Live Updates..
తెలంగాణ శాసనసభ వచ్చే గురువారానికి వాయిదా
రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం, ఉచిత బస్సు ప్రయాణం పథకాలు ప్రారంభిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ
ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయని ఇద్దరు మంత్రులు
- ప్రమాణం చేయని ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి
- వారిద్దరూ ఎంపీలుగానే ఉన్నారు.
- ఇంకా ఎంపీ పదవులకు రాజీనామా చేయని కారణంగా నేడు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు.
రాజ్‌భవన్‌కు బీజేపీ ఎమ్మెల్యేలు..
- బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.
- ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఎంపికపై గవర్నర్‌కు ఫిర్యాదు.
- గవర్నర్ తమిళిసై లేకపోవడంతో రాజ్‌భవన్ సెక్రటరీకి వినతి పత్రం అందజేత
- బీజేపీ ఎమ్మెల్యేలు సీనియర్లు కాదని మజ్లిస్ ఎమ్మెల్యేను కావాలనే ప్రొటెం స్పీకర్ చేశారని ఫిర్యాదు.
- శాసనసభ సంప్రదాయాలను కాలరాస్తున్నారని ఆగ్రహం.
నేడు రెండు పథకాలకు శ్రీకారం..
- మధ్యాహ్నం ఒంటి గంటకు అసెంబ్లీ ఆవరణలోని ఒకటో గేటు వద్ద రెండు పథకాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం
- పేదలందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల ఉచిత వైద్య సదుపాయం చేయూత.
కొలువుదీరిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలకు శ్రీకారం.
— Telangana Congress (@INCTelangana) December 9, 2023
నేడే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం.
👉 ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం.
👉 రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలు.
ప్రగతి పథం.. సకల జనహితం.. మన ప్రజా ప్రభుత్వం!… pic.twitter.com/stqOjkF10T
అందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాం: కిషన్‌రెడ్డి
- శాసనసభ గౌరవాన్ని కాలరాసేలా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది.
- సీనియర్ సభ్యులు ఉన్నా ఎంఐఎంతో ఒప్పందం మేరకు అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించింది.
- సభా నియమాలను తుంగలో తొక్కడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది
- అందుకే ఇవాళ అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించాం
- ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఎంఐఎం ఒకటేనన్న కాంగ్రెస్ అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎలా నియమించింది.
- సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించి ఆయన ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎన్నిక జరగాలని డిమాండ్ చేస్తున్నాం
- ఇదే విషయాన్ని గవర్నర్‌ను కలిసి కోరుతాం
గాంధీభవన్‌లో సీఎం రేవంత్ కామెంట్స్..
- భుజాలు కాయలు కాసేలాగా కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు
- కార్యకర్తల వల్లే మేం సీట్లలో కూర్చున్నాం
- ఎన్ని రాజకీయ ప్రకంపనలు ఎదురైనా ఉక్కు సంకల్పంతో సోనియా తెలంగాణ ఇచ్చారు
- తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో మనం చూడలేదు
- తెలంగాణ తల్లి సోనియా లాగే ఉంటుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు
- లక్షలాది తెలంగాణ బిడ్డలకు సోనియానే తల్లి
- డిసెంబర్ ఏడో తేదీన సోనియా ఎల్బీ స్టేడియంలోకి ఎంటర్ అయ్యే క్షణాలని నేను ఎప్పటికీ మర్చిపోలేను
- డిసెంబర్ 9, 2017న గాంధీ భవన్‌లో అడుగుపెట్టాను
- డిసెంబర్ 9, 2023న ప్రభుత్వం ఏర్పాటు అయింది
- పాలకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటాను
- పది సంవత్సరాలు కార్యకర్తలు వేల కేసులు ఎదుర్కున్నారు
- కార్యకర్తలకు మాట ఇస్తున్నాను. ఈ ప్రభుత్వం కార్యకర్తలది
- సోనియా గాంధీ 100 సంవత్సరాలు సంతోషంగా జీవించాలి
- శాసనసభలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజల ఆశీర్వాదం ఇవ్వాలి
►సభకు హాజరైన 109 మంది ఎమ్మెల్యేలు.
►అనారోగ్యం కారణంగా సభకు హాజరు కాని కేసీఆర్, కేటీఆర్
►సభకు బీజేపీ సభ్యులు ఎనిమిది మంది గైర్హాజరు
►మొదట రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు ప్రమాణ స్వీకారం..
►ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ.
►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
► తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన 51 మంది ఎమ్మెల్యేలు
►అసెంబ్లీ సమావేశాలకు బాయ్‌కాట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
►కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం
►అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.
►రేవంత్‌కు స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, అసెంబ్లీ సెక్రటరీ
►అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో రేవంత్ ప్రత్యేక పూజలు.
►అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
►భట్టి తో పాటు అసెంబ్లీకి వచ్చిన పొంగులేటి, తుమ్మల
గన్‌పార్క్ వద్ద కోలాహలం
- గన్‌పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు
- ఎదురుపడిన రెండు పార్టీల నేతలు
- గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన బీజేపీ, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
అసెంబ్లీకి చేరుకుంటున్న మంత్రులు
- కొత్త మంత్రులు అసెంబ్లీకి చేరుకుంటున్నారు.
- అసెంబ్లీకి చేరుకున్న మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ
గాంధీ భవన్‌లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు..
- గాంధీభవన్‌లో సోనియ బర్త్ డే సెలబ్రేషన్స్..
- 78 కిలోల కేట్ కట్ చేసి శుభాకాంక్షలు చెపుకున్న కాంగ్రెస్ నేతలు
- సోనియా పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వీహెచ్, మాణిక్‌రావ్ ఠాక్రే ఇతర నేతలు
- డిప్యూటీ సీఎం భట్టి ,మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,తుమ్మల, సీతక్క, కొండా సురేఖ ,పొన్నం ప్రభాకర్, హాజరైన పార్టీ నేతలు.
- భట్టి కామెంట్స్..
- గాంధీభవన్ ఆశయాలను నెరవేరుస్తాం
- సోనియా గాంధీ కలలు కన్న సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తాం.
- ప్రజలు మెచ్చేలా పాలన ఉంటుంది
- రాష్ట్ర సంపద ప్రజలకు పంచుతాం.
తెలంగాణభవన్‌లో ముగిసిన బీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం
- బీఆర్‌ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలు
- బస్సులో అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
- తెలంగాణభవన్ నుంచి గన్‌పార్క్‌కు బయలుదేరిన ఎమ్మెల్యేలు
- గన్‌పార్క్ వద్ద నివాళులు అర్పించనున్నారు
- అసెంబ్లీకి హాజరుకానున్న ఎమ్మెల్యేలు
- కేసీఆర్ పేరును ప్రతిపాదించిన పోచారం..
- బలపరచిన తలసాని, కడియం శ్రీహరి
- శాసనభాపక్ష మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యత కేసీఆర్‌కు అప్పగింత.
బీజేపీ నేతల కీలక నిర్ణయం..
- అసెంబ్లీ బహిష్కరించాలని బీజేపీ నిర్ణయం
- ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్
- ప్రమాణం చేయవద్దని డిసైడ్ అయిన కమలం పార్టీ
- అక్బరుద్దీన్ ఓవైసీ ముందు ప్రమాణం చేసేందుకు ససేమీరా అన్న బీజేపీ
- అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోనున్న ఎమ్మెల్యేలు
- ఈరోజు ఉదయం 10:30 గంటకు మీడియాతో మాట్లాడనున్న కిషన్ రెడ్డి
►అసెంబ్లీ ప్రారంభానికి ముందే మంత్రులకు శాఖల కేటాయింపు
►శాఖల కేటాయింపుపై ఇప్పటికే కేసీ వేణుగోపాల్‌తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి.
►ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ
►అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై
#WATCH | AIMIM MLA Akbaruddin Owaisi takes oath as Pro-tem Speaker of Telangana Legislative Assembly, in Raj Bhawan, Hyderabad pic.twitter.com/PpMoZhOvjy
— ANI (@ANI) December 9, 2023
►ప్రొటెం స్పీకర్ ప్రమాణానికి బీజేపీ దూరం
►బీఆర్‌ఎస్ నుంచి హాజరైన పోచారం శ్రీనివాస్, మాజీ మంత్రి హరీశ్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి.
►రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం
►కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం, మంత్రులు
►తెలంగాణ మూడో శాసన సభకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ
►చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్న అక్బరుద్దీన్
►రాజ్‌భవన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.
►కాసేపట్లో రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం.
►అక్బరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
►నేడు ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరం.
►తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం ఉదయం 11 గంటలకు తొలిసారిగా కొలువు దీరనుంది.
►తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు.
►కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం తదితరాల కోసం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగనున్నాయి.
తొలిసారిగా అసెంబ్లీకి 51 మంది
►అన్ని పార్టీల తరఫున కలుపుకుని మొత్తం 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, కరీంనగర్ జిల్లా నుంచి 8 మంది తొలిసారిగా ఎన్నికైన వారున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు తొలిసారి అడు గు పెడుతున్నారు. 51 మందిలో 18 మంది క్రియాశీల రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తున్న వారే.
రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం
►తొలిరోజు సమావేశంలో కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
►ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏఐఎంఐఎం సీనియర్ శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నామినేట్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు.
►ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 8.30కు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
►సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
►ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ప్రొటెమ్ స్పీకర్ అధ్యక్షతన తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ప్రారంభమవుతుంది.
►తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు.
►ఆ తర్వాత తెలుగు అక్షరమాలలోని అక్షర క్రమంలో ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
బీఆర్‌ఎస్‌కు విపక్ష హోదా
►శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులకు గాను తెలంగాణ మూడో శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేల బలం ఉంది. బీఆర్‌ఎస్ 39, బీజేపీ 8, ఏఐఎంఐఎంకు ఏడుగురు సభ్యుల బలం కలిగి ఉన్నాయి. అధికార కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్‌ఎస్‌కు విపక్ష హోదా దక్కే అవకాశముంది.
►బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది.
►ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్‌ఎస్ తరపున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణభవన్‌లో భేటీ అవుతున్నారు.
►బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేల భేటీకి అధ్యక్షత వహిస్తారు.
►కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ఈ భేటీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆమోదిస్తారు.
నేడు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్
►శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత స్పీకర్ ఎన్నిక కోసం శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయన శనివారం సాయంత్రం సీఎం రేవంత్, మంత్రివర్గం సమక్షంలో నామినేషన్ సమర్పిస్తారని తెలిసింది.
►కాగా రెండో రోజు ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధ్యతల స్వీకరణ కార్యక్రమం, ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఈ నెల 11న సోమవారం జరిగే మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాయిదా పడే సభ తిరిగి 12వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభమవుతుంది. నాలుగో రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment