Tamilisai Soundarrajan
-
తెలంగాణ హైకోర్టు.. ఇద్దరు ఎమ్మెల్సీల నియామకం కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్ర గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకాన్ని తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది. ఈ సందర్భంగా కోదండరామ్, అలీఖాన్‌ల నియామకాన్ని హైకోర్టు కొట్టివేసింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణ.. సిఫార్సుల తిరస్కరణలో గవర్నర్ తమిళిసై తీరును హైకోర్టు తప్పు పట్టింది. వీరి ఎన్నికను పున:పరిశీలించాలని గవర్నర్‌ను కోర్టు ఆదేశించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాను మరోసారి కేబినెట్ ముందు ఉంచి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇదే సమయంలో ఇద్దరు ఎమ్మెల్సీలను నియమిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను కోర్టు కొట్టివేసింది. అలాగే, మంత్రి మండలి నిర్ణయాలకు గవర్నర్ కట్టుబడి ఉండాల్సిదేనని హైకోర్టు సూచించింది. ఇక, మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకాలను చేపట్టాలని కోర్టు తెలిపింది. ఈ సందర్భంలో ఆర్టికల్ 171 ప్రకారం కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేదని హైకోర్టు దృష్టికి పిటిషనర్ తరుపు న్యాయవాదులు తీసుకెళ్లారు. -
మన సంస్కృతికి చిహ్నం చీరకట్టు
ఖైరతాబాద్ (హైదరాబాద్): చీరకట్టు అంటే భారతదేశ సంప్రదాయం, సంస్కృతికి చిహ్నం అని...చీర అంటే సంతోషం, గౌరవానికి చిరునామా అని గవర్నర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ‘శారీ వాకథాన్’లో గవర్నర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సంస్కృతి మహోత్సవాలు– 2024 వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం పీపుల్స్ ప్లాజా వేదికగా నిర్వహించిన శారీ వాకథాన్‌లో వందలాది మంది మహిళలు, విద్యార్థినులు చీరలు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తాను విదేశాల్లో చదువుకునే సమయంలో ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండా చీర ఎలా కడతారంటూ తన స్నేహితులు ఆశ్చర్యపోయేవారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, 75 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభలో పాసైన సందర్భంగా ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 33 శాతం రిజర్వేషన్ ఉపయోగించుకుని అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్న మహిళలకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు. అనంతరం బెలూన్స్ ఎగురవేసి శారీ వాకథాన్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దర్శన జర్దోష్, పద్మశ్రీ ఆనంద శంకర్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషనర్‌తో పాటు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. -
లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నాం: వికాస్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు సీఈఓ వికాస్‌రాజ్. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటించనున్నట్టు స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవడం మన అందరి బాధ్యత అని కామెంట్స్ చేశారు. కాగా, ఈరోజు హైదరాబాద్‌లోని జేఎన్టీయూలో నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఈవో వికాస్‌రాజ్, రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారధి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్‌రాస్ విచ్చేశారు. ఈ సందర్భంగా వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతున్నాం. ఫిబ్రవరి ఎనిమిదో తేదీన ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తాం. జనరల్ ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిపాం. మొదటిసారి హోం ఓటింగ్ విజయవంతంగా నిర్వహించాం. ఓటు హక్కును వినియోగించుకోవడం మనందరి బాధ్యత. తొమ్మిది లక్షల ఓటర్స్‌ను కొత్తగా నమోదు చేసినట్టు తెలిపారు. -
కొత్త టీఎస్పీఎస్సీకి లైన్‌క్లియర్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు కొత్తగా చైర్మన్, సభ్యుల నియామకానికి మార్గం సుగమమైంది. సర్కారీ కొలువుల భర్తీ కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులకు ఉపశమనం లభించనుంది. దాదాపు నెలరోజులుగా పెండింగ్‌లో ఉన్న చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, సభ్యుల రాజీనామాలకు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ బుధవారం ఆమోదం తెలిపారు. టీఎస్పీఎస్సీలో చైర్మన్‌తో పాటు 10 సభ్యులుంటారు. కానీ గత ప్రభుత్వం చైర్మన్, ఆరుగురు సభ్యులను మాత్రమే నియమించింది. వీరిలో ఒక సభ్యుడు పదవీ విరమణ పొందగా..ఐదుగురు కొనసాగుతూ వచ్చారు. అయితే ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో చైర్మన్ బి.జనార్దన్ రెడ్డి, సభ్యులు ఆర్.సత్యనారాయణ, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, కె.రవీందర్ రెడ్డి రాజీనామాలు సమర్పించారు. మిగతా ఇద్దరు సభ్యులు కోట్ల అరుణకుమారి, సుమిత్రా ఆనంద్ తనోబా రాజీనామా చేయలేదు. కొత్తగా కమిషన్‌ను ఏర్పాటు చేయాలంటే అప్పటివరకు ఉన్న కమిషన్ పదవీ కాలం పూర్తి కావడమో లేక రాజీనామాలు చేస్తే వాటిని ఆమోదించడమో జరగాలి. కానీ చైర్మన్, ముగ్గురు సభ్యులు సమర్పించిన రాజీనామా లేఖలపై గవర్నర్ వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంతకాలం పెండింగ్‌లో పెట్టారు. తాజాగా ఆమోదం లభించడంతో కొత్త కమిషన్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభు త్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. రాజీనామాలు చేసిన చైర్మన్, ముగ్గురు సభ్యుల స్థానంలో కొత్తవారిని నియమించడంతో పాటు ఎప్పట్నుంచో ఖాళీ గా ఉన్న 4 స్థానాలు, అలాగే పదవీ విరమణ చేసిన సభ్యుడి స్థానాన్ని ప్రభుత్వం భర్తీ చేసే అవకా శం ఉందని తెలుస్తోంది. తద్వారా టీఎస్పీఎస్సీ కార్యకలాపాలు పునఃప్రారంభించేందుకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అయితే రాజీనామాలు సమర్పించని ఇద్దరు సభ్యుల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తికరంగా మారింది. పరీక్షలు, ఫలితాలు పెండింగ్‌లోనే.. వాస్తవానికి రాజీనామాలను గవర్నర్ ఆమోదించిన మరుక్షణమే టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, సభ్యులను నియమిస్తామని డిసెంబర్ 27న సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు చేపడ్తామని, నిరుద్యోగులెవరూ ఆందోళనకు గురికావద్దని అన్నారు. తాజాగా మార్గం సుగమం అయిన నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లోనే నియామక ప్రక్రియ చేపట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ పరిధిలో దాదాపుగా అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. కొత్తగా ఉద్యోగ ప్రకటనల జారీ, ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాల ప్రకటన, ఇదివరకు జారీ చేసిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షల నిర్వహణ తదితర అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రధానంగా గ్రూప్–1 మెయిన్స్, గ్రూప్–2, గ్రూప్–3 పరీక్షలతో పాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ తదితర ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఉద్యోగాలకు ప్రకటనలు జారీ అయ్యి ఏడాది గడుస్తోంది. పలుమార్లు పరీక్ష తేదీలు వెల్లడించి చివరి నిమిషంలో వాయిదా వేయడంతో అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. మరోవైపు నిర్వహించిన పరీక్షలకు సంబంధించి ఫలితాలను వెల్లడించలేదు. వివిధ కేటగిరీల్లో దాదాపు 20 వేలకు పైగా ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీల భర్తీకి పరీక్షలు నిర్వహించినా ప్రక్రియ ముందుకు సాగలేదు. అలాగే కొత్తగా ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వేయడంలేదు. ఇవన్నీ ముందుకు సాగాలంటే చైర్మన్, ఇతర సభ్యుల నియామకం అత్యంత అవసరం. కాగా టీఎస్పీఎస్సీ నియామకాలకు సంబంధించి సీఎస్‌కు సీఎం రేవంత్‌రెడ్డి పలు సూచనలు చేసినట్లు సమాచారం. ముమ్మర కసరత్తు టీఎస్పీఎస్సీ సమూల ప్రక్షాళనలో భాగంగా యూపీఎస్సీ, ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల పనితీరును అధ్యయనం చేయాలని రేవంత్ రెడ్డి గత నెలలో అధికారులను ఆదేశించారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన.. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితో కలిసి స్వయంగా యూపీఎస్సీ కార్యాలయాన్ని సందర్శించారు. సీఎం ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాల కోసం మార్గదర్శకాలను ఇప్పటికే అధికారులు సిద్ధం చేసినట్టు తెలిసింది. సిట్ దర్యాప్తుపై ప్రభావం పడకుండా జాగ్రత్తగా నిర్ణయం: రాజ్‌భవన్ టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించడంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారని వచ్చిన విమర్శలను రాజ్‌భవన్ తోసిపుచ్చింది. రాజీనామాల ఆమోదంలో ఎలాంటి జాప్యం జరగలేదని పేర్కొంది. చట్టపరమైన విధానాలకు లోబడి అత్యంత శ్రద్ధతో ఒక్కరోజులోనే రాజీనామాల ఆమోద ప్రక్రియను గవర్నర్ పూర్తి చేశారని తెలిపింది. గవర్నర్ బుధవారం రాజీనామాలను ఆమోదించిన వెంటనే ఈ మేరకు వివరణ ఇచ్చింది. నిబంధనల ప్రకారం రాజీనామాలను గవర్నర్ క్షుణ్ణంగా పరిశీలించారని, ఆ తర్వాత తన రిమార్కులు, అడ్వకేట్ జనరల్ న్యాయ సలహాను జత చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఫైల్ పంపించారని తెలిపింది. ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణంపై సిట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తు.. గవర్నర్ ఓ నిర్ణయం తీసుకునే ప్రక్రియలో కీలక పాత్ర పోషించిందని వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం రాజీనామాలను సమీక్షించడంతో పాటు అడ్వకేట్ జనరల్ నుంచి న్యాయసలహా తీసుకుని తిరిగి ఫైల్‌ను ఈ నెల 9న సీఎం ద్వారా గవర్నర్‌కు పంపించిందని వెల్లడించింది. సిట్ దర్యాప్తుపై ఎలాంటి ప్రభావానికి తావు లేకుండా చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నిరుద్యోగ యువత ప్రయోజనాలను పరిరక్షించడంలో భాగంగా.. ఈ ప్రక్రియలో రాజ్‌భవన్ అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుందని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధమైన విధులు, న్యాయ సూత్రాలు, పారదర్శకత, జవాబుదారీతనం పరిరక్షణకు గవర్నర్ కట్టుబడి ఉన్నారని తెలిపింది. -
నగరంలో రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్‌బాబు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. శాలువాలతో రాష్ట్రపతిని సత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వచ్చి న రాష్ట్రపతి ముర్ముకు సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గ సహచరులు భట్టి విక్రమార్క, సీతక్క, శ్రీధర్‌బాబును పరిచయం చేశారు. రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, త్రివిధ దళాల అధికారులు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. స్వాగత కార్యక్రమం అనంతరం ప్రత్యేక వాహనంలో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ద్రౌపదీ ముర్ము వెళ్లారు. ఈనెల 23న రాష్ట్రపతి ముర్ము తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రపతి శీతాకాల విడిది నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు రోజులపాటు వివిధ కార్యక్రమాల్లో .. ♦ రాష్ట్రపతి ముర్ము మంగళవారం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ♦ పోచంపల్లిలో టెక్స్టైల్స్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హ్యాండ్లూమ్, స్పిన్నింగ్ యూనిట్లను ఈనెల 20న సందర్శిస్తారు. నేతకార్మికులతో మాట్లాడతారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్‌లో ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. ♦ డిసెంబర్ 21న బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పలు పనులను ఆమె ప్రారంభిస్తారు. ♦ డిసెంబర్ 22న బొల్లారం రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రంలోని ప్రముఖులు, విద్యావేత్తలు, ఇతర ముఖ్యులకు ఎట్‌హోం విందు ఇస్తారు. ♦డిసెంబర్ 23న రాజస్థాన్‌లోని పోక్రాన్‌లో నిర్వహిస్తున్న ఫైరింగ్ కార్యక్రమాలను లైవ్ ద్వారా వీక్షిస్తారు. అనంత రం రాష్ట్రపతి ముర్ము ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. -
TS: గవర్నర్ ప్రసంగంలో అసలు విషయం ఇదేనా?
తెలంగాణ గవర్నర్ తమిళసై శాసనసభలో చేసిన ప్రసంగం పరిశీలిస్తే కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత భయం, భయంగా నడక ప్రారంభించిందన్నది అర్ధం అవుతుంది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి గొప్ప అవకాశం వచ్చినప్పటికీ, మున్ముందు ఎదుర్కోబోయే కష్టాలు కూడా అంతర్లీనంగా ఈ ప్రసంగంలో కనిపిస్తాయి. ఆ విషయాలు నేరుగా గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించకపోయినా, ఉపన్యాస సరళిని గమనిస్తే ఆ భావం కలుగుతుంది. ఇంతకాలంగా అధికారంలో ఉన్న కేసీఆర్ పాలనను నిర్భంధ పాలనగా, నియంతృత్వ పాలనగా సహజంగానే విమర్శిస్తారు. దానికి కొంతమేర కేసీఆర్ అవకాశం ఇచ్చారని చెప్పకతప్పదు. అలాగే ఆయన చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్న విషయంలో విచారణ కొనసాగుతుందని గవర్నర్ వెల్లడించారు. ఇది బీఆర్ఎస్కు ఎంబరాస్మెంట్ కలిగించే అంశమే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చడం కష్టం అయినప్పుడు ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ కు ఇబ్బందిగా ఉండే విషయాలను తెరపైకి తెచ్చే అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీలు అలా వ్యవహరించడం సహజమే. ప్రజలు తమ కష్టాలు చెప్పుకోవడానికి వీలుగా ప్రజావాణి కార్యక్రమం ప్రారంభించామని ఈ స్పీచ్‌లో తెలిపారు. ప్రస్తుత వాతావరణం గమనిస్తే వేల సంఖ్యలో ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చి తమ వినతులు అందిస్తున్నారు. వాటన్నిటిని పరిష్కరించడం అంత తేలికకాదు. వాటిలో ఎక్కువగా వ్యక్తిగత సమస్యలే ఉండవచ్చు. వాటిని ఏమి చేయాలన్నదానిపై ఒక విధానం తీసుకోవలసి ఉంటుంది. లేకుంటే ఆ వినతులు ఇచ్చినవారిలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంటుంది. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని హామీ ఇచ్చామని, నిర్భంధాలు, నియంతృత్వ ధోరణులు ఉండవని ప్రభుత్వం భరోసా ఇవ్వడం బాగానే ఉంది. కాకపోతే ఇందిరమ్మ ఎమర్జెన్సీ తెచ్చి దేశాన్ని నియంతగానే పాలించారన్న సంగతి గుర్తుకు వస్తుంటుంది. అయినా ప్రజలకు పూర్థి స్వేచ్ఛ ఇస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించడం ముదావహమని చెప్పాలి.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వం చేపట్టిన 48 గంటలలో రెండు హామీలను నెరవేర్చడం రేవంత్ రెడ్డి చిత్తశుద్దికి నిదర్శనమని తెలిపారు. అంతవరకు ఓకే. అవి రెండు తేలికగా అయ్యేవి కనుక చేశారు. అందులో కూడా ఇబ్బందులు లేకపోలేదు. ఆర్టీసీ బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని నెరవేర్చింది వాస్తవమే. కాని దీనివల్ల ఆర్టీసీకి కలిగే నష్టాన్ని ఎలా భర్తీ చేసేది కూడా ప్రభుత్వం చెప్పగలిగి ఉంటే బాగుండేది. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఈ నష్టం మేరకు మొత్తాన్ని ఆర్టిసికి చెల్లిస్తుందా?లేక దానిని మరింత నష్టాలలోకి నెడుతుందా అన్నది చూడాలి. ఈ హామీ అమలు వల్ల వేలాది మంది ఆటోవాలాలు, క్యాబ్ ల వారు ఉపాధి కోల్పోతున్నారన్న విషయం బాగా ప్రచారం అవుతోంది. దీనిని ఎలా పరిష్కరిస్తారో ఆలోచించాలి. మరో హామీ పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనివల్ల ఇప్పటికప్పుడు ప్రభుత్వం మీద పడే ఆర్ధిక భారం పెద్దగా ఉండదు. కాని ఎంతో కొంత బడ్జెట్ పెంచవలసి ఉంటుంది. దాని సంగతి ఏమి చేస్తారో తెలియదు.మిగిలిన హామీలు మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్లు మొదలైన గ్యారంటీల పేర్లు ప్రస్తావించి వంద రోజుల కార్యాచరణ అన్నారు తప్ప వాటి వివరాల జోలికి వెళ్లినట్లు కనిపించలేదు.ఇక్కడే వారిలో భయం ఏర్పడిందన్న విషయం అర్ధం అవుతుంది. మహాలక్ష్మి స్కీమ్ కింద ప్రతి మహిళకు 2500 రూపాయల ఆర్ధిక సాయం, గృహజ్యోతి కింద ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం,రైతు భరోసా కింద పదహారువేల సాయం, ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షల సహాయం వంటివాటిని అమలు చేయవలసి ఉంది. వీటన్నిటికి అయ్యే వ్యయం అంచనా వేస్తే కనీసం ఏభైవేల కోట్ల వరకైనా ఉండవచ్చన్నది ఒక అబిప్రాయం. కాని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అంచనా వేసిన ప్రకారం లక్ష కోట్లు అవసరం అవుతాయి. ఆ డబ్బు ఎలా వస్తుందన్నది మున్ముందు రోజుల్లో చెబుతారేమో చూడాలి. ఇవి కాకుండా ఆయా డిక్లరేషన్లు ఉండనే ఉన్నాయి. ఉదాహరణకు దళిత బంధు కింద పన్నెండు లక్షల రూపాయల సాయం ఇస్తామని హామీ ఇచ్చారు. దాని ఊసేమీ ఎత్తలేదు. నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. గత ప్రభుత్వం అమలు చేయాలనుకున్న రైతు భరోసా ఆగిపోయినప్పుడు రేవంత్ రెడ్డి ఒక హామీ ఇస్తూ, తాము అధికారంలోకి రాగానే పదిహేనువేల చొప్పున ఇస్తామని చెప్పారు. దాని సంగతి కూడా చెప్పినట్లు లేదు. ఆరు గ్యారంటీలను మొదటి క్యాబినెట్ లోనే ఆమోదిస్తామని అప్పట్లో రాహుల్ గాంధీ చెబుతుండేవారు. ఆ ప్రకారం మంత్రివర్గం ఆమోదించినా, ఆ తర్వాత ప్రక్రియ ఏమిటో ప్రభుత్వం వివరించలేదు. మరో వైపు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, విద్యుత్ సంస్థలు 81 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయని,పౌర సరఫరా సంస్థ 56వేల కోట్ల అప్పుల్లో ఉందని ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ద్వారా వెల్లడించింది. మంత్రులు కూడా ఈ విషయాలను మీడియాకు చెబుతున్నారు. నిజానికి ఈ పరిస్థితి గురించి ఎన్నికల ముందు కూడా వీరికి తెలుసు. అయినా ఈ వాగ్దానాలు చేశారంటే, పదేళ్లుగా అధికారం లేక అల్లాడుతున్న కాంగ్రెస్ ను ఎలాగైనా పవర్ లోకి తీసుకురావాలన్న ఆకాంక్ష తప్ప మరొకటి కాదు.రెండు లక్షల రుణమాఫీపై కార్యాచరణ చేపడతామని కూడా ఈ స్పీచ్ లో పేర్కొన్నారు. ఇది కూడా అంత తేలిక కాకపోవచ్చు.మెగా డిఎస్సి ద్వారా టీచర్ల పోస్టులను భర్తీ చేస్తామని కూడా గవర్నర్ పేర్కొన్నారు. నిజంగానే ఆరు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయగలిగితే రేవంత్ ప్రభుత్వానికి మంచి క్రెడిట్టే వస్తుంది. ధరణి పోర్టల్ బదులు భూ మాత పోర్టల్ తెస్తామన్న హామీని కూడా ప్రస్తావించారు. మళ్లీ దీనివల్ల రైతులకు కొత్త సమస్యలు రాకుండా జాగ్రత్తపడితే మంచిది.గత ప్రభుత్వం మాదిరే మూసి నది ప్రక్షాళన చేస్తామని ఈ ప్రభుత్వం కూడా వెల్లడించింది. దానికి తోడు మూసి నదీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధికల్పన జోన్ చేస్తామని అంటున్నారు. అది ఎలా జరుగుతుందో వేచి చూడాలి.గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ప్రచారానికి మాత్రమే వాడుకుందని, తదితర విమర్శలు కూడా ఈ స్పీచ్ లో ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులపై శ్వేతపత్రాల విడుదలకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. కాని ప్రజలకు కావల్సింది శ్వేతపత్రాలు కాదుకదా! చేసిన వాగ్దానాలను నెరవేర్చడం కదా! అన్న వ్యాఖ్యలు ప్రతిపక్షం నుంచి వస్తాయి. గత ప్రభుత్వంపై నెపం నెట్టి కాలయాపన చేయడానికి ఇవి పాతరోజులు కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఇది రాచరికం కాదు.. ప్రజాస్వామ్యం అన్న విశ్వాసాన్ని ప్రజలలో కల్పిస్తామని చెప్పడం మంచి విషయమే. తమ ప్రభుత్వం మాటలకన్నా చేతలనే నమ్ముకుందని, మార్పును మీరు చూస్తారని ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి రేవంత్ ప్రభుత్వం ప్రయత్నించింది. ఒకరకంగా చూస్తే ఇది ఆశలు కల్పించి,వాటిని నెరవేర్చడానికి యత్నించే ప్రభుత్వంగా కనిపిస్తుంది.మరో రకంగా చూస్తే ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఉన్న ఇబ్బందులను పరోక్షంగా ప్రస్తావిస్తూ భయం,భయంగా సాగే ప్రభుత్వం అన్న అభిప్రాయం కలుగుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
‘టీఎస్పీఎస్సీ’పై హైకోర్టు జడ్జితో..న్యాయ విచారణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణస్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీ కోణంలోనే కాకుండా ప్రతి విభాగంలో నెలకొన్న లోపాలపై నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయముర్తికి లేఖ రాయనున్నారు. విచారణకు ప్రత్యేకంగా సిట్టింగ్ జడ్జిని నియమించాలని ఆ లేఖలో కోరనున్నట్టు సమాచారం. టీఎస్పీఎస్సీ వ్యవహారంపై గత ప్రభుత్వం సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు చేయగా, ఆ దర్యాప్తు కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ చైర్మన్ పదవికి బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేయగా, సభ్యులుగా కొనసాగిన ఐదుగురు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సభ్యులంతా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రాజీనామా పత్రాలు పంపించారు. గవర్నర్‌ను అపాయింట్మెంట్ కోరినా, ఆమె సమయం ఇవ్వకపోవడంతో రాజీనామాలు పంపించినట్టు ఓ సభ్యుడు తెలిపారు. దీంతో కమిషన్‌లో చైర్మన్‌తో సహా సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇతర విభాగాల పనితీరు, లోపాలపై దృష్టి టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలోని ‘కోరం’వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 30 వేలకు పైబడి ఉద్యోగాల భర్తీకి 23 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో 19 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పూర్తి కాగా, గ్రూప్–2, గ్రూప్–3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గ్రూప్–1 ప్రిలిమినరీ పూర్తి చేసిన కమిషన్ మెయిన్ పరీక్షలు చేపట్టాల్సి ఉంది. ఇవి కాకుండా వివిధ ప్రభుత్వ కాలేజీల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో నాలుగు పరీక్షలను రద్దు చేసి రెండుసార్లు నిర్వహించారు. మరికొన్నింటిని వాయిదాలు వేస్తూ పూర్తి చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీయే ఇందుకు కారణం. అయితే టీఎస్పీఎస్సీలోని ఇతర విభాగాల్లో పనితీరు, లోపాలు గుర్తించాలని రాష్ట్రం ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి విభాగంలో అధికారులు, ఉద్యోగుల పనితీరు, విధి నిర్వహణ, సమాచార వ్యవస్థ, గోప్యత తదితరాలను లోతుగా పరిశీలించనుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ఇతర విభాగాల అలసత్వం, అధికారుల ఉదాసీనతపై సమగ్రంగా విచారించనున్నారు. అక్రమాలకు పాల్పడిన, విధినిర్వహణలో అలసత్వం వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ దిశగా హైకోర్టు సిట్టింగ్ జడ్జిని నియమించాలని సీజేకు లేఖ రాయనున్నారు. కొత్త కమిషన్ కొలువుదీరేలోపు... టీఎస్పీఎస్సీలో పదవులన్నీ ఖాళీ అయ్యాయి. సాధారణంగా కమిషన్‌లో సభ్యుల నిర్ణయం తప్పనిసరి. కనీసం ఇద్దరు సభ్యులున్నా అందులో సీనియర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎవరూ లేకపోవడంతో ఏ నిర్ణయమూ తీసుకునే అవకాశం లేదు. కొత్త కమిషన్ కొలువుదీరేలోపు విచారణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విచారణకు ముందుగానే కొత్త కమిషన్ ఏర్పాటైతే తాజాగా చేపట్టదలచిన సమగ్ర విచారణకు ఆటంకాలు ఎదురవుతాయని, కొత్త కమిషన్‌కు నిర్ణయాధికారంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తు వేగవంతం చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీఎస్పీఎస్సీ, సిట్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. వీలైనంత వేగంగా విచారణ చేపడితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడుగులు పడతాయన్న ఆశలో నిరుద్యోగులు ఉన్నారు. -
టీఎస్పీఎస్సీ చైర్మన్...జనార్దన్‌రెడ్డి రాజీనామా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రాజీనామా పత్రం సమ ర్పించారు. ఆయన రాజీనామాను ఆమోదించిన గవర్నర్ తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎస్ శాంతికుమారిని ఆదేశించారు. రాజీనామాకు ముందు సీఎం రేవంత్‌రెడ్డిని జనార్ధన్‌రెడ్డి కలిశారు. కమిషన్‌కు సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీ ముగిసిన వెంటనే జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేయడం గమనార్హం. దిగజారిన ప్రతిష్ట ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాల విషయంలో టీఎస్పీఎస్సీ జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. పలు రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచింది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన తదితర ప్రక్రియలన్నీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి చేస్తూ విజయవంతంగా దూసుకెళ్లింది. 2021 మే 21వ తేదీన టీఎస్పీఎస్సీ చైర్మన్ బాధ్యతలు జనార్ధన్‌రెడ్డి స్వీకరించారు. ఆ తర్వాత నూతన జోనల్ విధానం అమలు నేపథ్యంలో ఉద్యోగ ప్రకటనల జారీలో జాప్యం జరిగింది. అయితే గతేడాది ఏప్రిల్ నుంచి క్రమంగా ఆ ప్రక్రియ ఊపందుకుంది. అత్యంత ఎక్కువ సంఖ్యలో 503 ఉద్యోగాలతో గ్రూప్–1 నియామకాల ప్రకటన జారీ చేసి రికార్డు సృష్టించింది. ఆ తర్వాత వరుసగా దాదాపు 30 వేల ఉద్యోగాలకు నెలల వ్యవధిలోనే ప్రకటలు జారీ చేస్తూ వచి్చంది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి పూనుకోవడంతో ఇంటిదొంగలు తయారయ్యారు. గ్రూప్–1 సహా పలు ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో టీఎస్పీఎస్సీ పరపతి ఒక్కసారిగా దిగజారింది. పోలీసుల కేసులు, పలువురు ఉద్యోగులు జైలుపాలు కావడం, అప్పటికే నిర్వహించిన పరీక్షల రద్దు తదితరాలన్నీ కమిషన్ స్థాయిని పూర్తిగా దిగజార్చాయి. ఈ నేపథ్యంలోనే చైర్మన్‌ను, సభ్యులను మార్చాలంటూ నిరుద్యోగులు ఒత్తిడి తెచ్చారు. క్రమంగా పరిస్థితులు కాస్త సద్దుమణగడం, పరీక్షల పునర్ నిర్వహణ తేదీలు ప్రకటించడంతో నిరుద్యోగులు సన్నద్ధతపై దృష్టి పెట్టారు. జనార్ధన్‌రెడ్డి వెటర్నరీ సైన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1990లో గ్రూప్–1 అధికారిగా నియమితులయ్యారు. 1996లో కన్ఫర్డ్ ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలన, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ, వ్యవసాయ శాఖల్లో కీలక హోదాల్లో పనిచేశారు. వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ కమిషనర్‌గా సేవలందించారు. అత్యంత నిజాయితీ గల అధికారిగా పేరుంది. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వం ఆయన్ను టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారని అంటున్నారు. టీఎస్పీఎస్సీ బోర్డులో ప్రస్తుతం ఐదురుగు సభ్యులున్నారు. వారు కూడా ఒకట్రెండు రోజుల్లో రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
తెలంగాణ అసెంబ్లీ గురువారానికి వాయిదా
Live Updates.. తెలంగాణ శాసనసభ వచ్చే గురువారానికి వాయిదా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం, ఉచిత బస్సు ప్రయాణం పథకాలు ప్రారంభిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయని ఇద్దరు మంత్రులు ప్రమాణం చేయని ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి వారిద్దరూ ఎంపీలుగానే ఉన్నారు. ఇంకా ఎంపీ పదవులకు రాజీనామా చేయని కారణంగా నేడు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు. రాజ్‌భవన్‌కు బీజేపీ ఎమ్మెల్యేలు.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఎంపికపై గవర్నర్‌కు ఫిర్యాదు. గవర్నర్ తమిళిసై లేకపోవడంతో రాజ్‌భవన్ సెక్రటరీకి వినతి పత్రం అందజేత బీజేపీ ఎమ్మెల్యేలు సీనియర్లు కాదని మజ్లిస్ ఎమ్మెల్యేను కావాలనే ప్రొటెం స్పీకర్ చేశారని ఫిర్యాదు. శాసనసభ సంప్రదాయాలను కాలరాస్తున్నారని ఆగ్రహం. నేడు రెండు పథకాలకు శ్రీకారం.. మధ్యాహ్నం ఒంటి గంటకు అసెంబ్లీ ఆవరణలోని ఒకటో గేటు వద్ద రెండు పథకాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం పేదలందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల ఉచిత వైద్య సదుపాయం చేయూత. కొలువుదీరిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలకు శ్రీకారం. నేడే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం. 👉 ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం. 👉 రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలు. ప్రగతి పథం.. సకల జనహితం.. మన ప్రజా ప్రభుత్వం!… pic.twitter.com/stqOjkF10T — Telangana Congress (@INCTelangana) December 9, 2023 అందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాం: కిషన్‌రెడ్డి శాసనసభ గౌరవాన్ని కాలరాసేలా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. సీనియర్ సభ్యులు ఉన్నా ఎంఐఎంతో ఒప్పందం మేరకు అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించింది. సభా నియమాలను తుంగలో తొక్కడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది అందుకే ఇవాళ అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించాం ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఎంఐఎం ఒకటేనన్న కాంగ్రెస్ అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎలా నియమించింది. సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించి ఆయన ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎన్నిక జరగాలని డిమాండ్ చేస్తున్నాం ఇదే విషయాన్ని గవర్నర్‌ను కలిసి కోరుతాం గాంధీభవన్‌లో సీఎం రేవంత్ కామెంట్స్.. భుజాలు కాయలు కాసేలాగా కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు కార్యకర్తల వల్లే మేం సీట్లలో కూర్చున్నాం ఎన్ని రాజకీయ ప్రకంపనలు ఎదురైనా ఉక్కు సంకల్పంతో సోనియా తెలంగాణ ఇచ్చారు తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో మనం చూడలేదు తెలంగాణ తల్లి సోనియా లాగే ఉంటుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు లక్షలాది తెలంగాణ బిడ్డలకు సోనియానే తల్లి డిసెంబర్ ఏడో తేదీన సోనియా ఎల్బీ స్టేడియంలోకి ఎంటర్ అయ్యే క్షణాలని నేను ఎప్పటికీ మర్చిపోలేను డిసెంబర్ 9, 2017న గాంధీ భవన్లో అడుగుపెట్టాను డిసెంబర్ 9, 2023న ప్రభుత్వం ఏర్పాటు అయింది పాలకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటాను పది సంవత్సరాలు కార్యకర్తలు వేల కేసులు ఎదుర్కున్నారు కార్యకర్తలకు మాట ఇస్తున్నాను. ఈ ప్రభుత్వం కార్యకర్తలది సోనియా గాంధీ 100 సంవత్సరాలు సంతోషంగా జీవించాలి శాసనసభలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజల ఆశీర్వాదం ఇవ్వాలి ►సభకు హాజరైన 109 మంది ఎమ్మెల్యేలు. ►అనారోగ్యం కారణంగా సభకు హాజరు కాని కేసీఆర్, కేటీఆర్ ►సభకు బీజేపీ సభ్యులు ఎనిమిది మంది గైర్హాజరు ►మొదట రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు ప్రమాణ స్వీకారం.. ►ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ. ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ► తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన 51 మంది ఎమ్మెల్యేలు ►అసెంబ్లీ సమావేశాలకు బాయ్‌కాట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు ►కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం ►అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ►రేవంత్‌కు స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, అసెంబ్లీ సెక్రటరీ ►అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో రేవంత్ ప్రత్యేక పూజలు. ►అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ►భట్టి తో పాటు అసెంబ్లీకి వచ్చిన పొంగులేటి, తుమ్మల గన్‌పార్క్ వద్ద కోలాహలం గన్‌పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఎదురుపడిన రెండు పార్టీల నేతలు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటున్న మంత్రులు కొత్త మంత్రులు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. అసెంబ్లీకి చేరుకున్న మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ గాంధీ భవన్లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు.. గాంధీభవన్‌లో సోనియ బర్త్ డే సెలబ్రేషన్స్.. 78 కిలోల కేట్ కట్ చేసి శుభాకాంక్షలు చెపుకున్న కాంగ్రెస్ నేతలు సోనియా పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వీహెచ్, మాణిక్‌రావ్ ఠాక్రే ఇతర నేతలు డిప్యూటీ సీఎం భట్టి ,మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,తుమ్మల, సీతక్క, కొండా సురేఖ ,పొన్నం ప్రభాకర్, హాజరైన పార్టీ నేతలు. భట్టి కామెంట్స్.. గాంధీభవన్ ఆశయాలను నెరవేరుస్తాం సోనియా గాంధీ కలలు కన్న సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తాం. ప్రజలు మెచ్చేలా పాలన ఉంటుంది రాష్ట్ర సంపద ప్రజలకు పంచుతాం. తెలంగాణభవన్‌లో ముగిసిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలు బస్సులో అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణభవన్ నుంచి గన్‌పార్క్‌కు బయలుదేరిన ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద నివాళులు అర్పించనున్నారు అసెంబ్లీకి హాజరుకానున్న ఎమ్మెల్యేలు కేసీఆర్ పేరును ప్రతిపాదించిన పోచారం.. బలపరచిన తలసాని, కడియం శ్రీహరి శాసనభాపక్ష మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యత కేసీఆర్‌కు అప్పగింత. బీజేపీ నేతల కీలక నిర్ణయం.. అసెంబ్లీ బహిష్కరించాలని బీజేపీ నిర్ణయం ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయవద్దని డిసైడ్ అయిన కమలం పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ ముందు ప్రమాణం చేసేందుకు ససేమీరా అన్న బీజేపీ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోనున్న ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం 10:30 గంటకు మీడియాతో మాట్లాడనున్న కిషన్ రెడ్డి ►అసెంబ్లీ ప్రారంభానికి ముందే మంత్రులకు శాఖల కేటాయింపు ►శాఖల కేటాయింపుపై ఇప్పటికే కేసీ వేణుగోపాల్‌తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. ►ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ►అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై #WATCH | AIMIM MLA Akbaruddin Owaisi takes oath as Pro-tem Speaker of Telangana Legislative Assembly, in Raj Bhawan, Hyderabad pic.twitter.com/PpMoZhOvjy — ANI (@ANI) December 9, 2023 ►ప్రొటెం స్పీకర్ ప్రమాణానికి బీజేపీ దూరం ►బీఆర్ఎస్ నుంచి హాజరైన పోచారం శ్రీనివాస్, మాజీ మంత్రి హరీశ్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి. ►రాజ్‌భవన్ దర్బార్ హాల్లో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం ►కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం, మంత్రులు ►తెలంగాణ మూడో శాసన సభకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ►చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్న అక్బరుద్దీన్ ►రాజ్‌భవన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ►కాసేపట్లో రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం. ►అక్బరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ►నేడు ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరం. ►తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం ఉదయం 11 గంటలకు తొలిసారిగా కొలువు దీరనుంది. ►తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ►కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం తదితరాల కోసం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగనున్నాయి. తొలిసారిగా అసెంబ్లీకి 51 మంది ►అన్ని పార్టీల తరఫున కలుపుకుని మొత్తం 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, కరీంనగర్ జిల్లా నుంచి 8 మంది తొలిసారిగా ఎన్నికైన వారున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు తొలిసారి అడు గు పెడుతున్నారు. 51 మందిలో 18 మంది క్రియాశీల రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తున్న వారే. రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం ►తొలిరోజు సమావేశంలో కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ►ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏఐఎంఐఎం సీనియర్ శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నామినేట్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ►ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 8.30కు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ►సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ►ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ప్రొటెమ్ స్పీకర్ అధ్యక్షతన తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ప్రారంభమవుతుంది. ►తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ►ఆ తర్వాత తెలుగు అక్షరమాలలోని అక్షర క్రమంలో ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. బీఆర్ఎస్కు విపక్ష హోదా ►శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులకు గాను తెలంగాణ మూడో శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేల బలం ఉంది. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఏఐఎంఐఎంకు ఏడుగురు సభ్యుల బలం కలిగి ఉన్నాయి. అధికార కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్కు విపక్ష హోదా దక్కే అవకాశముంది. ►బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ►ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ తరపున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణభవన్‌లో భేటీ అవుతున్నారు. ►బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేల భేటీకి అధ్యక్షత వహిస్తారు. ►కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ఈ భేటీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమోదిస్తారు. నేడు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ ►శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత స్పీకర్ ఎన్నిక కోసం శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయన శనివారం సాయంత్రం సీఎం రేవంత్, మంత్రివర్గం సమక్షంలో నామినేషన్ సమర్పిస్తారని తెలిసింది. ►కాగా రెండో రోజు ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధ్యతల స్వీకరణ కార్యక్రమం, ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఈ నెల 11న సోమవారం జరిగే మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాయిదా పడే సభ తిరిగి 12వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభమవుతుంది. నాలుగో రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. -
కేసీఆర్ సర్కార్‌కు షాక్.. గవర్నర్ తమిళిసై సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ ప్రభుత్వం మధ్య వ్యవహారం నువ్వా-నేనా అన్నట్టు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్ తమిళిసై మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీల కోటాలో ప్రభుత్వం పంపిన సిఫార్సులను గవర్నర్ తిరస్కరించారు. దీంతో, తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. వివరాల ప్రకారం.. తెలంగాణ గవర్నర్ తమిళిసై.. కేసీఆర్ సర్కార్‌కు మళ్లీ షాకిచ్చారు. రాష్ట్రంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన సిఫార్సులను తమిళిసై తిరస్కరించారు. ఇక, అంతకుముందు కూడా గవర్నర్ తమిళిసై ఎమ్మెల్సీ కోటా కింద పాడి కౌశిక్ రెడ్డి విషయంలో కూడా ప్రభుత్వ సిఫార్సులను కొద్దిరోజులు హోల్డ్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ.. దాసోజు శ్రవణ్, సత్యనారాయణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. కళలు, సాహిత్యం, సైన్స్ రంగంలో వీరిద్దరూ పెద్దగా కృషి చేయలేదు. గవర్నర్ కోటాలో నామినేట్ చేసే అర్హతలు వీళ్లకు లేవు. ఆర్టికల్ 171(5) ప్రకారం అభ్యర్థుల ఎంపిక జరగలేదు అని అన్నారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఇటీవలే బీజేపీలో చేరారు. అనంతరం, కొన్ని పరిణామాల నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో చేరాలని డిసైడ్ అయ్యా.. సోనియా సమక్షంలో చేరుతున్నా: మైనంపల్లి -
సచివాలయంలో సీఎం కేసీఆర్, గవర్నర్.. చాలా రోజులకు ఒకే వేదికపై..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సచివాలయంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.హైదరాబాద్: రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో గుడి, చర్చి, మసీదులను గవర్నర్ తమిళిసైతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ప్రారంభించారు. నల్లపోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చర్చి ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం మసీదును ప్రారంభించి నమాజ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ►గవర్నర్ తమిళిసైను సీఎం కేసీఆర్ కొత్త సచివాలయంలోకి తీసుకెళ్లారు. ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌ను చూపించారు. ►.సచివాలంలోని సర్వమత ప్రార్థనల్లో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై సీఎం, గవర్నర్ కలిసి కనిపించారు ►సచివాలయంలో నల్లపోచమ్మ ఆలయం, మసీదు, చర్చిల ప్రారంభోత్సవం జరిగింది. ఈ క్యాక్రమంలో సీఎ కేసీఆర్, గవర్నర్ తమిళిసైసౌందరరాజన్ ప్రారంభించారు. అనంతరం సచివాలయాన్ని గవర్నర్ తమిళిసై పరిశీలించనున్నారు ► శివాలయం, పోచమ్మగుడి, హనుమాన్, గణపతి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ► మందిరాల ప్రారంభోత్సవం సందర్భంగా యాగం నిర్వహించారు. ► గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ నేడు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ► మత పెద్దల సమక్షంలో మసీదు, చర్చిలను కేసీఆర్ ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ఇదే.. ► మధ్యాహ్నం 12: 35 గంటలకు కేసీఆర్ సచివాలయం చేరుకోనున్నారు. ► 12: 40 గంటలకు చర్చి రిబ్బన్ కటింగ్. ► 12: 45 గంటలకు చర్చిలో కేక్ కటింగ్. ►12: 55 గంటలకు చర్చిలో ముగింపు ప్రేయర్ ► మధ్యాహ్నం 1- 1.30 గంటల వరకు మసీదును ప్రారంభించి మత పెద్దల ప్రత్యేక ప్రార్ధనలో పాల్గొననున్నారు కేసీఆర్. -
ఆదివాసీల అభివృద్ధే దేశాభివృద్ధి: గవర్నర్
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్): ప్రకృతితో మమేకమై స్వచ్ఛంగా ఉండే ఆదివాసీలు అభివృద్ధి చెందినపుడే దేశం అభివృద్ధి చెందినట్లని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పేర్కొన్నారు. వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమంటే దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమేనని అభిప్రాయపడ్డారు. ఆధార్ సొసైటీ, ఆదివాసీ ఉద్యోగుల సంక్షేమం సాంస్కృతిక సంస్థ, ఆదివాసీ విద్యార్థి మండలి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాలకు ఆమె హాజరై మాట్లాడారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయడమంటే భగవంతుడికి సేవ చేయడమేనన్నారు. గవర్నర్‌గా ఇక్కడికి వచ్చాక ఆరు ఆది వాసీ గ్రామాలను దత్తత తీసుకుని అక్కడ సర్వే చేయించగా...అక్కడి మహిళలు రక్తహీనతతో అధికంగా బాధపడుతున్నట్లు తేలిందని, వారికి ఐరన్ మాత్రలు పంపించగా...వాటిని తీసుకునేందుకు వారు ఇష్టపడలేదని వివరించారు. దీంతో ఐరన్ ఎక్కువగా లభించే మహువా పూలతో తయారు చేసిన లడ్డూలను పంపిణీ చేస్తే చాలామంది మహిళలు రక్తహీనతనుంచి బయటపడ్డారని తెలిపారు. కార్యక్రమం అనంతరం ఆదివాసీలతో కలసి గవర్నర్ నృత్యాలు చేశారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ..ఆర్టి కల్ 244 ప్రకారం ఆదివాసులకు ప్రత్యేక రక్షణ చట్టాలున్నాయని, కానీ వాటిని పరిరక్షించడం పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆధార్ సొసైటీ జాతీయ అధ్యక్షులు వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. -
వీడిన ఉత్కంఠ.. ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో ఆర్టీసీ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. గవర్నర్ ఆమోదించిన ఆర్టీసీ డ్రాఫ్ బిల్లును అధికారులు అసెంబ్లీకి తీసుకొచ్చారు. తమిళిసైతో జరిగిన భేటీ వివరాలను రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివసరాజు సీఎం కేసీఆర్‌కు తెలపనున్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌కు వెళ్లారు. దీంతో అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన ఇవాళే ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెటే అకాశముంది. కాగా ఆర్టీసీ బిల్లును ఆమోదించే ముదు ఆర్టీసీ ఉన్నతాధికారులతో గవర్నర్‌తో భేటీ అయ్యారు. రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, పలువురు ఆర్టీసీ అధికారులు తమిళిసైను రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం కలిశారు. గవర్నర్ అడిగిన వివరాలను అందించారు. తాత్కాలిక ఉద్యోగుల భవితవ్యంపై తమిళిసై ఆరాతీశారు. అధికారులు తెలిపిన వివరాలపై సంతృప్తి చెందిన గవర్నర్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చదవండి: బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ప్రశంసలు.. కేసీఆరే మళ్లీ సీఎం! -
సర్కార్ వైఫల్యంతోనే భారీ నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తీవ్ర స్థాయిలో ఆస్తి, పంట నష్టపోయిన వారిని వెంటనే ఆదుకోవాలని, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు అంజన్ కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవితో కలిసి భట్టి రాజ్‌భవన్‌కి వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టం వివరాలను అందజేశారు. అనంతరం భట్టి మీడియాతో మాట్లాడుతూ భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేసినప్పటికీ , రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని సమాయత్తం చేయకుండా నిర్లిప్తంగా వ్యవహరించడం వల్లనే ఇంత నష్టం జరిగిందన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణం అశాస్త్రీయంగా జరగడం వల్లనే అనేక ప్రాంతాలు, గిరిజన గూడేలు ముంపునకు గురయ్యాయన్నారు. మున్నేరు, కిన్నెరసాని నదులపై నిర్మించిన చెక్ డ్యాములను ఇంజనీరింగ్ అధికారులతో శాస్త్రీయంగా డిజైన్ చేసి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. మహారాష్ట్రకు విమానాలు పంపించారు కానీ ఇక్కడ వరద ప్రాంతాలకుహెలికాప్టర్లు పంపించలేదు ప్రజల అవసరాల కోసం కాకుండా కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం అధికార యంత్రాంగాన్ని వాడుకున్నారని భట్టి ఆరోపించారు. మహారాష్ట్రకు ప్రత్యేక విమానాలు పంపించి అక్కడి నాయకులను ప్రగతిభవన్‌కు పిలిపించుకొని గులాబీ కండువాలు కప్పే దానిపై ఉన్న శ్రద్ధ వరద బాధితులను ఆదుకోవడంలో లేకుండా పోయందని విమర్శించారు. మహారాష్ట్రకు విమానాలు పంపించిన సీఎం కేసీఆర్ గోదావరి వరదలతో మునిగిపోయిన ఏజెన్సీ ఏరియాలో గిరిజన ప్రజలను ఆదుకోవడానికి హెలికాప్టర్లు పంపించ లేకపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వరదలతో ప్రజలు అల్లాడుతుంటే బాధితులను, ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించకుండా కేసీఆర్ మహారాష్ట్ర టూర్ కి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ విజయమే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని గతంలో తాము కోరినప్పుడు సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా దుర్భాషలాడుతూ నీతిమాలిన, పనికిమాలిన, ఆలోచన లేని నాయకులంటూ తప్పు పట్టారని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రాగానే ఆరీ్టసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ప్రకటించిందని, ఆ భయంతోనే కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆర్టీసీకి ఆస్తులు కూడబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ సంపాదించి పెట్టిన ఆర్టీసీ ఆస్తులను బీఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టడానికి చూస్తే రోడ్లపైకి వస్తామని భట్టి హెచ్చరించారు. వరద సహాయం సరిపోదు: గవర్నర్ తమిళిసై ఊహించిన దానికంటే పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి పునరావాస కేంద్రాలను పెంచాలి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, దాతలు ముందుకు రావాలి కుంభవృష్టిగా కురిసిన వర్షాలతో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల పట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఊహించిన దానికంటే పరిస్థితులు అత్యంత దయనీయంగా ఉన్నాయని, ఈ క్లిష్ట సమయంలో బాధిత కుటుంబాలకు అందిస్తున్న సహాయం సరిపోదని తాను భావిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాలలు, ప్రభుత్వ భవనాల్లో ప్రభుత్వం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వరదల విధ్వంసం కొనసాగుతున్న నేపథ్యంలో వీటి సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఉత్తర తెలంగాణలోని 10 జిల్లాలతో పాటు మధ్య తెలంగాణకు పరీక్షా సమయమని, ఇక్కడ తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు సాధ్యమైనంతగా సహకారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలకు పిలుపునిచ్చారు. వరద బాధిత కుటుంబాలకు తక్షణమే సహాయం అందించాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర, కేంద్ర, జిల్లా కార్యాలయాలకు పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగంతో కలిసి వరద బాధితులకు ఇప్పటికే రెడ్‌క్రాస్ సహాయం అందిస్తోందన్నారు. వరద బాధిత కుటుంబాలకు తక్షణమే ఆహారం, ఆశ్రయం, వంట సామాగ్రి, ఆరోగ్య శిబిరాలు నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని, వరద నష్టాన్ని వేగంగా అంచనా వేయాలని సూచించారు. దాతలు, స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, యూఎన్డీపీ, యూనిసెఫ్, సీఎస్ఆర్ ఫౌండేషన్లు, వైద్యులు, మీడియా భాగస్వామ్యంతో కింది సేవలు అందించాలని పిలుపునిచ్చారు. తక్షణ ఉపశమనంగా షెల్టర్ హోమ్స్, ఆహారం, తాగునీటి సరఫరా, అత్యవసర వైద్య బృందాల ను పంపించాలి. శిథిలాల తొలగింపు చేపట్టాలి. వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ఎన్డీ ఆర్ఎఫ్ బృందాలు చర్యలు తీసుకోవాలి. చిన్నారులు, బాలికలు, మహిళల రక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రాణ, ఆస్తి, ఉపాధికి జరిగిన నష్టాన్ని కచ్చితంగా మదించి పునరావాసం కల్పించాలి. బిల్లులు తిప్పి పంపడానికి కారణాలున్నాయి.. ప్రభుత్వానికి మూడు బిల్లులు వెనక్కి పంపించడానికి కారణాలున్నాయని గవర్నర్ తమిళిసై వ్యాఖ్యానించారు. గవర్నర్ తిప్పి పంపిన బిల్లు లను అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించి మళ్లీ గవర్నర్‌కు పంపిస్తామని, అప్పుడు ఆమోదించక తప్పదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్య లపై ఆమె మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. ‘నేను పంపించిన మూడు బిల్లులు ఎందుకు పంపించానో వివరంగా పేర్కొన్నాను. అందుకు సహేతుక కారణాలున్నాయి. ప్రతి బిల్లుపై నాకున్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరా. కావాలని ఏ బిల్లునూ కారణం లేకుండా తిప్పి పంపలేదు. బిల్లులు ఆపేశానని అనవసరంగా నిందించడం సరి కాదు’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. -
తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళిసై ఫైర్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణ చీఫ్ సెక్రెటరీ (CS) శాంతికుమారిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీరియస్ కామెంట్స్ చేశారు. సుప్రీం కోర్టులో తనపై వేసిన రిట్ పిటిషన్‌పై స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీనిపై గవర్నర్ తమిళిసై ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక.. ఒక్కసారి కూడా రాజ్‌భవన్‌కి రాలేదన్నారు. మర్యాదపూర్వకంగా తనను కలువలేదన్నారు. అధికారింగా కూడా రాలేదు.. ప్రోటోకాల్ లేదు. కనీసం ఆమె ఫోన్లో కూడా మాట్లాడలేదని సీరియస్ అయ్యారు. ఢిల్లీ కన్నా రాజ్‌భవన్ దగ్గరగా ఉందంటూ సెటైరికల్ పంచ్ ఇచ్చారు. ఈ ట్వీట్‌ని శాంతికుమారికి ట్యాగ్ చేశారు. ఈమధ్యే సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్న శాంతికుమారి.. గవర్నర్ ముందు.. 10 బిల్లులు పెండింగ్ ఉన్నాయనీ.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించేలా చెయ్యాలని కోరుతూ సుప్రీంకోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. 5 నెలలు గడిచినా బిల్లుల్ని గవర్నర్ ఆమోదించలేదని ఆమె పిటిషన్లో పేర్కొనడం సంచలనంగా మారింది. Dear @TelanganaCS Rajbhavan is nearer than Delhi. Assuming office as CS you didn't find time to visit Rahbhavan officially. No protocol!No courtesy even for courtesy call. Friendly official visits & interactions would have been more helpfull which you Don't even intend. — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) March 3, 2023 -
కేసీఆర్‌కు తెలంగాణను పాలించే నైతికత లేదు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణను పాలించే నైతికత లేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేదన్నారు. ప్రతిపక్షాలపై బీఆర్ఎస్ నేతలు విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శనివారం తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు షర్మిల వినతిపత్రాన్ని సమర్పించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పట్టపగలే వీధికుక్కలు పసిపిల్లలపై దాడులు చేస్తుంటే బీఆర్ఎస్ గూండాలు ప్రతిపక్షాల మీద కుక్కల్లా పడి దాడులు చేస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతి పక్షాలకు మాట్లాడే స్వేచ్ఛ లేదు, మహిళలకు గౌరవం లేదన్నారు. దేశంలో భారత రాజ్యాంగం అమలవుతుంటే.. తెలంగాణలో మాత్రం కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని షర్మిల ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు అన్న పదం వింటేనే కేసీఆర్, బీఆర్ఎస్కు ఎందుకు అంత అసహనమని ప్రశ్నించారు. భూములన్నీ కబ్జాలు చేసి అక్రమంగా సంపాదించుకున్న ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ కేసీఆర్ టికెట్లు ఇవ్వాలనుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ.. త్వరలో రాష్ట్రపతి దగ్గరకు కూడా వెళ్లబోతున్నామని షర్మిల తెలిపారు. గవర్నర్ తాము చెప్పిన దానికి ఏకీభవించారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా కలిసిరావాలని ఆమె పిలుపునిచ్చారు. మెడికల్ విద్యార్థిని ప్రీతికి తన సానుభూతి ఉందని పేర్కొంటూ.. ఆత్మహత్యాయత్నం చేసిన మరో మెడికల్ స్టూడెంట్‌కు కూడా తమ పార్టీ సానుభూతి ఉంటుందని షర్మిల ప్రకటించారు. -
సీఎంగా కేటీఆర్‌కు ముహుర్తం ఫిక్స్?
తెలంగాణ మున్సిపల్ , ఐటీ శాఖల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి పదవిని చేపట్టడానికి సమయం మరికాస్త దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. శాసనసభలో ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి జవాబు ఇచ్చిన తర్వాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి అభినందించారు. ఆ నేపధ్యంలో కేటీఆర్ త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారేమోనని ఆ పార్టీలో చర్చలు సాగుతున్నాయి. ఒకటి, రెండు ఆంగ్ల పత్రికలు సైతం ఆ కోణంలో విశ్లేషణలు ఇచ్చాయి. ఈ ఏడాది డిసెంబర్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ లోగానే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? లేక వచ్చే ఎన్నికలలో గెలిస్తే సీఎం అవుతారా? అన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారు జవాబు ఇస్తారు. కానీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ జవాబు ఇవ్వకుండా కేటీఆర్‌తో మాట్లాడించారు. గతంలో ఎన్నడూ ఇలా జరిగిన సందర్భం లేదు. ఎప్పుడైనా అరుదుగా ఉంటే, ఉందేమో తెలియదు కానీ.. ముఖ్యమంత్రులు ఈ జవాబు ఇవ్వడాన్ని ప్రతిష్టగా తీసుకుంటారు. తద్వారా తన ప్రభుత్వ విజయాలను చెప్పుకోవడానికి దీనిని ఒక అవకాశంగా భావిస్తారు. గత సంవత్సరం అసలు గవర్నర్ ప్రసంగం లేదు కనుక సమాధానం ఇవ్వాల్సిన అవసరం రాలేదు. అయినా ఆయా సమయాలలో కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగాలు చేశారు. ఈసారి గవర్నర్ తమిళిసైకి, కేసీఆర్‌కు మధ్య విబేధాలు బాగా పెరగడం, చివరికి బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం ఇవ్వకుండా నిలపడం, ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడం, తదుపరి రెండు వర్గాలు రాజీపడటం జరిగాయి. ఆ తర్వాత గవర్నర్‌ను కేసీఆర్ సగౌరవంగానే ఆహ్వానించి, స్పీచ్ తర్వాత మర్యాదగానే వీడ్కోలు పలికారు. గవర్నర్ కూడా స్పీచ్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. కానీ, ఇప్పుడు కేసీఆర్ కాకుండా కేటీఆర్ సంబంధిత తీర్మానంపై జవాబు ఇవ్వడం సహజంగానే చర్చకు దారి తీస్తుంది. కేసీఆర్‌కు ఈ అంశంపై సభలో మాట్లాడడం ఇష్టం లేదని, అందువల్లే కేటీఆర్‌కు అవకాశం ఇచ్చారని కొందరు అంటున్నారు. ఒకవేళ సీఎం ప్రసంగించకపోతే, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి మాట్లాడవచ్చు. లేదా ఆర్ధిక మంత్రి, సీనియర్ అయిన హరీష్ రావుకు అప్పగించవచ్చు. కానీ.. కేటీఆర్‌తో మాట్లాడించడం ద్వారా కాబోయే సీఎం ఆయనే.. అన్న సంకేతాన్ని బలంగా ఇప్పించినట్లు అనుకోవచ్చు. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చి పార్టీ పగ్గాలు ఇచ్చారు. పార్టీలో ఆయనకు పెద్దగా పోటీ లేకుండా వాతావరణం ఏర్పాటు చేశారు. కేటీఆర్ కూడా సమర్ధంగానే డీల్ చేస్తుంటారు. ప్రత్యేకించి తెలుగుతో పాటు, ఆంగ్లం, హిందీలలో అనర్గళంగా మాట్లాడగలరు. కేసీఆర్ కుటుంబానికి ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. కేటీఆర్ తమది కుటుంబ పాలన అంటూ, నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబం అని చెప్పడం ఆసక్తికరంగా ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిక్కు ఉంది. ప్రత్యర్దులు ఇకపై కేటీఆర్ తమది కుటుంబ పాలన అని ఒప్పుకున్నారు అనే వరకే తీసుకుని ప్రచారం చేసే అవకాశం ఉంది. అది వేరే విషయం. కేటీఆర్ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ అబివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించడంతో పాటు, ప్రధాని మోడీపై, పారిశ్రామికవేత్త ఆదానీలపైన కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశం అంటే మోదీ, అదానీలేనా అని ప్రశ్నల వర్షం కురిపించారు. బీజేపీపై ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ దాడి చేస్తున్న నేపథ్యంలో సహజంగానే కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. కాగా, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీతో సంవాదం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. నిజానికి బీఆర్ఎస్, ఎంఐఎంలు మిత్రపక్షాలుగానే ఉన్నాయి. 19 మంది ఉన్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీకి ప్రతిపక్షనేత హోదాను బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. ఆయా ఎన్నికలలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ రెండు పార్టీలు సహకరించుకుంటుంటాయి. అలాంటిది వచ్చే ఎన్నికలలో 50 సీట్లలో పోటీచేస్తామని, పదిహేను సీట్లతో శాసనసభలోకి వస్తామని అక్బర్ చెప్పినా అది నమ్మశక్యంగా లేదు. ఎంఐఎంకు హైదరాబాద్‌లో అది కూడా పాతబస్తీలోని ఏడు సీట్లలో తప్ప, మిగిలిన చోట్ల పెద్దగా బలం లేదు. కాకపోతే, ఆయా నియోజకవర్గాలలో కొంతమేర ఆ పార్టీకి ఓటర్లు ఉన్నారు. ఒకవేళ 50 సీట్లలో పోటీచేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్న చర్చ కూడా జరుగుతోంది. కానీ, ఈ పరిణామానికి పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అంగీకరించవలసి ఉంటుంది. కేసీఆర్, అసద్‌ల మధ్య మంచి రాజకీయ ఈక్వేషన్ ఉంది. అసలు అక్బర్ విద్వేష ప్రసంగం కేసు నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఎంతగా సాయపడిందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య వివాదం వస్తుందా అన్నది సందేహమే. పైకి ఇలా మాట్లాడినా.. లోపల అంతా బాగానే ఉండవచ్చన్న అభిప్రాయం ఉంది. అందువల్లే ఇదేదో మ్యాచ్ ఫిక్సింగ్ లాగా ఉందని కొందరు అనుమానిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలకన్నా ఎంఐఎం పార్టీనే ప్రతిపక్షం అన్న భావన కల్పించడం ఇందులోని అంతరార్ధం కావచ్చేమో. కేసీఆర్ దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అభివృద్దికి పర్యటించాలని భావిస్తున్నారు. ఒకవేళ కేంద్రానికి ఆయన వెళ్లాలనుకుంటే వచ్చే లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఉంటుంది. అప్పుడు కేటీఆర్ తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారని అనుకోవచ్చు. వచ్చే శాసనసభ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిస్తే ఈ పరిణామం జరగడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. - హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్. -
కేసీఆర్ సర్కార్ Vs గవర్నర్.. మండలి ఛైర్మన్ గుత్తా కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేసీఆర్ ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల రిపబ్లిక్ డే సందర్బంగా చోటుచేసుకున్న మాటల యుద్ధం తాజాగా మరో స్థాయికి చేరుకుంది. కాగా, రాష్ట్ర బడ్జెట్ 2023–24 ప్రతిపాదనలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఆమోద్ర ముద్ర వేయలేదు. దీంతో, ఈ విషయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఫెడరల్ వ్యవస్థ, లౌకిక విధానం కాపాడుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులు రాజ్యాంగానికి ఆటంకం కలిగిస్తున్నాయి. వక్రబుద్దితో రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తున్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించాలి. శాసన సభ, శాసన మండలి, గవర్నర్ ఎవరైనా సరే ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకునుఏ ధోరణిలో ఉండాలి అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం.. గవర్నర్ సిఫారసుల కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. అయితే గవర్నర్ పుదుచ్చేరిలో ఉండడంతో ఈ ప్రతిపాదనలు ఇప్పటివరకు రాజ్‌భవన్‌లోనే ఉండిపోయాయి. -
గవర్నర్ తమిళిసైకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కౌంటర్
సాక్షి, వరంగల్: తెలంగాణలో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజ్‌భవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ఈ ఏడాది కూడా సీఎం కేసీఆర్, మంత్రులు డుమ్మా కొట్టారు. దీంతో, కేసీఆర్ ప్రభుత్వం తీరుపై గవర్నర్ తమిళిసై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. కాగా, మంత్రి ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి గవర్నర్‌కు కనిపించడం లేదా?. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత అభివృద్ధి జరిగిందా?. గవర్నర్ వ్యవస్థను కించపరిచేలా తమిళిసై వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి గవర్నర్‌ను చూడలేదు. అంతపెద్ద సెక్రటేరియేట్ నిర్మాణం జరిగితే కనిపించడం లేదా.. అది అభివృద్ధి కాదా?. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి మిషన్ భగీరథ మంచి నీళ్లు ఇస్తున్నాము. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతోంది. రైతు సంక్షేమ తెలంగాణలో గవర్నర్‌కు ఆత్మహత్యలు కనిపిస్తున్నాయా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. -
బీజేపీ జెండాతో వచ్చానా?
యాదాద్రి దర్శనానికి వెళ్లినప్పుడు నేనేమైనా బీజేపీ జెండా పట్టుకున్నానా? నేను నా భర్తతో కలసి ఒక సామాన్య భక్తురాలిగా గుడికి వెళ్లాను. ఈవో, కలెక్టర్ ప్రొటోకాల్ ప్రకారం వచ్చారా లేదా అనేది పట్టించుకోలేదు. సీఎం, మంత్రులు, సీఎస్ రాజ్‌భవన్‌లో అడుగుపెట్టకుండా ఉండేందుకు వారికి ఉన్న సమస్యలు ఏమిటో చెప్పాలి. మీడియాలో చెప్పడానికి ఇష్టపడకపోతే నేరుగా వచ్చి సమస్యలు ఏమిటో చర్చిస్తే సమాధానం చెబుతా. నేను ఎక్కడికైనా ప్రయాణించాలంటే రెండు మార్గాలే అందుబాటులో ఉన్నాయి. కొంతకాలంగా కేవలం రోడ్డు లేదా రైలు మార్గంలోనే ప్రయాణిస్తున్నా. హెలికాప్టర్లో ఎందుకు ప్రయాణించట్లేదన్న విషయాన్ని మీడియానే తెలుసుకోవాలి. – గవర్నర్ తమిళిసై సాక్షి, న్యూఢిల్లీ: తాను బీజేపీకి అనుకూలంగా ఎన్నడూ వ్యవహరించలేదని, ప్రజలకు సేవకురాలిగానే ఉన్నానని, రాజ్యాంగ బద్ధంగా బాధ్యతలను నిర్వర్తిస్తున్నానని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ టీఆర్ఎస్ నేతలు తనపై చేసిన విమర్శలను ఆమె తీవ్రస్థాయిలో తిప్పికొట్టారు. తాను కేవలం స్వామి దర్శనం చేసుకోవడానికి మాత్రమే యాదాద్రికి వెళ్ళానని, అయితే మరుసటి రోజు ప్రొటోకాల్ పాటించలేదని, ఎవరూ రాలేదని మీడియా రిపోర్ట్ చేసిందని చెప్పారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రాజకీయం చేస్తున్నానంటూ ఏవిధంగా మాట్లాడతారని ప్రశ్నించారు. రాష్ట్ర గవర్నర్‌గా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించే తాను యాదాద్రి ఆలయానికి వెళ్తే.. బీజేపీ వ్యక్తిగా వెళ్ళానని ఎలా ఆరోపిస్తారని పరోక్షంగా మంత్రి జగదీశ్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీ పార్లమెంట్ భవన్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సుమారు 50 నిమిషాల పాటు చర్చించారు. గురువారం ఢిల్లీలో అమిత్ షాకు జ్ఞాపికను అందిస్తున్న తమిళిసై ఇటీవల హైదరాబాద్‌లో బయటపడ్డ డ్రగ్స్ అంశాన్ని ఆమె హోంమంత్రితో ప్రత్యేకంగా చర్చించారని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సమగ్ర విచారణ చేయాల్సిన అవసరం ఉందని కోరినట్లు తెలిసింది. ఈ భేటీ అనంతరం తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలను ప్రస్తావించగా వాటిని తీవ్రంగా ఖండిం చారు. ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. కలిసేందుకు అందరికీ అవకాశం ఇచ్చా.. నేను చాలా ఫ్రెండ్లీ (స్నేహపూర్వకంగా మెలిగే) వ్యక్తిని. తెలంగాణ ప్రజలకు ఏదైనా మేలు చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను. నేను ఏమైనా బీజేపీ వారిని తరచుగా కలుస్తున్నానా..? మీకు కావాలంటే గత రెండేళ్ళ అపాయింట్ మెంట్లను బహిరంగపరుస్తా. ఎన్ని రోజులు ఏ పార్టీ నాయకులను కలిశానో తెలుస్తుంది. అన్ని రాజకీయపార్టీల నాయకులు కలిసేందుకు నేను అవకాశమిచ్చా. బీజేపీ నేతలకు ఒకటి, రెండుసార్లు మాత్రమే అవకాశం ఇచ్చా. ఏదో మాట వరుసకు ఆరోపించడం సరికాదు. ఈ అన్ని విషయాలను రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతున్నా. తెలంగాణలో జరుగుతున్నది ఓపెన్ సీక్రెట్. నేను దాచేదేమీ లేదు. సమ్మక్క సారక్క జాతర సమయంలో ప్రొటోకాల్ పాటించలేదని నేనేం మీడియాకు చెప్పలేదు. స్థానిక ఎమ్మెల్యే సీతక్క అక్కడ జరిగిన విషయాలను మీడియాకు బహిరంగపరిచారు. కలెక్టర్, ఎస్పీ ఎవరూ అక్కడికి రానప్పుడు ప్రొటోకాల్ పాటిస్తున్నట్లు ఎలా చెప్తారు? గణతంత్ర, ఉగాది వేడుకలకు ఎందుకు రాలేదు? ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు ఎవరూ రాకపోవడం అనేదే అసలు సమస్య. రాజ్‌భవన్‌ని ఈ విధంగా అవమానించడం, విస్మరించడం ఎందుకు? గణతంత్ర వేడుకలకు, ఉగాది సంబరాలకు ఎవరూ ఎందుకు రాలేదు? నేను గవర్నర్ అనే విషయం పక్కన పెట్టండి. రాజ్‌భవన్‌లో ఉన్న ఒక సోదరిగా నేను చూపించే ఆప్యాయతను గౌరవించాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒక సోదరికి మర్యాద ఇవ్వాలా వద్దా..? అనేదే నా ప్రశ్న. గ్యాప్‌పై సీఎం, మంత్రులనే అడగండి.. తెలంగాణలో అందరం అన్నాచెల్లెళ్ళలా కలిసి ముందుకు వెళ్తున్నాం. అలాంటప్పుడు నాలాంటి ఒక మహిళను అవ మానించడం, విస్మరించడం ఎంతవరకు కరెక్ట్? నేను సీఎంతో మాట్లాడేందుకు చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఆయన మాట్లాడేందుకు ముందుకు రావాలి కదా. రాజ్‌భవన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ ఎందుకు వచ్చిందనేది సీఎం, మంత్రులనే అడగాలి. రాజ్‌భవన్ రాజకీయ పార్టీ కార్యాలయం కాదు గవర్నర్‌గా నేను రాజకీయం చేస్తున్నానని టీఆర్ఎస్ నేతలు ఎలా అంటారు? చాలా బాధ్యతాయుతంగా ఉండే నన్ను రాజకీయం చేస్తున్నానని ఎందుకు అంటున్నారో చెబితే వారికి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా. రాజ్‌భవన్ రాజకీయ పార్టీ కార్యాలయం కాదు. అక్కడ జరిగే కార్యక్రమాల వెనుక పోస్టర్లో రాష్ట్రపతి, ప్రధాని ఫొటోలు ఉంటా యి. ఇటీవల జరిగిన ఉగాది కార్యక్రమంలో నా ఫొటో వాడాల్సిన అవసరం లేదని కూడా చెప్పా. అందులో సీఎం ఫోటో వాడకపోవడం యాధృచ్ఛికమే. అంతకుముందు జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం బ్యాక్‌డ్రాప్ పోస్టర్లో సీఎం ఫొటో ఉంచాం. ఆయనను ఆహ్వానించినా రాలేదు. ఇదేనా గవర్నర్‌కు మీరిచ్చే గౌరవం? ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటా.. కొన్ని నెలలుగా రాష్ట్రంలో పర్యటించే సమయంలో రోడ్డు లేదా రైలు మార్గంలోనే ప్రయాణిస్తున్నా. సమ్మక్క సారక్క జాతరకు, నాగర్కర్నూల్కి రోడ్డు మార్గంలోనే వెళ్ళాను. భద్రాచలం శ్రీరామకల్యాణానికి.. దూరం ఎక్కువగా ఉన్నం దున రైలు మార్గం ద్వారానే వెళ్తున్నాను. అక్కడ రెండ్రోజుల పాటు గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తా. ప్రభుత్వం నుంచి సహాయం అందినా, అందకపోయినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉంటా. ఏ అవాంతరం నా ప్రయాణాన్ని ఆపబోదు. చదవండి: ట్రైనింగ్ విద్యార్థిని.. రికార్డులపై సంతకాలు కావాలంటే ఇంటికి రావాలంటూ.. -
గవర్నర్‌తో సీఎం భేటీ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 6 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం పొందిన బడ్జెట్ ప్రసంగం ప్రతిని సీఎం కేసీఆర్ గవర్నర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌తో శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించారు. 6న గవర్నర్ ప్రసంగంతో శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. 7న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అధికార, విపక్షాలు సభలో చర్చించనున్నాయి. 8న శాసనసభలో సీఎం కేసీఆర్, శాసనమండలిలో ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. ఈ విషయాలను సీఎం కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితి అదుపులోనే ఉంది.. రాష్ట్రంలో కోవిడ్–19 మహమ్మరి ప్రవేశించిన నేపథ్యంలో వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను సీఎం కేసీఆర్ గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం. పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం పేర్కొన్నట్టు తెలిసింది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమై ఉందని స్పష్టంచేసినట్టు సమాచారం. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మంచి ఫలితాలిచ్చాయని, పారిశుద్ధ్యం మెరుగైందని, దీంతో అంటురోగాలు ప్రబలే అవకాశాలు సన్నగిల్లిపోయాయని గవర్నర్‌కు వివరించినట్టు సమాచారం. -
మ్యూజియంగా పీవీ ఇల్లు
భీమదేవరపల్లి: మాజీ ప్రధాని దివంగత పీవీ నర్సింహారావు స్వగ్రామమైన వరంగల్ అర్బన్ జిల్లా వంగరలోని ఆయన స్వగృహం మ్యూజియంగా మారనుంది. పీవీ శతజయంతి ఉత్సవాల నేపథ్యంలో ఆయన స్మారకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో పీవీ ఉపయోగించిన 150 వస్తువులు ప్రదర్శనకు ఉంచుతారు. వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో నూతన గృహప్రవేశంతో పాటు మ్యూజియాన్ని గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ చేత ప్రారంభించేందుకు కుటుంబీకులు ప్రయత్నిస్తున్నారు. -
తమిళిసైపై అసభ్య పోస్టులు
టీ.నగర్: వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో తమిళిసై సౌందరరాజన్ గురించి అసభ్యంగా పోస్టులు చేసిన మహిళపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర బీజేపీ ఫిర్యాదు చేసింది. బీజేపీ నాలుగేళ్ల ప్రగతి గురించి బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయాలను వ్యతిరేకిస్తూ మహిళ ఒకరు వాట్సాప్, ఫేస్బుక్లో పోస్టులు చేశారు. ఇందులో తమిళిసైపైన అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ నిమిషం 10 సెకండ్ల వీడియో నమోదైంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని బీజేపీ, మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇలావుండగా దీని గురించి రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో డీజీపీ టీకే రాజేంద్రన్‌కు బీజేపీ రాష్ట్ర ఐటీ విభాగం అద్యక్షుడు ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదులో ఈ విధంగా తెలిపారు. కొన్ని రోజులుగా వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో సూర్య ఆరో అనే మహిళ బీజేపీ రాష్ట్రాధ్యక్షురాలు తమిళిసై, ముఖ్యమంత్రి ఎడపాడిలను అసభ్య పదజాలంతో దూషిస్తూ పోస్టులు చేసినట్లు తెలిపారు. దీంతో ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
నిన్న ప్రశంస నేడు విమర్శ
సాక్షి, చెన్నై : దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్ మద్దతు కోసం బీజేపీ అధిష్టానం తీవ్రంగానే కుస్తీలు పడుతోంది. రాష్ట్రంలోని కమలనాథులు అయితే, పొగడ్తల వర్షం కురిపించే పనిలో పడ్డారు. తన రూటే సపరేటు అని చెప్పుకొచ్చే కథానాయకుడు బీజేపీ వర్గాల పొగడ్తలకు పడిపోలేదు. ఏకంగా తనకు సీఎం అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఆఫర్ చేసినా ఖాతరు చేయలేదు. ‘‘నా దారి రహదారి.. బె టర్ డోండ్ కమ్ ఇన్ మై వే...’’ అన్నట్టుగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు పరామర్శ పేరిట మద్దతు లేఖాస్త్రం సంధించి బీజేపీ వర్గాలకు షాక్ ఇచ్చారు. అయితే, బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదని, రజనీ తన వెంటనే అన్నట్టుగా ప్రశంసించారు. అయితే డీఎంకే వర్గాలకు, కాంగ్రెస్ నేతలకు తన అపాయింట్ మెంట్ ఇచ్చి బీజేపీ వర్గాలకు రజనీ షాక్ ఇచ్చారు. దీంతో నిన్న మొన్నటి వరకు రజనీకాంత్‌ను స్తుతిస్తూ వ్యాఖ్యలు చేసినోళ్లు ఇప్పుడు విమర్శలకు సిద్ధమయ్యూరు. ఢిల్లీ వేదికగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ రజనీపై విమర్శ ఎక్కు బెట్టడం గమనించాల్సిన విషయం.విమర్శ: రాష్ట్ర పార్టీకి కొత్త ఇన్చార్జ్గా రాజీవ్ ప్రతాప్ రూడీ నియామకంతో ఢిల్లీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ పరుగులు తీశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితుల్ని, రాష్ట్ర కమిటీ ఎంపిక వివరాలు, సర్వ సభ్యసమావేశం ఏర్పాటుకు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు. కేంద్ర సమాచార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలుసుకుని ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలకు సంబంధించిన ఫిర్యాదు చేశారు. అనంతరం తమిళ మీడియా ముందుకు వచ్చిన ఆమె రాష్ట్రంలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా చేపట్టనున్న కార్యక్రమాల్ని వివరించారు. నవంబరులో పార్టీ సభ్యత్వానికి శ్రీకారం చుట్టనున్నామని, కోటి మంది సభ్యుల్ని చేర్చడం లక్ష్యంగా ముందుకు సాగనున్నామని వివరించారు. 2016లో బీజేపీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రజనీ రాజకీయ ప్రవేశం, బీజేపీకి మద్దతు గురించి మీడియా ప్రశ్నలు సంధించగా, ఆయన దయతో తాము పార్టీని నడపడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న వాళ్లను పెద్దోళ్లు చేసేంత సాహసం తాము చేయబోమన్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలతో వ్యంగ్యాస్త్రం సంధించడం గమనార్హం. శ్రీరంగం ఉప ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెడతారా? అని ప్రశ్నిస్తే, చర్చించి నిర్ణయం వెల్లడిస్తామంటూనే, తాము ఎవరి దయతో ముందుకు సాగడం లేదన్న విషయాన్ని గుర్తుంచుకోండంటూ ముగించారు. అయితే, ఆమె వ్యాఖ్యల్ని రజనీ అభిమానులు ఏ మేరకు పరిగణనలోకి తీసుకుని స్పందిస్తారోనన్నది వేచి చూడాల్సిందే. -
రజనీకి గాలం
సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ఎలాగైనా రాజకీయాల్లోకి దింపడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. అధిష్టానం వ్యూహాల అమలు లక్ష్యంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం లత రజనీకాంత్‌ను ఆమె కలుసుకోవడంతోపాటుగా, రజనీ, కమల్ లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి దించేందుకు గతంలో అభిమాన లోకం చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీకావు. అభిమానుల ఒత్తిడి శ్రుతి మించడంతో తలొగ్గిన రజనీ కాంత్ ‘దేవుడు ఆదేశిస్తే... రాజకీయాల్లోకి వస్తా..’ అన్న మెలిక పెట్టారు. అభిమానుల నోళ్లకు తాళం వేయించారు. అయితే, ఎన్నికల సమయాల్లో ‘రజనీ రాజకీయాల్లోకి రా...!’ అన్న నినాదం తెరపైకి రావడం సహజంగా మారింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి దింపే ప్రయత్నాలు వేగవంత మయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో రజనీ కాంత్‌కు ఉన్న మిత్రత్వం ఇందుకు ఓ కారణం. దక్షిణాదిలో కర్ణాటకలో బలంగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బలం పుంజుకుంటున్నా, తమిళనాడులో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా బీజేపీ పరిస్థితి ఉంది. లోక్ సభ ఎన్నికల్లో మోదీ ప్రభావంతో ఓ సీటును తన్నుకెళ్లినా, ఈ ప్రభావానికి సినీ గ్లామర్‌ను తోడు చేసి తమిళనాడులోనూ పాగా వేయాలన్న లక్ష్యంతో బీజేపీ అధిష్టానం వ్యూహ రచనల్లో ఉంది. ఇందుకు గాను రజనీకాంత్‌ను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు కార్యాచరణ సిద్ధం చేశారు. రంగంలోకి తమిళి సై : తొలి విడత మంతనాల బాధ్యతల్ని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్‌కు బీజేపీ అధిష్టానం అప్పగించింది. దీంతో రజనీ కాంత్‌ను రాజకీయాల్లోకి దించడమే లక్ష్యంగా తన ప్రయత్నాల్ని తమిళి సై వేగవంతం చేశారు. రజనీ కాంత్‌తో సంప్రదింపులకు ముందుగా ఆయన సతీమణి లతారజనీకాంత్‌తో భేటీ కావడం గమనార్హం. నవరాత్రి సందర్భంగా తొమ్మిది రోజుల పాటు బొమ్మల కొలువును రజనీ కాంత్ ఇంట్లో ఏర్పాటు చేశారు. చివరి రోజు పోయేస్ గార్డెన్‌లోని ఆయన ఇంటికి ఈ బొమ్మల కొలువు సందర్శన నిమిత్తం తమిళి సై సౌందరరాజన్ వెళ్లారు. బొమ్మల కొలువుకు పూజల అనంతరం లతా రజనీ కాంత్‌తో భేటీ అయ్యారు. ఈ భేగా సమయంలో రజనీ కాంత్ ఇంట్లో లేని దృష్ట్యా, తాను చెప్పదలచుకున్న విషయాల్ని లతా రజనీ కాంత్ ముందు ఉంచినట్టు సంకేతాలు వెలువడ్డాయి. మరో మారు వచ్చి రజనీ కాంత్‌ను కలుస్తానని చెప్పి, మోదీ జీవిత చరిత్ర పుస్తకాన్ని తమిళి సై అందజేశారు. వాస్తవమే: తాను రజనీ కాంత్ ఇంటికి వెళ్లడం వాస్తవమేనని, లత రజనీ కాంత్‌తో భేటీ అయినట్టు తమిళి సై స్పష్టం చేశారు. రజనీ కాంత్, ప్రధాని నరేంద్ర మోదీ మంచి మిత్రులు అని పేర్కొంటూ, రజనీ కాంత్, కమల్ లాంటి వారు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కరువవుతోందన్నారు. ఈ సమయంలో రజనీ కాంత్ రాజకీయాల్లోకి రావడం లేదా, బీజేపీకి మద్దతుగా నిలబడటం లక్ష్యంగా తమ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. డీఎంకే, అన్నాడీఎంకేలు దొందు దొందేనని, అవినీతి ఊబిలో కూరుకున్న ఈ పార్టీలకు పట్టం కట్టే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని పేర్కొన్నారు. అందుకే సమాజ హితాన్ని కాంక్షించే రజనీకాంత్, కమల్ లాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలని పిలుపు నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అసాధారణ పరిస్థితులు నెలకొన్న సమయంలో రజనీ ఏదో ఒక రూపంలో గళం వినిపిస్తున్నారని, ప్రస్తుతం అదే పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా దాన్ని ఓ మారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రజనీ కాంత్‌ను త్వరలో కలవనున్నట్టు పేర్కొన్నారు.