తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు శనివారం వాడీవేడీగా కొనసాగుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై.. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఒకరినొకరు విమర్శలతో సభను అట్టుడికించారు.
ఈ మేరకు అసెంబ్లీలో శనివారం హరీష్ రావు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో బెల్ట్ షాపులు ఎత్తేస్తామని అని అన్నారు.. ఏమైందని ప్రశ్నించారు. బీర్ల ధరలు పెంచి, ప్రజలపై భారం వేస్తారా అని ప్రశ్నించారు. బెల్ట్ షాపులు ఎత్తేస్తే రూ. 42 వేల కోట్లు ఆదాయం ఎలా వచ్చిందని నిలదీశారు. రూ. 7 వేల కోట్ల ఆదాయం ఎలా వస్తుందో చెప్పాలని, ఎక్సైజ్‌పై ఆదాయం పెంచి ప్రజలపై భారం వేయొద్దని అన్నారు.
రుణమాఫీ విషయంలో చాలా కోతలు పెట్టారని అన్నారు హరీష్ రావు. రూ. 31 వేల కోట్ల రుణమాఫీని ఒకేసారి చేస్తామని చెప్పారని కానీ.. కోతలతో రూ. 31 వేల కోట్ల నుంచి రూ. 25 వేల కోట్లుకు తగ్గిస్తారా? అని ప్రశ్నించారు. ఆరోగ్య శ్రీ రూ. 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం సంతోషమే కానీ వైద్యశాఖకు బడ్జెట్ తగ్గిస్తే ఇది ఎలా సాధ్యమవుతుందని విమర్శించారు. గత ప్రభుత్వ పథకాలను మేం అధికారంలోకి వచ్చాక కొనసాగించామని గుర్తు చేశారు.
కేసీఆర్ పేరు నచ్చకపోతే మార్చుకోండి.. కానీ కిట్లను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయాల కోసం పేదల కడుపు కొట్టకండని తెలిపారు. అప్పుల విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ 6 లక్షల 71 వేల 757 కోట్లు అప్పు చేసిందని పదే పదే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం ఏర్పడేనాటికి ఉన్న అప్పులు 72 వేల కోట్లు అని.. 72 వేల 658 కోట్ల అప్పులు వారసత్వంగా వచ్చినట్లు తెలిపారు. అయితే 7 లక్షల కోట్లు అప్పు చేశామని కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
‘బీసీలకు రూ. 9 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టారు. మైనార్టీలకు మంత్రివర్గంలో చోటులేదు. ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరగలేదు. ఉద్యోగులకు కొత్త పీఆర్సీకి అనుగుణంగా కేటాయింపులు లేవు. అభయ హస్తం శూన్య హస్తంలా మారింది. పాలమూరు వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణం. మహబూబ్‌నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం.
వందరోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. సోనియా గాంధీతో అబద్దాలు చెప్పారు. మహాలక్ష్మి పథకాన్ని వెంటనే అమలు చేయాలి. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు లేని 15 వందల గ్రామాలకు బస్సులు నడపాలి. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి’ అని అన్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. తమ బడ్జెట్ చూసి హరీష్ రావుకు కంటగింపుగా ఉందని విమర్శించారు. మంత్రి జూపల్లి గల్లి గల్లీకి బెల్ట్ షాపు పెడతా అని అన్నారా? అని ప్రశించారు. ప్రతిపక్ష నేత బడ్జెట్ పెట్టే సమయంలో సభకు వచ్చారని.. మళ్లీ నేడు సభకు రాలేదని తెలిపారు. హరీష్‌రావు ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
పదేళ్లు రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేశారని అన్నారు భట్టి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిక తీసుకొచ్చారని దుయ్యబట్టారు. తాము నెల నెల ఉద్యోగులకు జీతాలు ఇచ్చేపని మొదలు పెట్టినట్లు తెలిపారు. హారీష్ రావు ఎందుకు సభను తప్పుదోవ పట్టిస్తారని ప్రశ్నించారు. పూర్తి సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వైన్ షాపు టెండర్లు ముందే ఎందుకు పెట్టారని.. టానిక్ లాంటి దుకాణాలు పెట్టి సర్కార్‌కు డబ్బులు రాకుండా , కొన్ని కుటుంబాలకు వెళ్లేలా చేశారని మండిపడ్డారు. తాము అలా చేయమని.. సర్కార్ సొమ్ము ప్రజలకే చేరేలా చేస్తామని చెప్పారు.
2017లో ఆనాటి సీఎం మీటర్లు బిగిస్తామని మోదీతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సభను తప్పుదోవ పట్టించినప్పుడు సరిద్దాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నామని, విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని చెప్పారు.
‘బీఆర్‌ఎస్ తీరు వల్లే కేంద్ర బడ్జెట్‌లో నిధులు రాలేదు. గతంలో బతుకమ్మ చీరలు ఇస్తే మహిళలు తగలబెట్టిన పరిస్థితి ఉండేది. తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో బతుకుతారు. బతుకమ్మ చీరల విషయంలో అవినీతి జరిగింది. గొర్రెల పథకంలో రూ. 77 కోట్లు స్వాహా చేశారు.. బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్ల మీద విచారణకు సిద్ధమా?
పాలమూరు జిల్లా కేసీఆర్‌కు ఏం అన్యాయం చేసింది. పాలమూరు ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి బీఆర్‌ఎస్ దుర్మార్గం కారణం కాదా?రంగారెడ్డి జిల్లాకు, కొడంగల్‌కు గోదావరి జలాలు ఇవ్వొద్దని కుట్ర చేశారు రంగారెడ్డి జిల్లాకు, కొడంగల్‌కు గోదావరి జలాలు ఇవ్వొద్దని కుట్ర చేశారు. బీఆర్‌ఎస్ ఆలోచన మారలేదు.. విధానం మారలేదు. అబద్దాలు రికార్డుల్లో ఉంటే కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు నిజమనుకునే ప్రమాదం ఉంది. పూర్తిగా సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు’ అని రేవంత్ పేర్కొన్నారు.
గతంలో హరీస్ రావు ఓ డమ్మీ మంత్రి: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- అబద్దాలు, గారడీలు అంటే బీఆర్‌ఎస్సే
- అధికారంలోకి వస్తే దళితుడిని సీఎంనుచేస్తా అని కేసీఆర్ అన్నారు.
- హరీష్ రావు దగ్గర సబ్జెక్ట్ లేదు.
- ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతా అన్న కేసీఆర్.. ఇవాళ సభకు రాలేదు.
- చీల్చి చెండాడుతా అన్న కేసీఆర్ బడజెట్‌పై స్పందించలేదు.
- మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తున్నాం: మంత్రి శ్రీధర్ బాబు
- బీఆర్‌ఎస్ నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం
Comments
Please login to add a commentAdd a comment