సాక్షి, హైదరాబాద్: టీఎస్‌ఆర్టీసీ విలీన డ్రాఫ్ట్ బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదంతో ఆర్టీసీ బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. గవర్నర్ ఆమోదించిన ఆర్టీసీ డ్రాఫ్ బిల్లును అధికారులు అసెంబ్లీకి తీసుకొచ్చారు.
తమిళిసైతో జరిగిన భేటీ వివరాలను రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివసరాజు సీఎం కేసీఆర్‌కు తెలపనున్నారు. ఈమేరకు ఆయన అసెంబ్లీలోని సీఎం ఛాంబర్‌కు వెళ్లారు. దీంతో అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన ఇవాళే ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెటే అకాశముంది.
కాగా ఆర్టీసీ బిల్లును ఆమోదించే ముదు ఆర్టీసీ ఉన్నతాధికారులతో గవర్నర్‌తో భేటీ అయ్యారు. రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, పలువురు ఆర్టీసీ అధికారులు తమిళిసైను రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం కలిశారు. గవర్నర్ అడిగిన వివరాలను అందించారు. తాత్కాలిక ఉద్యోగుల భవితవ్యంపై తమిళిసై ఆరాతీశారు. అధికారులు తెలిపిన వివరాలపై సంతృప్తి చెందిన గవర్నర్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
చదవండి: బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అక్బరుద్దీన్ ప్రశంసలు.. కేసీఆరే మళ్లీ సీఎం!
Comments
Please login to add a commentAdd a comment