సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, సీఎం కేసీఆర్ ప్రసంగించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 9 ఏండ్ల కిందట తెలంగాణ అంటే వెనుకబడింది అనేవారు. ఇప్పుడు అభివృద్ధిలో దూసుకుపోతున్నాం. తెలంగాణతో దశ మారింది. తలసరి ఆదాయం పెరిగింది. పారిశ్రామిక రంగంలో అనూహ్య ప్రగతి సాధించాం. మంచినీళ్లు, కరెంట్ సమస్యలు తీరాయి.
ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు పదేండ్లలో కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ. 1200 కోట్లు మాత్రమే. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మైనార్టీల కోసం గత 9 ఏండ్లలో రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం అని తెలిపారు.
ఈ దేశం మనందరిది.. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడాలి. ఆవేశంతో కాదు.. ఆలోచనతో ఈ దేశాన్ని కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు న్యాయమే గెలుస్తుంది. ఇక, ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు మహముద్ అలీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా మీర్జా, ముస్లిం మతపెద్దలతో పాటు 13 వేల మంది ముస్లింలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment