Raj Bhavan
-
ఛలో రాజ్ భవన్.. కాంగ్రెస్ నిరసన ర్యాలీ
-
నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతల ఛలో రాజభవన్
-
మహారాష్ట్ర ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ నేత కాళిదాస్ కొలాంబ్కర్
ముంబై: బీజేపీ సీనియర్ నేత కాళిదాస్ కొలాంబ్కర్ మహారాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. కొలాంబ్కర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో కాళిదాస్ కొలాంబ్కర్ ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 288 మంది ఎమ్మెల్యేలతో కొలాంబ్కర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. డిసెంబర్ 7 నుంచి 15వ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ ప్రత్యేక సమావేశాల్లో సెంబ్లీకి శాశ్వత స్పీకర్‌ను, డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. త్వరలో నూతన అసెంబ్లీ కొలువుదీరనుంది.#WATCH | Mumbai: BJP leader Kalidas Kolambkar takes oath as the Maharashtra Assembly Protem Speaker at Maharashtra Raj Bhawan administered by state Governor CP Radhakrishnan in the presence of Maharashtra CM Devendra Fadnavis. pic.twitter.com/IHSA6Ube6z— ANI (@ANI) December 6, 2024కాగా మహారాష్ట్రలో ఎట్టకేలకు దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమి నూతన ప్రభుత్వం కొలువుదీరింది. ఫలితాలు వెలువడిన 12 రోజుల తర్వాత ఎట్టకేలకు ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఆజాద్ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవాల వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మోంశాఖమంత్రి అమిత్ షా సహా బీజేపీ కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, ప్రముఖ నేతలు, బాలీవుడ్ నటీనటుటు, పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు హాజరయ్యారు. -
నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి రాక
సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: రెండురోజుల పర్యటన కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. గురు, శుక్రవారాల్లో (21, 22వ తేదీల్లో) ఆమె హైదరాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గురువారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో దిగుతారు. అటునుంచి రాజ్‌భవన్‌కు చేరుకొని 6.20 గంటల నుంచి 7.10 వరకు విశ్రాంతి తీసుకొంటారు. రాత్రి 7.20 గంటలకు ఎన్టీఆర్ స్టేడియానికి చేరుకొని, అక్కడ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు శిల్పకళా వేదికలో జరుగుతున్న ‘లోక్ మంథన్’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. మ ధ్యాహ్నం 12.05 గంటలకు తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
విభిన్న సంస్కృతులు, సంప్రదాయాల సంగమమే భారత్: గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ
సాక్షి, హైదరాబాద్: విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాల సంగమమే భారతదేశమని రాష్ట్ర గవ ర్నర్ జిష్ణుదేవ్‌వర్మ వ్యాఖ్యానించారు. నవంబర్ 1న దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాల వ్యవస్థాపక దినోత్సవాన్ని శుక్రవారం రాజ్‌భవన్‌లోని సంస్కృతి హాలులో ఘనంగా నిర్వ హించారు. ఈ కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా గవ ర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్ అనే నినాదంతో భారతదేశ కీర్తిని ప్రధాని నరేంద్రమోదీ విశ్వవ్యాప్తం చేశార న్నారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక దినోత్సవాలు జరుపుకున్న రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. శుక్రవారం వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణాæ, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, పంజాబ్, తమిళనాడుతోపాటు కేంద్రపాలిత ప్రాంతాలైన అండమాన్–నికోబార్ దీవులు, చండీగఢ్, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరిలు న్నాయి. ఈ వేడుకల్లో పద్మశ్రీ పద్మజారెడ్డి బృందం ఇచ్చిన కూచిపుడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. -
మళ్లీ రాజుకుంటున్న మణిపూర్
ఇంఫాల్: కల్లోల మణిపూర్‌లో పరిస్థితి మళ్లీ అదుపు తప్పుతోంది. జాతుల ఘర్షణతో గతేడాది అట్టుడికిపోయిన ఆ రాష్ట్రంలో మరోసారి హింస పెచ్చరిల్లుతోంది. కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోతున్న ఘర్షణలను నిరసిస్తూ విద్యార్థులు తలపెట్టిన ఆందోళనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. డీజీపీ, భద్రతా సలహాదారును తొలగించాలంటూ గవర్నర్ నివాసాన్ని, సచివాలయాన్ని ముట్టించేందుకు వారంతా మంగళవారం విఫలయత్నం చేశారు. అడ్డుకున్న భద్రతా సిబ్బందిపైకి రాళ్లు తదితరాలు విసిరారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో 40 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు.దాంతో లోయలోని ఐదు సమస్యాత్మక జిల్లాల్లో 5 రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం రాష్ట్రమంతటికీ వర్తిస్తుందని తొలుత పేర్కొన్నా, అనంతరం దాన్ని ఐదు జిల్లాలకే పరిమితం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, విద్యా సంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు. రాజధాని ఇంఫాల్‌తో పాటు పరిసర జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ విధించారు. ఎవరూ ఇళ్లనుంచి బయటికి రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఆందోళనలు మరింత విస్తరించకుండా చూసేందుకే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు ప్రభు త్వం పేర్కొంది. మరో 2,000 మందికి పైగా సీఆరీ్పఎఫ్ సిబ్బందిని కేంద్రం మణిపూర్‌కు తరలించింది. మణిపూర్‌లో వారం రోజులుగా జరుగుతున్న ఘర్షణల్లో కనీసం 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల డ్రోన్, రాకెట్ దాడులు జరిగినట్టు వార్తలొచ్చా యి. అవి వాస్తవమేనని ఐజీ కె.జయంతసింగ్ తెలిపారు. డ్రోన్లతో పాటు అధునాతన రాకెట్ల తాలూకు విడి భాగాలను పౌర ఆవాస ప్రాంతాల్లో తాజాగా స్వా«దీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు. అంతకుమించి వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. తౌబల్ ప్రాంతంలో నిరసనకారుల నుంచి దూసుకొచి్చన తూటా ఓ పోలీసును గాయపరిచినట్టు చెప్పారు. -
కర్ణాటక పాలిటిక్స్‌లో ట్విస్ట్.. ఇప్పుడు కుమారస్వామి వంతు!
బెంగళూరు: ఓ సామాజికకార్త ఫిర్యాదు ఆధారంగా.. అవినీతి ఆరోపణలపై ఏకంగా ముఖ్యమంత్రినే విచారణ చేపట్టేందుకు అనుమతించడంతో కర్ణాటక గవర్నర్ తీరు సర్వతత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపింది. కేంద్రంలోని బీజేపీ ఇదంతా చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. అయితే ఈలోపు కన్నడనాట మరో మలుపు చోటు చేసుకుంది.అక్రమ గనుల వ్యవహారంలో జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామిని విచారణ చేపట్టేందుకు అనుమతించాలని ఆ రాష్ట్ర లోకాయుక్తా మంగళవారం గవర్నర్ తవార్ చంద్ గెహ్లాట్‌ను కోరింది. అయితే.. ఈ వ్యవహారంలో లోకాయుక్తా విజ్ఞప్తి చేయడం ఇదే మొదటిసారేం కాదు. కిందటి ఏడాది సైతం రాజ్‌భవన్‌కు రిక్వెస్ట్ పంపగా.. అక్కడి నుంచి తిరస్కరణ ఎదురైంది.2007లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓ ప్రైవేట్ సంస్థకు(ఎస్‌ఎస్‌వీఎం కంపెనీ) చట్టాన్ని అతిక్రమించి అప్పనంగా మైనింగ్ లీజ్‌ను కట్టబెట్టారన్నది ప్రధాన అభియోగం. దీనిపై 2013-17 మధ్య జస్టిస్ సంతోష్ హెగ్డే నేతృత్వంలోని కర్ణాటక లోకాయుక్త ఓ నివేదిక రూపొందించింది. ఈ నివేదిక ఆధారంగా సిట్ దర్యాప్తు జరిగింది. కిందటి ఏడాది నవంబర్ 1వ తేదీన ఏడీజీపీ చంద్రశేఖర్, రాజ్‌భవన్‌కు కుమారస్వామిని విచారించేందుకు అనుమతించాలని లేఖ రాశారు. తాజాగా ఆగష్టు 8వ తేదీన ఛార్జ్‌షీట్ ఆధారంగా రెండో విజ్ఞప్తి సిట్ తరఫు నుంచి రాజ్‌భవన్‌కు నివేదిక వెళ్లింది. అయితే.. గతంలో గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో పాటు తాజా పరిణామాలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంగళవారం స్పందించారు. ‘‘గవర్నర్ పక్షపాతంగా వ్యవహరించకూడదు. ఆయన రాజ్యాంగాన్ని గౌరవించాలి. రాష్ట్రపతికి ప్రతినిధిగా ఆయన వ్యవహరించాలే తప్ప.. కేంద్ర ప్రభుత్వానికి కాదు’’ అని అన్నారు. అంతేకాదు.. బీజేపీ మాజీ మంత్రులు శశికళ జోలే, మురుగేష్నిరాని, జీ జనార్ధన్రెడ్డిలపై ఉన్న అభియోగాలపై విచారణకు కూడా గవర్నర్ అనుమతించలేదన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం కుమారస్వామి కేంద్ర కేబినెట్లో ఉన్నారు. దీంతో ఆయన్ని విచారించాలంటే గవర్నర్ అనుమతి తప్పనిసరి. ఒకవేళ అనుమతి గనుక లభిస్తే మాత్రం.. రాజకీయంగా అది ఆయనకు కాస్త ఇబ్బందికర పరిస్థితే. అయితే.. కుమారస్వామి తాజా పరిణామాలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాత కేసును తిరగదోడి తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారాయన. గతంలో(2017) మూడు నెలలో దర్యాప్తు పూర్తి చేయాలని సిట్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. కానీ, సిట్ అప్పుడు విఫలమైంది. సిద్ధరామయ్యకే గనుక దమ్ముంటే మళ్లీ సుప్రీం కోర్టుకు వెళ్లాలి అని కుమారస్వామి సవాల్ విసిరారు. టీజే అబ్రహం అనే సామాజిక కార్యకర్త జులై 26వ తేదీన సీఎం సిద్ధరామయ్యపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 10 గంటల తర్వాత సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(MUDA) స్కామ్‌లో.. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం, అలాగే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 చట్టంలోని 218 సెక్షన్ ప్రకారం విచారణ జరపొచ్చని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టిన సిద్ధరామయ్య.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా అక్కడ స్వల్ప ఊరట లభించింది. తాము తదుపరి విచారణ జరిపేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకొవద్దని ట్రయల్ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఆగష్టు 29న సిద్ధరామయ్య పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. -
రాజ్‌భవన్‌లో ఎట్ హోం.. బీఆర్ఎస్ నేతలు డుమ్మా
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ సహా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతకుమారి, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కాగా, తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను, పద్మ అవార్డు గ్రహీతలను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పలికరించారు. మరోవైపు.. ఎట్ హోం కార్యక్రమానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్ రామిరెడ్డి హాజరయ్యారు. ఇక, ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు డుమ్మా కొట్టారు. సీఎం రేవంత్‌పై విమర్శలు చేయడంలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. -
తెలంగాణ రాజ్ భవన్ లో జెండా ఎగురవేసిన గవర్నర్
-
తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు.జిష్ణుదేవ్ వర్మ 2018–23 మధ్యకాలంలో త్రిపుర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర నాలుగవ గవర్నర్‌గా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ గవర్నర్లుగా ఇప్పటి వరకు ఈఎస్ఎల్ నరసింహన్, తమిళిసై సౌందరరాజన్, ఇన్చార్జి గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ వ్యవహరించిన సంగతి తెలిసిందే.కాగా, జిష్ణుదేవ్ వర్మ బుధవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం జిష్ణుదేవ్ వర్మకు సాయుధ దళాలు గౌరవ వందనం చేశాయి. -
హైదరాబాద్: రాజ్‌భవన్ లో ఆషాడ బోనాలు ఉత్సవాలు (ఫోటోలు)
-
సీఎం మమత వ్యాఖ్యలపై గవర్నర్ అభ్యంతరం.. ‘నివేదిక ఇవ్వండి’
కోల్‌కతా: నిస్సహాయులైన బంగ్లాదేశ్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా మమత చేసిన వ్యాఖ్యలపై వివరణతో కూడిన నివేదిక సమర్పించాలని కోరారు.‘విదేశి వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ విషయాన్ని బెంగాల్ ప్రభుత్వానికి గుర్తుచేస్తున్నాం. విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి ఆశ్రయం కల్పించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. విదేశాల నుంచి వచ్చే ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని సీఎం బహిరంగంగా ప్రకటించటం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటాన్ని సూచిస్తుంది. సీఎం మమత వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద్ ఆర్టికల్ 167 ప్రకారం వివరణతో కూడిన నివేదిక సమర్పించాలని కోరారు.’అని రాజ్‌భవన్ మీడియా సెల్ ‘ఎక్స్’లో పేర్కొంది.HG has sought a report under Article 167 on the reported comment made by Chief Minister publicly on 21.07.2024:“…But I can tell you this, if helpless people come knocking on the doors of Bengal, we will surely provide them shelter.”Close on its heels came Government of India’s…— Raj Bhavan Media Cell (@BengalGovernor) July 22, 2024బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ కోటాను వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. వారం రోజులు పాటు తీవ్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళలో వందకుపైగా నిరసనకారులు మృతి చెందారు. ఇలాంటి సమయంలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. -
గవర్నర్ కొడుకు ఓవరాక్షన్.. లగ్జరీ కారు కోసం రాజ్‌భవన్ అధికారిపై దాడి
భువనేశ్వర్: ఒడిశా రాజ్‌భవన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గవర్నర్ రఘుబర్ దాస్ కుమారుడు రాజ్‌భవన్‌లోకి ఓ అధికారిపై దాడి చేసినట్టు ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో సదురు అధికారి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.ఈ ఘటనపై బాధితుడి భార్య సయోజ్ తెలిపిన వివరాల ప్రకారం.. బైకుంత్ ప్రధాన్(47) ఒడిశా రాజ్‌భవన్‌లోని గవర్నర్ సెక్రటేరియట్, డొమెస్టిక్ సెక్షన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. కాగా, బైకుంత్ ప్రధాన్ ఏడో తేదీన గవర్నర్ రఘుబర్ దాస్ కుమారుడు లలిత్ కుమార్‌ను పూరీ రైల్వే స్టేషన్ నుంచి రాజ్‌భవన్‌కు తీసుకురావాల్సి ఉంది. అయితే, అదే సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన నేపథ్యంలో రాజ్‌భవన్‌లో సన్నాహకాలు జరుగుతున్నాయి. #WATCH | Sayoj, wife of Baikuntha Pradhan, who works in Odisha's Raj Bhavan, has accused the Governor's son and others of beating her husband.She said, "...On the night of June 7, the Governor's son called my husband to his room and beat him badly. He came out to save himself,… pic.twitter.com/PmWmVs3hqh— ANI (@ANI) July 13, 2024ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో ఉన్న లగ్జరీ కార్లు అన్నీ బయటకు వెళ్లిపోవడంతో అందుబాటులో ఉన్న మారుతీ సుజుకీ కారును తీసుకుని బైకుంత్ రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అనంతరం, కారు ఎక్కిన లలిత్.. బైకుంత్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మారుతీ కారును తీసుకురావడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో వారు రాజ్‌భవన్‌కు చేరుకోగానే లలిత్ కుమార్, అతడి స్నేహితులు(ఐదుగురు) బైకుంత్పై దాడి చేశారు. అతడిని తీవ్రంగా గాయపరిచారు. ఇక, ఈ ఘటనపై రాజ్‌భవన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తాము పోలీసులను ఆశ్రయించినట్టు ఆమె తెలిపారు. సయోజ్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పూరీ పోలీసులు చెప్పారు. -
7 బిల్లులకు గవర్నర్ ఓకే
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఏడు బిల్లులకు రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ శనివారం ఆమోదం తెలిపారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణకు సంబంధించిన మూడు బిల్లులతో పాటు తెలంగాణ స్టేట్ ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) బిల్లు, తెలంగాణ స్టేట్ మైనార్టీస్ కమిషన్ బిల్లు, తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర వేశారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి గత సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సుమారు రెండు గంటలపాటు సమావేశమై పెండింగ్ బిల్లుల అంశాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే గవర్నర్ పెండింగ్ బిల్లులపై నిర్ణయం తీసుకున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్ర శాసనసభలో ఆమోదించిన చాలా బిల్లులను నాటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించకుండా సుదీర్ఘ కాలం పెండింగ్‌లో పెట్టారు. దీనిపై అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో తమిళిసై కొన్ని బిల్లులను మాత్రమే ఆమోదించారు. తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం బిల్లును రాష్ట్రపతికి పంపించారు. మిగిలిన బిల్లులను తిరస్కరించడం లేదా ప్రభుత్వానికి తిప్పి పంపించడం చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం శాసనసభ రెండోసారి ఆమోదించిన బిల్లులను గవర్నర్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పెండింగ్ బిల్లుల్లో నాలుగింటిని గత బీఆర్ఎస్ సర్కారు రెండోసారి రాష్ట్ర శాసనసభలో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపినా తమిళిసై ఆమోదించలేదు. తాజాగా ఏడు బిల్లులను గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించడంతో ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది. మరో ఐదు ప్రైవేటు వర్సిటీలకు చాన్స్ తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు–2022ను గవర్నర్ ఆమోదించడంతో రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు వీలు కలగనుంది. ఈ బిల్లును బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి శాసనసభలో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపించింది. కాగా మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో ఎన్‌ఐసీఎంఏఆర్ (NICMAR) యూనివర్సిటీ, సంగారెడ్డిలో ఎంఎన్ఆర్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురునానక్, మేడ్చల్ జిల్లా ఘటకేసర్ మండలం యామ్నంపేటలో శ్రీనిధి, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో కావేరి వర్సిటీల ఏర్పాటుకు మార్గం సుగమం అయ్యింది. ‘అవిశ్వాసం’ ఇక నాలుగేళ్ల తర్వాత.. మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు–2022కు ఆమోదముద్ర లభించడంతో మున్సిపల్ చైర్పర్సన్/వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీస కాల వ్యవధిని 3 ఏళ్ల నుంచి 4 ఏళ్లకు పెరిగింది. రాష్ట్రంలోని 129 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల మేయర్లు/చైర్ పర్సన్లు, డిప్యూటీ మేయర్లు/వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాసన తీర్మానం ప్రవేశపెట్టడానికి వారి పదవీ కాలం కనీసం మూడేళ్లు ముగిసి ఉండాలని మున్సిపాలిటీల చట్టం పేర్కొంటోంది. మేయర్లు/చైర్ పర్సన్లు, వైస్ చైర్మన్లు/డిప్యూటీ మేయర్లను బెదిరించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికి కౌన్సిలర్లు/కార్పొరేటర్లు ఈ నిబంధనను దురి్వనియోగం చేస్తున్నారని పేర్కొంటూ గత ప్రభుత్వం ఈ వ్యవధిని 4 ఏళ్లకు పెంచాలనే ప్రతిపాదన చేసింది. రాజ్యసభ సభ్యులకూ ఓటు హక్కు మున్సిపాలిటీల ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు వ్యవహరిస్తారని మునిసిపాలిటీల చట్టంలో ఉండగా, చైర్పర్సన్/మేయర్, వైస్ చైర్పర్సన్/డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఓటేసే హక్కు మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్‌సభ సభ్యులకు మాత్రమే ఉన్నట్టు చట్టంలో ఉంది. ‘రాజ్యసభ సభ్యులు’ అనే పదాన్ని చేర్చడంలో చట్టం రూపొందించే సమయంలో పొరపాటున మరిచిపోయారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యులకు సైతం ఓటు హక్కును కల్పిస్తూ ప్రభుత్వం ఈ బిల్లు రూపొందించింది. – ఇక జీహెచ్ఎంసీలో ముగ్గురు కో–ఆప్షన్ సభ్యులకు గాను ఇద్దరు మైనారిటీలు ఉండాలి. జీహెచ్ఎంసీ పరిధి పెరిగిన నేపథ్యంలో కోఆప్షన్ సభ్యుల సంఖ్య 9కి, వారిలో మైనారిటీల సంఖ్య 6కి పెంచాలనే మరో ప్రతిపాదన ఈ బిల్లులో పెట్టారు. మున్సిపాలిటీగా ములుగు ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు, కేతనపల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్‌గా మార్పు సంబంధిత అంశం కూడా బిల్లు ద్వారా ప్రతిపాదించారు. దీనిని కూడా రెండోసారి శాసనసభలో ఆమోదించి రాజ్‌భవన్‌కు పంపించారు. 3 పంచాయతీలుగా భద్రాచలం తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు–2023కు ఆమోదం లభించడంతో పాలన వికేంద్రీకరణలో భాగంగా భద్రాచలంను మూడు గ్రామ పంచాయతీలుగా, సారపాకను రెండు గ్రామ పంచాయతీలుగా విభజించడానికి, రాజంపేటను కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. మైనారిటీల జాబితాలో జైనులు – తెలంగాణ స్టేట్ మైనార్టీస్ కమిషన్ చట్ట సవరణ బిల్లుతో రాష్ట్రంలోని మైనారిటీల జాబితాలో జైనులకు కూడా చోటు లభించింది. రాష్ట్ర మైనార్టీస్ కమిషన్‌లో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలతో పాటు కొత్తగా జైన మతస్తుడిని సైతం సభ్యుడిగా నియమించడానికి వీలు కలిగింది. – తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) బిల్లు ద్వారా హైదరాబాద్ నగరం నలువైపులా నాలుగు బోధనాస్పత్రుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదించింది. -
నీట్ పై ఆగ్రహం.. రాజ్ భవన్ ముట్టడికి పిలుపు
-
మమతా బెనర్జీపై బెంగాల్ గవర్నర్ పరువు నష్టం దావా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై పరువు నష్టం దావా వేశారు. బెంగాల్ రాజ్‌భవన్‌లోకి వెళ్లేందుకే మహిళలు భయపడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు గానూ ఆయన ఈ చర్యలకు దిగారు. శుక్రవారం కలకత్తా హైకోర్టులో ఈ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. మే మొదటి వారంలో రాజ్‌భవన్‌లో పని చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగిణి.. గవర్నర్ ఆనంద్ బోస్ తనను లైంగికంగా వేధించారంటూ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఇది కుట్ర అని, ముందు ముందు ఇలాంటి ఆరోపణలు చాలానే వస్తాయని ఆ టైంలోనే గవర్నర్ ఆనంద బోస్ అన్నారు. మరోవైపు ఈ ఆరోపణల పర్వం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. మరోవైపు బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా సచివాలయంలో జరిగిన పాలక భేటీలో ‘‘రాజ్‌భవన్‌కు వెళ్లాలంటే మహిళలు భయపడుతున్నారని, తనకు ఫిర్యాదులు చేస్తున్నారని’’ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. అంతకు ముందు టీఎంసీ నేతలు కొందరు గవర్నర్ ఆనందబోస్‌పై ఈ తరహా వ్యాఖ్యలే చేశారు. దీంతో మమతా బెనర్జీతో పాటు టీఎంసీ నేతలపైనా గవర్నర్ పరువు నష్టం దావా వేసినట్లు తెలుస్తోంది.ఈ పరిణామంపై టీఎంసీ సీనియర్ నేత డోలా సేన్ మీడియా స్పందన కోరింది. అయితే ఇది సున్నితమైన అంశం కాబట్టి పార్టీతో చర్చించాకే తమ నిర్ణయం ఏంటో చెబుతామని అన్నారాయన. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై బీజేపీ మద్దతు తెలిపింది. గవర్నర్ ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని, ఆలస్యమైనా సరైన నిర్ణయం తీసుకున్నారని, ఆయనకు తమ మద్దతు ఉంటుందని బీజేపీ సీనియర్ రాహుల్ సిన్హా చెబుతున్నారు. మరోవైపు సీపీఐ(ఎం) నేత సుజాన్ చక్రవర్తి తాజా పరిణామాలతో రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం ఒరగదని, పైగా జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీస్తాయని అంటున్నారు. -
రాజ్‌భవన్‌లో నాకు భద్రత లేదు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతో ఆ రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ విభేదాలు మరోసారి తెరమీదకొచ్చాయి. గవర్నర్ అధికార నివాసం రాజ్‌భవన్‌లో విధులు నిర్వర్తిస్తున్న బెంగాల్ పోలీసు బృందంతో మనకు ముప్పు ఉందని గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో డ్యూటీలో ఉన్న పోలీసులంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించిన కొద్దిరోజులకే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. ‘‘ ప్రస్తుత ఆఫీసర్–ఇన్చార్జ్, ఆయన బృందం వల్ల నా వ్యక్తిగత భద్రతకు ముప్పు ఉంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తెలియజేశా. అయినా ఆమె ఎలాంటి చర్యలు తీసుకోలేదు. చుట్టూ ఉన్న కోల్‌కతా పోలీసులతో నాలో అభద్రతా భావం గూడుకట్టుకుపోయింది’’ అని గవర్నర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘ ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగేలా ఇక్కడి పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాజ్‌భవన్‌కు వ్యతిరేకంగా వాళ్లు పనిచేస్తున్నట్లు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న పోలీసులు గతంలో రాష్ట్ర సచివాలయం ‘నబన్నా’లో పనిచేశారు. ఒకరి కోసం వీళ్లు పనిచేస్తున్నారు. వాళ్ల పేరు నేను చెప్పదల్చుకోలేదు’’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
రాజ్‌భవన్ ఆవరణను తక్షణమే ఖాళీ చేయండి
కోల్‌కతా: రాజ్‌భవన్ వద్ద బందోబస్తు విధుల్లో ఉండే కోల్‌కతా పోలీసు సిబ్బంది తక్షణమే అక్కడి నుంచి ఖాళీ చేయాలని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనందబోస్ సోమవారం ఉదయం ఆదేశాలు జారీ చేశారు. రాజ్‌భవన్ నార్త్‌గేట్ వద్ద ఉన్న పోలీస్ ఔట్ పోస్టును ప్రజావేదికగా మార్చాలని గవర్నర్ భావిస్తున్నట్లు సమాచారం. గవర్నర్, మమతా బెనర్జీ మధ్య విభేదాలు కొనసాగుతున్న సమయంలోనే ఇటీవల చోటుచేసుకున్న ఒక పరిణామమే దీనికి కారణమని భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై గవర్నర్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు వచి్చన సువేందు అధికారి సారథ్యంలోని బీజేపీ నేతల బృందాన్ని రాజ్‌భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ ప్రాంతంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయంటూ బీజేపీ నేతలను వెనక్కి పంపించి వేశారు. గవర్నర్ రాతపూర్వకంగా అనుమతి ఇచి్చనప్పటికీ పోలీసులు ఇలా వ్యవహరించడం వివాదస్పదమైంది. దీనిపై సువేందు కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించడం.. గవర్నర్‌ను గృహ నిర్బంధంలో ఉంచారా అంటూ మమతా బెనర్జీ ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. -
హైదరాబాద్ రాజ్ భవన్ లో ఘనంగా ఎట్ హోం కార్యక్రమం
-
సందడిగా రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోమ్’
సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలోని రాజ్‌భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా జరిగింది. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్రంలోని ప్రముఖులకు రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, గుడియా ఠాకూర్ దంపతులతోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి దంపతులకు గవర్నర్ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సాదర స్వాగతం పలికారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం మొదలైంది. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు వివిధ అంశాలపై కొద్దిసేపు సంభాíÙంచుకున్నారు. రాజ్‌భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ మీద ప్రదర్శించిన దేశ స్వాతంత్య్ర పోరాట చిత్రాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిథులు అందరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు జోగి రమేశ్, ఆర్ కే రోజా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమర యోధులు, పద్మ అవార్డు గ్రహీతలు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. -
రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం.. హాజరైన సీఎం జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా, శుక్రవారం ఉదయం విజయవాడలో పర్యటించిన సీఎం జగన్.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆతిథ్యం ఇచ్చిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. -
రాజ్ భవన్ లో సంక్రాంతి వేడుకలు
-
సంపూర్ణంగా సహకరిస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజ్‌భవన్‌కు సంపూర్ణ సహకారం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. నూతన సంవత్సర ఆరంభం సందర్భంగా సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన ఆయన.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క) ఆయన వెంట ఉన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా రాజ్‌భవన్‌కు వెళ్లిన రేవంత్‌రెడ్డి. గవర్నర్ దంపతులకు శాలువ కప్పి సత్కరించారు. అనంతరం గవర్నర్‌తో దాదాపుగా 15 నిమిషాల పాటు విడిగా భేటీ అయ్యారు. ఏమైనా ఇబ్బందులుంటే తెలియజేయాలని, వెంటనే పరిష్కరిస్తామని గవర్నర్‌ను సీఎం కోరారు. గత ప్రభుత్వ హయాంలో ధ్వంసమైన పాలన వ్యవస్థలను మళ్లీ గాడిలో పెడుతున్నామని వివరించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని, వెంటనే కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని తెలియజేసినట్టు సమాచారం. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల కోసం నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని అందువల్ల త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరినట్టు తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింన తర్వాత తీసుకున్న నిర్ణయాలు, చర్యలు, ప్రణాళికలను రేవంత్ వివరించినట్టు సమాచారం. ఘనంగా నూతన సంవత్సర వేడుకలు నూతన సంవత్సర ఆరంభం పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో కేక్ కట్ చేశారు. ఓపెన్‌హౌస్ నిర్వహించి అతిథుల నుంచి శుభాకాంక్షలు అందుకున్నారు. రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర సీనియర్ అధికారులు, 2,500 మంది సాధారణ ప్రజలు గవర్నర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ పిలుపు మేరకు పూలబోకేలకు బదులుగా చాలామంది అతిథులు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ను కానుకలుగా ఇచ్చారు. దీంతో 25,000 నోట్‌బుక్స్ రాజ్‌భవన్‌కు అందాయి. ఈ పుస్తకాలను జీహెచ్ఎంసీ, గిరిజన ప్రాంత మురికివాడల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గవర్నర్ రాజ్‌భవన్‌కు సంబంధించిన వాట్సాప్ చానల్ ( https:// whatsapp. com/ channel/0029VaIxdrC4 NVicOQDVvY3 L)ను కూడా ఆవిష్కరించారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమాల వార్తలు, ఫొటోలను దీనిద్వారా ఎప్పటికప్పుడు విడుదల చేయనున్నారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయండి: గవర్నర్ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, వర్సిటీల్లో తక్షణమే బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని గవర్నర్ సూచించినట్టు తెలిసింది. రాజ్‌భవన్ తరఫున కొత్త ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందిస్తామని తమిళిసై హామీ ఇచ్చింనట్టు సమాచారం. -
ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ ఒవైసి
-
తెలంగాణ అసెంబ్లీ గురువారానికి వాయిదా
Live Updates.. తెలంగాణ శాసనసభ వచ్చే గురువారానికి వాయిదా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం, ఉచిత బస్సు ప్రయాణం పథకాలు ప్రారంభిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయని ఇద్దరు మంత్రులు ప్రమాణం చేయని ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి వారిద్దరూ ఎంపీలుగానే ఉన్నారు. ఇంకా ఎంపీ పదవులకు రాజీనామా చేయని కారణంగా నేడు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు. రాజ్‌భవన్‌కు బీజేపీ ఎమ్మెల్యేలు.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఎంపికపై గవర్నర్‌కు ఫిర్యాదు. గవర్నర్ తమిళిసై లేకపోవడంతో రాజ్‌భవన్ సెక్రటరీకి వినతి పత్రం అందజేత బీజేపీ ఎమ్మెల్యేలు సీనియర్లు కాదని మజ్లిస్ ఎమ్మెల్యేను కావాలనే ప్రొటెం స్పీకర్ చేశారని ఫిర్యాదు. శాసనసభ సంప్రదాయాలను కాలరాస్తున్నారని ఆగ్రహం. నేడు రెండు పథకాలకు శ్రీకారం.. మధ్యాహ్నం ఒంటి గంటకు అసెంబ్లీ ఆవరణలోని ఒకటో గేటు వద్ద రెండు పథకాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం పేదలందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల ఉచిత వైద్య సదుపాయం చేయూత. కొలువుదీరిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలకు శ్రీకారం. నేడే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం. 👉 ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం. 👉 రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలు. ప్రగతి పథం.. సకల జనహితం.. మన ప్రజా ప్రభుత్వం!… pic.twitter.com/stqOjkF10T — Telangana Congress (@INCTelangana) December 9, 2023 అందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాం: కిషన్‌రెడ్డి శాసనసభ గౌరవాన్ని కాలరాసేలా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. సీనియర్ సభ్యులు ఉన్నా ఎంఐఎంతో ఒప్పందం మేరకు అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించింది. సభా నియమాలను తుంగలో తొక్కడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది అందుకే ఇవాళ అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించాం ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఎంఐఎం ఒకటేనన్న కాంగ్రెస్ అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎలా నియమించింది. సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించి ఆయన ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎన్నిక జరగాలని డిమాండ్ చేస్తున్నాం ఇదే విషయాన్ని గవర్నర్‌ను కలిసి కోరుతాం గాంధీభవన్‌లో సీఎం రేవంత్ కామెంట్స్.. భుజాలు కాయలు కాసేలాగా కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు కార్యకర్తల వల్లే మేం సీట్లలో కూర్చున్నాం ఎన్ని రాజకీయ ప్రకంపనలు ఎదురైనా ఉక్కు సంకల్పంతో సోనియా తెలంగాణ ఇచ్చారు తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో మనం చూడలేదు తెలంగాణ తల్లి సోనియా లాగే ఉంటుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు లక్షలాది తెలంగాణ బిడ్డలకు సోనియానే తల్లి డిసెంబర్ ఏడో తేదీన సోనియా ఎల్బీ స్టేడియంలోకి ఎంటర్ అయ్యే క్షణాలని నేను ఎప్పటికీ మర్చిపోలేను డిసెంబర్ 9, 2017న గాంధీ భవన్లో అడుగుపెట్టాను డిసెంబర్ 9, 2023న ప్రభుత్వం ఏర్పాటు అయింది పాలకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటాను పది సంవత్సరాలు కార్యకర్తలు వేల కేసులు ఎదుర్కున్నారు కార్యకర్తలకు మాట ఇస్తున్నాను. ఈ ప్రభుత్వం కార్యకర్తలది సోనియా గాంధీ 100 సంవత్సరాలు సంతోషంగా జీవించాలి శాసనసభలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజల ఆశీర్వాదం ఇవ్వాలి ►సభకు హాజరైన 109 మంది ఎమ్మెల్యేలు. ►అనారోగ్యం కారణంగా సభకు హాజరు కాని కేసీఆర్, కేటీఆర్ ►సభకు బీజేపీ సభ్యులు ఎనిమిది మంది గైర్హాజరు ►మొదట రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు ప్రమాణ స్వీకారం.. ►ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ. ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ► తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన 51 మంది ఎమ్మెల్యేలు ►అసెంబ్లీ సమావేశాలకు బాయ్‌కాట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు ►కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం ►అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ►రేవంత్‌కు స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, అసెంబ్లీ సెక్రటరీ ►అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో రేవంత్ ప్రత్యేక పూజలు. ►అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ►భట్టి తో పాటు అసెంబ్లీకి వచ్చిన పొంగులేటి, తుమ్మల గన్‌పార్క్ వద్ద కోలాహలం గన్‌పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఎదురుపడిన రెండు పార్టీల నేతలు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటున్న మంత్రులు కొత్త మంత్రులు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. అసెంబ్లీకి చేరుకున్న మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ గాంధీ భవన్లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు.. గాంధీభవన్‌లో సోనియ బర్త్ డే సెలబ్రేషన్స్.. 78 కిలోల కేట్ కట్ చేసి శుభాకాంక్షలు చెపుకున్న కాంగ్రెస్ నేతలు సోనియా పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వీహెచ్, మాణిక్‌రావ్ ఠాక్రే ఇతర నేతలు డిప్యూటీ సీఎం భట్టి ,మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,తుమ్మల, సీతక్క, కొండా సురేఖ ,పొన్నం ప్రభాకర్, హాజరైన పార్టీ నేతలు. భట్టి కామెంట్స్.. గాంధీభవన్ ఆశయాలను నెరవేరుస్తాం సోనియా గాంధీ కలలు కన్న సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తాం. ప్రజలు మెచ్చేలా పాలన ఉంటుంది రాష్ట్ర సంపద ప్రజలకు పంచుతాం. తెలంగాణభవన్‌లో ముగిసిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలు బస్సులో అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణభవన్ నుంచి గన్‌పార్క్‌కు బయలుదేరిన ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద నివాళులు అర్పించనున్నారు అసెంబ్లీకి హాజరుకానున్న ఎమ్మెల్యేలు కేసీఆర్ పేరును ప్రతిపాదించిన పోచారం.. బలపరచిన తలసాని, కడియం శ్రీహరి శాసనభాపక్ష మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యత కేసీఆర్‌కు అప్పగింత. బీజేపీ నేతల కీలక నిర్ణయం.. అసెంబ్లీ బహిష్కరించాలని బీజేపీ నిర్ణయం ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయవద్దని డిసైడ్ అయిన కమలం పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ ముందు ప్రమాణం చేసేందుకు ససేమీరా అన్న బీజేపీ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోనున్న ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం 10:30 గంటకు మీడియాతో మాట్లాడనున్న కిషన్ రెడ్డి ►అసెంబ్లీ ప్రారంభానికి ముందే మంత్రులకు శాఖల కేటాయింపు ►శాఖల కేటాయింపుపై ఇప్పటికే కేసీ వేణుగోపాల్‌తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. ►ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ►అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై #WATCH | AIMIM MLA Akbaruddin Owaisi takes oath as Pro-tem Speaker of Telangana Legislative Assembly, in Raj Bhawan, Hyderabad pic.twitter.com/PpMoZhOvjy — ANI (@ANI) December 9, 2023 ►ప్రొటెం స్పీకర్ ప్రమాణానికి బీజేపీ దూరం ►బీఆర్ఎస్ నుంచి హాజరైన పోచారం శ్రీనివాస్, మాజీ మంత్రి హరీశ్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి. ►రాజ్‌భవన్ దర్బార్ హాల్లో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం ►కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం, మంత్రులు ►తెలంగాణ మూడో శాసన సభకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ►చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్న అక్బరుద్దీన్ ►రాజ్‌భవన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ►కాసేపట్లో రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం. ►అక్బరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ►నేడు ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరం. ►తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం ఉదయం 11 గంటలకు తొలిసారిగా కొలువు దీరనుంది. ►తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ►కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం తదితరాల కోసం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగనున్నాయి. తొలిసారిగా అసెంబ్లీకి 51 మంది ►అన్ని పార్టీల తరఫున కలుపుకుని మొత్తం 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, కరీంనగర్ జిల్లా నుంచి 8 మంది తొలిసారిగా ఎన్నికైన వారున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు తొలిసారి అడు గు పెడుతున్నారు. 51 మందిలో 18 మంది క్రియాశీల రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తున్న వారే. రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం ►తొలిరోజు సమావేశంలో కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ►ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏఐఎంఐఎం సీనియర్ శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నామినేట్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ►ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 8.30కు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ►సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ►ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ప్రొటెమ్ స్పీకర్ అధ్యక్షతన తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ప్రారంభమవుతుంది. ►తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ►ఆ తర్వాత తెలుగు అక్షరమాలలోని అక్షర క్రమంలో ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. బీఆర్ఎస్కు విపక్ష హోదా ►శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులకు గాను తెలంగాణ మూడో శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేల బలం ఉంది. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఏఐఎంఐఎంకు ఏడుగురు సభ్యుల బలం కలిగి ఉన్నాయి. అధికార కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్కు విపక్ష హోదా దక్కే అవకాశముంది. ►బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ►ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ తరపున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణభవన్‌లో భేటీ అవుతున్నారు. ►బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేల భేటీకి అధ్యక్షత వహిస్తారు. ►కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ఈ భేటీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమోదిస్తారు. నేడు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ ►శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత స్పీకర్ ఎన్నిక కోసం శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయన శనివారం సాయంత్రం సీఎం రేవంత్, మంత్రివర్గం సమక్షంలో నామినేషన్ సమర్పిస్తారని తెలిసింది. ►కాగా రెండో రోజు ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధ్యతల స్వీకరణ కార్యక్రమం, ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఈ నెల 11న సోమవారం జరిగే మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాయిదా పడే సభ తిరిగి 12వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభమవుతుంది. నాలుగో రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. -
విన్నపాలు వినవలె..
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో మొదటిసారిగా శుక్రవారం ప్రారంభమైన ప్రజాదర్బార్‌కు జన సందోహం వెల్లువెత్తింది. హైదరాబాద్, ఇతర జిల్లాల నుంచి ఫిర్యాదులు పట్టుకొని ప్రజలు ఉదయం 8 గంటల నుంచే ప్రజాభవన్‌కు తరలివచ్చారు. వేలాది మంది రావడంతో బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాస ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం ఎనుముల రేవంత్‌రెడ్డి ఉదయం దాదాపు 10.15 గంటల ప్రాంతంలో అక్కడకు వచ్చారు. మొదటగా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. ఇతరుల నుంచి కూడా విజ్ఞాపనలు స్వీకరించి, పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు తమ వ్యక్తిగత, ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో ఏం చేయాలో చూడాలని సీఎం అప్పటికప్పుడే అధికారులను ఆదేశించారు. మరికొందరు రోడ్లు, భూములు, ఇతర సమస్యలను ప్రస్తావించారు. గంటసేపున్న సీఎం ప్రతి ఒక్కరి సమస్యలు ఓపిగ్గా విన్నారు. అనంతరం ముఖ్యమంత్రి అత్యవసర సమావేశం నిమిత్తం సచివాలయానికి వెళ్లారు. ఆ తర్వాత మంత్రి సీతక్క ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రతిఒక్కరి నుంచి విజ్ఞాపనలు స్వీకరించారు. మధ్యాహ్నం మూడున్నర వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమం వారంలో రెండురోజులు నిర్వహించేలా.. శాఖల వారీగా ఫిర్యాదులు స్వీకరించేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే దీనికి సీఎం నుంచి ఆమోదం లభించాల్సి ఉంది. 320 సీట్లు .. 15 డెస్కులు ..మౌలిక వసతులు ప్రజాదర్బార్ నిర్వహణకు ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది. సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, జలమండలి ఎం.డి. దానకిషోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తదితర అధికారులు ప్రజాదర్బార్ నిర్వహణను సమన్వయం చేశారు. సమస్యల నమోదుకు 15 డెస్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రతి విజ్ఞాపన పత్రాన్ని ఆన్లైన్లో ఎంట్రీ చేసి, ప్రతి విజ్ఞాపనకు ప్రత్యేక గ్రీవెన్స్ నంబర్ ఇచ్చి, ప్రింటెడ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం, పిటిషన్ దారులకు ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఎక్ నాలెడ్జ్జ్‌మెంట్ పంపే విధంగా ఏర్పాటు చేశారు. ప్రజలు కూర్చోవడానికి 320 సీట్లను ఏర్పాటు చేశారు. బయట కూడా నీడతో కూడిన క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. హర్షాతిరేకాలు ప్రజాదర్బార్‌కు వచ్చిన ప్రజలు ప్రగతిభవన్ తలుపులు అందరికీ తెరుచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎంగా వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ప్రజాదర్బార్ నిర్వహించారంటూ గుర్తు చేసుకున్నారు. గడీల పాలనకు చరమగీతం పాడారంటూ కొందరు పాటలు పాడారు. కొందరు ప్రగతిభవన్ పైకి ఎక్కి అంతా కలియదిరిగారు. పచ్చిక బయలుపై, భవనాల వద్ద పెద్ద ఎత్తున ఫొటోలు దిగారు. సెల్ఫీలు తీసుకున్నారు. ప్లాట్లు కబ్జా చేశారు మా అసోసియేషన్‌కు సంబంధించిన ప్లాట్లను కొందరు కబ్జా చేశారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే విచారించారు. దొంగ డాక్యుమెంట్లు పెట్టి కబ్జా చేశారని తేలింది. ఎమ్మార్వోపై చర్య తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఇప్పటివరకు మోక్షం లభించలేదు. నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నాం. త్వరగా న్యాయం చేయాలని కోరేందుకు వచ్చా. –దామోదర్‌రెడ్డి, చాణిక్యపురి ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్, నాదర్గుల్, రంగారెడ్డి జిల్లా మా పేరు మీద పట్టా చేయించాలి మా భూమి మా పేరు మీద పట్టా చేయించాలని ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. రెవెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారే తప్ప పట్టా చేయించడం లేదు. ఐదు మందిమి ఉన్నా పట్టాలు ఇవ్వలేదు. లక్షలు ఇవ్వాలంటున్నారు. పేదోళ్లం అంత డబ్బులు ఎలా ఇవ్వగలం? – గిరన్న, బాలమ్మ,కాశింనగర్ గ్రామం, వనపర్తి జిల్లా -
కొత్త సర్కారుకు శ్రీకారం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది. తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా.. తాజా ఎన్నికల్లో గెలిచినవారి జాబితాతో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాశ్ కుమార్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ సోమవారం గెజిట్ జారీ చేశారు. ఆ వెంటనే సీఈఓ వికాస్‌రాజ్ రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు గెజిట్ నోటిఫికేషన్ ప్రతిని అందజేశారు. ఈ సందర్భంగా సీఈఓ వికాస్‌రాజ్ నేతృత్వంలోని ఎన్నికల అధికారుల బృందం గవర్నర్ తమిళిసైతో కొంతసేపు మర్యాదపూర్వకంగా సమావేశమైంది. ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ శాససభాపక్ష (సీఎల్పి) నేతను ఎన్నుకోవడానికి సోమవారం సమావేశమయ్యారు. సీఎల్పీ నేతగా రేవంత్‌రెడ్డి ఎన్నికవుతున్నారని, ఆయన రాజ్‌భవన్‌కు చేరుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని, మరో ఒకరిద్దరు మంత్రులుగా ప్రమాణం చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో రాజ్‌భవన్ ఉన్నతాధికారులు సోమవారం ఉదయమే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ప్రారంభించారు. రాజ్‌భవన్ దర్బార్‌హాల్‌లో కొత్త సీఎం, మంత్రులతో గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించడానికి వీలుగా పొడియంను, కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితుల కోసం కుర్చిలను సిద్ధం చేశారు. దర్బార్ హాల్‌ను అలంకరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీర్మానం తీసుకుని సీఎల్పీ నేత రాజ్‌భవన్‌కు వచ్చే అవకాశం ఉండటంతో గవర్నర్ తమిళిసై, రాజ్‌భవన్ అధికారులు సాయంత్రం వరకు వేచిచూశారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో రాజ్‌భవన్ వద్దకు చేరుకోవడంతో సందడి నెలకొంది. కాన్వాయ్‌లనూ సిద్ధం చేసినా.. కొత్త సీఎం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రొటోకాల్ ప్రకారం వారికి ప్రత్యేక కాన్వాయ్‌ల కోసం కూడా ఏర్పాట్లు జరిగాయి. రాజ్‌భవన్ పక్కనే ఉన్న దిల్కుషా అతిథి గృహం వద్ద ఈ మేరకు వాహనాలను సిద్ధంగా ఉంచారు. అయితే సీఎల్పీ నేత ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం రాలేదని, కొత్త సీఎం ప్రమాణ స్వీకారం సోమవారం ఉండదనే స్పష్టత రావడంతో జీఏడీ అధికారులు రాజ్‌భవన్ నుంచి వెనుతిరిగారు. కొత్త కొత్తగా సచివాలయం నూతన సీఎం, మంత్రులకు రాష్ట్ర సచివాలయంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నా రు. సచివాలయంలో పాత ప్రభుత్వంలోని కీలక ప్రజాప్రతినిధుల నేమ్ ప్లేట్లను అధికారులు సోమ వారం తొలగించారు. కొత్త సీఎం, మంత్రుల కోసం చాంబర్లను సిద్ధం చేస్తున్నారు. కొత్త సీఎం, మంత్రులకు సంబంధించి తమకు ఎలాంటి కబురు అందలేదని, అధికారికంగా సమాచారం అందగానే వారి కి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని సాధారణ పరిపాలన విభాగం అధికారులు తెలిపారు. అసెంబ్లీ కూడా ముస్తాబు కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, కొత్తగా ఎన్నికైన వారితో ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీని కూడా ముస్తాబు చేస్తున్నారు. అసెంబ్లీ భవనానికి రంగులు వేయడంతోపాటు పాత ఫర్నిచర్‌ను తొలగించి కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మంత్రులు, సీఎం చాంబర్లను అందంగా తీర్చిదిద్దే కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ రెండో శాసనసభ రద్దు కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్ర రెండో శాసనసభను రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రద్దు ఉత్తర్వులు ఆదివారం (డిసెంబర్ 3) మధ్యాహ్నం నుంచే వర్తిస్తాయని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉపసంహరణ సాక్షి, హైదరాబాద్: శాసనసభ సాధారణ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమలును కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అజయ్‌కుమార్ వర్మ సోమవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈవో)కు లేఖ రాశారు. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అక్టోబర్ 9న రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నాటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనానియమావళి అమల్లోకి వచి్చన విషయం తెలిసిందే. -
రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారానికి ముందస్తు ఏర్పాట్లు
-
తెలంగాణ సీఎం ఎవరు?.. అప్డేట్స్
లైవ్ అప్డేట్స్.. ఎప్పటికప్పటి సమాచారం సీఎం ఎవరు.. ఓవర్ టు ఢిల్లీ ►తెలంగాణలో కాంగ్రెస్ మార్క్ రాజకీయం ►సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో తేలని పంచాయితీ ►ఎవరికి వారు పట్టు వీడని నేతలు ►మ్యూజికల్ చెయిర్ గేమ్‌ను తలపిస్తున్న టీ కాంగ్ నేతల వ్యవహారం ►ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి ► తెలంగాణ ఎన్నికల పరిశీలకుడు డీకే శివకుమార్‌తో పాలు నలుగురు పరిశీలకులు కూడా ఢిల్లీకి ఆ కథనాల్ని నమ్మొద్దు: భట్టి ►హైదరాబాదులో సీఎల్పీ సమావేశం జరిగింది ►ఈ సమావేశంలో సీఎల్పీ నాయకుడి ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగిస్తూ ఏక వాక్య తీర్మానం చేసి పంపించడం జరిగింది ►పార్టీ అధిష్టానం సిఎల్పీ నాయకుడిని ప్రకటిస్తుంది ►ప్రస్తుతం ప్రసార మాధ్యమాల్లో వస్తున్న వివిధ కథనాలు ఊహాగానాలు మాత్రమే.. వాటిని ఎవరు నమ్మొద్దు. తేలేదాకా హోటల్లోనే.. ►హైదరాబాద్ ఎల్లా హోటల్ లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే లు ►అదిష్టానం సీఎం అభ్యర్థి ని ప్రకటించే వరకు హోటల్ కే పరిమితం కానున్న ఎమ్మెల్యేలు ►అదిష్టానం నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలు ►రేపు డీకే శివకుమార్ ద్వారా నిర్ణయం వెల్లడించనున్న కాంగ్రెస్ అధిష్టానం ►రేపటితో సీఎం అభ్యర్థి ఉత్కంఠ వీడుతుందా? అనే అనుమానంలో కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్‌ను కలిసిన భద్రాచలం ఎమ్మెల్యే ►కేసీఆర్‌ను కలిసిన తెల్లం వెంకట్రావు ►కాంగ్రెస్‌లోకి మారతారంటూ ఉదయం నుంచి ప్రచారం ►సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన తెల్లం ►సాయంత్రం ఎర్రవెల్లి ఫామ్‌హౌజ్ వెళ్లి కేసీఆర్‌తో భేటీ కాంగ్రెస్‌లో ఓ విధానం ఉంటుంది: మాణిక్యం ఠాగూర్ ►తెలంగాణ పరిణామాలపై AICC స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు మాణిక్యం ఠాగూర్ ►తెలంగాణ ఎమ్మెల్యేల అభిప్రాయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు చేరింది ►రేపు ఖర్గే ఏఐసీసీ పరిశీలకులతో భేటీ అవుతారు ►సీఎం అభ్యర్థి ఎవరనేది ఆయనే ప్రకటిస్తారు ►కాంగ్రెస్‌లో ఓ విధానం ఉంటుంది ►సరైన అభ్యర్థినే సీఎంగా హైకమాండ్ ప్రకటిస్తుంది ‘తెలంగాణ సీఎం అభ్యర్థి’పై సోనియా చర్చ! ►కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమాశంలో తెలంగాణ సీఎం అభ్యర్థి పై నో చర్చ ►కానీ, ఆ తర్వాత సోనియా గాంధీ మరో సమావేశం ►ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన సోనియా ►తెలంగాణ ఫలితాలు, సీఎం అభ్యర్థిపై చర్చించిన సోనియా ►రేపు డీకే శివకుమార్, ఇతర పరిశీలకుతో చర్చించనున్న ఖర్గే ► నిర్ణయాన్ని డీకేఎస్ ద్వారా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పంపనున్న హైకమాండ్ రేపు జనగామకు మాజీ సీఎం కేసీఆర్! ►రేపు జనగామకు వెళ్లనున్న మాజీ సీఎం కేసీఆర్ ►బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం ►సంతాప ప్రకటన వెలువరించిన కేసీఆర్ ►తెలంగాణ ఉద్యమంలో తొలినాళ్ల నుంచి తన వెంట నడిచిన యువ నేత సంపత్ రెడ్డి మరణం బాధాకరమని కేసీఆర్ ఆవేదన ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఎవరిని అడిగి చేశారు? ►తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార ఏర్పాట్లపై కాంగ్రెస్ సీనియర్ల గుస్సా ►సీఎం అభ్యర్థి ఎంపిక, ప్రమాణ స్వీకార ఏర్పాట్ల లీకులపైనా ఆగ్రహం ►ఎవరిని అడిగి ఏర్పాట్లు చేశారంటూ హైకమాండ్‌కు ఫిర్యాదు ఏం జరుగుతుందో చూద్దాం: కేసీఆర్ ►తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ►గెలిచిన ఎమ్మెల్యేలకు కేసీఆర్ శుభాకాంక్షలు ►ఇంకో నెల ప్రభుత్వంలో కొనసాగే అవకాశం ఉన్నా.. ప్రజా తీర్పుతో హుందాగా తప్పుకున్నాం ►కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం ►చూద్దాం ఏం జరుగుతుందో ►త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ మీటింగ్ జరుపుదాం ►ఓటమిపై సమీక్ష జరుపుదాం ►శాసనసభ పక్ష నేతను ఎన్నుకుందాం తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్ ►తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 నేపథ్యంతో ఎన్నికల కోడ్ ముగిసింది ►సోమవారం సాయంత్రంతో కోడ్ ముగిసినట్లు ఈసీ అధికారిక ప్రకటన చేసింది ►అక్టోబర్ 9వ తేదీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల ►ఆ మరుక్షణం నుంచే అమల్లోకి వచ్చిన కోడ్ ►డిసెంబర్ 5 వరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఈసీ నోటిఫికేషన్ ►తాజాగా.. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో కోడ్ ముగిసినట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం అబ్బే.. సీఎల్పీపై చర్చించలేదు: జైరాం రమేష్ ►సోనియా నివాసంలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ సమావేశంలో తెలంగాణ సీఎల్పీ అంశంపై చర్చ జరగలేదు ►డీకే శివకుమార్, ఇతర పరిశీలకులు ఢిల్లీ వస్తున్నారు ►పరిశీలకులతో చర్చించాల్సిన అవసరం ఉంది ►వాళ్ల అభిప్రాయం హైకమాండ్ తీసుకుంటుంది ►సీఎల్పీ ఖరారుపై రేపు నిర్ణయం తీసుకోవచ్చు ►మీడియాతో సీనియర్‌నేత జైరాం రమేష్ తెలంగాణ అడ్వొకేట్ జనరల్ రాజీనామా ►తెలంగాణ అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ రాజీనామా ►అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు కూడా.. ►ఫాక్స్ ద్వారా రాజీనామాను పంపిన ఏజీ, ఏడీజీ ►ప్రభుత్వం మారడంతో.. రాజీనామా బాటలో మరికొందరు అధికారులు రాజ్‌భవన్ నుంచి వెళ్లిపోయిన.. ►రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమ వాయిదా ►రాజ్ భవన్ నుంచి వెళ్లిపోయిన జీఏడీ, పోలీస్, ప్రోటోకాల్, ఐ అండ్ పీఆర్ అధికారులు రాజ్‌భవన్ వద్ద ‘సీఎం రేవంత్’ నినాదాలు ►సీఎల్పీ ఎవరనేది తేల్చని ఏఐసీసీ ►రేపటి వరకు కొనసాగనున్న ఉత్కంఠ ►సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా ►రాజ్‌భవన్ వద్ద నుంచి కాంగ్రెస్ శ్రేణుల్ని ఖాళీ చేయిస్తున్న పోలీసులు ►రాజ్ భవన్ ముందు కాంగ్రెస్ కార్యకర్తల హంగామా ►సీఎం రేవంత్ అంటూ రేవంత్ అభిమానుల నినాదాలు ►ఢిల్లీకి పయనమైన డీకే శివకుమార్ ►డీకేఎస్ వెంట భట్టి, దామోదర, ఉత్తమ్‌లు ►రేపు ఖర్గేతో భేటీ తర్వాతే సీఎం అభ్యర్థిపై అధికారిక ప్రకటన వంద కోట్ల ఖర్చుతో నన్ను ఓడించారు: దుర్గం చిన్నయ్య ►బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సంచలన వ్యాఖ్యలు ►కోట్లు కుమ్మరించి ఎమ్మెల్యేగా నెగ్గారంటూ గడ్డం వినోద్‌పై ఆరోపణలు ►గడ్డం కుటుంబం.. వేల కోట్ల రూపాయలు ఉన్న కుటుంబం ►నన్ను ఓడగొట్టడానికి కుట్ర చేసింది ►అధర్మంగా యుద్ధం చేసి నాపై గెలిచారు ►ఏడాది కాలంగా నాపై ఎన్నో అసత్య ప్రచారాలు తెరపైకి తెచ్చారు ►కుట్రలతో నన్ను దెబ్బ తీశారు ►డబ్బు మందు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేసి గెలిచారు ►బెల్లంపల్లిలో వంద కోట్లు ఖర్చు చేసి గెలిచారు ►నైతికంగా మేము గెలిచినాం. వాళ్లు గెలిచినా ఓడిపోయినట్టే! ►బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వాళ్లు దాడులు చేస్తున్నారు.. ఆపకపోతే ఖబడ్దార్ సీఎల్పీ ఎంపిక వాయిదా? ►తెలంగాణ సీఎల్పీ నేత ఎంపిక వాయిదా ►ఢిల్లీకి పయనం అయిన కాంగ్రెస్ నేతలు ►రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల్ని ఖాళీ చేయిస్తున్న పోలీసులు ►ఇవాళ రాత్రే సీఎం ప్రమాణం ఉంటుందని ఏర్పాట్లు చేసిన అధికారులు ►తాజా పరిణామాలతో కార్యక్రమం వాయిదా అయినట్లే! ►రేపు కీలక సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ►తెలంగాణ సీఎం ఎవరనే దానిపై కొనసాగనున్న సస్పెన్స్ ► తెలంగాణ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ రాజీనామా ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లే! ►కాంగ్రెస్ సీఎం అభ్యర్థి విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్ ► ఢిల్లీకి తెలంగాణ ఎన్నికల కాంగ్రెస్ పరిశీలకుడు డీకే శివకుమార్ ►శివకుమార్‌తో పాటు మరో నలుగురు పరిశీలకులు కూడా? ►రేపు ఖర్గేతో ఏఐసీసీ పరిశీలకుల సమావేశం ►ఇవాళ సీఎల్పీ నేత ప్రకటన లేనట్లే! ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు గులాబీ నేతల క్యూ ►బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఎమ్మెల్యేల క్యూ ►బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన వాళ్లంతా ఒక్కొక్కరుగా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి.. ►ఎమ్మెల్యేలతో పాటు నేతలు కూడా ►హరీష్ రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, తులా ఉమ, మల్లారెడ్డి,కడియం శ్రీహరి, పద్మ దేవేందర్ రెడ్డి,జగదీష్ రెడ్డి,తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు,కేటీఆర్, సుదీర్ రెడ్డి,సత్యవతి రాధోడ్ ఎమ్మెల్సీ, మహమూద్ అలీ, రెడ్యానాయక్ తదితరులు కాసేపట్లో వీడనున్న ‘సీఎం’ ఉత్కంఠ? ►కొద్దిసేపట్లో సీఎం అభ్యర్థి ఎవరనేది ప్రకటించనున్న డీకే శివకుమార్ ►ఢిల్లీలో సోనియా నివాసంలో జరుగుతున్న పార్లమెంటరీ స్ట్రాటజీ మీటింగ్ ► ఈ సమావేశంలో తెలంగాణ సీఎం అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం వినోద్ కుమార్ రాజీనామా ►రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్ష పదవికి బోయినపల్లి వినోద్ కుమార్ రాజీనామా ►కిందటి ఏడాది బాధ్యతలు చేపట్టిన వినోద్ ►గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడినా.. స్నేహపూర్వకంగా కేబినెట్ హోదాలో వినోద్‌కు కీలక పదవి అప్పజెప్పిన కేసీఆర్ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి వినోద్ ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా పోషిస్తాం: కేటీఆర్ ►గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలకు అభినందనలు ►పదేళ్లలో బీఆర్ఎస్ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టింది ►ఎన్నికల్లో గౌరవప్రదమైన స్థానాలు సాధించింది ►తెలంగాణ భవన్ కేంద్రంగా ప్రజలకు అందుబాటులో ఉంటాం ►ప్రతిపక్ష బాధ్యతను విజయవంతంగా నిర్వహిస్తాం తెలంగాణ సీఎం ఎవరనేది మరికాసేపట్లో.. ►సోనియా గాంధీ నివాసంలో పార్లమెంటరీ స్ట్రాటజీ మీటింగ్ ►తెలంగాణ సీఎం అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ►ఇప్పటికే గెలిచిన ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణ నివేదిక పంపిన డీకేఎస్ ►ఢిల్లీ నుంచి సీఎల్పీ నేత ఎంపిక కోసం టీ కాంగ్రెస్ శ్రేణులు వెయిటింగ్ ►నిర్ణయం వెలువడగానే తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ప్రకటన ►ఆ వెంటనే రాజ్‌భవన్‌లో తెలంగాణ కొత్త సీఎం ప్రమాణం ►సీఎంతో పాటు పలువురు మంత్రులు కూడా?? తెలంగాణలో కొత్త శాసనసభ ►తెలంగాణలో మూడో శాసన సభ ఏర్పాటకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల ►పాత అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసిన రాజ్‌భవన్ ►ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళిసైకు సమర్పించిన సీఈవో వికాజ్‌రాజ్ ►119 మంది ఎమ్మెల్యేల ఎంపికను ధృవీకరించిన గవర్నర్ ►గవర్నర్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఎలక్షన్ కమిషన్ ►గెజిట్ ను గవర్నర్ కు అందించిన సీఈవో, ఈసీ ముఖ్య కార్యదర్శి ►అంతకు ముందు అసెంబ్లీ రద్దు ప్రతులను అందించిన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచారి ► ఇక కొలువుదీరనున్న కొత్త శాసనసభ వరుస రాజీనామాలు ►తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత వరుస రాజీనామాలు ►బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేసిన పలువురు అధికారులు కూడా ►ఇప్పటికే రకరకాల కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా ► 15 మంది కార్పొరేషన్ చైర్మన్లు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు ►హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు ►పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగం ►కౌంటింగ్ సందర్భంగా నిన్న పోలీసులతో వాగ్వాదం కొత్త సీఎం కోసం కొత్త కాన్వాయ్.. ►రాజ్ భవన్ వద్ద కొత్త సీఎం కోసం న్యూ కాన్వాయ్ ►రాజ్ భవన్ పక్కన దిల్కుషా వద్ద సిద్ధం చేసిన ప్రోటోకాల్ అధికారులు ►ఆరు కొత్త ఇన్నోవా వెహికిల్స్ రెఢీ చేసిన అధికారులు తమిళసై చేతికి నెగ్గిన ఎమ్మెల్యేల జాబితా.. ►రాజ్ భవన్ నుంచి వెళ్లిపోయిన సీఈఓ వికాస్ రాజ్ బృందం ►గవర్నర్ తమిళ్ సై కి రిజల్ట్ ను సమర్పించిన సీఈఓ ►గెలిచిన ఎమ్మెల్యేల పేర్లతో కూడిన జాబితాను అందించిన సీఈవో కొత్త ప్రభుత్వానికి సచివాలయం సిద్ధం ►ఛాంబర్లను సిద్ధం చేస్తున్న జీఏడీ శాఖ ►పాత బోర్డులను తొలగించిన అధికారులు ►ప్రభుత్వ సలహాదారుల కార్యాలయాలు ఖాళీ చేసిన సిబ్బంది ►కొత్త మంత్రులకు కొత్త సిబ్బంది కేటాయింపు ►గ్రౌండ్ ఫ్లోర్లో మీడియాకు ప్రత్యేక గది తెలంగాణ టాస్క్ ఫోర్స్ OSD రాధా కిషన్ రావు రాజీనామా ►మూడేళ్ల క్రితం ముగిసిన రాధాకిషన్ పదవీ కాలం ►టాస్క్ ఫోర్స్ లో ఎక్స్ టెన్సన్ మీద కొనసాగుతున్న రాధా కిషన్ రావు ►ప్రస్తుత ప్రభుత్వం ఓడిపోవడంతో నిర్ణయం? ►తన రాజీనామా ను ప్రభుత్వానికి పంపిన రాధా కిషన్ రావు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు టెక్నికల్ క్లియరెన్స్ పనిలో గవర్నర్ ►గవర్నర్ తమిళిసైతో సీఈవో వికాస్ రాజ్ భేటీ ►గెలిచిన అభ్యర్థుల జాబితాను గవర్నర్ కి ఇచ్చిన వికాస్ రాజ్ ►రాజ్‌భవన్‌లోనే ఉన్న అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి ►ప్రస్తుత అసెంబ్లీ రద్దుకు టెక్నికల్ ఫార్మాలిటీస్ పూర్తి ►ఈ రాత్రికి కొత్త సీఎం ప్రమాణానికి రాజ్‌భవన్ లో ఏర్పాట్లు దాదాపు పూర్తి పార్టీ మారను: పాడి కౌశిక్‌రెడ్డి ►హుజూరాబాద్ నియోజక వర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయను ►హుజూరాబాద్ ను గొప్పగా అభివృద్ధి చేసుకుందాం ►నా పాత ఫోటో పెట్టీ రేవంత్ రెడ్డి నీ కలిసినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు ►నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ గారితో కేసీఆర్ కుటుంబం తోనే ఉంట ►ఫేక్ ప్రచారాలను ఎవరు నమ్మొద్దు బీఆర్ఎస్ ఓటమిపై అసదుద్దీన్ ఒవైసీ ►రాజకీయాల్లో గెలుపోటములు సహజం ►ఓటమికి కారణాలు గుర్తించి బీఆర్ఎస్ సరి చేసుకుంటుంది ►కేటీఆర్, హరీష్‌రావులకు ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అవకాశం దొరికింది. -
రాజ్‌భవన్‌కు సీఈవో.. అసెంబ్లీ రద్దు ప్రతులతో సెక్రటరీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటునకు రంగం సిద్ధమవుతోంది. ఏఐసీసీ నుంచి సీఎల్పీ నేత ఎంపికపై స్పష్టత రాగానే.. సాయంత్రం రాజ్‌భవన్‌లో సీఎం ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి కూడా. ఈ క్రమంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు టెక్నికల్ క్లియరెన్స్ పనిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బిజీగా ఉన్నారు. ప్రస్తుత అసెంబ్లీ రద్దుకు సంబంధించిన ఏర్పాట్లు రాజ్‌భవన్‌లో నడుస్తున్నాయి. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచారి రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు శాసనసభ రద్దు ప్రతులను అందజేశారు. ఆ వెంటనే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి(సీఈవో) వికాస్ రాజ్, ఈసీ ప్రత్యేక అధికారితో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నివేదికను గవర్నర్‌కు సీఈవో అందజేశారు. ఈ ఫార్మాలిటీస్ పూర్తి కాగానే.. కొత్త అసెంబ్లీ ఏర్పాటు కోసం గెజిట్ ఇచ్చేందుకు గవర్నర్ ఆదేశాలు జారీ చేస్తారు. ఈ అధికార ప్రక్రియ కొనసాగుతుండగానే.. మరోవైపు కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన ఏర్పాట్లలో అధికారులు తలమునకలయ్యారు. ఈ రాత్రికే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో.. ప్రోటోకాల్ అధికారులు రాజ్ భవన్ చేరుకున్నారు. మరోవైపు రాజ్‌భవన్ వద్ద కోలాహలం నెలకొంది. ఆహ్వానం లేకపోయినా కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నాయి. దీంతో.. భారీగా పోలీసులు మోహరించారు. -
ఈరోజే సీఎం ప్రమాణ స్వీకారం !..రాజ్ భవన్ లో భారీ ఏర్పాట్లు
-
నేటి సాయంత్రం సీఎం ప్రమాణం.. రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాట్లుకు రంగం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం తెలంగాణ రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాణ స్వీకరానికి కావాల్సిన సామ్రాగ్రిని కూడా తరలిస్తున్నారు. వివరాల ప్రకారం.. రాజ్‌భవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి జీఏడీ ఏర్పాటు చేస్తోంది. రాజ్‌భవన్‌కు సామాగ్రి చేరుకుంటోంది. టెంట్లు, స్టాండ్స్, టేబుల్స్, కుర్చీలు, రెడ్ కార్పెట్లు, ఫర్నిచర్ ఇప్పటికే చేరుకుంది. రాజ్ భవన్‌కు చేరుకున్న లైవ్ కవరేజ్ ఐ అండ్ పీఆర్ మీడియా. గవర్నర్ తమిళిసై ఏ క్షణంలోనైనా ఆదేశం ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు.. ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు సీఈవో వికాస్‌రాజ్ రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల లిస్ట్‌ను గవర్నర్‌కు వికాస్‌రాజ్ అందజేయనున్నారు. ఇక, నివేదిక అందాక కొత్త శాసనసభ ఏర్పాటుకు గవర్నర్ గెజట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత పొలిటికల్ అపాయింట్మెంట్స్ అని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉండగా, ఎల్లా హోటల్లో సీఎల్పీ సమావేశం జరిగింది. సీఎల్పీ సమావేశానికి 64 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక, సీఎల్పీ సమావేశానికి ఏఐసీసీ ప్రతినిధులు, డీకే శివకుమార్ హాజరు. సీఎల్పీలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే సీఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు. -
ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాజ్ భవన్ కు వికాస్ రాజ్
-
కేసీఆర్ ఒంటరిగా రాజ్ భవన్‌కు
-
HYD: తమిళిసైను కలిసిన మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు కలిశారు. రాజ్‌భవన్‌లో వీరు కలుసుకోవడం విశేషం. వివరాల ప్రకారం.. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో కలిశారు. కాగా, మర్యాదపూర్వకంగానే తమిళిసైను కలిసి నరసింహన్ దంపతులు ముచ్చటించినట్టు సమాచారం. రాజకీయంగా వీరి మధ్య ఎలాంటి చర్చ జరగలేదని తెలుస్తోంది. -
TN: రాజ్‌భవన్‌పై పెట్రో బాంబుల దాడి
చెన్నై: తమిళనాడు రాజ్‌భవన్ వద్ద పోలీసులు బుధవారం హైఅలర్ట్ ప్రకటించారు. ఓ వ్యక్తి పెట్రోల్ బాంబులతో రాజ్‌భవన్‌పై దాడికి పాల్పడడమే అందుకు కారణం. అయితే ఈ ఘటనలో ఎలాంటి నష్టం వాటిల్లలేదు. రాజ్‌భవన్ మెయిన్ గేట్ వద్ద బారికేడ్లు మాత్రం ధ్వంసం అయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు ఘటనకు కారణమైన వ్యక్తిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నాం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రెండు పెట్రోల్ బాంబుల్ని రాజ్‌భవన్ మెయిన్ గేట్ వద్దకు విసిరేశాడు ఆగంతకుడు. ఆ ధాటికి బారికేడ్లు ధ్వంసం అయ్యాయి. రోడ్డు కొంత భాగం దెబ్బ తింది. వెంటనే అతన్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. నిందితుడ్ని కారుకా వినోద్‌గా గుర్తించారు. ఘటన సమయంలో గవర్నర్ రాజ్‌భవన్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సైదాపేట కోర్టు బయట పార్క్ చేసిన ఉన్న బైకుల నుంచి పెట్రోల్ దొంగతనం చేసిన వినోద్.. రాజ్‌భవన్ వైపు నడుచుకుంటూ వచ్చాడు. నెమ్మదిగా ఆ రెండు బాటిళ్లకు నిప్పటించి మెయిన్ గేట్ వైపు విసిరాడు. నీట్ బిల్లు.. గవర్నర్ ఆర్ఎన్ రవికి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. అయితే ఈలోపు అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది.. అతన్ని నిలువరించారు. అతని నుంచి మరో రెండు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నీట్ బిల్లుకు గవర్నర్ ఆర్ఎన్ రవి క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్లే వినోద్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక్కడో విషయం ఏంటంటే.. వినోద్ 2022లో చెన్నై బీజేపీ కార్యాలయంపైకి పెట్రోల్ బాంబులు విసిరిన కేసులో అరెస్ట్ అయ్యాడు. మూడు రోజుల కిందటే జైలు నుంచి విడుదలయ్యి వచ్చాడు. ఈ ఘటనపై బీజేపీ, డీఎంకే సర్కార్‌పై మండిపడుతోంది. శాంతి భద్రతలను ఈ ప్రభుత్వం ఏస్థాయిలో పరిరక్షిస్తుందో.. రాజ్‌భవన్‌పై జరిగిన దాడి ప్రతిబింబిస్తోందని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. Petrol bombs were hurled at Raj Bhavan today, reflects the true law and order situation in Tamil Nadu. While DMK is busy diverting the attention of people to insignificant matters of interest, criminals have taken the streets. Incidentally, it is the same person who attacked… — K.Annamalai (@annamalai_k) October 25, 2023 -
Bathukamma Celebrations: రాజ్ భవన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై (ఫొటోలు)
-
మళ్లీ మొదలైంది..గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్
-
ఉన్నత విద్య పేదవాళ్లకి అందాలి
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన ఉన్నత విద్య పేదవాళ్లందరికీ అందాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆకాంక్షించారు. ఈ దిశగా విద్యా సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యావిధానం–2020 ఈ తరహా మార్పు లకు శ్రీకారం చుడుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ’’విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్లు– పూర్వ విద్యార్థులతో సంబంధాలు’’ అనే అంశంపై సోమవారం రాజ్‌భవన్‌లో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని పలు విశ్వవి ద్యాలయాల వీసీలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల్లో స్థిరపడిన వర్సిటీల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతు లు పెంచి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బోధన విధానాలు తీసుకురావాలని సూచించారు. అకడమిక్ యాక్టివిటీని వర్సిటీలు మర్చిపోయాయి ప్రపంచంతో పోటీ పడగల సత్తా రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఉందని, అయితే అకడమిక్ యాక్టివిటీని విశ్వవిద్యాలయాలు మరిచిపోయా యని ఆమె వ్యాఖ్యానించారు. సరైన బోధన విధానాలు, మౌలిక వసతులు కల్పిస్తే ఇప్పుడు ప్రపంచ విశ్వవిద్యాలయాల గురించి చెప్పుకున్నట్టే, భవిష్యత్‌లో మన యూనివర్సిటీల గురించి చర్చించుకునే వీలుందన్నారు. విద్యావికాసానికి డిజిటల్ లైబ్రరీ మంచి అవకాశంగా పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సహకారం విశ్వవిద్యాలయాలకు అత్యంత ముఖ్యమని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. -
రాజ్‌భవన్ అడ్డాగా రాజకీయాలు.. బీఆర్ఎస్ మండిపాటు
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలంటూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై తిరస్కరించడంపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సు చేసిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలకు రాజకీయ నేపథ్యం ఉందంటూ తిరస్కరించడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించింది. మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఇతర నేతలు గవర్నర్ చర్యను ఖండించారు. మీరు తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారు?: హరీశ్‌రావు వెనుకబడిన వర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ దశాబ్దాలుగా ప్రజాసేవలో ఉన్నారని, వారిని ఎమ్మెల్సీలుగా నియమించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తే బీఆర్ఎస్ సభ్యులంటూ గవర్నర్ తిరస్కరించడం దారుణమని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటప్పుడు తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సర్కారియా కమిషన్ సూచనల మేరకు గవర్నర్‌గా పనిచేసేందుకు తమిళిసై అనర్హులని పేర్కొ న్నారు. బీజేపీకి చెందిన గులాం అలీ ఖతానా, మహేశ్ జెఠ్మలానీ, సోనాల్ మాన్సింగ్, రాంషకల్, రాకేశ్ సిన్హా తదితరులను రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సభ్యులుగా ఎలా నియమించారని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో జితిన్ ప్రసాద్, గోపాల్ అర్జున్ బూర్జీ, చౌదరీ వీరేంద్ర సింగ్, రజనీకాంత్ మహేశ్వరీ, సాకేత్ మిశ్రా, హన్స్‌రాజ్ విశ్వకర్మ తదితర బీజేపీ నేతలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆపారని, ఇప్పుడేమో ఎమ్మెల్సీ అభ్యర్దిత్వాలను తిరస్కరించారని.. తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలను అవమానించడమే: ప్రశాంత్‌రెడ్డి అత్యంత వెనుకబడిన కులాల (ఎంబీసీ)కు చెందిన దాసోజు శ్రవణ్, షెడ్యుల్డ్ తెగకు (ఎస్టీ) చెందిన కుర్రా సత్యనారాయణ అభ్యర్దిత్వాలను గవర్నర్ తిరస్కరించడం ఆయా వర్గాలను అవమానించడమేనని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు. రాజ్‌భవన్‌ను అడ్డాగా చేసుకొని గవర్నర్ రాజకీయా లు చేస్తున్నారని, ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హతను తమిళిసై కోల్పోయారని వ్యాఖ్యానించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు: ఇంద్రకరణ్‌రెడ్డి గవర్నర్ తమిళిసై చర్య సమాఖ్య స్పూర్తికి గొడ్డలిపెట్టు వంటిదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. గవర్నర్ తీరు రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. కిషన్‌రెడ్డి కుట్ర వల్లే తిరస్కరణ: శ్రీనివాస్‌గౌడ్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేసిన కుట్ర వల్లే గవర్నర్ ఎమ్మెల్సీల ఫైల్‌ను తిరస్కరించారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఇది బలహీన వర్గాలకు చెందిన వారిని అణచివేసే కుట్ర అని మండిపడ్డారు. ఇది కక్ష సాధింపు కోసమే.. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్, దూదిమెట్ల బాలరాజు యాదవ్, రాజీవ్ సాగర్ వేర్వేరు ప్రకటనల్లో మండిపడ్డారు. ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం మంత్రి వర్గ సమావేశంలో చర్చించి, ఆమోదించి పంపిన సిఫార్సు లను గవర్నర్ ఆమోదించకపోవటం సరికాదని, దీనికి రాజకీయ దురుద్దేశమే కారణమని విమర్శించారు. -
ఆర్టీసీ ఉద్యోగులు.. ఇక ప్రభుత్వ ఉద్యోగులే
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోద ముద్ర వేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ గురువారం ఓకే చెప్పడంతో చట్ట బద్ధత లభించింది. దీంతో 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. టీఎస్ ఆర్టీసీ (ఉద్యో గులను ప్రభుత్వంలో విలీనం) బిల్లు–2023ను శాసనసభ గతనెలలో ఆమోదించగా, రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ బిల్లుపై సంతకం చేసినట్టు రాజ్భవ న్ తాజాగా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే.. జూలై 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి ఆమోద ముద్ర వేయడం, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని నిర్ణ యించిన విషయం విదితమే. అయితే ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్న ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో, గవర్నర్ బిల్లు ను పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేయడం, మొద ట సంస్థ ఆస్తులు, కేంద్ర గ్రాంట్లు, వాటా, విభజన చట్టంలో 9వ షె డ్యూల్, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చూస్తారా.? వారి సీనియారిటీ, పారిశ్రామిక వి వాదాల చట్టం వర్తిస్తుందా..? ప్రభుత్వ ఉద్యోగులతో సమా నంగా పెన్షన్ వర్తిస్తుందా..?అన్ని ప్రయోజనాలు కల్పి స్తారా..? ప్రభుత్వ ఉద్యోగాల్లో కండక్టర్, కంట్రోలర్ వంటి పోస్టులు లేవు మరి వారిని ఏ విధంగా సర్దుబాటు చేస్తారు.? కేంద్రం నుంచి అనుమతి తీసుకున్నారా.? డిపోల్లో కేటగిరి వారీగా ఉన్న ఉద్యోగుల సంఖ్య ఎంత.. కాంట్రాక్టు, క్యాజువ ల్ కార్మికుల పరిస్థితి ఏమిటీ..? ఆర్టీసీ ప్రస్తుత స్వరూపంతోనే పనిచేస్తుందా..? ఆస్తులను ప్రభుత్వం విలీనం చేసు కుంటుందా.? బస్సుల నిర్వహణ, ఆజమాయిషీ ఎవరిది లాంటి అనేక ప్రశ్నలు గవర్నర్ లేవనెత్తడం.. వాటిన్నింటికి ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతోపాటు, బిల్లులో పొందుపరిచి అసెంబ్లీలో పాస్ చేసిన సంగతి విదితమే. బిల్లు వచ్చిన తర్వాత మళ్లీ న్యాయశాఖ పరిశీలనకు పంపించిన గవర్నర్.. ఈనెల 3వ తేదీన న్యాయశాఖ నుంచి బిల్లు తిరిగి వచ్చిన తర్వాత దాదాపు పదిరోజుల పరిశీలన అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపారు. సీఎంకు ధన్యవాదాలు : బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగులంతా రుణపడి ఉంటారని పేర్కొన్నారు. తాను సంస్థ చైర్మన్‌గా ఉన్న సమయంలో వారంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం ఆనందంగా ఉందన్నారు. -
సర్కార్‌తో కొట్లాడే ఉద్దేశం లేదు: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తనపై.. ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు తమిళిసై సౌందరరాజన్. తెలంగాణ గవర్నర్‌గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో.. రాజ్‌భవన్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ వివాదంపైనా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను ఎక్కడ ఉన్నా తెలంగాణతో బంధం మరిచిపోను. నేను సవాళ్లకు, పంతాలకు భయపడే వ్యక్తిని కాను. నా బాధ్యతలు, విధులను సమర్థవంతగా నిర్వర్తిస్తూ.. తెలంగాణలో గవర్నర్‌గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్నా. అలాగే.. నేను కోర్టు కేసులకు, విమర్శలకు భయపడే రకం కాదు. ప్రొటోకాల్ ఉల్లంఘనతో నన్ను కట్టడి చేయలేరు. తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి వచ్చా. ప్రజల విజయమే నా విజయం అంటూ వ్యాఖ్యానించారామె. ► నేను రాజకీయాలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం.. కొట్లాడే ఉద్దేశం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ లీడర్.. పవర్ ఫుల్ నేత. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నేను చూస్తున్నా. రాజ్‌భవన్‌కి, ప్రగతి భవన్‌కు గ్యాప్ లేదు. సీఎంతో ఎలాంటి దూరం లేదు. దూరం గురించి నేను పట్టించుకోను. నా దారి నాదే. ► ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది. కానీ, గవర్నర్ ఆఫీస్‌కు కొంత లిమిట్ ఉంది. ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయాలని ఉన్నా.. నిధుల కొరత ఉంది. నాకు పొలిటికల్ ఎజెండా లేదు.. ప్రజలకు సేవ చేయడం తప్ప. నాది మోసం చేసే తత్వం కాదు. నాది కన్నింగ్ మెంటాల్టి కాదు.. పేదలకు ఏదో చేయడం తప్ప. పీపుల్ ఫ్రెండ్లీ గవర్నర్ గా ఉండాలని అనుకుంటా అంతే. ► తెలంగాణ బర్త్ డే- నా బర్త్ డే ఒకేరోజు. నా మైండ్ లో ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలనే ఉంటుంది. నా కుటుంబ నేపథ్యం అంతా రాజకీయాలు మాత్రమే. నేను గౌరవం కోసం కొట్లాడే వ్యక్తిని కాదు.. నిరంతరం సంతోషంగా ఉండే వ్యక్తిని. పుదిచ్చేరికి కూడా గవర్నర్ గా ఉన్నా.. తెలంగాణ ప్రజల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. అడ్మిస్టేషన్ పరంగా రెండు రాష్ట్రాలకూ నా బాధ్యత నిర్వర్తిస్తున్నా. ఇక్కడ జిల్లాలకు వెళ్తే ఐఏఎస్ అధికారులు రారు. కానీ, పుదుచ్చేరిలో సీఎస్ సహా చాలా మందిని పర్యవేక్షిస్తున్నాను. నాకు గౌరవం ఇస్తారా.. నా పనిని గుర్తిస్తారా? అనేది నాకు అవసరం లేదు. ► ఆర్టీసీ బిల్లుపై అనవసర కాంట్రవర్సీ జరిగింది. నేను ఆర్టీసీ కార్మికుల లబ్ధికోసమే బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అనేది కేటగిరి ఉంటుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై ప్రభుత్వం కేటగిరి పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అనేది పొలిటికల్ నామినేషన్ కాదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి అర్హత ఫీల్ చేస్తే.. సంతకం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ► మెడికల్ కాలేజీల వ్యవహారంలో కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరిగింది. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలి. మెడికల్ కాలేజీలు ఇవ్వడానికి కేంద్రం అడిగిన సమయంలో రాష్ట్రం స్పందించలేదనే విషయాన్ని కేంద్రం చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి కూడా మెడికల్ కాలేజీలు కేంద్రం ఇచ్చింది. అంతకుముందు.. తెలుగులో స్పీచ్ మొదలు పెట్టిన గవర్నర్ తమిళిసై, తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ గా పనిచేయడం ఎంతో గౌరవంగా ఉందని పేర్కొన్నారు. గవర్నర్ గా తనకు అవకాశం కల్పించినందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. ‘‘నా మొదటి సంవత్సరంలోనే కోవిడ్ ఛాలెంజ్ ఎదుర్కొన్నాం. తెలంగాణ ప్రతి ఒక్క విద్యార్థికి విద్యను అందిచడం ఒక ప్రాధాన్యత ఉండేది. దోనెట్ డివైజ్ తో పేద విద్యార్థులకు ల్యాప్ టాప్‌లు అందించాం. మహిళా గవర్నర్ గా మహిళ సాధికారత అందించడం మరో ఛాలెంజ్. గిరిజన మహిళల ఆరోగ్యం పై నేను దృష్టి పెట్టాను. గిరిజన మహిళల్లో రక్తహీనత ఎంత బాధను కలిగించింది. గిరిజన గ్రామాల్లో పోషకాలు, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం జరిగింది అని తెలిపారామె. అలాగే రాజ్‌భవన్ తరపు ఘనతలను కూడా ఆమె చదివి వినిపించారు. నాకు, తెలంగాణకు మధ్య దేవుడు ఇచ్చిన బంధం ఉంది అంతే. ఇంకో 30, 40 ఏళ్ళ పాటు ఇదే రకంగా ఉంటాను అంటూ భావోద్వేగంగా మాట్టాడారామె. ఇదీ చదవండి: ఆయనంతే అదో టైప్! -
ఆర్టీసీ విలీనం బిల్లు ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం అంశం మరోసారి గందరగోళంగా మారుతోంది. ఆగమేఘాల మీద శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఏమైందో స్పష్టత లేకపోవటం కార్మికుల్లో ఆందోళనకు, అయోమయానికి కారణమవుతోంది. బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలపడంలో జాప్యం జరిగినప్పుడు ఆర్టీసీ కార్మికులు ఏకంగా రెండు గంటలపాటు బస్సులు దిగ్బంధం చేసి రాజ్‌భవన్‌ను ముట్టడించారు. ఆ సమయంలో పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ మరుసటి రోజు హైదరాబాద్ వచ్చిమరీ ఆమోదం తెలిపారు. అంత వేగంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఇక బిల్లు ఆమోదం, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనానికి వీలుగా కమిటీ ఏర్పాటు కావటం, మార్గదర్శకాలు రూపొందటం, విలీన ప్రక్రియ పూర్తి కావటం కూడా అంతే వేగంగా జరుగుతుందని భావించారు. కానీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి సరిగ్గా నెల గడిచింది. గత నెల ఆరో తేదీన శాసనసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అది గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు చేరింది. అయితే కొన్ని సందేహాల నివృత్తి కోసం దానిని న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్టు తర్వాత గవర్నర్ ప్రకటించారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందన్న విషయంలో మాత్రం ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. 183 మంది ఉద్యోగులకుటుంబాలకు నిరాశ గత నెలలో పదవీ విరమణ పొందిన 183 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలు నెలాఖరు వరకు ఉత్కంఠగా ఎదురుచూసి నిరాశ చెందాల్సి వచ్చింది. ఇప్పుడు మరో 200 కుటుంబాలు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. న్యాయశాఖ కార్య దర్శి కార్యాలయానికి వచ్చిన బిల్లు అప్పటినుంచి తెలంగాణ సచివాలయంలోనే ఉండిపోయిందంటూ కార్మిక సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై రాజ్‌భవన్ వర్గా లను ‘సాక్షి’వివరణ కోరగా, ఆర్టీసీ బిల్లు ఇంకా రాజ్‌భవన్‌కు చేరుకోలేదని పేర్కొన్నాయి. వేరే 3 బిల్లులు మాత్రం వచ్చాయని వివరించాయి. ఆ రెండు వేతన సవరణలు చేయాలి: కార్మిక సంఘాలు బిల్లును తిరిగి రాజ్‌భవన్‌కు పంపటంలో జాప్యం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు, ఇప్పుడు మరో అంశంపై పట్టుపడుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు 2017, 2021 వేతన సవరణలు పెండింగులో ఉన్నందున, వాటిని క్లియర్ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని పేర్కొంటున్నాయి. విలీన ప్రక్రియ లోపే ఆ రెండు వేతన సవరణలు చేస్తే, ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల వేతనాలను కొంత ఉన్నత స్థాయిలో స్థిరీకరించేందుకు వీలుంటుందని, లేకుంటే తక్కువ వేతన స్థాయిలోనే ఫిక్స్ అవుతాయని, ఇది కార్మికులను తీవ్రంగా నష్టపరుస్తుందని వివరిస్తున్నాయి. ఆయా అంశాలపై మరోసారి ఆందోళనకు సిద్ధమని అంటున్నాయి. ఇప్పుడు ఏ కార్యాలయాన్నిముట్టడించాలి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలియజేయడంలో జాప్యం జరిగిందంటూ రాజ్‌భవన్‌ను ముట్టడించేలా చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వమే జాప్యం చేస్తోంది. ఇప్పుడు ఏ కార్యాలయాన్ని ఆర్టీసీ కార్మికులు ముట్టడించాలి. బిల్లును ఇప్పటికీ రాజ్భవవన్కు పంపకుంటే వెంటనే పంపాలి. ఈలోపు కార్మికులకు బకాయి ఉన్న వేతన సవరణలు చేయాలి. – అశ్వత్థామరెడ్డి, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వెంటనే రాజ్‌భవన్‌కు పంపాలి ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ సంతకం కోసం వెంటనే రాజ్‌భవన్‌కు పంపాలి. జాప్యం చేయకుండా రెండు వేతన సవరణలు జరిపి, సీసీఎస్ బకాయిలు చెల్లించి, ఆ తర్వాత విలీన ప్రక్రియ పూర్తి చేయాలి. – రాజిరెడ్డి, ఎంప్లాయీస్ యూనియన్ -
గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో గురువారం ఆసక్తికరమైన పరిణామం ఒకటి చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. అటుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తిని రేకెత్తించింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ సీఎస్‌తో పాటు రాజ్‌భవన్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆపై ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. అయితే భేటీ సారాంశం అధికారకంగా బయటకు రాకపోయినా.. గవర్నర్‌తో ప్రత్యేక భేటీలో.. పెండింగ్‌లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాదు.. పెండింగ్‌లో ఉన్న బిల్లులపైనా సీఎం కేసీఆర్ గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల భేటీ తర్వాత.. పట్నం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆపై సీఎం కేసీఆర్, కేబినెట్‌తో కలిసి గవర్నర్ గ్రూప్ ఫొటో దిగారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య నెలకొన్న గ్యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారిక కార్యక్రమాలకు సైతం గవర్నర్‌ను ఆహ్వానించకపోవడం, ఆ చర్యపై ఆమె బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కుతుండడం చూస్తున్నాం. అదే సమయంలో ఆమె ముఖ్యమైన బిల్లులనూ పెండింగ్‌లో పెడుతూ వస్తున్నారు. -
ఆర్టీసీ బిల్లుపై న్యాయ సలహా కోరిన గవర్నర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ న్యాయసలహా కోరారు. ఈ క్రమంలో ఆర్టీసీ బిల్లుతో పాటు ఇతర బిల్లులను సైతం ఆమె న్యాయ కార్యదర్శికి పంపినట్లు సమాచారం. ఇది నిబంధనల్లో భాగంగా జరిగే ప్రక్రియే అని రాజ్‌భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. ఆర్టీసీ బిల్లుతో పాటు గతంలో తాను వెనక్కి పంపిన మరో నాలుగు బిల్లులకు సంబంధించిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా? లేదా? అనే విషయాన్ని సైతం నిర్ధారించాలన్నారామె. ఈ క్రమంలో.. న్యాయకార్యదర్శి సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆర్టీసీ బిల్లు సమయంలో దురుద్దేశంతో చేసిన అసత్య ప్రచారాలను నమ్మొద్దంటూ తెలంగాణ ప్రజలను, ఆర్టీసీ ఉద్యోగులను ఓ ప్రకటనలో ఆమె కోరారు. గవర్నర్ కావాలనే ఆపుతున్నారు ఆర్టీసీ బిల్లును గవర్నర్ కావాలనే ఆపుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లులపై ఇప్పటికే రాష్ట్రపతి సంతకం చేశారని, అంతకుముందే శాసనసభ ఆమోదం పొందిన బిల్లుల ఆమోదానికి గవర్నర్ మాత్రం జాప్యం చేస్తున్నారని, ఇందుకు రాజకీయ ప్రేరేపిత కారణాలు ఉన్నాయని మండిపడ్డారాయన. నామినేటెడ్ ఎమ్మెల్సీలకు కేబినెట్ పంపిన పేర్లను కూడా ఆమోదించలేదు. తక్షణమే ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని డిమాండ్ చేశారాయన. ప్రత్యక్ష కార్యాచరణకు సిద్దం ఆర్టీసీ బిల్లు విషయంలో జరుగుతున్న జాప్యంపై ఆర్టీసీ ఉద్యోగులు ప్రత్యేక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రేపు(శుక్రవారం) ఉదయం మంత్రి హరీష్ రావు ను కలవనున్నారు టీఎంయూ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి, ఇతర నేతలు. గవర్నర్ ఆర్టీసి బిల్లు పై నిర్ణయం తీసుకోకుండా పెండింగ్ లో పెట్టడం, న్యాయ సలహా అంటూ తాత్సరం చేయడం పై హరీష్ రావు ను కలిసి తెలంగాణ మజ్దూర్ యూనియన్ నేతలు చర్చించనున్నారు. అనంతరం టీఎంయూ తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించనుంది. -
తెలంగాణ: నేతలు లేక ఎట్‌హోం వెలవెల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్‌భవన్‌లో పంద్రాగస్టును పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే గంటన్నరపాటు సాగిన ఈ తేనీటి విందు కార్యక్రమం రాజకీయ నేతల హడావిడి లేక వెలవెలబోయింది. షరామామూలుగా.. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. వరుసగా మూడోసారి రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. బీఆర్ఎస్ అధినేత మాత్రమే కాదు అధికార ప్రజాప్రతినిధులు(మంత్రులు, ఎమ్మెల్యేలు) సైతం ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇక.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఎట్‌హోమ్‌లో కనిపించకపోవడం గమనార్హం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. తెలంగాణ బీజేపీ తరపున కీలక నేతలు సైతం ఎట్ హోమ్‌కు దూరంగా ఉండడం. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధేతో పాటు కొంత మంది ప్రముఖులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇదీ చదవండి: ఆస్తులు అమ్ముకుని పోయేందుకు కేసీఆర్ ప్లాన్ -
రాజ్ భవన్ లో ఎట్ హోమ్..హాజరైన సీఎం వైఎస్ జగన్ దంపతులు
-
కాసేపట్లో రాజ్ భవన్ లో ఎట్‌హోం కార్యక్రమం
-
రాజ్‌భవన్ ఎట్‌హోం.. సీఎం జగన్ దంపతుల హాజరు
సాక్షి, విజయవాడ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఈ కార్యక్రమం జరిగింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు కొట్టు, ధర్మాన, జోగి రమేష్, చెల్లబోయిన వేణు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏపీసీసీ అధ్యక్షుడు రుద్ర రాజు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కాగా, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శకటాలతో వివిధ శాఖలు ప్రదర్శన నిర్వహించారు. -
బిల్లుల లొల్లి.. మళ్లీ!.. గవర్నర్ వద్ద నిలిచిపోయిన 12 బిల్లులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య పెండింగ్ బిల్లుల జగడం మళ్లీ రాజుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలిలో 12 బిల్లులను పాస్ చేసి గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం పంపించగా.. వారం రోజుల నుంచి రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఉద్దేశించిన టీఎస్ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023 కూడా వీటిలో ఉంది. గవర్నర్ ఆమోదించాక, ప్రభుత్వం గజిట్ నోటిఫికేషన్లను జారీ చేశాక ఈ బిల్లులు చట్టరూపం దాల్చి, అమల్లోకి రానున్నాయి. రెండోసారి పంపినా నిరీక్షణ గవర్నర్ తమిళిసై గతంలో తిప్పి పంపిన 3 బిల్లులు, తిరస్కరించిన మరో బిల్లుతో కలిపి మొత్తం 4 బిల్లులను ప్రభుత్వం ఇటీవల రెండోసారి అసెంబ్లీలో ఆమోదించింది. వీటితోపాటు మరో 8 కొత్త బిల్లులను సైతం ఆమోదించి.. మొత్తం 12 బిల్లులను రాజ్‌భవన్‌కు పంపింది. వీటి విషయంలో గవర్నర్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపిస్తే.. గవర్నర్ ఆమోదించక తప్పదని రాజ్యాంగంలోని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు సదరు నాలుగు బిల్లులను ఆమోదించడం తప్ప గవర్నర్‌కు గత్యంతరం లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. మరికొన్ని రోజులు గవర్నర్ స్పందన కోసం నిరీక్షించిన అనంతరం.. పెండింగ్ బిల్లుల వ్యవహారంపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. రెండు నెలల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో.. ఆలోగానే బిల్లులను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్సీ అభ్యర్థులపై ‘పరిశీలన’! గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎరుకల సామాజికవర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బలహీనవర్గాల నుంచి దాసోజు శ్రవణ్‌లను నామినేట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ గత నెల 31న తీర్మానం చేసి పంపినా.. గవర్నర్ తమిళిసై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్సీలుగా నియమించేందుకు వారికి ఉన్న అర్హతలను గవర్నర్ పరిశీలిస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఇద్దరు నేతలు గతంలో కొంతకాలం బీజేపీలో పనిచేసి.. తర్వాత బీఆర్ఎస్లో చేరినవారే. గతంలో కౌశిక్‌రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ సమ్మతించకపోవడం నేపథ్యంలో.. ప్రస్తుతం ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. నెలల తరబడి పరిశీలనలోనే..! పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై న్యాయ సలహా కోరినట్టు సమాచారం. బిల్లులు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా? లేదా? అన్న అంశంపై పరిశీలన కోసం తనకు అవసరమైనంత సమయం తీసుకుంటానని గవర్నర్ గతంలో పలుమార్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో నెలల తరబడి బిల్లులు రాజ్‌భవన్ ‘పరిశీలన’లో ఉండిపోతున్నాయి. రాజ్‌భవన్‌లో ఉన్న బిల్లులు ఇవీ.. రెండోసారి ఆమోదించి పంపినవి.. తెలంగాణ మున్సిపల్ బిల్లు–2022 తెలంగాణ ప్రైవేటు వర్సిటీల బిల్లు–2022 రాష్ట్ర పంచాయతీరాజ్ బిల్లు–2023 తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యూయేషన్) బిల్లు–2022 తొలిసారిగా ఆమోదించి పంపినవి.. తెలంగాణ పంచాయతీరాజ్ (మూడో సవరణ) బిల్లు – 2023 తెలంగాణ మున్సిపాలిటీల (రెండో సవరణ) బిల్లు–2023 తెలంగాణ ఆర్టీసీ బిల్లు (సర్కారులో ఉద్యోగుల విలీనం) – 2023 తెలంగాణ పంచాయతీరాజ్ (రెండో సవరణ) బిల్లు–2023 తెలంగాణ జీఎస్టీ చట్ట సవరణ బిల్లు–2023 తెలంగాణ స్టేట్ మైనారిటీస్ కమిషన్ బిల్లు–2023 ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లు–2023 టిమ్స్ వైద్య సంస్థల బిల్లు–2023 -
గవర్నర్ తమిళిసైతో ఆర్టీసీ అధికారుల భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రతిపాదించిన ‘ఆర్టీసీ చట్ట సవరణ బిల్లు–2023’ అంశం అనేక మలుపులు తిరుగుతోంది.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య సాగుతున్న ఉత్తర, ప్రత్యుత్తరాలు, ప్రశ్నలు, సమాధానాలు, వివరణలు.. రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. గవర్నర్‌తో ఆర్టీసీ ఉన్నతాధికారుల భేటీ అయ్యారు. రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, పలువురు ఆర్టీసీ అధికారులు తమిళిసైను రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం కలిశారు. గవర్నర్ అడిగిన వివరాలను అధికారులు అందించారు. తాత్కాలిక ఉద్యోగుల భవితవ్యంపై తమిళిసై ఆరాతీశారు. వారు తెలిపిన వివరాలపై గవర్నర్ సంతృప్తి చెందితే వెంటనే బిల్లు ఆమోదించే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన నేడు సభలో ప్రవేశపెట్టి బిల్లును ఆమోదించేలా తెలంగాణ సర్కార్ ఆలోచిస్తుంది. ఆర్టీసీ బిల్లుకు వ్యతిరేకం కాదు: గవర్నర్ తాను ఆర్టీసీ బిల్లుకు వ్యతిరేకం కాదని గవర్నర్ తమిళిసై మరోసారి స్పష్టం చేశారు. ట్రాన్స్‌పోర్టు సెక్రటరీని పిలిచానని.. ఆర్టీసీ బిల్లులోని సందేహాలకు వివరణ అడిగి, సమగ్ర రిపోర్టు తీసుకుంటానని తెలిపారు. దీనిపై సాధ్యమైనంత తర్వగా నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. కాగా రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనంపై గత నెల 31న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 3 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడంతో.. ఈ సమావేశాల్లోనే బిల్లును ఆమోదించేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అయితే ఆర్టీసీ బిల్లు ఆర్థిక సంబంధిత అంశాలతో ముడిపడి ఉండటంతో, అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ అనుమతి కోసం ఈనెల 2న రాజ్‌భవన్‌కు పంపించింది. చదవండి: ఆర్టీసీ బిల్లుపై లొల్లి!. గవర్నర్ ఆ బిల్లును పరిశీలించి.. ఐదు ప్రధాన సందేహాలను లేవనెత్తుతూ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు కోరారు. ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆయా అంశాలపై వివరణలు ఇస్తూ గవర్నర్ కార్యదర్శికి శనివారం లేఖ పంపారు. కానీ ఈ వివరణలతో గవర్నర్ సంతృప్తి చెందకపోవడం, పలు అంశాలపై పూర్తిస్థాయి స్పష్టత కోరినట్లు రాజ్‌భవన్ ప్రకటించింది. మరోవైపు బిల్లుకు అనుమతి ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు రాజ్‌భవన్‌ను ముట్టడించగా.. ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు గవర్నర్. కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, వారి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం నుంచి వివరణలు కోరానని గవర్నర్ తమిళిసై ప్రకటించారు. ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తే.. రెండు గంటల్లోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి అనుమతిస్తానని గవర్నర్ పేర్కొన్నట్టు తెలిసింది. ఇక శనివారం రాత్రి తర్వాత కూడా ఈ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. -
నిరసన చేస్తున్న ఆర్టీసీ యూనియన్ నాయకులకు గవర్నర్ ఆహ్వానం
-
రాజభవన్ దగ్గర భారీగా భద్రత పెంపు
-
మరోసారి రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్
-
నేడు ఆర్టీసీ ఉద్యోగుల రాజ్‌భవన్ ముట్టడి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికుల విలీనం బిల్లు’ను గవర్నర్ తమిళిసై పరిశీలన కోసం ఆపడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణయించాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సు సర్విసులను నిలిపివేయాలని ఉద్యోగులు, కార్మికులకు పిలుపునిచ్చాయి. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని పీవీ మార్గ్ నుంచి భారీ ర్యాలీగా వెళ్లి రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని ప్రకటించాయి. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశాయి. -
వచ్చి రెండు రోజులేగా అయ్యింది.. టైం పడుతుంది!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై వర్సెస్ బీఆర్ఎస్ సర్కార్‌కు నడుమ మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ తెలిసిందే. ఈ క్రమంలో.. ‘బిల్లుల పెండింగ్’ అంశం కూడా హాట్ టాపిక్‌గా ఉంటోంది. అయితే తాజాగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఆర్టీసీ బిల్లును ఈ దఫా అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశపెట్టాల్సి ఉండగా.. గవర్నర్ నుంచి అందుకు అనుమతులు రాలేదు. ఈ తరుణంలో.. రాజ్‌భవన్ స్పందించింది. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ.. ఆ సంస్థ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా బిల్లును రూపొందించింది.. ఆర్థికపరమైంది కావడంతో దానిని గవర్నర్‌కు పంపింది కూడా. అయితే రెండు రోజులు గడిచినా గవర్నర్ నుంచి అనుమతి రాలేదు. ఆమె అనుమతి ఇస్తేనే అసెంబ్లీలో దీనిపై చర్చ జరిగేది. దీంతో ప్రభుత్వ వర్గాల్లో దీనిపై చర్చ నడుస్తుండగా.. మరోవైపు ఈ పరిణామంపై రాజ్‌భవన్ వర్గాలు స్పందిస్తూ.. బుధవారం మధ్యాహ్నాం ఆర్టీసీ బిల్లు రాజ్‌భవన్‌కు చేరింది. కాబట్టి గవర్నర్ ఈ బిల్లును పరిశీలించడానికి కొంత సమయం పడుతుంది. పైగా న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సమయం కావాలి అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదీ చదవండి: ‘మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించేది నేనే!’ -
పిల్లల టిఫిన్ బాక్సులు తెరిచి చూసి షాకయ్యా: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: ‘మనం కరెన్సీని కాదు.. కేలరీలను లెక్కించడం చాలా ముఖ్యం’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మహిళా ఆరోగ్యంపై రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్త్రీలు, కౌమారదశలో ఉన్న బాలికల మానసిక, శారీరక శ్రేయస్సు ప్రధానమని పేర్కొన్నారు. బాల్యం నుంచే బాలికలకు యోగా, శారీరక వ్యాయామం, సంప్రదాయ ఆహార ప్రాధాన్యాన్ని తెలియజేయాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఎలాంటి ఆహారం ఇస్తున్నారో తెలుసుకోవాలంటే పిల్లల టిఫిన్ బాక్సులను తనిఖీ చేయాలని ఆమె సూచించారు. గతంలో తాను ఒకసారి అలా టిఫిన్ బాక్సులను పరిశీలించానని, చాలా బాక్సుల్లో బయటి నుంచి బర్గర్లు, చిప్స్, పఫ్స్, బిస్కెట్లు, స్నాక్స్ ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోయానని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా మహిళల ఆరోగ్య అవసరాలపై ఇంకా స్పష్టత రాలేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి మరిన్ని మొబైల్ మెడికల్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆయు ష్మాన్ భారత్‌లో మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు వ్యాధుల కవరేజీని ఎక్కువగా పెంచారని ఆమె వెల్లడించారు. -
గవర్నర్‌కు డీఎంకే ఫైల్స్–2
సాక్షి, చెన్నై: డీఎంకే అవినీతి అక్రమాలు ఫైల్స్ –2 పేరుతో ఏకంగా ఓ ట్రంక్ పెట్టెలో ఆధారాలను పెట్టి మరీ రాజ్‌భవన్‌లో బీజేపీ రాష్ట్ర అ«ధ్యక్షుడు అన్నామలై బుధవారం గవర్నర్‌కు సమరి్పంచడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులో తొమ్మిది మంది రాష్ట్ర మంత్రుల అవినీతికి సంబంధించిన వివరాలు, మూడు ప్రాజెక్టుల్లో చోటుసుకున్న అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. వివరాలు.. అవినీతి అక్రమాలు.. పేరుతో సీఎం స్టాలిన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆస్తులు, డీఎంకే పార్టికి సంబంధించిన ఆస్తులు, పలువురు ఎంపీల అక్రమార్జన వివరాలను డీఎంకే ఫైల్స్ –1 పేరుతో ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విడుదల చేశారు. ఈ సమయంలో త్వరలో డీఎంకే ఫైల్స్– 2 కూడా బయటకు వస్తుందని వ్యాఖ్యానించారు. డీఎంకే ఫైల్స్ వ్యవహారంలో అన్నామలైపై డీఎంకే పార్టీ వర్గాలు పరువునష్టం దావా కూడా వేశాయి. ఈ పరిస్థితుల్లో ఇది వరకు మీడియా ముందు ఫైల్స్– 1ను విడుదల చేసిన అన్నామలై ఈసారి రూటు మార్చారు. డీఎంకే ఫైల్స్– 2 పేరుతో ఒక ట్రంక్ పెట్టెలో కొన్ని పత్రాలను పెట్టి పెట్టి మరీ రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌కు అందజేశారు. అలాగే ఇటీవల కాలంలో మూడు ప్రాజెక్టుల్లో రూ. 5,600 కోట్ల అవినీతి జరిగిందని పేర్కొంటూ, ఆ వివరాలను ఫిర్యాదులో పేర్కొన్నారు. -
ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం: గవర్నర్ నజీర్
సాక్షి, విజయవాడ: దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక, ఏపీలో కూడా యోగా డే వేడుకలు కొనసాగుతున్నాయి. కాగా, రాజ్‌భవన్‌లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజ్‌భవన్‌లో అధికారులతో కలిసి గవర్నర్ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు స్పెషల్ సీఎస్ అనిల్ కుమార్ సింఘల్ యోగాసనాలు వేశారు. అనంతరం, గవర్నర్ మాట్లాడుతూ.. ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం. యోగా ప్రక్రియ ద్వారా మానసిన ప్రశాంతత చేకూరుతుంది. యోగా ద్వారా ఒత్తిడిని అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా అంతర్గత శక్తి, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యోగాతో అన్ని వయసుల వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ఇది కూడా చదవండి: మాతో పొత్తా?.. పద్ధతిగా ఉండదు! చంద్రబాబుపై సోమువీర్రాజు ఘాటు వ్యాఖ్యలు -
కొందరి అభివృద్ధి కాదు.. అందరి అభివృద్ధి కావాలి
సాక్షి, హైదరాబాద్: కేవలం కొంత మంది అభివృద్ధి కాకుండా, రాష్ట్రం మొత్తం జరిగితేనే అది నిజమైన అభివృద్ధి అనిపించుకుంటుందని గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. అప్పుడే తెలంగాణ ఉద్యమానికి సంపూర్ణ సార్థకత సమకూరుతుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిలో ఇక్కడివారితోపాటు అంతర్జాతీయంగా ఉన్న తెలంగాణ వాసులంతా ఉద్యమ స్ఫూర్తితో మరింత చురుకైన పాత్ర పోషించాలని.. అంతా కలసి సరికొత్త తెలంగాణకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను రాజ్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న 30 మందిని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారందరినీ గవర్నర్ తమిళిసై శాలువాతో సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలంటూ.. తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్, ప్రసంగం ఆ సాంతం తెలుగులోనే కొనసాగించారు. ‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని తెలంగాణ వాసులందరికీ శుభాకాంక్షలు. జై తెలంగాణ అన్నది కేవలం ఒక నినాదం కాదు. ఆత్మగౌరవ నినాదం. నా జీవితంలో ప్రతి క్షణం ప్రజాసేవకే అంకితం. నేను తెలంగాణ ప్రజలతో ఉన్నాను. తెలంగాణ ప్రజలు నాతో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో నా పాత్ర కచ్చితంగా ఉంటుంది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుదాం. తెలంగాణ సాధనలో 1969 ఉద్యమంలో పాల్గొన్న 30 మంది పోరాట యోధులను ఈ సందర్భంగా సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అనేక రంగాల్లో ఈ పదేండ్లలో తెలంగాణ తన ప్రత్యేకతను చాటుకుంది. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా పేరు సాధించింది. అయితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటే హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని మారుమూల పల్లెలకు అభివృద్ధి ఫలాలు చెందాలి’అని గవర్నర్ ఆకాంక్షించారు. కేక్ కట్ చేసిన గవర్నర్.. శుక్రవారం గవర్నర్ పుట్టినరోజు కూడా అయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఆమె తెలంగాణ తొలి దశ ఉద్యమకారుల దగ్గరకు స్వయంగా వెళ్లి కేక్ తినిపించారు. ‘రాష్ట్రాల అవతరణ దినోత్సవాలను అన్ని రాష్ట్రాల రాజ్భవన్లలో చేయాలని ప్రధాని మోదీ సూచించడం ఎంతో సంతోషించే అంశం. శుక్రవారం సాయంత్రం పుదుచ్చేరి రాజ్‌భవన్‌లో నిర్వహించే తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొంటున్నా’అని అన్నారు. గవర్నర్ వ్యవస్థ అలంకారప్రాయమైనదని, దాన్ని రద్దు చేయాలని ఇటీవల కేసీఆర్.. కేజ్రీవాల్, భగవంత్సింగ్మాన్లతో కలసి చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ప్రశ్నించగా..గవర్నర్ అలంకారప్రాయమన్న వ్యాఖ్యలకు ఈ రోజు రాజ్‌భవన్‌లో జరుగుతున్న వేడుకలే సమాధానమన్నారు. అవతరణ వేడుకలకు ప్రభుత్వం నుంచి తనకు ఆహ్వానం అందిందా..లేదా అన్నది సమస్య కాదని, దానిపై తాను వ్యాఖ్యానించదలచుకోలేదన్నారు. తానెప్పుడూ ప్రజలతోనే ఉన్నానని, వారు కూడా తనతో ఉన్నారని మరోమారు స్పష్టం చేశారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గవర్నర్ తమిళిసై చిన్నారులతో కలసి ఉత్సాహంగా కాసేపు కాలు కదిపారు. అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. -
తెలుగులోనే పూర్తి ప్రసంగం.. కళాకారులతో గవర్నర్ తమిళిసై డ్యాన్స్
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు, ప్రముఖుల మధ్య గవర్నర్ కేక్ కట్ చేశారు. వేడుకల సందర్భంగా రాజ్‌భవన్‌లో గవర్నర్ డ్యాన్స్ వేశారు. అక్కడ నృత్యకారులతో కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. గవర్నర్ తమిళిసైకి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అనంతరం గవర్నర్ తొలిసారి తన ప్రసంగాన్ని మొత్తం తెలుగులో మాట్లాడారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనేక పోరాటాల వల్ల సాధించుకున్న తెలంగాణకు గవర్నర్‌గా రావడం దేవుని ఆశీర్వాదమన్నారు. 1969 తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న సమరయోధులకు తమిళిసై పాదాభివందనం చేశారు. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మూడు వందల మందికిపైగా ప్రాణ త్యాగం చేయడం తెలంగాణ ఆకాంక్ష ఎంత బలంగా ఉందో ఆనాడో తెలియజేస్తుందన్నారు. దశాబ్ద కాలంలో తెలంగాణ ఎన్నో ప్రత్యేకతలు చవి చూసిందని తెలిపారు. స్వరాష్ట్ర ఏర్పాటులో భాగంగా తనువు చాలించిన వారి పేర్లను స్మరించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో గొప్పగా ఎదగాలని ఆకాంక్షించారు. తెలంగాణ అంటే స్లోగన్ కాదని, ప్రజల ఆత్మగౌరవ నినాదామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. చదవండి: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు ఆత్మహత్యాయత్నం -
కళ్లెదుటే భర్త, కన్నకూతురు, తోడబుట్టిన తమ్ముడు చనిపోతే..
విషాదం నుంచి మొదలై.. కళ్లెదుటే భర్త, కన్నకూతురు, తోడబుట్టిన తమ్ముడు చనిపోతే.. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు అచేతనంగా పడి ఉంటే.. ఎవరైనా ఏం చేస్తారు? జీవితాంతం ఆ విషాద ఘటనను గుర్తు చేసుకుని జీవశ్చవంలా మారిపోతారు. గుండెల్ని పిండేసే ఆ ఘటన తలచుకుంటేనే హృదయం ద్రవించిపోతోంది. మరీ. కళ్లారా చూసి ఆ ఘోరాన్ని భరించాలంటే ఆ బాధ వర్ణనాతీతం. కానీ సరిగ్గా అటువంటి విషాద సంఘటనే ఆమె జీవితంలో చోటు చేసుకుంది. కానీ అందరిలా విధి రాత, తలరాత అనుకుంటూ ఆమె కుమిలిపోతూ కూర్చోలేదు. బతికి ఉన్న కొడుకులో భర్త, కూతురు, తమ్ముడిని చూసుకుంటూ జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు. తండ్రి ఇచ్చిన మనోధైర్యంతో విజయతీరాలకు చేరారు టెకీ విజయగౌరి. బాధను దిగి మింగి ఓ వైపు ఉద్యోగం చేస్తూనే మరో వైపు ఉన్నత చదువులు చదివి పీహెచ్డీ పూర్తి చేసింది. ప్రస్తుతం రాజ్‌భవన్‌లో ఉద్యోగం చేస్తూ అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆమె జీవన పోరాటాన్ని ఆమె మాటల్లోనే విందాం.. కుటుంబ నేపథ్యం.. మాది విశాఖపట్నం గాజువాక. నాన్న కృష్ణారావు డాక్ యార్డ్‌లో ఉద్యోగి. అమ్మ లక్ష్మీ గృహిణి, కుటుంబ, ఆర్థిక కట్టుబాట్ల కారణంగా ఇంటర్ పూర్తి కాగానే పెళ్లి చేశారు. 1992లో సూర్యప్రకాష్‌తో వివాహమైంది. భర్త ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఇద్దరు పిల్లలతో జీవితం హాయిగా సాగిపోతోంది. చదువుపై ఉన్న శ్రద్ధతో ఆయన సహకారంతో 2000లో దూరవిద్యలో ఆంధ్ర యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేశాను. 2002లో హిందీ బీఈడీలో సీటు వచ్చినప్పటికీ వదులుకోవాల్సి వచ్చింది. ఎంఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్) పూర్తి చేశాను. హాయిగా సాగిపోతున్న జీవితంలో ఒక్కసారిగా విషాదం. సంకాంత్రి పండుగ వేళ 2003 జనవరి 16న జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త, కూతురు, తమ్ముడు చనిపోయారు. నేను, ఆరేళ్ల మా బాబు కోమాలోకి వెళ్లాం. అయితే మా అత్తింటి వారు నా భర్త, పాప మృతదేహాలు మా పుట్టింటి వద్దే వదిలివెళ్లిపోయారు. అప్పటి నుంచి మా పుట్టింట్లోనే అమ్మా నాన్న వద్దే ఉంటున్నాను. 2004లో కారుణ్య నియామకం.. నా భర్త ఉపాధ్యాయుడు కావడంతో కారుణ్య నియామకాల్లో 2004 ఏప్రిల్ 3న సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగం వచ్చింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చినరావుపల్లి గ్రామంలో పోస్టింగ్. అయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కంటే సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగానికి జీతం ఎక్కువ కావడం, కారుణ్య నియామకం కింద టీచర్‌గా పోస్టింగ్ ఇవ్వడం సరికాదని, దీనికి సంబంధించి సెప్టెంబర్ 2002 ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని, తెలుసుకోకుండా పోస్టింగ్ ఇచ్చారని సరెండర్ చేశారు. దీంతో మళ్లీ ఒంటరి పోరాటం ప్రారంభం అయ్యింది. పిల్లాడి చదువు, ఇంటిపోషణ చూసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. నవంబర్, 2005లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చారు. నాన్న ఇచ్చిన ధైర్యంతో ఉద్యోగం చేస్తూనే పట్టు వదలకుండా చదువు కొనసాగించాను. పీహెచ్డీ చేయాలనే అభిరుచి, గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఇంగ్లిషు అభివృద్ధి చేసి, సేవ చేయాలనే ఆలోచనతో ఎంఏ ఇంగ్లిష్‌లో పోస్ట్ గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాను. ఆ తర్వాత కృష్ణా యూనివర్సిటీలో పీహెచ్‌డీలో జాయిన్ అయ్యాను. 2023 మార్చి 29న డాక్టరేట్ పొందాను. ఎందరో ప్రోత్సాహం.. నా జీవిత ప్రయాణంలో విజయనగరం నుంచి రాజ్‌భవన్ వరకు ఎందరో వెన్నుతట్టి ప్రోత్సహించారు. ప్రత్యేకంగా డాక్టర్ ఎన్.అప్పారావు, డాక్టర్ మోహన్‌రావు, సీహెచ్ ప్రసాదరావు, ఎం. కోటేశ్వరరావుకు ధన్యవాదాలు. నా కొడుకు శశిధర్ ఎన్ఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. మా నాన్నకు డాక్టరేట్ అంకితమిస్తున్నా. నాన్న ఇచ్చిన ధైర్యంతో.. ఒంటరిగా ఉంటే పిచ్చిదానివి అయిపోతావు. నీ కొడుకు కోసమైనా నీవు అన్ని మరిచిపోయి బతికి ఉండాలి. మామూలు మనిషివి కావాలంటూ నాన్న వెన్నుతట్టారు. గుండె ధైర్యం నింపారు. మళ్లీ చదువు బాట పట్టించారు. 2003లో గురజాడ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, శ్రీకాకుళంలో బీఎడ్ జాయిన్ చేశారు. ఇక ప్రతిరోజు తెల్లవారు జామున నాలుగంటలకు నిద్ర లేచి బస్సులో గాజువాక నుంచి శ్రీకాకుళం జిల్లా పెదపాడు గ్రామం వెళ్లడం.. రావడం. ఇంటికి రాగానే ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్న కొడుకు. ఓ వైపు పిల్లాడికి చదువు చెప్పుకుంటూ నేను చదువుకుంటూ బీఎడ్ డిస్టింక్షన్లో పాసయ్యాను. -
పరిశ్రమల శాఖ మంత్రిగా రాజ
సాక్షి, చైన్నె: డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనెల 7వ తేదీతో రెండేళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. ప్రజా పాలన మూడో వసంతంలోకి అడుగు పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి వర్గంలో భారీ మార్పులు చేపట్టాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. దీంతో పలువురు మంత్రుల పదవులు ఊడినట్లే అనే చర్చ జోరందుకుంది. అయితే పాడి పరిశ్రమల శాఖ మంత్రి నాజర్‌కు మాత్రమే ఉద్వాసన పలికారు. డీఎంకే సీనియర్ నేత టీఆర్ బాలు వారసుడు టీఆర్బీ రాజకు కొత్తగా మంత్రి వర్గంలో చోటు కల్పించారు. వేడుకగా ప్రమాణ స్వీకారం.. గురువారం ఉదయం గిండిలోని రాజ్‌భవన్‌లో మంత్రిగా టీఆర్బీ రాజతో గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ రవికి సీఎం స్టాలిన్ పుష్పగుచ్ఛాలను అందజేశారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్బీ రాజ సీఎం స్టాలిన్ ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీఆర్బీ రాజకు మంత్రి పదవి దక్కడంతో మన్నార్‌కుడిలోని ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. తిరువారూర్ జిల్లాకు ఇంతవరకు మంత్రి లేరు. ఆ లోటు టీఆర్బీ రాజ రూపంలో సీఎం స్టాలిన్ భర్తీ చేయడాన్ని ఆహ్వానిస్తూ అక్కడి డీఎంకే శ్రేణులు స్వీట్లు పంచి.. బాణసంచా పేల్చుతూ ఆనందాన్ని పంచుకున్నారు. కాగా, తన కుమారుడు రాజకు మంత్రి పదవి దక్కడంతో డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్ బాలు ఆనందం వ్యక్తం చేశారు. మంత్రిగా రాజ ఉత్తమ సేవలు అందిస్తారన్నారు. సీఎం స్టాలిన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, మరింత నమ్మకాన్ని పెంపొందించుకునే విధంగా పని తీరు ఉంటుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం మంత్రులు అందరూ సీఎం స్టాలిన్, గవర్నర్ ఆర్ఎన్రవితో కలిసి గ్రూప్ ఫొటో తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. తదుపరి జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి వర్గం మార్పుకు గురించి సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. పీటీఆర్ చేజారిన ఆర్థికశాఖ ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు, టీఆర్బీ రాజకు శాఖను కేటాయిస్తూ సీఎం స్టాలిన్ చేసిన సిఫారసులకు గవర్నర్ రవి ఆమోద ముద్ర వేశారు. సీఎం స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్(పీటీఆర్) వివాదాస్పద వ్యాఖ్యలు, అవినీతి ఆరోపణలు చేసినట్లుగా ఓ ఆడియో ఇటీవల వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు పదవీ గండం తప్పదనే చర్చ జరిగింది. అయితే ఆయనకు ఉద్వాసన పలకలేదు. ఆయన శాఖలో మాత్రం మార్పు చేశారు. ఆర్థిక శాఖ నుంచి ఆయన్ని తప్పించి ఐటీ శాఖకు మార్చారు. ఈ శాఖను తనకు కేటాయించడాన్ని ఆహ్వానిస్తూ, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ పీటీఆర్ ట్వీట్ చేశారు. పలువురి మంత్రుల శాఖల్లో మార్పు కొత్త మంత్రి టీఆర్బీ రాజకు పరిశ్రమల శాఖను కేటాయించారు. ఇది వరకు ఈ శాఖ తంగం తెన్నరసు చేతిలో ఉండేది. 2024 జనవరిలో పెట్టుబడిదారుల మహానాడు చైన్నె వేదికగా జరగనుంది. ఇందుకోసం ప్రపంచ దేశాలలో పర్యటించి పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు సీఎం స్టాలిన్ సిద్ధమయ్యారు. ఆయనతో పాటు టీఆర్బీ రాజ కూడా విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. వచ్చి రాగానే రాష్ట్రంలో ప్రస్తుతం కీలకంగా ఉన్న పరిశ్రమల శాఖ టీఆర్బీ ఖాతాలో పడడం గమనార్హం. ఇక ఆర్థిక శాఖను తంగం తెన్నరసుకు అప్పగించారు. రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఆర్థిక శాఖకు తంగం తెన్నరసు పూర్తి స్థాయిలో అర్హుడు అని పలువురు సీనియర్ మంత్రులు సైతం కితాబు ఇవ్వడం విశేషం. సమాచార శాఖ మంత్రి ఎంపీ స్వామినాథన్‌కు అదనంగా తమిళాభివృద్ధి శాఖను కేటాయించారు. ఇది వరకు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న టి. మనో తంగరాజ్కు ప్రస్తుతం పాడి పరిశ్రమల శాఖను అప్పగించారు. శాఖల కేటాయింపు తర్వాత మంత్రులు టీఆర్బీ రాజ, పీటీఆర్, తంగం తెన్నరసు, ఎంపీ స్వామినాథన్, మనో తంగరాజ్ సీఎం స్టాలిన్‌ను సచివాలయంలో కలిసి.. ఆశీస్సులు అందుకున్నారు. -
AP: రాజ్‌భవన్‌లో ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్ దినోత్సవ వేడుకలు
సాక్షి, విజయవాడ: ఏపీ రాజ్‌భవన్‌లో ఇంటర్నేషనల్ రెడ్‌క్రాస్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ రెడ్ క్రాస్ ఛైర్మన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్.. కలెక్టర్లతో పాటు పలువురికి మెడల్స్ అందజేశారు. అనంతరం గవర్నర్ నజీర్ మాట్లాడుతూ.. ఏపీలో రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం. గ్లోబల్ వార్నింగ్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాలి అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: సీఎం జగన్‌ను కలిసిన సిక్కు మత పెద్దలు.. కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ -
రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్ దూరం.. స్టేట్ చీఫ్‌ను కలిసే అవకాశమే లేదు!
సాక్షి, హైదరాబాద్: ‘దేశ, విదేశాల అధిపతులనైనా కలవగలం.. దురదృష్టవశాత్తు ఇక్కడి స్టేట్ చీఫ్‌ను మాత్రం కలవలేం.. కనీసం దగ్గరగా వెళ్లడానికి కూడా అవకాశం ఉండదు..రాజ్‌భవన్‌కు ప్రగతిభవన్ దూరంగా ఉంది. ఇది మంచి ధోరణి కాదు..’అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న తనను నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. సేవా ఇంటర్నేషనల్, సీ–20 వర్కింగ్ గ్రూప్, సేవా భారతి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం గచ్చిబౌలిలో నిర్వహించిన సీ–20 సమావేశాల కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అభివృద్ధి అంటే ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదు.. ‘ప్రజా ప్రతినిధులు సమాజ సేవకులు. ఎల్లప్పుడూ ప్రజల అభివృద్ధికి పాటు పడాలి. అభివృద్ధి అంటే ఒక్క కుటుంబానికి సంబంధించింది కాదు. అన్ని కుటుంబాలు అభివృద్ధి చెందాలి. ఐదు వేల సంవత్సరాల క్రితమే ఆనాటి ప్రముఖుడు కనియన్ పుంగనాన ప్రజలంతా ఒక్కటేనని నినదించారు. ప్రస్తుత ప్రధానమంత్రి అదే నియమాన్ని పాటిస్తూ ప్రజలందరినీ సమానంగా చూస్తున్నారు. యావత్ ప్రపంచానికి భారత్ పరిష్కార మార్గాలను చూపిస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో 150 దేశాలకు వ్యాక్సిన్లను సరఫరా చేసి ఆదుకుంది. మన దేశంలోని వసుదైక కుటుంబానికి ఇది నిదర్శనం’అని తమిళిసై తెలిపారు. ‘తొలిసారిగా జీ20 ఫోరమ్‌కు 2023లో భారత్ అధ్యక్షత వహించడం గర్వకారణం. మోదీ నేతృత్వంలో భారత్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. స్వాతంత్య్ర శతాబ్ది వైపు పయనించే ‘అమృత్కాల్’దిశగా ఇదో ముందడుగు. నిరాక్షరాస్యత, అనారోగ్యం, నిరుద్యోగం లేని దేశంగా భారత్ అవతరిస్తుంది. అయితే అభివృద్ధి దిశగా చేసే పనిని కొందరు వ్యతిరేకిస్తారు కానీ పని చేయరు. నాయకులు అధికారులు, రాజ్‌భవన్ అందరూ ప్రజల కోసమే ఉన్నాం..’అని గవర్నర్ స్పష్టం చేశారు. జీ20 సౌస్ షెర్పా డీఎం కిరణ్, రామకృష్ణమఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద, సేవా ఇంటర్నేషనల్ డైరెక్టర్ స్వాతి రామ్ తదితరులు పాల్గొన్నారు. -
సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి తమిళిసై గైర్హాజరు.. రాజ్‌భవన్ క్లారిటీ..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నూతన సచివాలయ ప్రారంభోత్సవం ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా కొత్త సచివాలయాన్ని ప్రారంభమైంది. కాగా, ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి రాకపోవడంపై గవర్నర్ తమిళిసై వివరణ ఇచ్చారు. సచివాలయ ప్రారంభోత్సవానికి గవర్నర్‌కు ఆహ్వానం పంపలేదు. దీనిపై తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదు. గవర్నర్‌కు ఆహ్వానం పంపామని ప్రభుత్వం అనడం తప్పు. ఆహ్వానం రాకపోవడం వల్లే సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్లలేదు అంటూ రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ పేరుతో మరో కొత్త పార్టీ.. -
మరో 3 బిల్లుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాలతో రాజ్‌భవన్‌లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉండిపోయిన బిల్లుల వ్యవహారంలో మరికొంత కదలిక వచ్చింది. మొత్తం 10 బిల్లులు పెండింగ్‌లో ఉండగా, 7 బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయాలు తీసుకుని పరిష్కరించినట్టు ఈ నెల 10న సుప్రీంకోర్టుకు రాజ్‌భవన్ నివేదించింది. తాజాగా మిగిలిన 3 బిల్లులపై సైతం గవర్నర్ నిర్ణయాలు తీసుకుని పరిష్కరించారని సోమవారం వెల్లడించింది. రాజ్‌భవన్ వర్గాల ప్రకారం.. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ ఏన్యుయేషన్) చట్ట సవరణ బిల్లు–2022ను గవర్నర్ తిరస్కరించారు. తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు–2022తో పాటు తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు–2022పై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణలు కోరుతూ తిప్పి పంపారు. ప్రస్తుతం తమ వద్ద ఎలాంటి ప్రభుత్వ బిల్లులు పెండింగ్‌లో లేవని రాజ్‌భవన్ అధికారవర్గాలు వెల్లడించాయి. ఇలావుండగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు–2023 పై వివరణలు కోరుతూ గతంలోనే తిప్పి పంపడంతో.. ఈ విధంగా ప్రభుత్వానికి తిప్పి పంపిన బిల్లుల సంఖ్య మూడుకు పెరిగింది. కేవలం 3 బిల్లులకే ఆమోదం .. తెలంగాణ మోటారు వాహనాల పన్నుల చట్ట సవరణ బిల్లు–2022, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు–2023, తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లు–2023కు గవర్నర్ తమిళిసై ఈ నెల 9న ఆమోదం తెలిపారు. కీలకమైన తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు–2022, తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం బిల్లు–2022లను రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం పంపించారు. ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంత (లీజుల నియంత్రణ, రద్దు) చట్ట సవరణ బిల్లు–2022 న్యాయశాఖ నుంచి చేరలేదని రాజ్‌భవన్ అధికారులు పేర్కొంటున్నారు. -
మూడు బిల్లులకు ఓకే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాల నేపథ్యంలో చాలాకాలం నుంచి రాజ్‌భవన్‌లో పెండింగ్ పడిన బిల్లుల వ్యవహారంలో కదలిక వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. మూడు సాధారణ బిల్లులపై ఆమోదముద్ర వేశారు. కీలకమైన యూనివర్సిటీల నియామక బోర్డు, అటవీ వర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన రెండు బిల్లులను రాష్ట్రపతికి నివేదించడం కోసం నిలిపివేశారు. మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం తిప్పిపంపారు. మరింత పరిశీలన అవసరమంటూ ఇంకో రెండు బిల్లులను రాజ్‌భవన్‌లోనే అట్టిపెట్టుకున్నారు. మొత్తంగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఇటీవలి వరకు రాష్ట్ర శాసనసభ ఆమోదించిన పది బిల్లులకు సంబంధించి.. రాజ్‌భవన్ ఇచ్చిన వివరాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సోమవారం సుప్రీంకోర్టుకు అందజేశారు. ఆ బిల్లులపై మరింత జాప్యమే.. కీలకమైన తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం బిల్లులను రాష్ట్రపతి పరిశీలన, ఆమోదం కోసం పంపాలన్న నిర్ణయం నేపథ్యంలో.. వీటి ఆమోదానికి మరింత జాప్యం జరిగే అవకాశం ఉంది. గతేడాది సెప్టెంబర్ 13 నుంచి ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఉమ్మడి నియామకాల బోర్డు బిల్లుకు ఆమోదముద్ర లభిస్తే.. యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. బోధన సిబ్బంది లేక యూనివర్సిటీల్లో విద్యార్థులు నష్టపోతున్నారని అధికారవర్గాలు అంటున్నాయి. ఆజామాబాద్ బిల్లుపై సందిగ్ధం 2022 సెప్టెంబర్ 13న రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఆమోదించిన ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంత (లీజుల నియంత్రణ, రద్దు) చట్ట సవరణ బిల్లు–2022పై కాస్త సందిగ్ధం నెలకొంది. ఆ బిల్లును అదే రోజున గవర్నర్ ఆమోదముద్ర కోసం రాజ్‌భవన్‌కు పంపినట్టు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుండగా.. ఇప్పటివరకు న్యాయశాఖ నుంచి రాజ్‌భవన్‌కు అందలేదని గవర్నర్ కార్యదర్శి తాజాగా పేర్కొనడం గమనార్హం. అయితే సుప్రీంకోర్టుకు సొలిసిటర్ జనరల్ సమర్పించిన వివరాల మేరకు.. ఆజామాబాద్ బిల్లుకు సంబంధించి న్యాయశాఖ నుంచి స్పందన రావాల్సి ఉందని గవర్నర్ కార్యాలయం పేర్కొంది. కాగా.. ఈ బిల్లుల వ్యవహారంలో తాజా పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు. గవర్నర్ ఆమోదించిన 3 బిల్లులివీ.. – తెలంగాణ మోటారు వాహన పన్నుల చట్ట సవరణ బిల్లు–2022 ఇంతకుముందు మోటార్ వాహనాల చట్టంలో వాహనాల ధరకు సంబంధించి సరైన నిర్వచనం లేకపోవడంతో పన్నుల విధింపులో సమస్యలు ఎదురయ్యాయి. దీనితో డిస్కౌంట్లతో సంబంధం లేకుండా ఎక్స్‌షో రూమ్ ధర ఆధారంగా పన్ను విధించేలా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. – తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లు–2023 ఆసిఫాబాద్, జనకాపూర్, గోదవెల్లి గ్రామాల కలయికతో కొత్తగా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఏర్పాటు.. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి నుంచి బోయపల్లి, తాళ్లనరసింహాపూరం గ్రామాలను తొలగింపు కోసం ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చింది. – ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లు–2023 ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలకు అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) ఇచ్చే అధికారాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కల్పించడంతోపాటు బీఎస్సీ(హోమ్‌సైన్స్) కోర్సు పేరును బీఎస్సీ (కమ్యూనిటీ సైన్స్)గా మార్చడానికి ఈ బిల్లును తెచ్చింది. రాష్ట్రపతి పరిశీలన కోసం నిలిచిపోయిన బిల్లులివీ.. – తెలంగాణ అటవీ విశ్వవిద్యాలయం బిల్లు–2022 హైదరాబాద్‌లోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థను విశ్వవిద్యాలయంగా నవీకరించి.. ప్రపంచ స్థాయి అటవీ విద్య, పరిశోధన అందించడానికి ఈ బిల్లును తీసుకొచ్చింది. – తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు–2022 తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేసి.. ఉన్నత విద్య, వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖల పరిపాలన నియంత్రణలో వర్సిటీల్లోని బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి ఈ బిల్లును తెచ్చింది. ఇంకా గవర్నర్ పరిశీలనలో ఉన్న బిల్లులివీ.. – తెలంగాణ ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు–2022 రాష్ట్రంలో కొత్తగా మరో ఐదు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. – తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లు–2022 మున్సిపల్ చైర్పర్సన్/ వైస్ చైర్పర్సన్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే కనీస కాలవ్యవధి ప్రస్తుతమున్న మూడేళ్ల నుంచి నాలుగేళ్లకు పెంపు.. మున్సిపాలిటీల్లో కో–ఆప్షన్ సభ్యుల సంఖ్య పెంపు, ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు, కేతనపల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణాపూర్‌గా మార్పు కోసం ఈ బిల్లును తెచ్చింది. – తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్) చట్ట సవరణ బిల్లు–2022 వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 61 నుంచి 65 ఏళ్లకు పొడిగించేందుకు ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోసం తిప్పి పంపినవి.. – తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు–2023 : పాలన వికేంద్రీకరణలో భాగంగా భద్రాచలంను మూడు గ్రామ పంచాయతీలుగా, సారపాకను రెండు గ్రామ పంచాయతీలుగా విభజించడానికి, రాజంపేటను కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసేందుకు ఈ బిల్లును తెచ్చింది. – ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంత (లీజుల నియంత్రణ, రద్దు) చట్ట సవరణ బిల్లు–2022 హైదరాబాద్ నగరంలో ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంతంలోని భూములను విక్రయించడానికి ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. -
రాజ్‌భవన్‌లో బిల్లుల పెండింగ్‌పై 'నేడు సుప్రీంలో విచారణ'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాల నేపథ్యంలో రాజ్‌భవన్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు బిల్లుల వ్యవహారంపై సోమవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. గవర్నర్ తమిళిసై బిల్లులను ఆమోదించకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఈ నెల 20న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్... కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు పంపడం తెలిసిందే. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండటంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు నోటీసులు జారీ చేయలేమని వ్యాఖ్యానించిన ధర్మాసనం... కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయమై అనుసరించాల్సిన వ్యూహంపై గవర్నర్ తమిళిసై ఢిల్లీలోని న్యాయ నిపుణులతో చర్చించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. సోమవారం జరిగే విచారణ సందర్భంగా ఈ వ్యవహారంలో కేంద్రం అభిప్రాయంతోపాటు రాజ్‌భవన్ వైఖరి సైతం వెల్లడి కానుంది. ఈ వ్యవహారంలో సుప్రీం ధర్మాసనం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశభావంతో ఉంది. 194 రోజులుగా పెండింగ్‌లో 7 బిల్లులు.. గతేడాది సెప్టెంబర్ 13న శాసనసభ, శాసన మండలి ఆమోదించిన మొత్తం 8 బిల్లులను ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. అందులో జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే గవర్నర్ ఆమోదం తెలిపారు. మిగతా ఏడు బిల్లులు 194 రోజులుగా రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ప్రైవేటు వర్సిటీల బిల్లు ముఖ్యమైనది. ఈ బిల్లుపై గవర్నర్ పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గతేడాది నవంబర్ 8న రాజ్‌భవన్‌కు వెళ్లి అనుమానాలను నివృత్తి చేశారు. అయినా బిల్లు పెండింగ్‌లోనే ఉండిపోయింది. మరోవైపు వర్సిటీల్లో బోధన, బోధనేతర విభాగాల కొలువుల భర్తీ జరగక ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ములుగు అటవీ కళాశాల పేరును తెలంగాణ అటవీ యూనివర్సిటీగా మార్పు ప్రతిపాదన బిల్లు, ప్రైవేటు వర్సిటీల చట్టం బిల్లు, పురపాలికల చట్ట సవరణ బిల్లు, ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లు, మోటార్ వెహికల్స్ ట్యాక్సేషన్ చట్ట సవరణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి 12న శాసనసభ, మండలి ఆమో దించిన ప్రొ.జయశంకర్ వ్యవసాయ వర్సిటీ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. -
పేపర్ లీక్‌పై స్పందించిన తమిళిసై.. న్యాయనిపుణుల సలహాతో..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం తెలంగాణలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే, పేపర్ లీక్ వ్యవహారంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం, రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన కాంగ్రెస్ నేతలు గవర్నర్ తమిళిసైని కలిశారు. అనంతరం, రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘టీఎస్పీఎస్సీలో పేపర్ లీక్ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. పేపర్ లీక్ ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశాం. మంత్రి కేటీఆర్ శాఖ ఉద్యోగులే పేపర్ లీక్‌లో కీలక పాత్ర పోషించారు. మంత్రి కేటీఆర్‌ను విచారించాలని గవర్నర్‌ను కోరాం. వ్యాపం కుంభకోణంలో సుప్రీంకోర్టు ఇచ్చిను తీర్పును కోడ్ చేస్తూ గవర్నర్‌కు అప్లికేషన్ ఇచ్చాం. ఇప్పుడున్న టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. అందర్నీ సస్పెండ్ చేసి పారదర్శక విచారణ చేస్తారని భావించాము. కానీ, ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదు. విచారణ పూర్తి అయ్యే వరకు టీఎస్పీఎస్సీని రద్దు చేసే విశేష అధికారం గవర్నర్‌కు ఉంది. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉంది. కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారు’ అని తెలిపారు. ఇక, కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు సందర్భంగా వారితో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. పేపర్ లీక్ వ్యవహారంలో ప్రతిపక్షాల ఫిర్యాదులపై న్యాయనిపుణుల సలహా తీసుకుంటానని అన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం చాలా బాధాకరం. రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఇదే సమయంలో సిరిసిల్లలో నిరుద్యోగి ఆత్మహత్యను కూడా గవర్నర్ ప్రస్తావించారు. ఇదిలా ఉండగా.. పేపర్ లీక్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసుపై ఇప్పటికే సిట్ స్పీడ్ పెంచింది. నిందితులను విచారిస్తోంది. అలాగే, పేపర్ లీక్ అంశంలో ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణలపై కూడా సిట్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌కు సిట్ నోటీసులు పంపింది. వారి వద్ద ఉన్న ఆధారాలను తమకు ఇవ్వాలని సిట్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిట్ వద్దకు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. -
హైదరాబాద్ : రాజ్‌భవన్‌లో ఉగాది ఉత్సవాలు (ఫోటోలు)
-
తెలంగాణ రాజ్‌భవన్ దగ్గర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజ్‌భవన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. రాజ్‌భవన్ ముట్టడికి విద్యార్థి సంఘాలు యత్నించాయి. యూనివర్శిటీ కామన్ రిక్రూట్మెంట్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్వీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: MLA Rajaiah: ఎమ్మెల్యే రాజయ్యపై తేనెటీగల దాడి -
రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత.. మేయర్ విజయలక్ష్మి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజ్‌భవన్ గేటు ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఫిర్యాదు చేసేందుకు గవర్నర్ తమిళిసైని కలవడానికి మేయర్ బృందం ప్రయత్నించగా, గవర్నర్ అపాయింట్మెంట్ లేదని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో రాజ్‌భవన్ వద్ద బైఠాయించి నిరసనకు దిగిన మహిళా నేతలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. రాజ్‌భవన్ గోడకు వినతి పత్రం అంటించారు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో మేయర్ విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. అపాయింట్మెంట్ అడిగినా గవర్నర్ స్పందించలేదని.. ఆమెను కలిసే వరకూ ఇక్కడే ఉంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తేల్చి చెప్పారు. బండి సంజయ్.. మహిళలను అవమానించారని మేయర్ మండిపడ్డారు. ‘‘మహిళల పట్ల సంజయ్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు.. సంజయ్‌ను నోటిని ఫినాయిల్‌తో కడగాలి. సంజయ్ వ్యాఖ్యలు సమాజం తలదించుకునేలా ఉన్నాయి. బేషరతుగా మహిళలకు సంజయ్ క్షమాపణలు చెప్పాలని మేయర్ విజయలక్ష్మి డిమాండ్ చేశారు. చదవండి: కవితపై అనుచిత వ్యాఖ్యలు.. బండి సంజయ్‌పై కేసు నమోదు.. -
నేను తెలంగాణ బిడ్డనే.. వెలివేయకండి: పూనమ్ కౌర్ ఎమోషనల్
హీరోయిన్ పూనమ్ కౌర్.. సినిమాల కంటే వివాదాలతో ఎక్కువ ఫేమస్ అయింది. మాయాజాలం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్, ఆమె 3 దేవ్, శ్రీనివాస కళ్యాణం, నెక్స్ట్ ఏంటి తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమా విషయాలతో పాటు రాజకీయ అంశాలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తరచూ ట్రోలింగ్‌కు గురవుతుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ స్టేజీపై కన్నీళ్లు పెట్టుకుంది. తనను తెలంగాణ నుంచి వేరు చేస్తున్నారంటూ ఎమోషనల్ అయింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాజ్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పూనమ్ కౌర్ పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన మతం ద్వారా తనను వేరు చేసి చూస్తున్నారంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ‘నేను తెలంగాణలోనే పుట్టాను. ఇక్కడే పెరిగాను. కానీ నేను పంజాబీని అని, సిక్కు అని మతం పేరుతో దూరం చేస్తున్నారు. నన్ను తెలంగాణ నుంచి దూరం చేయకండి. మతం పేరుతో నన్ను వెలివేయకండి. నేను తెలంగాణ బిడ్డనే’అంటూ పూనమ్ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నేను తెలంగాణ బిడ్డనే.. పూనమ్ కౌర్ కంటతడి..#Poonamkaur#telangana #RajBhavan #poonamKaurCryingpic.twitter.com/gwagW0ipNE — yousaytv (@yousaytv) March 7, 2023 -
TS: గవర్నర్ వైఖరి రాజ్యాంగ విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై ఎలాంటి స్పందనా తెలపకుండా గవర్నర్ పెండింగ్‌లో పెట్టారని.. ఈ వైఖరి రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు మొత్తం పది బిల్లులపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తెలపకుండా రాజ్‌భవన్‌లో ఆపేశారని.. దీనికి సంబంధించి తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. గవర్నర్ తీరు వల్ల సదరు బిల్లులకు సంబంధించిన ప్రయోజనాలు దెబ్బతింటాయని పేర్కొంది. ఈ అంశంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, పార్లమెంటులో జరిగిన చర్చలను కూడా పిటిషన్లో ప్రస్తావించింది. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖలను చేర్చింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌లోని వివరాలివీ.. ‘‘శాసనసభ ఆమోదించిన పలు బిల్లులపై తెలంగాణ గవర్నర్ ఎలాంటి నిర్ణయం చెప్పడం లేదు. దీనివల్ల ఏర్పడిన రాజ్యాంగ ప్రతిష్టంభన దృష్ట్యా ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నాం. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీ ఉభయ సభలు బిల్లులను ఆమోదించి గవర్నర్‌కు పంపినప్పుడు.. సమ్మతిస్తున్నట్టు లేదా ఆమోదం నిలిపివేస్తున్నట్టు చెప్పాలి. లేదా రాష్ట్రపతి పరిశీలన నిమిత్తం రిజర్వు చేసినట్టు పేర్కొనాలి. బిల్లు వచ్చినపుడు వీలైనంత త్వరగా తిప్పి పంపవచ్చు. ద్రవ్య బిల్లు కానట్లయితే నిర్దిష్ట నిబంధనలు/అంశాలను పునఃపరిశీలించాలని కోరవచ్చు. అప్పుడు దానిపై ఉభయ సభలు పునః పరిశీలన జరిపి తగిన సవరణలతో తిరిగి గవర్నర్‌కు పంపుతాయి. వాస్తవానికి ఆర్టికల్ 163 ప్రకారం ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రి మండలి సహాయం, సలహాతో మాత్రమే గవర్నర్ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలు లేదు. షంషేర్‌సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. భవిష్యత్తులో మంత్రి మండలి సలహాలకు వ్యతిరేకంగా గవర్నర్లు రాష్ట్రంలో సమాంతర పరిపాలనకు ప్రయత్నించవచ్చని రాజ్యాంగ కర్తలు ఊహించలేదని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. పాత ఆర్టికల్ 175పై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి టి.టి.కృష్ణమాచారి చర్చిస్తూ.. ఆర్టికల్ 200 గవర్నర్‌కు ఎలాంటి స్వతంత్ర విచక్షణాధికారాన్ని అందించలేదని స్పష్టం చేశారు. ఏదైనా అధికారం, విధిని అమలు చేయడం కోసం రాష్ట్రపతి, గవర్నర్ సంతృప్తి చెందాలని రాజ్యాంగం కోరుతుందని షంషేర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. కానీ ఆర్టికల్ 123, 213, 311(2), 317, 352(1), 356, 360ల ప్రకారం రాజ్యాంగం పేర్కొన్న ఈ సంతృప్తి.. రాష్ట్రపతి లేదా గవర్నర్ల వ్యక్తిగత సంతృప్తి కాదు. అది ప్రభుత్వంలోని మంత్రిమండలి వ్యవస్థ సంతృప్తి అనేది రాజ్యాంగం ఉద్దేశమని కూడా స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని పలు నిబంధనల ప్రకారం.. గవర్నర్ కొన్ని విధులు నిర్వర్తించడానికి అధికారమున్నా, ఆర్టికల్ 163 ప్రకారం మంత్రి మండలి సలహాలనే పాటించాల్సి ఉంటుంది..’’ అని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్లో స్పష్టం చేసింది. కారణమేదీ చెప్పకుండా ఆపడమేంటి? 12–9–2022 తేదీ నుంచి 13–2–2023 తేదీ వరకూ పంపిన బిల్లులపై గవర్నర్ ఆమోదం, తిరస్కరణ ఏదీ చెప్పలేదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది. సహేతుకమైన కారణాలు చూపకుండా బిల్లులను పెండింగ్ పెట్టడం సరికాదని పేర్కొంది. ఆయా బిల్లులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రులు నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి తగిన వివరణలు ఇచ్చారని.. ఆ సమయంలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని గుర్తు చేసింది. 13–9–2022న పంపిన ఏడు బిల్లులను.. ఈ ఏడాది ఫిబ్రవరి 10, 11, 12 తేదీల్లో పంపిన ఒక్కో బిల్లు కలిపి.. మొత్తం పది బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్నట్టు తెలిపింది. వాటిపై గవర్నర్ ఏదో ఒక చర్య తీసుకునేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరింది. పెండింగ్‌లో ఉన్న బిల్లులివీ.. ► ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టెర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్) సవరణ బిల్లు, 2022 ► తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు, 2022 ► తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుషన్) సవరణ బిల్లు, 2022 ► యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు, 2022 ► తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, 2022 ► తెలంగాణ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ సవరణ బిల్లు, 2022 ► తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ (ఎస్టాబ్లిష్మెంట్, రెగ్యులేషన్) సవరణ బిల్లు, 2022 ► ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లు, 2023 ► తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, 2023 ► తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ సవరణ బిల్లు, 2023 -
ఆర్థిక విద్యలో శిక్షణ అవసరం
పంజగుట్ట: కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనం బలంగా ఉన్నామంటే మన పూర్వీకులదగ్గర నుండి మనం నేర్చుకున్న, సంపాదించిన దాంట్లో కొంత దాచుకునే అలవాటు వల్లే అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ అన్నారు. ఆదివారం రాజ్‌భవన్ సంస్కృతి హాల్లో హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ సిబ్బందికి ‘ఫైనాన్షియల్ లిట్రసీ ట్రైనింగ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ .. ఆర్థిక మోసగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు ఆర్ధిక విద్యలో శిక్షణ ఎంతో అవసరమన్నారు. కరోనా సమయంలో రాజ్‌భవన్ మహిళలకు పలు రంగాల్లో శిక్షణ ఇప్పించామని దీంతో వారు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు నేను ఏదైనా సాధించవచ్చు అనే ఆత్మవిశ్వాసం కూడా పెంపొందించుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్డీఎఫ్సీ ఏఎమ్‌సీ తెలుగు రాష్ట్రాల రీజనల్ హెడ్ సిద్దార్ధ చటర్జీ, వైస్ ప్రసిడెంట్, సౌత్ జోనల్ హెడ్ జి.శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్, ట్రైనర్ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
పూల మాలతో నిమ్స్‌కు గవర్నర్ తమిళిసై.. రాజ్‌భవన్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌కు చెందిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రీతి ఆరోగ్యం విషమంగా మారింది. దీంతో, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా, గవర్నర్ తమిళిసై నిమ్స్ పర్యటనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోంది. నిమ్స్‌కు గవర్నర్ తమిళిసై వచ్చినప్పుడు వాహనంలో పూలమాల ఉందని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే, దీనిపై గవర్నర్ కార్యాలయం స్పందించి వివరణ ఇచ్చింది. గవర్నర్ తమిళిసై ఇతర ప్రాంతాల నుంచి రాజ్‌భవన్‌కు వచ్చిన ప్రతీసారి ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రీతి త్వరగా కోలుకోవాలని ఆలయంలో ప్రార్థించారు. ఆలయం నుంచి గవర్నర్ తమిళిసై నేరుగా నిమ్స్‌కు వచ్చారు. గవర్నర్ నిమ్స్ పర్యటనలో ఎలాంటి దురుద్దేశం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. -
విజయవాడ: రాజ్‌భవన్‌కు సీఎం వైఎస్ జగన్ దంపతులు
-
విజయవాడ : రాజ్ భవన్ కు సీఎం వైఎస్ జగన్
-
నూతన గవర్నర్ అబ్ధుల్ నజీర్‌ను కలిసిన సీఎం జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: నూతన గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ దంపతులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు రాజ్‌భవన్‌లో గురువారం మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. రేపు(శుక్రవారం) ఏపీ గవర్నర్‌గా అబ్ధుల్ నజీర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా, నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌కు సీఎం జగన్ సాదర స్వాగతం పలికారు. జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి 8.15 గంటలకు ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. చదవండి: పట్టాభి ఎపిసోడ్.. నటన ఫెయిలైందా?.. ఇంతకీ ఏం జరిగింది?