
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరంపై రూ.లక్షల కోట్లు ఖర్చు చేసే మేడిగడ్డ కూలిపోయింది.. ప్రాజెక్టు వల్ల నీళ్లు రాలేదు కానీ.. వాళ్ల జేబులు నిండాయంటూ బీఆర్‌ఎస్ నేతలపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన జలసౌధలో మాట్లాడుతూ.. కాళేశ్వరం కూలిపోయింది.. పాలమూరు కింద ఒక్క ఎకరం ఆయకట్టు రాలేదని విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు.
‘‘కృష్ణా వాటర్‌లో తెలంగాణకు అన్యాయం జరగొద్దని.. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌కు వివరించా.. పదేళ్ల పాటు అధికారంలో ఉండి.. టెలిమెట్రిక్ ఏర్పాటు చేయలేక పోయారు. పదేండ్ల పాటు తెలంగాణకు కృష్ణా జలాల్లో అన్యాయం జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేయలేదు. పదేండ్ల కాలంలో నీటి కేటాయింపులు సాధించలేదు. శ్రీశైలం, నాగార్జున సాగర్ రిపేర్లను కూడా మేమే ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని ఉత్తమ్ తెలిపారు.
కాళేశ్వరం కూలితే.. స్వయంగా ఎన్‌డీఎస్‌ఏ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. ప్రాథమిక విచారణలోనే.. ప్రాజెక్టు డిజైన్ తప్పు ఉందని స్పష్టం చేసింది. నీళ్లు నింపవద్దని స్వయంగా ఎన్‌డీఎస్‌ఏ లిఖిత పూర్వకంగా లేఖ రాసింది. ప్రాజెక్టుల్లో కమీషన్ కోసం 12 శాతం వడ్డీకి రుణాలు తెచ్చారు. ప్రాజెక్టుల రుణాలను నెగోషియేట్ చేసి 7 శాతానికి తగ్గించాం.’’ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment