Bhatti Vikramarka
-
సత్వర పరిష్కారానికి త్రిసభ్య కమిటీ
సాక్షి, హైదరాబాద్: జెన్కో పరిధిలోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఏర్పడే సాంకేతిక సమస్యలను వెంటనే నివృత్తి చేసేందుకు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఇందులో జెన్కో డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్‌తోపాటు మరో అధికారి ఉంటారని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఈ కమిటీ సదరు సమస్యలను సమీక్షించి తగిన నివేదికను బోర్డుకు సమర్పిస్తుందని, బోర్డు అనుమతితో విద్యుదుత్పత్తి పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తి చేస్తుందన్నారు సకాలంలో సరైన నిర్ణయం తీసుకొని ఎలాంటి ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవడం ద్వారా విద్యుత్ సంస్థలు నష్టపోకుండా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు.భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం (బీటీపీఎల్) పనుల పురోగతిపై జెన్కో అధికారులతో ఆదివారం ఆయన ప్రజాభవన్‌లో సమీక్షించారు. విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, జెన్కో డైరెక్టర్లు అజయ్, సచ్చిదానందం, లక్ష్మయ్య, చీఫ్ ఇంజనీర్లు శ్రీనివాస్‌రావు, రత్నాకర్‌రావు, పీవీ.శ్రీనివాస్, జేవాకుమార్, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా బీటీపీఎల్ పనుల పురోగతిపై అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బీహెచ్ఈఎల్తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు పూర్తి చేయాల్సిన ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్ పనులను నిర్దిష్ట గడువులో పూర్తి చేయించాలని సూచించారు. నాణ్యత విషయంలో రాజీ వద్దు యూనిట్–1లో ఉత్పత్తికి సంబంధించి కాలిపోయిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ మరమ్మతుల గురించి అధికారులను డిప్యూటీ సీఎం ఆరా తీయగా, విద్యుదుత్పత్తికి ఆటంకం కలగకుండా ఉండేందుకుగాను మరో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ను కొనుగోలు చేస్తున్నామని, ఇందుకోసం టెండర్లు పిలిచామని అధికారులు వివరించారు. జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు అవసరమైన అదనపు పరికరాలను కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సూచించారు. వర్షాకాలంలో బొగ్గు నిల్వ చేయడానికి అవసరమైన షెడ్ నిర్మాణం, సింగరేణి నుంచి భద్రాద్రి ప్లాంట్ వరకు బొగ్గు రవాణా కోసం ఏర్పాటు చేస్తున్న రైల్వే లైన్, సిబ్బందికి వసతి గృహ నిర్మాణ పనుల గురించి కూడా డిప్యూటీ సీఎం ఆరా తీశారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, అన్ని ప్రమాణాలు పాటించేవిధంగా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. రైల్వేలైన్ నిర్మాణం కోసం భూసేకరణ జరుగుతోందని అధికారులు వివరించగా, ఈ రైల్వే లైన్ పనులను సమీక్షించేందుకు ప్రతివారం సమావేశం కావాలని అధికారులు ఆదేశించారు. బీటీపీఎల్‌లో జరిగే ఎలాంటి ఘటనకైనా చీఫ్ ఇంజనీర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని, ప్రతి విషయాన్ని తనతోపాటు సీఎండీ దృష్టికి తీసుకురావాలని, ఈ విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు ఉంటాయని చెప్పారు. పవర్ ప్లాంట్‌లో పనిచేసే అన్‌స్కిల్డ్ కార్మికుల విషయంలో ఐటీడీఏ ప్రాజెక్టును సంప్రదించి స్థానిక గిరిజనులను తీసుకోవాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో స్థానిక గిరిజన యువత కోసం బూడిదతో ఇటుకలు తయారుచేసే యూనిట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా గిరిజన యువతకు ఉపాధి కలుగుతుందని చెప్పిన భట్టి... బీటీపీఎల్‌లో త్రీడీ వాక్‌వే మోడల్ తయారు చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. విద్యుత్ డిమాండ్‌ను బట్టి ఉద్యోగాల భర్తీ» త్వరలోనే పదోన్నతుల ఉత్తర్వులు» టీఈఏఈఏ సమావేశంలో భట్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ శాఖలో జాబ్ రిక్రూట్మెంట్ కేలండర్‌ను అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క చెప్పారు. అదే విధంగా పదోన్నతులకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆదివారం ప్రజాభవన్‌లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ (టీఈఏఈఏ) నేతలు భట్టిని కలిశారు. రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన కొత్త విద్యుదుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జెన్కో పరిధిలో 2024, అక్టోబర్‌లో ఏఈల నుంచి ఏడీఈలుగా పదోన్నతులు పొందిన వారికి పోస్టింగులు ఇవ్వాలని, ట్రాన్స్‌కో, డిస్కం కంపెనీలలో పదోన్నతులు అమలు చేయాలని వారు భట్టికి విజ్ఞప్తి చేశారు. అసిస్టెంట్ ఇంజనీర్ల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన భట్టి పదోన్నతుల ఉత్తర్వులు త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగం సేవా భావంతో కూడినదని, రాష్ట్ర ప్రజలకు అవసరమైన విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా పనిచేయాలని కోరారు. డిప్యూటీ సీఎంను కలిసిన వారిలో టీఈఏఈఏ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి బట్టు హరీశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ ఇమ్రాన్ తదితరులున్నారు. -
విద్య.. కేంద్ర గుత్తాధిపత్యం కాదు
సాక్షి, హైదరాబాద్: భారత రాజ్యాంగంలో విద్య ఉమ్మడి జాబితాలో ఉందని, దానిపై కేంద్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం పనికిరాదని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యపై కేంద్రానికి గుత్తాధిపత్యం కట్టబెట్టేందుకే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చిందని ఆరోపించారు. రాష్ట్రాలు తమ సొంత విద్యావిధానాన్ని రూపొందించుకోవడానికి అధికారం ఉండాలని అభిప్రాయపడ్డారు. విద్యా వ్యవస్థను ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నడపలేరని తేల్చి చెప్పారు. కేరళ ప్రభుత్వం తిరువనంతపురంలో గురువారం నిర్వహించిన జాతీయ ఉన్నత విద్యా సమ్మేళనంలో భట్టి మాట్లాడారు. ‘యూజీసీ నిబంధనలు మీరు బిల్లు చెల్లించాలి కానీ ఫుడ్ ఆర్డర్ చేయలేరు అన్నట్లుగా ఉన్నాయి.వర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు సమకూర్చాలి. కీలకమైన వైస్–చాన్స్లర్ల నియామకం, ప్రవేశాలపై అధికారం మాత్రం కేంద్రానికి ఇవ్వాలని ముసాయిదాలో ఉంది. వైస్ చాన్స్లర్ల నియామకానికి సెర్చ్ కమిటీల్లో రాష్ట్ర ప్రభుత్వ పాత్రను తొలగించడం, వైస్ చాన్స్లర్ల అర్హతలు మార్చడం ఆందోళనకరం. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రాలు భవనాలు ప్రారంభించే రిబ్బన్ కటింగ్ అధికారానికి మాత్రమే పరిమితమవుతాయి’ అని పేర్కొన్నారు. రాష్ట్రాలకు విద్యపై స్వయంప్రతిపత్తి ఉండాలి: స్వయం ప్రతిపత్తి లేకుండా నాణ్యమైన విద్యను ఏ రాష్ట్రమూ అందించలేదని భట్టి విక్రమార్క అన్నారు. ఈ అంశంపై రాష్ట్రాల ఉమ్మడి విజ్ఞప్తిని కేంద్రం తప్పక పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహకారమంటే బలవంతంగా రుద్దడం కాదని చురకలంటించారు. రాష్ట్రాలు ఐక్యంగా గళం విప్పితే ఆ ప్రతిధ్వని ఎంత దూరమైనా చేరుతుందని అన్నారు. తెలంగాణలో విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలు, ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భట్టి వివరించారు.సరైన మార్గాన్ని ఎంచుకునే హక్కు రాష్ట్రాలకు ఉందని, సరైన నిర్ణయం తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ అంశంపై తదుపరి సమావేశాన్ని తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కేరళ సీఎం పినరయి విజయన్, ఆ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్. బిందు, కర్ణాటక మంత్రి ఎం.సీ. సుధాకర్ అవారే, తమిళనాడు నుంచి తిరు గోవి చేజియాన్, పంజాబ్ నుంచి సర్దార్ హరోజ్ సింగ్ తోపాటు ప్రముఖ విద్యావేత్తలు పాల్గొన్నారు. -
పెండింగ్‌లో ‘ప్రాధాన్యం’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న ఆర్థిక బిల్లుల చెల్లింపులో ప్రాధాన్యం పాటించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లుల మంజూ రు క్రమంలో వస్తున్న అపవాదులు, ప్రతిపక్షాలు మోపు తున్న నిందలకు చెక్ పెట్టేలా అందుబాటులో ఉన్న నిధుల ను బట్టి ప్రాధాన్యతల వారీగా మంజూరు చేయాలని భావి స్తోంది. ఇందుకోసం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు ప్రతి 15 రోజులకోసారి సమా వేశం కావాలని, ఈ బిల్లులపై చర్చించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులకుగాను టోకెన్లు వచ్చి పెండింగ్‌లో ఉన్న బిల్లుల గురించి ఈ సమావేశంలో చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. ప్రతినెలా రాష్ట్ర ఖజానాపై పెద్దభారం పడకుండా, తక్కువ నిధులతో ఎక్కువమందికి ప్రయోజనం కలిగే విధంగా ఉండే బిల్లులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, పాఠశాలల్లో పుస్తకాలు, క్రీడా పరికరాల సరఫరా, మెడికల్ బిల్లులు, ఆరోగ్యశ్రీ ట్రస్టు, సర్పంచ్‌లకు రూ.5 లక్షల లోపు బిల్లులను వీలున్నంత త్వరగా క్లియర్ చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. తద్వారా ఇష్టారాజ్యంగా బిల్లులు ఇస్తున్నారన్న విమర్శలకు చెక్ పెట్టాలనేది అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కాంగ్రెస్ పార్టీ పెద్దల ఉద్దేశమనే చర్చ ప్రభుత్వవర్గాల్లో జరుగుతోంది. అంతర్గత విమర్శలకూ తావు లేకుండామరోవైపు రాష్ట్ర ప్రభుత్వంలో భాగమైన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బిల్లుల మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తాము చెప్పినా బిల్లులు రావడం లేదనే అసంతృప్తితో వారున్నారనేది కాంగ్రెస్ పార్టీలో బహిరంగ రహస్యమే. ఈ అసంతృప్తికి కూడా చెక్ పెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీలో అంతర్గత విమర్శలకు కూడా తావులేకుండా పెండింగ్ బిల్లుల మంజూరులో ప్రాధాన్యం పాటించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ప్రాధాన్యతల ప్రకారం అడిగే బిల్లులను కూడా వీలున్నంత త్వరగా క్లియర్ చేసేలా 15 రోజులకోసారి జరిగే సీఎం, డిప్యూటీ సీఎంల భేటీలో నిర్ణయాలు తీసుకుంటారని సమాచారం. -
విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు నమోదైంది. బుధవారం ఉదయం 7.55 గంటలకు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 16,058 మెగావాట్లకు పెరిగింది. ఈనెల 10న ఏర్పడిన 15,998 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ రికార్డును తాజాగా రాష్ట్రం అధిగమించింది. రోజువారీ గరిష్ట విద్యుత్ డిమాండ్ 16 వేల మెగావాట్లను దాటడం ఇదే తొలిసారి. వేసవి ప్రారంభంలోనే విదుŠయ్త్ డిమాండ్ భారీగా పెరుగుతుండటంతో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ సంస్థల సీఎండీలతో పరిస్థితిని సమీక్షించారు. విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. -
మరో విడత కులగణన సర్వే నిర్వహణకు సర్కారు నిర్ణయం
-
ఓబీసీల కలను నిజం చేస్తాం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, కులగణన సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా వారి వివరాలను కూడా సేకరించనుంది. ఈ నెల 16 నుంచి 28 వరకు ఈ సర్వే నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, రిజర్వేషన్లకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం జరిగింది. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను.. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్, సీఎస్ శాంతికుమారి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాతో కలిసి భట్టి మీడియాకు వెల్లడించారు.బిల్లుకు పూర్తి చట్టబద్ధత కోసం చర్యలు‘రాష్ట్రంలోని బీసీలు, ఓబీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ, తదితర రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా..దశాబ్దాల ఓబీసీల కలను నిజం చేసే దిశలో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేసి పార్లమెంట్‌కు పంపిస్తాం. ఆ తర్వాత కలసి వచ్చే రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళుతుంది. ప్రధానితో పాటు కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అన్ని పార్టీల నేతలు, ఎంపీలను కలిసి ఈ బిల్లుకు పూర్తి చట్టబద్ధత కల్పించేందుకు చర్యలు చేపడతాం. పార్లమెంట్లో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను, శక్తులను ఏకం చేస్తాం..’ అని డిప్యూటీ సీఎం చెప్పారు.మూడు పద్ధతుల్లో వివరాల నమోదు‘ఇటీవల నిర్వహించిన కులగణన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదు. అలాంటి వారు ఈ నెల 16 నుంచి 28వ తేదీ వరకు తమ వివరాలు, సమాచారం నమోదు చేసుకోవచ్చు. మూడు పద్ధతుల్లో అంటే.. టోల్ ఫ్రీ నంబర్ (ఇంకా ప్రకటించలేదు)కు ఫోన్ చేసి, మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారుల వద్ద, ఆన్లైన్లో కుటుంబ వివరాల నమోదుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి కోరితే అధికారులు వారి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు నమోదు చేసుకుంటారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వంటి వారు గతంలో ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వలేదు. మరికొందరు అందుబాటులో లేకుండా పోయారు అలాంటి వారందరి కోసం మరోసారి అవకాశం కల్పిస్తున్నాం..’ అని భట్టి వివరించారు. బీసీల ప్రయోజనాల కోసం భారం మోసేందుకు సిద్ధం‘ఇప్పటికే ఏడాదికి పైగా ఎన్నికలు జరగకపోవడంతో పంచాయతీలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. ఎన్నికలు ఆలస్యమైతే మరింత ఇబ్బంది అవుతుంది కదా..’ అని ఓ విలేకరి ప్రశ్నించారు. దీంతో ‘కులగణనలో రాష్ట్రంలో బీసీలు 56 శాతమున్నట్టుగా తేలిన నేపథ్యంలో వారి ప్రయోజనాల కోసం మరో 2, 3 నెలలు ఆర్థిక భారం పడినా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది..’ అని భట్టి బదులిచ్చారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్ష మందికి పైగా సిబ్బందితో పూర్తి శాస్త్రీయంగా సమగ్ర ఇంటింటి సర్వే జరిగిందని చెప్పారు. బిల్లు ఆమోదం కోసం రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి అంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. మరోసారి సర్వే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: జాజులసమగ్ర ఇంటింటి కులగణన సర్వేను మరోసారి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. బీసీలు, ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి చట్టం చేయాలని నిర్ణయించడం శుభ పరిణామమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో భట్టి విక్రమార్క భేటీ
-
కులగణనే కొలమానం!
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వంలోగానీ, పార్టీలోగానీ ఇకముందు తీసుకునే విధానపర నిర్ణయాలన్నింటికీ కులగణనే(caste census) ప్రాతిపదికగా ఉండాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(mallikarjun kharge)తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జరిపిన భేటీలో నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, నిధుల కేటాయింపుల్లో కులగణన లెక్కలను కొలమానంగా తీసుకుని ముందుకెళ్లాలని.. స్థానిక సంస్థల ఎన్నికలు మొదలు నామినేటెడ్ పోస్టులు, పీసీసీ పదవుల భర్తీ దాకా ఇదే ఫార్ములాను అనుసరించాలని నిశ్చయానికి వచ్చినట్టు తెలిపాయి.రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణతో పాటు పలు రాజకీయ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు శుక్రవారం ఖర్గేతో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లోని ఖర్గే కార్యాలయంలో సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం పీసీసీ కూర్పుపై కేసీ వేణుగోపాల్‌తోనూ నేతలు విడివిడిగా భేటీ అయి తమ అభిప్రాయాలను వెల్లడించారు. కులగణన దేశానికి నమూనా కావాలి రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణలకు అసెంబ్లీ ఆమోదం తెలిపిన అంశాన్ని రాష్ట్ర నేతలు ఖర్గేకు వివరించారు. దీనిపై రాష్ట్రంలోని నిమ్న వర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఈ అంశాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి మూడు, నాలుగు జిల్లాలకు కలిపి ఒక సభను ఏర్పాటు చేస్తామని.. ఆ సభలకు హాజరుకావాలని ఖర్గేను కోరారు. ఇందులో ఎస్సీ వర్గీకరణ అంశంపై గజ్వేల్‌లో నిర్వహించే సభకు వచ్చేందుకు ఖర్గే ఒకే చెప్పినట్టు తెలిసింది.‘‘జనాభా ప్రాతిపదికన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నది నాతోపాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ప్రధాన ఉద్దేశం. కులగణనతో ఆయా వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని మేం విశ్వసిస్తున్నాం. విద్య, ఉద్యోగం, ఉపాధి, నిధుల కేటాయింపులలో ఓబీసీ, గిరిజన, దళితులు, మైనార్టీలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు ఉండాలి...’’అని ఖర్గే సూచించారని సమాచారం.తెలంగాణలో కులగణన, దాని ఆధారంగా అమలు చేసే అంశాలు దేశానికే దిక్సూచిగా నిలవాలని పేర్కొన్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని సైతం ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వర్గీకరణను పూర్తి చేసిన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర నేతలకు ఖర్గే సూచించినట్టు తెలిసింది. ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రానివ్వొద్దు.. ఇటీవల కొందరు ఎమ్మెల్యేల ప్రత్యేక భేటీ అంశం కూడా ఖర్గే వద్ద ప్రధానంగా ప్రస్తావనకు వచ్చినట్టు తెలిసింది. ఒకరిద్దరు మంత్రుల తీరు నచ్చక జరిగిన ఈ భేటీతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దీన్ని ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చకు పెట్టిందని నేతలు ప్రస్తావించారని సమాచారం. అయితే దీనిపై ఇప్పటికే ఎమ్మెల్యేలతో మాట్లాడామని... ఏ విషయమైనా నేరుగా తమతోగానీ, అధిష్టానం పెద్దలతోగానీ మాట్లాడొచ్చని సూచించామని దీపాదాస్ మున్షీ, రేవంత్‌రెడ్డి వివరించినట్టు తెలిసింది.ఈ క్రమంలో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రానివ్వొద్దని, వారితో ఎప్పటికప్పుడు చర్చించుకోవాలని, రెండు, మూడు నెలలకోసారి సీఎల్పీ భేటీలు నిర్వహించుకోవాలని ఖర్గే సూచించారని సమాచారం. బీఆర్ఎస్ బలంగా ఉన్న నేపథ్యంలో ఎలాంటి వదంతులు, తప్పుడు సంకేతాలకు ఆస్కారం ఇవ్వకూడదని స్పష్టం చేసినట్టు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు పాలనకు పరీక్ష అని.. ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఖర్గే పేర్కొన్నట్టు తెలిసింది. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు.. 20మందికిపైగా వైస్ ప్రెసిడెంట్లు.. పీసీసీ కార్యవర్గ కూర్పుపై ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో రాష్ట్ర నేతలు జరిపిన భేటీలలో కొంతమేర స్పష్టత వచ్చినట్లు తెలిసింది. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను, 20 నుంచి 25 మంది వరకు వైస్ ప్రెసిడెంట్లను నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లలో బీసీ, రెడ్డి, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారు ఉండాలనే భావనకు వచ్చినట్టు సమాచారం. ఇక జిల్లా నేతల ఆమోదం ఉన్న చోట్ల డీసీసీ అధ్యక్షులను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. -
అత్యంత శాస్త్రీయతతో కుల సర్వే చేశాం..
సాక్షి, హైదరాబాద్: ప్రజా సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా అమలుచేసేందుకు తమ ప్రభు త్వం నిర్వహించిన ‘సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే– 2024’సమాచారం ఎంతగానో ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. భవిష్యత్‌లో అమలుచేయబోయే సంక్షేమ పథకాలను ఈ సర్వే గణాంకాల ఆధారంగానే చేపడుతా మని చెప్పారు. శాసనమండలిలో మంగళవారం ఆయన సమగ్ర కుల సర్వేతోపాటు, ఎస్సీ వర్గీకరణ నివేదికలను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. దేశంలో ఇంతటి శాస్త్రీయతతో ఏ రాష్ట్రంలోనూ సర్వే చేయలేదని తెలిపారు. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ప్రత్యేక రూట్‌మ్యాప్ ఆధారంగా సర్వే నిర్వహించామని చెప్పా రు. 50 రోజులపాటు నిర్వహించిన సర్వేలో 96.9% స్పష్టమైన వివరాలు వచ్చాయని వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకు శాస్త్రీయత లేదని, ఆ వివరాలను అప్పటి ప్రభుత్వం ఎక్కడా బహిర్గతం చేయలేదని విమర్శించారు.సర్వేలో ఉద్దేశపూర్వకంగా పాల్గొనని పెద్ద మనుషులు కూడా ఉన్నారని ప్రతిపక్షాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సర్వేలో పాల్గొనని వారి వివరాల నమోదుకు మరోమారు అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిందని వెల్లడించారు. కమిషన్ ఇచి్చన నివేదిక ఆధారంగా వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. సర్వే వివరాలు బయటపెట్టకుండా చర్చ ఏంటి? సమగ్ర సర్వేకు సంబంధించిన వివరాలు సభ్యులకు ఇవ్వకుండా సభలో చర్చఎలా నిర్వహిస్తారని మండలిలో ప్రతిపక్ష నేత మధసూదనాచారి ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వ నిర్ణయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సరికాదని అన్నారు.ప్రకటనలు ప్రవేశపెట్టేందుకు అసెంబ్లీ వేదిక కాదని, కనీసం లోతైన చర్చ కూడా జరపకపోవడం దారుణమని ఆగ్ర హం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సర్వేలో అన్ని వర్గాల జనాభా తగ్గిందని, ఓసీల జనాభాను మాత్రం భారీగా పెంచి చూపించారని ఆరోపించారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వండి: బండ ప్రకాశ్ గత ప్రభుత్వం చేసిన సమగ్ర సర్వే వివరాలు ఎంసీఆర్హెచ్ఆర్డీ వైబ్సైట్లో ఉన్నాయని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీకి అనుగుణంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. అందుకు సభ్యులు కూడా మద్దతుగా నిలుస్తారని తెలిపారు. సర్వే విషయంలో ప్రభుత్వం నుంచి సమాచారం అందకపోవడం, స్పష్టత లేకుండా సభ నిర్వహించడంపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ చర్చలో పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే, ఎస్సీ వర్గీకరణపై సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. -
తెలంగాణకు ‘హిమాచల్’ విద్యుత్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచనలతో రాష్ట్ర అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం బూట్ (బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ఫర్) విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రికల్ (జలవిద్యుత్) ప్రాజెక్టుల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఆహ్వనించగా.. రాష్ట్ర విద్యుత్ శాఖ అధికారుల బృందం హిమాచల్‌ప్రదేశ్‌ను సందర్శించింది. ఈ సందర్భంగా 100 మెగావాట్లకు పైబడిన సామర్థ్యం గల రెండు ప్రాజెక్టుల ఏర్పాటుపై రాష్ట్రం ఆసక్తిని వ్యక్తం చేసింది.ఇందుకు సంబంధించి హిమాచల్ ప్రభుత్వం ఎంఓయూపై సంతకం చేస్తే త్వరితగతిన తగిన తదుపరి చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియాతో కలసి ఢిల్లీలో హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్సింగ్తో సమావేశమయ్యారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వం నుంచి సెలి (400 మెగావాట్లు), మియార్ (120 మెగావాట్లు) హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణంపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ ఒక లేఖను సమర్పించారు.ఈ సందర్భంగా ఎంఓయూ గురించి చర్చించారు. త్వరలోనే దీనిపై ఒక నిర్ణయానికి రావాలని హిమాచల్ సీఎం, భట్టి నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్ రాష్ట్రానికి సరఫరా అవుతుంది. ఈ విద్యుత్ వల్ల రాష్ట్ర అవసరాలు, భవిష్యత్ విద్యుత్ డిమాండ్లను తీర్చేందుకు వీలు ఏర్పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. -
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కనిపించడం లేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఏ పార్టీ కనిపించడం లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం లేకపోతే ప్రజాస్వామ్యం లేదని, అన్ని పార్టీలూ ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. భావస్వేచ్ఛపై తమ ప్రభుత్వానికి విశ్వాసం ఉన్నందునే ఆయా పార్టీలు వారి సిద్ధాంతాలను ప్రచారం చేసుకునే అవకాశమిచ్చామన్నారు. చెన్నై వేదికగా మంగళవారం ప్రముఖ ఆంగ్ల పత్రిక ‘విద్య’అంశంపై నిర్వహించిన కాంక్లేవ్‌లో పాల్గొన్న భట్టి పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ కార్యక్రమంలో భట్టి ఏమన్నారంటే... » ఫార్ములా ఈ–కార్ రేసు వ్యవహారంలో రాజకీయంగా మేం చేసిందేమీ లేదు. ప్రజాధనం దురి్వనియోగమైందన్న ఆరోపణల మేరకు నాటి మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదై విచారణ జరుగుతోంది. ఈ అంశంలో ఎవరైనా విచారణ సంస్థల ముందుకొచ్చి వారి అభిప్రాయాలను చెప్పొచ్చు. » ప్రజాస్వామ్యం, సమాఖ్య వ్యవస్థలపై మాకు నమ్మకం ఉంది. భారత రాజ్యాంగంపై అచంచల విశ్వాసం ఉంది. కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు బలంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వంగా మేం కోరుకుంటున్నాం. అయితే, విధానపరమైన అంశాలపై కొట్లాడుతూనే ఉంటాం. » స్వాతంత్య్రోద్యమాన్ని ప్రచారం చేసేందుకు గాం«దీజీ యంగ్ ఇండి యా పత్రికను స్థాపించారు. ఆ పత్రిక స్ఫూర్తితోనే యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకుని లక్షల్లో వస్తున్న విద్యార్థుల్లో ఎంఎన్‌సీలు ఆశిస్తున్న నైపుణ్యాలు ఉండటం లేదు. దీంతో ఉపాధి కష్టతరమవుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని స్కిల్స్ వర్సిటీని స్థాపించాలని నిర్ణయం తీసుకున్నాం. » పాత లేత్ మెషీన్లతో ఉన్న ఐటీఐలను కంప్యూట ర్ యుగానికి అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం. రాష్ట్రంలోని 65 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేస్తున్నాం. » విద్యపై పెట్టుబడితో గొప్ప మానవ వనరులను ఉత్పత్తి చేయొచ్చు. ఈ వనరుల ద్వారా రాష్ట్రానికి సంపద చేకూరుతుంది. అందుకే ఈ ఏడాది బడ్జె ట్లో విద్యకు రూ.21వేల కోట్లు కేటాయించాం.» అంతర్జాతీయ ప్రమాణాల పేరుతో ప్రైవేటు విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్న ఫీజు దోపిడీపై విచారణ జరిపి చర్యలు చేపట్టేందుకే రాష్ట్రంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. » తెలంగాణలో ఇల్లు లేకుండా ఏ ఒక్కరూ మిగిలిపోకూడదు. విద్యా సౌకర్యం అందకుండా ఎవరూ బాధపడకూడదు. ఉపాధి లేదనే భావన ఎవరికీ కలగకూడదు. ఈ లక్ష్యాలతోనే ముందుకెళ్తున్నాం. రాష్ట్ర సంపదను అర్హులైన పేదలకు పంచడమే మా లక్ష్యం. -
నేడు ఇండోర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలు సోమవారం మధ్యప్రదేశ్ వెళ్లనున్నారు. ఇండోర్‌కు సమీపంలోని అంబేడ్కర్ స్వగ్రామం మహూ కంటోన్మెంట్లో ఏఐసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిధాన్ బచావో ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ర్యాలీలో పాల్గొనేందుకు రాష్ట్రం నుంచి సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఇతర మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు వెళ్లనున్నారు. -
నాలుగు పథకాలకు ఏటా రూ.45 వేల కోట్లు
కొణిజర్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, రైతుభరోసా పథకాలకు ఏటా రూ.45 వేల కోట్లు వెచ్చిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఖర్చుకు వెరవకుండా సంక్షేమ పథకాల అమలులో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం చిన్నగోపతిలో ఆదివారం ఆయన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసి మాట్లాడారు. ఇటీవల గ్రామసభల్లో లక్షలాది దరఖాస్తులు అందగా, వాటిని క్రోడీకరించి ప్రతీ నిరుపేదకు లబ్ధి జరగాలనే లక్ష్యంగా రాష్ట్రంలోని 66 మండలాల్లో ఒక్కో గ్రామంలో లాంఛనంగా పథకాలు ప్రారంభించామని తెలిపారు. దీనిపై బురదజల్లే యత్నం చేస్తూ ‘ఎక్స్’లో పోస్టులు పెట్టిన మాజీమంత్రి కేటీఆర్ సంక్షేమ పథకాల ప్రవాహంలో కొట్టుకుపోవడం ఖాయమని చెప్పారు.గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసి ఉంటే.. ఇప్పుడు త మకు పని ఉండేది కాదని భట్టి తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతీ నిరుపేదకు గూడు కల్పించే వరకు పథకం కొనసాగుతుందని, రాబోయే ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల రుణాలు ఇస్తామని భట్టి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్, ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో సహా పలువురు మంత్రులు స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు అనేది నిరంతర ప్రక్రియ అని, ఈ పథకాలకు ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోనివారు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 24 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న గ్రామ సభలు, వాటిలో నాలుగు పథకాలకు సంబంధించి ప్రజల స్పందన తదితర అంశాలపై కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 4 పథకాలకు రూ.40 వేల కోట్లు ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు దాదాపు రూ.40 వేల కోట్ల వ్యయం అవుతుందని మంత్రులు వెల్లడించారు. పదేళ్ల తర్వాత రాష్ట్రంలో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నందున ఈ రెండు పథకాలకు అధికంగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే వచ్చిన దరఖాస్తుల్లో ఇల్లు లేని వారు, ఇళ్ల స్థలం ఉండి ఇల్లు లేని వారి జాబితాను గ్రామ సభల్లో వెల్లడించాలన్నారు. ఇప్పటివరకు రేషన్ కార్డుల జారీకి సంబంధించి అర్హుల జాబితాను ప్రకటించలేదని, అన్ని దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులను ప్రకటిస్తామని తెలిపారు. దరఖాస్తుల్లో పేరు, ఆధార్ కార్డు నంబర్, చిరునామా తదితర వివరాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు విజయవంతంగా జరిగాయంటూ జిల్లా కలెక్టర్లను మంత్రులు అభినందించారు. రాష్ట్రంలో 4,098 గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెల్లడించారు. -
ఒడిశాలో 1,600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఒడిశాలోని నైనీ బొగ్గు బ్లాక్‌లో మార్చి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఒడిశాలోని కోణార్క్‌లో జరుగుతున్న మూడో జాతీయ మైనింగ్ మంత్రుల సదస్సులో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి ఆ రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాఝీకి ఆయన విజ్ఞాపన లేఖను అందజేశారు. నైనీ బ్లాకు ఏర్పాటుకు ఒడిశా సీఎం కార్యాలయం మద్దతు ఇచి్చనందుకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. నైనీ గనికి సమీపంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ కేంద్రం స్థాపనకు భూమిని కేటాయించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కోరగా, ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించి సహకరిస్తామని హామీ ఇచ్చారు.‘గత జూలై 24న మీతో జరిగిన సమావేశాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఆ చర్చలు ఫలవంతమయ్యాయి’అని భట్టి సంతోషం వ్యక్తం చేశారు. నైనీ గనిలో ఉత్పత్తయిన బొగ్గును 1000 కి.మీ. దూరంలో ఉన్న మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌కు తరలిస్తే రవాణా ఖర్చులు పెరిగి విద్యుత్ ధరలూ భారీగా పెరుగుతాయి. ఈ నేపథ్యంలో నైనీ గనికి సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఉత్పత్తయ్యే బొగ్గును అక్కడే వినియోగించాలని నిర్ణయించామని భట్టి తెలిపారు. 20వ ఎలక్ట్రిక్ పవర్ సర్వే ప్రకారం వచ్చే మూడు దశాబ్దాలపాటు థర్మల్ విద్యుత్‌కు భారీ డిమాండ్ ఉంటుందన్నారు. బొగ్గు గనుల దగ్గరే కొత్త థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు.దీంతో బొగ్గు రవాణా ఖర్చులను తగ్గించడంతోపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా, పర్యావరణ పర్యవేక్షణకు అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు. సింగరేణి, ఒడిశా అధికారుల మధ్య జరిగిన చర్చల్లో ప్రాథమికంగా జరపాడ/తుకుడ, హండప్ప/బని నాలిని ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే రెండు రాష్ట్రాలకూ ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయానికి వచ్చారన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలతోపాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. 10 ప్రాజెక్టులకు నిధులిప్పించండి తెలంగాణ చేపడుతున్న పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్థిక సాయంతోపాటు అనుమతులు ఇప్పించేందుకు సహకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. ప్రభుత్వం చేపడుతున్న పది ప్రాజెక్టులకు మొత్తం రూ.1,63,559 కోట్ల వ్యయం కానుందని తెలిపా రు. మైనింగ్ మంత్రుల సమావేశంలో ఆయా ప్రాజెక్టుల ఆర్థిక అంచనాలు, అనుమతుల ప్రతిపాదనల తో కూడిన వినతిపత్రాన్ని కిషన్‌రెడ్డికి అందజేశారు. 32 ఖనిజ బ్లాకులను వేలం వేస్తాంసున్నపురాయి, మాంగనీసు వంటి 32 మేజర్ ఖనిజ బ్లాకులను 2024–25, 2025–26 సంవత్సరాలకు సంబంధించి వేలం వేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. 2014లో రూ.1958 కోట్లుగా ఉన్న ఖనిజ ఆదాయం 2023–24 నాటికి రూ.5,540 కోట్లకు పెరిగిందన్నారు. జాతీయ ఖనిజ మంత్రుల సమావేశంలో భట్టి ప్రసంగించారు. ‘జాతీయ, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యాలకు అనుగుణంగా ఖనిజాన్వేషణ, నిర్వహణ ఉండాలి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ దేశీయంగా ఖనిజ పరిశ్రమలను ప్రోత్సహించాలి. రాష్ట్రంలో మొత్తం 2,552 గనుల లీజుల ఉన్నాయని, చిన్న ఖనిజాల లీజు మంజూరు విషయంలో బ్లాక్‌ల వేలం విధానంలో అనుసరించే నిబంధనలు పాటిస్తున్నాం’అని భట్టి వెల్లడించారు. జిల్లా మినరల్ ఫౌండేషన్ ద్వారా 2015 నుంచి ఇప్పటివరకు రూ. 5,537 కోట్లు వసూలైందని, ఈ నిధిని ప్రభుత్వ పాఠశాలలతో పాటు పలు ప్రాధాన్యతా రంగాల్లో వినియోగిస్తున్నామన్నారు. -
26 నుంచి రైతు భరోసా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా వర్తింపజేస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26 నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుభరోసా డబ్బులు జమ చేస్తామని చెప్పారు. పథకం కోసం రూ.8,400 కోట్లను వెచ్చించడానికి ప్రాథమికంగా అంచనా వేశామని వెల్లడించారు. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎన్పిడీసీఎల్)లో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన 92 మందికి శనివారం సాయంత్రం సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన నియామక పత్రాలు అందజేసి మాట్లాడారు. భూమి లేని రైతుకూలీల కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మి య భరోసా పథకం కింద ఈ నెల 26వ తేదీ తర్వాత మొదటి విడత వాయిదా (ఇన్స్టాల్మెంట్) డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. అబద్ధాల పార్టీ.. పదేపదే అబద్ధాలు అబద్ధాల మీద పుట్టిన రాజకీయ పార్టీవాళ్లు పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు భ్రమలు కల్పించి బతికారని, ఇప్పుడు మళ్లీ అవే అబద్ధాలతో తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్పై భట్టి విక్రమార్క మండిపడ్డారు. మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు తగ్గకుండా సాగునీరు ఇస్తామని గత పాలకులు హామీ ఇచ్చి గాలికి వదిలేశారని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోందని తెలిపారు. రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల పెట్టుబడులు తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దావోస్ వెళ్లారని భట్టి తెలిపారు. యాసంగిలో నాణ్యమైన విద్యుత్: తుమ్మల యాసంగి సీజన్ రైతులు పండిస్తున్న వరి పంటలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు తెలిపారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో 35 శాతం నిధులు కేటాయించామని చెప్పారు. పంటలసాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, డిస్కంల సీఎండీలు ముషారఫ్ ఫారూఖీ, వరుణ్ రెడ్డి పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగులకు డీఏ విద్యుత్ ఉద్యోగుల పెండింగ్ డీఏను మంజూరు చేస్తూ జారీచేసిన ఉత్తర్వులను సభా వేదికగా భట్టి విక్రమార్క విడుదల చేశారు. 11.78% నుంచి 14.074 శాతానికి పెరిగిన డీఏను గతేడాది జూలై 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తింపజేయనున్నారు. విద్యుత్ ఉద్యోగులకు వేతన అడ్వాన్స్‌లు, రుణాల చెల్లింపుల కోసం విద్యుత్ సంస్థలు ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన ఆదేశించారు. రాష్ట్రంలో 28 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ కోసం రూ.8,729 కోట్లను అందజేస్తున్నామని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. గృహజ్యోతి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా రూ.148.5 కోట్ల చొప్పున ఇప్పటివరకు రూ.1,485 కోట్ల బిల్లులను చెల్లించిందని తెలిపారు. రాష్ట్రంలో 25 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సోలార్ గ్రామాలుగా మార్చబోతున్నామని, వ్యవసాయ పంపు సెట్లకు, గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తామని వివరించారు. -
ఉగాదికి గద్దర్(సినిమా)అవార్డులు: భట్టి విక్రమార్క
సాక్షి,హైదరాబాద్:ఉగాదికి గద్దర్ (సినిమా) అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.ఈ మేరకు శనివారం(జనవరి18) సచివాలయంలో జరిగిన గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం వెల్లడించారు. అవార్డుల ప్రదానోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని కమిటీ సభ్యులు,అధికారులకు సూచించారు. సినిమా నిర్మాణంలో హైదరాబాద్‌ను ప్రపంచ గమ్యస్థానంగా మారుస్తామని ఈ సందర్భంగా భట్టి తెలిపారు.అవార్డుల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు చెప్పారు. అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని జాతీయ స్థాయి కార్యక్రమాల తరహాలో నిర్వహించాలని సూచించారు.గత పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ చిత్ర పరిశ్రమను నిర్లక్ష్యం చేసిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో అవార్డుల ప్రదానం జరగలేదన్నారు. రాష్ట్రంలో సినిమాల నిర్మాణాన్ని ప్రోత్సహించే అవార్డులను ఏటా అందజేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.అవార్డుల కోసం లోగోతో సహా విధివిధానాలు, నియమ నిబంధనలపై కమిటీ చర్చించింది.గతంలో తెలుగు సినిమా రంగానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డులు బహుకరించేవారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నంది అవార్డుల సంప్రదాయం కొనసాగినప్పటికీ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం సినిమా రంగానికి అవార్డులివ్వలేదు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత సినిమా రంగానికి తెలంగాణ యుద్ధనౌక గద్దర్ పేరుతో అవార్డులివ్వాలని నిర్ణయించింది. -
సబ్‌ప్లాన్ నిధులు పూర్తిగా ఖర్చు చేయండి
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలులో భాగంగా ప్రభుత్వ శాఖలకు కేటాయించిన నిధులను నూరు శాతం ఖర్చు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుపై ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కేటగిరీలవారీగా సమీక్షించి పలు సూచనలు చేశారు. సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం ప్రభుత్వ శాఖలకు కేటాయించిన నిధులు, చేసిన ఖర్చు వివరాలను ప్రతి నెలా వెల్లడించాలని స్పష్టం చేశారు.అందుబాటులో ఉన్న నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. సబ్‌ప్లాన్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో ఈ నెల 23న నిర్వహించబోయే సమావేశానికి హాజరు కావాలని శాఖాధిపతులను ఆదేశించారు. బడ్జెటేతర నిధుల వ్యయంలోనూ సబ్‌ప్లాన్ చట్టం ప్రకారం జనాభా దామాషాలో నిధుల ఖర్చు జరిగిందా? లేదా? అనే సంపూర్ణ సమాచారం అందించాలని సూచించారు. సబ్‌ప్లాన్ అమలుకు సంబంధించి గత ఎనిమిదేళ్లలో క్షేత్రస్థాయిలో వివిధ శాఖల్లో అధ్యయనం చేసి సెస్ రూపొందించిన నివేదికపై ఈ సమావేశంలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అటవీ భూముల్లో వాణిజ్య పంటలు అటవీ భూముల్లో వ్యవసాయ మోటార్లకు సోలార్ విద్యుత్తు వినియోగించాలని భట్టి విక్రమార్క సూచించారు. ఆయా భూముల్లో వెదురు, అవకాడో, పామాయిల్ వంటి వాణిజ్య పంటలతోపాటు అంతర పంటల సాగు ప్రాజెక్టులు డిజైన్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పంటలతో ఆదివాసీ, గిరిజన రైతులకు ఆదాయాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మూసీ పునర్జీవనం పథకంలో నిర్వాసితులవుతున్న ఎస్సీ, ఎస్టీ మహిళలను స్వయం సహాయక సంఘ సభ్యులుగా చేర్పించి, వారికి వడ్డీ లేని రుణాలు అందించాలని సూచించారు. స్వయం ఉపాధి కింద పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు రవాణా వాహనాలు, క్లీనింగ్ యంత్రాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, సీనియర్ ఐఏఎస్ అధికారులు వికాస్ రాజ్, దాన కిషోర్, ఎన్.శ్రీధర్, శరత్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు చేసే బాధ్యత నాదే
నాగార్జునసాగర్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను సహచర మంత్రులతో కలిసి సంపూర్ణంగా అమలు చేసే బాధ్యత తానే తీసుకుంటానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం నాగార్జునసాగర్ లో ఏర్పాటు చేసిన ఆదివాసీ, గిరిజన ప్రజాప్రతినిధుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు సంబంధించి తాను చీఫ్‌విప్‌గా ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సమావేశపరిచి అధిష్టా నానికి నివేదిక ఇచ్చి అమలు చేయాలని కోరానని చెప్పారు. ఆ తర్వాత తాను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నప్పుడు ఈ చట్టం ఆమోదం పొందిందన్నారు.చట్టాన్ని మొదలుపెట్టిన వ్యక్తిగా, బిల్లును ఆమోదింపచేసిన వ్యక్తిగా తనకు సంపూర్ణ అవగాహన ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం అన్ని శాఖల సెక్రటరీలను సమావేశపరిచి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ప్రకారం నిధుల కేటాయింపు జరుగుతుందా? లేదా అని నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్టు చెప్పారు. ఇప్పటికే రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నివేదికలు సమర్పించారని, మిగిలిన శాఖల నుంచి నివేదికలు త్వరలో తెప్పించి సమగ్రంగా సమీక్షిస్తానని తెలిపారు.రాష్ట్రంలో పీసా, అటవీ హక్కుల చట్టాలను 100 శాతం సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు. అటవీ హక్కుల చట్టం ద్వారా వచ్చిన భూముల్లో విద్యుత్ సౌకర్యం పొందేందుకు లైన్లు వేసే క్రమంలో ఆ శాఖ నుంచి ఇబ్బందులు తలెత్తుతున్న నేపథ్యంలో సోలార్ పవర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి మోటార్ల ద్వారా ఆయా భూములు సాగులోకి తెచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. బడ్జెట్లో ఆదివాసీ, గిరిజనులకు పదిశాతం రాష్ట్ర బడ్జెట్లో ఆదివాసీ, గిరిజనులకు పదిశాతం కంటే తక్కువ కాకుండా కేటాయిస్తామని మంత్రులు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివాసీ, గిరిజన బిడ్డలను నాయకులుగా తీర్చిదిద్దడానికే ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గిరిజన, ఆదివాసీ సంక్షేమ చట్టాలను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు. -
త్వరలో ‘సౌర’ టెండర్ల ఖరారు!
సాక్షి, హైదరాబాద్: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళల ఆధ్వర్యంలో సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) పిలిచిన టెండర్లను త్వరలో ఖరారు చేస్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇందుకుగాను ఎస్‌హెచ్‌జీల కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన రుణ సహాయం కోసం ఎస్‌హెచ్‌జీలను బ్యాంకులతో సమన్వయం చేయాలని కోరారు. ఎస్‌హెచ్‌జీల ద్వారా 1,000 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు గతేడాది సెప్టెంబర్‌లో ఇంధన, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈ కార్యక్రమం పురోగతిపై మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి బుధవారం ప్రజాభవన్‌లో జిల్లా కలెక్టర్లతో ఉపముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకి 4 ఎకరాలు చొప్పున ప్రతిజిల్లాలో కనీసం 150 ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల ఎకరాలను సేకరించాల్సి ఉంటుందన్నారు. ఇందుకుగాను దేవాదాయ, నీటిపారుదల శాఖల పరిధిలోని భూములను గుర్తించాలని సూచించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తయారు చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో చిన్న స్థాయి పారిశ్రామికవాడల ఏర్పాటుకు భూములు సేకరించాలని భట్టి ఆదేశించారు. వీటితో ఎస్‌హెచ్‌జీలు వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమల ఏర్పాటుకి 4–5 ఎకరాల భూమి సరిపోతుందన్నారు. అటవీ భూముల్లో అవకాడో వంటి పంటలు సాగు చేస్తే అటవీ సంపద పెరగడంతో పాటు గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవుతారని చెప్పారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా ఉన్న గుట్టలతో పాటు నగరాల్లో భారీ భవంతులపై సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గిరిజనులకు భూమి ఎక్కువగా ఉన్నా ఆదాయం తక్కువగా ఉంటుందని, అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి పరీవాహకంలోని భూములపై దృష్టిపెడితే వారికి ప్రయోజనం కలుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. సమావేశంలో ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్యకార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా, లోకేశ్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ పాల్గొన్నారు. -
కొత్త ఏడాదిలోనూ భారీగా నియామకాలు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే టీజీపీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేసింది. యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్ కేలండర్ ప్రకటించింది. పారదర్శకంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి ఏడాదిలో 56 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది. ప్రతి నెలా ఏదో ఒక నియామక పత్రాలు అందజేస్తున్నాం. నూతన సంవత్సరంలో కూడా పెద్ద ఎత్తున నియామకాలుంటాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు వస్తాయి..’అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)లో ఏఈ పోస్టులకు ఎంపికైన 315 మంది అభ్యర్థులకు సోమవారం ఆయన నియామక పత్రాలు అందజేశారు. సచివాలయం ఎదుట ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొలువుల కోసం కొట్లాడిన నిరుద్యోగుల ఆశలను గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలకులు అడియాసలు చేశారని విమర్శించారు. కొలువులు లేక నిరాశ నిస్పృహలకు గురైన నిరుద్యోగ యువత ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ఉద్యోగాలు వస్తాయని భావించి ప్రజా ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని అన్నారు. వారి ఆశలు వమ్ము చేయకుండా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు, స్వయం ఉపాధి కల్పించేందుకు సీఎం, మంత్రివర్గం నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. 9న రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ ప్రకటన దేశ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఈ నెల 9న తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీ–2025ని ప్రకటించనున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు తయారు చేశామన్నారు. ఇందుకోసం అదనంగా 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు. 2030 నాటికి రాష్ట్ర గరిష్ట విద్యుత్ డిమాండ్ 22,448 మెగావాట్లకు చేరుకుంటుందని సెంట్రల్ ఎలక్రి్టసిటీ ఆథారిటీ (సీఈఏ) అంచనా వేసిందని, ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ‘చెమట చుక్కలకు తర్పీదు’లోగో ఆవిష్కరణసింగరేణి సంస్థ రూపొందించిన ‘చెమట చుక్కలకు తర్పీదు’లోగోను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. దేశ, విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై కోల్ బెల్ట్ యువతకు అవగాహన కల్పించేందుకు సింగరేణి సంస్థ చేస్తున్న ప్రయత్నాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, షబ్బీర్ అలీ, ఇంధన శాఖ ముఖ్య కార్యదిర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ పాల్గొన్నారు. -
భోజనం ఎలా ఉందమ్మా?
బీబీనగర్:బోజనం ఎలా ఉందమ్మా? కొత్త మెనూ ప్రకారం అన్నీ పెడుతున్నారా? సదుపాయాలు బాగున్నాయా?..’అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విద్యార్థులను ఆరా తీశారు. వారితో కలిసి భోజనం చేశారు. ఆదివారం ఆయన వరంగల్ వెళుతూ మధ్యలో యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని బీసీ బాలికల గురుకులం, ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించారు. తొలుత బీసీ బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లారు. కొత్త మెనూ అమలు, వసతిగృహంలో కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ అడిగారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అరగంటకు పైగా అక్కడ గడిపారు. అనంతరం అదే ఆవరణలో ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్‌ను సందర్శించి తనిఖీలు చేశారు. భోజనం, కిచెన్, డైనింగ్ హాల్, కూరగాయలు, కిరాణా సరుకులు, బియ్యం తదితర వంట సామాన్లను పరిశీలించారు. విద్యార్థులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారా అని ప్రిన్సిపాల్‌ను ప్రశ్నించారు. హెల్త్చెకప్ కార్డులు మెయింటెయిన్ చేయడం లేదని, రిజిస్టర్లలో నమోదు చేస్తున్నారని ఆయన చెప్పడంతో, హెల్త్ చెకప్ కార్డులు తప్పనిసరిగా మెయింటెయిన్ చేయాలని వైద్యారోగ్య సిబ్బందిని ఆదేశించారు. ఎస్సీ బాలికల హాస్టల్లో డిప్యూటీ సీఎం గంటన్నర పాటు ఉన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆర్థిక భారం ఉన్నా డైట్ చార్జీలు పెంచాం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యం కోసం డైట్ చార్జీలను 40 శాతం పెంచినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.పెంచిన చార్జీలు, మెనూ ప్రకారం హాస్టళ్లలో అన్నీ సక్రమంగా అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకు మంత్రులతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, అదనపు కలెక్టర్లు గంధాధర్, వీరారెడ్డి ఆయన వెంట ఉన్నారు.వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా: భట్టి గీసుకొండ: భూమిలేని వ్యవసాయ కూలీలందరికీ ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పథకం ద్వారా ఆర్థిక చేయూత అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచర్లలో కీర్తినగర్, మొగిలిచర్ల, విశ్వనాథపురం 33/11 కేవీ విద్యుత్ సబ్స్టేషన్ల పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కారు రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామని మాయమాటలు చెప్పి అప్పుల కుప్పగా మార్చి ప్రజల జీవితాలను ఆగం చేసిందని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు చేసిన నిర్వాకానికి ప్రతి నెలా రూ.6,500 కోట్ల మేరకు అసలు, వడ్డీ చెల్లిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కరెంటు సమస్య లేకుండా చేస్తామని అన్నారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్.నాగరాజు, గండ్ర సత్యనారాయణ, మురళీనాయక్, రాంచంద్రునాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం కాన్వాయ్కి తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, వరంగల్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో అపశ్రుతి చోటుచేసుకుంది. వరంగల్ వెళ్తున్న క్రమంలో జనగామలోని కళాతోరణం వద్ద భట్టి కాన్వాయ్‌లోని ఒక పోలీస్ వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు. ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థుల ఆరోగ్యంగా ఉండాలని.. పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డైట్ చార్జీలు పెంచిందన్నారు.ఇదీ చదవండి: మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు -
ఢిల్లీకి సీఎం రేవంత్, భట్టి విక్రమార్క
-
తెలంగాణ ఏర్పాటైంది మన్మోహన్ హయాంలోనే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారమైంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలోనే. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది. తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు, రాజకీయ నిర్ణయాలు జరిగినప్పటికీ మన్మోహన్ ప్రధానిగా ఉన్న సభలోనే రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడం గమనార్హం. హైదరాబాద్ మెట్రో రైలు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే మంజూరు కావడమే కాక, వయబిలిటీ గ్యాప్ ఫండ్‌ను ఇవ్వడంలో ఆయన కృషి ఉంది. కాగా, మన్మోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన జీవితం దేశానికి ఆదర్శమని, ఆయన మరణం దేశ ప్రజలకు తీరనిలోటని పేర్కొన్నారు. మన్మోహన్ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. -
త్వరలో రూ.400 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీల్లో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన అప్పటి సర్పంచులకు త్వరలోనే రూ.400 కోట్లు విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. గత ప్రభుత్వం వారితో అభివృద్ధి పనులు చేయించి.. నిధులు విడుదల చేయకుండా వారిని రోడ్డుపై వదిలేసిందని మండిపడ్డారు. అందువల్ల పంచాయతీ బకాయిలపై బీఆర్ఎస్ నాయకులు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని హితవు పలికారు. రూ.10 లక్షలలోపు పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రతినిధుల బిల్లులు దాదాపు రూ.400 కోట్లు ఉంటాయని అంచనా వేశామని, వాటిని త్వరలోనే విడుదల చేస్తామని మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో భట్టి చెప్పారు. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వంటి ప్రజాప్రతినిధులు చేసిన అభివృద్ధి కార్యక్రమాల పెండింగ్ బిల్లులు గత సంవత్సరం డిసెంబర్ 7 నాటికి ఉన్న బకాయిలు రూ.1,300 కోట్లు అని వెల్లడించారు. సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్‌రెడ్డి, తాను గమనించి రూ.10 లక్షల లోపు ఉన్న బకాయిలను త్వరలోనే విడుదల చేయాలన్న నిర్ణయానికి వచి్చనట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధుల ఇబ్బందులకు కారణమైన బీఆర్ఎస్ నేతలు పెండింగ్ బిల్లుల కోసం ధర్నాలు చేస్తామని ప్రకటించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం–కుసుమ్) పథకం కింద రాష్ట్రంలో రైతుల పంట పొలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 0.5– 2 మెగావాట్ల సామర్థ్యం గల సౌర విద్యుత్ ప్లాంట్లను ఎండిపోయిన, పాడుబడిన వ్యవసాయ భూముల్లో రైతులతో ఏర్పాటు చేయిస్తామన్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసే విద్యుత్‌కు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు యూనిట్‌కు రూ.3.13 చొప్పున ధర చెల్లిస్తాయన్నారు. రైతులు, రైతు బృందాలు, సహకార సొసైటీలు, పంచాయతీలు, రైతు సంఘాలు, నీటి వినియోగ సంఘాలు ఈ పథకం కింద అర్హులన్నారు. -
రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ దే : భట్టి విక్రమార్క
-
అసెంబ్లీలో అప్పు లపై కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యుల | మధ్య వాగ్వాదం
-
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు మేం తీర్చాల్సి వస్తుంది: భట్టి
-
అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
-
భట్టిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్లో రాష్ట్ర అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారని బీఆర్ఎస్ పార్టీ విమర్శించింది. సోమవారం ఈ అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆయన చాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అప్పులపై శాసనసభ, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఆరోపించారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ‘2023 డిసెంబర్ 20న అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడుదల చేసిన శ్వేతపత్రంలో తెలంగాణ అప్పులను రూ.6.71 లక్షల కోట్లుగా చూపించారు. ఈ ఏడాది జూలై 25 నాటి బడ్జెట్ ప్రసంగంలోనూ ఇవే అంకెలను వల్లె వేశారు. కానీ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ‘హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’నివేదికలో 2014–15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72, 658 కోట్లు కాగా 2024 మార్చి నాటికి రూ.3.89 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది.కానీ ఆర్థిక మంత్రి అప్పులపై ఉద్దేశ పూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారు. ఈ నేప థ్యంలో ఆర్థిక మంత్రిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం’అని బీఆర్ఎస్ ప్రకటించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులకు భంగం: కేటీఆర్ ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అప్పులపై తప్పుదోవ పట్టిస్తున్నందునే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీ లాబీలో తనను కలసిన మీడియా ప్రతినిధులతో వ్యాఖ్యానించారు. ‘గతంలో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఇచ్చిన హక్కుల ఉల్లంఘన నోటీసును నాటి స్పీకర్ మనోహర్ అంగీకరించి సభలో చర్చకు వీలు కల్పించారు.ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నేతలు అప్పులపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా కేవలం టూరిజంపైన రాష్ట్ర ప్రభుత్వం చర్చ పెట్టడం బాధాకరం. రాష్ట్రంలో ఢిల్లీ టూరిజం, జైలు టూరిజం బాగా నడుస్తున్నాయి. శాసనసభలో లగచర్ల అంశానికి సంబంధించిన అంశాన్ని చర్చకు తీసుకురావాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యేలను కూడా అడ్డుకుంటున్నారు ‘గతంలో ఎన్నడూ లేని రీతిలో మాజీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ వైపు రాకుండా అడ్డుకుంటున్నారు. గతంలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎంను కలిసే అవకాశం ఉండేది. ప్రస్తుతం కనీసం ప్లకార్డులను కూడా తీసుకురాకుండా అడ్డు కుంటున్నారు. మమ్మల్ని కట్టడి చేసి, ప్రభుత్వం తన వైఫల్యాలను దాచుకోవాలని అనుకుంటున్నది. రైతు కూలీలకు రూ.12 వేల అర్థిక సహాయం చేస్తామని ఆర్థిక మంత్రి భట్టి చేసిన ప్రకటన అసెంబ్లీ వ్యవహారాలకు విరుద్ధం. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నప్పుడు విధానపరమైన నిర్ణయాలను సభలోనే ప్రకటించాలన్న అంశాన్ని భట్టి విక్రమార్క విస్మరించారు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. -
ఆర్థిక మంత్రి భట్టి అప్పు లపై చేసిన ప్రసంగాన్ని ఖండించిన కేటీఆర్...
-
నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశంకానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో... కొత్త రెవెన్యూ చట్టం ‘రికార్డ్స్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్)’బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. అనంతరం ఈ బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతించేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించనున్నట్టు తెలిసింది. ఇక రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి విధివిధానాలను మంత్రివర్గం ఖరారు చేయనుంది. వీటిపై శాసనసభలో చర్చ నిర్వహించనుంది. మరోవైపు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ సమరి్పంచిన విచారణ నివేదికను సైతం కేబినెట్ పరిశీలించి శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతించనుంది. ‘ఫార్ములా–ఈ’రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్‌పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సీఎంతో మంత్రి పొంగులేటి భేటీ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో ఆర్ఓఆర్ బిల్లు తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఇక ధరణిపై ఏర్పాటైన కమిటీ సభ్యులు కోదండరెడ్డి, ప్రొఫెసర్ సునీల్ ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలసి బిల్లులోని అంశాలను వివరించారు. -
అప్పులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
ఖమ్మం వన్‌టౌన్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఇప్పుడు ఆ అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల కాలంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7,11,911 కోట్ల అప్పులు చేసి ప్రజలపై తీరని భారం మోపిందన్నారు.రాష్ట్రానికి తెచ్చిన అప్పులను బీఆర్ఎస్ నాయకులు దోచుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూనే వాళ్లు తెచ్చిన అప్పులు తీరుస్తున్నామని పేర్కొన్నారు. ఖమ్మం డీసీసీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పారీ్టనే అప్పుల పాలు చేయగా.. ఇప్పుడు హరీశ్‌రావు, కేటీఆర్ గాయిగత్తర చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలను శ్వేతపత్రం ద్వారా విడుదల చేసి ప్రజల ముందు ఉంచామని భట్టి గుర్తుచేశారు. రానున్న సంక్రాంతికి రైతు భరోసా డబ్బు సైతం జమ చేస్తామని, ఇప్పటివరకు మొత్తం రూ.50,953 కోట్లను రైతుల కోసం ఖర్చు చేశామని వివరించారు. పేదలకు రెండు విడతలుగా సాయం ఈ నెల 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భూమి లేని నిరుపేదలకు రూ.12 వేల చొప్పున రెండు విడతలుగా సాయం అందించే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడతామని భట్టి విక్రమార్క ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు వరంగల్, రామగుండం, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో పండించిన ప్రతీ గింజను కొనుగోలు చేసి రైతులకు వారంలోపే డబ్బులు, సన్నాలకు బోనస్‌ను సైతం అందిస్తున్నామని తెలిపారు.అన్ని జిల్లాలను కలుపుతూ రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఓఆర్ఆర్–ట్రిపుల్ ఆర్ మధ్య ఇండస్ట్రియల్, హౌసింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు అందిస్తామని చెప్పారు. వసతి గృహాల్లో నూతనంగా పెంచిన డైట్ చార్జీలతో ప్రభుత్వంపై ఏడాదికి రూ. 541 కోట్ల భారం పడుతుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో డైట్ చార్జీలు పెంచలేదని, అందుకే అన్నంలో పురుగులు వంటివి వచ్చాయని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై తప్పుడు కథనాలు ప్రచురిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56 వేల మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించామని చెప్పారు. -
రూ.12వేల సాయానికి అర్హుల ఎంపిక ఎలా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూమిలేని ప్రతీ కుటుంబానికి ఏటా రూ.12వేల ఆర్థిక సాయాన్ని అందించే పథకానికి ఈ నెల 28న శ్రీకారం చుట్టబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించిన నేపథ్యంలో అర్హుల ఎంపికపై జోరుగా చర్చ సాగుతోంది. ఏడాదిలో రెండు విడతలుగా ఈ మొత్తాన్ని చెల్లిస్తామని, తొలి విడతగా ఈనెల 28న అర్హుల బ్యాంకు ఖాతాల్లో జమచేయనున్నట్లు భట్టి చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఎకరాకు ఏటా రూ. 12వేల చొప్పున ఆర్థిక సాయం అందించే కార్యక్రమం ఇప్పటికే కొనసాగుతోంది.రైతులతోపాటు రైతు కూలీలకు కూడా సాయం అందజేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. గత సెపె్టంబర్లో రూ.12వేల సాయం ప్రకటన చేసిన భట్టి ఆదివారం ఖమ్మంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. ఈ నెల 28న తొలివిడతగా రూ. 6వేలు ఇస్తామని ప్రకటించారు. సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్న శాసనసభ సమావేశాల్లో భూమిలేని పేదలను గుర్తించి, ఎంత మందికి పథకాన్ని అమలు చేయాలనే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భూమిలేని పేదలు ఎందరు? రాష్ట్రంలో రైతు కుటుంబాలు 64 లక్షల వరకు ఉండగా, భూమిలేని కుటుంబాలు, కూలీ నాలీ చేసుకునే వారు కలిపి 50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. అయితే రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 53.06 లక్షల కుటుంబాల్లోని వారికి జాబ్‌కార్డులున్నాయి. వారిలో 34.52 లక్షల కుటుంబాల వారే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నట్లు ఇటీవల ఓ సర్వేలో తేలింది. జాబ్‌కార్డు ఉన్న వారిలో కూడా కొందరు చిన్న, సన్నకారు రైతులు ఉంటారు. అయితే, భూమిలేని కుటుంబాలను గుర్తించేందుకు ఇప్పటివరకు పూర్తిస్థాయి సర్వే ఏదీ జరగలేదు.2014లో జరిపిన సకుటుంబ సర్వే వివరాలు వెల్లడి కాకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కులగణనతో కూడిన కుటుంబసర్వే ఇంకా పూర్తికాలేదు. అయితే మండలాల స్థాయిలో ఉన్న లెక్కల ప్రకారం సుమారు 40లక్షల కుటుంబాలను భూమిలేని కుటుంబాలుగా ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఏ పథకానికైనా రేషన్‌కార్డును ప్రాథమిక అర్హతగా చెబుతున్న ప్రభుత్వం.. రైతు రుణమాఫీ తరహాలో కుటుంబంలో ఒక్కరినే ఇందుకు అర్హులుగా గుర్తిస్తుందా అనేది తెలియాల్సి ఉంది.గుంట భూమి ఉన్న రైతుకు కూడా రైతుభరోసా పథకాన్ని వర్తింపజేస్తున్న ప్రభుత్వం.. ఈ పథకంలో లబ్ధి పొందని వారందరినీ భూమిలేని కు టుంబాలుగా పరిగణనలోకి తీసుకుంటుందేమోన ని రైతు కూలీ సంఘాల నేతలు పేర్కొంటున్నారు. 30 లక్షల కుటుంబాలకు ఇచ్చినా..భూమిలేని కుటుంబాలను ప్రభుత్వం ఏ ప్రాతిపదికన గుర్తించినా... కనీసం 30 లక్షల కుటుంబాలను అర్హులుగా తేల్చే అవకాశం ఉందని సమాచారం. ఈలెక్కన ఒక్కో కుటుంబానికి తొలివిడత రూ. 6వేల చొప్పున బ్యాంకు ఖాతాల్లో వేస్తే రూ.1,800 కోట్ల భారం ప్రభుత్వంపై పడే అవకాశం ఉంది. ఈలెక్కన సంవత్సరానికి రూ. 3,600 కోట్లు అవసరమవుతాయి. అర్హుల గుర్తింపుపై స్పష్టత వస్తే ఈ లెక్కల్లో తేడా ఉండే అవకాశం ఉంది.అర్హులందరికీ ఇవ్వాలిసారంపల్లి మల్లారెడ్డి, సీపీఎం నేత కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు భూమిలేని కుటుంబాలకు, రైతు కూలీలకు రూ.12వేల ఆర్థిక సాయాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. రైతు రుణమాఫీలో కోతలు పెట్టినట్టుగా ఈ పథకం కింద పేదలకు అన్యాయం చేయొద్దు. రాష్ట్రంలో 60 లక్షల వ్యవసాయ కుటుంబాలు ఉంటే, 40 లక్షల కుటుంబాలు భూమి లేని పేదలే. వీరందరికీ ఆర్థిక సాయాన్ని అందించాలి. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం
-
అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?.. బీఆర్ఎస్కు డిప్యూటీ సీఎం సవాల్
సాక్షి, ఖమ్మం జిల్లా: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఆదివారం ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాట్లాడుతూ, మంచి పోషక విలువలు కలిగిన ఆహారం పిల్లలకు అందిస్తున్నామని తెలిపారు. నూతనంగా పెంచిన డైట్ ఛార్జీల కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై కొంత భారం పడుతుందన్నారు.‘‘రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులు 2014 నాటికి 72450 కోట్ల రూపాయలు.. ప్రభుత్వంతో పాటు కొన్ని కార్పొరేట్ బ్యాంక్‌ల ద్వారా అప్పులు చేసింది. 5893 కోట్లు రాష్ట్ర విభజన జరిగే నాటికి అప్పు ఉంటే అవి 95 వేల కోట్లకు పెరిగింది. పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల 23 వేల కోట్లు చేసింది. అది రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి. మేము కూడ అప్పులు చేశామని అంటున్నారు. మీరు చేసింది తినేందుకు, మేము చేసేది అప్పు కట్టేందుకు’’ అంటూ భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.మా ప్రభుత్వం ఏర్పడ్డాక 50 వేల కోట్లు.. మేము అప్పు వడ్డీ కలిపి 66 వేల 722 కోట్లు చెల్లించాం. 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు 6 వేల 400 కోట్లు ఉండేది. ఇంత భారం రాష్ట్ర ప్రభుత్వం మీద వేసి, తగుదునమ్మా అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం మీద అరుస్తా ఉన్నారు. 10 ఏళ్లు పెరిగిన ధరలకు అనుగుణంగా మీరు రేట్లు పెంచలేదు కాబట్టి అన్నంలో పురుగులు వంటివి వచ్చాయి. మళ్ళీ తిరిగి రెసిడెన్షియల్ స్కూల్లో టాయిలెట్స్ సరిగా లేవని మాట్లాడుతున్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నది మీరే కదా?’’ అంటూ భట్టి ప్రశ్నించారు.‘‘మేము కేవలం సంవత్సర కాలంలోనే పూర్తి కాకముందే 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. 66 వేల కోట్ల రూపాయలు అప్పు కడుతూ రైతుల అప్పు కడుతున్నాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్ని వేల కోట్లు రైతుల అప్పు కట్టలేదు. రైతు భరోసా 7 వేల 625 కోట్లు కల్పించాం. రైతు బీమా కట్టాం. 1500 రూపాయలు రైతు బీమా ప్రభుత్వం కట్టింది. ఆయిల్ ఫోం కి 40 కోట్లు విడుదల చేశాం. 30 వేల కోట్ల రూపాయలు రైతులకు మేము బోనస్ కాకుండా రైతుల కోసం మేము డిసెంబర్ నుండి వాటికి నేరుగా ఖర్చు పెట్టాం’’ అని భట్టి విక్రమార్క వివరించారు.పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ పంట నష్టపోయిన రైతులను పట్టించుకోలేదు. రైతుల పట్ల ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో పని చేస్తుంది. భూమిలేని నిరుపేదల గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. డిసెంబర్ 28వ తేదీన మొదటి ఇన్స్టాల్మెంట్ ఇస్తుంది. రైతుల పక్షాన, వ్యవసాయ పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. సీఎం పైన, ప్రభుత్వం పైన తప్పుడు కథనాలు ప్రచురిస్తే నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. 56 వేల మంది నిరుద్యోగ యువతకు నియామక పత్రాలు అందించాం. ఇంకా 22 వేల కోట్ల బడ్జెట్‌తో 3500 ఇళ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ప్రతిపక్ష పార్టీ వాస్తవాలను అవాస్తవాలుగా చూపించే ప్రయత్నం చేస్తుంది’’ అని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. -
మహిళలకు రూ.లక్ష కోట్ల రుణాలు
సనత్‌నగర్: రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని.. వ్యాపారులుగా, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళ లకు ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్‌ను మంత్రి సీతక్క తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ప్రభు త్వ ఆర్థిక సహాయాన్ని మహిళలందరూ అందిపుచ్చుకొని కోటీశ్వరులుగా ఎదగాలన్నారు. 17 రకాల వ్యాపారాలకు వడ్డీలేని రుణాలు: మంత్రి సీతక్కకోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చాలన్నదే ప్రభుత్వ లక్ష్య మని, అందుకో సం వడ్డీ లేని రుణాలను అందించి ప్రోత్సహి స్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. మహిళ లు ఆర్థికంగా నిలదొక్కుకొంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు. 17 రకాల వ్యాపారాలను గుర్తించి.. ఆ వ్యాపారాలు చేసుకునేందుకు మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్పొరేషన్ల చైర్మన్లు శోభారాణి, కాల్వ సుజాత, వెన్నెల, నిర్మల జగ్గారెడ్డి, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చైర్పర్సన్ మాధవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపక్షాలది కనికట్టు ప్రచారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రతిపక్ష పార్టీలు కనికట్టు ప్రచారం చేస్తున్నాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వ్యాఖ్యానించారు. వారి ఆర్భాటమంతా సామాజిక మాధ్యమాల్లోనే కనిపిస్తుందని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం చేశారని, వారు చేసిన అప్పులకు ఇప్పుడున్న ప్రభుత్వం వడ్డీలు కట్టాల్సివస్తోందన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాలం కావొస్తున్న నేపథ్యంలో ఆర్థిక, విద్యుత్, ప్రణాళిక శాఖల పురోగతిపై శుక్రవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.64,516 కోట్లు వడ్డీ, రీపేమెంట్ల కింద చెల్లింపులు చేశామన్నారు. రాష్ట్రంలోని 3.69 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లకు ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నామని చెప్పారు. ఏడాది కాలంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ కోసం రూ.60 వేల కోట్లు వెచ్చించామన్నారు. ఇప్పటి వరకు వివిధ పథకాల కింద రూ.61,194 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నిరుద్యోగులను నట్టేట ముంచిందని, కానీ ప్రజా ప్రభుత్వం ఏడాది కాలంలో దాదాపు 56 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది...రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగు తోందని భట్టి విక్రమార్క చెప్పారు. రానున్న పదే ళ్లలో ప్రస్తుతం కంటే రెట్టింపు డిమాండ్ ఉంటుంద ని, ఫ్యూచర్‌సిటీ, రీజినల్ రింగురోడ్డు చుట్టూ పరిశ్ర మలు, పారిశ్రామిక పార్కులతో డిమాండ్ పెరుగు తుందని వివరించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతులు తీసుకురాకుండా గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని, ఆ తర్వాత ప్రజా ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి అన్నిరకాల అనుమతులు తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రానికి దశాదిశా నిర్దేశించే విధంగా 2047 నాటికి కావాల్సిన విజన్ డాక్యుమెంట్‌ను ప్రణాళికా విభాగం తయారు చేస్తోందన్నారు.ప్రజాపాలన ద్వారా వారం రోజులుగా గ్రామసభలు పెట్టి తీసుకున్న 1.28 కోట్ల దరఖాస్తులను డిజిటలైజ్ చేశామని, ప్రభుత్వం అమలు చేస్తున్న గృహజ్యోతి, రాయితీ సిలిండర్ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడానికి ప్రజాపాలన డిజిటలైజేషన్ నుంచి సమాచారం తీసుకున్నామని చెప్పారు. ప్రణాళిక శాఖ ద్వారా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా 1.11 కోట్ల ఇళ్లను సర్వే చేశామని, ఈ సమాచారాన్ని కంప్యూటరీకరిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. -
అప్పు లు కట్టడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు
-
మేం డిస్టింక్షన్లో పాస్
కాంగ్రెస్ పార్టీలో గొడవలు ఉండవు. భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. వాటిపై పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటాం. అభిప్రాయ వ్యక్తీకరణ విభేదించడం కిందికి రాదు. రాజకీయ బాంబుల విషయంలో అధికార యంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతుంది. అందులో రాజకీయ దురుద్దేశాలు ఉండవు. ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది.గత ఏడాది పాలనలో తాము డిస్టింక్షన్లో పాస్ అయ్యామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని రెండు కళ్లుగా సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తున్నామని చెప్పారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని.. ఆ అప్పులు తీర్చుకుంటూ, ప్రజలపై భారాన్ని తగ్గించుకుంటూ వ్యవస్థను గాడిలో పెడుతున్నామని పేర్కొన్నారు. ఒకదాని తర్వాత ఒకటిగా ప్రజల కిచ్చిన అన్ని హామీలను నెరవేర్చే దిశలో అడుగులు వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భట్టి విక్రమార్క మంగళవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే...సాక్షి, హైదరాబాద్: ‘‘గత ప్రభుత్వ హయాంలో ఆదాయంతో పాటు తెచ్చిన అప్పులను కూడా విచ్చలవిడిగా ఖర్చు చేసేందుకే ప్రాధాన్యమిచ్చారు. ఆ అప్పులు కట్టాల్సిన సమయంలో రాష్ట్ర పగ్గాలు మా చేతికి వచ్చాయి. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు అప్పులు తెచ్చుకోగలగడం వల్ల వారికి లాభం కలిగింది. ఇప్పుడు అవన్నీ కట్టాల్సి రావడం మాకు భారంగా మారింది. మేం ఏడాదిలో రూ.52,118 కోట్లు అప్పులు తెచ్చి.. రూ. 64,516 కోట్ల అప్పులు తీర్చాల్సి వచ్చింది.అయినా అభివృద్ధి, సంక్షేమంలో వెనకబడకుండా జాగ్రత్త పడుతున్నాం. ప్రణాళిక వ్యయం కింద రూ. 24 వేల కోట్లు ఖర్చుపెట్టి అభివృద్ధి చేశాం. అదే సమయంలో రూ. 61,194 కోట్లను వివిధ సంక్షేమ పథకాలకు ఖర్చు పెట్టాం. ప్రతి పైసా అర్థవంతంగా ప్రజలకు చేరాలన్నదే మా తపన.ఆ మూడూ మా పేటెంట్లు..వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన వ్యవసాయానికి ఉచిత విద్యుత్ మా పేటెంట్ పథకం. పకడ్బందీగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. ఆరోగ్యశ్రీ, మహిళలకు వడ్డీ లేని రుణాల పథకం పేటెంట్లు కూడా కాంగ్రెస్‌వే. వచ్చే ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్లు రుణాలు ఇవ్వాలన్నది మా లక్ష్యంఅందులో ఈ ఏడాది రూ.20 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకోగా... ఇప్పటికే రూ.18 వేల కోట్లు రుణాలిచ్చాం. కొత్త రేషన్ కా ర్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభించాం. తెలంగాణలో ఇల్లు లేని కుటుంబం ఉండకూడదన్నదే కాంగ్రెస్ లక్ష్యం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వబోతున్నాం. రూ.21 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేశాం. పింఛన్లు పెంచుతాం. అన్ని హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తాం. గత పదేళ్లలో బీఆర్ఎస్, బీజేపీ ఏమీ చేయలేకపో యాయి. కానీ మమ్మల్ని మాత్రం ఏడాదిలోనే అన్నీ చేసేయాలంటున్నాయి.మేం ప్రచారంపై దృష్టి పెట్టలేదు..మేం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రచారం చేసుకోవడంపై దృష్టి పెట్టలేదు. కానీ బీఆర్ఎస్ మాత్రం ప్రచారం మీదనే బతుకుతోంది. మేం రైతు రుణమాఫీ ప్రారంభించినప్పుడు ఏమీ కాలేదన్నారు. అక్కడితో ఆగిపోతామని అనుకున్నారు. కానీ మేం ఆగలేదు. నిజానికి రేషన్‌కార్డులు లేని రైతులకు రుణమాఫీ ఆలస్యం కావడానికి కారణం బీఆర్ఎస్ కాదా? గత పదేళ్లలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదు. ప్రజలకు ఏమేం చేయాలన్న దానిపై మా దృష్టి ఉంటే.. వాళ్లు పదేళ్లు ప్రచార పటాటోపంతో నెట్టుకొచ్చారు.మేం బీఆర్ఎస్లా కాదు.. చెప్పినవన్నీ చేస్తున్నాం. దుబారా చేయకుండా కస్టోడియన్‌గా ప్రజల సంపదను ఖర్చు పెడతాం. రైతు భరోసా విషయంలో అదే చేస్తాం. ఒకదాని తర్వాత ఇంకోటి అమలు చేస్తూనే ఉంటాం. పాలనపై సంపూర్ణంగా పట్టు వచ్చింది. ఈ ఐదేళ్లే కాదు.. వచ్చే ఐదేళ్లు కూడా అధికారంలో ఉండేది మేమే. ప్రతిపక్షాలు నిరంతరం మా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర చేస్తున్నాయి. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరు.సంవత్సరం కూడా ఆగలేకపోతున్నారుగురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్ జరగడం దురదృష్టకరం. అయితే పార్టీలు దీనిని రాజకీయంగా ఉపయోగించుకోవడం సరికాదు. అడ్డగోలుగా అనుభవించిన అధికారం దూరంకావడంతో ఏడాది కూడా ఉండలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో గొడవలుండవు. భిన్నాభిప్రాయాలు మాత్రమే ఉంటాయి. వాటిపై పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటాం. అభిప్రాయ వ్యక్తీకరణ విభేదించడం కిందికి రాదు. రాజకీయ బాంబుల విషయంలో అధికార యంత్రాంగం తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోతుంది. అందులో రాజకీయ దురుద్దేశాలు ఉండవు. ఎప్పుడు ఏం జరగాలో అది జరుగుతుంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు.. ఇలా తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం. ‘రైజింగ్ తెలంగాణ హాస్ టుబీ రైజ్ ఆల్ ద టైం’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారుమూసీ ప్రక్షాళనపై ప్రతిపక్షాలు మొదటి నుంచీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉంది. మూసీ నీటిని శుద్ధి చేయడం, పెట్టుబడుల ద్వారా పరీవాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఆ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయడం మా ఉద్దేశం. ఇవన్నీ పూర్తయితే కాంగ్రెస్‌కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో... బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేశాయి. కానీ ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు. మూసీ ప్రాజెక్టు కావాలంటున్నారు. ఫ్యూచర్ సిటీ, ట్రిపుల్ ఆర్, మూసీ పునరుజ్జీవం, మెట్రో విస్తరణ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా ప్రపంచంతో పోటీపడేలా తీర్చిదిద్దుతాం.త్వరలో కొత్త విద్యుత్ విధానం..త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో కొత్త విద్యుత్ పాలసీని ప్రవేశపెట్టి చర్చిస్తాం. 2029–30 నాటికి 20 వేల మెగావాట్లు, 2035–36 నాటికి 40 వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ విద్యుత్‌ను రాష్ట్రంలో వినియోగించడంతోపాటు ఇతర రాష్ట్రాలకు విక్రయించేందుకు ఒప్పందాలు చేసుకుంటాం.పెరిగే సామర్థ్యానికి తగ్గట్టు సరఫరా, పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తాం. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ సమర్పించిన విచారణ నివేదికను అసెంబ్లీలో పెడతాం. గత ప్రభుత్వ హయాంలో శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదానికి బాధ్యులైన డైరెక్టర్లను తొలగించాం. త్వరలోనే విద్యుత్ సంస్థలకు కొత్త డైరెక్టర్లను నియమిస్తాం. -
బీఆర్ఎస్ నేతల చేతుల్లోఅసైన్డ్ భూములు
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని గత పదేళ్లలో బీఆర్ఎస్ నేతలు వేలాది ఎకరాల అసైన్డ్ భూములను ఆక్రమించారని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదలకు 26 లక్షల ఎకరాల భూములు పంచాయని, ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చిన తర్వాత.. వాటి పరిస్థితి ఏమిటో ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైనట్లు తేలితే, వాటిని తిరిగి అర్హులైన పేదలకు పంచుతామని వెల్లడించారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. కులాల లెక్కలు కొందరికి ఇష్టం లేదు రాష్ట్రంలో ఏ కులం జనాభా ఎంత ఉందన్న లెక్కలు తీయటం కొందరికి ఇష్టంలేదని, అందుకే ప్రభుత్వం నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక సర్వేకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. ‘కులాలను విడగొడుతున్నామని విపక్షాలు మా ప్రభుత్వంపై నిందలేస్తున్నాయి. మేం కులాలను కొత్తగా సృష్టించడం లేదు. అవి శతాబ్దాలుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఏయే కులం జనాభా ఎంత ఉన్నది? రాజ్యాంగం ప్రకారం అందరూ సమానంగా ఎదిగారా? అనేది సర్వే ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇంతకాలం రాష్ట్రాన్ని దోపిడీ చేసిన బ్యాచ్ మళ్లీ దోపిడీ చేయాలని చూస్తోంది. అందరి లెక్కలు బయటకు వస్తే వాళ్లకు ఇబ్బంది’అని విమర్శించారు. హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం ఎన్నికల సమయంలో ఇచి్చన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ‘మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించి, వారి పక్షాన ప్రభుత్వం ప్రతినెలా రూ.400 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తోంది. పేదలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు త్వరలోనే భూమి పూజ చేయబోతున్నాం. 15 రోజుల్లోనే రైతు రుణమాఫీ కింద రూ.18 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశాం. రేషన్‌కార్డు ఉన్న అన్ని రైతుకుటుంబాలకు రూ.2 లక్షలలోపు రుణమాఫీ చేశాం. త్వరలోనే అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. రైతు భరోసా తప్పకుండా ఇస్తాం. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించాం’అని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కేటీ రామారావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని భట్టి మండిపడ్డారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ కనీస సంస్కారం లేకుండా జిల్లా కలెక్టర్‌ను సన్యాసి అంటారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఇమడలేకనే పార్టీ మారుతున్నారని పేర్కొన్నారు. పెరుగుతున్న కాంగ్రెస్ గ్రాఫ్..దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతోందని భట్టి విక్రమార్క తెలిపారు. అదే సమయంలో బీజేపీ పతనం మొదలైందని అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారని గుర్తుచేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ మంత్రిని కాంగ్రెస్ అభ్యర్థి ఓడించారని చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమికి అనేక కారణాలున్నాయని పేర్కొన్నారు. చిట్‌చాట్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు పాల్గొన్నారు. -
రేవంత్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు పరాభవం!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో తెలంగాణ సీఎం రేవంత్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. రేవంత్ ప్రచారం నిర్వహించిన షోలాపూర్ సిటీ నార్త్, షోలాపూర్ సౌత్, చంద్రాపూర్, భోకార్, నాయగావ్, నాందేడ్ నార్త్‌లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌గా డిప్యూటీ సీఎం భట్టి పని చేసిన సంగతి తెలిసిందే. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలను ఎప్పటి కప్పుడు అధిష్టానానికి చేర్చుతూ.. కింది స్థాయిలో హైకమాండ్ నిర్ణయాలను అమలు పరిచారు. జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా సాగుతోంది. ఇక్కడ ఎన్డీయే కూటమికి గట్టి షాక్ తగిలింది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.జార్ఖండ్ అసెంబ్లీ పోస్ట్ ఎలక్షన్ ఏఐసీసీ అబ్జర్వర్‌గా భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు పార్టీ సీనియర్ లీడర్లు తన్వీర్ అన్వర్, కృష్ణ అల్లవూర్ నియమించింది.జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తున్న క్రమంలో రాంచీలో కాంగ్రెస్ నేతలతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఫలితాల సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. మంత్రి పదవులపై భట్టి విక్రమార్క సమాలోచనలు జరుపుతున్నారు. -
విదేశీ విద్యకు సాయమందించండి
సాక్షి, హైదరాబాద్: తమ పిల్లలు చదువుకునేందుకు విదేశాలకు వెళ్లారని, వారికి అంబేడ్కర్ విదేశీ విద్యానిధి పథకం కింద సాయమందించాలని పలువురు తల్లిదండ్రులు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు విజ్ఞప్తి చేశారు. గురువారం గాందీభవన్‌లో ‘మంత్రితో ముఖాముఖి’ కార్యక్రమం జరిగింది. దీనికి హాజరైన మల్లు భట్టి విక్రమార్కను సామాన్య ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కలిసి తమ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. విదేశీ విద్యానిధి పథకం కింద పెద్ద చదువులు చదువుకునే విద్యార్థులకు ప్రజాప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పిన భట్టి.. వీలున్నంత త్వరగా ఆ నిధులు విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. » తన తల్లి బ్రెస్ట్ కేన్సర్‌తో బాధపడుతున్నారని, ఆమె ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకునేందుకు అవసరమైన సాయం అందించాలని మహేశ్ కోరగా, భట్టి వెంటనే స్పందించి ఇప్పటివరకు అయిన ఆస్పత్రి బిల్లులకు ఎల్ఓసీ ఇప్పించాలని తన పీఏను ఆదేశించారు. స్వయంగా తన నంబరు ఆ యువకుడికి ఇచ్చి ఎలాంటి సమస్య ఉన్నా తనకు తెలియజేయాలని సూచించారు. » జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా తమకు పోస్టింగులు ఇవ్వలేదంటూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు భట్టికి విజ్ఞప్తి చేయగా, సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. » ట్రాన్స్‌కో, జెన్కోలలో ఖాళీగా ఉన్న డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, ఇంజనీర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సంబంధిత శాఖ సిబ్బంది కూడా విజ్ఞప్తి చేశారు. » ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల కోసం పలువురు విజ్ఞప్తి చేశారు. మంత్రితో ముఖాముఖిలో భాగంగా మొత్తం 300 దరఖాస్తులు వచ్చాయి.ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యే శంకర్, టీపీసీసీ ప్రధానకార్యదర్శి అద్దంకి దయాకర్ తదితరులు పాల్గొన్నారు. భట్టి దృష్టికి పటాన్చెరు పంచాయితీ పటాన్చెరు నియోజకవర్గంలో పాత కాంగ్రెస్ నేత లు, ప్రస్తుత ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డిల మధ్య నెలకొన్న రాజకీయ పంచాయితీ భట్టి దృష్టికి వచ్చింది. పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ కాట శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలో వచ్చిన నేతలంతా తమపై మహిపాల్‌రెడ్డి పెత్తనం చేస్తున్నారని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి అన్యాయం చేస్తున్నారని, తద్వారా నియోజకవర్గంలో పార్టీకి నష్టం జరుగుతోందని వివరించారు. ఆ తర్వాత కాట శ్రీనివాస్‌గౌడ్ కూడా టీపీసీసీ అధ్యక్షుడి చాంబర్లో భట్టితో పాటు మహేశ్‌గౌడ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. -
రైతుల భూమి బీఆర్ఎస్ నేతల పాలు
సాక్షి, హైదరాబాద్: గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంపిణీ చేసిన భూములను బీఆర్ఎస్ పాలనలో బలవంతంగా గుంజుకొని అమ్ముకున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. అలాంటి దుర్మార్గులు ఇప్పుడు రైతుల సంక్షేమం గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ధ్వజమెత్తారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 24 లక్షల ఎకరాల భూమిని రైతులకు పంచిందని, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు అందులో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రైతుల నుంచి 10 వేల ఎకరాల భూమిని బలవంతంగా లాక్కొని అమ్ముకొన్నారని ఆరోపించారు.దివంగత ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని మంగళవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి ఆయన నెక్లెస్‌రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అరి్పంచారు. అనంతరం గాం«దీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచి్చన భూ సేకరణ చట్టం ప్రకారమే రైతుల నుంచి అభివృద్ధికి అవసరమైన భూములు తీసుకుంటామని, బలవంతంగా తీసుకోబోమని స్పష్టంచేశారు. లగచర్లలో అధికారులపై దాడి చేయించింది బీఆర్ఎస్ పార్టీయేనని ఆరోపించారు. హామీలను నెరవేర్చకుండా బీజేపీ ప్రజలను మోసగించిందని విమర్శించారు. సొంత స్థలం ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబి్ధదారులకు రూ.5 లక్షలు ఇచ్చే అంశంపై సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సమానావకాశాల కోసమే సర్వే..: రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నదని భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మహిళా స్వయం సహాయక సంఘాలకు ఏటా రూ. 20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తున్నామని చెప్పారు. దేశాన్ని విభజించి, అస్థిరపరిచి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నవారు ఇందిరాగాంధీ గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అలాంటివారితో దేశానికి ఎప్పటికైనా ప్రమాదమేనని అన్నారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, చరణ్ యాదవ్, భూపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.కాళేశ్వరంతో ఏ ప్రయోజనం లేదు⇒ ఆ ప్రాజెక్టు నీళ్లు లేకున్నా రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి ⇒ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కగన్పౌడ్రీ: బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో వరి ఉత్పత్తి పెరిగిందనటం అవాస్తవమని పేర్కొన్నారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండానే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి ఉత్పత్తి జరుగుతుందని ఆనాడే చెప్పామని, ఇప్పుడు అదే నిజమైందని పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఆయన పలువురికి ఇందిరాగాంధీ వ్యవసాయ ప్రతిభా అవార్డులను అందజేశారు.ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో మొదటిసారి తమ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి బడ్జెట్లో రూ.72 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. వ్యవసాయ రుణాల మాఫీ కింద రూ.18 వేల కోట్లను రైతుల ఖాతాల్లో జమచేశామని వెల్లడించారు. వ్యవసాయరంగ అభివృద్ధికి అన్నివిధాలుగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ఇందిరాగాం«దీపై ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ఇందిరా గాంధీపై విమర్శలు: భట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ స్థాయిలో భారత్‌ను నిలబెట్టడంతో దివంగత మాజీ ప్రధాని ఇంధిరా గాంధీ పాత్ర కీలకపాత్ర పోషించారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ ప్రాణాలు విడిచారని తెలిపారు. మంగళవారం భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఇందిరా గాంధీపై నెగెటివ్‌గా సినిమాలు తీసే వారికి కౌంటర్ ఇచ్చారు.దేశ సమగ్రతపై అవగాహన లేని వారు కావాలని సినిమాలు చేస్తున్నారరని మండిపడ్డారు. గతం గురించి తెలియని వారు ఇందిరా గాంధీ చరిత్రను వక్రీకరిస్తున్నారని, గతం గురించి తెలిసిన వారు ఆమెకు చేతులు ఎత్తి నమస్కరిస్తారని తెలిపారు. దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారు..దేశాభిమానం లేనివారే ఇందిరా గాంధీపై విమర్శలు చేస్తున్నారని, ఉద్దేశ్యపూర్వకంగా ఆమెనె నెగెటీవ్‌గా చూపిస్తున్నారని అన్నారు. మాజీ ప్రధానిపై తప్పుడు ప్రచారం చేస్తూ దేశాన్ని విభజించి లబ్ధి పొందాలని చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. దేశం కోసం ప్రాణాలను తృణపాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర ఇందిరా కుటుంబానిదని అన్నారు.‘ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నాం. అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించామన్నారు. ఆర్టీసీలో ఉచిత రవాణా కోసం నెలకు రూ. 400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం. ఇందిరమ్మ ఆశయ స్పూర్తితో ఇందిరమ్మ రుణాలు ఇవ్వబోతున్నాం.తెలంగాణ వైపు దేశం చూపు..బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నాం రాష్ట్ర ప్రజలందరికీ వనరులు అందజేయడానికే ఈ సర్వేచేస్తున్నాం. యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూస్తోంది. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అందాలనేది సర్వే ఉద్దేశ్యం. భూములు కోల్పోయే వారిని అన్ని రకాలు ఆదుకుంటాం. అందరికీ నచ్చ చెప్పే పరిశ్రమలకు భూమి తీసుకుంటాం. కొద్దిమంది రాజకీయ నేతలు కుట్రలతో అమాయకులను రెచ్చగొడుతున్నారు,యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది..బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారు. దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్రపన్నుతున్నారు. బీజేపీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి? పేదల అకౌంట్లో 15 వేలు వేస్తామని మోసం చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత కాంగ్రెస్‌ది. జాబ్ క్యాలెండర్, యూపీఎస్ సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం’ అని తెలిపారు. -
ఊగిసలాటకు తెరపడేదెప్పుడో!
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని జీవితకాలం ముగిసిన బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగావాట్ల కొత్త పవర్ ప్లాంట్ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఇటీవల రామగుండంలో పర్యటించి ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు. సుమారు రూ.10 వేల కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నెలకొల్పేందుకు నిర్ణయించారు. అయితే, జెన్కో, సింగరేణి సంయుక్త భాగస్వామ్యంలో గణాంకాలు తేలకపోవడంతో ప్లాంట్ పనుల్లో జాప్యమవుతోందని ఉద్యోగులు అంటున్నారు.డీపీఆర్ కోసం..పెద్దమొత్తంలో పెట్టుబడి భరించే అవకాశం లేదని సింగరేణి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ(జెన్కో) సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను సింగరేణితో కలిసి వారంలోగా రూపొందించాలని జెన్కోకు రాష్ట్ర ఇంధనశాఖ గత సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీచేసింది. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను నెలలోగా తయారు చేయాలని జెన్కోకు సూచించింది. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం డిజిగ్ అనే సంస్థ డీపీఆర్ తయారు చేసేందుకు ప్లాంట్‌ను సందర్శించింది. పాత విద్యుత్ కేంద్రాన్ని తొలగించేందుకు వివిధ విభాగాలకు చెందిన ఇంజనీర్లను జెన్కో ప్రత్యేకంగా నియమించినట్టు విశ్వసనీయ సమాచారం.1971 నుంచి బీ–థర్మల్‌లో విద్యుత్ ఉత్పత్తిఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు, నీరు అందుబాటులో ఉండటంతో రామగుండంలో 1965 జూలై 19న అప్పటి సీఎం కాసు బ్రçహ్మానందరెడ్డి 62.5 మెగావాట్ల సామర్థ్యం గల బీ–థర్మల్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. 1971లో ఇది విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ప్లాంట్ నిర్మాణానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.14.80 కోట్లు ఖర్చు చేసింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) నిబంధనల ప్రకారం 1996 వరకే ఈ ప్లాంట్‌ను నడిపించాల్సి ఉంది.కానీ, దాని జీవితకాలం పొడిగిస్తూ వచ్చారు. మరోవైపు కొన్నేళ్లుగా ప్లాంట్‌లో బాయిలర్ ట్యూబ్స్ లీక్‌కావడం, మిల్స్, టర్బైన్ విభాగాల్లో తరచూ సమస్యలు తలెత్తడంతో గుదిబండగా మారింది. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. తరచూ షట్‌డౌన్ కావడం, ఆ తర్వాత పునరుద్ధరించేందుకు ప్రతీసారి బాయిలర్ మండించేందుకు సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుండటంతో నిర్వహణ భారమైంది. అంతేకాదు.. దాని జీవితకాలం ముగియటంతో ప్లాంట్‌ను మూసి వేశారు.భాగస్వామ్యంపై పీటముడిపాత ప్లాంట్ పరిధిలో 560 ఎకరాల స్థలం, అనుభవం కలిగిన ఇంజనీర్లు, శ్రామిక శక్తి ఉన్న జెన్కోను కాదని, సింగరేణి భాగస్వామ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయడాన్ని జెన్కో ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. గతనెలలో వివిధ రూపాల్లో నిరసన తెలియజేశారు. అయినా, ప్రభుత్వం సింగరేణి భాగస్వామ్యంతో నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది. మరోవైపు.. జెన్కో 76 శాతం, సింగరేణి 24 శాతం వాటాతో ప్లాంట్ నిర్మించేందుకు జెన్కో ఇంజనీర్లు సముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే, సింగరేణి సంస్థ తమకు 50 శాతం వాటా ఇవ్వాలని ఉన్నతస్థాయి సమావేశంలో పట్టుబట్టినట్టు సమాచారం. భాగస్వామ్యం లెక్కలు తేలి రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరితేనే కొత్త ప్లాంట్ శంకుస్థాపనకు అవకాశం ఉంటుంది. అప్పుడే జెన్కో పాలకమండలి పాత ప్లాంట్‌ను మూసివేసినట్టుగా ఆమోదం తెలిపే అవకాశాలుంటాయని జెన్కో ఉద్యోగులు చెబుతున్నారు. జెన్కో, సింగరేణి సీఎండీల మధ్య సయోధ్య కుదుర్చేంచేందుకు ఉపముఖ్యమంత్రి సాయంతో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ప్రయత్నాలు చేశారు. మధ్యేమార్గంగా నిర్ణయానికి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు సిద్ధమయ్యేలా చూడాలని ఆయన సూచించారు. -
మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం సౌర విద్యుత్ (సోలార్ పవర్ ప్లాంట్లు) కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, ఇందులో ఇందిరా మహిళాశక్తి సంఘాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం తీర్మానించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ఇందిరా మహిళాశక్తి సభ్యులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. అందుకు పూర్తిస్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ప్రజాభవన్‌లో ఆయన ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేశ్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, రెడ్కో వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వావిలాల అనీల తదితరులతో ఈ అంశంపై సమీక్షించారు.రాష్ట్రంలో 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి త్వరితగతిన చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల సమాఖ్యలకు అవసరమైన స్థలాలను సేకరించి వారికి లీజుకు ఇవ్వాలని సూచించారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన యంత్రాల కొనుగోళ్లకు అవసరమైన ఆర్థిక వనరుల కోసం బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రుణాల తిరిగి చెల్లింపుల్లో స్వయం సహాయక సంఘాల సభ్యులు 99 శాతం ప్రగతిని కనబరుస్తున్నారని, వీరికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఆసక్తిగా ఉన్న విషయాన్ని అనుకూలంగా మలుచుకోవాలని డిప్యూటీ సీఎం చెప్పారు.ఇటీవల బ్యాంకర్ల సమావేశంలోనూ స్వయం సహాయక సంఘాల సభ్యులు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాట్ల ఏర్పాటు, ఆరీ్టసీకి బస్సులు సమకూర్చే మరిన్ని పథకాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నట్టు స్పష్టం చేశామన్నారు. వారు కూడా విరివిగా రుణాలిచ్చి ఆర్థికంగా ప్రోత్సాహం అందిస్తామని స్పష్టం చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం అధికారులకు వివరించారు.మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత ఇవ్వడం ద్వారా, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం ద్వారా సామాజిక మార్పు సాధించేందుకు అవకాశం ఏర్పడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు. స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలపడితే గ్రామీణ మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఇంధనశాఖకు పీఆర్‌శాఖ ప్రతిపాదనలుమహిళా స్వయం సహాయక సంఘాలకు వె య్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లు కేటాయించాలని ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు పంపింది. ఒక్క మెగావాట్‌కు రూ. 3 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ వ్యయంలో 10 శాతం మహిళా సంఘాలు భరిస్తే 90 శాతం బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వనున్నాయి. ఇంధనశాఖ దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. -
‘సంక్షేమం’ పెంచేందుకే సర్వే
సాక్షి, హైదరాబాద్: అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలను మరింత పెంచడానికే సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆశయాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చె ప్పారు. రాష్ట్రంలో బీసీ కులగణన నిర్వహిస్తామని ఇ చ్చిన మాటకు కట్టుబడి సర్వే నిర్వహిస్తున్నామని పే ర్కొన్నారు. గురువారం ఆయన గాం«దీభవన్‌లో భా రత తొలి ప్రధాని పండిట్ నెహ్రూ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మీడియా తో మాట్లాడుతూ కులగణన ద్వారా దేశానికి తెలంగాణ రోల్ మోడల్ కాబోతోందని అన్నారు. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొనే కుటుంబ సర్వే కు సంబంధించి ప్రశ్నలు తయారు చేసినట్లు చెప్పారు. ప్రభుత్వాన్ని కూల్చటమే బీఆర్ఎస్ లక్ష్యం తమ ప్రభుత్వ వైఫల్యాలు ఏంటో బీఆర్ఎస్ నేత కేటీఆర్ చెప్పాలని భట్టి విక్రమార్క సవాల్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుచేయటం, రైతు రుణమాఫీ, ప్రజలకు మంచి చేయడం ప్రభుత్వ వైఫల్యాలా? అని ప్రశ్నించారు.అధికారం పోయిందన్న అక్కసుతో అమాయక ప్రజలను రెచ్చగొట్టి ఫార్మా క్లస్టర్స్ విస్తరించే పనిని వ్యతిరేకించడం బుద్ధి తక్కువ పని అని మండిపడ్డారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా, ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్ఎస్ దృష్టి పెట్టిందని ఆరోపించారు. నెహ్రూ ఆశయాలు కొనసాగిస్తాం నెహ్రూ ఆశయాలను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్ మున్షీ తెలిపారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆమె మాట్లాడారు. -
దాడి బీఆర్ఎస్ కుట్రే !
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అరాచక శక్తులతో కలిసి కుట్రపూరితంగా దళిత, గిరిజన రైతులను రెచ్చగొట్టి లగచర్లలో జిల్లా కలెక్టర్, ఆర్డీవో స్థాయి అధికారిపై దాడి చేయించిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తలకిందులుగా తపస్సు చేసినా ఈ ప్రభుత్వాన్ని అస్థిరపర్చలేరని చెప్పారు. లగచర్ల ఘటనలో నిందితుల కాల్ డేటాను సేకరించగా, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఉన్నట్టు తేలిందన్నారు. దీని వెనుక ఎంతటి పెద్దవారున్నా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం, వారితో చర్చించడం, న్యాయ స్థానాలకు వెళ్లడం వంటి అవకాశాలుండగా, బీఆర్ఎస్ నేతలు రైతులను రెచ్చగొట్టి అధికారులపై దాడులు చేయించడం దుర్మార్గమన్నారు. భట్టి బుధవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావొద్దని, అభివృద్ధి జరగొద్దనే దుర్మార్గమైన ఆలోచనతో ప్రతిపక్షం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ కోసం భూసేకరణ చేపట్టినప్పుడు ప్రతిపక్ష పార్టీగా ప్రజాస్వామ్యయుతంగా రైతుల పక్షాన గొంతెత్తాం. అధికారులను కలిశాం. న్యాయస్థానాలకు వెళ్లాం. పత్రికల ద్వారా నిరసనను తెలియజేశాం. కానీ ఏనాడు ఇలా దాడులకు తెగబడలేదు’అని భట్టి అన్నారు. ఇలా దాడులు చేయించడం సబబేనా? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా బయటకు వచ్చి ఈ అంశంపై మాట్లాడాలని కోరారు. అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, కుట్రపూరిత దాడుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఉద్యోగులు అధైర్యపడకుండా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని హితవు పలికారు. అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు... ప్రజాప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. అత్యంత వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గంలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటుచేసి పరిశ్రమల అభివృద్ధితో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చి.. ఇక్కడికొచ్చే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కలి్పస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంలో భాగంగానే రీజినల్ రింగ్ రోడ్– ఔటర్ రింగ్ రోడ్ మధ్య పరిశ్రమల ఏర్పాటుకు క్లస్టర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. బీజేపీ పెద్దలతో కేటీఆర్ ఒప్పందం ఫార్ములా ఈ–రేస్ కేసు నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీకి పోయి బీజేపీ పెద్దలను కలిసి ఒప్పందం చేసుకున్నాడని భట్టి ఆరోపించారు. అందుకే మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటేయమని పిలుపునిచ్చి బీజేపీకి ఓటేయాలని కేటీఆర్ పరోక్షంగా చెప్పారని ఆరోపించారు. గవర్నర్‌పై సంపూర్ణమైన విశ్వాసం ఉందని, ఫార్ములా ఈ–రేస్ కేసు విచారణకు ప్రభుత్వానికి సహకరిస్తారని ఆశిస్తున్నామన్నారు. గవర్నర్ తిరస్కరిస్తే చట్టం ప్రకారం ఏం చేయాలో అదేవిధంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు రైతుల పట్ల మొసలికన్నీరు కారుస్తున్నారని, అధికారులపై దాడిని వారు కనీసం ఖండించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. -
హైడ్రాను చూసి బ్యాంకర్లు భయపడొద్దు
సాక్షి, హైదరాబాద్: హైడ్రాను చూసి భయపడొద్దంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బ్యాంకర్లకు ధైర్యం నింపారు. హైడ్రా గురించి ఆందోళన అవసరం లేదని, హైడ్రా భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వదని స్పష్టం చేశారు. బుధవారం ప్రజాభవన్‌లో నిర్వహించిన బ్యాంకర్ల ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాలక్ష్మి పథకం మహిళలు గౌరవ మర్యాదలతో జీవించేందుకు దోహదపడుతుందన్నారు. స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ.20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలివ్వాలని సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కేబినెట్ నిర్ణయించిందని, వీలైతే అంతకుమించి వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు.కార్పొరేట్ కమర్షియల్ బ్యాంకులు 9 నుంచి 13 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయని, బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో పనిచేయాలన్నారు. మహిళల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వమే బస్సులు కొనుగోలు చేసి వారికి లీజుకు ఇవ్వాలని ఆలోచన సైతం చేస్తున్నట్టు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటుచేసే సూక్ష్మ, మధ్యతర పారిశ్రామిక పార్కుల్లో మహిళలకు ప్రత్యేకంగా కేటాయింపులు చేస్తున్నట్టు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు సంబంధించి వన్ టైం సెటిల్మెంట్ చేసే అవకాశాన్ని పరిశీలించాలని కోరారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మున్సిపల్ పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్, పురపాలక సంచాలకులు, కమిషనర్ శ్రీదేవి పాల్గొన్నారు. ప్రజలపై భారం మోపకుండా వనరుల సమీకరణ: సామాన్య ప్రజలపై భారం మోపకుండా వనరుల సమీకరణపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. బుధవారం ప్రజాభవన్‌లో ఆదాయ వనరుల సమీ కరణపై వాణిజ్య పన్నులు, రవాణా, స్టాంపులు రిజి్రస్టేషన్లు, మైనింగ్, ఎక్సైజ్ శాఖల ఉన్నతాధికారు లతో భట్టి భేటీ అయ్యారు. సమావేశంలో భాగంగా శాఖల వారీగా సాధించిన పురోగతి వివరాలు, ఆదాయ సమీకరణ కోసం రూపొందించిన ప్రణాళి కలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డిప్యూటీ సీఎంకు అధికారులు వివరించారు. భట్టి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే పన్ను ఎగవేతదారులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఇసుకను అందరికీ అందుబాటులో ఉంచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుకుమార్ సుల్తానియా, రెవెన్యూ, వాణిజ్య పనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ, భూగర్భ గనుల శాఖ సెక్రటరీ సురేంద్రమోహన్, ఎక్సైజ్ శాఖ కమిషనర్ శ్రీధర్, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్ బుద్ధ ప్రకాశ్ పాల్గొన్నారు. -
ఆదాయం పెంపుపై దృష్టి పెట్టండి
సాక్షి, హైదరాబాద్: సామాన్య ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వనరుల సమీకరణకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ సోమవారం సచివాలయంలో భేటీ కాగా, సబ్‌కమిటీ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులతోపాటు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణశాఖ ఆ«ధ్వర్యంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టిన జాయింట్ వెంచర్లపై చర్చ జరిగింది.ఈ వెంచర్ల కోసం జరిగిన ఒప్పందాలను అమలు చేయకుండా కొందరు వ్యక్తులు కోర్టులకు వెళ్లి న్యాయ వివాదాలు సృష్టిస్తున్నారని అధికారులు సబ్‌కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ వివాదాల పరిష్కారానికి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు చైర్మన్‌గా పురపాలక, గృహ నిర్మాణ, న్యాయ శాఖ కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ సమావేశమై వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరించేలా ప్రణాళికలు రూపొందించాలని సబ్‌కమిటీ సూచించింది. ⇒ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లాట్ల బహిరంగ వేలం ప్రక్రియను కొనసాగించాలని, ముందుగా కొంత భాగంలోని భూములను వేలం వేసి రాష్ట్ర ప్రభుత్వానికి గరిష్ట ఆదాయం సమకూరేలా ముందుకెళ్లాలని సూచించింది. ⇒ రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న ఫ్లాట్ల అమ్మకాల స్థితిగతులను సమీక్షించిన సబ్‌కమిటీ ఈ ఫ్లాట్ల అమ్మకాల ప్రక్రియకు ప్రణాళిక రూపొందించాలని కోరింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను మినిట్స్ రూపంలో నమోదు చేయాలని, మరో వారంలో జరిగే సమావేశానికి యాక్షన్ టేకెన్ రిపోర్టుతో హాజరుకావాలని అధికారులను భట్టి ఆదేశించారు. ⇒ ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మందకొడిగా సాగుతుండడంపై సబ్‌కమిటీ అధికారులను ప్రశ్నించింది. అయితే, న్యాయ పరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా చేపడుతున్నందునే కొంత ఆలస్యం జరుగుతోందని అధికారులు సబ్‌కమిటీకి వివరించారు. జీరో కాలుష్యం ఉండాలి కాలుష్య సమస్య కారణంగా తాము ఓఆర్ఆర్ బయటకు వెళ్లేందుకు కూడా ముందుకొస్తున్నట్టు పరిశ్రమల నిర్వాహకులు సబ్ కమిటీకి స్పష్టం చేసిన నేపథ్యంలో వారి విజ్ఞప్తులను పరిశీలించి ఓఆర్ఆర్ బయట పరిశ్రమలను ప్రోత్సహించాలని, హైదరాబాద్నగరంలో జీరో కాలుష్యం ఉండేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల అధికారులను సబ్‌కమిటీ ఆదేశించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో 5 ఎకరాల విస్తీర్ణంలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా ఇండస్ట్రియల్ పార్కులు నిర్మించాలని, తద్వారా గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి, ఆర్థిక చేయూత లభిస్తుందని సబ్‌కమిటీ సూచించింది.ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, పురపాలక, రెవెన్యూ, ఐటీ, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు దానకిశోర్, నవీన్ మిత్తల్, జయేశ్‌రంజన్, సందీప్‌కుమార్ సుల్తానియా, హౌసింగ్ శాఖ కార్యదర్శి బుద్ధప్రకాశ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధ్దన్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు సి.నారాయణరెడ్డి, క్రాంతి పాల్గొన్నారు. -
ఫ్రీ బస్సు స్కీమ్.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఖమ్మం: తెలంగాణలో ఉచిత బస్సు పథకంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలు ఉచితంగా ప్రయాణించడం వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందన్నారు. ఖమ్మంలో ఆదివారం(అక్టోబర్ 27) జరిగిన ఓ కార్యక్రమంలో భట్టి మాట్లాడుతూ‘మహిళలను వ్యాపారవేత్తలుగా చేయడం ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నాం.కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలను మహిళల కోసమే ప్రారంభించింది. మహిళల కోసం రూ.500కు గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం.రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఆర్థికంగా బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. మహిళల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళలకు దీపావళి శుభాకాంక్షలు’అని భట్టి తెలిపారు.ఇదీ చదవండి: రేవంత్ పాపం.. ఆయనకు శాపం: కేటీఆర్ -
మూసీ నిర్వాసితుల కోసం టవర్లు
సాక్షి, హైదరాబాద్: మూసీ నిర్వాసితులకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని.. నిర్వాసితులకు అక్కడే అద్భుతమైన టవర్లు నిర్మిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. నిర్వాసితులు సకల సౌకర్యా లతో ఉండేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. శనివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భట్టి ప్రసంగించారు. మూసీ నిర్వాసితుల పిల్లల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నిర్వాసితులైన డ్వాక్రా మహిళల కు రూ.1,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని.. చిన్నతరహా పరిశ్రమలు ఏర్పా టు చేసి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. పరీవాహక ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కోసం 39 ఎస్టీపీలు మంజూరు చేశామని భట్టి చెప్పారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లకు బ్యాంకర్లతో ఉన్న సమస్యలపై త్వరలోనే ఎస్ఎల్బీసీ సమావేశం ఏర్పాటు చేసి స్పష్టత ఇస్తామని వివరించారు. గత ప్రభుత్వం తరహాలో అనుకూలంగా ఉన్న వాళ్లను దగ్గరికి తీసుకోవడం, లేని వాళ్లను దూరం పెట్టడం వంటి ఆలోచన తమకు లేదన్నారు.అద్భుతంగా ఫ్యూచర్ సిటీ..: హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధిపై కొన్ని నెలలుగా కావాలనే కొందరు విష ప్రచారం చేస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్డుతోపాటు 30 వేల ఎకరాల్లో అద్భుతంగా నిర్మించనున్న ఫ్యూచర్ సిటీతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఎయిర్పోర్ట్ నుంచి 30 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి చేరుకోవచ్చని.. అక్కడ ప్రపంచ స్థాయి యూనివర్సిటీ, క్రికెట్ స్టేడియం వంటివెన్నో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రభుత్వం హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేయాలన్న చిత్తశు ద్ధి, సంకల్పంతో ఉందన్నారు. నాటి పాలకులు బీహెచ్ఈఎల్, సీసీఎంబీ, హెచ్ఈ ఎల్ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారని.. ఫలితంగా వారి నివాసం కోసం కూకట్పల్లి, వెంగళరావునగర్, బర్కత్‌పుర వంటి హౌసింగ్ బోర్డులు ఏర్పడ్డాయని గుర్తుచేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి రూ. పది వేల కోట్లు కేటాయించామన్నారు. ఆ నిధులతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు, డ్రైనేజీలు వంటి అన్ని సౌకర్యాలు కల్పించి ప్రపంచ డెవలపర్లను ఆకర్షిస్తామని చెప్పారు. -
ఆ నిర్మాణాలపై ‘హైడ్రా’ కొరడా తప్పదు: భట్టి విక్రమార్క
సాక్షి,హైదరాబాద్: అనుమతులు లేకుండా చేసిన నిర్మాణాలపై హైడ్రా కొరడా తప్పదని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. శనివారం(అక్టోబర్ 26)హైటెక్స్‌లో జరిగిన ప్రాపర్టీ షోలో మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు,హైడ్రాలను భట్టి ప్రస్తావించారు.‘ఎట్టి పరిస్థితుల్లోనూ మూసీ పునరుజ్జీవం జరుగుతుంది. మూసీ పునరుజ్జీవం వల్ల హైదరాబాద్‌కు, రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది.మూసీలో నివసిస్తున్నపేదల జీవితాలు మెరుగుపడతాయి.హైడ్రాపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా హైడ్రాపై దుష్ప్రచారం జరుగుతోంది.అనుమతులు ఉన్న నిర్మాణాలను హైడ్రా కూల్చదు’అని భట్టి తెలిపారు.ఇదీ చదవండి: దొరా.. మా భూములు లాక్కోవద్దు -
సినీ పరిశ్రమకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సినీ పరిశ్రమ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే శాసించే స్థాయికి ఎదగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. సోమవారం సచివాలయంలో జరిగిన గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, సీఎం రేవంత్‌రెడ్డి మీ అందరితో చెప్పాలని కోరినట్టు వివరించారు. ‘గతంలో నంది అవార్డులను ఒక పండుగలా నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. పొడుస్తున్న పొద్దు మీద నడు స్తున్న కాలమా అంటూ సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు సమాయత్తం చేసి నడిపించిన ప్రజాయుద్ధనౌక గద్దర్.ఆయన ఒక లెజెండ్. ఒక శతాబ్ద కాలంలో ఆయనలాంటి వ్యక్తి మరొకరు పుడతారని నేను అనుకోవడం లేదు. ప్రపంచంలోని అన్ని సమస్యలపై ఆయన ప్రజలను పాటలతో కదిలించారు’అని భట్టి చెప్పారు. అన్ని అంశాలు పరిశీలించే రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని కమిటీ సభ్యులకు వివరించారు. గద్దర్ అవార్డుల కార్యక్రమం గొప్ప పండుగలా జరగాలి.. ఏ తేదీన జరపాలనేది కమిటీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. గద్దర్‌ను అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. కొద్దిరోజుల్లోనే కమిటీ మరోమారు సమావేశమై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం కమిటీ సభ్యులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అద్భుతమైనదని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ సమావేశంలో డిప్యూటీ సీఎంకు అభినందనలు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్స్ వర్సిటీలో యాక్టింగ్, కల్చర్‌కు సంబంధించిన అంశాలకు చోటు కలి్పంచడంపై నిర్ణ యం తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమిటీ సభ్యులు నర్సింగరావు, తనికెళ్ల, సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరీశ్‌శంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాని శ్రీధర్, గుమ్మడి విమల, హనుమంతరావు పాల్గొన్నారు. -
‘మూసీ’ ప్రజల జీవనప్రమాణాలు పెంచుతాం
సాక్షి, హైదరాబాద్: మురుగునీటితో నిండిన మూసీని బాగు చేస్తున్నట్టే.. పరీవాహక ప్రాంతంలో నివసించే ప్రజల జీవితాలను బాగు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దోమలు, ఈగలు, దుర్గంధంతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్న ప్రజలను గత ప్రభుత్వం మాదిరి గాలికి వదిలేయబోమని, వారి జీవన ప్రమాణాలు మారుస్తామన్నారు. అక్కడ నివసించే ప్రజల సమస్యలను వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, బస్తీల్లో ఉండే పెద్ద మనుషులు, రాజకీయపక్షాల నాయకులు, సామాజిక నాయకుల సలహాలు, సూచనలు కూడా వింటామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు మణిహారంగా మూసీని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో మూసీ రివర్ ఫ్రంట్ రిహాబిలిటేషన్‌పై పురపాలక శాఖ ఉన్నతాధికారులు, హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. మూసీ ప్రక్షాళన, అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆలోచనలు, అభివృద్ధి విజన్‌ను మూసీ పరీవాహక ప్రాంతవాసులకు వివరించా లని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మూసీలో నివాసముంటున్న వారికి పట్టాలు ఉన్నా. లేకున్నా వారంతా తెలంగాణ బిడ్డలేనని వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. మూసీకి దగ్గరున్న ప్రభుత్వ భూముల్లోనే వారికి ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి మూసీ నిర్వాసితుల పిల్లలకు మెరుగైన విద్య అందిస్తామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళాసభ్యులకు వడ్డీ లేని రుణాలు, వ్యాపారం చేసుకోవడానికి ఒక అధ్యయన బృందం ఏర్పాటు చేసి సహాయ, సహకారాలను ప్రభుత్వం అందిస్తుందని వారికి చెప్పాలన్నారు. ప్రజలకు మేలు జరిగే సూచనలు ఇస్తే అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్,జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, కలెక్టర్లు అనుదీప్, శశాంక్, గౌతమ్, డిప్యూటీ సీఎం సెక్రటరీ కృష్ణభాస్కర్ ఉన్నారు. ఆదాయం పెంచే ప్రణాళికలతో రండి ఆదాయ శాఖల ఉన్నతాధికారుల సమీక్షలో భట్టి ధరలు పెంచకుండా, రాష్ట్ర ఖజానా ఆదాయం పెరిగే మార్గాలను అన్వేíÙంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులకు ఆదేశించారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంపు అంశంపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆదాయం పెంపునకు నిర్దిష్ట ప్రణాళికతో రావాలన్నారు. లొసుగులను అరికడుతూ ఆదాయం పెంచేందుకు వాణిజ్య పన్నుల కమిషనర్, జాయింట్ కమిషనర్ ఆయా విభాగాల అధిపతులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. మద్యం దుకాణాల్లో గరిష్ట ధర కంటే ఎక్కువ రేట్లతో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసేందుకు ప్రత్యేకంగా ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అక్రమంగా ఇసుక రవాణా, పనుల ఎగవేతను కట్టడి చేయడానికి వాణిజ్య పన్నులు, రవాణా అధికారులు సమావేశమై ఓ నివేదిక రూపొందించాలని తెలిపారు. నిర్మాణాలు పూర్తయిన రాజీవ్ స్వగృహ, గృహ నిర్మాణ శాఖ పరిధిలోని ఇళ్ల విక్రయాలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఇసుక రీచ్‌ల ద్వారా ప్రభుత్వ ఖజానాకు గరిష్ట ఆదాయం సమకూరాలంటే ఏం చేయాలో సీనియర్ అధికారులు ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, వికాస్‌రాజ్, వాణిజ్య పన్నుల ముఖ్య కార్యదర్శి రిజ్వీ, గనుల శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్, సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి బుద్ధ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్‌శాఖలో ఖాళీలు భర్తీ చేస్తాం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘విద్యుత్ శాఖలో పదేళ్లు గా ప్రమోషన్లు పెండింగ్‌లో ఉండగా, మా ప్రభుత్వమే ఇచ్చి0ది. ఎవరూ అడగక ముందే దీనిపై నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం ఈ శాఖలో ఖాళీల కారణంగా ఉన్న వారిపై పనిభారం పడు తోంది. నెల,రెండు నెలల్లో వీటి భర్తీకి నోటిఫికేషన్ ఇస్తాం’అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్ర మార్క వెల్లడించారు. ఖమ్మం కలెక్టరేట్లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల అధికారుల తో విద్యుత్, సంక్షేమ శాఖలపై మంగళవారం ఆయన సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో భట్టి మాట్లాడారు. మార్పులపై ప్రత్యేక శిక్షణ వరదల సమయంలో విద్యుత్ ఉద్యోగులు ఎంతో కష్టపడి పనిచేశారని భట్టి అభినందించారు. అయితే శాఖలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉద్యోగ వ్యవస్థ అందుబాటులోకి రావాల్సి ఉందని, 20 నుంచి 30 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి హైదరాబాద్‌లోని స్టాఫ్ కాలేజీలో శిక్షణ ఇస్తామని తెలిపారు. విద్యుత్‌కు సంబంధించి ఏ సమస్య వచ్చినా వినియోగదారులు 1912కు కాల్ చేయొచ్చని, 108 లాగే ఇది కూడా ఉపయోగపడుతుందన్నారు. పేరు, అడ్రస్ చెబితే అక్కడ సమస్య పరిష్కారానికి అధికారులు కృషి చేస్తారని తెలిపారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నందున ఉద్యోగులు చిన్నలోపం కూడా ఎదురుకాకుండా చూడాలన్నారు. మరమ్మతులు చేసిన కొన్నాళ్లకే టాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నందున, వ్యవస్థలను తనిఖీ చేయాలని అధికారులకు సూచించారు. మూసీ అంశం కొత్తది కాదు రెవెన్యూ రికార్డుల అప్డేట్ అంటూ.. గత పాలకులు బినామీల పేర్లపైకి భూములను బదలాయించారని భట్టి ఆరోపించారు. తాము మాత్రమే ఆక్రమణకు గురైన చెరువులను సరిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఒక్కరే నిర్ణయాలు తీసుకునేవారని, అందుకే మూసీ అంశాన్ని కేబినెట్లో చర్చించారా అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారన్నారు. మూసీపై కేబినెట్లో చర్చించడానికి కొత్త అంశమేమీ కాదన్నారు. మూసీని శుభ్రం చేసి నగరం నడి»ొడ్డున స్వచ్ఛమైన నది ప్రవహించేలా సుందరీకరణ చేయబోతున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూసీని సుందరీకరణ చేస్తామని చెప్పి చేయలేదని, తాము చేసి చూపిస్తామని, నిర్వాసితులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వమన్నారు. మూసీ ప్రక్షాళనకు డీపీఆర్‌లు సిద్ధం కాకముందే రూ.1.50 లక్షల కోట్లు వ్యయమవుతుందని చెప్పడం సరికాదని చెప్పారు. తాము గడీల్లో లేమని, ఎవరైనా ఎప్పుడైనా వచ్చి సలహాలు ఇవొచ్చని భట్టి తెలిపారు. మైనింగ్ వ్యవస్థపై అధ్యయనం చేశాం అమెరికాలో జరిగిన అంతర్జాతీయ మైనింగ్ ఎక్స్‌పోలో పాల్గొని ఆధునిక యంత్ర పరికరా లు, సాంకేతికతను వినియోగించి ఎక్కువ బొగ్గు వెలికితీయడం, బొగ్గు ఉత్పత్తిలో భద్రతా చర్యలను పరిశీలించామని భట్టి తెలిపారు. సింగరేణి పెద్ద మైనింగ్ వ్యవస్థ కావడంతో ఆ శాఖ మంత్రి గా అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించానన్నా రు. దసరా కన్నా ముందే అన్ని రకాల పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల పెండింగ్ బిల్లులు రూ.114 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం పెండింగ్ బిల్లులు విడుదల చేశామని, పిల్లల కాస్మోటిక్ చార్జీలను ఏ నెలకానెల అందజేస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అన్నీ క్లియర్ చేస్తామన్నారు. 2029–2030 వరకు 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఎన్పీడీసీఎల్ సీఎండీ కె.వరుణ్‌రెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఆక్రమణలపైనే ఫోకస్
అవేమీ మా సొంత ఆస్తులు కాదు..హైదరాబాద్ నగరంలో కబ్జాకు గురైన చెరువులన్నీ సీఎం రేవంత్‌రెడ్డికో, నాకో చెందిన ఆస్తులు కాదు. అవి నగర ప్రజల ఆస్తులు. వాటిని భవిష్యత్తు తరాలకు అందించాలన్నదే మా ప్రభుత్వ ఎజెండా. కబ్జాలు ఇదే రీతిన కొనసాగితే భవిష్యత్తులో చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి వస్తుందన్న భయంతోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.లక్షన్నర కోట్ల లెక్క ఎక్కడిది? మూసీ నది పునరుజ్జీవనం పనులపై స్టడీ కోసం మాత్రమే టెండర్లు పిలిచాం. నది ప్రక్షాళన ప్రాజెక్టు ఇంకా మొదటి దశలోనే ఉంది. అలాంటిది మూసీ ప్రక్షాళన ప్రాజెక్టుకు రూ.1.50 లక్షల కోట్లు వ్యయం అవుతుందని ఎలా నిర్ధారిస్తారు. అవాస్తవ ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: మూసీ నదిని పునరుజ్జీవింపజేయడానికి, చెరువులను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని.. ప్రజలకు మేలు చేయాలన్నదే తమ ప్రభుత్వ ఎజెండా అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎవరికీ నష్టం కలిగించే పని చేయదు, చేయబోదని పేర్కొన్నారు. ప్రస్తుతం మూసీ నది గర్భం లోపలి ఆక్రమణలపైనే దృష్టి పెట్టామని.. బఫర్ జోన్ జోలికి వెళ్లడం లేదని వివరించారు.మూసీ పరీవాహక ప్రాంతంలో ఇళ్లు కోల్పోతున్న వారిని గాలికి వదిలేయబోమని, బాధితులకు ఏ సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, గత పదేళ్లలో వాటి ఆక్రమణలు, మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు తదితర అంశాలపై సోమవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చెరువుల కబ్జాలకు సంబంధించిన శాటిలైట్ చిత్రాలను ప్రదర్శించారు. పలు దేశాల్లోని ముఖ్య నగరాల్లో నదులను సుందరీకరించుకున్న తీరును వివరించారు. సమావేశంలో భట్టి చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ నగరంలో చెరువుల కబ్జా కొనసాగింది. పూర్తిగా 44 చెరువులు, పాక్షికంగా 127 చెరువులు కబ్జా అయ్యాయి. హైదరాబాద్ నగరం అంటేనే రాక్స్ (కొండలు), పార్క్స్, లేక్స్.. అవే భాగ్యనగరానికి చాలా శోభను తెచ్చాయి. కాలక్రమేణా కొండలు (రాక్స్) కనబడకుండా పోతున్నాయి. పార్కులు కబ్జాలకు గురవుతున్నాయి. చెరువులు కూడా కబ్జాలతో కనుమరుగు అవుతున్నాయి. భారీ వర్షాలు, వరదలతో హైదరాబాద్ నగరానికి ముప్పు ఏర్పడే పరిస్థితి వచి్చంది. కాపాడాల్సిన బాధ్యత మాది ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న చెరువులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామని, మూసీని ప్రక్షాళన చేస్తామని గత ప్రభుత్వాలు ఘనంగా చెప్పి.. ఏమీ చేయలేకపోయాయి. ఎన్నో దేశాల్లోని ముఖ్య నగరాల్లో నదులను సుందరీకరించుకున్నారు. హైదరాబాద్‌ను కూడా తీర్చిదిద్ది ప్రపంచాన్ని ఆకర్షించేలా చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన. అన్యాక్రాంతం అవుతున్న చెరువులను కాపాడాల్సిన బాధ్యత సీఎం రేవంత్, నాతోపాటు అందరిపైనా ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులు చెరువులు ఆక్రమణలకు గురికాకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పింది వాస్తవం కాదా? బాధితులకు అండగా ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం ఎవరికీ నష్టం కలిగించే కార్యక్రమం చేయదు, చేయబోదు. ఎవరి ఇల్లూ కూల్చాలని ప్రభుత్వం అనుకోదు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఇల్లు కోల్పోతున్న వారిని గాలికి వదిలేయం. ఏ సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇళ్లు తొలగించిన బాధితులకు వేరేచోట ఇళ్లు ఇస్తున్నాం. ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉంటే బాధితులకు అక్కడే ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. గుడిసెలు వేసుకుని బతుకుతున్న వారిని కూడా మా ప్రభుత్వం ఆదుకుంటుంది. మూసీ బాధితుల ఆస్తులకు విలువ లెక్కకట్టి చెల్లిస్తాం. వారి కోసం రూ.10 వేల కోట్లు ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు..’’అని భట్టి వెల్లడించారు.ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నా యి. పారదర్శకంగా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభు త్వంపై, సీఎం రేవంత్‌రెడ్డిపై కొందరు ప్రతిపక్ష నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ప్రజా ప్రభుత్వం ఆలోచన ప్రజ లకు మంచి చేయాలనే తప్ప మరొకటి లేదు. ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే భవిష్యత్ తరాలకు నష్టం చేసిన వారవుతారు.నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇవ్వాలి. అందుకు మా ద్వారాలు తెరిచే ఉంటాయని అన్ని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మేమేమీ గడీలలో లేము. త్వరలోనే అన్ని పారీ్టల నాయకులకు నేనే స్వయంగా లేఖలు రాసి అభిప్రాయాలు తెలుసుకుంటా. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదగాలని ప్రతిపక్షాలకు ఉందా? లేదా? అన్నది బహిర్గతం చేయాలి. కొందరు సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. అలా ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు. -
ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ము ఖ్యమంత్రులు, డీజీపీలతో సోమ వారం జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు ఆదివారం సాయంత్రం ఆయన హస్తిన బయలుదేరారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కూడా సోమవారం ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. వారిద్దరూ పార్టీ హైకమాండ్ పెద్దలను కలిసే అవకాశముందని, మంత్రివర్గ విస్తరణతోపాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకంపై చర్చించొచ్చని ఉందని గాంధీ భవన్ వర్గాలు తెలి పాయి.అయితే సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోనే ఉంటారని తెలుస్తోంది. అలాగే పీసీసీ చీఫ్ మహే శ్‌కుమార్‌గౌడ్ తిరుపతి వెళ్తున్నారు. ఈ నేప థ్యంలో ఉత్తమ్, మహేశ్‌గౌడ్ లేకుండానే మంత్రివర్గ విస్తరణ, ఇతర అంశాలపై హైకమాండ్‌తో చర్చలు జరుగుతాయా లేదా అన్నదా నిపై స్పష్టత రావాల్సి ఉంది. అవకాశాన్నిబట్టి సీఎం, డిప్యూటీ సీఎం కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలవనున్నారు. -
భట్టి ఇంట్లో చోరీ నిందితుల రిమాండ్
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్డు నంబర్–14 బీఎన్‌రెడ్డి కాలనీలోని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఇంట్లో నగదు, నగల చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన రోషన్ కుమార్ మండల్ కొంతకాలంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో పని చేస్తున్నాడు. ఇటీవల భట్టి అమెరికా పర్యటనకు వెళ్లగా.. ఇంట్లోని బెడ్రూంలోని రోషన్ మండల్ అల్మరా తాళాలు పగులగొట్టి రూ.2.50 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసి తన స్నేహితులు ఉదయ్‌కుమార్ మండల్, కృష్ణ, సంజులతో కలిసి ఉడాయించాడు. గత నెల 24న సాయంత్రం చోరీ చేసిన నగదు, వస్తువులతో ఉదయ్‌కుమార్, సంజు, కృష్ణలతో కలిసి నాంపల్లి దాకా ఆటోలో వెళ్లి అక్కడి నుంచి రైలులో ఘట్కేసర్ వెళ్లారు. ఘట్కేసర్లో రైలెక్కి కాజీపేటలో దిగి అక్కడ మళ్లీ విజయవాడ రైలెక్కారు. విజయవాడ నుంచి విశాఖలో రైలు దిగి అక్కడి నుంచి బిహార్ ఖరగ్‌పూర్ రైలెక్కారు. గత నెల 26వ తేదీ ఉదయం ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్లో దిగిన వీరు అనుమానాస్పదంగా సంచరించడంతో అక్కడి రైల్వే పోలీసులు గుర్తించారు. కృష్ణ, సంజు అక్కడి నుంచి పారిపోగా.. ప్రధాన నిందితుడు రోషన్ కుమార్, ఉదయ్‌కుమార్‌లు పట్టుబడ్డారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్ఐ రాంబాబు బృందం ఖరగ్‌పూర్ వెళ్లి పీటీ వారెంట్ వేసి నిందితులను నగరానికి తీసుకువచ్చి శనివారం నాంపల్లిలోని మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. నిందితులిద్దరికీ 14 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. మిగతా ఇద్దరి నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యా న్ని నిర్దేశించుకున్నట్టు ఉప ముఖ్యమంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టివిక్రమార్క తెలిపారు. ఈ నేపథ్యంలో సెమీకండక్టర్ల పరిశ్రమలకు తెలంగా ణలో మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన వెల్ల డించారు. జపాన్ పర్యటనలో భాగంగా ఆయన గురువారం క్విటో నగరానికి సమీపంలో ఉన్న ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోహ్మ్ను సందర్శించి, నిర్వాహకులతో మాట్లాడారు. భట్టికి రోహ్మ్ కంపెనీ ప్రెసిడెంట్ ఇనో, కంపెనీ ఉన్నతాధి కారులు తకహసి, అండో, కాత్సునో, తనాక తకా షీ తదితరులు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భిన్న రంగాల్లో సెమీకండక్టర్ల ఆవశ్యకత ఎంతో ఉందని భట్టి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకొని విడిగా కానీ ఉమ్మడి భాగస్వామ్యంతో కానీ తెలంగాణలో సెమీ కండక్టర్ల పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని రోహ్మ్ యాజమాన్యానికి భట్టి విక్రమార్క పిలుపుని చ్చారు. భారతదేశంలో ఇప్పటికే మూడు చోట్ల తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కల్పిస్తున్న సౌకర్యాలు వ్యాపార అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని రోహ్మ్ సంస్థ తెలిపింది. సాయంత్రం క్విటో నగరానికి సమీపంలో ఉన్న పానసోనిక్ కంపెనీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రికి ఆ కంపెనీ ప్రెసిడెంట్ నబి నకానీషి ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల గురించి వివరించారు. తాము ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ వాహనాలకు సంబంధించిన బ్యాటరీలు సరఫరా చేస్తున్నామని భారతదేశంలోనూ ఒక ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలిపారు. తెలంగాణలో పానసోనిక్ ప్లాంట్ ఏర్పాటు చేయవచ్చని, ప్రభుత్వం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని భట్టి హామీ ఇచ్చారు. భట్టికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు క్విటో నగరానికి సమీపంలో ఉన్న టోజీ బౌద్ధ ఆలయాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ఉన్నతాధికారులు గురువారం ఉదయం సందర్శించారు. వారికి బౌద్ధ గురువు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ పర్యటనలో భట్టితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, ఇంధనశాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు. -
పీవీ మాడ్యూల్స్ పరిశ్రమలు నెలకొల్పండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ప్లాంట్లకు ఫోటో వోల్టాయిక్ (పీవీ) మాడ్యూల్స్ పెద్దసంఖ్యలో కావాల్సి ఉందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఫ్యూయ ల్ సెల్ టెక్నాలజీని వినియోగించబోతున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పీవీ మాడ్యూ ల్స్, ఫ్యూయల్ సెల్స్ తయారీ యూనిట్ల ఏర్పా టుకు ముందుకు రావాలని ప్రముఖ జపనీస్ కంపెనీ తోషిబాను ఆహ్వానించారు. జపాన్ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన టోక్యో శివార్లలోని తోషిబా ప్రధాన కార్యాలయంలో ఫ్యూయల్ సెల్, న్యూక్లియర్ పవర్/థర్మల్ పవర్ టర్బైన్లు, జనరేటర్ల తయారీ యూనిట్లను పరిశీలించారు. కంపెనీ ఉన్నతాధికారి హిరోషి కనేట, వైస్ ప్రెసిడెంట్ షిగేరిజో కవహర.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తమ ఉత్పత్తులను వివరించారు. తెలంగాణను ఎల్రక్టానిక్ హబ్‌గా మార్చనున్నామని, ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెద్దపీట వేస్తామని భట్టి విక్రమార్క వారికి చెప్పారు. సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణలో భాగంగా లిథి యం, ఇతర ఖనిజ తవ్వకాల రంగంలోకి ప్రవేశించనుందన్నారు. లిథియం బ్యాటరీల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న తోషిబా సింగరేణితో కలిసి ముందు కు పోవచ్చని సూచించారు. భారత్‌లో మూడు రాష్ట్రాల్లో తమ యూనిట్లను నెలకొల్పామని, అందులో తెలంగాణలోని యూనిట్ అత్యంత ముఖ్యమైనదని తోషిబా ప్రతినిధులు తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వ ఉమ్మడి భాగస్వామ్యంతో తమ పరిశ్రమలను విస్తరించేందుకు సానుకూలంగా ఉన్నామన్నారు. రాష్ట్రంలో బులెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలి భట్టి విక్రమార్క బుల్లెట్ ట్రైన్లో 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒసాకా పట్టణాన్ని 2.2 గంటల్లో చేరుకున్నారు. ఈ తరహా రవాణా వ్యవస్థను తెలంగాణలోనూ అభివృద్ధి చేయాలని రైల్వేశాఖను కోరనున్నట్లు ఆయన తెలిపారు. అక్కడి పానసోనిక్ ప్రధాన కార్యాలయాన్ని భట్టి సందర్శించనున్నారు. పర్యటనలో ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. తెలంగాణలో నీటి లభ్యత, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన స్థలాలకు లోటు లేనందున రాష్ట్రమంతా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయవచ్చన్నారు. దేశంలో గ్రీన్ హైడ్రోజన్‌కు చిరునామాగా తెలంగాణ నిలవాలని ఆకాంక్షించారు. జపాన్ పర్యటనలో భాగంగా రాజధాని టోక్యోకు 100 కి.మీ. దూరంలో ఉన్న యమానాషీ గ్రీన్ హైడ్రోజన్ కంపెనీని ఆయన సందర్శించారు. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, ఇతర పునరుత్పాదక విద్యుత్ సాంకేతికతలను పరిశీలించి అక్కడి శాస్త్రవేత్తల బృందంతో మాట్లాడారు. సౌర విద్యుత్ వినియోగించి నీటిని ఎలక్రో్టలైజింగ్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడగొట్టే యంత్ర విభాగాలను ఈ సంస్థ తయారు చేస్తోంది. ఇలా ఉత్పత్తి చేసిన హైడ్రోజన్‌ను రేసింగ్ కార్లకు ఇంధనంగా, సూపర్ మార్కెట్లలో ఫ్యూయల్ సెల్స్‌గా, ఫ్యాక్టరీల్లో బాయిలర్లకు ఉష్ణాన్ని అందించేందుకు ఇంధనంగా వినియోగిస్తున్నారని నిర్వాహకులు భట్టికి వివరించారు. ఈ ప్రక్రియలో సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తుండటంతో దీన్ని గ్రీన్ హైడ్రోజన్‌గా పేర్కొంటున్నామని వివరించారు. రాష్ట్రంలో ఉత్పత్తి కానున్న గ్రీన్ హైడ్రోజన్‌ను స్థానిక ఎరువుల కర్మాగారాలు, ఆరీ్టసీ, ఇతర పరిశ్రమలకు సరఫరా చేయొచ్చని భట్టి అన్నారు. థర్మల్ విద్యుత్‌కు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక విద్యుదుత్పత్తిని ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో సౌర విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఉమ్మడిగా ప్లాంట్ల ఏర్పాటుకు కలిసిరండి.. కంపెనీ తయారు చేస్తున్న ‘బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం’బ్యాటరీల తయారీ విభాగాన్ని భట్టి విక్రమార్క పరిశీలించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు పగటిపూట ఉత్పత్తి చేసే విద్యుత్‌లో మిగులు విద్యుత్‌ను నిల్వ చేయడానికి ఈ బ్యాటరీలను ఉత్పత్తి చేస్తున్నారు. సింగరేణి ఏర్పాటు చేసిన 245 మెగావాట్ల సామర్థ్యంగల సోలార్ ప్లాంట్లతోపాటు త్వరలో ఏర్పాటు చేయనున్న మరో వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని భట్టి అన్నారు.తెలంగాణలో గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ప్లాంట్లను ఉమ్మడి భాగస్వామ్యంతో ఏర్పాటు చేసేందుకు తమతో కలిసి రావాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. దీనిపై యమానాషీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఉన్నత స్థాయిలో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ఈ పర్యటనలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ పాల్గొన్నారు. -
డిప్యూటీ సీఎం ఇంట్లో భారీ చోరీ.. నిందితులు అరెస్ట్
-
డిప్యూటీ సీఎం ఇంట్లో భారీ చోరీ
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆయన ఇంట్లో పని చేస్తున్న బిహార్‌కు చెందిన వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి దాదాపు రూ.20 లక్షల విలువైన సొత్తు, నగదు ఎత్తుకుపోయాడు. ఈ మేరకు అందిన ఫిర్యాదు నేపథ్యంలో..బంజారాహిల్స్ పోలీసులు అన్ని రాష్ట్రాల రైల్వే పోలీసు (జీఆర్పీ) అధికారులను అప్రమత్తం చేయడంతో.. పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్లో వారిద్దరూ పట్టుబడ్డారు. భట్టి విక్రమార్క ప్రస్తుతం ప్రజా భవన్లో నివసిస్తున్నారు. అయితే ఆయనకు బంజారాహిల్స్ రోడ్ నం.14లోని బీఎన్ రెడ్డికాలనీలో విల్లా ఉంది. బిహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్ (28) ఆ ఇంట్లో పని చేస్తూ అక్కడే ఉంటున్నాడు.ఇంటి హాల్లో పడుకుంటూ వాచ్‌మన్‌గా, సర్వెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. భట్టి ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లడాన్ని అవకాశంగా తీసుకున్న రోషన్ దొంగతనానికి పథకం వేశాడు. తన స్వస్థలం నుంచి స్నేహితుడైన ఉదయ్ కుమార్ ఠాకూర్‌ను పిలిపించాడు. ఇద్దరూ కలిసి మంగళవారం మధ్యాహ్నం విల్లా పడక గది తాళాలు పగులకొట్టారు. అందులోని బీరువాలో ఉన్న నగదు, బంగారు, వెండి వస్తువులు, విదేశీ కరెన్సీ, బంగారు ఆభరణాలు తస్కరించారు. అదే రోజు రాత్రి సికింద్రాబాద్ నుంచి రైలు మార్గంలో బిహార్‌కు బయలుదేరారు. అయితే అదే ఇంట్లో భట్టి వ్యక్తిగత సహాయకులు కూడా ఉంటుంటారు.గురువారం విల్లాలో రోషన్ కనిపించకపోవడంతో ఇల్లంతా వెతుకుతూ మొదటి అంతస్తుకు వెళ్లారు. అక్కడ ప్రధాన బెడ్రూమ్ తాళాలు పగులగొట్టి ఉండటం, చోరీ జరగడాన్ని గుర్తించారు. వెంటనే భట్టి పీఏ భాస్కర శర్మకు సమాచారం అందించారు. వెంటనే విల్లాకు వచ్చిన ఆయన రోషన్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఫుటేజ్‌లను పరిశీలించగా రోషన్, ఉదయ్ ఓ బ్యాగ్‌తో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వీళ్లు రైల్లో వెళ్లారని గుర్తించిన పోలీసులు పశి్చమ బెంగాల్, బిహార్‌ల్లో ఉన్న అన్ని రైల్వేస్టేషన్ల జీఆర్పీ అధికారులకు సమాచారం ఇచ్చారు.నగరం నుంచి తొలుత భువనేశ్వర్ వెళ్లిన నిందితులిద్దరూ అక్కడి నుంచి భువనేశ్వర్–హౌరా జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఈ రైలు గురువారం సాయంత్రం ఖరగ్‌పూర్ స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నం.7కు చేరుకోగా అందులో తనిఖీలు చేస్తున్న జీఆర్పీ సిబ్బంది బ్యాగ్‌తో ఉన్న రోషన్, ఉదయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి చోరీ సొత్తు, సొమ్ము స్వాధీనం చేసుకుని నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శుక్రవారం ఖరగ్‌పూర్ వెళ్లిన ఎస్సై రాంబాబు నేతృత్వంలోని బృందం శనివారం సాయంత్రానికి నిందితుల్ని ఇక్కడకు తీసుకురానుంది. -
భట్టివిక్రమార్క ఇంట్లో చోరీ..నిందితుల అరెస్ట్
సాక్షి,హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్14లో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితులు పోలీసులకు చిక్కారు. పశ్చిమబెంగాల్లోని ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్లో నిందితులను బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు.చోరీకి పాల్పడ్డవారిని బిహార్‌కు చెందిన రోషన్ కుమార్ మండల్,ఉదయ్‌కుమార్ ఠాకూర్‌గా గుర్తించారు. వీరి నుంచి రూ.2.2లక్షల నగదు,100 గ్రాముల బంగారం, విదేశీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఇదీ చదవండి: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు -
సింగరేణిలో ‘వర్చువల్ రియాలిటీ’!
సాక్షి, హైదరాబాద్: కార్మికుల రక్షణ దృష్ట్యా సింగరేణి ప్రస్తుత, భవిష్యత్ గనుల్లో వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో బొగ్గు తవ్వకాలు జరిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అమెరికాలోని లాస్వేగాస్లో జరుగుతున్న అంతర్జాతీయ గనుల ప్రదర్శన (మైనెక్స్)–2024లో భాగంగా ఏర్పాటైన స్టాల్స్‌ను గురువారం ఆయన సందర్శించారు. శాండ్విక్ కంపెనీ స్టాల్లో అత్యాధునిక కంటిన్యూయస్ మైనర్ యంత్రంతోపాటు వర్చువల్ రియాలిటీ మైనింగ్ టెక్నాలజీని పరిశీలించారు. వర్చువల్ రియాలిటీ ద్వారా గని లోపల పరిస్థితుల్ని వెలుపలి నుంచి ప్రత్యక్షంగా చూస్తూ యంత్రాలను నడపొచ్చని కంపెనీ నిర్వాహకులు వివరించారు. యంత్రాల ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయని తెలిపారు. గని లోపలికి యంత్రాన్ని పంపించి వెలుపల నుంచే వాటిని ఆపరేట్ చేస్తూ బొగ్గు తవ్వొచ్చని చెప్పారు. భట్టి విక్రమార్క స్వయంగా వర్చువల్ రియాలిటీ సాంకేతికతతో పనిచేసే యంత్రానికి సంబంధించిన హెడ్గేర్ను ధరించి దాని పనితీరును పరిశీలించారు. ఈ పరిజ్ఞానం అద్భుతంగా పనిచేస్తోందని, కారి్మకులకు చిన్న ప్రమాదం జరగకుండా బొగ్గు ఉత్పత్తి చేయొచ్చని అభిప్రాయపడ్డారు. హూవర్ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకోవాలి అమెరికాలోని నేవడ, అరిజోన రాష్ట్రాల మధ్య ఉన్న హూవర్ డ్యామ్ జలవిద్యుత్ కేంద్రాన్ని భట్టి విక్రమార్క సందర్శించారు. అక్కడి నీటి వినియోగం, రక్షణ చర్యలు ఆచరించదగినవని ప్రశంసించారు. ఫెడరల్ గవర్నమెంట్ అధికా రులు ఆయనకు ప్రాజెక్టు గురించి వివరించారు. 17 జనరేటర్ యూనిట్ల ద్వారా 2,080 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి అవుతుందని, తద్వారా మూడు రాష్ట్రాల విద్యుత్ అవసరాలను తీరుస్తుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలోని మూడు ప్రధాన పట్టణాల్లో ఉన్న 80 లక్షల మంది ప్రజల మంచినీటి అవసరాలతోపాటు సాగునీటి అవసరాలను కూడా హూవర్ డ్యామ్ తీరుస్తుందన్నారు. ఏటా 80 లక్షల మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారని పేర్కొన్నారు. హువర్ డ్యామ్ జలవిద్యుత్ ఉత్పాదకతను స్ఫూర్తిగా తీసుకొని మన ప్రాజెక్టుల సామర్థ్యం పెంపుదలకు, రక్షణ మెరుగుదలకు గల అవకాశాలను పరిశీలించాలని రాష్ట్ర అధికారులను కోరారు. రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్, ఉపముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్ భట్టి వెంట ఉన్నారు. -
నెలవారీగా నిధులు వారం వారం సమీక్ష
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎస్ఎఎల్బీసీ టన్నెల్ తవ్వకం పనులను పూర్తి చేసేందుకు నెలవారీగా నిధులు ఇస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. టన్నెల్‌ను ప్రతినెలా రెండు వైపులా 400 మీటర్లు తవి్వతే రూ.14 కోట్లు ఖర్చు అవుతుందని, ఆ నిధులు ఇచ్చేందు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఒక్కోవైపు 300 మీటర్ల చొప్పున తవి్వనా నిధులను ఇస్తామని చెప్పారు. ఈ లెక్కన 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉంటుందని కాంట్రాక్టు సంస్థ వెల్లడించిందన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా మన్నేవారిపల్లి వద్ద చేపట్టిన ఎస్ఎల్బీసీ సొరంగమార్గం పనులను శుక్రవారం భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పరిశీలించారు.అనంతరం నీటిపారుదల శాఖ, విద్యుత్ అధికారులతో అక్కడే సమీక్షించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ టన్నెల్ పనులకు అయ్యే నిధులను గ్రీన్‌చానల్ ద్వారా ప్రతినెలా ఆర్థికశాఖ నుంచి ఇస్తామని, ఇప్పటికే రూ.42 కోట్లు ఇచ్చి పనులను మొదలు పెట్టించామన్నారు. మంత్రి కోమటిరెడ్డి అమెరికా వెళ్లి టన్నెల్ బోర్మిషన్ బేరింగ్ గురించి మాట్లాడారని, బేరింగ్ రాగానే పనులు మరింత వేగం అవుతాయన్నారు.రాష్ట్ర విభజన కంటే ముందే ఎస్ఎల్బీసీ సొరంగం 32 కిలోమీటర్లు పూర్తయిందని, మరో 11 కిలోమీటర్లు చేస్తే రూ.వెయ్యి కోట్లతో ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిర్మాణ వ్యయం రూ.4 వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇచి్చన హామీ మేరకు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు పాలసీని రూపొందించామని తెలిపారు. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్లలో అన్ని ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేస్తామన్నారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను చేస్తూనే వాటికి సంబంధం లేకుండా సాగునీరు వచ్చే ఎత్తిపోతలు, ఆర్అండ్ఆర్, ఫారెస్ట్ క్లియరెన్స్ పనులను పూర్తి చేయాలన్నారు. సాగర్ ఎడమకాలువ లైనింగ్ పూర్తి చేయాలన్నారు. హై లెవెల్ కెనాల్‌కు సంబంధించి భూసేకరణ, అటవీ భూముల అనుమతి వంటి వాటికి ప్రత్యేక అంచనాలు రూపొందించి పంపాలని అధికారులను ఆదేశించారు. డిండి, నక్కలగండి, ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి వాటికి ఒకే ఫైల్లో ప్రతిపాదనలు పంపిస్తే మంజూరు చేస్తామని, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి నిధులను ఇస్తామని చెప్పారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని బునాదిగాని కాలువ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. రూ.4400 కోట్లతో ఎస్ఎల్బీసీకి ఆమోదం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులకు సవరించిన అంచనాల ప్రకారం రూ.4400 కోట్ల పెంచి కేబినెట్లో ఆమోదిస్తామని సాగునీటి పారుదలశాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. సొరంగం పనుల కోసం అయ్యే ఖర్చును ఏజెన్సీకి చెల్లిస్తామని, ఈ ప్రాజెక్టు మొత్తాన్ని 2027 సెపె్టంబర్ 20 నాటికి పూర్తి చేసి, సాగునీటిని అందిస్తామన్నారు. డిండి ప్రాజెక్టుపై ప్రతివారం సమీక్ష చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ అనుమతులు తీసుకొచ్చేందుకు ఢిల్లీ స్థాయిలో చర్యలు చేపడతామన్నారు. దీనిపై దృష్టి సారించాలని ఎంపీ రఘువీర్‌రెడ్డిని కోరారు. పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాల్వ, బునాదిగాని కాలువలు గ్రావిటీ ద్వారా నీటిని అందిస్తాయని, ఈ మూడు కాలువలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. టన్నెల్‌తో శాశ్వత పరిష్కారం: కోమటిరెడ్డి వెంకట్రెడ్డిఎస్ఎల్బీసీ టన్నెల్ ద్వారా 4 లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీరు అందుతుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. పుట్టంగండి సిస్టర్స్ ద్వారా ఎత్తిపోసే దానికంటే ఇదే శాశ్వత పరిష్కారమన్నారు. అందుకే టన్నెల్‌ను మంజూరు చేయించామని, దానిని పూర్తి చేస్తామని చెప్పారు. పుట్టంగండిలో ప్రస్తుతం మరమ్మతులో ఉన్న నాలుగో మోటార్ ద్వారా తక్షణమే నీటిని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.ఎస్ఎల్బీసీని వేగంగా పూర్తి చేసేందుకు నెలకు రూ.30 కోట్లు ఇవ్వాలని కోరారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం డిండి ఎత్తిపోతల కింద దాదాపుగా పూర్తయిన గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్లను వర్షాధారంగా నీటిని నింపుకోవచ్చని వాటికి సంబంధించిన పనులను చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు నేనావత్ బాలునాయక్, వంశీకృష్ణ, కుందూరు జయవీర్‌రెడ్డి, వేముల వీరేశం, మందుల సామేలు, బత్తుల లక్ష్మారెడ్డి, కుంభం అనిల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు కోటిరెడ్డి, నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భూమిలేని రైతుకూలీలకు ఏటా రూ.12 వేలు
చింతకాని: ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమల్లో భాగంగా భూమిలేని నిరుపేద రైతు కూలీల కుటుంబాలకు ఈ ఏడాది నుంచి ఖాతాల్లో రూ.12 వేలు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలో దళితబంధు లబ్ధిదారులు 847 మందికి రెండో విడతగా రూ.15.54 కోట్ల మేర మంజూరు పత్రాలను మంగళవారం ఆయన అందజేశారు. నిరంకుశ రాచరిక పరిపాలన నుంచి తెలంగాణ ప్రజాస్వామ్య పరిపాలనలోకి వచ్చినందున తమ ప్రజాప్రభుత్వం సెపె్టంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందని తెలిపారు. ఈ ప్రకటనను వ్యతిరేకించిన వారు రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్టేనన్నారు.ఈ విషయంలో భిన్నాభిప్రాయాలున్నా ప్రజాపాలన దినోత్సవాన్ని స్వాగతించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టబోతున్నామని, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.6 లక్షలు, ఇతరులకు రూ.5 లక్షల మేర అందిస్తామని తెలిపారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై ప్రజలు ఆసక్తి చూపుతున్నందున రైతులు దృష్టి సారించాలని, సేంద్రియ విధానంలో సాగు చేసే ఉత్పత్తుల అమ్మకానికి ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని భట్టి తెలిపారు.చిన్నాభిన్నమైన ఆర్థికవ్యవస్థను సరిచేస్తూ ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు ఇస్తున్నామని, ఆస్పత్రి మందుల బిల్లులు, కల్యాణలక్ష్మి, మధ్యాహ్న భోజన కారి్మకుల గౌరవ వేతనం, హాస్టల్ మెస్ బిల్లుల బకాయిలను చెల్లించామని వెల్లడించారు. కాగా, దళితబంధు యూనిట్లను లబ్ధిదారుల నుంచి కొనడానికి వీల్లేదని, బెదిరించి తీసుకువెళ్లడం నేరమని భట్టి స్పష్టం చేశారు. అలా ఎవరైనా యూనిట్లను తీసుకెళ్తే తిరిగి అప్పగించాల్సిన బాధ్యత స్పెషల్ ఆఫీసర్లు, జిల్లా యంత్రాంగంపై ఉందన్నారు. సమావేశంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి భట్టి
సాక్షి, హైదరాబాద్: ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 18 నుంచి 21 వరకు మెక్సికో దేశం న్యూవోలియోన్‌లోని మోంటిగ్రో నగరంలో జరగనున్న 19వ ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావాల్సిందిగా భట్టి విక్రమార్కను నిర్వాహకులు ఆహ్వానించారు. ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన అజెండాతో ఈ సమావేశాలు జరగనున్నాయి. నోబెల్ శాంతి, ప్రపంచ శాంతి పురస్కార గ్రహీతల విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ఆహ్వానంలో పేర్కొన్నారు. ప్రపంచ సమస్యల పరిష్కారానికి వ్యూహాలు, కార్యాచరణను ఈ సమా వేశంలో రూపొందిస్తారని తెలిపారు. గుజరాత్‌కు భట్టి..గుజరాత్ గాంధీనగర్‌లోని మహాత్మ మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఈనెల 16 నుంచి 18 వరకు జరుగుతున్న నాలుగో గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ అండ్ ఎక్స్పో (ఆర్ఈ ఇన్వెస్ట్ 2024)లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. సదస్సులో పాల్గొనేందుకు భట్టి ఆదివారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయం నుంచి గుజరాత్‌కు బయలుదేరి వెళ్లారు. -
గాందీభవన్ ఆదేశాలను పాటిస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పరంగా గాం«దీభవన్ నుంచి వచ్చే ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని, ముఖ్యమంత్రి సహా యావత్ మంత్రిమండలి ఇందుకు కట్టుబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ సభలో భట్టి మాట్లాడారు. సామాజిక న్యాయం జరిగేది కాంగ్రెస్ పారీ్టలోనేనని.. ఇందుకు మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే నిదర్శనమని పేర్కొన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ కారణంగానే పార్టీ అధికారంలోకి వచి్చందని.. కార్యకర్తలను సముచితంగా గౌరవిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యతలను కార్యకర్తలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో ముందుకెళ్లాలి: దీపాదాస్మున్షీ పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా తీసుకుని పనిచేయాలని కోరారు. మరింత బలోపేతం చేయాలి: ఉత్తమ్ కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పేందుకు మహేశ్‌గౌడ్ నియామకమే నిదర్శనమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కార్యకర్తల శ్రమ, త్యాగాలతోనే తాము పదవుల్లో ఉన్నామని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి సీఎం పరామర్శ చిన్నచింతకుంట: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. మధుసూదన్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లో జరిగిన దశదినకర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. మధుసూదన్‌రెడ్డిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి జూపల్లి, చిన్నారెడ్డి, మల్లురవి ఉన్నారు.సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగు కలకలం బంజారాహిల్స్ (హైదరాబాద్): సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో ఆదివారం ఓ గుర్తుతెలియని బ్యాగు కనిపించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని రంగోలి స్టోర్ నుంచి సీఎం ఇంటికి వెళ్లేదారిలో ఈ బ్యాగును సీఎస్‌డబ్లూ (సిటీ సెక్యూరిటీ వింగ్) అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే వెళ్లి.. ఆ బ్యాగ్‌ను పరిశీలన కోసం అక్కడి నుంచి తరలించారు. ఇది సీఎం నిత్యం ప్రయాణించే మార్గం కావడం గమనార్హం. బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని గుర్తించినట్లు పోలీసువర్గాలు చెప్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ప్రకటనా చేయకుండా గోప్యత పాటిస్తున్నారు. -
‘విద్యుత్’కు రోల్‌మోడల్‌గా రాష్ట్రం
సాక్షి, పెద్దపల్లి: విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ విషయంలో తెలంగాణను దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలుపుతామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. 2030 నాటికి ఉండే డిమాండ్‌ను అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా గ్రీన్ పవర్, సోలార్ పవర్, ఫ్లోటింగ్ సోలార్, పంప్డ్ స్టోరేజీ తదితర రంగాల్లో దాదాపు 20 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా ధర్మారం, పెద్దపల్లిలో ఐటీ శాఖమంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి భట్టి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.అనంతరం నిర్వహించిన బహిరంగ సభల్లో భట్టి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టు కింద 30 గ్రామాలను ఎంపిక చేసి, అక్కడ వ్యవసాయ మోటార్లకు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. తద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును రైతులు వ్యవసాయ రంగానికి ఉపయోగించుకోవడంతో పాటు మిగిలిన విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చని చెప్పారు. ఇందులో భాగంగా నందిమేడారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోలార్ పవర్ప్లాంట్లను మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లాలోని కాచాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని, అక్కడ అందుబాటులో ఉన్న 12 ఎకరాలు సేకరించి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షను డిప్యూటీ సీఎం ఆదేశించారు.రామగుండంలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, త్వరలోనే భూమిపూజ చేస్తామని తెలిపారు. దశాబ్దానికి పైగా పెండింగ్‌లో ఉన్న ఎల్లంపల్లి నిర్వాసితుల సమస్య పరిష్కారానికి ప్రజాప్రభుత్వం పరిష్కారం చూపించి, వారి ఖాతాల్లో రూ.18 కోట్లు జమ చేయడం సంతోషంగా ఉందన్నారు. పదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ నేతలు.. రుణమాఫీపై మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. ఎమ్మెల్యేలు బజారున పడటం బాధ కలిగించింది ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అరికెపూడి గాంధీ వ్యవహారంపై మీడియా ప్రశ్నలకు స్పందిస్తూ.. బాధ్యతగల ఎమ్మెల్యేలు బజారునపడి కొట్లాడుకోవడం బాధ కలిగించిందని భట్టి అన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల తగాదా వెనుక కాంగ్రెస్ పెద్ద తలకాయ ఉందని బీజేపీ ఆరోపించడం అర్థరహితమని పేర్కొన్నారు. కాగా ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ప్రభుత్వంపై అడ్డగోలుగా మాట్లాడుతూ ప్రతి అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని విమర్శించారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయరమణరావు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కేంద్ర అధికారాలను పరిమితం చేయకపోవడంతో అంతరాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర అధికారాలను పరిమితం చేయకపోవడం వల్ల రాష్ట్రాల అభివృద్ధికి తగినన్ని నిధులు లేకుండా పోయాయని, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 42 శాతం నుంచి 50శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రులతో గురువారం తిరువనంతపురం లో జరిగిన ‘కేరళ కాంక్లేవ్’కు భట్టి హాజరయ్యారు.కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో భట్టి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంబంధాలను, దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. కేంద్రం, రాష్ట్రం దేనికదే బలంగా ఉంటూ తమ విధులు నెరవేర్చడానికి అవసరమైన వనరులతో కూడిన వ్యవస్థను రాజ్యాంగ నిర్మాతలు రూపొందించారని, కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా రాష్ట్రాలతో వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ 14వ ఆర్థిక సంఘం చేసిన నిర్ణయం తప్పుదోవ పట్టించేదేనని మండిపడ్డారు. సెస్సులు, సబ్ చార్జీల ఆదాయాన్ని కేంద్రం రాష్ట్రాలతో పంచుకోవడం లేదన్నారు. వాటిపై ఆధారపడటం వల్ల కేంద్రం స్థూల పన్ను ఆదాయం 28 శాతానికి పెరిగిందని, దీంతో రాష్ట్రాల వనరుల్లో గణనీయంగా కోత పడిందని చెప్పారు. జీఎస్టీలో అవలంబిస్తున్న విధానం వల్ల రాష్ట్రాల ఆర్థిక స్థితి దెబ్బతింటోందన్నారు.దేశ జనాభాలో 19.6 శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు జీడీపీలో 30 శాతంతో గణనీయమైన సహకారం అందిస్తున్నప్పటికీ, ఫైనాన్స్ కమిషన్ పన్నుల పంపిణీలో వాటాను 21.073 శాతం నుంచి 15.800 శాతానికి తగ్గించారన్నారు. అలాగే కేంద్ర ప్రాయోజిత పథకాల కఠినమైన నిబంధనలు, మ్యాచింగ్ గ్రాంట్ షరతులు రాష్ట్ర బడ్జెట్లను ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. దక్షిణాది స్వరాన్ని అణగదొక్కే కుట్ర రాబోయే నియోజకవర్గాల పునరి్వభజన కసరత్తు 2011 జనాభా ఆధారంగా జరిపితే లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతుందని భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ నిర్ణయాధికారంలో దక్షిణాది రాజకీయ స్వరాన్ని అణగదొక్కే కుట్ర చేస్తున్నారన్నారు. జనాభా నియంత్రణ, సామాజిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్రాలు అన్యాయానికి గుర య్యే అవకాశం ఉందని, అధిక జనాభా ఉన్న రాష్ట్రాలు అసమాన ప్రాతినిధ్యాన్ని పొందే అవకాశం ఉందని చెప్పారు. ఒక శతాబ్దంలో ప్రతినిధుల సభలో సభ్యుల సంఖ్య గరిష్టంగా 435గా ఉండాలని నిర్ణయించిన అమెరికా విధానాన్ని మనం అనుసరించాలన్నారు. -
‘యాదాద్రి’లో డిసెంబర్‌లోగా విద్యుదుత్పత్తి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని అన్ని యూనిట్ల (ఐదు)లో విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి మూడు యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రా రంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నా రు. మిగతా రెండు యూనిట్లలో మార్చి 31 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. బుధవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనుల పురోగతిపై అ«ధికారులతో సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు.. మార్చి 31కి విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు సివిల్ పనులతోపాటు రైల్వే లైన్, రోడ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు భట్టి చెప్పారు. బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇదే వేగంతో ప్రాజెక్టు పనులు పూర్తిచేసి యూనిట్ విద్యుత్తును రూ.6.35కు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రాజెక్టు భూనిర్వాసితులకు భూసేకరణ నిధులతోపాటు, ప్రాజెక్టులో ఉద్యోగాలు కలి్పస్తామని, ఇచి్చన మాట ప్రకారం వారి కుటుంబాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. 2015 జూన్ 8న థర్మల్ పవర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన జరగ్గా, 2017 అక్టోబర్‌లో పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 నాటికి మూడు యూనిట్లు పూర్తి చేయాలని చేయాల్సి ఉన్నా.. చేయలేదన్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడిందని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమేనని మండిపడ్డారు. గత ప్రభుత్వం 50 శాతం దేశీయ బొగ్గును, 50 శాతం విదేశీ బొగ్గును వినియోగించాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా నూటికి నూరు శాతం దేశీయ బొగ్గును వినియోగించిందని, దీంతో పర్యావరణ వేత్తలు కేసు వేశారన్నారు. అందువల్లే ఎన్జీటీ క్లియరెన్స్‌ను సస్పెండ్ చేసిందని వివరించారు. అప్పటి ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే ఆలస్యమయ్యేది కాదని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్జీటీ క్లియరెన్స్‌ను తీసుకోవడంతోపాటు, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. తద్వారానే ఆయిల్ సింక్రనైజేషన్ చేసే స్జేజీకి తెచి్చనట్లు పేర్కొన్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ పనులను గత ప్రభుత్వం ఆలస్యం చేసిందని, తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పనులను పూర్తి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జెన్కో ఎండీ రోనాల్డ్ రోస్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు. -
సెస్‌లు, సర్‌చార్జీల్లో రాష్ట్రాలకు వాటా కుదరదు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర పన్నుల వాటా పంపిణీలో పనితీరు బాగా ఉన్న రాష్ట్రాలకు అన్యా యం జరుగుతోందనే ఆరోపణలను 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా తోసిపుచ్చా రు. పంపిణీ చేయదగిన కేంద్ర నిధుల నుంచి రాష్ట్రాలకు 41 శాతాన్ని పంపిణీ చేయాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిందని, చట్టరీత్యా తప్పనిసరిగా కేంద్రం పంపిణీ చేయాల్సిందేనని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నికర పన్నుల ఆదా యంలో సెస్‌లు, సర్‌చార్జీలు సైతం కలిసి ఉంటాయని, వీటిని రాష్ట్రాలకు పంపిణీ చేయడం కుదరదన్నారు. సెస్‌లు, సర్‌చార్జీలను సైతం లెక్కించి కేంద్రం రాష్ట్రాలకు 31 లేదా 32 శాతం నిధులు మాత్రమే ఇస్తోందని రాష్ట్రాలు అంటున్నాయని తెలిపారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా మంగళవారం ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడా రు. కేంద్రం వసూలు చేసే సెస్‌లు, సర్‌చార్జీల్లో సైతం రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని సిఫారసు చేస్తారా? అని జర్నలిస్టులు ప్రశ్నించగా, ఈ అంశం ఆర్థిక సంఘం పరిధిలోకి రాదంటూనే.. సెస్‌లు, సర్‌చార్జీలను వసూలు చేసి 100 శాతం తీసుకునే అధికారం కేంద్రానికి రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. ఆ విధంగా రాష్ట్రాలకు వాటా ఇవ్వాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ పట్టణాభివృద్ధి ప్రణాళికలు భేష్దేశంలో గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యతని స్తుండడంతో పట్టణాభివృద్ధి నిర్లక్ష్యానికి గురవు తోందని, తెలంగాణ ఈ విషయంలో చాలా ముందుచూపుతో వెళ్తోందని అరవింద్ పనగరి యా ప్రశంసించారు. పట్టణాభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం వేసిన ప్రణాళికలు ఒక ఆర్థికవేత్తగా తనను ఆకట్టుకున్నాయన్నారు. ఆర్థిక ప్రణాళికల విష యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉందని, ప్రభుత్వం వివరించిన రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు తమను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. రాష్ట్రానికి భారంగా మారిన రుణాల రీస్ట్రక్చరింగ్ అంశం తమ పరిధిలోకి రాదని వివరించారు.జీఎస్డీపీ ఆధారంగా నిధుల పంపిణీని రాష్ట్రం కోరిందిఏ ప్రాతిపదికన కేంద్రం, రాష్ట్రాల మధ్య నిధుల పంపకాలు జరగాలి? ఏ ప్రాతిపదికన రాష్ట్రాల మధ్య నిధుల పంపకాలు జరగాలి? అనే అంశంపై రాష్ట్రం సూచనలు చేసిందని పనగరియా చె ప్పారు. జీడీపీకి ఒక్కో రాష్ట్రం అందిస్తున్న చేయూ త, ఆయా రాష్ట్రాల స్థూల దేశీయోత్పత్తి (జీఎస్డీ పీ)ని ప్రామాణికంగా తీసుకుని 28 రాష్ట్రాల మధ్య సమానంగా (హారిజాంటల్గా) నిధుల పంపిణీ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిందని వెల్లడించారు. ఇప్పటివరకు తాము 6 రాష్ట్రాల్లో పర్యటించగా, కర్ణాటక, తెలంగాణ ఈ తరహా డిమాండ్ చేశాయని తెలిపారు. రాష్ట్రం చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని చెప్పారు. తాము ఇంకా 20కి పైగా రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉందని తెలిపారు.ఏం సిఫారసులు చేస్తామో ఇప్పుడే చెప్పలేం2026–27 నుంచి 2030–31 మధ్య ఐదేళ్ల కా లంలో కేంద్ర పన్నుల ఆదాయం.. కేంద్రం, రాష్ట్రాల మధ్య పంపిణీ, రాష్ట్రాల వాటా నిధు లు మళ్లీ రాష్ట్రాల మధ్య పంపిణీ, కేంద్ర సంఘటిత నిధి నుంచి పంచాయతీలు, మున్సిపా లిటీలకు నిధుల పంపిణీ, విపత్తుల నిర్వహణ కు నిధుల పంపిణీ విషయంలో కేంద్రానికి 16వ ఆర్థిక సంఘం సిఫారసులు చేయనుందని పనగరియా వివరించారు. అయితే ఎ లాంటి సిఫారసులు చేస్తామో ఇప్పుడే వెల్ల డించలేమన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫా రసులనే కేంద్రం సరిగ్గా అమలు చేయడం లేదని విమర్శలున్న నేపథ్యంలో, 16వ ఆర్థిక సంఘం సిఫారసులకు ఏం విలువ ఉంటుందని జర్నలిస్టులు ప్రశ్నించగా.. కేంద్రం, రా ష్ట్రాల మధ్య నిధుల పంపిణీ, స్థానిక సంస్థ లు, విపత్తుల నివారణకు నిధుల పంపిణీ విషయంలో తమ సిఫారసులను కేంద్రం తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇతర సిఫారసుల అమలు కేంద్రంపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. 16వ ఆర్థిక సంఘం సభ్యులు అజయ్ నారాయణ్ ఝా, జార్జి మాథివ్, మనోజ్ పాండ, సౌమ్య కంటి ఘోష్ సమావేశంలో పాల్గొన్నారు. -
రాష్ట్రానికి సవాలుగా రుణ భారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి సవాలుగా మారిన భారీ రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు అవకాశం కల్పించాలని, లేనిపక్షంలో రాష్ట్రానికి అదనపు ఆర్థి క సహాయం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి 16వ ఆర్థిక సంఘానికి విజ్ఞప్తి చేశారు. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.6.85 లక్షల కోట్లకు చేరిన రుణ భారం రాష్ట్రానికి సవాలుగా మారిందని చెప్పారు. మంగళవారం ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగరియా, ఇతర సభ్యుల బృందంతో సీఎం సమావేశమయ్యారు.రా ష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ప్రాథమ్యాలు, అభివృద్ధి ప్రణాళికలు, నిధుల అవసరాలను బృందం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లా డుతూ.. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ రాష్ట్రం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. గత పదేళ్లలో ప్రభుత్వం (గత) భారీగా అప్పులు చేసిందని, రాష్ట్ర ఆదాయంలో అధిక భాగం రుణాలు, వడ్డీ చెల్లించేందుకే వెచ్చించాల్సిన పరిస్థితిని తీసు కొచ్చిందని అన్నారు. రుణాలు, వడ్డీలను సక్రమంగా చెల్లించని పక్షంలో రాష్ట్ర పురోగతిపై భారం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రుణాల సమస్యను పరిష్క రించేందుకు సహాయం చేయాలని కోరారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచండిదేశంలోనే తెలంగాణ చిన్న రాష్ట్రమని, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్‌గా పిలుస్తున్నామని రేవంత్‌రెడ్డి ఆర్థిక సంఘానికి తెలిపారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతా మని, రాష్ట్రాని కి తగిన సహాయం అందించాలని కోరారు. రాష్ట్రం దేశాభివృద్ధిలో కీలకపా త్ర పోషిస్తోందని చెప్పారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను నెరవేర్చితే దేశా న్ని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనకు తాము సంపూర్ణంగా సహకరిస్తామని చెప్పారు. దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నెరవే రుస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. నిధులు మళ్లించాల్సి వస్తోంది: డిప్యూటీ సీఎం భట్టితెలంగాణ తీవ్ర సంధికాలంలో ఉందని, రూ.6.85 లక్షల కోట్లకు పైగా అప్పులకు అసలు, వడ్డీలు చెల్లించేందుకు గాను అభివృద్ధి పనులకు కేటాయించాల్సిన నిధులు మళ్లించాల్సి వస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క 16వ ఆర్థిక సంఘానికి తెలిపారు. ప్రభుత్వానికి ఉన్న రుణాలను రీస్ట్రక్చర్ చేసేందుకు సాయమందించాలని కోరారు. మంగళవారం ప్రజాభవన్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లు, సూచనలను ఆయన ఆర్థిక సంఘం ముందుంచారు. కేంద్ర ప్రాయో జిత పథకాల (సీఎస్ఎస్) కోసం ఇచ్చే గ్రాంట్లను మూసపద్ధతిలో కాకుండా, ఆంక్షలు, కోత లు లేకుండా ఇవ్వాలని కోరారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో సంపదను సృష్టించే రంగాలు కొద్ది మంది చేతుల్లోనే ఉండిపోయాయని చెప్పారు. ఆర్థిక సంఘంతో భేటీ తర్వాత ప్రజాభవన్‌లో విలేకరులతో మాట్లాడు తూ.. రాష్ట్రంలోని సామాజిక అసమానతలు, భౌగోళిక పరిస్థితులను ఆర్థిక సంఘానికి వివరించినట్టు భట్టి తెలిపారు. రూ.10 వేల కోట్లు అడిగాంరైతు భరోసా, రుణమాఫీ లాంటి కార్యక్రమా ల కు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక సంఘాన్ని కోరామని, అమ్మ ఆదర్శ పాఠశాలలు, ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు రూ.10 వేల కోట్లు ఇవ్వాల్సిందిగా అడిగామని చెప్పారు. స్కి ల్స్ వర్సిటీ, ఐఐటీల అప్‌గ్రెడేషన్, మూసీ ప్రక్షా ళన, ట్రిపుల్ ఆర్, ఫ్యూచర్ సిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పాటు, స్పోర్ట్స్ వర్సిటీ లాంటి కార్యక్రమాల కోసం కూడా ఆర్థిక సా యం చేయాలని, రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల అ భివృద్ధికి చేయూతనందించాలని కోరినట్లు తెలి పారు.ఆర్థిక సంఘం సభ్యులు సానుకూలంగా స్పందించారని, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రజెంటేషన్ల విషయంలో వారు సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. రుణాల రీస్ట్ర క్చర్ అంశం తమ పరిధిలోకి రాదని ఆర్థిక సంఘం సభ్యులు అంటున్నారు కదా అని ప్రశ్నిం చగా, తమ అభిప్రాయాన్ని తెలియజేశామని, ప్రధాని, ఆర్థిక మంత్రికి కూడా ఇప్పటికే విన్న వించామని తెలిపారు. ఆర్థిక సంఘం కూడా ఈ విషయంలో తమకు సాయం చేయాలని కోరా మని, అవకాశమున్న ప్రతి చోటా తమ విజ్ఞప్తిని తెలియజేస్తామని భట్టి చెప్పారు. విలేకరుల సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఉన్నతాధికారు లు సందీప్‌కుమార్ సుల్తానియా, కృష్ణభాస్కర్, హరిత పాల్గొన్నారు. -
రేపు సీఎంతో 16వ ఆర్థిక సంఘం భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యటనలో భాగంగా 16వ ఆర్థిక సంఘం బృందం ఆదివారంహైదరాబాద్ చేరుకుంది. చైర్మన్ అరవింద్ పనగరియా నేతృత్వంలోని ఈ బృందంలో అజయ్ నారాయణ్ ఝా, యానీ జార్జి మ్యాథ్యూ, మనోజ్ పాండా, డాక్టర్ సౌమ్య కాంతి ఘోష్ సభ్యులుగా ఉన్నారు. సోమవారం ఉదయం ప్రజాభవన్‌లో పట్టణ స్థానికసంస్థల ప్రతినిధులు, గ్రామీణ స్థానికసంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్/సభ్యులు, అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించనుంది. ఆ తర్వాత వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంఘాలు, సంస్థలతోపాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో విడివిడిగా సమావేశం కానుంది. రాత్రి 8 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సచివాలయంలో ఈ బృందానికి విందు ఇవ్వనున్నారు. రేపు సీఎంతో సమావేశం.. మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రజాభవన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ఆర్థిక సంఘం బృందం సమావేశం కానుంది. రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో వెళ్తున్న ఆదాయంతో పోలిస్తే రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న కేటాయింపులు తక్కువగా ఉంటున్నందున వాటిని పెంచేలా కేంద్రానికి నివేదించాలంటూ 16వ ఆర్థిక సంఘానికి సీఎం విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. అభివృద్ధిలో పురోగమిస్తున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు నిధుల కేటాయింపులు పెంచితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి చెందుతుందని.. తద్వారా కేంద్ర, రాష్ట్రాలకు ఆదాయం పెరుగుతుందని ఆయన సూచించనున్నట్లు తెలిసింది.15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంతోపాటు 16వ ఆర్థిక సంఘం నుంచి ఆశిస్తున్న సహకారంపై ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక, పురపాలక శాఖలు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి. అనంతరం ప్రజాభవన్‌లో అరవింద్ పనగరియా బృందానికి భట్టి విక్రమార్క విందు ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు అరవింద్ పనగరియా బృందం మీడియా సమావేశంలో తమ పర్యటన వివరాలను వెల్లడించనుంది. 11న ఉదయం 16వ ఆర్థిక సంఘం తిరిగి వెళ్లిపోనుంది. 2025–26 నుంచి 2030–31 మధ్య కేంద్రం, రాష్ట్రాల మధ్య జరగాల్సిన నిధుల పంపకాల విషయంలో 16వ ఆర్థిక సంఘం చేయనున్న సిఫారసులు కీలకం కానున్నాయి. 2025 అక్టోబర్ 31 నాటికి నివేదిక సమరి్పంచాల్సి ఉండగా 2026 ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. రాష్ట్రాల ఆర్థిక వనరులను అంచనా వేసి ఐదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీలకు అదనపు నిధులను సమకూర్చడానికి తీసుకోవాల్సిన చర్యలనూ సిఫారసు చేయనుంది. పీహెచ్‌సీని సందర్శించనున్న 16వ ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం సభ్యుడు అజయ్ నారాయణ్ ఝా మంగళవారం మధ్యాహ్నం ప్రజాభవన్‌లో పురపాలక శాఖ అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. 15వ ఆర్థిక సంఘం కింద జీహెచ్ఎంసీకి మంజూరైన నిధుల వినియోగంపై సంస్థ అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఆయన మధ్యాహ్నం 3 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని అనంతారం గ్రామాన్ని సందర్శించనున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) పనితీరును, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య రంగానికి కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగాన్ని పరిశీలించనున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. -
రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్: భట్టి విక్రమార్క
సాక్షి,పెద్దపల్లిజిల్లా: రామగుండంలో 800 మెగావాట్ల జెన్కో పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం(ఆగస్టు31) భట్టి విక్రమార్క రామగుండం ప్రాంతంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రామగుండంలో ఇప్పటికే ఉన్న పాత జెన్కో పవర్‌ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ‘భవిష్యత్తులో సింగరేణి సంస్థ, జెన్కో సహకారంతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్న పాత ప్లాంటు 50 ఏళ్లుగా రాష్ట్రానికి వెలుగులు ఇచ్చింది. ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో నేను ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ ప్రభుత్వంలో ప్లాంటు ప్రారంభించి మాట నిలబెట్టుకుంటా. వీలైనంత త్వరగా ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తాం’అని భట్టి తెలిపారు. -
సెక్యూరిటీ గార్డులకు కనీస వేతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పని చేస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు త్వరలో కనీస వేతనాలను ఖరారు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రస్తుతం ఇక్కడి కంటే తమిళనాడు, కర్ణాటకల్లో సెక్యూరిటీ గార్డుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయని, త్వరలో తెలంగాణలో దేశంలోనే ఉత్తమమైన వేతనాలను సిఫార్సు చేయనున్నట్లు ఆయన తెలిపారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీజీ సీసీసీ)లో శుక్రవారం జరిగిన నేషనల్ ఫిజికల్ సెక్యూరిటీ సమ్మిట్–2024ను భట్టి విక్రమార్క ప్రారంభించారు.హైదరాబాద్ పోలీసులు, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ సమ్మిట్‌కు నగర కొత్వాల్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్‌ఎం.భగవత్, అదనపు సీపీ (శాంతిభద్రతలు) విక్రమ్‌సింగ్ మాన్‌తో పాటు హెచ్సీఎస్సీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. డిçప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ..’’రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 3.5 లక్షల వరకు ఉండగా.. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు 4 లక్షల మంది ఉన్నారు. అపారమైన ఉద్యోగావకాశాలు ఉన్న ఈ రంగం యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. ఈ సమ్మిట్ చేసే సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుంది.’’అని చెప్పారు. సెక్యూరిటీ ఏజెన్సీలు రిజి్రస్టేషన్ చేసుకోవాలి: సీపీ నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు ఇప్పటికీ తక్కువ జీతాలే ఇస్తున్నారు. రాష్ట్రంలో 1500 ఏజెన్సీలు ఉండగా... 500 మాత్రమే రిజి్రస్టేషన్ చేసుకున్నాయి. మిగిలినవీ రిజి్రస్టేషన్ చేసుకోవాలి’అని పేర్కొన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఏదైనా ఉదంతం జరిగినప్పుడు ఫస్ట్ రెస్పాండెంట్స్‌గా మారాలని అదనపు డీజీ (శాంతిభద్రతలు) మహేశ్ ఎం.భగవత్ పిలుపునిచ్చారు. ‘పోలీసులు వచ్చే వరకు నేర స్థలిని పరిరక్షించాలి. చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి అంశాన్నీ గుర్తిస్తూ, సంబంధిత శాఖలు, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రైవేట్ సెక్యూరిటీలకు సంబంధించిన పసేరా చట్టం కూడా అదే చెప్తోంది. సెక్యూరిటీ గార్డులు ఇలా రూపొందేలా ప్రతి ఏజెన్సీ వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. పోలీసు విభాగం అప్పట్లో నక్సలైట్లతో ఇప్పుడు సైబర్ క్రిమినల్స్‌తో పోరాటం చేస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే సైకిల్ పెట్రోలింగ్ పోయి సైబర్ పెట్రోలింగ్ వచి్చంది’అని మహేశ్‌భగవత్ అభిప్రాయపడ్డారు.