lb stadium
-
దేశ ప్రతిష్ఠను పెంచేది క్రీడా మైదానాలే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదికగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం కప్-2024 ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. 25 ఏళ్ల క్రితం కామన్వెల్త్, ఆప్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించి హైదరాబాద్ క్రీడలకు తలమానికంగా నిలబడింది. క్రీడల్లో హైదరాబాద్ దేశానికే ఆదర్శంగా ఉండేది. తెలంగాణ వచ్చిన పదేళ్లలో రాష్ట్రంలో క్రీడలను నిర్లక్ష్యం చేశారు. హైదరాబాద్ నగర యువత క్రీడల వైపు వెళ్లకుండా వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. ఇది బాధ కలిగిస్తోంది. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే క్రీడలకు వేదికగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాను.నిఖత్ జరీన్ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి ఇండియాకు బాక్సింగ్‌లో తలమానికంగా మారారు. జరీన్‌ను డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. తెలంగాణలో క్రీడల్లో రాణిస్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుందనడానికి నిఖత్ జరీన్ నిదర్శనం. నిబంధనలు సడలించి మహ్మద్ సిరాజ్‌కు కూడా డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాము. పీవీ సింధు, అజారుద్దీన్ లాంటి హైదరాబాదీలు దేశానికే పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టారు. పుట్ బాల్ కోచ్ రహీమ్ సార్ హైదరాబాద్ నగరానికి చెందిన వారు కావడం గర్వకారణం. హైదరాబాద్ నగరం క్రీడలకు వేదిక కావాలని అండర్-17 పుట్ బాల్ నేషనల్ టీంను తెలంగాణ దత్తత తీసుకుంటోంది.చిన్న దేశం దక్షిణ కొరియా ఒలంపిక్స్‌లో 36 పతకాలు సాధించింది. తెలంగాణలో క్రీడలను ప్రోత్సహించడం కోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తాం. దక్షిణ కొరియా కోచ్‌లను ఇక్కడికి రప్పించి శిక్షణ ఇస్తాం. మతాలకు అతీతంగా అందరూ కలిసేది క్రీడా మైదానంలోనే. దేశ ప్రతిష్ఠను పెంచేది క్రీడా మైదానాలే. ఎల్బీ స్టేడియాన్ని అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్దుతాం. యువత వ్యసనాల వైపు వెళ్లొద్దు. క్రీడల్లో రాణిస్తే దేశ ప్రతిష్టను పెంపొందించే అవకాశం ఉంటుంది. 2028 ఒలింపిక్స్‌లో దేశం తరపున తెలంగాణ క్రీడాకారులు గోల్డ్ మెడల్స్ తీసుకురావాలి. రాష్ట్ర క్రీడాకారులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిది. ఒక లక్ష్యాన్ని పెట్టుకుని కష్టపడి పనిచేస్తే సాధించలేనిది లేదు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.ఇది కూడా చదవండి: కేటీఆర్‌పై మరోసారి కొండా సురేఖ సంచలన ఆరోపణలు -
9న టీచర్ నియామక పత్రాలు
సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ–2024 కింద ఎంపికయ్యే ఉపాధ్యాయులకు అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో నియామక పత్రాలను అందజేస్తామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దసరా నాటికి టీచర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. ఈ మేరకు 65 రోజుల్లోనే డీఎస్సీ పూర్తి చేశామని.. విద్యను పేదవాడి ముంగిటకు చేర్చడ మే ధ్యేయంగా చర్యలు చేపట్టామని తెలిపారు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ నియామక పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.తమ ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందని తెలిపారు. డీఎస్సీ రాసిన వారి మెరిట్ జాబితాల్లోంచి ఒక్కో పోస్టుకు ముగ్గురి చొప్పున ఎంపిక చేస్తామని.. ఆ జాబితాలను జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ)కి పంపుతామని సీఎం చెప్పారు. అక్కడ తుది ఎంపిక జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒకే ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందని.. అదీ 7,857 మంది టీచర్లనే నియమించిందని పేర్కొన్నారు. అదే తాము అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. పది నెలల్లోనే 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసి, నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు అడుగులు వేశామని చెప్పారు. ఉపాధ్యాయులంటే.. ఓ భావోద్వేగం ఉపాధ్యాయులు అంటే ఉద్యోగి కాదని, ఓ భావోద్వేగమని సీఎం అభివర్ణించారు. కీలకమైన ఈ రంగం గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. విద్యా రంగానికి భవిష్యత్‌లో మరిన్ని నిధులు ఇస్తామని.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రా«ధాన్యమిస్తామని ప్రకటించారు. పబ్లిక్ సరీ్వస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి, వివాదాలకు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించామని సీఎం తెలిపారు. గ్రూప్–1 పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేస్తామన్నారు.నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ స్కూల్రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించినట్టు సీఎం రేవంత్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఒకే చోట ఉంచి విద్యను అందించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతీ రెసిడెన్షియల్ స్కూల్‌ను 20 నుంచి 25 ఎకరాల్లో రూ.125 కోట్ల వ్యయంతో నిర్మిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం మధిర, కొడంగల్ నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా వీటిని చేపడుతున్నామని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీల మీడియాలు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.గత పదేళ్లు ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తే ఎందుకు ప్రశ్నించలేదన్నారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ బడులను కొనసాగిస్తామని ఓ ప్రశ్నకు బదులుగా చెప్పారు. తాము జాతీయ నూతన విద్యా విధానం కన్నా.. రాష్ట్ర విద్యా విధానంపైనే దృష్టి పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, తు మ్మల నాగేశ్వర్రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేం దర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం పాల్గొన్నారు. -
