సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, పలువురు పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున అందించే కానుకలను సీఎం రేవంత్ పంపిణీ చేశారు.
ఇక, క్రిస్మస్ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘దేశంలో మతసామరస్యానికి పెద్దపీట వేసింది కాంగ్రెస్. అన్ని మతాలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుంది. డిసెంబర్ నెల మిరాకల్ నెల అని ముందే చెప్పా. నేను చెప్పిన మాట నిజమైంది. ఎర్రకోటపై మువ్వెనెల జెండా ఎగిరినప్పుడే దేశంలో మత సామరస్యం పరిడవిల్లుతుంది. మణిపూర్‌లో జరిగిన మారణ కాండ కళ్ల ముందే కనిపిస్తోంది.
మణిపూర్‌కు రాహుల్ గాంధీ వెళ్లి శాంతి నెలకోల్పడానికి ప్రయత్నించారు. దాన్ని కూడా ప్రధాని విమర్శించారు. మాకు బలమైన శక్తి వచ్చేలా బిషప్ లంతా ప్రార్థనలు చేయాలి. ఏకే ఆంటోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ లాంటి వారికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చింది. గుడిలో పూజలు చేసే బ్రాహ్మణులకు, చర్చిలో ప్రార్దనలు చేసే బిషప్‌లకు, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇస్తాం. ఏసుక్రీస్తును ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు అండగా ఉంటాం. మీ సమస్యలు చెప్పుకునేందుకు సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ముళ్ళ కంచలు బద్దలు కొట్టి ప్రజావాణి ప్రారంభించాం’ అని వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: TSRTC: ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment