రాజ్‌భవన్‌లో క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభం | Christmas celebrations at Raj Bhavan | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌లో క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభం

Published Thu, Dec 21 2017 2:30 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

Christmas celebrations at Raj Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాజ్‌భవన్‌లో క్రిస్మస్‌ వేడుకల ఏసు క్రీస్తు ప్రార్థనా గీతాలతో కాస్త ముందుగానే ప్రారంభమయ్యాయి. బుధవారం రాజ్‌భవన్‌లో జరిగిన క్రిస్మస్‌ వేడుకల్లో గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తో పాటు ఆయన సతీమణి విమలా నరసింహన్‌ హాజరయ్యారు. అలాగే ఈ వేడుకల్లో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు డాక్టర్‌ డీఎం డి రెబెలో, రాచెల్‌ ఛటర్జీతోపాటు రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి అరుణ బహుగుణ పాలుపంచుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు రిటైర్డ్‌ అధికారులు యేసును స్తుతిస్తూ ప్రార్థనా గీతాలు ఆలపించారు. గవర్నర్‌ నరసింహన్‌ మాట్లాడుతూ.. ప్రతి ఏటా నూతన సంవత్సరాన్ని సూచించే ఈ ప్రార్థనా గీతాలాపన కోసం తాను ఎదురు చూస్తుంటానని అన్నారు. యేసు ప్రపంచానికి శాంతిని బోధించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రార్థనా గీతాల్లో పాల్గొన్న వారిని గవర్నర్‌ అభినందించారు. కార్యక్రమంలో రాజ్‌భవన్‌ అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement