సాక్షి, హైదరాబాద్: నగరాభివృద్ధికి హైడ్రాను సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఔటర్ లోపల ఉన్న నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ రోడ్లపై నీరు ఆగకుండా ఉండేందుకు వాటర్ హార్వెస్టింగ్‌లను ఏర్పాటు చేస్తామని రేవంత్ తెలిపారు. మూసీని సబర్మతి, లండన్ థీమ్స్ తరహాలో డెవలప్ చేస్తాం. త్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్‌లను నియమిస్తామని సీఎం పేర్కొన్నారు.
ఎస్‌వోటీ, గ్రేహండ్స్ తరహాలోనే హైడ్రా తెస్తున్నాం. దీని పరిధి 2వేల కిలోమీటర్లకు విస్తరించాం. ప్రపంచంతో పోటీ పడేలా చేసేందుకే సంస్కరణలు తెస్తాం. నగరంలో సరస్సులు అదృశ్యమవుతున్నాయని.. నాలాల కబ్జాలతో హైదరాబాద్ అతలాకుతలమవుతోందని రేవంత్ అన్నారు.
మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు జలాల తరలింపునకు ప్రణాళిక సిద్ధం చేశామన్న సీఎం.. రూ.6 వేల కోట్ల ప్రతిపాదనలు కేంద్రానికి ఇచ్చామని రేవంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment