డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: వచ్చే ఏడాది మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని అన్ని యూనిట్ల (ఐదు)లో విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. వచ్చే డిసెంబర్ నాటికి మూడు యూనిట్ల ద్వారా 2,400 మెగావాట్ల విద్యుదుత్పత్తిని ప్రా రంభించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నా రు. మిగతా రెండు యూనిట్లలో మార్చి 31 నాటికి ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు.
బుధవారం మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి ఆయన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెండో యూనిట్ ఆయిల్ సింక్రనైజేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనుల పురోగతిపై అ«ధికారులతో సమీక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు..
మార్చి 31కి విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు సివిల్ పనులతోపాటు రైల్వే లైన్, రోడ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు భట్టి చెప్పారు. బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇదే వేగంతో ప్రాజెక్టు పనులు పూర్తిచేసి యూనిట్ విద్యుత్తును రూ.6.35కు ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
ప్రాజెక్టు భూనిర్వాసితులకు భూసేకరణ నిధులతోపాటు, ప్రాజెక్టులో ఉద్యోగాలు కలి్పస్తామని, ఇచి్చన మాట ప్రకారం వారి కుటుంబాలను గౌరవించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. 2015 జూన్ 8న థర్మల్ పవర్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన జరగ్గా, 2017 అక్టోబర్‌లో పనులు ప్రారంభమైనట్లు చెప్పారు. 2020 అక్టోబర్ నాటికి 2 యూనిట్లు, 2021 నాటికి మూడు యూనిట్లు పూర్తి చేయాలని చేయాల్సి ఉన్నా.. చేయలేదన్నారు. దీంతో ఇప్పుడు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడిందని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం గత ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమేనని మండిపడ్డారు.
గత ప్రభుత్వం 50 శాతం దేశీయ బొగ్గును, 50 శాతం విదేశీ బొగ్గును వినియోగించాల్సి ఉండగా, దానికి విరుద్ధంగా నూటికి నూరు శాతం దేశీయ బొగ్గును వినియోగించిందని, దీంతో పర్యావరణ వేత్తలు కేసు వేశారన్నారు. అందువల్లే ఎన్జీటీ క్లియరెన్స్‌ను సస్పెండ్ చేసిందని వివరించారు. అప్పటి ప్రభుత్వం తగిన చర్యలు చేపడితే ఆలస్యమయ్యేది కాదని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఎన్జీటీ క్లియరెన్స్‌ను తీసుకోవడంతోపాటు, ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు.
తద్వారానే ఆయిల్ సింక్రనైజేషన్ చేసే స్జేజీకి తెచి్చనట్లు పేర్కొన్నారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ పనులను గత ప్రభుత్వం ఆలస్యం చేసిందని, తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పనులను పూర్తి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జెన్‌కో ఎండీ రోనాల్డ్ రోస్, నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment