Christmas celebrations
-
Foula: ఆరున క్రిస్మస్.. 13న న్యూ ఇయర్!!
2025 ఏడాది మొదలై ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా కొత్త తీర్మానాలతో, ఆనందక్షణాలతో బంధుమిత్రుల సమక్షంలో జనమంతా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేసి తమతమ పనుల్లో బిజీ అయిపోయారు. కానీ బ్రిటన్‌లోని ‘ఫౌలా’ద్వీపంలో మాత్రం అత్యంత ఆలస్యంగా అంటే సోమవారం (జనవరి 13) రోజు ఘనంగా కొత్త ఏడాది వేడుకలు జరిగాయి. అందరూ డిసెంబర్ 31 రాత్రి నుంచే సెలబ్రేషన్లు మొదలెట్టి ముగించేస్తే వీళ్లేంటి ఇంత ఆలస్యంగా వేడుకలు చేస్తున్నారని ఆశ్చర్యపోకండి. వాళ్ల దృష్టిలో జనవరి 13వ తేదీనే అసలైన కొత్త ఏడాది. ఎందుకంటే వాళ్లు మనలా ఆధునిక గ్రెగోరియన్ క్యాలెండర్‌ను పాటించరు. ప్రాచీనకాలంనాటి సంప్రదాయ జూలియన్ క్యాలెండర్‌ను మాత్రమే అనుసరిస్తారు. జూలియన్ క్యాలెండర్ స్థానంలో నాలుగు శతాబ్దాల కిందట కొత్తగా గ్రెగరీ క్యాలెండర్ వచ్చిన సంగతి తెల్సిందే. 400 సంవత్సరల క్రితం నాటి 13వ పోప్ గ్రెగరీ కొత్త క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కొత్త క్యాలెండర్ ఆయన పేరిటే తర్వాత కాలంలో గ్రెగోరియన్ క్యాలెండర్‌గా స్థిరపడిపోయింది. కానీ ఫౌలా ద్వీపవాసులు మాత్రం తన ఐలాండ్‌లో వేడుకలను పాత జూలియన్ క్యాలెండర్‌ను అనుసరించి మాత్రమే జరుపుకుంటారు. అందుకే జూలియన్ క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాదిని జనవరి 13వ తేదీన మాత్రమే జరుపుకున్నారు. దీంతో ఆదివారం ద్వీపంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. క్రిస్మస్ను సైతం వాళ్లు జూలియన్ క్యాలెండర్ ప్రకారమే చేసుకుంటారు. అందరూ డిసెంబర్ 25న క్రిస్మస్ చేసుకుంటే వీళ్లు మాత్రం జనవరి ఆరో తేదీన క్రిస్మస్ను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఎక్కడుందీ ఫౌలా? బ్రిటన్‌లోని అత్యంత మారుమూల ద్వీపంగా గుర్తింపు పొందిన ఈ ఫౌలా.. షెట్‌ల్యాండ్ అనే ప్రధాన ద్వీపానికి 16 మైళ్ల దూరంలో ఉంది. ఫౌలా ద్వీపం పొడవు కేవలం ఐదు మైళ్లు. ప్రధాన భూభాగం నుంచి ఇక్కడికి విద్యుత్లైన్ల వ్యవస్థ లేదు. అందుకే ఇక్కడ జనం సొంతంగా విద్యుత్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. పవన విద్యుత్, చిన్నపాటి జల విద్యుత్ వ్యవస్థ, సౌర ఫలకాలతో సౌర విద్యుత్‌ను సమకూర్చుకుంటున్నారు. ప్రధాన ద్వీపసముదాయమైన షెట్లాండ్లోని టింగ్వాల్ విమానాశ్రయం నుంచి ఇక్కడికి విమాన సర్వీసులు ఉన్నాయి. బ్రిటన్‌లోని అత్యంత మారుమూల ద్వీపాల్లో ఒకటైన ఫౌలాలో అత్యంత పురాతన నార్న్ భాషను మాత్రమే మాట్లాడతారు. ఇక్కడి జనాభా కేవలం 40 మంది మాత్రమే. ప్రస్తుతం 36 మంది మాత్రమే ఉంటున్నారు. పని చేయడానికి బయటి నుంచి ఎవరూ రారు. మన పని మనం చేసుకోవాల్సిందే. ప్రకృతిని ఆస్వాదిస్తూనే ఇక్కడి జనమంతా పనుల్లో బిజీగా ఉంటారు. రెండూ అద్భుతమైనవే: రాబర్ట్ స్మిత్ రెండు వారాల వ్యవధిలో రెండు క్రిస్మస్లు, రెండు నూతన సంవత్సర వేడుకలు రావడం నిజంగా బాగుంటుందని 27 ఏళ్ల రాబర్ట్ స్మిత్ వ్యాఖ్యానించారు. విద్యాభ్యాసం కోసం కొంతకాలం షెట్లాండ్ ద్వీపసముదాయంలో ఉన్న రాబర్ట్.. మళ్లీ ఫౌలాకు వచ్చేశారు. అందరు ద్వీపవాసుల మాదిరిగానే ఆయనా అనేక పనులు చేస్తాడు. పడవను నడపడం, నీటి శుద్ధి కర్మాగారంలో పనిచేయడం, టూర్లు, అవసరమైతే ఉత్తరాలు అందించడం అన్ని పనుల్లో పాలు పంచుకుంటాడు. ‘‘ఉరుకుల పరుగుల షెట్లాండ్ లైఫ్‌ను చూశా. ప్రశాంతమైన ఫౌలా జీవితాన్ని గడుపుతున్నా. ఆస్వాదించగలిగే మనసున్న ఫౌలా స్వాగతం పలుకుతోంది. ఇక్కడ అందరం ఒకే కుటుంబంలా నివసిస్తాం. ఎప్పుడూ సంగీతం వింటాం. సాధారణంగా ఏ ద్వీపంలోనైనా వృద్ధులు, మధ్యవయస్కులు ఉంటారు. కానీ ఫౌలాలో ఎక్కువ మంది యువత, చిన్నారులే. గతంలో ఇక్కడి మెజారిటీ జనాభా పక్షుల వేటనే ప్రధాన వృత్తిగా ఎంచుకునేది. పక్షులను కొట్టి తెచ్చి కూర వండుకుని తినేయడమే. ఇప్పుడంతా మారిపోయింది. ఎన్నో వృత్తులు వచ్చాయి. తోటపని, చేపలు పట్టడం, కళాకారునిగా పనిచేయడం ఇలా...’’అని రాబర్ట్ అన్నారు. ‘‘ఇక్కడి వాళ్లు అందరితో కలుపుగోలుగా ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్తాం. ఆనందంగా పాడతాం. ఆడతాం. రాబర్ట్ గతంలో గిటార్ వాయించేవాడు. తర్వాత మాండలీన్ పట్టుకున్నాడు. ఇప్పుడేమో ఫిడేల్ నేర్చుకుంటున్నాడు’అని ద్వీపంలోని మరో వ్యక్తి చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్షంలో క్రిస్మస్
-
ఫ్యాన్స్‌పై లవ్.. అలియా భట్‌ను మించిపోతున్న కూతురు రాహా (ఫోటోలు)
-
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో సినీతారలు సందడి (ఫోటోలు)
-
క్రిస్మస్ వేడుకల్లో YS భారతీ
-
పిల్లలతో సరదాగా వైఎస్ జగన్
-
హైదరాబాద్ లో క్రిస్మస్ వేడుకలు
-
విజయవాడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
తల్లి విజయమ్మతో కలిసి క్రిస్మస్ జరుపుకున్న వైఎస్ జగన్
-
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో స్టార్ హీరోహీరోయిన్స్ (ఫొటోలు)
-
పులివెందుల క్రిస్మస్ వేడుకల్లో వైఎస్ జగన్
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్టమస్ వేడుకలు (ఫొటోలు)
-
క్రిస్మస్ వేడుకల్లో తారకరత్న ఫ్యామిలీ (ఫొటోలు)
-
మొదలైన క్రిస్మస్ సందడి..ముస్తాబైన చర్చ్ లు (ఫొటోలు)
-
అంతరిక్షంలో ఉన్నా మాకూ సెలవు కావాలి
‘సెలవు కావాలి’. పండుగలు, పెళ్లిళ్లు, ముఖ్యమైన సందర్భాల్లో ఉద్యోగి నోట వినిపించే మొట్టమొదటి మాట ఇది. ప్రపంచదేశాలు అన్ని చోట్లా ఇదే వినతి. ఇప్పుడు ఈ విన్నపం భూమిని దాటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికీ చేరింది. క్రిస్మస్, నూతన సంవత్సరం వేడుకల కోసం తాము కూడా విధులకు గైర్హాజరై సెలవు పెడతామని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్(ఐఎస్ఎస్)లోని ఆస్ట్రోనాట్స్, కాస్మోనాట్స్ తెగేసి చెప్పారు. వీళ్ల సెలవు అభ్యర్థనకు ఇప్పటికే ఆమోదముద్ర పడిందోఏమో క్రిస్మస్, కొత్త ఏడాది సంబరాలకు వ్యోమగాములంతా సిద్ధమైపోయారు. ప్రత్యేకంగా క్రిస్మస్, న్యూ ఇయర్ విందు కోసం ఇప్పటికే ప్యాక్ చేసి పంపించిన ఆహారపదార్థాలు తినేందుకు నోరూరుతోందని అక్కడి భారతీయమూలాలున్న అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ చెప్పారు. ఐఎస్ఎస్లోని ఏడుగురు వ్యోమగాముల బృందం క్రిస్మస్, జనవరి ఒకటిన తమ రోజువారీ శాస్త్రీయ పరిశోధనలు, ప్రయోగాలను కాసేపు పక్కనబెట్టి సంబరాల్లో తేలిపోతారని తెలుస్తోంది. తాజాగా ఐఎస్ఎస్కు వచి్చన స్పేస్ఎక్స్ డ్రాగన్ 2,700 కేజీల కార్గోలో వ్యోమగాముల కోసం విడి విడిగా వారి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితుల నుంచి గిఫ్ట్‌లు వచ్చాయి. స్పెషల్ మీల్స్ తింటూ కుటుంబంతో వీడియోకాల్స్ మాట్లాడుతూ వ్యోమగాములు సరదాగా గడపనున్నారు. ఇప్పటికే హాలిడే మూడ్‌ను తెస్తూ సునీత, డాన్ పెటిట్లు శాంటా టోపీలు ధరించిన ఫొటో ఒకటి తాజాగా షేర్చేశారు. బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో ఐఎస్ఎస్కు వచి్చన సునీతా విలియమ్స్ తాము వచ్చిన వ్యోమనౌకలో హీలియం లీకేజీ కారణంగా తిరిగి భూమికి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. నెలల తరబడి అక్కడే ఉండిపోయిన సునీతకు క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు కాస్తంత ఆటవిడుపుగా ఉండబోతున్నాయి. – వాషింగ్టన్ -
ప్రేమ, సామరస్యమే క్రీస్తు బోధనల సారం
న్యూఢిల్లీ: ప్రేమ, సోదరభావం, సామరస్యమే క్రీస్తు బోధనల సారమని, అందరూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరింత ఉత్సాహంతో పనిచేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా(సీబీసీఐ) సోమవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ప్రధాని పాల్గొని, మాట్లాడారు. సమాజంలో శాంతియుత వాతావరణాన్ని దెబ్బతీసి, హింసను వ్యాపింపజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తోటి వారి పట్ల సానుభూతితో వ్యవహరించాలనే భావనను అందరం అలవర్చుకున్నప్పుడు మాత్రమే 21వ శతాబ్దపు ప్రపంచంలో కొత్త శిఖరాలకు చేరుకోగలమన్నారు. జర్మనీలో క్రిస్మస్ మార్కెట్‌పై దాడి, 2019లో శ్రీలంకలో ఈస్టర్ బాంబు దాడులను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ..ఇటువంటి సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరముందని నొక్కిచెప్పారు. కేరళలో జని్మంచిన జార్జి కూవకడ్‌ను పోప్ ఫ్రాన్సిస్ ఇటీల కార్డినల్ ప్రకటించడం మనందరికీ గర్వకారణమన్నారు. దేశంలో కేథలిక్ చర్చ్‌లకు ప్రధాన కేంద్రంగా భావించే సీబీసీఐలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనడం ఇదే మొదటిసారి. -
Christmas 2024: జగద్రక్షకుని జన్మదినం
చీకటిని చీల్చుకుంటూ వస్తున్న సూర్యుడు తన లేత వెచ్చని కిరణాలతో ఆ గ్రామాన్ని నిద్ర లేపాడు. పక్షుల కిలకిలరావాలతో, పట్టణానికి బయలుదేరుతున్న ఎడ్లబండ్ల చప్పుళ్ళతో, గేదెలను తోలుకుంటూ వెళ్తున్న పల్లె పిల్లగాళ్ళ అరుపులతో, నీళ్ళ కోసం బయలుదేరిన అమ్మలక్కల బిందెల చప్పుళ్ళతో దినచర్య ప్రారంభించే ఆ అందమైన గ్రామం ఆరోజు మరింత సందడిగా మారింది.రాత్రంతా తాగుబోతు నాన్న కొట్టిన దెబ్బలకు అల్లాడిపోయి జ్వరంతో మత్తుగా నిద్ర పట్టేసిన సూరి ఈ హడావిడికి ఒక్కసారిగా లేచాడు. ‘అమ్మో! చాలా ఆలస్యమైందే! పండుగ రోజులు కదా, చాలా తొందరగా రావాలి అని నిన్న అమ్మగారు చెప్పారు. ఈరోజు నా పని అయిపోయిందిలే’ అని అనుకుంటూ, కళ్ళు నులుముకుంటూ ‘ఒరేయ్ చద్దన్నమన్నా తిని వెళ్ళరా!’ అని అరుస్తున్న అమ్మ కేకలు కూడా పట్టించుకోకుండా పరుగు పరుగున బయలుదేరాడు. అప్పటికే కారాలు మిరియాలు నూరుతోంది ఆ ఇంటి యజమానురాలు. భయం భయంగా లోపలికి వస్తుండగా, ‘ఆగు!’ అనే మాట విని నిలబడిపోయాడు. అమ్మగారి వంకే చూస్తున్నాడు. ‘అమ్మగారూ! రాత్రంతా జ్వరం..’ అని పరిస్థితిని చెబుదామనే లోపులో దబదబమని బాదింది. ‘పండుగ రోజులు కదా, త్వరగా రావాలి అని చెప్తే లేటుగా వస్తావా?’ అని నోటికొచ్చినట్టు తిట్టింది. అసలే రాత్రి వాళ్ళ నాన్న కొట్టిన దెబ్బల మీద ఈ దెబ్బలు తగలడంతో మరింత బాధపడుతూ పని దగ్గరకు పరుగెత్తాడు. దుఃఖాన్ని ఆపుకోలేక భోరున ఏడ్చాడు. ఓదార్చేవారెవ్వరూ లేరక్కడ.సూరి వాళ్ళ నాన్న రిక్షా తొక్కుతాడు. సాయంత్రం తాగివచ్చి వాళ్ళమ్మను, చెల్లెళ్ళను, సూరిని చితకబాదుతాడు. ప్రతిరాత్రి పస్తే! వాళ్ళమ్మ జబ్బు చేసి నీరసంగా ఉంటుంది. అందుకని సూరిని ఆ ఊళ్ళో డబ్బున్న కాంతారావు ఇంట్లో పనికి పెట్టింది. సూరి ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ఇంట్లో పని చేస్తాడు. వాళ్ళు పెట్టే మిగిలిపోయిన అన్నం, కూరలు తింటూ జీవిస్తున్నాడు. చాకిరి చెయ్యడమే కాకుండా ప్రతిరోజు ఏదో ఒక వంకతో ఆ యజమానురాలు కొట్టే దెబ్బలు, తిట్లు భరిస్తున్నాడు. ఇవన్నీ తలచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఇల్లు చక్కబెడుతున్నాడు. ‘ఒరేయ్ సూరీ ఎంతసేపురా! ఇటురా!’ అనే కేకతో ఉలిక్కిపడి కళ్ళు తుడుచుకొని వెళ్లాడు. కంటకురాలైన యజమానురాలి హెచ్చరికతో బండెడు గిన్నెలు తోమడం మొదలు పెట్టాడు.అవి క్రిస్మస్ పండుగ రోజులు. కాంతారావుగారి ఇల్లంతా సందడే సందడి. ఇల్లంతా పువ్వులతో, కరెంటు దీపాలతో అలంకరించారు. అమ్మగారు, వాళ్ళ పిల్లలు ఖరీదైన బట్టలు, నగలు ధరించారు. పిండివంటల ఘుమఘుమలతో, ఇంటికొచ్చిన బంధువులు, స్నేహితులతో, పిల్లల కేరింతలతో ఇల్లంతా కోలాహలంగా ఉంది. సూరి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. క్షణం తీరిక లేకుండా పని చేస్తూనే ఉన్నాడు. మధ్యమధ్యలో ఈ సందడంతా గమనిస్తూనే ఉన్నాడు. భోజనాల సమయమైంది. అందరూ భోంచేశారు. సూరి ఒక్కడే మిగిలి పోయాడు.పెరట్లో కూర్చుని అమ్మగారి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు. ఇంతలో అమ్మగారి కేక వినిపించింది. ‘రారా సూరీ అన్నం తిందువు గాని’.. వెంటనే ఆత్రంగా వెళ్ళాడు. రాత్రి భోజనం లేదు. ఉదయం లేదు గదా ఇప్పుడు పెట్టే పిండి వంటలు ఆరగిద్దామంటూ తనకు పెట్టిన భోజనం వైపు చూశాడు. ఎంత ఆశతో వెళ్లాడో అంత నిరుత్సాహానికి గురయ్యాడు. మాడు అన్నం, వూడ్చి వూడ్చి వేసిన కూర చూసి తినలేక దుఃఖం పొంగుకు వచ్చింది. ఆకలంతా చచ్చిపోయింది. మంచినీళ్ళు తాగి వెళ్ళి, వారంతా తిన్న గిన్నెలన్నీ తోమి, మిగతా పనులన్నీ చక్కబెట్టి ఇంటికి బయలుదేరాడు. ఒళ్ళంతా హూనమైపోయింది. కళ్ళు తిరుగుతున్నాయి. చడీచప్పుడు లేకుండా ఇంటిలోకి అడుగు పెట్టాడు. అప్పటికే వాళ్ళ నాన్న బీభత్సం సృష్టించాడేమో! చెల్లెళ్ళంతా ఏడుస్తూ చలికి దుప్పట్లు లేక కాళ్ళు ముడుచుకొని వణుకుతూ పడుకున్నారు. తల్లి మంచం మీద మూలుగుతోంది. గుడిసె అంతా చిందరవందర. సర్దిపెట్టే ఓపిక లేక తల్లి వద్ద తాను చిన్న గుడ్డ ముక్క పరచుకుని పడుకున్నాడు. పండగపూట కదా! కొడుకు ఏదైనా తెస్తాడని ఆశించిన తల్లి కుమారుని పరిస్థితి చూసి తల్లడిల్లిపోయింది. సూరి పడుకున్నాడు గాని నిద్ర పట్టడం లేదు. ఏడుపొస్తోంది. అమ్మకు కనబడకుండా ఏడ్వాలనుకున్నాడు కాని, అదిమి పట్టేకొద్ది ఎక్కువైపోయింది. ఒక్కసారిగా సూరి తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తున్నాడు. ‘ఏంట్రా? నీ బాధేమిటో చెప్పమ్మా’ అమ్మ అడుగుతోంది. ఆ రోజు జరిగినదంతా అమ్మకు చెప్పాడు. తల్లి నచ్చచెప్ప ప్రయత్నించింది. తన్ను తాను తమాయించుకొని, ‘అమ్మా! క్రిస్మస్ అంటే ఏంటమ్మా?’ అని అడిగాడు. వాళ్ళమ్మ చెప్పింది. ‘మానవులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు పుట్టినరోజురా’.. ‘అమ్మా! ఆయన గొప్పోళ్ళకేనా దేవుడు? మనలాంటి పేదోళ్ళకు దేవుడు కాదా?’.. ‘లేదు నాయనా! దేవుడు అందరికీ దేవుడే! ఈ లోకంలోని ప్రజలందరి కోసం ఆయన పుట్టాడు. మనలాంటి పేదోళ్ళ బతుకులు బాగుపరచడానికి, చెడ్డవాళ్ళను మంచివాళ్ళుగా చేసి తన రాజ్యానికి చేర్చడానికి వచ్చాడు!’.. ‘అలా అయితే మనకేంటి ఈ పేద బతుకు?’ దుఃఖంతో అన్నాడు సూరి. ‘లేదు నాయనా! అసలైన పేదరికం భౌతికమైనది కాదు. మనలోని ఆత్మకు సంబంధించినది. పాపంలో బందీయైన ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా దరిద్రుడే! ప్రేమ హీనత, క్షమించలేకపోవడం, అహంభావం, ఇతరులను అవమానించడం లాంటివి ఆధ్యాత్మిక పేదరికానికి నిదర్శనాలు. అలాంటి స్థితిలో ఉన్నవారిని ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితికి చేర్చడానికి యేసయ్య కూడా అందరికీ దగ్గరవ్వడానికి పేదవానిగానే వచ్చాడు. బెత్లేహేము గ్రామంలో పశువుల తొట్టెలో పుట్టాడు. ‘అయ్యో! పశువుల తొట్టా? దేవుడు పశువుల తొట్టెలో పుట్టడమేంటమ్మా?’.. ‘ఆయన పశులతొట్టెలో పుట్టాడు కాబట్టే, సామాన్యులైన గొర్రెల కాపరులు ఆయనను మొదట దర్శించుకున్నారు. దేవుడు వారికి ఇంత దగ్గరగా వచ్చినందుకు వారి ఆనందానికి అవధులు లేవు. యేసుక్రీస్తు నజరేతులో పెరిగి పెద్దవాడయ్యాక అనేకమంది రోగులను బాగుచేశాడు, బీదవాళ్ళను, కుష్ఠు రోగులను అక్కున చేర్చుకున్నాడు. కన్నీరు తుడిచి, తన బిడ్డలుగా చేసుకున్నాడు. అంతేకాదు! మనందరి కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. తలలో ముళ్ళు, చేతుల్లో, కాళ్ళల్లో మేకులు, ఒళ్ళంతా కొరడా దెబ్బలు. కడుపులో బల్లెపు పోట్లు, శరీరమంతా మాంసపు ముద్దగా మారి రక్తాన్ని చిందించాడు. దుర్మార్గులు పొందాల్సినవన్నీ ఆ ప్రేమమయుడు తనపై వేసుకున్నాడు. ఈ ప్రాణత్యాగం చేయడానికి పరలోకాన్ని వీడి ఈ లోకానికి వచ్చాడు. మరో గొప్ప సంగతి. చనిపోయి మూడవరోజు తిరిగి లేచాడు’ అని తల్లి అనేక విషయాలు సూరికి తెలిపింది. ‘అయితే ఇకనుండి నేను ఏడ్వను. మా అమ్మగారిని తిట్టను, నాన్నమీద కోపపడను. వీళ్ళందరినీ ప్రేమిస్తాను. ఎన్ని కష్టాలొచ్చినా ఫర్వాలేదు. యేసయ్య నాతో ఉన్నారుగా’ అంటూ ఆ చిన్ని హృదయంలోకి ప్రభువును చేర్చుకున్నాడు. తిట్లకు, తన్నులకు, పస్తులకు సూరి భయపడట్లేదు, ఏడ్వట్లేదు. కొన్ని రోజులు గడిచాయి. తాను పనిచేసే ఇంటి అమ్మగారికి జబ్బు చేసింది. ఆమె పిల్లలంతా ఆమెకు సేవ చేయలేక వెళ్ళిపోయారు. రోజురోజుకీ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆ సమయంలో సూరి ఆమెకు ఎంతో శ్రద్ధతో çసపర్యలు చేయడం మొదలుపెట్టాడు. చావు బతుకుల్లో ఉన్న ఆమెను బతికించాడు. ఆమె కోసం నిద్రాహారాలు లేకుండా ప్రార్థించాడు. డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయేలా ఆమె కోలుకుంది. ఆమె మనస్సంతా కృతజ్ఞతతో నిండిపోయింది. సూరిని దగ్గరకు పిలిపించింది. గట్టిగా కౌగిలించుకొని కన్నీరు కార్చింది. ‘ఒరేయ్ సూరీ! నేనంటే నీకు ఎందుకురా ఇంత ప్రేమ? నిన్ను ఇంతగా బాధలు పెట్టిన నన్ను ఎంత ఆదరించావురా! నా పిల్లలు కూడా నా పరిస్థితిని చూసి నన్ను విడిచి వెళ్ళిపోయారే! నువ్వు మాత్రం నన్ను కంటికి రెప్పలా కాచి మనిషిని చేశావురా’ అని మెచ్చుకుంటుంటే సూరి ‘మా అమ్మగారేనా ఇలా మాట్లాడుతోంది? దేవుడెంత గొప్పవాడు’ అనుకుంటూ దేవున్ని స్తుతించాడు. ‘క్రీస్తు ప్రభువు నాలోకి వచ్చి ఉండకపోతే నేను మిమ్మల్ని ప్రేమించి ఉండేవాణ్ణి కాదు. ఆ యేసయ్య ప్రేమతో పోల్చుకుంటే నేను చూపిన ప్రేమ సముద్రంలో నీటి చుక్క.. మంచినీళ్ళు తెమ్మంటారా?’ అని పైకి లేచాడు. సూరి మాటలకు నిశ్చేష్టురాలైంది. ఔను! బుద్ధిహీనులకు తెలివి కలిగించేది దేవుని వాక్యం. ఎన్ని క్రిస్మస్ పండుగలు వెళ్ళిపోయాయి. దేవుని ప్రేమను ఎంతగా దుర్వినియోగపరచాను. కొంచెం కూడా దేవుని ధ్యాస లేకుండా ఆడంబరాల మీదే మనసు పెట్టి, అసలు ఆశీర్వాదాన్ని కోల్పోయానే! ఈ చిన్న పిల్లవాని ద్వారా దేవుడు నిజంగా నా కన్నులు తెరిచాడు అని దేవునికి తనను తాను అర్పించుకున్నది. ఇంటికి వెళ్ళిన సూరి అమ్మగారిలో వచ్చిన మార్పును తన కుటుంబంతో పంచుకున్నాడు. తెల్లారింది. అమ్మగారింటికి బయలుదేరాడు. ఆమె సాదరంగా సూరిని ఆహ్వానించి కేకు కోయించి, కొత్త బట్టలు ధరింపజేసి, ప్రార్థన చేసింది. ‘అమ్మగారూ! క్రిస్మస్ పండుగ అయిపోయింది కదండీ. మళ్ళీ ఇవన్నీ ఏంటండీ’ అడిగాడు. ‘లేదురా సూరీ! అసలు పండుగ నా జీవితంలో ఇదే! నేను నమ్మిన వారంతా నన్ను మోసం చేశారు. నేను ద్వేషించిన వారు నాకు సహాయం చేసి నిజమైన ప్రేమంటే ఏమిటో చూపించారు’.. ఈ మాటలకు సూరి ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. తన బంధువులు, స్నేహితులు అందరిముందు ‘సూరిని నా కొడుకుగా చేసుకొంటున్నాను. నా తదనంతరం ఈ యావదాస్తికి అతడే వారసుడు. క్రిస్మస్ బహుమానంగా దేవుడు సూరిని నాకు అనుగ్రహించాడు’ అని చెమ్మగిల్లిన కళ్ళతో సూరిని వాటేసుకుంది. ఒక మనిషికి కనువిప్పు కలగడమే నిజమైన పండుగ. క్రైస్ట్, మాస్ అనే రెండు పదాల కలయిక క్రిస్మస్. దీని అర్థం క్రీస్తును ఆరాధించడం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రైస్తవులు క్రీస్తు పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ క్రిస్మన్ జరుపుకుంటారు. క్రీస్తు జననం చరిత్రాత్మకమైనది. సుప్రసిద్ధ చరిత్రకారులు క్రీస్తు చరిత్రను అద్భుతంగా వివరించారు. వారిలో రోమా చరిత్రకారుడు గాయిస్ ప్లినియస్ ఒకడు. ఇతడు రోమా చక్రవర్తి ట్రాజన్ దగ్గర మేజిస్ట్రేట్‌గా క్రీ.శ 98 నుండి 117 వరకు పనిచేశాడు. చక్రవర్తియైన ట్రాజన్‌కు ఇతనికి జరిగిన ఓ సంభాషణ ఆ కాలంలోని క్రైస్తవుల నిబద్ధతలను వెల్లడిచేసింది. ‘క్రైస్తవులు చీకటి పడకముందే ఒక నియమిత సమయానికి కలుసుకొనేవారు. క్రీస్తును దేవునిగా సంబోధిస్తూ పాటలు పాడేవారు. తాము ఎప్పుడూ ఏ దోషము, దొంగతనమును చేయమని, తాము కట్టుబడియున్న పవిత్ర ప్రమాణమును గౌరవిస్తామని తీర్మానించుకున్నారు. తమ మాటను ఎన్నడు అబద్ధముగా మార్చమని, తప్పుడు ప్రమాణము చేయమని చెప్పుకొనేవారు’. పైమాటలను గమనిస్తే యేసుక్రీస్తును అంగీకరించి మారుమనస్సు పొందిన పిదప వారు నమ్మిన వాక్యమునకు దేవుని బిడ్డలు ఏవిధంగా కట్టుబడియున్నారో విశదమవుతుంది.అపొస్తలుడైన పౌలు తన సువార్త యాత్రలో ఒకసారి గ్రీసు దేశమునకు వెళ్ళాడు. గ్రీసు రాజధాని ఏథెన్సు మహానగరం. విశ్వ విజేతగా పేరుపొందిన అలెగ్జాండరు గ్రీకు సామ్రాజ్యాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. ప్రపంచ ప్రఖ్యాత తత్త్వజ్ఞానులు సోక్రటీసు, అరిస్టాటిల్, ప్లేటో ఈ దేశానికి చెందినవారే! అక్కడి ప్రజలు తత్త్వజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. ‘గ్రీసు దేశస్థులు జ్ఞానాన్ని వెదకుచున్నారు’ అని పౌలు ప్రస్తావించుటలో ఆశ్చర్యమేమీ లేదు. ఏథెన్సులో అరీయొపెగు అనే ప్రాంతం ఉన్నది. దానిని అరీసు కొండయని పిలుస్తారు. ఏథెన్సు మహాసభ వారు అక్కడ కూర్చుండేవారు. ఆ పట్టణంలోని ఘనులు, ధనికులు, అధికారులలోని ముఖ్యులు దీనిలో సభ్యులుగా ఉండేవారు. మొదట్లో దేశంలో జరిగే నేరములను ఈ ప్రాంతంలోనే విచారించి, నేరస్థులకు శిక్షలు విధించేవారు. తరువాతి కాలంలో దేశపాలన విషయాలను, రాజనీతి విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను కూడా తర్కిస్తుండేవారు. ఎవరైనా ఒక కొత్త విషయాన్ని చెప్పాలనుకుంటే, ఆ సభకు వెళ్ళి చెప్పాలి. వారు చెప్పిన వాటిలో సత్యం లేకపోతే, తేలు విషాన్ని వారికిచ్చి అక్కడే వారిని చంపేస్తారు. అక్కడ పలికే ప్రతి మాట చాలా జాగ్రత్తగా పలకాలి. అపొస్తలుడైన పౌలు క్రీస్తును గూర్చిన సత్యాన్ని చెప్పడానికి అరీయొపెగు మధ్యన నిలిచి, నిర్భయంగా ప్రకటించాడు. అనేకమందిని ఆలోచింపచేసిన ప్రసంగమది: ‘‘ఏథెన్సు వారలారా! మీరు సమస్త విషయములలో విశేష భక్తి గలవారై ఉన్నట్లు కనబడుచున్నది. నేను మీ పట్టణములో సంచరించుచుండగా నాకొక బలిపీఠము కనబడింది. దానిమీద ‘మాకు తెలియబడని దేవుడు’ అని వ్రాసియుంది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి గలిగి యున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను’’.. తెలియబడని దేవునికి నిర్మించిన బలిపీఠాన్ని గ్రీకు భాషలో ‘అగ్నోస్టిక్ థియోస్’ అంటారు. క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏథెన్సులో ఒక తెగులు వ్యాపించింది. భయంకరమైన తెగులు ద్వారా ప్రజలు చనిపోతున్నారు. ఎన్నో పూజలు, ప్రయత్నాలు చేసినా, పరిస్థితి అదుపులోకి రాలేదు. ఆ సమయంలో అక్కడ ప్రజాదరణ పొందిన ఎపిమెనిడెస్, అరాటస్ అను ఇద్దరు తత్త్వజ్ఞానులు ఉండేవారు. ప్రజలు వారి యొద్దకు వెళ్ళి తమ గోడు వెళ్ళగక్కారు. వచ్చిన తెగులు తొలగిపోవడానికి పరిష్కార మార్గాన్ని చూపాలని అడిగారు.అప్పుడు వారు ఈ విచిత్రమైన సలహాను ఇచ్చారు: ‘మీ శక్తి కొలది కొంతమంది దేవుళ్ళను ఆరాధించుచున్నారు. మీకు తెలియని దేవుళ్ళు కూడా ఉండవచ్చు. బహుశా వారు మీ మీద ఆగ్రహించి ఈ తెగులును పంపియుండవచ్చు. ఈ తెగులు అరికట్టాలంటే మీరు ఒక బలిపీఠమును కట్టి దానికి తెలియబడని దేవుడు అని పేరు పెట్టండి. ఆ దేవుడు శాంతించి తెగులును నిలిపివేయవచ్చు’.. ఆ మాటలను లక్ష్యపెట్టిన ప్రజలు తెలియబడని దేవునికి బలిపీఠం కట్టారు. అక్కడ వారు చేసే ప్రార్థనలు తెలియబడని దేవుని దగ్గరకు వెళ్తున్నాయని భ్రమపడేవారు. సరిగ్గా ఆ ప్రజల ప్రశ్నలకు పౌలు చక్కని సమాధానాలను ఇచ్చాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు విశిష్ట లక్షణాలను కలిగియుంటాడు. వాటిలో మొదటిది: ‘ఆయన సృష్టికర్త’. తన మహిమ కోసం సమస్తాన్ని సృష్టించిన దేవుడు మానవుని తన పోలికలో సృష్టించాడు. మనిషి పరమార్థం సృష్టికర్తను తెలుసుకొని తన గమ్యాన్ని అర్థం చేసుకోవడమే! రెండవది: దేవుడు మనలో ఏ ఒక్కరికీ దూరంగా ఉండువాడు కాదు. గ్రీకులలో కొందరు జ్ఞానులు దేవుడున్నాడు గాని, ఆయన మనుషులను పట్టించుకోడు అని బోధించేవారు. ఆ ఆలోచనను పౌలు ఖండించాడు. దేవుడు మానవుని పట్ల శ్రద్ధ కలిగియుంటాడు. మనిషికి దగ్గరగా ఉండాలనే మనుష్య రూపంలో ఈ లోకానికి ఏతెంచాడు. మూడవది: దేవుడు మనిషి నుండి మార్పును ఆంకాక్షిస్తున్నాడు. ఆ మార్పు హృదయానికి సంబంధించినది. ఇత్యాది విషయాలను తెలియచేయడం ద్వారా పౌలు అనేకులను సత్యం వైపు నడిపించాడు. క్రీస్తు రాక పుడమిని పులకింపచేసింది. తరతరాల నిరీక్షణ ఫలితమే యేసుక్రీస్తు పుట్టుక. క్రీస్తుకు పూర్వం ఎందరో ప్రవక్తలు ఆయన రాకను కాంక్షిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనాలు పలికారు. వారి ప్రవచనాలు తనలో నెరువేర్చుకుంటూ క్రీస్తు మానవ చరిత్రలో ప్రవేశించారు. ఆయన పుట్టినప్పుడు ఇశ్రాయేలు రాజ్యము రోమా పాలనలో ఉంది. దాస్యం, అన్యాయం, అవినీతి ముమ్మరంగా ఉన్నాయి. వాటి నుండి విముక్తి కోసం మెస్సీయా రావాలని ఆశించారు. అయితే క్రీస్తు రాజకీయ స్వాతంత్య్రాన్ని ఇవ్వడానికి రాలేదు. అందరికీ ఆధ్యాత్మిక స్వాతంత్య్రం అనుగ్రహించడానికి వచ్చాడు. ఆ కాలంలోని సుంకపు గుత్తదారుడైన మత్తయి యేసుక్రీస్తు చరిత్రను వ్రాసే భాగ్యాన్ని పొందుకున్నాడు. మత్తయి సువార్త ప్రారంభంలో ఇలా ఉంటుంది. పాతనిబంధన గ్రంథంలో అబ్రాహాముకు దావీదుకు చాలా విశిష్టమైన స్థానం ఉంది. అబ్రాహామును యూదులకు తండ్రిగా పిలిచారు. అతడు విశ్వాసులకు తండ్రి అని పేరు పొందాడు. కల్దీయ దేశాన్ని విడిచి దేవుని పిలుపును బట్టి కనాను దేశానికి వచ్చి దైవ సంకల్పంలో పాలిభాగస్తుడయ్యాడు. అతని కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. ఈ ముగ్గురినీ మూలపురుషులు అని పిలుస్తారు. వీరి సంతానమే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు బానిసత్వం నుండి విడుదల పొంది నలభై సంవత్సరాల అరణ్యయాత్ర తదుపరి యెషువా నాయకత్వంలో కనాను దేశాన్ని చేరుకున్నారు. నాలుగు శతాబ్దాలు న్యాయాధిపతుల పాలనలో ఉన్న ఆ ప్రజలు రాజు పాలన కోసం పట్టుబట్టారు. మొదటి రాజుగా సౌలు, తర్వాత దావీదు వారిని పరిపాలించారు. యేసుక్రీస్తు దావీదు వంశంలోను జన్మించి పాతనిబంధన లేఖనాలను నెరవేర్చారు. యేసుక్రీస్తు పుట్టుక అకస్మాత్తుగా జరిగింది కాదు. అది ప్రవచనానుసారం. క్రీస్తు కన్యకకు జన్మిస్తాడని, కన్య గర్భాన ఈ లోకంలోనికి రావడం ద్వారా ఆయన పరిశుద్ధుడుగా జీవిస్తాడని ఎన్నో యేండ్ల క్రితం ఝెషయా అనే ప్రవక్త ద్వారా ప్రవచించబడింది. పశువుల తొట్టెలో జన్మిస్తాడని యోబు గ్రంథంలోను, బెత్లేహేములో ఉదయిస్తాడని మీకా గ్రంథంలోను, నీతి చిగురుగా వస్తాడని జెకర్యా గ్రంథంలోను స్పష్టంగా ప్రవచించబడ్డాయి. క్రీస్తు జన్మించినప్పుడు నక్షత్రం కనిపిస్తుందని, జ్ఞానులు ఆయన్ను దర్శించుకుంటారని, ఆయనకు ముందుగా యోహాను అనే భక్తుడు వస్తాడనే ప్రవచనాలు చాలా సంవత్సరాలకు ముందే ప్రవచించబడ్డాయి. యేసుక్రీస్తు జన్మించినప్పుడు మొదటిగా సామాన్యమైన గొర్రెల కాపరులు ఆయన్ను దర్శించుకున్నారు. ‘మీరు భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు’ అని దూత ద్వారా గొర్రెల కాపరులకు వర్తమానం అందింది. ఆనాడు క్రీస్తు పుట్టిన చోట ఇప్పుడు ఓ గొప్ప దేవాలయాన్ని చూస్తాం. బెత్లేహేము సందర్శించే ప్రతి ఒక్కరూ ఆ దేవాలయంలో క్రీస్తు పుట్టినచోట ఉన్న నక్షత్రాన్ని చూసి వస్తారు. దానిని చర్చ్ ఆఫ్ నేటివిటీ అని పిలుస్తారు. బేత్లెహేము అనగా రొట్టెల గృహం. ఇది ప్రపంచ నగరాలతో పోలిస్తే చాలా చిన్నది. కాని, జగద్రక్షకుడైన యేసుక్రీస్తు జన్మించడం ద్వారా దీనిని గురించి తెలియని వారు లేరు. జస్టిన్ మార్టర్ అనే చరిత్రకారుడు క్రీ.శ 160లో వ్రాసిన పుస్తకాల ఆధారంగా, 3వ శతాబ్దికి చెందిన చరిత్రకారులు ఆరిజన్, యుసేబియస్లు తెలిపిన వివరాల ప్రకారం బేత్లెహేములో ఉన్న ఈ స్థలం క్రీస్తు జన్మస్థలంగా నిర్ధారించబడింది. కాన్స్టెంటెయిన్ తల్లియైన సెయింట్ హెలీనా ఆధ్వర్యంలో క్రీ.శ 339 మే 31న ఈ నిర్మాణం పూర్తయింది. బైబిల్‌ను లాటిన్ బాషలోనికి అనువదించిన చరిత్రకారుడు సెయింట్ జెరోమ్ కూడా క్రీ.శ 384 సంవత్సరంలో ఇక్కడే సమాధి చేయబడ్డాడు. క్రీస్తు ప్రభువు జన్మించిన పవిత్రస్థలాన్ని అందరూ దర్శించాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించారు. క్రీ.శ 614లో పర్షియా దేశస్థులు, ఇశ్రాయేలును ఆక్రమించుకుని ప్రతి దేవాలయాన్ని నేలకూల్చారు. వారు ఈ చర్చ్ ఆఫ్ నేటివిటీని మాత్రం కూల్చలేదు. కారణమేమిటంటే, ఆ చర్చ్‌లో యేసుక్రీస్తు పాదాల దగ్గర సాష్టాంగ నమస్కారం చేసిన జ్ఞానులలో ఒకరు పర్షియా దేశస్థుడు కావటమే! 6వ శతాబ్దానికి చెందిన జస్టీవియస్ అనే చక్రవర్తి ఈ చర్చిని మరింత అందంగా రూపొందించాడు. ఈ చర్చిలో మరింత ప్రాముఖ్యమైనది స్టార్ ఆఫ్ బేత్లెహేము. ఆ ప్రాంతంలోనే సర్వాధికారియైన యేసుక్రీస్తు సమస్త మానవాళిని రక్షించడానికి నరావతారి అయ్యాడు. బేత్లెహేము నక్షత్రం ప్రక్కనే యేసుక్రీస్తు పవళించిన పశువుల తొట్టె నమూనా కూడా ఉంది. అక్కడ కన్యయైన మరియ యేసుకు జన్మనిచ్చిన స్థలం అనే అక్షరాలు చెక్కబడియున్నవి. యేసుక్రీస్తు జన్మించిన తదుపరి ఆయన్ను వెదకుచూ తూర్పు దేశపు జ్ఞానులు ఇశ్రాయేలుకు వచ్చారు. యూదుల రాజు అంతఃపురంలో జన్మిస్తాడని భావించి హేరోదు రాజునొద్దకు వెళ్ళి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆరాధించడానికి వచ్చామని తెలియచేశారు. వారి మాటలు హేరోదు రాజును కలవరపరచాయి. శాస్త్రులను పిలిచి క్రీస్తు జన్మించే స్థలం ఏమిటని ప్రశ్నించాడు. వారు లేఖనాలను పరిశీలించి ఆయన బ్లెత్లేహేములో జన్మిస్తాడని తెలియచేశారు. మీరు వెళ్ళి ఆయన్ను ఆరాధించి తిరిగి నా యొద్దకు రండి అని హేరోదు జ్ఞానులను పంపివేశాడు. వారు వెళ్ళి బాలుడైన యేసును కనుగొని, ఆయన ముందు సాగిలపడి బంగారాన్ని, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా సమర్పించారు. వారు దేవుని చేత బోధించబడినవారై మరియొక మార్గమున తమ దేశములకు వెళ్ళారు. బంగారము క్రీస్తు దైవత్వమునకు, రాజరికమునకు, సాంబ్రాణి ఆయన ఆరాధనీయుడని, బోళము ఆయన మానవుల నిమిత్తం పొందబోయే శ్రమలకు సాదృశ్యమని బైబిల్ పండితులు వివరించారు. క్రిస్మస్ ప్రేమ పండుగ. నిజమైన ప్రేమ విశిష్టతను తెలిపే పండుగ. ప్రేమ అంటే తీసుకోవడం కాదు, ఇవ్వడం అనే ధన్య సత్యాన్ని అర్థం చేసుకొనే ప్రతి ఒక్కరూ క్రిస్మస్ను ఆత్మానుసారంగా పాటిస్తారు. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’– (యోహాను 3:16). నిత్యజీవితంలో ప్రతి మనిషిలోనూ కొన్ని భావోద్వేగాలు ఉంటాయి. వీటన్నింటిలోనూ మనకు ఎక్కువగా వినిపించేది ‘ప్రేమ’. పవిత్రమైన ఈ పదం ఈ రోజులలో చాలా ప్రమాదకరముగా మారిపోయింది. శాశ్వత ప్రేమ, నిజమైన ప్రేమ మానవ ఊహలకు మించినది. ఆ ప్రేమ ‘ప్రేమాస్వరూపియైన’ దేవుని నుంచి మాత్రమే రావాలి. క్రీస్తు ప్రభువు కేవలం ప్రేమిస్తున్నానని చెప్పడమే కాదు ఆ ప్రేమను సిలువలో మరణించుట ద్వారా ఋజువుపరచాడని పౌలు రోమాలో సంఘానికి వ్రాసిన ఉత్తరంలో తెలియచేశాడు. మనమింకను పాపులమై ఉండగానే, శత్రువులమై యుండగానే, బలహీనులమై యుండగానే క్రీస్తు యుక్తకాలమున మనకొరకు మరణించెను. దేవుడు తన ప్రేమను మానవుల పట్ల వ్యక్తపరచి సమసమాజ నిర్మాణానికి చక్కని మార్గాన్ని ఉపదేశించారు. ‘నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు’ అనే జీవనసూత్రాన్ని క్రీస్తు ఉపదేశించారు. ప్రతియేటా డిసెంబర్ 26వ తేదీని ‘బాక్సింగ్ డే’ అని పిలుస్తారు. క్రిస్మస్ తర్వాతి రోజున అవసరతలో ఉన్నవారికి బహుమతులు పంచుతారు. ఎవరి స్థాయిని బట్టి వారు వారికి తెలిసిన వారికి ఇబ్బందుల్లో ఉన్నవారికి కానుకలు పంపి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ‘నశించిన దానిని వెదకి రక్షించుటకు నేను వచ్చాను’ అని క్రీస్తు పలికిన మాటను క్రైస్తవులు అత్యధికంగా విశ్వసిస్తారు. పాపపు అంధకారంలో చిక్కి, నిత్యశిక్షను మూటకట్టుకున్న మానవుని రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. యేసు అనుమాటకు రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విడిపించును గనుక ఆయన రక్షకుడు అని బైబిల్ తెలియచేస్తున్న విషయం. మానవాళి ఎదుర్కొంటున్న ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానమై యుంటాడు. ‘ఓ దేవా! నన్ను అసత్యము నుండి సత్యములోనికి, చీకటి నుండి వెలుగులోనికి, మరణము నుండి జీవములోనికి, పాపము నుండి పరిశుద్ధమైన జీవితంలోనికి నడిపించు’ అని మానవుడు ప్రార్థిస్తే.. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు సత్యమై, వెలుగై, జీవమై, పరిశుద్ధుడుగా తన ఉనికిని వెల్లడిచేశాడు. వెలిగింపబడిన హృదయం నుండి జాలువారిన ఓ మధురమైన పాట ఇది. ‘కొనియాడ తరమే నిను.. కోమల హృదయ.. కొనియాడ తరమే నిను. తనరారు దినకరు బెను తారలను మించు... ఘన తేజమున నొప్పు కాంతిమంతుడ నీవు’.. సర్వలోకంబుల బర్వు దేవుడువయ్యు.. నుర్వి స్త్రీగర్భాన నుద్భవించితి నీవు.. కొనియాడ తరమే నిను’సాక్షి పాఠకులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ‘మానవులను రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు పుట్టిన రోజురా’.. ‘అమ్మా! ఆయన గొప్పోళ్ళకేనా దేవుడు? మనలాంటి పేదోళ్ళకు దేవుడు కాదా?’‘ఆయన సృష్టికర్త’. తన మహిమకోసం సమస్తాన్ని సృష్టించిన దేవుడు మానవుని తన పోలికలో సృష్టించాడు. మనిషి పరమార్థం సృష్టికర్తను తెలుసుకొని తన గమ్యాన్ని అర్థం చేసుకోవడమే!సర్వాధికారియైన యేసుక్రీస్తు సమస్త మానవాళిని రక్షించడానికి నరావతారి అయ్యాడు. బేత్లెహేము నక్షత్రం ప్రక్కనే యేసుక్రీస్తు పవళించిన పశువుల తొట్టె నమూనా కూడా ఉంది. -
ఇందిరమ్మ ఇళ్లలో దళిత క్రైస్తవులకు ప్రాధాన్యత
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో దళిత క్రైస్తవులకు ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ పదవుల్లోనూ వారికి తగిన స్థానం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో అన్ని మతాలను సమానంగా చూడడమే తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. ఎల్బీస్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేకు కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రజలకు డిసెంబర్ ఒక అద్భుతమైన మాసం. ఇదే నెలలో ఏసుక్రీస్తు పుట్టారు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన ఈ నెలలోనే వచ్చిoది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎంతో ఉత్సాహాన్నిచ్చే నెల కూడా ఇదే. ఎందుకంటే పార్టీ నేత సోనియాగాంధీ పుట్టిన రోజు కూడా ఈ నెలలో ఉంది. మా ప్రభుత్వం ఏర్పాటైంది కూడా డిసెంబర్లోనే’అని గుర్తుచేశారు. క్రిష్టియన్ మిషనరీల సేవలు అద్భుతం నిన్ను నువ్వు ప్రేమించుకో, పొరుగువారిని ప్రేమించు అన్న ఏసుక్రీస్తు బోధనలు అనుసరిస్తే జీవితం ప్రశాంతంగా గడిచిపోతుందని సీఎం అన్నారు. మానవ సమాజానికి అత్యంత ప్రధానమైన విద్య, వైద్యం అందించటంలో క్రైస్తవ మిషనరీలు ప్రభుత్వాలతో పోటీ పడుతున్నాయని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ పదవుల్లోనూ దళిత క్రైస్తవులకు అవకాశం కల్పిస్తామని, ఆసక్తి ఉన్నవాళ్లు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు వివరాలు ఇవ్వాలని సూచించారు. సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల లబి్ధదారులను ఎంపిక చేస్తామని, వారిలో దళిత క్రైస్తవులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా కమిటీల్లో వారి కోటా తప్పకుండా వారితోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, పొంగులేటి పాల్గొన్నారు. -
సెమీ క్రిస్మస్ వేడుకలు
-
ఫ్రెండ్లీ బైబిల్ చర్చ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
Anna Lezhneva: అన్నా లెజినోవా... ఇదొక డిఫరెంట్ యాంగిల్.. అనాథలతో సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
దుబాయ్‌లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు
దుబాయ్‌లో ఘనంగా క్రిస్మస్ సంబరాలు జరిగాయి. యూఏఈలో బ్రదర్ సామ్యూల్ రత్నం నీలా ఆధ్వర్యంలో డేరా క్రీక్ ధోవ్ క్రూయిజ్‌లో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవులు, ఇతర మతస్థులు, వారి కుటుంబాలతో కలిసి వేడుకలను జరుపుకున్నారు. . ఇందులో భాగంగా క్రైస్తవ సంఘాల క్వయర్తో కలిసి అందరూ పాటలు, ప్రార్థనలతో అలరించారు. బ్రదర్ అరవింద్ వుడ్స్-సాక్సోఫోన్, యేసు,మేరి జ్యోతి బృందం వారు క్రిస్మస్ కేరల్స్తో కచేరితో అలరించారు. ఈ కార్యక్రమంలో దుబాయ్‌లోని వివిధ సంఘాల పాస్టర్స్, సంఘ పెద్దలతో పాటు పాస్టర్లు జాన్ ప్రసాద్, జైకుమార్ రబ్బి తదితరులు హాజరయ్యారు. -
Celebrities Christmas Celebrations Photos: క్రిస్మస్ రోజు రెడ్ అండ్ హాట్‌గా మెరిసిన తారలు..
-
రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలు
గుణదల (విజయవాడ తూర్పు)/కర్నూలు కల్చరల్/డాబాగార్డెన్స్ (విశాఖ)/ : ప్రపంచశాంతిని కాంక్షించిన శాంతిదూత.. కరుణామయుడు.. ఏసుక్రీస్తు జన్మించిన పర్వదినం పురస్కరించుకుని సోమవారం రాష్ట్రవ్యాప్తంగా చర్చిలన్నీ జనసంద్రంగా మారాయి. లక్షలాది మంది భక్తులు ప్రార్థనలతో పరవశించిపోయారు. ప్రభువు చూపిన మార్గంలో పయనించాలంటూ బిషప్‌లు, పాస్టర్లు సందేశాన్నిచ్చారు. ప్రసిద్ధ క్రైస్తవ ఆధ్యాత్మిక కేంద్రం విజయవాడలోని గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో బాలయేసును దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పశువుల పాకలో పడుకోబెట్టిన బాలయేసు స్వరూపానికి సాగిలపడి మొక్కులు చెల్లించుకున్నారు. పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు భక్తులనుద్దేశించి మాట్లాడారు. సమిష్టి దివ్యబలి పూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. ఆలయానికి వచ్చిన భక్తుల కోసం గురువులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంబరాన్నింటిన సంబరాలు.. మరోవైపు.. విజయవాడ నగర వ్యాప్తంగా కూడా క్రిస్మస్ సంబరాలు అంబరాన్నంటాయి. పలు ప్రముఖ చర్చిల్లో సోమవారం ఉదయం సర్వమానవాళి సుఖ శాంతులతో ఉండేలా చూడాలని దైవకుమారునికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పటమట సెయింట్ పాల్ కథెడ్రల్ చర్చి, సెయింట్ పాల్స్ బసిలికా చర్చి, గాంధీజీ మున్సిపల్ హైస్కూల్ ఎదురుగా ఉన్న సెయింట్ పాల్ సెంటినరీ చర్చిలో తెల్లవారుజాము నుంచి ఆరాధనా కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో విశ్వాసులు హాజరయ్యారు. వన్‌టౌన్ తారాపేటలోని పురాతన సెయింట్ పీటర్స్ చర్చి, సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చిలో ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించారు. ఇక విశాఖ నగరంలోని సెయింట్ ఆంథోనీ చర్చి, ట్రినిటీ లూథరన్ చర్చి, జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ రక్షణగిరి పునీత పేతురు చర్చి, బాప్టిస్ట్ చర్చిల్లో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. క్రీస్తు స్తుతి గీతాలు భక్తుల హృదయాలను పరవశింపజేశాయి. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న చర్చిల్లోనూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కర్నూలులోని బిషప్ చర్చిలో రెవరెండ్ చౌరప్ప, సీఎస్ఐ చర్చిలో పాస్టర్ రెవరెండ్ వరప్రసాద్, కోల్చ్ చర్చిలో పాస్టర్ రెవరెండ్ అనిల్‌కుమార్ సామ్యేల్, రెవరెండ్ జీవన్‌రావు సందేశం వినిపించారు. యేసును గుండెల్లో నింపుకుని పొరుగు వారిని ప్రేమిస్తూ ఆపన్న సమయంలో చేతనైన సహాయ, సహకారాలందించడమే నిజమైన క్రిస్మస్ అన్నారు. నంద్యాలలోని హోలీక్రాస్ కెథడ్రల్ చర్చిలో బిషప్ రైట్ రెవరెండ్ ఐజక్ వరప్రసాద్, జోసెఫ్ బాబు, హోలీక్రాస్ కెథడ్రల్ పాస్టరేట్–2 (ఆల్‌సెయింట్ చర్చి)లో రెవరెండ్ విజయ్‌కుమార్, డీనరీ చైర్మన్ ఇమ్మానియేల్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
పులివెందులలో సీఎం క్రిస్మస్ వేడుకలు
పులివెందుల: క్రిస్మస్ పర్వదినం పురస్కరించుకుని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందులలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా మూడో రోజైన సోమవారం ఉదయం సీఎం ఇడుపులపాయ ఎస్టేట్ నుంచి హెలికాప్టర్ ద్వారా భాకరాపురం హెలిప్యాడ్, అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా పులివెందుల పట్టణానికి చేరుకున్నారు. ఉ.9.30 గంటలకు సీఎస్ఐ చర్చి ప్రాంగణానికి చేరుకుని అక్కడ హాజరైన వారిని ఆప్యాయంగా, చిరునవ్వుతో పలకరించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం తన బంధువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్.. ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏటా క్రిస్మస్ రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిస్తుందన్నారు. అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలు తనకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన ప్రార్థించారు. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తరిస్తున్నానని.. ఎప్పటికీ మీ హృదయాల్లో ప్రియమైన నాయకుడిగా సుస్థిర స్థానాన్ని పొందుతానన్నారు. అనంతరం.. ముఖ్యమంత్రి జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. 2024 నూతన సంవత్సర చర్చి క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఆ తర్వాత చర్చి నుంచి రోడ్డు మార్గాన సీఎం బయల్దేరి వైఎస్సార్సీపీ నేత నల్లచెరువుపల్లె రవి ఇంటికెళ్లి నూతన దంపతులు మంజ్రేకర్రెడ్డి, రేణుకారెడ్డిలను ఆశీర్వదించారు. ఇక ఉ.11.07 గంటలకు సీఎం జగన్ అక్కడ నుంచి బయల్దేరి 11.15 గంటలకు భాకరాపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడారు. ప్రజల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. మ.12.19 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి మైదుకూరులోని జిల్లా వక్ఫ్‌బోర్డు చైర్మన్ దస్తగిరి నివాసంలో ఆయన కుమారుడు, ఇద్దరు కుమార్తెల వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులు.. ఇక క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, కుటుంబ సభ్యులు వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, ఆత్మీయులు, మిత్రులు, పుర ప్రజలు పాల్గొన్నారు. సీఎం వెంట ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ డి. సుధ, జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, ఆర్డీఓ వెంకటేశులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఉండాలి సీఎం వైఎస్ జగన్ సాక్షి,అమరావతి: నిస్సహాయులపై కరుణ, సాటివారిపై ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఆ కరుణామయుని ఆశీస్సులు, దీవెనలు ప్రజలపై ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అని సోమవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
భారీగా చేరి.. బారులు తీరి..!
మెదక్: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో సోమవారం క్రిస్మస్ సంబరాలు వైభవంగా జరిగాయి. మెదక్ పట్టణంలోని సుమారు 600 ఎకరాల చర్చి ప్రాంగణం జనంతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి మూడులక్షల మంది భక్తులు తరలివచ్చారని అంచనా. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే ప్రార్థనలు మొదలయ్యాయి. చలితీవ్రతను కూడా లెక్కచేయకుండా భక్తులు యేసయ్య దీవెనల కోసం బారులుతీరారు. ఈ సందర్భంగా బిషప్ కె.పద్మారావు దైవసందేశం ఇచ్చారు. శాంతిద్వారానే సమసమాజ స్థాపన జరుగుతుందని పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ క్రీస్తును ఆరాధించాలని, విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రతిసమస్యకూ పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. ప్రభువు చూపిన మార్గంలో నడుస్తూ సుఖసంతోషాలతో విరాజిల్లాలంటూ ప్రార్థనలు చేశారు. అంతకుముందు చర్చి వందో యేటా అడుగు పెట్టిన సందర్భంగా రూపొందించిన కేలండర్‌ను ఆవిష్కరించారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ‘కల్వరి’లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు హఫీజ్‌పేట్(హైదరాబాద్): మియాపూర్ కల్వరి టెంపుల్లో సోమవారం వైభవంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు మూడు లక్షలమంది భక్తులు తరలివచ్చి యేసుక్రీస్తు ప్రార్థనలు చేశారు. కల్వరి టెంపుల్ వ్యవస్థాపకుడు డాక్టర్ సతీశ్‌కుమార్ భక్తులకు క్రీస్తు జననం గురించి వివరించి, ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా క్రీస్తు నాటక ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. టెంపుల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 100 అడుగుల క్రిస్మస్ ట్రీ ఆకట్టుకుంది. దీంతో ట్రీ వద్ద సందర్శకులు పెద్దఎత్తున ఫొటోలు దిగడానికి ఆసక్తి చూపారు. -
కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
Christmas 2023 Celebrations: దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు (ఫొటోలు)
-
రాష్ట్ర ప్రజలందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు: సీఎం జగన్
-
Live: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
-
ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
వైఎస్సార్ కడప జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
Live Updates.. 3:28PM. సోమవారం, Dec 25, 2023 ►వైఎస్సార్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగిసింది. కడప ఎయిర్‌పోర్టు నుంచి గన్నవరానికి సీఎం బయల్దేరారు. 12:40PM, సోమవారం, Dec 25, 2023 ► మైదుకూరు చేరుకున్న సీఎం జగన్ ► వైఎస్సార్ జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ దస్తగిరి నివాసానికి చేరుకున్న సీఎం జగన్ ► ఆయన కుమారుడు, కుమార్తెల వివాహ వేడుకలో పాల్గొన్న సీఎం జగన్ ► నూతన దంపతులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ► పులివెందుల పర్యటన ముగించుకుని మైదుకూరుకు బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ► కాసేపట్లో వక్ఫ్ బోర్డు చైర్మన్ దస్తగిరి కుమారుడు, కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ ► 2024 నూతన సంవత్సర క్యాలెండర్‌ను సీఎం జగన్, వైఎస్ విజయమ్మ ఆవిష్కరించారు. వారితోపాటు ఎంపీ అవినాష్ రెడ్డి, డిప్యూటి సీఎం అంజాద్ బాషా, మంత్రి అదిమూలపు సురేష్ ఉన్నారు. ► ప్రార్థనల అనంతరం సీఎం జగన్, వైఎస్ విజయమ్మ కేక్ కట్ చేశారు. ► సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. ► సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్. ►పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్, కుటుంబ సభ్యులు. ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం జగన్ పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు) మూడో రోజు పర్యటన ఇలా.. ‘మూడో రోజు జిల్లా పర్యటనలోభాగంగా.. సోమవారం ఉదయం ఇడుపులపాయ ఎస్టేట్ నుండి హెలికాప్టర్ ద్వారా బాకరపురం హెలిప్యాడ్, అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా పులివెందుల టౌన్ చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఉదయం 9.30 గంటలకు సిఎస్ఐ చర్చి ప్రాంగణం చేరుకుని.. అక్కడికి హాజరైన వారిని ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇక్కడికి విచ్చేసిన బందువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్బంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలను, ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రతి ఏడాది ఈ క్రిస్మస్ పర్వదినం రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు, బందుగణం, స్నేహితులతో.. కలిసి పండుగ వేడుకలో పాల్గొనడం తన మనసుకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సొంత ఊరిలో.. అందరితో కలిసి క్రిస్మస్ ప్రార్థనలు చేయడం తనకు ఎంతో ఆనందాన్ని, సంతృప్తినిచ్చిందని, అలాగే.. మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దేవుని చల్లని దీవెనలేలు తనకు ఎల్లవేళలా అందాలని కోరుకుంటున్నానని ప్రార్థించిన ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాసేవలో తరిస్తున్నానని.. ఎప్పటికీ మీ హృదయాల్లో ప్రియమైన నాయకుడిగా సుస్థిర స్థానాన్ని పొందగలనని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసిన ముఖ్యమంత్రి.. 2024 చర్చి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న ముఖ్యమంత్రి తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతమ్మ లతో పాటు.. వైఎస్ ప్రకాష్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి తదితర బంధువర్గాలు, ఆత్మీయులు, మిత్రులు, పురప్రజలు వేడుకలో పాల్గొన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే డా.డి. సుధా, తదితరులు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, పాడా ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పలువురు జిల్లాస్థాయి అధికారులు, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు తదితరులు) -
విద్యుత్ అలంకారాలతో మెరిసిపోతున్న చర్చిలు..
-
ముస్తాబైన మెదక్ చర్చి
-
Merry Christmas 2023: దివిలోను.. భువిలోనా... సంబరం క్రిస్మస్ పర్వదినం
క్రీస్తు పుట్టుక సర్వ సృష్టికి పర్వదినం.. మనుజ కుమారుడిగా ఆ దేవాది దేవుడే ఈ భూతలంపైకి అరుదెంచిన అపురూప ఘట్టం. సర్వ మానవాళికి రక్షణ సౌభాగ్యం. ప్రతి ఒక్కరికి దేవుడు అందించిన శుభదినం. ► పరలోకం పరవశించిన వేళ మానవాళి రక్షణకు యేసు జననం అనివార్యమయినప్పుడు అది విశ్వవేడుకగా మారిపోయింది. రెండు వేల సంవత్సరాల క్రితం ఆ దేవాదిదేవుడే నరరూపిగా అరుదెంచేందుకు సిద్ధపడ్డాడు. నశించిపోతున్న మానవులందరికి తనని తాను బలి అర్పణగా అర్పించుకునేందుకు సిద్ధపడ్డ కరుణామయుని జననం కోసం అటు పరలోకం ఇటు భూలోకం సమాయత్తమయ్యాయి. దైవ సంకల్పం నెరవేర్చేందుకు పరలోక దూతాళి దిగివచ్చింది. గలిలయలోని నజరేతు గ్రామంలో దావీదు వంశస్థుడైన యోసేపునకు ప్రదానం చేయబడిన కన్యయైన మరియ వద్దకు పరలోకం నుంచి ముందుగా శుభవార్త తీసుకువచ్చారు. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఆ దేవాది దేవుని కృపపొందిన నీవు ఒక కుమారుని కంటావు.. ఆ శిశువు గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడతాడు ఆయన రాజ్యం అంతం లేనిదై ఉంటుంది. ఇదంతా పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతుంది కాబట్టి నీవు భయపడాల్సిన పనిలేదు. సర్వోన్నతుని శక్తి నీకు తోడుగా ఉంటుందని అభయమిచ్చాడు. మరియతో పాటు దేవదూత యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై ఇదంతా దేవుని సంకల్పంతో జరుగుతుంది కాబట్టి నీ భార్యను చేర్చుకొనుటకు సందేహింప వద్దని, పుట్టబోవు శిశువు తన ప్రజలను వారి పాపాల నుంచి రక్షిస్తాడు కాబట్టి యేసు అని నామకరణం చేయాలని చెబుతాడు. ఈ విధంగా మానవ ప్రమేయం లేకుండా పరమ దేవుడు పరిశుద్ధాత్మ శక్తి తో మరియ ద్వారా అవని మీద అవతరించడానికి మార్గం సుగమం అయింది. ► భూలోకం మైమరచిపోయిన వేళ యేసు పుట్టుక సమయంలో యోసేపు మరియను తీసుకుని తన సొంత గ్రామమైన బెత్లెహేముకు బయలుదేరతాడు. నిండు చూలాలైన మరియకు స్థలం లేకపోవడం వలన ఓ పశువు పాకే ప్రభు జన్మస్థలమైంది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఓ సత్రములో పరుండి యుండుట మీరు చూచెదరన్న ప్రవచనం ఆ విధంగా నెరవేరింది. ఆ రాత్రి ఊరి వెలుపల గొఱె -
క్రిస్మస్ ప్రార్థనల్లో సీఎం జగన్
సాక్షి కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా రెండో రోజు ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇడుపులపాయలో ఉదయం 9.10 గంటల ప్రాంతంలో తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ బరువెక్కిన హృదయంతో ఘాట్ ప్రాంగణంలో అందరినీ పలుకరిస్తూ ముందుకు కదిలారు. నివాళులర్పించిన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలోని దివంగత వైఎస్సార్ సమాధి వద్ద పలువురు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. సీఎం జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ ఉదయాన్నే ఘాట్ వద్దకు చేరుకుని పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేశారు. వైఎస్సార్ సోదరులు వైఎస్ రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్ సు«దీకర్‌రెడ్డి, సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతీరెడ్డి, వైఎస్ జగన్ సోదరులు వైఎస్ సునీల్‌రెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, నగర మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, చక్రాయపేట మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, మంగళగిరి వైఎస్సార్ సీపీ మహిళా నేత బొమ్మారెడ్డి సునీత, కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ సిద్దార్థ కౌశల్, జేసీ గణేష్‌కుమార్, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్య సలహాదారు రాజోలి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి ఇడుపులపాయలోని చర్చిలో జరిగిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. సీఎం జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, అత్తమ్మ ఈసీ సుగుణమ్మ, సతీమణి వైఎస్ భారతీరెడ్డి, బావమరిది ఈసీ దినేష్‌రెడ్డి, సోదరుడు వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ సునీల్‌రెడ్డి, చిన్నాన్న, పెద్దనాన్నలు వైఎస్ సుధీకర్‌రెడ్డి, వైఎస్ రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ తదితరులతోపాటు వైఎస్ కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెవరెండ్ ఫాదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మూడు దశాబ్దాలుగా ఆనవాయితీ ప్రతి క్రిస్మస్కు ముందురోజు కుటుంబ సభ్యులు, బంధువులు కలుసుకోవడం ఎప్పటినుంచో కొనసాగుతోంది. ఇడుపులపాయలోని చర్చి వద్ద ›ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి శుభాకాంక్షలు తెలియచేయడం సంప్రదాయంగా వస్తోంది. ఇదే క్రమంలో సీఎం జగన్ బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులను కలుసుకుని ఆప్యాయంగా పలుకరిస్తూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. -
Christmas Celebrations Photos: ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఐహెచ్ఎంఐలో క్రిస్మస్ వేడుకలు
-
క్రిస్మస్ ఎనర్జీ
క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కు సంబంధించి బాలీవుడ్ సెలబ్స్ సందడి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. పాత, కొత్త అనే తేడా లేకుండా తారల క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి. తారలలో కొందరు తమ క్రిస్మస్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. క్రిస్మస్ తన ఫేవరెట్ ఫెస్టివల్ అని చెబుతోంది బాలీవుడ్ కథానాయిక జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ‘క్రిస్మస్కు సంబంధించి బాల్యజ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. పిల్లలకు బాగా నచ్చే పండగ ఇది. నా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎక్కువగా బహ్రెయిన్‌లో జరిగాయి. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అక్కడే. చిన్నప్పుడు క్రిస్మస్కు ముందురోజు రాత్రి బొమ్మల దుకాణంలో అందమైన బార్బీ బొమ్మను చూశాను. అది నాకు బాగా నచ్చింది. అదేరోజు అర్ధరాత్రి ప్రార్థనల తర్వాత శాంటా క్లాజ్ నుంచి అచ్చం అలాంటి బొమ్మే అందింది. ఓ మై గాడ్, శాంటా ఈజ్ సో కూల్ అనుకున్నాను’ అంటూ గత జ్ఞాపకాల్లోకి వెళ్లింది ఫెర్నాండేజ్. ‘క్రిస్మస్ ఎనర్జీ’ పేరుతో క్రిస్మస్ జ్ఞాపకాల ఫోటోలను సోషల్ మీడియా లో షేర్ చేయడంలో ముందుంటుంది శ్రద్ధా కపూర్. -
క్రిస్మస్ సందర్భంగా గుణదలలో ప్రత్యేక ప్రార్థనలు
-
LB Stadium: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నగరంలోని ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, పలువురు పాల్గొన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తరఫున అందించే కానుకలను సీఎం రేవంత్ పంపిణీ చేశారు. ఇక, క్రిస్మస్ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘దేశంలో మతసామరస్యానికి పెద్దపీట వేసింది కాంగ్రెస్. అన్ని మతాలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తుంది. డిసెంబర్ నెల మిరాకల్ నెల అని ముందే చెప్పా. నేను చెప్పిన మాట నిజమైంది. ఎర్రకోటపై మువ్వెనెల జెండా ఎగిరినప్పుడే దేశంలో మత సామరస్యం పరిడవిల్లుతుంది. మణిపూర్‌లో జరిగిన మారణ కాండ కళ్ల ముందే కనిపిస్తోంది. మణిపూర్‌కు రాహుల్ గాంధీ వెళ్లి శాంతి నెలకోల్పడానికి ప్రయత్నించారు. దాన్ని కూడా ప్రధాని విమర్శించారు. మాకు బలమైన శక్తి వచ్చేలా బిషప్ లంతా ప్రార్థనలు చేయాలి. ఏకే ఆంటోనీ, ఆస్కార్ ఫెర్నాండెజ్ లాంటి వారికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రాధాన్యత ఇచ్చింది. గుడిలో పూజలు చేసే బ్రాహ్మణులకు, చర్చిలో ప్రార్దనలు చేసే బిషప్‌లకు, ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇస్తాం. ఏసుక్రీస్తును ఆదర్శంగా తీసుకుని పేద ప్రజలకు అండగా ఉంటాం. మీ సమస్యలు చెప్పుకునేందుకు సచివాలయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ముళ్ళ కంచలు బద్దలు కొట్టి ప్రజావాణి ప్రారంభించాం’ అని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: TSRTC: ప్రయాణీకులకు గుడ్‌న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన -
Christmas 2023: క్రిస్మస్ ట్రీ థీమ్ ఏంటి?
క్రిస్మస్ కాంతులు సమీపించాయి. బెంగళూరులో 100 అడుగుల నిటారుగా ఇండియాలోనే ఎత్తయిన క్రిస్మస్ ట్రీ వెలిసింది. క్రిస్మస్ వచ్చిందంటే ఇంటింటా స్త్రీలు, పిల్లలు క్రిస్మస్ ట్రీని అలంకరించేందుకు ఉత్సాహపడతారు. క్రిస్మస్ ట్రీని అనేక థీమ్లతోఅలంకరించవచ్చు. క్రిస్మస్ ట్రీ కథనూ ఈ సారి అనువైన థీమ్‌లను తెలుసుకుందాం. క్రిస్మస్ అంటే ప్రపంచమంతా నక్షత్రాలు పూసే వేళ. కేకులు సువాసనలు వెదజల్లే వేళ. కానుకలు రిబ్బన్ ముక్కల్లో అందంగా ప్యాక్ అయ్యే వేళ, శాంటా కోసం పిల్లలు ఎదురు చూసే వేళ, ప్రతి ఇంట్లో క్రిస్మస్ చెట్టు చిగురించే వేళ. ఏసుక్రీస్తు జన్మదినాన జగతి అంతా రంగులను హత్తుకుంటుంది. కురిసే మంచును కేరింతలతో కోస్తుంది. చర్చ్ గంటలు గణగణమోగుతాయి. స్తోత్రగీతాలు హోరెత్తుతాయి. కొవ్వొత్తులు రెపరెపలాడతాయి. ప్రేమ, త్యాగం, కరుణ... మనిషిని కాపాడేవి ఇవే కదా. ఇలాంటి పర్వదినంలో అలంకరణ ఎలా మిస్ అవుతాము? క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ వేళ ప్రతి ఇంటిపై క్రిస్మస్ స్టార్ వెలుగుతుంది. అలాగే క్రిస్మస్ చెట్టు కూడా కొలువుదీరుతుంది. జన సంస్కృతి నుంచి మెల్లగా పండుగలోకి వచ్చిన చిహ్నం ఇది. శీతల దేశాలలో శీతాకాలం కడు దుర్భరంగా ఉంటుంది. జీవేచ్ఛ అడుగంటుతుంది. అందుకని అప్పటి ప్రజలు పచ్చటి పైన్ లేదా ఫర్ చెట్టు కొమ్మలను తెచ్చి ఇంటి బయట వాటిని అలంకరించేవారు. ఇది పాజిటివ్ వైబ్రేషన్స్‌ను తెస్తుందని భావించేవారు. క్రీస్తు జన్మదినం కూడా శీతాకాలంలో వస్తుంది కాబట్టి ఈ అలంకరణ మెల్లగా ఒక దేశం నుంచి మరో దేశానికి పాకి క్రిస్మస్తో జత కలిసింది. క్రిస్మస్ ట్రీని సతత హరిత జీవనానికీ, జీవితేచ్ఛకూ చిహ్నంగా భావిస్తారు. పచ్చగా వర్థిల్లమనే కామన క్రిస్మస్ ట్రీ. క్రిస్మస్ పండగనాడు ఒక చర్చిలో ఏసు ప్రభువు విగ్రహం ఎదుట అందరూ ఖరీదైన కానుకలు పెడుతుంటే ఒక పేద బాలుడు ఒక పచ్చటి మొక్కను పెట్టాడట. ఆ మొక్క వెంటనే బంగారు కాంతులీనిందట. అప్పటి నుంచి నిరాడంబరమైన ఆరాధనకు గుర్తుగా క్రిస్మస్ ట్రీ వచ్చిందని ఒక కథ. ముఖ్యమైన రంగులు నాలుగు క్రిస్మస్ ట్రీ అలంకరణలో నాలుగు రంగులు కనపడతాయి. తెలుపు రంగు– ఇది స్వచ్ఛతకు గుర్తు. కురిసే మంచుకు కూడా. అందుకే క్రిస్మస్ ట్రీలో పత్తిని తెల్లదనానికి ఉపయోగిస్తారు. ఎరుపు రంగు– ఇది క్రీస్తు రక్తానికి, త్యాగానికి చిహ్నం. శాంటా కూడా ఈ రంగు దుస్తులనే ధరిస్తాడు. ఆకుపచ్చ రంగు– ఇది క్రీస్తు సజీవతను గుర్తు చేస్తుంది. బంగారు రంగు– ఇది సంపదకు, మానవాళికి బహుమతిగా దక్కిన ఏసు మార్గానికి గుర్తు. ఒకప్పుడు ఫర్, పైన్ చెట్ల కొమ్మలను తెచ్చే క్రిస్మస్ ట్రీని తయారు చేసేవారు. ఆ తర్వాత చైనా నుంచి కృత్రిమ చెట్లు వచ్చాయి. కేవలం క్రిస్మస్ ట్రీల కోసమే అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా దేశాలలో 25 రకాల పైన్, ఫర్ చెట్లను సాగు చేస్తున్నారు. ఇవి ఆరడుగుల ఎత్తు పెరగడానికి ఎనిమిది నుంచి పన్నెండేళ్లు పడతాయి. ఎన్నో థీమ్‌లు సంప్రదాయ క్రిస్మస్ చెట్టును అలంకరించడంలో కొత్తదనం కోసం రకరకాల థీమ్‌లు కూడా వచ్చాయి. మన వీలును బట్టి ఆ థీమ్‌ను ఎంచుకోవచ్చు. ఇంటికి వచ్చిన వారిని ఆశ్చర్యపరచవచ్చు. ► అండర్ ద సీ: అంటే గవ్వలు, జలకన్యలో, సొరచేపలు, తాబేళ్లు... ఇలాంటి రకరకాల బొమ్మలతో అలంకరించవచ్చు ► రెయిన్ బో: అంటే ఇంద్రధనుస్సులోని ఏడు రంగులు ఒక్కో దొంతరగా కిందనుంచి పై వరకూ వచ్చేలా ఆయా రంగు కాగితాలను, రిబ్బన్లను, లేదా క్రిస్మస్ బాల్స్ లేదా బెల్స్‌ను కట్టొచ్చు ► ట్రావెల్: విహారం థీమ్‌తో మీనియేచర్ బ్యాగులు, వాహనాలు, ఏరోప్లేన్లు, టికెట్లు, మైలు రాళ్ల బొమ్మలు.. ఇవి ఉపయోగించాలి ► జలపాతం: క్రిస్మస్ ట్రీ నుంచి జలపాతాలు జారుతున్నట్టు బ్లూ రిబ్బను పాయలు పాయలుగా వేలాడగట్టాలి ఏ బెలూన్: ఇది ఈజీ థీమ్. కొమ్మ కొమ్మకు మంచి మంచి బెలూన్లు రకరకాల సైజులవి కట్టడమే. ► చాక్లెట్లు: పిల్లలను ఆకర్షించేలా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయాలంటే క్యాండీలు, చాకెట్లు, పిప్పరమెంట్లు, జెమ్స్ ప్యాకెట్లు... కొమ్మ కొమ్మలో దూర్చడమే. ► ఎర్ర పూలు: మన దగ్గర దొరికే ఎర్రరంగు పూలు గులాబీలు కావచ్చు, చామంతులు కావచ్చు, మందారాలు కావచ్చు... వీటితో క్రిస్మస్ ట్రీని అలంకరిస్తే ఆ లుక్కే వేరు. ఇవి కొన్ని సూచనలు. వీటిని అందుకొని మీ సొంత థీమ్‌తో ఈ క్రిస్మస్ను కళకళలాడించండి. హ్యాపీ క్రిస్మస్. -
విజయవాడ: సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ (ఫోటోలు)
-
22న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం తరఫున ఈనెల 22న ఎల్బీ స్టేడియంలో నిర్వహించే క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. కాగా, రాష్ట్రమంతా ఈ వేడుకలను నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ.కాంతి వెస్లీ వెల్లడించారు. ప్రభుత్వం ఏటా ఆనవాయితీగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తోందని ఆమె వివరించారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆహ్వానాలు కూడా పంపుతున్నట్లు వెల్లడించారు. -
ప్రపంచంలోని 10 అత్యంత ప్రసిద్ధ చర్చిలు (ఫొటోలు)
-
Ukraine Russia War: రష్యా కాల్పుల విరమణ
కీవ్: ఉక్రెయిన్‌లో ఈ వారాంతంలో 36 గంటలపాటు కాల్పుల విరమణ పాటించాలని రష్యా అధినేత పుతిన్ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్ భూభాగంలో ఎలాంటి దాడులు చేయొద్దని గురువారం పేర్కొన్నారు. రష్యాలో ఆర్థోడాక్స్ క్రిస్మస్ సెలవు నేపథ్యంలో పుతిన్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. ప్రాచీన జూలియన్ క్యాలెండర్ ప్రకారం రష్యన్ ఆర్థోడాక్స్ చర్చి ఆధ్వర్యంలో ప్రతిఏటా జనవరి 7వ తేదీన క్రిస్టమస్ వేడుకలు జరుగుతాయి. ఉక్రెయిన్‌లోని కొందరు ఇదే రోజు క్రిస్మస్ జరుపుకుంటారు. కాగా, ఉక్రెయిన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ పునరుద్ఘాటించారు. కానీ, చర్చలు జరగాలంటే ఒక షరతు విధించారు. ఉక్రెయిన్ నుంచి తాము స్వాధీనం చేసుకున్న భూభాగాలను రష్యాకు చెందిన భూభాగాలుగానే జెలెన్స్కీ ప్రభుత్వం అంగీకరించాలని తేల్చిచెప్పారు. ఈ ఒక్క షరతుకు ఒప్పుకుంటే ఉక్రెయిన్‌తో చర్చలకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టంచేశారు. తూర్పు, దక్షిణ ఉక్రెయిన్‌లోని పలు కీలక ప్రాంతాలను రష్యా బలప్రయోగంతో ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. డొనెట్స్క్, లుహాన్స్క్, జపొరిఝాజియా, ఖేర్చన్లలో రష్యా సైన్యం పాగా వేసింది. -
చికాగోలో సీయోను తెలుగు చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
చికాగోలోని ప్రవాస తెలుగువారు క్రిస్మస్ వేడుకలను సీయోను తెలుగు చర్చిలో అత్యంత వైభవంగా సీనియర్ పాస్టర్ ఇంటర్నేషనల్ స్పీకర్ మాథ్యూస్ వట్టిప్రోలు ఆధ్వర్యంలో జరుపుకున్నారు. యేసు ప్రభు పుట్టుకను జ్ఞాపకం చేస్తూ చేసిన చిన్నపిల్లల డాన్స్, యూత్ డాన్స్‌లు, కారల్ సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. శాంతాక్లాస్ చిన్న పిల్లలకు బహుమతులు అందచేశాడు. యేసు ప్రభు రెండువేల సంవత్సరాల క్రితం బెత్లహేంలో జన్మించినది స్కిట్‌గా ఆవిష్కరించిన రీతి ఈ వేడుకలకు హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా పాస్టర్ మాథ్యూస్ వట్టిప్రోలు మాట్లాడుతూ సీయోను తెలుగు చర్చి రెండు కుటుంబాలతో ప్రారంభమై ఇప్పుడు అరవై ఐదు కుటుంబాలతో అమెరికాలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న తెలుగు చర్చిగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందాన్ని కలుగచేస్తోందన్నారు. క్రిస్మస్ సందేశాన్ని అందచేస్తూ యేసు ప్రభు జననం ఎందుకు అవసరమో, మానవాళికి అది ఎంత అధ్బుతమనేది వివరించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటున్న వారందరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. -
నిఖిల్ సింహా క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో తారల సందడి (ఫొటోలు)
-
Hyderabad: వైభవంగా క్రిస్మస్ వేడుకలు (ఫొటోలు)
-
మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
మెదక్‌జోన్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చిలో ఘనంగా ప్రార్థనలు జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం కిటకిటలాడింది. తెల్లవారు జామున 4.30 గంటలకు మొదటి ఆరాధనతో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రెవరెండ్ బిషప్ సాల్మన్‌రాజ్ భక్తులకు దైవ సందేశం అందించి.. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసు క్రీస్తు జననం మానవాళి అంతటికీ శుభదినం అన్నారు. భక్తులు ఏసు చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఉదయం 10 గంటలకు భక్తులకు చర్చి దర్శనానికి అనుమతిచ్చారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులను ఆశీర్వదించేందుకు 15 మంది గురువులను అందుబాటులో ఉంచామని రెండో ఆరాధనలో దైవ సందేశమిచ్చిన చర్చి ప్రెసిబిటరీ ఇన్చార్జ్ జార్జ్ ఎబనైజర్రాజ్ తెలిపారు. ఈ ఉత్సవాలకు డయాసిస్ పరిధిలోని 13 జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. చర్చిలో ఆలపించిన భక్తిగీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. క్రిస్మస్ సందర్భంగా కల్వరి టెంపుల్‌కు భారీగా హాజరైన భక్తులు అన్ని మతాలకు సీఎం కేసీఆర్ ప్రాధాన్యం: మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ అన్ని మతాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని, అందులో భాగంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ గిఫ్టు ప్యాకెట్లు అందజేశారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మతాలను గౌరవిస్తూ రాష్ట్ర శ్రేయస్సును కోరుకుంటున్న సీఎం కేసీఆర్‌కు ఏసుప్రభువు ఆశీస్సులు ఉండాలన్నారు. రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలను దేశానికి అందించాలనే ఉదేశంతో బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. ఆమెతోపాటు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. -
కాకినాడలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్ (ఫోటోలు)
-
విశాఖ జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు (ఫోటోలు)
-
క్రిస్మస్ వెలుగులు (ఫోటోలు)
-
క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైన మెదక్ చర్చి
మెదక్‌జోన్: మెదక్ జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. చర్చి ప్రాంగణంలో శాంతాక్లాస్, క్రిస్మస్ట్రీ, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో విద్యుత్ కాంతుల్లో చర్చి వెలుగులీనుతోంది. చర్చిలో ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటలకు మొదటి ఆరాధనను బిషప్ సాల్మన్‌రాజ్, రెండో ఆరాధనను ఉదయం 9.30 గంటలకు చర్చి ప్రెసిబెటరీ ఇన్‌చార్జి్జ జార్జ్ ఎబినేజర్ ప్రారంభిస్తారు. వేడుకలకు తెలంగాణతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఇంగ్లండ్ దేశస్తులు కూడా వస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. -
క్రిస్మస్ వేడుకల్లో యాంకర్ శ్యామల.. శాంటాక్లాస్లా మెరిసిన ముద్దుగుమ్మ (ఫొటోలు)
-
ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు..
సాక్షి, మైదరాబాద్: నగరంలోని ఎల్బీ స్టేడియంలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. పలువురికి అవార్డులను అందజేయడంతో పాటు క్రైస్తవులతో కలిసి సీఎం కేసీఆర్ డిన్నర్ చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీలు వాణీదేవి, రాజేశ్వర్‌రావు, నగర మేయర్ విజయలక్ష్మి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజుసాగర్, నగర సీపీ సీవీ ఆనంద్ పాల్గొన్నారు. పూల ఆంథోనికి మంత్రి కొప్పుల ఆహ్వానం.. రాంగోపాల్‌పేట్: క్రిస్మస్ వేడుకలకు హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ బిషప్, కార్డినల్ పూల ఆంథోనిని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. మంగళవారం ఎస్పీ రోడ్‌లోని బిషప్ హౌజ్‌లో ఆయనను మంత్రి కలిశారు. -
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైఎస్ జగన్
-
నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
సాక్షి, ప్రకాశంజిల్లా: దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులు రాజీవ్, రోహితలను సీఎం జగన్ ఆశీర్వదించారు. జిల్లాకు వచ్చిన సీఎంకు ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. క్రిస్మస్ సందర్భంగా మంగళవారం సాయంత్రం విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనీటి విందులో సీఎం జగన్ పాల్గొంటారు. ఇందుకోసం సాయంత్రం 5.30 గంటలకు ఏప్లస్ కన్వెన్షన్‌కు సీఎం జగన్ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం ఆయన తిరిగి తాడేపల్లికి వెళ్తారు. -
ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు: కొప్పుల
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): ఎల్బీ స్టేడియంలో ఈనెల 21న క్రి స్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం వివిధ శాఖల అధికారులతో కలిసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రి స్మస్ వేడుకలను తిలకించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. కాగా, ఈ వేడుకల్లో పాల్గొనాలని మెథడిస్ట్ బిషప్ ఎంఏ డేనియల్ను కొప్పుల ఈశ్వర్ ఆహ్వానించారు. ఈ మేరకు అబిడ్స్ చాపల్ రోడ్డులోని బిషప్ హౌస్‌కు మంత్రి హాజరై ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ వేడుకల్లో సీఎం కేసీఆర్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. క్రైస్తవుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలపట్ల బిషప్ డేనియల్ సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజుసాగర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, మైనార్టీ కార్పొరేషన్ ఎండీ క్రాంతి వెస్లీ, చర్చి ఫాదర్లు పాల్గొన్నారు. -
భట్టిని ఓర్వలేకనే ఎమ్మెల్యేలను కొన్న కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో దళిత వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా ఎన్నుకుంటే సీఎం కేసీఆర్ ఓర్వలేకపోయారని.. భట్టికి సీఎల్పీ నేత హోదా ఉండకుండా చేసేందుకే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దేశంలో దళితులకు సీఎంలుగా, కేంద్ర మంత్రులుగా కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించిందని చెప్పారు. దళితుడిని అధ్యక్షుడిని చేసే దమ్ము దేశంలోని ఏపార్టీకి ఉందని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గేను ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. శనివారం గాంధీభవన్ ఆవరణలో దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. రేవంత్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దళితులపై కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమ, అభిమానానికి మల్లికార్జున ఖర్గేనే ఉదాహరణ అని చెప్పారు. దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ పేదలకు భూములు పంచితే బీఆర్ఎస్ వాటిని గుంజుకుంటోందని.. బీజేపీ దీన్ని చోద్యం చూస్తోందని రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత క్రిస్టియన్లకు కచ్చితంగా రిజర్వేషన్లు కల్పిస్తామని.. ప్రతీ మండలంలో ఒక క్రిస్టియన్ çశ్మశానవాటికను ఏర్పాటు చేసే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల కోసమే రాహుల్ పాదయాత్ర సాగిస్తున్నారన్నారు. బీఆర్ఎస్కు వేసే ఓటు పరోక్షంగా మోదీకే చేరుతుందని.. బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన పోరాడుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, చిన్నారెడ్డి, మల్లు రవి, వేం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంకోసారి ఇలా మోసం చేయకు: బన్నీపై నిహారిక కామెంట్
Allu Arjun: క్రిస్మస్ వేడుకులను మెగా హీరోలంతా ఒకేచోట జరుపుకున్నారు. శనివారం రాత్రి జరిగిన వేడుకల్లో రామ్‌చరణ్-ఉపాసన, చైతన్య-నిహారిక దంపతులు, వరుణ్‌తేజ్, వైష్ణవ్‌తేజ్, సాయిధరమ్ తేజ్‌తో పాటు చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుష్మితా ఒకే చోట హాజరై సందడి చేశారు. వీరందరూ కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సెలబ్రేషన్స్‌లో నిహారిక, అల్లు అర్జున్ శాంటాక్లాజ్‌గా మారినట్లు కనిపిస్తోంది. నిహారిక.. చెర్రీకి గిఫ్టులిచ్చి సర్ప్రైజ్ చేసింది. 'ఎవరికీ తెలియకుండా, ఏ అనుమానం రాకుండా ఇంట్లో బహుమతులను దాయడం ఎంత కష్టమో పక్కనపెడితే నీకు సీక్రెట్ శాంటాగా ఉండటం నాకిష్టం చరణ్ అన్న.. అలాగే ఎంతో ఓపికగా నాటునాటు పాటకు స్టెప్పులు నేర్పించినందుకు థ్యాంక్స్' అని రాసుకొచ్చింది. బన్నీ కోసం చెప్తూ.. 'ఇదిగో ఇక్కడుంది నా శాంటా.. సినిమా ప్రమోషన్లతో ఎంత బిజీగా ఉన్నా కూడా నాకోసం ఎన్నో బహుమతులు పట్టుకొచ్చాడు. థాంక్యూ బన్నీ అన్నా.. నెక్స్ట్ టైం మాత్రం ఇలా మోసం చేయొద్దే..' అని అల్లు అర్జున్‌తో దిగిన ఫొటోను షేర్ చేసింది. ఇంతకీ నిహారిక మోసం చేయొద్దు అనడానికి కారణం ఏమై ఉంటుంది? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. బహుశా బన్నీ ఈసారి ఏ గిఫ్టూ ఇవ్వలేదేమోనని కామెంట్లు చేస్తున్నారు. -
శాంతి సౌభ్రాతృత్వాలకు ప్రతీక క్రిస్మస్
గుణదల (విజయవాడ తూర్పు): క్రిస్మస్ పండుగ శాంతి సౌభ్రాతృత్వాలకు ప్రతీక అని, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు బోధించిన శాంతి మార్గంలో నడుచుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. విజయవాడలోని నోవోటెల్ హోటల్లో శనివారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ దంపతులు క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా పౌరులందరూ సోదర భావంతో మెలగాలని కోరారు. ఒకరికొకరు శాంతి సమాధానాలతో నడుచుకున్నపుడే సమాజం పురోగమిస్తుందన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రకారం అన్ని మతాలు ఒక్కటేనన్న మార్గాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. అనంతరం కేక్ కట్‌చేసి, ప్రజలందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్, పలు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రజలందరికీ మంచి జరగాలి
పులివెందుల: రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరగాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా శనివారం మూడో రోజు ఆయన వైఎస్సార్ జిల్లా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా అవ్వా తాతలు, అక్కచెల్లెమ్మలు, ప్రతి సోదరుడు, స్నేహితుడు, బంధువులు, కుటుంబ సభ్యులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం 9.15 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి పులివెందులలోని సీఎస్ఐ చర్చికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పాస్టర్ ఆనందరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తల్లి విజయమ్మతో కలిసి కేక్‌ను కట్ చేశారు. సీఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించారు. అంతకు ముందు సీఎస్ఐ చర్చి న్యూ కాంప్లెక్స్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీఎస్ఐ చర్చి పాస్టర్ ఆనందరావు వైఎస్ విజయమ్మ రచించిన ‘కీర్తనల జ్ఞాన అన్వయం’ గ్రంథాన్ని సంఘ సభ్యులకు పంపిణీ చేశారు. వైఎస్ విజయమ్మ తన జీవిత అనుభవసారంగా రచించిన ఈ గ్రంథంలోని అంశాలను అందరూ తెలుసుకుని నడుచుకోవాలని పాస్టర్ సూచించారు. క్రిస్మస్ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కేక్ తినిపిస్తున్న మాతృమూర్తి వైఎస్ విజయమ్మ ఈ కార్యక్రమాల అనంతరం సీఎం జగన్ కడప విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి విజయవాడ బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్సార్ సోదరి విమలమ్మ, వైఎస్సార్ సోదరుడు రవీంద్రనాథరెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, వైఎస్ ప్రమీలమ్మ, వైఎస్ మాధవి, డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పాల్గొన్నారు. -
రాజమండ్రిలో అట్టహాసంగా క్రిస్మస్ వేడుకలు
-
పశ్చిమ గోదావరి జిల్లాలో అట్టహాసంగా క్రిస్మస్ వేడుకలు
-
క్రిస్మస్ వేడుకలు.. ప్రత్యేక ప్రార్థనల్లో భక్తులు
-
క్రీస్తు జననం.. లోకమంతా పావనం
-
క్రీస్తు జనన వేళ ప్రపంచవ్యాప్తంగా వేడుకలు
-
మానవ రూపంలోని దైవత్వానికి ప్రతీక క్రీస్తు జీవితం
-
స్పెషల్ ఎడిషన్ 24 December 2021
-
నాలుగో వేవ్ నడుస్తోంది.. జాగ్రత్త!
న్యూఢిల్లీ: ప్రస్తుతం ప్రపంచంలో కరోనా నాలుగో వేవ్ ఉధృతి కనిపిస్తోందని, ఈ సమయంలో భారత్‌లో కోవిడ్ నిబంధనలను నిర్లక్ష్యం చేయవద్దని ప్రజలను కేంద్రం శుక్రవారం హెచ్చరించింది. ముఖ్యంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల పేరిట కోవిడ్ నిబంధనల అతిక్రమణ చేయవద్దని కోరింది. తక్షణమే టీకాలు తీసుకోవడం, కోవిడ్ సమయంలో పాటించాల్సిన పద్ధతులు(కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్– సీఏబీ) పాటించడం, అనవసర ప్రయాణాలు మానుకోవడం చేయాలని సూచించింది. ఇప్పటికీ ఇండియాలో డెల్టానే డామినెంట్ వేరియంట్ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ భార్గవ తెలిపారు. ఏరకమైన వేరియంట్ సోకినా ఒకటే చికిత్స అందించాలన్నారు. ఇంతవరకు దేశంలో 358 ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయని, వీటిలో 183 కేసులను విశ్లేషించగా అందులో 121 కేసులు విదేశీ ప్రయాణికులవని తెలిపింది. 183 కేసుల్లో 91 శాతం మంది టీకా రెండు డోసులు తీసుకున్నారని, ముగ్గురైతే బూస్టర్ డోసు తీసుకున్నారని వివరించింది. వీరిలో 70 శాతం మందిలో ఒమిక్రాన్ సోకినా లక్షణాలు కనిపించలేదని తెలిపింది. ప్రస్తుతం ప్రపంచ పాజిటివిటీ రేటు 6.1 శాతం వద్ద కదలాడుతోంది. దేశీయంగా కేరళ, మిజోరాంలో జాతీయ సగటు కన్నా అధిక పాజిటివిటీ నమోదవుతోందని కేంద్రం వెల్లడించింది. దేశం మొత్తం మీద 20 జిల్లాల్లో(కేరళలో 9, మిజోరాంలో 8)పాజిటివిటీ రేటు 5– 10 శాతం మధ్య ఉందని తెలిపింది. ఒమిక్రాన్ ముంచుకొస్తున్న తరుణంలో ప్రైవేట్ వైద్య రంగం తమ వంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది. కరోనాపై పోరుకు 18 లక్షల ఐసోలేషన్ బెడ్స్, 5 లక్షల ఆక్సీజన్ సపోర్టెడ్ బెడ్స్, 1.39 లక్షల ఐసీయూ బెడ్స్ సిద్ధంగా ఉంచారు. ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్2లో భాగంగా 50 శాతం నిధులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు అందించామని, వీటితో ఏర్పాట్లు చేస్తున్నాయని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు. యూపీలో రాత్రి కర్ఫ్యూ ఈనెల 25 నుంచి ఉత్తరప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. పెళ్లిళ్లలాంటి కార్యక్రమాలకు 200కు మించి హాజరు కారాదని తెలిపారు. రోడ్లపై తిరిగేవారికి మాస్కు తప్పనిసరి చేశారు. ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రాలకు వచ్చేవారికి కరోనా టెస్టులు చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు, ముంబైలో రాత్రిపూట ఐదుగురి కన్నా ఎక్కువమంది గుమిగూడడంపై నిషేధం విధించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఈ నియమం అమల్లోకి వస్తుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6గంటల వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుంది. అదేవిధంగా ఇన్డోర్ ఫంక్షన్లలో 100 మంది లేదా హాలు సామర్ధ్యంలో 50 శాతం కన్నా ఎక్కువమంది, అవుట్ డోర్ కార్యక్రమాల్లో 250 మంది లేదా సమావేశ ప్రాంత మొత్తం సామర్ధ్యంలో 25 శాతం కన్నా ఎక్కువ హాజరు కాకూడదని ప్రభుత్వం ఆదేశించింది. జార్ఖండ్‌లోని రాంచీలో జనం రద్దీ -
Telangana: న్యూ ఇయర్ వేడుకులపై ఆంక్షలు విధించాలన్న హైకోర్టు
-
వేడుక చూడొద్దు.. నియంత్రించండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు వేగంగా వ్యాప్తిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల తరహాలో రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా వేడుకలను నియంత్రించాలని స్పష్టం చేసింది. ఎక్కడా జనం గుమిగూడకుండా రెండు, మూడు రోజుల్లో తగిన ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ టి.తుకారాజీలతో కూడిన ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మరోసారి విచారించింది. ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతున్నాయని, క్రిస్మస్, నూత న సంవత్సరం, సంక్రాంతి సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం ఉందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ, రాజకీయ, సాంప్ర దాయ కార్యక్రమాల్లో కరోనా నియంత్రణ నిబంధ నలు పాటించడం లేదని, మాస్కులు ధరించడం లేదని, భౌతిక దూరం పాటించడం లేదని తెలి పారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం స్పందించింది. ఎక్కడికక్కడ పరీక్షలు చేయండి: ‘ఢిల్లీ, మహారాష్ట్రలు వేడుకలను నియంత్రిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశాయి. ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులతో ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా విమానాశ్రయాల్లో నిర్వహి స్తున్న తరహాలో రాష్ట్ర సరిహద్దులు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలి. కరోనా నియంత్రణకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై గత నెల 21న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయాలి. తీసుకున్న చర్యలపై జనవరి 4లోగా సమగ్ర నివేదిక సమర్పించండి..’ అని ధర్మాసనం ఆదేశించింది. చదవండి: తెలంగాణలో రికార్డ్: తొలి ముస్లిం మహిళా ఐపీఎస్ సలీమా -
ఏపీ మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్ మస్ వేడుకలు
-
సిటీలో కలర్‌ఫుల్ క్రిస్మస్
-
కరోనా టీకా అందరికీ అందాలి
వాటికన్ సిటీ: కరోనా టీకాపై పేటెంట్ హక్కులు ఎవరికి ఉన్నప్పటికీ.. అది ప్రజలందరికీ అందాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న వారికి, వైరస్ బాధితులకు తొలుత టీకా అందేలా ప్రభుత్వాలు కృషి చేయాలని విన్నవించారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పోప్ ఇటలీలో ఉన్న వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి సందేశం ఇచ్చారు. కరోనా బారినపడే అవకాశం ఉన్నవారికి ముందుగా టీకా ఇస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పలు కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి చెందుతుండడం ప్రపంచానికి ఒక ఆశారేఖ లాంటిదేనని అన్నారు. పోటీని కాదు, పరస్పర సహకారాన్ని పెంపొందించే దిశగా దేశాల అధినేతలు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు ముందడుగు వేయాలని పేర్కొన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో మనుషులంతా ఒకరికొకరు సహరించుకోవాలని చెప్పారు. మన కుటుంబం, మన మతం, మన వర్గం కాకపోయినా ఇతరులకు స్నేహ హస్తం అందించాలని ఉద్బోధించారు. కళ తగ్గిన క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలపై కరోనా ప్రభావం పడింది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లు, ఆంక్షలు, సరిహద్దుల మూసివేతలు, ప్రయాణాల నిషేధాలతో క్రిస్మస్ కాంతులు మసకబారాయి. అయితే వ్యాక్సిన్లపై ఆశలు మానవాళి మదిలో కదలాడుతూ పండుగ స్ఫూర్తిని కొనసాగించేలా చేశాయని, కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో అధికారికంగా చర్చ్‌లు సామూహిక ప్రార్ధనలు రద్దు చేశాయి. ధాయ్‌లాండ్ తదితర దేశాలకు పండుగ కోసం వచ్చిన స్వదేశీయులు క్వారంటైన్లో గడుపుతున్నారు. ఆఫ్రికాదేశాల్లో సైతం ప్రజలు ఆంక్షల మూలంగా పండుగ ఉత్సాహాన్ని పొందలేకపోయారు. వాటికన్లో క్రిస్మస్ రోజు ఆనవాయితీగా సెయింట్ పీటర్ బాసిలికా బాల్కనీలో దర్శనమిచ్చే పోప్, ఈ దఫా దర్శనాన్ని రద్దు చేసుకున్నారు. -
మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు..
క్రిస్మస్ వేడుకల సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చి ముస్తాబైంది. గురువారం రాత్రి విద్యుత్ దీప కాంతుల్లో మెరిసిపోయింది. చర్చి ప్రాంగణంలో శాంతాక్లాజ్, క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేశారు. అలాగే మహాదేవాలయంలో జరిగే ప్రత్యేక ఆరాధనలకు తరలివచ్చే భక్తులకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. శుక్రవారం తెల్లవారు జామున జరిగే మొదటి ఆరాధనను బిషప్ సాల్మాన్రాజ్ ప్రారంభించనున్నారు. రెండో ఆరాధన ఉదయం 9గంటలకు ప్రారంభమవుతుంది. పోలీసుల నిఘా కోసం ప్రత్యేకంగా ఔట్‌పోస్టు ఏర్పాటు చేసి అక్కడే బస చేస్తున్నారు. బందోబస్తును ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షిస్తున్నారు సాక్షి, మెదక్ : కరుణామయుడు, లోకరక్షకుడు ఏసుక్రీస్తు జననం సందర్భంగా ఉమ్మడి జిల్లాలో క్రిస్మస్ సందడి నెలకొంది. చర్చిలను విద్యుత్ కాంతులతో అత్యంత సుందరంగా అలంకరించారు. క్రిస్మస్ పండుగకు ముందు రోజైన గురువారం అర్థరాత్రి నుంచే ఆధ్యాత్మికత వైభవం వెల్లివిరిసింది. ప్రత్యేక ట్రీలు, క్రీస్తు జననాన్ని తెలిపే పూరిపాక ఘట్టాలు, దైవదూత విగ్రహాలు తీరొక్క విద్యుత్ దీపాలు శోభాయమానంగా వెలిగిపోయాయి. అంతటా కోలాహలం నెలకొంది. క్రిస్మస్ వేడుకలు అంగ రంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆసియా ఖండంలో అతి పెద్ద మెదక్ చర్చిలో యేసు పుట్టిన రోజు వేడుకలు అర్ధరాత్రి నుంచి మొదలయ్యాయి. చర్చి పాస్టర్ సాల్ మాన్ రాజు ఆరాధన యేసు సందేశాలు అందిస్తున్నారు. దివ్యతార దిగి వచ్చిన వేళ.. గజ్వేల్‌రూరల్: ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అతి పవిత్రమైన ఈ చర్చిని సందర్శించేందుకు గజ్వేల్ పట్టణ ప్రజలతో పాటు సమీప గ్రామాలే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. గురువారం అర్థరాత్రి నుంచి బాలయేసు పుణ్యక్షేత్రంలో ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు మొదలై శుక్రవారం రాత్రి వరకు కొనసాగుతాయి. చర్చి ఆవరణలో పశువుల పాక, స్టార్, ఏసు జననం వంటి కళాకృతులను అందంగా అలంకరించారు. క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు చర్చి ఆవరణను అందంగా తీర్చిదిద్దారు. మెథడిస్ట్ చర్చి.. మైమరపించెన్ జహీరాబాద్: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చీలన్నీ అందంగా ముస్తాబయ్యాయి. జహీరాబాద్‌లోని పలు చర్చీలను రంగు రంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. సంగారెడ్డి జిల్లాలోనే అతిపెద్ద చర్చి అయిన ఎంఆర్హెస్ఎస్ ఆవరణలో నిర్మించిన మెథడిస్ట్ చర్చి విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోంది. ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలుగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని టౌన్ చర్చితో పాటు పలు కాలనీల్లో ఉన్న చర్చీలను సైతం అందంగా అలంకరించారు. ముస్తాబైన చర్చిలు చిలప్‌చెడ్(నర్సాపూర్): క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి చిలప్‌చెడ్ మండలంలోని పలు చర్చిలు ముస్తాబయ్యియి. గురువారం మండల కేంద్రమైన చిలప్‌చెడ్ గ్రామంలోని చర్చిని అందంగా అలంకరించారు. నర్సాపూర్ రూరల్: నేటి క్రిస్మస్ పండుగ వేడుకల కోసం నర్సాపూర్ పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న చర్చిలను రంగులు, విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. నర్సాపూర్ సీఎస్ఐ చర్చితో పాటు నాగులపల్లి, అవంచ, ఎల్లాపూర్, ఖాజీపేట, పెద్దచింతకుంట చర్చిలకు పెద్ద ఎత్తున్న భక్తులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వీరిని దష్టిలో పెట్టుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దివ్య సందేశం దుబ్బాకటౌన్: పెద్దగుండవెల్లి సీఏస్‌ఐ చర్చిలో ప్రతి ఏటా క్రిస్మస్ సంబురాలు ఘనంగా జరుపుతారు. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ తాతయ్య (శాంతక్లాజ్) వేషధారణతో గ్రామంలో తిరుగుతూ పిల్లలకు చాక్లెట్లు పంచుతారు. చర్చిలో 100 కుటుంబాలు ఒకేచోట ఉండి సంబురాలు ఆనందంగా జరుపుకొంటారు. క్రిస్మస్ శుభాకాంక్షలు సిద్దిపేటకమాన్: నేడు జరుపుకోనున్న పవిత్ర క్రిస్మస్ పండగను పురస్కరించుకుని క్రిస్టియన్ సోదరి, సోదరులకు సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సీపీ ఆకాంక్షించారు. విద్యుత్ కాంతుల్లో మెదక్ సీఎస్ఐ చర్చి -
కనిపించని క్రిస్మస్ ఉత్సాహం
బెత్లహాం: ప్రతిసంవత్సరం బెత్లహాంలో అంగరంగవైభవంగా జరిగే క్రిస్మస్ వేడుకలపై కరోనా నీడ పడింది. దీంతో గురువారం ఆరంభమైన ఉత్సవాలకు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. ప్రతిసారీ ప్రపంచం నలుమూలల నుంచి బెత్లహాంకు భక్తులు ఈ ఉత్సవాలు చూసేందుకు వచ్చేవారు. ఈదఫా ప్రయాణాలపై ఆంక్షలతో దాదాపు విదేశీ యాత్రికులు కనిపించడంలేదు. వాటికన్ సిటీలో జరిగే పోప్ ఫ్రాన్సిస్ పూజాకార్యక్రమాలకు కూడా కర్ఫ్యూ కారణంగా ఎవరూ హాజరు కాకపోవచ్చని అంచనా. యూరప్‌తో పాటు ఇతర దేశాల్లో కూడా కరోనా ఆంక్షలు క్రిస్మస్ ఉత్సాహాన్ని తగ్గించాయి. -
క్రిస్మస్ ప్రార్థనల్లో సీఎం జగన్
-
కరోనా వేళ.. క్రిస్మస్ ఎలా..!
క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకల ఉత్సాహం కరోనా పుణ్యమా అని మసకబారుతోంది. ఒకపక్క ఈ మహమ్మారికి టీకా అందుబాటులోకి వచ్చిందని సంతోషించేలోగానే, కొత్త రూపు సంతరించుకొని దాడి చేయడం ఆరంభించింది. దీంతో పలు దేశాలు క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నాయి. కొన్ని దేశాలు కఠినమైన నిబంధనలు అమల్లోకి తీసుకురాగా, కొన్ని దేశాలు తేలికపాటి ఆంక్షలు తెచ్చాయి. ప్రజలు సమూహంగా గుమిగూడటం నుంచి విందు భోజనాల వరకు అనేక అంశాలపై పరిమితులు విధించాయి. నూతన సంవత్సర వేడుకల్లో కొత్తరూపంలో కరోనా దాడి చేయకుండా దేశాల మధ్య ప్రయాణాలపై నిషేధాజ్ఞలు పెరిగాయి. యూరప్ దేశాలైతే దాదాపు భయం గుప్పిట్లోకి జారాయి. ఆయా దేశాల వాతావరణ, భౌగోళిక, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షలు విధించుకున్నాయి. –లండన్ బ్రిటన్‌లో షట్‌డౌన్ నిన్నమొన్నటి వరకు క్రిస్మస్ సమయంలో ఆంక్షలన్నీ రద్దు చేయాలని బ్రిటన్ భావించింది. వ్యాక్సినేషన్ కూడా ఆరంభించింది. అయితే ఒక్కమారుగా కొత్త స్ట్రయిన్ బయటపడడంతో ఉలిక్కిపడింది. ప్రస్తుతం పాత ప్లాన్లన్నీ రద్దు చేసి పలు ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐలాండ్‌ల్లో వివిధ రూపాల్లో లాక్‌డౌన్‌ను పునఃప్రారంభించారు. లండన్‌లోనైతే ఇంట్లో కూడా సామూహిక వేడుకలు వద్దని ప్రభుత్వం తేల్చిచెప్పింది. మరోవైపు డజన్ల కొద్దీ దేశాలు బ్రిటన్‌కు విమానాలు నిలిపివేశాయి. లెబనాన్ తీరేవేరు ఆర్థికంగా కూనారిల్లుతున్న ఎకానమీని గట్టెక్కించడానికి విదేశీ మారక ద్రవ్యార్జనే మార్గమని భావించిన లెబనాన్ చాలా ఆంక్షలు ఎత్తివేసింది. నైట్‌క్లబ్బులు తెరిచిఉంచేందుకు అనుమతినిచ్చింది. అయితే క్లబ్బుల్లో డ్యాన్సులను నిషేధించింది. అమెరికాలోరాష్ట్రాలదే నిర్ణయం అమెరికా ప్రభుత్వం దేశవ్యాప్తం ప్రయాణాలపై జాతీయ స్థాయిలో నిషేధం విధించలేదు. ఆయా రాష్ట్రాలే ఈ విషయంపై నిర్ణయం తీసుకునే వీలు కల్పించింది. కానీ వీలయినంత వరకు ఇంట్లోనే ఉండమని ప్రజలకు సూచించింది. దక్షిణాఫ్రికాలో మందు బం§Š క్రిస్మస్ రోజు దేశంలో మందు అమ్మకాలను దక్షిణాఫ్రికా నిలిపివేసింది. దేశంలో పలు చోట్ల నైట్‌కర్ఫ్యూ విధించింది. క్రిస్మస్, న్యూఇయర్ రోజును బీచ్‌లు మూసివేస్తున్నట్లు తెలిపింది. సామూహికంగా తిరగవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఇంట్లో మాత్రం 100 మంది వరకు కలుసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు దక్షిణాఫ్రికాకు విమానాలు నిలిపివేస్తున్నాయి. బ్రెజిల్లో మీ ఇష్టం ఆది నుంచి కరోనాపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బోల్సెనారో ప్రభుత్వం క్రిస్మస్ సమయంలో ఎలాంటి కొత్త ఆంక్షలు లేవని తెలిపింది. సోపౌలో నగర గవర్నర్ మాత్రం స్వల్ప ఆంక్షలు విధించారు. సోపౌలో, రియో, సాల్వ డార్లో డిసెంబర్ 31న బాణసంచా కాల్చడాన్ని నిలిపివేశారు. జర్మనీలో పాటలు నిషిద్ధం వచ్చే నెల 10వరకు కొత్త ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 24–26 మధ్య మాత్రం స్వల్ప సడలింపులుంటాయని తెలిపింది. మ తపరమైన సమావేశాలు జరపవచ్చని, కానీ పాటలు మాత్రం నిషిద్ధమని తెలిపింది. ఇతర దేశాల్లో... ► పెరూలో క్రిస్మస్ రోజు కారు డ్రైవింగ్‌ను నిషేధించారు. ► ఫ్రాన్స్‌లో సామూహిక విందు భోజనాల్లో పాల్గొనేవారి సంఖ్యను ఆరుకు పరిమితం చేశారు. వచ్చే నెల వరకు రాత్రి కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. ► చిలీలో విందు భోజనాలకు 15మంది వరకు అనుమతినిస్తున్నారు. ► ఇటలీలో వచ్చే రెండువారాల వరకు ప్రయాణాలు నిషేధించారు. ► పోర్చుగల్‌లో క్రిస్మస్కు కొంతమేర సడలింపులిచ్చి న్యూఇయర్‌కు కఠిన ఆంక్షలు విధించనున్నారు. ► స్పెయిన్‌లో స్వల్ప సడలింపులతో వేడుకలకు అనుమతించారు. ► దక్షిణ కొరియాలో వచ్చే నెల 3వరకు ఐదుగురి కన్నా ఎక్కువమంది గుమిగూడడంపై ఆంక్షలు తెచ్చారు. ► రష్యాలో వచ్చేనెల 15వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. -
క్రిస్మస్ వేడుకలపై కఠిన ఆంక్షలు
లండన్: ఇంగ్లాండ్ ప్రజల ఆశలపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నీళ్లు చల్లారు. క్రిస్మస్ వేడుకలపై కఠినమైన ఆంక్షలు విధించారు. బంధు మిత్రులతో కలిసి పండుగ ఘనంగా జరుపుకోవాలని లక్షలాది మంది ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా వైరస్‌లో కొత్త రకం(వేరియెంట్) విజృంభిస్తున్న నేపథ్యంలో రాజధాని లండన్‌తో సహా పశ్చిమ, ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో క్రిస్మస్ వేడుకలపై కొత్త టైర్–4 స్థాయి ఆంక్షలు విధిస్తున్నట్లు బోరిస్ జాన్సన్ శనివారం ప్రకటించారు. ఇవి ఆదివారం ఉదయం నుంచే అమల్లోకి వస్తాయన్నారు. ప్రధానమంత్రిగా దేశ ప్రజల రక్షణ తన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజల భావోద్వేగాలు తనకు తెలుసని, అయినప్పటికీ భారమైన హృదయంతో ఆంక్షలు విధించాల్సి వస్తోందన్నారు. ► ఇంగ్లాండ్‌లో టైర్–4 ప్రాంతంలో ఉన్నవారు క్రిస్మస్ రోజున సొంత ఇంట్లో మినహా బయట ఎక్కడా ఎవరినీ కలవడానికి వీల్లేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వారికి మినహాయింపు లభిస్తుంది. ఇతర దినాల్లో విద్య, వైద్యం కోసం బయటకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. ► టైర్–4 ప్రాంతాలు మినహా దేశవ్యాప్తంగా డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు కరోనా ఆంక్షల్లో ఇచ్చిన సడలింపులను ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం డిసెంబర్ 25న మాత్రమే ఈ సడలింపులు అమల్లో ఉంటాయి. ► టైర్–4 ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి వ్యాయామశాలలు, సెలూన్లు, అత్యవసరం కాని దుకాణాలు మూసివేయాలి. ∙ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని టైర్–3 ప్రాంతాల్లో టైర్–4 ఆంక్షలను అమలు చేస్తారు. కెంట్, బకింగ్హమ్షైర్, బెర్క్‌షైర్, సుర్రే(వేవెర్లీ మినహా), గోస్పోర్ట్, హావెంట్, పోర్ట్స్మౌత్, రోథర్, హేస్టింగ్స్‌లో టైర్–4 ఆంక్షలు ఉంటాయి. ► లండన్ నగరంతోపాటు పశ్చిమ ఇంగ్లాండ్‌లోని బెడ్ఫోర్డ్, సెంట్రల్ బెడ్ఫోర్డ్, మిల్టన్ కీనెస్, లూటన్, పీటర్‌బరో, హెర్ట్‌ఫోర్డ్‌షైర్, ఎసెక్స్(కోలచెస్టర్, అటిల్స్ఫోర్డ్, టెండ్రింగ్ మినహా)లో టైర్–4 ఆంక్షలు అమలవుతాయి. ► యునైటెడ్ కింగ్డమ్(యూకే)లో అంతర్భాగమైన వేల్స్‌లోనూ క్రిస్మస్ సంబరాలపై ఆంక్షలు విధించారు. ఇవి శనివారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. డిసెంబర్ 23 నుంచి 28వ తేదీ వరకు ఇచ్చిన సడలింపులను కేవలం డిసెంబర్ 25వ తేదీకే పరిమితం చేశారు. -
40 మంది చిన్నారులు.. మృత్యు లారీ
ఆళ్లగడ్డ/శిరివెళ్ల: వాళ్లంతా పది, పదిహేనేళ్లలోపు చిన్నారులు. దేవుడిపై ఎనలేని భక్తితో ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా ప్రార్థన కోసం బయలుదేరారు. లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు వారిలో నలుగుర్ని పరలోకాలకు తీసుకుపోయింది. ఘటనలో మరో 12 మందికి తీవ్ర గాయాలు కాగా.. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలం యర్రగుంట్ల వద్ద కర్నూలు–కడప జాతీయ రహదారిపై మంగళవారం వేకువజామున ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పొగమంచు కమ్ముకోవడం, డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనాన్ని అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. వివరాల్లోకి వెళితే... యర్రగుంట్ల దళితవాడలో ఈ నెల 1వ తేదీన క్రిస్మస్ ముందస్తు సంబరాలు మొదలయ్యాయి. భక్తులతో కలిసి 30 మందికి పైగా చిన్నారులు ప్రతిరోజు తెల్లవారుజామున వీధుల్లో తిరుగుతూ ప్రార్థనా గీతాలు ఆలపిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం వేకువజామున 4 గంటలకు ఆ ప్రాంతంలోని చర్చి ఆవరణ నుంచి బయలుదేరారు. మరో కాలనీకి వెళ్లేందుకు జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. ఆ సమయంలో హైదరాబాద్ నుంచి కడప వైపునకు వేగంగా వెళ్తున్న డీసీఎం లారీ వారి మీదుగా దూసుకెళ్లింది. దీంతో గుంపుగా వెళ్తున్న వారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. సమీపంలోని వారు గమనించి అక్కడికి చేరుకునేలోపు చిన్నారులు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ కనిపించారు. ప్రమాదంలో స్థానిక విమల ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఉప్పలపాటి వెంకటరమణ కూతురు ఝాన్సీ (15) అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన శిరివెళ్ల ఏపీ మోడల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న దాసరి సురేష్ కుమార్తె సుస్మిత (15), అదే స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న సయ్యగాళ్ల బాలుగ్రం కుమారుడు వంశీ (12), మండల పరిషత్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న దాసరి బాలుగ్రం కుమారుడు హర్షవర్దన్ (8) నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 12 మందికి తీవ్ర గాయాలు ప్రమాదంలో తోట సువర్ణ, సుంకేసుల చెన్నమ్మ, సాయగాళ్ల మైథిలి, మేకల మద్దిలేటమ్మ, బాలబోయిన స్పందన, దాసరి చెన్నకేశవులు, కొత్తమాసి విజయకుమార్, మట్టల లక్ష్మిభార్గవ్, దాసరి నరసింహ, బేతి అరవింద్, దాసరి లక్ష్మి, ప్రవల్లిక తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో సాయగాళ్ల మైథిలి, బాలబోయిన స్పందన, తోట సువర్ణ, దాసరి నరసింహ, మేకల మద్దిలేటమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి కారణమైన లారీని ఆపకుండా వెళ్లిపోతుండగా.. కొందరు యువకులు వెంబడించి ఆళ్లగడ్డ మండలం బత్తలూరు సమీపంలో అడ్డుకుని డ్రైవర్‌ను పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప, జేసీ ఖాజామొహిద్దీన్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, డీఎస్పీ రాజేంద్ర ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పాస్టర్ రాకపోయినా బయలుదేరి.. గ్రామంలోని ఎస్సీ కాలనీలో గత ఏడాది నూతన చర్చి నిర్మించి.. క్రిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా రెండు వారాల నుంచి వేడుకలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి పాస్టర్ సొంత పనులపై వేరే ప్రాంతానికి వెళ్లడంతో కాలనీలోని కొందరు యువకులు రాత్రి చర్చిలోనే బస చేశారు. తెల్లవారుజామున పాస్టర్ లేకపోయినా వారే ప్రార్థనలు ప్రారంభించి ముందుకు సాగుతుండగా కాలనీలోని సుమారు 40 మంది చిన్నారులు కూడా హుషారుగా వారితో బయలుదేరారు. ప్రమాదంలో మృత్యువాత పడిన చిన్నారులు, క్షతగాత్రులందరిదీ ఒకే వాడ. అంతా కలిసిమెలిసి ఆటపాటలతో సందడి చేసే చిన్నారుల్లో నలుగురు మరణించారని, మరికొందరు గాయపడ్డారని తెలిసి గ్రామస్తులంతా విషాదంలో మునిగిపోయారు. అవ్వ కళ్లముందే మనుమరాలు మృతి చాగలమర్రి మండలం డి.వనిపెంట గ్రామానికి చెందిన ఉప్పలపాటి వెంకటరమణ కుమార్తె ఝాన్సీ చిన్నతనం నుంచీ యర్రగుంట్లలో అవ్వతాతల ఉంటూ చదువుకుంటోంది. రోడ్డు ప్రమాదంలో ఈ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా.. బాలికకు తోడుగా వెళ్లిన అవ్వ సువర్ణ తీవ్ర గాయాలపాలైంది. యర్రగుంట్ల గ్రామానికే చెందిన సయ్యగాళ్ల బాలుగ్రం కుమారుడు వంశీ మరణించగా.. కుమార్తె మైథిలి రెండు కాళ్లు పోగొట్టుకుని మృత్యువుతో పోరాడుతోంది. ఎప్పుడూ ప్రార్థనకు వెళ్లని చిన్నారి సుస్మిత తోటి పిల్లలతో సరదాగా వెళ్లి మృత్యువాత పడటాన్ని ఆ కుటుంబం తట్టుకోలేకపోతుంది. -
దుబాయ్‌లో సీనియర్‌తో జూనియర్!
క్రిస్మస్ పర్వదినాన్ని సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కొందరు సెలబ్రిటీలు సన్నిహితులు, స్నేహితులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అదేవిధంగా క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్ అందరికీ సంతోషాన్ని కలిగించాలని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కాగా, టీమిండియా యువ సంచలనం రిషభ్ పంత్ ఈ సారి క్రిస్మస్ వేడకులను మాజీ కెప్టెన్, సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోనితో కలిసి జరుపుకున్నాడు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం సీనియర్ క్రికెటర్ ఎంఎస్ ధోని దుబాయ్ వెళ్లాడు. ధోనితో పాటు అతడి స్నేహితులు, పంత్ కూడా వెళ్లి తెగ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ‘జూనియర్ అండ్ సీనియర్ ఎట్ క్రిస్మస్ సెలబ్రేషన్స్’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక ధోని, పంత్‌ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. ప్రసుతం టీమిండియా సెలక్షన్స్‌కు దూరంగా ఉంటున్న ధోనిని పంత్ తరుచూ కలుస్తున్నాడు. కుటుంబ స్నేహితుడిగా అదేవిధంగా ఆట పరమైన టెక్నిక్‌లు తెలసుకోవడానికి సీనియర్ క్రికెటర్‌ను జూనియర్ క్రికెటర్ కలుస్తున్నాడని వారిద్దిరి సన్నిహితులు పేర్కొంటున్నారు. .@msdhoni and @RishabhPant17 celebrating Christmas in Dubai with friends!🎄🎁🥳 #MerryXmas #MSDhoni #Dhoni pic.twitter.com/33huzJVtkU — MS Dhoni Fans Official (@msdfansofficial) December 25, 2019 -
క్రిస్మస్ వేడుకల్లో సీఎం
పులివెందుల/సాక్షి,అమరావతి: సీఎం వైఎస్ జగన్ బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ జిల్లా పులివెందుల సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పాస్టర్ బెనహర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నారు. సీఎస్ఐ చర్చికి సంబంధించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. వైఎస్ విజయమ్మ క్రిస్మస్ సందేశాన్ని వినిపించారు. వైఎస్ జగన్, వైఎస్ విజయమ్మలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు క్రిస్మస్ కేక్‌ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దివంగత వైఎస్ జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జార్జిరెడ్డి కుమారులు అనిల్‌రెడ్డి, సునీల్‌రెడ్డి.. వైఎస్ ప్రకాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్ జోసఫ్‌రెడ్డి, వైఎస్ మధురెడ్డి, డాక్టర్ ఈసీ గంగిరెడ్డి, ఎన్.శివప్రకాష్‌రెడ్డి, మంత్రులు సురేష్, అవంతి, అంజాద్ బాషా, ఆళ్ల నాని, కడప, రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షులు సురేష్‌బాబు, అమరనాథ్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి చేరుకున్న సీఎం వైఎస్ జగన్..: సీఎం వైఎస్ జగన్ మూడు రోజుల వైఎస్సార్ జిల్లా పర్యటన ముగించుకుని బుధవారం సాయంత్రం తాడేపల్లి చేరుకున్నారు. ఈ నెల 23వ తేదీ ఉదయం ఆయన తాడేపల్లి నుంచి వైఎస్సార్ జిల్లా పర్యటనకు బయలుదేరిన విషయం తెలిసిందే. అదే రోజు ఆయన జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్‌కు, కడపలో పలు అభివృద్ధి పనులకు.. 24న రాయచోటి, 25న పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. -
ఆఫ్రికాలో శాంతి నెలకొనాలి
వాటికన్ సిటీ: అంతర్యుద్ధంతో సతమతమైపోతున్న ఆఫ్రికా దేశాల్లో శాంతి స్థాపన జరగాలని పోప్ ఫ్రాన్సిస్ ఆకాంక్షించారు. మధ్యప్రాచ్యం, వెనిజులా, లెబనాన్ ఇతర దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణానికి ఇకనైనా ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం పోప్ వాటికన్ నగరం నుంచి తన సందేశాన్నిచ్చారు. ఆఫ్రికాలో క్రైస్తవులపై తీవ్రవాద సంస్థలు జరుపుతున్న దాడుల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. హింసతో రగిలిపోతున్న దేశాల్లో ప్రకృతి వైపరీత్యాలతో సతమతమైపోతున్న దేశాల్లో, వ్యాధులు పడగవిప్పిన నిరుపేద దేశాల్లో ఈఏడాదైనా శాంతి, సుస్థిరతలు నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు. ‘మధ్యప్రాచ్యం సహా ఎన్నో దేశాల్లో యుద్ధ వాతావరణంలో చిన్నారులు భయంతో బతుకులీడుస్తున్నారు. వారందరి జీవితాల్లో ఈ క్రిస్మస్ వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను‘‘అని పోప్ ఫ్రాన్సిస్ పేర్కొన్నారు. అంబరాన్నంటిన సంబరాలు క్రిస్మస్ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా అంబరాన్నంటాయి. క్రిస్టియన్ నేతలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటూ శాంతి సందేశాలను పంపించుకున్నారు. సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. తీవ్ర తుఫాన్‌తో అల్లాడిపోయిన ఫిలిప్పీన్స్‌లో వేలాది మంది వరద ముప్పులో చిక్కుకోవడంతో క్రిస్మస్ హడావుడి కనిపించలేదు. ఇక ఫ్రాన్స్‌లో పింఛను సంస్కరణలకు వ్యతిరేకంగా నాలుగు వారాలుగా జరుగుతున్న రవాణా సమ్మెతో రాకపోకలు నిలిచిపోయాయి. బంధువులు, స్నేహితులు తమవారిని చేరుకోకపోవడంతో క్రిస్మస్ సందడి కనిపించలేదు. -
క్రిస్మస్ పార్టీలో ‘లవ్‌బర్డ్స్’ సందడి
ముంబై : బాలీవుడ్ బడా ఫ్యామిలీ ఇళ్లల్లో ఏ వేడుక జరిగినా సినీ తారలంతా అక్కడా ప్రత్యక్షమవుతారు. అందరితో ఆడి పాడి సరాదాగా గడుపుతారు. గత వారం కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్‌ల ముద్దుల తనయుడు తైమూర్ అలీఖాన్ పుట్టినరోజు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం క్రిస్మస్ సందర్భంగా మంగళవారం రాత్రి కరీనా-సైఫ్ అలీఖాన్ ఇంట్లో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి కపూర్ ఫ్యామిలీతోపాటు బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-అలియా భట్.. మలైకా అరోరా- అర్జున్ కపూర్ హాజరయ్యారు. ఎంతో వైభవంగా ఏర్పాటు చేసిన ఈ పార్టీకి వచ్చిన అతిథిలందరూ పార్టీలో ఎంజాయ్ చేయగా పార్టీకి సంబంధించిన ఫోటోలను సారా అలీఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఈ పార్టీలో ప్రేమ జంటలతోపాటు కరీనా, సైఫ్ అలీఖాన్, సారా అలీఖాన్, నటాషా, సంజయ్ కపూర్- మహీప్ కపూర్ ఉన్నారు. మరోవైపు దీనికంటే ముందే సల్మాన్‌ఖాన్ సోదరి అర్పితా ఖాన్, భర్త ఆయుష్ శర్మతో కలిసి మంగళవారం తమ ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.. ఈ పార్టీకి నిర్మాత కరణ్ జోహర్, కరీనా- సైఫ్, సల్మాన్ ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్-జెనీలియా, నీతూ కపూర్, ఏక్తా కపూర్ తదితరులు విచ్చేశారు. View this post on Instagram Red nose reindeer 🦌 White snowflake ❄️ Virgin eggnog 🥚 Christmas cake 🎂 Get the party started 🎈 It’s Christmas Eve for heavens sake 🎄 A post shared by Sara Ali Khan (@saraalikhan95) on Dec 24, 2019 at 8:55am PST View this post on Instagram Merry Christmas ❤️😍 #AliaBhatt #KareenaKapoor #MalaikaArora #AmritaArora #party #lastnight A post shared by Manav Manglani (@manav.manglani) on Dec 24, 2019 at 9:05pm PST View this post on Instagram ❤️❤️❤️❤️❤️ @therealkarismakapoor @malaikaaroraofficial @amuaroraofficial @natasha.poonawalla A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on Dec 24, 2019 at 3:48pm PST -
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న వైఎస్ జగన్
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
విశాఖలో గ్రాండ్‌గా క్రిస్మస్ సెలబ్రేషన్స్
-
క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్
-
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, వైఎస్సార్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్.. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి కూడా క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్, విజయమ్మ, వైఎస్ భారతి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా సీఎం వైఎస్ జగన్, విజయమ్మ కేక్ కట్ చేశారు. నూతన సంవత్సర క్యాలెండర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలపు సరేష్, అవంతి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. -
ముస్తాబైన మెదక్ చర్చి
కరుణామయుడి ఆలయం.. ప్రపంచంలోనే అద్భుతమైన కట్టడం.. ఆనాటి కట్టడాలను కళ్లారచూస్తే తప్పా వర్ణించటం ఎవరితరం కాదు.. అదే మెదక్‌లోని ఏసయ్య కోవెల సీఎస్ఐ చర్చి. డిసెంబర్ 25న లోక రక్షకుడి అవతరణ వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఏసయ్య మందిరంలో ప్రతి వస్తువు కళాత్మకమే.. ప్రతి కట్టడం ప్రత్యేకమే.. మహా దేవాలయం వీక్షణం నయనానందకరమే. రెవరెండ్ చార్లెస్ వాకర్ పాస్నెట్ ఆధ్వర్యంలో 1914 నుంచి 1924 వరకు చర్చి నిర్మాణం జరిగింది. డిసెంబర్ 25, 1924లో ప్రారంభించారు. – మెదక్‌జోన్ ఆధ్యాత్మిక, కళాత్మకతల మేళవింపుతో చారిత్మాక సీఎస్ఐ చర్చి ప్రసిద్ధిగాంచింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాదేవాలయాన్ని సందర్శించిన వారెవరైనా నిర్మాణ సౌందర్యాన్ని తిలకించి పులకించి పోవాల్సిందే. చర్చిలో మూడు వైపులా కుడ్యాలపై కరుణామయుని చిత్రాలు అబ్బుర పరుస్తాయి. స్పెయిన్ గ్లాస్ పలకలపై చిత్రించిన క్రీస్తు జననం, శిలువ, పునరుత్థానం దృశ్యాలు కేవలం సూర్య కిరణాలతోనే తేజోవంతంగా ప్రకాశించడం వాటి ప్రత్యేకత. ఈ దృశ్యాలు తిలకించిన పర్యాటకులు మంత్ర ముగ్ధులు కావాల్సిందే. దేవదారు కర్రతో, పక్షిరాజు ఆకృతిలో తయారుచేసి పరిశుద్ధ గ్రంథ వేధిక మరో ఆకర్షణ. మహా దేవాలయంలో ప్రసంగ వేదికను బాల్‌స్టోన్‌తో రూపొందించారు. ఫరి్నచర్ కోసం రంగూన్ టేకు కర్రను, ఇతరత్రా ఆసనాలకు గులాబీ కర్రలను వినియోగించారు. ఈ చర్చి కట్టడాలను తిలకించిన పర్యాటకులు మళ్లీ మళ్లీ వస్తుండటం ఇక్కడి నిర్మాణ శైలి ప్రత్యేకత. చర్చి లోపల భాగాన ప్రత్యేక అలంకరణ క రక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని నేడు జరిగే క్రిస్మస్ వేడుకలకు మెదక్ సీఎస్ఐ చర్చిని నిర్వాహకులు అందంగా అలంకరించారు. ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి సుమారు 10 లక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. అనేక రకాల గిఫ్టులు ఏసయ్య జన్మ దినమైన క్రిస్మస్ పండగ డిసెంబర్ 25న జరగనుంది. కాగా క్రిస్మస్ సంప్రదాయాల్లో ప్రధానంగా ఏడు అంశాలు ప్రపంచ వ్యాప్తంగా అమలులో ఉన్నా యి. అందులో గిఫ్ట్‌లు ఇవ్వ డం ప్రత్యేకత. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఇళ్లకు వెళ్లి క్యారెల్స్ గీతాలు ఆలపించడం, ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం, బహుమతులు పంచుకోవడం, కేక్‌కట్ చేసుకోవడం ఆనవాయితి. ఈ మేరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని జనరల్ స్టోర్స్, ఫ్యాన్సీ స్టోర్లలో విభిన్న రకాల బహుమతులు కొలువు దీరాయి. ఏసుక్రీస్తు, మేరిమాత రూపాలతో, శిలువ గుర్తులతో ఉన్న వాల్ హ్యాంగింగ్స్, రకరకాల ఫొటో ఫ్రేములు, క్రీస్తు బొమ్మతో ఉన్న గడియారాలు, శాంతాక్లాజ్ బొమ్మలు లభిస్తున్నాయి. క్రైస్తవుల పరిశుద్ధ గ్రంథమైన బైబిల్స్ కూడా దొరుకుతున్నాయి. ఏసుక్రీస్తు జన్మవత్తాంతాన్ని, బోధన తెలిపే సీడీలు, డీవీడీలు లభిస్తున్నాయి. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా క్రైస్తవులు తమ సన్నిహితు లు, మిత్రులు, బంధువులకు అందజేసేందుకు వీటిని కొనుగోలు చేస్తున్నారు. క్రీస్తు శకం 300ల నుంచే బహుమతులు పంచే సంప్రదాయం ఉందని క్రైస్తవ మతపెద్దలు చెబుతున్నారు. ఆధ్యాత్మిక, కళాత్మకతల మేళవింపుతో చారిత్మాక సీఎస్ఐ చర్చి ప్రసిద్ధిగాంచింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహాదేవాలయాన్ని సందర్శించిన వారెవరైనా నిర్మాణ సౌందర్యాన్ని తిలకించి పులకించి పోవాల్సిందే. చర్చిలో మూడు వైపులా కుడ్యాలపై కరుణామయుని చిత్రాలు అబ్బుర పరుస్తాయి. స్పెయిన్ గ్లాస్ పలకలపై చిత్రించిన క్రీస్తు జననం, శిలువ, పునరుత్థానం దృశ్యాలు కేవలం సూర్య కిరణాలతోనే తేజోవంతంగా ప్రకాశించడం వాటి ప్రత్యేకత. ఈ దృశ్యాలు తిలకించిన పర్యాటకులు మంత్ర ముగ్ధులు కావాల్సిందే. దేవదారు కర్రతో, పక్షిరాజు ఆకృతిలో తయారుచేసి పరిశుద్ధ గ్రంథ వేధిక మరో ఆకర్షణ. మహా దేవాలయంలో ప్రసంగ వేదికను బాల్‌స్టోన్‌తో రూపొందించారు. ఫరి్నచర్ కోసం రంగూన్ టేకు కర్రను, ఇతరత్రా ఆసనాలకు గులాబీ కర్రలను వినియోగించారు. ఈ చర్చి కట్టడాలను తిలకించిన పర్యాటకులు మళ్లీ మళ్లీ వస్తుండటం ఇక్కడి నిర్మాణ శైలి ప్రత్యేకత. క్రిస్మస్ పర్వదినాన దేశ నలుమూలల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సీఎస్ఐ చర్చికి వస్తారని, ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇందులో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారని చెప్పారు. ఇక్కడకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. వందలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు. అలాగే ఆలయం తరఫున వలెంటీర్లను సైతం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 25వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకే మొదటి ప్రార్థన ఉంటుందని తెలిపారు. కేక్ కట్‌చేసిన కలెక్టర్, ఎస్పీ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం బిషప్ బంగ్లాలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎస్పీ చందనాదీప్తితో కలిసి కలెక్టర్ ధర్మారెడ్డి కేక్‌కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలు కుల, మత, ప్రాంత బేధాలు వీడి ప్రేమతో నడుచుకోవాలని సూచించారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకున్నప్పుడే ఏసుక్రీస్తు మార్గం అనుసరించిన వారౌతారని చెప్పారు. అనంతరం ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ క్రైస్తవ సోదర, సోదరీ మణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. చర్చి సంఘం ద్వార సాధ్యమైనంత వరకు ఇతరులకు లబ్ధి చేకూర్చాలని కోరారు. చర్చ్బిషప్ సాల్మన్‌రాజ్ మాట్లాడుతూ, దేవుడి దృష్టిలో ప్రతిఒక్కరూ సమానమేనని పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా అందరూ ప్రేమభావంగా నడుచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగరాజు, డీఎస్పీ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు. -
చర్చిలకు క్రిస్మస్ శోభ
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్/ అమరావతి : తెలుగు రాష్ట్రాలతో పాటు, దేశవ్యాప్తంగా క్రిస్మస్ సందడి నెలకొంది. కరుణామయుడైన ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందుకోసం చర్చిలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. విద్యుత్ దీపాకాంతులతో ప్రార్థన మందిరాల్లో క్రిస్మస్ శోభ వెల్లివిరుస్తోంది. అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ను జరుపుకుంటున్నారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులతో చర్చిల వద్ద సందడి వాతావరణం నెలకొంది. మెదక్ చర్చిలో వైభవంగా క్రిస్మస్ వేడుకలు.. ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దీంతో చర్చి ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. అలాగే సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చి, విజయవాడ గుణదల చర్చిలలో భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. -
దివ్యలోకపు ప్రేమధార
మనుషుల్ని చూడండి. మీద ఏదో ఒక బరువు. చదువుల బరువు. ఉద్యోగాల బరువు. ఇంటి పోషణ బరువు. బంధువుల మాటపట్టింపు బరువు. స్నేహితుల ముఖంచాటు బరువు. దగ్గరివాళ్లెవరి మనసునో నొప్పించిన బరువు. అంత బరువులోనూ సాటి మనిషి తల మీది బరువును రెండు చేతులతో చేపల గంపను కిందికి దింపినట్లుగా.. ‘కష్టాన్ని పంచుకునే బరువు’నూ పైకెత్తుకుంటారు! మనిషి ఎంత బరువును మోస్తున్నా.. మనిషి లోపల పంచుకోవడం అనే ఆ ‘ప్రేమ నక్షత్రం’ వెలుగుతున్నంత కాలం లోకం ప్రేమమయమే. కాంతిమయమే. మాధవ్ శింగరాజు మంచిని మోసుకొచ్చేవాళ్లు కనిపిస్తే మనసుకు భారం దిగినట్లుగా అనిపిస్తుంది. భుజాన అరటి గెలతో వచ్చేవాళ్లు, వడ్ల బస్తాల బండితో దిగేవాళ్లు, అమ్మాయికి పెళ్లి సంబంధం తెచ్చేవాళ్లు.. ఇవనే కాదు, ఊరికే చూసిపోదామని ఎంతోదూరం నుంచి ఒక పలకరింపునైనా మూట కట్టుకుని వచ్చేవాళ్లు.. వాళ్లు ఎండన పడి వచ్చినా.. మనకు నీడనిచ్చేందుకు వేర్లు పెకిలించుకుని కదలి వచ్చిన మనిషంత మహావృక్షంలా కనిపిస్తారు. మన నీరసాన్ని, నిస్సత్తువను పోగొడతారు. వాళ్లు తెచ్చిన చక్కెరకేళీలు, వాళ్లు దించిన ధాన్యం గింజలు, వాళ్లు చెప్పిన వరుడి విశేషాలు.. ఇవి కాదు మనసుకు సంతోషం. ఆ మోసుకురావడం.. అదీ! మనిషంటే అలానే ఉండాలి. నక్షత్రంలా! క్రీస్తు జన్మించారన్న కబురును ఇలాగే ఒక నక్షత్రం భూమి మీదకు మోసుకొచ్చింది. ఆ నక్షత్రం ప్రసవించిన వెలుగులో క్రీస్తు జనన ఘడియలు కాంతిపుంజాలై ప్రసరించి లోకమంతటా మంచిని విత్తనాల్లా విరజిమ్మాయి. ఆ విత్తన సంతతే కావచ్చు ఈ మంచిని ప్రయాసపడి మోసుకొచ్చే మనుషులు! విరజిమ్మినప్పుడు మంచి అక్కడక్కడా పడింది కనుకనేనా మంచి మనుషులు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంటారు?! కాదు. కనిపించకపోవడానికి కారణం మనం చూడకపోవడం, చూడాలని మనకు లేకపోవడం! ప్రకృతిని చూసి పరవశిస్తాం. ప్రకృతిలో భాగమైన మూగజీవుల్ని చేరదీసి సేదతీరుతాం. పక్షులు పాడుతుంటే వింటాం. మరి సాటి మనిషినెందుకు దగ్గరకు రానివ్వం? ఎన్ని యుగాల పరిచయం ఉన్నా మనిషికి దగ్గరగా ఎందుకు వెళ్లలేం? చూడదలచుకుంటే దిగ్మండలంలోనే కాదు, ఈ భూమండలంలోనూ నక్షత్రాల్లాంటి మనుషులు ప్రత్యక్షమవుతారు. క్రీస్తు జననం వంటి ఒక మంచిని వాళ్లు సాక్షాత్కరింపజేస్తారు. మనలో ప్రతి ఒక్కరం చూడగలం. అయితే చూడదలచుకోం! చూసేందుకు లోకంలో మంచే లేదనుకుంటాం. నిజంగానే లోకంలో మంచికి చోటు లేదా, మంచిని చూసేందుకు మనలో చోటు లేదా? ఉంటుంది. మంచిని చూడాలన్న ఆలోచన.. అది రాదు. వచ్చిందా.. మరుక్షణమే మన పక్కనే ఉన్న మనిషిలోనూ ఒక నక్షత్రం కనిపిస్తుంది! మనిషిలో నక్షత్రం కాదు, మనిషే నక్షత్రంలా కనిపిస్తారు. ఆ నక్షత్రపు వెలుగులో లోకంలోని మంచి కనిపిస్తుంది. వెలుగులో మంచొక్కటే కనిపిస్తుందా! వెలుగులో కనిపించేది మంచైనా, కానిదైనా.. మనసులోని వెలుగు మంచిని మాత్రమే చూస్తుంది. ఆ చూపును కాపాడుకోవాలి మనం. అప్పుడు లోకం దివ్యమైన నక్షత్ర కూటమిలా వెలుగుతూ కనిపిస్తుంది. శోకమయపు సముద్రాల ఈతకు నీటిపై సురక్షితంగా తేలియాడే ఆకులాంటి ఒక మంచి చూపు చాలదా.. సముద్రాన్ని, సుడిగుండాల్ని, తిమింగలాలను లక్ష్యపెట్టక ప్రశాంతంగా జీవనయానం సాగించడానికి! కొన్ని సంగతులు విన్నప్పుడు భూమి మీద ఉన్నదంతా ప్రేమ సందేశాలను మోసుకొచ్చే నక్షత్రాలే కానీ మానవమాత్రులు కారేమో అనిపిస్తుంది. కాకపోతే కొన్ని వెలిగే నక్షత్రాలు. కొన్ని వెలుగులో మాత్రమే కనిపించే నక్షత్రాలు. వెలుగులో నక్షత్రాలు కనిపించడం ఏమిటి! నక్షత్రమంటేనే వెలుగు కదా?! మనిషెంత వెలిగినా మంచితో వెలగడం ఒకటి ఉంటుందిగా. అలాంటిదే. ఒక యువకుడు ఉన్నాడు. హోటల్లో వెయిటర్. రూపాయి రూపాయి కూడ»ñ ట్టుకుని సైకిల్ కొనుక్కోవడం కోసం రోజూ పదకొండు కిలోమీటర్లు కాలి నడకన పనికి వచ్చి పోతున్నాడు.ఆ హోటల్‌కు వస్తుండే దంపతులొకరికి ఈ సంగతి తెలిసింది. మర్నాడే ఒక సైకిల్ని కొని అతడికి కానుకగా ఇచ్చారు! కష్టపడటం అతడి వెలుగైతే, అతడి కష్టాన్ని ఆ దంపతులు గమనించడం అతడిపై ప్రసరించిన వెలుగు. ఒక పోలీస్ అధికారి బంద్ డ్యూటీలో ఉన్నాడు. మధ్యాహ్నం అయింది. డ్యూటీలో ఉన్న చోటే ఒక అరుగు మీద భోజనానికి కూర్చోబోతుండగా ఒక వ్యక్తి దగ్గరగా వచ్చి నిలుచున్నాడు. అతడికి ఆకలిగా ఉన్నట్లు గ్రహించాడు ఆ పోలీస్ అధికారి. ‘తింటావా?’ అని అడిగాడు. ‘తింటాను’ అన్నట్లు తలూపాడు ఇల్లూ వాకిలీ లేని ఆ వ్యక్తి. పోలీస్ అధికారి తెప్పించుకున్న అన్నం పొట్లంలోనే ఇద్దరూ కలిసి చేతులు పెట్టి భోజనం చేశారు! పంచే బుద్ధి పోలీస్ ఆఫీసర్లోని వెలుగైతే, దాన్ని బయటికి కనిపించేలా చేసిన వెలుగు ఆ ఆకలిగొన్న వ్యక్తి. ఇలాంటివి జరక్కపోతే పోలీసు చొక్కాపై నక్షత్రాలను తప్ప పోలీసు మనసు లోపలి నక్షత్రాలను చూడగలమా?! మనుషుల్లోపల్లోపల సాటి మనుషులంటే ఇంతింత ప్రేమ ఉంటుందే.. మరి అదంతా కనిపించకుండా ఎక్కడికి పోతుంది? ఎక్కడీ పోదు. ఎక్కడి నుంచో, ఏ రూపంలోనో ఓ కాంతి ధార వచ్చి పడితేనే కానీ ఆ మానవ నక్షత్రాల్లోని ప్రేమ వెలుగు పైకి కనిపించదు. మనుషులు ధరించే నిర్దయ, నిరాదరణ అనే కవచాలు మనుషుల మీద అనుమానంతోనే కానీ అవేవీ సహజ కవచాలు, కుండలాలు కావు. సాటి మనిషి అవసరానికి అవి తునాతునకలైపోయి హృదయకాంతి బయపడినప్పుడు గానీ అప్పటి వరకు వారు పండ్ల గెలలు, ధాన్యపు బస్తాలు, పెళ్లి సంబంధాలు మోస్తున్నట్లు తెలియదు. జ్ఞానులు సైతం క్రీస్తు జననాన్ని నక్షత్రం ద్వారానే గుర్తించగలిగారు. మనిషిలోని దైవత్వాన్ని గుర్తించడానికి ప్రతి మనిషీ అంతటి నక్షత్రం అయి ఆ కాంతిని లోకానికి బాటగా వేయాలి. తాతకు తోడుగా..! క్రిస్మస్ తాత నివాసం దక్షిణధ్రువంలో ఉంటుందని ప్రపంచం అంతా భావిస్తుంటే.. నెదర్లాండ్స్ ప్రజలు మాత్రం ఆయన స్పెయిన్ దేశంలో ఉంటాడని నమ్ముతారు. క్రిస్మస్ తాతను ఇంగ్లిషులో శాంటాక్లాస్ అంటాం కదా. శాంటాక్లాస్ అన్నది నెదర్లాండ్స్ వాళ్లు మాట్లాడే డచ్ భాషా పదం. వాళ్ల దేశం నుంచి శాంటాక్లాస్ అనే మాట వచ్చింది కాబట్టి, శాంటాక్లాస్ది స్పెయిన్ అని చెబుతున్న డచ్‌వాళ్ల మాటను మనం పూర్తిగా కాదనేందుకు లేదు. డచ్వాళ్లకు ఇంకో నమ్మకం కూడా ఉంది. క్రిస్మస్ గిఫ్టులు ఇవ్వడానికి శాంటాక్లాజ్ ఒక్కడే వస్తాడని మనం అనుకుంటాం. కానీ కాదట. ఆయన పక్కన ఆయనకు సహాయకులుగా కొన్ని ‘పిల్ల శాంటాలు’ ఉంటారట. వాళ్లేం చేస్తారంటే.. గిఫ్టులు ఇవ్వడానికి క్రిస్మస్‌తాతతో పాటు ఇళ్లకు వెళ్లినప్పుడు అక్కడ పిల్లలెవరైనా తుంటరి పనులు చేస్తే వాళ్లను అమాంతం ఎత్తుకుని తెచ్చేసి స్పెయిన్‌లో వదిలేస్తారట! అంతకుమించిన శిక్ష ఉండదని నెదర్లాండ్స్ వాళ్లు అంటారు! బాల యేసుకు దుప్పటి రాత్రి పెట్టిన క్రిస్మస్ చెట్టు మీద తెల్లారే సాలెగూడు కనిపిస్తే ఏదో అదృష్టం వరించబోతోందని జర్మనీ, పోలండ్, ఉక్రెయిన్ దేశాలలో ఒక విశ్వాసం ఉంది. బేబీ జీసెస్ కోసం ఆ సాలె పురుగు దుప్పటి నేస్తూ ఉంటుందని కొందరి నమ్మకం. ఆ సాలెగూడు ఉదయాన్నే సూర్య కిరణాలు సోకి బంగారు, వెండి సాలెగూడుగా మారిపోతుందని మరికొందరి నమ్మకం. మన దగ్గర మార్కెట్ నుంచి కొని తెచ్చుకున్న రెడీమేడ్ క్రిస్మస్ ట్రీలో ఏ మూలో సాలెగూడు కూడా ఉండటానికి ఇదే కారణం అయి ఉండొచ్చు. ఈ నమ్మకం గురించి తెలిసినవాళ్లు క్రిస్మస్ చెట్టుకు తప్పని సరిగా ఒక ప్లాస్టిక్ సాలెగూడును సంపాదించి తగిలిస్తారు. అలా కూడా అదృష్టం కలసి వస్తుందని కొందరు విశ్వసిస్తారు. పసి మనసులు కొన్ని పాశ్చాత్య దేశాలలో.. ముఖ్యంగా జర్మనీలో ఒక అందమైన విశ్వాసం ఉంది. క్రిస్మస్కు కొద్ది గంటల ముందు.. కల్లాకపటం తెలియని స్వచ్ఛమైన పసి హృదయాలు జంతువుల మాటల్ని వినగలుగుతాయట! అంతేకాదు, నదులు ద్రాక్ష సారాయిగా మారడాన్ని ఆ పసివాళ్ల కళ్లు చూడగలుగుతాయి. క్రిస్మస్ ట్రీకి వాళ్ల కళ్లముందే తియ్యటి బేరీ పండ్లు కాస్తాయి. పర్వతాలు తెరుచుకుని వాటి గర్భంలోని మణులు మాణిక్యాలు బయటపడతాయి. సముద్రపు అడుగునుంచి దేవుని గంటలు ధ్వనిస్తాయి. నిజంగా ఇలా జరిగితే ఎంతమందిమి చూడగలుగుతాం? మనలో ఎన్ని పవిత్రమైన హృదయాలు ఉంటాయి అని ప్రశ్న?! గంటకు 60 లక్షల మైళ్లు! క్రిస్మస్తాత తెచ్చే గిఫ్టుల కోసం ఎదురు చూసే పిల్లలు ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మంది వరకు ఉంటారని అంచనా. మరి వారందరికీ గిఫ్టులు చేరవెయ్యాలంటే క్రిస్మస్ తాతకు టైమ్ సరిపోతుందా? సరిపోతుంది. గంటకు అరవై లక్షల మైళ్ల వేగంతో ప్రయాణిస్తే చాలు. అన్ని దేశాల్లోని అందరి పిల్లలకు గిఫ్టులు అందినట్లే. యు.ఎస్.లోని యూనివర్శిటీ ప్రొఫెసర్ ఒకరు వేసిన లెక్క ఇది. ఎక్స్‌మస్ క్రిస్మస్ని ఎక్స్‌మస్ అని కూడా అంటుంటాం. ఎందుకిలా? ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? మీకు వచ్చినా రాకున్నా ఎక్స్‌మస్ అన్నది మాత్రం క్రిస్మస్ నుంచే వచ్చింది. అబ్రివేషన్‌గా వాడుతున్నాం. ఇలా ఇష్టమొచ్చినట్లు వాడితే సరిపోయిందా? లాజిక్ ఉండొద్దా? ఉంది! గ్రీకు భాషలో ఛిజిజీ ని గీ తో సంకేతపరుస్తారు. అందుకే క్రైస్ట్, క్రిస్టోస్ అనే మాటలకు ముందు వాళ్లు గీ అని రాస్తారు. అలా క్రిస్మస్.. ఎక్స్‌మస్ అయింది. బాతు చెట్లు మొదట్లో క్రిస్మస్ చెట్టును బాతు ఈకలతో చేసేవాళ్లు. ఆ ఈకలకు పచ్చరంగు వేసేవారు. 19వ శతాబ్దంలో జర్మనీలో ఇలా చేయడం మొదలైంది. అప్పట్లో అక్కడ అడవుల నరికివేత విపరీతంగా ఉండటంతో చెట్లకు కరువొచ్చింది. దాంతో బాతు ఈకల ఆలోచన వచ్చింది వాళ్లకు. తర్వాత్తర్వాత బాతు ఈకలతో క్రిస్మస్ చెట్లను తయారు చేయడమన్నది అమెరికాకు, ఇతర దేశాలకూ వ్యాపించింది. కెంటకీ ఫర్ క్రిస్మస్ జపాన్‌లో క్రిస్మస్ రోజు కె.ఎఫ్.సి.లు కిటకిటలాడిపోతుంటాయి. అక్కడ క్రైస్తవుల సంఖ్య పెద్దగా ఉండదు కానీ, క్రిస్మస్ రోజు అంతా కె.ఎఫ్.సి.ల దారి పడతారు. కె.ఎఫ్.సి. అంటే కెంటకీ ఫ్రైడ్ చికెన్. అయితే 1947లో కె.ఎఫ్.సి. తన సేల్స్ పెంచుకోవడం కోసం ‘కెంటకీ ఫర్ క్రిస్మస్’ అనే మార్కెటింగ్ వ్యూహం పన్ని సక్సెస్ అయ్యింది. అప్పట్నుంచీ క్రిస్మస్ సీజన్లో జపాన్వారికి పండగే పండుగ. కె.ఎఫ్.సి. వారి నోరూరించే ఆఫర్లు కడుపునిండా ఉంటాయి. -
అందుకే క్రిస్మస్ ట్రీకి వీటిని వేలాడదీస్తారు!
ప్రపంచ వ్యాప్తంగా జరిగే ముఖ్యమైన పండుగలలో ముందు వరుసలో నిలిచేది క్రిస్మస్. ప్రపంచంలోని పలు దేశాల్లో పలు క్రిస్మస్ ఆచారాలు ఉన్నాయి. అందులో కొన్ని ఎప్పుడో పురతాన కాలంలో ప్రారంభం కాగా, మరికొన్ని నూతనంగా ప్రవేశించాయి. ఈ క్రిస్మస్కు వారు ఎలాంటి ఆచారాలు పాటిస్తారో అవి ఎలా పుట్టుకొచ్చాయో తెలుసుకుందాం రండి. క్రిస్మస్ ట్రీకి ఎందుకు ‘షూ’ బోమ్మలను ఉంచుతారో తెలుసా.. క్రిస్మస్ చెట్టుకు క్రిస్మస్ తాత ‘షూ’ను వేలాడదీసి కట్టడం మీరు చూసే ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ పండుగకు టపాసులు కాలుస్తారు. కానీ కేవలం పిల్లలు మాత్రమే ఈ టపాసులను కాలుస్తారు. ఓ నిరుపే దవ్యక్తికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అయితే క్రిస్మస్ రాగానే వారు తమ తండ్రి టపాసులు కావాలని అడిగారు. అయితే ఆ తండ్రి ఇప్పడు వద్దమ్మా తరువాత కొనిస్తాను అని చెప్పాడు. చుట్టుపక్కల పిల్లలు టపాసులు కాల్చడం చూసి తమకూ కావాలని వారు పట్టుబట్టారు. కానీ తండ్రి వద్ద కొనడానికి డబ్బులే లేవు. ఎలాగైనా సరే అవి మాకు తెచ్చి పెట్టు అంటూ పిల్లులు మారాం చేశారు. అలా ఏడుస్తున్న పిల్లలు టపాసుల శబ్థం వచ్చి బయటికి వచ్చి చుశారు. అక్కడ వారి ఇంటి ముందు ‘షూ’లో బోలేడన్ని బహుమతులు, టపాసులు పెట్టి ఉండటం వారు గమనించారు. ఇవి ఎవరు తెచ్చారా అని చుట్టూ చూసిన వారు ఎరుపు రంగు ఉలను టోపి, అదే రంగులో ఉన్ని కోటును ధరించి చేతి కర్రతో వెలుతున్న ఓ ముసలి వ్యక్తిని చూశారు. అలా చూస్తూ ఉండగానే ఆయన మంచులో మాయమైపోయాడు. ఆ తర్వాత వారు ఇంటి లోపలికి వెళ్లి వాళ్ల నాన్నతో క్రిస్మస్ తాత వచ్చి మాకు టపాసులు ఇచ్చాడంటూ సంబర పడిపోయారు. అలా అప్పటీ నుంచి ప్రతి క్రిస్మస్కు పిల్లలందరూ క్రిస్మస్ చెట్లకు, ఇంటి ముందు ‘షూ’ను వెలాదీసీ ఉంచడం మొదలు పెట్టారు. ఎందుకంటే క్రిస్మస్ తాత వచ్చి వాటిలో క్రిస్మస్ బహుమతులు, టపాసులు పెట్టి వెడతాడని వారి నమ్మకం. రాను రానూ క్రిస్మస్ ట్రీకి ‘షూ’ను వేలాడదీయడం ఆనవాయితీగా మారింది. జర్మనీ రాజు తెచ్చిన గ్రీటింగ్ కార్డులు: 1843లో ఇంగ్లాండు దేశానికి చెందిన సర్ హెన్నీ కోల్ తన బంధు మిత్రులకు క్రిస్మస్ శుభాకాంక్షలు వినూత్న రీతిలో తెలపాలని అనుకున్నాడు. వెంటనే కొన్ని కార్డులను తయారు చేసి దాని మీద క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అని రాయించాడు. వాటిని తన మిత్రులకు పంపడంతో ఈ ఆచారం పుట్టుకొచ్చింది. కార్డులు ఒక్కసారి ఇస్తే అవి జీవితాంతం దాచుకుంటారు. అనుకోని సంఘటనలు ఎదురైతే తప్ప వాటిని కోల్పోరు కదా. అందుకే ఈ గ్రీటింగ్ కార్డులు ఇస్తే అవి ఎప్పటికీ తీపి గుర్తులుగా ఉండిపోతాయి.. ఇది మంచి ఆలోచన. ఎప్పటికీ ఎండిపోని ఫిర్ చెట్టు(క్రిస్మస్ ట్రీ).. క్రిస్మస్ చెట్టు ఆచారం జర్మనీ నుంచి పుట్టుకొచ్చింది. సాధారణంగా ఫిర్ చెట్టును క్రిస్మస్ చెట్టుగా అలంకరిస్తారు. ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది అన్ని కాలాల్లోనూ ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది.అలాగే మన జీవితాల్లో కూడా దేవుని దీవెనలను అలాగే ఉండాలన్న ఆలోచనలతో ఈ ఆచారం పుట్టుకొచ్చింది. 1846లో విక్టోరియా రాణి, జర్మనీ రాకుమారుడు అల్బర్ట్‌ను కలసి అలంకరించిన క్రిస్మస్ ట్రీ పక్కన నిలుచుని ఫొటో దిగారు. అతి అన్ని వార్తాపత్రికలలో ప్రచురితం కావడంతో క్రిస్మస్ ట్రీ డిమాండ్ పెరిగింది. అనంతరం జర్మన్ ప్రజలు అమెరికాలో స్థిరపడటం వల్ల అమెరికాలో కూడా ఈ ఆచారం వాడుకలోకి వచ్చింది. చైనాలో అతిపెద్ద క్రిస్మస్ సిజన్ షాపింగ్ : క్రిస్మస్ సీజన్లో చైనాలో అత్యధిక కొనుగోళ్లు జరుగుతాయి. ఆ దేశంలో జరిగే అతి పెద్ద షాపింగ్ సీజన్ క్రిస్మస్ ముందు రోజే. క్రిస్మస్ ఆచారాల్లో అక్కడక్కడా కనిపించే యాపిల్ పండ్ల ఆచారం చైనా నుంచే వచ్చింది. మండారిన్ భాషలో యాపిల్ పండు ఉపయోగించే పదరం క్రిస్మస్ ఈవ్‌కు దగ్గరగా ఉంటుంది. అందుకే అక్కడ యాపిల్‌తో చేసిన అలంకరణలకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. ముందు రోజు ఉపవాసం: క్రిస్మస్ ముందు రోజైన డిసెంబర్ 24న రష్యన్ ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేస్తారు. సాధారణంగా సూర్యుడు వెళ్లిపోయి చుక్కలు కనిపించినప్పుడు మాత్రమే ఆహారాన్ని భుజిస్తారు. అయితే మాంసం మాత్రం ముట్టుకోరు. కుత్యా అనే వంటకం అక్కడ ఫేమస్. ఆ వంటకంలో వివిధ రకాలైన ధాన్యాలు, తెనె, వంటి విత్తనాలు వేసి తయారు చేస్తారు. అయితే ఉపవాసం విరమించేటప్పుడు బోధకులు వారి ఇళ్లకు వెళ్లి వాటిపై పవిత్ర జలం చల్లి ప్రార్థనలు చేసిన తర్వాతే దానిని స్వీకరిస్తారు. - స్నేహలత (వెబ్ డెస్క్) -
క్రిస్మస్: దారి చూపిన స్టార్
సాక్షి, నాగార్జునసాగర్(నల్గొండ) : క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని క్రైస్తవులు ఇంటింటికీ పైభాగాన క్రిస్మస్ స్టార్‌ను అమర్చుతారు. సెమి క్రిస్మస్ నుంచి ఈ స్టార్స్‌ను ఏర్పాటు చేస్తారు. బుధవారం క్రిస్మస్ పండుగ ఉండటంతో నందికొండ మున్సిపాలిటీ కాలనీల్లో ఉన్న అన్ని ప్రముఖ ఫ్యాన్సీ షాపుల్లో క్రిస్మస్ స్టార్స్ విక్రయించేందుకు సిద్ధంగా ఉంచారు. క్రీస్తు జన్మించిన స్థలానికి మార్గం చూపిన తారగా దీనిని భావిస్తారు. క్రిస్మస్ సార్స్ ప్రాధాన్యత... క్రిస్మస్ స్టార్స్ గురించి పూర్వీకులు ఈ విధంగా చెప్పారు. ఏసుక్రీస్తు జన్మించిన వెంటనే ఆకాశంలో ఒక కొత్త నక్షత్రం పుట్టింది. మిగతా నక్షత్రాలకంటే అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతున్న ఆ నక్షత్రం వైపే అందరి దృష్టిపడింది. ఆకాశంలో ఏదైన కొత్తగా ప్రకాశవంతంగా పుట్టిందని జగతిని కాపాడేందుకు గొప్పవారు జన్మించినట్టే అనే నమ్మకంతో ఆ తార వైపు పయనించసాగారు. తూర్పుదేశ జ్ఞానులు ఆకాశంలో ప్రకాశిస్తున్న తార ఎటు కదిలితే అటు పయనించారు. ఈ నక్షత్రం జెరుసలెంలోని బెత్లహంలో పశువులకొట్టం వద్ద తనప్రయాణాన్ని ఆపింది. పశువుల కొట్టం వద్ద తూర్పుదేశ జ్ఞానులు అప్పుడే జన్మించిన ఏసును కనుగొన్నారు. ఈ విధంగా పలుప్రాంతాలకు చెందిన వారు జగతి మేలుకోసం జన్మించిన ఏసుకు కానుకలుగా బంగారం, సాంబ్రాణి, సుగంధ పరిమళాలతో కూడిన బోళమును సమర్పించారు. అప్పటినుంచి క్రైస్తవుల్లో నక్షత్రానికి ప్రాధాన్యత ఏర్పడింది. క్రీస్తు జన్మించిన ప్రదేశానికి దారి చూపిన నక్షత్రానికి గుర్తుగా అందరూ తమ ఇళ్లల్లో క్రిస్మస్ స్టార్స్ ఏర్పాటు చేస్తారు. క్రిస్మస్కు నెలరోజుల ముందుగానే ఈ స్టార్‌ను ఉంచుతారు. క్రిస్మస్ను తెలియజేస్తుంది క్రిస్మస్ పండుగకు ముందు క్రైస్తవులందరూ తమ ఇళ్లల్లో స్టార్స్‌ను ఉంచుతారు. అర్థమవుతుంది. చాలా సంతోషంగా ఈ క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం. – డి.కోటేశ్వర్రావు, సాగర్ అధిక సంఖ్యలో ఆరాధించే దేవుడు క్రీస్తు అధికసంఖ్యలో ఆరాధించే దైవం ఏసు క్రీస్తు. ప్రతి క్రైస్తవుడు ఘనంగా జరుపుకునే ఈ పండుగలో క్రిస్మస్ స్టార్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాం. ఇంటి ఎదుట క్రిస్మస్స్టార్ను అలంకరించగానే ఇంట్లో పండుగ వాతావరణం వచ్చేస్తుంది. – విజయప్రభావతి, హిల్‌కాలనీ -
ఒక్కో చర్చి ఎంతో ఘన కీర్తి
రాష్ట్రంలోనే రెండో పెద్దది సీఎస్ఐ కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం పట్టణంలోని సెయింట్ ఆండ్రూస్ సీఎస్ఐ చర్చి రాష్ట్రంలోనే రెండో పెద్ద చర్చిగా గుర్తింపు పొందింది. డోర్నకల్ డయాసిస్‌లో అతిపెద్దది. 1943లో బ్రిటిష్ కాలంలో కొత్తగూడెంలో 15 కుటుంబాలతో ఏర్పడిన సంఘం ఆధ్వర్యంలో పోస్టాఫీస్ సెంటర్లో నిర్మించారు. 2005లో రూ.1.60కోట్ల విరాళాలతో ఆధునిక పద్ధతిలో తిరిగి నిర్మించి పునఃప్రారంభించారు. జిల్లా కేంద్రంలో ప్రధానమైన కట్టడంగా గుర్తింపును సంతరించుకుంది. ఒకేసారి మూడువేల మంది ప్రార్థనలు చేయొచ్చు. ప్రతి ఆదివారం జన సందోహంగా మారుతుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, విదేశాల నుంచి కూడా వచ్చి సందర్శిస్తుంటారు. వేడుకలకు సిద్ధం చేశాం.. ప్రతి ఏడాది ఇక్కడ క్రిస్మస్ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటాం. ఏసు జీవిత చరిత్రను భక్తులకు వివరించేందకు ప్రత్యేకంగా ఏర్పాట్లను చేశాం. ఈ చర్చికి ప్రతి ఆదివారం రాష్ట్ర నలుమూలల నుంచి క్రైస్తవ భక్తులు వస్తుంటారు. – టి.జాన్సన్, సీఎస్ఐ చర్చి చైర్మన్ కరుణగిరి.. ఖమ్మంరూరల్: మండలంలోని నాయుడపేట నుంచి మొదలై..అటు బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న కరుణగిరి చర్చి ఎంతో ప్రఖ్యాతిగాంచింది. ఇక్కడ గత 20 ఏళ్ల నుంచి క్రైస్తవులు విశేష ప్రార్థనలు చేస్తున్నారు. ఆధునిక నిర్మాణ పద్ధతి ఆకట్టుకుంటుంది. ప్రతి ఆదివారం వందలాదిగా క్రైస్తవులు ఇక్కడికి వస్తుంటారు. విశాల ఆహ్లాద ప్రాంగణం దీని మరో ప్రత్యేకత. ఖమ్మంనగరంతో పాటు కూసుమంచి, తిరుమలాయపాలెం, ఖమ్మంరూరల్, మరిపెడ మండలాల నుంచి ఇక్కడికి తరలివస్తుండడం విశేషం. లివింగ్ గాస్పెల్ చర్చి.. పాల్వంచ: పట్టణంలోని కాంట్రాక్టర్స్ కాలనీలో ఉన్న లివింగ్ గాస్పెల్ చర్చ్ (ఎల్జీఎం) ఇండిపెండెంట్ చర్చిల్లోనే అతి పెద్దదిగా గుర్తింపుపొందింది. 1984లో సింగరేణి సంస్థలో ఉద్యోగాన్ని వదిలి పాస్టర్ లిటిల్ దేవసహాయం నలుగురైదుగురు భక్తులతో లివింగ్ గాస్పెల్ చర్చిని బాపూజీ నగర్లో ప్రారంభించారు. నేడు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. లిటిల్ దేవసహాయం కుమారుడు సాధు టైటస్ లివింగ్ వాటర్ వివాహం చేసుకోకుండా దైవ సేవ చేయాలనే తలంపుతో పాస్టర్‌గా మారారు. ఆయన కాంట్రాక్టర్స్ కాలనీలో అధునిక పద్ధతుల్లో చర్చిని నిర్మింపజేసి 2016 జనవరి7వ తేదీన ప్రారంభించారు. ఉభయ జిల్లాల నుంచి ఇక్కడికి వేలాదిమంది వస్తుంటారు. ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతుంటాయి. టైటస్ లివింగ్ వాటర్ పేదలు, అనారోగ్యంతో ఉన్న వారికి, అనాథలకు తన వంతు సహకారం అందిస్తున్నారు. యేసు ప్రేమను చాటడమే లక్ష్యం యేసు క్రీస్తు చూపిన ప్రేమను చాటడమే నా లక్ష్యంగా భావిస్తున్నా. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ వంతు కృషి చేస్తున్నాం. అనుబంధంగా జిల్లాలో ఐదు చర్చిలు, చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నాలుగు చర్చిలు ఉన్నాయి. మాకు ఇతర ఏ సంస్థల నుంచి ఎలాంటి ప్రొత్సాహం లేదు. స్వతహాగా ఇక్కడి భక్తుల సహకారంతో ముందుకు సాగుతున్నాం. – సాధు టైటస్ లివింగ్ వాటర్, పాస్టర్ అద్భుతం..లూర్థుమాత ఆలయం తల్లాడ: రాష్ట్రీయ రహదారి పక్కనే తల్లాడలో ఉన్న జిల్లాలోనే అతి పెద్ద చర్చిల్లో ఒకటిగా లూర్థుమాత ఆలయం పేరెన్నికగన్నది. 21 సంవత్సరాల క్రితం రోమన్ కేథలిక్ మిషన్ ఆధ్వర్యంలో నిర్మించారు. ఒకేసారి మూడువేల మంది ప్రార్థనలు చేయొచ్చు. అద్భుతమైన కల్వరి కొండలు, ఏసుక్రీస్తు జీవితానికి సంబంధించిన విశేషాలు, లూర్థమాతా చిత్రపటాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. చర్చిగోపురం 150 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆలయం గంట మోగినప్పుడు కిలోమీటరుకుపైగా వినిపిస్తుంది. ప్రాంగణం ప్రశాంతంగా ఉంటుంది. క్రిస్మస్ అంటే క్రీస్తు ఆరాధనే.. బాల యేసు పశువుల పాకలో జన్మించడం ఒక అద్భుత కార్యం. అలాంటి రోజును అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవడమే కిస్మస్. క్రైస్తవులకు ఇదే పెద్ద పండుగ. కులమత బేధాలకు తావులేకుండా ఎంతో ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలి. – పుట్టి రాజేంద్రప్రసాద్, లూర్థుమాత ఆలయం విచారణ గురువు, తల్లాడ ఆకట్టుకునే ఆర్సీఎం పాల్వంచ: స్థానిక ఆర్సీఎం చర్చిని కేరళకు చెందిన గోర్తిక్ ఆర్ట్ విధానంలో కట్టారు. కేరళ రాష్ట్రానికి చెదిన ఆగస్టీన్ అనే ఆర్కిటెక్ట్ దీనికి రూపకల్పన చేయగా అప్పటి ఫాదర్ బెనడిక్ట్ ఆధ్వర్యంలో 2013 జూన్ 8న చర్చిని పునఃప్రారంభించారు. దేవ దూతల విగ్రహాలు, ఏసు ప్రతిమలు, ఆయన శిష్యుల విగ్రహాలు ఎంతో ఆకట్టుకుంటాయి. తెల్లవారేదాకా ప్రార్థనలు 24వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 25వ తేదీ తె ల్లవారుజాముదాకా..క్రిస్మస్ ప్రార్థనలు ఉంటాయి. మళ్లీ 31వ తేదీ రాత్రి నుంచి ప్రేయర్ చేయిస్తాం. భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేశాం. ఇంకా ప్రత్యేక సందర్భాలను కూడా నిర్వహిస్తుంటాం. – ఆంథోని కడే పరంబిల్, చర్చి ఓసీడీ -
ఏసు ప్రాణత్యాగానికి ప్రతీకగా..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో సంబరంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. ఏసుక్రీస్తు జన్మదినం (డిసెంబర్ 25) సందర్భంగా జరుపుకునే పండుగ ఇది. ఏసుక్రీస్తు పుట్టిన రోజు కాబట్టి క్రైస్తవులంతా చర్చిలకి వెళ్లి ఆయన జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో క్రైస్తవుల పవిత్ర ప్రార్థనా మందిరాలైన చర్చిలను ఆ రోజు రంగు రంగు లైట్లతో, క్రిస్మస్ ట్రీతో అలంకరిస్తారు. అలాగే ప్రముఖ దేశాలైన లండన్, యురప్లలోని చర్చిలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భిన్నమైన రూపశైలిలో అద్బుత కట్టడాలుగా పేరున్న ఈ చర్చిలకు ఓ విశేషమైన ప్రత్యేకత ఉంది. వాటి నిర్మాణాల వెనుక ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ సుప్రసిద్ధ ప్రార్థనా మందిరాలు ప్రపంచ వ్యాప్తంగా పర్యటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇందులోని కొన్ని చర్చిలు చాలా సినిమాలలో కూడా కనిపించాయి. బైబిల్లో పేర్కొన్న రాజుల పేర్లను, ఏసుక్రీస్తు తల్లి మరియా పవిత్రకు, ఏసు ప్రాణత్యాగానికి ప్రతీకగా బెత్లెహాంలో నిర్మించిన చర్చిలకు ప్రపంచ మందిరాలలో పవిత్రంగా చూస్తారు. అలాంటి చరిత్ర కలిగిన ఈ అద్బుత కట్టడాల గురించి ఓ సారి తెలుసుకుందాం రండి! సాగ్రడా ఫ్యామిలియా, బార్సిలోనా, స్పెయిన్ ఇది ప్రపంచ ప్రముఖ చర్చిల్లో ఒకటి. స్పెయిన్‌లోని బార్సినాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలోని నిర్మించిన రోమన్ కాథలిక్ ప్రార్థన మందిరం. దీనిని 1882లో ప్రముఖ అర్కిటెక్చర్ ఆంటోని గౌడే నిర్మించారు. ఈ చర్చి నిర్మాణం 1882 లో ప్రారంభమైనప్పటికి దీనిని నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. అసంపూర్తిగా ఉన్నప్పటికీ ప్రపంచంలోని ప్రముఖ చర్చిలలో ఇది ఒకటిగా ఉంది. ఓ అద్భుత కళాఖండంతో నిర్మించిన ఈ మందిరానికి పర్యాటకులు ఫిదా అవుతున్నారు. ఏటా ఈ చర్చిని సందర్శించే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ చర్చిపై నిర్మించిన 18 స్తంభాలు మందిరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అప్పటి అర్కిటెక్ గౌడే రూపొందించిన ఈ చర్చి ప్రకృతిని తలపించేలా ఉంటుంది. చర్చి లోపల నిర్మించిన స్తంభాలు మెలితిప్పినట్లుగా ఉండి కొమ్మల్లాంటి చెట్ల ఆకృతిలో ఉంటాయి. ఇవి పర్యటకులను విపరీతంతగా ఆకట్టుకుంటాయి. అలాగే చర్చి ముందు భాగంలో బేస్ వద్ద పాలరాతితో చెక్కిన రెండు తాబేళ్లు మందిరానికి ప్రత్యేక ఆకర్షణ. అవి భూమి, సముద్రాన్ని సమతుల్యం చేస్తున్నాయని చెప్పడానికి ఉదాహరణగా వాటిని అక్కడ చెక్కారు. ఇక చర్చి పైకప్పుపై చెక్కిన మొజాయిక్ నుంచి రాత్రి వేళ చర్చి లోపలికి చంద్రకాంతి పడటం వల్ల ఆ దృశ్యాన్ని చూడటానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు. చంద్రుడి కాంతితోవచ్చే వెలుగు వల్ల చర్చి బయట నుంచి చూసే వారికి ఓ లైట్ హౌజ్లా మెరిసిపోతూ ఉంటుంది. అందువల్ల దీనిని ‘లైట్ హౌజ్’ అని కూడా పిలుస్తుంటారు. అలాగే మందిరంపై నిర్మించిన 18 టవర్లకు ఒక ప్రత్యేకత ఉంది. అందులో ఒక స్తంభం కన్య మరియ మేరి మాతకు చిహ్నంగా నిర్మించగా.. 12 టవర్లను బైబిల్లో పేర్కొన్న అపొస్తులులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. మరో నాలుగు స్థంభాలు వారిలోని నలుగురు సువార్తికులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇక మందిరంపై మధ్యలో నిర్మించిన అతిపెద్ద టవర్ ఏసుక్రీస్తును సూచిస్తుంది. 170 మీటర్ల ఎత్తులో ఉండి బార్సిలోనాలోని మౌంట్‌జ్యూక్ పర్వతం కంటే ఒక మీటర్ తక్కువగా ఉంటుంది. ఈ మౌంట్‌జ్యూక్ పర్వతం స్పెయిన్‌లో ఎత్తైనా పర్వతం. ఇప్పటికీ అసంపూర్ణంగా ఉండిపోయిన ఈ చర్చిని పర్యటించడానికి కనీసం వారం రోజులైన పడుతుంది. అయితే దీనికి ఇప్పటికీ మర్మత్తులు చేస్తూనే ఉన్నారు. అక్కడికి వచ్చే పర్యాటకులు ఈ చర్చి నిర్మాణం కోసం విరాళాలు కూడా ఇస్తుంటారు. ఎప్పుడు మరమ్మత్తులు చేస్తూ ఉన్న ఈ మందిరం 2026 నాటికి పూర్తికావచ్చు. సెయింట్ బాసిల్ కేథడ్రల్ చర్చి అత్యంత ప్రసిద్ధ చర్చిలలో ఒకటైనా ఈ సెయింట్ బాసిల్ కేథడ్రల్ చర్చిని ఒకే పునాదిపై తొమ్మిది ప్రార్థనా మందిరాలుగా నిర్మించారు. రష్యా రాజధాని మాస్కో నగరంలో ఉన్న ఈ చర్చి నిర్మాణం క్రీ.శ. 1561లో ఇవాన్ ది టెర్రిబుల్ పాలనలో పూర్తయింది. ఈ చర్చి అసాధారణమైన వివిధ రంగుల నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సాగ్రడా ఫ్యామిలియా మాదిరిగా, ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం. ఇది పలు సినిమాల్లో కూడా కనిపిస్తుండం విశేషం. దీని లోపలి భాగంలో చాపెల్ నుంచి ఇరుకైన మెట్లు ఉండి, తక్కువ తోరణాలు, గజిబీజీ చాపెల్లతో నిర్మించబడిన ఉండటమే ఈ మందిరం ప్రత్యేకత. ఒకదానిని ఒకటి అనుకుని ఉండే ఈ చాపెల్లలోని ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అవి.. పైకప్పు మధ్యలో ఉన్న టవర్ ఏసుక్రీస్తు తల్లి మేరిమాతకు చిహ్నంగా నిర్మించి.. దీనికి చర్చి ఆప్ ది ఇంటర్సేషన్ అని పేరు పట్టారు. ఇక కనిపించే నాలుగు పెద్ద గోపురాలు అష్టభుజి ప్రార్థన మందిరాలు(చర్చ్ ఆఫ్ ది హోలీ ట్రినిటీ, చర్చ్ ఆఫ్ స్టీస్ సిప్రీయన్& జస్టీనా, చర్చ్ ఆఫ్ ది ఐకాన్ ఆఫ్ సెయింట్ నికోలాస్ ది మిరాకిల్ వర్కర్, చర్చ్ ఆఫ్ ది ఎంట్రీ ఆఫ్ ది లార్డ్ జెరుసలేం) అనే బైబిల్లోని కొన్ని పవిత్ర స్థలాలకు ప్రతికగా ఈ పేర్లన పెట్టారు. బయటి నుంచి చూస్తే చిక్కుముడిగా కనింపిచే ఈ టవర్ల మధ్యలో నాలుగు చిన్నప్రార్థన మందిరాలు ఉన్నాయి. ప్రతి ప్రార్థనా మందిరం కజాన్‌కు వ్యతిరేకంగా చేసిన పోరాటంలోని సంఘటనకు, యుద్ధానికి గౌరవసూచికగా నిర్మించారు. ఈ సెయింట్ బాసిల్ కేథడ్రల్ రంగుల నిర్మాణం నిజంగా ఓ అద్బుతంలా ఉంటుంది. ఈ చర్చి రూపకర్త సెయింట్ బాసిల్ బ్లెస్డ్ను చర్చి లోపలి ప్రార్థనా మందిరంలో సందర్శించవచ్చు. అక్కడ ఆయన విగ్రాహన్ని వెండి పేటికలో ఉంచారు. అయితే ఇలాంటి అద్బుత కట్టడం మరెక్కడా ఉండకూడదనే ఉద్దేశంతో కూలీల కళ్లు తీయించి వారిని అంధులుగా మార్చాడట. నోట్రే డామ్ డి పారిస్- ఫ్రాన్స్: నోట్రే-డామ్ డి పారిస్ అనగా ‘అవర్ లేడీ ఆఫ్ పారిస్. దీనిని సింపుల్‌గా నోట్రే-డామ్ అని కూడా పిలుస్తారు. పారిస్‌లోని అరోండిస్మెంట్లో ఓలే డి లా సిటిలో తూర్పు చివరలో ఈ చర్చిని నిర్మించారు. కన్య మరియ మేరి మాతకు పవిత్రమైన పత్రికగా దీన్ని ప్రకటించారు. ఈ కేథడ్రల్ చర్చి లోపలి విస్తీర్ణం 427-157 అడుగులు(130 నుంచి 48మీటర్లు) దీని పైకప్పు 115 అడుగుల(35 మీటర్ల) ఎత్తులో ఉంటుంది. రెండు పెద్ద గోతిక్ టవర్లు 50 అడుగు వెడల్పు, 1210 పొడవును కలిగి ఈ మందిరానికి పశ్చిమ ముఖానికి కిరీటంగా ఉంటాయి. ఇక చర్చి ముఖ ద్వారం ప్రవేశ ద్వారం తలుపులు గోతిక్ శిల్పాలతో చెక్కబడిన రాజుల విగ్రహాలు వరుసగా ఉంటాయి. ముందు భాగంలో ఉన్న రెండు పెద్ద టవర్లు 68 మీటర్ల ఎత్తులో కలిగి 223 అడుగులు పొడవు ఉంటాయి. రంగులతో మెరిసేటి అద్దాల కిటికిలు 1235-70 పొడవు- వెడల్పులో ఉంటాయి. ముందు భాగంలో ఉండే పొడవైన రెండు స్తంభాలు లేక్కలేనన్ని గంటలను కలిగి ఉంటాయి. ఫ్రెంచ్ గోతిక్ రూపశైలిలో ఉండే నోట్రే-డామ్ చర్చి ప్రపంచ ప్రముఖ చర్చిలలో ఒకటిగా ప్రసిద్ది పొందింది. 1163లో పోప్ అలెగ్జాండర్-3 ఈ చర్చికి పునాది రాళ్లు వేయగా 1250 నాటికి ఈ చర్చి పురైంది. చర్చి నిర్మించిన 100 సంవత్సరాలకు మందిరం ముందు భాగంలోని రెండు ఎత్తైనా చాపెల్‌లను, ఇతర స్థంభాలను, విగ్రహాలను నిర్మించి ఈ ప్రార్థన మందిరాన్ని పూర్తి చేశారు. అయితే ఈ మందిరాన్ని 19వ శతాబ్థంలో పూర్వపు రెండు పవిత్ర ప్రార్థన మందిరాల నిర్మించినట్లు సమాచారం. సెయింట్ పీటర్స్ బసిలికా: వాటికన్ సిటి ఇది వాటికన్ సిటిలో ఉంది. దీనిని న్యూ సెయింట్ పీటర్స్ బసిలికా అని కూడా పిలుస్తారు. ఇటలీలో రోమ్‌లోని వాటికన్ నగరంలోనే ఇది పెద్దది. దీన్ని క్రైస్తవుల మతపరమైన చర్చిలన్నింటీ కంటే గొప్ప మందిరం. వాటికన్ నగరంలో సెయింట్ పీటర్ ప్రస్తుత బాసిలికా నగరంలో(రోమ్‌లోని ఒక ఎన్క్లేవ్), 2వ జూలియస్1506 లో ఈ మందిరం నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే అది 1615 పాల్.వీ రాజు కాలంలో పూర్తైంది. సెయింట్ పీటర్ అపొస్తల రాజు నిర్మించిన మూడు ఎత్తైన బలిపీఠాలపై నుంచి నేరుగా క్రాసింగ్ వద్ద ఉన్న పెద్ద గోపురాన్ని కలుపుతూ నిర్మించారు. ఈ మందిరం అక్కడి పోప్‌ల చర్చే కాకుండా వారి ప్రధాన తీర్థయాత్ర కూడా. కాథలిక్ సంప్రదాయంలో, యేసు పన్నెండు అపొస్తలులలో ఒకడైన సెయింట్ పీటర్ శ్మశానవాటికగా భావిస్తారు. ఆయన సెయింట్ పీటర్ రోమ్ యొక్క మొదటి బిషప్ అని, బైబిల్ ప్రకారం.. క్రీ.శ. 1వ శతాబ్దంలోని రోమన్ క్రైస్తవులు అపొస్తలుడైన పేతురు(సెయింట్ పీటర్) రోమ్కు వెళ్లాడని బైబిల్లో పేర్కొన్నారు. పీటర్ చనిపోయిన తరువాత ఆయన మృతదేహాన్ని బాసిలికాలోని స్మశానవాటికలో ఖననం చేశారని అక్కడి వారి నమ్మకం. వెస్ట్ మినిస్టర్ అబ్బే యూరప్ దేశాలలోని అత్యంత ప్రసిద్ద మత భవనాలలో ఇది ప్రముఖమైనది. ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రార్థన మందిరంగా దీన్ని పిలుస్తారు. లండన్ బరలిలోని పార్లమెంటు భవనానికి పశ్చిమాన ఈ మందిరాన్ని నిర్మించారు. మాజీ బెనెడక్టిన్ ఆశ్రమంగా ఉన్న ఈ మందిరాన్ని క్వీన్ ఎలిబెత్2, 1560లో సెయింట్ పీటర్ కాలేజీయేట్ చర్చిగా మార్చారు. ఆ తర్వాత 1987లో దీనిని సెయింట్ మార్గరేట్ చర్చి, పార్లమెంటు గృహాల సమిష్టి యునెస్కోగా నియమించారు. ఇది కూడా ప్రపంచ వారసత్వ స్థలం. ఈ ప్రార్థన మందిరాన్ని 1300 లో హెన్రీ యెవెల్ అనే రాజు ఆధ్వర్యంలో నార్మన్-శైలిలో నిర్మించారు. ఇంగ్లీష్ గోతిక్ డిజైన్ శైలిలో దీనిని నిర్మించారు. ఈ మందిరానికి పశ్చిమాన ఉన్న రెండు పెద్ద టవర్లు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. వీటిని సర్ క్రిస్టోఫర్ రెన్ రూపొందించినట్లు చెబుతారు. కాని అవి వాస్తవానికి నికోలస్ హాక్స్మూర్, జాన్ జేమ్స్‌లు నిర్మించినట్లుగా సమాచారం. ఈ చాపెల్‌లను వారు 1745 లో పూర్తిచేశారు. 1847 లోపలి గాయక స్టాల్స్, ఎత్తైన బలిపీఠం, రేడోలను పునర్నిర్మించి 1867లో సర్ జార్జ్ గిల్బర్ట్ స్కాట్ పూర్తిచేశారంటా. స్కాట్, జెఎల్ పియర్సన్ కూడా 1880 లలో ఉత్తర ట్రాన్సప్ట్ ముఖభాగాన్ని పుననిర్మించారు. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబు దాడుల్లో అబ్బే భారీగా దెబ్బతింది, యుద్దం అనంతరం ఈ మందిరాన్ని వెంటనే పునర్మించారు. లండన్‌లోని సెయింట్ పాల్స్ కేథడ్రాల్ ప్రపంచ ప్రముఖ చర్చిలలో ఒకటి. దీన్ని లండన్ బిషప్, డయోసెస్ తల్లి చర్చిగా పిలుస్తుంటారు. ఈ ప్రార్థనా మందిరాన్ని లండన్‌లోని ఎత్తైన లుడ్గేట్ కోండపై నిర్మించారు. అత్యంత ప్రముఖ, చరిత్రాత్మకంగా పేరున్న మందిరం ఇది. దీనిని పాల్ అపోస్తులు రాజు క్రీ.శ. 604లో దీన్ని నిర్మించడం జరిగింది. ఈ కేథడ్రల్‌ను 17వ శతాబ్ధపు రాజైన సర్ క్రిస్టోఫర్ రెన్ చేత ఇంగ్లీష్ బరోక్ శైలిలో నిర్మించారు. సర్ రెన్ కాలంలోనే ఈ చర్చి నిర్మాణం పూర్తిగా జరిగింది. ఈ చర్చిలో పాల్ అపోస్తుల రాజు గుర్తులు ఉండటం వల్ల దీనిని ఒల్డ్ సెయింట్ పాల్ చర్చి అని కూడా పిలుస్తుంటారు. ఈ మందిరంలో విక్టోరియా రాణి జూబ్లీ వేడుకలను, రెండవ ప్రపంచ యుద్ధాల ముగింపును సూచించే శాంతి సేవలు ప్రిన్స్ చార్లెస్, లేడీ డయానా స్పెన్సర్ వివాహం ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ ప్రారంభంతో పాటు సిల్వర్, గోల్డెన్, డైమండ్ జూబ్లీలకు క్వీన్ ఎలిజబెత్-2 80, 90వ పుట్టినరోజు వేడుకలు, థాంక్స్ గివింగ్ సేవలు ఈ చర్చిలోనే జరిపారు. సెయింట్ పాల్స్ కేథడ్రల్‌కు సంబంధించిన గుర్తులు ఈ చర్చిలోనే భద్రపరిచారు. చర్చ్ ఆఫ్ ది నేటివిటీ: బెత్లెహాం బసిలికా ఆఫ్ ది నేటివిటీ ఇది బెత్లెహాంలోని వెస్ట్ బ్యాంక్‌లో ఉన్న బాసిలికా. యేసు జన్మస్థలంగా చెప్పుకునే ప్రదేశంలోనే ఈ చర్చిని నిర్మించారు. ఈ ప్రదేశం క్రైస్తవులకు పవిత్రమైన స్థలం, పవిత్ర ప్రార్థనా మందిరం. ఏసుక్రీస్తు ఇక్కడే నిరంతరం ప్రార్థనలు చేసుకునేవారని, అది గ్రోట్టో స్థలమని బైబిల్లో పేర్కొన్నారు. దీంతో క్రైస్తవులు ఈ స్థలాన్ని పవిత్రం స్థలంగా భావిస్తారు. 325-326లో బసిలికా అతని తల్లి హెలెనా జెరూసలేం, బెత్లెహాములను సందర్శించిన కొద్దిరోజులకే ఈ చర్చిని కాన్స్టాంటైన్ ది గ్రేట్‌గా నిర్మించారు. సాంప్రదాయకంగా ఏసు జన్మస్థలం అని భావించి ఇక్కడ బాసిలికా 330-333 కాలంలో నిర్మించినట్లు చెప్పుకుంటారు. 6వ శతాబ్ధంలో సమారిటన్ తిరుగుబాటు సమయంలో 529లో ఈ చర్చిని చాలా భాగాన్ని మంటలతో కాల్చేశారు. అయితే చాలా ఏళ్లకు మళ్లీ దీనిని బైజాంటైన్ చక్రవర్తి క్రీ.శ. 527-565 కాలంలో బాసిలికాను పునర్మించారు. 12వ శతాబ్దంలో క్రూసేడర్స్ చిత్రీకరించిన సెయింట్స్, ఫ్రెస్కోలతో అలంకరించారు. చర్చిలోకి చిన్న ఒట్టోమన్ యుగం నాటి తలుపు ద్వారం ఉంటుంది. దీనికి డోర్ ఆఫ్ రెస్పెక్ట్ అని పేరు పిలుస్తారు. అయితే వాస్తవానికి ఈ ప్రవేశ ద్వారం చాలా పెద్దది, కాని క్రూసేడర్లు దాని పరిమాణాన్ని తగ్గించి గుర్రంపై దాడి చేసేందుకు లోనికి ప్రవేశించకుండా చేశారు. ఆ తరువాత క్రమంగా దానిని అతిచిన్న ముఖ ద్వారంగా మార్చేశారు. 6వ శతాబ్దం నాటి అసలైన ద్వారానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయి. క్రూసేడర్ల యుగంనాటి నిర్మాణ శైలిలో ఈ మందిరాన్ని నిర్మించారు. కాగా ఈ మందిరంలోని ఓ రహష్య చికటి గది లాంతర్లు వెలిగించి, 14 వెండి లైట్లతో అలంకరించి ఉంటుంది. ఏసుక్రీస్తు జన్మించిన స్థలం అదే అని చెప్పడానికి గుర్తుగా దానిని వెండి దీపాలతో అలంకరించారు. గ్రోట్టోలోని ఈ మందిరానికి పై మధ్య భాగంలో ఒక చాపెల్‌ను నిర్మించారు. దానిని ‘చాపెల్ ఆఫ్ ది మాంగెర్ (ది క్రిబ్) అని కూడా పిలుస్తారు. ఈ మందిరానికి, అదే ప్రత్యేక ఆకర్షణ. చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ దీనిని హోలీ సెపల్చర్ అని కూడా పిలుస్తారు, ఇది ఏసుక్రీస్తు సిలువ, ఖననం చేసిన పవిత్ర స్థలంలో నిర్మించిన ప్రార్థనా మందిరం. బైబిల్ ప్రకారం, ఏసుక్రీస్తు సమాధికి, సిలువ వేయబడిన ప్రదేశానికి దగ్గరగా ఉంది (జాన్ 19: 41:42). సిలువ, సమాధులను రెండింటి చూట్టు ఈ ప్రార్థన మందిరాన్నినిర్మించారు. ఓల్డ్ సిటీ ఆఫ్ జెరూసలేలోని వాయువ్యంలో హోలీ సెపల్చర్ చర్చి ఉంది. చక్రవర్తి కాన్స్టాంటైన్ ది గ్రేట్ అనే రాజు క్రీ.శ. 336లో సైట్లో అనే ప్రదేశంలో మొదటగా నిర్మించాడు. ఆ తరువాత 614లో పర్షియన్లు దీనిని కుల్చివేసి మోడెస్టస్ (థియోడోసియస్ ఆశ్రమ మఠాధిపతి, 616-626) పునరుద్ధరించారు. ఖలీఫ్ అల్-అకిమ్ బా-అమర్ అల్లాహ్ 1009లో దీనిని కుల్చివేయడంతో మళ్లీ 12వ శతాబ్దంలో క్రూసేడర్లు పునర్నిర్మాణాన్ని చేపట్టి ప్రార్థనలు చేసుకునేవారు. అలా తరుచూ మరమ్మత్తులు చేపడుతూ 1810 నాటికి పూర్తి చేశారు.. సెయింట్ మార్క్స్ బసిలికా వాస్తవానికి ఇది డోగే ప్రార్థనా మందిరం. సెయింట్ మార్క్స్ బసిలికా (బసిలికా డి శాన్ మార్కో) 829లో ముఖ్యమైన చర్చి. సెయింట్ మార్క్ యొక్క అవశేషాలు అలెగ్జాండ్రియా నుంచి వెనిస్కు వచ్చి ఇక్కడ ఖననం చేసినట్లుగా చెబుతారు. 1063 నాటి కాన్స్టాంట్ నోబెల్ చర్చ్ ఆఫ్ అపోస్టల్స్ చర్చి నమునాలను తీసుకుని ఇప్పటి గౌడే-ప్లాన్ శైలిలో నిర్మించారు. ఈ చర్చి నిర్మాణానికి 1075లో, డోజ్ ఒక చట్టాన్ని ఆమోదించి మరియు టింటోరెట్టితో సహా కళాకారులు రూపొందించిన ‘ఆధునిక’ మొజాయిక్లతో భర్తీ చేశారు. మొజాయిక్లు, బంగారు బలిపీఠం, అందమైన ప్రార్థనా మందిరాలు మరియు ఖజానా ఇటలీకి బాగా నచ్చిన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలిచాయి. క్రీ.శ.1075 లోడోజ్ ఒక చట్టాన్ని ఆమోదించాడు, ఈ చర్చిని బాసిలికాను అలంకరించడానికి విలువైన వస్తువులను, తూర్పు నుంచి అరుదైన పాలరాయి, పోర్ఫిరీ, అలబాస్టర్ మరియు జాస్పర్ 500లకు పైగా స్తంభాలను తెప్పించి నిర్మించాడు. దీని లోపలి భాగాన్ని 12, 13 శతాబ్ధాల కాలం నాటి 4,240 చదరపు మీటర్ల బంగారు మొజాయికులతో నిర్మించాడు. 1500, 1750 మధ్య,కొన్ని పాత విభాగాలను టిటియన్, టింటోరెట్టోతో సహా కళాకారులు రూపొందించిన ఆధునిక మొజాయికన్లతో నిర్మించారు. అలాగే దీని ముఖభాగం ముందు రెండు పాలరాయి పైలాస్టర్లు, పిలాస్త్రీ అక్రితాని, ఆరవ శతాబ్దపు అద్భుతమైన శిల్పాలతో కప్పబడి ఉంటాయి. సెయింట్ మార్క్ మాదిరిగానే, ఈజిప్టు 4వ శతాబ్దంలోని మూలలోని టెట్రార్చ్స్ శిల్పం పోర్ఫిరీ నుంచి తీసుకుని ఈ శిల్పాలను రూపొందించారు. మొజాయిన్ల, బంగారు బలిపీఠం, అందమైన ప్రార్థనా మందిరాలు, ఖజానాలు ఉండటంతో ఇది ఇటలీలో అందమైన పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా నిలిచింది. హగియా సోఫియా, ఇస్తాంబుల్, టర్కీ.. హగియా సోఫియా అనగా ‘పవిత్ర జ్ఞానం’ అని అర్ధం. ఇది మాజీ గ్రీకు ఆర్థోడాక్స్ పితృస్వామ్య ప్రార్థన మందరం. క్రీ.శ. 537లో నిర్మిచిన ఈ మందిరం క్రీ.శ.1453 వరకు మ్యుజియంగా ఉండేది. లాటిన్ సామ్రాజ్యంలో ఈ మందిరాన్ని రోమన్ కాథలిక్ కేథడ్రాల్ మందిరంగా మార్చారు. రెండు అంతస్తులుగా నిర్మించిన ఈ మందిరాన్ని క్రీ.శ. 537లో పూర్తిచేశారు. దీనిని 6 సంత్సరాలలో పూర్తి చేశారు. 6వ శతాబ్దంలో కాన్స్టాంటినోపుల్ (ఇప్పుడు ఇస్తాంబుల్, టర్కీ)లోని కేథడ్రల్ స్మారక చిహ్నంగా నిర్మించారు. దీనిపై నిర్మించిన గోపురం కేథడ్రల్‌కు చిహ్నం. హెలెన్ గార్డనర్, ఫ్రెడ్ క్లీనర్లు రూపొందించిన ఈ కట్టడాడంలో అసలు ఉక్కు పరికరాలను వాడకపోవడం ఈ మందిరానికి ఉన్న ప్రత్యేకత. ఈ మందిరాన్ని 270 అడుగుల (82 మీటర్లు) పొడవు మరియు 240 అడుగుల (73 మీటర్లు) వెడల్పులో నిర్మించారు. అలాగే దీనిపైన నిర్మించిన ప్రధాన గోపురం 108 అడుగుల (33 మీటర్లు) చర్చికి కిరీటంగా వ్యవహరిస్తుంది. ఈ గోపురం 180 అడుగుల (55 మీటర్లు) పెండెంటివ్స్ రెండు సెమిడోమ్లకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మందిరంపైన నిలువుగా నిర్మించిన గ్యాలరీలతో వేరు చేసి ఉంటుంది. అలాగే మూడు అంతస్తుల మేట్లకు, గోపురానికి మద్దుతుగా ఓ పాలరాయి పైర్లను నిర్మించారు. గ్యాలరీలకు పైన ఉన్న గోడలు,గోపురం బేస్‌లు వివిధ డిజైన్ల కిటికీలచే అమర్చబడి ఉంటుంది. ఈ కిటికీల నుంచి వచ్చే గాలికి ఆకాశంలో తేలుతున్నట్లుగా అనిపిస్తుందని అక్కడ పర్యటించినవారు అంటుంటారు. 1,400 సంవత్సరాల కేథడ్రల్, మసీదుగా ఉండేది ఆ తర్వాత దీనిని ఈ చర్చిగా మార్చారు. ప్రస్తుతం ఇది పర్యటకానికి వీలుగా పురాతన వస్తువులను ఉంచే మ్యూజియంగా మార్చారు. దీనిని మొదటిసారి నిర్మించినప్పుడు, కాన్స్టాంట్నోబుల్లో ఇని బైజాంటైన్ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇది అధికారికంగా క్రిస్టియన్, రోమన్ సామ్రాజ్యం తూర్పు భాగంలో ఉంది. - స్నేహలత (వెబ్ డెస్క్) -
క్రిస్మస్ సంబరాలకు చారిత్రక చర్చిలు
డిసెంబర్ నెల అంటే టక్కున గుర్తొచ్చేది క్రిస్మస్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లు ఈ పండుగను తమదైన శైలిలో అంగరంగవైభవంగా పండుగను జరుపుకుంటారు. దాదాపు డిసెంబర్ నెల మొత్తం చర్చిలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. హైదరాబాద్ నగరంలో క్రిస్మస్ వేడుకలు కొంత ప్రత్యేకమేనని చెప్పొచ్చు. ఎందుకంటే కులమతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ వేడుకల్లో వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన చర్చిలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నగరం నలుమూలలనుంచి ప్రజలు ఇక్కడకు చేరుకుని ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆంగ్లేయుల ప్రార్థనల కోసం.. నిజాం పాలకులు బ్రిటిషర్లకు అప్పగించిన సికింద్రాబాద్‌ను ఆంగ్లేయులు మిలిటరీ స్థావరంతో (కంటోన్మెంట్) పాటు హైదరాబాద్‌కు సమాంతర నగరంగా తీర్చిదిద్దారు. ఓ వైపు మిలిటరీ శిక్షణ కేంద్రాలు, మిలిటరీ ఆంక్షల నడుమ వ్యాపార, వాణిజ్య కేంద్రాలు, సామాన్యుల జనావాసాలు అభివృద్ధి చెందుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే బ్రిటిష్ పాలకులు తాము ప్రార్థనలు చేసుకునేందుకు వీలుగా నగరమంతటా చర్చిల నిర్మాణం ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలో ఉన్న వందకుపైగా చర్చిలలో కొన్ని వందేళ్లకుపైగా చరిత్ర కలిగినవి ఉన్నాయి. సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ చర్చి ఈ చర్చి సికింద్రాబాద్‌లోని ఈస్ట్ మారేడ్‌పల్లిలోని ప్రముఖమైన చర్చి. 1813లో నిర్మితమైన ఈ చర్చి జంటనగరాల్లోనే అత్యంత పురాతనమైంది. లాన్సర్స్ లైన్‌లోని బ్రిటిష్ కుటుంబాలు ప్రార్థన చేసుకునేందుకు వీలుగా దీనిని నిర్మించారు. 1998లో ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ అవార్డును దక్కించుకుంది. 111 ఏళ్ల నాటి ‘పైప్ ఆర్గాన్’ నేటికీ వినియోగంలో ఉండటం దీని ప్రత్యేకత. చర్చి ప్రారంభించిన మొదట్లో ఆంగ్లేయులే మాత్రమే వెళ్లేవారు. కానీ ప్రస్తుతం నగరంలోని క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు సెయింట్ మేరీస్ చర్చి నగరంలోని అత్యంత ప్రముఖమైన చర్చిగా సెయింట్ మేరీస్ చర్చి ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈ చర్చిని గోతిక్ శైలిలో నిర్మించారు. అత్యంత పురాతనమైన రోమన్ క్యాథలిక్ చర్చి ఇది. ఐరిష్ క్యాథలిక్స్‌తో కలిసి ఫాదర్ డేనియల్ మర్ఫీ 1840లో ఈ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించగా, 1850లో పూర్తయింది. 1886 వరకు హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ ప్రధాన చర్చి (క్యాథెడ్రల్)గా కొనసాగింది. చాలాకాలం ఆర్చ్ డయోసిస్ ఆఫ్ హైదరాబాద్ ప్రధాన చర్చిగా కొనసాగింది. రోమన్ క్యాథలిక్ చర్చిలలో ప్రముఖమైన వాటికి దక్కే ‘బాసిలికా’ గుర్తింపును ఈ చర్చికి 2008లో ఇచ్చారు. ‘బాసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ ది అసెంప్షన్’గా కూడా వ్యవహరిస్తారు. కన్య మేరీ యేసు క్రీస్తును చేతుల్లో పట్టుకున్న దృష్యం భావోద్వేగ పూరితంగా ఉంటుంది. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. సెయింట్ థామస్ ఎస్పీజీ చర్చి సికింద్రాబాద్‌లోని పురాతన చర్చిలలో అత్యంత ముఖ్యమైన చర్చ. ఒకటి. ఈ చర్చికి సంబంధించిన స్థలాల్లో చాలావరకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తీసుకుంది. ప్రస్తుత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్థలం ఒకప్పుడు ఈ చర్చి ఆధ్వర్యంలోనిదే. 1852లో నిర్మితమైంది. సెంటినరీ బాప్టిస్ట్ చర్చి ఈ చర్చి సికింద్రాబాద్‌లో అత్యంత ప్రాముఖ్యమైన చర్చి. బాప్టిస్ట్ చర్చిగా రెవరెండ్ డబ్ల్యూ.డబ్ల్యూ. క్యాంప్‌బెల్ ఆధ్వర్యంలో 1875లో ఏర్పాటైంది. 1975లో పునర్నిర్మాణం చేపట్టగా 1991లో పూర్తయింది. ఈ చర్చి ఆధ్వర్యంలో జంటనగరాల్లోని 35 చర్చిలు కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రముఖ చర్చిలలో చాలా ముఖ్యమైనది. ఆల్ సెయింట్స్ చర్చి చర్చి ఆఫ్ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో 1860లో తిరుమలగిరిలో నిర్మితమైన ఈ చర్చి నిర్వహణ ఆర్మీ ఆధ్వర్యంలోనే ఉండేది. స్వాతంత్య్రానంతరం ఆంగ్లికన్, ప్రొటెస్టెంట్ల సమ్మేళనంతో ఏర్పాటైన ‘చర్చి ఆఫ్ సౌత్ ఇండియా’ (సీఎస్ఐ) పరిధిలోకి వచ్చింది. క్వీన్ ఎలిజిబెత్– 2 భర్త ఫిలిప్‌తో పాటు 1983లో నగరాన్ని సందర్శించారు. వారి 36వ వివాహ వార్షికోత్సవాన్ని ఈ చర్చిలోనే జరుపుకొన్నారు. ప్రతి వారం ఇంగ్లీష్, తమిళ భాషలలో నిర్వాహకులు తమ సేవలను అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. హోలీ ట్రినిటీ చర్చి ఈ చర్చి సికింద్రాబాద్‌లో అత్యంత ప్రసిద్డి గాంచిన చర్చి. చర్చి ఆఫ్ సౌత్ ఇండియా (సీఎస్ఐ) ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఈ చర్చి విక్టోరియన్ గోతిక్ శైలిలో నిర్మించారు. 1847లో అప్పటి బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా తన సొంత డబ్బులతో బొల్లారంలో నిర్మించారు. ఈ చర్చిని క్వీన్ చర్చిగా పిలుస్తారు. క్రిస్మస్ వేడుకలకు ప్రజలు పెద్ద యెత్తున పాల్గొంటారు. గారిసన్ వెస్లీ చర్చి సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో ఈ చర్చి ప్రాముఖ్యతను సంతరించుకుంది. 1853లో నిర్మాణం ప్రారంభించగా, 1883 నుంచి వినియోగంలోకి వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం కేవలం ఆర్మీ అధికారుల కుటుంబాలు మాత్రమే ఈ చర్చిలో ప్రార్థనలు చేసేవారు. క్రిస్మస్, గుడ్ఫ్రైడ్డే వేడుకలు ఈ చర్చిలో ఘనంగా నిర్వహిస్తారు. మిలీనియం మెథడిస్ట్ చర్చి ఈ చర్చి సరోజిని దేవి రోడ్, సికింద్రాబాద్‌లోని చాలా ముఖ్యమైన చర్చి. మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన మిషనరీస్ ఆధ్వర్యంలో 1882లో నిర్మితమైంది. మెథడిస్ట్ చర్చిగా ప్రారంభమైన ఈ చర్చిని 2001లో పునర్నిర్మించాక మిలినియం మెథడిస్ట్ చర్చిగా నామకరణం చేశారు. ఈ చర్చిలో పెద్ద యెత్తున ప్రజలు క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. సెయింట్ జోసెఫ్ చర్చి ఇది నగరంలోని అత్యంత ప్రముఖమైన చర్చి. అబిడ్స్‌లోని ఈ చర్చిలో ప్రార్థనలు చేయడానికి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు. ప్రజలు పెద్ద సంఖ్యలో క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటారు. సంవత్సరం పొడువున పర్యాటకులు ఈ చర్చిని సందర్శిస్తుంటారు. సెయింట్ జార్జ్ చర్చి-కింగ్ కోఠి హైదరాబాద్- ఇది చాలా పురాతనమైన చర్చి, హైదరాబాద్ వారసత్వ సంపదలో ఈ చర్చికి చోటు కల్పించారు. చర్చ ఆఫ్ సౌత్ ఇండియా ఆధ్వర్యంలో ఈ చర్చి కొనసాగుతుంది. క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. నగరంలోని ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. గ్రాండ్ క్రిస్మస్ కార్నివాల్ నగరంలో క్రిస్మస్ వేడుకలలో కార్నివాల్ వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో సంగీతం, ఆహారం & షాపింగ్ సదుపాయం కల్పిస్తారు. లైవ్ బ్యాండ్ ప్రదర్శనలు, క్రిస్మస్ కరోల్స్, మీట్ అండ్ గ్రీట్ శాంతా క్లాజ్ వంటి కార్యకలాపాలతో ప్రత్యేక ఆకర్శనగా నిలుస్తాయి. ఓపెన్ మైక్, రాప్ ఛాలెంజ్, హిప్ హాప్ ఛాలెంజ్, కాస్ ప్లే పోటీలు, డ్రాయింగ్ పోటీలు, ఫ్యాన్సీ దుస్తులు, లిటిల్ శాంటా పోటీలు యువత ఉత్సాహంగా పాల్గొంటారు. వైవిధ్యమైన ఆటలతో కుటుంబాలకు వినోదం లభిస్తుంది. డిసెంబర్ 15 న ప్రారంభమైన కరోల్స్ ఆదివారం వివిధ చర్చిలలో ముగిసింది. క్రిస్మస్ రోజున మెథడిస్ట్ చర్చిలో పేదలు, వితంతువులకు ప్రత్యేక బహుమతులు, విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేస్తారు. క్రిస్మస్ వేడుకలకు తెలంగాణ ప్రభుత్వం 15కోట్లు విడుదల చేసింది. మైనారిటీ సంక్షేమ శాఖ ఈ నిధులను కేటాయించింది. ఇప్పటికే తెలంగాణలోని అన్ని జిల్లాలకు నిధులు పంపిణి జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు. - రవికాంత్ (వెబ్ డెస్క్) -
హైదరాబాద్‌లో క్రిస్మస్ వేడుకలు..
డిసెంబర్ నెల ముదలైందంటే చాలు నగరం అంతా క్రిస్మస్, న్యూయర్ వేడుకల సెలబ్రేషన్స్‌తో హడావుడిగా ఉంటుంది. హిందూ, ముస్లిం పండుగలు, ప్రముఖుల పుట్టినరోజు వేడుకలతో గడిచే ఏడాది.. చివరగా క్రిస్మస్ పండుగతో పూర్తవుతుంది. అందుకే ఈ పండగకు పట్టణప్రజలు అత్యంత ప్రాముఖ్యత నిస్తారు. ఏసుక్రిస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇక మన హైదరాబాద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిసెంబర్ నెల మొదలైందంటే చాలు నగరాల్లో ఎక్కడా చూసినా క్రిస్మస్ ట్రీ, స్టార్స్, క్రిస్మస్ తాతలు దర్శనమిస్తాయి. క్రైస్తవులు తమ ఇంటి ముందు, పైన స్టార్స్‌ను వ్రేలాడిస్తారు. ఇంటి లోపల క్రిస్మస్ ట్రీని రంగు రంగు లైట్లతో అలంకరించి పెట్టుకుంటారు. క్రిస్మస్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కేకు. ఈ కేకును ప్రత్యేకంగా తయారు చేసి క్రిస్మస్ పండుగ రోజున విక్రయిస్తారు. అలాగే ఈ పండుగలో బహుమతులు ఒక భాగమే. మరి ఇంతటి ప్రాముఖ్యత ఉన్న క్రిస్మస్ పండగను మన హైదరాబాద్‌లో ఏలా జరుపుకుంటారో, నగరంలో ఉండే హడావుడి గురించి బహుమతులు, కేకుల తయారి గురించి తెలుసుకుందాం రండి. క్రిస్మస్కి నగరం ఇలా ముస్తాబవుతుంది: డిసెంబర్ రాగానే నగరంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ఎక్కడ చూసిన స్టార్స్, వివిధ రంగుల లైట్లతో హైదరాబాద్ నగరమంతా తారలే కిందకు వచ్చేయేమో అనేలా విరజిల్లుతుంది. క్రైస్తవులు తమ ఇంటినంతా రంగుల రంగుల లైట్లతో, ఓ పెద్ద స్టార్, క్రిస్మస్ ట్రీలతో అలంకరించుకుంటారు. ఇక షాపింగ్ మాల్స్ గురించి పెద్దగా చెప్పనక్కేర్లేదు. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఏరియాలలో ఉండే ఏ షాపింగ్ మాల్‌కు వెళ్లినా అక్కడ క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ తాత దర్శనమిస్తారు. బిల్డింగ్ అంత ఎత్తు ఉండే.. ఆకాశాన్ని తాకుతుందేమో అనేంత ఎత్తుగా క్రిస్మస్ ట్రీని పెట్టి దానికి బహుమతుల బొమ్మలు, చాక్లేట్స్ బొమ్మలు, క్రిస్మస్ తాత బొమ్మలు వంటి వివిధ రకాల మెరిసే బొమ్మలతో ఆకర్షణీయంగా అలంకరిస్తారు. కోన్ ఆకారంలో ఉండే క్రిస్మస్ ట్రీకి చివరి అంచున పెద్ద స్టార్‌ను బొమ్మను ఉంచుతారు. ఇది ఏసుక్రిస్తు జననానికి సూచిక. ఈ క్రిస్మస్ ట్రీ అలంకరణకను సంబంధించిన డేకరేషన్ వస్తువులు అన్ని చోట్ల దొరకవు. వాటికి సంబంధించి హైదరాబాద్‌లో ప్రత్యేకమైన బజార్లు ఉంటాయి. కోఠి, సికింద్రాబాద్ బజార్, ఒల్డ్ సీటి బేగం బజారు వంటి ప్రత్యేకంగా వాటి కోసం బజార్లు ఉన్నాయి. అక్కడ క్రిస్మస్ సంబంధించిన వస్తువులు, బహుమతులు అన్ని కూడా దొరుకుతాయి. క్రిస్మస్ కేకు ప్రాముఖ్యత: క్రిస్మస్ అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ప్లమ్ కేకు. అన్ని కేకుల్లా కాకుండా క్రిస్మస్ కేకు ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇందుకోసం కేకు తయారీని రెండు నెలల ముందు నుంచే మొదలు పెడతారు. కేకు కోసం ఏ ఒక్క డ్రై ఫ్రూట్స్ వదలరు అన్నీరకాల డ్రై ఫ్రూట్స్‌ను వాడుతారు. డ్రై ఫ్రూట్స్‌తో తయారు చేసే ఈ కేకును ‘ప్లమ్ కేక్’ అంటారు. దీని కోసం రెండు నెలల ముందే వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ అన్నింటిని వైన్‌తో బాగా కలిపి నానబెట్టి తయారు చేస్తారు. వైన్‌లో డ్రై ఫ్రూట్స్‌ను కలిపేందుకు తాజా ద్రాక్ష పండ్ల రసాన్ని వాడతారు. ఇందుకోసం గ్రేప్ వైన్ ప్రక్రియ విధానాన్ని వాడతారు. అంటే తాజా ద్రాక్ష పండ్లను తొక్కుతూ రసాన్ని తీస్తారు. ఈ క్రమంలో దేవుడి పాటలు పాడుతూ.. డ్రమ్స్ వాయిస్తూ.. క్రైస్తవులు ఉల్లసంగా డ్యాన్స్ చేస్తూ ప్రతిఒక్కరు ఈ ‘గ్రేప్ స్టంపింగ్’లో పాల్గొంటారు. ఈ కేకు మిక్సింగ్ వేడుకతోనే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలవుతాయి. ఓ వేడుకలా జరుపుకునే కేకు మిక్సింగ్ ప్రక్రియ విదేశాలల్లో క్రిస్మస్ పండుగలో ఆచారంగా ఉంది. అలాగే క్రిస్మస్ సంబరాలలో ఇది ఒక భాగం కూడా. ఈ ఆచారం మొదట విదేశాలలో మాత్రమే ఉండేది. ఆ తరువాత క్రమ క్రమంగా మన భారతదేశంలో కూడా జరుపుతున్నారు. మన హైదరాబాద్‌లో కూడా పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ రెండు నెలల ముందే సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుతున్నారు. శంషాబాద్ నోవాటేల్ స్టార్ హోటల్స్, హైదరాబాద్ గోల్కొండ హోటల్, తాజ్ బంజారా, తాజ్ క్రిష్ణా హోటల్స్‌తో పాటు పలు ప్రముఖ హోటల్స్ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా కేకు మిక్సింగ్ వేడుకను జరుపుతున్నాయి. దీని కోసం సినీ ప్రముఖులను, ప్రముఖలను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానిస్తారు. కేకు తయారీ కోసం చేసే డ్రై ఫ్రూట్స్ మిక్సింగ్‌లో వారు పాల్గొని అక్కడి వారిలో ఉత్సాహాన్ని నింపుతారు. ఇలా తయారు చేసే క్రిస్మస్ కేకు రుచికరంగా ఉండటమే కాదు.. దాని ధర కూడా ఎక్కువగానే. అరకిలో కేకు రూ.500 నుంచి రూ.800 వరకు ఉంటుంది. హైదరాబాద్‌లో క్రైస్తవులు ఇలా క్రిస్మస్ సంబరాలను జరుపుకుంటారు: మతబేధం చూపకుండా ఈ పండుగను ప్రతి ఒక్కరు ఉత్సాహంగా జరుపుకుంటారు. అంతటి ప్రాముఖ్యత ఉన్న క్రిస్మస్ సీజన్ మొత్తం క్రైస్తవులంతా ఆనందోత్సాహాలతో ఉంటారు. డిసెంబర్ నెల మొదలైనప్పటి నుంచే ఆయా చర్చి సంఘ పెద్దలు, చర్చి సభ్యుల ఇళ్లకు వెళ్లి పాటలు పాడుతూ ఏసుక్రీస్తు జన్మదిన వేడుకలకు ఆహ్వానం ఇస్తారు. దీనినే ‘క్యారెల్స్’ అని పిలుస్తారు. ఈ క్యారెల్స్ను ప్రతి రోజు సాయంత్రం నుంచి రాత్రంతా నిర్వహిస్తారు. చర్చి సంఘ పెద్దలు, చర్చి సభ్యులతో కలసి గుంపులుగా చేరి.. ఎవరెవరి ఇళ్లకు వెళ్లాలో ముందుగానే ప్రణాళిక వేసుకుంటారు. ఆ విధంగా సాయంత్రం నుంచి రాత్రివరకు ప్రతి సంఘ సభ్యుడి ఇంటికి వెళ్లి వారిని క్రిస్మస్ పండుగ వేడుకలో భాగస్వాములను చేస్తూ పండుగ వేడుకలకు ఆహ్వానిస్తారు. ఈ క్రమంలో వారంతా గిటారు, డ్రమ్స్ వాయిస్తూ ఆనందోత్సాహాలతో డ్యాన్స్‌లు వేస్తూ ఆ ఇంట్లో కాసేపు సందడి చేసి క్రిస్మస్ పండుగకు వారికి ఆహ్వానం తెలుపుతారు. ఇలా ప్రతిరోజు క్రిస్మస్ వరకు చర్చి పెద్దలు, ఇతర సంఘ సభ్యులంతా బీజీగా ఉంటారు. ఈ క్యారెల్స్లో ప్రతి సంఘ సభ్యులు పాల్గొనాల్సిందే. అలాగే క్రిస్మస్ డిసెంబర్ 25 తేదికి 10 రోజుల ముందు చర్చిలో సేమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా చర్చిలోని సభ్యులందరికి విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈ విందులో స్వీట్స్, కేకు, వివిధ రకాలు భోజన పదార్థాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో అందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, పాటలు పాడటం, ఆటల పోటీలను నిర్వహిస్తారు. పోటీల్లో గెలిచిన వారికి, పాటలు బాగా పాడిన వారికి, డ్యాన్స్ బాగా చేసే వారికి బహుమతులు ఇస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుపుకునే ఈ ప్రీ క్రిస్మస్ వేడుకలు ఆట, పాటలతో చిందలేస్తూ రోజంతా ఆనందోత్సహాలతో సందడిగా గడుపుతారు. ఇలా సందడి చేస్తూ గ్రాండ్ క్రిస్మస్ పండుగకు స్వాగతం పలుకుతారు. ఇలా హైదరాబాద్‌లో కొన్ని చర్చిలలో ప్రీ క్రిస్మస్ ఈవేంట్స్ను ఘనంగా క్రిస్మస్ నిర్వహిస్తారు. అవి సికింద్రాబాద్ వెస్టీ చర్చి, సెయింట్ మార్టిన్స్, కల్వరి టెంపుల్, ది కింగ్స్ టెంపుల్, బాప్తిస్ట్ చర్చిలు మొదలైనవి. క్రిస్మస్ బహుమతులు: క్రిస్మస్ అనగానే ముఖ్యంగా గుర్తొచ్చేది కేకు ఆ తరువాత బహుమతులు. అవును క్రిస్మస్ అంటేనే బహుమతులు ఇవ్వడం. ఈ బహుమతులను ఇచ్చేది శాంటా క్లాజ్(క్రిస్మస్ తాత). ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండటం, ఇతరులను ఆనందపరచడమే ఈ క్రిస్మస్ ముఖ్య ఉద్దేశం. అందుకే కుటుంబ పెద్దలు తమ పిల్లలకు ఏమి ఇష్టమో వాటిని ఈ పండుగ రోజున బహుమతిగా ఇస్తారు. ఇందుకోసం వారు బహుమతిని కొని సీక్రేట్‌గా ఓ ప్లేస్ ఉంచి వారు చూసేలా చేసి సర్ప్రైజ్ చేస్తారు. నిజంగానే క్రిస్మస్ తాత వచ్చి తనకు నచ్చిన వస్తువు ఇచ్చి వెళ్లాడనుకుని పిల్లలు నమ్ముతారు. ఈ పండుగకు కానుకలను ఇవ్వడం అనేది విదేశాల్లో ఓ ఆచారంగా ఉంది. క్రిస్మస్ వస్తే చాలు విదేశాల్లో పిల్లలకు తమకు కావాలసిన బహుమతుల జాబితా తయారు చేసి వారి తల్లిదండ్రులకు ఇస్తారు. అందులో పేర్కొన్న కానుకలను వారు తప్పక ఇవ్వాల్సిందే మరి. చోట్ల, విదేశాలలో లేనివారికి ఏదో ఒక విధంగా సాయం చేసి వారి అవసరాలను తీరుస్తారు కూడా. అలా ఇదే పద్దతిని క్రమ క్రమంగా మన ఇండియాకి కూడ వచ్చేసింది. బహుమతులు తెచ్చే క్రిస్మస్ తాత ఇలా వచ్చాడు.. అసలు క్రిస్మస్కి ఈ బహుమతుల ఆచారం ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఓ ధనికుడైన వృద్దుడు ఒంటరిగా జీవించేవాడు. అతడు కాలక్షేపం కోసం రోజూ సాయంత్రం అలా బయట నడుస్తూ ఉండేవాడు. రోజూలాగే ఓ రోజు సాయంత్రం బయటకు వెళ్లిన అతనికి వీధిలో ఓ పేద కుటుంబం రోడ్డు పక్కన నివసిస్తున్నట్లు గమనించాడు. అది క్రిస్మస్ సీజన్ కాబట్టి చలి కూడా ఎక్కువగా ఉంటుంది వారు దుప్పట్లు లేక చలికి వణుకుతూ ఉండేవారు. పిల్లలకు సరైన బట్టలు లేకుండా ఇబ్బందులు పడుతున్న వారిని రోజు చూస్తుండేవాడు. అలా రోజు వారిని చూసి వారికి ఏ విధంగానైనా సాయం చేయాలని అనుకున్నాడు. ఓ రాత్రి పూట సిక్రేట్‌గా వెళ్లి వారికి దుప్పట్లు, దుస్తులు, ఆట బొమ్మలు, కొన్ని డబ్బులు వారి ఇంటి ముందు పెట్టి వెళ్లాడు. అప్పుడు ఆయన తలకు చలి చోపి, కోటును ధరించి చేతి కర్రతో ఉన్న ఆయనను వారు గమనించారు. అయితే తెల్లవారు జామున అది చూసి వారు. దేవుడే శాంటాక్లాస్(క్రిస్మస్ తాత)ను పంపించాడని. అతడే వారికి సాయం చేశాడని అనుకుంటారు. అలా ఈ క్రిస్మస్ తాత పుట్టుకొచ్చాడు. దీంతో ప్రజలు సీక్రేట్ శాంటా క్లాజా అంటూ పిలుచుకుంటారు. ఇలా క్రిస్మస్ తాత కథలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా చెప్పుకుంటారు. అయితే దీనికి సంబంధించిన అసలు కథ బైబిల్లో కూడా ఉంది. దీనిని చర్చిలోని సండే స్కూల్స్‌లో పిల్లలకు కథగా చెబుతారు. -
ఈ క్రిస్మస్ మీ ప్రియమైన వారితో..
క్రిస్మస్ అంటే ముందుగా గుర్తొచ్చేవి మనసు దోచే కానుకలు.. చల్లటి సాయంత్రాలు.. రంగుల రాత్రులు. పండుగ నాడు తమకిష్టమైన వారికి ఏదైనా ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలని తహతహలాడే వారు కొందరైతే. అందరిలా మామూలుగా కాకుండా పండుగను కొంత ప్రత్యేకంగా.. మరికొంత ‘ప్రేమ’గా జరుపుకోవాలని ఆలోచించే వారు మరికొందరు. అలాంటి వారు, ముఖ్యంగా పర్యటనలంటే ఇష్టపడేవారు తమ ప్రియమైన వారికి ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటే పండుగను తమదైన రీతిలో కన్నుల పండుగగా జరుపుకునే ప్రదేశాలకు తీసుకెళ్లండి. మీ మనసుకు దగ్గరైన వారితో ఈ క్రిస్మస్ పండుగ రోజును మరింత అందంగా, గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా మార్చుకోండి. 1) గోవా ఈ క్రిస్మస్ మరింత అందంగా సెలబ్రేట్ చేసుకోవటానికి గోవా ఓ అద్భుతమైన ప్రదేశం. క్రిస్మస్ రోజున గోవాలోని దాదాపు 400 చర్చిలు సప్తవర్ణశోభితంగా వెలుగిపోతాయి. రాత్రి వేళల్లో గోవా ఓ నూతన స్వర్గంలా అనిపిస్తుంది. వయస్సుతో సంబంధంలేకుండా అన్ని వయస్సుల వారు రాత్రి వేళ పెద్ద సంఖ్యలో చర్చిల వద్దకు చేరి ప్రార్థనలు నిర్వహిస్తారు. పండుగను మరింత అందంగా జరుపుకోవటానికి ప్రపంచం నలుమూలలనుంచి పర్యాటకులు గోవా చేరుకుంటారు. ఇక ఇక్కడి బీచ్‌ల వద్ద ఉండే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2) పాండిచ్చేరి ‘లిటిల్ ఫ్రాన్స్’ అని పిలువబడే పాండిచ్చేరి అద్భుతమైన కట్టడాలతో, సుందరమైన సముద్ర తీరాలతో మనల్ని కట్టిపడేస్తుంది. ఫ్రాన్స్ మూలాలు ఉన్న చాలామంది క్రిస్టియన్లు క్రిస్మస్ను తమదైన సాంప్రదాయాలు పాటిస్తూ కన్నులపండువగా జరుపుకుంటారు. పండుగనాడు అక్కడి చర్చిలు, బీచ్‌లు ఓ ప్రత్యేక ఆకర్షణ నిలుస్తాయి. 3) మనాలి చల్లని శీతాకాలం నాడు తెల్లటి మంచుతో మనాలి ఓ వెండి పర్వతంలా అందంగా మెరిసిపోతుంది. అందుకే మనాలిలో జరుపుకునే క్రిస్మస్కు వైట్ క్రిస్మస్ అని పేరు కూడా ఉంది. కేవలం క్రిస్మస్తోనే కాకుండా న్యూ ఇయర్‌తో మొదలయ్యే పండుగలన్నింటికి మంచుతో కప్పబడిన మనాలి స్వాగతం పలుకుతుంది. అందంగా అలంకరించబడిన హోటళ్లు పండుగ వాతావరణాన్ని పరిమళించేలా కులు ఫోక్ మ్యూజిక్ మనల్ని మైమరిపింపజేస్తుంది. ప్రతి ఏటా వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోందంటే మనాలి ప్రకృతి అందచందాలు వారిని ఎంతగా ఆకర్షిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 4) కేరళ దైవ భూమిగా పిలువబడే కేరళ పచ్చటి పకృతి అందాలతో, సముద్రపు తీరాలతో, బ్యాక్ వాటర్‌తో ఎంతో రమణీయంగా ఉంటుంది. క్రిస్మస్ రోజున కేరళ పర్యటన మీ జీవితంలో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. జనాభాలో అధిక భాగం ఉన్న క్రిస్టియన్లు పండుగను అత్యంత అద్భుతంగా సెలబ్రేట్ చేస్తారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా క్రిస్మస్ రోజు రాత్రి అందరూ చర్చిల వద్దకు చేరి ప్రార్థనలు చేస్తారు. ప్రకృతి ఒడిలో క్రిస్మస్ జరుపుకోవాలనుకునే వారికి కేరళ ఓ బెస్ట్ ఛాయిస్. 5) సిమ్లా మీకిష్టమైన వారితో ఈ క్రిస్మస్ను ప్రశాంతంగా, గుర్తుండిపోయేలా జరుపుకోవాలంటే తప్పకుండా సిమ్లా వెళ్లి తీరాల్సిందే. పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండే కొండ ప్రాంతాలు మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. అక్కడి ఇళ్లు, వీధులు, చర్చిలు రంగురంగుల లైట్లతో అందంగా అలంకరించబడి కొత్త శోభను సంతరించుకుంటాయి. నోరూరించే సాంప్రదాయ వంటకాలు మనల్ని లొట్టలేసుకునేలా చేస్తాయి. చల్లటి సాయంత్రాలు క్రిస్మస్ వాతారణాన్ని మరింత అందంగా చేస్తూ వినసొంపైన పాటలతో మనల్ని అలరిస్తాయి. 6) లాన్స్ డౌన్ ఈ క్రిస్మస్ను కొండ ప్రాంతంలో జరుపుకోవాలనుకుంటే లాన్స్ డౌన్ అద్బుతమైన ప్రదేశం. యాంత్రికమైన జీవితంలో కొద్దిగా ప్రశాంతత లభిస్తుంది. వెండికొండల్లో.. మంచులోయల్లో.. చల్లటి సాయంత్రాలు.. వెన్నెల రాత్రులు మనకో గొప్ప అనుభూతిగా మిగిపోతాయి. భాగస్వామితో మాత్రమే కాదు, కుటుంబసభ్యులు, స్నేహితులతో గడపటానికి ఇదో అద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు. 7) దాద్రా నగర్ హవేలీ అన్ని క్రిస్మస్ డెస్టినేషన్లకంటే దాద్రా నగర్ హవేలీ కొంచెం ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇక్కడ పండుగ మొత్తం గిరిజన పద్దతిలో జరుగుతుంది. రాత్రి వేళ చర్చిల వద్ద నిండుగా గుమిగూడే జనంతో పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది. పండుగ నాడు మీ ప్రియమైన వారితో ఇక్కడ క్రిస్మస్ జరుపుకోవటం నిజంగా ఓ మరిచిపోలేని జ్ఞాపకం అవుతుంది. 8) షిల్లాంగ్ చలికాలంలో ఇక్కడ పర్యాటకుల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది. మరెక్కడా రాని అనుభూతి మనకిక్కడ దొరుకుతుంది. పర్యాటకుల్లా కాకుండా స్థానికుల్లా క్రిస్మస్ పండుగను ఆస్వాదించవచ్చు. తక్కువ సంఖ్యలో ఉన్న క్రిస్టియన్లు ఎంతో వైభవంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహిస్తారు. మిరుమిట్లు గొలిపే రంగుల లైట్లతో.. వినసొంపైన గాస్పెల్ పాటలతో రేయి ఇట్టే గడిచిపోతుంది. అక్కడి ప్రజలతో పాటు కలిసి స్థానిక వంటకాలను రుచి చూడవచ్చు. 9) డామన్ అండ్ డయ్యూ గోవాకు ప్రత్యామ్నాయంగా దీనిని చెప్పుకోవచ్చు. పోర్చుగీసు వారి ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రదేశం ఇది. సంప్రదాయ నృత్యాలతో పాటు కారిడినో వంటి పోర్చుగీసు నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పెద్ద సంఖ్యలో చర్చిల వద్ద గుమిగూడే జనం ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహిస్తారు. 10) నార్త్ ఈస్ట్ క్రిస్మస్ పండుగను వైభవంగా నిర్వహించే ప్రదేశాల్లో నార్త్ ఈస్ట్ ఒకటి. ఇక్కడి గిరిజనులు పండుగ కోసం సంవత్సరం మొత్తం ఎదురుచూస్తూ ఉంటారు. కొండ ప్రాంతాల్లోని పట్టణాలలో క్రిస్మస్ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రాత్రి వేళ వీధుల్లో ఎక్కడ చూసినా కనపించే జనంతో వాతావరణం ఎంతో సందడిగా ఉంటుంది. మన కిష్టమైన వారితో పండుగను మరింత సరదాగా జరుపుకోవటానికి ఇదో చక్కటి ప్రదేశం. -
సిటీ థ్రిల్స్.. పార్టీ స్టైల్స్..
ఇది వింటర్ సీజన్. వెచ్చని పార్టీల సీజన్. చల్లని వాతావరణంలో పుట్టే లేజీనెస్‌ను వేడి వేడి క్రేజీ పార్టీస్ ద్వారా తరిమికొట్టడం సిటీలోని పార్టీ లవర్స్‌కి బాగా ఇష్టం. దీనికి తోడు క్రిస్మస్ మొదలుకుని సంక్రాంతి దాకా వరుసగా హోరెత్తే వేడుకల్లో అటు పండుగలు ఇటు న్యూ ఇయర్ లాంటి సంబరాలు కలగలసి ఎక్కడలేని సందడినీ మోసుకొస్తాయి. ఇప్పటికే చలితో పాటు పార్టీల సందడి కూడా సిటీని కమ్ముకుంది. ఈ నేపథ్యంలో సిటీలో క్రేజీగా మారిన కొన్ని పార్టీల విశేషాలు... సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పార్టీలకు థీమ్‌ని జత చేయడం అనేది ఎప్పటికప్పుడు మరింత కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. నలుగురం కలిశామా తిన్నామా తాగామా తెల్లారిందా అన్నట్టు కాకుండా తమ వేడుకని కొన్ని రోజుల పాటు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మార్చాలని మోడ్రన్ సిటీ ఆశిస్తోంది. అందుకని వెరైటీ స్టైల్స్ కోసం అన్వేషిస్తోంది. సిటీలో ఇప్పుడు బాగా క్రేజీగా మారిన పార్టీ స్టైల్స్‌లో... కూల్... పూల్.. సిటీలో స్విమ్మింగ్ పూల్స్ ఉన్న స్టార్ హోటల్స్ ఉన్నాయి. అలాగే సొంత భవనాలూ కొందరికి ఉన్నాయి. దీంతో పూల్ పార్టీ కూడా క్రేజీగా మారింది. ఈ వేడుక మొత్తం పూల్ దగ్గరే జరుగుతుంది. దీనిలో భాగంగా వాటర్ గేమ్స్, ఆక్వా డ్యాన్స్ వంటివి ఉంటాయి. పూల్ పార్టీలో భాగంగా పగలూ రాత్రీ లైట్ల థగథగల మధ్య నీళ్లలో జలకాలాటలు ఉర్రూతలూగిస్తాయి డెస్టినేషన్.. పేషన్ ఉన్న ఊర్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం ఎలా ఉన్నా... ఊరు దాటి వెళ్లాం అంటే తెలియని ఫ్రీడమ్ ఫీలింగ్ వచ్చేసి ఆటోమేటిగ్గా సందడి మొదలైపోతుంది. డెస్టినేషన్ పార్టీలు నగరంలో క్లిక్ అవడానకి కారణం అదే . ప్రస్తుతం బ్యాచిలర్ పార్టీలు ఎక్కువగా డెస్టినేషన్ ఈవెంట్స్‌గా మారాయని నగరానికి చెందిన ఉత్సవ్ ఈవెంట్స్ నిర్వాహకులు రాజ్‌కిషోర్ చెప్పారు. పాట్ లాక్... ఫుడ్ క్లిక్... చాలా కాలంగా వాడుకలో ఉన్న సంబరాల శైలి ఇది. అయినప్పటికీ దీనికి ఇంకా క్రేజ్ తగ్గలేదు. ఇంట్లోనే నిర్వహించుకోవడం, ఎన్నో రకాల ఇంటి వంటలు ఆస్వాదించే వీలుండడం ఈ పాట్లాక్ని బాగా క్లిక్ చేసింది. పాట్లాక్ కోసం ఒక వ్యక్తి హోస్ట్‌గా ఉంటే ఆ వ్యక్తి ఇంటికి అందరూ తమకు బాగా నచ్చిన, వచ్చిన వంటకాన్ని తయారు చేసి తీసుకెళతారు. అలా పెద్ద సంఖ్యలో పోగైన ఆహారపదార్ధాలను రుచి చూస్తూ గేమ్స్, అంత్యాక్షరి వంటివాటితో సందడిగా గడిపేస్తారు. ట్రెడిషనల్... ట్రెండీగా... సంక్రాంతి టైమ్‌లో ట్రెడిషనల్ పార్టీస్ ఎక్కువగా జరుగుతుంటాయి.వేడుక అంతా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది. ముగ్గులు, జానపద గీతాలు పాడడం, కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. వీటికి తమ టీనేజ్ పిల్లల్ని తీసుకుని రావడానికి పార్టీ ప్రియులు ఇష్టపడుతున్నారని పార్టీ ఆర్గనైజర్ విశాల చెప్పారు. దీని వల్ల వారికి మన సంప్రదాయాలపై మక్కువ, అవగాహన ఏర్పడతాయనే ఆలోచన దీనికి కారణమన్నారు. ఆరోగ్యకరం... ఆర్గానిక్ ఆహారంలో, ఆహార్యంలో ఇప్పటికే సహజత్వంవైపు సిటిజనులు బాగా దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ పోకడ పార్టీస్‌కి కూడా వచ్చేసింది. ఆర్గానిక్ పార్టీలు షురూ అయ్యాయి. సిటీలో చాలా మందికి పార్మ్ హౌజ్‌లు ఉన్న నేపథ్యంలో ఒక్కోసారి ఒక్కో ఫార్మ్ హౌజ్‌లో పార్టీ ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ కాసేపు ఆటపాటలు, నృత్యాలు వచ్చీరాని సేద్యం కూడా చేసేసి, సహజమైన పద్ధతిలో తయారైన వంటకాలను ఆస్వాదించి పచ్చని ప్రకృతిలో సేదతీరి తిరిగి వస్తన్నారు. -
సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం
సాక్షి, అమరావతి: ‘అందరికీ మెర్రీ క్రిస్మస్...’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి విజయవాడలోని ఏ–1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో సీఎం కొవ్వొత్తుల ప్రదర్శనకు సారథ్యం వహించి క్రిస్మస్ కేకును కట్ చేశారు. ప్రార్థనా గీతాల నడుమ బిషప్‌లు, పాస్టర్ల సందేశాలతో రెండు గంటలకుపైగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ క్లుప్తంగా తన సందేశాన్ని ఇచ్చారు. క్రైస్తవుల సంక్షేమానికి పలు పథకాలు రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు చేపడుతోందని ఉప ముఖ్యమంత్రి షేక్ బేపారి అంజాద్ బాషా తెలిపారు. క్రీస్తు పుట్టుక సమాజానికి శాంతి, సంతోషాలను కలుగజేసిందన్నారు. క్రిస్మస్ ప్రాశస్త్యాన్ని ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత వివరించారు. రాష్ట్రంలో అక్షరాస్యత, విద్యా ప్రమాణాలను పెంచేందుకు అమ్మ ఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం లాంటి సాహసోపేతమైన నిర్ణయాలను ముఖ్యమంత్రి తీసుకున్నారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్, పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సామినేని ఉదయభాను, కె.పార్థసారథి, కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు కైలే జ్ఞానమణితో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
అందరినీ ఆదరిస్తాం
సాక్షి, హైదరాబాద్: ఎవరికి ఏరకమైన అభ్యంతరాలు ఉన్నా తెలంగాణ రాష్ట్రం నూటికి నూరు శాతం సెక్యులర్ రాష్ట్రంగానే ఉంటుందని, ఇక్కడ అన్ని మతాలకు సమాన గౌరవం లభిస్తుందని, అందరినీ ఆదరించే రాష్ట్రమని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. భారత్ గొప్ప దేశ మని ఇక్కడ జరుపుకున్నన్ని పండుగలు ప్రపంచంలో మరెక్కడా జరుపుకోరన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇస్లామిక్ దేశాలలో రంజాన్, బక్రీద్ పండుగలు, ఇతర దేశాలలో నాలుగైదు పండుగలు జరుపుకుంటారని, కానీ భారత్‌లో జరుపుకు నేవి చాలా ఉన్నాయన్నారు. ‘ఉత్సవాలు జరుపుకునే గుణం, సహనంతోపాటు మనుషులను ప్రేమించే తత్వం ఉంటే ఇది సాధ్యపడుతుంది. దానికి నా తెలంగాణ రాష్ట్రమే నిదర్శనం. క్రిస్మస్ వేడుకల సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు ఇదే ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్, బతుకమ్మ, ఇప్పుడు క్రిస్మస్ పండుగలు జరుపుకుంటున్నాము’అని సీఎం అన్నారు. అన్ని సంక్షేమ పథకాలు అందరితో పాటు క్రైస్తవులకు అందిస్తున్నామని, ఎవరికైనా పథకాలు అందకపోతే మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి చెప్పాలని సూచించారు. త్వరలో క్రైస్త్త్తవ మత నాయకులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటానని హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి 2 పంటలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 70 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని సీఎం ప్రకటించారు. ఉత్సవాల్లో బిషప్ షపర్డ్ రెవరెండ్ గొల్లపల్లి జాన్, బిషప్ తుమ్మ బాల, మంత్రులు శ్రీనివాసగౌడ్, శ్రీనివాసయాదవ్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
‘నాకు మంచి నాన్న కావాలి’
క్రిస్మస్ పండగను ఇష్టపడని వాళ్లంటూ ఉండరు. సాంటాక్లాజ్ తెచ్చే బహుమతుల కోసం చిన్నారులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. మరికొద్ది రోజుల్లో క్రిస్మస్ వస్తుండటంతో అందరూ పండగ ఏర్పాట్లలో మునిగిపోయారు. తమకు కావాల్సిన వస్తువులు, దుస్తులు కొనుక్కోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చిన్నారి క్రిస్మస్ తాతకు లేఖ రాశాడు. తన కోసం కొన్ని వస్తువులు తీసుకురావాలంటూ సాంటాతాతను కోరాడు. అమెరికాలోని టెక్సాస్‌లో గృహ హింస బాధితుల ఆశ్రమంలో ఓ మహిళ తన ఏడేళ్ల చిన్నారితో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో కుమారుడి బ్యాగులోని లేఖను చూసి తల్లి ఆశ్చర్యానికి లోనైంది. విషయం తెలిసిన ఆశ్రమ అధికారి ఒకరు ఈ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఉత్తరంలో ‘‘మేము మా ఇంటిని వదిలేయాల్సి వచ్చింది. మా నాన్నకు మతిస్థిమితం లేదు. మేము అన్నీ కోల్పోయాం. అయినా సరే, మేము భయపడాల్సిన అవసరం లేదని, మమ్మల్ని నీవు సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్తావని అమ్మ చెప్పింది. ఈ క్రిస్మస్కు మీరు నా దగ్గరకు వస్తున్నారా..! నా దగ్గర ఏమీ లేవు. అందుకని మీరు నాకోసం కొన్ని పుస్తకాలు, డిక్షనరీ, కంపాస్ తీసుకురాగలరా.. అలాగే నాకు మంచి నాన్న కావాలి. మీరు అది చేయగలరా? ప్రేమతో బ్లాక్’ అంటూ బాలుడు తన ఆవేదనను పేర్కొన్నాడు. లేఖలో కేవలం బాలుడి పేరును మాత్రం మార్చి పోస్ట్ చేశారు. ఈ లేఖ.. చదివిన వారందరి మనసులను కట్టిపడేస్తుంది. కాగా యునైటెడ్ స్టేట్స్లో ప్రతి నిమిషానికి సగటున 20 మంది తమ భాగస్వామితో గృహ హింసకు గురవుతున్నారని ఓ జాతీయ నివేదిక పేర్కింది. ఈ లెక్కన ఎంత మంది మహిళలు శారీరక, మానసిక వేదనకు గురవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. -
ఆరోగ్యకర ఆహార అలవాట్లతోనే మేలు
కేపీహెచ్‌బీకాలనీ: ఆరోగ్యకర ఆహార అలవాట్లతోనే యువతకు మేలు చేకూరుతుందని, బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి సారించా లని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బుధవారం జేఎన్టీయూహెచ్ ఆడిటోరియంలో ఎన్ఎస్ఎస్, కూకట్పల్లి ఇస్కాన్ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ‘కిల్ కేన్సర్’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. కేన్సర్ పట్ల ప్రతిఒక్కరిలో అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, ఆ దిశగా ప్రభుత్వా లు చర్యలు తీసుకోవాలన్నారు. యంగ్ తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే యంగ్ గవర్నర్‌గా తాను నియమితులు కావడం అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ వీసీ, ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తదిత రులు పాల్గొన్నారు. కాగా, ఏసు ప్రభువు శాంతి, సామరస్యం, సోదరభావాన్ని బోధించారని, ఆయన బోధనలు ఆచరణీయమని గవర్నర్ పేర్కొన్నారు. రాజ్‌భవన్ దర్బార్ హాల్లో బుధవారం నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. -
కూతురు కోసం 6 టికెట్లు కొన్నాడు..!
లోకంలో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనల్ని ఎవరూ ప్రేమించలేరు. అనంతమైన వారి ప్రేమ మన జీవితాలకు ఎంతో అవసరం కూడా. పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తల్లిదండ్రులు.. తమ జీవితంలో వచ్చే అన్ని పండుగలు, సంతోషాలు, సంబరాలను వారితోనే కలిసి జరుపుకోవాలనుకుంటారు. కానీ నేటి కాలంలో ఉద్యోగాల వల్ల పిల్లలు ఒక చోట.. తల్లిదండ్రులు ఒక చోట ఉండాల్సిన పరిస్థితి. దాంతో సంవత్సరానికి ఒకటి, రెండు పండుగలను మాత్రమే అందరు కలిసి జరుపుకోగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది హాల్ వాఘన్ అనే వ్యక్తికి. కూతురుతో కలిసి పండుగ జరుపుకోవడం కోసం ఆ తండ్రి చేసిన పని నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. ఆ వివరాలు.. పియర్స్ వాఘన్ అనే యువతి డెల్టా ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్‌గా పని చేస్తుంది. క్రిస్టమస్ సీజన్ దృష్టా రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆమెకు పండుగ నాడే కాక మరుసటి రోజు కూడా సెలవు దొరకలేదు. దాంతో పండుగ రోజున కూతురుతో ఉండాలనుకున్న హాల్, కూతురు డ్యూటి నిమిత్తం వెళ్లే ప్రతి ప్రాంతానికి తాను వెళ్లాలని భావించాడు. అందుకోసం ఆరు టికెట్లను కొన్నాడు. దాంతో పండుగ రోజున తండ్రి, కూతుళ్లిద్దరూ ఒకే చోట ఉన్నారు. మైక్ లేవి అనే ప్రయాణికుని ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చంది. లేవి, హాల్‌తో పాటు అదే విమానంలో కలిసి ప్రయాణించాడు. మాటల సందర్భంలో లేవికి, హాల్ ప్రయాణం గురించి తెలిసింది. పియర్స్ పట్ల ఆమె తండ్రికున్న ప్రేమ చూసి ముగ్ధుడైన లేవి ఈ విషయం గురించి తన ఫేస్బుక్లో షేర్ చేశారు. దాంతో ఈ తండ్రికూతుళ్ల అనురాగం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నెటిజన్లు కూడా పియర్స్ తండ్రిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
ముగ్గురు నల్లగొండవాసుల సజీవదహనం!
భవిష్యత్తుపై ఎన్నో కలలతో ఆ ముగ్గురూ అమెరికాలో అడుగుపెట్టారు... చదువుల్లో రాణించి తల్లిదండ్రులకు, సొంతూరికి మంచి పేరు తేవాలనుకున్నారు. క్రిస్మస్ సెలవులు కావడంతో పరిచయస్తుల ఇంటికి పండుగను ఆనందంగా జరుపుకునేందుకు వెళ్లారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. క్రిస్మస్ పండుగే వారి జీవితాలను బుగ్గిపాలు చేసింది. అగ్నిప్రమాదం రూపంలో వారిని మృత్యువు వెంటాడింది. కన్నవాళ్ల జీవితాల్లో తీవ్ర విషాదం నింపింది. చందంపేట/వాషింగ్టన్: అమెరికాలోని టెన్నిసీ రాష్ట్రంలో ఉన్న ఓ ఇంట్లో జరిగిన అగ్నిప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు టీనేజర్లు సహా నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కొలిరివిల్లే ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఆదివారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11 గంటలకు) క్రిస్మస్ వేడుకలు జరుగుతుండగా ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇంటిని మంటలు చుట్టుముట్టాయి. తప్పించుకునే వీల్లేకపోవడంతో నల్లగొండ జిల్లా నేరెడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందిన సాత్విక (18), సుహాస్ నాయక్ (16), జై సుచిత (14)తోపాటు ఇంటి యజమానురాలు కేరీ కోడ్రియట్ (46) సజీవదహనమయ్యారు. మృతుల కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గుర్రపు తండాకు చెందిన కేతావత్ శ్రీనివాస్ నాయక్, సుజాత దంపతులు గ్రామంలో ‘అలితేయా’క్రిస్టియన్ మిషనరీ ఆశ్రమంతోపాటు స్కూల్, హాస్టల్ నిర్వహిస్తూ 450 మందికి విద్యనందిస్తున్నారు. శ్రీనివాస్ నాయక్ పాస్టర్‌గా కూడా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు సాత్విక, జై సుచిత, కుమారుడు సుహాస్ నాయక్ ఉన్నారు. నాయక్ కుటుంబానికి అమెరికాలోని కొలిరివిల్లే బైబిల్ చర్చిలో భాగస్వామ్యం ఉంది. దీంతో ఆ చర్చి నడుపుతున్న పాస్టర్ డేనియల్ సాయంతో నాయక్ తన పిల్లలను మిస్సిసిపీలోని ఫ్రెంచ్ క్యాంప్ అకాడమీలో చదివిస్తున్నారు. అకాడమీకి క్రిస్మస్ సెలవులు ప్రకటించడంతో పిల్లలు డేనియల్ ఇంటికి గెస్ట్లుగా వెళ్లారు. ఆదివారం రాత్రి క్రిస్మస్ వేడుకల్లో వారు నిమగ్నమై ఉండగా షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకొని సాత్విక, సుహాస్, జై సుచితతోపాటు కేరీ కోడ్రియట్ మరణించగా కేరీ భర్త డేనియల్, ఆమె చిన్న కుమారుడు కోల్ (13) మాత్రం కిటికీలోంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకోగలిగారు. ప్రమా దవార్త తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పినప్పటికీ అప్పటికే జరగాల్సిన న ష్టం జరిగిపోయింది. పిల్లల మరణవార్త సమాచారం అందడంతో తల్లిదండ్రులు శ్రీనివాస్ నాయక్, సు జాత హుటాహుటిన అమెరికా పయనమయ్యారు. కేటీఆర్‌తో మాట్లాడిన ఎమ్మెల్యే... అమెరికాలో ముగ్గురు టీనేజర్ల మరణవార్త తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ గుర్రపుతండాకు చేరుకొని మృతుల బంధువులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. వారి మృతదేహాలు సాధ్యమైనంత త్వరగా దేశానికి తీసుకొచ్చేందుకు దౌత్యపరమైన చర్యలు చేపట్టాలని కేటీఆర్‌ను కోరారు. మృతుల కుటుంబాలకు కేటీఆర్, ఎమ్మెల్యే ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఊరంటే ప్రాణం ఊరంటే ముగ్గురు పిల్లలకూ ప్రాణం. ఎప్పుడొచ్చినా వారంపాటు ఉండేవారు. వారు దాచుకున్న డబ్బులతో ఈ స్కూల్లో చదివే పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు, కొత్త దుస్తులు కొనిచ్చేవారు. – కేతావత్ చంద్రునాయక్, పిల్లల పెదనాన్న వీడియో కాల్లో మాట్లాడేవారు వారానికి ఒకసారి వాళ్ల చిన్నమ్మలు, పెదనాన్నలందరితో వీడియో కాల్ ద్వారా మాట్లాడే వారు. నాకు ఫోన్ లేకుంటే వాళ్లే పెద్ద ఫోన్ కొనిచ్చారు. వాళ్లు ఇక లేరంటే నమ్మశక్యం కావడం లేదు. – సామ్య నాయక్, పెదనాన్న తమ్ముడు, చెల్లెలిని చూడాలని ఉంది తమ్ముడు, చెల్లెలు పెద్ద చదువులు చదివి ఉద్యోగం వచ్చాక మా అందరినీ అమెరికాకు తీసుకెళ్తామని చెప్పేవారు. చిన్న వయసులోనే వారిని తీసుకెళ్లిపోయిన దేవుడికి మనసెలా ఒప్పిందో అర్థం కావట్లేదు. – సుమలత, సోదరి నమ్మలేకపోతున్నాం.. ముగ్గురు పిల్లలూ హైదరాబాద్‌లో ఉన్నా, అమెరికాలో ఉన్నా వారానికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడే వారు. అందరూ బాగుండాలని ఎప్పుడూ కోరుకునే వారు. వారు చనిపోయారంటే నమ్మలేకపోతున్నాం. – చిన్నారుల పెద్దమ్మలు -
‘షార్ట్ సర్క్యూట్ వల్లే ఆ ప్రమాదం జరిగింది’
సాక్షి, నల్గొండ : అమెరికాలోని కొలిర్‌విల్ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నల్గొండ వాసులైన సాత్విక్ నాయక్, సుహాస్ నాయక్, జయసుచిత్ మరణించిన సంగతి తెలిసిందే. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు శ్రీనివాస్ నాయక్, సుజాత హుటాహుటిన అమెరికా బయలుదేరి వెళ్లారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన బిడ్డలు.. ఇలా విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రుల గుండెలవిసేలా రోదిస్తున్నారు. వారి స్వగ్రామం గుర్రపు తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవరకొండ నియోజకవర్గంలోని నేరుడుగొమ్ము మండలం గుర్రపు తండా గ్రామానికి చెందిన శ్రీనివాస్ నాయక్, సుజాతలు గ్రామంలో ‘అలితేయా’ క్రిస్టియన్ మిషనరీ ఆశ్రమంతో పాటు స్కూల్‌ను కూడా నడుపుతున్నారు. అంతేకాక శ్రీనివాస్ నాయక్ చర్చి పాస్టర్‌గా కూడా పని చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీనివాస్ నాయక్‌కు అమెరికాకు చెందిన మరో పాస్టర్‌తో పరిచయం ఏర్పడింది. అతని సాయంతో శ్రీనివాస్ నాయక్ తన ముగ్గురు పిల్లలైన సాత్విక్, జాయి, సుహాస్లను అమెరికాకు పంపి చదివిస్తున్నారు. వీరు అమెరికా వెళ్లి ఇప్పటికి 20 నెలలు అయ్యింది. ఈ క్రమంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 24 రాత్రి స్థానిక చర్చి పెద్ద డేనీ విల్లాలో జరిగిన వేడుకల్లో సాత్విక్ నాయక్, సుహాస్ నాయక్, జయసుచిత్ పాల్గొన్నారు. డేనీ కుటుంబసభ్యులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్న సమయంలో విల్లాలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. అగ్నికీలలు ఇంటిని చుట్టుముట్టాయి. భారీస్థాయిలో జరిగిన ఈ ప్రమాదంలో సాత్విక్, సుహాస్, జయ సుచిత్తోపాటు డేనీ భార్య మంటల్లో సజీవ దహనమయ్యారు. డేనీ, అతని కొడుకు మాత్రం అగ్నిప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన గిరిజన బిడ్డలు ఇలా చనిపోవడం గ్రామంలోని ప్రతి ఒక్కరిని కంట తడిపెట్టిస్తోంది. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలి : ఉత్తమ్ గిరిజన విద్యార్థుల మృతి పట్ల టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉజ్వల భవిష్యత్ ఉన్న విద్యార్థులు ఇలా మృత్యువాత పడటం అత్యంత దురదృష్టకరమన్నారు. పిల్లల తల్లిదండ్రులు శ్రీనివాస్ నాయక్, సుజాతలకు సానుభూతి తెలిపారు. బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా సాయం చేయాలంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
పండగకొస్తూ.. పరలోకానికి
ఆత్మకూర్ (కొత్తకోట): కుటుంబ సభ్యులతో కలిసి పండగను ఆనందంగా జరుపుకోవాలనుకున్న ఆ యువకుడి ఆశలు అడియాసలయ్యాయి.. పనిచే స్తున్న ప్రాంతం నుంచి స్వగ్రామానికి బయలుదేరగా.. మార్గమధ్యలో చోటుచేసుకున్న ప్రమాదం లో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన ఆత్మకూరు పట్టణంలో చోటుచేసుకోగా.. యువకుడి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. అమరచింత మండల కేంద్రానికి చెందిన దీక్షిత్(26) అయిజలోని ఎస్బీఐ బ్రాంచ్‌లో క్యాషియర్‌గా వి ధులు నిర్వహిస్తున్నాడు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తన స్వగ్రామమైన అమరచింతకు ద్విచక్రవాహనంపై కొత్తకోట మీదుగా బయలుదేరాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆ త్మకూర్ శివారులోని పరమేశ్వరస్వామి చెరువుకట్ట మలుపు వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోవడంతో దీక్షిత్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ శంకర్, ఎస్ ఐ ముత్తయ్య సంఘటన స్థలానికి చేరుకుని విచార ణ చేపట్టారు. ద్విచక్రవాహనం అదుపు తప్పడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదే హాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకు డు జగన్నాథరెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వగ్రామంలో విషాదఛాయలు అమరచింత (కొత్తకోట): నాన్నమ్మతో కలిసి క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకుందామనుకుని వస్తున్న అమరచింతకు చెందిన దీక్షిత్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో అమరచింతలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన ఫ్రాంక్లిన్ కుమారుడు దీక్షిత్ అయిజ ఎస్బీఐ బ్యాంకులో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. అయితే క్రిస్మస్ పండగను అమరచింతలోని నాన్నమ్మ కృపమ్మతో కలిసి జరుపుకోవాలని ద్విచక్రవాహనంపై బయలుదేరి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. సమాచారం అందిన వెంటనే కృపమ్మ ఇంటి వద్ద జనం గుమిగూడారు. గత రెండు నెలల క్రితం కృపమ్మ టీచర్ భర్త దీనదయాల్ అనారోగ్యంతో మృతిచెందారు. ఈ ఘటన నుంచి కోలుకోలేని ఆ కుటుంబ సభ్యులకు దీక్షిత్ మృతి మరింత కుంగదీసింది. విషయం తెలుసుకున్న ఎమ్మెలే చిట్టెం రాంమోహన్రెడ్డితోపాటు ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు నరేష్‌రెడ్డి, వీరేశలింగం, భూషణంగౌడ్ తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. -
శాంతిదూత ఏసుక్రీస్తు
సిరిసిల్లకల్చరల్: కరుణామయుడు, శాంతిదూత ఏసుక్రీస్తు జననం సందర్భంగా జిల్లావ్యాప్తంగా మంగళవారం క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. చర్చిలు, ప్రార్థనా మందిరాల్లో సోమవారం అర్ధరాత్రి నుంచే క్రైస్తవులు ప్రత్యేకపూజలు చేయడం ప్రారంభించారు. మతపెద్దలు ఏసుక్రీస్తు బోధనలను చదివి వినిపించారు. జిల్లా కేంద్రంతోపాటు సమీప గ్రామాలు, వేములవాడ పట్టణం, అన్ని మండల కేంద్రాల్లోని చర్చిలు భక్తుల రాకతో కళకళలాడాయి. సిరిసిల్ల బీవై నగర్ రిజరెక్షన్ లైఫ్ మినిస్ట్రీస్, బెతెస్థ బాప్టిస్ట్ చర్చిలో క్రైస్తవ సంఘం జిల్లా అధ్యక్షుడు జాన్ ఐజాక్ ప్రసంగించారు. లోక కల్యాణకారకుడు క్రీస్తు జీవితం, ఆయన అనుసరించిన ప్రేమ మార్గం ప్రపంచ ప్రజానీకం శాంతియుతంగా జీవించేందుకు ఆచరణ యోగ్యమైనదన్నారు. మానవ సమాజంలో శాంతి సాధనకు క్రీస్తు చూపిన మార్గమే శిరోధార్యమనిచెప్పారు. ఏసు ద్వారా అందిన శాంతి సందేశాన్ని అందరికీ చేరవేయడం ద్వారా ప్రజల జీవితాల్లో సుఖశాంతులను స్థాపింప జేయాలని కోరారు. రెవరెండ్ శ్యామ్ కల్వల ప్రత్యేక ప్రసంగం చేశారు. వేడుకల్లో దేవకర్ణతోపాటు సుమారు వెయ్యి మంది క్రైస్తవులు పాల్గొన్నారు. సుభాష్‌నగర్ సీఎస్ఐ చర్చిలో సుధాకర్ ప్రసంగిస్తూ ప్రభువు చూపిన దారిలో పయనించే ప్రజలందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. క్రైస్తవ సమాజం పెద్దలు సత్యం బాబూరావు, అనంతరావు, సులోచన, నర్సయ్య, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో టీఆర్ఎస్ నాయకులు.. జిల్లాకేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, చిక్కాల రామారావు, పార్టీ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు గూడూరి ప్రవీణ్, ఎండీ సలీం తదితరులు కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, త్వరలోనే ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని వారు పేర్కొన్నారు. -
ప్రపంచవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సాక్షి, హైదరాబాద్/ అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే క్రైస్తవ సోదరులు చర్చిల్లో ప్రత్యేక పార్థనలు నిర్వహిస్తున్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా చర్చిలను నిర్వాహకులు సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రార్థన మందిరాలు విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి. మెదక్ సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. బిషప్ సాల్మన్ రాజ్ ఆధ్వర్యంలో తెల్లవారుజామున శిలువ ఊరేగింపు నిర్వహించారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త జోగి రమేశ్ పాల్గొన్నారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా సీఎస్ఐ, ఆర్సీఎం చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గన్నవరం, నిడమానూరులోని పలు చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. విశాఖపట్నం పెదబయలు మండలంలో జరుగుతున్న ఐక్య క్రిస్మస్ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లా రాజంపేటలోని పలు చర్చిలలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్సార్ సీపీ పార్లమెంట్ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటూ ప్రార్థనలు చేశారు. పలు చర్చిల్లో కేక్ కట్ చేసి ఆడపడుచులకు చీరల పంపిణీ చేశారు. విశాఖపట్నం అరకు మండలం పనిరంగిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రూపాంతర దేవాలయం చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కన్వీనర్ గ్రంధి శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి కొయ్యే మోసేనురాజు పాల్గొన్నారు. నెల్లూరు నగరంలోని సెయింట్ జోసెఫ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ సీఎస్ఐ చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే దివాకర్ రావు హాజరయ్యారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రశాంతి నిలయంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో విదేశీ భక్తులు పాల్గొన్నారు. సత్యసాయి మహా సమాధి వద్ద విదేశీ భక్తులు ప్రార్థనలు నిర్వహించారు. సూర్యాపేటలోని మేరిమాత చర్చిలో జరుగుతున్న క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి జిల్లాలోని చర్ల సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఖమ్మంలోని సెయింట్ మేరీస్ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. క్రైస్తవ సోదర, సోదరీమణులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిల్లో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. నగరంలోని చర్చిలు సర్వాంగ సుందరంగా అలకరించారు. గుణదల మేరిమాత చర్చిలో క్రీస్తు ఆరాధన కొనసాగుతుంది. కాకినాడలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విశాఖపట్నం అల్లిపురం కల్వారి బాప్టిస్ట్, పాతనగరం లండన్ మిషన్ మెమోరియల్ చర్చిల్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన విజయమ్మ
-
‘దేవుడు వైఎస్ జగన్ పక్షాన ఉన్నాడు’
సాక్షి, వైఎస్సార్: దేశవ్యాప్తంగా క్రిస్మస్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైఎస్సార్ జిల్లా పులివెందుల సీఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, భారతి జార్జిరెడ్డి, ఈసీ గంగిరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డి పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వైఎస్ కుటుంబం తరఫున ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ.. ‘దేవుడు నాకు మంచి భర్తను, కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి మంచి పరిపాలన ఇచ్చే శక్తిని ఇచ్చారు. దేవుని ఆశీర్వాదం వల్లే ఆయన కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయారు. ఆయన మరణించాక ఈ తొమ్మిదేళ్ల జీవితం నాకు ఒక ఎత్తు. ఇటీవల వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం నుంచి దేవుని కృపే ఆయన్ను కాపాడింది. దేవుడు వైఎస్ జగన్ పక్షాన ఉన్నాడు. వైఎస్సార్‌లాగే వైఎస్ జగన్‌తో కూడా ప్రజలకు మరింత సేవ చేయించుకోవాలని దేవుడు భావించి ఉంటాడు. పాదయాత్రలో వైఎస్ జగన్‌కు నిత్యం దేవుడు తోడుగా ఉండి కాపాడుతున్నాడు. రాబోయే రోజుల్లో దేవుడు వైఎస్ జగన్ లక్ష్యం నెరవేరుస్తాడ’ని అన్నారు. వైఎస్ జగన్ కోసం ప్రార్థిస్తున్న కోట్లాది మందికి కృతజ్ఞతలు తెలిపారు. -
కారుణ్య వారధి
-
హ్యాపీ క్రిస్మస్: దేశవ్యాప్తంగా క్రిస్మస్ సందడి
-
హ్యాపీ క్రిస్మస్
లైఫ్‌ని సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోరు నయనతార, విఘ్నేష్ శివన్. పుట్టినరోజులు, పండగలు, సినిమా విజయాలు.. ఇలా దేన్నీ మిస్ కాకుండా సెలబ్రేట్ చేసుకుంటారు. వీటికి అదనంగా అడపా దడపా హాలీడే ట్రిప్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నయన్–శివన్ క్రిస్మస్ జరుపుకుంటున్నారు. క్రిస్మస్ ట్రీను అలంకరిస్తూ ఇద్దరూ సెల్ఫీలు దిగారు. ‘‘అందరికీ హ్యాపీ అండ్ జాయ్‌ఫుల్ క్రిస్మస్ శుభాకాంక్షలు’’ అంటూ ఈ ఫొటోలను షేర్ చేశారు. పండగలు కలసి సెలబ్రేట్ చేసుకుంటున్న ఈ జంట పెళ్లి పండగను ఎప్పుడు చేసుకుంటారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నయనతార -
క్రిస్మస్కు ముస్తాబైన గుణదల మేరిమాత చర్చి
-
హైదరాబాద్‌లో ప్రారంభమైన క్రిస్మస్ సందడి
-
అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
-
వైద్యం అందక యువకుడి మృతి
సిరిసిల్ల టౌన్: వైద్యాన్ని పక్కనబెట్టి.. ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో మునిగిపోయారు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి సిబ్బంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. చికిత్స కోసం వచ్చినా పట్టించుకోకపోవడంతో ఆ యువకుడు చనిపోవడం జిల్లాలో కలకలం సృష్టించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే సదరు యువకుడు చనిపోయాడని పేర్కొంటూ బీజేపీ నాయకులు ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఈ ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. చందుర్తి మండలం లింగంపేట శివారులో శుక్రవారం రాత్రి గొంటి సునీల్ (23) ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతడిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికే వైద్యసిబ్బంది క్రిస్మస్ సంబరాల్లో ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని చెప్పినా పట్టించుకోలేదు. దాదాపు 25 నిమిషాలపాటు కొట్టుమిట్టాడినా ఫలితం లేకుండా పోయింది. తీరా డ్యూటీ డాక్టర్ 9 గంటలకు వచ్చి పరిశీలించి అప్పటికే సునీల్ చనిపోయినట్లు నిర్ధారించారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే సునిల్ చనిపోయాడని, సదరు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ తిరుపతి వివరణ ఇస్తూ.. శుక్రవారం రాత్రి ఎమర్జెన్సీ వార్డులోని సిబ్బంది ఎవరూ వేడుకల్లో పాల్గొనలేదని, డ్యూటీలో లేనివారు మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. తీవ్ర గాయాలతో వచ్చిన సునీల్‌ను డాక్టర్ పరిశీలించి అప్పటికే మరణించాడని ధ్రువీకరించారని, ఆ తర్వాత క్రిస్మస్ వేడుకలను నిలిపివేశామని పేర్కొన్నారు. -
హ్యపీ సెలబ్రేషన్స్
ప్రతీ పండగను ఫ్యామిలీతో కలసి ఆహ్లాదంగా జరుపుకుంటారు అల్లు అర్జున్. ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్‌ను షురూ చేసినట్లున్నారు. ఆదివారం ఇలా కుటుంబంతో కలసి క్రిస్మస్ ట్రీ దగ్గర ఫొటోకు పోజిచ్చారు. సినిమాల విషయానికి వస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే చిత్రం వచ్చే ఏడాదిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. -
క్రిస్మస్కు.. ఆ ఆరు ప్రాంతాలు
క్రైస్తవులు తమ దేవుడైన యేసుక్రీస్తు పుట్టినరోజును స్మరించుకుంటూ జరుపుకునే క్రిస్మస్ వారికి ఎంతో ముఖ్యమైన పండుగ. డిసెంబర్ ప్రారంభమవగానే చర్చ్‌లు, ఇళ్లు, పలు దుకాణాలు క్రిస్మస్ హడావిడితో నిండిపోతాయి. శాంటా క్లాస్ (క్రిస్మస్ తాత) దుస్తులతో, విద్యుద్దీపాలతో అలంకరించిన క్రిస్మస్ చెట్లు, వీధివీధికి రకరకాల రంగులతో నిలిచే క్రిస్మస్ స్టార్లతో (నక్షత్రాలతో), యేసుక్రీస్తు పుట్టిన ప్రదేశానికి గుర్తుగా తయారు చేసే పశువుల పాక వంటి వాటితో నెలంతా సందడి నెలకొంటుంది. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా, ప్రత్యేక బహుమతులను అందించి క్రిస్మస్ ఆనందాన్ని పంచుకుంటారు. చాలాసార్లు ఒకే చోట క్రిస్మస్ పండుగ జరుపుకొని కొత్తదనం కొరవడితే ఇండియాలోని కింది ప్రాంతాలు మీకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి. 1. గోవా అత్యధికంగా కతోలిక క్రైస్తవులు నివసిస్తున్న ప్రాంతం కావడంతో డిసెంబర్ మొదటి వారంలో వచ్చే ఆడ్వెంట్ నుంచే ఇక్కడ సంబరాలు మొదలవుతాయి. పట్టణమంతా క్రిస్మస్ పూలతో (పోయిన్సెట్టియా), రంగురంగుల విద్యుద్దీపాలతో, అలంకరిస్తారు. చర్చ్‌లు అన్నింటి మీదా పెద్ద స్టార్లను అమరుస్తారు. బీచ్‌ల దగ్గర హోటళ్లు, రెస్టారెంట్లు క్రిస్మస్ గంటల మ్యూజిక్‌తో పాటు పలు రకాల క్రిస్మస్ వంటకాలను తయారుచేస్తారు. క్రిస్మస్ ముందు రోజు రాత్రంతా చర్చిలలో ప్రత్యేక ఆరాధనలు, ప్రార్థనలు నిర్వహిస్తారు. 2. కేరళ చర్చ్‌లకు పుట్టినిల్లుగా పిలిచే కేరళలో క్రిస్మస్ను ఘనంగా నిర్వహిస్తారు. యేసుక్రీస్తు శిష్యులలో ఒకరైన సెయింట్ తోమాస్ రాక తర్వాత ఇక్కడ ఈ పండుగ జరపడం ప్రారంభమయిందని చరిత్రకారులు చెబుతున్నారు. ప్రతి వీధిలో ప్రత్యేక దీపాలను వెలిగిస్తారు. తమ ఇళ్ల మీద కూడా స్టార్లను అమర్చి అందులో రంగులను చిమ్మే లైట్లను అమరుస్తారు. చర్చ్‌లలో కారోల్స్ నిర్వహిస్తారు. ప్రత్యేక ప్రార్థనలతో పాటు ప్రత్యేక గంటలను మోగిస్తారు. ప్లమ్ కేక్స్‌ను క్రిస్మస్ ప్రత్యేక వంటకంగా తయారు చేసుకుంటారు. పలు హోటళ్లలో ప్రత్యేక రాయితీలను అందిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తారు. 3. మనాలి మంచు కురిసే ప్రదేశంలో క్రిస్మస్ (వైట్ క్రిస్మస్) జరుపుకోవాలన్నది మీ కోరికా..! అయితే మనాలి బెస్ట్ ఛాయిస్‌గా నిలుస్తుంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతం తెల్లని మంచుతో పండుగను వేరే దేశంలో జరుపుకున్న అనుభూతిని అందిస్తుంది. ఇక్కడకు క్రిస్మస్కు వచ్చేవారు తమ మిత్రులు, కుటుంబ సభ్యుల మీద మంచు ముద్దలు విసురుకొని ఆనందిస్తుంటారు. పండుగ అర్ధరాత్రి జరిగే ప్రార్థనల్లో పాల్గొనడం మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. చలికాలంలో మనాలికి పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ క్రిస్మస్ను జరుపుకోవాలి అనుకునే వారు ముందుగానే హోటళ్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 4. పుదుచ్చేరి గోవాలాగే పుదుచ్చేరి కూడా క్రైస్తవులు అధికంగా ఉన్న ప్రాంతం కావడంతో పట్టణంతా డిసెంబర్ ప్రారంభం నుంచే క్రిస్మస్ సందడి అలుముకుంటుంది. ఈ ప్రాంతం మీద ఫ్రెంచ్‌వారి ప్రభావం ఎక్కువగా ఉండడంతో సహజంగానే వారి ఆచారాలు, వంటకాలు కొన్ని ఇక్కడ కనిపిస్తాయి. ఇతర ప్రదేశాలతో పోలిస్తే పుదుచ్చేరిలో క్రిస్మస్ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న యేసు తిరుహృదయ బసిలికా దేవాలయంలో క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. 5. షిల్లాంగ్ ఎక్కువ తాకిడి లేకుండా ప్రశాంతంగా క్రిస్మస్ జరుపుకోవానుకుంటే షిల్లాంగ్ అనువైన ప్రదేశం. ఇక్కడ క్రైస్తవులు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ పండుగను మాత్రం ఉత్సుకతతో కొనియాడుతారు. వీధులను, చర్చ్‌లను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. ప్రత్యేక పాటలను ఆలపిస్తూ ప్రార్థనలను చేస్తారు. 6. కొచ్చి గోవా, పుదుచ్చేరిలాగే కొచ్చిలో కూడా ఎక్కువ సంఖ్యలో క్రైస్తవులు ఉన్నారు. చారిత్రాత్మకమైన చర్చ్‌లు ఉన్నప్రాంతం కావడంతో క్రిస్మస్ను ఇక్కడ ఘనంగా కొనియాడుతారు. అన్ని ప్రాంతాల్లోలాగే ఇక్కడ కూడా చర్చ్‌లను, ఇళ్లను, వీధులను విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. పండుగ ముందురోజు రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు హోరెత్తుతాయి. వీధుల్లోని దుకాణాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన యేసుక్రీస్తు, ఆయన తల్లి మరియమ్మ చెక్క స్వరూపాలను అమ్ముతారు. క్రిస్మస్తో పాటు స్థానికంగా జరిగే పండుగ తోడవడంతో షాపింగ్ మాల్స్ అన్నీ ప్రత్యేక రాయితీలు కల్సిస్తూ కస్టమర్లను ఆకర్షిస్తాయి. కుటుంబంతో కలిసి వెళ్తే షాపింగ్‌కు, ఆటపాటలతో ఆనందంగా గడపడానికి ఇది ఉత్తమ ప్రదేశం. -
మిద్దెపై నుంచి పడి చిన్నారి ఐశ్వర్య దుర్మరణం
అందరూ క్రిస్మస్ను సంతోషంగా జరుపుకున్నారు. క్రీస్తు గురించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. అనూహ్యంగా జరిగిన ప్రమాదంలో చిన్నారి మృతిచెందింది. దీంతో అప్పటి వరకు సంతోషంగా ఉన్న ఆ ఇంటిలో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఒక్కగానొక్క కూతురు మిద్దెపై నుంచి జారి పడి దుర్మరణం చెందడంతో ఆ దంపతులు చేస్తున్న చేస్తున్న రోదనలు అన్నీ ఇన్నీ కావు. ఈ సంఘటన రేణిగుంట మండలంలో సోమవారం సాయంత్రం జరిగింది. చిత్తూరు, రేణిగుంట:మిద్దెపై నుంచి పడి చిన్నారి మృతిచెందిన సంఘటన రేణిగుంటలో జరిగింది. మండలంలోని ఎల్లమండ్యంకు చెందిన మదన్మోహన్ ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ భార్య కళ, కుమార్తె ఐశ్వర్య (3)ను పోషించుకుంటున్నాడు. రేణిగుంట మంచినీళ్ల గుంత వద్ద ఉన్న తన సమీప బంధువు ఇంటిలో సోమవారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాడు. అందరూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సాయంత్రం అందరూ ఇంటి పనుల్లో ఉండగా ఐశ్యర్య మూడవ అంతస్తు మిద్దిపైకి ఎక్కింది. ఆటలాడుకుంటూ అక్కడి నుంచి కాలుజారి కింద పడింది. తీవ్రంగా గాయపడిన బాలికను తిరుపతి రోడ్డులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడి నుంచి తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. స్విమ్స్‌లో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. కళ్లముందే కన్నబిడ్డ విగతజీవిగా మారడంతో నిండు గర్భిణిగా ఉన్న కళను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. చిన్నారి మృతితో రేణిగుంట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చిన్నారి మృతదేహాన్ని స్వగ్రామం ఎల్లమండ్యకు తీసుకెళ్లడంతో గ్రామం శోకసంద్రంగా మారింది. ఈ దుర్ఘటనపై పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. -
శాంతి సౌధాలు..చారిత్రక సౌరభాలు
క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని చారిత్రక చర్చిలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. సికింద్రాబాద్, అబిడ్స్‌లోని ప్రార్థనాలయాలను రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆదివారం రాత్రి ప్రత్యేక క్రిస్మస్ ప్రార్థనల కోసం సిద్ధమైన అబిడ్స్‌లోని సెయింట్ జార్జి చర్చి.. బ్రిటిషర్ జార్జి యూలే సతీమణి 1865లో అబిడ్స్‌లో ఈ చర్చిని నిర్మించారు. 1867లో అధికారికంగా ప్రారంభించారు. నిజాం ప్రధాన ఇంజినీర్ జార్జి విలియమ్ మర్రెట్ దీనికి రూపకల్పన చేశారు. నిజాం, బ్రిటిష్ రెసిడెన్సీ సిబ్బంది ఇచ్చిన విరాళాలతో ఇది నిర్మితమైంది. ఇలాంటి ఎన్నో చారిత్రక చర్చిలపై ప్రత్యేక కథనం.. గారిసన్ వెస్లీ.. 1853లో తిరుమలగిరిలో గారిసన్ వెస్లీ చర్చి నిర్మాణాన్ని ప్రారంభించగా, 1883లో వినియోగంలోకి వచ్చింది. స్వాతంత్య్రానికి పూర్వం కేవలం ఆర్మీ అధికారుల కుటుంబీకులు మాత్రమే ఇక్కడ ప్రార్థనలు చేసేవారు. తొలి రోమన్ క్యాథలిక్ చర్చి.. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ తొలి రోమన్ క్యాథలిక్ చర్చి. ప్రతిష్టాత్మకంగా భావించే ‘బాసలికా’ హోదా కల్గిన పురాతన చర్చి. 2008లో ఈ గుర్తింపు దక్కింది. ఫాదర్ డేనియల్ మర్ఫి 1840లో నిర్మాణాన్ని ప్రారంభించగా, 1850లో పూర్తయింది. దీని ఆధ్వర్యంలో సెయింట్ ఆన్స్ హైస్కూలు కొనసాగుతోంది. మెథడిస్ట్.. మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చికి చెందిన మిషనరీస్ ఆధ్వర్యంలో 1882లో సికింద్రాబాద్‌లో మెథడిస్ట్ చర్చిని నిర్మించారు. దీనిని 2001లో పునర్నిర్మించాక మిలీనియమ్ మెథడిస్ట్ చర్చిగా నామకరణం చేశారు. సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ చర్చిని గన్‌ఫౌండ్రీలో నిర్మించేందుకు 1870లో పునాది రాయి వేశారు. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ నిర్మాణానికి మార్బల్ బహూకరించారు. 1891లో దీని నిర్మాణం పూర్తయింది. అద్దె రూమ్‌లో ప్రారంభం.. రాంనగర్ డివిజన్\ బాకారంలోని వెస్లీ చర్చి 10 మంది భక్తులతో ప్రారంభమైంది. 1930లో ఇంగ్లండ్‌కు చెందిన రెవరెండ్ ఈబర్ ప్రెస్లీ ఇక్కడ రూమ్ అద్దెకు తీసుకొని ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశాడు. 1938లో ఇంగ్లండ్‌కు చెందిన మెగ్నిల్ అదే ప్రాంతంలో చిన్న ఇళ్లులా నిర్మించారు. 1961లో పూర్తిస్థాయిలో నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం వెయ్యికి పైగా భక్తులు ఇక్కడ ప్రార్థనలు చేసుకునే వీలుంది. సేవా విస్తరణ.. గాంధీనగర్‌లోని బాలాజీ ఇంద్రప్రస్థాన్ సమీపంలో 1969లో సెయింట్ గ్రెగోరియన్ చర్చిని నిర్మించారు. కేరళకు చెందిన పరుమళ కొచిర్ తిరుమనేని రెవరెండ్ జీనన్ దీనిని స్థాపించారు. ఇందులో గ్రెగోరియన్ ఆర్థటిక్స్ స్కూల్‌నూ ఏర్పాటు చేశారు. నగరంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరో నాలుగు చర్చిలు నిర్మించారు. పంజాబీ నిర్మించిన హెబ్రోన్ క్రైస్తవ బోధకుడిగా మారిన పంజాబీ భక్తసింగ్ 1954లో నగరానికి వచ్చి, ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని గోల్కొండ క్రాస్ రోడ్డులో హెబ్రోన్ చర్చిని ఏర్పాటు చేశాడు. తర్వాత దేశవ్యాప్తంగా హెబ్రోన్ చర్చిలు వెలిశాయి. భక్తసింగ్, అగస్టిన్, బెంజుమన్లు ఇందుకు కీలకంగా పనిచేశారు. ఇక్కడ ప్రతి ఆదివారం అన్నదానం చేస్తారు. క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనల్లో సుమారు 5వేల మంది పాల్గొంటారు. వెస్లీ చర్చి.. సికింద్రాబాద్‌లోని క్లాక్‌టవర్ దగ్గర బ్రిటిష్ మిషనరీస్ రెవరెండ్ విలియం బర్గెస్, రెవరెండ్ బెంజిమిన్ ప్రాట్ల ఆధ్వర్యంలో 1916లో వెస్లీ చర్చిని నిర్మించారు. సీఎస్ఐ అనుబంధంగా కొనసాగుతోంది. అతి పురాతనం.. సెయింట్ బాప్టిస్టు జంటనగరాల్లోనే అతి పురాతన చర్చి సికింద్రాబాద్‌లోని సెయింట్ బాప్టిస్టు. 1813లో దీనిని నిర్మించారు. 1998లో హెరిటేజ్ అవార్డు దక్కించుకుంది. దీనికి అనుబంధంగా స్కూల్, కాలేజీ కొనసాగుతున్నాయి. చర్చి అధీనంలో సుమారు 100 ఎకరాలు ఉండేది. కాలక్రమేణా చాలా వరకు స్థలం అన్యాక్రాంతమైంది. ఆర్మీ స్పెషల్.. ఆల్ సెయింట్స్ ఆర్మీ అధికారుల కోసం ప్రత్యేకంగా తిరుమలగిరిలో 1860లో చర్చి ఆఫ్ ఇంగ్లండ్ ఆధ్వర్యంలో ఆల్ సెయింట్స్ చర్చిని నిర్మించారు. స్వాతంత్య్రానంతరం సీఎస్ఐ (చర్చి ఆఫ్ సౌతిండియా) పరిధిలోకి వచ్చింది. తిరుమలగిరిలో ఏర్పాటైన తొలి శాశ్వత కట్టడం ఇదే కావడం గమనార్హం. సెయింట్ జాన్స్ సికింద్రాబాద్‌లోని సెయింట్ జాన్స్ చర్చికి 200ఏళ్ల చరిత్ర ఉంది. 1813లో దీనిని నిర్మించారు. ఇది 1998లో హెరిటేజ్ అవార్డు దక్కించుకుంది. సెంటినరీ బాప్టిస్టు బాప్టిస్ట్ చర్చిగా ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్‌లోని సెంటినరీ బాప్టిస్టు చర్చిని రెవరెండ్ డబ్ల్యూడబ్ల్యూ క్యాంప్‌బెల్ ఆధ్వర్యంలో 1875లో నిర్మించారు. 1975లో పునర్నిర్మాణం చేపట్టగా 1991లో పూర్తయింది. దీని ఆధ్వర్యంలో జంటనగరాల్లో 35 చర్చిలు కొనసాగుతున్నాయి. వందేళ్ల చరిత్ర.. ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని గోల్కొండ క్రాస్ రోడ్డులో ఉన్న ఎంబీ చర్చికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. 1898లో మిషనరీస్ ఆధ్వర్యంలో ఈబర్ట్ దంపతులు మలక్‌పేట్‌లో చర్చి ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం మలక్‌పేట్ ఏరియా పోలీస్ ఆసుపత్రిగా కొనసాగుతోంది. తర్వాత నగరంలో విద్యా, వైద్య సేవలు విస్తరించాలని రెవరెండ్ ఫాంక్రాట్స్ ఆధ్వర్యంలో 1904లో ఇక్కడి గాంధీనగర్‌లో చర్చి, గోల్కొండ చౌరస్తాలో స్కూల్‌ను ప్రారంభించారు. అయితే 1952లో చర్చిని కూడా గోల్కొండ చౌరస్తాకు తరలించారు. లూథరన్ చర్చి 1990లో రెవరెండ్ సి.ఏసుపాదం లక్డీకాపూల్‌లో కొండపై లూథరన్ చర్చికి పునాది వేశారు. ఆంధ్రా ఇవాంజలికల్ లూథరన్ చర్చి (గుంటూరు) కేంద్రంగా ఇది కొనసాగుతోంది. ఒకేసారి 2వేల మంది ప్రార్థనలు చేసుకునే విధంగా విశాల ప్రార్థనా మందిరం ఉంది. ఇక్కడ 5వేల మంది భక్తులు సభ్యత్వం తీసుకున్నారు. -
పండుగ సంబరాల్లో క్రైస్తవ యువత
-
తమిళనాడులో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
మెదక్ చర్చ్‌లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
అంబరాన్ని తాకిన క్రిస్మస్ వేడుకలు
-
దేశ వ్యాప్తంగా క్రిస్మస్ సందడి
-
క్రిస్మస్ వేడుకలపై ట్రంప్ ప్రకటన ప్రభావం
బెత్లహాం: ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలెంను గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన బెత్లహాంలో క్రిస్మస్ వేడుకలపై ప్రభావం చూపుతోంది. ప్రతి ఏడాదీ డిసెంబరు 24 అర్ధరాత్రి క్రైస్తవులు సామూహిక ప్రార్థనలు చేస్తారు. స్థానికులే కాకుండా పలు దేశాల నుంచి కూడా యాత్రికులు వస్తుంటారు. ట్రంప్ నిర్ణయంతో పాలస్తీనా నిరసనకారులు, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య ఘర్షణలు, నిరసనల నేపథ్యంలో యాత్రికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. హింసకు భయపడే ఎంతోమంది పర్యాటకులు ఇక్కడకు రాలేదని ఓ ఆర్చ్‌బిషప్ చెప్పారు. -
క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైన సీఎస్ఐ
సాక్షి, మెదక్ : క్రిస్మస్ వేడుకలకు మెదక్ సీఎస్ఐ (చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా) ముస్తాబైంది. యేసయ్య మహాదేవాలయం రంగురంగుల విద్యుద్దీపాలతో వెలుగులీనుతోంది. సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు బిషప్ ఏసీ సాల్మన్‌రాజు తొలి ప్రార్థన ప్రారంభిస్తారు. అనంతరం దైవ సందేశాన్ని ఇస్తారు. తర్వాత పవిత్ర సిలువ ఊరేగింపు నిర్వహిస్తారు. 9.30 గంటలకు రెండో ఆరాధన జరుగుతుంది. చర్చిలో నిర్వహించే వేడుకలకు రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల వారు హాజరవుతారు. మరోవైపు చర్చికి ఆదివారం నుంచే భక్తుల తాకిడి మొదలైంది. సుమారు రెండు లక్షల మంది వరకు వేడుకల్లో పాల్గొంటారని అంచనా. ఈ సందర్భంగా చర్చి వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 500 మందికిపైగా పోలీసులు బందోబస్తులో ఉన్నారు. -
రాజ్‌భవన్‌లో క్రిస్మస్ వేడుకలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో క్రిస్మస్ వేడుకల ఏసు క్రీస్తు ప్రార్థనా గీతాలతో కాస్త ముందుగానే ప్రారంభమయ్యాయి. బుధవారం రాజ్‌భవన్‌లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో పాటు ఆయన సతీమణి విమలా నరసింహన్ హాజరయ్యారు. అలాగే ఈ వేడుకల్లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు డాక్టర్ డీఎం డి రెబెలో, రాచెల్ ఛటర్జీతోపాటు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అరుణ బహుగుణ పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్ అధికారులు యేసును స్తుతిస్తూ ప్రార్థనా గీతాలు ఆలపించారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. ప్రతి ఏటా నూతన సంవత్సరాన్ని సూచించే ఈ ప్రార్థనా గీతాలాపన కోసం తాను ఎదురు చూస్తుంటానని అన్నారు. యేసు ప్రపంచానికి శాంతిని బోధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనా గీతాల్లో పాల్గొన్న వారిని గవర్నర్ అభినందించారు. కార్యక్రమంలో రాజ్‌భవన్ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ వేడుకలు వద్దు: స్కూళ్లకు వార్నింగ్
లక్నో: పాఠశాల ప్రాంగణాల్లో క్రిస్మస్ సంబరాలు జరపొద్దని ఉత్తరప్రదేశ్‌లోని క్రిస్టియన్ స్కూళ్లకు హెచ్చరిక జారీ అయింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చెందిన హిందూ యువవాహిని సంస్థకు అనుబంధంగా ఉన్న హిందూ జాగరణ్ మంచ్ ఈ హెచ్చరిక జారీ చేసింది. అలీగఢ్‌లోని క్రిస్టియన్ స్కూళ్లలో క్రిస్మస్ వేడుకలు జరపొద్దని ఈ సంస్థ హెచ్చరించినట్టు ‘వరల్డ్ ఈజ్ వన్ న్యూస్’ వెల్లడించింది. తమ ఆజ్ఞలను ఉల్లంఘిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. క్రిస్టియన్ స్కూళ్లలో ఎక్కువ సంఖ్యలో హిందూ విద్యార్థులు చదువుకుంటున్నారని, కిస్మస్ జరుపుకునేందుకు విద్యార్థులను బొమ్మలు, కానుకలు తీసుకురమ్మంటున్నారని హిందూ జాగరణ్ మంచ్ అధ్యక్షుడు సోనూ సవిత తెలిపారు. బహుమానాలు, ఇతర వస్తువులతో హిందూ విద్యార్థులను క్రైస్తవులు ఆకర్షిస్తున్నారని, తర్వాత మతమార్పిడి చేస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి కార్యకలాపాలు హిందూ విద్యార్థులపై మానసికంగా ప్రతికూల ప్రభావం చూపుతాయని అన్నారు. ఇలాంటి చర్యలను వ్యతిరేకించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి కోరతామన్నారు. -
రాణిగారి క్రిస్మస్ సంబరాలు షురూ!
అబ్బో... ఇప్పుడెక్కడ క్రిస్మస్ అండీ! పండక్కి ఇంకో పాతిక రోజులు ఉందిగా? అనొచ్చు. కానీ, కాజల్ అగర్వాల్‌కి ఆల్రెడీ క్రిస్మస్ వచ్చింది. ఇప్పుడా సంబరాల్లోనే ఉన్నారు. అదీ ప్యారిస్‌లో! ఇదేం లెక్క? ఇండియాలో డిసెంబర్ 25న, ప్యారిస్‌లో పాతిక రోజుల ముందు క్రిస్మస్ చేస్తారా! అనే డౌటొచ్చిందా? అదేం కాదు. కాజల్ అగర్వాల్ ‘ప్యారిస్ ప్యారిస్’ అనే తమిళ సినిమా చేస్తున్నారిప్పుడు. హిందీ హిట్ ‘క్వీన్’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. కంగనా రనౌత్ పాత్రలో కాజల్ నటిస్తున్నారు. ఇప్పుడీ సిన్మా షూటింగ్ ప్యారిస్‌లో జరుగుతోంది. అందులో భాగంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట! ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ప్యారిస్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరో పది రోజులు అక్కడే చేస్తారట! నటుడు రమేశ్ అరవింద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే... తెలుగు ‘క్వీన్’ రీమేక్‌లో తమన్నా టైటిల్ రోల్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ‘క్వీన్’కి నీలకంఠ దర్శకుడు. -
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
సాక్షి, మెదక్: మెదక్ చర్చిలో ఆదివారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. లోకరక్షకుడైన ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చిలో రోజంతా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బిషప్ ఏసీ సాల్మన్‌రాజ్ ఆధ్వర్యంలో వేకువజామున 4.30 గంటలకు దైవ ప్రార్థనలు మొదలయ్యాయి. ప్రార్థనల అనంతరం ఆయన భక్తులకు దైవ సందేశం ఇచ్చారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారితో చర్చి కిటకిటలాడింది. ప్రార్థనల్లో సుమారు 3 లక్షల మంది పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పద్మాదేవేందర్‌రెడ్డితో కలసి కడియం కేక్ కట్ చేశారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ బాసలికా చర్చిలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ఆర్చ్ డయాసిస్ బిషప్ తుమ్మ బాల ప్రత్యేక ప్రార్థనలుS చేసి, క్రీస్తు సందేశాన్ని అందించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. -
ఏసు నామంతో పులకించిన పుట్టపర్తి
పుట్టపర్తి టౌన్ : క్రిస్మస్ సందర్భంగా ఏసునామ స్మరణతో పుట్టపర్తి పులకించిపోయింది. ఆదివారం ఉదయం ప్రశాంతినిలయంలోని సాయికుల్వంత్ సభామందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సత్యసాయి స్కూల్ విద్యార్థుల వయొలిన్ వాయిద్య కచేరితో వేడుకలు ప్రారంభమయ్యాయి. బ్రాస్‌బ్యాండ్ వాయిద్య కచేరి నిర్వహించారు. ఏసును, సత్యసాయిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. గత క్రిస్మస్ వేడుకలలో ఇచ్చిన సందేశాన్ని భక్తులకు డిజిటల్ స్క్రీన్ల ద్వారా ప్రదర్శించారు. శాంతాక్లాజ్ తాత సాయికుల్వంత్ మందిరంలో కలియ తిరుగుతూ చాక్లెట్లు వెదజల్లుతూ మేరీ మేరీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం పూర్వపు ఇంటర్నేషనల్ క్రిస్మస్ కమిటీ చైర్మన్ జాన్బెన్హార్డ్ క్రిస్మస్ వేడుకలు, క్రీస్తు, సత్యసాయి సందేశాలను వివరిస్తూ ప్రసంగించారు. ఏసు, సత్యసాయి ఇద్దరూ లోక కల్యాణ సాధనకు పాటుపడిన మహనీయులన్నారు. అనంతరం పలువురు విదేశీ భక్తులు శాస్త్రీయ సంగీత వాయిద్య కచేరీ నిర్వహించారు. కళాకారులకు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు నూతన వస్త్రాలను బహూకరించి సన్మానించారు. వేడుకలలో తెలంగాణ ఐజీ చారుసిన్హా, వివిధ దేశాల సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ వేడుకలకు రాణీగారు దూరం!
దాదాపు 28 ఏళ్లలో తొలిసారిగా ఈ సంవత్సరం బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2 క్రిస్మస్ సంబరాలకు దూరంగా ఉన్నారు. ఆమెకు బాగా జలుబు చేయడంతో సండ్రింగ్‌హామ్‌లో జరిగే వేడుకలకు వెళ్లలేదని తెలిసింది. బ్రిటిష్ రాజకుటుంబానికి చెందిన వారు క్రిస్మస్ సంబరాలకు వెళ్లకపోవడం దాదాపు ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఆమెను చూసేందుకు ఈ సందర్భంలోనే భారీ సంఖ్యలో సామాన్య ప్రజలు చర్చికి వస్తారు. రాణీగారికి జలుబు చాలా ఎక్కువగా ఉందని, అందువల్ల ఆమెను లోపలే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. రాబోయే రోజుల్లో రాచకుటుంబం నిర్వహించే క్రిస్మస్ సంబరాల్లో రాణీగారు పాల్గొంటారని తెలిపారు. రాణీ ఎలిజబెత్ ఆరోగ్యం సాధారణంగా అయితే బాగానే ఉంటుంది. ఆమె గత కొన్నేళ్లుగా ప్రయాణాలు కూడా బాగానే చేస్తున్నారు. ఇటీవలి కాలంలో రాణీగారి భర్త ప్రిన్స్ ఫిలిప్ (95) ఇటీవలి కాలంలో ప్రజల ముందు రావడం, సహాయ కార్యక్రమాలు చేయడం మానుకున్నారు. ఆయనకు కూడా ఈ వారం మొదటి నుంచి జలుబు ఎక్కువగా ఉందని బకింగ్‌హామ్ ప్యాలెస్ వర్గాలు చెప్పాయి. -
హుజూరాబాద్ చర్చిలో కేక్ కట్ చేసిన ఈటల
కరీంనగర్: జిల్లాలోని హుజూరాబాద్‌లో గల బిలీవర్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. చర్చిలో ప్రార్ధనల్లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కేక్ కట్ చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు. -
పులివెందుల చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
నేటి నుంచి జనవరి 2వరకు క్రిస్మస్ వేడుకలు
-
తమిళనాడు వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
ప్రకాశం జిల్లాలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
-
సికింద్రాబాద్ సెయింట్ మేరీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు
-
క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబు
-
క్రిస్మస్ వేడుకలకు మెదక్ చర్చి ముస్తాబు
ఆసియాలోనే అతిపెద్దదైన మెదక్ సీఎస్ఐ చర్చి క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. కరుణామయుని నిలయంలో ప్రార్థన చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సీఎస్ఐ మెదక్ డయాసిస్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు జనవరి 2 వరకు కొనసాగనున్నాయి. వేకువజామున 4.30 గంటలకు బిషప్ ఏసీ సాల్మన్ రాజు మొదటి ప్రార్థనలతో చర్చిలో వేడుకలను ప్రారంభిస్తారు. -
చెన్నై మాల్స్‌లో క్రిస్మస్ సందడి
-
లండన్‌లో టీఆర్‌ఎస్‌సెల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు
రాయికల్ : లండన్‌లోని ఎన్ఆర్ఐ టీఆర్‌ఎస్‌సెల్ ఆధ్వర్యంలో ఈస్ట్హోమ్లో గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. లండన్‌లోని వివిధ ప్రాంతాలకు చెందిన తెలంగాణవాదులు క్రిస్మస్ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ టీఆర్‌ఎస్‌సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్ మాట్లాడుతూ సీఏం కేసీఆర్ హయాంలో అన్నివర్గాల వారికి సముచిత స్థానం ఉందని, ఎలాంటి మతభేదాలు లేకుండా పండుగలు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం తెలంగాణ జాగృతి నాయకుడు హైదర్ ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నవీన్‌రెడ్డి, శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి రత్నాకర్, అడ్వైజరి బోర్డు చైర్మన్ వెంకట్‌రెడ్డి, సభ్యులు సత్యం, ప్రవీణ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.