బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులన్నీ అవినీతిమయమని.. తమ ప్రాజెక్టులు ప్రజలపరమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. వైరా సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ రాష్ట్రంలో ఏయే ప్రాజెక్టులు ప్రారంభించాం, తక్కువ ఖర్చుతో ఏం పూర్తి చేశామనే చర్చకు ఎక్కడైనా, ఎప్పుడైనా నేను, మా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చర్చకు సిద్ధం. కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ సిద్ధమా? పదేళ్లలో రూ.లక్ష రుణమాఫీ చేయలేని గత ప్రభుత్వం.. ఏకకాలంలో 15 రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన మా ప్రభుత్వానికి పోలిక ఉందా? దేశంలో ఏ రాష్ట్ర చరిత్రలోనూ లేనట్టుగా వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్లో రూ.72 వేల కోట్లు కేటాయించాం.
సీఎం ఆదేశించిన వెంటనే శుక్రవారం రైతుల ఖాతాల్లో రుణమాఫీ నిధులు జమ అవుతాయి..’’ అని తెలిపారు. గోదావరి జలాలను ఖమ్మం జిల్లాకు తీసుకురావాలనే ఉద్దేశంతో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌లకు పునాది వేశారని గుర్తు చేశారు. వైఎస్ హయాంలోనే వీటికి రూ.1,500 కోట్లకు పైగా ఖర్చు చేశారని.. మరో రూ.1,548 కోట్లు ఖర్చు చేస్తే 4 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చేదని చెప్పారు. కానీ బీఆర్‌ఎస్ వీటిని పక్కనపెట్టి రీడిజైనింగ్ పేరిట సీతారామ ప్రాజెక్టును తెచ్చి దోపిడీ చేసిందని.. వేల కోట్లు దండుకునేందుకు, కమీషన్ల కక్కుర్తి కోసం ఐదేళ్ల ముందే మోటార్లను కొనుగోలు చేసిందని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ అసమర్థత వల్లే ప్రాజెక్టు ఆలస్యం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
పదేళ్లలో రూ. 7,500 కోట్లు ఖర్చు చేసినా, బీఆర్‌ఎస్ ప్రభుత్వ అస మర్థతతో సీతారామ ప్రాజెక్టు పూ ర్తికాలేదని మంత్రి ఉత్తమ్ మండి పడ్డారు. తమ మంత్రుల పర్యవేక్ష ణతోనే ప్రాజెక్టు పనులు ముందు కు సాగాయన్నారు. మరో 15 రో జుల్లో ప్రాజెక్టు ద్వారా 67 టీఎంసీల నీళ్లు వాడుకునేందుకు కేంద్రం నుంచి అనుమతులు వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో రాబోయే ఐదేళ్లలో 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు.
మేమే ప్రారంభించాం.. మేమే పూర్తి చేస్తాం: పొంగులేటి
గతంలో కాంగ్రెస్ ప్రారంభించిన ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ప్రాజెక్టులను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీయే పూర్తి చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పా రు. వైఎస్సార్ హయాంలో చేప ట్టిన ప్రాజెక్టుల పనులు మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉండి చుక్కనీరు ఇవ్వకుండా కాలం వెళ్లదీశారని మండిపడ్డారు. ఇప్పటివరకు సీతారామ ప్రాజెక్టు పనులు 39 శాతమే పూర్తయ్యాయని వెల్లడించారు.
రైతు రుణం తీర్చుకుంటున్నాం: తుమ్మల
రాష్ట్రంలో ఇందిరమ్మ రా జ్యం కోసం ప్రజలు తపించారని, వారి రుణం తీర్చు కుంటున్నామని మంత్రి తు మ్మల చెప్పారు. ‘‘రైతులకు రూ.31 వేల కోట్లు రుణాలు మాఫీ చేసి మాట నిలబె ట్టుకున్నాం. కొన్ని పార్టీలు రుణమాఫీ రాలేదంటూ వా ట్సాప్ చేయాలంటున్నాయి. గత పదేళ్లలో చేయని హామీల గురించి వాట్సాప్ చేస్తే మంచిది’ అని పేర్కొన్నారు.
ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొడతాం: మంత్రి కోమటిరెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని.. అందులో భాగంగా రైతు రుణమాఫీ చేశామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ భూతాన్ని తరిమి కొట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఎన్ని వేల కోట్లు అయినా ఖర్చు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment