ఈ విషయాన్ని సీఎం మీ అందరితో చెప్పమన్నారు..
గద్దర్ అవార్డుల కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సినీ పరిశ్రమ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే శాసించే స్థాయికి ఎదగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. సోమవారం సచివాలయంలో జరిగిన గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, సీఎం రేవంత్‌రెడ్డి మీ అందరితో చెప్పాలని కోరినట్టు వివరించారు. ‘గతంలో నంది అవార్డులను ఒక పండుగలా నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. పొడుస్తున్న పొద్దు మీద నడు స్తున్న కాలమా అంటూ సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు సమాయత్తం చేసి నడిపించిన ప్రజాయుద్ధనౌక గద్దర్.
ఆయన ఒక లెజెండ్. ఒక శతాబ్ద కాలంలో ఆయనలాంటి వ్యక్తి మరొకరు పుడతారని నేను అనుకోవడం లేదు. ప్రపంచంలోని అన్ని సమస్యలపై ఆయన ప్రజలను పాటలతో కదిలించారు’అని భట్టి చెప్పారు. అన్ని అంశాలు పరిశీలించే రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని కమిటీ సభ్యులకు వివరించారు. గద్దర్ అవార్డుల కార్యక్రమం గొప్ప పండుగలా జరగాలి.. ఏ తేదీన జరపాలనేది కమిటీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. గద్దర్‌ను అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. కొద్దిరోజుల్లోనే కమిటీ మరోమారు సమావేశమై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం కమిటీ సభ్యులను కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అద్భుతమైనదని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ సమావేశంలో డిప్యూటీ సీఎంకు అభినందనలు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్స్ వర్సిటీలో యాక్టింగ్, కల్చర్‌కు సంబంధించిన అంశాలకు చోటు కలి్పంచడంపై నిర్ణ యం తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమిటీ సభ్యులు నర్సింగరావు, తనికెళ్ల, సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరీశ్‌శంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాని శ్రీధర్, గుమ్మడి విమల, హనుమంతరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment