Telangana Assembly Monsoon Session
-
మీరు కోరినట్లు చేస్తే మేం ప్రతిపక్షంలో ఉంటాం: సీఎం రేవంత్
హైదరాబాద్, సాక్షి: ప్రతిపక్ష నేత కేసీఆర్ వచ్చి రైతు భరోసా మీద సలహాలు ఇస్తారని అనుకున్నానని, సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే రావట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో భూభారతి, రైతు భరోసాలపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.బీఆర్ఎస్ హయాంలో క్రషర్ యూనిట్లకు, మైనింగ్ భూములకు రైతు బంధు ఇచ్చారు. లేఅవుట్లు వేసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. రోడ్డు విస్తరణలో పోయిన భూమికి కూడా రైతు బంధు ఇచ్చారు.మేము ఇచ్చినట్లు గానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని కేటీఆర్ అంటున్నారు. మీరు ఇచ్చినట్లు ఇస్తే..మేము ప్రతిపక్షం లో ఉంటాం. ఆ తర్వాత బయటకు వెల్లాల్సి వస్తుంది. కేసీఆర్ చేసిన ఘనకార్యానికి ఇప్పుడు ఆయన సభకు రాలేకపోతున్నారు..గుట్టలు, రోడ్డు, రియలెస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వాలా? వద్దా? బీఆర్ఎస్ సమాధానం చెప్పాలి. మా ప్రభుత్వం సూచనలను తీసుకోవడానికి సిద్ధం గా ఉంది. బీఆర్ఎస్ సభలో ఎంత చిల్లరగా వ్యవహరించినా ఓపికతో ఉన్నాం’ అని రేవంత్ అన్నారు.అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రవర్తన, చిత్ర విచిత్ర వేషాలు ప్రజలు గమనిస్తున్నారు. అబద్ధాల సంఘానికి అధ్యక్షుడు సభకు రాలేదు. ఉపాధ్యక్షుడు వచ్చారు.మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రైతుభరోసాపై సలహాలు ఇస్తారనుకున్నాం. కానీ అలా జరగడం లేదు.గత పదేళ్ల పాలనపై సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే సభకు రావడం లేదేమోఒకసారి అధికారం.. మరోసారి డిపాజిట్లు కోల్పోయిన బీఆర్ఎస్ నేతల తీరు మారడం లేదు. మీరు లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి ఆపసోపాలు పడ్డారు. కానీ మేం మీలా కాదు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రుణమాఫీ చేశామని అన్నారు. -
అదే నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేస్తా: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలకు మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఏ గ్రామంలోనైనా రుణమాఫీ పూర్తయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై శనివారం చర్చ కొనసాగుతుంది. చర్చలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా ఇవ్వలేదు.రెండు పంటలది రైతు భరోసా ఇవ్వలేదు.ఏడాది కాంగ్రెస్ పాలనలో రూ.17వేల బాకి పడ్డారు.రూ.26వేల కోట్లు రైతులకు బాకీ పడ్డారు.రైతులకు ఉన్న బకాయిలను క్లియర్ చేసి...కొత్త రైతు భరోసా రైతులకు ఇవ్వాలి.రుణమాఫీ రూ.40 వేల కోట్లు సిఎం రేవంత్ రెడ్డి అన్నారు...కేబినెట్లో రూ.31వేలు అయ్యింది. బడ్జెట్ కి వచ్చే సరికి రూ.26 వేల కోట్లయ్యింది.రుణమాఫీ కాలేదు...కొండారెడ్డి, సిరిసిల్ల పోదామా? ఏ ఊరిలో అయినా రుణమాఫీ పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎన్నికల హామీలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి’అని కేటీఆర్ సూచించారు. -
తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య.. -
ఫార్ములా ఈ రేస్ కేసుపై అసెంబ్లీలో కేటీఆర్ సవాల్
అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి.. సభలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్.. -
అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నేడు ఆర్వోఆర్ బిల్లును.. -
భట్టిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్లో రాష్ట్ర అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. సోమవారం ఈ అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆయన చాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులపై శాసనసభ, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ‘2023 డిసెంబర్ 20న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలంగాణ అప్పులను రూ.6.71 లక్షల కోట్లుగా చూపించారు. ఈ ఏడాది జూలై 25 నాటి బడ్జెట్ ప్రసంగంలోనూ ఇవే అంకెలను వల్లె వేశారు. కానీ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’నివేదికలో 2014–15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72, 658 కోట్లు కాగా 2024 మార్చి నాటికి రూ.3.89 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది.కానీ ఆర్థిక మంత్రి అప్పులపై ఉద్దేశ పూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు. ఈ నేప థ్యంలో ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం’అని బీఆర్ఎస్ ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులకు భంగం: కేటీఆర్ ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అప్పులపై తప్పుదోవ పట్టిస్తున్నందునే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ లాబీలో తనను కలసిన మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. ‘గతంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసును నాటి స్పీకర్ మనోహర్ అంగీకరించి సభలో చర్చకు వీలు కల్పించారు.ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు అప్పులపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా కేవలం టూరిజంపైన రాష్ట్ర ప్రభుత్వం చర్చ పెట్టడం బాధాకరం. రాష్ట్రంలో ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం బాగా నడుస్తున్నాయి. శాసనసభలో లగచర్ల అంశానికి సంబంధించిన అంశాన్ని చర్చకు తీసుకురావాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలను కూడా అడ్డుకుంటున్నారు ‘గతంలో ఎన్నడూ లేని రీతిలో మాజీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వైపు రాకుండా అడ్డుకుంటున్నారు. గతంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎంను కలిసే అవకాశం ఉండేది. ప్రస్తుతం కనీసం ప్లకార్డులను కూడా తీసుకురాకుండా అడ్డు కుంటున్నారు. మమ్మల్ని కట్టడి చేసి, ప్రభుత్వం తన వైఫల్యాలను దాచుకోవాలని అనుకుంటున్నది. రైతు కూలీలకు రూ.12 వేల అర్థిక సహాయం చేస్తామని ఆర్థిక మంత్రి భట్టి చేసిన ప్రకటన అసెంబ్లీ వ్యవహారాలకు విరుద్ధం. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడు విధానపరమైన నిర్ణయాలను సభలోనే ప్రకటించాలన్న అంశాన్ని భట్టి విక్రమార్క విస్మరించారు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
వాకౌట్.. వాయిదాలు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల రెండో రోజు సోమవారం బీఆర్ఎస్ నిరసన లు, వాకౌట్, అధికారపక్ష సభ్యుల విమర్శల మధ్య శాసనసభ అర్ధంతరంగా ముగిసింది. ఈ నెల 9న అసెంబ్లీ సమావేశాలు లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ ఒక్క రోజే భేటీ నిర్వహించి, 16వ తేదీకి (సోమవారానికి) వాయిదావేశారు. ఈమేరకు సోమవారం ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశం ప్రారంభమైనా.. ప్రశ్నోత్తరా లు, సంతాప తీర్మానాలు, ప్రభుత్వ బిల్లుల ప్రతిపాదనకే పరిమితమైంది.మాజీ సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం నిర్దిష్ట హామీ ఇవ్వలేదని నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ ప్రశ్నోత్తరాల సమయంలో సభ నుంచి వాకౌట్ చేసింది. ప్రశ్నోత్తరాలు, టీ విరామం తర్వాత సభ తిరిగి సమావేశంకాగానే.. ‘లగచర్ల’అంశంపై చర్చకోసం బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఈ గందరగోళంతో స్పీకర్ సభ ను మంగళవారం ఉదయానికి వాయిదా వేశారు. నిర్దేశిత సమయంలోనే ప్రశ్నోత్తరాలు సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలకు సంబంధించి స్పీకర్ ప్రకటన చేశారు. రోజూ గంటపాటు జరిగే ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో.. పది ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఆరు నిమిషాల సమయం లభిస్తోందని తెలిపారు. కానీ నిర్దేశిత సమయంలో పూర్తి చేయకపోవడం, కొన్ని ప్రశ్నలు మిగిలిపోవడంతో సభ్యులు అసంతృప్తి చెందుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సభ్యులు, మంత్రులు ప్రశ్నలు, సమాధానాలు సూటిగా, క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. సంతాప తీర్మానాలు.. బిల్లులు.. ⇒ ఉమ్మడి ఏపీ శాసనసభలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు దివంగత సభ్యులకు శాసనసభ రెండు నిమిషాల పాటు సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవి (మెట్పల్లి), ఊకె అబ్బయ్య (బూర్గంపాడు, ఇల్లందు), డి.రామచంద్రారెడ్డి (దొమ్మాట) మరణం పట్ల స్పీకర్ ప్రసాద్‌కుమార్ సంతాప తీర్మానం ప్రతిపాదించారు. ⇒ ‘యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణ బిల్లు 2024’ను సీఎం రేవంత్ పక్షాన మంత్రి శ్రీధర్‌బాబు సభకు సమరి్పంచారు. ‘తెలంగాణ యూనివర్సిటీస్ (సవరణ) బిల్లు–2024’ను సీఎం తరఫున మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. వాయిదా తీర్మానాలన్నీ తిరస్కరించిన స్పీకర్ ⇒అసెంబ్లీ సమావేశాల రెండో రోజున బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ సభ్యులు ఇచి్చన పలు వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు. ⇒ ‘లగచర్ల’అంశంపై చర్చించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, విజయుడు, మర్రి రాజశేఖర్‌రెడ్డి వాయిదా తీర్మానం ప్రతిపాదించారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులి దాడులను అరికట్టడం, బాధితులకు పరిహారం అందించే అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్, పాయల్ శంకర్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ⇒ మూసీ ప్రక్షాళన, హైడ్రాపై చర్చించాలంటూ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వాయిదా తీర్మానం ఇచ్చారు. -
కేటీఆర్‌కు స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. ‘నేను స్పీకర్‌ని. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. బీఆర్ఎస్ ఓడిపోయినా ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు. నేను స్పీకర్ కావడానికి బీఆర్ఎస్ కూడా మద్దతు ఇచ్చింది. సీనియర్ సభ్యుడిగా ఉన్న కేటీఆర్ స్పీకర్‌పై ఈ రకమైన వాఖ్యలు చేయడం సరైంది కాదు. బీఆర్ఎస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోతోంది. శాసన సభలో ప్రతిపక్షానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోవడం లేదు’అని వ్యాఖ్యానించారు. అంతకుముందు అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ తీరుపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘శాసనసభ ప్రారంభానికి ముందే మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారు. మొదటి రోజే మమ్మల్ని లోపలికి రాకుండా పోలీసులతో అరెస్టు చేయించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా సమస్యలను ఎత్తిచూపేందుకు నిరసన తెలిపితే అరెస్టు చేశారు. మా పార్టీ శాసనసభ్యుల అక్రమ పార్టీ ఫిరాయింపుల పైన నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చివేత ధోరణి అవలంబిస్తున్నారు. గత శాసనసభ సమావేశాల్లోనూ మా పార్టీ సభ్యుల గొంతు నోక్కేల వ్యవహరించారు. మాకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు. మా శాసన సభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్త శాసనసభ్యులు ఉన్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహార శైలికి నిరసనగా రేపటి నుంచి జరగనున్న ఓరియంటేషన్ సెషన్‌ను బహిష్కరిస్తున్నాము. ఇప్పటికైనా స్పీకర్ పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నాము’’ అని ట్వీట్లో పేర్కొన్నారు. తాజాగా, కేటీఆర్ వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ పై విధంగా వ్యాఖ్యానించారు. -
బీఆర్ఎస్ నేతల టీ షర్ట్స్పై రేవంత్ ఫొటో.. అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నేతలు.. అదానీ-రేవంత్ ఉన్న ఫొటోతో టీ షర్టులు వేసుకుని వచ్చారు. దీంతో, వారిని పోలీసులు అడ్డుకున్ని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చారు. ఈ క్రమంలో వారంతా రేవంత్, అదానీలు కలిసి ఉన్న ఫొటోలతో టీ షర్టీలు ధరించి అసెంబ్లీ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ గేటు నెంబర్-2 వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. టీ షర్టులు ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వదం జరిగింది. అనంతరం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తుతాం. రేవంత్-అదానీ ఒక్కటై తెలంగాణ ప్రజలతో ఆడుకుంటున్నారు. ప్రతీ సమస్యపై అసెంబ్లీలో మాట్లాడుతాం. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలను ఎండగడతాం.అనంతరం, హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్-అదానీ టీషర్టు వేసుకుని సభలోకి వస్తే ఇబ్బందేంటి?. ప్రజా ప్రతినిధులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యం అవుతుందా?. అదానీ, రేవంత్ రెడ్డి భాయ్, భాయ్. అరెస్ట్ చేసి, గొంతు నొక్కి మమ్మల్ని ఆపలేరు. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీ ఎమ్మెల్యే Vs మంత్రులు
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా కొనసాగే అవకాశం ఉంది.. -
ఎస్వోటీ, గ్రేహండ్స్ తరహాలో హైడ్రా: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: నగరాభివృద్ధికి హైడ్రాను సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఔటర్ లోపల ఉన్న నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ రోడ్లపై నీరు ఆగకుండా ఉండేందుకు వాటర్ హార్వెస్టింగ్‌లను ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. మూసీని సబర్మతి, లండన్ థీమ్స్ తరహాలో డెవలప్ చేస్తాం. త్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్లను నియమిస్తామని సీఎం పేర్కొన్నారు.ఎస్వోటీ, గ్రేహండ్స్ తరహాలోనే హైడ్రా తెస్తున్నాం. దీని పరిధి 2వేల కిలోమీటర్లకు విస్తరించాం. ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకే సంస్కరణలు తెస్తాం. నగరంలో సరస్సులు అదృశ్యమవుతున్నాయని.. నాలాల కబ్జాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోందని రేవంత్ అన్నారు.మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు జలాల తరలింపునకు ప్రణాళిక సిద్ధం చేశామన్న సీఎం.. రూ.6 వేల కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి ఇచ్చామని రేవంత్ చెప్పారు. -
తెలంగాణలో జాబ్ క్యాలెండర్, స్కిల్ వర్సిటీ: మంత్రి శ్రీధర్ బాబు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు. రాబోయే రోజుల్లో దీని ద్వారా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పుకొచ్చారు. అలాగే, ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు.కాగా, తెలంగాణ అసెంబ్లీలో నేడు ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేస్తాం. రెండు లక్షల ఉద్యోగాలు కల్పించినా.. ఇంకా లక్షలాది మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ప్రభుత్వ పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదు. గ్రాడ్యుయేట్లలో పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు కొరవడ్డాయి. వారిలో స్కిల్స్ పెంపుపై పారిశ్రామిక వేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించాం.ఇందులో భాగంగానే ‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’ స్థాపనకు ప్రతిపాదిస్తున్నాం. అన్ని కోర్సులు 50 శాతం ప్రాక్టికల్ కాంపోనెంట్ కలిగి ఉంటాయి. నైపుణ్యాలు, ఉపాధి అంతరాల పరిష్కారం కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నాం. స్కిల్ యూనివర్సిటీ ఉపాధి కల్పిస్తుంది.. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుంది. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు ఊతమిస్తుంది. 2024-25 సంవత్సరంలో 2వేల మంది విద్యార్థులకు.. వచ్చే ఏడాది 10వేల మందికి శిక్షణ ఇస్తాం. ముచ్చర్లలో స్కిల్ వర్సిటీ కోసం శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పుకొచ్చారు.ఇక, మంత్రి శ్రీధర్ బాబు ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీధర్ బాబు ప్రసంగం ఆపాలని కామెంట్స్ చేశారు. దీంతో, బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీరియస్ అయ్యారు. సభలో గందరగోళం చేస్తున్న బీఆర్ఎస్ సభ్యుల తీరు సరికాదు. పదేళ్ళు పాలించిన బీఆర్ఎస్ సభ్యులకు సభ రూల్స్ తెలియవా?. నిరుద్యోగ యువత కోసం బిల్లు తెస్తే అడ్డుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలు సిద్దాంత పరంగా వేరు అయినా బిల్లుకు మద్దతు ఇచ్చారు. స్లోగన్స్ ఇవ్వడానికి అసెంబ్లీ ఫ్లాట్ ఫాం కాదు. యువతకు సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై చర్చ జరుగుతుంటే సహకరించాలి కదా? అని ప్రశ్నించారు. మరోవైపు.. బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ కూడా మండిపడ్డారు. -
సబితపై రేవంత్ వ్యాఖ్యలు.. కేటీఆర్ రియాక్షన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మహిళలను సీఎం రేవంత్ అవమానించారని.. వారంటే సీఎంకు గౌరవం లేదని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ వ్యాఖ్యలు బాధాకారం.. ‘అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని అంటారా?’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ, తమ మహిళా శాసనసభ్యులపైన అకారణంగా సీఎం నోరు పారేసుకున్నారన్నారు.ఈ అవమానం కేవలం సబితక్క, సున్నితక్కకు జరిగింది కాదు.. తెలంగాణ ఆడబిడ్డలు అందరి పట్ల జరిగిన అవమానం. నోరు జారితే ఎవరైనా వెనక్కి తీసుకుంటారు కానీ కండకావరంతో సీఎం ఆడబిడ్డలను అవమానించారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తగుల్తది. మా ఇద్దరూ మహిళా నేతలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి నేతలైన గొప్ప ఆడబిడ్డలు. ప్రజల దీవెనలు కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లు. నీ లెక్క పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్లు కారు.. సీఎం గుర్తుంచుకోవాలి’’ అని కేటీఆర్ హితవు పలికారు.‘‘ఇప్పటికైనా ముఖ్యమంత్రి సిగ్గు తెచ్చుకొని... బుద్ధి తెచ్చుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఏ మొహం పెట్టుకుని వచ్చినవని ఉప ముఖ్యమంత్రి అనడం అన్యాయం. ఆడబిడ్డల గురించి అంత దారుణంగా మాట్లాడే అధికారం నీకు ఎవరు ఇచ్చారు భట్టి. పదేళ్లు అధికారంలో ఉన్న ఏరోజైనా ఒక్కరోజైనా ఆడబిడ్డలను అవమానించామా. సీఎంను ఏకవచనంతో మాట్లాడానని అని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నాం.. అది మాకు కేసీఆర్ నేర్పించిన సంస్కారం’’ అని కేటీఆర్ చెప్పారు. -
పద్దులపై చర్చ.. సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి: స్పీకర్ గడ్డం ప్రసాద్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది: కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం గత ప్రభుత్వం రైతుల ఆదాయం డబుల్ చేస్తానని చెప్పిందిరైతులను రారాజు చేస్తామని చెప్పి మోసం చేసింది.వడ్లు వేయాలని చెప్పి.. కొనుగోళ్లు మాత్రమే చెయ్యలేదు.పత్తి వేయొద్దని.. గత ప్రభుత్వం చెప్పింది..అదే ఏడాది పత్తి రేట్లు భారీగా పెరిగింది నిన్న 18 గంటలు...19 పద్దుల పై చర్చ జరిగింది: స్పీకర్ గడ్డం ప్రసాద్పద్దుల పై వరుసగా ఒకేసారి సభ్యులు మాట్లాడాలిసమయాన్ని దృష్టిలో పెట్టుకొని వరుసగా అన్ని పద్దుల పై మాట్లాడాలిసభ సజావుగా జరిగేందుకు నిన్న అందరూ సహకరించారు.ఇవాళ సైతం 19 పద్దుల పై చర్చ జరగాలి.. సభ్యులు సహకరించాలిప్రారంభమైన తెలంగాణ శాసన సభఆరో రోజు శాసన సభ సమావేశాలుప్రశ్నోత్తరాల సమయం రద్దు చేసిన సభస్కిల్ యూనివర్సిటీ పై మొదలైన చర్చస్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టిన శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుఅసెంబ్లీ ఆవరణలో రైతు రుణమాఫీ రెండో విడత కార్యక్రమం..వ్యవసాయ ఉత్పత్తులతో వేధికను అలంకరించిన వ్యవసాయ శాఖలక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కోసం 6 వేల 191 కోట్ల నిధులు కేటాయింపురెండో విడుత నిధులు విడుదల చేయనున సీఎం రేవంత్ రెడ్డి ,డిప్యూటీ సీఎం, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క17 మంది రైతులకు రుణమాఫీ చెక్కు లను అందజేయనున్న సీఎంసాక్షి, హైదరాబాద్: కాసేపట్లో ఆరో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదో రోజు(సోమవారం) 17 గంటలకు పైగా జరిగిన శాసనసభ.. వేకువ జామున 3 గంటలల వరకు కొనసాగింది. 19 పద్దులకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇవాళ సభ ముందుకు స్కిల్ యూనివర్శిటీ బిల్లు రానుంది. మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు. నేడు అసెంబ్లీ వేదికగా రూ.లక్షన్నర రుణాల వరకు మాఫీ ప్రకటన చేయనున్నారు.తెలంగాణ శాసనసభ మూడో విడత సమావేశాల్లో ఐదోరోజు 2024–25 వార్షిక బడ్జెట్ పద్దులపై సోమ వారం సుదీర్ఘ చర్చ జరిగింది. సమయపాలన పాటించి డిమాండ్లకు పరిమితమై మాట్లాడాల్సిందిగా స్పీకర్ సభ ప్రారంభమైన వెంటనే కోరారు. డిమాండ్లపై చర్చకు సంబంధించి ఒక్కో సభ్యుడికి 15 నిమిషాలపాటు సమయం కేటాయిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.మధ్యాహ్నం మూడు గంటల వరకు చర్చ కొనసాగుతుందని ప్రకటించారు. ప్రశ్నోత్తరాలు లేకుండానే సోమవారం ఉదయం 19 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే నేరుగా పద్దులపై చర్చ ప్రారంభమైంది. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 19 పద్దులను సంబంధిత శాఖల మంత్రులు ప్రతిపాదించారు.అయితే సభ్యులు తమకు కేటాయించిన సమయం కంటే ఎక్కువ సేపు ప్రసంగించడం, ఒకేరోజు 19 పద్దులను చర్చించి ఆమోదించాల్సి ఉండటంతో సోమవారం అర్ధరాత్రి దాటినా చర్చ కొనసాగింది. -
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. పవర్‌పై వాడీవేడి చర్చ
Updates.. సీఎం రేవంత్ కామెంట్స్..కోర్టు ఇచ్చిన తీర్పును కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు.ఇలా మాట్లాడితే ప్రాసిక్యూలేషన్ చేయాల్సి వస్తుంది.కమిషన్ ఛైర్మన్‌ను మార్చాలని మాత్రమే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.విచారణ ఆపాలని కోర్టు చెప్పలేదు. 2021లో పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్తో ఒప్పందం చేసుకున్నారు.ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదు.రూ.81వేల కోట్లు అప్పులకు కారణమయ్యారు.నల్లగొండ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలని చూస్తున్నారు.పార్లమెంట్ ఎన్నికల్లోనే మీ సంగతి తేలిపోయింది.పవర్ ప్లాంట్ పేరుతో దోచుకున్నారు. 👉మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..మీరు ఫ్లోరోసిన్‌ను మాకు బహుమతిగా ఇచ్చారు.బీహెచ్ఈఎల్కు కాంట్రాక్ట్ ఇస్తే తప్పేంటి?.పవర్ ప్లాంట్ నల్లగొండలో కడితే తప్పు.. వేరే చోట కడితే తప్పా?.సూపర్ క్రిటికల్‌లో అయితే నాలుగేళ్లలో భద్రాద్రి పవర్ ప్లాంట్ పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్ చెప్పింది.బీహెచ్ఈఎల్ సబ్ కాంట్రాక్ట్‌ల్లో మా బంధువు ఒక్కరు కూడా లేరు.మీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా కరెంట్ పోయిందని అధికారులకు ఫోన్ చేశారు.నల్లగొండ తెలంగాణలో లేదా?.కరెంట్ లేదని హెల్ఫ్‌లైన్‌కు ఫోన్ చేస్తే కేసులు పెడుతున్నారు.దానిపై ఎందుకు మాట్లాడటం లేదు?.జీవన్ రెడ్డిపై కూడా కేసు పెడతారా?. 👉గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నాపై మూడు మర్డర్ కేసులు పెట్టారు - జగదీష్ రెడ్డి👉మూడు మర్డర్ కేసుల్లో కోర్టు నిర్దోషిగా తీర్చి కేసులను కొట్టివేసింది - జగదీష్ రెడ్డి.👉మంత్రి కోమటిరెడ్డి నాపై రెండు మర్డర్ కేసుల ఆరోపణలు చేశారు - జగదీష్ రెడ్డి.👉ఆ మర్డర్ కేసులో అంశంపై హౌస్ కమిటీ వేయాలని కోరుతున్నా - జగదీష్ రెడ్డి.👉హౌస్ కమిటీ వేసి నిజా నిజాలు తేల్చాలి - జగదీష్ రెడ్డి.👉హౌస్ కమిటీ ద్వారా నిజాలు తేలుతాయి అప్పుడు రాజీనామా వాళ్లు చేస్తారా నేను చేస్తానా అనేది తెలుస్తుంది.👉నేను ఉద్యమంలో పనిచేశాను ఆ కేసులు ఉన్నాయి.. వాళ్ల లాగా సంచులు మోసిన జీవితం నాది కాదు. - జగదీష్ రెడ్డి👉సంచులు మోసి జైలుకుపోయిన జీవితం నాది కాదు. జగదీష్ రెడ్డి👉రికార్డుల నుంచి తొలగించాలి అంటే ముఖ్యమంత్రి మాట్లాడిన వ్యాఖ్యలను సైతం తొలగించాలి. - జగదీష్ రెడ్డి. 👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి పై వ్యాఖ్యల మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్👉మర్డర్ కేసులో జైశ్వర్ రెడ్డి ఉన్నారు - కోమటి రెడ్డి👉ఏడాది పాటు జగదీష్ రెడ్డిని జిల్లా బహిష్కరించింది - మంత్రి.👉కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదు - జగదీష్ రెడ్డి.👉కోమటిరెడ్డి చెప్పినట్లుగా నా పై కేసులు ఉన్నట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా. - జగదీష్ రెడ్డి👉నిరూపించకపోతే ముఖ్యమంత్రి కోమటిరెడ్డి ఇద్దరు రాజీనామా చేసి ముక్కు నేలకు రాయాలి. - జగదీష్ రెడ్డి👉జగదీష్ రెడ్డి సవాలను స్వీకరిస్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.👉కేసులో రికార్డులు బయటపెడతా... లేకపోతే నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా - కోమటి రెడ్డి వెంకట్ రెడ్ 👉సీఎం రేవంత్‌కు జగదీష్ రెడ్డి కౌంటర్..👉చర్లపల్లి జైలుకు వెళ్లిన విషయాలను రేవంత్ గుర్తు చేసుకుంటున్నారు.👉మేము తెలంగాణ ఉద్యమంలో జైలుకు వెళ్లాను.👉జగదీష్ రెడ్డి సూర్యాపేట రైస్ మిల్లులో దొంగతనం చేసింది మర్చిపోయాడు.👉మర్డర్ కేసులో జగదీష్ రెడ్డి ఏ-2: మంత్రి కోమటిరెడ్డి👉మా జిల్లా నుంచి ఏడాది బహిష్కరించారు.👉రాంరెడ్డి హత్య కేసులో ఏ-6👉లక్షా 80వేల దొంగతనం కేసులో ముద్దాయి జగదీష్ రెడ్డి.👉నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే, రాజకీయాల నుంచి తప్పుకుంటాను. సభలో ముక్కు నేలకు రాసి వెళ్లిపోతాను.👉జగదీష్ రెడ్డి ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నాను.👉నేను చెప్పిన కేసులో జగదీష్ రెడ్డి 16 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాడు.👉కోమటిరెడ్డి మాటలను రికార్డు నుంచి తొలగించాలి. సీఎం రేవంత్ సీరియస్ కామెంట్స్.. సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..కరెంట్ కొనుగోళ్లపై ఎంక్వైరీ చేయమని అడిగింది మీరే.సత్యహరిశ్చంద్రుడు మా నాయకుడి రూపంలో పుట్టారన్నట్టు మాట్లాడారు.జ్యుడీషియల్ కమిషన్ ముందుకెళ్లి మీ వాదన వినిపించి ఉంటే మీ నిజాయితీ తెలిసేది.కానీ, మీరు కమిషన్ విచారణే వద్దు చేయాలని హైకోర్టుకు వెళ్లారు.కోర్టు దాన్ని కొట్టేసింది. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు.విచారణ కొనసాగించాల్సిదేనని సుప్రీంకోర్టు కూడా చెప్పింది.కమిషన్ ఛైర్మన్‌ను మాత్రమే మార్చాలని సుప్రీంకోర్టు చెప్పింది.సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్‌కు కొత్త ఛైర్మన్ పేరును ప్రకటిస్తాం.తెలంగాణను సంక్షోభం నుంచి కాపాడింది సోనియా గాంధీ, జైపాల్ రెడ్డి మాత్రమే.సోనియా గాంధీ దయ వల్ల రాష్ట్రం కరెంట్ సమస్య నుంచి గట్టెక్కింది.లేనిపక్షంలో తెలంగాణ చీకటిమయమయ్యేది.నాడు నేను టీడీపీలో ఉన్నా అసెంబ్లీలో వాస్తవాలు చెప్పాను. దీంతో, నన్నుమార్షల్స్ను పెట్టి బయటకు ఇడ్చుకెళ్లారు. సోలార్ పవర్లో ప్రైవేటు పెట్టుబడులు వచ్చాయి. దీంతో, కరెంట్ ఉత్పత్తి పెరిగింది. సిగ్గులేకుండా ఇంకా మేము విద్యుత్ ఉత్పత్తి చేశామని చెప్పుకుంటున్నారు.బీహెచ్ఈఎల్ నుంచి సివిల్ వర్క్‌లు వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇచ్చారు.ఆఖరికి అటెండర్ పోస్టులు కూడా వాళ్ల బినామీలకే ఇచ్చారు.ఈ సందర్భంగా వాళ్లకు కావాల్సిన వాళ్లకు అనుమతులు ఇచ్చారు. ఇక్కడేవిచారణ అంటే భయపడి కోర్టుకు వెళ్లారు.టెండర్ ఇచ్చి తొమ్మిదేళ్లు అయినా ఇంకా విద్యుత్ ఉత్పత్తి కాలేదు.ఇండియా బుల్స్ నుంచి రూ.1000 కోట్లు దండుకున్నారు.భద్రాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ నీళ్లలో మునిగిపోతోంది. 👉అసెంబ్లీ సమావేశం ప్రారంభమైంది. 👉ఇప్పటి వరకు డిమాండ్ బుక్స్ ఇవ్వలేదన్న జగదీష్ రెడ్డి.👉రాత్రే పంపించామన్న స్పీకర్👉దేనిపై మాట్లాడాలో అర్థం కావడం లేదు: జగదీష్ రెడ్డి.👉పదేళ్లలో రేపు రాత్రి 10 గంటలకు వచ్చి మాట్లాడే వాళ్లు: శ్రీధర్ బాబు👉హరీష్ రావు బుల్డోడ్ చేసేపని పెట్టుకున్నారు. ఇది మానుకోవాలి: శ్రీధర్ బాబు👉మీరు త్వరగా ఇంటికి వెళ్తే మేమేం చేస్తాం: మంత్రి శ్రీధర్ బాబు. 👉పది రోజుల ముందే సభ పెడితే ఏమయ్యేది: జగదీష్ రెడ్డి.👉ఒకేరోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సమంజసమేనా?.👉మీటర్ల విషయంలో సీఎం రేవంత్ సభను తప్పుదోవ పట్టించారు.👉కరెంట్ తలసరి వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.👉ఉదయ్ స్కీమ్‌లో 27 రాష్ట్రాలు చేరాయి.👉ఒప్పందంలో వాళ్లకు అనుకూలమైన అంశాలను మాత్రమే చెప్పారు.👉స్మార్ట్ మీటర్లతో డిస్కంలు చేరాయి. మీటర్ల విషయంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు. 👉అసెంబ్లీలో విద్యుత్‌పై చర్చ.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కామెంట్స్గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరించింది. అందుకే పవర్ సెక్టార్ గందరగోళంగా మారింది. రైతులకు ఉచిత కరెంట్ తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. విద్యుత్ రంగం అస్తవ్యస్తమైంది. యూపీఏ ప్రభుత్వం నిర్ణయం వల్ల 1800 మెగావాట్ల అదనపు కరెంట్ రాష్ట్రానికి వచ్చింది. కేసీఆర్ ఎందుకు రాలేదంటే, మీ స్థాయికి మేము చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇంత పెద్ద విషయంపై చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ సభకు రాలేదు. మీ స్థాయి ఏంటో ప్రజలు మీకు చెప్పారు.కనీసం అధికారులు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు. చేసిన తప్పులు చాలవని ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సభకు రాని వ్యక్తికి ప్రతిపక్ష హోదా ఎందుకు?.విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.విద్యుత్ సంస్థలు ఎందుకు నష్టాల్లోకి వెళ్లాయి?.ఉచిత కరెంట్ ఇచ్చామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటోంది.ప్రతిపక్షంలో ఉండి ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలి.గనులకు 250 కి.మీలకు దూరం ఉన్న దామెరచెర్ల దగ్గర పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టారు?.యాదాద్రి పవర్ ప్లాంట్ ఇప్పటికీ వినియోగంలోకి రాలేదు.పవర్ ప్లాంట్‌లో టెండర్ వ్యవస్థ లేదు. పారదర్శకత లేదు. 👉విద్యుత్ మీటర్ల అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన బీఆర్ఎస్.సీఎం రేవంత్ రెడ్డి మాపై బురద జల్లే ప్రయత్నం చేశారని దీనిపై చర్చకు సిద్దమంటున్న బీఆర్ఎస్.హోం శాఖ, మెడికల్ అండ్ హెల్త్‌పై మాట్లాడనున్న - మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు.ఎడ్యుకేషన్ పై చర్చపై మాట్లాడనున్న- ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.ఎక్సైజ్ , ట్రాన్స్ పోర్ట్ చర్చపై మాట్లాడనున్న - ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.విద్యుత్ చర్చ పై మాట్లాడనున్న - మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిఎం అండ్యూడీ, ఐటీ మున్సిపల్ చర్చపై మాట్లాడనున్న - ఎమ్మేల్యే వివేకా నంద గౌడ్. 👉తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేడు ఐదో రోజు కొనసాగనున్నాయి. ఈరోజు ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇక, నేడు ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పైనే చర్చించనున్నారు.👉మరోవైపు.. నేడు సభలో 19 పద్దులపై శాసనసభలో చర్చ ఉండనుంది. ఆర్థిక నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, విద్యుత్ డిమాండ్లపై, మున్సిపాల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఎంఏయూడీలపై చర్చ జరుగుతుంది.పరిశ్రమల శాఖ పద్దులపై చర్చ..👉ఐటీ, ఎక్సైజ్, హోం, కార్మిక, ఉపాధి, రవాణా, బీసీ సంక్షేమం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, మెడికల్ అండ్ హెల్త్‌పై కూడా చర్చించనున్నారు. 19 పద్దులపై చర్చించిన తర్వాత వాటికి శాసనసభ ఆమోదం తెలుపనుంది. ఇక, ముఖ్యమంత్రి వద్దనే మున్సిపల్, విద్యాశాఖ, హోం శాఖ ఉన్న విషయం తెలిసిందే.👉మోటర్లకు మీటర్లు పెట్టేందుకు 2017లోనే ఉదయ్ స్కీంలో గత ప్రభుత్వం సంతకం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఉదయ్ స్కీంపై సంతకం చేయ్యలేదని, మీటర్లు పెట్టలేదు బీఆర్ఎస్ చెబుతోంది. దీనిపై కూడా సభలో చర్చ జరుగనుంది. ఇదిలాఉండగా.. అసెంబ్లీలో పోడు భూముల సమస్యలపై వాయిదా తీర్మానం ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు -
సభలో మా గొంతు నొక్కుతున్నారు.. హరీష్‌రావు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మా గొంతు నొక్కుతున్నారని.. ఏ పార్టీకి ఎంత సమయం ఇచ్చారో లెక్కలు చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం సభను తప్పుదోవ పట్టించే విధంగా ప్రసంగం చేశారని.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు చేసే ప్రకటనలు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని హితవు పలికారు.‘‘ఉదయ్ స్కీం వల్ల కేంద్ర ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు గతంలో మాకు ఇస్తామన్న మేము ఒప్పుకోలేదు. వ్యవసాయ బోర్డు దగ్గర మీటర్లు పెట్టకూడదని 30 వేల కోట్ల రూపాయలను వదులుకున్నాం. వ్యవసాయ బావుల దగ్గర మీటర్లు కాకుండా.. పాత మీటర్ల చోట కొత్త మీటర్ల అంశం అందులో ఉంది. వ్యవసాయ భూములు మీటర్లు ప్రైవేటుపరం చేయకూడదని మేము కేంద్రం పెట్టిన నిబంధనలకు ఒప్పుకోలేదు. కేంద్రం పెట్టిన నిబంధనలకు మేము ఒప్పుకుంటే ప్రతి ఏడాది 5000 కోట్లు మొత్తం ఐదేళ్లు 30 వేల కోట్లు వచ్చేవి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.హరీష్ రావు వ్యాఖ్యలపై స్పందించిన డిప్యూటీ సీఎంహరీష్ రావు వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్లు పెట్టదు. తలకిందులుగా తపస్సు చేసిన రైతులకు అన్యాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదన్నారు. -
‘మా గ్యారెంటీల సంగతి సరే.. పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసింది?’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏ తప్పు చేసిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. అసెంబ్లీలో బడ్జెట్ చర్చలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయానికి 72 వేల కోట్లు ఇవ్వడం తప్పా?. మహిళలను ఆదుకోవడం తప్పా?. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడం తప్పా?. మా గ్యారెంటీల సంగతి సరే.. పదేళ్లు బీఆర్ఎస్ ఏం చేసింది’’ అంటూ ప్రశ్నించారు.రైతు భరోసాపై అఖిల పక్షం పెట్టబోతున్నాం. వందకు వంద శాతం రైతు భరోసా అమలు చేస్తాం. గతంలో బడ్జెట్‌పై నేను మాట్లాడితే అవహేళన చేశారు. వాస్తవానికి దూరంగా గత బడ్జెట్‌ను పెట్టారు. గత ప్రభుత్వం లాగా మేము బడ్జెట్ పెట్టాలనుకుంటే మూడున్నర లక్షల కోట్లు పెట్టేవాళ్లం. గత ప్రభుత్వం చివరి బడ్జెట్ రెండు లక్షల 90 వేలు పెట్టింది. వాస్తవానికి దగ్గరగా ఉండాలని మేము ఒక వెయ్యి మాత్రమే పెంచాము. గత ప్రభుత్వం లాగా మేము గాలి బడ్జెట్ పెట్టలేదు.’’ అని భట్టి విక్రమార్క చెప్పారు.‘‘ప్రతి నియోజకవర్గంలో స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాం. స్పష్టమైన విద్యుత్ పాలసీ తీసుకురాబోతున్నాం. వరుస సమీక్షలతో పాలన పరుగులు పెడుతోంది. మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రణాళికలు వేస్తున్నాం. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్శిటీ పెట్టబోతున్నాం. 2035 వరకు విద్యుత్ ప్రణాళికను సిద్ధం చేశాం. రాబోయే 20 ఏళ్లు మేమే అధికారంలో ఉంటాం.’’ అని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు.‘‘రుణమాఫీపై మమ్మల్ని రైతులు నమ్మారు. బడ్జెట్‌పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఇచ్చిన మాటను మేం నిలబెట్టుకుంటాం. పదేళ్లలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు. రైతు రుణ మాఫీ చేస్తామంటే అభినందించడం పోయి విమర్శిస్తున్నారు. రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం. ఇరిగేషన్‌పై కూడా ఆరోపణలు చేస్తున్నారు’’ అంటూ భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
డిప్యూటీ సీఎం చేస్తా..! అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్
సాక్షి, హైదరాబాద్: ఓల్డ్ సిటీ అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. అభివృద్ధి చేయకపోను ఓల్డ్ సిటీ వాసులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో పాతబస్తీకి మెట్రో విషయంలో ఇరువురి మధ్య మాటల యుద్ధ జరిగింది. పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూళ్ల కోసం ఆదాని సంస్థకు అప్పగించారు. కేవలం పాతబస్తీని ఎందుకు సెలెక్ట్ చేశారు?. సీఎం నియోజకవర్గం కొడంగల్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గం, శ్రీధర్ బాబు నియోజకవర్గం ఎందుకు పైలెట్ ప్రాజెక్టుగా పరిగణలోకి తీసుకోలేదంటూ అక్బరుద్దీన్ ప్రశ్నించారు.అక్భరుద్దీన్ ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానమిస్తూ.. మెట్రో విషయంలో పాతబస్తీని గత ప్రభుత్వం మోసం చేసిందని.. ఎట్టి పరిస్థితుల్లో పాతబస్తీలో మెట్రో నిర్మిస్తామని రేవంత్ అన్నారు. అది ఓల్డ్‌సీటీ కాదు.. ఒరిజినల్ సిటీ. రెండో విడత మెట్రో విస్తరణపై బీఆర్ఎస్ కాకి లెక్కలు చెప్పింది. పాతబస్తీలో మెట్రో నిర్మాణం చేపట్టాలని ఎల్అండ్ టీకి చెప్పాం. లేదంటే చర్లపల్లి, చంచల్‌గూడ జైలుకు వెళ్లాల్సి వస్తుందని చెప్పానని రేవంత్ అన్నారు.‘‘కాంగ్రెస్ బీ ఫామ్‌పై అక్బరుద్దీన్ పోటీ చేస్తే కొడంగల్‌లో గెలిపించే బాధ్యత నాది.. డిప్యూటీ సీఎంను చేసి పక్కనే కూర్చోబెట్టుకుంటా’’ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా.. మజ్లిస్ పార్టీలో తాను సంతోషంగానే ఉన్నానని.. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానంటూ అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. -
ఎవరి పాలనలో పవర్ కట్ ఎక్కువ ?
-
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ పాలన.. విమర్శలతో అట్టుడికిన అసెంబ్లీ
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు శనివారం వాడీవేడీగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై.. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఒకరినొకరు విమర్శలతో సభను అట్టుడికించారు.ఈ మేరకు అసెంబ్లీలో శనివారం హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు ఎత్తేస్తామని అని అన్నారు.. ఏమైందని ప్రశ్నించారు. బీర్ల ధరలు పెంచి, ప్రజలపై భారం వేస్తారా అని ప్రశ్నించారు. బెల్ట్ షాపులు ఎత్తేస్తే రూ. 42 వేల కోట్లు ఆదాయం ఎలా వచ్చిందని నిలదీశారు. రూ. 7 వేల కోట్ల ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలని, ఎక్సైజ్‌పై ఆదాయం పెంచి ప్రజలపై భారం వేయొద్దని అన్నారు.రుణమాఫీ విషయంలో చాలా కోతలు పెట్టారని అన్నారు హరీష్ రావు. రూ. 31 వేల కోట్ల రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పారని కానీ.. కోతలతో రూ. 31 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్లుకు తగ్గిస్తారా? అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ రూ. 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం సంతోషమే కానీ వైద్యశాఖకు బడ్జెట్ తగ్గిస్తే ఇది ఎలా సాధ్యమవుతుందని విమర్శించారు. గత ప్రభుత్వ పథకాలను మేం అధికారంలోకి వచ్చాక కొనసాగించామని గుర్తు చేశారు.కేసీఆర్ పేరు నచ్చకపోతే మార్చుకోండి.. కానీ కిట్లను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాల కోసం పేదల కడుపు కొట్టకండని తెలిపారు. అప్పుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ 6 లక్షల 71 వేల 757 కోట్లు అప్పు చేసిందని పదే పదే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం ఏర్పడేనాటికి ఉన్న అప్పులు 72 వేల కోట్లు అని.. 72 వేల 658 కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చినట్లు తెలిపారు. అయితే 7 లక్షల కోట్లు అప్పు చేశామని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.‘బీసీలకు రూ. 9 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టారు. మైనార్టీలకు మంత్రివర్గంలో చోటులేదు. ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరగలేదు. ఉద్యోగులకు కొత్త పీఆర్సీకి అనుగుణంగా కేటాయింపులు లేవు. అభయ హస్తం శూన్య హస్తంలా మారింది. పాలమూరు వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణం. మహబూబ్‌నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం. వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. సోనియా గాంధీతో అబద్దాలు చెప్పారు. మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయాలి. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేని 15 వందల గ్రామాలకు బస్సులు నడపాలి. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి’ అని అన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. తమ బడ్జెట్ చూసి హరీష్ రావుకు కంటగింపుగా ఉందని విమర్శించారు. మంత్రి జూపల్లి గల్లి గల్లీకి బెల్ట్ షాపు పెడతా అని అన్నారా? అని ప్రశించారు. ప్రతిపక్ష నేత బడ్జెట్ పెట్టే సమయంలో సభకు వచ్చారని.. మళ్లీ నేడు సభకు రాలేదని తెలిపారు. హరీష్‌రావు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.పదేళ్లు రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారని అన్నారు భట్టి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిక తీసుకొచ్చారని దుయ్యబట్టారు. తాము నెల నెల ఉద్యోగులకు జీతాలు ఇచ్చేపని మొదలు పెట్టినట్లు తెలిపారు. హారీష్ రావు ఎందుకు సభను తప్పుదోవ పట్టిస్తారని ప్రశ్నించారు. పూర్తి సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైన్ షాపు టెండర్లు ముందే ఎందుకు పెట్టారని.. టానిక్ లాంటి దుకాణాలు పెట్టి సర్కార్‌కు డబ్బులు రాకుండా , కొన్ని కుటుంబాలకు వెళ్లేలా చేశారని మండిపడ్డారు. తాము అలా చేయమని.. సర్కార్ సొమ్ము ప్రజలకే చేరేలా చేస్తామని చెప్పారు.2017లో ఆనాటి సీఎం మీటర్లు బిగిస్తామని మోదీతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సభను తప్పుదోవ పట్టించినప్పుడు సరిద్దాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నామని, విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు.‘బీఆర్ఎస్ తీరు వల్లే కేంద్ర బడ్జెట్లో నిధులు రాలేదు. గతంలో బతుకమ్మ చీరలు ఇస్తే మహిళలు తగలబెట్టిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతుకుతారు. బతుకమ్మ చీరల విషయంలో అవినీతి జరిగింది. గొర్రెల పథకంలో రూ. 77 కోట్లు స్వాహా చేశారు.. బీఆర్ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్ల మీద విచారణకు సిద్ధమా?పాలమూరు జిల్లా కేసీఆర్‌కు ఏం అన్యాయం చేసింది. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి బీఆర్ఎస్ దుర్మార్గం కారణం కాదా?రంగారెడ్డి జిల్లాకు, కొడంగల్‌కు గోదావరి జలాలు ఇవ్వొద్దని కుట్ర చేశారు రంగారెడ్డి జిల్లాకు, కొడంగల్‌కు గోదావరి జలాలు ఇవ్వొద్దని కుట్ర చేశారు. బీఆర్ఎస్ ఆలోచన మారలేదు.. విధానం మారలేదు. అబద్దాలు రికార్డుల్లో ఉంటే కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు నిజమనుకునే ప్రమాదం ఉంది. పూర్తిగా సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు’ అని రేవంత్ పేర్కొన్నారు.గతంలో హరీస్ రావు ఓ డమ్మీ మంత్రి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిఅబద్దాలు, గారడీలు అంటే బీఆర్ఎస్సేఅధికారంలోకి వస్తే దళితుడిని సీఎంనుచేస్తా అని కేసీఆర్ అన్నారు.హరీష్ రావు దగ్గర సబ్జెక్ట్ లేదు.ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతా అన్న కేసీఆర్.. ఇవాళ సభకు రాలేదు.చీల్చి చెండాడుతా అన్న కేసీఆర్ బడజెట్పై స్పందించలేదు.మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబుబీఆర్ఎస్ నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం -
బడ్జెట్‌పై కేసీఆర్ వ్యాఖ్యలు తగదు.. జగ్గారెడ్డి
ప్రతిపక్షనేత కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై ఆయన స్పందించారు.కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్.. రాష్ట్ర ప్రజలకు దగ్గరగా ఉండే బడ్జెట్. గత పదేళ్ల కాలంలో హైప్ బడ్జెట్..కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రాక్టీకల్ అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ పదేళ్ల బడ్జెట్ ఊహల్లో విహరించిన బడ్జెట్ అన్న ఆయన.. కాంగ్రెస్ నాయకత్వం వాస్తవానికి ఎప్పుడూ దగ్గరగా ఉంటుందని తెలిపారు. ప్రజా సంక్షేమం కోరి ప్రవేశ పెట్టిన బడ్జెట్ వ్యవసాయానికి పెద్ద పీట వేయడంతో అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తే.. గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వం అప్పులకే ప్రాధాన్యత ఇచ్చిందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. -
రేవంత్ Vs కేటీఆర్.. మాటల దాడితో హీటెక్కిన సభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యద్ధం నడిచింది. మేనేమెంట్ కోటా మంత్రి అంటూ కేటీఆర్ కామెంట్స్ చేయగా.. తండ్రి పేరుతో తాను రాజకీయ పదవులు పొందలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్.కాగా, సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. బడ్జెట్లో భాగంగా కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం తీర్మానం అంటుంది కానీ, మాకు తీర్మాన కాపీ రాలేదు. బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై మాట్లాడం ఇష్టం లేదనుకుంటాను అంటూ వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ స్పందిస్తూ.. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సభకు ప్రతిపక్ష నాయకుడు రాలేదు. సభకి వచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్‌కు భయమేస్తోంది. సభ నుంచి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎంత హడావిడి చేసినా సభ నుంచి బయటకు పంపొద్దు. ఢిల్లీలో చీకటి ఒప్పందాలు బయటపడతాయిన బీఆర్ఎస్ భయపడుతోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తండ్రి పేరుతో తాను రాజకీయం చేయడం లేదంటూ కౌంటరిచ్చారు. నేనేమీ మేనేజ్మెంట్ కోటాలో మంత్రి, ముఖ్యమంత్రి కాలేదని కామెంట్స్ చేశారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ విమర్శలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ.. తానేమీ పేమెంట్ కోటాలో పదవులు పొందలేదన్నారు. తండ్రి పేరు అంటే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీని ముఖ్యమంత్రి అంటున్నారా? అని ప్రశ్నించారు. దీంతో, వీరి మధ్య మాటల యుద్ధం నడిచింది. సభలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. -
హరీష్ Vs సీఎం, మంత్రులు.. సభలో వాడీవేడీ చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా సభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడి చర్చ నడుస్తోంది. ఆర్టీసీ అంశంపై హరీష్ రావు వ్యాఖ్యలకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కౌంటరిచ్చారు. దీంతో, మూడు సభ్యులు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.హరీష్‌రావు కామెంట్స్..ప్రభుత్వం భాధ్యతారహితంగా సమాధానం చెబుతోంది.ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తుంది.ఆర్టీసీ పీఆర్సీని ప్రభుత్వం రాగానే ఇస్తాం అన్నారు.ఆర్టీసీ ఉధ్యోగులను ఎప్పటిలోగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో చెప్పాలి.300 కోట్లు పీఆర్సీ బకాయి చెక్కులు ఫిబ్రవరిలో ఇచ్చారు.ఇంతవరకు అది బస్‌భవన్‌కు చేరలేదు.ఆర్టీసి ప్రభుత్వంలో విలీనంపై ఎందుకు జాప్యం జరుగుతుంది..మంత్రి పొన్నం ప్రభాకర్ జాప్యం జరగటం లేదని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు.కొత్త యూనియన్లు ఎప్పటిలోగా పునరుద్దరిస్తారు.ఆర్టీసీలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వటం లేదుగతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాము.కొత్త బస్సుల ప్రారంభం నాడు 300కోట్లు చెక్ చూపించారుమహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇచ్చింది ఎంత?సీసీఎస్ డబ్బులు మళ్ళించి కార్మికులకు జీతాలు ఇచ్చారా లేదా?హరీష్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..హరీష్ రావుకు క్వశ్చన్ అవర్‌లో క్వశ్చన్ అడిగాలని తెలియదా?ఈ ఉపన్యాసం ఏంటి?.కాంగ్రెస్ మేనిఫెస్టోను హరీష్ రావు బట్టి పట్టారు.. చాలా సంతోషం.సభ్యులు ప్రశ్నలు మాత్రమే అడగండి.. ఉపన్యాసాలు వద్దు.ప్రశ్నోత్తరాల సమయంలో నిరసన చేసే హక్కు సభ్యులకు సభలో లేదు.బీఆర్ఎస్ నాయకులు సభ రూల్స్ తెలుసుకోవాలి.హరీష్ రావు రూల్స్ గురించి మాట్లాడుతున్నారు అందుకే చెప్తున్నా.బీఆర్ఎస్కు ఏదైనా అభ్యంతరం ఉంటే వేరే ఫార్మాట్ ద్వారా రావాలి శ్రీధర్ బాబు వ్యాఖ్యలపై స్పందించిన హరీష్..శ్రీధర్ బాబు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి.ప్రశ్నోత్తరాల సమయంలో సరైన సమాధానాలు రాక గతంలో కాంగ్రెస్ చాలాసార్లు వాకౌట్ చేసింది.ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..ఆర్టీసీ కార్మికుల గురించి హరీష్ రావు మాటలు హస్యాస్పదం.కార్మిక సంఘాలను రద్దు చేసి ఆర్టీసీని చంపేశారు.ఆర్టీసీ కార్మికులు చనిపోతే పట్టించుకోలేదు.2013 నుంచి ఆర్టీసీకి బకాయిలు ఉన్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని విడుదల చేసాము.ఆర్టీసీ ఏడువేల కోట్ల అప్పులతో బీఆర్ఎస్ మాకు అప్పగించింది.మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెల రెండు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది.మూడు వేల ఉద్యోగాలు నియామకం చేశాము.ఓవర్ లోడ్ అవుతుంది.కానీ కార్మికులకు డబుల్ పేమెంట్ జరుగుతుంది.గత మూడు నెలల నుంచి ఆర్టీసీ లాభాల్లో నడుస్తోంది.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను ఎండీగా పెట్టీ ఆర్టీసీని బీఆర్ఎస్ నడిపించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆర్టీసీ ఆస్తులను అప్పనంగా అప్పగించారుఆర్టీసీకి అన్యాయం జరగకుండా భవిషత్లో అన్ని చర్యలు తీసుకుంటాంబీఆర్ఎస్ పార్టీకి ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత లేదురిటైర్డ్ ఈడీనీ ఆర్టీసీకి ఎందుకు ఎండీగా పెట్టిందో చెప్పాలి? హరీష్‌కు సీఎం రేవంత్ కౌంటర్హరీష్ రావు సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రి.హరీష్ రావుకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది.స్పీకర్ కుర్చీపై ఆరోపణలు చేయడం ఏ మంత్రికి తగదు.ఆర్టీసీ అంశం ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య.ఆర్టీసీ కార్మికుల దీక్షలు చేసి 50 మంది చనిపోయినప్పుడు.. ఆనాడు ప్రభుత్వం వివక్ష చూపింది.సీపీఐ కార్మికుల కోసం కొట్లాడింది వాళ్ల కోసం మాట్లాడడానికి సీపీఐకి అవకాశం ఇచ్చారు.హరీష్ రావు మాట్లాడుతుంది చట్టాలకు విరుద్ధం.ఎవరు ప్రశ్న అడిగితే వాళ్లకే అవకాశం ఇవ్వాలి అన్నది రూల్‌లో లేదుప్రశ్నోత్తరాలు సభకు వస్తే అది సభ సొంతమవుతుంది.సభ సభ్యులందరి ఆస్తి.ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్నది చైర్ విచక్షణ మీద ఉంటుంది.రూల్ బుక్కు గురించి బీఆర్ఎస్ అసలు విషయం తెలుసుకోవాలి.గతంలో ఎమ్మెల్యే తన సీటును వదిలి పక్కకు వస్తే సభ నుంచి సస్పెండ్ చేశారు.గతంలో బీఆర్ఎస్ ఆనవాయితీలను ఇప్పుడు కూడా కొనసాగించాలని వాళ్లు కోరుకుంటున్నారు.కుటుంబం వల్ల కార్మిక సంఘాలను గత ప్రభుత్వం రద్దు చేశారు.కార్మికులను కార్మిక సంఘాలను రద్దుచేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కొత్తగా బీఆర్ఎస్ బురద చల్లుతుంది.హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు.సభలో కొత్త సభ్యులు ఉన్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. -
TS Assembly: కేసీఆర్‌ను ఢిల్లీకి రమ్మనండి, కలిసి దీక్ష చేస్తాం: సీఎం రేవంత్
Updates..👉తెలంగాణ శాసనసభ రేపటికి వాయిదా పడింది. గురువారం మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.👉 ‘కేంద్ర బడ్జెట్’పై తీర్మానానికి బుధవారం తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం’ అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నేడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ముందు పెట్టారు. కేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో తీర్మానంకేంద్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.అసెంబ్లీలోని సభ్యులకు తీర్మానం పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి జరగాలని ఏపీ విభజన చట్టంలో పొందుపర్చారు.తెలంగాణకు అన్యాయం జరగకుండా చట్టం చేశారు. గడిచిన పదేళ్లు ఆ చట్టాలను అమలు చేయలేదు.గత ప్రభుత్వం కేంద్రాన్ని నిలదీయలేదు.కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగింది వాస్తవం: హరీష్ రావుమీరు అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామంటే రావడానికి మేము సిద్ధంఢిల్లీలో దీక్ష చేద్దాం రమ్మంటే సిద్ధం.నిరుద్యోగుల గురించి కేటీఆర్ దీక్ష చేయాలని సీఎం అన్నారురుణమాఫీ గురించి నన్ను దీక్ష చేయాలని సీఎం అన్నారుఅన్ని మేమే చేస్తే.. మీరేం చేస్తారు?ఉద్యమ సమయంలో రాజీనామా చేకుండా పారిపోయింది మీరు.పదవులు గడ్డిపోసలెక్క విసిరేసింది మేముఢిల్లీలో మంత్రులు ఆమరణ దీక్ష చేయాలన్ని కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ కౌంటర్కేసీఆర్ను ఢిల్లీకి రమ్మని చెప్పండి.నేను కూడా దీక్షలో కూర్చుంటా.ఇద్దరం సచ్చుడో, నిధులు తెచ్చుడో చుద్దాం.చావునోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చామని మేము చెప్పలేదు.మేము ఎవరి శవాలపై రాజకీయాలు చేయలేదుకేటీఆర్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్సీఎం కూడా సీనియర్ సభ్యులుఆయనకు సభా వ్యవహారాలు తెలుసుసభా నాయకుడికి అనుభవం లేదని కేటీఆర్ మాట్లాడటం సరికాదుబీజేపీకి కోపం వస్తుందని కేటీఆర్ విషయాన్ని వదిలేసి అన్నీ మాట్లాడారు.రాష్ట్ర ప్రయోజనాల కంటే బీఆర్ఎస్కు రాజకీయ ప్రమోజనాలు ముఖ్యంఅమృత్ నిధుల అంశంపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.అమృత స్కీం కింద వచ్చిన నిధుల గురించి మాట్లాడి అసలు విషయం డైవర్ట్ చేస్తున్నారు.రాజకీయ విషయాలు కాకుండా రాష్ట్రానికి పనికొచ్చే విషయాలు మాట్లాడాలిఅమృత్ స్కీం కింద వచ్చిన నిధులకు టెండర్ల ప్రక్రియ సాగుతోంది - విప్ ఆది శ్రీనివాస్సగం తప్పుదారి పట్టించేలాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి.బీజేపీ ప్రభుత్వం అయోధ్యలో ఓడిపోయింది. ఆదిశ్రీనివాస్ విప్ఓటమి గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదు - ఏలేటి మహేశ్వర్ రెడ్డితెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అక్కడ బిజెపి గెలిచింది .బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్కేంద్రం అమృత్ పథకం కింద 3500 కోట్లు ఇచ్చింది.ఆ 3,500 కోట్లను ఎవరికి తెలియకుండా కాంగ్రెస్ మంత్రులు పంచుకున్నారు.మా నియోజకవర్గానికి మూడు కోట్లు అడిగితే మంత్రులు ఇవ్వడం లేదు.మంత్రుల వాళ్ల నియోజకవర్గాలు అభివృద్ధి జరిగితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగినట్లు కాదు.అమృత్ నిధులు టెండర్లు లేకుండా మంత్రులు లెక్కలేసుకొని పంచుకున్నారుభట్టి విక్రమార్క కామెంట్స్..కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే మంచిది.బీజేపీని అంటే బీఆర్ఎస్ ఎందుకు బయపడుతోంది. కేటీఆర్ కామెంట్స్..మేము ఎవరితోనూ చీకటి ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం లేదు.ఆరు గ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తూనే ఉంటాం.కేంద్ర ప్రభుత్వం సహాయం చేయకున్నా గత పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం. మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..విభజన చట్టాన్ని కేంద్రం అమలు చేయాలి.ఇప్పటికైనా సమయం మించిపోలేదు.బడ్జెట్ ఆమోదం పొందడానికి ముందే సవరణలు చేయాలని కోరుతున్నాంవిభజన హామీల అంశాల్లో ఒక్కటి లేదు.కేంద్రంపై అందరం కలిసి ఫైట్ చేద్దాం.బీజేపీ తెలంగాణ ప్రజలపై వివక్ష చూపిందివిభజన చట్టం ప్రకారం తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులు ఇవ్వాలితెలంగాణకు ఎనిమిది మంది ఎంపీలు ఇచ్చారు.నిధులు రాబట్టడంలో బీజేపీ తెలంగాణ ఎంపీలు విఫలం అయ్యారు.దేశంలో తెలంగాణ భాగం కాదా?కేంద్రం తెలంగాణను ఎందుకు మర్చిపోయింది?కేంద్రం, బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల యద్ధంకేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై ప్రభుత్వం తీర్మానం అంటుంది.కానీ, మాకు తీర్మాన కాపీ రాలేదు. రేవంత్ రెడ్డికి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంపై మాట్లాడం ఇష్టం లేదనుకుంటానురేవంత్ కామెంట్స్..కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్.రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సభకు ప్రతిపక్ష నాయకుడు రాలేదు.సభకి వచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్‌కు భయమేస్తోంది.సభ నుంచి వెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నం చేస్తున్నారు.బీఆర్ఎస్ ఎంత హడావిడి చేసినా సభ నుంచి బయటకు పంపొద్దు.ఢిల్లీలో చీకటి ఒప్పందాలు బయటపడతాయిన బీఆర్ఎస్ భయపడుతోందితండ్రి పేరుతో తాను రాజకీయం చేయడం లేదు.నేనేమీ మేనేజ్మెంట్ కోటాలో మంత్రి, ముఖ్యమంత్రి కాలేదు.కేటీఆర్ కౌంటర్..పేమెంట్ కోటాలో పదవులు పొందలేదు.తండ్రి పేరు అంటే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీని ముఖ్యమంత్రి అంటున్నారా? అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్..నిధుల కేటాయింపులో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందిటూరిజం డెవలప్మెంట్ అంశంలో తెలంగాణకు నిధులు నిల్.నిధులు ఇవ్వాలని కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరాం కేంద్ర బడ్జెట్‌పై మంత్రి సీతక్క ట్వీట్ఇది ఎన్డీఏ బడ్జెట్, ఇండియా బడ్జెట్ కాదుతనను భయపెట్టే బాబు, నితీష్ మీద మోదీ ప్రేమ కురిపించారుఏపీకి 15వేల కోట్లు, బీహార్‌కు 26 వేల కోట్లుఇది యూనియన్ బడ్జెట్ కాదు, కుర్చీ కాపాడుకునే బడ్జెట్ It’s NDA Budget, not INDIA Budget.AP Budget 15,000 cr Bihar Budget 26,000 cr Modi ji showed love on those who he fears ( Babu & Nithish )It’s not union Budget it’s Kursi Bachao Budget @RahulGandhi @revanth_anumula @kharge #KursiBachaoBudget #Budget2024— Danasari Seethakka (@seethakkaMLA) July 24, 2024 👉రేవంత్ తీర్మానం.. తెలంగాణకు అన్యాయం జరిగింది అని సభలో చర్చ జరపాలని తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డిఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కామెంట్స్..సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు పోతుందిరుణమాఫీ చేయడంతో రైతుల కుటుంబాలు పండుగ చేసుకుంటున్నారురాహుల్ గాంధీ వరంగల్‌లో ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశారుత్యాగాల కుటుంబం గాంధీ కుటుంబంరుణమాఫీ చేసినందుకు తెలంగాణ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారురుణమాఫీ చేసినందుకు యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ప్రసాదం లడ్డులు అసెంబ్లీలో పంపిణీ చేసాం. అసెంబ్లీ లాబీలో హరీష్‌రావు చిట్‌చాట్..కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత లేదు.వీహెచ్ వంటీ సీనియర్ నేతకు ఏ పదవి దక్కలేదు.నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చిన కేశవరావుకు మాత్రం పదవి ఇచ్చారు.మరో సీనియర్ నేత కోదండరెడ్డిని కూడా పక్కకు పెట్టారు.అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి చిట్‌చాట్..బీఆర్ఎస్కు సభలో మాట్లాడేందుకు వాయిస్ లేదువాయిస్ లేదు కాబట్టే ఆర్టీసీ అంశాన్ని మాట్లాడింది.బీఆర్ఎస్కు అసెంబ్లీలో హరీష్ రావు తప్ప వేరే లీడర్లు లేరు.బీఆర్ఎస్ పార్టీ పోయి తీహార్ జైల్లో పడింది.ఇక, వాళ్ల పార్టీలో ఎవ్వరూ ఉండరు.కేంద్రం తెలంగాణకు మొండి చెయ్యి చూపించింది.తెలంగాణ పేరు ఎత్తకుండా సెంట్రల్ బడ్జెట్ పెట్టడం వివక్షే.తెలంగాణలో బీజేపీకి మంచి గుణపాఠం చెప్తం.సెంట్రల్ బడ్జెట్‌పై రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడలేక వాయిస్ పోయింది. అసెంబ్లీ లాబీలో మంత్రి సీతక్క చిట్‌చాట్..10 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో ప్రజా స్వామ్యం కనిపిస్తోంది.బీఆర్ఎస్ హయంలో అసెంబ్లీలో ప్రొటెస్ట్ చేస్తే సస్పెండ్ చేసే వారుతెలంగాణ ఏర్పడిందే నియామకాల కోసం అలాంటి నియామకాలు మీద అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ స్పందించలేదు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలతో పాటు, జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చాంఅధికారం పోయాక బీఆర్ఎస్కు నిరుద్యోగులు గుర్తుకు వచ్చి ప్రొటెస్ట్ చేయటం హాస్యాస్పదంగా ఉంది.పదేళ్లుగా ఉద్యోగాల భర్తీని పట్టించుకోని బీఆర్ఎస్, జాబ్ క్యాలెండర్ కోసం డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందిఅసెంబ్లీ పోడియంలోకి వెల్లినా, ప్లకార్డులు ప్రదర్శించినా గత ప్రభుత్వం సస్పెండ్ చేసేదికానీ మా ప్రభుత్వం అలా చేయడంలేదుగతంలో నిరసనలను అణగదొక్కిన బీఆర్ఎస్, ఇప్పుడు నిరసనకు దిగడం ఆశ్చర్యంబీఆర్ఎస్ నిరసనలతో రాష్ట్రంలో ఎంత ప్రజాస్వామ్యం ఉందో అర్థం అవుతుందిఉద్యోగాల భర్తీలో ఉన్న చిక్కు ముడులను విప్పి నియామకాలు చేపట్టాముత్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం గ్రూప్ పరీక్షలపై సభలో హరీష్ రావు కామెంట్స్..జీవో-55 ప్రకారం 1:50 క్యాన్సిల్ చేసిందికాస్ట్ వారీగా మేము 1:50 మేము తీసుకున్నాం.కానీ ఇప్పుడు రేవంత్ సర్కార్ దాన్ని తొలగించి జీవో-29 తెచ్చింది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నారుసీఎం రేవంత్ 1:100 సాధ్యం కాదు అంటున్నారు.కానీ 2006లో వైఎస్సార్ ఈ రేషియో ప్రకారం గ్రూప్-1 చేశారు.వైఎస్ జగన్ గ్రూప్-2 కూడా చేశారువాళ్లకు లేని ఇబ్బంది. మీకు ఎందుకు వస్తుందిగ్రూప్-2, గ్రూప్-3 ఉద్యోగాల సంఖ్య పెంచండి అంటున్నాముఇబ్బంది వస్తుంది అని సీఎం రేవంత్ అంటున్నారు.కానీ మేము యాడ్ చేశాం.. మాకు రాని లీగల్ సమస్య మీకు ఎందుకు వస్తుంది2008-09లో కాంగ్రెస్ సర్కార్ పోస్టుల సంఖ్య పెంచిందికానీ రేవంత్ సర్కార్ మాత్రం పోస్టుల సంఖ్యను పెంచడం లేదుపలు సమస్యలపై హరీష్ కామెంట్స్..ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందిరాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారుఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంఆర్టీసీ యూనియన్ ను పునరుద్ధరణ చేయడంఇలాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యాచరణ చేపట్టలేదునేను రాష్ట్ర మంత్రి అయిన తర్వాత ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడుగా రాజీనామా చేశానుమేము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక వాయిదా వేసి పారిపోయిందిమేము అసెంబ్లీలో నిరుద్యోగులపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారుఊసరవెల్లి సైతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి భయపడుతుందికాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిందిఅధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందిగ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారురాష్ట్రంలో నిరుద్యోగులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారునిరుద్యోగులపై అసెంబ్లీలో మాట్లాడే అవకాశం మాకు ఇవ్వడం లేదురాష్ట్రంలో 21 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయికాంగ్రెస్ వస్తే 25వేల పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు 👉 బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కామెంట్స్..మా నియోజకవర్గాలకు చెందిన ఆర్టీసీ కార్మికుల సమస్యలపై మాట్లాడాలంటే స్పీకర్ అవకాశం ఇవ్వలేదుబీఆర్ఎస్ పార్టీ అడిగిన ప్రశ్నకు సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావుకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారుసభలో సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలిప్రశ్న అందరి ప్రాపర్టీ అని సీఎం అంటున్నారు కాబట్టి అందరికీ అవకాశం కల్పించాలని కోరుతున్నాం 👉అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యులకు టీ బ్రేక్..బీఆర్ఎస్, బీజేపీ వాయిదా తీర్మానం తిరస్కరణ..తెలంగాణ రాష్ట్రంలో పంటల నష్టం గురించి బీజేపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్.నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇతర న్యాయపరమైన డిమాండ్లపై బీఆర్ఎస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన స్పీకర్. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లు చర్చించాలని కోరుతూ కేటీఆర్ వేసిన ప్రతిపాదనను తిరస్కరించిన స్పీకర్ pic.twitter.com/ViedsXuvAB— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024వీడియో క్రెడిట్.. Telugu Scribe సీఎం రేవంత్ కామెంట్స్.. హరీష్ రావు సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రి.హరీష్ రావుకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా చేసిన అనుభవం ఉంది.స్పీకర్ కుర్చీపై ఆరోపణలు చేయడం ఏ మంత్రికి తగదు.ఆర్టీసీ అంశం ప్రాధాన్యతతో కూడుకున్న సమస్య.ఆర్టీసీ కార్మికుల దీక్షలు చేసి 50 మంది చనిపోయినప్పుడు.. ఆనాడు ప్రభుత్వం వివక్ష చూపింది.సీపీఐ కార్మికుల కోసం కొట్లాడింది వాళ్ల కోసం మాట్లాడడానికి సీపీఐకి అవకాశం ఇచ్చారు.హరీష్ రావు మాట్లాడుతుంది చట్టాలకు విరుద్ధం.ఎవరు ప్రశ్న అడిగితే వాళ్లకే అవకాశం ఇవ్వాలి అన్నది రూల్‌లో లేదుప్రశ్నోత్తరాలు సభకు వస్తే అది సభ సొంతమవుతుంది.సభ సభ్యులందరి ఆస్తి.ఎవరికి అవకాశం ఇవ్వాలి అన్నది చైర్ విచక్షణ మీద ఉంటుంది.రూల్ బుక్కు గురించి బీఆర్ఎస్ అసలు విషయం తెలుసుకోవాలి.గతంలో ఎమ్మెల్యే తన సీటును వదిలి పక్కకు వస్తే సభ నుంచి సస్పెండ్ చేశారు.గతంలో బీఆర్ఎస్ ఆనవాయితీలను ఇప్పుడు కూడా కొనసాగించాలని వాళ్లు కోరుకుంటున్నారు.కుటుంబం వల్ల కార్మిక సంఘాలను గత ప్రభుత్వం రద్దు చేశారు.కార్మికులను కార్మిక సంఘాలను రద్దుచేసి కాంగ్రెస్ ప్రభుత్వంపై కొత్తగా బీఆర్ఎస్ బురద చల్లుతుంది.హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు.సభలో కొత్త సభ్యులు ఉన్నారు వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. 👉రేపు కేబినెట్ భేటీ..రేపు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశం.రాష్ట్ర బడ్జెట్‌కు ఆమోదం తెలపనున్న కేబినెట్.మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు. 👉మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..ఆర్టీసీ కార్మికుల గురించి హరీష్ రావు దయ్యాలు వేదాలు వల్లించినట్లు మాట్లాడుతున్నారు.కార్మిక సంఘాలను రద్దు చేసి ఆర్టీసీని చంపేశారు.ఆర్టీసీ కార్మికులు చనిపోతే పట్టించుకోలేదు.2013 నుంచి ఆర్టీసీకి బకాయిలు ఉన్నాయి.కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాటిని విడుదల చేసాము.ఆర్టీసీ ఏడువేల కోట్ల అప్పులతో బీఆర్ఎస్ మాకు అప్పగించింది.మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ నెల రెండు వందల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం ఇస్తుంది.మూడు వేల ఉద్యోగాలు నియామకం చేశాము. ఆర్టీసీకి ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల కోట్లు చెల్లించాం - మంత్రి పొన్నం ప్రభాకర్ pic.twitter.com/3do5ayZUDF— Telugu Scribe (@TeluguScribe) July 24, 2024వీడియో క్రెడిట్: Telugu Scribeఓవర్ లోడ్ అవుతుంది.కానీ కార్మికులకు డబుల్ పేమెంట్ జరుగుతుంది.గత మూడు నెలల నుంచి ఆర్టీసీ లాభాల్లో నడుస్తోంది.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను ఎండీగా పెట్టీ ఆర్టీసీని బీఆర్ఎస్ నడిపించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆర్టీసీ ఆస్తులను అప్పనంగా అప్పగించారుఆర్టీసీకి అన్యాయం జరగకుండా భవిషత్లో అన్ని చర్యలు తీసుకుంటాంబీఆర్ఎస్ పార్టీకి ఆర్టీసీ గురించి మాట్లాడే అర్హత లేదురిటైర్డ్ ఈడీనీ ఆర్టీసీకి ఎందుకు ఎండీగా పెట్టిందో చెప్పాలి? 👉హరీష్‌రావు Vs మంత్రి శ్రీధర్ బాబు.. హరీష్‌రావు కామెంట్స్..ప్రభుత్వం భాధ్యతారహితంగా సమాధానం చెబుతోంది.ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తుంది.ఆర్టీసీ పీఆర్సీని ప్రభుత్వం రాగానే ఇస్తాం అన్నారు.ఆర్టీసీ ఉధ్యోగులను ఎప్పటిలోగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారో చెప్పాలి.300 కోట్లు పీఆర్సీ బకాయి చెక్కులు ఫిబ్రవరిలో ఇచ్చారు.ఇంతవరకు అది బస్‌భవన్‌కు చేరలేదు.ఆర్టీసి ప్రభుత్వంలో విలీనంపై ఎందుకు జాప్యం జరుగుతుంది..మంత్రి పొన్నం ప్రభాకర్ జాప్యం జరగటం లేదని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు.కొత్త యూనియన్లు ఎప్పటిలోగా పునరుద్దరిస్తారు.ఆర్టీసీలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వటం లేదుగతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాము.కొత్త బస్సుల ప్రారంభం నాడు 300కోట్లు చెక్ చూపించారుమహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇచ్చింది ఎంత?సీసీఎస్ డబ్బులు మళ్ళించి కార్మికులకు జీతాలు ఇచ్చారా లేదా? 👉హరీష్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్..హరీష్ రావుకు క్వశ్చన్ అవర్‌లో క్వశ్చన్ అడిగాలని తెలియదా?ఈ ఉపన్యాసం ఏంటి?.కాంగ్రెస్ మేనిఫెస్టోను హరీష్ రావు బట్టి పట్టారు.. చాలా సంతోషం.సభ్యులు ప్రశ్నలు మాత్రమే అడగండి.. ఉపన్యాసాలు వద్దు. 👉సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్..రోడ్డు, కరెంటు లేకుండా తండాను గ్రామ పంచాయతీలు చేశారు.ప్రతీ తండా నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు వేస్తాం.ప్రతీ తండాకు తాగు నీటితో పాటు కరెంటు, రోడ్డు వేస్తాం.ఏడు లక్షల ఇళ్ళకు గత ప్రభుత్వం నీళ్లు ఇవ్వలేదు.బీఆర్ఎస్ నేతలు ఎక్కడికి వెళ్తారో చెప్పండి తీసుకెళ్తాం.ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారడం లేదు.తండాల అభివృద్ధి జరిగినప్పుడే సంపూర్ణ అభివృద్ధి జరుగుతుంది.సరైన రోడ్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. 👉ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య..తండా గ్రామపంచాయతీలు చెట్ల కింద ఉండి పాలన సాగుతుంది.సర్పంచ్ల నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళించింది.సర్పంచ్ల ఆత్మహత్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం.ఎమ్మెల్యే వంశీకృష్ణ కామెంట్స్..నెంబర్ కోసమే అన్ని తండాలను గ్రామపంచాయతీలు చేశారు.ఒకే తండాను రెండుగా విడగొట్టి, రెండు గ్రామపంచాయతీలు చేశారు.తండా గ్రామపంచాయతీల అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించింది.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కామెంట్స్..62 కోట్ల మంది మహిళలు ఫ్రీ ఆర్టీసీ బస్సును ఉపయోగించుకున్నారు..ఫ్రీ బస్సు వల్ల దేవాలయాల వద్ద రద్దీ పెరిగింది.కొత్త బస్సులు కొనుగోలు చేసి.. ఆర్టీసీ సర్వీసులు పెంచాలి.రోడ్డు భధ్రత వారోత్సవాలపై మరింత అవగాహన పెంచాలి .మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్స్..పాఠశాల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా బస్సు టైమింగ్స్ సెట్ చేస్తున్నాం.ఆర్టీసీ ప్రయాణం భధ్రత విషయంలో రాజీపడం.ఆర్టీవోలు కఠినంగా వ్యవహరించాలి.ప్రభుత్వ విప్ రాంచంద్ర నాయక్గత ప్రభుత్వం ఓట్ల కోసం నామమాత్రంగా తండాలను గ్రామపంచాయతీలను చేసింది.తండా గ్రామపంచాయతీలకు ఎటువంటి ఫండ్స్ లేవు.ప్రస్తుతం ప్రభుత్వం ప్రతీ తండా గ్రామపంచాయతీలకు ఆఫీస్‌తో పాటు ప్రత్యేక నిధులు ఇవ్వాలి. మీడియా పాయింట్.. ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్..బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది.విభజన తరువాత 2 రాష్ట్రాలు చాలా నష్ట పోయాయి..నిర్మల సీతారామన్ తెలంగాణలో పర్యటన సమయంలో..రేషన్ షాప్‌ల దగ్గర ప్రధాని మోదీ ఫోటో ఎందుకు పెట్టలేదు అని డీలర్‌ను, కలెక్టర్‌ను ప్రశ్నించారు.తెలంగాణకు ఏ ముఖం పెట్టుకొని నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి, సంజయ్ వస్తారుమూసీకి ఇతర ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని సీఎం ఎన్నో సార్లు అడిగారుతెలంగాణ ప్రజలకు బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు క్షమాపణ చెప్పాలిహైదరాబాద్లో వారిని తిరగనివ్వం.ఇలాంటి ఆర్థిక మంత్రి దేశానికి ఉండటం అరిష్టంవిభజన చట్టంలో ఉన్న అంశాలు పరిష్కారం చేయకపోవడం బాధాకరంఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోకోవాలినిన్న బడ్జెట్లో తెలంగాణ పేరు తీయకపోవడం విచారకరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేపీ వివేకానంద కామెంట్స్..కేంద్ర బడ్జెట్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తీరని అన్యాయం చేసిందిబీఆర్ఎస్ హయాంలో కేంద్రం ఎన్నో ఇబ్బందులు పెట్టినా కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ముందుకు వెళ్ళిందిదేశానికి ఆదాయం అందించే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి మూడు, నాలుగు స్థానాల్లో ఉందితెలంగాణలో కేసీఆర్ నాయకత్వం ఉండకూడదని కుట్ర చేశారుకేంద్ర బడ్జెట్‌పై సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకాలకు తెరదీశారుమోదీని బడే భాయ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారుఅసెంబ్లీలో చర్చ పెట్టి హామీలను నెరవేర్చకుండా కేంద్రంపై నెపంవేసే ప్రయత్నం సీఎం చేస్తున్నారుతెలంగాణకు ఎలాంటి ఐఐఎం ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి సీఎంకు లేఖ రాశారుతన కేసుల కోసం కేంద్ర ప్రభుత్వంతో రేవంత్ రెడ్డి రాజీపడ్డారుబీజేపీతో కుమ్మక్కు అయ్యి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలనుకుంటున్నారు. 👉బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చక్కర్లు కొట్టి రూపాయి కూడా తీసుకురాలేదుతెలంగాణలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి చెరో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు ఇచ్చారుతెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 16 ఎంపీ సీట్లు ఇస్తే ఎన్ని వేల కోట్లు వచ్చే అవకాశం ఉండేదో ఆలోచించండిఏపీకి 15 వేల కోట్లు ఇచ్చారుతెలంగాణపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డ్రామాలు బంద్ చేయాలితెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తామురెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడ చేశారో రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి 👉నేడు రెండో రోజు తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగనున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మొదట సభ్యులు అడిగిన ప్రశ్నలకు సదరు మంత్రులు సమాధానం చెబుతారు.👉షార్ట్ డిస్కషన్ కింద కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చ చేపట్టాలని స్పీకర్‌ను ప్రభుత్వం కోరనుంది. ఈ క్రమంలో స్పీకర్ అనుమతి ఇస్తే కేంద్ర బడ్జెట్‌పై సభలో చర్చ చేయనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం.. సభలో తీర్మానం చేయనుంది.👉మరోవైపు.. గోదావరి పరివాహక ప్రాంతంలో పంట నష్టంపై బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు వాయిదా తీర్మానం ఇచ్చారు.నేడు అసెంబ్లీలో ఇలా..1) ప్రశ్నోత్తరాలు .2) ప్రభుత్వ రిజల్యూషన్3) నిన్న బీఏసీలో తీసుకున్న నిర్ణయాలు ఉభయసభల్లో టేబుల్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.4) వివిధ శాఖల్లో యాన్యువల్ రిపోర్టులను ఉభయ సభల్లో టేబుల్ చేస్తారు.ఇదిలా ఉండగా..1. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ 23వ వార్షిక రిపోర్టును సభలో ప్రవేశపెడతారు.2. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ యాన్యువల్ రిపోర్టును విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క సభలో ప్రవేశపెట్టనున్నారు.3. తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెడతారు.4. ఇటీవల దివంగతులైన మాజీ శాసనసభ్యులు డాక్టర్ నెమురు గొమ్ముల సుధాకర్ రావు, మహమ్మద్ విరాసత్ రసూల్ ఖాన్, ధర్మపురి శ్రీనివాస్, రమేష్ రాథోడ్‌లకు సభలో సంతాపం వ్యక్తం చేయనున్నారు.5. శాసనసభలో స్వల్పకాలిక చర్చ(యాక్టివిటీస్ సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్ మెట్రో సిటీ).శాసనసభలో చర్చకు వచ్చే ప్రశ్నోత్తరాలు..1.పాఠశాలలు, కళాశాలల బస్సుల ఫిట్నెస్ తనిఖీలు.2.తండాలు గ్రామపంచాయతీలుగా ఉన్నతీకరణ3.ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు.4.వాణిజ్య పనుల శాఖలో అవకతవకలు.5.నిజామాబాద్ పట్టణ శాసనసభ నియోజకవర్గంలో క్రీడా సముదాయం.6.తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఐటీ ఏర్పాటు.7.ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులు చెల్లింపు.8.రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు.9.జాతీయ రహదారి విస్తరణ పనులు.10.మూసీ నదికి ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ చెరువుల అనుసంధానం. -
TS: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Updates... పోచారం శ్రీనివాస్ రెడ్డి నేను - సీఎం రేవంత్ రెడ్డి టీడీపీలో కలిసి కష్టపడి పనిచేశాము నేను బీఆర్ఎస్లో అప్పుడే చేరిన. 2011లో రేవంత్ రెడ్డి చెప్పినట్లు ఎమ్మెల్సీ రేసులో కిరణ్ కుమార్ రెడ్డి లేరు మల్రెడ్డి రంగారెడ్డి కాంగ్రెస్ , మహమూద్ అలీ బీఆర్ఎస్ నుంచి రేసులో ఉన్నారు రేవంత్ చెప్పిన ముగ్గురు ఎమ్మెల్యేలు లాలూచీ పడి కాంగ్రెస్‌కు ఆనాడు ఓటు వేశారు ఆనాడు బీజేపీ లేదు.. మాకు బీజేపీకి ఎలాంటి సంబంధాలు లేవు సీఎం కుర్చీ మార్చాలంటే మేమే వంద మందికి పైగా ఉన్నాము మోడీతో మాకు చర్చలు అవసరం లేదు నిజాలు మాట్లాడితే బాగుంటుంది గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం తెచ్చిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది 2014-24 వరకు పార్లమెంట్లో ఎవరి పక్షాన నిలిచారు? బీజేపీ, బీఆర్ఎస్ ఒకే ఆలోచనతో నడుస్తున్నాయి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రజా పాలన అంటారు అసెంబ్లీ చుట్టూ ఇనుప కంచెలు వేశారు. ప్రజా ప్రభుత్వంలో దిగ్బంధం ఎందుకు చేస్తున్నారు. పోలీసుల సంఖ్య ఎందుకు పెంచారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే మాజీ స్పీకర్ సభ ఆర్డర్ లో ఉండటం లేదు. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. చిన్న వయసులో రేవంత్ సిఎం అయ్యారు. ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను. చిల్లర మల్లర రాజకీయాలు, కామెంట్స్ వద్దు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి. ► సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఈ రాత్రికి శాసన మండలిలోనే ఉండే ఆలోచన లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ► కచ్చితంగా శాసన మండలి కి రావాలి, క్షమాపణ చెప్పాలి ఐటి అంశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు గతంలో దావోస్ వెళ్తే విమర్శలు చేసింది కాంగ్రెస్ - పల్లా ఇప్పుడు సిఎం దావోస్ పర్యటనలో అదానీ గ్రూప్ తో ఒప్పందం చేసుకున్నారు అధానిపై ఆరోపణలు చేస్తూనే ...మరోవైపు ఒప్పందాలు చేసుకుంటుంది కాంగ్రెస్ మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తాము. నిబంధనల ప్రకారమే పరిశ్రమల ఒప్పందాలు జరిగాయి. ఐటి అభివృద్ధి పై సలహాలు సూచనలు తీసుకుంటాము. ► తెలంగాణ శాసమండలికి భోజన విరామం శాసన మండలిలో గందరగోళం బీఆర్ఎస్ నేతల చిట్టా మా దగ్గర ఉంది: జూపల్లి కృష్ణా రావు ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మాకు తెలుసు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తెలపకుండ అడ్డుకోవడం మంచిది కాదు: మంత్రి తుమ్మల సభ గౌరవం పాటించక పోవడం సబబు కాదు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్, సీతక్క ఆర్టీసి కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో ఆర్టీసి బస్సులను పెంచాలి. ఆర్టీసి అంశంపై మాట్లాడుతుండగా అడ్డుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసి, ఆటోలను పట్టించుకోలేదు. ఆటో, ఆర్టీసి కార్మికులు 60 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు. ఆటో కార్మికులకు కనీసం 1000 రూపాయలు ఇవ్వని వాళ్ళు బీఆర్ఎస్ ఫ్యూడల్స్ ఆటోలలో వస్తున్నారు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కావాలా వద్దా? బీఆర్ఎస్ స్పష్టం చేయాలి. ఆర్టీసి, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే బీఆర్ఎస్ పట్టించుకోలేదు. ఆర్టీసి అభివృద్ధి పై ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంత్రి సీతక్క మహిళలు ఉచిత ప్రయాణం చేస్తే BRS ఓర్వలేక పోతున్నారు. ఆర్టీసి ఉచిత ప్రయాణం కావాలా వద్దా అనేది సూటిగా చెప్పాలి. BRS మళ్ళీ సెంటిమెంట్ రాజకీయాలు మొదలు పెట్టింది. గతంలో అగ్గిపెట్టె దొరక్క యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్టీసి ఆస్తులను అమ్ముకున్నది BRS ప్రభుత్వం ముగిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సమావేశం సమావేశం వివరాలను మంత్రులకు చైర్మన్‌కు వివరిస్తున్న ఎమ్మెల్సీ భాను ప్రసాద్ సీఎం మండలికి వచ్చి క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న ఎమ్మెల్సీలు సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే కౌన్సిల్ సభ్యులకు క్షమాపణలు చెప్పే వరకు మండలి నిర్వహించొద్దు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నినాదాలు సీఎం డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేసిన ఎమ్మెల్సీలు మరోసారి 10 నిమిషాలు మండలిని వాయిదా వేసిన కౌన్సిల్ చైర్మన్ జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ కౌన్సిల్ ను బీఆర్ఎస్ సభ్యులు అగౌరపరుస్తున్నారు భారాస ఎమ్మెల్సీలు చేసిన ఫిర్యాదును ప్రివిలేజ్ కమిటీకి పంపారు పెద్దల సభలో ఓపిక ఉండాలి జూపల్లి కృష్ణారావు మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు ఈ విషయంలో ప్రొటెక్ట్ చేసే హక్కులేదు అనవసరంగా సభను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పు దోవ పట్టిస్తున్నారు ► కౌన్సిల్ హాల్ ముందు నల్ల కండువాలతో బైటాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ► తెలంగాణ శాసన మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళన ► బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనలతో సభ వాయిదా పడింది ► సీఎం రేవంత్‌రెడ్డి మండలి సభ్యులను అవమానించారని.. మండలి సభ్యులకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ► బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నిరసన తెలిపే హక్కు లేదు: మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు ప్రారంభం అయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవేశపెట్టారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మాన్నాన్ని యన్నెం శ్రీనివాస్‌రెడ్డి బలపరిచారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఎసీ అజెండాను టేబుల్ చేయనున్నారు.