల స్పెషల్ కలెక్టర్ నిరంజన్, మైనార్టీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసులు, డీఆర్డీఏ అడిషనల్ పీడీ కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
డల్లాస్‌లా హైదరాబాద్
-
కలెక్టర్ ఇఫ్తార్ విందు
గుంటూరు ఎడ్యుకేషన్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాగం తరపున కలెక్టర్ కాంతిలాల్ దండే ముస్లింలకు ఆదివారం సాయంత్రం ఇఫ్తార్ విందు ఇచ్చారు. స్థానిక ఇండియన్ టుబాకో బోర్డు అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ విందుకు హాజరైన ప్రజా ప్రతినిధులు, అధికారులు, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, రాష్ట్ర మైనార్టీస్ ఆర్ధిక సహకార సంస్థ చైర్మన్ ఎండీ హిదాయత్, ఎమ్మెల్యేలు మహమ్మద్ ముస్తఫా, కోన రఘుపతి, ధూళిపాళ్ళ నరేంద్ర, కొమ్మాలపాటి శ్రీధర్, యరపతినేని శ్రీనివాసరావు, తెనాలి శ్రావణ్‌కుమార్, జాయింట్ కలెక్టర్ వివేక్ యాదవ్, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగబాబు, మాజీ ఎమ్మెల్యేలు షేక్ మస్తాన్ వలి, ఎస్ఎం జియావుద్దీన్, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ ఎం.వెంకట సుబ్బయ్య, పలువురు అధికారులు పాల్గొన్నారు.