మీ చేతుల్లోనే రాష్ట్ర భవిత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర భవిష్యత్ టీచర్ల చేతుల్లోనే ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. ఉపాధ్యాయులు తేనెతుట్టె వంటి వారని.. వారికి ఎవరైనా అపకారం చేస్తే తేనెటీగల్లా ఎదురుదాడి చేస్తారని వ్యాఖ్యానించా రు. తమ ప్రభుత్వానికి ఉపాధ్యాయులే బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం ఆతీ్మయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే క్రమంలో ముందుంటాం. 15 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న 30వేల మంది టీచర్ల పదోన్నతులు చేపట్టడం గర్వకారణం. బడ్జెట్లో విద్యారంగానికి 10% కేటాయించాలనుకున్నా.. హామీల అమలు దృష్ట్యా 7.3% నిధులే ఇవ్వగలిగాం. స్కూళ్లలో దారుణ పరిస్థితులు.. గురుకులాలతో కలిపి రాష్ట్రంలో 30వేల ప్రభుత్వ స్కూళ్లుంటే వాటిలో 26 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే ప్రైవేటు స్కూళ్లు 10వేలు ఉంటే వాటిలో 33 లక్షల మంది విద్యార్థులున్నారు. ప్రైవేటు స్కూళ్లలో గొప్ప టీచర్లున్నారా? టెన్త్, ఇంటర్ ఫెయిలైన వాళ్లతో పాఠాలు చెప్పిస్తున్నారు. ఎక్కడో లోపం ఉంది. దీనికి ప్రభుత్వ విధానాలూ కారణమే. మౌలిక వసతులు లేక విద్యార్థులు ప్రైవేటుబాట పడుతున్నారు.మహిళా టీచర్లు పనిచేసే ప్రాంతాల్లో కూడా టాయిలెట్లు లేవు. కొన్నిచోట్ల స్కూళ్లలో పశువులను కట్టేసే పరిస్థితి. మేం పాఠశాలలను మెరుగుపరిచే బాధ్యతను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు అప్పగించాం. ప్రతీ ప్రభుత్వ స్కూల్‌కు ఉచిత విద్యుత్ అందిస్తాం. పారిశుధ్య కారి్మకులను నియమిస్తాం. మీరే అంబాసిడర్లు.. తెలంగాణ సాధనలో టీచర్ల పాత్ర కీలకం. దీన్ని దృష్టిలో ఉంచుకునే వారి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యమిచ్చాం. టీచర్లతో పెట్టుకోవద్దని చాలామంది నాకు సలహా ఇచ్చారు. కానీ వారిలో విశ్వాసం నింపుతాననే నమ్మకం నాకు ఉంది. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పేదల భవిత టీచర్ల చేతుల్లోనే ఉంది. గత ఏడాది విద్యార్థుల అడ్మిషన్లు 2 లక్షల మేర తగ్గాయి. అందువల్ల టీచర్లు ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలను పంపడం ఆత్మగౌరవంగా భావించే పరిస్థితి తేవాలి..’’అని సీఎం రేవంత్ కోరారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, టీజేఎస్ చీఫ్ కోదండరాం, ఉన్నతాధికారులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. పేరుకేనా ముఖాముఖి: టీచర్ల అసంతృప్తి ప్రమోషన్లు పొందిన వారితో సీఎం ముఖాముఖి అని చెప్పి అధికారులు తమను తీసుకొచ్చారని.. కానీ ఒక్కరికైనా మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని సమావేశం అనంతరం టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజానికి విద్యాశాఖ అధికారులు వారం రోజుల నుంచే ఈ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఉపాధ్యాయులను తరలించేందుకు ప్రతీ జిల్లా నుంచి పెద్ద ఎత్తున వాహనాలు ఏర్పాటు చేశారు. దీంతో టీచర్లు ఏమేం మాట్లాడాలో ముందే సిద్ధం చేసుకున్నారు.కనీసం జిల్లాకు ఒకరినైనా సీఎంతో మాట్లాడిస్తారని భావించామని.. కానీ సమావేశం కేవలం ప్రసంగాలకే పరిమితమైందని టీచర్లు పేర్కొన్నారు. గతంలో చెప్పినవే ఇప్పుడూ చెప్పారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా విద్యా రంగ సమస్యల పరిష్కారానికి హామీ ఇచి్చన సీఎంకు పీఆరీ్టయూటీఎస్ నేతలు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్ కృతజ్ఞతలు తెలిపారు. -
తెలంగాణ భవిష్యత్ మా చేతుల్లో కాదు.. మీ చేతుల్లోనే: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్ టీచర్ల చేతుల్లోనే ఉందన్నారు. ఎల్బీ స్టేడియంలో ఉపాధ్యాయులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. తెలంగాణ భవిష్యత్ ఎక్కడుందని.. ఈ క్షణం తనను అడిగితే.. వేలాది మంది ఉపాధ్యాయుల రూపంలో ఎల్బీ స్టేడియంలో ఉందని చెబుతానన్నారు.‘‘30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు వారి భవిష్యత్‌ను మీ చేతుల్లో పెట్టారు. రాష్ట్రం వస్తే విద్యా విధానం బాగుపడుతుందనుకున్నాం.. ఉపాధ్యాయుల గౌరవం పెరుగుతుందనుకున్నాం.. కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్యలాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందనుకున్నాం.. కానీ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందో చూశాం.. గత పాలకులు ఉపాధ్యాయులను ఏ విధంగా అవమానించారో చూశాం’’ అంటూ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.‘‘ఈ బడ్జెట్లో విద్యకు 10 శాతం కేటాయించాలని భావించాం. కానీ హామీల అమలు దృష్ట్యా 7.3 శాతం అంటే రూ.21 వేల కోట్లకు పైగా కేటాయించాం. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 30 వేల పాఠశాలల్లో.. 26 లక్షల విద్యార్థులు చదువుకుంటున్నారు.. 10వేల ప్రయివేట్ పాఠశాలల్లో.. 33 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.. ప్రైవేట్ పాఠశాలలల్లో మీకంటే గొప్ప టీచర్లున్నారా?. మౌళిక సదుపాయాలు లేకపోవడమే ఇందుకు కారణం కావచ్చు’’ అంటూ రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.‘‘తెలంగాణలో ఉద్యోగుల పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కంటే దారుణంగా ఉంది... ఇది కఠోర నిజం. టీచర్లు తేనెతుట్టె లాంటి వాళ్లు.. హాని చేయాలని చూస్తే తీనెటీగల్లా ఎదురుదాడికి దిగుతారు. ప్రభుత్వంపై ఉద్యోగులకు నమ్మకం కలిగించేందుకు ప్రతీ నెలా 1వ తేదీనే జీతాలు అందించేలా చర్యలు తీసుకున్నాం. పదిహేనేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల ప్రమోషన్ల అంశాన్ని పరిష్కరించాం. మీ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే ఈ సమావేశం ఏర్పాటు చేశాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘తెలంగాణ భవిష్యత్ మా చేతుల్లో కాదు.. మీ చేతుల్లో ఉందని చెప్పేందుకే ఈ సమావేశం.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేను ఈ స్థాయికి చేరా.. అలాంటి ప్రభుత్వ టీచర్లను కలుసుకునేందుకే ఈ ఆత్మీయ సమావేశం. టీచర్లంతా నిబద్ధతతో పనిచేయాలి.. విద్యార్థులకు విద్యనందించాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.‘‘గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో 2 లక్షలకుపైగా విద్యార్థుల అడ్మిషన్లు తగ్గాయి. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం ఆత్మ గౌరవమని భావించేలా పాఠశాలలను తీర్చిదిద్దాలి. ప్రభుత్వం వైపు నుంచి మీ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు మాకు ఎలాంటి భేషజాలు లేవు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు స్వయం సహాయక మహిళా సంఘాలకు బాధ్యత అప్పగించాం. అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మహిళలకు బాధ్యత అప్పగించాం. ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని అధికారులను ఆదేశించాం’’ అని రేవంత్ చెప్పారు.‘‘తెలంగాణ బలపడాలంటే మనందరం కార్యదీక్షతో పనిచేయాలి. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మండల కేంద్రాల్లో మినీ స్టేడియంల ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. నైపుణ్యం లేకపోవడం వల్లే నిరుద్యోగం పెరుగుతోంది. అందుకే ముచ్చెర్లలో 50 ఎకరాల్లో రూ.150 కోట్లతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. స్కిల్ యూనివర్సిటీలో యువకులకు నైపుణ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. క్రీడలను ప్రోత్సహించేందుకు స్పోర్ట్స్ పాలసీని తీసుకొస్తాం. మీరు నేర్పే విద్యనే రేపటి తెలంగాణ భవిష్యత్‌కు బాటలు వేస్తుంది. పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే మీ లక్ష్యం కావాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు. -
జూన్ 4న దేశం గెలుస్తుంది: ప్రధాని మోదీ.
సాక్షి,హైదరాబాద్: జూన్ 4న దేశం గెలుస్తుందని, 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. ‘కాంగ్రెస్‌కు ఓటు వేయడమంటే పాత రోజులను ఆహ్వానించినట్లే.. దేశం ఉగ్రవాదుల చేతిలోకి వెళ్లకూడదు.2012లో దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు జరిగాయి. ఎంతో మంది అమాయకులు కాంగ్రెస్ పాలనలో బలయ్యారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం వచ్చాకే బాంబు పేలుళ్లు ఆగాయి. అందుకే మోదీని దించాలని చాలామంది చూస్తున్నారు. కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్ వద్దు. మజ్లిస్ వద్దని తెలంగాణ అంటోంది. బీజేపీ కావాలంటోంది. లూటీ లూటీ లూటీ, వారసత్వ రాజకీయాలు ఇవే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు. మీ సంపదను లాక్కునే వాళ్లు కావాలా.. మీ సంపదపై మీ పిల్లలకు హక్కుఉండాలా వద్దా. రాముడికి పూజ చేయడం తప్పా. నాకు హైదరాబాద్ చాలా ప్రత్యేకం. యువరాజుకు ట్యూషన్ చెప్పే నేత రామ నవమి చేసుకోవడం తప్పన్నారు. కాంగ్రెస్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు కోత పెట్టి ముస్లింలకు కోటా ఇచ్చింది. ఇదీ కాంగ్రెస్ పార్టీ మోడల్. తెలంగాణకు ఎయిమ్స్, వందేభారత్ రైళ్లు ఇచ్చిందెవరో చెప్పాలి’అని మోదీ ప్రసంగించారు. -
Directors Day 2024: డైరెక్టర్స్ డే వేడుకను ఘనంగా నిర్వహిస్తాం
దివంగత దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని మే 4న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దాసరి జయంతి అయిన మే 4న ‘డైరెక్టర్స్ డే’గా తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం అధ్యక్షుడు వీర శంకర్ మాట్లాడుతూ– ‘‘దాసరి నారాయణరావుగారి జయంతిని ఈ ఏడాది మే 4న ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించబోతున్నాం. ఈ ఈవెంట్ ద్వారా ఫండ్ రైజ్ చేసి డైరెక్టర్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం, మిడ్ డే మీల్స్, అసోసియేషన్‌కు కొత్త బిల్డింగ్ నిర్మాణం, వయసు పైబడిన దర్శకులకు ఆర్థిక సహాయం వంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఈ కార్యక్రమాల కల్చరల్ కమిటీలో డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, శివ నిర్వాణ, నందినీ రెడ్డి, అనుదీప్ కేవీ, విజయ్ కనకమేడల ఉంటారు’’ అన్నారు. -
ధర్మయుద్ధానికి సిద్ధం కావాలి
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే ధర్మ యుద్ధానికి (లోక్‌సభ ఎన్నికలకు) పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలని కేంద్రమంత్రి బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. అందరూ కష్టపడి పనిచేసి ధర్మం, న్యాయం కోసం కృషిచేస్తున్న మోదీని మరోసారి ప్రధానిని చేయాలని కోరారు. మంగళవారం ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ పోలింగ్ బూత్ అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ప్రతి పోలింగ్ బూత్ స్థాయిలో ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ ముఠా వందరోజుల్లో రాష్ట్రంలోని బిల్డర్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పరిశ్రమలు, కాంట్రాక్టర్ల దగ్గర రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తోందని ఆరోపించారు. ‘మన అందరి ఎజెండా ఒకటే..ఏప్రిల్‌లో జరగనున్న ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవాలి. గత పదేళ్లలో మోదీ సర్కార్ తెలంగాణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది’ అని కిషన్‌రెడ్డి చెప్పారు. 12 సీట్లు గెలుస్తాం : డీకే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ...‘ఆరు నూరైనా.. తెలంగాణలో 12 సీట్లు గెలుస్తాం, కాషాయ జెండా ఎగరేస్తాం. తెలంగాణలో ఏ ప్రాంతానికి వెళ్లినా ఈసారి మోదీకే ఓటని ప్రజలు చెప్తున్నారు. కాంగ్రెస్ అరుగ్యారంటీలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. తెలంగాణలో 17 సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని అవుతాడా..? రాహుల్‌ను ప్రధాని అభ్యరి్థగా ఇండియా కూటమే ఒప్పుకోవడం లేదు. రాష్ట్రంలోకాంగ్రెస్ మోసపూరిత పాలనతో ప్రజలు విసుగు చెందుతున్నారు’ అని అన్నారు. బీజేపీ పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. ‘రాబోయే 40 రోజులు పోలింగ్బూత్లకే కార్యకర్తలు పరిమితమై పార్టీ అభ్యర్థులను గెలిపించాలి. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంఐఎంలను ఎదుర్కొనే సత్తా బీజేపీకే ఉంది. గ్యారంటీల పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారు’ అని అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ...‘మేము రాముని పేరు చెప్పి బరాబర్ ఓట్లు అడుగుతాం. మీకు దమ్ముంటే బాబర్ పేరు చెప్పి ఓట్లు అడగండి’ అని సవాల్ విసిరారు. ‘అసలు కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి ఎవరు? ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు చుక్కలు చూపెడతారు. ఒకట్రెండు హామీలు నెరవేర్చి ఎన్నికల కోడ్ వస్తే కాలం గడపొచ్చని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోంది’ అని అన్నారు. నిజామాబాద్ ఎంపీ అరి్వంద్ ధర్మపురి మాట్లాడుతూ...‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా మోదీకే ఓటేస్తామని జనం అంటున్నారు. వచ్చే నెల, నెలన్నర రోజుల్లో జరిగే ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీ అత్యధిక సీట్లలో గెలిచేలా కృషిచేయాలి’ అని చెప్పారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులకుప్పగా మారిస్తే, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ సర్కార్ ఉందన్నారు. -
ఎల్బీ స్టేడియంలో ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేసిన సీఎం (ఫొటోలు)
-
హైదరాబాద్ : ఎల్బీ స్టేడియం క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి (ఫొటోలు)
-
సెక్యులర్ ప్రభుత్వంతోనే మత సామరస్యం
సాక్షి, హైదరాబాద్: సెక్యులర్ ప్రభుత్వాల పాలనలోనే మత సామరస్యం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, కేంద్రంలో తిరిగి సెక్యులర్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్ జి.ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలసి రేవంత్ పాల్గొన్నారు. క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ పాలనలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం దక్కుతుందని చెప్పారు. ‘‘డిసెంబర్లో తెలంగాణలో మిరాకిల్ జరుగుతుందని నేను ముందుగానే చెప్పాను. మొన్న హిమాచల్, నిన్న కర్ణాటక, నేడు తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి.పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును అన్ని వర్గాల ప్రజలు కోరుకోవాలి.. అని పేర్కొన్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటా.. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చివరి లబ్ధిదారు వరకు అందించే దిశగా పాలన సాగిస్తామని రేవంత్ చెప్పారు. తామంతా పాలకుల మాదిరి కాకుండా సేవకుల్లా పనిచేస్తామని.. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఆ దిశగానే గడీలను బద్దలుకొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించామని.. వారంలో రెండ్రోజులు ప్రజావాణి వింటున్నామని చెప్పారు. మిడ్జిల్ జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రజల్లోకి వచ్చిన తాను ఇప్పటివరకు ప్రజలతోనే ఉన్నానని, ఇకపైనా నిత్యం ప్రజల్లోనే ఉంటానని రేవంత్ పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం మైనార్టీలు ఎన్నో ప్రార్థనలు చేశారని, ఇప్పుడు దేశంలోనూ కొత్త ప్రభుత్వం కోసం అదే తరహాలో ప్రార్థనలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని సీఎం రేవంత్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ప్రభుత్వ సీఎస్ శాంతికుమారి, డీజీపీ, బిషప్‌లు పాల్గొన్నారు. -
LB Stadium: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, పలువురు పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున అందించే కానుకలను సీఎం రేవంత్ పంపిణీ చేశారు. ఇక, క్రిస్మస్ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘దేశంలో మతసామరస్యానికి పెద్దపీట వేసింది కాంగ్రెస్. అన్ని మతాలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుంది. డిసెంబర్ నెల మిరాకల్ నెల అని ముందే చెప్పా. నేను చెప్పిన మాట నిజమైంది. ఎర్రకోటపై మువ్వెనెల జెండా ఎగిరినప్పుడే దేశంలో మత సామరస్యం పరిడవిల్లుతుంది. మణిపూర్‌లో జరిగిన మారణ కాండ కళ్ల ముందే కనిపిస్తోంది. మణిపూర్‌కు రాహుల్ గాంధీ వెళ్లి శాంతి నెలకోల్పడానికి ప్రయత్నించారు. దాన్ని కూడా ప్రధాని విమర్శించారు. మాకు బలమైన శక్తి వచ్చేలా బిషప్ లంతా ప్రార్థనలు చేయాలి. ఏకే ఆంటోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ లాంటి వారికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చింది. గుడిలో పూజలు చేసే బ్రాహ్మణులకు, చర్చిలో ప్రార్దనలు చేసే బిషప్‌లకు, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇస్తాం. ఏసుక్రీస్తును ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు అండగా ఉంటాం. మీ సమస్యలు చెప్పుకునేందుకు సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ముళ్ళ కంచలు బద్దలు కొట్టి ప్రజావాణి ప్రారంభించాం’ అని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: TSRTC: ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన -
22న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం తరఫున ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. కాగా, రాష్ట్రమంతా ఈ వేడుకలను నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కాంతి వెస్లీ వెల్లడించారు. ప్రభుత్వం ఏటా ఆనవాయితీగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తోందని ఆమె వివరించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు వెల్లడించారు. -
సొంత పెన్ తో రేవంత్ సీఎంగా సంతకం
-
రేవంత్‌రెడ్డి అనే నేను..
ఉదయం నుంచి కాంగ్రెస్ అగ్రనేతల రాక, ఆహ్వానాలు.. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారాలు, సభ.. కొత్త సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం.. అధిష్టానం నేతలకు వీడ్కోలు.. సాయంత్రం సచివాలయం వద్ద హడావుడి.. సీఎం చాంబర్లో రేవంత్ బాధ్యతల స్వీకరణ.. తర్వాత కాసేపటికే కొత్త కేబినెట్ తొలి సమావేశం.. రాత్రిదాకా వాడీవేడిగా చర్చలు.. మొత్తంగా రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిరోజు హడావుడిగా కనిపించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు రేవంత్‌రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. వారంతా తాజ్‌కృష్ణ హోటల్‌కు వెళ్లగా.. రేవంత్ తన నివాసానికి వెళ్లి, అక్కడి నుంచి కుటుంబంతో కలసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మళ్లీ తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకుని, కాంగ్రెస్ అగ్రనేతలతో కలసి ఎల్బీ స్టేడియానికి వచ్చారు. గవర్నర్ తమిళిసై సీఎంగా రేవంత్‌తో, ఇతర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారాలు ముగిశాక గవర్నర్, ఏఐసీసీ నేతలు వెళ్లిపోగా.. రేవంత్ ప్రజలను ఉద్దేశించి సీఎంగా తొలి ప్రసంగం చేశారు. తర్వాత మళ్లీ తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లారు. ఏఐసీసీ పెద్దలతో కలసి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డి సచివాలయానికి వచ్చారు. గౌరవ వందనం స్వీకరించి, సచివాలయమంతా కలియతిరిగారు. సీఎం చాంబర్లో లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై మంత్రివర్గం చర్చించింది. ఇక శనివారం అసెంబ్లీ సమావేశం నిర్వహించి కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గురువారం మధ్యా హ్నం 1:19 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్ర మార్క, కేబినెట్ మంత్రులుగా ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ధనసరి అన సూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాందీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, కర్ణాటక, హిమాచల్ సీఎంలు సిద్ధరామయ్య, సుఖి్వందర్సింగ్ సుక్కు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పవిత్ర హృదయంతో అంటూ ఇద్దరు.. ఒకరు ఇంగ్లిష్‌లో.. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు 9 మంది మంత్రులు దైవసాక్షిగా ప్రమాణం చేయగా.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క మాత్రం పవిత్ర హృదయంతో అంటూ ప్రతిజ్ఞ చేశారు. దామోదర రాజనర్సింహ ఇంగ్లి‹Ùలో, మిగతా అందరూ తెలుగులో ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 1:04 గంటలకు రేవంత్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా కొంత ఆలస్యమైంది. ట్రాఫిక్ సమస్య కారణంగా గవర్నర్ 1:17 గంటలకు సభా వేదిక వద్దకు వచ్చారు. రేవంత్ వేదిక దిగి వెళ్లి ఆమెకు స్వాగతం పలికారు. ఆ వెంటనే ప్రమాణ స్వీకారాలు మొదలయ్యా యి. 28 నిమిషాల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం 1:46 గంటలకు ముగిసింది. తర్వాత గవర్నర్ తమిళిసై, కాంగ్రెస్ అగ్రనేతలు వెళ్లిపోయారు. ఓపెన్ టాప్ జీపులో.. కలియదిరిగి.. సోనియాగాంధీతో కలసి రేవంత్‌రెడ్డి ఓపెన్‌టాప్ జీప్‌లో ఎల్బీ స్టేడియంలోకి వచ్చారు. సోనియా గాంధీ ముందు నిలబడగా.. ఆమెకు కాస్త వెనుకగా రేవంత్ నిలబడి స్టేడియంలో కలియదిరిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. తర్వాత రేవంత్ స్వయంగా సోనియాను తోడ్కొని వేదికపైకి వచ్చారు. రాహుల్, ప్రియాంక నడుచుకుంటూ, ప్రజలకు అభివాదం చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. కార్యక్రమం ముగిశాక సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు రేవంత్ స్వయంగా వీడ్కోలు పలికారు. తర్వాత మళ్లీ వేదికపైకి వచ్చి ముఖ్యమంత్రిగా తన తొలి ప్రసంగం చేశారు. సీతక్క.. హోరెత్తిన స్టేడియం మంత్రులందరిలో సీతక్క ప్రమాణ స్వీకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రిగా సీతక్క పేరు ప్రకటించగానే ఎల్బీ స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో హోరెత్తింది. ఆ హోరులో సీతక్క ఒక నిమిషం పాటు ఆగిపోవాల్సి వచ్చింది. ఇది చూసి వేదికపై ఉన్న పెద్దలు, నేతలంతా ఆశ్చర్యపోయారు. ప్రమాణం కొనసాగించాలంటూ గవర్నర్ తమిళిసై సైగ చేయడంతో సీతక్క ఆ హోరులోనే ప్రమాణ స్వీకారం కొనసాగించారు. తర్వాత సోనియా వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. సోనియా లేచి నిలబడి సీతక్కను హత్తుకుని అభినందించారు. అగ్రనేతలతో.. ఒకే వాహనంలో.. గురువారం ఉదయం రేవంత్‌రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరి పెద్దమ్మ గుడికి వెళ్లారు. అక్కడ పూజలు చేసిన తర్వాత తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌గా ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకలతో కలసి రేవంత్ ఒకే వాహనంలో కూర్చున్నారు. సోనియా సభావేదికపై వచ్చాక రేవంత్‌రెడ్డి మనువరాలిని చూసి ముద్దాడారు. ప్రమాణ స్వీకారాలు ముగిశాక.. రేవంత్‌రెడ్డి వేదికపైనే ఉన్న తన సతీమణితో కలసి సోనియా దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేశారు. తన కుమార్తెను, అల్లుడిని సోనియా, రాహుల్, ప్రియాంకలకు పరిచయం చేశారు. ప్రమాణ స్వీకారం.. పదనిసలు ► గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ► ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొదట, చివరిలో నల్లగొండ గద్దర్ స్వయంగా రాసి, పాడిన ‘మూడు రంగుల జెండా పట్టి’ పాట పార్టీ శ్రేణులకు హుషారెక్కించింది. ► సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండే సోనియాగాంధీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ం కొలువుదీరే సందర్భంగా హాజరవడం గమనార్హం. గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆమెతోపాటు, రాహుల్, ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ► మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరిని రేవంత్‌రెడ్డి దగ్గరికి తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత మంత్రులు వేదికపై ఉన్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఇతర అగ్రనేతలకు మర్యాదపూర్వకంగా నమస్కరించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రతి మంత్రిని భుజం తట్టి ఆశీర్వదించారు. ► ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. ► రేవంత్ ప్రసంగిస్తూ.. ‘ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే, అక్కడ ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెలు బద్దలుగొట్టాం. ఇకపై అందరూ ప్రగతిభవన్‌కు రావొచ్చు’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమోగింది. ► ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి వస్తున్న పలువురు ప్రముఖుల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. కాగా,ఏపీకి చెందిన టీడీపీ నాయకులు ఆ పార్టీ జెండాలు పట్టుకొని స్టేడియంలో హల్చల్ చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతూ.. టీడీపీ కార్యకర్తలను చితకబాదడంతో అక్కడి నుంచి పారిపోయారు. కాంగ్రెస్ సభలో టీడీపీ జెండాలు ఏమిటని, మళ్లీ టీడీపీ జెండాలు కనిపిస్తే పీకి పారేయాలని సీనియర్ లీడర్లు కార్యకర్తలకు సూచించారు. -
TS CM Revanth Reddy: తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం.. సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం (ఫొటోలు)
-
సీఎంగా రేవంత్ తొలి ప్రసంగం.. ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి తొలిసారి ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు చేసిందని, దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. ‘‘ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. ప్రమాణ స్వీకారం మొదలైనపుడే అక్కడ ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా... ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలు బద్దలు కొట్టాం. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. ‘‘మేం పాలకులం కాదు.. మేం సేవకులం.. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా.. గుండెల్లో పెట్టుకుంటా’’ అని రేవంత్ చెప్పారు. చదవండి: తెలంగాణ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసింది వీరే -
రేవంత్ రెడ్డి గ్రాండ్ ఎంట్రీ..
-
Live: ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను..
-
రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపు కొత్త సర్కార్ కొలువుదీరనుంది. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు ఎల్బీ స్టేడియానికి వచ్చే మార్గాల్లో కాకుండా వేరే మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ట్రాఫిక్ ఆంక్షలు ఇలా.. పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు, ఎస్బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు, బషీర్‌బాగ్ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్ కోఠి వైపు, సుజాత స్కూల్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లించనున్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లను సీఎస్ శాంతకుమారి, డీజీపీ రవి గుప్తా పరిశీలించారు. ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రేపటి సభలో మూడు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లెఫ్ట్ సైడ్ 63 సీట్లతో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక వేదిక.. రైట్ సైడ్ వీవీఐపీల కోసం 150 సీట్లతో వేదికను ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా 500 మందితో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గోండు, డప్పు, ఒగ్గు, బోనాలు, షేరీ బ్యాండ్ కళాకారులతో రేవంత్ రెడ్డికి స్వాగత ఏర్పాట్లు చేశారు. అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో ప్రత్యేక గ్యాలరీ, తెలంగాణ మేధావులు, ఉద్యమకారుల కోసం 250 సీట్లతో మరో గ్యాలరీ, ముప్పై వేల మంది సాధారణ ప్రజలు కూర్చొనే విధంగా ఏర్పాట్లు చేశారు. స్టేడియం బయట వీక్షించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: తెలంగాణలో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్ -
ఉ.10.28 గంటలకు ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణ స్వీకారం
-
సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం.. కేసీఆర్‌తోపాటు వీరికి ఆహ్వానం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో విజయం సాధించింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుపై హస్తం పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇక, తెలంగాణ ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపు(గురువారం) ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్ నేతలు, అధికారులు పరిశీలిస్తున్నారు. మరోవైపు, రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందించారు. రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉండగా.. ఇప్పటికే సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కలిసి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఇక, కాంగ్రెస్ నేతలు రేవంత్ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని ఏఐసీసీ నేతలకు, ఇతర రాష్ట్రాల నేతలకు ఆహ్వానం పంపారు. వీరికి ఆహ్వానం పంపనున్నారు.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కర్ణాటక మంత్రులు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్, మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహన్. తమిళనాడు సీఎం స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం మాజీ సీఎం కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపనున్నారు. గతంలో ఇంఛార్టీలుగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్, వీరప్ప మొయిలీ, కుంతియా, వాయిలార్ రవి, మాణిక్కం ఠాగూర్, మరికొందరు ముఖ్యులు. తెలంగాణ ఏర్పాటు కీలక పాత్ర పోషించిన చిదంబరం, మీరాకుమారి, సుశీల్ కుమార్ షిండే, కురియన్, మరికొందరు నేతలు. తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలు కోదండరామ్, గాదె ఇన్నయ్య, హరగోపాల్, కంచ ఐలయ్య తోపాటు మరికొందరు ఉద్యమ కారులు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపనున్నారు మాజీ సీఎం చంద్రబాబు, సినీ నటులకు ఆహ్వానం పంపనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్‌తోపాటు వివిధ కులసంఘాల నేతలకు, మేధావులకు ఆహ్వానం పంపనున్నారు. -
నేడు తెలంగాణకు మోదీ
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ తరపున ప్రచారంకోసం మరోసారి రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ప్రధాని మళ్లీ శనివారం మాదిగల విశ్వరూప మహాసభకు హాజరుకానున్నారు. తొలుత బీసీ సీఎం నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రధాని, ఈసారి తెలంగాణతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే కమంలో జరుగుతున్న బహిరంగసభకు హాజరవు తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 9 లేదా 10 శాతానికి పెంచే విషయంపైనా మోదీ ఏదైనా ప్రకటన చేయవచ్చునని ఊహాగానాలు సాగుతు న్నాయి. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టా త్మకంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర జనాభాలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కలిపి 80 శాతానికి పైగానే ఉండటంతో వీరి మద్దతును కూడగట్టే దిశలో పార్టీ జాతీయ నాయకత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా.. శనివారం సాయంత్రం 5 గంటలకు ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభ’లో ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2.35 నిముషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4.45కు ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుని సాయంత్రం 5 నుంచి 5.40 వరకు బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీనేతల సమాచారం. సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. అదేవిధంగా ఈ నెల 26న నిర్మల్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో కూడా మోదీ పాల్గొననున్నట్టు పార్టీనేతల సమాచారం. దీంతో పాటు రాష్ట్రపార్టీ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించే సభకు సైతం మోదీ హాజరవుతారని పార్టీవర్గాలు వెల్లడించాయి. ఇదీ చదవండి: అమలు గ్యారంటీ -
ఎల్బీ స్టేడియంలో భాజపా బీసీ ఆత్మ గౌరవ సభ
-
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ
-
అవినీతిని అంతం చేస్తాం.. ఇది మోదీ గ్యారంటీ
PM Modi Meeting at LB stadium-Updates.. బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో మోదీ ప్రసంగం ►పీఎం ఆవాజ్ యోజన్ కింద తెలంగాణలో 2.5 లక్షల ఇళ్లు ఇచ్చాం ► కోవిడ్ కష్టకాలంలో ప్రతీ పేదకుటుంబాన్ని ఆదుకున్నాం. ►పేదలకు ఇచ్చిన ఉచిత రేషన్‌ను మరో 5 ఏళ్లు పెంచుతున్నాం ►బీసీ కమిషన్‌కు మా ప్రభుత్వం రాజ్యాంగ మోదా కల్పించింది. ►తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ►బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంబంధాలు ఉన్నాయి. ►లిక్కర్ స్కామ్‌పై దర్యాప్తు చేస్తుంటే.. ఈడీ, సీబీఐని ఇక్కడి నేతలు తిడుతున్నారు. ►అవినీతిని అంతం చేస్తాం.. ఇది మోదీ గ్యారంటీ. ►అవినీతి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ►ఎవరు ప్రజాధనాన్ని దోచుకున్నారో.. వాటిని తిరిగి రాబడతాం. ►2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు గుణపాఠం చెప్పారు. ►బీఆర్ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోంది. ►బీఆర్ఎస్ వైఫల్యం వల్ల టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయ్యింది. ►అన్నీ నియామకాల పరీక్షల్లో అవకతకవకలు కామన్ అయిపోయాయి. ►ఒక తరం భవిష్యత్తును బీఆర్ఎస్ నాశనం చేసింది. ► తెలంగాణలో వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ►అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది బీజేపీనే ►బీజేపీకి పూర్తి మెజార్టీ ఇచ్చి ఓబీసీ వర్గానికి చెందిన నన్ను ప్రధానిని చేశారు. ►కేంద్ర కేబినెట్లో అత్యధిక మంది బీసీలు మంత్రులుగా ఉన్నారు. ►లోక్‌సభ తొలి దళిత స్పీకర్‌గా బాలయోగిని చేసింది బీజేపీనే. ►ఇదే మైదదానం సాక్షిగా బీసీ ముఖ్యబమంత్రి రాబోతున్నారు ►తెలంగాణలో మార్పు తుఫాన్ కనిపిస్తోంది ►తెలంగాణలో అధికారంలోకి రాగానే బీసీనే ముఖ్యమంత్రి చేస్తాం ►యువతను మోసం చేసిన బీఆర్ఎస్ను సాగనంపాలా.. వద్దా? ►సమ్మక్మ- సారలమ్మకు జై అంటూ ప్రసంగం మొదలు పెట్టిన మోదీ ►బీసీ ఆత్మగౌరవ సభలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా ►ఎల్బీ స్టేడియంతో నాకు సంబంధం ఉంది ►నాటి సభలో నా ప్రసంగం కోసం టికెట్ పెట్టారు ►భారతదేశంలో అది ఒక కొత్త ప్రయోగం ►ఇదే గ్రౌండ్లో ప్రజలు ఆశీర్వదించడంతో నేను ప్రధాని అయ్యాను. ►ఇదే మైదానం సాక్షిగా బీజేపీ బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారు ►తెలంగాణ కోసం ఎంతోమంది ప్రాణత్యాగం చేశారు. ►నీళ్లు నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమించింది. ►తెలంగాణ ఏర్పడ్డాక ప్రజల ఆకాంక్షలను అణగదొక్కారు. ►9 ఏళ్లుగా తెలంగాణలో బీసీ, స్సీ, ఎస్టీ వ్యతిరేక ప్రభుత్వం ఉంది. ►బీసీ ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదు. ►కాంగ్రెస్.. బీఆర్ఎస్కు సీ టీమ్‌గా పనిచేస్తుంది. ►బీఆర్ఎస్ కేవలం తన కుటుంబ సభ్యుల కోసమే పనిచేసింది. ►కాంగ్రెస్, బీఆర్ఎస్లలో కుటుంబ పాలన, అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలే ►కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఎప్పుడూ బీసీలకు పదవులు ఇవ్వలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు అమ్ముడు పోయారు: కిషన్ రెడ్డి ►తమ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు అమ్ముడుపోయారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ►అమ్ముడుపోయే పార్టీ కాంగ్రెస్.. కొనుగోలు చేసేపార్టీ బీఆర్ఎస్. ►బీఆర్ఎస్, కాంగ్రెస్ నియంతృత్వ పార్టీలే.. డీఎన్ఏ ఒక్కటే. ►తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారు. ►తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీ రావాలి. సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో మంగళవారం బీజేపీ బీసీ ఆత్మ గౌరవ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ప్రధానికి బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీపులో మోదీ స్టేడియమంతా కలియతిరిగారు. బీసీ ఆత్మగౌరవ సభలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఈటెల రాజేందర్, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. Live : Shri Narendra Modi BC Aatma Gourava Public Meeting at LB Stadium. https://t.co/Hs18g62m3V — BJP Telangana (@BJP4Telangana) November 7, 2023 కాగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ఇప్పటికే ప్రకటించడం నేపథ్యంలో.. మరో అడుగు ముందుకేసి సదరు బీసీ సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రధాని మోదీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు. బీసీలతోపాటు ఎస్సీ, ఎస్టీ, ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునే చర్యలనూ పేర్కొనవచ్చని అంటున్నారు. కేవలం గంటన్నర సేపట్లోనే ప్రధాని పర్యటన ముగియనుంది. తెలంగాణ మదిలో మన మోదీ! A wave of love and admiration for PM Modi in Telangana!#BCsWithBJP pic.twitter.com/g4tfuRefUj — BJP (@BJP4India) November 7, 2023