Film Industry
-
దయచేసి సినిమాల్లోకి రాకండి.. విశాల్ కీలక వ్యాఖ్యలు
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్(Vishal) చిత్ర పరిశ్రమపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో పరిస్థితి బాగోలేదని..సినిమాలు నిర్మించి డబ్బును వృథా చేయకండి అని కోరారు. డబ్బులు ఉన్నవారు మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి రావాలన ఇలాంటి మాటలు చెబితే తనను విలన్‌గానే చూస్తారని.. అయినా కూడా తాను చెప్పేస్తున్నానని అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘చిత్ర పరిశ్రమలోని పరిస్థితుల గురించి గతంలోనే నేను మాట్లాడాను. పరిస్థితి బాగోలేదని చెబితే అందరూ నన్ను విలన్లా చూశారు. కానీ నేను చెప్పిందే వాస్తవం. ఒక చిన్న సినిమా తెరకెక్కించాలన్న కనీసం రూ. 4 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దయచేసి ఆ డబ్బుని మీ పిల్లల పేరుపై పిక్స్డ్ డిపాజిట్ చేయండి. లేదా భూములు కొనండి. అంతేకాని సినిమా రంగంలో పెట్టి నష్టపోకండి. ప్రస్తుతం ఇండస్ట్రీలో పరిస్థితుల ఏం బాగోలేవు. డబ్బులు ఉన్నవారు ఎవరైనా సినిమాలు చేయ్యొచ్చు. విజయ్ మాల్యా, అంబానీ కూడా సినిమాలు చేయొచ్చు. వారి వద్ద అంత డబ్బు ఉంది. కానీ వాళ్లెందుకు సినిమాలు నిర్మించడం లేదు. ఎందుకంటే సినీ పరిశ్రమలో సరైన లాభాలు ఉండవని వాళ్లకు తెలుసు’ అని విశాల్ అన్నారు. కాగా, గతేడాది కోలీవుడ్ భారీగా నష్టాలను చవి చూసింది. ఏడాది మొత్తంలో 240 వరకు సినిమాలు నిర్మిస్తే..వాటిల్లో కేవలం 18 మాత్రమే విజయం సాధించాయి. మొత్తంగా దాదాపు రూ. 1000 కోట్ల నష్టపోయినట్లు తెలుస్తోంది.మొక్కు చెల్లించిన విశాల్..12 ఏళ్ల క్రితం విశాల్ హీరోగా నటించిన ‘మదగజరాజా'(Madha Gaja Raja) చిత్రం తాజాగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. చాలా రోజుల తర్వాత విశాల్ చిత్రం రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. దీంతో బుధవారం విశాల్ చెన్నైలోని కపలీశ్వరర్ టెంపుల్ సందర్శించి మొక్కులు చెల్లించాడు. సినిమా విజయం సాధిస్తే టెంపుల్‌కి వస్తానని మొక్కుకున్నానని.. అనుకున్నట్లే మూవీ హిట్ కావడంతో మొక్కులు చెలించానని విశాల్ చెప్పారు.సుందర్ సి దర్శకతవం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, అంజలి హీరోయిన్స్‌గా నటించారు. సంక్రాంతి కానుకగా తమిళ్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ యాక్షన్-కామెడీ ఎంటర్ టైనర్ సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్ ద్వారా జనవరి 31న తెలుగులో విడుదల కానుంది. -
రెండోరోజూ ఐటీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు రెండోరోజూ కొనసాగాయి. ప్రముఖ నిర్మాత, తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి మండలి చైర్మన్ దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌తోపాటు మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల కార్యాలయాలు, కొందరు సినీ ఫైనాన్షియర్ల ఇళ్లలో మంగళవారం ఉదయం నుంచి మొదలైన సోదాలు, బుధవారం రాత్రి వరకు కొనసాగాయి. భారీ బడ్జెట్ చిత్రాలు రూపొందించే వారిపై ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అధికారులు 55 బృందాలుగా మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో ఈ సోదాలు సాగించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో సోదాలు కొనసాగాయి. దిల్‌రాజు, ఆయన కూతురు హన్సిత, సోదరుడు శిరీష్ నివాసాల్లో సోదాలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఇళ్లు, మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సినీ ఫైనాన్షియర్స్ సత్య రంగయ్య, అభిషేక్ అగర్వాల్ ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఆయా సంస్థల బ్యాలెన్స్ షీట్స్, బ్యాంకు లావాదేవీలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. తనిఖీలు జరిగిన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. ఐటీ దాడులపై దిల్‌రాజు స్పందించారు. తన ఒక్కరి ఇళ్లు, కార్యాలయాల్లోనే సోదాలు జరగడం లేదని.. సినీ ఇండస్ట్రీ మొత్తంపై జరుగుతున్నాయని తెలిపారు. -
సైఫ్ అలీ ఖాన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు అరెస్ట్
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్(54)పై(Saif Ali Khan) దాడిచేసిన వ్యక్తిని ముంబై పోలీసులు కొంతసమయం క్రితం అరెస్ట్ చేశారు. సైఫ్‌పై దాడి ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు(Bandra Police) రంగంలోకి దిగారు. సుమారు 36 గంటల్లో అతన్ని బాంద్రా ప్రాంతంలోనే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం నిందుతుడిని పోలీసులు విచారిస్తున్నారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతో పాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద అతనిపై పోలీసులు కేసు పెట్టారు. సైఫ్‌పై దాడి ఘటనలో మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా..? అనే కోణంలో వారు విచారణ జరుపుతున్నారు. (ఇదీ చదవండి: 'గేమ్ ఛేంజర్' ప్రసారం చేసిన కేబుల్ ఆపరేటర్ ఆరెస్ట్)దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. అయితే, తాజాగా నిందితుడు పట్టుబడటంతో మరిన్ని వివరాలు వెళ్లడి అయ్యే ఛాన్స్ ఉంది. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. అప్పటికే సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్ర నుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలోనే సైఫ్‌పై కత్తితో విచక్షణారహితంగా నిందితుడు పొడిచాడు. -
నిలకడగా సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం
ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రముఖ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సైఫ్ అలీ ఖాన్(54)పై గుర్తుతెలియని దుండగుడు కత్తితో దాడికి దిగాడు. ఈ ఘటనలో నటుడికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో సంపన్నులు నివాసం ఉండే బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్న సద్గురు శరణ్ భవనం 12వ అంతస్తులో సైఫ్ సొంత ఫ్లాట్‌లో గురువారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో ఇంట్లో సైఫ్ భార్య కరీనాకపూర్ ఖాన్‌తో కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. దుండగుడి దాడిలో గాయపడి రక్తమోడుతున్న సైఫ్‌ను ఆయన పెద్ద కుమారుడు ఇబ్రహీం, పనిమనుషులు వెంటనే ఆటోలో సమీపంలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స ప్రారంభించడంతో ప్రాణాపాయం తప్పింది. రెండు బలమైన కత్తిపోట్లు సహా మొత్తం ఆరు చోట్ల గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. వెన్నుముక నుంచి 2.5 అంగుళాల కత్తి మొనను ఆపరేషన్ ద్వారా తొలగించారు. సైఫ్‌కు ఎలాంటి ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం కోలుకుంటున్నారని తెలిపారు. సైఫ్‌పై దాడిపట్ల బాలీవుడ్ నటులతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కత్తితో దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు భద్రత కల్పించాలని కోరారు. మరోవైపు ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండాపోయిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రత్యేక బృందాలతో గాలింపు సైఫ్‌పై దాడి ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే బాంద్రా పోలీసులు రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. రాత్రిపూట ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించడంతోపాటు దొంగతనం కోసం వచ్చి హత్యాయత్నానికి పాల్పడడంతో సెక్షన్ 331(4), సెక్షన్ 311 కింద కేసు పెట్టారు. సాక్ష్యాధారాల కోసం సీసీటీవీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. సైఫ్‌పై దాడి తర్వాత దుండగుడు మెట్లు దిగి పారిపోయినట్లు గుర్తించారు. వీపున తగిలించుకున్న ఓ బ్యాగ్‌తో అతడు పారిపోతున్న దృశ్యాలు ఆరో అంతస్తులో తెల్లవారుజామున 2.33 గంటల సమయంలో రికార్డయ్యాయి. స్థానికంగా మొబైల్ ఫోన్ల డేటాను పోలీసులు వడపోశారు. దుండుగుడి ఆచూకీ కనిపెట్టడానికి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అతడి ఫోటోను విడుదల చేశారు. దుండగుడి దాడిలో సైఫ్ పనిమనిషికి సైతం గాయాలయ్యాయి. దుండగుడితో జరిగిన పెనుగులాటలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. బాధితురాలి నుంచి పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. స్టేట్మెంట్ రికార్డు చేశారు. అసలేం జరిగింది? దొంగతనం కోసమే దుండగుడు సైఫ్ ఫ్లాట్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. సైఫ్, కరీనా దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి తమ ఫ్లాట్‌లో నిద్రిస్తున్న సమయంలో అలికిడి వినిపించింది. అప్పటికే సైఫ్ చిన్నకుమారుడు జహంగీర్ గదిలో మాటువేసిన దుండగుడి కదలికలను పనిమనిషి గమనించి బిగ్గరగా కేకలు వేసింది. అలారం మోగించింది. దాంతో అతడు ఆమెపై కత్తి దూశాడు. ఈ శబ్దాలు వినిపించి నిద్రనుంచి మేల్కొన్న సైఫ్ అలీ ఖాన్ ఆ గదిలోకి వచ్చి దుండగుడిని అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చాలాసేపు పెనుగులాట జరిగింది. వాగ్వాదం చోటుచేసుకుంది. సైఫ్‌ను దుండగుడు కత్తితో విచక్షణారహితంగా పొడిచి తక్షణమే మెట్ల మార్గం గుండా పరారయ్యాడు. ఫైర్ ఎగ్జిట్ ద్వారా అతడు సైఫ్ ఫ్లాట్‌లో ప్రవేశించినట్లు పోలీసులు చెప్పారు. సైఫ్ కుమారుడి గదిలో నాలుగు గంటలపాటు నిశ్శబ్దంగా నక్కి ఉండి, అవకాశం కోసం ఎదురు చూశాడని, అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగతనానికి ప్రయతి్నంచాడని తెలిపారు. కారు అందుబాటులో లేకపోవడంతో సైఫ్‌ను ఆయన కుమారుడు, సహాయకులు ఆటోలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాధితుడికి న్యూరో సర్జన్ డాక్టర్ నితిన్ డాంగే, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ లీనా జైన్, అనస్థీషియాలజిస్టు డాక్టర్ నిషా గాంధీ శస్త్రచికిత్స చేశారు. ఆరు చోట్ల గాయాలైనట్లు తెలిపారు. మెడ, వెన్నుముక భాగంలో సర్జరీ చేశారు. ఎడమ చెయ్యి, మెడ కుడి భాగంలో రెండు లోతైన గాయాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుంటారని వెల్లడించారు. నిప్పులు చెరిగిన ప్రతిపక్షాలు మహారాష్ట్రలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణిస్తున్నాయని ఎన్సీపీ(శరద్ పవార్ అధ్యక్షుడు శరద్ పవార్ ఆరోపించారు. బాంద్రాలో ఇటీవలే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడని, ఇప్పుడు సైఫ్‌పై దాడి జరిగిందని చెప్పారు. ఇవన్నీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని తెలిపారు. హోంశాఖ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దే ఉందని, శాంతిభద్రతల పరిరక్షణపై ఇకనైనా దృష్టి పెట్టాలని సూచించారు. ముంబైలో ఎవరికీ రక్షణ లేదని శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. -
చిరంజీవితో తొలి సినిమా.. సుకుమార్ బర్త్‌డే విశేషాలు (ఫోటోలు)
-
కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లే హైదరాబాద్ కు సినీ ఇండస్ట్రీ వచ్చింది
-
Watch Live: సీఎం రేవంత్ తో టాలీవుడ్ పెద్దల భేటీ
-
రేపు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తాం: దిల్ రాజు
-
సినిమా వాళ్లేమైనా ప్రత్యేకమా? పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్ రోడ్ షో చేశారు... అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు
-
సినిమా వాళ్లు స్పెషలా?: సీఎం రేవంత్
సినీ పరిశ్రమకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇలాంటి విషయాల్లో అమానవీయంగా వ్యవహరించొద్దు. మీరు సినిమా తీయండి. వ్యాపారం చేసుకోండి. డబ్బులు సంపాదించండి. ప్రత్యేక ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అన్నీ తీసుకోండి. షూటింగ్స్ కోసం ఏమేం కావాలో అదీ తీసుకోండి. అయితే ఎవరిదైనా హత్య జరిగాక, ఎవరిదైనా ప్రాణం పోయాక మాత్రం స్పెషల్ ప్రివిలేజెస్ కోరితే.. అవి ఎట్టిపరిస్థితుల్లోనూ దొరకవు. నేను సీఎం సీట్లో ఉన్నంత వరకూ అది జరగదు. – సీఎం రేవంత్సాక్షి, హైదరాబాద్: సినిమా వాళ్లకు మానవత్వం లేకపోవడాన్ని ఏమనాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సినీ పరిశ్రమ తీరు అమానవీయమని.. ఎవరి ప్రాణాలైనా పోయిన తర్వాత ప్రత్యేక హక్కు కావాలంటే దొరకదని పేర్కొన్నారు. కేవలం ఒక్కరోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన హీరోను పరామర్శించిన సినీ పరిశ్రమ పెద్దలు... బాధిత కుటుంబీకులను కనీసం పరామర్శించలేదని మండిపడ్డారు. సాధారణ ప్రజల ప్రాణాలు కాపాడటం తమకు ప్రధానమని.. ప్రాణాలు పోయేందుకు ఎవరు కారణమైనా విడిచిపెట్టబోమని హెచ్చరించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైన వారిని విచారించి శిక్షించే వరకు విడిచిపెట్టబోమని ప్రకటించారు. శనివారం అసెంబ్లీలో రైతుభరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. ‘‘సంధ్య థియేటర్ తొక్కిసలాట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అతిగా స్పందించిందన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఒక మహిళ చనిపోగా, ఒక బాలుడు కోమాలో, మరొకరు తొక్కిసలాటలో ఇరుక్కుపోతే.. ఆ హీరో కనీసం పట్టించుకోకుండా అభిమానులకు చేతులు ఊపుతూ వెళ్లడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?’’అని పేర్కొన్నారు. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ఈ అంశం సభలో చర్చకు వస్తుందని అనుకోలేదు. డిసెంబర్ 4న పుష్ప–2 విడుదల సందర్భంగా హీరో, హీరోయిన్ వస్తారని బందోబస్తు కల్పించాలని డిసెంబర్ 2న సంధ్య టాకీస్ వాళ్లు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో దరఖాస్తు చేశారు. ఆ ప్రాంతంలో రద్దీతోపాటు సంధ్య థియేటర్లోకి వెళ్లడానికి, బయటికి రావడానికి ఒకే గేటు ఉన్న కారణంగా సెక్యూరిటీ కల్పించలేమని అనుమతి నిరాకరిస్తూ 3న అక్కడి సీఐ సమాధానమిచ్చారు. అయినా 4న రాత్రి 9 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్‌రోడ్డు మీదుగా తన కారు రూఫ్‌టాప్ ఓపెన్ చేసి రోడ్‌షో నిర్వహిస్తూ థియేటర్‌కు వచ్చారు. తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఉన్న ఆ ప్రాంతంలో వేలమంది ఒకచోట చేరడంతో పరిస్థితి అదుపు తప్పింది. అల్లు అర్జున్ 50, 60 మంది ప్రైవేట్ సెక్యూరిటీ అడ్డుగా ఉన్న వారిని తోసేయడం తొక్కిసలాటకు దారితీసింది. రేవతి అనే మహిళ, శ్రీతేజ్ అనే బాలుడు స్పృహ తప్పినట్టుగా పోలీసులు గుర్తించారు. అప్పటికే రేవతి మరణించగా, శ్రీతేజ్ బ్రెయిన్‌డెడ్‌గా వైద్యులు ప్రకటించారు. పోలీసులు చెప్పినా పట్టించుకోలేదు ఏసీపీ ఆ రోజు రాత్రి 11 గంటల సమయంలో సంధ్య థియేటర్‌కు వెళ్లి పరిస్థితి బాగో లేదని.. హీరోను అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరినా పూర్తి సినిమా చూస్తానంటూ ఆయన పట్టించుకోలేదు. తర్వాత డీసీపీ వెళ్లారు. వెంటనే వెళ్లిపోకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని హెచ్చరించడంతో బయటికి వచ్చారు. ఇంత ప్రమాదం జరిగి, ఒకరు చనిపోయాక కూడా హీరో కారు రూఫ్‌టాప్ ఓపెన్ చేసి అభిమానులకు చెయ్యి ఊపుతూ వెళ్లారంటే... ఆయన ఎలాంటి మనిషి అనుకోవాలి? నేను సీఎం కుర్చీలో కూర్చుని మౌనంగా ఉండలేను. ఇంటికెళ్లిన పోలీసులతో దురుసుగా.. తొక్కిసలాట ఘటనపై పోలీసులు కేసు పెట్టారు. కొందరిని అరెస్ట్ చేశారు. కొన్నిరోజుల తర్వాత హీరో నివాసానికి కూడా వెళ్లి తమ వెంట రావాల్సిందిగా కోరారు. కానీ పోలీసులపై వారు దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. ఆ హీరోను పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లగానే... నా రాజకీయ మిత్రుల కోసం కేసు పెట్టానంటూ సోషల్ మీడియాలో కొన్ని రాజకీయపార్టీల వారు నన్ను పైశాచికంగా, నీచంగా తిడుతూ పోస్టులు పెట్టారు. బాధితులను కనీసం పరామర్శించలేదు శ్రీతేజ్ తండ్రి నెలకు రూ.30 వేలు సంపాదించే మామూలు ఉద్యోగి. కొడుకు ఆ హీరో అభిమాని కావడంతో.. స్పెషల్ షో కోసం ఒక్కో టికెట్‌కు రూ.మూడేసి వేల చొప్పున రూ.12 వేలు పెట్టి కొన్నారు. తల్లి రేవతి చనిపోయి, అబ్బాయి తీవ్ర అస్వస్థతకు గురై 11 రోజులు గడిచినా ఆ కుటుంబ సభ్యులను హీరో, ప్రొడ్యూసర్, మరెవరూ పరామర్శించలేదు. ఇది ఏరకమైన మానవత్వం? ఇలా వ్యవహరించే వారిని ఏమనాలి? విధి నిర్వహణలో భాగంగా హీరోను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళితే.. పదేళ్లు మంత్రిగా ఉన్న ఓ వ్యక్తి, ఉద్యమాల టైంలో షూటింగ్‌లు జరపొద్దంటూ దాడులు చేసిన వ్యక్తి విమర్శలు చేస్తారు. ఈ హీరో భగవత్ స్వరూపుడు, ఆయనను పోలీసులు ముట్టుకుంటారా? అసలేం జరుగుతోంది? అంటారు. అంటే మీ స్నేహితులైతే అరెస్ట్ చేయొద్దా? వారేం చేసినా మాఫీనా? ప్రత్యేక రాయితీలిచ్చింది మా సర్కారే కదా! సినీ పరిశ్రమను ప్రోత్సాహించాలని ఆ సినిమాకు టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోలకు అనుమతినిచ్చింది మా ప్రభుత్వమే. అయితే ఇలా ప్రోత్సహించే క్రమంలో ప్రాణాలు తీసే ఘటనలు జరిగినా ఏమీ చేయకూడదంటే ఎలా? అంటే ఫిల్మ్‌స్టార్, సూపర్‌స్టార్, రాజకీయ ప్రముఖులు ఎవరినైనా హత్యచేసినా... వారిని ప్రాసిక్యూట్ చేయొద్దని ఏదైనా ప్రత్యేక చట్టం ఉంటే చెప్పండి పాటిస్తాం. సినీ ప్రముఖులను సూటిగా అడుగుతున్నా.. తల్లి చనిపోయింది, పిల్లవాడు బ్రెయిన్‌డెడ్ అయ్యి కోమాలో ఉంటే ఒక్కరైనా వెళ్లారా? సినీ ప్రముఖులను సూటిగా అడుగుతున్నా.. ఆ సినీ హీరోకు ఏమైంది కాలు పోయిందా? చెయ్యి పోయిందా? కన్ను పోయిందా? కిడ్నీలు దెబ్బతిన్నాయా? ఏమైంది.. వెళ్లి పరామర్శించడానికి.. అదే చావుబతుకుల్లో ఉన్న పిల్లవాడిని ఒక్కరూ పరామర్శించలేదు. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. హీరో అయితే అర్ధరాత్రి జైలు నుంచి వదిలిపెట్టాలా? హీరోకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయనను అర్ధరాత్రి 11, 12 గంటలకు విడుదల చేయాలని చాలా మంది గట్టిగా కోరారు. అర్ధరాత్రి జైలు నుంచి వదిలేందుకు చట్టంలో ఏదైనా వెసులుబాటు ఉందా? సినీహీరో కాబట్టి అర్ధరాత్రి వదిలిపెట్టాలంటే ఎలా? కొన్ని రాజకీయ పార్టీల నేతలు, పదేళ్లు మంత్రిగా ఉన్న వారు ఆ హీరోపై కేసు పెట్టడాన్ని తప్పుబడుతున్నారు. హీరో కాబట్టి ఏం చేసినా చెల్లుతుందా? మేం అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి అనుగుణంగా చట్టం, న్యాయం ప్రకారం నడిపిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. -
ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చింది – బెల్లంకొండ సురేష్
‘‘శ్రీహరి హీరోగా నటించిన ‘సాంబయ్య’ (1999) సినిమాతో నిర్మాతగా నా ప్రయాణం ప్రారంభమైంది. ప్రొడ్యూసర్‌గా 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇన్నేళ్లలో 38 సినిమాలు చేశాను. ఇండస్ట్రీ నాకు ఎంతో ఇచ్చింది. డబ్బు, పేరు, హోదా అన్నీ ఇక్కడే సంపాదించుకున్నాను. ఈ ప్రయాణం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు. నిర్మాతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు, నేడు (డిసెంబర్ 5) తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం బెల్లంకొండ సురేష్ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో మోహన్‌బాబుగారు నాకు గాడ్ ఫాదర్. నాకు ఎవరూ సపోర్ట్ లేనప్పుడు ఆయన తన సినిమాకి ప్రొడక్షన్ మేనేజర్ని చేశారు. శ్రీహరిగారితో తీసిన ‘సాంబయ్య’ 25 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే శ్రీహరిగారు, ఆ సినిమా డైరెక్టర్ కేఎస్ నాగేశ్వర రావుగారు మన మధ్య లేకపోవడం చాలా బాధగా ఉంది. శ్రీహరిగారు మంచి నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. ఒక ఫ్రెండ్‌గా ఆయన పిల్లల భవిష్యత్‌కి నా వంతు బాధ్యతగా అవసరమైనప్పుడు చేయూతనిస్తాను. 2015లో వచ్చిన ‘గంగ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత తొమ్మిదేళ్ల పాటు సినిమా నిర్మించలేదు నేను. మా అబ్బాయిలు సాయి శ్రీనివాస్, సాయి గణేశ్ బయట బ్యానర్లలో సినిమాలు చేస్తున్నారు... అందుకే ఇన్నేళ్లు విరామం ఇవ్వాల్సి వచ్చింది. శ్రీనివాస్ కెరీర్ సెట్ అయ్యింది. పెళ్లి కూడా కుదిరింది. వచ్చే ఏడాది చేసుకుంటాడు. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. గణేశ్ తన కెరీర్ సెట్ చేసుకుంటున్నాడు. రెండు మంచి ప్రాజెక్ట్స్ తన చేతిలో ఉన్నాయి. నా రీ ఎంట్రీలో భాగంగా మా అబ్బాయిలతోనే ఫిబ్రవరి, ఏప్రిల్‌లో రెండు కొత్త ప్రాజెక్ట్స్ప్రారంభిస్తాను. ఈ రెండు సినిమాలతో కొత్త దర్శకులని పరిచయం చేస్తున్నాను. ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ని 4కే క్వాలిటీలో సిద్ధం చేశాను. రవితేజ బర్త్‌డేకి (జనవరి 26) రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. -
మోహన్‌బాబు@50
నటుడు–నిర్మాత మంచు మోహన్‌బాబు సినీ జర్నీ గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి అడుగుపెట్టింది. యాభై ఏళ్ల కెరీర్లో ప్రతినాయకుడిగా, కథానాయకుడిగా, సహాయ నటుడిగా, నిర్మాతగా ఎన్నో ఘనవిజయాలను చూశారు మోహన్‌బాబు. నేటితో సినీ పరిశ్రమలో హీరోగా 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. సినిమాల్లోకి రాక ముందు ఆయన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేశారు. అయితే సినీ పరిశ్రమపై ఎనలేని ఆసక్తితో మద్రాస్ వెళ్లి, అవకాశాల కోసం ఎంతో శ్రమించారు మోహన్‌బాబు. అలా ఒకట్రెండు సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించిన మోహన్‌బాబు హీరోగా నటించిన తొలి చిత్రం ‘స్వర్గం నరకం’ (1975). డా. దాసరి నారాయణరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నవంబరు 22న విడుదలైన ఈ సినిమాకు విశేష ప్రేక్షకాదరణ దక్కింది. ఈ సినిమా విడుదలై, గురువారంతో నలభైతొమ్మిది సంవత్సరాలు పూర్తయ్యాయి. ‘స్వర్గం నరకం’తో హీరోగా వెండితెరకు పరిచయమైన మోహన్‌బాబు కెరీర్ మొదట్లో ఎక్కువగా విలన్ పాత్రలనే పోషించారు. 1975–1990 సమయంలో విలన్‌గా విజృంభించారు. హీరోగా ‘అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు, మేజర్ చంద్రకాంత్’ వంటి బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నారు. 75 సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమాలో మహాదేవ శాస్త్రిగా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు మోహన్‌బాబు. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే స్పష్టత రానుంది. -
సినీ పరిశ్రమకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సినీ పరిశ్రమ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే శాసించే స్థాయికి ఎదగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. సోమవారం సచివాలయంలో జరిగిన గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, సీఎం రేవంత్‌రెడ్డి మీ అందరితో చెప్పాలని కోరినట్టు వివరించారు. ‘గతంలో నంది అవార్డులను ఒక పండుగలా నిర్వహించేవారు. రాష్ట్ర విభజన తర్వాత గత ప్రభుత్వం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. పొడుస్తున్న పొద్దు మీద నడు స్తున్న కాలమా అంటూ సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు సమాయత్తం చేసి నడిపించిన ప్రజాయుద్ధనౌక గద్దర్.ఆయన ఒక లెజెండ్. ఒక శతాబ్ద కాలంలో ఆయనలాంటి వ్యక్తి మరొకరు పుడతారని నేను అనుకోవడం లేదు. ప్రపంచంలోని అన్ని సమస్యలపై ఆయన ప్రజలను పాటలతో కదిలించారు’అని భట్టి చెప్పారు. అన్ని అంశాలు పరిశీలించే రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించిందని కమిటీ సభ్యులకు వివరించారు. గద్దర్ అవార్డుల కార్యక్రమం గొప్ప పండుగలా జరగాలి.. ఏ తేదీన జరపాలనేది కమిటీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. గద్దర్‌ను అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. కొద్దిరోజుల్లోనే కమిటీ మరోమారు సమావేశమై త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం కమిటీ సభ్యులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కాన్సెప్ట్ అద్భుతమైనదని ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ సమావేశంలో డిప్యూటీ సీఎంకు అభినందనలు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్, స్కిల్స్ వర్సిటీలో యాక్టింగ్, కల్చర్‌కు సంబంధించిన అంశాలకు చోటు కలి్పంచడంపై నిర్ణ యం తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమిటీ సభ్యులు నర్సింగరావు, తనికెళ్ల, సురేశ్‌బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరీశ్‌శంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాని శ్రీధర్, గుమ్మడి విమల, హనుమంతరావు పాల్గొన్నారు. -
ఇంకా సద్దుమణగలేదు!
సాక్షి, హైదరాబాద్: సినీ హీరో అక్కినేని నాగార్జున కుటుంబంతోపాటు సినీనటి సమంతపై తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం ఇంకా సద్దుమణగలేదు. మంత్రి వ్యాఖ్యలను తప్పుపడుతూ చలనచిత్ర ప్రముఖులు గురువారం తీవ్రస్థాయిలో స్పందించారు. అక్కినేని కుటుంబంతోపాటు నటి సమంతకు బాసటగా నిలిచారు. ఈ మేరకు కొండా సురేఖపై సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. తెలుగు సినీ పరిశ్రమతోపాటు ఇతర భాష నటీనటులు కూడా స్పందించారు. మెగాస్టార్ చిరంజీవి, హీరోలు వెంకటేష్, మహేష్‌బాబు, ప్రభాస్, రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ, నరేష్, నాని, విజయ్ దేవరకొండతో పాటు సీనియర్ నటి విజయశాంతి, హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్, దర్శకులు రాజమౌళి, హరీశ్ శంకర్, తమిళ నటి కుష్బూ తదితరులు కూడా మంత్రి సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ ‘ఎక్స్’, ఇన్‌స్ట్రాగామ్‌లలో పోస్టులు పెట్టారు. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ సైతం మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. సినీ పరిశ్రమకు చెందిన సభ్యుల వ్యక్తిగత జీవితాలతో ముడిపడి ఉన్న సున్నిత అంశాలపై ఎవరు మాట్లాడినా తగిన చర్యలకు ఉపక్రమిస్తామని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు.. అసోసియేషన్ తరపున కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ అధికారికంగా సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మరింత నష్టం జరగకుండా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. దీంతో సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నట్లు ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. నాగార్జున పరువునష్టం దావా..మంత్రి సురేఖపై సినీనటుడు నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ సభ్యుల పరువుకు మంత్రి భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు కొండా సురేఖపై పలువురు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. ‘మూసీ మురికి అంతా వాళ్ల నోట్లోనే ఉంది. ఇంకా శుద్ధి ఎందుకు.. లక్షన్నర కోట్లు ఖర్చు ఎందుకు?’ అని ప్రశ్నించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యల దుమారం రేగుతున్నా... సీఎం రేవంత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. -
శ్రీలంకవైపు ఇండియన్ సినిమా చూపు
శ్రీలంక అడవుల్లో రిస్కీ ఫైట్స్ తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి విజయ్ దేవరకొండ ఇటీవల శ్రీలంక వెళ్లొచ్చారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆ మధ్య శ్రీలంకలో జరిగింది. అక్కడ ఓ భారీ రిస్కీ ఫైట్‌ని చిత్రీకరించారని సమాచారం. అటు బాలీవుడ్ వైపు వెళితే... అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రియదర్శన్ దర్శకత్వంలో రానున్న హారర్ కామెడీ చిత్రంలోని కీలక సన్నివేశాలను శ్రీలంకలో చిత్రీకరిస్తున్నారు. ఇవి కాకుండా కొన్ని దక్షిణాసియా చిత్రాలు కూడా లంకలో షూటింగ్స్ జరుపుకుంటున్నాయి.లంకలో ప్యారడైజ్మద్రాస్ టాకీస్ బ్యానర్‌పై ప్రముఖ దర్శకుడు మణిరత్నం సమర్పణలో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘ప్యారడైజ్’ను పూర్తిగా శ్రీలంకలోనే చిత్రీకరించారు. మలయాళ నటుడు రోషన్ మ్యాథ్యూ ఇందులో హీరోగా నటిస్తే ప్రముఖ శ్రీలంక దర్శకుడు ప్రసన్న వితనకే డైరెక్ట్ చేశారు. ఇక మమ్ముట్టి, మోహన్ లాల్ కాంబినేషన్ లో త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న మలయాళం మూవీని 30 రోజుల పాటు శ్రీలంకలోనే షూట్ చేయనున్నురు. ఈ చిత్రానికి లంక ప్రభుత్వం ఎంతటిప్రాధాన్యత ఇచ్చిందంటే నిర్మాత, దర్శకుడితో ఆ దేశ ప్రధానమంత్రి నినేష్ గుణవర్దెన నేరుగా చర్చలు జరిపారు. ఇక ఫ్యూచర్ప్రాజెక్ట్స్కు షూటింగ్ లొకేషన్ గా శ్రీలంకను ఎంచుకోవాలని మలయాళ ఫిల్మ్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ భావిస్తోంది.ఇండియన్ సినిమాకి రెడ్ కార్పెట్ఒకప్పుడు శ్రీలంకలో సినిమా షూటింగ్స్ వ్యవహారం ఓ ప్రహసనంలా సాగేది. దేశ, విదేశీ సినిమాల షూటింగ్స్ అనుమతుల కోసం 41 ప్రభుత్వ విభాగాలను సంప్రదించాల్సి వచ్చేది. దీంతో భారత్‌తో పాటు ఇతర దేశాల చిత్ర నిర్మాతలు లంక లొకేషన్స్ కు దూరమవుతూ వచ్చారు. దీనికి తోడు 2022 నాటి ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని రోడ్డున పడేసింది. అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో దేశాన్ని పునర్నిర్మించడం ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. అప్పటివరకు టూరిస్ట్ డెస్టినేషన్ గా ఉన్న శ్రీలంకకు పర్యాటకులు రావడం కూడా తగ్గిపోయింది.దేశాన్ని గాడిలో పెట్టేందుకు ఎన్నో మార్గాలు అన్వేషించిన లంక పాలకులకు భారతీయ సినీ రంగుల ప్రపంచం జీవనాడిలా కనిపించింది. మళ్లీ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు సినిమా షూటింగ్స్‌తో దేశాన్ని కళకళలాడేలా చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. సినిమా షూటింగ్స్ కోసం తమ దేశంలో అడుగుపెట్టే ఎవరికైనా సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేసే విధానాన్నిప్రారంభించింది. ముఖ్యంగా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలకు సంబంధించిన షూటింగ్స్ కోసం అనుమతులను వేగవంతం చేసింది. భారతీయ సినీ ప్రముఖులకు అక్కడి టూరిజం ప్రమోషన్ బ్యూరో రెడ్ కార్పెట్ పరిచింది. దీంతో ఇండియన్ మూవీ షూటింగ్స్‌కు శ్రీలంక కేరాఫ్ అడ్రెస్‌గా మారిపోయిందిఆర్థిక అస్త్రంగా...ఫిల్మ్ టూరిజాన్ని లంక ప్రభుత్వం ఆర్థిక అస్త్రంగా ఎంచుకోవడం వెనక మరో కారణం కూడా ఉంది. ఇండియన్ మూవీస్ అంటే సింహళీయుల్లో విపరీతమైన క్రేజ్. బాలీవుడ్‌తో పాటు ఇతర భారతీయ చిత్రాలు లంక థియేటర్స్‌లో నిత్యం స్క్రీనింగ్ అవుతాయి. షూటింగ్స్ కోసం భారతీయ సినీ ప్రముఖులు లంక బాటపడితే దేశ పర్యాటక రంగానికి కూడా కొత్త ఊపు వస్తుంది. విదేశీ మారక ద్రవ్యం కూడా పెరుగుతుంది. లంక ప్రభుత్వం వేసుకున్న ప్రణాళికకు తగ్గట్టుగానే షూటింగ్స్ కోసం ఇండియన్ డైరెక్టర్స్,ప్రోడ్యూసర్స్ లంక వైపు చూస్తున్నారు. ఆ దేశం కల్పించే ప్రత్యేక సదుపాయాలను ఉపయోగించుకుంటూ అందమైన లంక లొకేషన్స్ ను షూటింగ్ స్పాట్స్‌గా మార్చేశారు. ఒక రకంగా లంక ఎకానమీకి భారతీయ చిత్ర పరిశ్రమ వెన్నెముకగా మారిపోయింది. – ఫణికుమార్ అనంతోజు శ్రీలంక పిలుస్తోంది.... రారమ్మంటోంది.... అందుకే ఈ మధ్య కాలంలో ఇండియన్ ఫిల్మ్స్ శ్రీలంకకు క్యూ కడుతున్నాయి. టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్... ఇలా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ శ్రీలంక వైపు చూస్తోంది. సినిమా షూటింగ్స్ కోసం ఏకంగా శ్రీలంక ప్రధానమంత్రితో కూడా భారతీయ సినీ నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. ఒకప్పుడు విదేశాల్లో షూటింగ్స్ అంటే అమెరికాతో పాటు యూరప్ దేశాల పేర్లు ఎక్కువగా వినిపించేవి. కానీ ఇప్పుడు ఇండియన్ సినిమా రూటు మార్చింది. ఆ విశేషాల్లోకి...పచ్చందనమే... పచ్చందమనే పచ్చదనమే అన్నట్లు... శ్రీలంక గ్రీనరీతో అందంగా ఉంటుంది. పాటల చిత్రీకరణకు బెస్ట్ ప్లేస్. ఫైట్లు తీయడానికి దట్టమైన అడవులు ఉండనే ఉన్నాయి. అలాగే అబ్బురపరిచే చారిత్రక కట్టడాలూ, కనువిందు చేసే సముద్ర తీరం ఉన్నాయి. వీటికి తోడు భారతీయులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుబంధం ఉండటంతో ఇండియన్ ఫిల్మ్ మేకర్స్‌ను తమ దేశంవైపు తిప్పుకుంటోంది లంక సర్కార్. శ్రీలంకలో గతంలోనూ షూటింగ్స్ జరిగాయి. అక్కడ షూట్ చేయడం కొత్త కాకపోయినా ఆ దేశం భారతీయ చిత్ర నిర్మాణాలకు ఇప్పుడు సింగిల్ డెస్టినేషన్ గా మారిపోయిందని అనొచ్చు. 2022 నాటి ఆర్థిక సంక్షోభం నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతున్న శ్రీలంక గతంలో ఎప్పుడూ లేని విధంగా ఫిల్మ్ టూరిజాన్ని ్రపోత్సహిస్తూ తమ దేశ ఎకానమీకి ఊతమిచ్చే ప్రయత్నాలు చేస్తోంది. -
వరద బాధితుల సహాయానికి ప్రత్యేక కమిటీ
‘‘విజయవాడ, ఖమ్మం ప్రాంత ప్రజలు వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ప్రకృతి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం చేసేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ముందు ఉంటుంది’’ అని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కేఎల్ దామోదర్ ప్రసాద్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఫిల్మ్ ఛాంబర్ తరఫున ఏపీకి రూ. 25 లక్షలు, తెలంగాణకు రూ. 25 లక్షలు, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తరఫున ఏపీకి 10 లక్షలు, తెలంగాణకు 10 లక్షలు, అదే విధంగా ఫెడరేషన్ తరఫున ఒక్కో రాష్ట్రానికి రూ. 5 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నాం.రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు సంబంధించి అకౌంట్ నంబర్స్‌తోపాటు ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఒక అకౌంట్ నంబర్ ఇస్తున్నాం. సాయం చేయాలనుకునేవారు ఈ ఖాతాలకు డబ్బులు పంపవచ్చు’’ అన్నారు. ‘‘మా కుటుంబం నుంచి రూ.కోటి విరాళం ఇస్తున్నాం’’ అన్నారు నిర్మాత డి. సురేష్‌బాబు. ‘‘కష్టాల్లో ఉన్న తెలుగు ప్రజలను మనమందరం ఆదుకోవాలి’’ అని డైరెక్టర్ రాఘవేంద్రరావు తెలి΄ారు. ‘‘మా నిర్మాణ సంస్థ నుంచి రెండు రాష్ట్రాలకు చెరోపాతిక లక్షలు ఇస్తున్నాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు చె΄్పారు. ‘‘వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇండస్ట్రీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేశాం’’ అని దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తెలి΄ారు. ‘‘అన్ని కార్మిక యూనియన్లు ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చేలా ΄్లాన్ చేస్తున్నాం’’ అని ఫిల్మ్ ఇండస్ట్రీ ఎం΄్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ వరద బాధితులకు తమ వంతు సాయం ప్రకటించారు హీరో వరుణ్ తేజ్, నిర్మాత అంబికా కృష్ణ. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి వరుణ్ తేజ్ రూ. 10 లక్షలు (5 లక్షల చొప్పున), అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖకు రూ. 5 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే అంబికా కృష్ణ రూ.10 లక్షలు (5 లక్షల చొప్పున) విరాళం ప్రకటించారు. -
కన్నడ పరిశ్రమలోనూ హేమా తరహా కమిటీ కావాలి
‘‘మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీని ఏర్పాటు చేసినట్లుగా కన్నడంలోనూ ఓ కమిటీ ఉండాలి. సుప్రీమ్ కోర్టు లేక హై కోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆ కమిటీని ఏర్పాటు చేయాలి’’ అంటూ కర్ణాటకకు చెందిన ‘ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ రైట్స్ అండ్ ఈక్విటీ’ (ఫైర్) కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. కన్నడ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై నివేదిక తీసుకు రావాలని ‘ఫైర్’ సభ్యులు కోరారు. బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు తమ డిమాండ్లను తెలియజేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతి పత్రంలో పలువురు నటీనటులు, రచయితలు.... ఇలా మొత్తం 153 మంది సంతకం చేశారు. వీరిలో నటుడు కిచ్చా సుదీప్, నటీమణులు రమ్య, ఆషికా రంగనాథ్, శ్రద్ధా శ్రీనాథ్, ‘ఫైర్’ అధ్యక్షురాలు, దర్శకురాలు, రచయిత కవితా లంకేశ్ వంటివారు ఉన్నారు. ‘‘కేఎఫ్ఐ’ (కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ)లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై సమగ్ర విచారణ జర΄ాలి. కర్ణాటక పరిశ్రమలో పని చేస్తున్న మహిళలకు సురక్షితమైన, సమానమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, వారిపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడానికి సమగ్రమైన చర్యలు చేపట్టాలి’’ అని ఆ వినతి పత్రంలో ‘ఫైర్’ పేర్కొంది. కాగా ‘మీటూ’ ఉద్యమం ఊపందుకున్న సమయంలో 2018లో ‘ఫైర్’ సంస్థ ఆరంభమైంది. దేశంలోనే మొట్టమొదట ‘ఐసీసీ’ (పరిశ్రమలో జరుగుతున్న అంతర్గత ఫిర్యాదుల కమిటీ)ని స్థాపించడంలో ‘ఫైర్’ కీలక ΄ాత్ర ΄ోషించింది. లైంగిక వేధింపులకు గురైనవారికి న్యాయ సహాయం అందించడానికి ‘ఫైర్’ కృషి చేస్తూ వస్తోంది. అందరం మాట్లాడుకుంటున్నాము కానీ... – సమంతమలయాళ చిత్ర పరిశ్రమలోని జస్టిస్ హేమా కమిటీ తరహాలో తెలుగులోనూ ఓ కమిటీ రావాలని, తెలుగు ఇండస్ట్రీలో మహిళల కోసం ఏర్పాటు చేయబడిన 2019 సబ్ కమిటీ నివేదికను బయట పెట్టాలని సమంత ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. తాజాగా సమంత ఇన్‌స్టాలో షేర్ చేసిన మరో ΄ోస్ట్ వైరల్ అవుతోంది. ‘‘ఆగస్టు నెల గడిచి΄ోయింది. 2012లో జరిగిన హత్యాచార ఘటన తరహాలోనే ఇటీవల కోల్‌కతాలోనూ జరిగింది... ఘటనలు జరుగుతున్నాయి. వీటి గురించి మనందరం మాట్లాడుకుంటున్నాం. ఈ ఘటనల హైప్ మెల్లిగా తగ్గి΄ోతుంది. మనం కూడా మన పనులతో ముందుకెళ్తుంటాం. మళ్లీ ఘటన జరుగుతుంది’’ అంటూ సమంత ఆ ΄ోస్ట్‌లో షేర్ చేశారు. ఇదిలా ఉంటే... తాను గాయపడ్డ విషయాన్ని తెలియజేస్తూ సమంత ఇన్‌స్టాలో మరో ΄ోస్ట్ షేర్ చేశారు. ‘‘గాయాలు లేకుండా నేను యాక్షన్ స్టార్ కాలేనా?’’ అంటూ సమంత ఆ ΄ోస్ట్‌లో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఆమె ఏదో సినిమా సెట్లో గాయపడి ఉంటారని ఊహించవచ్చు. -
ఏఐ టెక్నాలజీ వస్తే చిత్రపరిశ్రమలో జరిగేది ఇదే: రామజోగయ్య శాస్త్రి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రభావం అన్ని రంగాల్లో ఏ మేరకు ఉంటుంది? కొందరు ఉపాధి కోల్పోయేలా చేస్తుందా? వంటి చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. సినిమా రంగంపైనా ఏఐ ప్రభావం భారీగా ఉంటుందన్నది కొందరి ఊహ. ముఖ్యంగా మ్యూజిక్ విభాగంపై ఎక్కువ ప్రభావం పడుతుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ అంశంపై ఇటీవల ‘సాక్షి’ సినిమా పేజీలో ఓ కథనం కూడా ప్రచురితమైంది. తాజాగా ‘స్టార్ రైటర్స్’ చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి ‘ఏఐ’ గురించి తమ అభిప్రాయాలను ‘సాక్షి’తో ఈ విధంగా పంచుకున్నారు.అది మనకు బానిస.... మనం బాస్ – చంద్రబోస్ మనిషి కంటే.. మనిషి మేధస్సు కంటే ఏదీ గొప్పది కాదు. కాక΄ోతే కొత్త కొత్త ఆవిష్కరణలన్నీ కూడా మనిషికి సాయం చేయడానికే కనిపెట్టబడుతున్నాయి. మనిషిని కొల్లగొట్టడానికి, కూల్చేయడానికి కాదు. ఈ కోణంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆహ్వానిస్తే అన్నీ మంచి ఫలితాలే వస్తాయి. నిజమే... అన్నింటా ఏఐ పరిజ్ఞానంపై చర్చ జరుగుతోంది... కాదనడం లేదు. సెల్‌ఫోన్ చాలా రకాల పనుల్ని చేస్తోంది. అందులో ఉన్న కెమెరాలతో ఫొటోలు, వీడియోలు తీసుకుంటున్నాం. అయినా బయట ఫొటో, వీడియో స్టూడియోలు ఉన్నాయి. అందులో సరికొత్త నిపుణులు పుట్టుకొచ్చారు. ఇంకా పెద్దగా అది విస్తరించింది. చాలా మందికి ఉపాధి లభిస్తోంది. ఏ వస్తువొచ్చినా కూడా మనిషి మాత్రమే ప్రత్యేకంగా చేయగలిగింది ఒకటుంటుంది.కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు. దాంతో (టెక్నాలజీ) మనం చాకిరీ చేయించుకోవాలి. బానిసలాగా ఆ కొత్త పరిజ్ఞానాన్ని వాడుకోవాలి. అక్కడే మనిషి ప్రతిభ తెలుస్తుంది. అది బాణీలు కట్టి సాహిత్యాన్నిస్తుంటే.. దాన్నుంచి వందల కొద్దీ బాణీలు తీసుకుని అందులోని ఆత్మను ఎంపిక చేసి దానికి మనం మెరుగులు అద్దుకోవాలి. ఉదాహరణకు కంప్యూటర్ వల్ల మనకు ఎంతో సమయం ఆదా అవుతోంంది. అలా ఆదా అయిన సమయాన్ని వేరే దానికి మళ్లిస్తున్నాం. అలాగే సంగీతంలో కూడా ఏఐ ఇచ్చే ట్యూన్ల నుంచి మంచిది ఎంపిక చేసుకుని దానికి మన సృజనాత్మకతను జోడించి ఏఐ కూడా చేయలేని సరికొత్త రాగాన్ని సృష్టించాలి. అంతే కానీ ఎవరి ఉద్యోగాలూపోవు. ఎవరి పనులూ ఆగిపోవు. అదేమీ దేవుడు కాదు.కాకపోతే దాన్ని అర్థం చేసుకోవాలి. కంప్యూటర్ వచ్చినప్పుడు అందరి ఉద్యోగాలూపోతాయన్నారు.. మరి కంప్యూటరే లక్షల ఉద్యోగాల్ని క్రియేట్ చేసింది. ఒకప్పుడు పేపర్ మీద పాట రాసుకునేవాడ్ని. ఇప్పుడు రిమార్కర్ అనే సాంకేతికత ద్వారా రాసుకుంటున్నా. ఒకప్పుడు తప్పులొస్తే తుడిచేయడానికి వైట్ మార్కర్‌తో కొట్టేయాల్సి వచ్చేది. ఇప్పుడు రిమార్కర్పైన ఆ సమస్యే లేదు. అందుకే ఏ సాంకేతికతనైనా విశాల హృదయంతో స్వీకరించినప్పుడే అది మనకు ఉపయోగపడుతుంది. దానిని సరిగ్గా వాడుకోవడం తెలుసుకుంటే అది మనకు బానిసే అవుతుంది.. దానికి మనం బాసే అవుతాం. ఏఐ ఆత్మను ఆవిష్కరించగలదా? – రామజోగయ్య శాస్త్రి మనం సంధి కాలంలో ఉన్నాం. నేను రోళ్లు చూశాను.. మిక్సీలు చూశాను. మార్పును తిరస్కరించలేం. టెక్నాలజీ పరంగా ఎదగాల్సిందే. అయితే.. దేనిని ఎంత మేర వాడుకోవాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు పంచాంగం చూడాలంటే ఫోనులో ‘మెటా’ని అడిగినా చెబుతుంది. అదే ఫోన్‌ను మంచికీ చెడుకీ వాడొచ్చు. సో.. టెక్నాలజీని తప్పనిసరిగా స్వాగతించాల్సిందే. పాటలు లేకుండా సినిమాలు ఆడతాయని కొందరు అన్న సందర్భాలు ఉన్నాయి. మరి జరిగిందా? సో.. తెలుగువాళ్లను సినిమాల నుంచి వేరు చేయలేము... పాటల నుంచీ వేరు చేయలేము. పల్లెల్లో పని చేసుకునేవాళ్లు తమకొచ్చినది పాడుతుంటారు. వాటిల్లోనూ మంచి ట్యూన్లుంటాయి. అలాగే హైదరాబాద్‌లోనే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లున్నారు.కూచోబెట్టి 15 ట్యూన్లు అలవోకగా పాడేవాళ్లుంటారు. అంతటితో అయి΄ోతుందా.. దానికి పరిపుష్టి చేకూర్చేలా వాయిద్యాల సహకారం ప్లాన్ చేయటం, పాడించడం వంటివన్నీ ఉంటాయి కదా. ఓ ట్యూన్ జనరేట్ చేసి ఆర్కెస్ట్రైజేషన్ చేస్తే సరిపోతుందా? అది నచ్చాలి కదా.. తుది మెరుగులు దిద్దితేనే అది బాగుంటుంది. ‘లాభం ఎంతొచ్చిందమ్మా సౌభాగ్యం అమ్మేశాక...’ (‘శుభలగ్నం’లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ‘చిలుకా ఏ తోడు లేక...’ పాటను ఉద్దేశించి) అనే పాటను ఏఐ ఇవ్వగలదా? ఒక మనిషి తాలూకు భావనను పరికించి.. పరిశీలించి.. ప్రతిస్పందించి ఇవ్వగలిగేది మనిషి, మనసు మాత్రమే. ఆ మనసు ఏఐకి ఉందా? సినీ ఇండస్ట్రీలో పర్ఫెక్షన్ కోసం ఏమిచ్చినా ఇంకా ఏదో కావాలంటాం.80 శాతం ఫలితమొచ్చినా దాన్ని వంద శాతం తీసుకొచ్చేందుకు మళ్లీ ఓ మనిషి కావాల్సిందే. యంత్రాలొచ్చినప్పుడు కార్మికులకు పనిపోతుందనుకున్నాం..పోయిందా..? ఏఐ కావాల్సిందే.. అదే పనిగా ఏఐతో పది పదిహేను సినిమాలు చేస్తే బోర్ కొట్టేస్తుంది. అప్పుడు మళ్లీ మనుషులే కావాల్సి వస్తారు. పాట అనేది ఆత్మకు సంబంధించిన అంశం. ఇవాళ ఉన్న టెక్నాలజీతో ప్రతి శబ్దాన్ని వర్చ్యువల్‌గా సృష్టించవచ్చు. వయొలిన్, కీ బోర్డ్, మృదంగం ఇలా... కానీ దానిని లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ శబ్దాలతో మళ్లీ రీ ప్లేస్ చేస్తారు. అలాంటప్పుడు మృదంగం, వయొలిన్ విద్వాంసుల ఉద్యోగాలు ఎప్పుడోపోయుండాలి. ఏదైనా ఆర్గానిక్‌గా వచ్చే దాని అందమే వేరు. సాహిత్యం విషయంలోనూ అంతే. మనిషి అనుభవంతో పలికే పదాలుంటాయి. వాటిని ఏఐ నుంచి ఎలా ఆశించగలం? కొన్నింటిని మనిషే పుట్టించగలడు.. ఏదోప్రాస కోసం వెదుకుతున్నప్పుడు కొన్ని పదాలను ఏఐ ఇవ్వచ్చేమోగాని పాట యొక్క ఆత్మను ఏఐ ఆవిష్కరించలేదు కదా. -
సినీ సంగీతంపై ఏఐ పిడుగు?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)... ఇప్పుడు ఎక్కడ చూసినా దీని పైనే చర్చ. ఇప్పటికే పలు రంగాల్లో దీని ప్రభావం మొదలైంది. ఇప్పుడు సినిమా రంగంపైనా ఏఐ తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ అందుబాటులోకి వచ్చిన ఏఐ టెక్నాలజీతో సినిమాకు సంబంధించిన మ్యూజిక్ విభాగం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోందని టాక్. మ్యూజిక్ డైరక్టర్లపై, ఆ విభాగానికి చెందినవారిపై ఏఐ తీవ్ర ప్రభావం చూపనుందనే ఊహాగానాలు ఉన్నాయి.ఓ సినిమాకు సంగీతం అందించడమంటే సంగీతదర్శకుడు ఆ చిత్రకథ వినాలి... అతనిచ్చే ట్యూన్స్ డైరక్టర్‌తోపాటు నిర్మాత, హీరోలకూ నచ్చాలి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో డైరక్టర్ సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాలి. సినిమా స్థాయిని బట్టిæనెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు కూడా పట్టొచ్చు. పాటలు, ఆర్ఆర్, ట్రైలర్లు, గ్లింప్స్, బీజియమ్స్, ప్రమోషన్ వీడియోలు ఇలా చాలా రకాలు తయారు చేయాల్సి ఉంటుంది. దీనికోసం మ్యూజిక్ డైరక్టర్ వద్ద పదుల సంఖ్యలో ఆర్టిస్టులు పని చేయాల్సి ఉంటుంది. అలాగే చాలామంది టెక్నీషియన్లు కూడా పని చేస్తారు. స్టూడియో బాయ్ నుంచి సౌండ్ ఇంజినీర్స్ వరకు చాలా మంది అవసరం ఉంటుంది. దీనికోసం రెమ్యునరేషన్ రూపంలో నిర్మాత నుంచి మ్యూజిక్ డైరక్టర్‌కు భారీగానే డబ్బూ అందుతుంది. ఇందులో కొంత మొత్తాన్ని ఆర్టిస్టులకు పారితోషికం రూపంలో, కొందరికి జీతాల రూపంలో ఇస్తుంటారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఈ మొత్తం వ్యవస్థే ప్రమాదంలో పడే చాన్స్ కనిపిస్తోంది. ఏఐ మ్యూజిక్ యాప్స్..నెట్టింట్లో కొన్ని రకాల ఏఐ మ్యూజిక్ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఉంటే మ్యూజిక్ డైరక్టర్ అవసరమే ఉండదంటున్నారు. వీటి ప్రత్యేకత ఏంటంటే... మనం లిరిక్స్ ఇస్తే చాలు క్షణాల్లో పాట తయారై΄ోతుంది. ట్యూన్ కట్టి సింగర్ వాయిస్, మ్యూజిక్‌తో సహా ఇచ్చేస్తుంది. మనం చేయాల్సిందల్లా... మనకు ఎటువంటి ట్యూన్ కావాలి, ఎవరి వాయిస్ కావాలి వంటి రిఫరెన్స్ ఇస్తే చాలు. ఉదాహరణకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాయిస్‌తో పాట కావాలని ఇస్తే క్షణాల్లో ఆయన గాత్రంతో పాట ప్రత్యక్షమవుతుంది. రకరకాల ఇన్ స్ట్రుమెంట్స్తో మ్యూజిక్, సింగర్ వెర్షన్ తో సహా సాంగ్‌ను వినిపిస్తుంది... అది కూడా వందల రకాల ట్యూన్స్‌లో. మనకు ఏ ట్యూన్ నచ్చితే దాన్ని ఎంచుకోవచ్చు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్‌గోపాల్ వర్మ అటువంటి మ్యూజిక్ యాప్‌ను ఉపయోగించి పాటల్ని వినిపించారు.సాహిత్యం కూడా.. సంగీతమే కాదు సాహిత్యాన్ని కూడా ఇచ్చే యాప్స్ అందుబాటులోకి వచ్చేశాయట. మనకు ఏ అంశంపై పాట కావాలి... ఎటువంటి పదాలు అందులో ఉండాలి వంటి హింట్స్ ఇస్తే చాలు.. పాట సాహిత్యం కూడా క్షణాల్లో చేతికొస్తుంది. ఇదే కాదు... వీఎఫ్ఎక్స్ వంటి పనులు కూడా ఏఐతో చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే సినీ రంగంపై ఏఐ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.– దాచేపల్లి సురేష్ కుమార్యంత్రం పాడితే యాంత్రికంగానే ఉంటుంది – రచయిత భాస్కరభట్ల రవికుమార్సాహిత్యం, మ్యూజిక్‌లపై ఏఐ టెక్నాలజీ ప్రభావం తక్కువగా ఉంటుందని నా ఫీలింగ్. యంత్రాల సహాయం తీసుకుంటారు కానీ పాటలు రాయడమనేది యాంత్రికం కాదు. మనిషి మెదడు గొప్పది. మనిషి యంత్రాన్ని తయారు చేశాడు. కానీ మనిషిలా యంత్రం రాయలేదు... పాటలు పాడలేదు. యంత్రం పాడే పాటలు యాంత్రికంగానే ఉంటాయి. తబలా ప్లేయర్స్, కీ బోర్డ్ ప్లేయర్స్ చేసే పనిని యంత్రం చేయలేదు. రోబోలు పనులు చేస్తున్నాయి కదా అని అందరూ రోబోలను పెట్టుకోలేదు కదా! సరదాకి ఏఐతో కొన్ని పాటలను క్రియేట్ చేసి చూసుకోవడమే తప్పితే ఏమీ ఉండదు. పాట అంటే సౌండింగ్ కోసం రాసేది కాదు. అందులో ఆత్మ ఉంటుంది. దర్శకులు సినిమాలోని సందర్భం, బ్యాక్‌డ్రాప్, హీరో–హీరోయిన్ల పాత్రల తీరు తెన్నెలు చెబుతారు. ఎన్నో అంశాలు సమ్మిళితమై ఓ పాట సిద్ధమవుతుంది. పాట ఎలా ఉంటే ఆడియన్స్‌కు నచ్చుతుంది. ఎలాంటి లిరిక్స్ ఈ పాటను వారికి చేరువ చేస్తాయి? ఇలా తర్జనభర్జనలు పడి, రాత్రీ పగలూ కూర్చొని రాసే పాటలు అవి. లవ్ సాంగ్ కావాలంటే... ఏఐ ఆ పాటను ఇచ్చేస్తుంది. కానీ సినిమాల్లో తీసుకుంటారా? ఏఐ వల్ల చరిత్ర మారి΄ోతుందని, ఉపాధి పడి΄ోతుందనే మాటల్లో వాస్తవం లేదు. ఎవర్ని విమర్శించాలి?– సంగీతదర్శకుడు భీమ్స్మనుషులు లేక΄ోతే భూమి ఏమవుతుంది? తల్లి లేక΄ోతే జన్మ ఉంటుందా? ‘మౌనంగానే ఎదగమనీ...’ అని కొన్ని వేల మంది రాస్తే టెక్నాలజీ పుట్టింది. అసలు మనిషి పుట్టాకే దేవుడు పుట్టాడు. దేవుడు పుట్టాకే కులాలు, మతాలు పుట్టాయి. అలాగే టెక్నాలజీని పుట్టించిందీ మనిషే. ఆ టెక్నాలజీయే మనిషి మనుగడను శాసిస్తోంది. మనిషికి మంచి... చెడు... రెండూ ఉంటాయి. దాన్నేం చేయలేం. మరి.. సృష్టించినవారిని విమర్శిద్దామా? పాటిస్తున్నవారిని విమర్శిద్దామా? ఎవర్ని విమర్శించాలి? నాకు ఏఐ మీద అవగాహన లేదు. టెక్నాలజీ తెలియదు. భవిష్యత్తులో నాకు పని లేక΄ోతే అప్పుడు నాకు వచ్చింది నేను చేసుకుంటాను. -
అంధులకు సాయం చేసిన తెలుగు హీరో.. మనసు బంగారం (ఫోటోలు)
-
15 ఏళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్న శృతి హాసన్..
-
పవన్ కళ్యాణ్‌తో సినీ నిర్మాతల భేటీ
సాక్షి, అమరావతి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో తెలుగు సినిమా నిర్మాతలు సోమవారం సమావేశమయ్యారు. విజయవాడలోని పవన్ కళ్యాణ్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో సినిమా రంగానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేశ్, నిర్మాతలు సి.అశ్వనీదత్, అల్లు అరవింద్, ఏఎం రత్నం, ఎస్.రాధాకృష్ణ, దిల్ రాజు, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య, సుప్రియ, ఎన్వీ ప్రసాద్, బన్ని వాసు, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టీజీ విశ్వ ప్రసాద్, వంశీకృష్ణ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ కళ్యాణ్‌కు వివరించామని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమ తరఫున ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని అభినందించడానికి అపాయింట్మెంట్ కోరామన్నారు. సినీ రంగ సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించేందుకు మరోసారి సమావేశమవుతామని చెప్పారు. -
Celebrity Siblings: సినీ ఇండస్ట్రీలో సత్తా చాటిన అన్నదమ్ములు (ఫోటోలు)
-
చిరంజీవి, షారుక్‌ను మించి.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ధనిక కుటుంబం వారిదే! (ఫొటోలు)
-
సినిమా రంగంలోకి ఆదిత్య పాపగారి
తెలుగు సినీ పరిశ్రమ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కంటెంట్‌నే నమ్ముకొని వైవిధ్యమైన సినిమాలు తెరకెక్కిస్తూ హిట్ కొడుతున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది వ్యాపార వేత్తల కన్ను టాలీవుడ్‌పై పడింది. ఇతర రంగాలలో రాణిస్తున్నవారు సినిమా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. డిఫరెంట్ స్టోరీలతో తక్కువ బడ్జెట్లో సినిమాను నిర్మించి విజయం సాధిస్తున్నారు. తాజాగాప్రముఖ రియల్టర్ ఆదిత్య పాపగారి కూడా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమా పరిశ్రమలో రాణించాలని, మంచి సినిమాలు అందించాలనే ఉద్దేశంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. షేక్ స్పియర్ డ్రీమ్స్ ఎల్ఎల్ పీ బ్యానర్ తో, ప్రముఖ దర్శకుడు, నిర్మాత స్వప్నేష్ చింతల తో కలిసి సంయుక్తంగా చిత్రాలు నిర్మించబోతున్నారు. మంచి సినిమాలతో పాటు కొత్తవాళ్లను, ఔత్సాహిక నటీనటులను, రచయితలను, దర్శకులను ప్రొత్సహించాలనేది తన మోటో అని ఆదిత్య పాపగారి అన్నారు. -
మొత్తం సినీ ఇండస్ట్రీకి కలిసొచ్చిన సంక్రాంతి 2024
-
Bollywood Celebrities In Umang 2023: ఉమాంగ్ ముంబై పోలీస్ షోలో మెరిసిన తారలు (ఫొటోలు)
-
నందమూరి బాలయ్య మేకపోతు గాంభీర్యం
చంద్రబాబు నాయుడి అరెస్ట్ పై సినీ పరిశ్రమలో TDP నేతలు మినహా మిగతా ఎవరూ స్పందించకపోవడం పట్ల బావయ్య బాలకృష్ణకు చాలా కోపంగా ఉంది. ఎవరినో అనుకుని ఏం లాభం తమ కుటుంబానికే చెందిన జూనియర్ ఎన్టీయార్ కూడా బాబు అరెస్ట్ ను ఖండించకపోవడం బాలయ్యక జీర్ణం కావడం లేదు. లోప కుత కుత లాడిపోతున్నారు. కానీ పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తూ ఐ డోంట్ కేర్ అంటున్నారు. బాబును అరెస్ట్ చేస్తే మొత్తం సినీ పరిశ్రమలోని కళాకారులంతా షూటింగులు ఆపేసి వీధుల్లోకి వచ్చేసి జనజీవనాన్ని స్తంభింపజేస్తారని బాలయ్య అనుకున్నట్లు ఉంది. అలా జరక్క పోవడంతో ఆయనలో ఫ్రస్ట్రేషన్ తారాస్థాయికి చేరిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రూ.371 కోట్లు లూటీ చేసిన స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్ట్ అయిన మరుక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చేసి ఎనభైలలో ఎన్టీయార్ ను గద్దె దింపినపుడు ప్రజాఉద్యమం చేసిన తరహాలో ఉద్యమాలు చేస్తారని టీడీపీ నేతలు అనుకున్నారు. అయితే జనం మాట దేవుడెరుగు టీడీపీ నేతలు, కార్యకర్తలే చంద్రబాబు అరెస్ట్‌ను పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడే బట్టబయలు చేసిన సంగతి కూడా అందరికీ తెలుసు. ✍️ఇక సామాన్య ప్రజలతో పాటు తెలుగు సినీ పరిశ్రమలో అయితే బాబు అరెస్ట్ ప్రకంపనలు సృష్టించేస్తుందని ఎన్టీయార్ కుటుంబ సభ్యులు అనుకున్నారు. నందమూరి బాలయ్య కూడా అదే ఆశించారు. అయితే వారి అంచనాలకు విరుద్ధంగా సినీ పరిశ్రమలో టిడిపి కార్యకర్తలయిన ముగ్గురు నలుగురు తప్ప ఎవరూ పట్టించుకోలేదు. బాబు అరెస్ట్ ను ఖండించలేదు. టీడీపీ నేత అశ్వనీ దత్, మురళీ మోహన్, టీడీపీ హయాంలో ప్రభుత్వ పదవి అనుభవించిన కె.రాఘవేంద్రరావు, నిర్మాత కె.ఎస్.రామారావు తప్ప ఎవ్వరూ చంద్రబాబు అరెస్ట్ ను పట్టించుకోలేదు. ✍️ఇక నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీయార్ సైతం మౌనంగా ఉండిపోవడంతో నందమూరి నారా కుటుంబాలకు పెద్ద షాకే ఇచ్చింది. ఈ వరుస షాక్ లు నందమూరి బాలకృష్ణకు బాగా కోపాన్ని తెప్పించినట్లున్నాయి. అందుకే సినీ పరిశ్రమలో ఎవ్వరూ బాబు అరెస్ట్ కు స్పందించకపోయినా తాను పట్టించుకోనన్నారు బాలయ్య. అదే విధంగా జూనియర్ ఎన్టీయార్ పేరు ప్రస్తావిస్తూ ఆయన స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అనేశారు. ✍️టాలీవుడ్ లో ఎవరూ కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఎందుకు ఖండించలేదు? అని నందమూరి నారా కుటుంబ సభ్యులు చిర్రు బుర్రు లాడుతున్నారు. అయితే చంద్రబాబును అవినీతి కేసులో అరెస్ట్ చేస్తే మేమెందుకు స్పందించాలి? అని మెజారిటీ సినీ ప్రముఖులు చాలా క్లారిటీతో ప్రశ్నిస్తున్నారు. ✍️ఇక చంద్రబాబు జైలుకెళ్లిన మర్నాడే టిడిపి ఆఫీసులో చంద్రబాబు కుర్చీలో కూర్చున్నారు బాలయ్య. అది చంద్రబాబు నాయుడికి తెలిసి కోప్పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత బాలయ్యకు అచ్చెంనాయుడి కుర్చీ పక్కన కుర్చీ వేయించారట. అంటే నీ స్థానం అక్కడే తప్ప అధ్యక్ష స్థానంలో కాదని చెప్పకనే చెప్పారని పార్టీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ✍️చంద్రబాబు జైల్లో ఉంటే నారా లోకేష్ 20రోజులకు పైగా ఢిల్లీలోనే మకాం వేశారు. ఇపుడాయన సిఐడీ విచారణకు హాజరవ్వాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో బాలయ్య ఏపీలో పార్టీ వ్యవహారాల్లో తలదూరిస్తే పార్టీకి నష్టం అనుకున్నారో ఏమో కానీ ఆయన్ను తెలంగాణా వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. తాజాగా బాలయ్య మాట్లాడుతూ తెలంగాణాలో పూర్తి స్థాయిలో ఎన్నికల్లో పోరాడతామని అన్నారు. బహుశా తెలంగాణాలో పార్టీ ఎలాగూ లేదు కాబట్టి బాలయ్య ఎలాంటి వేషాలు వేసినా పార్టీకి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు కాబట్టి బాలయ్యను తెలంగాణా చూసుకోమని చంద్రబాబే సంకేతాలు ఇచ్చారేమో అని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య తన బావయ్య అరెస్ట్ అయితే ఎవరూ పట్టించుకోరా? అని అగ్గిమీద ఫైర్ అయిపోతున్నారు. :::CNS యాజులు సీనియర్ జర్నలిస్టు -
రొమాంటిక్ హీరో.. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రచారం..
హిందీ సినిమా రంగంలో అయిదు దశాబ్దాలకు పైగా నటుడిగా కొన సాగారు దేవానంద్. ఆయన నటనే స్టైల్‌కు పర్యాయపదంగా నిలిచి పోయింది. నిర్మాతగా, రచయితగా, దర్శకుడిగా కూడా కొనసాగుతూ ఎంతోమంది ప్రతిభావంతుల్ని సినీతెరకు పరిచయం చేశారు. శతజయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆయన సినిమాలు ప్రదర్శితమయ్యాయి. హిందీ ప్రధాన స్రవంతి సినిమాల్లో దేవానంద్‌కు ముందు హుందా అయిన నటులున్నారు. ఆయన తర్వాత కాలంలో కూడా ఎంతో మంది నటులు వచ్చారు. కానీ దేవానంద్ స్టైల్, స్మైల్ విలక్షణమయినవి. ఆయన కదలిక, ఆహార్యం మొత్తంగా ఆయన నటనే స్టైల్‌కు పర్యాయ పదంగా నిలిచిపోయింది. ఆయన సినిమాల్లోని పాటలు నేటికీ జనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉన్నాయి. ‘మై జిందగీ కా సాత్ నిభాతా చలాగయా’, ‘కొయా కొయా చాంద్’, ‘గాతా రహే మేరా దిల్’ లాంటి పాటల్ని ఎవరు మరిచిపోగలరు? ఆ కాలంలో దిలీప్ కుమార్ విషాదాంత పాత్రలకు పర్యాయ పదంగా ఉండి, మధ్యతరగతి ప్రజల్ని, ఆనాటి మేధావుల్ని అలరిస్తున్నాడు. మరో వైపు చార్లీ చాప్లిన్ తరహా ట్రాంప్లా రాజ్ కపూర్ సామాన్య జన జీవితాల్లోకి చొచ్చుకు పోతున్నాడు. ఆ పరిస్థితుల్లో వారిద్దరికీ భిన్నంగా, తనదైన చేతనాత్మకమైన ధోరణితో నిలిచి గెలిచాడు దేవానంద్. సురయ్యా, మధుబాల, వైజయంతిమాల, హేమామాలిని, వహీదా రెహమాన్, నూతన్, గీతా దత్ లాంటి వాళ్ళతో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించాడు. 1923లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో దేవానంద్ జన్మించాడు. పంజాబ్ విశ్వ విద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసుకుని బొంబాయి బయలుదేరాడు. అప్పటికే సినీ రంగంలో కృషి చేస్తున్న సోదరుడు చేతన్ ఆనంద్‌తో కలిసి తన భవిష్యత్తును నిర్మించుకుందామని ఆలోచన. 1946లో ప్రభాత్ వాళ్ళు నిర్మించిన ‘హామ్ ఏక్ హై’తో దేవ్ తన నట జీవితాన్ని ఆరంభించాడు. అప్పుడే గురు దత్తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మిత్రులయ్యారు. తాను నిర్మాతగా మారి దర్శకుడిని చేస్తానని హామీ ఇచ్చాడు. రష్యన్ సినిమా ‘ఇన్స్పెక్టర్ జనరల్’ ప్రేరణతో చేతన్ ఆనంద్ తీసిన ‘అఫ్సర్’తో ఎస్.డి.బర్మన్ను సంగీత దర్శకుడిగా పరి చయం చేశాడు. తర్వాత బాల్ రాజ్ సహానీ స్క్రిప్ట్ ఆధారంగా ‘బాజీ’ తీశాడు. గురుదత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఉర్దూ కవి సాహిర్ లుథియాన్వీ మొదటిసారిగా గీతాలు రాశాడు. ఈ సినిమాతోనే కమెడియన్‌గా జానీ వాకర్ కూడా పరిచయం అయ్యాడు. గీతా రాయ్‌ను గురుదత్, కల్పనా కార్తీక్‌ను దేవా నంద్ ఈ చిత్ర సమయంలోనే కలుసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు జంటలయ్యారు. వహీదా రహ్మాన్‌తో దేవానంద్ అనేక విజయవంతమయిన సినిమాలు చేశాడు. వారిద్దరిదీ అప్పుడు హిందీ సినిమాల్లో గొప్ప హిట్ జంట. ‘సోల్వా సాల్’, ‘గైడ్’, ‘కాలా బాజార్’, ‘బాత్ ఏక్ రాత్ కీ’ వంటి సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోయాయి. ‘గైడ్’ మొట్ట మొదటి ఇండో అమెరికన్ సిన్మాగా రూపొందింది. ఆర్.కె.నారాయణ్ నవల ఆధారంగా తీసిన ఈ సినిమా విమర్శ కుల ప్రశంసల్ని అందుకుంది. నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ముగ్గురు త్రిమూర్తుల్ని– అంటే దేవానంద్, రాజ్‌కపూర్, దిలీప్ కుమార్‌లను తీన్‌మూర్తి భవన్‌కు ప్రత్యేకంగా ఆహ్వానించారు. అయిదు దశాబ్దాలకు పైగా హిందీ సినిమా రంగంలో తనదయిన శైలిలో నటిస్తూ, నిర్మిస్తూ... రచయితగా, దర్శకుడిగా కూడా కొనసాగుతూ... మొండితనంతో, తృష్ణతో తన నిర్మాణ సంస్థ ‘నవకేతన్’ను 52 ఏళ్ళకు పైగా సజీవంగా ఉంచుకున్నాడు దేవానంద్. 2001లో పద్మభూషణ్, 2002లో దాదా సాహెబ్ ఫాల్కే వరించాయి. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నేషనల్ పార్టీ ఆఫ్ ఇండియా పేర రాజకీయ పార్టీని స్థాపించినప్పటికీ దాన్ని ఎక్కువ కాలం నడపలేదు. దేవానంద్ జన్మశతాబ్ది సందర్భంగా దేశ వ్యాప్తంగా 30 నగరాల్లో 55 టాకీసుల్లో ఆయన నటించిన సినిమాలతో ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, ఎన్.ఎఫ్.డి.సి. ఆర్కైవ్స్ ఆధ్వర్యంలో ఇది జరిగింది. వారాల ఆనంద్ వ్యాసకర్త కవి, విమర్శకుడు. 94405 01281 (నేడు నటుడు దేవానంద్ శతజయంతి.) -
వేణువుకు నిర్దిష్ట రూపం ఇచ్చిందెవరు? పాశ్చాత్య సంగీతానికీ అనువుగా మలచినదెవరు?
పన్నాలాల్ ఘోష్.. ఆధునిక వేణుగాన పితామహునిగా పేరొందారు. వేణువును అటు జానపద వాయిద్యాలకు, ఇటు శాస్త్రీయ వాయిద్యాలకు సరితూగేలా మలచారు. పన్నాలాల్ ఘోష్ కృషి కారణంగానే నేటి ఫ్యూజన్ సంగీతంలో వేణువుకు ప్రముఖ స్థానం దక్కింది. పన్నాలాల్ ఘోష్ అనేక సినిమాలకు వాయిద్య సహకారాన్ని కూడా అందించారు. పన్నాలాల్ ఘోష్ బంగ్లాదేశ్‌లోని బరిసాల్‌లో జన్మించారు. అతని అసలు పేరు అమల్ జ్యోతి ఘోష్. అతని తాత హరి కుమార్ ఘోష్, తండ్రి అక్షయ్ కుమార్ ఘోష్ నిష్ణాతులైన సంగీత విద్వాంసులు. పన్నాలాల్ ఘోష్ తల్లి సుకుమారి ప్రముఖ గాయని. పన్నాలాల్ ఘోష్ ప్రారంభ విద్య ప్రసిద్ధ సితార్ వాద్యకారుడైన అతని తండ్రి అక్షయ్ కుమార్ ఘోష్ ఆధ్వర్యంలో మొదలయ్యింది. పన్నాలాల్ ఘోష్ సితార్ వాయించడం ద్వారా తన సంగీత విద్యను ప్రారంభించారు. తరువాతి కాలంలో పన్నాలాల్ ఘోష్ వేణువు వైపు ఆకర్షితులయ్యారు. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ దగ్గర వేణువు పాఠాలు నేర్చుకున్నారు. ప్రఖ్యాత హార్మోనియం వాద్యకారుడు ఉస్తాద్ ఖుషీ మహమ్మద్ ఖాన్ వద్ద రెండేళ్లపాటు సంగీత శిక్షణ తీసుకున్నారు. పన్నాలాల్ ఘోష్ ఆ కాలంలోని గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్, కాజీ నజ్రుల్ ఇస్లాంలకు అమితంగా ప్రభావితులయ్యారు. ఆ సమయంలో పన్నాలాల్ ఘోష్ స్వాతంత్ర్య ఉద్యమానికి సహకరించడమే కాకుండా, బెంగాల్ సమకాలీన సంగీతం, కవిత్వంలో పునరుజ్జీవానికి కూడా విశేష కృషి చేశారు. పన్నాలాల్ ఘోష్ వేణువును అటు జానపద సంగీతం నుండి ఇటు శాస్త్రీయ సంగీతం వరకు వాయించడానికి అనువుగా ఉండేలా సవరించారు. వేణువు పొడవు, పరిమాణం (7 రంధ్రాలతో 32 అంగుళాలు) నిర్థిష్ట రీతిలో ఉండేలా తీర్చిదిద్దారు. ఆయన అనేక కొత్త రాగాలను స్వరపరిచారు. పన్నాలాల్ ఘోష్ శిష్యులలో హరిప్రసాద్ చౌరాసియా, అమీనూర్ రెహమాన్, ఫకీరచంద్ర సామంత్, సుధాంశు చౌదరి, పండిట్ రాష్‌బెహారీ దేశాయ్, బి.జి.కర్నాడ్, చంద్రకాంత్ జోషి, మోహన్ నాద్కర్ణి, నిరంజన్ హల్దీపూర్ తదితరులు ఉన్నారు. అతను తన సంగీత ప్రతిభను మరింత ముందుకు తీసుకెళ్లడానికి 1940లో ముంబైకి చేరుకున్నారు. ముందుగా ‘స్నేహ బంధన్’ (1940) చిత్రానికి స్వర్తకర్తగా వ్యవహరించారు. పన్నాలాల్ ఘోష్ 1952లో ఉస్తాద్ అలీ అక్బర్ ఖాన్, పండిట్ రవిశంకర్‌లతో కలిసి ‘ఆంధియాన్’ చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్‌ను రూపొందించారు. ఏడు రంధ్రాల వేణువును పన్నాలాల్ ఘోష్ తొలిసారిగా పరిచయం చేశాడు. ఈ కొత్త రంధ్రాన్ని మధ్య రంధ్రం అని పిలుస్తారు. చిటికెన వేలు ఈ రంధ్రంలోకి చేరుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఇదేవిధంగా పన్నాలాల్ ఘోష్ 42 అంగుళాల పొడవున్న కేవలం నాలుగు రంధ్రాలతో కూడిన మరో వెదురు వేణువును కనిపెట్టాడు. ఈ వేణువు భారతీయ ఫ్లూట్ పాశ్చాత్య సంగీతాన్ని కూడా ప్లే చేయగలుగుతుంది.పన్నాలాల్ ఘోష్ రూపొందించిన పొడవాటి వెదురు వేణువును హిందుస్థానీ శాస్త్రీయ సంగీతకారులు వాయిస్తుంటారు. ఇది కూడా చదవండి: ఆసియాలో అతిపెద్ద కూరగాయల మార్కెట్ ఏది? ఏ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది? -
యంత్రాలు రీప్లేస్ చేస్తాయి!
‘‘మనందరం ఇప్పుడు ఏకతాటిపై నిలవక΄ోతే కచ్చితంగా మనల్ని యంత్రాలు రీప్లేస్ చేస్తాయి’’ అన్నారు సాగ్–ఆఫ్ట్రా (సీనియర్ యాక్టర్స్ గిల్డ్–అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టెలివిజన్ అండ్ రేడియో ఆర్టిస్ట్స్) అధ్యక్షురాలు ఫ్రాన్ డ్రెస్చెర్. కొన్ని వారాలుగా సమ్మె చేస్తున్న డబ్లు్యజీఏ (రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా)కి పూర్తి మద్దతు ప్రకటించారామె. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ‘‘నటీనటులు అణచివేతకు గురవుతున్నారు. వారికి తగిన గౌరవం దక్కడంలేదు. చిత్రపరిశ్రమలో ఏం జరుగుతుందనేది అందరికీ చాలా ముఖ్యం. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందో మిగతా అన్ని రంగాల్లోని కార్మికులకు అదే జరుగుతోంది. యజమానులు అత్యాశకు ΄ోతున్నారు. యంత్రాలను నడిపించే సహాయకులను (కార్మికులను ఉద్దేశించి) మర్చి΄ోతున్నారు. వారు చేస్తున్న సేవలను గుర్తించడంలేదు. ఇది నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. సీఈవోలకు ఏకంగా వందల మిలియన్ల డాలర్లలో అధిక వేతనాలు ఇవ్వడంవల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇక్కడ బాధితులు ఎవరంటే మేమే (కార్మికులు). వ్యా΄ారంలో ఉన్నవాళ్లు మా పట్ల వ్యవహరిస్తున్న తీరు షాకింగ్‌గా ఉంది’’ అని ఘాటుగా స్పందించారు ఫ్రాన్ డ్రెస్చెర్. తగ్గేదే లే... ‘‘ఏఐ వల్ల ముప్పే’’ అంటూ సమ్మెలో భాగంగా నినాదాలు చేస్తున్నారు. ఇప్పటికే ఏఐ న్యూస్ రీడర్స్ వచ్చిన నేపథ్యంలో ఏఐ వల్ల చిత్రపరిశ్రమలోనూ పెను మార్పు సంభవించే అవకాశం ఉందని హాలీవుడ్ కళాకారులు వా΄ోతున్నారు. అయితే ఏఐ వినియోగాన్ని తగ్గించాలన్న కళాకారుల డిమాండ్‌ని నిర్మాణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. అలాగే నటీనటుల వేతనాలు పెంపుకు కూడా నిర్మాతలు సుముఖత వ్యక్తపరచడంలేదన్నది హాలీవుడ్ టాక్. ఈ నేపథ్యంలో నటీనటులు కూడా తమ డిమాండ్లను ఆమోదించేవరకూ సమ్మె కొనసాగించే తీరాలనీ, తగ్గేదే లే అనే పట్టుదలతో ఉన్నారనీ సమాచారం. -
టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన
బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బాలీవుడ్ నటి అర్చన గౌతమ్. ఆమె ప్రస్తుతం రోహిత్ శెట్టి హోస్ట్ చేస్తున్న ఖత్రోన్ కే ఖిలాడీ షోలో నటిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పుట్టి పెరిగిన ఆమె పని కోసం ముంబైకి వలస వచ్చింది. సినిమా పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. అంతే కాకుండా పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. (ఇదీ చదవండి: కీర్తి సురేష్‌తో ఉన్న వ్యక్తి ఎవరు.. ఫోటో వైరల్?) తను ముంబైలో పీజీ చదువుతున్నప్పుడు సినిమా పరిశ్రమకు చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడిందట.. తనకు సినిమాలపై ఉన్న ఇష్టాన్ని ఆ మహిళ గుర్తించి ఆడిషన్స్‌కు వెళ్లాలనుకుంటున్నావా అని అడగడంతో తన ఆనందానకి రెక్కలు వచ్చినట్లు అయిందని తెలిపింది. కానీ ఆడిషన్స్ కోసం వెళ్తున్నప్పుడు షార్ట్‌లు వేసుకుని వెళ్లాలని, అలా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతావని ఆ మహిళ సలహా ఇచ్చిందట. పై భాగంలో టాప్ కూడా అలాగే షార్ట్‌గా ఉంటే తప్పకుండా సెలెక్ట్ అవుతావని చెప్పడంతో కొంచెం ఇబ్బంది పడినట్లు అర్చన తెలిపింది. (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెస్ రాకతో చిరు ఏం చేయబోతున్నాడంటే..?) ఆమె చెప్పిన మాటలు ఆశ్చర్యం కలిగించినా అదే నిజం అని తర్వాత తెలుసుకున్నట్లు ఆమె తెలిపింది. ఆ తర్వాత ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో కొంతమంది మహిళలు ఎదుర్కొన్న పరిస్థితుల గురించి తెలుసుకున్నా, అలా రోజుకు మూడువేలతో తన ప్రయాణం మొదలైంది అని అర్చన గౌతమ్ చెప్పుకొచ్చింది. -
చిన్న రూమ్ రెంట్‌కు..ఒక్క పూట మాత్రమే తినేవాడిని : శివ బాలాజీ
ఆర్య, చందమామ, శంభో శివ శంభో లాంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు శివబాలాజీ. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అలాగే బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ మొదటి సీజన్లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఇక 2009లో నటి మధుమితను ప్రేమ వివాహం చేసుకొని వార్తల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ యాక్టర్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లతో నటిస్తున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లలతో పడ్డ కష్టాలను వెల్లడించాడు. ‘మా నాన్న చెన్నైలో ఓ కంపెనీ రన్ చేస్తుండేవాడు. చాలామంది మా ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవారు. ఆ సంస్థకి సంబంధించిన వ్యవహారాలు కొన్నాళ్ల పాటు నేను చూసుకున్నాను. (చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాశా: హీరోయిన్) అయితే సినిమాలపై నాకున్న ఇష్టంతో హీరో అవుదామని హైదరాబాద్ రావాలనుకున్నాను. నేను ఇండస్ట్రీలోకి రావడం నాన్నకు ఇష్టంలేదు. చెన్నైలోనే ఉండి బిజినెస్ చూసుకోవాలని ఆయన కోరిక. కానీ నాకు మాత్రం బిజినెస్ నచ్చలేదు. హైదరాబాద్‌కి వచ్చాన కొన్నాళ్ల పాటు సినిమా చాన్స్‌ల కోసం ప్రయత్నించాను. ఓ సారి నాన్నకు ఫోన్ చేస్తే.. ‘అక్కడే ఉండు’అంటూ కోపంగా ఫోన్ పెట్టేశాడు. (చదవండి: పెళ్లి చేసుకుంటే అమ్మ చనిపోంతుందని చెప్పారు: శివ బాలాజీ ) నా ప్రయత్నాలు ఫలించి 'ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ'లో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాకి పారితోషికంగా నాకు 40 వేలు ఇచ్చారు. షూటింగ్ అయ్యాక చిన్న రూమ్‌ని రెంట్‌కి తీసుకున్నాడు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోతున్నాయి కానీ సినిమా అవకాశాలు రావట్లేదు. రోజుకు ఒక్క పూట మాత్రమే తినేవాడిని. మేల్కొని ఉంటే ఎక్కడ ఆకలి అవుతుందోనని త్వరగా పడుకొని లేటుగా నిద్ర లేచేవాడిని. మంచి నీళ్లు తాగుతూ గడిపిన రోజులు ఉన్నాయి. ఒక నెల రోజుల పాటు చాలా కష్టపడ్డాను. నా బాధలు చూసి అమ్మని నా దగ్గరికి పంపించాడు నాన్న. ఆ తర్వాత ఓ పెద్దింటికి షిఫ్ట్ అయ్యాం’ అంటూ శివ బాలాజీ ఎమోషనల్ అయ్యాడు. -
సౌత్ వర్సెస్ బాలీవుడ్.. ఐశ్వర్యరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘‘ఓ సినిమాను నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విభజించి చూడలేదు. ఏ సినిమా అయినా అది భారతీయ సినిమాగానే భావిస్తాను’’ అన్నారు ఐశ్వర్యా రాయ్. ‘ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాల పాపులారిటీ ఎక్కువగా ఉందనీ, ఉత్తరాదిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ ఆధిపత్యం చలాయిస్తుందనీ కొందరు అనుకుంటున్నారు. వీటిని మీరు అంగీకరిస్తారా?’ అనే ప్రశ్నలు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్యకి ఎదురయ్యాయి. దీనిపై ఐశ్వర్యా రాయ్ స్పందిస్తూ– ‘‘ఏ రంగంలో అయినా పోటీ ఉన్నట్లే చిత్ర పరిశ్రమలోనూ ఒక ఇండస్ట్రీకి మరొక ఇండస్ట్రీకి మధ్య పోటీ ఉంటుంది. అయితే కళాకారుల మధ్య అలాంటి భేదాలుండవు. నేనెప్పుడూ దక్షిణాది, ఉత్తరాది అని విడిగా చూడలేదు. ఏ సినిమా అయినా భారతీయ చిత్రంగానే భావిస్తాను. ఒకదానిపై మరొకటి ఆధిపత్యం చలాయిస్తుందనే అభిప్రాయాన్ని అంగీకరించను. ఒకచోట అవకాశాలు రాకపోతే మరొక చోట ప్రయత్నించవచ్చు. అక్కడ కూడా రాకపోతే వేరే ఇండస్ట్రీలోకి వెళ్లొచ్చు. కళకు, కళాకారులకు ఎక్కడైనా గౌరవం ఉంటుంది. పని చేసే ప్రతి సినిమా నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు. దక్షిణాదిలో మణిరత్నంగారు, శంకర్‌గారు.. వంటి పెద్ద దర్శకులతో మంచి సినిమాలు చేసే అవకాశం నాకు వచ్చింది’’ అన్నారు ఐశ్వర్య. -
CII Dakshin Summit 2023: చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తాం
‘‘చిత్ర పరిశ్రమకు చెందిన చిన్న చిన్న సమస్యలను ఈ వేదికపై చెప్పారు. వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటాం. పైరసీని అరికట్టే విధంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చాం. అదే విధంగా జీఎస్టీ విషయంలో ఒకే పన్ను విధానాన్ని చట్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. చిత్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరిస్తాం’’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ అన్నారు. సీఐఐ దక్షిణ్ సమ్మిట్ ముగింపు కార్యక్రమం గురువారం సాయంత్రం చెన్నైలోజరిగింది. సీఐఐ చైర్మన్ టీజీ త్యాగరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫెప్సీ అధ్యక్షుడు ఆర్కే సెల్వమణి, నటుడు ధనుష్, నటి శోభన, కమల్‌బాలి తదితరులు పాల్గొన్నారు. ఇందులో ముఖ్య అతిథిగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్ పాల్గొన్నారు. కాగా సీఐఐ దక్షిణ్ నిర్వాహకులు చిరంజీవికి ఐకాన్ అవార్డును, తమిళ నటుడు ధనుష్‌కు యూత్ ఐకాన్ అవార్డును ప్రకటించారు. చిరంజీవి హాజరు కాకపోవడంతో ఆయన అవార్డును సుహాసిని అందుకున్నారు. ఈ వేడుకలో పాల్గొనలేకపోయినందుకు క్షమాపణ తెలుపుతూ చిరంజీవి వీడియోను షేర్ చేశారు. -
పాన్ వరల్డ్ మేనియాకి సీక్వెల్ ప్రాణం పోస్తుందా..?
-
గతంలో చాలా విషయాలు నన్ను బాధపెట్టాయి : సమంత
ఏమాయ చేశావే సినిమాతో వెండితెరకు పరిచమయైన హీరోయిన్ సమంత. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న సమంత జెస్సీ పాత్రలో యూత్‌ను మెస్మరైజ్ చేసింది. ఒక్క సినిమాతోనే బోలెడంత క్రేజ్ సంపాదించుకున్న సమంత ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. తాజాగా ఏమాయ చేశావే సినిమా విడుదలై 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా తన సినీ జర్నీపై సామ్ ఎమోషనల్ అయ్యింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేస్తూ.. మీరంతా నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. అందుకు ధన్యవాదాలు. గతంలో ఎన్నో విషయాలు నన్ను బాధపెట్టాయి. కానీ ఇప్పుడలా జరగదు. కేవలం ప్రేమ, కృతజ్ఞతతో మాత్రమే ముందుకు సాగుతున్నా అంటూ సామ్ పేర్కొంది. సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్‌గా 13ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు సమంతకు పలువురు ప్రముఖులు, నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రస్తుతం సమంత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సిటీడెల్ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: విడాకుల తర్వాత తొలిసారి సమంతతో ఉన్న ఫోటో షేర్ చేసిన చై -
విడాకుల తర్వాత తొలిసారి సమంతతో ఉన్న ఫోటో షేర్ చేసిన చై
సమంత-నాగచైతన్య తొలిసారి నటించిన సినిమా ఏమాయ చేశావే. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సమంత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే జెస్సీగా అలరించి కుర్రాళ్ల మనసు దోచుకుంది. అంతేకాదు ఇండస్ట్రీలోనూ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గానూ క్రేజ్ సంపాదించుకుంది. నాగ చైతన్య అంతకుముందే జోష్ అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైనా ఏమాయ చేశావే సినిమాతోనే తొలి హిట్ అందుకున్నాడు. తెరపైనే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ చై-సామ్‌ల జోడికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా సెట్స్‌లోనే వీరిద్దరి మధ్య స్నేహం చిగురించింది. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో 2021, అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు. టాలీవుడ్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారన్నది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. నాగచైతన్యతో విడాకుల తర్వాత అతనితో దిగిన ఫోటోలన్నింటిని సామ్ తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. అటు చై కూడా విడాకుల తర్వాత సామ్‌కు సంబంధించి ఎలాంటి పోస్టులు చేయలేదు. అయితే తాజాగా ఏమాయ చేశావే సినిమా వచ్చి నేటితో 13ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ మూవీలో సమంతతో దిగిన ఓ ఫోటోను నాగచైతన్య తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. సెలబ్రేటింగ్ 13ఇయర్స్ అంటూ పోస్ట్ చేశాడు. సమంత కూడా ఏమాయ చేశావేకు పదమూడేళ్లు అంటూ పలు ఫోటోలను షేర్ చేసినా అందులో కేవలం తన ఫోటోలు మాత్రమే నెట్టింట పోస్ట్ చేసింది. దీంతో ఇద్దరి ఇన్‌స్టా పోస్టులు ఇప్పుడు మరోసారి హాట్‌టాపిక్‌గా మారాయి. ❤️🫠#Yemaayachesave pic.twitter.com/9UL9j1528c — Movie Muthyam (@MovieMuthyam) July 22, 2022 -
పన్నెండేళ్లు పూర్తి చేసుకున్న ఆది సాయికుమార్
డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన హీరో ఆది సాయికుమార్. ప్రేమకావాలి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో పన్నెండేళ్లు పూర్తయ్యింది. ఈ పుష్కరకాలంలో ఆయన ఎన్నెన్నో ప్రయోగాలు చేశారు. ఫలితంతో సంబంధం లేకుండా అభిమానుల్ని అలరించడానికి డిఫరెంట్ జానర్స్‌ను ప్రయత్నిస్తూనే వచ్చాడు. ఆయన కెరీర్లో ప్రేమ కావాలి, లవ్లీ, సుకుమారుడు, శమంతకమణి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ, శశి ఇలా అనేక రకాల కాన్సెప్టులతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో ముందుకు వచ్చాడు. కానీ కరోనా వల్ల ఆది నటించిన సినిమాలు కాస్త ఆలస్యం అయ్యాయి. దీంతో గత ఏడాది తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో,బ్లాక్ అతిథి దేవో భవ, టాప్ గేర్ అంటూ ఇలా వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చివరగా వచ్చిన టాప్ గేర్ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఆది సాయి కుమార్ ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చారు. పులి మేక అనే వెబ్ సిరీస్‌లో ఆది సాయి కుమార్ నటించారు. ప్రస్తుతం ఈ పులి మేక వెబ్ సిరీస్ జీ5లో ట్రెండ్ అవుతోంది. ఫోరెన్సిక్ టీమ్ హెడ్ ప్రభాకర్ శర్మ పాత్రలో ఆది కనిపించిన తీరు, నటించిన సీన్ల గురించి అంతా చర్చించుకుంటున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇలా ఓటీటీలోనూ నటించి ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చారు.త్వరలోనే ఆది నుంచి రాబోతున్న కొత్త ప్రాజెక్టుల వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు. -
ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పనున్న సాయిపల్లవి? క్లారిటీ ఇచ్చిన నటి
తమిళసినిమా: సాయిపల్లవి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సహజత్వంతో కూడిన నటనకు ఈమె చిరునామా. పరిచయమైన తొలి చిత్రం ప్రేమమ్‌తోనే టీచర్ పాత్రకు జీవం పోసి తనేంటో నిరూపించుకున్నారు. ఆ తరువాత గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళంలో ఎక్కువగా చిత్రాలు చేయకపోయినా, తెలుగులో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రముఖ నటిగా రాణిస్తున్నారు. అయితే ఆమె గురించి అభిమానులు జీర్ణించుకోలేని వార్తలు ఇటీవల కొన్ని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సాయిపల్లవి నటనకు స్వస్తి పలికి వైద్య రంగంలో సేవలను అందించాలని నిర్ణయించుకున్నట్లు.. అందుకు ఒక ఆసుపత్రిని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. సాయి పల్లవి సినిమాల్లో నటించి చాలా కాలం అయ్యింది. తెలుగులో వచ్చిన కొన్ని అవకాశాలను ఆమె తిరస్కరించారు. గార్గీ చిత్రం తరువాత సాయి పల్లవిని తెరపై చూడలేదు. ఈ కారణంగానే ఆమెపై వదంతులు వస్తున్నాయి. ఈ సందర్భంగా సాయి పల్లవి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. తాను ఎంబీబీఎస్ చదివినా నటి కావాలని ఆశించానన్నారు. దీనికి తన ఆశను తల్లిదండ్రులు అడ్డుకోలేదన్నారు. అందం అన్నది రూపంలో కాదని గుణంలో ఉందని చెప్పే ప్రేమమ్ చిత్రంతో నటిగా తన సినీప్రయాణం ప్రారంభమైందని చెప్పారు. ఆ చిత్రం అంత పెద్ద విజయం సాధిస్తుందని ముందు ఊహించలేదన్నారు. అయితే ఆ చిత్రంలో టీచర్ ఇమేజ్ను మార్చడానికి వేరే తరహా పాత్రల్లో నటించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పారు. తాను నటించిన చిత్రాలు, తన పాత్రలు ప్రేక్షకులకు నచ్చాలనే భావిస్తానన్నారు. తనను అందరూ తమ ఇంటి ఆడపడుచుగా భావించడం సంతోషంగా ఉందని అన్నారు. మంచి కథలు లభిస్తే భాషాభేదం లేకుండా నటించడానికి సిద్ధమని సాయి పల్లవి పేర్కొన్నారు. -
సినీ కార్మికులకు అండగా ఉంటాం
మణికొండ: సినీ రంగానికి చెందిన కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ భరోసానిచ్చారు. గురువారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ ఎం పభ్రాకర్రెడ్డి చిత్రపురి కాలనీలో 1176 ఎంఐజీ గృహాలు , 180 హెచ్ఐజీ డ్యూప్లెక్స్ విల్లాలకు సంబంధించి లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. లబ్ధిదారులు సామూహిక గృహా ప్రవేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభకి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ చిత్రపరిశ్రమకి చెందిన 24 విభాగాలలో ఉపాధి పొందుతున్న వేలాది మంది కార్మికుల సొంత ఇంటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో సీనియర్ నటులు దివంగత ప్రభాకర్‌రెడ్డి కృషితో ప్రభుత్వం ఇక్కడ స్థలం కేటాయించిందన్నారు. ఈ కాలనీలో ఇప్పటికే రూ. 20కోట్లతో రోడ్లను వేశామనీ, ఇక్కడి ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సినీ పరిశ్రమ పెద్దలతో కలిసి కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటికే బస్తీ దవాఖాన మంజూరు చేశామన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా గృహ నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిన కమిటీని మంత్రిఅభినందించారు. పరిశ్రమకు నేను పెద్దను కాదు: చిరంజీవి సినీ పరిశ్రమకు తాను పెద్దను కానని, కొందరు తమ వయసును తగ్గించుకునేందుకు తనను అలా అంటున్నారనిపిస్తోందని మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యానించారు. తను పరిశ్రమలో ఒకనిగా ఎదిగానని, ఎక్కడా పెద్దరికం చేయలేదన్నారు. సినీ పరిశ్రమ తాను అనుకున్న దానికన్నా అధికంగానే ఇచ్చిందని, ఇక నుంచి నావంతుగా సినీ కార్మికులకు సహాయం చేస్తానని చిరంజీవి హామీనిచ్చారు. సొసైటీ లోటు బడ్జెట్‌తో ఉన్నా.. ఎన్నో ఇబ్బందులు వచ్చినా పరిశ్రమ, ప్రభుత్వ పెద్దలు అండగా ఉండటంతోనే గృహనిర్మాణాలు పూర్తి చేయగలిగామని చిత్రపురి హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ చెప్పారు. -
ఇళ్ల నిర్మాణంలో అవినీతి గురించి నాకు తెలియదు.. చిరు కీలక వ్యాఖ్యలు
పెద్దరికం అనుభవించాలని తనకు లేదని, ఇండస్ట్రీలో తనకంటే పెద్దవాళ్లు చాలామంది ఉన్నారని చిరంజీవి అన్నారు. చిత్రపురి కాలనీ ఎంఐజీ, హెచ్ఐజీ ప్లాట్ల సామూహిక గృహ ప్రవేశ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ''సినీ కార్మికులకు సొంత ఇల్లు ఉండటం అదృష్టంగా భావిస్తున్నాను.అనిల్, దొరై ఎంతో కష్టపడి గృహా సముదాయాన్ని పూర్తి చేశారు.దాసరి నారాయణ, రాఘవేంద్రరావు వంటి పెద్దలు దీనికి చాలా కృషి చేశారు. ఎం. ప్రభాకర్ రెడ్డి దూరదృష్టి వల్లే కార్మికుల కల సాకారమైంది.భారతదేశంలో ఎక్కడా ఇలాంటి గృహసముదాయం లేదు. ఇక చిత్రపురి కాలనీలో అవినీతి, అవకతవకలు జరిగాయని అన్నారు.. కానీ ఆ విషయం గురించి నాకు తెలియదు కాబట్టి మాట్లాడటం అసంబద్ధమే అవుతుంది. సినీ కార్మికులకు ఎప్పుడు, ఏ సహాయం కావాలన్నా నేను సపోర్ట్‌గా ఉంటాను. కార్మికులకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా భుజంకాస్తా. కోరుకున్న దానికంటే భగవంతుడు నాకు ఎక్కువే ఇచ్చాడు. నన్ను అందరూ చిత్ర పరిశ్రమకు పెద్దోడు అంటున్నారు.పెద్దరికం అనుభవించాలని నాకు లేదు నాకంటే చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్లు చిన్నవాళ్లుగా చెప్పుకుంటూ నన్ను పెద్ద చేస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదములు'' అంటూ పేర్కొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రిష.. ఇప్పటికీ అదే క్రేజ్
సినీ రంగంలో 70 ఏళ్ల హీరోలు కూడా 20 ఏళ్ల హీరోయిన్లతో డ్యూయెట్లు పాడుతుంటారు. అయితే హీరోయిన్లకు 30 ఏళ్లు దాటినా, వివాహం చేసుకున్నా పక్కన పెట్టేస్తారు. ఆ తర్వాత వారికి అక్క, వదిన, అమ్మ పాత్రలు ఇస్తుంటారు. అయితే ఇటీవల ఆ పరిస్థితి మారిందని చెప్పాలి. 30 ఏళ్లు దాటినా, వివాహం చేసుకున్నా పాపులారిటీ కలిగిన హీరోయిన్లకు అవకాశాలు వస్తున్నాయి. నటి త్రిష ఈ కోవకు చెందినదే. ఈ చెన్నై బ్యూటీ నటిగానే 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2002 సంవత్సరంలో మౌనం పేసి యది చిత్రంలో సూర్యకు జంటగా హీరోయిన్గా పరిచయం అయింది. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ క్రేజీ కథానాయికగా రాణిస్తోంది. ఇటీవల ఈమె నటించిన పొన్నియన్ సెల్వన్ చిత్రంలోని కుందవై పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం మలయాళంలో మోహన్‌లాల్‌కు జంటగా రామ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇక తమిళంలో త్రిష నటించిన గర్జనై, చతురంగ వేటై, రాంగీ చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. తాజాగా ది రోడ్ అనే హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రంలో నటిస్తోంది. కాగా నటిగా రెండు శతాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా త్రిష తన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపే విధంగా ‘ప్రియమైన త్రిషయర్స్ మనలో నేనూ ఒకరిగా ఉండగలగడం గర్వంగా ఉంది. మనకు ఎప్పటికీ కృతజ్ఞతలు. మన ఉన్నతికి మీరు చేసే అన్నింటికీ ధన్యవాదాలు’. అంటూ త్రిష తననూ అభిమానులతో కలుపుకుని ట్విట్టర్లో పేర్కొంది. -
ఏ టైటిల్ పెట్టాలో తెలియక 'మసూద' అని పెట్టాం : నిర్మాత
ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మళ్ళీ రావా’, థ్రిల్లర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, హర్రర్ డ్రామా ‘మసూద’ వంటి విభిన్న కథలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించి 5 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మీడియా సమావేశం నిర్వహించి తన జర్నీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విశేషాలను పంచుకున్నారు. ► ‘మసూద’ సినిమా విజయం సాధించినందుకు, అందరి నమ్మకం నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ► హ్యాట్రిక్ అనిగానీ, నెంబర్స్ గురించిగానీ అస్సలు ఆలోచించలేదు. మంచి స్టోరీ. జెన్యూన్‌గా, హానెస్ట్‌గా, క్రమశిక్షణతో సినిమా తీస్తే.. జనాలకు నచ్చుతుంది. డబ్బులు కూడా వస్తాయని నమ్మాను. మొదటి సినిమా ‘మళ్లీరావా’ నుంచి ఇదే నమ్ముతున్నాను. ► ‘మసూద’ ఫస్ట్ డే తక్కువ థియేటర్లలోనే విడుదలైంది. ఆ తర్వాత వచ్చిన టాక్‌తో రోజురోజుకు థియేటర్లు పెరిగాయి. నా ఫస్ట్ సినిమా నుంచి శుక్రవారం సినిమా విడుదలైతే.. శనివారం నుంచే థియేటర్లు పెరుగుతూ వచ్చాయి. ► స్టార్ హీరోల సినిమాలకు పబ్లిసిటీ ఎంత చేస్తే అంత జనాల్లోకి ఆ సినిమా వెళుతుంది. మొదటి నుంచి సినిమాపై అంచనాలు ఉంటాయి కాబట్టి.. థియేటర్లకి ప్రేక్షకులు వస్తారు. కానీ ‘మసూద’ వంటి సినిమాలకు.. సినిమా బాగుంటే తప్పితే.. విడుదలకు ముందు ఎంత ప్రమోట్ చేసినా జనాలు పట్టించుకోరు. నేను సినిమా తీసే విధానంలో ఎంత జాగ్రత్త పడతానో.. ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను. ► బై ఛాన్స్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను ఇంజనీరింగ్ చేశాను. తర్వాత సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యాను. ఆ తర్వాత ఓన్‌గా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో రియల్ ఎస్టేట్‌లోకి వచ్చాను. చిన్న ఫార్మా ఇండస్ట్రీ కూడా రన్ చేయాలని అనుకున్నాను. అట్లాంటి టైమ్‌లో కామన్ ఫ్రెండ్స్ ద్వారా గౌతమ్ నన్ను కలిశాడు. అతని గురించి చెప్పి.. ‘మళ్ళీరావా’ స్క్రిఫ్ట్ ఇచ్చాడు. మొత్తం చదివాను. నాకు చాలా బాగా నచ్చింది. అలా ఇండస్ట్రీలోకి వచ్చాను. ► నేను టైమ్ ఎక్కువ తీసుకుంటాను. అలాగే నాకు వర్క్‌షాప్ కూడా చేయాలి. ఎంత ప్రూవ్డ్ యాక్టర్స్ అయినా.. కాంబినేషన్ సీన్స్ విషయంలో ఖచ్చితంగా వర్క్ షాప్ చేయాలి. కొత్త డైరెక్టర్స్‌తో రిస్క్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది అవసరం అని భావిస్తాను. ► నేను సినిమా ఇండస్ట్రీకి వెళుతున్నానని చెప్పినప్పుడు.. ఇంట్లో అందరూ క్లాస్ తీసుకున్నారు. మా నాన్నగారు కొన్ని రోజుల పాటు మాట్లాడలేదు కూడా. ఈ ఒక్కసారికి నాకు సపోర్ట్ చేయండి. ఇది చేయలేకపోతే.. మీరు ఏది చెబితే అది చేస్తాను అని చెప్పా. నా బిగ్గెస్ట్ సపోర్ట్ నా వైఫ్, పిల్లలు, మా అమ్మనాన్న, నా చెల్లెలు, ఫ్యామిలీ. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏమీ చేయలేము. ► ‘మళ్ళీరావా’ సినిమాకి మా నాన్నగారు చాలా సపోర్ట్, ధైర్యం ఇచ్చారు. ఆ ధైర్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ► ‘మసూద’ సినిమాకు మాత్రం టెక్నికల్‌గా అద్భుతంగా తీయాలని అనుకున్నాను. ఏం జరిగినా సరే.. నేను అనుకున్నది చేశాను. ఒక పొరిగింటి వ్యక్తికి మంచి టైటిల్ ఏమీ దొరకక ‘మసూద’ అని పెట్టాం. ► నేను అందరి హీరోల సినిమాలు చూస్తాను. పర్సనల్‌గా అయితే మాత్రం చిన్నప్పటి నుంచి వెంకటేష్‌గారంటే ఇష్టం. ► డిసెంబర్ 8తో మా బ్యానర్ స్థాపించి 5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ బ్యానర్ స్థాపించినప్పుడు అనుకున్నదానికంటే.. ఎక్కువే సాధించానని అనుకుంటున్నాను. మూడు సినిమాలు తీస్తాననిగానీ, ఆ మూడు సక్సెస్ అవుతాయనిగానీ, ముగ్గురు దర్శకులని పరిచయం చేస్తాననిగానీ, కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేస్తాననిగానీ అనుకోలేదు. కానీ ఇవన్నీ జరిగాయి. అందుకే, నేను చాలా ఎక్కువే సాధించానని చెబుతాను. ► ఒక మంచి కథ, నాకు ఛాలెంజింగ్‌గా అనిపించాలి.. అలాంటి కథ దొరికితే వెంటనే తర్వాత చేయబోయే సినిమా అనౌన్స్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంకా ఏ కథ చదవలేదు. స్క్రిప్ట్స్ మాత్రం 2019 నుంచి నా టేబుల్ మీదే ఉన్నాయి. దాదాపు 30 కథలు ఉన్నాయి. వాటిలో ఏదీ ఇంకా చదవలేదు. ► మా సంస్థను, మా సంస్థ నుంచి వస్తున్న సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, సహకరిస్తున్న మీడియావారికి, శ్రేయోభిలాషులకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. -
Sai Pallavi: సాయిపల్లవి సంచలన నిర్ణయం.. ఇండస్ట్రీకి గుడ్‌బై?
నటి సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ కావాల్సిన ఈమె నటనపై ఉన్న ఆసక్తితో నటి అయ్యారు. ఈమె మంచి డ్యాన్సర్ కావడంతో నిరూపించుకోవడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేకపోయింది. చదువుకుంటున్న రోజుల్లోనే చిన్న వేషాలు వేసిన సాయి పల్లవి మలయాళ చిత్రం ప్రేమమ్‌తో కథానాయకిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం భాషలో నటిస్తూ బాగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో బాగా పాపులర్ అయ్యారు. గ్లామర్‌కు దూరంగా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల పలు అవకాశాలను దూరం చేసుకున్నారు. కారణం ఏమైనా ప్రస్తుతం ఈమె చేతిలో ఒక చిత్రం కూడా లేదు. త్వరలో కమలహాసన్ నిర్మించనున్న చిత్రంలో శివ కార్తికేయన్‌కు జంటగా నటించడానికి సిద్ధమవుతున్నారు. కాగా సాయి పల్లవి గురించి తాజాగా ఒక వార్త సమాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె జార్జియాలో ఎంబీబీఎస్ చేసిన విషయం తెలిసిందే. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తన జన్మస్థలం అయిన కోయంబత్తూరులో ఆస్పత్రి కట్టించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయి పల్లవి నటనకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా? వైద్య సేవలు అందిస్తూనే నటనను కొనసొగిస్తారా? అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఈ విషయంపై సాయి పల్లవినే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. చదవండి: (ఈ సీజన్ హిట్ది అని అర్థం కావాలి) -
సినిమాలకు సాయి పల్లవి గుడ్ బై ..?
-
సినిమా ఇండస్ట్రీ ఓ కుటుంబం
‘‘సినిమా ఇండస్ట్రీ అనేది ఓ కుటుంబం. మనుషుల జీవితాల్లో సినిమా కూడా నిత్యసాధనం అయిపోయింది. ఇలాంటి సమయాల్లో ప్రేక్షకులకు మంచి సినిమాలు అందేలా దర్శక–నిర్మాతలు కృషి చేయాలి’’ అన్నారు హీరో బాలకృష్ణ. అల్లు శిరీష్, అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా రాకేష్ శశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘‘ఊర్వశివో రాక్షసివో’. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ చిత్రం నవంబరు 4న విడుదల కానుది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్యఅతిథిగా విచ్చేసిన బాలకృష్ణ ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం బిగ్ టికెట్‌ను బాలకృష్ణకు అందించారు అల్లు అరవింద్. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ–‘‘అరవింద్‌గారి అసోసియేషన్‌తో నేను చేస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’కు మంచి స్పందన లభిస్తోంది. అల్లు రామలింగయ్యగారితో వర్క్ చేసే అవకాశం దక్కడం నా అదృష్టం. ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా టీజర్, ట్రైలర్ బాగున్నాయి. శిరీష్, అను, దర్శకుడిగా రాకేశ్ బాగా చేశారనిపిస్తోంది. ప్రతి మనిషిలో విభిన్నకోణాలు ఉంటాయి. ప్రతి మగాడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందంటారు. ఓ కుటుంబాన్ని నిలబెట్టాలన్నా, కూల్చాలన్నా ఆ తాలూకు బరువు, బాధ్యతలన్నీ మహిళల చేతుల్లోనే ఉంటాయి. కాలంతో ఇప్పుడు కొన్ని పరిస్థితులు, అభిరుచులు కూడా మారుతున్నాయి. సహజీవనం, ఎఫైర్స్ అనేవి కూడా నడుస్తున్నాయి. ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ‘ఊర్వశివో రాక్షసివో..’ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ– ‘‘శిరీష్ మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఈ మూవీలో నటించాడు. ప్రస్తుతం యువత ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పుట్టిన సినిమా ఇది. మంచి ఎంటర్టైనర్ అండ్ ఓ ఇన్‌డెప్త్ డిస్కషన్ ఈ సినిమాలో ఉంది.. దాన్ని తెరపైనే చూడాలి’’ అన్నారు. ‘‘చిరంజీవిగారి 60వ బర్త్ డే వేడుకల్లో బాలకృష్ణగారు పాల్గొన్నారు. కొంత సమయం తర్వాత ఆ ఫంక్షన్లో మా జోష్ తగ్గింది కానీ బాలకృష్ణగారి జోష్ తగ్గలేదు. ‘కొత్తజంట’, ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాల తర్వాత నాన్నగారితో ముచ్చటగా మూడోసారి నేను చేసిన ఈ చిత్రం కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు అల్లు శిరీష్. ‘‘శిరీష్‌గారు, అను వల్ల ఈ సినిమా మేకింగ్ చాలా సాఫీగా జరిగింది’’ అన్నారు రాకేష్ శశి. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్, కొరియోగ్రాఫర్ విజయ్, దర్శకులు మారుతి, పరశురామ్, చందూ మొండేటి, వశిష్ఠ్, వెంకటేశ్ మహా, దర్శక–నిర్మాత, రచయిత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శక–నిర్మాత సాయిరాజేష్, నిర్మాత ఎస్కేఎన్, ‘గీతాఆర్ట్స్’ బాబు, సత్య, పూర్ణా చారి, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధులు మాధవ్, నిరంజన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సినిమాకు స్వీయ నియంత్రణ:సీసీఐ
న్యూఢిల్లీ: చలనచిత్ర పరిశ్రమలోని సంఘాలు సభ్యులు కానివారిని నిషేధించడం, బహిష్కరించడం మానుకోవాలని కాంపిటీషన్ కమిషన్ స్పష్టం చేసింది. వాటాదారుల మధ్య విభేదాలను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలను పరిశీలించాలని శుక్రవారం సూచించింది. దేశంలో చిత్ర పంపిణీపై మార్కెట్ అధ్యయనాన్ని సీసీఐ ఈ సందర్భంగా విడుదల చేసింది. పరిశ్రమ అనుసరించేలా వివిధ స్వీయ నిబంధనలను రూపొందించింది. మల్టీప్లెక్స్‌లు, నిర్మాతలు, వర్చువల్ ప్రింట్ ఫీ (వీపీఎఫ్), సినిమాతో ముడిపడి ఉన్న సంఘాలు, డిజిటల్ సినిమాలకు సంబంధించిన స్వీయ నియంత్రణలను ప్రతిపాదించింది. నిర్మాతల వాణిజ్య స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా చిత్రాల ప్రదర్శనలో వాణిజ్యంపై మల్టీప్లెక్స్‌లు ఎలాంటి నియంత్రణ ఉంచరాదని ఈ సందర్భంగా తెలిపింది. -
డై హార్డ్ ఫ్యాన్.. వెండితెరపై ‘సాఫ్ట్వేర్’ కుర్రాడు
మధురవాడ (భీమిలి): ఆ యువకుడికి సినిమాలంటే పిచ్చి..ఎలాగైనా సరే తెరపై కనిపించాలని కలలుగన్నాడు. చిన్నతనం నుంచీ ఇదే ధ్యాస. వయసు పెరిగే కొద్దీ లక్ష్యం మరింత బలపడింది. చిన్నచిన్న పాత్రలతో ఆకట్టుకున్నాడు. కట్ చేస్తే డై హార్డ్ ఫ్యాన్ సినిమాతో హీరో అయ్యాడు. మంచి టాక్ తెచ్చుకోవడంతో ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరనుకుంటున్నారా? విశాఖకు చెందిన శివ రామకృష్ణ ఆలపాటి. సింపుల్‌గా శివ అలపాటి. చదవండి: రెండోపెళ్లిపై చర్చకు దారితీసిన రేణు దేశాయ్ కామెంట్స్ శివది స్వస్థలం పీఎంపాలెం కాగా.. విశాఖ కిర్లంపూడి లే అవుట్లో నివాసం ఉంటున్నాడు. శివ హీరోగా ‘డై హార్డ్ ఫ్యాన్’ చిత్రంలో నటించారు. ఈ నెల 2న చిత్రం హైదరాబాద్‌లో విడుదలైంది. త్వరలోనే ఏపీ అంతటా విడుదల చేయనున్నారు. సినిమా యూత్‌ను మెప్పించింది. దీంతో తన ఆశలకు ఈ చిత్రం జీవం పోసినట్టుందని శివ పేర్కొన్నాడు. శివ సరసన ప్రియాంక్ శర్మ హీరోయిన్ నటించగా, షకలక శంకర్, రాజీవ్ కనకాల, నోయల్ ముఖ్య పాత్రల్లో నటించారు. అభిరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. హీరోయిన్‌కి, అభిమానికి మధ్య జరిగిన సస్పెన్స్ కామెడీ డ్రామానే ఈ సినిమా కథ. సినిమా అంటే ప్రాణం మొదటి నుంచీ సినిమాలన్నా..నటనన్నా చాలా ఇష్టం. ఓ వైపు చదువుకుంటూ మరోవైపు సినిమా రంగంవైపు అడుగులేశా..సాఫ్ట్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తూ మరోవైపు వెండితెరపై నటిస్తున్నా..సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ఐదేళ్లు హైదరాబాదు, పూనేలో పనిచేశా.. గతంలో చిన్న చిన్న చిన్న క్యారక్టర్లు వచ్చేవి. వీటిలో ‘నేనే లేని నా ప్రేమ కథ , రన్ వెబ్ సిరీస్‌లో మేజర్ రోల్ చేశాను. తర్వాత 2019లో హైదరాబాద్‌లో జరిగిన ఆడిషన్స్ హీరో రోల్‌కి అవకాశం వచ్చింది. ఉద్యోగం, నటన రెండూ సాధ్యం కాదు కనుక ఉద్యోగం మానేశా. వారం రోజుల్లో విశాఖ థియేటర్లలో డై హార్డ్ ఫ్యాన్ చిత్రాన్ని విడుదల చేస్తాం. – శివ, హీరో -
ఇండస్ట్రీలో నాకు చాలామంది శత్రువులు ఉన్నారు: నిత్యామీనన్
తమిళసినిమా: తనకు శత్రువులు ఉన్నారు.. అని అంటున్నారు నటి నిత్యామీనన్. ఈ మాలీవుడ్ నటి టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అందుకోలేకపోయినా, ఎలాంటి పాత్రనైనా చేయగల సత్తా ఉన్న నటి అని పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా పొగరుబోతు అనే ముద్ర కూడా వేసుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో నటించిన ఓకే కణ్మణి చిత్రం సక్సెస్ తరువాత ఆయన దర్శకత్వంలోనే మరో చిత్రంలో నటించే అవకాశం వస్తే దాన్ని తిరస్కరించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అదే విధంగా ఒక మలయాళ చిత్ర షూటింగ్లో ఉన్న నిత్యామీనన్‌ను కలవడానికి ఒక నిర్మాత రాగా ఆయన్ని కలవడానికి నిరాకరించిందనే ఘటన అప్పట్లో కలకలం రేకెత్తించింది. ఇక ఈ మధ్య నటి నిత్యామీనన్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఒక వ్యక్తి రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు మలయాళ చిత్ర పరిశ్రమ ఒక దశలో నిత్యామీనన్‌పై రెడ్ కార్డు విధించాలనే వరకూ వచ్చింది. ఇలాంటి వివాదాస్పద ఘటనలు నిత్యామీనన్ జీవితంలో చాలానే ఉన్నాయి. కాగా చాలా కాలం తరువాత ఈ సంచలన నటి కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా నటించిన తిరుచిట్రంఫలం చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా సాగుతోంది. ఈ సందర్భంగా ఒక భేటీలో నటి నిత్యామీనన్ పలు విషయాల గురించి మనసు విప్పి చెప్పారు. అందులో ముఖ్యంగా తనపై జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ తనకు చాలా మంది శత్రువులు ఉన్నారని అన్నారు. మనం ఎదుగుతున్నప్పుడు గిట్టని వాళ్లు చాలా మంది కాళ్లు పట్టుకుని కిందకు లాగాలని భావిస్తారని అన్నారు. వాళ్ల మాట వినకపోతే వదంతులు ప్రచారం చేయడానికీ వెనుకాడరన్నారు. నిత్యామీనన్‌తో పని చేయడం చాలా కష్టం అంటారని, అయితే తాను చాలా మందితో కలిసి పని చేశానని, ఎవరూ అలా భావించలేదని అన్నారు. కారణం తాను ఎలాంటి వ్యక్తినో వారందరికీ తెలుసని స్పష్టం చేశారు. -
హీరోయిన్ జీవితం అలా ఉండదని అమ్మ చెప్పింది: జాన్వీ కపూర్
సినీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్ చూసి.. జీవితం అంటే అలా ఉండాలి అనుకుంటారు సాధారణ వ్యక్తులు. కానీ, అనుకున్నంత సులభంగా, సౌకర్యవంతంగా సినీ తారల జీవితం ఉండదు. అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి ముద్దుల తనయగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. 'దఢక్' సినిమాతో డెబ్యూ ఇచ్చిన ఈ భామ తనదైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల 'గుడ్ లక్ జెర్రీ' సినిమాతో ఓటీటీ ద్వారా పలకరించి నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తన తల్లిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయింది. అలాగే వాళ్ల అమ్మ చెప్పిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ''నిజానికి ప్రతి క్షణం అమ్మను ఎంతో మిస్ అవుతున్నా. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేపేది. అమ్మ ముఖం చూడకుండా నా రోజువారీ పనులు ప్రారంభించేదాన్ని కాదు. అలాటంది ఇప్పుడు అమ్మ లేకుండా జీవితాన్ని కొనసాగించడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అని తెలిపింది. 'ఇండస్ట్రీలోకి వస్తానని చెప్పినప్పుడు మీ అమ్మ ఏం అన్నారు?' అని అడిగిన ప్రశ్నకు.. ''మొదట్లో అమ్మ ఒప్పుకోలేదు. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టొద్దనే చెప్పింది. 'నా జీవితం మొత్తం చిత్రపరిశ్రమతోనే గడిచిపోయింది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇప్పుడు మీకు ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చాను. మీరు అనుకుంటున్నట్లుగా స్టార్ జీవితం అంత సౌకర్యవంతంగా ఉండదు. అలాంటి రంగంలోకి నువ్వు వెళ్లాల్సిన అవసరం ఏంటీ?' అని అమ్మ ప్రశ్నించింది. కానీ నేను దానికి ఒప్పుకోలేదు. ఏది ఏమైనా నేను హీరోయిన్గా చేయడం నాకిష్టమని చెప్పడంతో ఆమె ఓకే చెప్పింది. నా ఇష్టానికి కాదనలేక ఆమె ఒప్పుకున్నా.. 'నువ్వు సున్నిత మనస్కురాలివి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక కొంతమంది చేసే వ్యాఖ్యలకు నొచ్చుకోక తప్పదు. ఇక్కడ నెగ్గుకు రావాలంటే మరింత కఠినంగా మారాల్సి ఉంటుంది' అని అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది'' అని జాన్వీ కపూర్ అప్పటి రోజులను గుర్తు చేసుకుంది. అనంతరం తన సినిమాలు, నటనపై వస్తున్న విమర్శల గురించి మాట్లాడుతూ 'నేను శ్రీదేవి కూతురు కావడం వల్లే నాకు ఎక్కు విమర్శలు వస్తున్నాయి. నా మొదటి నాలుగు సినిమాలను ఆమె 300 చిత్రాలతో పోల్చి చూస్తున్నారు. నేను ఆమెలా నటించలేకపోవచ్చు. కానీ ఈ వృత్తిని ఆమెకోసం చేయాలనుకుంటున్నాను. నేను ఆమెను గర్వపడేలా చేయకుండా అలా వదిలేయలేను' అని చెప్పుకొచ్చింది జాన్వీ కపూర్. -
దుబారా సినిమా
ఎన్.టి.రామారావు ఆఖరు పుట్టినరోజు వేడుక లలిత కళాతోరణంలో జరిగింది. తెల్లసూటు, హ్యాటు పెట్టుకుని హాజరైన ఎన్.టి.ఆర్ తన గురించి కంటే సినిమా పరిశ్రమ గురించి ఎక్కువ మాట్లాడారు. ‘నేను మద్రాసు నుంచి షూటింగ్‌కు వస్తే నిర్మాత ఇక్కడ రిట్జ్ హోటల్లో రూమ్ వేస్తాననేవారు. అక్కర్లేదు... సారథీ స్టూడియోలో ఉంటానని అనేవాణ్ణి. మరి ఇవాళ్టి హీరోలు ఎందుకు స్టార్ హోటల్ అడుగుతున్నారో అర్థం కావడం లేదు’ అన్నారు. ఎన్.టి.ఆర్ ఎంత సమర్థులైన నటులో అంత సమర్థులైన నిర్మాత. ‘ఫలానా పాత్ర చుట్ట వెలిగిస్తూ డైలాగ్ చెబుతుంది’ అని తాను తీసే సినిమాలో సీన్ ఉంటే ప్రొడక్షన్ వాళ్లకు నాలుగు లంక పొగాకు చుట్టలు తెమ్మని చెప్పేవారు. ఆ సంగతి తెలిసి ఆ పాత్ర వేసే నటుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని నాలుగు టేకుల్లో షాట్ ఓకే చేయాలన్నమాట. పది టేకులకు పది లంక పొగాకు చుట్టలు అక్కడ ఉండవు. సినిమాకు మూలవిరాట్టు– హీరో కాదు. నిర్మాత... అతణ్ణి కాపాడుకుంటే ఇండస్ట్రీని కాపాడు కున్నట్టేనని పెద్ద హీరోలంతా భావించేవారు. తన సమీప బంధువు వెంకటరత్నం ‘యమగోల’ తీస్తుంటే అతనికి ప్రొడక్షన్ స్థాయిలోనే రూపాయి మిగల్చాలని మొత్తం బడ్జెట్ చెప్పమని పట్టుబట్టారు ఎన్.టి.ఆర్. ఎక్కడెక్కడ తగ్గించవచ్చో చెబుతానన్నారు. దానికి అతను ‘అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాను. సెకండ్ హాఫ్‌లో మీరు యమలోకంలో ఉంటారు. మొత్తం సీన్లన్నీ ఒక్క డ్రస్ మీదే ఉంటారు. అలా మీ కాస్ట్యూమ్స్ ఖర్చు కూడా తగ్గించాను’ అని చెప్తే సంతృప్తి పడ్డారు. ఎన్.టి.ఆర్ షూటింగ్లో ఉండి తనకు గెస్ట్‌లు వస్తున్నట్టయితే ‘ఇంత మంది గెస్ట్‌లు వస్తున్నారు. కాఫీ, టీలకు ఖర్చు అవుతుంది’ అని కూడా చెప్పేవారు. నిర్మాతకు ఇచ్చే మర్యాద అలాంటిది. ఏ.ఎన్.ఆర్ తన పారితోషికం పెంచాలనుకుంటే నిర్మాతలను పిలిచి, వారి ముఖ కవళికలు గమనిస్తూ ఆ పెంపును ప్రతిపాదించేవారు. భయంకరమైన ఎండలు కాసే వేసవిలో కృష్ణ ఊటీకి విశ్రాంతికి వెళ్లినా ఆ కాలంలో తలా ఒక పాట చేసుకోండని నిర్మాతలకు చెప్పి డబ్బు ఆదా చేసేవారు. ఉదయం ఏడుకల్లా సెట్లో టంచన్‌గా ఉన్న హీరోలు వీరంతా. దర్శకులకు కూడా నిర్మాతే మూలవిరాట్టు అని తెలుసు. ‘కృష్ణుడు ఫ్లూట్ పట్టుకుని నాలుగు అడుగులు నడిచి డైలాగ్ చెబుతాడు’ అని స్క్రిప్ట్ రాసుకునేవారు కె.వి.రెడ్డి. ఆయన సినిమాలకు ఎడిటర్ వృథా అని తీసి పారేసేదంటూ ఏదీ ఉండదు. ఎందుకంటే వృథా షాట్ ఒక్కటీ తీయడు. ‘ప్రేమాభిషేకం’ సినిమాకు రెండు పాటలు, ఐదారు ముఖ్యమైన సీన్లు ఉన్న జయసుధ నుంచి దాసరి తీసుకున్నది ఎనిమిది రోజుల కాల్షీట్లే. ఏం తీస్తున్నామో, ఎందుకు తీస్తున్నామో, ఎంతలో తీస్తున్నామో దర్శకులకు తెలిసేది. వహీదా రెహమాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది– ‘సత్యజిత్ రే ఒక షాట్ ఓకే చేశాక నాకు అదనంగా ఇంకో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలనిపించింది. అది కూడా ఇస్తాను యాడ్ చేసుకోండని ఎంతో బతిమిలాడాను. నేను తీయను వహీదా! పిక్చర్ ఎడిట్ అయ్యి ఎలా ఉంటుందో నాకు తెలుసు... నీ కోసం తీసినా ఆ షాట్ పక్కన పడేస్తాను అన్నారు’. కాలం చాలా మారింది. కొందరి ధోరణీ అలాగే మారింది. ‘నిర్మాతను సెట్ బయట కూర్చోమనండి. లోపల అడుగు పెట్టడానికి వీల్లేదు’ అనగలిగే హీరోలు వచ్చారు. ‘నిర్మాతకు కథ చెప్పను... బడ్జెట్ ఎంతో చెబుతాను’ అనే దర్శకులు వచ్చారు. సినిమా సైన్ చేసిన నాటి నుంచి తన సమస్త ఖర్చులు, విహారాలు సదరు నిర్మాత చూసుకునేలా హీరోలు పరిణామం చెందారు. హీరోయిన్లు షూటింగ్లో ఉంటే తాము ఏం తింటామో అడక్కుండా ఒకరోజు తిండి ఖర్చు కింద పాతిక వేలు ఇమ్మని డిమాండ్ చేస్తున్నారు. కేరెక్టర్ ఆర్టిస్టులు తమకో బండి, తమ స్టాఫ్కో బండి పెట్టమని వ్యక్తిగత సిబ్బంది ఖర్చు నిర్మాత నెత్తిన వేస్తున్నారు. హీరోలు ఔట్‌డోర్ ఎండను, క్రౌడ్‌ను ఇష్టపడక íసీజీలో చేద్దాం అని తడిపి మోపెడు చేస్తున్నారు. దర్శకులు ఆ రోజున ఏ సీన్ తీస్తున్నాము, ఏ ఆర్టిస్ట్ అవసరం అని ప్లాన్ చేసుకోక అందరు ఆర్టిస్ట్లనూ సెట్లలో కూర్చోబెడుతున్నారు. వీరందరికీ క్యార్వాన్లు ఏర్పాటు చేయలేక నిర్మాతలు నలుగుతున్నారు. ఇక ఈ దర్శకులే ఏ ఎక్విప్మెంట్ వాడుతారో స్పష్టత లేకుండా మొత్తం ఎక్విప్మెంట్ను డంప్ చేయించి అద్దెలు కట్టిస్తున్నారు. ఈ దుబారాకు జవాబుదారీతనం ఎవరిదన్న అవలోకనం చేసుకోవాల్సిందే! డిమాండ్ అండ్ సప్లై సూత్రం ప్రకారం హీరో, డైరెక్టర్, ఆర్టిస్ట్ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు పడ్డ పోటీ కూడా నేటి పరిస్థితికి కారణమన్నది నిర్వివాదాంశం. నిర్మాత, దర్శకుడు, హీరో... అందరూ సినిమా కోసమే పని చేసినా సమన్వయం, సమైక్య దృష్టి అవసరం. నేడు పరిశ్రమలో రెగ్యులర్ పని, థియేటర్లకు ఫీడ్ దొరకాలంటే సరైన బడ్జెట్లో పెద్ద హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలని పరిశీలకులు అంటున్నారు. ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ వాస్తవిక అంచనాలతో, భేషజం లేని స్వీయ విశ్లేషణ చేసుకుని సినిమా రంగ భవిష్యత్తును నిర్దేశించుకోవాలి. ఎందుకంటే వీరందరూ కాకుండా స్టేక్ హోల్డర్ మరొకడు ఉన్నాడు– ప్రేక్షకుడు. ప్రేక్షకుడికి నేడు వేయి వినోదాలు. అతణ్ణి కట్టి పడేయడానికి సినిమా రంగం కలిసికట్టుగా సంస్కరణలు చేసుకోక తప్పదు. త్వరలో సినీ పరిశ్రమ మంచికి ‘యాక్షన్’, చెడుకు ‘కట్’ పలుకుతుందని ఆశిద్దాం. -
కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్
Ajay Devgn Special Post On Kajol Completes 30 Years In Bollywood: కాజోల్.. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసే స్టార్ హీరోయిన్లలో ఒకరు. ఎలాంటి కష్టతరమైన పాత్రలోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసి తన నటనా పటిమను చాటుకున్న బ్యూటీఫుల్ హీరోయిన్ ఆమె. ఎన్నో చిత్రాల్లో గ్లామర్‌తోపాటు అభినయంతో విశేష అభిమానులను సంపాదించుకున్న ఈ హీరోయిన్ బాలీవుడ్ చిత్రసీమలోకి అడుగుపెట్టి మూడు దశాబ్ధాలు (30 ఏళ్లు) పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆమె భర్త, నటుడు, స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అజయ్ దేవగణ్-కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమాలోని ఓ పిక్‌ను షేర్ చేస్తూ 'ఈ 3 దశబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో సినిమాలు చేశావు. ఎన్నో మైలురాళ్లు దాటావు. ఈ ముప్పై ఏళ్ల సినీ కెరీర్లో జ్ఞాపకాలు నిక్షిప్తమయ్యాయి. కానీ, నిజానికి.. నువ్ ఇప్పుడే అసలైన ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నావు' అంటూ రాసుకొచ్చాడు అజయ్ దేవగణ్. అలాగే తన సినీ కెరీర్‌కు ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక స్పెషల్ గ్లింప్స్‌ను షేర్ చేసింది కాజోల్. చదవండి: షూటింగ్ పోటీల్లో అజిత్ సత్తా.. 4 బంగారు పతకాలు కైవసం నిర్మాతగా మారిన బ్యూటిఫుల్ హీరోయిన్.. View this post on Instagram A post shared by Ajay Devgn (@ajaydevgn) కాగా 17 ఏళ్ల వయసులో 1992లో విడుదలైన 'బేఖుడి' చిత్రంతో సినీ రంగానికి పరిచయమైంది బ్యూటీఫుల్ కాజోల్. కుచ్ కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియే లేజాయింగే, ఫనా, బాజీగర్, దుష్మన్, త్రిభంగ, కరణ్ అర్జున్, మెరుపు కలలు, వీఐపీ 2 వంటి తదిర సినిమాలతో ఎంతో పేరు తెచ్చుకుంది. 1999లో అజయ్ దేవగణ్‌ను వివాహం చేసుకోగా, వారిద్దరికి నైసా, యుగ్ అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. అజయ్, కాజోల్ కలిసి నటించిన 'తానాజీ' సినిమా 68వ జాతీయ చలన చిత్ర అవార్డులలో మూడు బహుమతులను గెలుపొందింది. View this post on Instagram A post shared by Kajol Devgan (@kajol) -
షారుక్ ఖాన్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
Sharuk Khan Drops First Look Of Pathaan Celebrating 30 Years Film Industry: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ యావత్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అనేక విజయాలు, గ్లామర్ పాత్రలు, రొమాంటిక్ హీరోగా పేరు గడించిన షారుక్ ఖాన్ 'కింగ్ ఖాన్'గా మన్ననలు పొందాడు. ఈ బాలీవుడ్ బాద్షా సినీ ప్రయాణం ప్రారంభమై నేటితో (జూన్ 25) 30 ఏళ్లు పూర్తయింది. 1992 జూన్ 25న విడుదలైన 'దీవానా' సినిమాతో షారుక్ ఖాన్ హీరోగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఒక్కో సినిమాతో తన స్టార్డమ్ పెంచుకున్నాడు. ఇక షారుక్, కాజల్ రొమాంటిక్ లవ్ ట్రాక్ 'దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే'తో ప్రపంచంలోనే అత్యధిక సంవత్సరాలు ప్రదర్శితమైన మూవీగా రికార్డు సాధించింది. ఇదిలా ఉంటే షారుక్ ఖాన్ తన 30 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. షారుక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా 'పఠాన్' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ వీడియోలో చేతిలో గన్‌తో, చేతికి బేడీలతో ఇంటెన్సివ్ లుక్‌లో ఆకట్టుకుంటున్న షారుక్‌ను చూడొచ్చు. ఈ పోస్టర్ రిలీజైన అతి తక్కువ సమయంలోనే నెట్టింట షేక్ చేస్తోంది. కాగా పఠాన్ మూవీలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కూడా కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 25, 2023న గ్రాండ్‌గా విడుదల కానుంది. (చదవండి: నెట్టింట రకుల్ డ్యాన్స్ వీడియో వైరల్.. బాయ్‌ఫ్రెండ్ కామెంట్ ఏంటంటే ?) 'పఠాన్'తోపాటు షారుక్ ఖాన్ అట్లీ దర్శకత్వంలో 'జవాన్' సినిమా కూడా చేస్తున్నాడు. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించనుంది. రాజ్ కుమార్ హిరాణీ తెరకెక్కించే 'డంకీ'లోనూ నటించనున్నాడు. ఇవేకాకుండా మాధవన్ 'రాకెట్రీ: ద నంబీ ఎఫెక్ట్', అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్ధా', రణ్‌బీర్ కపూర్ 'బ్రహ్మాస్త్ర', సల్మాన్ ఖాన్ 'టైగర్-3' చిత్రాల్లో కింగ్ ఖాన్ కెమియో ఇవ్వనున్నట్లు సమాచారం. (చదవండి: ప్రముఖ నటుడి ఆత్మహత్య.. చిత్ర పరిశ్రమలో విషాదం నడిరోడ్డుపై యంగ్ హీరోయిన్ డ్యాన్స్.. వీడియో వైరల్) View this post on Instagram A post shared by Shah Rukh Khan (@iamsrk) -
శ్రీదేవి నుంచి సమంత దాకా ఎవరెవరు సర్జరీ చేసుకున్నారంటే?
‘అందం’ అనే భావన గతంలో ఒకలా ఉండేది. ఇప్పుడు మరోలా ఉంది. ఏవో కొన్ని కొలతల్లో ఇమిడితేనే అందం అంటున్నారు. ఆ కొలతల కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. గతంలో తెలుగు నటి ఆర్తి అగర్వాల్ అమెరికాలో ఈ కారణం చేతనే మరణించింది. ఇప్పుడు మరో కన్నడ నటి. ఈ భావజాలానికి విరుగుడు కనిపెట్టాలి. దక్షిణాదిలో మొదటగా కాస్మెటిక్ సర్జరీని శ్రీదేవి పరిచయం చేసింది. ఆమె తన ముక్కును ‘సరి చేసుకోవడం’ ద్వారా సగటు గృహిణులకు కూడా అటువంటి సర్జరీలు ఉంటాయని తెలియచేసింది. అంతవరకూ దక్షణాదిలో ‘బొద్దు’గా ఉండటం లేదా సహజ రూపంలో సౌందర్యాత్మకంగా ఉండటం సినీ పరిశ్రమలో సమ్మతంగా ఉండేది. ప్రేక్షకులు అటువంటి హీరోయిన్లు ఆదరించారు. అంజలీదేవి, సావిత్రి, కె.ఆర్.విజయ, బి.సరోజా దేవి, రాజశ్రీ, జయలలిత, దేవిక... వీరందరూ పూల తీవల్లాగా సుకుమారంగా తెర మీద కనిపించేవారు కాదు. ఆరోగ్యంగా, నిండుగా ఉండేవారు. దక్షిణాది స్త్రీలు తమను వారిలో పోల్చుకునేవారు. అయితే శ్రీదేవి ఉత్తరాదికి వెళ్లి నటించాలనుకున్నప్పటి నుంచి, ఉత్తరాదిలో కొత్తతరం వచ్చి ‘కాస్ట్యూమ్స్’ అధునాతనంగా మారి, ఫ్యాషన్ డిజైనర్స్ వచ్చి కొలతలను నిర్థారించడం మొదలెట్టినప్పటి నుంచి ఈ కాస్మెటిక్ సర్జరీల ధోరణి పెరిగింది. నేటికి అది శ్రుతి మించి ప్రాణాలకు ప్రమాదం తెచ్చే స్థాయికి చేరింది. లబ్ధి పొందినవారు ఉన్నారు కాస్మెటిక్ సర్జరీల వల్ల లబ్ధి పొందిన వారు ఉన్నారు. తమను తాము కొత్తగా మార్చుకున్నవారు ఉన్నారు. దానివల్ల కెరీర్లో ఎక్కువ రోజులు ఉండగలిగారు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఇలాంటి సర్జరీలను ఎంతవరకు ఉపయోగించాలో తెలుసుకున్నవారు సఫలం అయ్యారు. మీనాక్షి శేషాద్రి ముక్కును సరి చేసుకుని కొత్త రూపు పొందింది. హేమమాలిని ‘బ్లెఫరోప్లాస్టీ’ (కంటి ముడుతలు, సంచులు తొలగించే సర్జరీ), బొటాక్స్ల ద్వారా వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేసుకోగలిగిందనే వార్తలు ఉన్నాయి. ఇక అమితాబ్ తన తల వెంట్రుకలను, దవడలను ‘కరెక్ట్’ చేసుకుని ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో కొత్తరూపులో వచ్చాడు. గతంలో రజనీకాంత్‌కు పెదాల మీద మచ్చలు ఉండేవి. ఆయన కాస్మెటిక్ సర్జరీ ద్వారానే వాటిని పోగొట్టుకున్నాడు. ప్రియాంక చోప్రా నుంచి అనుష్కా శర్మ వరకు ఎందరో ఈ సర్జరీల దారిలో నేటికీ ఉన్నారు. తెలుగులో సమంత మునుపటి రూపానికి ఇప్పటి రూపానికి తేడా చూస్తే ఆమెలో కాస్మటిక్ మార్పులను గమనించవచ్చు. షారూక్ ఖాన్ భార్య గౌరి ఖాన్ కూడా తన రూపం కోసం ఈ ట్రీట్మెంట్ తీసుకుంది. వికటించిన వైనాలు కాని ప్రకృతి సిద్ధంగా వచ్చిన రూపాన్ని ఒకసారి కత్తిగాటు కిందకు తీసుకువచ్చాక అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఇంకా మారుద్దాం ఇంకా మారుద్దాం అని అనిపించే మానసిక స్థితి వచ్చి శరీరానికి పెనువిపత్తు, రూపానికి విఘాతం కలిగే అవకాశం ఉంది. మైకేల్ జాక్సన్ తన రూపాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీదేవి లెక్కకు మించిన సర్జరీలతో ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సమయానికి ఎంతో బలహీనంగా తెర మీద కనిపించడం అభిమానులు చూశారు. రాఖీ సావంత్ వంటి వారు ఈ సర్జరీలతో గత రూపం ఏమిటో తెలియనంతగా మారిపోయారు. జూహీ చావ్లా చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ ఆమె సహజ రూపాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. కత్రీనా కైఫ్, వాణి కపూర్లకు ఈ సర్జరీలు అంతగా లాభించలేదు. ఆయేషా టకియాకు ఈ సర్జరీలు బాగా నష్టం చేశాయి. ఊహించని మరణాలు తెర మీద సన్నగా కనిపించడానికి లైపోసక్షన్ చేయించుకున్న పంజాబీ నటుడు వివేక్ షౌక్ 2011లో మరణించాడు. ఇండస్ట్రీలో మరోసారి అదృష్టం పరీక్షించుకోవడానికి అమెరికాలో ఇలాంటి సర్జరీలోనే 2015లో ఆర్తి అగర్వాల్ మరణించింది. తాజా 21 ఏళ్ల కన్నడ నటి చేతనా రాజ్ ఫాట్లాస్ సర్జరీతోనే ప్రాణం కోల్పోయింది. అనుభవం ఉన్న డాక్టర్లు చేయకపోవడం వల్ల కొంత, శరీరాలకు తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు సంభవిస్తూ ఉన్నాయి. అలాంటి వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ప్రచారం లేదు. నా రూపమే నా సౌందర్యం తెర మీద నటించాలంటే మొదట నటన కావాలి... తర్వాత రూపం అవసరమవుతుంది అనే భావన చాలా ఏళ్లకు గాని రాలేదు. సీమా బిస్వాస్ వంటి నటీమణులు, నవాజుద్దీన్ సిద్ధఖీ వంటి నటులు నటనను ముందుకు తెచ్చి రూపాన్ని వెనక్కు తీసుకెళ్లారు. ముఖాన మొటిమలు ఉన్నా సాయి పల్లవి తన నటనతో కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు వాణిశ్రీ– హీరోయిన్లు బంగారు వర్ణంలో ఉండాలన్న రూలును బద్దలు కొట్టింది. సుజాత, జయసుధ లాంటి వాళ్లు మోడ్రన్ దుస్తులు, విగ్గులు లేకపోయినా సుదీర్ఘ కెరీర్ సాధించవచ్చు అని నిరూపించారు. ఒకవైపు ఈ కాలపు అమ్మాయిలు బాడీ షేమింగ్లతో, ఫ్యాషన్ ఇండస్ట్రీ తెచ్చే కొత్త కొత్త కొలతలతో, కాస్మటిక్ ఇండస్ట్రీ విసిరే కొత్త కొత్త వలలతో సతమతమవుతుంటే తెర మీద కనిపించే నటీమణులు తమ రూపాలు మార్చుకుంటూ ‘ఇలా ఉండటమే కరెక్టేమో’ అనే సందేశాలు ఇవ్వడం మెల్లగా తగ్గాలి. సహజ రూపమే సౌందర్యాత్మకమైనది అనే భావనకు ప్రచారం రావాలి. అత్యంత అవసరమైన, సురక్షితమైన చిన్న చిన్న అవసరాలకు తప్ప ఈ కృత్రిమ రూపాలకు దూరంగా ఉండాలనే చైతన్యం కలగాలి. అప్పుడే ప్రతిభ ముందుకు వచ్చి రూపానికి రెండవ స్థానం లభించగలదు. అందుకు అందరూ ప్రయత్నించాలి. సహజమే... సౌందర్యం... నిజానికి బ్యూటీ కాంటెస్ట్‌లలో కూడా ‘ఇలా కనపడాలి... అలా కనపడాలి’ అంటూ ఏమీ నిబంధనలు ఉండవు. అయినా అమ్మాయిలు ఓవర్ కాన్షియస్ అయిపోయి ఏవేవో లోపాలు వెతుక్కుంటున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, వర్కవుట్స్ తోనే గ్లో తెచ్చుకుని అందంగా కనిపించవచ్చు. ఏదైనా సరే సహజమైన పద్ధతులే తప్ప లేజర్ సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీలు వంటివి తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం అయితే ఓకే కానీ అందం కోసం చేయించుకోవడం సరైంది కాదు. – అభిమానిక తవి, ఫిట్నెస్ ట్రైనర్, బ్యూటీ పేజెంట్ గ్రూమింగ్ పోల్చుకోవడమే పెద్ద సమస్య... అందంగా కనిపించాలని ముందు మేకప్ చేసుకోవడం నుంచి మొదలుపెడతారు. తర్వాత బ్యూటీషియన్స్‌ని సంప్రదిస్తుంటారు. కాస్మెటిక్స్ ను విపరీతంగా వాడతారు. తర్వాత ప్లాస్టిక్ సర్జరీకి వెళతారు. ఇది బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్. వీరిలో సోషల్ యాంగ్జైటీ ఎక్కువ. నలుగురిలో తామే అందంగా కనిపించాలి. లేదంటే కామెంట్ చేస్తారేమో అని భయపడుతుంటారు కూడా. వేరే ఆలోచన ఉండదు. రోజులో ఎక్కువ మొత్తం ‘అందం’పైనే శ్రద్ధ పెడతారు. ఉన్నదున్నట్టుగా అంగీకరించడం వంటివి నేర్చుకునేలా కుటుంబంలోని వారంతా శ్రద్ధ చూపాలి. అందం ఉండటం కంటే ధైర్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి అనే విషయంలో గైడెన్స్ ఇవ్వాలి. లేదంటే అందం కోసం సర్జరీల వరకు వెళ్లడం అనే ఆలోచన ఒక వైరస్‌లా అంటుకుపోతుంది. సూసైడల్ టెండెన్సీ, ఇంటి నుంచి వెళ్లిపోవడం, ఇతరుల మాటలకు ప్రభావితులు అవడం వంటివి జరుగుతాయి. – గీతా చల్ల, సైకాలజిస్ట్ చదవండి: సీరియల్ నటి వివాహం.. నెట్టింట వీడియో వైరల్ -
'రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతుంటాయి'.. హీరోయిన్ ఎమోషనల్
Heroine Mehreen Pirzada Opens Up About Troubles In Film Industry: ‘సినిమా ఆర్టిస్టుల జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి’ అంటున్నారు హీరోయిన్ మెహరీన్. సోషల్ మీడియా వేదికగా ఆమె ఓ పోస్ట్ చేశారు. ‘‘మేము (ఆర్టిస్టులను ఉద్దేశిస్తూ) అన్నీ తెలిసే అనిశ్చితితో కూడిన జీవితాన్ని ఎంచుకుంటాం. జీవితానికి ఓ గ్యారంటీ ఉండదు. కొన్నిసార్లు సినిమాల్లోని మా పాత్రల లుక్స్ కోసం శారీరకంగా కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. షూటింగ్ షెడ్యూల్స్కు తగ్గట్లుగా మా జీవనశైలిలో ఎప్పటికప్పుడు కొత్త మార్పులు చోటుచేసుకుంటుంటాయి. ఇది మా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. చలికాలం, వర్షాకాలం, వేసవి.. అనే తేడాలు చూడకుండా సినిమాల కోసం పని చేస్తుంటాం. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇది చాలా బాధగా ఉంటుంది. మా జీవితాల్లోనూ ఎత్తు పల్లాలు ఉంటాయి. కెరీర్లో ఓ అద్భుతమైన విజయం దక్కిందనుకునేలోపే మరో వైఫల్యం వస్తుంది. ఒక్కోసారి రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతుంటాయి(సినిమా హిట్ అండ్ ఫెయిల్యూర్లను ఉద్దేశిస్తూ). ఇలా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సినిమాను ఓ కళారూపంగానే గౌరవిస్తాను’’ అన్నారు. కాగా తెలుగులో మెహరీన్ ఓ హీరోయిన్గా నటించిన ‘ఎఫ్ 3’ విడుదలకు సిద్ధంగా ఉంది. -
ఫీజులో రాయితీ.. సినీ కార్మికుల పిల్లలకు ఆఫర్: మోహన్ బాబు
Mohan Babu announces An Educational Offer: ‘తెలుగు సినీ పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌కి చెందిన పిల్లలకు ‘మోహన్‌బాబు విశ్వవిద్యాలయం’లో ఫీజుల్లో రాయితీ ఇవ్వనున్నాం’ అని నటుడు–నిర్మాత మంచు మోహన్‌బాబు అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. ‘‘47 ఏళ్లుగా సినీ కళామతల్లి నన్ను నటుడిగా, నిర్మాతగా ఆశీర్వదించి అక్కున చేర్చుకుంది. 30 ఏళ్లుగా ‘శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్’కి అధినేతగా ఉన్నాను. 1992లో ఈ విద్యాలయాల ప్రారంభం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోని కొంతమంది పిల్లలకు, సినిమా ఇండస్ట్రీకి చెందిన మరికొంతమంది పిల్లలకు 25శాతం మందికి కులమతాలకు అతీతంగా ఉచితంగా విద్య అందిస్తున్నాం. ఇప్పుడు శ్రీ విద్యానికేతన్ విద్యాలయాలన్నీ ‘మోహన్‌బాబు విశ్వవిద్యాలయం’ (యమ్‌బి యూనివర్శిటీ) గా మారింది. నాకెంతో ఇచ్చిన తెలుగు పరిశ్రమకు ఏదైనా ఉడతా భక్తిగా చేయాలనే ఆలోచన వచ్చింది. ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్‌కి చెందినవారి పిల్లలు మా ‘యమ్‌బీయు’లో చదవాలనుకుంటే ఫీజులో రాయితీ ఇస్తాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అన్నారు. -
ఆర్ఆర్ఆర్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
-
'నా ప్రేమకథ ఎప్పటికీ ముగియదు,సమంత ఎమోషనల్ పోస్ట్
Samantha Emotional Post On Her 12 Years Career: 'ఏమాయ చేశావే’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయిన సమంత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తి కావొస్తుంది. గౌతమ్‌మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతోనే సమంత తెరంగేట్రం చేసింది. ఈ చిత్రం విడుదలైన నేటికి 12ఏళ్లు. ఈ సందర్భంగా తన సినీ జర్నీని తెలియజేస్తూ సామ్ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేసుకుంది. 'చిత్ర పరిశ్రమలో నటిగా నా ప్రయాణం మొదలై నేటికి 12 సంవత్సరాలు. చదవండి: 'ప్రాణహాని ఉంది.. నా ప్రైవసీని అతిక్రమించారు' సమంత పోస్ట్ వైరల్ లైట్స్, కెమెరా, యాక్షన్.. వీటి చుట్టూ నాకున్న మధుర ఙ్ఞాపకాలు, అద్భుతమైన అనుభూతులకు 12 ఏళ్లు. ఇన్నేళ్ల ప్రయాణంలో ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్థమైన అభిమానులను పొందినందుకు ఆనందంగా ఉంది. సినిమాపై నాకున్న ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా' అంటూ సమంత పేర్కొంది. కాగా ఈ సినిమాతోనే సమంత-నాగ చైతన్య తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలా మొదలైన వారి పరిచయం ప్రేమగా మారి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో 2021, అక్టోబర్ 2న విడిపోతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తన తొలి సినిమా గురించి సమంత పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. చదవండి: బిగ్‌బాస్ నాన్‌స్టాప్: 24 గంటలు, 84 రోజులు, 17మంది కంటెస్టెంట్లు View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
Tollywood Drugs Case: కాల్ డేటా రికార్డింగ్స్ ఎక్కడ? ప్రశ్నించిన ఈడీ
-
టాలీవుడ్ అడ్డాగా మారనున్న విశాఖపట్నం
-
వాళ్ళిద్దరికీ తేడా అదే! ఇక మీరే నిర్ణయించుకోండి: పోసాని కృష్ణ మురళి
-
సీఎం జగన్ తో చిరంజీవ, మహేష్ ఏం మాట్లాడారో చూడండి
-
సినిమా టికెట్ రేట్స్ పై నా నిర్ణయం: సీఎం వైఎస్ జగన్
-
సమస్యలన్నీ పరిష్కారమవుతాయ్..
బంజారాహిల్స్: సినీ పరిశ్రమ సమస్యలన్నీ ఒకటి, రెండు నెలల్లో పరిష్కారమవుతాయని ప్రముఖ సినీ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిలిం చాంబర్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగనున్న సమావేశంతో అన్ని సమస్యలు కొలిక్కి వస్తాయని తెలిపారు. కూర్చొని చర్చించుకుంటే ప్రతి సమస్యకూ పరిష్కారం లభిస్తుందన్నారు. గతంలో ఎక్కువ ధరకు టికెట్లు విక్రయించారని, అయితే పన్నులు మాత్రం చెల్లించలేదన్నారు. ఇక ముందు అంతా పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. టికెట్ల రేట్లు పెంచితే డబ్బులొస్తాయనడం భ్రమని, దానికి మద్దతివ్వకూడదని చెప్పారు. అఖండ సినిమా పుష్పకంటే పెద్ద హిట్ అయినా.. పుష్ప సినిమానే ఎక్కువ కలెక్షన్లు వసూలు చేసిందని వెల్లడించారు. ఎక్కువ స్క్రీన్లు వేస్తే డబ్బులొస్తాయన్నారు. ఐదో షో వేసి చిన్న సినిమాలను ఆడిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో సినీ అవార్డులు ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న సినిమాలకు, ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ చేసుకున్న సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలని కోరారు. మినీ థియేటర్లను ప్రోత్సహించాలని, అవి వస్తేనే రెవెన్యూ పెరుగుతుందన్నారు. సినీ కార్మికులు ఈఎస్ఐ, పీఎఫ్ సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఈ రెండూ చెల్లిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని చెప్పారు. కరోనా కారణంగా థియేటర్లు మూతబడినందున మినిమం విద్యుత్ చార్జీలనే వసూలు చేయాలని తమ్మారెడ్డి విజ్ఞప్తి చేశారు. -
వెండితెరకు ‘బంగారు’ నగిషీలు.. సినిమాయే ప్రపంచం.. ఏకంగా 150 మంది
సబ్బవరం(పెందుర్తి)\విశాఖపట్నం: బంగారమ్మపాలెం గ్రామం.. సబ్బవరం మండలంలోని అందమైన పల్లెటూరు. ఉద్యానపంటలకు చిరునామా. ఆధ్యాత్మికంగా ఈ గ్రామానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇక్కడ స్వయం భూ సోమలింగేశ్వరస్వామి కొలువై ఉండటంతో ఈ గ్రామం జిల్లాలోనే ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. స్వామి పేరు మీద గ్రామాన్ని లింగాల తిరుగుడు అని కూడా పిలుస్తారు. గ్రామ జనాభా 1925. ఈ గ్రామం ఆధ్యాత్మికంగానే కాకుండా ఎన్నో అంశాల్లో ప్రత్యేకతను చాటుకుంటోంది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు, ఈ గ్రామానికి ఎంతో అనుబంధం ఉంది. ఎంతో మందికి వినోదం పంచే సినీ రంగంలో గ్రామానికి చెందిన దాదాపు 150 మంది వరకు వివిధ విభాగాల్లో పనిచేస్తూ గుర్తింపు పొందారు. వీరిలో కొందరు హైదరాబాద్‌లోనే స్థిరపడగా.. మరికొందరు అక్కడ తాత్కాలికంగా నివాసం ఉంటూ గ్రామానికి వచ్చి పోతుంటారు. లైట్‌మెన్‌గా, ఆర్ట్ డైరెక్టర్లుగా, మేకప్‌మెన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. చిరంజీవితో వెంకట్.. 1994లో గ్రామానికి చెందిన దొడ్డి రాము హైదరాబాద్ వలస వెళ్లాడు. సినీ పరిశ్రమలోని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగించాడు. కొన్నాళ్లు్ల తర్వాత స్వగ్రామం వచ్చిన రాము.. తన స్నేహితులతో సినిమా కబుర్లు చెప్పేవాడు. దీంతో సినీ రంగంపై వారికి ఆసక్తి పెరిగింది. ఒకరిద్దరినీ వెంట తీసుకెళ్తానని చెప్పడంతో బయలుదేరారు. అలా కొన్నాళ్లు సినీ పరిశ్రమలో వారంతా కలిసి పనిచేశారు. ఆ తర్వాత రాము గ్రామానికి తిరిగి వచ్చేశాడు. ఎల్ఐసీ ఏజెంట్‌గా, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ స్థిరపడ్డాడు. ఈ ప్రాంతంలో వ్యవసాయమే జీవనాధారం. వ్యవసాయం, వ్యవసాయ కూలి పనులు చేసుకునే వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఉపాధి కోసం సినీ పరిశ్రమకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే అక్కడ స్థిరపడిన వారి ద్వారా తమ ప్రయత్నాలు కొనసాగించారు. అల్లు అర్జున్‌తో బంగారమ్మపాలెం వాసులు ముందుగా దొడ్డి రాము.. ఆ తర్వాత గ్రామానికి చెందిన దాడి వెంకట సూర్యనారాయణ వెళ్లారు. అతను కొంతకాలం పనిచేసిన తర్వాత దొడ్డి రమేష్, సూరిశెట్టి అర్జున్, దాడి శంకర్లను తీసుకుని వెళ్లారు. కిల్లి చిన సత్యనారాయణ లైట్‌మన్‌గా, ఆడారి చంద్రరావు లైట్‌మన్‌గా, సూరిశెట్టి ఉత్తరకుమార్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో, బొడ్డేటి శివ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, కిల్లి నాగర వెంకట అప్పారావు లైట్‌మన్‌గా, దొడ్డి కామేష్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో హెల్పర్‌గా, దాడి గోవింద్ ప్రొడక్షన్ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా గ్రామానికి చెందిన సూరిశెట్టి ఉత్తర కుమార్, సూరిశెట్టి అర్జున్ తదితరులు మంచిస్థాయిలో స్థిరపడ్డారు. అనంతరం వీరి ద్వారా గ్రామం నుంచి యువకులు సినీ పరిశ్రమకు తరలివెళ్లారు. అక్కడ లైట్‌బాయ్స్, కెమెరా అసిస్టెంట్లు, ప్రొడక్షన్ అసిస్టెంట్లు, మేకప్‌మెన్ తదితర విభాగాల్లో రాణిస్తున్నారు. ఈ గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన వీరి బంధువులు, స్నేహితులు కూడా ఈ రంగం వైపు అడుగులు వేస్తున్నారు. సినీ పరిశ్రమలో ప్రాతినిథ్యం ఇలా.. ♦ఆర్ట్ డైరెక్టర్లుగా సూరిశెట్టి ఉత్తర కుమార్, సూరిశెట్టి అర్జున్, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్లుగా ఎస్.బాలకృష్ణ, దొడ్డి కామేష్, ఎస్.పరమేష్, ఎస్.వి.కె అప్పారావు పనిచేస్తున్నారు. దాడి లక్ష్మణ్, భీశెట్టి గోపాల్, ఆడారి సోమునాయుడు, దొడ్డి ఉమ, ఎస్.చంటి, కోరుబిల్లి శ్రీను, దొడ్డి తేజ, పి.పవన్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో సహాయకులుగా ఉన్నారు. ♦హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కు దాడి శంకర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ♦హీరో బాలకృష్ణకు దొడ్డి నిరంజన్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ♦లైట్మెన్లుగా 20 మంది, సెట్, ప్రొడక్షన్లో 110 మంది, మేకప్ డిపార్ట్మెంట్లో 15, కెమెరా అసిస్టెంట్లుగా నలుగురు పనిచేస్తున్నారు. సంతోషంగా ఉంది గ్రామంలో సుమారు 1,925 మంది జనాభా ఉంటారు. అధిక సంఖ్యలో గ్రామస్తులు సినీ పరిశ్రమలో పని చేస్తుండటం సంతోషంగా ఉంది. వీరంతా పండగలు, శుభకార్యాలకు గ్రామానికి వస్తుంటారు. ఆ సమయంలో గ్రామం ఎంతో సందడిగా ఉంటుంది. మా అన్నయ్య వెంకట కోటి సూర్యనారాయణ 1998లో చిత్ర పరిశ్రమలో పని చేసేందుకు హైదరాబాద్ వెళ్లారు. ఆయన ఎంతో మందిని సినీ ఇండస్ట్రీకి తీసుకెళ్లి ప్రోత్సహించారు. అనారోగ్యంతో ఎనిమిదేళ్ల కిందట ఆయన మృతి చెందారు. – దాడి కన్నంనాయుడు, గ్రామ పెద్ద, బంగారమ్మపాలెం బతికున్నంత కాలం సినీ పరిశ్రమలోనే.. నేను, నా కుమారుడు పోలమరశెట్టి రామకృష్ణ సినీ రంగంలో ఉన్నాం. నేను లైటింగ్ విభాగంతో పాటు కెమెరామెన్ క్రేన్ సహాయకుడిగా పనిచేస్తుంటాను. 2002లో రూ.11 వేలు చెల్లించి యూనియన్‌లో చేరాను. మా అబ్బాయి రామకృష్ణకు ఏడాది కిందట రూ.4లక్షలతో కార్డు చేయించాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. నాకు బాబు, పాప ఉన్నారు. ఇద్దరికీ వివాహాలు జరిగాయి. నిజం, నాగ, ఒక్కడు, అతడు, సైనికుడు, అతిథి, పౌర్ణమి, పుష్ప, సీతయ్య, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, లక్ష్మీ నరసింహ, మిత్రుడు, ఒక్క మగాడు, గోపాల గోపాల, లక్ష్మీ తదితర 250కి పైగా చిత్రాలకు పనిచేశాను. గ్రామంలో 30 సెంట్ల వరకు భూమి, సొంత ఇల్లు ఉంది. గతంలో వ్యవసాయంతో పాటు వ్యవసాయ కూలి పనులు చేసుకునేవాళ్లం. ఇక్కడ కష్టానికి తగ్గ ఫలితం రాలేదు. ప్రస్తుతం సినిమాలకు పనిచేయడం అలవాటుగా మారిపోయింది. బయట ఏ పని చేసుకోలేను. బతికి ఉన్నంత కాలం ఇదే పరిశ్రమలో కొనసాగుతాను. – పొలమర శెట్టి రాము ‘ఇడియట్’తో కెరీర్ ప్రారంభం గ్రామానికి చెందిన దాడి వెంకట సూర్యనారాయణతో 1999లో దొడ్డి రమేష్, సూరిశెట్టి అర్జున్, దాడి శంకర్లు వెళ్లారు. వీరు ముగ్గురూ హెల్పర్లుగా పనిచేస్తూ.. యూనియన్‌లో చేరారు. 2000లో నేను సినీ పరిశ్రమకు వెళ్లాను. ఆర్ట్ డైరెక్టర్ సత్య శ్రీనివాస్ దగ్గర అప్రెంటీస్‌గా చేరాను. అప్పట్లో నాకు రోజుకు రూ.100 ఇచ్చేవారు. 2002లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇడియట్ సినిమాతో అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా నా కెరీర్ ప్రారంభమైంది. గౌరమ్మ(నువ్వు నాకు నచ్చావ్ కన్నడ రీమేక్), విష్ణు సేన(ఠాగూర్ కన్నడ రీమేక్), అడుగు, మంజీర, వీలైతే ప్రేమిద్దాం, వానవిల్లు, మామ చందమామ, బైలంపూడి సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ఇడియట్, ఇందిరమ్మ, శివరాం, ఒట్టేసి చెబుతున్నా, అనుమానాస్పదం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, తులసి, జోష్, ఆకాశమంత, వసూల్ రాజా, గబ్బర్ సింగ్, బాద్షా, జనతా గ్యారేజ్, స్పైడర్ తదితర చిత్రాలకు అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశాను. ప్రస్తుతం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా సెట్స్‌పై ఉంది. డార్లింగ్ సినిమాకు అరుకులో ఒక పెద్ద సెట్ వేశాం. 32 రోజుల పాటు రోజుకు 150 మందితో పని చేశాం. ఇక్కడ 28 రోజుల పాటు షూటింగ్ జరిగింది. గబ్బర్‌సింగ్‌కు ఒక బజార్ స్ట్రీట్ మొత్తం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేశాం. జనతా గ్యారేజ్‌కు గ్యారేజ్, హౌస్ సెట్ వేశాం. – సూరిశెట్టి ఉత్తర కుమార్ 2000లో సినీ పరిశ్రమకు వెళ్లాను సినీ పరిశ్రమలో లైట్‌మన్‌గా పనిచేసేవాడిని. తర్వాత కొంత యువకులను సినీ పరిశ్రమకు తీసుకెళ్లాను. ప్రస్తుతం గ్రామం నుంచి చాలా మంది యువకులు సినీ రంగానికి వెళ్లి.. అక్కడే స్థిరపడ్డారు. నేను సినీ పరిశ్రమ నుంచి తిరిగి వచ్చేసి గ్రామంలోనే ఉంటున్నాను. నాకు ఇప్పటికీ లైటింగ్ యూనియన్ గుర్తింపు కార్డు ఉంది. – కిల్లి చినసత్యనారాయణ తొలిరోజుల్లో నా జీతం రూ.170 నేను, నా తమ్ముడు భాస్కరరావు సినీ రంగంలోనే ఉన్నాం. 2002 ఆగస్టులో గ్రామంలో తెలిసిన వారు సినీ పరిశ్రమకు వెళ్తుండటంతో.. వారితో కలసి వెళ్లాం. ప్రస్తుతం నేను లైటింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను. అప్పట్లో యూనియన్‌లో చేరేందుకు కార్డు కోసం రూ.10 వేలు కట్టాను. ప్రస్తుతం యూనియన్‌లో చేరాలంటే రూ.లక్ష చెల్లించాలి. మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ నాగ సినిమాకు పనిచేశాను. ఆ సినిమా కోసం కేరళలో ఓ పాట చిత్రీకరించారు. యూనిట్ సభ్యులతో కలిసి అక్కడకు వెళ్లడం ఎంతో అనుభూతిని మిగిల్చింది. సినిమాలో పనిచేసిన కొత్తలో రోజుకు రూ.170 ఇచ్చేవారు. ప్రస్తుతం రూ.1,100 ఇస్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడి.. అద్దె ఇంట్లోనే నెట్టుకొస్తున్నాను. పిల్లలు రామచరణ్ 6వ తరగతి, లక్షయ్ కుమార్ 5వ తరగతి చదువుతున్నారు. పుష్ప, సైరా, సరిలేరు నీకెవ్వరు, బ్రహ్మోత్సవం, అర్జున్ సురవరం, ఒక్కడు, నిజం తదితర 200 చిత్రాలకు పైగా పనిచేశాను. గ్రామంలో భూమి లేదు. సొంత ఇల్లు ఉంది. పండగలు, శుభకార్యాలకు కుటుంబ సభ్యులమంతా గ్రామానికి వస్తుంటాం. కొన్ని రోజులు ఇక్కడ గడిపి మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోతాం. – బత్తిన నాగసూరి అప్పారావు -
త్వరలో టికెట్ రేట్ల హేతుబద్ధీకరణ
సాక్షి, అమరావతి: ఏపీ రాష్ట్రంలో సినిమా టికెట్ రేట్ల హేతుబద్ధీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోందని ఏపీ ఫిల్మ్ చాంబర్ వైస్ ప్రెసిడెంట్ ముత్యాల రాందాస్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం సినీ పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తోందన్నారు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక కమిటీ బుధవారం సచివాలయంలో సమావేశ మైంది. ఇందులో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, సినీ గోయర్స్, థియేటర్లు, ఫిల్మ్ చాంబర్ అసోసియేషన్ సభ్యుల నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలను స్వీకరించారు. మున్సిపాలిటీలు, నగర, గ్రామ పంచాయతీల్లో రేట్లు తక్కువగా ఉండటంతో వాటిని పెంచాలని పలువురు సభ్యులు కమిటీకి విజ్ఞప్తి చేశారు. సుమారు మూడు గంటలపాటు జరిగిన చర్చలో టికెట్ రేట్లను ప్రాంతాల వారీగా నిర్ణయిం చాలా?, థియేటర్లను బట్టి ఉండాలా? అనే అంశా లపై కూలంకషంగా చర్చించారు. ఈ సందర్భంగా సచివాలయంలో రాందాస్ మీడియాతో మాట్లాడు తూ.. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందన్నా రు. తదుపరి సమావేశంలో అన్ని అంశాలపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయన్నారు. పలు సిని మాలు విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ప్రక్రి యను వేగంగా పూర్తిచేయాలని కోరామన్నారు. మల్టిప్లెక్స్‌లో కూడా సామాన్యులకు వినోదం దొరికేలా ఉండాలన్నారు. ఎగ్జిబిటర్ వేమూరి బాలరత్నం మాట్లాడుతూ.. అన్ని తరగతుల టికెట్ రేట్లను పెంచాలని కమిటీకి నివేదించామన్నారు. కొత్తగా ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు.. కమిటీ సభ్యులు సూచించిన రేట్లు చాలావరకు దగ్గరగానే ఉన్నట్లు చెప్పారు. అలాగే, సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ విమర్శకుడు ఓంప్రకాశ్ మాట్లాడుతూ.. కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, ప్రభుత్వం కూడా అందరికీ ఆమోదయోగ్యమైన విధంగా టికెట్ రేట్లు నిర్ణయిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. సౌత్ ఇండియా ఫిల్మ్ చాంబర్ ఉపాధ్యక్షుడు సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ.. పంచాయతీలు, నగర పంచాయతీల్లో టికెట్ రేట్లు పెంచాలని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రాంతాలను బట్టి కాకుండా ఏసీ, నాన్ ఏసీ థియేటర్ల వారీగా రేట్లు నిర్ణయించాలన్నారు. -
తవాయిఫ్‌ల నుంచి దేవదాసీల వరకు
స్త్రీని తన లైంగిక బానిస చేసుకోవడానికి పురుషుడు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. బలవంతపు పడుపువృత్తి లేదా ఆచారాల ముసుగులో నిర్బంధ లొంగుబాటు కొనసాగించాడు. దక్షిణభారతదేశంలో దేవదాసి వ్యవస్థ ఉత్తర భారతదేశంలో తవాయిఫ్‌లు గొప్ప నాట్యకత్తెలుగా సంగీతకారిణిలుగా గుర్తింపు పొందినా వీరి లైంగిక అస్తిత్వం వీరిని సమాజంలో అథమ స్థానానికి నెట్టింది. సినిమా ఈ పాత్రలను తరచూ ప్రస్తావించింది. తాజాగా ‘శ్యామ్ సింగరాయ్’ కూడా దేవదాసీ వ్యవస్థ దురాచారాన్ని గట్టిగా చర్చించింది. అలాంటి పాత్రలపై ఒక అవలోకన. ‘శ్యాం సింగరాయ్’ సినిమాలో బెంగాల్లో 1970 నాటి సాంఘిక దురన్యాయాల మీద తిరగబడతాడు హీరో నాని. ఆ కాలంలో హరిజనులపై అగ్రకులాలు చేసే దుర్మార్గాలను వ్యతిరేకిస్తాడు. అది కొంత వరకు కుటుంబం సహిస్తుంది. కాని ఎప్పుడైతే అతడు ‘దేవదాసి’ వ్యవస్థలో మగ్గుతున్న సాయి పల్లవిని తీసుకుని కోల్‌కతా వెళ్లిపోయి ఆమెకు విముక్తి ప్రసాదించి వివాహం చేసుకుంటాడో ఆ కుటుంబం రగిలిపోతుంది. తమ పరువును బజారున పడేస్తున్నాడని ఏకంగా అతణ్ణి హత్య చేసి శవం మాయం చేస్తుంది. ‘స్త్రీ శరీరానికి’, ‘పాతివ్రత్యానికి’, దాని చుట్టూ ఉండే ‘సామాజిక విలువ’కు ఈ హత్య ఒక తీవ్ర సూచిక. తమ ఇంటి యువకుడు స్త్రీలను పేదరికంలో నుంచి బయటకు తెస్తే ఆమోదం ఉంటుందేమో కాని, తక్కువ కులం నుంచి వివాహం చేసుకుంటే ఆమోదం ఉంటుందేమో కాని, ‘శీల పతనం’లో ఉండే స్త్రీకి గౌరవం తేవడానికి ప్రయత్నిస్తే మాత్రం కుటుంబం కాని, సమాజం కాని సహించదు. పురుషుడి శీల పతనానికి మించి స్త్రీల శీల పతనానికి ఎక్కువ విలువ, తీవ్రత ఆపాదిస్తుంది సమాజం. నిజానికి పురుషుడు తన స్వార్థం, సుఖం కోసం కల్పించిన వ్యవస్థ ‘దేవదాసీ’ వ్యవస్థ. దేవుణ్ణి అడ్డం పెట్టి పై వర్గాల వారు కింద వర్గాల స్త్రీలను లైంగిక దోపిడికి వాడుకోవడమే ఈ వ్యవస్థ పరమ ఉద్దేశం. పురుషుడు తాను తయారు చేసిన ఈ వ్యవస్థను గౌరవించడు సరి కదా ఈసడిస్తాడు. ఈ వర్గంలో ఎంతో గొప్ప ప్రావీణ్యం ఉన్న స్త్రీలు కళల్లో తయారైనా వారంతా ఇంటి బయటే ఉండాలి తప్ప ఇంట్లోకి రావడానికి వీల్లేదు. ఈ భావజాలాన్ని భారతీయ/ తెలుగు సినిమా అప్పుడప్పుడు చర్చిస్తూ వచ్చింది. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ కూడా చర్చించింది. ‘ధర్మపత్ని’తో మొదలయ్యి... 1941లో బి.శాంతకుమారి, భానుమతి నటించిన ‘ధర్మపత్ని’ సినిమా నుంచి ‘దేవదాసీ’ వ్యవస్థ ప్రస్తావన మన సినిమాల్లో వస్తూనే ఉంది. ‘ధర్మపత్ని’లో హీరోయిన్ శాంతకుమారి పెంపుడు తల్లి ఒకప్పుడు దేవదాసి అని తెలియడంతో హీరోకు కష్టాలు మొదలవుతాయి. దేవదాసి పెంచిన కూతురిని కోడలిగా ఆమోదించడం అసాధ్యమని హీరో వివాహానికి ఆటంకం ఏర్పడుతుంది. చివరకు శాంతకుమారి హీరోను పెళ్లి చేసుకోలేకపోతుంది. ‘దేవదాసు’లో ప్రేమ విఫలమైన అక్కినేని దేవదాసి అయిన చంద్రముఖి (లలిత–ట్రావెన్కోర్ సిస్టర్స్) పంచన చేరుతాడు. ఆ పాత్ర ఎంత ఉదాత్తంగా ఉన్నా ఆమె స్థాయి ఇలాంటి పతితులకు ఆశ్రయం కల్పించేదే తప్ప ఇల్లాలు అయ్యే స్థాయి మాత్రం కాదు. ‘శంకరాభరణం’లో శంకర శాస్త్రి అంతటివాడు ‘ఆటపాటలే వృత్తి’గా చేయబడిన కుటుంబం నుంచి వచ్చిన మంజుభార్గవి చేతికి తంబూర ఇస్తేనే సహించలేకపోతుంది పాడులోకం. మంజుభార్గవి సంగతి సరే ఏకంగా శంకరశాస్త్రినే నిరాకరిస్తుంది. స్త్రీలు మోయాల్సిన పాతివ్రత్యపు బరువు పట్ల దానికుండే పట్టింపు అది. మరి ఆ స్త్రీలను ఆ స్థితికి తెచ్చింది ఎవరు? ‘మేఘ సందేశం’లో ఇంటి ఇల్లాలి నుంచి ఎటువంటి స్ఫూర్తి పొందలేని అక్కినేని కళావంతురాలైన జయప్రదను అభిమానిస్తే ఆరాధిస్తే వారిరువురికి కూడా ఏకాంత వాసమే దక్కుతుంది. స్త్రీలకు తమ శరీరాల మీద, జీవితాల మీద పూర్తి హక్కు లేదని సమాజం పదే పదే చెప్పడం ఇది. అనార్కలికి దక్కని ప్రేమ... దక్షణాదిలో దేవదాసీ వ్యవస్థ ఉన్నట్టే ఉత్తరాదిలో తవాయిఫ్‌ల వ్యవస్థ ఉంది. తవాయిఫ్‌లు వినోద నాట్యకత్తెలు. గాయనీమణులు. దర్బారుల్లో ఆడిపాడటం వీరి పని. అంతిమంగా ఎవరో ఒకరి పంచన వీరు చేరక తప్పదు. వైవాహిక జీవితం వీరికి ఉండే అవకాశం లేదు. అందుకే ‘మొఘల్–ఏ–ఆజమ్’లో దిలీప్ కుమార్‌ను ప్రేమించిన మధుబాలకు ఆ ప్రేమ దక్కదు. ఆమెకు ప్రాణాలతో బొందపెట్టే శిక్ష దక్కుతుంది. ఆమె ఏ చిన్న నవాబు కూతురో అయినా ఈ సమస్య వచ్చి ఉండేది కాదు. తండ్రి ఎవరో తెలియని ఒక వ్యవస్థను తయారు చేసి ఆ పుట్టిన సంతానాన్ని తిరిగి అదే కూపంలో ఉంచే అమానవీయమైన వ్యవస్థ ప్రతిఫలం ఇది. దీనిని స్త్రీలే అనుభవించాలి. పురుషుడు కాదు. ‘గైడ్’ సినిమాలో దేవదాసీ అయిన వహిదా రహెమాన్‌ను పెళ్లి చేసుకుని ఉద్ధరించాననుకుంటాడు ఆమె భర్త. కాని అతడి లోలోపల ఆమె మీద అనుమానం, చిన్నచూపు. ఆ పెళ్లి నుంచి ఆమె బయటపడి దేవానంద్లో ప్రేమ వెతుక్కున్నా ఆ పరుషుడు కూడా అంతే దారుణంగా ఆమెతో వ్యవహరిస్తాడు. చివరకు ఆమె జీవితకాల విరక్తిని పొందుతుంది. ఇక రేఖ చేసిన ‘ఉమ్రావ్‌జాన్’ తవాయిఫ్‌ల జీవన విషాద వీచిక. ఎన్నో ప్రశ్నలు.. పాత్రలు మత దురాచారాల వల్ల కాని, కొన్ని సమూహాల వెనుకబాటుతనం వల్ల గాని, సామాజిక దోపిడి వల్ల గాని స్త్రీలు లైంగిక వ్యాపారాల్లో చిక్కుకుంటే ఆ స్త్రీలు తిరిగి గౌరవం పొందడానికి యుగాల కొలదీ పోరాటం చేయవలసి వస్తోంది. వారికి ఉండవలసిన సమాన హక్కుల గురించి, సమాన మర్యాద గురించి మారవలసిన భావజాల దృష్టి చాలా ఉంది. ‘పవిత్రత’, ‘శీలం’ అనే మాటలకు సర్వకాల సర్వావస్థల్లో ఒకే ప్రమాణం ఉండదని, స్థలకాలాలను బట్టి వాటికి అర్థాన్ని ఆపాదించాల్సిన పద్ధతి మారుతుండాలని, ముఖ్యంగా ఇవి స్త్రీలు మాత్రమే మోయాల్సిన పదాలు కావని పురుషులు కూడా సమాన హక్కుదారులే అని మళ్లీ మళ్లీ చర్చించాల్సిన సినిమాలు పాత్రలు రావాలి. ఇకపై అదే జరుగుతుందని ఆశిద్దాం. -
అందుబాటులో వినోదం
సాక్షి, అమరావతి/గన్నవరం: సామాన్యుడికి వినోదం అందుబాటులో ఉండాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచన, ఆకాంక్షను అభినందిస్తున్నానని ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అదే సమయంలో చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి బాధలను ముఖ్యంగా ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల సాధక బాధకాలు, సినీ కార్మికుల కష్టాలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించానన్నారు. తాను చెప్పిన అన్ని విషయాలను సానుకూలంగా ఆలకించారని తెలిపారు. సినీ ఇండస్ట్రీ విషయంలో సీఎం జగన్ స్పందన తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నారు. తాడేపల్లిలోని సీఎం నివాసంలో గురువారం ఆయన సీఎం జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం తిరిగి హైదరాబాద్ వెళుతూ గన్నవరం విమానాశ్రయం వద్ద విలేకరులతో మాట్లాడారు. టికెట్ల వివాదం జఠిలం అవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్, సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా తనను ఆహ్వానించారని.. భేటీ చాలా సంతృప్తికరంగా, ఆనందంగా జరిగిందని చెప్పారు. ఈ పండుగ పూట ఒక సోదరుడిగా తనను ఆహ్వానించి, విందు భోజనం పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఆ ఆలోచన నాకు బాగా నచ్చింది ► సినిమా అందరికీ అందుబాటులో ఉండాలన్న సీఎం జగన్ ఆలోచన నాకు బాగా నచ్చింది. సినిమా టికెట్ల ధరల విషయంపై కొన్ని రోజులుగా మీమాంస ఉంది. అగమ్యగోచర పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందోననే ఆందోళన ఒకవైపు.. ఇండస్ట్రీకి మేలు చేద్దామనేదే తమ ఉద్దేశం అని చెబుతున్న ప్రభుత్వం మరో వైపు.. కొలిక్కిరాని ఈ సమస్య జఠిలమవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ ప్రత్యేకంగా నన్ను రమ్మని ఆహ్వానించారు. ► ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక కోణంలో వినడం కాదు, రెండో కోణంలోనూ వినాలని సీఎం అన్నారు. రెండు వైపులా అంశాలను తెలుసుకోవాలని సీఎం ఆకాంక్షించారు. అది ఎంతో బాధ్యతగా అనిపించింది. ఇండస్ట్రీ, ఎగ్జిబిటర్ల ఇబ్బందులు ఒక్కొక్కటి సీఎం జగన్‌కు కూలంకషంగా తెలియజేశాను. ఎన్నో ఇబ్బందులున్నాయి.. ► సినీ ఫీల్డ్ పైకి కనిపించినంత గ్లామర్‌గా ఉండదు. రెక్కాడితే కాని డొక్కాడని పేదలు ఎంతో మంది ఇండస్ట్రీని నమ్ముకుని ఉన్నారు. థియేటర్ల యజమానులకూ అనేక బాధలు ఉన్నాయి. సినిమా హాళ్లు మూసేస్తే బెటర్ అనే భావనలో కొందరు యజమానులు ఉన్నారు. ► కోవిడ్ సమయంలో సినీ కార్మికులు దయనీయ పరిస్థితిలో గడిపారు. ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటితో పాటు ఇండస్ట్రీలో అన్ని కేటగిరీలకు చెందిన వారి సమస్యలను వివరించాను. నిర్మాణాత్మక సూచనలు చేశాను. అన్నీ పరిశీలిస్తామన్నారు ► అన్ని రకాలుగా ఆలోచించి, ఉభయ వర్గాలకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారు. టిక్కెట్ ధరలపై జారీ చేసిన జీవోను పునః పరిశీలిస్తామని తెలిపారు. ► ఐదో షో వేసుకునే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తామన్నారు. వీటిని ప్రభుత్వ కమిటీకి నివేదిస్తానని సీఎం హామీ ఇచ్చారు. ఆ తర్వాత కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఈ సమావేశం వివరాలను హైదరాబాద్‌కు వెళ్లాక సినీ ఇండస్ట్రీలోని చిన్నా పెద్దలకు తెలియజేస్తాను. ► ఆ తర్వాత మరోసారి సీఎం జగన్‌తో భేటీ అవుతాను. వచ్చే సమావేశానికి అందర్నీ పిలిస్తే అందరం వస్తాం. ఒక వేళ నన్నొక్కడినే పిలిస్తే నేనొక్కడినే వస్తాను. సినీ ఇండస్ట్రీ పెద్దగా కాదు ఒక బిడ్డగా చెబుతున్నా.. ఎవరూ ఆందోళన చెందొద్దు. అందరూ సంయమనంతో ఉండాలి. తొందరపడి లేనిపోని కామెంట్స్ చేయొద్దని కోరుతున్నా. ► పెద్ద బడ్జెట్ సినిమానా.. లేక చిన్న సినిమానా అన్న భేదం లేకుండా త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా. రెండు మూడు వారాల్లో ప్రభుత్వ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే జీవో ఇస్తామని సీఎం తెలిపారు. సీఎం జగన్‌ను సన్మానించిన చిరంజీవి చిరంజీవి గురువారం తాడేపల్లిలోని సీఎం ఇంటి వద్దకు రాగానే వైఎస్ జగన్ సాదరంగా ఆయన్ను ఇంట్లోకి ఆహ్వానించారు. ఇంట్లోకి అడుగుపెట్టగానే చిరంజీవి తొలుత వైఎస్ జగన్‌ను శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఇద్దరూ 1.20 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ భేటీపై చిరంజీవి పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. పండుగ పూట సీఎం నాతో సోదరుడిగా వ్యవహరించారని, వైఎస్ భారతి ఆప్యాయంగా వడ్డించారని ఆనందం వ్యక్తం చేశారు. వారిద్దరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. కాగా, మధ్యాహ్నం 12 గంటలకు చిరంజీవి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నప్పుడు, 3.10 గంటలకు తిరిగి వెళ్లేటప్పుడు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. -
టికెట్ రేట్లపై నిర్ణయం ప్రభుత్వానిదే
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ రేట్ల విషయంలో అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదేనని ప్రముఖ దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) చెప్పారు. ప్రభుత్వం నియమించిన కమిటీ ద్వారా మంచి నిర్ణయం వెలువడుతుందనే నమ్మకం ఉందన్నారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ఆయన సోమవారం సచివాలయంలో భేటీ అయ్యారు. అనంతరం ఆర్జీవీ విలేకరులతో మాట్లాడుతూ ‘టికెట్ రేట్ల తగ్గింపు విషయంలో నా అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లా. చర్చలు వంద శాతం సంతృప్తినిచ్చాయి. టికెట్ ధరలు తగ్గించొద్దని చెప్పాను. సినిమా తీసిన వాళ్లకే టికెట్ రేటు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలని కోరాను. సినీ పరిశ్రమకు ప్రతినిధిగా రాలేదు. ఒక దర్శక, నిర్మాతగా మాత్రమే వ్యక్తిగత వాదన వినిపించాను’ అని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించిందనే వాదనతో ఏకీభవించనని చెప్పారు. పవన్, బాలకృష్ణను టార్గెట్ చేయడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటోందనే ఆరోపణలు సరైనవి కావన్నారు. ‘సినీ రంగమంటే ఒకరిద్దరు కాదు. ఈ ఒక్క చర్చతోనే టికెట్ల అంశానికి ముగింపు రాదు. పరిశ్రమలోని వందల మంది అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి భేదాభిప్రాయాలు ఉండకూడదు. అందుకే సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందో మంత్రికి వివరించాను.’ అని చెప్పారు. ఏపీలో నిబంధనలు పాటించకపోవడం వల్లే థియేటర్లు మూసివేశారన్నారు. కలెక్షన్లు, పన్ను ఎగవేతపై ప్రభుత్వాన్ని మోసం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు. ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు: మంత్రి పేర్ని నాని టికెట్ రేట్ల విషయంలో ఆర్జీవీలానే సినీ పరిశ్రమలో ఎవరైనా వచ్చి అభిప్రాయాలు తెలపవచ్చని మంత్రి పేర్ని నాని చెప్పారు. వర్మతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టడం లేదని తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టంలోని అంశాలనే అమలు చేస్తున్నామన్నారు. 2013లో ఇచ్చిన జీవోతో పోలిస్తే రేట్లు పెంచామని చెప్పారు. అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం నియమించిన కమిటీ దృష్టికి తీసుకెళ్లొచ్చన్నారు. త్వరలోనే ఈ కమిటీ మరోసారి భేటీ అవుతుందన్నారు. కరోనా నేపథ్యంలో నైట్ కర్ఫ్యూతో పాటు థియేటర్లలో 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన విధించామని చెప్పారు. సంక్రాంతికి సినిమా విడుదలకు ఇబ్బందిపడే వారు వాయిదా వేసుకోవాలన్నారు. కోవిడ్ కారణంగానే ‘ఆర్ఆర్ఆర్’, రాథే శ్యామ్ విడుదల వాయిదా వేసుకున్నారని గుర్తు చేశారు. కోవిడ్ టాస్క్‌ఫోర్స్ పరిస్థితులను అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. -
Actor Shritej Latest Interview: నటుడు శ్రీతేజ్ ఫుల్ ఇంటర్వ్యూ
-
నటుడు శ్రీతేజ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో
-
ఫిల్మ్ ఇండస్ట్రీకి కరోనా టెన్షన్
-
సినిమాలతో సమానంగా ప్రాధాన్యతనివ్వాలి
సాక్షి, హైదరాబాద్: నాటకాలు సమాజంలోని పరిస్థితులను, వాస్తవ స్థితిగతులను ప్రతిబింబి స్తాయని, అలాంటి నాటకాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని భారత ఉప రాష్ట్రపతి ముప్ప వరపు వెంకయ్యనాయుడు చెప్పారు. సినిమా రంగంతో సమానంగా నాటక రంగానికి ప్రాధాన్యత పెరగాలని సూచించారు. శుక్రవారం హైదరా బాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీ సమావేశ మందిరంలో జరిగిన ‘నాటక సాహిత్యోత్సవం’ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి పాల్గొన్నారు. తెలుగు సాహితీ ప్రపంచంలో పేరెన్నికగన్న 100 ప్రసిద్ధ నాటకాల సంకలనంగా ‘తెలు గు ప్రసిద్ధ నాటకాలు’ పేరిట రూపొందిన 6 సంకలనా లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడారు. పూర్వ వైభవం రావాలి: సమాజంపై ప్రభావం చూపిం చడంలో నాటకాల పాత్ర కీలకమని ఉప రాష్ట్రపతి చెప్పా రు. భాష ఉన్నతికి చిరునామాగా ఉంటూ, సామాజిక హితాన్ని కాంక్షిస్తూ, ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని పంచే నాటకాలకు పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించారు. సినిమా వచ్చాక నాటకం బలహీన పడిందని చాలామంది అంటుం టారని కానీ తాను ఆ వాదనతో ఏకీభవించడం లేదని చెప్పారు. సినిమాతో సమానంగా నాట కాన్ని, దాని ప్రాధాన్యతను నిలబెట్టుకోవాలనేదే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ప్రోత్సాహానికి ముందుకు రావాలి ప్రభుత్వాలే కాకుండా, ప్రైవేట్ సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థలు నాటక రంగానికి ప్రోత్సాహం ఇచ్చేందుకు ముందుకు రావాలని వెంకయ్య కోరారు. ప్రైవేట్ టీవీ ఛానెళ్ళు నాటకాలకు ప్రోత్సాహం అందించే ప్రయత్నాలు చేయాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలల పిల్లలకు విద్యతో పాటు, సాంస్కృతిక కార్యక్రమాల దిశగా ప్రోత్సాహం అందించాలన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలకు అవగాహన కల్పించడంలో నాటక కళాకారుల పాత్రను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి, ఏపీ మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఆంధ్ర నాటక కళా పరిషత్ అధ్యక్షులు బొల్లినేని కృష్ణయ్య, తెలుగు ప్రసిద్ధ నాటకాలు సంకలనాల సంపాద కులు వల్లూరి శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఓ ప్రత్యేక ఈవెంట్లో పునీత్ రాజ్ కుమార్ వేడుకలు.. ఎప్పుడంటే..?
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ వేడుకలను ఒక ప్రత్యేక కార్యక్రమంలో నిర్వహించబోతున్నారు. కన్నడ సినీ పరిశ్రమ, కర్ణాటకలోని రాజకీయ నాయకులు దివంగత నటుడి వేడుకలను నవంబర్ 16న జరపనున్నారు. ఈ రోజంతా కన్నడ చిత్ర పరిశ్రమ రోజంతా మూసివేస్తారు. 3 గంటలపాటు జరిగే ఈ ఈవెంట్లో ఎవరెవరూ హాజరవుతాలో చూడాలి. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (కేఎఫ్సీసీ)తో పాటు శాండల్ వుడ్ ఫిల్మ్ నటీనటులు, సాంకేతిక నిపుణుల సంఘాలు 'పునీత్ నామన' పేరుతో ఈ వేడుకలను నిర్వహించనున్నాయి. అయితే కొవిడ్ కారణంగా అతిథుల జాబితాలో పరిమితులు ఉండనున్నట్లు సమాచారం. నిర్వాహకులు పొరుగు రాష్ట్రాలు, వారి చిత్ర పరిశ్రమ, ఛాంబర్ల నుంచి సభ్యులను కూడా ఆహ్వానించారు. పలు నివేదికల ప్రకారం ఈ కార్యక్రమానికి 1500 మంది హాజరవుతారని ప్రచారం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, ప్రతిపక్ష నాయకులు, ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు. కన్నడ సినీ పరిశ్రమ సభ్యులు పునీత్ రాజ్‌కుమార్‌కు ప్రత్యేక నివాళులు అర్పిస్తారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వి నాగేంద్ర ప్రసాద్ రచించగా, గురుకిరణ్ స్వరపరచిన ప్రత్యేక గీతాన్ని ఆలపించనున్నారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో అక్టోబర్ 29న బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో మరణించారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టూడియోస్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మరణించినప్పటి నుంచి ప్రతిరోజూ దాదాపు 30,000 మంది అభిమానులు ఆయన స్మారకాన్ని సందర్శిస్తున్నారు. కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అకాల మరణంతో కన్నడ నాట విషాదఛాయలు అలుముకున్నాయి. -
పిల్లలూ దేవుడూ చల్లనివారే...
రోజారమణి ‘భక్త ప్రహ్లాద’ చేస్తే నేటికీ అదొక అద్భుత నటన. ‘లవకుశ’లో లవుడుగా కుశుడుగా ఆ చిన్నారులు చెదిరిపోతారా మస్తిష్కం నుంచి. ‘పిల్లలూ దేవుడూ చల్లనివారే’ అన్న పద్మినికి ఇన్నేళ్లు వచ్చినా ‘కుట్టి పద్మినే’. గతంలో బాలలు గొప్పగా నటించే పాత్రలు ఉండేవి. బాలల కోసమే తీసే సినిమాలు ఉండేవి. బాలలే నటించగా బాల భారతం వచ్చింది. బాల రామాయణమూ వచ్చింది. బాలల సినిమాలకు ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చేవి. అవన్నీ ఇప్పుడు లేవు. పిల్లల భావోద్వేగాలను చెప్పే సినిమాలు దేవుడెరుగు. పిల్లలకు ఆరోగ్యకరమైన వినోదం అందించే సినిమాలు ఎక్కడ? ఆమిర్‌ఖాన్ తీసిన ‘లగాన్’ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో 11 మంది గ్రామీణులు బ్రిటిష్ వారి మీద క్రికెట్ ఆడి గెలుస్తారు. ఆ గ్రామీణుల్లో ఒక వయసు మళ్లిన వృద్ధ డాక్టర్ ఉంటాడు. ఒక దళిత వికలాంగుడు ఉంటాడు. చేతి వృత్తుల వారు ఉంటారు. ముస్లిం ఉంటాడు. వీరందరితోపాటు ఈ టీమ్‌కు సపోర్ట్‌గా ఒక పిల్లవాడు కూడా ఉంటాడు. మేచ్ జరుగుతున్నప్పుడు కీలక ఆటగాడు గాయపడితే ఈ పిల్లవాడే బై రన్నర్‌గా రంగంలో దిగుతాడు. ఈ పాత్రల అల్లిక ఇలా ఎందుకు? దేశం అంటే సమాజం అంటే అందరూ అని. వారిలో పిల్లలూ ఉంటారని. ఇదే ఆమిర్ ఖాన్ డిస్లెక్సియాతో బాధపడే పిల్లల పక్షాన నిలబడి ‘తారే జమీన్ పర్’ తీస్తే ఆ సినిమా గొప్ప ప్రశంసలు పొందింది. అతనికి కలెక్షన్లు కూడా కురిపించింది. తెలుగు సినిమా కూడా ఇలా ఆలోచించగలదు. కాని ఆలోచించడం లేదు. ఘనమైన బాలల పాత్రలు గతంలో తెలుగు సినిమాల్లో బాలల పాత్రలు చాలా గట్టిగా ఉండేవి. వారి మీదే తీసిన సినిమాలూ వచ్చేవి. బాలల కేంద్రంగా ఉన్నా పెద్ద హీరోలు ఆ సినిమాలు చేసేవారు. ఎన్.టి.ఆర్ ‘రాము’, ‘లవకుశ’, ఏ.ఎన్.ఆర్ ‘సుడిగుండాలు’, శోభన్‌బాబు ‘సిసింద్రీ చిట్టిబాబు’, హరనాథ్ ‘లేత మనసులు’ వంటి సినిమాల్లో నటించారు. సావిత్రి పిల్లల కోసమే ‘చిన్నారి పాపలు’ సినిమాను నిర్మించారు. ‘పాపం పసివాడు’ సినిమా ఆ రోజుల్లో మాస్టర్ రాము నటించగా సూపర్‌హిట్ అయ్యింది. పిల్లలే పాత్రలుగా బాలలకు చెప్పాల్సిన కథలు బాలల ద్వారానే చెప్పిస్తే బాగుంటుందనే ఆలోచనతో తెలుగులో ‘బాల భారతం’ వచ్చింది. భారత కథలోని అన్ని పాత్రలను ఈ సినిమాలో బాలలే ధరించడం విశేషం. ‘మానవుడే మహనీయుడు’ వంటి హిట్ సాంగ్‌ను శ్రీశ్రీ రాశారు. ఆ తర్వాత పిల్లలే అన్ని పాత్రలు పోషించగా భానుమతి రామకృష్ణ ‘భక్తధృవ మార్కండేయ’ తీశారు. కె.ఎస్.ప్రకాశరావు స్వీయదర్శకత్వంలో ‘బాలానందం’, బి.ఆర్.పంతులు దర్శకత్వంలో ‘పిల్లలు తెచ్చిన చల్లనిరాజ్యం’ ఇవన్నీ పిల్లలకూ సినిమాల్లో చోటు ఉందనీ పిల్లలూ సినిమా కథను నడిపించగలవనీ నిరూపించాయి. ఇదే సమయంలో ‘భక్త ప్రహ్లాద’లో రోజారమణి విశేష ప్రతిభ కనపరిచి ప్రహ్లాదునిగా ఘనఖ్యాతి పొందారు. ఇది జరిగిన చాలా రోజులకు నిర్మాత ఎం.ఎస్.రెడ్డి పూనిక మీద గుణశేఖర్ దర్శకత్వంలో ‘బాల రామాయణం’ వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో రాముడిగా నటించారు. ఈ సమయాలకు అటు ఇటుగా బేబీ షాలినీ ‘బంధం’ వంటి సినిమాలతో వెలిగితే తరుణ్ ‘మనసు మమత’, ‘తేజ’ వంటి సినిమాలతో అలరించాడు. బేబి సుజిత ‘పసివాడి ప్రాణం’తో సినిమాకు ప్రాణం పోసింది. భద్రం కొడుకో కమర్షియల్ సినిమా ఒక ధోరణిలో బాలలకు చోటు కల్పిస్తే తెలుగులో 1992లో వచ్చిన ‘భద్రం కొడుకో’ పార్లల్ సినిమాగా బాలల చిత్రాలకు దారి గట్టి పరిచింది. వీధి బాలల సమస్యలను చర్చించిన ఈ సినిమాకు ఓల్గా రచన చేయగా అక్కినేని కుటుంబరావు దర్శకత్వం వహించారు. జాతీయస్థాయి పురస్కారాలు అందుకున్న సినిమా ఇది. ఆ తర్వాత అక్కినేని కుటుంబరావు మరికొన్ని బాలల సినిమాలు తీశారు. అయితే ఆ దారిలో ఎక్కువ సినిమాలు రాలేదు. మణిరత్నం తమిళంలో తీయగా తెలుగులో డబ్ అయిన ‘అంజలి’ ఒక రకమైన పిల్లలను లోకానికి చూపితే పిల్లలు తమకు జీవితంలో ఎదురయ్యే పరిణామాలను బట్టి నిలబడి ఎదగాలని చెప్పిన గుణ్ణం గంగరాజు ‘లిటిల్ సోల్జర్స్’ పిల్లల్ని పిల్లల్లా చూపుతూ ప్రశంసలు పొందింది. స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు బాలల కోసం సినిమా తాను తీయకపోవడం వెలితిగా భావించి బి.నరసింగరావు దర్శకత్వంలో ‘హరివిల్లు’ నిర్మించారు. మారిన ధోరణి 2000 సంవత్సరం తర్వాత తెలుగు సినిమాల్లో పిల్లల పాత్రలు, చేష్టలు పూర్తిగా మారిపోయాయి. వారు పుట్టిన వెంటనే ప్రేమలో పడే స్థాయిలో ‘ఖుషి’ సినిమా నుంచి కొత్త పోకడలు పోయాయి. పదేళ్ల లోపే గట్టిగా ప్రేమలో పడుతూ ‘తూనీగా తూనీగా’ అని పాడుకోవడం మొదలెట్టారు. హైస్కూల్ తరగతి గదుల్లో వారి ప్రేమలు కొనసాగాయి. మాస్టర్ భరత్ తమిళం నుంచి వచ్చి హాస్యం పేరుతో పంచ్‌లు వేయడం మొదలుపెట్టాడు. భారతీయ భాషల్లో మెరుగైన బాలల పాత్రలతో సినిమాలు వస్తుంటే అతి చిన్న మార్కెట్ కలిగిన ఇరాన్ సినిమా అద్భుతమైన బాలల చిత్రాలతో ప్రపంచ ఖ్యాతి పొందుతుంటే మనం ఒక గొప్ప బాలల చిత్రం తీయలేకపోయాం. వారిని అలరించే టైం మిషన్ వంటి సబ్జెక్ట్స్ తీసుకుని ‘ఆదిత్య 369’ వంటి కమర్షియల్ చిత్రాలు కూడా తీయలేకపోతున్నాం. బాలలు ఏం చూడాలో సమాజం, సినిమా రంగం ప్రత్యేకంగా ఆలోచించకపోతే వారు నెట్లో అనివార్యంగా 18 ప్లస్ సినిమాలవైపుకు వెళతారు. వెళుతున్నారు. ప్రభుత్వం బాలల కోసం షార్ట్‌ఫిల్మ్స్‌ను, ఫీచర్ఫిల్మ్స్ను, యానిమేషన్ ఫిల్మ్ ్మ్సను ఎంకరేజ్ చేయాలి. బాలల థియేటర్ కొన్నాళ్లు యాక్టివ్‌గా ఉంది. ఇప్పుడు లేదు. బాలల సినిమాలు రాయితీల వల్ల అయినా తయారయ్యేవి. ఇప్పుడు అవీ లేవు. తెలుగు బాలలూ... మీరిప్పుడు అనుభవిస్తున్నది పసిడి కాలం కానేకాదు... ప్లాస్టిక్ స్క్రీన్ కాలం! ఏం విషాదం ఇది!! బాలలు ఏం చూడాలో సమాజం, సినిమా రంగం ప్రత్యేకంగా ఆలోచించకపోతే వారు నెట్లో అనివార్యంగా 18 ప్లస్ సినిమాలవైపుకు వెళతారు. వెళుతున్నారు. ప్రభుత్వం బాలల కోసం షార్ట్‌ఫిల్మ్స్‌ను, ఫీచర్ఫిల్మ్స్ను, యానిమేషన్ ఫిల్మ్ ్మ్సను ఎంకరేజ్ చేయాలి. వారికి కాసింత వినోదాన్ని పంచుదాం -
పద్మం దక్కిన వేళ.. ఆనంద హేల
2020 సంవత్సరానికి గాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ‘పద్మ’ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం ఈ అవార్డుల ప్రదానం జరిగింది. చిత్రసీమ నుంచి తమ తమ విభాగాల్లో సేవలు అందిస్తున్న నటి కంగనా రనౌత్, దర్శక–నిర్మాత కరణ్ జోహార్, నిర్మాత ఏక్తా కపూర్, సంగీత దర్శకుడు అద్నన్ సమి, నేపథ్య గాయకుడు సురేష్ వడ్కర్, సీనియర్ నటి సరితా జోషి ‘పద్మశ్రీ’ అవార్డులు అందుకున్నారు. పద్మం దక్కిన వేళ.. ఆనంద హేలలో పురస్కార గ్రహీతలు ఈ విధంగా స్పందించారు. ఆలస్యంగా వచ్చినా ఆనందమే – సురేష్ వాడ్కర్ ‘‘కాస్త అలస్యంగా వచ్చినప్పటికీ నా దేశం నన్ను గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఏ కళా కారుడికైనా ఈ పురస్కారం చాలా గొప్పది. సంగీత ప్రపంచంలోమరింత ముందుకు వెళ్లడానికి ఈ పురస్కారం నాకు స్ఫూర్తినిచ్చింది’’ అని 66 ఏళ్ల సురేష్ వాడ్కర్ అన్నారు. హిందీ, మరాఠీ భోజ్‌పురి భాషల్లో పాడారు సురేష్. ‘సద్మా’లో ‘ఏ జిందగీ గలే లగా లే’, ‘పరిందా’లో ‘తుమ్ సే మిల్కే’ , ‘ప్యాసా సావన్’లో ‘మేఘా రే.. మేఘా రే..’ వంటి పాటలు పాడారు వాడ్కర్. ఈ క్షణాలు గుర్తుండిపోతాయి – కరణ్ జోహార్ ‘‘ఈ క్షణాలు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మా అమ్మ, నా పిల్లలు, నా ప్రొడక్షన్ కంపెనీలా నా మనసులో ఈ పురస్కారం అలా ఉండిపోతుంది’’ అని పేర్కొన్నారు కరణ్ జోహర్. ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘కల్ హో నా హో’, ‘మై నేమ్ ఈజ్ ఖాన్’ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు కరణ్ జోహార్. అలాగే ‘దోస్తానా’, ‘2 స్టేట్స్’ వంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు. నమ్మలేని క్షణం – ఏక్తా కపూర్ ‘‘ఇదొక గొప్ప గౌరవం. నమ్మలేని క్షణం... అలాగే గర్వకారణం. నాకు రెండు పిల్లర్లలా నిలిచిన మా అమ్మానాన్న (శోభ, జితేంద్ర కపూర్)లకు ఈ పురస్కారాన్ని అంకితం ఇస్తున్నాను. వాళ్లిద్దరూ నన్ను పూర్తిగా నమ్మడంవల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. నా కుటుంబం, స్నేహితులు, మా బాలాజీ టెలీ ఫిలింస్ టీమ్, ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా కలలను నిజం చేసుకోవడానికి ఆస్కారం ఇచ్చిన ఈ దేశానికి తిరిగి ఇవ్వాలన్నది నా ఆలోచన. మరింతమంది ప్రతిభావంతులకు అవకాశం కల్పిస్తాను’’ అన్నారు ఏక్తా కపూర్. టీవీ రంగంలో దూసుకెళుతున్న ఏక్తా ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై’, ‘ది డర్టీ పిక్చర్’, ‘షూట్ అవుట్ అట్ వడాలా’ వంటి చిత్రాలు నిర్మించారు. ఆ ప్రేమవల్లే ఇంతదాకా... – అద్నన్ సమీ ‘‘నాకింత గొప్ప పురస్కారాన్ని అందించిన భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అలాగే భారతదేశ ప్రజలు నా మీద చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రేక్షకుల అభిమానం వల్లే నా ప్రయాణం ఇంతదాకా వచ్చింది’’ అన్నారు అద్నాన్ సమీ. హిందీలో పలు పాటలు పాడిన అద్నన్ తెలుగులో ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో ‘ఏ జిల్లా..’, ‘వర్షం’లో ‘నైజామ్ పోరి..’, ‘జులాయి’లో ‘ఓ మధు..’ వంటి పాటలు పాడారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. ప్రముఖ నటి సరితా జోషి (80) ఆరు దశాబ్దాలుగా గుజరాతీ, మరాఠీ, హిందీ, మర్వారీ భాషల్లో 15 వేలకు పైగా షోస్‌లో భాగమయ్యారు. అలాగే ‘పరివార్’, ‘గురు’, ‘సింబా’, ‘రూహీ’ తదితర చిత్రాల్లో నటించారు. ఆ నోళ్లు మూతపడతాయనుకుంటున్నాను ‘‘ఒక ఆర్టిస్టుగా నేను ఎన్నో అవార్డులు పొందగలిగాను. కానీ ఓ ఆదర్శనీయమైన పౌరురాలిగా ప్రభుత్వం నన్ను గుర్తించి ‘పద్మశ్రీ’ అందించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు కంగనా రనౌత్. ఇంకా మాట్లాడుతూ– ‘‘నా కెరీర్‌ను స్టార్ట్ చేసిన తర్వాత దాదాపు పది సంవత్సరాల వరకు నాకు సక్సెస్ రాలేదు. పెద్ద హీరోలు, పెద్ద ప్రొడక్షన్ హౌసెస్‌కు సంబంధించిన చిత్రాలు, స్పెషల్సాంగ్స్, సౌందర్య లేపనాల ఉత్పత్తులను గురించిన ప్రకటనలను కాదనుకున్నాను. జాతీయ అంశాలను గురించి నేను పలుసార్లు నా గొంతు విప్పాను. అందువల్ల ఎక్కువగా శత్రువులనే సంపాదించుకున్నాను. జాతీయ అంశాలను గురించి ప్రస్తావిస్తోంది అని నన్ను విమర్శించేవారి నోళ్లు ఇప్పుడు మూతపడతాయనుకుంటున్నాను’’ అన్నారు. ‘క్వీన్’, ‘తనువెడ్స్ మను’ ఫ్రాంచైజీ, ‘తలైవి’ వంటి చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కంగనా రనౌత్ నిర్మాతగానూ రాణిస్తున్నారు. – కంగనా రనౌత్ -
పవన్‌కల్యాణ్ తీరు ఇండస్ట్రీ వాళ్లకే నచ్చడం లేదు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వం ఒక మంచి విధానం తెస్తుంటే పవన్‌కల్యాణ్ తన స్వార్థం కోసం మాట్లాడుతున్నారంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. మంగళవారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కల్యాణ్ తీరు సినిమా ఇండస్ట్రీ వాళ్లకే నచ్చడం లేదు. ఆయన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలోనే అతను పెద్ద గుదిబండగా మారాడారాని బాధపడుతున్నారు. దీనివల్ల అసలుకే మోసం వచ్చేలా ఉందని ఇండస్ట్రీ భయపడుతోంది. బాహుబలి విషయంలో సగం డబ్బు ప్రభుత్వానికి, డిస్ట్రిబ్యూటర్‌కి రాలేదని విన్నాను. ఆన్లైన్ విధానం ద్వారా అప్పటికప్పుడే ఎవరికెళ్లాల్సిన డబ్బు వారికెళ్తుంది. రామారావు నుంచి కాంతారావు వరకు సినిమా ఎవరిదైనా టికెట్ ఒకేలా ఉంటుంది. ఆ టికెట్స్ వల్ల వచ్చే ఆదాయంతో ఎంత లోన్లు తెచ్చుకుంటారు?. మటన్ మార్కెట్లు లేదన్నా ప్రచారం చేస్తున్నారు. అందరితో చర్చింఏ ఆన్లైన్ టికెట్ విధానంపై ముందుకెళ్తాం. ప్రజలంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. చదవండి: (బద్వేలు వైఎస్సార్సీపీ అభ్యర్థిగా దాసరి సుధ: సజ్జల) థియేటర్లు ఎవరిచేతుల్లో నడుస్తున్నాయి?. ఎక్కడ ఇబ్బంది అవుతుందో ఇండస్ట్రీ వాళ్లు చెప్పాలి. సీఎం ఇండస్ట్రీ వాళ్లతో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలని ముందు నుంచి చెప్తున్నారు. కొద్దిమంది చేతిలో ఉన్న వ్యవస్థను సరళీకృతం చేస్తాం. సినిమా పెద్దలు ఎప్పుడైనా సీఎంను కలవొచ్చు. చంద్రబాబులా మేము పిలిచి ఫొటోలు దిగి పబ్లిసిటీ చేసుకునే వాళ్లం కాదు' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చదవండి: (పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను: మంచు విష్ణు) -
సినిమా టికెట్ల ఆన్లైన్ విధానంపై ఏకాభిప్రాయం
-
సినిమా టికెట్ల ఆన్లైన్ విధానంపై ఏకాభిప్రాయం
సాక్షి, అమరావతి: సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయంపై సినీ పరిశ్రమ ఏకాభిప్రాయం వ్యక్తం చేసిందని సమాచార, పౌర సంబంధాలు, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తెలిపారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లలో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. సోమవారం సచివాలయం నాలుగో బ్లాకులో మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. సినిమా టికెట్ల ఆన్లైన్ బుకింగ్ విధానం–2002 నుంచి అమలుకు నోచుకోలేదన్నారు. తమ ప్రభుత్వం దీనిపై వివిధ కమిటీలను నియమించి విస్తృతంగా అధ్యయనం చేస్తోందని వివరించారు. ఇందులో భాగంగానే తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి తెలుగు ఫిల్మ్ చాంబర్ ప్రతినిధులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, స్టేక్ హోల్డర్లతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకున్నట్టు చెప్పారు. ఆన్లైన్ టికెట్ల విక్రయంపై అందరూ ఏకాభ్రిపాయం వ్యక్తం చేయడంతో పాటు సినీ పరిశ్రమకు సంబంధించిన అనేక సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారన్నారు. వారి విజ్ఞప్తులను పరిశీలించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల గురించి సమావేశంలో వివరించామని, వాటిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సినిమాపై తమ ఇష్టాన్ని ఎందుకు సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు ప్రశ్నించే అవకాశం లేకుండా పారదర్శక విధానంలో ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరల ప్రకారం ప్రజలకు వినోదం అందిస్తామన్నారు. చాలా వరకు థియేటర్లలో ఆన్లైన్ టికెట్ల విక్రయిస్తున్నారని, త్వరలో అన్ని థియేటర్లలో ఈ విధానాన్ని ప్రవేశపెడతామన్నారు. ఏపీ సినిమా చిత్రీకరణకు అవసరమైన మౌలిక వసతుల కల్పన విషయంలో ప్రతినిధుల బృందం ప్రభుత్వానికి చేసిన సూచనలను పరిశీలిస్తామన్నారు. చిరంజీవి అంటే సీఎం జగన్‌కు ఎంతో గౌరవం చిత్రరంగ సమస్యలను పరిష్కరించాలని మెగాస్టార్ చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విన్నవించిన విషయమై విలేకరులు ప్రశ్నించగా.. చిరంజీవి అంటే సీఎం జగన్ ఎంతో గౌరవం ఉందని, ఆయనను సోదరభావంతో చూస్తారని చెప్పారు. ప్రజలకు మేలు చేసేలా ఎవరు ఏ విన్నపం చేసినా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందన్నారు. అంతకు ముందు జరిగిన సమావేశంలో రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షుడు విజయచందర్, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ టి.విజయకుమార్‌రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, ఏపీ డిజిటల్ కార్పొరేషన్ సీఈవో వాసుదేవరెడ్డి, ఏపీ తెలుగు ఫిల్మ్ చాంబర్‌కు చెందిన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సంఘాల ప్రతినిధులు సి.కల్యాణ్, దిల్ రాజు, జి.ఆదిశేషగిరిరావు, వంశీ, డీఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు చిత్ర సీమ సంతోషంగా ఉంది: సి.కల్యాణ్ సమావేశం అనంతరం నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భరోసాతో తెలుగు చిత్రసీమ చాలా సంతోషంగా ఉందన్నారు. టికెట్ రేట్ల సవరణ, వంద శాతం ఆక్యుపెన్సీ, రోజుకు నాలుగు షోలు, విద్యుత్ బిల్లులు తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు. సినీ పరిశ్రమలో పారదర్శకత కోసం ఆన్లైన్ టికెట్ల విక్రయ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని తామే కోరినట్టు చెప్పారు. థియేటర్ వ్యవస్థను ఆదుకోవాలని కోరాం.. మరో నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. ‘2006లో ఆన్లైన్ టికెట్ విధానం ఐచ్చికంగా ఉండేది. ఇప్పుడు తప్పనిసరి చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. పారదర్శకత కోసం గవర్నమెంట్ పోర్టల్ ఉండాలి. ఒకప్పుడు 1,800 థియేటర్లు ఉంటే ఇప్పుడు 1,200కు తగ్గిపోయాయి. వాటిలో ఐదారొందల థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. వాటిని విద్యుత్ టారిఫ్ సమస్య వేధిస్తోంది. జీతాలు, డీజిల్ రేట్లు పెరిగాయి. ఈ మేరకు రేట్లు సవరించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురాగా సానుకూల స్పందన లభించింది’ అన్నారు. నిర్మాత డీఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ సినీ పరిశమ్ర సమస్యలపై ప్రభుత్వ సానుకూల స్పందన తెలుగు చిత్రసీమకు ఊరటనిచ్చిందన్నారు. -
ఆన్లైన్ టికెట్ విధానంపై మంత్రి పేర్ని నాని సమీక్ష
విజయవాడ: ఆన్లైన్ పద్దతిలో సినిమా టికెక్టు అమ్మాలనే ప్రక్రియ 2002 నుంచి ఉందని సమాచారశాఖ మంత్రి పేర్నినాని అన్నారు. ఇందులో భాగంగా సినీ పరిశ్రమకు చెందిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధుల్ని ప్రభుత్వం నేడు చర్చకు పిలిచిందన్నారు. ఆన్లైన్ టికెట్ విధానంపై విజయవాడలో మంత్రి పేర్ని నాని సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులతోపాటు దిల్ రాజు, డీఎన్వీ ప్రసాద్, ఆది శేషగిరి రావు, డీవీవీ దానయ్య హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఆన్లైన్ టికెట్ వ్యవస్థ, కరోనా వలన సిని పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఎగ్జిబిటర్ల సమస్యలు, నిర్మాతల సమస్యలు అన్నింటిని ప్రభుత్వం తరపున తాము నమోదు చేసుకున్నామని తెలిపారు. త్వరలోనే సినీ పరిశ్రమ సమస్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించిన తర్వాత పరిష్కారం తీసుకుంటామన్నారు. ఆన్లైన్ టికెట్ వ్యవస్థ కు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు సానుకూలంగా ఉన్నారని, మళ్ళీ ఇంకోసారి సినిమా ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు సమావేశం అవుదామని తెలిపినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ ఎప్పుడు కూడా సాధారణ ప్రేక్షకులకు వినోదం అందుబాటులో ఉంచేలా చేస్తారని వెల్లడించారు. చదవండి: Youngest MPTC: చిన్న వయసులోనే.. ‘ఎంపీటీసీ’! -
రీమేక్ అంత వీజీ కాదు
భాష వేరు. కాని భావం ఒక్కటే. హీరో వేరు. కాని హీరోయిజం ఒక్కటే. అక్కడ హిట్ అయితే ఇక్కడ ఎందుకు కాదు. చలో... రీమేక్ చేద్దాం. కాని రీమేక్ అంత వీజీ కాదు. అది లైఫ్ ఇవ్వగలదు. ఫ్లాప్ చేయగలదు. కనెక్ట్ అయినవీ కానివీ వచ్చినవీ రాబోతున్నవీ ఈ సండే రోజున రీ విజిట్... బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాధున్’ తాజాగా అమేజాన్‌లో రిలీజ్ అయ్యింది. ఇది ఒక థ్రిల్లర్. అనూహ్యమైన మలుపులతో కథ సాగుతుంది. అందుకే దీనిని చాలామంది రీమేక్ చేయడానికి ఉత్సాహపడ్డారు. తెలుగులో నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ రిమేక్ చేశారు. ఇక్కడే జటిలమైన సమస్య వస్తుంది. యథాతథం తీయాలా? ఏమైనా మార్పులు చేయాలా? చేస్తే నచ్చుతుందా... చేయకపోతే నచ్చుతుందా... యథాతథంగా తీస్తే కొత్తగా ఏం చేశారని అంటారు. మార్పులు చేస్తే సోల్ చెడగొట్టారని అంటారు. అందువల్ల కొందరు దర్శకులు రీమేక్‌ల జోలికి రారు. కొందరు సక్సెస్‌ఫుల్‌గా తీస్తారు. ‘అంధాధున్’ కథ హిందీలో గోవాలో నడుస్తుంది. రీమేక్‌లో ప్రారంభంలోనే గోవా అని వేస్తారు. గోవాలో తెలుగు కథ ఎందుకు జరుగుతుంది? వైజాగ్‌లో తీసి ఉంటే ఎలా ఉంటుంది? ప్రేక్షకులకు వచ్చే సందేహం. కథ కనెక్ట్ కావచ్చు. కాని ఈ రీమేక్‌లో నేటివిటి కనెక్ట్ అయ్యిందా అనేది సమస్య. ఇద్దరు దర్శకులు గతంలో రీమేక్ సినిమాల్లో ఇద్దరు దర్శకులు పేరు పొందారు. వారు కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి. తమిళంలో భారతీరాజా తీసిన ఒక సినిమా బాగానే ఆడింది. దాని రైట్స్ నిర్మాత ఎస్.గోపాల్‌రెడ్డి కొన్నారు. కాని దర్శకుడు కోడి రామకృష్ణ దానిని యథాతథంగా తీస్తే ఫ్లాప్ అవుతుందని భావించి కథలో మార్పులు, యాస, స్థానికత మార్చారు. అదే ‘మంగమ్మ గారి మనవడు’. సూపర్‌హిట్ అయ్యింది. మరో హిట్ ‘ముద్దుల మావయ్య’ కూడా రీమేక్. కాని తమిళ సినిమా ‘అరువదై నాల్’ ఆధారంగా తీసిన ‘మువ్వ గోపాలుడు’ పూర్తిగా కనెక్ట్ కాలేదు. రీమేక్‌లలో కొన్ని ఎందుకు కనెక్ట్ అవుతాయో కొన్ని ఎందుకు కావో చెప్పలేము. తమిళంలో విసు తీసిన ‘అవళ్ సుమంళిదాన్’ సినిమాను రవిరాజా పినిశెట్టి ‘పుణ్యస్త్రీ’ పేరుతో మార్పుచేర్పులు చేసి సూపర్‌హిట్ చేశారు. రవిరాజా పినిశెట్టి ఇచ్చిన భారీ రీమేక్‌లలో ‘చంటి’, ‘పెదరాయుడు’ ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో భీమినేని శ్రీనివాసరావు ఈ పల్స్ పట్టుకున్న డైరెక్టర్‌గా పేరు పొందారు. గ్యారంటీ కథలు సినిమా కోట్ల రూపాయల వ్యవహారం. కథ విన్నప్పుడు అది తెర మీద ఎలా వస్తుందో ఎలా హిట్ అవుతుందో ఎవరూ ఊహించలేరు. విన్నప్పటి కథ చూసినప్పుడు తేలిపోయి భారీ ఫ్లాప్ కావచ్చు. అందుకే హీరోలు రీమేక్‌ల వైపు అప్పుడప్పుడు చూస్తుంటారు. ఎందుకంటే ఒక భాషలో హిట్ అయిన కథ మరో భాషలో హిట్ అవుతుందన్న ఒక గ్యారంటీతో. పైగా ఆ కథకు ఎంత ఖర్చు అవుతుందో, ఎన్ని రోజులు పడుతుందో కూడా తెలిసిపోతుంది. నాగార్జున ‘విక్రమ్’ (హిందీ ‘హీరో’) తో తెరంగేట్రం చేసినా వెంకటేశ్ కాలక్రమంలో రీమేక్‌ల మీదే పూర్తిగా దృష్టి పెట్టినా ఇదే కారణం. ఒక్కోసారి టాప్ హీరోలకు కూడా రీమేక్‌ల అవసరం ఏర్పడుతుంది. చిరంజీవికి ‘పసివాడి ప్రాణం’, ‘హిట్లర్’, ‘ఠాగూర్’, ‘ఖైదీ నంబర్ 150’ పెద్ద సక్సెస్ ఇచ్చాయి. ఇవి నాలుగూ రీమేకులే. ఇప్పుడు ఆయన మలయాళం హిట్ ‘లూసిఫర్’లో నటిస్తున్నారు. మోహన్‌బాబుకు మలయాళం నుంచి రీమేక్ చేసిన ‘అల్లుడు గారు’ బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. బి.గోపాల్ దర్శకుడిగా తీసిన ‘అసెంబ్లీ రౌడీ’ రీమేక్ ఆయనను కలెక్షన్ కింగ్‌ను చేసింది. కాని అదే బి.గోపాల్ వెంకటేశ్ హీరోగా చేసిన ‘చినరాయుడు’ రీమేక్ విఫలం అయ్యింది. ఆ సినిమాలోని తమిళదనం తెలుగుకు పడలేదు. తర్వాతి కాలంలో రాజశేఖర్ రీమేక్‌లకు కేరాఫ్‌గా మారాడు. అనూహ్య ఫలితాలు కచ్చితంగా హిట్ అవుతుందని రీమేక్ చేస్తే అనూహ్య ఫలితాలు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమిళంలో సూపర్‌డూపర్ హిట్ అయిన ‘వాల్టర్ వెట్రివల్’ను చిరంజీవి, శ్రీదేవితో ‘ఎస్పి పరశురామ్’గా రీమేక్ చేస్తే భారీ పరాజయం నమోదు చేసింది. అలాగే హిందీలో భారీ హిట్ అయిన ‘లగేరహో మున్నాభాయ్’ తెలుగు రీమేక్ ‘శంకర్‌దాదా జిందాబాద్’ కనెక్ట్ కాలేదు. వెంకటేశ్ ‘జెమిని’ నిరాశ పరిచింది. నాగార్జున ‘చంద్రలేఖ’ అంతే. ‘బాజీగర్’ రీమేక్‌గా తీసిన రాజశేఖర్ ‘వేటగాడు’ పరాజయం పొందింది. తమిళంలో భారీ హిట్ అయిన ‘ఆటోగ్రాఫ్’ను రవితేజాతో ‘నా ఆటోగ్రాఫ్’ తీస్తే ప్రేక్షకులు తిరస్కరించారు. ఈ మధ్యకాలంలో తమిళం నుంచి రీమేక్ చేసిన వరుణ్ సందేశ్ ‘కుర్రాడు’, మనోజ్ మంచు ‘రాజూ భాయ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘స్పీడున్నోడు’, సందీప్‌కిషన్ ‘రన్’, పవన్ కల్యాణ్ ‘కాటమరాయుడు’, విష్ణు మంచు ‘డైనమైట్’, అల్లరి నరేశ్ ‘సిల్లీ ఫెలోస్’ అంతగా మెచ్చుకోలు పొందలేదు. తమిళ ‘96’ తెలుగులో ‘జాను’గా వస్తే బాగుందని పేరు వచ్చినా జనం చూడలేదు. అందుకే రీమేక్‌లో తెలియని రిస్క్ ఉంటుందని అంటారు. కొనసాగుతున్న రీమేక్స్ అయినా సరే రీమేక్స్ కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న ‘నారప్ప’ వచ్చింది. తాజాగా ‘మాస్ట్రో’ వచ్చింది. ‘ఉమామహ్వేర ఉగ్రరూపస్య’, ‘కపటధారి’, ‘తిమ్మరుసు’, ‘రాక్షసుడు’, ‘గద్దలకొండ గణేశ్’, ‘వకీల్‌సాబ్’... ఇవన్నీ రీమేక్స్ పట్ల ఆసక్తిని నిలిపి ఉంచాయి. మలయాళంలో హిట్ అయిన ‘లూసిఫర్’, ‘అయ్యప్పనమ్ కోషియం’ రీమేక్ అవుతున్నాయి. మరాఠిలో నానా పటేకర్ నటించగా పెద్ద హిట్ అయిన ‘నటసామ్రాట్’ తెలుగులో ప్రకాష్‌రాజ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో తయారవుతోంది. ‘దృశ్యం 2’ రానుంది. గోడకు బంగారు చేర్పు అవసరం. ఇక్కడ గోడ కథ. గోడ గట్టిగా ఉంటే బంగారానికి దాని మీద వాలే శక్తి పెరుగుతుంది. కథను బాగా రాయడం తెలిస్తే రీమేక్‌ల అవసరం ఉండదు. తెలుగులో గట్టి సినీ కథకులు ఉన్నారు. తెలుగు సినిమాలు పరాయి భాషలో రీమేక్ అవుతున్నాయి. మన రంగంలో ఇతరులకు కథలిచ్చేలా ఎక్కువగా, కథలు తీసుకునేలా తక్కువగా ఉండాలని కోరుకుందాం. ‘ -
పరిశ్రమకు చంద్రబాబు ఏం చేశారో?
‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డిగారు, ఇప్పటి సీయం వైఎస్ జగన్మోహన్రెడ్డిగారు చిత్రపరిశ్రమకు అన్నీ ఇచ్చారు. కొందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఏపీ ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నారు. మరి.. చంద్రబాబుగారు ఇండస్ట్రీకి ఏం చేశారో వాళ్లు చెప్పాలి?’’ అని దర్శక–నిర్మాత నట్టి కుమార్ అన్నారు. సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పంచుకున్న విషయాలు.. ► ‘ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి వస్తున్నది పాతిక కోట్లు మాత్రమే. నేను ఇంకో పాతిక కోట్లు ఇస్తా. ఇండస్ట్రీని ఎలా అభివృద్ధి చేద్దామో చెప్పి చేయించుకోండి’ అని ఓ సందర్భంలో రాజశేఖర రెడ్డిగారు అన్నారు. అప్పట్లో ఇండస్ట్రీ కోసం విశాఖపట్నంలో 326 ఎకరాలు కేటాయించి, స్డూడియోలు, ఇతర సౌకర్యాలకు అనుగుణంగా మార్చుకోమన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆ స్థలాలను వేరే కంపెనీలకు ఇచ్చింది. అది జగన్మోహన్ రెడ్డిగారు క్యాన్సిల్ చేశారు. ఆ స్థలం అలాగే ఉంది. ఇండస్ట్రీకి ఆంధ్రా నుంచే 65 శాతం ఆదాయం వస్తోంది. అలాంటప్పుడు ట్యాక్స్ కట్టి అక్కడి ప్రభుత్వానికి మేలు జరిగేలా అక్కడ కూడా షూటింగ్‌లు జరుపుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ► షూటింగ్‌ల కోసం ఏపీలో సింగిల్ విండో విధానం అమలులో ఉంది. అలాంటప్పుడు ఆంధ్రాలో ఎందుకు షూటింగ్‌లు చేయరు? జగన్ గారు అపాయింట్మెంట్ లేదని కొందరు ఆరోపిస్తున్నారు. అది తప్పు. అడగనిదే అమ్మయినా అన్నం పెట్టదు. జగన్ గారిని అడిగితే వీలైనంత త్వరగా స్పందిస్తారు. ► ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 35 చిన్న నిర్మాతల పాలిట ఓ వరం. ఈ జీవోను ఉపసంహరించుకోకూడదని కోరడానికి చిన్న నిర్మాతల తరఫున సీయం గారి అపాయింట్మెంట్ కోరాను. కానీ, ప్రతిపక్షాలకు కొమ్ము కాస్తున్న ఓ వర్గం వారు ఈ జీవో విషయంలో ఏపీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకుని వచ్చేలా ప్రవర్తిస్తున్నారు. ► జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు చిరంజీవిగారు చిన్న నిర్మాతల సమస్యలను కూడా ప్రస్తావిస్తారని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన సినిమాలకు మంచి షేర్స్ వస్తున్నాయి. అయినా కొందరు పెద్ద సినిమాలను విడుదల చేయకుండా వేరే ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు. ► చిన్న, పెద్ద హీరోలు అనే తేడా లేకుండా టిక్కెట్ ధరలను పెంచేస్తున్నారు. ప్రేక్షకుల సొమ్మును హీరో హీరోయిన్లకు పారితోషికం రూపంలో ఇస్తున్నారు. ఓ ఐదుగురు పెద్ద టెక్నీషియన్స్‌ను, హీరోలను, హీరోయిన్లను మనం పెంచుతున్నాం. -
74 ఏళ్ల సినీ భారతం.. రూ. 10 వేల నుంచి 2000 కోట్ల వరకు..
స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి ఏ ఒడిదుడుకులు లేకుండా నిరంతరం విస్తరిస్తూ వచ్చిన పరిశ్రమ ఏదైనా వుందా అంటే అది సినిమా పరిశ్రమ మాత్రమే. 1947లో టర్నోవర్‌కు, యిప్పటి టర్నోవర్‌కు పోల్చి చూస్తే వందల రెట్లు పెరిగి వుంటుంది. సినిమా పరిశ్రమ అంటే దాని నిర్మాణం మాత్రమే లెక్క వేయకూడదు. పంపిణీ, ప్రదర్శనా రంగాలు, పార్కింగ్, క్యాంటీన్లు, బయట కాచుకున్న రిక్షాబళ్ల వరకు, బ్లాక్ మార్కెట్టు టిక్కెట్లు అమ్మేవారితో సహా అది చూపిన ఉపాధిని, ఆదాయాన్ని పరిగణించాల్సి ఉంటుంది. పంపిణీ, పబ్లిసిటీరంగాల కొస్తే రీళ్లు (ఇటీవల లేకపోవచ్చు, మొన్నటిదాకా వున్నాయి) రవాణా చేయడాలు, పోస్టర్లు డిజైన్ చేసేవారు, గోడకి అతికించేవారు, సినిమా సమీక్షలు, ఇంటర్వ్యూలు, చరిత్రలు రాసేవారు, సినిమా వార్తలతో పేపర్లు ప్రచురించేవారు, టీవీలకై కవర్ చేసేవారు, సినిమా పాటలతో సంగీత విభావరులు నిర్వహించేవారు, టీవీలో కార్యక్రమాలు చేసేవారు, సినిమా నటుల్ని అనుకరించే మిమిక్రీ కళాకారులు, సినీ నటుల్ని ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించేవారు, పాటల పోటీలు పెట్టేవారు.. యిలా ఎన్నో రంగాలకు చెందినవారు, ఎన్నో కుటుంబాలు సినీరంగంపై పరోక్షంగా ఆధారపడుతున్నాయి. థియేటర్లో చూపించే సినిమాలే కాక, టీవీ సినిమాలు, టీవీలో సినిమా సంబంధిత కార్యక్రమాలు, షార్ట్‌ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, ఓటీటీకై చేసే చిత్రాలు – వీటన్నిటినీ కూడా కలుపుకుంటే దీనిపై ఆధారపడే కుటుంబాల సంఖ్య మరీ పెరిగిపోతుంది. మరే దేశంలోనో అయితే ఒకటి, రెండు భాషల్లో సినిమాలు తయారయ్యేవి. కానీ భారతదేశంలో దాదాపు పది భాషల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో సినిమాలు తయారవుతున్నాయి. ఏ పరిశ్రమా యీ స్థాయిలో విస్తరించి వుండదు. సినిమాల్లో సంపాదించిన డబ్బును నటీనటులు వేరే పరిశ్రమల్లో పెట్టుబడిగా పెట్టి దేశపారిశ్రామికాభివృద్ధికి తోడ్పతున్నారు. నిజానికి సినిమా నిత్యావసర వస్తువు కాదు. అయినా ఎందుకీ స్థాయి వృద్ధి? తక్కిన పరిశ్రమలు వస్తువులు ఉత్పత్తి చేస్తాయి. అవి కొంతకాలానికి అనవసరమనిపించవచ్చు, లేదా డిమాండు పోగొట్టుకొనవచ్చు. కానీ సినిమాలు ఉత్పత్తి చేసేది ఆలోచనల్ని, కలల్ని! ప్రతి మనిషికీ ఊపిరున్నంతకాలం అవి కావాల్సిందే! చుట్టూ పరిస్థితులు దుర్భరమౌతున్న కొద్దీ భవిష్యత్తు గురించి కలలు కనడం పెరుగుతుంది. ఆ కలలకు ముడిసరుకును సినిమాలు సరఫరా చేస్తాయి. సినిమాకైతే ఆ బాధ లేదు ఒక నాటకం ప్రదర్శించాలంటే దానిలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఆ ప్రదేశానికి వెళ్లాలి. సినిమాకైతే ఆ బాధ లేదు. స్వాతంత్య్రానంతరం గ్రామాలకు విద్యుత్ సౌకర్యం రావడంతో పల్లెటూళ్లలో కూడా థియేటర్లు వెలిశాయి. జనాలు సినిమాలు చూడడం యిబ్బడిముబ్బడిగా పెరిగింది. తర్వాతి రోజుల్లో వీడియో క్యాసెట్లు, డీవీడీలు వచ్చాయి, బ్లూరే సీడీలూ వచ్చాయి. ఇప్పుడు సెల్ఫోన్లలోనే సినిమా చూసేసే సౌకర్యం వచ్చింది. ఈ విధంగా సినిమా ప్రజలకు మరీమరీ చేరువౌతూ వచ్చింది. సినిమా థియేటర్ అనేది ఊరిలో వుండవలసిన ముఖ్యమైన ప్రదేశంగా మారింది. కుటుంబమంతా సరదాగా సమయం గడపడానికి అతి చౌకగా వెళ్లగలిగేది సినిమా థియేటరుకు మాత్రమే. అందుకే అది ఒక సామాజిక అవసరంగా మారింది. కట్టూబొట్టూపై, సంభాషణ తీరుపై, భావప్రకటనపై సినిమా ప్రభావం పడింది. స్వాతంత్య్రానంతరం దేశమంతా ఒక్కటే అనే భావన పెంపొందడానికి కారణం హిందీ సినిమాలు అని చెప్పినా తప్పులేదు. ఈశాన్య రాష్ట్రాల నుంచి, లక్షద్వీప్ దాకా హిందీ పాటలు మారుమోగుతూనే వుంటాయి. హిందీలో అంత్యాక్షరి నిర్వహిస్తే, దేశంలోని ఏ ప్రాంతంవారైనా పాల్గొనగలుగుతారు. అది ఒక చైతన్య మాధ్యమం హాలీవుడ్‌తో స్ఫూర్తి పొందిన భారతీయ సినిమా క్రమంగా భారతీయ ప్రేక్షకుడికి తగినట్టుగా రూపు మార్చుకుంటూ వెళ్లింది. ప్రతిష్ఠాత్మక స్టూడియోల చేతుల్లో నుంచి కదిలి వ్యక్తిగత నిర్మాతల వరకూ విస్తరించింది. హిందీ రంగంలో మార్కెట్ కోసం రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ వంటి స్టార్స్‌కు ఇమేజ్ వచ్చేలా చూశారు. దక్షిణాదిలో ఎన్.టి.ఆర్, ఎం.జి.ఆర్, రాజ్ కుమార్, ప్రేమ్ నజీర్ వంటి స్టార్స్ ప్రేక్షకుల ఇలవేల్పులయ్యారు. కాంచనమాలతో మొదలెట్టి మధుబాల, సావిత్రి వరకూ అద్భుతమైన స్టార్‌డమ్‌ను చూసిన హీరోయిన్లూ ఉన్నారు. కాని సినిమా అంటే కాలక్షేపం మాత్రమే కాదని అది ఒక చైతన్య మాధ్యమం అని ‘పారలల్ సినిమా మూవ్మెంట్’ మొదలైంది. సత్యజిత్ రాయ్, మృణాల్ సేన్, ఎం.ఎస్.సత్యు, ఋత్విక్ ఘటక్, శ్యామ్ బెనెగళ్, బి.వి.కారంత్, గిరీష్ కర్నాడ్, కె.ఎన్.టి.శాస్త్రి, బి.ఎస్.నారాయణ వంటి దర్శకులు సినిమా ధోరణిని మార్చారు. మలయాళం ఈ విషయంలో అద్భుతమైన వికాసం చూపింది. అడూర్ గోపాలకృష్ణన్, అరవిందన్ వంటి దర్శకులు ప్రపంచ స్థాయి సినిమాలు తీశారు. తెలుగులో వీరు.. తెలుగులో మాదాల రంగారావు, టి.కృష్ణ తదితరులు చైతన్యవంతమైన సినిమాను ప్రేక్షకులకు హిట్ ఫార్ములాగా అందించారు. కె.బాలచందర్, కె.విశ్వనాథ్, దాసరి నారాయణరావు వంటి దర్శకులు మధ్యతరగతి డ్రామాను తెర మీద రక్తి కట్టించారు. అయితే నేటికీ సినిమా కమర్షియల్ మాధ్యమమే అని వినోదం అందిస్తూ లాభాలు గడించే వ్యాపార కళ అని నిరూపితం అవుతూనే ఉంది. హిందీలోగాని దక్షిణాది భాషల్లోగాని హీరోలే కేంద్రంగా కాలక్షేప కథలతో కొనసాగుతూ ఉంది. మరోవైపు సాంకేతిక అభివృద్ధి జరిగి సినిమాస్కోప్, 70 ఎంఎం, డాల్బీ సిస్టమ్.. అంటూ అనేక హంగులు వచ్చి చేరుతూ సినిమాను వీక్షించడం ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మారిపోయింది. తమిళ ప్రాంతంలో ద్రవిడ ఉద్యమం తన భావప్రచారానికి సినిమాను సాధనంగా వాడుకుని అధికారంలోకి వచ్చింది. దక్షణాదిలో సినిమా రంగం ఏకంగా ముఖ్యమంత్రులను ఇచ్చే స్థాయికి రాజకీయాలను ప్రభావితం చేసింది. సినిమాను దేశభక్తి పెంపొందించడానికి, సోషలిస్టు లేదా కమ్యూనిస్టు భావవ్యాప్తికి, భక్తి కలిగించడానికి, ఆలోచన రగిలించడానికి.. యిలా పలువిధాలుగా వాడుకున్నారు. పెద్దగా ప్రచారం లేని దేవుడికి పబ్లిసిటీ తేవాలంటే ఆ దేవుడి మహిమలపై సినిమా తీస్తే లేదా పేరున్న సినీగాయకుల చేత పాటలు పాడిస్తే చాలు అనే ధోరణి కూడా వచ్చింది. సినిమా సమాజాన్ని, సమాజం సినిమాను అనుకరిస్తూ పోవడం వలన జనాభాతో బాటు సినీపరిశ్రమ కూడా నిరంతరంగా పెరుగుతూ పోతోంది. నిజానికి స్వాతంత్య్రానంతరం సమాజ దృక్పథంలో వచ్చిన మార్పులను అధ్యయనం చేయడానికి దశాబ్దాల వారీగా సినిమా థీమ్స్‌ను విశ్లేషిస్తే సరిపోతుంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో సోషలిస్టు సమాజంపై ఆశలు, స్వతంత్ర భావాలు, మంచి కోసం తలిదండ్రులను ఎదిరించినా తప్పులేదనే ఆలోచన, కష్టపడి పని చేస్తూ నీతి, నిజాయితీలతో బతికితే జీవితంలో పైకి వస్తామన్న ఆశావహ దృక్పథం కథాంశాలుగా వుండేవి. పోనుపోను సమాజంలో హింసాత్మక విధానాలతోనైనా మార్పు తేవాల్సిందే అనే తీవ్రవాదం థీమ్‌గా మారింది. ఆ తర్వాతి రోజుల్లో సన్మార్గాన్ని నమ్ముకుంటే లాభం లేదు, ఈ సమాజంలో ఎలాగోలా పైకి వచ్చేవాడే మొనగాడు అనే ఆలోచన, విదేశాలు వెళ్లి డబ్బు సంపాదిద్దాం, ఎలాగోలా సంపాదించి, ఖర్చు పెట్టడంలోనే మజా వుంది అనే దృక్పథం.. ఇలా అన్నీ సినిమాల్లో ప్రతిఫలించాయి. అందుకే ప్రేక్షకులు సినిమా హీరోలతో మమేకమౌతున్నారు. వారిని ఆరాధిస్తున్నారు. 60, 70 ఏళ్ల క్రితం సినిమా కళాకారులను సంఘబాహ్యులుగా చూసే రోజుల్నుంచి, యింట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే వాళ్లను ఆహ్వానించడం ప్రతిష్ఠాత్మకమైన విషయంగా పరిగణించే వరకూ మార్పు వచ్చింది. సినిమావారు ప్రేక్షక ఓటర్ల రాజకీయ అభిప్రాయాలను కూడా ప్రభావితం చేయగల స్థితిలో వున్నారని గ్రహించిన రాజకీయ నాయకులు వారిని ప్రచారానికి, తమ మీటింగుల జనసమీకరణకు వాడుకుంటున్నారు. క్రమేపీ వేరెవరి కోసమో పని చేయడమెందుకనుకుని నటీనటులు తామే నాయకులుగా ఎదుగుతున్నారు. కొందరు సఫలం కావడం, మరి కొందరు విఫలం కావడం సహజం. ‘బాహుబలి’ వంటి సినిమాల వల్ల.. ఇవాళ భారతీయ సినిమా ప్రపంచ ప్రేక్షకులను సంపాదించుకుంది. భారతదేశంలోనే కాక అనేక దేశాలలో భారతీయ సినిమాలు విడుదల అవుతున్నాయి. జపాన్, చైనాలలో మన సినిమాలు డబ్ అయ్యి విడుదలై ఘన విజయాలు సాధిస్తున్నాయి. సినిమా వ్యాపారం ఒకప్పుడు పది వేల రూపాయలతో మొదలయ్యి ఇవాళ ఒక పెద్ద సినిమా తీయాలంటే బడ్జెట్ 50 కోట్ల నుంచి 100 కోట్ల స్థాయికి పెరిగింది. ‘బాహుబలి’ వంటి సినిమాలు 500 కోట్ల పెట్టుబడి వరకూ వెళ్లి దాదాపు 2000 కోట్ల కలెక్షన్ల దాకా సాధించవచ్చని నిరూపించాయి. ‘పాన్ ఇండియా’ సినిమా అంటూ ఇవాళ దేశం మొత్తం తెలిసే నటీనటులతో సినిమాలు తీసి రెండు, మూడు భాషల్లో విడుదల చేస్తున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కోసమే సినిమా కంటెంట్ వృద్ధి జరిగి ఓటీటీ బిజినెస్ ఒకటి కొత్త ఆర్థిక లావాదేవీలు నెరుపుతోంది. ఈ మొత్తం వృద్ధిలో ప్రాంతీయ అసమానత గమనార్హం. సినీ నిర్మాణం కొన్ని రాష్ట్రాలలోనే జరుగుతోంది. దక్షిణాదిన నాలుగు రాష్ట్రాలలో (ఆంధ్రలో యింకా పుంజుకోవాలి), ముంబయిలో, తక్కువ స్థాయిలో కోల్‌కతాలో సాగుతోంది. జనబాహుళ్యం ఎక్కువగా వున్న ఉత్తరాది రాష్ట్రాలలో, పశ్చిమ రాష్ట్రాలలో సినీ నిర్మాణం ఎదగడానికి ఎంతో అవకాశం వుంది. అలాగే అనేక మాండలిక భాషల్లో సినిమాలు నిర్మించడానికి మార్కెట్ వుంది. సినిమా నిర్మాణం అంతా ఒకే చోట పోగుపడడం అభిలషణీయం కాదు. దీని వలన కొందరి దగ్గరే పెత్తనం ఉండిపోతుంది. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్న కొద్దీ ఆ ప్రాబల్యం తగ్గుతుంది, సంపద పంపిణీ అవుతుంది, స్థానికులకు అవకాశాలు పెరుగుతాయి, సినీనిర్మాణ వ్యయం కూడా తగ్గుతుంది. వచ్చే దశాబ్దాలలో ఆ పని జరుగుతుందని ఆశిద్దాం. -ఎమ్బీయస్ ప్రసాద్ -
ఏపీ ప్రభుత్వం నుంచి ఆహ్వానం
కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన, ఇతర సమస్యలపై చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం నుంచి సినీ ప్రముఖులకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని హీరో చిరంజీవికి ఫోన్ చేశారు. సినీ రంగంలో నెలకొన్న ప్రస్తుత సమస్యల గురించి సినీ పెద్దలతో కలిసి వచ్చి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నెలాఖరులో ఈ సమావేశం జరగనుంది. థియేటర్స్‌లో వందశాతం సీటింగ్, టిక్కెట్ ధరలు, ఎగ్జిబిటర్స్ సమస్యలు, సినీ రంగంపై ఉపాధి పొందుతున్న వారి సమస్యలు వంటి అంశాలపై ఈ భేటీలో చర్చలు జరిగే అవకాశం ఉంది. -
ఫిఫ్టీ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ: జూనియర్ ఆర్టిస్ట్ నుంచి మెగాస్టార్‌గా..
Mammootty Completes 50 Years In Cinema: మమ్మూట్టీ.. ఇండియన్ సినీ పరిశ్రమకు, ముఖ్యంగా సౌత్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. మాలీవుడ్ మెగాస్టార్‌గా వెలుగొందుతున్న ఆయన.. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తయ్యింది. ఒక జూనియర్ ఆర్టిస్ట్‌గా మొదలైన ముహమ్మద్ కుట్టీ పనపరంబిల్ ఇస్మాయిల్ నటనా పరంపర.. ఇవాళ అభిమానులతో ఆప్యాయంగా ‘మమ్ముక్క’ అని పిలిపించుకునేంత స్థాయికి ఎదిగింది. సాక్షి, వెబ్‌డెస్క్: మిడిల్ క్లాస్ ముస్లిం కుటుంబంలో పుట్టిన మమ్మూట్టీ.. ఎర్నాకులం లా కాలేజీలో న్యాయ విద్య అభ్యసించాడు. ఆపై రెండేళ్లపాటు మంజేరీలో లాయర్‌గా కూడా ప్రాక్టీస్ చేశాడు. అనుభవంగళ్ పాలిచకల్(1971)లో గుంపులో గోవిందుడిగా కనిపించాడు పనపరంబిల్ ఇస్మాయిల్. ఆపై నటనపై ఆసక్తితో సినిమా, నాటకాల్లో చిన్నాచితకా పాత్రలు పోషించాడు. 1979లో దేవలోకం సినిమాతో లీడ్ రోల్ పోషించాడు. కానీ, ఆ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయింది. విక్కనుండు స్వప్నంగల్(1980) ద్వారా సాజిన్ పేరుతో మాలీవుడ్ ప్రేక్షకులను తొలిసారి పలకరించాడు. అదే ఏడాది వచ్చిన ‘మేళా’ ఆయనకి హీరోగా తొలి గుర్తింపు ఇచ్చింది. ఆల్ జానర్ల ఆర్టిస్ట్ ఎనభై దశకం మొదట్లో సాజిన్ పేరుతోనే కొన్నాళ్లపాటు నటనా ప్రస్థానం నడిచింది. ‘అహింసా’ సినిమాకు గాను కేరళ స్టేట్ తొలి అవార్డు(సపోర్టింగ్ రోల్) అందుకున్నాడు. ఓవైపు మాస్ క్యారెక్టర్లతో పాటు మరోవైపు ఎక్కువగా భర్త-తండ్రి పాత్రలతో అలరించాడాయన అందుకే ‘మమ్మూట్టీ-కుట్టీ-పెట్టీ’ అంటూ ప్రాసను వాడేవాళ్లు ఆయన మీద. అలాంటి టైంలో ‘న్యూఢిల్లీ’, ‘తనియావర్తనం’ ఆయనలోని సీరియస్ నటనా కోణాల్ని ఆవిష్కరించాయి. ఆపై చాలాకాలం వరుసగా అలాంటి సినిమాలే ఆయనకు దక్కాయి. 1984-93, 1994-2000, 2000-2010.. ఈ మధ్యకాలాల్లో మాస్-క్లాస్-ప్రయోగాత్మక కథలతో.. అప్ అండ్ డౌన్స్‌తో, మధ్య మధ్యలో భారీ బ్లాక్బస్టర్లతో మమ్మూటీ సినీ ప్రయాణం కొనసాగింది. ఎక్కువగా ఊరమాస్ క్యారెక్టర్లతో అలరించడం వల్లే మెగాస్టార్‌గా ముద్రపడిపోయాడు ఆయన. క్రిటికల్ నటుడు మమ్మూటీ మలయాళం పరిశ్రమకు మాస్ ఇంట్రోలు-యాక్షన్ అందించే మెగాస్టార్ కావొచ్చేమో.. కానీ, సౌత్‌కు మాత్రం ఆయనొక టిపికల్ నటుడు. సంగం, ఉత్తరం, ఒరు సీబీఐ డైరీ కురిప్పు, కథోడు కథోరం, పొంథన్ మడ, కౌరవర్, ప్రణామం, అయ్యర్ ది గ్రేట్, ముద్ర, ది కింగ్.. ఇలా హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా పాత సినిమాల సంగతి సరేసరి. పెరంబూ, ఉండా లాంటి కొన్ని రీసెంట్ చిత్రాలు ఆయనలోని అద్భుతమైన నటుడిని అన్ని భాషలకు చూపెట్టాయి. ఇక జబ్బర్ పటేల్ డైరెక్షన్లో వచ్చిన బాబా సాహెబ్ అంబేద్కర్కుగానూ నేషనల్ అవార్డు దక్కింది మమ్మూటీకి. ‘సామ్రాజ్యం’ లాంటి డబ్బింగ్ సినిమాలతోనూ ఆయన తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ఆరు భాషల్లో.. 69 ఏళ్ల మమ్మూటీ ఇప్పటిదాకా 400పైచిలుకు చిత్రాల్లో నటించారు. ఒక మెయిన్ లీడ్ హీరో మిగతా భాషల్లోనూ నటించడం అప్పటికే నడుస్తోంది. అలా మమ్మూటీ కూడా ఆరు భాషల్లో నటించారు. మాలీవుడ్‌తో పాటు మౌనం సమ్మదం(తమిళం)..దళపతి లాంటి సినిమాలు, స్వాతి కిరణం, త్రియాత్రి(హిందీ), షికారి(కన్నడ), డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్(ఇంగ్లీష్) నటించారు. అంతేకాదు ఐదు సినిమాలకుగానూ మూడు నేషనల్ అవార్డులు అందుకున్న అరుదైన రికార్డు మమ్ముక్క సొంతం. ఒరు వడక్కన్(1989) వీరగాథకు ఫస్ట్ నేషనల్ అవార్డు దక్కింది మమ్మూటీకి. అలాగే ఏడు స్టేట్ అవార్డులు దక్కాయి కూడా. తెలుగులో స్వాతి కిరణం, సూర్య పుత్రులు(1996), రైల్వే కూలీ(రిలీజ్‌కు నోచుకోలేదు).. ఆపై రెండు దశాబ్దాల తర్వాత వైఎస్సార్ బయోపిక్‘యాత్ర’లో నటించి.. మెప్పించాడు మమ్మూట్టీ. 4 ఇయర్స్.. 120 ఫిల్మ్స్ జూనియర్ ఆర్టిస్ట్‌గా మొదలైన మమ్మూటీ.. ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా-విలన్‌గా, సపోర్టింగ్ రోల్స్‌తో ఆపై లీడ్ రోల్స్‌తో ఆకట్టుకుంటూ వస్తున్నాడు. ఒకానొక టైంలో ఆయన ఎంత బిజీ అయ్యారంటే.. 1983 నుంచి 1986 మధ్య నాలుగేళ్ల కాలంలో ఏడాదికి 30కి పైగా సినిమాల చొప్పున ఏకంగా 120 సినిమాల్లో నటించారాయన. అంతేకాదు మలయాళంలో 15సార్లు డ్యుయెల్రోల్స్ వేసిన ఘనత కూడా ఆయన ఖాతాలో ఉంది. నిర్మాతగా కూడా.. నటుడే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. మెగాబైట్స్, ప్లే హౌజ్ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్, టెక్నోటెయిన్మెంట్ పేరుతో డిసస్టట్రిబ్యూషన్ కంపెనీ నడిపించారు కూడా. ఆయనలో రాతగాడు కూడా ఉన్నాడు. కాల్చప్పుడు పేరుతో ఓ పేపర్లో తన అనుభవాలను పంచుకోవడంతో పాటు సందర్భానికి తగ్గటుగా సోషల్ మీడియాలో వేదాంత ధోరణిలో కొటేషన్లు కూడా రాస్తుంటాడు. ఆయనలో మంచి వాలీబాల్ ప్లేయర్ కూడా ఉన్నాడు. అందుకే కేరళ వాలీబాల్ లీగ్‌కు అంబాసిడర్‌గా కూడా వ్యవహరించాడు. ఫ్రెండ్లీ స్టార్ సాధారణంగా సినిమాల్లో స్టార్ హీరోల మధ్య పోటీతత్వం.. అలాగే వాళ్ల అభిమానుల మధ్య వైరం కనిపిస్తుంటుంది. కానీ, మెగాస్టార్‌గా పేరున్న మమ్మూటీ.. మాలీవుడ్‌లో సీనియర్-జూనియర్లతోనూ స్నేహం కొనసాగిస్తుంటాడు. మధ్య మధ్యలో వాళ్ల సినిమాల్లో, మాలీవుడ్ చేపట్టే ఛారిటీ కార్యక్రమాల్లోనూ సహ నటులతో మెరుస్తుంటాడు. 2005-10 మధ్య మమ్మూట్టీ-మోహన్‌లాల్-దిలీప్.. ఈ త్రయం 97 శాతం మాలీవుడ్ ఫిల్మ్ రెవెన్యూను రాబట్టగా.. అందులో మేజర్ షేర్ మమ్మూట్టీదే కావడం విశేషం. ఇక మాలీవుడ్ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కొనసాగించే స్నేహం చాలామంది హీరోలకు ఒక మంచి పాఠం కూడా. Today, my brother completes 50 glorious years in the film industry. I feel so proud to have shared the screen with him in 55 memorable films and looking forward to many more. Congratulations Ichakka! @mammukka pic.twitter.com/UevUpSkSGH — Mohanlal (@Mohanlal) August 6, 2021 -
సినీ కార్మికులందరికి ఉచితంగా వ్యాక్సిన్ : చిరంజీవి
‘‘కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఆధ్వర్యంలో సినిమారంగంలోని 24 శాఖల వారికి, ఫిలిం ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, సినీ జర్నలిస్ట్‌లకు కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ వేయిస్తున్నాం.. వ్యాక్సిన్ విషయంలో అపోహలు వీడండి.. నేను వ్యాక్సిన్ తీసుకున్నాను. తప్పకుండా అందరూ తీసుకుందాం.. కరోనా రాకుండా చేద్దాం’’ అని హీరో చిరంజీవి అన్నారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా రంగంలోనివారికి వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం హైదరాబాద్‌లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో జరిగింది. ఈ వ్యాక్సిన్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నిజానికి మూడు వారాల క్రితమే ఈ డ్రైవ్ ప్రారంభించాం. అయితే వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో గ్యాప్ వచ్చింది. ఇప్పటికే వేలమంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. రోజుకు ఐదారు వందల మందికి వ్యాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాం’’ అన్నారు. -
SP Balasubrahmanyam: నిలువెత్తు మంచితనం
సినీ పరిశోధకునిగా, కళాసంస్థ నిర్వాహకుడిగా చాలా మంది సినీ ప్రముఖులతో సన్నిహితంగా మెలిగే భాగ్యం, వాళ్ళ వ్యక్తిత్వాలను అతి దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు కలిగాయి. అయితే బాలు గారి లాంటి వ్యక్తిని నేను చూడలేదు. పేరెన్నికగన్న గాయకుడిగా కీర్తి గడించినా ఎంతో ఒదిగి ఉండే తత్వం, స్థాయిలకు అతీతంగా అందరినీ గౌరవించే గుణం, నలుగురికీ సాయం చేసే దాతృత్వం, ఓర్పు, సహనంతో మెలగడం ఇవన్నీ వారిని ప్రత్యేకంగా నిలుపుతాయి. ‘సంగమం ఫౌండేషన్’ వ్యవస్థాపకుడిగా ఈ రెండు దశాబ్దాలలో నేను చేసిన అనేక కార్యక్రమాలలో బాలు గారు పాల్గొన్నారు. ప్రఖ్యాత గాయని పి.సుశీల గారు కొన్నేళ్ళ క్రితం ‘పి.సుశీల ట్రస్ట్’ను నెలకొల్పి ఆ ట్రస్ట్ ద్వారా ఏటా ఒక సింగర్‌ని జాతీయ స్థాయి పురస్కారంతో గౌరవించాలని సంకల్పించారు. తొలి అవార్డును గాయని యస్. జానకి గారికి బహూకరించాలనుకున్నారు. అప్పుడు బాలు గారి కచేరీ ఏర్పాటు చేశాం. హైదరాబాద్‌లో ఆ కార్యక్రమ నిర్వహణ అంతా నేనే చూసుకోవాల్సి వచ్చింది. రవీంద్రభారతిలో ఏర్పాట్లు చేశాం. కార్యక్రమం సాయంత్రం అనగా సౌండ్ సిస్టవ్‌ు చెక్ చేయడానికి ఉదయం పదకొండు గంటలకే బాలు గారు రవీంద్రభారతికి వచ్చారు. కొద్ది రోజుల ముందే లక్షలు ఖర్చుపెట్టి పెద్ద సౌండ్ సిస్టవ్‌ును రవీంద్రభారతి యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఆ సిస్టవ్‌ును చెక్ చేసిన బాలు గారు నాదగ్గరకొచ్చి ‘సంజయ్ గారూ! సౌండ్ సిస్టమ్ ఓకే. కానీ కొత్త సౌండ్ సిస్టవ్‌ు కాబట్టి సౌండ్ ఆపరేటర్లకు ఆ సిస్టవ్‌ును ఆపరేట్ చేయడంలో ఇంకా పూర్తి పట్టు చిక్కినట్లులేదు. సరిగ్గా ఆపరేట్ చేయకపోతే మేము, ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. రిస్క్ ఎందుకు? మీకు అభ్యంతరం లేకపోతే నా కచ్చేరీలన్నింటికీ రెగ్యులర్‌గా వాడే సౌండ్ సిస్టమ్‌నే పిలిపించుకుంటా’ అన్నారు. ‘అలాగే సర్’ అని, వారికి రెగ్యులర్‌గా వచ్చే సౌండ్ సిస్టమ్ వారినే పిలిపించి ఏర్పాట్లు చేశాం. అంతా బాగా జరిగింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత బాలు గారి దగ్గర కెళ్ళి ‘సౌండ్ సిస్టమ్ వారికి పేమెంట్ ఎంత ఇవ్వాలి సార్’ అని అడిగాను. దానికి వారు ‘‘సంజయ్ గారూ! ‘రవీంద్రభారతి సౌండ్ సిస్టమే వాడతాంగా’ అని సౌండ్‌కు మీరు బడ్జెట్ వేసుకొని ఉండరు. సడెన్‌గా నేను వచ్చి ఆ సౌండ్ సిస్టమ్‌ను కాదని నాకు అలవాటున్న సౌండ్ సిస్టమ్‌ను తెప్పించుకుని దానికి మిమ్మల్ని పేమెంట్ ఇవ్వండని అడిగితే మీకెంత ఇబ్బంది! ఇప్పటికిప్పుడు మీరెక్కడి నుంచి తెస్తారు? ఏం ఫరవాలేదు. మీరేమీ ఇవ్వకండి, నేను చూసుకుంటా’’ అని చెప్పి వారే స్వయంగా వారి జేబులోంచి రూ. 15 వేలు తీసి సౌండ్ సిస్టమ్ వారికి ఇచ్చారు. నాకు నోట మాట లేదు. ఖర్చు పెట్టించేవారినే చూశా కానీ, ఏ సెలబ్రిటీ ఎదురు ఖర్చు పెట్టడం చూడలేదు. మరునాడు ఉదయం బాలు గారి హోటల్ రూమ్‌కి నేను, సుశీల గారు వెళ్ళాం. ‘బాలూ! నేను పాడమని అడగగానే వెంటనే ఒప్పుకుని పాడావు. ఇంత ఇమ్మని ఏమీ అడగకుండానే వచ్చి పాడావు. ఇపుడే ట్రస్ట్ ప్రారంభించాం. ఇది నీ స్థాయి రెమ్యూనరేషన్ కాకపోయినా అభిమానంతో ఇస్తున్నా ఈ యాభై వేలుంచు’ అన్నారు సుశీల. వెంటనే బాలు చిరుకోపాన్ని ప్రదరిస్తూ, ‘అమ్మా! మీ పాటలు వింటూ పెరిగినవాణ్ణి. మీ పక్కన పాడడంతోనే నా సినీ కెరీర్ ప్రారంభమైంది. అలాంటి మీరు ఒక ట్రస్ట్ పెట్టి మంచి కార్యక్రమాలు చేస్తుంటే, మా వంతు సహకారం అందించాలి గాని మీ దగ్గర డబ్బులు తీసుకోవడమేంటి! ఇంకెప్పుడూ ఇలా చేయకండి’ అని తన చేతికిచ్చిన డబ్బుల కవర్‌ను సుశీల గారికిచ్చేసి, ఆమె కాళ్ళకు నమస్కరించారు. అప్పట్లో ఉడుత సరోజిని అని సీనియర్ సినీ గాయనికి ఆరోగ్యం బాగాలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని మా సంస్థ తరఫున సన్మానించి, కొంత నగదు ఇచ్చాం. నెల ముందే బాలు గారిని సంప్రతించి, ఆహ్వానించాం. ‘అదే రోజు బెంగళూరులో ప్రోగ్రామ్ ఉంది. రాలేను సారీ’ అన్నారు. సరోజిని గారి సన్మానం రోజున మా ఏర్పాట్ల హడావిడిలో మేముండగా సడెన్‌గా బాలు గారి నుండి ఫోన్. ‘‘కార్యక్రమం బాగా చేయండి. నేను రాలేకపోతున్నానని బాధగానే ఉంది. అయినా నా మిత్రుడు మురళితో ఓ పాతిక వేలు పంపిస్తున్నా. సరోజిని గారికి నా నమస్సులు తెలియజేసి ఆ మొత్తాన్ని వారికి అందజేయండి’’ అని కోరారు. ఎంతో బిజీగా ఉండే బాలుగారు, వారు రాలేకపోయినా, నెల తర్వాత జరిగే ప్రోగ్రావ్‌ు తేదీని గుర్తుపెట్టుకొని, తన సీనియర్ గాయని కోసం బాధ్యతగా పాతిక వేలు పంపడం చూసి మళ్ళీ ఆశ్చర్యపోయా. హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోయా. ప్రముఖ సితార్ విద్వాంసులు జనార్దన్ మిట్టా అంటే బాలు గారికి ప్రత్యేకాభిమానం. తను పాడిన తొలి చిత్రం నుండి అనేక వేల చిత్రాలలోని పాటలకు సితార్ వాయించిన జనార్దన్ గారికి రావాల్సిన గుర్తింపు రాలేదని బాలు గారి భావన. జనార్దన్ గారు పుట్టి పెరిగిన హైదరాబాద్‌లో వారికో ఘన సన్మానం చేసి గౌరవించాలనుకున్నారు బాలు. ఆ కార్యక్రమాన్ని మా సంస్థ ద్వారా చేయమన్నారు. అప్పుడే వరసగా మూడు ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాము. మళ్ళీ వెంటనే ప్రోగ్రామ్ అంటే స్పాన్సర్స్ కష్టమేమో అని తటపటాయిస్తూ వారికి విషయం చెప్పా. బాలు వెంటనే అప్పటికప్పుడు తనకు తెలిసిన వ్యాపారవేత్తలకు ఫోన్లు చేసి, స్పాన్సర్ చేయించారు. కార్యక్రమం ముందురోజు బాలుగారు నాకు ఫోన్ చేసి ‘‘ఏమండీ! జనార్దన్ గారు పెద్దవారు, వారిని మామూలుగా సత్కరించి వదిలేస్తే ఏం బాగుంటుంది. అందుకే స్వర్ణకంకణం తొడిగి గౌరవిద్దామనుకుంటున్నా. చెన్నైలో పనుల ఒత్తిడిలో ఉన్నాను. కంకణం కొనే టైమ్ లేదు. ఏమీ అనుకోకుండా ఓ లక్ష రూపాయల్లో మంచి స్వర్ణకంకణం మీరు నా తరఫున షాపింగ్ చేయండి’’ అన్నారు. నా దగ్గరున్న డబ్బుతో స్వర్ణకంకణం కొన్నాను. కార్యక్రమం రోజు బాలు దంపతులు తమ ఖర్చులతోనే విమానంలో చెన్నై నుండి హైదరాబాద్‌కు వచ్చారు. రవీంద్రభారతికి రాగానే రిసీవ్ చేసుకోవడానికి ఎదురెళ్లాను. కారు దిగుతూనే స్వర్ణకంకణం కోసం నేను ఖర్చుపెట్టిన లక్షరూపాయలు నా చేతిలో పెట్టేశారు. అంత పకడ్బందీగా ఉంటారు బాలు గారు. బాలు గారు అంత ఘనమైన సత్కారాన్ని తనకు చేయించడంతో సంతోషంలో సితార్ జనార్దన్ గారికి వేదికపైనే ఆనందభాష్పాలు రాలాయి. ఓ సాటి కళాకారుడిని ఇంత ఘనంగా గౌరవించే మనసు ఎంతమందికి ఉంటుంది! ఇలా ఎన్నో సంఘటనలు. ఏది ఏమైనా, బాలు గారి లాంటి వ్యక్తులు అరుదు. విశిష్ట వ్యక్తిత్వం వారి సొత్తు. అమరగాయకుడు ఘంటసాల గారి విగ్రహాన్ని హైదరాబాద్‌లో తన సొంత ఖర్చులతో నెలకొల్పారు బాలు. అలాగే, నెల్లూరులో తమ సొంత ఇంటిని వేద పాఠశాల నిమిత్తం కంచి కామకోటì పీఠానికి డొనేట్ చేశారు. మిత్రులెందరినో ఆపదలో ఆదుకున్నారు. లెక్కలేనన్ని గుప్తదానాలు చేశారు. 2020 ఫిబ్రవరిలో చెన్నైలో బాలు గారిని వారింట్లో కలిసినప్పుడు ‘త్వరలో హైదరాబాద్ వస్తున్నా. అప్పుడు టైమ్ తీసుకుని మీ ఆఫీసు కొచ్చి తెలుగు సినిమాపై మీరు సేకరించిన కలెక్షన్స్ అన్నింటినీ తీరిగ్గా చూస్తా. ఏయన్నార్, యస్వీఆర్లపై మీరు వేసిన ఫోటో బయోగ్రఫీ పుస్తకాలు నాకు బాగా నచ్చాయి. ఆ తరహాలో నా మీద కూడా ఒక పుస్తకాన్ని ప్లాన్ చేయాలి. అది కూడా మీతో అప్పుడు చర్చిస్తాను’ అన్నారు. అవేమీ జరగకుండానే కరోనా మహమ్మారి బారిన పడి 2020 సెప్టెంబర్ 25న బాలు ఈ లోకాన్ని వీడారు. వారితో పాటే నిబద్ధత, సమర్థత, విధేయత, మంచితనం, మానవత్వం కూడా వెళ్ళిపోయాయేమో అనిపించింది. – సంజయ్ కిషోర్, ప్రముఖ సినీ పరిశోధకులు నేడు యస్పీబీ స్వరనీరాజనం యస్పీబీ 75వ జయంతి సందర్భంగా ఈ శుక్రవారం తెలుగు సినీపరిశ్రమ అంతా కలిసి ‘స్వరనీరాజనం’ అందిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది వరకూ 12 గంటల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో దర్శకులు కె. విశ్వనాథ్, హీరో చిరంజీవి సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని, తమ అనుభవాలు పంచుకోనున్నారు. ఆర్పీ పట్నాయక్ సారథ్యంలో గాయనీ గాయకులు, సంగీత దర్శకులు పాటలు పాడనున్నారు. జూమ్‌లో జరిగే ఈ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని యూ ట్యూబ్‌లో చూడవచ్చు. -
ట్రిబ్యునల్ రద్దుతో సినీ నిర్మాతలకు చిక్కులే
గప్‌చుప్‌గా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 4న కొన్ని అప్పిలేట్ ట్రిబ్యునళ్లను రద్దు చేసింది. అందులో సినిమా సెన్సార్ బోర్డుకు చెందిన ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఒకటి. సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని సవరిస్తూ అప్పిలేట్ ట్రిబ్యునల్ స్థానంలో హైకోర్టును చేర్చారు. దేశంలో ఇన్ని హైకోర్టులు ఉన్నపుడు ప్రత్యేకంగా ఒక్కో విభాగానికి మళ్ళీ ట్రిబ్యునళ్లు ఎందుకని కేంద్రం ప్రశ్న. వీటిని తొలగించడం వల్ల సత్వరన్యాయం దూరమవడంతో పాటు కోర్టు ఖర్చులు మోయవలసి వస్తుందని సినీవర్గాలు అంటున్నాయి. అప్పిలేట్ ట్రిబ్యునల్ అంటే ఒక కోర్టులాంటిదే, అయితే అది ప్రత్యేక విషయానికే పరిమితమై పనిచేస్తుంది. దేశంలో ఆదాయపు పన్ను, జీఎస్టీ, విద్యుత్తు, సైన్యం, సైబర్ నేరాలు ఇలా చాలా విభాగాలకు సొంత ట్రిబ్యునళ్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన వ్యాజ్యాలపై కోర్టుకు వెళ్లనవసరం లేదు. ట్రిబ్యునల్‌కు ఒక రిటైర్డ్ హైకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జి చైర్మన్‌గా మరి కొందరు సభ్యులు ఉంటారు. ఏ ఖర్చూ లేకుండా వారి ముందుకు వచ్చిన పిటిషన్‌కు తుది తీర్పు చెబుతారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బిల్లు 2017లో భాగంగా క్రమబద్ధీకరణ పేరిట దేశంలో ఉన్న 26 ట్రిబ్యునళ్లను 19కు కుదించింది లేదా తగ్గించింది. మళ్ళీ ఈసారి వివిధ చట్టాలను సవరిస్తూ వాటికి అనుబంధంగా ఉన్న ఐదు చిన్న కోర్టులను రద్దు చేసింది. వీటిలో సినిమాటోగ్రాఫ్ చట్టం 1952, కస్టమ్స్ చట్టం 1962, ఎయిర్ పోర్ట్ చట్టం 1994, ట్రేడ్ మార్క్ చట్టం 1991, మొక్కల పరిరక్షణ రైతుల హక్కు చట్టం 2001 ఉన్నాయి. ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ రద్దు చేసి సెన్సార్ బోర్డుపై ఫిర్యాదు ఉంటే హైకోర్టుకు వెళ్ళమనడం పట్ల సినీ నిర్మాతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరణపై కోర్టుకెళితే ఆ కేసు తేలేదెన్నడు, సినిమా విడుదల అయ్యేదెన్నడు అని తలలు పట్టుకుంటున్నారు. ఎలాగైనా ట్రిబ్యునల్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మన దేశంలో సినిమాటోగ్రాఫ్ చట్టం ప్రకారం 1952లో సెన్సార్ బోర్డు ఏర్పడింది. సినీ నిర్మాతలు సెన్సార్ సమస్యలను సులువుగా తేల్చుకొనేందుకు చట్టంలోని సెక్షన్ డి ప్రకారం 1983లో బోర్డుకు అనుబంధంగా ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. సెన్సార్ బోర్డులో మూడు వ్యవస్థలుంటాయి. మొదటిది ఐదుగురు సభ్యులుండే ఎగ్జామినింగ్ కమిటీ, చాలా సినిమాలు ఇక్కడే సర్టిఫికెట్ పొందుతాయి. రెండోది రివైజింగ్ కమిటీ. మొదటి కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసిన సినిమాలకు కొన్ని తొలగింపులతో ఇది విడుదలకు అనుమతినీయవచ్చు. వీటికి ఒప్పుకొని సినిమా సర్టిఫికెట్ తెచ్చుకోనేవారు కూడా ఉంటారు. సెన్సార్ కటింగ్స్‌తో సినిమా విడుదల చేయడం వ్యర్థమని భావించి వాటిని ఒప్పుకోని నిర్మాత చివరి ప్రయత్నంగా ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ తలుపు తడతాడు. ఈ ట్రిబ్యునల్‌కు ఒక రిటైర్డ్ జడ్జి చైర్మన్‌గా ఉంటారు కాబట్టి దీని నిర్ణయం కోర్టు తీర్పుతో సమానం. పై రెండు కమిటీలు దీని మాటకు కట్టుబడి ఉండాల్సిందే. దీని తీర్పు నచ్చని నిర్మాత బయట కోర్టుల్లో సవాలు చేయవచ్చు. ఇక్కడ ప్రభుత్వానికి మింగుడుపడనిది, సినిమావాళ్ళకు ఇష్టమైనది ఏమిటంటే సామాజిక, రాజకీయ అంశాలపై విమర్శనాత్మకంగా వచ్చిన ఎన్నో సినిమాల విడుదలకు ఫిలిం సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ మార్గాన్ని సుగమం చేస్తోంది. పాలక పక్ష అనుయాయులను బోర్డు చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టినా ఫలితం శూన్యం. ట్రిబ్యునల్ ఉండడం వల్ల ప్రభుత్వాన్ని, సామాజిక కట్టుబాట్లను, విశ్వాసాలను విమర్శించే ప్రగతిశీల, అభ్యుదయ సినిమాలు బయటికి వస్తున్నాయి. ట్రిబ్యునల్ రద్దు చేసి ఇలాంటి సినిమాలు తీసేవారిని కోర్టుల చుట్టూ తిప్పితే కష్ట నష్టాలపాలై విమర్శనాత్మక సినిమాలు తీయడానికి ముందుకు రారు అని ప్రభుత్వం భావిస్తోందని సినీజీవులంటున్నారు. 1994లో ‘బాండిట్ క్వీన్’ విడుదలకు రెండు కమిటీలు ఒప్పుకోకున్నా ట్రిబ్యునల్ ప్రమేయంతో మన దేశంలో రిలీజ్ అయింది. 2017లో ‘లిప్‌స్టిక్ అండర్ మై బురఖా’ ట్రిబ్యునల్ తీర్పు మూలంగానే తెర మీదికొచ్చింది. 2016లో శ్యామ్ బెనెగల్ కమిటీ ట్రిబ్యునల్ అధికారాలను మరింత పెంచాలని సిఫారసు చేసింది. షర్మిలా ఠాగూర్ సెన్సార్ బోర్డు చైర్ పర్సన్‌గా ఉన్నప్పుడు తాను ట్రిబ్యునల్ ప్రాధాన్యతను ప్రభుత్వం దృష్టికి తెచ్చానని, రద్దు విషయంలో సినీ ప్రముఖులతో చర్చించి ఉండాల్సిందని అంటున్నారు.. ప్రజలకు అవసరం లేవని, ప్రభుత్వానికి భారమని భావించే ట్రిబ్యునళ్ల తొలగింపుపై కనీసం ఏకసభ్య కమిటీ అయినా వేసి అంతిమ నిర్ణయాలు తీసుకోవాలి. లక్షలాది మందికి ఉపాధికి, కోట్ల రూపాయల పన్నుకు మూలమైన చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం మరిన్ని వెసులుబాట్లు కల్పించాలి తప్ప ఉన్న సదుపాయాలను దూరం చేయవద్దు. వ్యాసకర్త :బి. నర్సన్ కవి, విశ్లేషకులు మొబైల్ : 94401 28169 -
New Movies Updates: పాంచ్ పటాకా!
ఒకటీ.. రెండు.. మూడు... ఐదు వరకూ లెక్కపెట్టాల్సిందే. ఎందుకంటే అందాల తారలు వరుసగా ఐదు సినిమాల్లో కనిపించనున్నారు. ప్లాన్ చేసినట్లుగా సినిమాలు విడుదలయ్యుంటే.. లెక్క ఐదు వరకూ వచ్చేది కాదు. వాయిదా పడిన సినిమాలు విడుదలయ్యే నాటికి చేతిలో ఉన్న సినిమాలు రెడీ అవుతాయి. అలా ఇప్పటికే పూర్తి చేసిన సినిమాలు, చేస్తున్న సినిమాలతో కలిపి కొందరి నాయికల డైరీలో ఐదు సినిమాలు కచ్చితంగా ఉన్నాయి. ఆ ‘పాంచ్ పటాకా’ సినిమాల గురించి తెలుసుకుందాం. క్రేజీ బుట్ట బొమ్మ బుట్టబొమ్మ పూజాహెగ్డే జోరు మామూలుగా లేదు. ఉత్తరాదిలోనైనా, దక్షిణాదిలోనైనా పూజ క్రేజ్ వేరు. ఈ క్రేజే ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, చిరంజీవి ‘ఆచార్య’లో రామ్‌చరణ్ సరసన పూజ చేస్తున్న సినిమాల చిత్రీకరణలు దాదాపు పూర్తయ్యాయి. ఇక నిర్మాణంలో ఉన్న చిత్రాల విషయానికొస్తే.. ఇటీవల తమిళ హీరో విజయ్ సరసన ఓ సినిమా కమిట్ అయ్యారు పూజ. అటు హిందీలో రణ్వీర్ సింగ్ చేస్తున్న ‘సర్కస్’ చిత్రంలో హీరోయిన్గా చేస్తున్న పూజ.. సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దీవాలి’ సినిమాలోనూ హీరోయిన్గా కమిట్ అయ్యారు. థియేటర్స్ ఓపెన్ అయితే.. రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, సర్కస్.. ఇలా వరుసగా వెండితెరపై ప్రేక్షకులకు దర్శనం ఇస్తారు పూజ. కాజల్ తగ్గేదే లే ! ఇండస్ట్రీకి వచ్చి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. కెరీర్లో యాభై చిత్రాల మైలురాయిని చేరుకున్నారు. అయినా సరే.. కాజల్ అగర్వాల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆమెకు వస్తున్న అవకాశాలే ఇందుకు నిదర్శనం. తెలుగులో చిరంజీవి ‘ఆచార్య’, నాగార్జునతో ఓ సినిమా (ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో..), తమిళంలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు ‘ఘోస్టీ’, డీకే దర్శకత్వంలో సినిమా, మలయాళంలో దుల్కర్ సల్మాన్ ‘హే సినామిక’ (ఒక హీరోయిన్గా.. మరో హీరోయిన్ అదితీరావ్ హైదరీ) చిత్రాల్లో హీరోయిన్గా చేస్తున్నారు కాజల్. అలాగే కమల్‌హాసన్‌తో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేయాల్సిన ‘ఇండియన్ 2’ సినిమా ప్రస్తుతానికి ఆగిపోయింది. కాజల్ నటించిన ‘ప్యారిస్ ప్యారిస్ (హిందీ ‘క్వీన్’కు తమిళ రీమేక్) విడుదల కావాల్సి ఉంది. మిగతా హీరోయిన్లకు హిందీతో కలిపి ఐదు ప్రాజెక్ట్స్ అయితే కాజల్ మాత్రం సౌత్‌లోనే ఐదు సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు.. ఇటు వెబ్ సిరీస్‌లు (కాజల్ నటించిన ‘లైవ్ టెలికాస్ట్’ ఇటీవల విడుదలైంది) కూడా చేస్తూ ‘తగ్గేదే లే’ అంటున్నారు కాజల్. తాప్సీ దూకుడు బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయారు తాప్సీ. గడచిన మూడేళ్ళుగా తాప్సీ ఏడాదికి నాలుగు సినిమాలకు సైన్ చేస్తున్నారు. అంతే వేగంగా ఆ సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది కూడా అదే దూకుడును చూపించారు. ‘హసీన్ దిల్రుబా’, ‘రష్మీ: ది రాకెట్’, ‘లూప్ లపేటా’ (జర్మన్ థ్రిల్లర్ ‘రన్ లోలా రన్’కు హిందీ రీమేక్) ‘దో బార’ సినిమాల షూటింగ్‌లను పూర్తి చేసి, విడుదలకు సిద్ధంగా ఉంచారు. ప్రస్తుతం ‘శభాష్ మీతూ’ (క్రికెటర్ మిథాలీరాజ్ బయోపిక్), సౌత్‌లో విజయ్ సేతుపతితో ఒక సినిమా చేస్తున్నారు తాప్సీ. ‘హసీన్ దిల్రుబా’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మిగతా చిత్రాలు థియేటర్స్‌లో విడుదలయ్యే అవకాశమే ఉంది. తమన్నా హవా మిల్కీ బ్యూటీ తమన్నా తన డైరీని ఖాళీగా ఉంచేందుకు ఇష్టపడటం లేదు. వెంకటేష్ – వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’, సత్యదేవ్ ‘గుర్తుందా..శీతాకాలం’ చిత్రాల్లో తమన్నా హీరోయిన్గా చేస్తున్నారు. నితిన్ ‘మ్యాస్ట్రో’లో కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే తమన్నా హీరోయిన్గా నటించిన ‘సీటీమార్’ సినిమా ఈ ఏడాది ఈపాటికే విడుదల కావాల్సింది. కరోనా కారణంగా వాయిదా పడింది. సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గోపీచంద్ హీరోగా నటించారు. ఇక బాలీవుడ్లో తమన్నా నటించిన ‘భోలే చూడియాన్’ చిత్రీకరణ పూర్తయింది. హిందీ హిట్ ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’ చిత్రంలో టైటిల్ రోల్ చేశారు తమన్నా. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినప్పటికీ విడుదల కాలేదు. ఇంకో విశేషం ఏంటంటే... ‘సీటీమార్’ (ఏప్రిల్ 2), ‘మ్యాస్రో’్ట (జూన్ 11), ‘ఎఫ్ 3’ (ఆగస్టు 27).. ఈ ఏడాది విడుదల కావాల్సిన చిత్రాలు. కానీ కరోనా వల్ల కాలేదు. వచ్చే ఏడాది తెలుగు తెరపై తమన్నా హవా తప్పక కనిపిస్తుందని అర్థం అవుతోంది. రాకెట్ వేగంతో రష్మిక దక్షిణాది అగ్రకథానాయికల్లో రష్మికా మందన్నా పేరు కూడా ఉంది. ఇదే సీన్‌ను ఉత్తరాదిలోనూ రిపీట్ చేయాలనే ఉత్సాహం ఆమెలో కనిపిస్తోంది. ఈ కన్నడ బ్యూటీ హిందీలో ఏకంగా మూడు చిత్రాలు చేజిక్కించుకున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాతో ‘మిషన్ మజ్ను’, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కాంబినేషన్లో ‘గుడ్ బై’ చిత్రాలు చేస్తున్నారు రష్మిక. అలాగే మరో హిందీ సినిమా కూడా సైన్ చేశానని, త్వరలో ఆ వివరాలు చెబుతానని ఇటీవల ఇన్స్టాగ్రామ్ చాట్ సెషన్లో రష్మికా మందన్నా వెల్లడించారు. ఈ మూడు ప్రాజెక్ట్స్ కాకుండా తెలుగులో అల్లు అర్జున్ నటిస్తున్న ప్యాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప’, శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ చిత్రాల్లో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. తెలుగులో ఈ రెండు చిత్రాలే కాకుండా మరో చిత్రంలో హీరోయిన్గా నటించేందుకు కూడా రష్మికా చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఇలా దక్షిణ, ఉత్తరాదిలో రాకెట్ వేగంతో కెరీర్లో దూసుకెళ్తున్నారు రష్మికా మందన్నా. రకుల్.. డైరీ ఫుల్ సౌత్‌లో హీరోయిన్గా తనదైన ముద్ర వేసిన రకుల్‌ప్రీత్ సింగ్ ఇప్పుడు బాలీవుడ్లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే జాన్ అబ్రహాం ‘ఎటాక్’ అజయ్ దేవగణ్ ‘మేడే’, ‘థ్యాంక్ గాడ్’ చిత్రాల్లో హీరోయిన్గా చేస్తున్న రకుల్ తాజాగా తేజస్ డియోస్కర్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. ఇందులో కండోమ్ టెస్టర్‌గా రకుల్ పాత్ర ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. హిందీలో ఈ నాలుగు చిత్రాలతో పాటు తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా (ఇందులో వైష్ణవ్‌తేజ్ హీరో), తమిళంలో శివ కార్తికేయన్ ‘ఆయలాన్’ చిత్రాల్లో రకుల్‌ప్రీత్ సింగ్ హీరోయిన్గా కనిపిస్తారు. ఇప్పుడు చేస్తున్న సినిమాలతో రకుల్ డైరీ ఫుల్. డిఫరెంట్ కృతీ మహేశ్‌బాబు ‘వన్: నేనొక్కడినే’ చిత్రంలో హీరోయిన్గా నటించిన కృతీ సనన్ గుర్తుండే ఉంటారు. ఇప్పుడు కృతీ హవా బాలీవుడ్లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘ఇట్స్ మై టైమ్’ అంటు కృతీ ప్రస్తుతం ఐదు చిత్రాలకు సైన్ చేశారు. ప్రభాస్ మైథలాజికల్ ఫిల్మ్ ‘ఆదిపురుష్’, వరుణ్ ధావన్ హారర్ ఫిల్మ్ ‘బేడియా’, అక్షయ్ కుమార్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘బచ్చన్ పాండే చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్నారు కృతీ సనన్. ఈ చిత్రా లే కాకుండా... రాజ్‌కుమార్ రావ్‌తో ‘హమ్ దో హమారే దో’, టైగర్ ష్రాఫ్ యాక్షన్ ఫిల్మ్ ‘గణ్‌పత్’ చిత్రాల్లో కృతీసననే హీరోయిన్. మరోవైపు కృతీ నటించిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘మిమి’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఓటీటీలో విడుదల అవుతుందనే ప్రచారం సాగుతోంది. మైథాలజీ, యాక్షన్, రొమాన్స్, హారర్.. ఇలా ఒకేసారి డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు చేసే అవకాశం రావడం అంటే గొప్ప విషయం. ఈ అవకాశాలను ఛాలెంజ్‌గా తీసుకుని, నిరూపించుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు కృతీ సనన్. ట్రిపుల్ రోల్ దీపికా హెడ్డింగ్ చదివి, ఫోటో చూసి దీపికా పదుకోన్ మూడు పాత్రలతో ఓ సినిమా వస్తుందనుకుంటే పొరపాటే. ఇంతకీ విషయం ఏంటంటే... అతిథిగా, నిర్మాతగా, హీరోయిన్గా దీపికా పదుకోన్ సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న చిత్రం, షారుక్ ఖాన్ ‘పఠాన్’, హృతిక్ రోషన్ ‘ఫైటర్’, దర్శకుడు శకున్ బాత్రా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రాల్లో హీరోయిన్గా కనిపిస్తారు దీపిక. ఇక తన భర్త, నటుడు రణ్వీర్ సింగ్ నటించిన ‘83, సర్కస్’ చిత్రాల్లో అతిథి పాత్రలు చేశారామె. క్రికెట్లో భారత జట్టు తొలిసారి ప్రపంచకప్పు సాధించిన 1983 సంఘటనల ఆధారంగా రూపొందిన ‘83’ చిత్రానికి దీపిక ఓ నిర్మాత. అలాగే దీపక నిర్మాతగా మహాభారతంలోని ద్రౌపది పాత్ర ఆధారంగా ఓ సినిమా రూపొందనుందని, ఇందులో ద్రౌపదిగా దీపికానే కనిపిస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
ప్రజారోగ్యాన్ని రాష్ట్రాలకు వదిలేయడం సరికాదు: కేతిరెడ్డి
చెన్నై: దేశంలో జాతీయ విపత్కర పరిస్థితి ఏర్పడిన సందర్భంలో ప్రజారోగ్యం పట్ల శ్రద్ధవహించాల్సిన కేంద్రం కరోనా నియంత్రణను రాష్ట్రాలకు అప్పగించడం ఎంతవరకు సరైనదని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్ది ఓ ప్రకటనలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. 'స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ మన దేశంలో విద్య, వైద్య రంగాలలో ఇప్పటికీ పరిస్థితులు మెరుగుపడలేదు. ప్రస్తుత ప్రభుత్వాలు కానీ, గతంలో ఉన్న ప్రభుత్వాలుగాని, ప్రజారోగ్యం, విద్య పట్ల శ్రద్ధ వహించి ఉంటే ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడి ఉండేవి కావు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుంటూ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి మరణాల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది. పౌరులు కూడా అప్రమత్తంగా ఉంటూ, కోవిడ్ నిబంధనలను పాటించి ప్రభుత్వానికి అండగా ఉండాలి. కరోనా తీవ్రతను బట్టి అవసరమైతే లాక్‌డౌన్‌ను విధించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి. సినీ పరిశ్రమలోని అగ్రనటులందరు కరోనా పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ఆ దిశగా టీవీ మాధ్యమాలు, ప్రింట్, యూట్యూబ్‌లలో ప్రకటనలు ఇస్తూ ప్రజలకు భరోసా కల్పించి తమ వంతు బాధ్యతను నిర్వహించాలి. ఇటువంటి పరిస్థితుల్లో సినీ రంగానికి చెందిన వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతుసాయంగా నిలవాలని' కేతిరెడ్డి కోరారు. -
సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్ బ్రేక్’
ఈ సినిమా పరిశ్రమ పరిస్థితి ఏంటి? ఈ కరోనా ఎటువైపు తీసుకెళుతోంది? కరోనా ఫస్ట్ వేవ్ చాలా నష్టాన్ని మిగిల్చింది. తొలి తాకిడి తట్టుకుని, మెల్లిగా తేరుకుంటున్న సమయంలో... ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చిపడింది. మళ్లీ సినిమా షూటింగ్‌లకు ‘సెకండ్ బ్రేక్’ వేయక తప్పడం లేదు. సెకండ్ వేవ్ ప్రభావంతో తాజాగా అర్ధంతరంగా షూటింగ్ ఆగిన చిత్రాల గురించి తెలుసుకుందాం... కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ అన్ని జాగ్రత్తలూ తీసుకుని, చిరంజీవి ‘ఆచార్య’ సినిమా షూటింగ్ చేస్తూ వచ్చారు. కానీ, రోజురోజుకీ కరోనా కేసులు ఎక్కువ అవుతుండడం, ఇదే చిత్రం షూటింగ్లో పాల్గొన్న సోనూ సూద్ కరోనా బారినపడటంతో ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చేశారు. చిత్రీకరణ ఆపాలనే నిర్ణయాన్ని సోమవారం తీసుకుంది చిత్రబృందం. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్‌కి పడిన బ్రేక్ కారణంగా ఆ సమయానికి ‘ఆచార్య’ తెరపైకి రావడం కుదరకపోవచ్చు. మరోవైపు ఇంకో పదంటే పది రోజులు మాత్రమే షూటింగ్ చేస్తే, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ పూర్తయిపోతుంది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కోసం కృష్ణంరాజు–ప్రభాస్ కాంబినేషన్ సీన్స్ తీస్తే సినిమా పూర్తయిపోతుంది. పది రోజుల షూటింగ్ ఎలాగోలా పూర్తి చేయాలనుకున్నారు కూడా! కానీ, ఇప్పుడు మాత్రం షూటింగ్ ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ‘ఆచార్య’, ‘రాధేశ్యామ్’ చిత్రాల షూటింగ్ ఆపాలనుకున్న విషయం సోమవారం బయటికొచ్చింది. ఇక, ఇప్పటికే కరోనా వల్ల ఆగిన సినిమాల విషయానికొస్తే... మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. షూటింగ్లో పాల్గొనే ముందు యూనిట్ సభ్యులకు కరోనా పరీక్షలు చేయగా నలుగురికి పాజటివ్ నిర్ధారణ అయిందట. వీరిలో హీరో వ్యక్తిగత సహాయకుల్లో ఒకరు కూడా ఉన్నారు. దీంతో హైదరాబాద్‌లో జరగాల్సిన ‘సర్కారువారి పాట’ సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణకు బ్రేక్ పడింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. ఇక రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రౌద్రం... రణం... రుధిరం’ (ఆర్ఆర్ఆర్)కి బ్రేక్ పడింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను ముంబయ్‌లో గ్రీన్ మ్యాట్ బ్యాక్‌డ్రాప్‌లో ప్లాన్ చేశారట. అయితే మహరాష్ట్రలో చిత్రీకరణలను ఆపేయాల్సిందిగా ప్రభుత్వం నిబంధన విధించడంతో ‘ఆర్ఆర్ఆర్’ ప్లాన్ ముందుకు సాగలేదని సమాచారం. ‘ఎఫ్ 2’లో బోలెడంత ఫస్ అందించిన వెంకటేశ్, వరుణ్ తేజ్ మళ్లీ నవ్వించడానికి ‘ఎఫ్ 3’ చిత్రీకరణతో బిజీ అయ్యారు. సరదా సరదాగా సాగుతున్న ఈ సినిమా చిత్రీకరణకు చిత్రదర్శకుడు అనిల్ రావిపూడికి కరోనా సోకడం వల్ల బ్రేక్ పడింది. ఈ చిత్రం ఆగస్టు 27న రిలీజ్‌కు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల పవన్‌కల్యాణ్ కరోనా బారిన పడ్డారు. అంతే కాదు... ఆయన చిత్రబృందంలో ఇంకా పాజిటివ్ నిర్ధారణ అయినవాళ్లు చాలా ఉన్నారట. దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న సీనియర్ కో–డైరెక్టర్ సత్యం కరోనా బారిన పడి కన్నుమూశారు. దీంతో పవన్‌కల్యాణ్–రానా నటిస్తున్న మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ షూటింగ్ నిలిచిపోయింది. మరోవైపు వేగంగా షూటింగ్ సాగుతున్న హీరో గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ సినిమాకు కూడా కరోనా బ్రేక్ వేసింది. హీరో వ్యక్తిగత సహాయకుల్లో ఒకరికి పాజిటివ్ రావడంతో షూటింగ్ నిలిపివేసినట్లు తెలిసింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాను ఈ ఏడాది అక్టోబరు 1న విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాలతో పాటు మరికొన్ని చిన్నా పెద్ద సినిమాల చిత్రీకరణలు ఆగాయి. మొత్తానికి షూటింగ్స్ తేదీలన్నీ తారుమారవుతున్నాయి. విడుదల తేదీలు తారుమారయ్యే అవకాశం ఉంది. కరోనా చేస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. -
సెకండ్ వేవ్ సినిమా.. మూడు నెలల ముచ్చటేనా?
కరోనా మళ్ళీ భయపెడుతోంది. సెకండ్ వేవ్ స్పీడుగా వ్యాపిస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న... సినీ పరిశ్రమపై మళ్ళీ ప్రభావం చూపుతోంది. దేశంలోకెల్లా కరోనా కేసులు ఎక్కువున్న... మహారాష్ట్ర సినిమా హాళ్ళు పూర్తిగా మూసేసింది. హిందీ రిలీజులు వాయిదా పడుతున్నాయి. కర్ణాటక సహా దేశంలోని అనేక రాష్ట్రాలేమో... 50 శాతం సీటింగ్ కెపాసిటీకి దిగి వచ్చాయి. కన్నడ పునీత్ రాజ్‌కుమార్ ‘యువరత్న’ రిలీజైన వారం రోజులకే ఇవాళ్టి నుంచి ఓటీటీ బాట పట్టింది. తమిళ సర్కార్ నేటి నుంచే సీటింగ్ తగ్గించేసింది. ఫుల్ కెపాసిటీ ఉన్నా... తెలుగునాట హాళ్ళలో జనం పలచబడుతున్నారు. ‘లవ్‌స్టోరీ’ పోస్ట్‌పోన్ అయింది. రోజు రోజుకూ కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని తెలంగాణ హైకోర్టు అడుగుతోంది. మరి, ఇప్పుడిక... మన సినిమా హాళ్ళ సంగతేమిటి? రిలీజవ్వాల్సిన మిగతా తెలుగు సిన్మాల భవిత ఏమిటి? సరిగ్గా ఏడాది క్రితం... కరోనా వ్యాప్తితో దేశమంతా లాక్ డౌన్లో ఉంది. హాళ్ళు మూసేశారు. సినిమాలు లేవు. సమ్మర్ మొదలు గత డిసెంబర్ దాకా సినీ వ్యాపారమే తుడుచుకుపోయింది. ఏడాది తరువాత... ఇప్పుడు లాక్ డౌన్ లేదు. కరోనా మాత్రం బలంగానే ఉంది. హాళ్ళు తెరిచారు. సినిమాలు వస్తున్నాయి. కానీ, సెకండ్ వేవ్ దెబ్బతో ఇప్పుడు క్రమంగా హాలుకు వచ్చే జనమే తగ్గుతున్నారు. రెండువారాలుగా రోజు రోజుకూ కేసులు పెరుగుతుండడంతో తెలుగు నాట కూడా సినిమా హాళ్ళపై షరతులు తప్పేలా లేవు. దాంతో, భారీ ఖర్చు పెట్టి తీసి, అంతే భారీగా వ్యాపారమూ జరుపుకొన్న పెద్ద సినిమాల రిలీజులు డోలాయమానంలో పడ్డాయి. తాజాగా నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ వాయిదా తాజా పరిస్థితికి నిదర్శనం. టెస్టుల నడుమే... తెగ షూటింగ్స్ నిజానికి, లాక్డౌన్ ఎత్తేశాక∙ఒక దశలో తెలుగునాట షూటింగులు పీక్‌కి వెళ్ళాయి. రోజూ ఏకంగా 120కి పైగా షూటింగులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ వేప్తో ఆ జోరూ కొంత తగ్గింది. అయితేనేం... ఇప్పటికీ సినిమాలైతేనేం, వెబ్ సిరీస్లైతేనేం... రోజుకు సగటున 80 షూటింగులైతే తెలుగునాట జరుగుతున్నాయి. ‘‘షూటింగుల కోసం తగినంత మంది టెక్నీషియన్లైనా దొరకని పరిస్థితి. చివరకు, హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్న మా భారీ చిత్రానికి కావాల్సినంత మంది మేకప్మ్యాన్లు కూడా దొరకడం లేదంటే నమ్మండి’’ అని ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. అయితే, ఈ షూటింగుల్లో శానిటైజేషన్, పదే పదే టెస్టులకే శ్రమ, ఖర్చు తడిసిమోపెడవుతున్నాయి. ఇటీవల అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ షూటింగు కోసం 100 మంది జూనియర్ ఆర్టిస్టులకు టెస్టులు చేస్తే, 45 మందికి పాజిటివ్ వచ్చింది. గుణశేఖర్ రూపొందిస్తున్న ‘శాకుంతలం’ సహా తెలుగునాట పలు సినిమా యూనిట్లు ముంబయ్, చెన్నైల నుంచి వచ్చే ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేయించి కానీ, షూటింగుకు అనుమతించడం లేదు. ‘‘రోజూ భారీ యూనిట్‌తో షూటింగ్ చేస్తున్నాం. పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్నవాళ్ళను ఒక రోజు ముందే వచ్చి, పరీక్ష చేయించుకోమంటున్నాం. స్థాని కులకు సైతం రెండు రోజులకు ఒకసారి ర్యాపిడ్ టెస్టులు చేయిస్తున్నాం’’ అని ‘శాకుంతలం’ చిత్ర వర్గాలు తెలిపాయి. హిందీలో వాయిదా పర్వం టెస్టులు, షూటింగుల మాటెలా ఉన్నా – కరోనా విజృంభణ ఆగడం లేదు. సామాజిక దూరంతో షూటింగులు జరుపుకొంటున్న హిందీ చిత్రసీమ చివరకు మూతపడ్డ హాళ్ళు, వివిధ ప్రాంతాల్లోని కర్ఫ్యూ, లాక్డౌన్, 144 సెక్షన్ల నిబంధనలతో ఏకంగా రిలీజులు వాయిదా వేయడం మొదలుపెట్టింది. ఇప్పటికే పలు హిందీ సినిమాలు వాయిదా బాట పట్టాయి. రానా నటించిన తెలుగు వెర్షన్ ‘అరణ్య’ రిలీజైంది కానీ, దాని రిలీజుకు మూడు రోజుల ముందే మార్చి 23న హిందీ వెర్షన్ ‘హాథీ మేరే సాథీ రిలీజ్’ను చిత్రనిర్మాణ సంస్థ ఈరోస్ నిరవధికంగా వాయిదా వేసింది. ఇక, అమితాబ్ ‘చెహరే(’ ఏప్రిల్ 9న విడుదల కావాల్సింది. దాన్నీ వాయిదా వేశారు. ఇప్పటికే వాయిదాల మీద వాయిదాలు పడుతూ, ఎట్టకేలకు ఈ నెల 30న రిలీజు చేద్దామనుకున్న అక్షయ్ కుమార్ ‘సూర్యవంశి’ సైతం తాజా పరిస్థితుల్లో మళ్ళీ నిరవధికంగా వాయిదా పడింది. ‘బబ్లీ ఔర్ బంటీ 2’ సహా అనేకం ఇప్పటికే పోస్ట్పోనయ్యాయి. కరోనా సెకండ్, ఆపై థర్డ్‌వేవ్ అంటున్న నేపథ్యంలో ఈ సినిమాలు కానీ, వీటి తరువాత రిలీజనుకున్న ఇతర సినిమాలు కానీ అను కున్నట్టు రిలీ జవడం కచ్చితంగా అనుమానమే! పచ్చిగా చెప్పాలంటే, అసంభవమే!! మూడు నెలల ముచ్చటేనా? నిజానికి, అన్–లాక్డౌన్ తరువాత సినీరంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. హాలీవుడ్లో ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ వేల కోట్లకు పైగా కొల్లగొట్టి బ్లాక్‌బస్టర్ దిశగా పరుగులు తీస్తోంది. మరోపక్క గత డిసెంబర్లో హాళ్ళు తెరవడానికి అనుమతి ఇచ్చినప్పటి నుంచి తెలుగు చిత్రసీమ వడివడిగా అడుగులు వేస్తూ వచ్చింది. సగం థియేటర్ కెపాసిటీలో సైతం సంక్రాంతి సిన్మాలు ‘క్రాక్’, ‘మాస్టర్’, ‘రెడ్’ లాంటివి వసూళ్ళ వర్షం కురిపించాయి. ఆ తరువాత ఫిబ్రవరి 5 నుంచి పూర్తి కెపాసిటీకి అనుమతి ఇచ్చాక, తెలుగులో చిన్న, పెద్ద సినిమాలు సైతం బాక్సాఫీస్‌కు కొత్త కళ తెచ్చాయి. ఫిబ్రవరి 12న వచ్చిన ‘ఉప్పెన’తో హాళ్ళు పూర్తిగా హౌస్ ఫుల్ అయి, కరోనా మునుపటి రోజుల్ని గుర్తు చేశాయి. ఇక కరోనాతో జీవితంలో నవ్వు కరవైన జనాన్ని మార్చి 11న వచ్చిన ‘జాతిరత్నాలు’ నవ్వించి, అనూహ్య విజయంతో పాటు, అద్భుతమైన షేర్లు రాబట్టింది. తాజా హాలీవుడ్ చిత్రం ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ అయితే ఇంగ్లీషు, తెలుగు, హిందీ మూడు భాషల్లోనూ తెలుగునాట బాగా ఆడుతోంది. అందుకే, ‘‘గడచిన మూడున్నర నెలల్లో మన దేశం మొత్తం మీద మిగతా సినీపరిశ్రమలతో పోలిస్తే, తెలుగు సినిమాయే బాగుంది. తెలుగు స్ఫూర్తితో తమిళ, మలయాళ, కన్నడ భాషా చిత్రసీమల్లోనూ ఉత్సాహం పుంజుకుంది’’ అని తమిళ హీరో కార్తీ, కన్నడ పునీత్ రాజ్ కుమార్ సైతం ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. దానికి తగ్గట్టే క్రమంగా మిగతాచోట్లా వసూళ్లు పెరిగాయి. మాలీవుడ్‌లో మమ్ముట్టి ‘ది ప్రీస్ట్’ కరోనా తర్వాత ఫస్ట్ బ్లాక్‌బస్టరైంది. కోలీవుడ్‌లో ఈ నెల 2న రిలీజైన కార్తీ ‘సుల్తాన్’ మూడు రోజుల్లో 20 కోట్లకు పైగా గ్రాస్ సాధిం చింది. టాలీవుడ్‌లోనూ భారీ బిజినెస్ జరుగుతోంది. ఏడాది తర్వాత బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడుతున్నవేళ, ఇదంతా మూడునెలల ముచ్చటేనా అనిపించేలా సెకండ్ వేవ్ వచ్చిపడింది. మళ్ళీ కలవరంలోకి నెట్టింది. సెకండ్ వేవ్ నేపథ్యంలో మాస్కులు లేకుండా నిర్లక్ష్యం వహిస్తున్న జనంపైనా, సరిగ్గా కరోనా నిబంధనలు పాటించని థియేటర్లపైనా కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దేవి, సుదర్శన్ థియేటర్ల ఓనరైన బాలగోవిందరాజు అంగీకరించారు. అయితే, ‘‘అలాంటి ప్రాథమిక చర్యలు తీసుకోకుండా, ఎకాఎకిన హాళ్ళ కెపాసిటీ 50 శాతం తగ్గించడం మొదలు మూసివేత దాకా సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నా అది సినీపరిశ్రమకు మళ్ళీ కోలుకోలేని దెబ్బ’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఖర్చులు బాగా పెరిగిన నేపథ్యంలో హాళ్ళలో యాభై శాతం కెపాసిటీకే అనుమతి అని షరతు పెడితే వ్యాపారం దాదాపు సున్నాయే. ‘‘ఆ షరతు మళ్ళీ పెడితే – జనం లేకుండా హాళ్ళు నామ్ కే వాస్తే నడుస్తాయే తప్ప, నిర్మాతలకూ, డిస్ట్రిబ్యూటర్లకూ, ఎగ్జిబిటర్లకూ ఎవరికీ ఉపయోగం ఉండదు’’ అని హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ప్రతినిధి అన్నారు. ‘‘కెపాసిటీ 50 శాతమే ఐనా, ఖర్చు మాత్రం ఎప్పటిలానే వంద శాతం తప్పదు’’ అని శాలిబండ సుధా మల్టీప్లెక్స్ ఓనర్ కె. అనుపమ్ రెడ్డి వాపోయారు. కానీ, వ్యాపారం కన్నా జనం క్షేమం బాగుండాలని కోరుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తారో చూడాలి. మూసినా... సగమే తెరిచినా... దెబ్బ మీద దెబ్బే! గత ఏడాది సంక్రాంతి తర్వాత మళ్ళీ ఇప్పుడు 15 నెలలకు స్టార్ హీరోల సినిమాలు వస్తున్న నేపథ్యంలో సహజంగానే అడ్వా¯Œ ్స బుకింగులు జోరుగా సాగుతున్నాయి. కోర్టు నుంచి ఏ సినిమాకు ఆ సినిమా తెచ్చుకుంటున్న ఉత్తర్వులతో తెలంగాణలో టికెట్ రేట్లూ సింగిల్ స్క్రీన్లలో రూ. 150కి, మల్టీప్లెక్సుల్లో రూ. 200కి ఎగబాకాయి. ఒక్క హైదరాబాద్‌లోనే సగటున వందకు పైగా థియేటర్లలో ఓ హౌస్ ఫుల్ స్టార్ సినిమా రిలీజైతే, ఎంతలేదన్నా రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ప్రేక్షకులు ఆ వంద చోట్ల కలిపి పోగవుతారని లెక్క. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా – ఆ జనసందోహంలో 5 నుంచి 10 శాతానికి కరోనా వ్యాపించినా, కరోనా బారినపడేవారి సంఖ్య వేలల్లో ఉండే ప్రమాదమైతే ఉంది. కొందరు ఎగ్జిబిటర్లే అది ఒప్పుకుంటున్నారు. అందుకే లాక్డౌన్ ఉండదనీ, హాళ్ళను మూయబోమనీ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా – గుంపుల కొద్దీ జనంతో, వ్యాప్తికి కారణమయ్యే థియేటర్లపై ఆంక్షలు విధించడం పెద్ద పనేమీ కాదు. కర్ణాటక, తమిళనాడు బాటలో ఇతర రాష్ట్రాల్లో సైతం మళ్లీ 50 పర్సెంట్ కెపాసిటీతోనే థియేటర్లు నడపాలని ప్రభుత్వాలు ఆదేశించేంచే ఛాన్స్ బలంగా ఉంది. తమిళ సర్కారు సైతం ఎన్నికలు ముగిశాక సరిగ్గా ధనుష్ ‘కర్ణన్’ రిలీజు రోజు నుంచి షరతులు పెట్టింది. ‘వకీల్ సాబ్’ సహా తెలుగులోనూ పలుకుబడి గల పెద్దల సినిమాలు రిలీజైపోతాయి గనక, ఇక్కడా హాళ్ళపై ఆంక్షలు రావడం ఖాయం. అదే జరిగితే... కలెక్షన్లే కీలకమైన ‘ఆచార్య’ సహా అనేక స్టార్ సినిమాల రిలీజ్ ప్రశ్నార్థకమే. అదే ఇప్పుడు ఎగ్జిబిటర్లకూ, వారి అడ్వాన్సుల మీద ఆధారపడ్డ బయ్యర్లకూ, వారితో వ్యాపారం చేసి సిన్మా రిలీజు చేసే నిర్మాతలకూ కంటి నిండా నిద్ర లేకుండా చేస్తోంది. ఒక్కమాటలో – ఇదంతా ఓ చెయిన్ రియాక్షన్. వెరసి, ఇప్పుడిప్పుడే కాళ్ళూ చేతులూ కూడదీసుకుంటున్న సినీ పరిశ్రమపై ఈ సెకండ్ వేవ్‌తో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టయింది. తగ్గుతున్న జనం... తరిగిపోతున్న కలెక్షన్లు... కరోనా సెకండ్ వేవ్ సమాజంతో పాటు సినిమా మీదా గట్టిగా ప్రభావం చూపెడుతోంది. ‘‘కరోనా కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో, హాళ్ళకొచ్చే జనం రెండు వారాలుగా తగ్గుతున్నారు. లాక్డౌన్ ఎత్తేశాక... ఫరవాలేదనుకున్న సినిమాలకు సైతం మంచి కలెక్షన్లే వస్తే, ఇప్పుడు బాగున్న సినిమాలకు కూడా ఫరవా లేదనే స్థాయి కలెక్షన్లయినా రావట్లేదు. అలా కొన్ని సినిమాలు ఇప్పటికే ఈ సెకండ్ వేవ్‌లో బాక్సాఫీస్ వద్ద కొట్టుకుపోయాయి’’ అని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ టి. బాలగోవిందరాజు వివరించారు. ఫిబ్రవరి, మార్చి నెల మధ్య దాకా హౌస్ ఫుల్ బోర్డులు చూసిన ఏసీ హాళ్ళలో ప్రస్తుతం సగటున ఆటకు 30 నుంచి 40 శాతం ప్రేక్షకులే ఉంటున్నారు. గత నెల మొదట్లో ఫ్యామిలీలు, ఆడవాళ్ళు, పిల్లలతో కళకళలాడి పూర్వవైభవం వస్తోందని ఆశలు రేపిన హాళ్ళు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. మూడు రాష్ట్రాల మార్కెట్ పాయె! తెలుగులో కూడా సినిమాలు ముందుగా ప్లాన్ చేసిన తేదీలకు వస్తాయా అన్నది సందేహమే. మహారాష్ట్రలో హాళ్ళు మూసేస్తే, కన్నడనాట ఈ నెల 7 నుంచి సినిమా హాళ్ళను సగం సీటింగుకే పరిమితం చేశారు. తాజాగా, తమిళనాడులో సైతం ఇవాళ (ఏప్రిల్ 9) నుంచి థియేటర్లలో 50 శాతం సీటింగే అని అక్కడి సర్కారు ప్రకటించింది. అలా ఇప్పుడు మన తెలుగు సినిమాకు ఈ మూడు పొరుగు రాష్ట్రాల మార్కెట్ పోయింది. ఆ దెబ్బ తెలుగు సిన్మా వ్యాపారం పైనా ఉంటుంది. ‘‘మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల్లో హాళ్ళపై వచ్చిన నిర్ణయాల ప్రభావం మన సినీసీమపై ఇప్పటికే పడింది. రేపు పొద్దున మన దగ్గర థియేటర్లు ఎంత కెపాసిటీతో నడుస్తాయి, హాళ్ళు తెరిచి ఉన్నా జనం వస్తారా – ఇలా అందరం రకరకాల అనుమానాలతో ఉన్నాం’’ అని పేరు ప్రచురించవద్దంటూ ఓ సినీ నిర్మాత చెప్పారు. హాళ్ళు మూసిన మరాఠ్వాడా, ఢిల్లీ లాంటి చోట్ల మన సినిమానే రిలీజు కాదు. పెద్ద హీరోల సినిమాలకు బలమైన మార్కెటైన కర్ణాటక, తమిళనాడు లాంటి చోట్ల రిలీజైనా సగం కెపాసిటీతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ మారిన పరిస్థితుల్లో బయ్యర్లు సైతం ఒకప్పుడు తాము ఒప్పుకున్న రేట్లకు సినిమా కొంటారా, డబ్బు మొత్తం నిర్మాతలకు కడతారా అన్నదీ అనుమానమే. ఆ మేరకు రిలీజుకు ముందే వ్యాపారం, రిలీజయ్యాక సీటింగ్ తగ్గుదలతో కలెక్షన్లు తెలుగు సినిమా నష్టపోయినట్టే! హాట్‌స్పాట్‌గా హాళ్లు? ఒక హౌస్‌ఫుల్ స్టార్ సినిమా ఒక్క హైదరాబాద్‌లోనే సగటున వందకు పైగా థియేటర్లలో రిలీజవుతుంది. ఎంతలేదన్నా రోజుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ప్రేక్షకులు ఆ వంద చోట్ల కలిపి పోగవుతారని లెక్క. ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా – ఆ జనసందోహంలో 5 నుంచి 10 శాతానికి కరోనా వ్యాపించినా, కరోనా బారినపడే వారి సంఖ్య వేలల్లో ఉండే ప్రమాదమైతే పొంచి ఉంది. జనంలో భయం పోయి, నిర్లక్ష్యం పెరిగిందని గమనిస్తున్న కొందరు ఎగ్జిబిటర్లే ఆ సంగతి బాహాటంగా ఒప్పుకుంటున్నారు. పెరుగుతున్న పాజిటివ్‌లు హిందీ, తెలుగు సీమల్లో రోజూ పలువురు ‘పాజిటివ్’గా తేలుతున్నారు. ‘వకీల్ సాబ్’ ప్రమోషన్లలో జోరుగా పాల్గొన్న నటి నివేదా థామస్‌కు కరోనా వచ్చింది. దాంతో, ఆమెతో కలసి టీవీ ఇంటర్వ్యూలిచ్చిన అంజలి, అనన్య, దర్శకుడు శ్రీరామ్ వేణు సహా అందరూ టెస్టుల హడావిడి పడ్డారు. హిందీలో పలువురి పేర్లు బయటకు వస్తుంటే, మన దగ్గరేమో బయటపడి చెప్పకుండా హోమ్ క్వారంటైన్లో గడిపేస్తున్నవారి సంఖ్య చాలానే ఉంది. నివేదా ఎఫెక్ట్‌తో అంజలి స్టాఫ్‌కూ కరోనా సోకిందనీ, తనకూ తప్పదని అంజలి సైతం క్వారంటైన్లోకెళ్ళారనీ భోగట్టా. ఆమె మాత్రం తనకు కరోనా రాలేదని ఖండించారు. ఏమైనా, షూటింగుల్లో ఇప్పటికీ పదులమంది కరోనా పాజిటివ్‌గా తేలుతు న్నారు. ఇటీవలే టీజర్ రిలీజైన ఓ భారీ ‘స్టయిలిష్’ సిన్మా సెట్స్‌లో ఒకటికి, రెండు సెట్ల అసిస్టెం ట్లను పెట్టుకొని, ఒకరికి వస్తే మరొకర్ని దింపి, షూటింగ్ కానిచ్చేస్తున్నారు. తెలుగులోనూ... వాయిదాలు షురూ! తాజా పరిస్థితుల్లో ‘లవ్‌స్టోరీ’ రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు దర్శక,నిర్మాతలు గురువారం సాయంత్రం ప్రకటించారు. కానీ,ఈ సెకండ్ వేవ్‌లోనే రిలీజవుతున్న తొలి భారీ చిత్రం పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’. తెలుగునాట రోజువారీ కరోనా కేసుల సంఖ్య వేలల్లోకి వెళుతుండడంతో రానున్న రోజుల్లో మళ్ళీ షరతులు విధించే అవకాశం ఉంది. నేడో, రేపో తెలుగు రాష్ట్రాలలోనూ థియేటర్లలో సగం మందినే అనుమతించే సూచనలున్నాయి. అదే గనక జరిగితే, ‘వకీల్ సాబ్’ మొదలు ఈ నెలలోనే రిలీజు కావాల్సిన రానా ‘విరాటపర్వం’, మే నెలలో వస్తామన్న చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేశ్ ‘నారప్ప’ లాంటి పెద్ద బడ్జెట్ చిత్రాలు ఇరుకున పడడం ఖాయం. పెట్టిన ఖర్చు మేరకు వ్యాపారం జరిగి, వసూళ్ళూ రావాలంటే – పరిస్థితులు చక్కబడే దాకా రిలీజు వాయిదా మినహా మరో మార్గం లేదు. ఈ నెలలోనే తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రావాల్సిన జయలలిత బయోపిక్ ‘తలైవి’ సైతం ఇప్పటికే రిలీజు వాయిదా రూటు పట్టింది. కరోనాకు తోడు గ్రాఫిక్స్ సహా ఇంకా చాలా వర్క్ పెండింగ్ లో ఉంది గనక ‘ఆచార్య’ వాయిదా ఖాయమైందని ఆంతరంగిక వర్గాల సమాచారం. వెరసి, ఈ డోలాయమాన పరిస్థితిలో ఏ సినిమా ఎప్పుడొస్తుందో, ఏం జరుగుతుందో సినీరంగంలో ఎవరూ ఏదీ స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. – డాక్టర్ రెంటాల జయదేవ -
సినీ పరిశ్రమకు ప్రభుత్వ రాయితీలు
సాక్షి, అమరావతి: కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిత్ర పరిశ్రమ, దాని అనుబంధ విభాగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని సినిమా థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లు 2020 ఏప్రిల్, మే, జూన్ నెలలకు విద్యుత్ స్థిర చార్జీల చెల్లింపును పూర్తిగా రద్దు చేసింది. ఆ తర్వాత 6 నెలలకు (2020 జులై నుంచి డిసెంబర్ వరకు) విద్యుత్ స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం కల్పించింది. బ్యాంకుల నుంచి సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి 50 శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. వడ్డీ రాయితీ వెసులుబాటు ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత వర్తిస్తుందని పేర్కొంది. వడ్డీ రాయితీ వెసులుబాటు మల్టీ ఫ్లెక్స్ థియేటర్లకు లేదని తెలిపింది. కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న చిత్ర పరిశ్రమ, దాని అనుబంధ విభాగాలు, దానిపై ఆధారపడిన కార్మికులకు లబ్ధి కలిగేలా ఈ రాయితీలిచ్చినట్లు సమాచార, పౌర సంబంధాల ఎక్స్ అఫీషియో కార్యదర్శి టి.విజయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: చిరంజీవి
సాక్షి, అమరావతి: కరోనాతో భారీగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. సినిమా థియేటర్లకు సంబంధించి విద్యుత్ చార్జీలు, వడ్డీ రాయితీలను మరికొంత కాలం పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్, మే, జూన్ నెలల విద్యుత్ ఫిక్స్డ్ చార్జీలకు మినహాయింపునిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో సినిమా థియేటర్ల యజమానులకు భారీ ఊరట లభించనుంది. దీంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున అక్కినేనితో పాటు పలువును సినీ ప్రముఖులు కృతజ్ఞతులు తెలిపారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: చిరు, నాగ్ విద్యుత్ చార్జీలు, వడ్డీ రాయితీలు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెగస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సినీ కళాకారులను ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఆదుకున్నారని ప్రశంసించారు. సీఎం జగన్ సాయంతో వేలాది కుటుంబాలకు ఊరట లభించింది అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. My hearty thanks to Hon'ble CM Shri. @ysjagan for the much deserved relief measures for the Film Industry during Covid times. Your sympathetic support will help several thousands of families dependent on this industry. — Chiranjeevi Konidela (@KChiruTweets) April 6, 2021 అలాగానే బుధవారం నాగార్జున అక్కినేని కూడా ట్విటర్ వేదికగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ‘మహమ్మారి వంటి విపత్కర సమయంలో సినిమా హాల్ల విద్యుత్ చార్జీలకు రాయితీ ఇచ్చి అవసరమైన సమయంలో అదుకుని భారీ ఊరటనిచ్చిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశాడు. Thanking the Hon’ble chief minister of Andhra Pradesh Shri @ysjagan for the much needed relief measures given to the film Industry During these dark times of Covid🙏 — Nagarjuna Akkineni (@iamnagarjuna) April 7, 2021 చదవండి: సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు -
అక్క జాన్వీనే ఫాలో అవుతున్న ఖుషీ.. త్వరలోనే..
సినిమా ఇండస్ట్రీలో వారసులను పరిచయం చేసేందుకు దర్శక–నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. బాలీవుడ్లో అయితే వారసులను పరిచయం చేయడానికి దర్శక–నిర్మాత కరణ్ జోహార్ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే ఎంతో మంది వారసులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ఆయన తాజాగా అతిలోక సుందరి శ్రీదేవి–నిర్మాత బోనీ కపూర్ల చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ను హీరోయిన్ గా హిందీ చిత్రసీమకు పరిచయం చేయనున్నారని టాక్. శ్రీదేవి–బోనీ కపూర్ల పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ను తమ ధర్మా ప్రొడక్షన్స్‌పై ‘ధడక్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం చేశారు కరణ్ జోహార్. త్వరలో కథానాయికగా ఎంట్రీ ఇవ్వడానికి ఇప్పటికే నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు ఖుషీ. ఇప్పుడు ఖుషీని పరిచయం చేసే బాధ్యతను కూడా కరణే తీసుకున్నారట. ధర్మా –కార్నర్‌స్టోన్ ఏజెన్సీ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తున్న ఆయన ఈ బ్యానర్లో ఖుషీ కపూర్‌ను పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. -
రజనీకి అమ్మగా చేయమంటారని తెలుసు!
హీరోలకు పారితోషికం ఎక్కువ ఉంటుంది. వారితో పోలిస్తే – హీరోయిన్లకు చాలా తక్కువ ఉంటుంది. ఇక వయసు విషయానికొస్తే.. హీరో ఎప్పటికీ హీరోనే! 50 – 60 ఏళ్లు దాటినా హీరోగా చేయొచ్చు. కానీ హీరోయిన్‌కు 30 మహా అయితే 40 టచ్ అయ్యేవరకూ ఓకే. అది కూడా ఏ కొందరో 30 దాటినా హీరోయిన్లుగా చేయగలుగుతారు. చాలామటుకు 30 టచ్ అయ్యాక అక్కా, వదిన పాత్రలకు అడుగుతారు. 40 దాటితే అమ్మ పాత్రలు ఆఫర్ చేస్తారు. మేల్ యాక్టర్, ఫీమేల్ యాక్టర్‌కి ఉన్న ఈ వ్యత్యాసం గురించి ఓ కార్యక్రమంలో నటి రాధిక మాట్లాడుతూ – ‘‘నేను ఒకవైపు సినిమాల్లో నటించడంతో పాటు బిజినెస్ ఉమన్ (సినిమా, సీరియల్ నిర్మాణం) గానూ మారాను. ఎందుకంటే నా కెరీర్ నా కంట్రోల్లో ఉండాలనుకున్నాను. భవిష్యత్తులో నన్ను రజనీకాంత్‌కి అమ్మ (రజనీ సరసన తమిళంలో పలు సూపర్‌హిట్ చిత్రాల్లో కథానాయికగా నటించారు రాధిక)గా చేయమని అడుగుతారని నాకు ముందే తెలుసు. నటుల విషయంలో ఎవరికీ ఎలాంటి ముందస్తు ఆలోచనలు ఉండవు. కానీ నటీమణుల విషయంలో మాత్రం కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉంటాయి. ఏది ఏమైనా కెరీర్ పరంగా దాటుతున్న ప్రతి మైలురాయికీ నేనింకా బెటర్ అవుతున్నాను’’ అన్నారు. కథానాయికగా తన ప్రయాణం గురించి మాట్లాడుతూ – ‘‘చూసేవారికి నా కెరీర్ చాలా సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ ఈ జర్నీ అంత సులభంగా సాగలేదు. ఎన్నో కష్టాలున్నాయి. అసలు నేను యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. ఒక డైరెక్టర్ నన్ను నటించమని అడిగారు. నేను లెజండరీ యాక్టర్ ఎం.ఆర్. రాధ కూతుర్ని అని ఆయనకు తెలియదు. వాస్తవానికి నేనప్పుడు అంత అందంగా కూడా ఉండేదాన్ని కాదు. ‘నా ముఖాన్ని ఎవరు చూస్తారు’ అని ఆయనతో అన్నాను. ఎలాంటి అంచనాలు, కలలు లేకుండానే కెమెరా ముందుకొచ్చాను. ఇంతదాకా వచ్చేశాను’’ అన్నారు రాధిక. -
హిట్ రిపీట్ అవుతుందా?
ఓ భాషలో ఏదైనా సినిమా విజయం సాధిస్తే, రీమేక్ ద్వారా తమ భాషలోకి తీసుకురావాలనుకుంటారు దర్శక–నిర్మాతలు. ఈజీ హిట్ ఫార్ములా అనేది ఒక కారణం. మంచి కథను మరో ప్రాంతం ఆడియన్స్‌కు చూపించాలనేది ఇంకో కారణం. హిట్ సినిమా రీమేక్ కూడా హిట్టే అవుతుందా? అంటే చెప్పలేం. చాలా లెక్కలుంటాయి. ఆ లెక్కలన్నీ సరిగ్గా లెక్క కట్టాలి. ఆ మంత్రం మళ్లీ సరిగ్గా జపించాలి. అప్పుడే మ్యాజిక్ జరుగుతుంది. ప్రస్తుతం ఓ భాషలో తయారైన అయిదు సూపర్ హిట్ సినిమాలు ఏకకాలంలో మూడు భాషల్లో రీమేక్ అవుతున్నాయి. ఆ సినిమాలు – ఆ రీమేక్‌ల విశేషాలు. అయ్యప్పనుమ్ కోషియుమ్ పృథ్వీరాజ్, బిజూ మీనన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’. ఇద్దరు వ్యక్తుల ఈగోకి సంబంధించిన కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది. సచీ దర్శకత్వం వహించారు. మలయాళంలో ఘనవిజయం సాధించింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రీమేక్ అవుతోంది. ► తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటిస్తున్నారు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు–స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. నాగవంశీ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. ► హిందీ రీమేక్‌లో ‘దోస్తానా’ కాంబినేషన్ జాన్ అబ్రహామ్, అభిషేక్ బచ్చన్ నటించనున్నారు. నటించడంతో పాటు జాన్ అబ్రహామ్ ఈ సినిమాను నిర్మించనున్నారు కూడా. జూన్ లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. ► ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తమిళ రీమేక్‌లో కార్తీ, పార్తిబన్ నటిస్తారని వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. హెలెన్ రెస్టారెంట్‌లోని ఫ్రీజర్‌లో చిక్కుకుపోయిన అమ్మాయి అందులో నుంచి ఎలా బయటపడింది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్ చిత్రం ‘హెలెన్ ’. అన్నా బెన్ ముఖ్య పాత్ర చేసిన ఈ సినిమాని మతుకుట్టి జేవియర్ డైరెక్ట్ చేశారు. 2019లో ఈ సినిమా విడుదలైంది. తాజాగా ‘హెలెన్ ’ చిత్రాన్ని హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ► అన్నా బెన్ చేసిన పాత్రను తెలుగు రీమేక్‌లో అనుపమా పరమేశ్వరన్ చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ► ‘హెలెన్ ’ తమిళ రీమేక్‌ను ‘అన్బిర్కినియాళ్’ టైటిల్‌తో తెరకెక్కించారు. కీర్తీ పాండియన్ లీడ్ రోల్ చేస్తున్నారు. గోకుల్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది. ► ‘హెలెన్ ’ హిందీ రీమేక్‌లో జాన్వీ కపూర్ నటించనున్నారు. దర్శకుడు, మిగతా వివరాలు ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. దృశ్యం 2 మోహన్ లాల్, మీనా జంటగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన థ్రిల్లర్ చిత్రం ‘దృశ్యం’. 2013లో విడుదలైన ఈ సినిమా పెద్ద హిట్. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ (దృశ్యం 2) విడుదలయింది. మొదటి భాగంలో పని చేసిన టీమే ఈ సీక్వెల్ తెరకెక్కించారు. ‘దృశ్యం 2’ చిత్రం ప్రస్తుతం తెలుగులో, తమిళంలో రీమేక్ కాబోతోంది. హిందీలోనూ రీమేక్ కానుందని టాక్. ► ‘దృశ్యం’ మొదటి భాగంలో వెంకటేశ్, మీనా జంటగా నటించారు. సీక్వెల్లోనూ వీరే నటించనున్నారు. మార్చి మొదటి వారం నుంచి ఈ రీమేక్ సెట్స్ మీదకు వెళ్లనుంది. జీతూ జోసెఫ్ డైరెక్ట్ చేస్తారు. ► ‘దృశ్యం’ తమిళ రీమేక్ జీతూ జోసెఫ్, కమల్‌హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కింది. తాజాగా ఈ సీక్వెల్‌ను కేయస్ రవికుమార్ డైరెక్ట్ చేయనున్నారని వార్తలు వచ్చాయి. కమల్‌హాసన్ ప్రస్తుతం పొలిటికల్‌గా బిజీగా ఉన్నారు. మరి ఈ సీక్వెల్లో ఆయనే నటిస్తారా? వేరెవరైనా సీన్ లోకి వస్తారేమో చూడాలి. ► ‘దృశ్యం’ హిందీ రీమేక్‌లో అజయ్ దేవగణ్, శ్రియ నటించారు. తాజా సీక్వెల్ హిందీలోనూ రీమేక్ అవుతుందని బాలీవుడ్ టాక్. ఓ మై కడవుళే అశోక్ సెల్వన్, రితికా సింగ్ జంటగా అశ్విన్ మారిముత్తు తెరకెక్కించిన తమిళ చిత్రం ‘ఓ మై కడవుళే’. జీవితంలో రెండో అవకాశం లభించినప్పుడు ఏం చేయొచ్చు అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఇది. ఇందులో విజయ్ సేతుపతి అతిథి పాత్రలో నటించారు. 2020లో విడుదలైన ఈ సినిమా మంచి హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. ► తమిళ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన అశ్విన్ తెలుగు రీమేక్‌ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. విశ్వక్ సేన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తారు. పీవీపీ బ్యానర్ నిర్మించనున్న ఈ సినిమా చిత్రీకరణ త్వరలో ప్రారంభం కానుంది. ► హిందీ రీమేక్ హక్కులను ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దక్కించుకుంది. అశ్విన్ మారిముత్తునే ఈ హిందీ వెర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తారు. ► ‘ఓ మై కడవుళే’ కన్నడ వెర్షన్ లో డార్లింగ్ కృష్ణ హీరోగా నటిస్తున్నారు. అతిథి పాత్రలో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కనిపిస్తారు. అంధా ధున్ ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన హిందీ చిత్రం ‘అంధా ధున్ ’. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పెద్ద హిట్. జాతీయ అవార్డు కూడా సాధించింది. ఇప్పుడు ‘అంధా ధున్ ’ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ కానుంది. ► తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. రాధికా ఆప్టే పాత్రలో నభా నటేశ్, టబు పాత్రలో తమన్నా కనిపించనున్నారు. జూన్ 11న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ► తమిళ రీమేక్‌లో ‘జీన్స్’ ఫేమ్ ప్రశాంత్ నటిస్తున్నారు. జేజే ఫ్రెడ్రిక్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. టబు చేసిన పాత్రను సిమ్రాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘అంధగన్ ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ► ‘అంధా ధున్ ’ మలయాళ రీమేక్‌ని ‘భ్రమం’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. పృధ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తున్నారు. రాశీ ఖన్నా కథానాయిక. ఆయా భాషల్లో విజయం సాధించినట్టు ఈ రీమేక్స్ కూడా విజయం సాధిస్తాయా? ఒరిజినల్లో జరిగిన మ్యాజిక్‌ను రీమేక్‌లోనూ ఆయా చిత్రబృందాలు క్రియేట్ చేయగలుగుతాయా? వెయిట్ అండ్ సీ! -
మరో విషాదం : ప్రముఖ టీవీ నటుడు ఆత్మహత్య
సాక్షి, చెన్నై: తమిళ టెలివిజన్ పరిశ్రమ మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటుడు ఇంద్ర కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. తమిళనాడులోని పెరంబలూర్‌లో ఆయన స్నేహితుని నివాసంలో ఉరివేసుకుని ఉసురు తీసుకున్నారు. వరుస ఆత్మహత్యలతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. (హీరో వీరాభిమాని ఆత్మహత్య : ఆఖరి కోరిక) చెన్నైలోని శ్రీలంక శరణార్థి శిబిరంలో నివాసం ఉంటున్న ఇంద్ర కుమార్ తమిళ డైలీ సీరియల్స్ ద్వారా ఫ్యామస్ అయ్యారు. అయితే గురువారం రాత్రి తన స్నేహితులతో కలిసి సినిమా చూసి వచ్చిన కొన్ని గంటల్లోనే కుమార్ విగతజీవిగా మారడంతో అతని స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయారు స్నేహితుల సమాచారం మేరకు కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు పోలీసులు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అయితే అవకాశాలు రావడంలేదనే ఆందోళనతోనే ఇంద్ర కుమార్ ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. మరోవైపు వివాహ జీవితంలో సమస్యలు, భార్యతో విభేదాలు కారణంగానే చనిపోయాడనే మరో వాదన కూడా వినిపిస్తోంది. కాగా కరోనా సంక్షోభ కాలంలో ఫిలిం ఇండస్ట్రీ కూడా కష్టాల్లో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలో అవకాశాలు లేక చాలామంది నటీనటులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం ఆందోళన రేపుతోంది. ఈ వారంలో సినీ పరిశ్రమకు సంబంధించి ఇది రెండవ ఘటన. కేసరి, ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ వంటి సినిమాల్లో నటించిన బాలీవుడ్ నటుడు సందీప్ నహర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతకుముందు ప్రముఖ నటి, వీజే చిత్ర ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. -
పరిశ్రమ ఇకనైనా కళ్లు తెరవాలి!
‘తెలుగు సినిమాతల్లి బర్త్‌డే’ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. హెచ్.ఎం.రెడ్డి తీసిన మన తొలి పూర్తితెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ బొంబాయి కృష్ణా థియేటర్లో 1932 ఫిబ్రవరి 6న విడుదలైందని ప్రముఖ జర్నలిస్ట్ – పరిశోధకుడు రెంటాల జయదేవ నిరూపించారు. అప్పటి నుంచి ‘కళా మంజూష’ ఏటా ఫిబ్రవరి 6న ‘తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు’ జరుపుతోంది. ఈసారి ‘తెలుగు సినిమా వేదిక’, ‘నేస్తం ఫౌండేషన్’ తోడయ్యాయి. ‘‘స్వచ్ఛంద సంస్థలు కాకుండా, సినీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహించే పెద్దలు, ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, డైరెక్టర్స్ అసోసియేషన్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లాంటివి ఇకనైనా కళ్ళు తెరిచి, ఇక ప్రతి ఏడాదీ తెలుగు సినిమా తల్లి పుట్టినరోజు జరపాలి’’ అని సభలో పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ‘‘అరుదైన పాత సినిమాల ప్రింట్లను డిజిటలైజ్ చేయించి, సినీచరిత్ర నూ, సమాచారాన్నీ భద్రపరిచే పనిని రాష్ట్ర ఆర్కైవ్స్, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికైనా చేయించాలి’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసాద్ ల్యాబ్స్ రమేశ్‌ప్రసాద్, పరుచూరి గోపాలకృష్ణ, దర్శకుడు ఎన్. శంకర్, నిర్మాతలు ఆదిశేషగిరిరావు, ఏ.ఎం.రత్నం, విజయ్‌కుమార్ వర్మ, నటి కవిత, కెమెరామ్యాన్ ఎం.వి. రఘు అతిథులుగా హాజరయ్యారు. దర్శకులు బాబ్జీ, రామ్ రావిపల్లి, నిర్మాతలు గురురాజ్, విజయ వర్మ, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, మోహన్ గౌడ్, ఫిల్మ్ స్కూల్ ఉదయ్ కిరణ్, జర్నలిస్ట్ రెంటాల జయదేవ మాట్లాడారు. దివంగత నిర్మాత వి.దొరస్వామిరాజు పేరిట సీనియర్ నిర్మాతలు ఎన్.ఆర్. అనురాధాదేవి, జాగర్లమూడి రాధాకృష్ణమూర్తి, గొట్టిముక్కల సత్యనారాయణరాజు, దర్శక – నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజలకు పురస్కారాలు అందించారు. జయదేవ, పరుచూరి, వెంకట్, కవిత, తుమ్మలపల్లి, తమ్మారెడ్డి, ఎన్. శంకర్, గురురాజ్, బాబ్జీ, రామ్ రావిపల్లి -
తెలుగు సినిమాకు 89 వసంతాలు
వెండితెర పూర్తి స్థాయిలో తెలుగు మాటలు నేర్చుకొని, ఈ రోజుతో 89 వసంతాలు నిండాయి. మూగ సినిమాలైన ‘మూకీ’లకు మాటొచ్చి, పూర్తి తెలుగు ‘టాకీ’లుగా మారింది సరిగ్గా 89 ఏళ్ళ క్రితం ఇదే రోజున! మన తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్తప్రహ్లాద’ 1932లో ఫిబ్రవరి 6న థియేటర్లో తొలిసారిగా రిలీజైంది. అలా ఆ నాటి నుంచి పూర్తి స్థాయి తెలుగు చిత్రాలు ప్రేక్షకులను వెండితెరపై పలకరించడం ప్రారంభమైంది. ఆ లెక్కన మన తెలుగు సినిమాకు ఇవాళ హ్యాపీ బర్త్ డే! మన తెలుగు సినిమా పరిశ్రమ 89 ఏళ్ళు నిండి, 90వ ఏట ప్రవేశిస్తున్నందున సినిమాను ప్రేమించేవారికీ, సినిమా రంగం మీద ఆధారపడినవారికీ ఇదో మెమరబుల్ డే!! దేశంలో ఇవాళ ప్రధాన సినీ పరిశ్రమలలో ఒకటిగా ఉన్నత స్థానానికి చేరుకున్న మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వేసిన తొలి అడుగు అది. అయితే, తెలుగు సినిమా పెద్దలు, ప్రభుత్వాలు మాత్రం మన సంపూర్ణ తెలుగు టాకీ పుట్టినరోజును మర్చిపోయినట్లుంది. పరిశ్రమకు పండుగగా జరుపుకొనే ఈ సందర్భాన్ని విస్మరించి, నిర్లక్ష్యం చూపుతున్నట్టున్నాయి. మన తెలుగు టాకీ అలా తయారైంది! తొలి దక్షిణ భారతీయ టాకీ ‘కాళిదాస్’ రిలీజై, సక్సెసయ్యాక పూర్తిగా తెలుగులోనే సినిమా తీయాలనే ఆలోచన వచ్చింది. అప్పటికే తొలి భారతీయ టాకీ, తొలి దక్షిణాది టాకీలతో అనుభవం గడించిన హెచ్.ఎం. రెడ్డికే దర్శకత్వ బాధ్యత ఇచ్చారు. అప్పుడు పూర్తి తెలుగు మాటలు, పాటల ‘భక్త ప్రహ్లాద’ తయారైంది. ఆ చిత్ర నిర్మాణం, సెన్సారింగ్, ఫస్ట్ రిలీజ్ కూడా బొంబాయిలోనే జరగడం గమనార్హం. ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించిన ప్రసిద్ధ ’ప్రహ్లాద’ నాటకం ఆధారంగా, సురభి నాటక సంస్థ నటులతో ఈ సినిమా తీశారు. హిరణ్యకశిపుడిగా మునిపల్లె వి. సుబ్బయ్య, అతని భార్య లీలావతిగా ‘సురభి’ కమలాబాయి, వారి బిడ్డ ప్రహ్లాదుడిగా మాస్టర్ కృష్ణారావు ముఖ్య పాత్రధారులు. ఇందులో టైటిల్ రోల్ చేసిన మాస్టర్ కృష్ణారావునే మన తొలి తెలుగు కథానాయకునిగా చెప్పుకోవాలి. ఇక, ‘ఆలమ్ ఆరా’, ‘కాళిదాస్’ చిత్రాలలో కూడా పనిచేసిన తరువాతి కాలపు ప్రసిద్ధ దర్శక, నిర్మాత ఎల్వీప్రసాద్ ‘భక్త ప్రహ్లాద’లో మొద్దబ్బాయిగా నటించారు. ఈ సినిమాకు చందాల కేశవదాసు సాహిత్యం సమకూర్చారు. అలా ఆయన తొలి తెలుగు సినీ కవి అయ్యారు. పరిశోధనలో బయటపడ్డ మన సినిమా పుట్టినరోజు! నిజానికి, ఈ తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లద’ – ఏకంగా ‘కాళిదాస్’ కన్నా ముందే – 1931 సెప్టెంబర్ 15న వచ్చిందని కొన్నేళ్ళ పాటు ఆధారాలు లేని వినికిడి ప్రచారం జరిగింది. అయితే, అది వాస్తవం కాదని సీనియర్ జర్నలిస్టు, పరిశోధకుడు డాక్టర్ రెంటాల జయదేవ కొన్నేళ్ళు శ్రమించి, సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. 100% సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ 1932 జనవరి 22న సెన్సార్ పూర్తి చేసుకొని, ఫిబ్రవరి 6న విడుదలైనట్లు అసలు నిజాలు వెల్లడించారు. అలా మూకీ సినిమా కాస్తా పూర్తిగా తెలుగులోనే మాట్లాడడం మొదలై, నేటితో 89ఏళ్ళు పూర్తయ్యాయి. మన మాటలు రికార్డ్ చేసింది హాలీవుడ్ వాడే! పెట్టుబడి, సాంకేతిక సౌకర్యాలు, ఖర్చు – అన్నీ అతి తక్కువగా ఉన్న రోజులవి. ‘ఆలమ్ ఆరా’ కోసం ఆ రోజుల్లోనే హాలీవుడ్ నుంచి విల్ఫోర్డ్ డెమింగ్ అనే అమెరికన్ సౌండ్ ఇంజనీర్‌ను ఇండియాకు రప్పించారు దర్శకుడు అర్దేషిర్ ఇరానీ. సౌండ్ ప్రూఫ్ స్టేజీలు లేని ఆ రోజుల్లో కేవలం స్టూడియోల్లో, అదీ బయటి శబ్దాలు ఉండని రాత్రి పూట షూటింగ్ చేశారు. అప్పట్లో పిక్చర్కీ, సౌండ్‌కీ వేర్వేరు నెగటివ్‌లు కూడా ఉండేవి కావు. కేవలం సింగిల్ సిస్టమ్‌లో ‘తానార్ రికార్డింగ్ ఎక్విప్మెంట్’తో మాటలు రికార్డు చేసేవారు. చివరకు షూటింగ్ స్పాట్లోనే ఏకకాలంలో యాక్టింగ్‌తో పాటు, మాటలు చెబుతూ, పాటలు పాడుతుంటే రికార్డింగ్ చేసేయాల్సిందే! అప్పట్లో చివరకు ఇవాళ్టిలా మాటలు రికార్డు చేసే బూమ్ లు కూడా ఉండేవి కావు. కెమేరా కంట్లో పడకుండా మైకులు రకరకాల చోట్ల దాచిపెట్టి, ఈ తొలి టాకీల్లో డైలాగ్స్, సాంగ్స్ రికార్డ్ చేసేవారు. అప్పటి దాకా నాటకాలు, మాటా పలుకూ లేని మూగ సినిమాలే అలవాటైన జనానికి... తెర మీద బొమ్మలు మాట్లాడడం, పాటలు పాడడం ఓ వింత. అదీ మన సొంత తెలుగు భాషలోనే పూర్తిగా మాట్లాడడం మరీ విడ్డూరం. అలా మొదలైన సినిమా హంగామా ఇవాళ్టికీ దేశమంతటా, మరీ ముఖ్యంగా మన తెలుగునాట విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. కానీ, మన తెలుగు సినిమా పుట్టిన రోజు సందర్భంగా మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్నలూ చాలానే ఉన్నాయి. ఈ తొమ్మిది దశాబ్దాల కాలంలో తెలుగు సినిమా చాలానే పురోగమించింది. బాక్సాఫీస్ వేటలో పేటలు దాటి, దేశాల కోటలు దాటి ముందుకు ఉరికింది. అప్పటి ‘భక్త ప్రహ్లాద’ రోజుల నుంచి ఇప్పటి ‘బాహుబలి’ కాలం దాకా మన తెలుగు సినిమా చాలా దూరమే ప్రయాణించింది. కేవలం కొన్ని వేల రూపాయల ఖర్చుతో తయారై, ఆ మాత్రం ఖర్చు వస్తేనే మహాద్భుతం అనుకొనే పరిస్థితి నుంచి ఇవాళ అనేక పదుల కోట్ల రూపాయల బడ్జెట్, వందల కోట్లల్లో వ్యాపారం, వసూళ్ళు, ప్రపంచవ్యాప్తంగా చూసే కోట్లమంది జనంతో తెలుగు సినిమా అంకెల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంది. కానీ, ఇప్పటికీ కొన్ని ప్రాథమిక అంశాల దగ్గర తడబడుతోంది. ఈ ప్రశ్నకు బదులేది? ఓ తెలుగు సినీ కవి అన్నట్టుగా... ‘పుట్టినరోజు పండగే అందరికీ! మరి పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి?’ మన సినిమా చరిత్రను భద్రపరిచే విషయంలో పరిశ్రమ పెద్దలు, ఫిల్మ్ ఛాంబర్లు, ప్రభు త్వాలు చేస్తున్నది చాలా తక్కువే. మనవాళ్ళ అశ్రద్ధ వల్ల ఇప్పుడు మన తొలి తెలుగు సినిమా ప్రింటే లేకుండా పోయింది. టాకీలకే దిక్కు లేదు... ఇక మూకీల చరిత్ర మాట చెప్పనే అక్కర్లేదు. మన తొలి తెలుగు సినిమాల్లో మిగిలిన కొన్నింటి ప్రింట్లు పుణే ఫిల్మ్ ఆర్కైవ్స్ లాంటి చోట్ల ఉన్నాయి. కానీ, మిగిలిన ఆ కొద్ది 1930 – 40ల నాటి తెలుగు చిత్రాల ప్రింట్లను డిజిటలైజ్ చేయించడానికి సినీపెద్దలు, ప్రభుత్వాలు చేçపడు తున్న చర్యలు శూన్యం. చరిత్రపై తమిళ, మల యాళ, బెంగాలీ చిత్రసీమలకున్న శ్రద్ధ మనకేది? మరోపక్క కొత్త కథాంశాలతో సినిమా తీయడానికి మలయాళ, తమిళ చిత్రసీమలలా మనమెందుకు ముందుకు రాలేకపోతున్నాం? ఒకప్పుడు థియేటర్ల సంఖ్యలో దేశంలో రెండో స్థానంలో ఉన్న మనం ఇప్పుడు తెలుగు రాష్టాలు రెండూ కలిపినా 1600 హాళ్ళు కూడా లేని పరిస్థితిలో పడ్డామెందుకు? భారీ రెమ్యూనరేషన్లు, భారీ బడ్జెట్ల విషవలయంలో పడి ప్రేక్షకుడి నడ్డి విరిచేలా పన్ను పెంచుదాం, టికెట్ రేట్లు పెంచుదాం లాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నాం? ఇలా పరిశ్రమ వేసుకోవాల్సిన ప్రశ్నలెన్నో ఉన్నాయి. ఏది ఏమైనా, ఒకప్పుడు వీధి దీపాల మధ్య టెంట్లో టూరింగ్ టాకీసుల్లో నడిచిన సినిమా ఇవాళ ఏసీ హాళ్ళు, మల్టీప్లెక్సుల మీదుగా ఓటీటీ దాకా వచ్చేసింది. థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకుడు టీవీలు, కంప్యూటర్ల మీదుగా ఇప్పుడు అరచేతిలోని స్మార్ట్ఫోన్లలో ఓటీటీలో వినోదాన్ని వెతుక్కుంటున్నాడు. కరోనా వచ్చింది... మనల్ని విడిచి వెళ్ళకుండా ఇంకా ఉంది. ఏడు నెలల పైచిలుకు తరువాత థియేటర్లు తెరిచారు. మరో మూడున్నర నెలల తరువాత ఇప్పుడు హాళ్ళలో అన్ని సీట్లలో ప్రేక్షకులను అనుమతిస్తున్నారు. హాలులో జనం తగ్గారేమో కానీ, సినిమా పట్ల మన మనసుల్లో ఆదరణ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ సామాన్యుడికి సినిమా ఒక మోహం. తెరపై కొత్త బొమ్మ చూడడం తీరని దాహం. ఆ దప్పిక తీర్చడానికి హాలైనా, మరొకటైనా మనకొకటే. అందుకే కాలంతో పాటు మారుతున్న వెండితెర మాయాజాలానికి జేజేలు. లాంగ్ లివ్ సినిమా! మన తెలుగు సినిమా!! ఫస్ట్ ఇండియన్ టాకీ ‘ఆలమ్ ఆరా’ తొలి రోజుల్లో సినిమా అంటే... భాషతో సంబంధం లేని మూగచిత్రాలు (మూకీలు). తర్వాత కాలంలో మూగకు మాటొచ్చింది. వెండితెర మాటలు నేర్చింది. పాటలు పాడసాగింది. మన తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ 1931 మార్చి 14న విడుదలైంది. మాస్టర్ విఠల్, మిస్ జుబేదా నటించిన ఆ చిత్రానికి దర్శకుడు అర్దేషిర్ ఇరానీ. తెలుగువాడైన హెచ్.ఎం. రెడ్డి ఆ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశారు. అక్కడి నుంచి మన దేశంలోని విభిన్న ప్రాంతాలు, వివిధ భాషల వారీగా వాక్చిత్రాలు (టాకీలు) రావడం మొదలైంది. తొలి భారతీయ టాకీ నిర్మించిన ‘ఇంపీరియల్ మూవీటోన్’ సంస్థే ఆ తరువాత తొలిసారిగా దక్షిణాది భాషల్లో టాకీల రూపకల్పన మొదలుపెట్టింది. ఫస్ట్ సౌతిండియన్ టాకీ ‘కాళిదాస్’ ‘ఆలమ్ ఆరా’కు దర్శకత్వ శాఖలో పనిచేసిన హెచ్.ఎం. రెడ్డే ఆ తరువాత సరిగ్గా ఏడున్నర నెలలకు తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ను రూపొందించారు. బొంబాయిలోనే ‘ఆలమ్ ఆరా’కు వేసిన సెట్స్ ఉపయోగించుకుంటూ ఆ సినిమా తీశారు. ప్రధానంగా తమిళ మాటలు – పాటలు, కొంత తెలుగు డైలాగులు – కొన్ని త్యాగరాయ కీర్తనలు, అక్కడక్కడా హిందీ డైలాగులతో ఆ ‘కాళిదాస్’ తయారైంది. ఆ చిత్రం 1931 అక్టోబర్ 31న తొలిసారిగా మద్రాసులోని సినిమా థియేటర్ ‘కినిమా సెంట్రల్’ (తర్వాత ‘మురుగన్ టాకీస్’గా మారింది)లో రిలీజైంది. ‘‘తొలి తమిళ – తెలుగు టాకీ’’ అంటూ ఆ దర్శక, నిర్మాతలే ప్రకటించిన ఆ సినిమా – మన దక్షిణాది భాషల్లో వచ్చిన ఫస్ట్ టాకీ! టాలీవుడ్ అంటే తెలుగు కాదు... బెంగాలీ! మొదట్లో బొంబాయి ఇంపీరియల్ స్టూడియోలో పనిచేసిన హాలీవుడ్ సౌండ్ ఇంజనీర్ విల్ఫోర్డ్ డెమింగ్ అక్కడ సౌండ్ రికార్డింగ్ మిషన్ పెట్టి, శబ్దగ్రహణమంతా తానే చూసేవారు. ‘ఆలమ్ ఆరా’ సహా బొంబాయిలో 5 చిత్రాలకు ఆయనే వర్క్ చేశారు. ఇంపీరియల్ స్టూడియోలో తయారైన ఫస్ట్ సౌతిండి యన్ టాకీ ‘కాళిదాస్’కు కూడా బహుశా ఆయనే సౌండ్ ఇంజనీర్. అంటే మన తెలుగు మాటల్ని, త్యాగరాయ కీర్తనల్నీ తెరపై వినిపించిన సౌండ్ ఇంజనీర్ ఎనిమిదేళ్ళ అనుభవం ఉన్న ఆ హాలీవుడ్ టెక్నీషియనే కావచ్చు. ఆ తరువాతి కాలంలో ఆయన కలకత్తాకు మకాం మార్చి, బి.ఎన్. సర్కార్ ‘న్యూ థియేటర్స్’ సంస్థలో 2 చిత్రాలకు పని చేశారు. కలకత్తాలోని టాలీగంజ్ ప్రాంతంలో కేంద్రీకృతమైన బెంగాలీ చిత్రసీమకు ‘టాలీవుడ్’ అని పేరు పెట్టిందీ ఆయనే! 1932లో ‘అమెరికన్ సినిమాటోగ్రాఫర్’ పత్రికకు కలకత్తా సినీ పరిశ్రమ గురించి రాసిన వ్యాసంలో ఆయనే మొదట ఆ పేరు వాడారు. అంటే తెలుగు చిత్రసీమను మనోళ్ళు ‘టాలీవుడ్’ అనడమే పెద్ద తప్పు అన్న మాట! మన తొలి సినిమా విశేషాలు తొలి పూర్తి తెలుగు టాకీ: ‘భక్త ప్రహ్లాద’ దర్శకుడు: హెచ్.ఎం. రెడ్డి చిత్ర నిర్మాణం జరిగింది: 18 రోజుల్లో, రూ. 18 వేల పెట్టుబడితో సినిమా నిడివి: 9,762 అడుగులు సెన్సారైంది: 1932 జనవరి 22న, సెన్సార్ సర్టిఫికెట్ నంబర్: 11032. తొలి రిలీజ్: 1932 ఫిబ్రవరి 6న, బొంబాయిలోని కృష్ణా సినిమా థియేటర్ దర్శకుడు హెచ్.ఎం. రెడ్డి; తొలి 3 టాకీల్లో దర్శక నిపుణుడు చందాల కేశవదాసు, తొలి తెలుగు సినీ కవి దర్శక, నిర్మాత ఎల్వీ ప్రసాద్ తొలి 3 టాకీల్లో పని చేసిన వ్యక్తి – రెంటాల జయదేవ -
కష్టం వస్తే కన్నీరు కారుస్తారు.. మరి కేన్సర్ వస్తే
హీరోకు కష్టం వస్తే ప్రేక్షకులు కన్నీరు కారుస్తారు. హీరోకు కేన్సర్ వస్తే భరించగలరా? తెలుగు సినిమాకే కాదు భారతీయ సినిమాకు కూడా ‘కేన్సర్’ ఒక హిట్ ఫార్ములాగా నిలిచింది. ‘కేన్సర్’ అని తెలిశాక జీవితాన్ని చూసే పద్ధతి, చేసే త్యాగం, పోరాడే తెగువ, నిలుపుకునే ఆశ... ఇవన్నీ సినిమా కథలుగా మారి బాక్సాఫీస్ హిట్‌గా నిలిచాయి. నేడు ‘వరల్డ్ కేన్సర్ డే’ సందర్భంగా ఆ సినిమాల తలపులు... జ్ఞాపకాలు... పూర్వం తెలుగు ప్రేక్షకులకు గుండెపోటు మాత్రమే తెలుసు. అది కూడా గుమ్మడి వల్ల. ఆయనే గుండె పట్టుకుని చనిపోతూ ఉండేవారు సినిమాలో. కేన్సర్ చాలా ఆధునిక జబ్బు. దానికి కొత్తల్లో తగిన చికిత్స లేకపోవడం విషాదం. ప్రాణరక్షణకు గ్యారంటీ ఉందని చెప్పలేని స్థితి. మృత్యువు దాపున ఉన్నట్టే అన్న భావన ఉంటుంది. ఇది తెలుగు సినిమా కథకు డ్రామా తీసుకురాగలదని సినిమా దర్శకులు కనిపెట్టారు. పూర్వం టి.బి వంటి వ్యాధుల మీద సినిమాలు ఉన్నా కేన్సర్‌లో ఉండే తక్షణ ప్రాణ భయం సినిమా కథల్లో మలుపులకు కారణమైంది. ప్రేమాభిషేకం పాత ‘దేవదాసు’లో దేవదాసు తాగి తాగి చనిపోతాడు. పార్వతిని వదులుకోవాల్సి రావడమే కారణం. ‘ప్రేమాభిషేకం’లో హీరోయిన్ను వదలుకోవడానికి పాతకాలం కాదు. ఆధునిక కాలం. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవచ్చు. కాని కేన్సర్ కథను మలుపు తిప్పింది. తనకు కేన్సర్ వచ్చిందన్న కారణంతో అక్కినేని తాను ప్రేమించిన శ్రీదేవిని దూరం పెడతాడు. ఆమెను మర్చిపోవడానికి తాగుతాడు. బంగారం లాంటి భవిష్యత్తు ఒక జబ్బు వల్ల బుగ్గిపాలు అవుతుంది. డాక్టర్లు కాపాడలేని ఈ రోగం ఒక ప్రేమికుడి త్యాగానికి కారణమవుతుంది. దర్శకుడు దాసరి అల్లిన ఈ కథ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. సామాన్య ప్రేక్షకుడికి కేన్సర్ అనే వ్యాధి ఉన్నట్టు తెలియచేసింది. ‘ప్రేమాభిషేకం’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అందులోని పాటలు, మాటలు జనం నేటికీ మర్చిపోలేదు. ‘ఆగదు ఏ నిమిషము నీ కోసము’ అని పాట. మనం ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్త గా ఉండాల్సిందే. మనకు అనారోగ్యం వస్తే అయ్యో అని లోకం ఆగదు. మన జీవితమే స్తంభిస్తుంది. గీతాంజలి హీరో హీరోయిన్లలో ఒకరికి కేన్సర్ వస్తేనే ప్రేక్షకులు ఆ సినిమాను చూడాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇక ఇద్దరికీ కేన్సర్ వస్తే చూస్తారా? ఫ్లాప్ చేస్తారు. కాని దర్శకుడు మణిరత్నం ఈ కథను చెప్పి హిట్ కొట్టాడు. గిరిజకు, నాగార్జునకు కేన్సర్ వచ్చిందని చెప్పి వారు కొద్దిరోజుల్లో చనిపోతారని చెప్పి ఏడుపులు పెడబొబ్బలు లేకుండా కథ నడిపించాడు. మృత్యువు ఎవరికైనా రావాల్సిందే... వీరికి తొందరగా రానుంది... ఈలోపు అన్నింటినీ కోల్పోవడం కంటే జీవితంలో ఉండే ప్రేమను, తోడును ఆనందించ వచ్చు కదా అని కథను చెప్పాడు. ‘గీతాంజలి’ మొదటగా స్లోగా ఎత్తుకున్నా మెల్లగా క్లాసిక్ రేంజ్‌కు వెళ్లింది. ఇళయరాజా పాటలు, వేటూరి సాహిత్యం... ‘రాలేటి పువ్వులా రాగాలలో’... అని ఒక అందమైన ప్రేమకథను చెప్పింది. గిరిజ ఈ ఒక్క సినిమా కోసమే పుట్టిందని ప్రేక్షకులు అనుకున్నారు. మళ్లీ ఆమె నటించలేదు. సుందరకాండ దర్శకుడు కె.భాగ్యరాజ్ కొత్త కొత్త కథలు కనిపెట్టడంలో మేధావి. ఒక స్టూడెంట్‌కు కేన్సర్ వస్తే తాను సుమంగళిగా చనిపోవాలని తన లెక్చరర్నే ప్రేమించి తాళి కట్టించుకోవాలని అనుకుంటుంది. అయితే ఇదంతా చివరలో తెలుస్తుంది. మొదట అంతా ఆ స్టూడెంట్ ఆ లెక్చరర్ వెంట పడితే అమాయకుడు, మంచివాడు అయిన ఆ లెక్చరర్ ఎలా తిప్పలు పడ్డాడో నవ్వులతో చెబుతాడు దర్శకుడు. తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో కూడా వెంకటేశ్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అంతే పెద్ద హిట్ అయ్యింది. ‘సుందరాకాండకు సందడే సండది’ అని కలెక్షన్ల సందడి సృష్టించింది. ఈ సినిమాలో కూడా స్టూడెంట్ పాత్ర వేసిన అపర్ణ ఆ తర్వాత ఇతర చిత్రాల్లో చేసిన ఒకటి రెండు పాత్రల కంటే ఈ ఒక్క పాత్రతోనే అందరికీ గుర్తుండిపోయింది. కేన్సర్‌కు లేడీస్ సెంటిమెంట్‌కు ముడిపెట్టడంతో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందని అనుకోవాలి. ‘నీ మజిలీ మూడునాళ్లే ఈ జీవయాత్రలో... ఒక పూటలోనే రాలు పూలు ఎన్నో’ అని తాత్త్వికంగా వేటూరి రాసిన పాట మనల్ని గాంభీర్యంలో పడేస్తుంది. మృత్యువు సమీపిస్తేనే జీవితం రుచి తెలుస్తుంది. అది గమనికలో పెట్టుకుని అందరినీ ప్రేమించమని తాత్త్వికులు చెబుతుంటారు. మాతృదేవోభవ కన్నీరు... కన్నీరు.. కన్నీరు.. కారిన ప్రతి కన్నీటిబొట్టు కాసులను కురిపించడం అంటే ఏమిటో ఈ సినిమా చెప్పింది. ఇందులో నలుగురు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల్లో తండ్రి నాజర్ అనుకోకుండా చనిపోతాడు. కుటుంబం కష్టాల్లో పడింది అనుకుంటే తల్లికి కేన్సర్ వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలు ఏం కావాలి? ఆ తల్లి ఆ పిల్లలకు ఒక నీడ కోసం సాగించే అన్వేషణ గుండెల్ని పిండేస్తుంది. నటి మాధవి చేసిన మంచి పాత్రల్లో ఇది ఒకటి. ఈ సినిమా చూసినవారు కష్టాల్లో ఉన్న కుటుంబాలకు కొద్దో గొప్పో సాయం చేయాలని ఏ దిక్కూ లేని పిల్లలను ఎలాగోలా ఆదుకోవాలని అనుకుంటారు. అంత ప్రభావం చూపుతుందీ సినిమా. ‘వేణువై వచ్చాను భువనానికి... గాలినైపోతాను గగనానికి’ అని వేటూరి రాశారు. అందరం ఏదో ఒకనాడు గాలిగా మారాల్సిందే. కాని ఈ గాలిని పీల్చి బతికే రోజుల్లో కాసిన్నైనా మంచి పరిమళాలు వెదజల్లగలిగితే ధన్యత. చక్రం.. జానీ.. హిందీ ‘ఆనంద్’ స్ఫూర్తితో ‘చక్రం’ తీశారు డైరెక్టర్ కృష్ణవంశీ. కాని అప్పటికే మాస్ సినిమా ఇమేజ్ వచ్చిన ప్రభాస్ కేన్సర్‌తో బాధపడటం ప్రేక్షకులు అంతగా మెచ్చలేకపోయారు. మృత్యువు అనే ఒక పెద్ద వాస్తవానికి తల వొంచితే రోజువారి చిన్న చిన్న స్పర్థలు, పట్టుదలలు, పంతాలు నిలువవనీ వాటికి అతి తక్కువ విలువ ఇస్తామని ఈ సినిమా చెబుతుంది. ‘జగమంత కుటుంబం నాదీ... ఏకాకి జీవితం నాది’ పాట ఈ సినిమా నుంచి వచ్చి నిలిచింది. ‘జానీ’ సినిమా కూడా కేన్సర్ కథాంశం ఉన్నా జనం మెప్పు పొందలేకపోయింది. భార్య కేన్సర్ బారిన పడితే హీరో ఆమె చికిత్సకు కావాల్సిన డబ్బు కోసం ఫైట్స్ చేస్తుంటాడు. ఈ ‘యాక్షన్–సెంటిమెంట్’ సరైన తాలుమేలుతో లేదు. ఆ తర్వాత వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో తల్లికి కేన్సర్ వస్తే పిల్లలు బాధ్యతను ఎరగడం చూపించాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ప్రతిరోజూ పండగే... ఇటీవల కేన్సర్‌ను మెయిన్ పాయింట్‌గా చేసుకుని హిట్ కొట్టిన సినిమా ‘ప్రతిరోజూ పండగనే’. ఇంటి పెద్దకు కేన్సర్ వస్తే పిల్లలు ‘ముసలాడు ఎప్పుడు పోతాడా’ అన్నంత మెటీరియలిస్టులుగా మారడంలోని బండతనాన్ని, అమానవీయతను నవ్వులలో పెట్టి ప్రశ్నించడం వల్ల ఈ సినిమా నిలిచింది. సత్యరాజ్ ఈ పాత్రను పండించడం, తండ్రి గొప్పదనాన్ని మర్చిపోయిన కొడుకుగా రావు రమేశ్ సెటైర్లు సినిమాకు ప్లస్ అయ్యాయి. బహుశా రాబోయే రోజుల్లో కేన్సర్ కథలు ఉండకపోవచ్చు. కథలు ఇకపై మారవచ్చు. మనిషి ఇవాళ డిజిటల్ ప్రపంచంలో పడి ఒంటరితనం అనే కేన్సర్‌లో పడటం సినిమా కథ కావచ్చు. సమయాన్ని ఫోన్లో కూరేస్తూ ఇంట్లోని సభ్యులు కూడా మాట్లాడుకోకపోవడానికి మించిన కేన్సర్ లేదని చెప్పే కథలే ఇకపై రావచ్చు. వాటి అవసరం ఉంది కూడా. బహుశా రాబోయే రోజుల్లో కేన్సర్ కథలు ఉండకపోవచ్చు. కేన్సర్‌ను దాదాపుగా జయించే దారిలో మనిషి ఉన్నాడు. కనుక కథలు ఇకపై మారవచ్చు. మనిషి ఇవాళ డిజిటల్ ప్రపంచం వల్ల ఒంటరితనం అనే కేన్సర్‌లో పడటం సినిమా కథ కావచ్చు. మొత్తం సమయాన్ని ఫోన్లో కూరేస్తూ ఇంట్లోని సభ్యులు కూడా మాట్లాడుకోకపోవడానికి మించిన కేన్సర్ లేదని చెప్పే కథలే ఇకపై రావచ్చు. వాటి అవసరం ఉంది కూడా. – సాక్షి ఫ్యామిలీ -
సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి సుదీప్ శ్రీకారం
కన్నడ నటుడు సుదీప్ తన కెరీర్‌ను స్టార్ట్ చేసి 25 వసంతాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన నటించిన తాజా చిత్రం ‘విక్రాంత్ రోణ’ టైటిల్ లోగో, స్నీక్‌పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తయిన భవనం దుబాయ్‌లోని బూర్జ్ ఖలీఫాలో విడుదల చేశారు. అనూప్ భండారి దర్శకత్వంలో జాన్ మంజునాథ్, శాలినీ మంజునాథ్ నిర్మించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘సినీ పరిశ్రమలో సిల్వర్ జూబ్లీని పూర్తి చేసుకుని తనదైన మార్క్ క్రియేట్ చేసిన సుదీప్ ‘విక్రాంత్ రోణ’తో సరికొత్తగా పరిచయం అవుతున్నారు. బూర్జ్ ఖలీఫాలో ‘విక్రాంత్ రోణ’ టైటిల్ లోగో, స్నీక్ పీక్‌ను విడుదల చేయడం ద్వారా సినీ చరిత్రలో కొత్త అధ్యాయానికి సుదీప్ శ్రీకారం చుట్టారు. ఇండియన్ సినిమా స్థాయిని, గౌరవాన్ని ప్రపంచానికి చాటిన ఘట్టమిది. ఈ వేడుక కోసం 2000 అడుగుల ఎత్తున్న సుదీప్ భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఇంత భారీ కటౌట్‌తో సుదీప్ ఓ రికార్డ్ క్రియేట్ చేశారు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో 50 దేశాల్లో ‘విక్రాంత్ రోణ’ చిత్రం విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: అలంకార్ పాండియన్, సంగీతం: బి.అజనీష్ లోక్‌నాథ్, కెమెరా: విలియమ్ డేవిడ్. -
ఇవన్నీ సిద్ధం.. మీరు సిద్ధమా?
థియేటర్స్‌లో సినిమాలు లేక 2020 వెలవెలబోయింది. 2021 కొత్త చిత్రాల రిలీజులతో జోరుగా హుషారుగా ఉండబోతోంది. గత ఏడాది మిస్సయిన మజాని రెండింతలు ఈ ఏడాది ఇవ్వబోతోంది. స్టార్స్ అందరూ తమ చిత్రాలను థియేటర్స్‌కు తీసుకొచ్చే డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాల విడుదల తేదీలు వచ్చాయి. తాజాగా మరిన్ని అప్ డేట్స్ వచ్చాయి. వేసవి నుంచి దసరా వరకూ ఒక్కో డేట్‌ను ఒక్కో సినిమా తీసుకుంది. ఆ విశేషాలు. ట్రిపుల్ ఫన్ ‘ఎఫ్2’తో డబుల్ ఫన్ ఇచ్చాం. ఇప్పుడు ట్రిపుల్ ఫన్ ఇవ్వడానికి రెడీ అయ్యాం అంటోంది ‘ఎఫ్ 3’ చిత్రబృందం. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్ 3’. ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రానికి ఇది సీక్వెల్. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మాత. ఈ సీక్వెల్లో కో బ్రదర్స్ వెంకీ, వరుణ్ డబ్బు సంపాదించడం మీద ఎక్కవ దృష్టి పెడతారట. ఈ సినిమాను ఆగస్ట్ 27న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. పుష్పరాజ్ వేట త్వరలో.. అల్లు అర్జున్, సుకుమార్‌ది స్పెషల్ కాంబినేషన్. వీరిద్దరూ గతంలో ‘ఆర్య, ఆర్య 2’ సినిమాలు చేశారు. తాజాగా ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయిక. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేస్తున్నారు. ‘పుష్పరాజ్ వేట త్వరలోనే ఆరంభం’ అంటూ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. కూత మొదలు ‘సీటీమార్’ కోసం కబడ్డీ కోచ్‌గా మారారు గోపీచంద్. ఏప్రిల్ 2నుంచి థియేటర్స్‌లో కూత మొదలవుతుందట. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘గోపీచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయింది’’ అని చిత్రబృందం పేర్కొంది. కపటధారి రెడీ? క్రైమ్‌ని పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీస్ సుమంత్ సిద్ధమయ్యారు. సుమంత్, నందితా శ్వేత జంటగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కపటధారి’. ఇందులో సుమంత్ ట్రాఫిక్ పోలీస్‌గా కనిపించనున్నారు. నాజర్, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రల్లో నటించారు. కన్నడ చిత్రం ‘కవులుదారి’కి ఇది తెలుగు రీమేక్. ఫిబ్రవరి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. గని రెడీ బాక్సర్ గని తన పంచ్ ఎలా ఉంటుందో చూపించడానికి రెడీ అవుతున్నారు. జూలైలో తన పంచ్ పవర్ చూపించనున్నారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ నటిస్తున్న చిత్రం ‘గని’. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్దా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ కథానాయిక. ఉపేంద్ర, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 30న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రాధాకృష్ణ ‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా టి.డి. ప్రసాద్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ పార్వతి ఓ కీలక పాత్రలో నటించారు. పుష్పాల సాగరిక నిర్మించారు. నిర్మల్ బొమ్మలు తయారు చేసే కళాకారుల సమస్యల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 5న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కామ్రేడ్ రవన్న వస్తున్నాడు ప్రజల సమస్యలపై పోరాడటానికి కామ్రేడ్ రవన్న అయ్యారు రానా దగ్గుబాటి. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా చేస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయిక. ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరీరావ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. నివేదా పేతురాజ్ అతిథి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో కనిపిస్తారు రానా. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. -
హీరోయిన్ల చేతిలో ఎన్ని సినిమాలున్నాయి?
హీరోయిన్లు ఒకే సమయంలో నాలుగైదు సినిమాలు చేస్తుంటారు. ఆ సెట్ నుంచి ఈ సెట్‌కి.. ఈ సెట్ నుంచి ఆ సెట్‌కి వెళ్తూ బిజీబిజీగా ఉంటారు. లాక్డౌన్లో షూటింగ్స్ మాత్రమే ఆగిపోయాయి. కొత్త కథలు తయారవుతూనే ఉన్నాయి. కొత్త సినిమాలు కమిట్ అవుతూనే ఉన్నారు. ప్రస్తుతం హీరోయిన్ల చేతిలో ఎన్ని సినిమాలున్నాయి? సెట్స్‌లో ఉన్న, పూర్తయిన, విడుదలకు సిద్ధమైన చిత్రాలతో ఒక్కో స్టార్ డైరీ ఎలా ఉంది? ఓ లుక్కేద్దాం. తమన్నా: వెంకటేశ్‌తో ‘ఎఫ్ 3’, నితిన్‌తో ‘అంధా ధున్’ తెలుగు రీమేక్. గోపీచంద్‌తో ‘సీటీమార్’, సత్యదేవ్‌తో ‘గుర్తుందా శీతాకాలం’. కాజల్ అగర్వాల్: చిరంజీవితో ‘ఆచార్య’, కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’, మంచు విష్ణుతో ‘మోసగాళ్ళు’, దుల్క ర్తో ‘హే సినామిక’ (పూర్తయింది), తమిళంలో రెండు హారర్–కామెడీ చిత్రాలు కమిటయ్యారు. కీర్తీ సురేశ్: మహేశ్‌బాబుతో ‘సర్కారు వారి పాట’, రజనీకాంత్‌తో ‘అన్నాత్తే’, నితిన్‌తో ‘రంగ్ దే’, నితిన్‌తో ‘పవర్ పేట’, ఆదితో ‘గుడ్ లక్ సఖీ’ (పూర్తయింది), తమిళంలో సెల్వ రాఘవన్‌తో ‘సాని కాయిదమ్’. రకుల్ ప్రీత్ సింగ్: నితిన్‌తో ‘చెక్’ (పూర్తయింది). కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు 2’, వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమా, హిందీలో ‘సర్దార్ అండ్ గ్రాండ్ సన్’, ‘మే డే’, ‘థ్యాంక్ గాడ్’. తమిళంలో శివకార్తికేయన్‌తో ‘అయలాన్’. సాయి పల్లవి: రానాతో ‘విరాట పర్వం’, నాగచైతన్యతో ‘లవ్‌స్టోరీ’ (పూర్తయింది), నానీతో ‘శ్యామ్ సింగరాయ్’. లావణ్యా త్రిపాఠి: సందీప్ కిషన్‌తో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, కార్తికేయతో ‘చావు కబురు చల్లగా’. శ్రుతీహాసన్: ‘క్రాక్’ (రేపే విడుదల). పవన్ కల్యాణ్‌తో ‘వకీల్ సాబ్’, తమిళంలో విజయ్ సేతుపతితో ‘లాభం’ నిత్యా మీనన్: సత్యదేవ్‌తో ‘స్కై ల్యాబ్’ చిత్రం, అశోక్ సెల్వన్‌తో ‘నిన్నిలా నిన్నిలా’, మలయాళంలో ‘కులంబీ’. నిధీ అగర్వాల్: గల్లా అశోక్‌తో ఓ తెలుగు సినిమా, తమిళంలో శింబుతో ‘ఈశ్వరన్’, ‘జయం’ రవితో ‘భూమి’ సినిమాలు పూర్తయ్యాయి. నివేదా థామస్: ‘వకీల్ సాబ్’, సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా. సమంత: గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుం తలం’, తమిళంలో విజయ్ సేతుపతితో ‘కాదువాక్కుల రెండు కాదల్’ చేస్తున్నవి. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా కమిటయ్యారని టాక్. రష్మికా మందన్నా: అల్లు అర్జున్‌తో ‘పుష్ప’, శర్వానంద్‌తో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, కార్తీతో ‘సుల్తాన్’ (పూర్తయింది), హిందీలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ’మిషన్ మజ్ను’, అమితాబ్‌తో ‘డెడ్లీ’. కన్నడంలో ‘పొగరు’ (పూర్తయింది). పూజా హెగ్డే: ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, దుల్కర్–హను రాఘవపూడి సినిమా, హిందీలో సల్మాన్ ఖాన్‌తో ‘కభీ ఈద్ కభీ దీపావళి’, రణ్వీర్తో ‘సర్కస్’. రాశీ ఖన్నా: తమిళంలో విజయ్ సేతుపతితో ‘తుగ్లక్ దర్బార్’, ఆర్యతో ‘అరణ్మణై’. షాహిద్‌తో హిందీలో ఓ వెబ్ సిరీస్. తమిళంలో విక్రమ్‌తో ఓ సినిమా కమిటయ్యారట. నయనతార: తమిళంలో రజనీకాంత్‌తో ‘అన్నాత్తే’, విజయ్ సేతుపతితో ‘కాదువాక్కుల రెండు కాదల్, నెట్రిక్కన్’, మలయాళంలో ‘నిళల్, పాట్టు’. రీతూ వర్మ: నానీతో ‘టక్ జగదీష్’, శర్వానంద్‌తో ఓ ద్విభాషా చిత్రం, నాగ శౌర్యతో ‘వరుడు కావలెను’, అశోక్ సెల్వన్‌తో ‘నిన్నిలా నిన్నిలా, తమిళంలో విక్రమ్‌తో ‘ధృవ నక్షత్రం’. నభా నటేశ్: నితిన్‌తో ‘అంధా ధున్’ తెలుగు రీమేక్, ‘అల్లుడు అదుర్స్’ (సంక్రాంతికి విడుదల కానుంది). పాయల్ రాజ్‌పుత్: తెలుగులో లేడీ ఓరియంటెడ్ ‘5డబ్ల్యూస్’, తమిళంలో ‘ఏంజెల్’. ప్రియమణి: ‘నారప్ప, కొటేషన్ గ్యాంగ్’. అంజలి: పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’. రెజీనా: విశాల్‌తో ‘చక్ర’, ‘నేనేనా’, అరవింద్ స్వామితో ‘కల్లాపాట్’. అదితీ రావ్ హైదరీ: శర్వానంద్‌తో ‘మహా సముద్రం’, తమిళంలో దుల్కర్ సల్మాన్‌తో ‘హే సినామిక’ (పూర్తయింది), హిందీలో ‘సర్దార్ అండ్ గ్రాండ్ సన్’. అనుపమా పరమేశ్వరన్: నిఖిల్‌తో ‘18 పేజెస్’ మెహరీన్: ‘ఎఫ్ 3’. నివేదా పేతురాజ్: సాయిధరమ్–దేవా కట్టా సినిమా. ఈషా రెబ్బా: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, తమిళ సినిమా ‘ఆయిరమ్ జన్మంగళ్’. శ్రద్ధా శ్రీనాథ్: సిద్ధు జొన్నలగడ్డతో ‘నరుడి బ్రతుకు నటన’, విశాల్‌తో ‘చక్ర’ (పూర్తయింది) ఐశ్వర్యా రాజేష్: నానీతో ‘టక్ జగదీష్’. -
మ్యాజికల్ కాదు... ట్రాజికల్
2020.... మ్యాజికల్ నంబర్... కానీ మ్యాజిక్ జరగలేదు సినిమా రిలీజ్ నంబర్ తగ్గించేసింది. వసూళ్ల నంబర్ పడిపోయింది సినీ కార్మికులకు ఉపాధి లేకుండా చేసింది షూటింగులు లేక స్టూడియోలు వెలవెలబోయేలా చేసింది గాన గంధర్వుడిని, విలక్షణ నటులను తీసుకెళ్లిపోయింది మొత్తం మీద ‘మ్యాజికల్ ఇయర్’ కాదు.. ‘ట్రాజికల్ ఇయర్’గా మిగిలిపోయింది. పెద్ద పెద్ద విషాదాల్లో చిన్న చిన్న సంతోషాలూ ఉంటాయి. అలా కొన్ని ఆనందకరమైన సంఘటనలూ ఉన్నాయి. 2020.. 12 నెలలు... రౌండప్ వేద్దాం. జనవరి: ఈ నెలలో సుమారు 12 సినిమాల వరకూ రిలీజయ్యాయి. సంక్రాంతికి విడుదలైన మహేశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ పెద్ద విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇంకా విడుదలైన చిత్రాల్లో రవితేజ ‘డిస్కో రాజా’, కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’, నాగశౌర్య ‘అశ్వథ్థామ’ వంటివి ఉన్నాయి. ♦ నిర్మాత మండల్‌రెడ్డి కొండల్‌రెడ్డి 29న మృతి చెందారు. ఫిబ్రవరి: ఈ నెల 16 సినిమాలు రిలీజయ్యాయి. నితిన్ ‘భీష్మ’ సూపర్ హిట్ టాక్‌తో వసూళ్లను కొల్లగొట్టింది. శర్వానంద్ ‘జాను’, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’తో పాటు విశ్వక్సేన్ ‘హిట్’ తదితర చిత్రాలు తెరకొచ్చాయి. ♦19న ‘ఇండియన్ 2’ సెట్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మార్చి: ఈ నెల 15 నుంచి థియేటర్స్‌ను మూసేశారు. 15వ తేదీ వరకూ 7 సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘పలాస 1978’ మంచి ప్రశంసలు అందుకుంది. ‘ఓ పిట్ట కథ’, ‘మద’ వంటి చిత్రాలు రిలీజయ్యాయి. ∙12న ‘పరుగు’ ఫేమ్ షీలా వివాహం వ్యాపారవేత్త సంతోష్ రెడ్డితో జరిగింది. ♦సినిమా చిత్రీకరణలన్నీ నిలిచిపోయిన నెల ఇది. ♦8న నిర్మాత సి. వెంకటరాజు కన్నుమూశారు. ఏప్రిల్: ∙జీ5లో ‘అమృతరామమ్’ విడుదలైంది. ఓటీటీలో విడుదలైన తొలి తెలుగు చిత్రమిది. ♦14న రచయిత సీయస్ రావ్ మృతి చెందారు. మే: ♦ ఈ నెల 10న ‘దిల్’ రాజు వివాహం వైఘాతో జరిగింది. ♦14న హీరో నిఖిల్ పెళ్లి పల్లవి వర్మతో జరిగింది. జూన్: కీర్తీ సురేశ్ నటించిన ‘పెంగ్విన్’ ప్రైమ్‌లో విడుదలైంది. సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ ఆహాలో, సత్యదేవ్ ‘47 డేస్’ జీ5లో విడుదలయ్యాయి. ♦కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో సినిమా చిత్రీకరణలు జరుపుకోవచ్చని ప్రభుత్వం అనుమతిచ్చింది. జూలై: ♦ ఈ నెల 26న నితిన్–షాలినీ వివాహం జరిగింది ♦ సత్యదేవ్ ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’, నవీన్ చంద్ర ‘భానుమతి రామకష్ణ’ చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ♦ 5న ఈతరం ఫిలింస్ బ్యానర్ సమర్పకుడు, నిర్మాత పోకూరి బాబురావు సోదరుడు పోకూరి రామారావు, 26న నిర్మాత కందేపి సత్యనారాయణ, 28న నటుడు, రచయిత రావికొండలరావు కన్నుమూశారు. ఆగస్ట్: ♦ 8వ తేదీ రానా, మిహికా వివాహం జరిగింది ♦ దర్శకులు రాజమౌళి, సంగీత దర్శకులు కీరవాణి మరియు వారి కుటుంబ సభ్యులు, నటి జెనీలియా కోవిడ్ బారినపడ్డారు. ♦ ప్రముఖ గాయకుడు వంగపండు ప్రసాదరావు 4న తుది శ్వాస విడిచారు. సెప్టెంబర్: ∙నాని, సుధీర్‌బాబు ‘వి’ అమెజాన్ ద్వారా విడుదలైంది. ఓటీటీలో విడుదలైన తొలి పెద్ద తెలుగు సినిమా ఇదే. ♦ ఈ నెల తెలుగు సినిమాల చిత్రీకరణలు ప్రారంభం అయ్యాయి. ♦ ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, నటుడు నాగబాబు కరోనా బారిన పడ్డారు ♦ 8న ప్రముఖ నటులు జయప్రకాశ్ రెడ్డి మరణించారు. ♦ సీనియర్ నటి పొట్నూరి సీతాదేవి 21న కన్నుమూశారు. ♦ 23న నటుడు కోసూరి వేణుగోపాల్ మృతి చెందారు. ♦ 25న గాన గాంధర్వుడు యస్పీ బాలసుబ్రహ్మణ్యం తిరిగి రాని లోకాలకు వెళ్లారు. అక్టోబర్: లాక్‌డౌన్‌కి ముందు విడుదల కావాల్సిన అనుష్క ‘నిశ్శబ్దం’ వాయిదా పడుతూ అక్టోబర్‌లో ఓటీటీలో విడుదలైంది. రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’, క్యారెక్టర్ నటుడు సుహాస్ లీడ్ రోల్ చేసిన ‘కలర్ ఫొటో’ చిత్రాలూ ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ♦ 7న నిర్మాత బూరుగుపల్లి బప్పిరాజు కన్నుమూశారు. ♦ లాక్డౌన్ తర్వాత తెలుగు నుంచి విదేశాలు వెళ్లిన తొలి సినిమా ప్రభాస్ ‘రాధేశ్యామ్’. ఇటలీలో ఓ భారీ షెడ్యూల్ కోసం ఈ టీమ్ అక్కడికి వెళ్లింది ♦ కాజల్ అగర్వాల్ ఏడడుగులు నడిచిన తేదీ అక్టోబర్ 30. స్నేహితుడు గౌతమ్ కిచ్లుతో వెడ్లాక్లోకి ఎంటరయ్యారు ఈ బ్యూటీ ♦ ‘నేను పాజిటివ్’ అంటూ ఈ నెల మొదటి వారంలో తమన్నా చెప్పారు. కొన్ని రోజులకే కరోనా పాజిటివ్ నుంచి బయటపడి, నెగటివ్ అయ్యారు ♦ 50 శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు తెరవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. నవంబర్: ఈ నెల ఆరు ఓటీటీ రిలీజులను చూసింది. పెద్ద సినిమా సూర్య ‘ఆకాశం నీ హద్దు రా’ విడుదలై, మంచి సినిమాగా నిలిచింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ఆకట్టుకుంది. ‘మిస్ ఇండియా’గా కీర్తీ సురేశ్ వచ్చారు. ‘మా వింత గాథ వినుమా’, ‘అనగనగా ఓ అతిథి’ చిత్రాలు రిలీజయ్యాయి. విడుదలైన చిన్న సినిమాల్లో ‘గతం’ వచ్చే ఏడాది జనవరిలో గోవాలో జరగనున్న చిత్రోత్సవాల్లో ఇండియన్ పనోరమ విభాగంలో ప్రదర్శితం కానుంది. ఈ విభాగంలో ప్రదర్శితం కానున్న ఏకైక తెలుగు చిత్రం ‘గతం’. ♦ ఈ నెల 5న ఎడిటర్ కోలా భాస్కర్ చనిపోయారు. ♦ అక్టోబర్‌లో రాజశేఖర్, జీవిత, వారి పిల్లలు శివాని, శివాత్మిక కరోనా బారిన పడ్డారు. జీవిత, పిల్లలు కోలుకోగా రాజశేఖర్ కొన్నాళ్ల పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సి వచ్చింది. నవంబర్‌లో కోలుకుని రాజశేఖర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు ♦ చిరంజీవికి ‘పాజిటివ్’ అనే వార్త ఈ నెలలో మెగాభిమానులను కలవరపెట్టింది. అయితే రిజల్ట్ తేడాగా వచ్చిందని, తనకు కరోనా లేదని ఆ తర్వాత చిరంజీవి ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డిసెంబర్: ♦ ఈ నెల 4న తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్‌ను ఓపెన్ చేశారు. హాలీవుడ్ మూవీ ‘టెనెట్’తో థియేటర్స్ తెర్చుకున్నాయి. ఆ తర్వాత ‘కరోనా వైరస్, మర్డర్’ చిత్రాలు కూడా విడుదలయ్యాయి. థియేటర్స్‌లో విడుదలైన పెద్ద సినిమా సాయి తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ♦ డిసెంబర్ 9న నిహారిక వివాహం జరిగింది ♦ హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ చిత్రీకరణలో పాల్గొంటున్న రజనీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి, కోలుకున్నాక చెన్నై వెళ్లారు ♦ రకుల్ ప్రీత్, రామ్‌చరణ్, వరుణ్ తేజ్ కోవిడ్ బారినపడ్డారు ♦ 21న పంపిణీదారుడు అడుసుమిల్లి సాంబశివరావు, 25న దర్శకుడు ఓఎస్సార్ ఆంజనేయులు, 28న ఏఆర్ రెహమాన్ తల్లి కరీమా బేగమ్ మృతి చెందారు. 2020తో కలుపుకుని గడచిన పదేళ్లలో తక్కువ సినిమాలు చూపించిన సంవత్సరం ఇదే. ఈ ఏడాది విడుదలైన సినిమాలు మొత్తం 65. వాటిలో 50 స్ట్రయిట్ కాగా, 15 డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. స్ట్రయిట్ చిత్రాలు, అనువాద చిత్రాలు కలుపుకుని 2011లో 243, 2012లో 224, 2013లో 270, 2014లో 276, 2015లో 245, 2016లో 266, 2017లో 245, 2018లో 228, 2019లో 269, 2020లో 65 చిత్రాలు రిలీజయ్యాయి. -
వెళుతూ ఉండాలి... వెళ్లనివ్వాలి
‘‘జీవితం ఏది ఇస్తే దాన్ని అంగీకరించాలి’’ అంటున్నారు అమలా పాల్. ఇంకా చాలా విషయాలు చెప్పారు. 2020 చాలా నేర్పించిందంటున్నారామె. ఈ ఏడాది నేర్చుకున్న విషయాలు, తీసుకున్న నిర్ణయాల గురించి అమలా పాల్ ఈ విధంగా చెప్పారు. సరిగ్గా లేకపోవడం సరైనదేనని నేర్చుకున్నాను. నువ్వు సరిగ్గా లేవనే సంగతిని స్వీకరించకపోవడం సరైనది కాదని తెలుసుకున్నాను. సరేనా? మన లోపాల్ని స్వీకరించడంతోనే ఉపశమనం మొదలవుతుంది. . దైవత్వంతో పున స్సంధానమై, నా అహం తాలూకు మరణం నుంచి మేలుకొన్నాను. నాలోని కుండలిని (అనిర్వచనీయమైన శక్తి)ని నన్ను జాగృతం చేయనిచ్చాను. జీవితం నా దారిలో విసిరేసిన ప్రతి దానినీ హుందాగా, కృతజ్ఞతగా స్వీకరించాను. బాధ నుంచి నేనెప్పుడూ తప్పించుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ బాధను నన్ను ప్రభావితం చేయనిచ్చాను. బాధను అనుభవించడం నుంచే చాలా నేర్చుకున్నా. పాత స్నేహితులను కలవడానికి వెళ్లాలి. జీవితంలో కొత్త జ్ఞాపకాల కోసం వెళ్లాలి. శత్రువులను క్షమించడానికి వెళ్లాలి. మన జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పడానికి వెళ్లాలి. మనల్ని మనం తెలుసుకోవడానికి వెళ్లాలి. వెళ్లాలి.. వెళ్లాలి.. వెళుతూ ఉండాలి. వెళ్లనివ్వాలి. నా జీవనగడియారాన్ని సరిదిద్దుకోవడానికి నేను ఆయుర్వేదాన్ని ఆశ్రయించాను. -
కనబడుట లేదు.. భారీ హిట్‌కి గురి
అవును... మన స్టార్స్‌కి కనబడట్లేదు. కథలో దమ్ము కనిపించేసరికి స్క్రీన్ మీద తమ పాత్రకు కళ్లు కనిపించకపోయినా ఫర్వాలేదంటున్నారు. క్యారెక్టర్‌కి కొత్త షేడ్ వస్తుందంటే.. సినిమా మొత్తం షేడ్స్ (కళ్ల జోడు) పెట్టుకొనే ఉండటానికి రెడీ అంటున్నారు. స్క్రీన్‌పై అంధులుగా నటిస్తూ.. బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్‌కి గురి పెట్టారు. అంధ పాత్రలను ఓ చూపు చూస్తున్నారు. ప్రస్తుతం అంధ పాత్రలో నటిస్తున్న స్టార్స్‌పై ఓ లుక్కేద్దాం.. ‘అంధా ధున్’ హిందీలో పెద్ద హిట్. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళంలో రీమేక్ అవుతోంది. తెలుగు రీమేక్‌లో నితిన్ హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే దుబాయ్‌లో ప్రారంభం అయింది. ఇందులో నితిన్ అంధ పియానో ప్లేయర్ పాత్రలో కనిపిస్తారు. తమిళ రీమేక్ విషయానికి వస్తే.. ప్రశాంత్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను జనవరి 1న ప్రకటిస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది. జేజే ఫ్రెడ్రిక్ దర్శకుడు. ఈ సినిమాలో పియానో వాద్యకారుడిగా నటించడానికి లాక్డౌన్లో రోజుకి రెండు గంటల చొప్పున పియానో నేర్చుకున్నారట ప్రశాంత్. ‘అంధా ధున్’ మలయాళంలోనూ రీమేక్ కాబోతుందనే వార్త కూడా ఉంది. మలయాళ హీరో పృథ్వీరాజ్ లీడ్ రోల్ చేస్తారట. లేడీ సూపర్‌స్టార్ నయనతార కొత్త సినిమా కోసం అంధురాలిగా మారారు. మిలింద్ రాజు తెరకెక్కిస్తున్న ‘నెట్రిక్కన్’లో కళ్లు కనిపించని అమ్మాయిగా చేస్తున్నారు నయన. ‘నెట్రిక్కన్’ అంటే మూడో కన్ను అని అర్థం. ఈ సినిమాలో నగరంలో వరుసగా అమ్మాయిలు కనిపించకుండా పోతుంటారు. ఈసారి నయనతార వంతు వస్తుంది. మరి ఆ చిక్కుల్లో నుంచి చూపులేకున్నా ఈ అమ్మాయి ఎలా తప్పించుకుందన్నది కథ. కమల్ హాసన్ సూపర్‌హిట్ సినిమాల్లో ‘రాజపార్వై’ (తెలుగులో ‘అమావాస్య చంద్రుడు’) ఒకటి. అందులో కమల్ అంధుడిగా నటించారు. ఇప్పుడు అదే టైటిల్‌తో వరలక్ష్మి ప్రధాన పాత్రలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో వరలక్ష్మి కూడా అంధురాలిగా నటిస్తున్నారు. హిందీ వైపు వెళ్తే... క్రైమ్‌ని కనిపెట్టడానికి కళ్లు అంత ముఖ్యమా? కామన్సెన్స్ చాలు అంటున్నారు సోనమ్ కపూర్. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్లైండ్’. ఈ చిత్రంలో ఓ సైకో కిల్లర్‌ను పట్టుకునే కళ్లు కనిపించని పోలీసాఫీసర్‌గా సోనమ్ నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ సోమవారం స్కాట్‌ల్యాండ్‌లో ప్రారంభం అయింది. ఈ చూపులేని పాత్రల్లో తారలందరూ ఆడియన్స్ చూపు తిప్పుకోలేని పర్ఫార్మెన్స్ ఇచ్చి, అలరిస్తారని ఊహించవచ్చు. -
సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం జగన్ సిద్ధంగా ఉన్నారు
‘‘కనుమరుగైపోతున్న చేతివృత్తుల కళాకారుల్ని ప్రోత్సహించాలనే ఆశయంతో వారి ఇబ్బందుల నేపథ్యంలో ‘రాధాకృష్ణ’ సినిమా తీయడం అభినందించాల్సిన విషయం. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా, ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రాధాకృష్ణ’. దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో టి.డి. ప్రసాద్ వర్మ దర్శకత్వం వహించారు. పుప్పాల సాగరిక, కృష్ణ కుమార్ నిర్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ని రిలీజ్ చేసి, మాట్లాడుతూ– ‘‘తెలుగు పరిశ్రమకు ఎలాంటి పథకాలు కావాలన్నా మా ముఖ్యమంత్రి జగన్‌గారు సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందినట్లుగానే ఏపీలోనూ అభివృద్ధి చేయడానికి సీయం చర్యలు చేపడుతున్నారు’’ అన్నారు. ‘‘నేను యాక్ట్ చేయడం ఏంటి? అని నాకు అనిపిస్తుంది. శ్రీనివాస్ రెడ్డి పట్టుబట్టి నన్ను నటింపజేశారు. ప్రాచీన కళలను కోల్పోతే మన మనుగడ కోల్పోయినట్టే’’ అన్నారు లక్షీ పార్వతి. ‘‘వైవీ సుబ్బారెడ్డిలాంటి మంచి మనిషి మా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అప్పుడే ఈ సినిమా విజయం కన్ఫర్మ్ అయిపోయింది. ఈ సినిమాని సెన్సార్ వాళ్లు ప్రశంసించారు’’ అన్నారు శ్రీనివాస్‌రెడ్డి. ‘‘త్వరలోనే థియేటర్స్‌లో విడుదల చేస్తాం’’ అన్నారు సాగరిక కష్ణకుమార్. అలీ, దర్శకుడు టీడీ ప్రసాద్ వర్మ, ముస్కాన్ సేథీ తదితరులు పాల్గొన్నారు. – టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి -
సీఎం జగన్‌కు మెగాస్టార్ కృతజ్ఞతలు
సినీ పరిశ్రమ మీద వరాల జల్లు కురిపించింన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమకు ఊరటనిచ్చే నిర్ణయాలపై తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ మేరకు చిరంజీవి ట్విటర్లో ‘ఎగ్జిబిటర్స్ కోసం సినిమా రిసార్ట్ ప్యాకేజీని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్‌కు నా హృదయ పూర్వక ధన్యవాదాలు. సినిమా థియేటర్ల పునరుద్దరణ కోసం అనేక చర్యలు చేపట్టాలి. సినిమా పరిశ్రమ మీద వేలాది మంది కుటుంబ సభ్యులు ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు. దీని ద్వారా వారికి జీవనోపాధి లభిస్తుంది’ అని ట్వీట్ చేశారు. అదే విధంగా సినిమా పరిశ్రమకు సంబంధించి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను పలువురు ప్రముఖులు అభినందించారు. లాక్డౌన్ వల్ల ఏర్పడ్డ ఇబ్బంది నుంచి తిరిగి పుంజుకోవడానికి ఏపీ ఇచ్చిన వరాలు ఎంతో సహాయకరంగా ఉంటాయని పేర్కొన్నారు. చదవండి: సినీ పరిశ్రమ మీద వరాల జల్లు My sincere gratitude to @YSJagan garu for the very compassionate #CinemasRestartPackage for Exhibitors.The various relief measures are the need of the hour for the sustenance of Theatres & #TeluguFilmIndustry as a whole & will greatly benefit livelihoods of thousands of families. — Chiranjeevi Konidela (@KChiruTweets) December 18, 2020 కాగా కరోనా కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరటనిచ్చింది. 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని ఏపీ కేబినెట్ తెలిపింది.మిగిలిన ఆరు నెలలు ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లింపును వాయిదా వేసేలా నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.దింతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది. రీస్టార్ట్ ప్యాకేజీకింద వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, ఏ, బి, సెంటర్లలో థియేటర్లకు రూ.10లక్షల చొప్పున, సి– సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు, వాయిదాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం, తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీనికి రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.4.18 కోట్ల భారం పడుతుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. -
వరాలు భలే
సినీ పరిశ్రమ మీద వరాల జల్లు కురిపించింది ఏపీ ప్రభుత్వం. పరిశ్రమకు ఊరటనిచ్చే నిర్ణయాలపై ఇండస్ట్రీ ప్రముఖులు తమ సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. లాక్డౌన్ వల్ల ఏర్పడ్డ ఇబ్బంది నుంచి తిరిగి పుంజుకోవడానికి ఏపీ ఇచ్చిన వరాలు ఎంతో సహాయకరంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ విషయం గురించి మాజీ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు, నిర్మాత, ఎగ్జిబిటర్ ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘ఏపీ ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డిగారు పరిశ్రమకు అండగా నిలబడుతున్నారు. ఆయన చేస్తున్న సాయం ఎనలేనిది. మన దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా 3 నెలలు పవర్ టారిఫ్ నుంచి ఉపశమనం కల్పించారు. జగన్‌గారికి, మంత్రి మండలికి, సినీ పెద్దలకు ధన్యవాదాలు’’ అన్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తూ నటుడు చిరంజీవి, సురేశ్ ప్రొడక్షన్స్, అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర వంటి నిర్మాణసంస్థలు, ఇంకా పలువురు తమ సామాజిక వేదికల్లో జగన్మోహన్రెడ్డిని ప్రశంసించారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు : దిల్ రాజు
సాక్షి, అమరావతి : కరోనా కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరటనిచ్చింది. 3 నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్డ్ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం భరించనుందని ఏపీ కేబినెట్ తెలిపింది. (చదవండి : ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే..) మిగిలిన ఆరు నెలలు ఫిక్స్డ్ ఛార్జీలు చెల్లింపును వాయిదా వేసేలా నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.దింతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది. రీస్టార్ట్ ప్యాకేజీకింద వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, ఏ, బి, సెంటర్లలో థియేటర్లకు రూ.10లక్షల చొప్పున, సి– సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ. 5లక్షల చొప్పున రుణాలు, వాయిదాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం, తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీనికి రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.4.18 కోట్ల భారం పడుతుందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినీ పరిశ్రమకు చేసిన సహకారానికి టాలీవుడ్ నిర్మాణ సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. సినీ పరిశ్రమకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన సాయం ఎనలేనిదని న ఆంధ్రప్రదేశ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత ఎన్వీ ప్రసాద్ కొనియాడారు. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ కూడా సోషల్ మీడియాలో దీనిపై స్పందించింది. సీఎం జగన్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన మినహాయింపులు, ఇతర ఊరట చర్యలు చిత్ర పరిశ్రమ పునఃప్రారంభానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొంది.చిత్ర పరిశ్రమ కోసం రీస్టార్ట్ ప్యాకేజి ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు అన్నపూర్ణ స్టూడియోస్ ట్వీట్ చేసింది. Ex- Film Chamber President (Andhra Pradesh), Producer & exhibitor NV Prasad garu thanks AP CM Sri YS Jagan garu on behalf of the exhibitors for granting many concessions to help restart the film industry. pic.twitter.com/pSaJih5eCc — BARaju (@baraju_SuperHit) December 18, 2020 -
ట్విట్టర్ ఇండియా టాప్ 10 జాబితా
స్టార్స్ తాజా చిత్రాల అప్డేట్స్, హాలిడేస్, ఇంకా ఇతర విశేషాల గురించి తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటారు. అందుకే ఏదైనా అప్డేట్ దొరుకుతుందేమోనని సోషల్ మీడియాలో వెతుకుతారు. ఎంత బాగా వెతికితే ట్విట్టర్లో అంత ట్రెండ్ అవుతుంటారు స్టార్స్. అలాగే ఎవరి గురించి అయితే ఎక్కువగా ట్వీట్స్ పడతాయనేదాన్ని బట్టి ట్విట్టర్లో వారి స్థానం ఉంటుంది. ‘2020లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన దక్షిణ భారత స్టార్స్ వీరే అంటూ ‘ట్విట్టర్ ఇండియా’ టాప్ 10 జాబితాను విడుదల చేసింది. దక్షిణాదిన ఎక్కువగా ట్వీట్ చేయబడిన స్టార్‌గా మహేశ్‌బాబు నంబర్ వన్ స్థానంలో నిలిచారు. మహేశ్ తాజా సినిమాల అప్డేట్స్, భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో హాలిడే ట్రిప్స్ విశేషాలకు చాలా క్రేజ్ ఉంటుంది. ఇవే మహేశ్ నంబర్ వన్ స్థానానికి కారణం అని చెప్పొచ్చు. ఆ తర్వాతి స్థానం పవన్ కల్యాణ్‌ది. కొంత గ్యాప్ తర్వాత పవన్ చేస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’. ఈ సినిమా విశేషాల కోసం అభిమానులు భారీగానే ట్వీట్స్ చేశారు. ఇక తమిళ మాస్ హీరో విజయ్‌కి సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా విజయ్ రాజకీయ రంగప్రవేశం గురించిన వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. సౌత్‌లో మూడో స్థానం విజయ్‌ది. ప్రతిష్టాత్మక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చేస్తున్న ఎన్టీఆర్ నాలుగో స్థానం దక్కించుకున్నారు. ఇటీవల సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’కి లభించిన ఆదరణ, ఆ క్రమంలో ప్రముఖులు చేసిన ట్వీట్లు సూర్యని ఐదో ప్లేస్‌లో నిలబెట్టాయి. ‘పుష్ప’లో డిఫరెంట్ లుక్‌లో కనిపించబోతున్న అల్లు అర్జున్ ఆరవ స్థానంలో, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో నటించడంతో పాటు ‘ఆచార్య’లో కీలక పాత్ర చేస్తున్న రామ్‌చరణ్ ఏడో స్థానంలో, ‘వై దిస్ కొలవెరి..’, ‘రౌడీ బేబీ’ వంటి పాటలతో పాటు మంచి మాస్ క్యారెక్టర్స్‌తో దూసుకెళుతున్న ధనుశ్ ఎనిమిదో స్థానంలో, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తొమ్మిది, తెలుగు మెగాస్టార్ చిరంజీవి పదో స్థానంలో నిలిచారు. కథానాయికల్లో అగ్రస్థానం ‘మహానటి’ కీర్తీ సురేశ్‌ది. లాక్డౌన్లో కీర్తీ సురేశ్వి ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ సినిమాలు విడుదలయ్యాయి. అలాగే తాను చేస్తున్న సినిమాల అప్డేట్స్తో ట్రెండ్ అయ్యారు. రెండో స్థానంలో కాజల్ అగర్వాల్ నిలవడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదు. కాజల్ పెళ్లి సందడి ట్విట్టర్లో హల్చల్ చేసింది. అలాగే తన భర్త గౌతమ్‌తో మాల్దీవులకు వెళ్లి, ఆ ఫొటోలను షేర్ చేయడం కాజల్‌ని ట్రెండింగ్‌లో ఉంచింది. సమంత సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఫాలోయర్స్ కూడా అంతే. ఈ బ్యూటీది మూడో స్థానం. రష్మికా మందన్నా నాలుగు, పూజా హెగ్డే ఐదు, తాప్సీ ఆరు, తమన్నా ఏడు, రకుల్ ప్రీత్‌సింగ్ ఎనిమిది, శ్రుతీహాసన్ తొమ్మిది, త్రిష పదో స్థానం దక్కించుకున్నారు. -
చిన్న నిర్మాతలకు అన్యాయం చేశారు
‘‘తెలంగాణ ప్రభుత్వం సినీ ఇండస్ట్రీకి వరాలు కురిపించిందని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. కానీ చిన్న చిత్రాలకు న్యాయం జరిగినట్లు అనిపించడంలేదు’’ అన్నారు ‘తెలుగు ఫిలిం చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్’ చైర్మన్ యేలూరు సురేందర్ రెడ్డి. శుక్రవారం ఆయన మాట్లాడుతూ– ‘‘ఓ ఏడాదిలో వచ్చే 200 సినిమాల్లో పెద్ద సినిమాలు 20 నుంచి 30 వరకు ఉంటాయి. మిగిలినవి చిన్నవే. కొత్త నటీనటుల్ని, సాంకేతిక నిపుణులను తీసుకువచ్చేది, సామాజిక స్పృహ ఉన్న చిత్రాలని తీసేది చిన్న నిర్మాతలే. 30 వేల మంది కార్మికులకు పని ఇచ్చేది ఈ నిర్మాతలే. థియేటర్స్‌లో మధ్యాహ్నం 2 గంటల షో కచ్చితంగా చిన్న సినిమా ప్రదర్శించాలని, షూటింగ్‌కి ఫ్రీగా లొకేషన్స్ ఇవ్వమని అడిగాం. థియేటర్స్‌లో సినిమా ప్రదర్శనకు డిజిటల్ ప్రొవైడర్స్ అన్యాయంగా వారానికి 12,000 వేలు వసూలు చేస్తున్నారు. మేమడిగిన ఈ మూడే మూడు డిమాండ్లను పక్కన పడేశారు. సంవత్సరంలో 180 చిత్రాలను తీస్తున్న చిన్న నిర్మాతలకి అన్యాయం చేశారు’’ అన్నారు. -
కేసీఆర్‌కే నా మద్దతు: కాదంబరి కిరణ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ సినిమా ఇండస్ట్రీని కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు.. మనసున్న నేత కేసీఆర్ అన్నారు నటుడు, ‘మనం సైతం’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు కాదంబరి కిరణ్. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆయన మాట్లాడారు. ‘మనం సైతం’ తరఫున కేసీఆర్‌కి, టీఆర్ఎస్కి సపోర్టు చేస్తున్నాను అన్నారు. పేదవారికి సాయం చేసేందుకు తాను ఎప్పుడు వెళ్లిన కేటీఆర్, సంతోష్ కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ఇండస్ట్రీకి కేటాయించబోయే 1500 ఎకరాల ఫిల్మ్ సిటీలో కొంతవరకు పేద కార్మికుల కోసం స్థలం ఇవ్వాలని కోరుకొంటున్నాను అన్నారు. (చదవండి: టాలీవుడ్‌కు వరాల జల్లు; కేసీఆర్‌కు చిరు కృతజ్ఞతలు) థియేటర్ల రీ ఓపెనింగ్.. కేసీఆర్‌కు ధన్యవాదాలు థియేటర్లు రీఓపెనింగ్ చేసుకునేలా జీవో ఇవ్వడంతో పాటు సినీ ఇండస్ట్రీకి లాభం చేకూర్చేలా పలు నిర్ణయాలు ప్రకటించినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలుగు ఇండస్ట్రీ తరపున తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ధన్యవాదాలు తెలిపింది. చిన్న సినిమాలకు జీఎస్టీ రీయింబర్స్మెంట్ ఇచ్చినందుకు.. థియేటర్లు ఇష్టప్రకారం షోలు పెంచుకునేందుకు.. సినిమా టికెట్ల ధరను 50 రూపాయల నుంచి 250 రూపాయల వరకు నిర్ణయించుకునేందుకు నిర్మాతలకు అధికారం ఇచ్చినందుకు.. సినీ కార్మికులకు రేషన్, హెల్త్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చినందుకు తెలుగు సినీ నిర్మాతల మండలి నుంచి ప్రెసిడెంట్ సి.కల్యాణ్, సెక్రటరీలు పసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల.. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడేందుకు తీవ్రంగా కృషి చేసిన హీరో మెగాస్టార్ చిరంజీవి, హీరో నాగార్జునకు కృతజ్జతలు తెలిపారు. అలాగే సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఇతర డిపార్ట్‌మెంట్స్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. -
హీరో భార్యకి నచ్చలేదని నన్ను తప్పించారు
హిందీ సినిమా ‘పింక్’ తర్వాత దాదాపు శక్తిమంతమైన పాత్రలే చేస్తున్నారు తాప్సీ. తెర మీద అన్యాయాలను ఎదిరించే ధైర్యం ఉన్న అమ్మాయి పాత్రలు చేస్తున్న ఆమె తెరవెనక కూడా తన మనసులోని మాటలను ధైర్యంగా చెబుతున్నారు. సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పలు సందర్భాల్లో చెప్పారామె. తాజాగా కొన్ని విషయాలను బయటపెట్టారు. అయితే తాను ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో వాళ్ల పేర్లను బయటపెట్టకుండా ‘ఆ హీరో’ అని సంబోధించారు. తాప్సీ మాట్లాడుతూ – ‘‘గతంలో ఓ హీరో భార్యకు నేను ఆ సినిమాలో నటించడం ఇష్టం లేకపోవడంతో నన్ను తప్పించి, వేరే హీరోయిన్ని తీసుకున్నారు. ఇంకో సినిమాకైతే హీరోకి నా డైలాగ్ నచ్చలేదు. దాంతో మార్చమన్నాడు. కానీ నేను తిరస్కరించాను. ఆ సినిమాకి నేను డబ్బింగ్ చెప్పుకున్నాను. కానీ నేను డైలాగ్ మార్చడానికి తిరస్కరించడం వల్ల డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో చెప్పించారు. అలాగే ఒక హీరో సరసన సినిమా కమిట్ అయ్యాక, ఆ హీరో అంతకు ముందు చేసిన సినిమా బాగా ఆడలేదని బడ్జెట్ కంట్రోల్ చేయాలని నా పారితోషికం తగ్గించుకోమన్నారు. ఇంకో హీరో అయితే నా ఇంట్రడక్షన్ సీన్‌ని మార్చాలని కోరాడు. ఎందుకంటే అతని ఇంట్రడక్షన్ సీన్‌ని డామినేట్ చేసే విధంగా ఉందని ఆ హీరోకి అనిపించిందట. ఇవన్నీ కూడా నా ముందు జరిగిన విషయాలు. ఇక వెనక ఎలాంటివి జరిగి ఉంటాయో’’ అన్నారు తాప్సీ. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కడా తగ్గడంలేదని తాప్సీ చెబుతూ – ‘‘కొన్నాళ్లుగా నాకు పూర్తి సంతృప్తినిచ్చే సినిమాలనే ఒప్పుకుంటున్నాను. అయితే కొందరు నా నిర్ణయం సరికాదన్నారు. ఇక ఎవరైనా హీరోయిన్ లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తే చాలు... ఆమెను హీరోలు తమ సినిమాల్లో కథానాయికగా తీసుకోవడానికి వెనకాడతారు. ఏది ఏమైనా నాకు తృప్తినిచ్చే సినిమాలే చేయాలంటే ఒక్కోసారి సాధ్యపడకపోవచ్చు. కానీ అలాంటి సినిమాలు చేయడంవల్ల ప్రతిరోజూ నేను ఆనందంగా ఉంటాను’’ అన్నారు. హిందీలో నామ్ షబానా, బద్లా, సాండ్ కీ ఆంఖ్, థప్పడ్.. ఇలా వరుసగా కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేస్తున్నారు తాప్సీ. ప్రస్తుతం హిందీలో చేస్తున్న ‘హసీన దిల్ రుబా’, ‘రష్మీ రాకెట్’ చిత్రాలు కూడా ఆ కోవకి చెందినవే. ఓ తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నారు. -
నన్ను నేను తెలుసుకుంటున్నాను!
‘రాఖీ రాఖీ రాఖీ.. నా కవ్వాసాకీ...’ అంటూ ‘రాఖీ’లో పాడిన పాట ద్వారా తెలుగు సినిమాకి పరిచయమయ్యారు మమతా మోహన్‌దాస్. ముందు తన గొంతును పరిచయం చేసి, తర్వాత తనలోని నటిని ‘యమదొంగ’ ద్వారా తెలుగుకి చూపించారు. మమతామో హన్ దాస్ సినిమాల్లోకి వచ్చి పదిహేనేళ్లు పూర్తయింది. 2005లో చేసిన మలయాళ చిత్రం ‘మయూకం’ ద్వారా హీరోయిన్ అయ్యారామె. ఈ పదిహేనేళ్ల ప్రయాణం గురించి మమతా మోహన్ దాస్ మాట్లాడుతూ – ‘‘2004లో దీపావళి బ్రేక్‌లో సరదాగా చేసిన ఓ పని (నటన) నా జీవితం అయిపోతుంది అనుకోలేదు. పదిహేనేళ్ల పాటు ఈ ఇండస్ట్రీలోనే కొనసాగుతానని అప్పుడు అనుకోనేలేదు. నాలో ఇందిర (‘మయూకం’లో ఆమె పాత్ర పేరు)ను చూసిన హరిహరన్ గారికి ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో నాతో నిలబడ్డ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మ్యూజిక్‌లో పెద్ద బ్రేక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ (‘రాఖీ’కి దేవి సంగీతదర్శకుడు)గారికి, నన్ను నమ్మిన నిర్మాతలకు, అందరికీ ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో ఎన్నో చాలెంజ్‌లు ఎదురయ్యాయి. వాటన్నింటినీ దాటుతూ నన్ను నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాను’’ అన్నారు. ఇటీవలే ఆమె నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. మలయాళంలో లేడీ ఓరియంటెడ్ సినిమాను నిర్మిస్తున్నారు మమతా మోహన్‌దాస్. -
మజా మాల్దీవ్స్
‘కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి’ అని పాడుకుంటారు ‘జీన్స్’ సినిమాలో హీరో. ఇప్పుడు సెలవు దొరికినప్పుడు కొందరు సెలబ్రిటీలు ఈ పాటనే గుర్తు చేసుకుంటున్నారు. బెస్ట్ దీవి ఏదంటే.. ‘మాల్దీవులు’ అంటున్నారు. ప్రస్తుతం వెకేషన్‌కు హాట్‌స్పాట్‌గా మారింది మాల్దీవులు. లాక్డౌన్ ఎక్కడివాళ్లను అక్కడే లాక్ చేసేసింది. అన్ని టెన్షన్లు మరచిపోయి కాస్త సేదతీరడం కోసం మాల్దీవులకు వెళ్లారు కొందరు స్టార్స్. ఈ రెండు వారాల్లోనే చాలామంది సెలబ్రిటీలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ విశేషాలు. వర్క్–వెకేషన్ వర్క్‌ను, వెకేషన్‌ను ఒకేసారి పూర్తి చేస్తున్నారు కత్రినా కైఫ్. షూటింగ్ నిమిత్తం ఇటీవల మాల్దీవ్స్ వెళ్లారామె. అయితే సినిమా షూటింగా? యాడ్ కోసమా? అనేది సీక్రెట్‌గా ఉంచారు. ఒకవైపు షూటింగ్లో పాల్గొంటూ మరోవైపు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మూమెంట్స్‌ని మాత్రం సీక్రెట్‌గా ఉంచకుండా ఫోటోలను షేర్ చేశారామె. బెస్ట్ బర్త్‌డే ఈ ఏడాది తన బర్త్‌డేను స్పెషల్‌గా చేసుకోవాలనుకున్నారు మెహరీన్. వెంటనే మాల్దీవులకు ప్రయాణం అయ్యారు. తన కుటుంబంతో కలసి మాల్దీవుల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారీ బ్యూటీ. ‘ఈ బర్త్‌డే చాలా స్పెషల్’ అంటూ ఫోటోలు షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. చిన్న బ్రేక్ గత వారం తాప్సీ కూడా మాల్దీవుల్లో సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. హిందీ చిత్రం ‘హసీనా దిల్రుబా’ చిత్రీకరణ పూర్తి చేసి చిన్న బ్రేక్ తీసుకున్నారు తాప్సీ. కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యేలోగా తన స్నేహితులతో కలసి మాల్దీవుల్లో హాలిడేయింగ్ చేశారు. హనీమూన్ కొత్త కపుల్ కాజల్ అగర్వాల్– గౌతమ్ కిచ్లు ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హనీమూన్ కోసం ఈ జంట ఎంచుకున్న చోటు మాల్దీవులు. అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్. పుట్టినరోజు వేడుకలు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన పుట్టినరోజును జరుపుకోవడానికి భర్త కల్యాణ్ దేవ్‌తో కలసి మాల్దీవులు వెళ్లారు. కొన్ని రోజుల పాటు ఈ బర్త్‌డే వీక్‌ను ఎంజాయ్ చేశారు ఈ కపుల్. ఇటీవలే మాల్దీవుల నుంచి తిరిగొచ్చారు కూడా. -
క్షేమం కోరి...
బాలీవుడ్లో అంతా పండగ వాతావరణం కనిపించింది. ఈ సందడంతా ‘కర్వా చౌత్’ కోసమే. భర్త శ్రేయస్సు కోసం రోజంతా ఉపవాసం ఉండి, భర్తతో కలిసి చంద్రుణ్ణి చూశాక భార్య ఉపవాసాన్ని విరమించే పండగ ఇది. ప్రతి ఏడాదీ ఈ పండగను ఘనంగా జరుపుకునేవారిలో శిల్పా శెట్టి ముందుంటారు. ఈసారి కూడా మిస్ కాలేదు. కష్టకాలంలో (కేన్సర్ బారిన పడటం, చికిత్స చేయించుకుని ఆరోగ్యవంతురాలవడం) తోడున్న భర్త కోసం సోనాలీ బింద్రే ఉపవాసం ఆచరించారు. విదేశీ గాయకుడు నిక్ జోనస్‌ని పెళ్లాడిన ప్రియాంకా చోప్రా ‘లవ్ యు నిక్’ అంటూ లాస్ ఏంజిల్స్‌లో పండగ చేసుకున్నారు. కాజోల్, రవీనా టాండన్, బిపాసా బసు తదితరులు కూడా శ్రద్ధగా పూజలు చేశారు. కొత్త దంపతులు కాజల్ అగర్వాల్–గౌతమ్, వీరికన్నా ముందు ఆగస్ట్ 8న పెళ్లి చేసుకున్న రానా–మిహికా కూడా సంప్రదాయాన్ని పాటించారు. డిజైనర్ శారీ, చక్కని నగలతో తమ భర్తతో కలిసి దిగిన ఫొటోలను అందాల భామలు షేర్ చేశారు. రానా, మిహీకా; ∙నక్తో ప్రియాంకా చోప్రా; రవీనా టాండన్; భర్తతో సోనాలీ బింద్రే; భర్తతో బిపాసా -
నవంబర్‌లో ‘స్టార్స్’ హుషార్
స్టార్స్ ఉంటే ఆకాశం నిండుగా ఉంటుంది. స్టార్స్ ఉంటే సినిమాలు సందడిగా ఉంటాయి. కోవిడ్ వల్ల సినిమాల చిత్రీకరణలు అటూఇటూ అయ్యాయి. స్టార్స్ సినిమాలంటే భారీ కాన్వాస్‌తో కూడుకున్నవి. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చి పక్కా ప్లానింగ్‌తో రంగంలోకి దిగుతున్నారు. ఈ నవంబర్‌లో చాలా మంది స్టార్స్ మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. కొందరు కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నారు. మరికొందరు మధ్యలో ఉన్నవాటిని ముగించనున్నారు. ఆ విశేషాలు. వేసవిలో మెగామాస్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఈ సినిమా చిత్రీకరణ ఈ నెల 9న మళ్లీ ఆరంభం కానుంది. ‘నెలరోజుల పాటు సాగే షెడ్యూల్‌తో చాలా శాతం చిత్రీకరణ పూర్తి చేయనున్నాం. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్‌లో మెగామాస్ చూస్తారు’ అని చిత్రబృందం పేర్కొంది. ఎంట్రీ షురూ బాలకృష్ణ–బోయపాటి కాంబినేషన్లో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. అయితే నవంబర్ 16 నుంచి బాలకృష్ణ లొకేషన్ ఎంట్రీ షురూ అయిందని తెలిసింది. క్రాక్ టు ఖిలాడీ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ నుంచి పక్కా పోకిరిగా మారబోతున్నారు రవితేజ. ఆయన ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నారు. అందులో రవితేజ పోలీస్‌గా కనిపిస్తారు. ఇది పూర్తి కాగానే రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా ప్రారంభించనున్నారు. ఇందులో ఆయన ఖిలాడీగా కనిపిస్తారు. నవంబర్ చివరి వారంలో చిత్రీకరణలో పాల్గొంటారట రవితేజ. అడవిలోకి పుష్ప అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రీకరణ కోసం నవంబర్ 6 నుంచి 10 మధ్యలో రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అడవులకు ప్రయాణం కానుంది యూనిట్. 30 రోజుల పాటు దట్టమైన అడవుల్లో చిత్రీకరణ జరపనున్నారు. ముంబైలో ఫైటర్ పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ఫైటర్’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతోంది. ఇందులో కిక్ బాక్సర్‌గా విజయ్ దేవరకొండ కనిపిస్తారు. ఈ సినిమా చిత్రీకరణ నవంబర్ మూడు లేదా నాలుగో వారం నుంచి ముంబైలో ఆరంభం కానుంది. శ్రీదేవి సోడా సెంటర్ సుధీర్‌బాబు హీరోగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే కొత్త చిత్రం ఇటీవలే ప్రకటించారు. ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకుడు. గోదావరి పరిసర ప్రాంతాల్లో నవంబర్ రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుంది. వచ్చే ఏడాది సంక్రాంతి, వేసవికి సినిమాలను థియేటర్స్‌లోకి తీసుకురావడానికి చిత్రబృందాలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ ఏడాది మిస్సయిన జోష్ని వచ్చే ఏడాది రెండింతలు ఇవ్వడానికి ఇండస్ట్రీ రెడీ అవుతోంది. ఫుల్ స్పీడ్ స్టార్స్ అందరిలో ముందుగా షూటింగ్లో పాల్గొన్న హీరో నాగార్జున. ప్రస్తుతం ‘వైల్డ్ డాగ్’ను పూర్తి చేసే పనిలో ఉన్నారాయన. అలాగే పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’, ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ‘ఆర్ఆర్ఆర్’, నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’, శర్వానంద్ ‘శ్రీకారం’, నాగశౌర్య కొత్త చిత్రం, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ సినిమాలు ఫుల్ స్పీడ్‌లో షూటింగ్స్ జరుగుతున్నాయి. -
ఐదు కోట్ల ప్రేమ
‘‘మన చుట్టూ ఉన్నవాళ్లతో, మనతో మనం ఏర్పరుచుకునే బంధాలే మన జీవితం. నువ్వు అదీ ఇదీ.. అలా ఇలా అని తక్కువ చేసే అర్హత ఎవ్వరికీ ఉండదు. మరీ ముఖ్యంగా కీబోర్డ్ వెనక దాక్కునేవాళ్లకు (సోషల్ మీడియాలో విమర్శలు చేసేవాళ్లను ఉద్దేశిస్తూ)’’ అన్నారు ఆలియా భట్. ఇన్‌స్టాగ్రామ్‌లో తాజాగా 50 మిలియన్ల అభిమానులను (5 కోట్ల మంది) సంపాదించుకున్నారామె. ఈ సందర్భంగా ఆలియా మాట్లాడుతూ –‘‘నాకు 50 మిలియన్లు ప్రేమను అందించిన అభిమానులందరికీ నా ప్రేమను ఇస్తున్నాను. ఈ సందర్భంగా గత కొన్ని నెలల్లో నేను నేర్చుకున్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సోషల్ మీడియా మనందర్నీ ఒక్కచోట చేరుస్తుంది. కనెక్ట్ చేస్తుంది. వినోదం ఇస్తుంది. కానీ అందులో ఉండేది నిజమైన మనం కాదు. అది మనం కానే కాదు. అందుకే ఇప్పుడు ఐదు కోట్ల మంది చూపించిన అభిమానానికి ఎంత ఆనందపడ్డానో ఒకప్పుడు ఐదు వేల మంది, యాభైవేల మంది, యాభై లక్షలమంది ఉన్నప్పుడూ అంతే ఆనందపడ్డాను. ఇంకో విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మీకంటూ కొంత టైమ్ కేటాయించుకుని మీ శరీరాన్ని, మనసుని అభినందించండి. మీరేంటో తెలుసుకోండి. ఎందుకంటే సోషల్ మీడియాలో వచ్చే ఒక లైక్, డిస్లైక్, ఒక అభినందన, ఒక విమర్శ... వీటి తాలూకు ప్రభావం మీ మీద పడకూడదు’’ అన్నారు. చిత్రపరిశ్రమలో వారసత్వం గురించి జరిగిన చర్చలో ప్రముఖ దర్శక–నిర్మాత మహేశ్‌భట్ కుమార్తెగా ఆలియా సోషల్ మీడియాలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అవి తనపై ఎలాంటి ప్రభావం చూపించలేదని చెప్పడానికే ఆలియా భట్ ఈ విధంగా చెప్పి ఉంటారని ఊహించవచ్చు. -
సినిమా ప్రేమికులకు డబుల్ పండగ
ఆదివారం దశమి. అందరికీ పండగ. సినిమా ప్రేమికులకు డబుల్ పండగలా మారింది. కొన్ని నెలలుగా కొత్త సినిమా కబుర్లు లేక డల్‌గా ఉన్నారంతా. అయితే పండగ రోజు వాళ్లలో జోష్ నింపాయి సినిమా విశేషాలు. కొత్త సినిమాల ముహూర్తాలు, టీజర్లు, లుక్స్ రిలీజులు, విడుదల తేదీ ప్రకటనలు.. అబ్బో సందడే సందడి. పండగే పండగ. ఆ విశేషాలన్నీ మీ కోసం. రెండో సినిమా షురూ ‘మత్తువదలరా’తో హీరోగా పరిచయమైన సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహ కోడూరి రెండో చిత్రం ఆరంభమైంది. మనికాంత్ దర్శకత్వంలో సాయి కొర్రపాటితో కలిసి రజినీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రా శుక్ల, మిషా నారంగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రచయిత పురాణపండ శ్రీనివాస్ కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి క్లాప్ ఇచ్చారు. యం.యం. కీరవాణి స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, కెమెరా: సురేష్ రగుతు. నాగచైతన్య థాంక్యూ అక్కినేని నాగచైతన్య హీరోగా విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్సియర్ సత్య రంగయ్య క్లాప్ కొట్టారు. ‘‘ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్ , కెమెరా: పీసీ శ్రీరామ్. జోహార్లు శర్వానంద్, రష్మిక మందన్నా జంటగా ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా తిరుపతిలో ప్రారంభం అయ్యింది. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కెమెరా స్విచాన్ చెయ్యగా, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి క్లాప్‌నిచ్చారు. అనగాని సత్యప్రసాద్, 14 రీల్స్ నిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట స్క్రిప్ట్‌ను అందించారు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఎస్.ఎల్.వి.సి పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంగ్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. డిఫరెంట్ సింగరాయ్ నాని హీరోగా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించనున్న ఈ సినిమా డిసెంబరులో సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయిపల్లవి, క్రితి శెట్టి కథానాయికలు. ‘‘ఈ సినిమాలో నాని కొత్తగా కనిపించబోతున్నాడు. నాని లుక్, డ్రెస్సింగ్ వైవిధ్యంగా ఉండబోతున్నాయి. డిసెంబర్ నుండి నాని ఈ షూటింగ్లో పాల్గొనబోతున్నాడు’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: సాను జాన్ వర్గీస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). మళ్లీ పోలీస్ ‘గబ్బర్‌సింగ్’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించిన పవన్ కల్యాణ్ మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో నటించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో రూపొందనున్న ఈచిత్రానికి సంగీత దర్శకుడు: తమన్, కెమెరా: ప్రసాద్ మూరెళ్ల. పవర్ఫుల్ ఆద్య ‘బద్రి, జానీ’ వంటి చిత్రాలతో హీరోయిన్గా ఆకట్టుకున్న రేణూ దేశాయ్ తాజాగా ఒక పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ ప్యాన్ ఇండియా వెబ్ సిరీస్ ‘ఆద్య’తో తన సెకండ్ ఇన్నింగ్స్‌కి శ్రీకారం చుట్టారు. ఎం.ఆర్. కృష్ణ మామిడాల దర్శకత్వంలో యు అండ్ ఐ పద్మనాభరెడ్డి సమర్పణలో డి.ఎస్.కె.స్క్రీన్–సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై డి.ఎస్.రావు– రజనీకాంత్. ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ స్క్రిప్ట్‌ను ప్రముఖ పారిశ్రామికవేత్త చింతిరెడ్డి అనంత్ రెడ్డి దర్శకుడు కృష్ణకు అందించారు. రేణూ దేశాయ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు నీలకంఠ కెమెరా స్విచ్చాన్ చేయగా, డి.ఎస్.రావు క్లాప్ ఇచ్చారు. ‘‘దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యే గొప్ప కథ ఇది’’ అన్నారు రేణూ దేశాయ్. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ చైతన్యరెడ్డి .ఎస్. పేరు జోకర్ ‘మేరా నామ్ జోకర్’ పేరుతో ఓ సినిమా ప్రారంభం అయింది. 4ఏయం మూవీ మేకర్స్ బ్యానర్‌పై సూర్యగోపాల్ను దర్శకునిగా పరిచయం చేస్తూ శివ ఎన్, ఎస్.జి. కృష్ణ, నవీన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన తొలి షాట్‌కు దర్శకుడు క్లాప్ ఇచ్చి, స్క్రిప్ట్‌ను దర్శకుడు గోపాల్‌కి అందించారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో ఆరంభం కానుంది. కోతికొమ్మచ్చి మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్నలు హీరోలుగా ‘కోతికొమ్మచ్చి’ సినిమా ప్రారంభం అయ్యింది. వేగేశ్న సతీశ్ దర్శకత్వంలో లక్ష్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎల్.వి సత్యనారాయణ నిర్మిస్తున్నారు. ‘దిల్’ రాజు క్లాప్‌నివ్వగా, ‘అల్లరి’ నరేశ్ కెమెరా స్విచాన్ చేశారు. ‘‘యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్‌ను నవంబర్ 3న అమలాపురంలో ప్రారంభిస్తాం’’ అన్నారు దర్శకుడు వేగేశ్న సతీశ్. అమ్మ సెంటిమెంట్‌తో... హాస్యనటుడు గౌతంరాజు కుమారుడు కృష్ణ హీరోగా ఆయుషి హీరోయిన్గా నూతన చిత్రం ప్రారంభమయింది. డి.ఎస్. రాథోడ్ దర్శకత్వంలో డీఎస్ఆర్ ఫిలిం ప్రొడక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి తనికెళ్ల భరణి క్లాప్‌నివ్వగా, కె.యస్. రవికుమార్ కెమెరా స్విచాన్ చేశారు. ‘‘అమ్మ సెంటిమెంట్‌తో వస్తున్న డిఫరెంట్ చిత్రం ఇది. తాండూర్‌లో నవంబర్ 8న షూటింగ్ మొదలు పెడతాం. రెండో షెడ్యూల్‌ను నవంబర్ చివరివారంలో హైదరాబాద్‌లో జరిపి, తర్వాత బ్యాంకాక్ వెళతాం’’ అన్నారు దర్శకుడు. సంక్రాంతికి వస్తున్నాం కరోనా వల్ల ఈ ఏడాది కొత్త సినిమాల విడుదల సందడంతా మిస్సయింది. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి సందడి రెండింతలు ఉండేలా ఉంది. సంక్రాంతి బరిలో దిగడానికి చాలా సినిమాలు సిద్ధం అవుతున్నట్టు కనిపిస్తోంది. దసరా పండగ సందర్భంగా సంక్రాంతికి సీట్‌ను పలు సినిమాలు బుక్ చేసుకున్నాయి. ఆ విశేషాలు. ‘డాన్ శీను, బలుపు’ తర్వాత రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘క్రాక్’. శ్రుతీహాసన్ హీరోయిన్. పవర్ఫుల్ పోలీస్ కథగా ఈ సినిమా ఉంటుంది. ‘సంక్రాంతికి థియేటర్స్‌లో క్రాక్ పెట్టిద్దాం’ అన్నారు రవితేజ. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటిస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. పూజా హెగ్డే కథానాయిక. దసరా సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేసి, సంక్రాంతికి వస్తున్నట్టు ప్రకటించారు. అలాగే కొన్ని రోజుల కిత్రమే రానా కూడా సంక్రాంతికి రాబోతున్నట్టు ప్రకటించారు. ఆయన నటించిన ‘అరణ్య’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. మరి.. సంక్రాంతి రేసులో మరికొన్ని సినిమాలు జాయిన్ అవుతాయా? చూడాలి. ప్రేమ.. పెళ్లిళ్లు ‘‘1992’ టైటిల్‌తో పాటు నేను విడుదల చేసిన పాట ఆసక్తికరంగా ఉంది. కొత్తవారు చేస్తున్న ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. శివ పాలమూరి దర్శకత్వంలో మహి రాథోడ్ హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘1992’. ఈ సినిమాలోని లిరికల్ వీడియోస్‌ని వీవీ వినాయక్, నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ‘‘నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్లు ఎలా ఉన్నాయనే కథాంశంతో ఈ సినిమా రూపొందించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు హీరో, నిర్మాత మహి రాథోడ్. అద్దెకు బాయ్ ఫ్రెండ్ విశ్వంత్ దుద్దుంపూడి, మాళవిక సతీషన్ జంటగా సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్’. స్వస్తిక సినిమా మరియు ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై వేణుమాధవ్ పెద్ది, కె. నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలోని విశ్వంత్, మాళవిక ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అశ్రిన్ రెడ్డి, సంగీతం: గోపి సుందర్, కెమెరా: బాల సరస్వతి. ∙బీవీఎస్ రవి, విక్రమ్ కె.కుమార్, శిరీష్, పీసీ శ్రీరామ్, ‘దిల్’రాజు నాగచైతన్య రవితేజ, శ్రుతీహాసన్ -
దసరదా లేదు
సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి వంటివి ఇండస్ట్రీకు చాలా ఇష్టమైన సీజన్లు. ఈ సమయంలో థియేటర్స్ నిండుగా ఉంటాయి. సినిమా ఆడితే లాభాలు మెండుగా ఉంటాయి. పండగలే ఫ్యామిలీలను థియేటర్స్‌కు కదిలిస్తాయి. అయితే ఈ ఏడాది కోవిడ్ వల్ల సమ్మర్ పోయింది. చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే థియేటర్స్ తెరిచారు. కానీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులు థియేటర్స్‌లో లేరు. దసరాకి కూడా థియేటర్స్ బిజినెస్‌కు సందడి లేనట్టే. కొత్త సినిమాలేవి? థియేటర్స్‌కి ప్రేక్షకులు రావాలంటే కొత్త సినిమా ఉండాలి. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తున్నట్టు అనిపిస్తేనే కొత్త సినిమా విడుదల చేయగలం అన్నట్లుంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ పరిస్థితి. పాత సినిమాలను ప్రదర్శిస్తూ థియేటర్స్‌ను నడిపిస్తున్నారు. అయితే వస్తున్న ప్రేక్షకుల సంఖ్య వేళ్ల మీద లెక్కెట్టొచ్చు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఈజీగా మూడు కొత్త రిలీజ్లు ఉండే సీజన్ దసరా. ఈసారి ఒక్కటీ లేదు. కొత్త సినిమాలు ఎప్పుడు విడుదలకు సిద్ధం అవుతాయో అర్థం కాని పరిస్థితి. సినిమాలన్నీ సంక్రాంతికి సిద్ధం చేసే పనిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. డిజిటల్ దసరా థియేటర్స్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న నేపథ్యంలో ఓటీటీకి బాగా డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. థియేటర్స్ ప్రారంభించినప్పటికీ ఓటీటీలో కొత్త సినిమాలు, సిరీస్‌లు, షోలు విరివిగా విడుదలవుతున్నాయి. బాలకృష్ణ దర్శకత్వంలో ‘నర్తనశాల’ అనే చిత్రం అప్పట్లో ప్రారంభం అయింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పూర్తికాలేదు. సౌందర్య, శ్రీహరి ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే చిత్రీకరించిన కొంత భాగాన్ని ఓటీటీలో విడుదల చేయాలని నిశ్చయించుకున్నారు. సుహాస్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ప్రేమకథా చిత్రం ‘కలర్ ఫోటో’ ఆహాలో విడుదలయింది. సూపర్‌హిట్ సిరీస్ ‘మిర్జాపూర్’కి సీక్వెల్‌గా ‘మిర్జాపూర్ 2’ తాజాగా అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. టబు, ఇషాన్ కట్టర్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘ఎ సూటబుల్ బాయ్’ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇలా సినిమాలు, సిరీస్‌లతో డిజిటల్లో దసరా సందడి కనబడుతోంది. సందడి మళ్లీ సంక్రాంతికేనా? దీపావళి, క్రిస్మస్ సీజన్లోనూ కొత్త సినిమాలు విడుదలవుతున్నట్టు అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఆల్రెడీ రానా నటించిన ‘అరణ్య’ సినిమాను సంక్రాంతికి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. అలాగే అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తదితర చిత్రాలు కూడా పండగకి రానున్నాయి. మరి.. కొత్త సినిమాలతో సంక్రాంతికైనా థియేటర్లు కళకళాలాడతాయా? చూడాలి. -
ప్రేక్షకులు ఎక్కడ?
నిండుగా ఉంటేనే థియేటర్స్‌కి అందం. థియేటర్స్ నడిపేవారికి ఆనందం. థియేటర్ గేట్‌కి హౌస్‌ఫుల్ బోర్డ్‌కి మించిన మెడల్ ఏముంటుంది? అయితే కరోనా థియేటర్స్ బిజినెస్‌ను బాగా దెబ్బకొట్టింది. ఏడు నెలలు ఖాళీగా, సందడి లేకుండా ఉండిపోయాయి హాళ్లు. థియేటర్స్ మళ్లీ తెర్చుకోండి, కానీ కొన్ని షరతులు అంది ప్రభుత్వం. 50 శాతం మించి ఆడియన్స్‌కు అనుమతి లేదు. అక్టోబర్ 15న దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయ్యాయి. మరి థియేటర్స్‌కి ప్రేక్షకులు వచ్చారా? పరిస్థితి ఏంటి? చూద్దాం. లాక్డౌన్ సమయంలో సినిమా హాళ్లు మూసివేసి ఉన్నప్పుడు, ప్రేక్షకులు వస్తారో రారా అనేది పక్కనపెడితే ముందైతే థియేటర్స్ తెరవాలి, దాన్ని నమ్ముకున్నవాళ్ల పరిస్థితి ఏంటి? అనే వాదనలు వినిపించాయి. జాగ్రత్తలు తీసుకుందాం, జనమే అలవాటు పడతారు అనే ధైర్యం కూడా ఉంది థియేటర్స్ యాజమాన్యంలో. అక్టోబర్ 15నుంచి థియేటర్స్ తెరుచుకోమని, గైడ్‌లైన్స్ ఇచ్చింది ప్రభుత్వం. 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతి ఉండడంతో కొత్త చిత్రాలేవీ రిలీజ్ చేయలేదు. గతంలో విడుదలైన చిత్రాలనే మళ్లీ ప్రదర్శిస్తూ థియేటర్స్‌ను ప్రారంభించారు. చాలా ప్రాంతాల్లో మునుపటికంటే టికెట్ రేట్ చాలా తగ్గించారు. ప్రేక్షకులను థియేటర్స్‌కి ఆకర్షించే భాగంలో ఇదొకటì . అయితే థియేటర్స్‌కి వస్తున్న ప్రేక్షకుల సంఖ్య చాలా చాలా తక్కువ ఉండటం షాక్‌కి గురి చేస్తోంది. పలు చోట్ల పట్టుమని పదిమంది కూడా కనిపించలేదట. ఢిల్లీలో... ఢిల్లీలోని గ్రేటర్ కైలాస్ ప్రాంతంలో కోవిడ్ గైడ్‌లైన్స్‌తో థియేటర్ గేట్లు తెరిచారు. 300 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్లో 150 వరకు అనుమతిస్తూ, టికెట్ కౌంటర్ వద్ద సిబ్బంది టికెట్లు తెంచడానికి రెడీ అయ్యారు. ఏడు నెలలవుతోంది, టికెట్లు చింపి. ఎంతో ఆసక్తిగా ఎదురు చూసినవాళ్లకు చిన్న షాక్ తగిలింది. కేవలం ఐదుగురు మాత్రమే సినిమా చూడటానికి వచ్చారు. ఇంకెవరైనా వస్తారని అరగంట ఆగారు. ఉహూ... వచ్చిన ఆ ఐదుగురికి సినిమా వేశారు. ‘ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే కుతూహలంతోనే వచ్చాను’ అని సమాధానమిచ్చాడో ప్రేక్షకుడు. గురువారం మ్యాట్నీ షో పరిస్థితి ఇది. శుక్రవారం కుటుంబంతో కలసి సినిమా చూడాలని ముందు రోజు టికెట్స్ బుక్ చేసుకోవడానికి ఆ థియేటర్‌కి వచ్చిన వ్యక్తి, ‘ఇంకా ఇంట్లోనే ఉంటే మానసికంగా ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. అందుకే థియేటర్లో సినిమా చూడాలనుకున్నాం’ అనడం విశేషం. వైజాగ్‌లో.. వైజాగ్‌లో వరుణ్ ఐనాక్స్, పూర్ణ అనే థియేటర్‌ను ఓపెన్ చేశారు. ‘అల వైకుంఠపురములో, భీష్మ’ చిత్రాలను ప్రదర్శిస్తున్నారు. కానీ ప్రేక్షకుల సంఖ్య తక్కువగానే ఉంది. ఇక్కడ కూడా ప్రేక్షకుల సంఖ్య పదికి దాటలేదు. వైజాగ్‌లో రాత్రి 7 గంటల షో ఎప్పుడూ హౌస్‌ఫుల్. అది కూడా ఏడుగురుకంటే ఎక్కువ మంది లేరట. ఇలా షోకి వెయ్యి రూపాయిల వసూళ్లు కూడా రావడంలేదట. ఓ మూడు పాత ఇంగ్లిష్ సినిమాలను రిలీజ్‌కి రెడీ చేసి, ప్రేక్షకులు రాకపోవడంతో షోలు రద్దు కూడా చేశారని సమాచారం. ఖర్చులు కూడా మిగలవు థియేటర్స్‌లో ఒక్క షో వేస్తే... తెగిన టికెట్లు, కరెంటు బిల్లులు, థియేటర్ రెంటు ఇలా ప్రతీది లెక్క కట్టుకుని మిగిలినది లాభం. ఇక వసూళ్లు వెయ్యి రూపాయిలైతే కరెంటు బిల్లు ఖర్చులు కూడా రావు. ఇలా నడపడమెందుకు? అనే ఆలోచన కూడా రాకమానదు. ఈ క్లిష్ట పరిస్థితి గురించి చర్చించడానికి థియేటర్స్ యూనియన్‌కి సంబంధించి త్వరలో ఓ మీటింగ్ జరిగే అవకాశం ఉందని తెలిసింది. పాత సినిమాలు కదా, థియేటర్స్‌కి ఏం వెళ్తాం అని ప్రేక్షకులు భావిస్తున్నారా? కరోనా టైమ్‌లో ఇంటిపట్టున ఉండటం బెటర్ అనుకుంటున్నారా? కొత్త సినిమాలు పడితే థియేటర్స్ వైపు నడుస్తారా? థియేటర్స్‌కు మళ్లీ పూర్వ వైభవం ఎప్పుడు? ప్రస్తుతానికి సమాధానం దొరకని ప్రశ్నలే. -
స్టార్స్ స్టార్ట్ అయ్యారు
షూటింగ్ లొకేషన్ అంటేనే సందడి. వందల మంది సవ్వడి. కరోనా వల్ల మొన్నటి వరకూ ఇండస్ట్రీని నిశ్శబ్దం ఆవహించింది. మెల్లిగా చిత్రీకరణలు ప్రారంభం అవుతున్నాయి. స్టార్స్ అందరూ సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. గత సోమవారం నుంచి శనివారం వరకూ చిత్రీకరణలు ఎక్కువ ప్రారంభం అయ్యాయి. చాలామంది స్టార్స్ కూడా షూటింగ్‌కి స్టార్ట్ అయ్యారు... ఉత్సాహంగా సెట్లోకి అడుగుపెట్టారు. ఆ వివరాలు. కరోనా వల్ల విదేశీ చిత్రీకరణలు సాధ్యమేనా? అనే సందేహం అందరిలోనూ ఉంది. కానీ ప్రభాస్ అండ్ టీమ్ షూటింగ్‌కి ఇటలీ వెళ్లి సాధ్యమే అన్నారు. అటు బాలీవుడ్లో లాక్డౌన్ తర్వాత తొలిసారి విదేశాలకు వెళ్లిన టీమ్ అక్షయ్ కుమార్ ‘బెల్‌బాటమ్’. తెలుగు నుంచి ప్రభాస్ నటిస్తున్న ‘రాధే శ్యామ్’ విదేశాలు వెళ్లింది. ప్రభాస్, పూజా హెగ్డే చిత్రీకరణ ప్రారంభించారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణ కూడా ఈ వారంలోనే ప్రారంభం అయింది. ఏడు నెలల గ్యాప్ తర్వాత సెట్స్ దుమ్ము దులిపి షూటింగ్ షురూ చేశారు దర్శకుడు రాజమౌళి అండ్ టీమ్. ఈ చిత్రీకరణతో మళ్లీ సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్, రామ్‌చరణ్. ఏకధాటిగా రెండు నెలలు ఈ చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది. ‘క్రాక్’తో మరోసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయ్యారు రవితేజ. ఆయన కూడా విలన్స్‌ను రఫ్ఫాడించడం ఈ వారం నుంచే మొదలుపెట్టారు. సినిమా పూర్తయ్యేవరకూ చిత్రీకరణ జరపనున్నారట ‘క్రాక్’ టీమ్. టక్ చేసుకుని మళ్లీ సెట్స్‌లోకి అడుగుపెట్టారు నాని. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టక్ జగదీష్’. ఈ సినిమా షూట్‌లోకి ఈ మధ్యే జాయిన్ అయ్యారు నాని. తన రెండు చిత్రాలు తిరిగి ప్రారంభించారు శర్వానంద్. ఆయన నటిస్తున్న తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం, ‘శ్రీకారం’ సినిమాలు మొదలయ్యాయి. సంక్రాంతికి ‘శ్రీకారం’తో థియేటర్స్‌లో కలుస్తారట శర్వా. కాంట్రవర్శీలకు కాస్త బ్రేకిచ్చి తిరిగి పనిలో పడ్డారు కంగనా రనౌత్. జయలలిత బయోపిక్ ‘తలైవి’లో ఆమె నటిస్తున్నారు. చెన్నైలో కంగనా మీద కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కత్రినా కైఫ్ కూడా షూటింగ్ మొదలుపెట్టారు. ‘ఫోన్ బూత్’ అనే కొత్త సినిమాను మొన్నే ప్రారంభించారు. రష్మికా మందన్నా కూడా ‘సుల్తాన్’ సినిమా సెట్లో ఈ మధ్యే జాయిన్ అయి, పూర్తి చేశారు. సంజయ్ లీలా భన్సాలీ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘గంగూభాయ్ కతియావాడీ’ని పునః ప్రారంభించారు. గంగూభాయ్‌గా ఆలియా భట్ చిత్రీకరణతో బిజీ అయ్యారు. కోవిడ్ జాగ్రత్తలను పాటిస్తూనే సినిమాలన్నీ చిత్రీకరిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా పనులు జరగాలి. ఇండస్ట్రీ పరిగెత్తాలి. అందరికీ విజయం లభించాలి. -
ఇండస్ట్రీ నష్టాన్ని ఎలా అధిగమించాలి?
‘తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్’ అధ్యక్షుడు సి.కళ్యాణ్, కార్యదర్శులు టి. ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ– ‘‘షూటింగ్స్ ఆగిపోవడం, థియేటర్స్ మూతపడిన కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో జరిగిన నష్టాన్ని ఎలా అధిగమించాలి? ఎవరెవరు ఏయే త్యాగాలు చేయాలి? అనే అంశంపై అన్ని శాఖలవారూ చర్చిస్తున్నాం. ఈ చర్చలకు అందరూ పాజిటీవ్‌గా స్పందిస్తున్నారు. ఈ సమావేశాల వివరాలను త్వరలో తెలుపుతాం’’ అన్నారు. -
మార్పు అవసరం
‘‘థియేటర్, ఓటీటీ.. రెండూ వేరు అయిన ప్పటికీ ఓటీటీలో సినిమాల విడుదలను పాజిటివ్‌గా చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్లాలంటే టెక్నాలజీ పరంగా ఆడియన్స్‌కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో ఇలాంటి మార్పులు రావడం అవసరం. వాటిని అందరూ స్వాగతించడం కూడా చాలా అవసరం’’ అన్నారు అనుష్క. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్ జంటగా అంజలి ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. కోన ఫిల్మ్ కార్పొరేషన్ సహకారంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర ్భంగా అనుష్క చెప్పిన విశేషాలు. ‘భాగమతి’ చిత్రం తర్వాత కావాలని గ్యాప్ తీసుకున్నా. ఆ సమయంలో కోన వెంకట్‌గారు, హేమంత్ గారితో ‘నిశ్శబ్దం’ కథ వినిపించారు. ఇందులో నా పాత్ర వైవిధ్యంగా ఉండటంతో పాటు సినిమా కూడా బాగుంటుందని బలంగా అనిపించి, నటించడానికి ఒప్పుకున్నాను. తొలిసారి నేను నటించిన సినిమా ఓటీటీలో విడుదలవ్వడం నాకు కాస్త కొత్తగా అనిపిస్తోంది. ఈ చిత్రంలో నాది చెవిటి, మూగ అమ్మాయి పాత్ర. నేను ఈ సినిమా చేయడానికి కారణం నా పాత్రకున్న ప్రత్యేకతే. ఈ పాత్ర కోసం కొన్నాళ్లు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను. అయితే షూటింగ్‌కి అమెరికా వెళ్లాక అందరూ ఎక్కువగా వాడే సైన్ లాంగ్వేజ్‌ని అక్కడి ఓ 14 ఏళ్ల అమ్మాయి దగ్గర శిక్షణ తీసుకుని నటించాను. మాధవన్‌గారితో నా కెరీర్ తొలినాళ్లలో నటించాను. మళ్లీ ఇన్నాళ్లకు నటించడం వండర్‌ఫుల్‌గా అనిపించింది. ఈ కథ కేవలం మా ఇద్దరి చుట్టూనే తిరగదు.. స్క్రీన్‌ప్లే ముందుకు నడిపించడంలో మిగతా పాత్రలు కూడా కీలకంగా మారుతుంటాయి. హేమంత్ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కించారు. ఈ ప్రయోగాత్మక కథని అమెరికా బ్యాక్‌డ్రాప్‌లో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించడం అంత సులువు కాదు.. దానికి చాలా ప్యాషన్, ధైర్యం కావాలి.. ఆ రెండూ ఉన్న నిర్మాతలు విశ్వప్రసాద్, కోన వెంకట్గార్లు. థ్రిల్లర్ సినిమాలకి నేపథ్య సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఓటీటీలో విడుదలవడంలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఇదే. థియేటర్స్‌లో ఉండే సౌండ్ సిస్టమ్, ఆడియో క్వాలిటీని ప్రేక్షకులు మిస్ అవుతారు. అయితే హెడ్ ఫోన్స్, హోమ్ థియేటర్స్ ఈ లోపాన్ని కవర్ చేస్తాయి. మా సినిమాకు మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్స్ పెద్ద ఎస్సెట్స్. గోపీ సుందర్ ఇచ్చిన ఆర్ఆర్ సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చేసింది. ఫార్వార్డ్ చేయకుండా ‘నిశ్శబ్దం’ సినిమాను ప్రేక్షకులంతా ఓ ఫ్లోలో చూడాలని మనవి చేస్తున్నా. -
స్వీట్ మెమోరీస్ విత్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
విజయంలో ఆయన పాట ఉంది.. అపజయంలోనూ ఆయన పాట ఉంది. ప్రేమలో ఆయన పాట ఉంది.. విరహంలోనూ ఆయన పాట ఉంది.. ఆనందంలో ఆయన పాట ఉంది.. విషాదంలోనూ ఆయన పాట ఉంది.. మనిషి తాలూకు ప్రతి భావోద్వేగంలో బాలు పాట ఉంది. అందుకే బాలు ఎప్పటికీ ఉంటారు... ఆయన పాట ద్వారా గుర్తుండిపోతారు. బాలూ ఎంతోమంది సీనియర్ గాయనీమణులతో పాడారు. బాలూతో పాడే అవకాశం దక్కించుకున్న యువ గాయనీమణులు ఉష, కౌసల్య ఏమంటున్నారో తెలుసుకుందాం. అలాగే బాలు గురించి ప్రముఖులు చెప్పిన విశేషాలు నేనేమన్నా రాక్షసుడినా అన్నారు – కౌసల్య ‘‘నా కెరీర్లో బాలూగారితో 15 పాటలు పాడే అదృష్టం నాకు దక్కింది’’ అన్నారు గాయని కౌసల్య. బాలూతో తన అనుబంధం గురించి కౌసల్య మాట్లాడుతూ – ‘‘పాడుతా తీయగా’ సెలక్షన్స్‌కి వెళ్లాను. ఫస్ట్ ఎపిసోడ్‌లోనే నన్ను పాడమన్నారు. బాలూగారి ముందు పాడటానికి కొంచెం భయపడ్డాను. అప్పుడు స్టేజీ మీద ఉన్న బాలూగారు షూటింగ్ ఆపేశారు. నా దగ్గరకి వచ్చి ‘ఒక్కసారి నా వైపు చూడు, నేనేమన్నా రాక్షసుడిలా ఉన్నానా’ అని ఆయన స్టైల్లో జోకులు వేస్తే షూటింగ్లో ఉన్న వాళ్లందరూ నవ్వేశారు. అప్పుడు ఆయన నాతో ‘మనందరం ఒక సంగీత కుటుంబం అమ్మా. నువ్వు పాడే పాటను ఎన్నో లక్షలమంది ప్రేక్షకులు వింటారు. నీకు అద్భుతమైన కెరీర్ వస్తుంది. అందుకని భయపడకుండా పాడు’ అని ధైర్యమిచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత నేను రిలాక్స్ అయి, బాగా పాడగలిగాను. నేను ఆయన గురించి ఎప్పుడు ఆలోచించినా ఆయన ఆ రోజు అలా చెప్పబట్టే కదా, ఈ రోజు నా కెరీర్ ఇంత గొప్పగా ఉంది అనుకుంటాను. ఆ తర్వాత బాలూగారు అనేక ప్రాంతాలకు షూటింగ్లకని, షోలకని తీసుకెళ్లారు. అప్పుడాయన మమ్మల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. ఒక్కోసారి వైజాగ్ లాంటి ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఆక్కడి వాతావరణానికి నోరు ఎండిపోతుండేది. ఆయన మా సింగర్స్ అందరి దగ్గరికి వచ్చి ‘ఈ వాతావరణానికి ఎక్కువ నీళ్లు తాగాలి, అలాగే చక్కెరకేళి తినండి.. తొందరగా ఎనర్జీ వస్తుంది’ అని చెప్పేవారు. చిన్న సింగర్.. పెద్ద సింగర్ అనే తేడా లేకుండా అందరితో చక్కగా కలిసిపోయేవారు. మొదట్లో నాకు సినిమా పాటలకు తక్కువగా అవకాశాలు వస్తుండేవి. ఆ టైమ్‌లో పెద్ద వంశీ గారు ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమాకి దర్శకత్వం వహించారు. మేల్ సింగర్‌గా బాలూగారు, ఫిమేల్ సింగర్ ఎవరు? అని సంగీత దర్శకుడు చక్రిగారిని వంశీగారు అడిగారట. అప్పుడు చక్రిగారు కౌసల్య అని కొత్తమ్మాయి నా సినిమాలకు పాడుతుందని చెప్పారట. ‘బాలూగారంటే నాకు ఎంతో ఇష్టం.. నువ్వు కొత్తమ్మాయితో అంటే ఎలా పాడుతుందో’ అని కంగారు పడ్డారట వంశీగారు. నేను పాడుతుంటే ఓసారి రికార్డింగ్ స్టూడియోకి వచ్చి చూసుకుని ‘ఈ అమ్మాయి బాగా పాడుతుంది’ అని అప్పుడు బాలూగారితో పాడే అవకాశం ఇచ్చారు వంశీగారు. ఆ పాట (రారమ్మని.. రారా రమ్మని...) పెద్ద హిట్ అయింది. తర్వాత కూడా బాలూగారితో 15 పాటలు దాకా పాడే అదృష్టం దక్కింది. బాలూగారు తెలుగు మ్యుజీషియన్ అసోసియేషన్‌కి ఎన్నో సలహాలు ఇచ్చి ఎంతో సాయం చేశారు. ‘చెన్నై యూనియన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సింగర్స్‌కి కష్టమొచ్చినప్పుడు వారికి సాయం చేయటానికి నిధులు లేకపోతే ఎలా చేస్తారు? మీరందరూ కలిసి ఓ ఫండ్‡రైజింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఆ కార్యక్రమానికి నేను వచ్చి ఫ్రీగా పాడతాను. నేను వస్తే నాతో పాటు అందరూ వస్తారు’ అన్నారు. దానివల్ల చక్కని నిధి ఏర్పడింది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరాలు రావటం వల్ల చాలామంది ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాద్యకారులకు పనిలేకుండా పోయింది. వారికేమన్నా ఇబ్బంది కలిగి ఆసుపత్రులకు వెళితే ఆ ఖర్చులను మా యూనియన్ భరిస్తోంది. బాలూగారి దయవల్లే చేయగలుగుతున్నాం’’ అన్నారు. మా కోసం వంట చేశాడు – కేజే ఏసుదాస్ ‘‘నాతో పని చేసినవాళ్లలో బాలు నాకు సోదరుడితో సమానం. బాలు నన్నెంత ప్రేమించాడో నాకే తెలియదు. బహుశా మేమిద్దరం గత జన్మలో అన్నదమ్ములం అయ్యుంటాం’’ అన్నారు ప్రముఖ గాయకుడు కె.జె. ఏసుదాస్. బాలు గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘శాస్త్రీయంగా సంగీతం నేర్చుకోకపోయినా బాలూకి సంగీతం మీద ఉన్న జ్ఞానం అపారమైనది. అద్భుతంగా పాడటమే కాదు, కంపోజ్ కూడా చేసేవాడు. ‘శంకరాభరణం’ చిత్రంలో బాలు పాడిన తీరు అచ్చు సంగీతాన్ని ఔపోసన పట్టినవాడు పాడినట్టే ఉంటుంది. బాలు ఎప్పుడూ ఎవర్నీ నొప్పించలేదు. ఆప్యాయంగా, ప్రేమతోనే మాట్లాడేవాడు. ప్యారిస్‌లో కన్సర్ట్కి వెళ్తే మాకు వంట చేశాడు ఓసారి. కరోనా వల్ల అమెరికా నుంచి ఇండియా రాలేకపోతున్నాను. బాలూని చివరిసారిగా చూడలేకపోయినందుకు బాధగా ఉంది’’ అన్నారు ఏసుదాస్. పెద్ద లోయలో పడినట్లనిపించింది – పి. సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో తనకున్న అనుబంధం గురించి ప్రముఖ గాయని పి. సుశీల మాట్లాడుతూ – ‘‘కరోనా ఇంత అలజడి రేపుతుందని అనుకోలేదు. మనందరికీ కావాల్సిన బాలూను వెంటాడి వెంటాడి తీసుకెళ్లిపోయింది. ఎంత బాగా ఉండేవాడు. ఆయన వచ్చిన తర్వాత సినిమా, టీవీ.. ఇలా రెండు రంగాల్లోనూ అందరూ బిజీగా ఉండేవారు. వీళ్లకు తీపి ఎక్కువైంది అని కన్ను కుట్టినట్టుంది ఆ మహమ్మారికి.. మనందర్నీ దుఃఖసముద్రంలో ముంచేయాలని ఆయన్ను తీసుకెళ్లిపోయింది. ఇక మీద పాటలు వస్తాయి. కానీ బాలూ లేడు. ఈ వార్త వినగానే ఒళ్లు గగుర్పొడిచింది. దేశ విదేశాల్లో ఆయన అభిమానులున్నారు. ఆయనతో మొట్టమొదటిసారి అమెరికా షోకి వెళ్లాను. ఇప్పటికీ అదే అభిమానంతో ఆదరణ లభిస్తోంది. ఆయన మరణవార్త వినగానే ఒకేసారి ఓ పెద్ద లోయలో పడినట్టు అయిపోయింది. అందరూ గుండె ధైర్యం చేసుకోని ఉండాలి. ఘంటసాలగారిని మెప్పించాడు. మరిపించాడు. ఆయన్ను మర్చిపోవాలంటే చాలా కష్టం. నాతో ఫస్ట్‌సారి పాడినప్పుడు కొంచెం భయపడి, మెల్లిగా తేలికపడి పాడాడు. ఇప్పుడు అందర్నీ మెప్పించేశాడు. అలాంటి బాలు ఇక లేడా? తీసుకోలేకపోతున్నాను. దేవుడే మనకు బలం ఇవ్వాలి. ఘంటసాలగారు వెళ్లిపోయారు. రాజేశ్వరరావు గారు వెళ్లిపోయారు. ఇంకా ఎందరో మహానుభావులు వెళ్లిపోయారు. కానీ బాలు నిష్క్రమణాన్ని మాత్రం తట్టుకోలేకపోతున్నాం. ధైర్యంగా ఉందాం’’ అన్నారు. ఆయన నాకు తండ్రిలాంటివారు – ఉష ‘‘బాలసుబ్రహ్మణ్యం గారి వల్లే నేను సినిమా పరిశ్రమలో ఉన్నాను. ఆయన నాకు తండ్రి లాంటివారు. ‘పాడుతా తీయగా’ లాంటి పెద్ద ప్లాట్‌ఫాం మీద నన్ను అభినందించి, ప్రోత్సహించి ఇక్కడవరకు తీసుకొచ్చింది ఆయనే’’ అన్నారు గాయని ఉష. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ఇంకా మాట్లాడుతూ – ‘‘నాకే కాదు ఎంతోమందికి బాలూగారు ఇటాంటి వేదిక మీద అవకాశాలు ఇచ్చారు. ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ ఆహ్లాదపరుస్తూ చిన్నపిల్లలను ట్రీట్ చేసినట్లు నన్ను ట్రీట్ చేసేవారు. ఆయన ఆయాచితంగా ఎవరినీ పొగడరు. ఆయనతో మెప్పు పొందటమంటే సామాన్యమైన విషయం కాదు. నేను ఆయనతో కలిసి చాలా స్టేజ్ షోలు చేశాను. శైలజగారు ఆ ప్రోగ్రామ్‌లో లేకపోతే ‘వేదం అనువణువున నాదం...’ పాటను నాతో పాడించేవారాయన. బాలూగారు అమెరికా వచ్చినప్పుడు ‘మావారితో ఇండియా వచ్చేయండయ్యా’ అని ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. ఆయనతో కలిసి స్టేజ్ షేర్ చేసుకోవటం, అనేక సినిమాల్లో ఆయనతో ఓ 15 పాటలదాకా పాడటం అంతా నా అదృష్టంగా భావిస్తున్నా. మొదట ఆరోగ్యం నుండి కోలుకోవటానికి ఆయన ఎంతో పోరాడారు. ఫిజియోథెరపీ కూడా చేయించుకుని, ఎప్పుడెప్పుడు బయటికి రావాలా అనుకున్నారు. రెండోసారి సమస్య వచ్చినప్పుడు ఆయన గివ్‌అప్ చేసేశారు. ఆయన లేకపోవటం వ్యక్తిగతంగా నాకు ఎంతో నష్టం’’ అన్నారు ఉష. ఆయన దగ్గర నేను నేర్చుకున్న పాఠం అదే – ఏఆర్ రెహమాన్ ‘‘బాలూగారి దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాఠం దేనికీ ‘నో’ చెప్పకపోవడం. ఎలాంటి ప్రయోగానికైనా నిత్యం సిద్ధంగా ఉంటారాయన. పాడటానికైనా, యాక్టింగ్‌కి అయినా, మ్యూజిక్ డైరెక్షన్‌కి అయినా దేనికైనా సిద్ధమే’’ అన్నారు రెహమాన్. యస్పీ బాలుతో తనకున్న అనుబంధాన్ని వీడియో రూపంలో తెలిపారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఆ వీడియోలో ఈ విధంగా మాట్లాడారు. ‘‘ఓసారి యస్పీబీగారి పుట్టిన రోజు వేడుకలో పెర్ఫార్మ్ చేశాను. అదే నా తొలి పెర్ఫార్మెన్స్. 1982లో మేము మ్యూజిక్ అకాడమీలో ఉన్నప్పుడు ఆ వేడుక జరిగింది. అది నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకం. నన్ను ఆయనకు పరిచయం చేసింది సుహాసినీగారే. నేను వేరే సంగీత దర్శకుల వద్ద కీబోర్డ్ ప్లేయర్‌గా పని చేసే సమయంలో యస్పీబీగారు 15 నిమిషాల్లో పాటను నేర్చుకొని, 10 నిమిషాల్లో పాడేసి మరో పాటను రికార్డ్ చేయడం కోసం వెళ్లిపోయేవారు. అలాంటి గాయకుడిని నేనెక్కడా చూడలేదు. అంత ప్రొఫెషనల్, అంత వేగం, అంత మంచితనం. నా తొలి చిత్రం ‘రోజా’లో ‘నా చెలి రోజావే..’ పాట రికార్డ్ చేయడానికి స్టూడియోకి వచ్చారు. ‘ఇలాంటి స్టూడియోలో సినిమాటిక్ సౌండ్‌ని సృష్టించగలమా?’ అని సందేహం వ్యక్తం చేశారు. నేను నవ్వాను. సినిమా విడుదలైన తర్వాత ‘సినిమాటిక్ సౌండ్ ఎక్కడైనా సృష్టించొచ్చు అని నిరూపించావు’ అని అభినందించారు. జీవితాన్ని పూర్తిగా జీవించారు ఆయన. అందర్నీ ప్రేమించారు. అందరిచే ప్రేమించబడ్డారు. మన విజయాల్లో, విషాదాల్లో, వినోదాల్లో, ప్రేమలో, భక్తిలో ఆయన గాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఆయనంత విభిన్నమైన సింగర్ మళ్లీ ఉంటారో ఉండరో కూడా నాకు తెలియదు. ఆయన సంగీతాన్ని, జీవన విధానాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. సౌతిండియా అందరిలో ఓ భాగం యస్పీబీ’’ అన్నారు రెహమాన్. -
నరుడి బతుకు నటన... ఈశ్వరుడి తలపు ఘటన
బాలూ ఇళయరాజాల స్నేహం ఈశ్వరుడి తలపు అనిపిస్తుంది. తమిళనాడులోని మారుమూల పల్లె నుంచి దర్శకుడు భారతీరాజా పూనికతో చెన్నై చేరుకున్న ఇళయరాజా అతని ఇద్దరు సోదరులు మొదట బాలూ ట్రూప్‌లోనే చేరారు. ఇళయరాజా బాలు దగ్గర గిటార్ వాయించేవారు. ఆ తర్వాత ఇళయరాజా ‘అన్నక్కిళి’తో సంగీత దర్శకుడుగా మారారు. బాలు–ఇళయరాజాల స్నేహం దాదాపు నలభై ఏళ్ల నాటిది. వారిరువురూ కలిసి గొప్ప పాటలు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఇచ్చారు. ‘నా ట్యూన్ వల్ల నువ్వు గొప్పవాడివయ్యావ్’ అని ఇళయరాజా అంటే ‘నీ ట్యూన్‌ను నేను పాడటం వల్లే నువ్వు పెద్దవాడివయ్యావ్’ అని బాలు సరదాగా అనుకునేవారు. బాలు–ఇళయరాజా కాంబినేషన్లో వందల పాటలు సంగీత ప్రియులకు స్ట్రెస్ బస్టర్స్‌గా మారాయి. ‘ఇలాగే ఇలాగే సరాగమారితే’ (వయసు పిలిచింది), ‘పరువమా చిలిపి పరుగు తీయకు’ (మౌనగీతం), ‘ఈ లోకం అతి పచ్చన’ (వసంత కోకిల), సుమం ప్రతి సుమం సుమం (మహర్షి), కీరవాణి (అన్వేషణ), ఉరకలై గోదావరి (అభిలాష), ఈనాడే ఏదో అయ్యింది (ప్రేమ), ఆమని పాడవే హాయిగా (గీతాంజలి) ఎన్ని చెప్పినా మరొకటి మిగిలిపోయే పాట ఉంటుంది. ఇళయరాజా కోసం బాలు గొంతుకు స్ట్రయిన్ ఇస్తూ గీతాంజలిలో ‘నందికొండ వాగుల్లోనా’ పాడారు. ఆయనే మళ్లీ ‘ఇంద్రుడు చంద్రుడు’ కోసం ‘నచ్చిన ఫుడ్డు’ పాటకు గొంతు పోయేలా పాడి ఇబ్బంది పడ్డారు. అయినా ఇళయరాజా కోసం ఇదంతా ప్రేమగా చేసేవారు. ఇళయరాజా కంపోజ్ చేసిన ‘సాగర సంగమం’ పాటలు బాలూకు గొప్ప పేరు తెచ్చి పెట్టాయి. అందులోని ‘తకిట తధిమి తకిట తధిమి తందానా’ పాట సంగీతాభిమానులకు ఎంతో ఇష్టమైనది. వీరి మధ్యే కాకుండా వీరి కుటుంబాల మధ్య కూడా స్నేహం ఉంది. ఇళయరాజా సోదరుడు గంగై అమరన్ ప్రేమ విషయంలో అమ్మాయి వాళ్ల ఇంట్లో మాట్లాడింది బాలూనే. యస్పీబీ కుమారుడు యస్పీ చరణ్ నిర్మించే సినిమాలకు రాజా తనయుడు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుంటారు. రాజా మేనల్లుళ్లు వెంకట్ ప్రభు (దర్శకుడు), ప్రేమ్‌జీ అమరన్ (నటుడు–సంగీతదర్శకుడు) కూడా యస్పీ చరణ్‌తో తరచూ సినిమాలు చేస్తారు. ఇలాంటి అనుబంధంలో మనస్పర్థలు లేవా? అంటే ఉన్నాయి. ‘నా పాటలను నా అనుమతి లేకుండా వేదికల మీద పాడొద్దు. పాడితే రాయల్టీ చెల్లించాలి’ అని ఒక సందర్భంలో కోప్పడ్డా కొద్ది రోజులకే ఇద్దరూ కలిసిపోయారు. బాలు అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన వెంటనే ‘త్వరగా తిరిగిరా బాలూ’ అంటూ చెమర్చిన కళ్లతో ఓ వీడియో పంచుకున్నారు ఇళయరాజా. హీరో ఎవరైనా గొంతు బాలూదే(డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా బాలు) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంను డబ్బింగ్ ఆర్టిస్టుగా మార్చింది సంగీత దర్శకుడు చక్రవర్తి. ఆ రోజుల్లో చక్రవర్తి చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు. ‘మన్మథలీల’ (1976)లో కమలహాసన్‌కు డబ్బింగ్ చెబుతూ అందులోని ఒక బ్రాహ్మణుడి పాత్రకు బాలు గొంతు సూట్ అవుతుందని చెప్పించారు. ఆ తర్వాత ‘కల్యాణ రాముడు’ (1979) సినిమా నుంచి కమల్ హాసన్‌కు బాలు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా మారారు. దాదాపు తెలుగులో డబ్ అయిన అన్ని కమల్ సినిమాలకు బాలు డబ్బింగ్ చెప్పారు. వసంత కోకిల, నాయకుడు, డాన్స్‌మాస్టర్, గుణ, మైకేల్ మదన్కామరాజు, విచిత్రసోదరులు... ఇవన్నీ ముఖ్యమైనవి. ‘దశావతారం’లో పది కమల్ పాత్రలకు పది విధాలుగా కేవలం రెండున్నర రోజుల్లో డబ్బింగ్ ముగించారు బాలు. హీరో నరేశ్ ‘నాలుగు స్తంభాలాట’కు, హీరో జగపతిబాబు ‘అడవిలో అభిమన్యుడు’ సినిమాకు బాలు డబ్బింగ్ చెప్పారు. కె.భాగ్యరాజాకు కూడా బాలు గొంతు బాగా సూట్ అయ్యేది. కె.భాగ్యరాజా తెలుగులో డబ్బింగ్ చేసిన ‘డార్లింగ్ డార్లింగ్’, ‘అమ్మాయిలు ప్రేమించండి’, ‘చిన్నరాజా’, ‘నేనూ మీవాడినే’ వంటి సినిమాలకు బాలు డబ్బింగ్ చెప్పి భాగ్యరాజాను తెలుగువారికి దగ్గర చేశారు. తమిళ నటుడు విసు నటించిన తెలుగు సినిమాలు ‘ఆడదే ఆధారం’, ‘ఇల్లు–ఇల్లాలు–పిల్లలు’ సినిమాల్లో విసుకు డబ్బింగ్ చెప్పారు. ‘రుద్రవీణ’లో జెమినీ గణేశన్‌కు చెప్పిన డబ్బింగ్ చాలా ప్రతిభావంతమైనది. ‘అన్నమయ్య’లో సుమన్ శ్రీవేంకటేశ్వర స్వామి పాత్ర ధరిస్తే బాలూయే డబ్బింగ్ చెప్పి ఆయనకు పేరు రావడానికి కారకులయ్యారు. బాలు తమిళంలో నాగార్జునకి, రజనీకాంత్‌కి, బాలకృష్ణకి డబ్బింగ్ చెప్పారు. అన్నింటికి మించి అటెన్‌బరో ‘గాంధీ’ చిత్రం తెలుగులో డబ్ అయినప్పుడు గాంధీ పాత్రకు ఎంతో అద్భుతంగా డబ్బింగ్ చెప్పారు బాలు. అందులో రకరకాల వయసుల్లో ఉన్న గాంధీకి రకరకాల ధ్వని స్వభావంతో చెప్పే తీరు ఔత్సాహికులకు పాఠం లాంటిది. దేశంలోని పది మంది గొప్ప డబ్బింగ్ ఆర్టిస్టులను లెక్కిస్తే వారిలో బాలు తప్పక వస్తారు. చూడు పిన్నమ్మా పాడు పిల్లోడు(మిమిక్రీ ఆర్టిస్ట్ బాలు) బాలు గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్‌ను బట్టి, ఆర్టిస్ట్ బాడీ లాంగ్వేజ్‌ను బట్టి పాడి తాను పాడినట్టుగా కాకుండా పాత్ర పాడినట్టుగా అనిపించగలరు. దాసరి తీసిన ‘చిల్లరకొట్టు చిట్టెమ్మ’ (1977)లో నటుడు మాడా ‘పేడి’ పాత్ర ధరిస్తే ఆ పాట కోసం బాలూ ‘చూడు పిన్నమ్మా పాడు పిల్లోడు’ పాడారు. ఆ పాట బాలూకు, మాడాకు చిరకాల కీర్తి తెచ్చి పెట్టింది. మాడాకు జీవితకాలం ఆ పాత్రే భుక్తి కల్పించిందని చెప్పవచ్చు. గతంలో కిశోర్ కుమార్ ‘హాఫ్టికెట్’ సినిమా కోసం స్త్రీ,పురుష గొంతుల్లో పాడారు. బాలు కూడా అలా గొంతు మార్చి తన ప్రతిభ చాటుకున్నారు. రాజేంద్రప్రసాద్ తీసిన ‘మేడమ్’ సినిమా కోసం స్త్రీ వేషంలో ఉన్న రాజేంద్రప్రసాద్ పాటను స్త్రీ గొంతుతో బాలు పాడారు. ఇలా మేల్ సింగర్ పూర్తి స్త్రీ గొంతుతో పూర్తి పాట పాడటం ఒక రికార్డ్. అల్లు రామలింగయ్య కోసం బాలు పాడిన ‘ముత్యాలు వస్తావా’ పాట పెద్ద హిట్. ‘మనుషులంతా ఒక్కటే’ (1976) కోసం అల్లు రామలింగయ్య, రమాప్రభల మీద చిత్రీకరించిన పాట సినిమా హిట్ కావడానికి ఒక కారణమైంది. కొంచెం ముక్కుతో పాడి అచ్చు అల్లు పాడినట్టే అనిపించారు బాలు. కామెడీ నటులకు బాలు పాడిన పాటలు కూడా హిట్ అయ్యాయి. రాజబాబుకు ‘తాతా–మనవడు’ కోసం ‘సోమా మంగళ బుధ’ పాడారు బాలు. పద్మనాభంకు బాలు పాడిన ‘ఆకలయ్యి అన్నమడిగితే పిచ్చోడన్నారు నాయాళ్లు’ (దేశోద్ధారకులు–1973) కూడా పెద్ద హిట్టే. ‘ప్రతిఘటన’ (1985) సినిమాలో సుత్తి వేలుకు బాలూ పాడిన ‘తందనాన భళ తందనాన’ ఆ సమయంలో ఒక ఉద్వేగగీతంగా నిలిచింది. శుభలేఖ సుధాకర్‌కు ‘రెండు జళ్ల సీత’ కోసం బాలు పాడిన ‘కొబ్బరినీళ్ల జలకాలాడి’ ఇప్పటికీ ఒక వినోద గీతమే. కామెడీ స్టార్ అలీకి పాడిన ‘చినుకు చినుకు అందెలలో’ (శుభలగ్నం) పెద్ద హిట్. బాలుఅనే శంఖంలో ఎన్నో తీర్థాలు. రాగాలు. రసాలు. అందులో హాస్యరసం కూడా తరించింది. సుశీలమ్మ – బాలు బాలసుబ్రహ్మణ్యం విజయంలో ఆయన వాటా ఎంత ఉందో ఆయనతో పాటు గొంతు కలిపిన సుశీలమ్మ వాటా కూడా అంత ఉంది. బాలూ కంటే ఎంతో సీనియర్ అయినప్పటికీ సుశీలమ్మ బాలూను ప్రోత్సహించారు. బాలు అంత హుషారుగా తనను తాను ఉత్సాహపరుచుకుని యుగళగీతాలు ఆలపించారు. వీరిద్దరి హిట్స్ లెక్కబెట్టే కొలది వస్తూనే ఉంటాయి. ‘మానసవీణ మధుగీతం’ (పంతులమ్మ), ‘ఝుమ్మందినాదం సయ్యంది పాదం’ (సిరిసిరిమువ్వ), ‘ఇది పున్నమి వెన్నెల రేయి’ (ప్రేమ లేఖలు), ‘మావిచిగురు తినగానే’ (సీతామాలక్ష్మి), ‘గోరంత దీపం కొండంత వెలుగు’ (గోరంత దీపం), ‘శ్రీరస్తు శుభమస్తు’ (పెళ్లిపుస్తకం) లాంటి అద్భుతమైన పాటలు ఉన్నాయి. కమర్షియల్ సినిమాల జోరు పెరిగి మాస్ సాంగ్స్ కావాలని నిర్మాతలు పట్టుబట్టినప్పుడు, దర్శకులు కోరినప్పుడు సుశీల బాలూతో కలిసి అలాంటి మాస్ సాంగ్స్ పాడారు. ముఖ్యంగా చక్రవర్తి ఆమెను ఒప్పించి బాలూతోటి ‘గుగ్గుగుగ్గు గుడిసుంది’ (డ్రైవర్ రాముడు) పాడించారు. అలాగే వీళ్లద్దరూ ‘వేటగాడు’లో ‘పుట్టింటోళ్లు తరిమేశారు’ పాడారు. అక్కినేనికి బాలు పాడిన డ్యూయెట్స్‌లో ఎన్నో హుషారైనవి సుశీల పాడారు. వాటిలో ‘ఒక లైలా కోసం’ (రాముడు కాదు కృష్ణుడు), ‘కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్న’ (ప్రేమాభిషేకం), ‘తొంగి తొంగి చూడమాకు చందమామా’ (శ్రీరంగ నీతులు)..లాంటివి ఎన్నో ఉన్నాయి. కృష్ణకు ‘ఇదిగో తెల్ల చీర’ (ఊరికి మొనగాడు), శోభన్‌బాబుకు ‘వెల్లువచ్చి గోదారమ్మ’ (దేవత), చిరంజీవికి ‘గోరింట పూసింది’ (ఖైదీ) హిట్ పాటలకు లెక్క లేదు. సుశీల పాడిన ‘పాలకడలిపై శేషతల్పమున’ పాటను పాడి చిన్నప్పుడు పాటల పోటీలో ప్రైజులు తెచ్చుకున్నానని బాలు చాలాసార్లు చెప్పుకున్నారు. -
నటుడిగా ప్రాణం పోసుకున్న రోజు
చిరంజీవి నటుడిగా మారి సెప్టెంబర్ 22తో 42 ఏళ్లు పూర్తయింది. ఈ 42 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు అందుకున్నారు. మెగాస్టార్‌గా మారారు. 151 సినిమాలు పూర్తి చేశారు. ఈ నట ప్రస్థానం గురించి, సెప్టెంబర్ 22తో తనకున్న అనుబంధం గురించి ఈ విధంగా చెప్పారు. ‘‘నా జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యత ఉందో సెప్టెంబర్ 22కి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఆగస్ట్ 22 నేను మనిషిగా ప్రాణం పోసుకున్న రోజయితే సెప్టెంబర్ 22 (‘ప్రాణం ఖరీదు’ సినిమా విడుదల తేదీ) నటుడిగా ‘ప్రాణం ’ పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలయిన రోజు. నన్ను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’’ అని అన్నారు చిరంజీవి. -
ప్రాణం పోసుకుంది నేడే: చిరంజీవి
మెగస్టార్ చిరంజీవి.. ఇండస్ట్రీలోనే కాదు సమాజంలో కూడా ఎందరికో ఆదర్శం. ఓ సామన్య కుటుంబంలో జన్మించి.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే మెగాస్టార్ రేంజ్‌కి ఎదిగి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. అందుకు ఎంతో కృషి, శ్రమ, పట్టుదల అవసరం. ఇవన్ని ఉన్నాయి కనుకే ఆయన జీవితం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. ఎన్నో ఆటుపోట్లని దాటుకుని.. సిని పరిశ్రమలో ఉన్నత స్థానానికి చేరారు చిరంజీవి. నేటితో ఆయన సినీ ప్రయాణం 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆయన నటించిన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’ 1978, సెప్టెంబర్ 22న విడుదలైంది. మంచి విజయాన్ని సాధించింది. కె.వాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయసుధ, రావుగోపాల్రావు, చంద్రమోహన్, చిరంజీవి, రేష్మా రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో చిరంజీవిది ముఖ్యమైన పాత్ర. పల్లెటూరి యువకుడిగా చిరు మెప్పించారు. ‘ప్రాణం ఖరీదు’ చిరంజీవికి నటుడిగా ప్రాణం పోసిందనే చెప్పాలి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిరు ట్వీట్ చేశారు. (చదవండి: సన్యాసిలా ఆలోచించగలనా?) #BornAsAnActor #ForeverGrateful #PranamKhareedu #thisdaythatyear pic.twitter.com/lKM1qQhpN9 — Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2020 ‘నా జీవితంలో ఆగస్ట్ 22కి ఎంత ప్రాముఖ్యత ఉందో సెప్టెంబర్ 22కి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే ఆగస్టు 22 నేను మనిషిగా ప్రాణం పోసుకుంటే.. సెప్టెంబర్ 22 నటుడిగా ‘ప్రాణం’ పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి.. ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికి, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను’ అంటూ చిరు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అవుతోంది. ‘ప్రాణం ఖరీదు’ నుంచి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఆచార్య’ వరకు తన 42 ఏళ్ల కెరీర్లో చిరంజీవి 152 సినిమాల్లో నటించారు. దాదాపు అన్ని జానర్లలో నటిస్తూ ప్రేక్షకులను ఆలరించారు. ఇటీవల వచ్చిన ‘సైరా’ చారిత్రాత్మక చిత్రంతో ఇన్నాళ్లు ఉన్న లోటుని కూడా తీర్చేసుకున్నారు. ఆయన మరెన్నో మంచి చిత్రాలు చేయాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటున్నారు. -
ఆ ఎనిమిదినీ అంతం చేయాలి
‘‘మన భారతీయ చిత్రసీమల్లో హిందీ పరిశ్రమ మాత్రమే పెద్దది అనుకోవడం పొరపాటు. తెలుగు పరిశ్రమ కూడా టాప్ ప్లేస్‌లో ఉంది’’ అన్నారు కంగనా రనౌత్. ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నోయిడాలో ఫిల్మ్ సిటీ నిర్మించాలనుకుంటున్నాం అని పేర్కొన్నారు. ఈ విషయం గురించి కంగనా మాట్లాడుతూ – ‘‘యోగి ఆదిత్యనాథ్‌గారి నిర్ణయం అభినందించదగ్గది. సినిమా పరిశ్రమలో ఇలాంటి సంస్కరణలు చాలా జరగాలి. అయితే భారతీయ సినిమా అంటే హిందీ మాత్రమే కాదు. తెలుగు మేకర్స్ ప్యాన్ ఇండియా సినిమాలు రూపొందించడానికి ముందుకు వస్తున్నారు. వివిధ కారణాల వల్ల ఒక్కో ఇండస్ట్రీగా మనందరం ఉన్నప్పటికీ మన పరిశ్రమలన్నీ కలసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారాలి. మనందరం ఇలా విడివిడిగా ఉండటం డబ్బింగ్ అవుతున్న హాలీవుడ్ సినిమాలకు ఉపయోగకరంగా మారింది. ఉత్తమమైన ప్రాంతీయ చిత్రాలకు దేశవ్యాప్త గుర్తింపు లభించదు. కానీ హాలీవుడ్ సినిమాకు దేశవ్యాప్త విడుదలలు ఏంటి? హిందీ సినిమాల్లో కరువవుతున్న నాణ్యత, మోనోపోలీ వల్లే ఇదంతా. మనందరం సినిమా పరిశ్రమను వివిధ టెర్రరిజమ్‌ల నుండి కాపాడాలి. వాటిని అంతం చేయాలి. అవేంటంటే... ► నెపోటిజమ్ టెర్రరిజమ్ ► డ్రగ్స్ మాఫియా టెర్రరిజమ్ ► సెక్సిజమ్ టెర్రరిజమ్ ► ప్రాంతీయ మరియు మతపరమైన టెర్రరిజమ్ ► విదేశీ సినిమాల టెర్రరిజమ్ ► పైరసీ టెర్రరిజమ్ ► శ్రమ దోపిడీ టెర్రరిజమ్ ► ప్రతిభను దోచుకునే టెర్రరిజమ్.. ఈ ఎనిమిది టెర్రరిజమ్‌ల నుంచి కాపాడాలి’’ అని ట్వీట్ చేశారు కంగనా. -
డ్రగ్స్ కేసు: సీసీబీ ఎదుట గ్లామర్‌జంట
సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్‌లో డ్రగ్స్ కేసు అనేక మంది మెడకు చుట్టుకొనేలా ఉంది. ప్రముఖ నటి ఐంద్రితా రై, ఆమె భర్త, నటుడు దిగంత్‌లు బుధవారం సీసీబీ ఎదుట హాజరయ్యారు. ముఖ్య నిందితులు రాగిణి ద్వివేది, సంజన గల్రాని, ఇతరుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం బుధవారం 11 గంటలకు చామరాజపేటలోని సీసీబీ ఆఫీసుకు రావాలని మంగళవారం వారు నోటీసులు అందుకున్న సంగతి తెలిసిందే. నిందితునితో ఐంద్రిత, దిగంత్ ఫోటోలు డ్రగ్స్ దందా కేసులో ప్రధాన పెడ్లర్ షేక్ ఫాజిల్‌తో కలిసి ఐంద్రితా రై, దిగంత్‌లు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందాయి. ఐంద్రిత దంపతులు డ్రగ్స్ విక్రేతలను సంప్రదించినట్లు సీసీబీ గుర్తించింది. గ్లామర్ జంటకు పిలుపు రావడం శాండల్‌వుడ్‌తో పాటు అభిమానులకు కలవరం కలిగిస్తోంది. మేం ఎక్కడకీ పారిపోవడం లేదు, తప్పకుండా సీసీబీ విచారణకు హాజరవుతామని ఐంద్రితా, దిగంత్‌లు మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. నటి రాగిణి ద్వివేదితో ఐంద్రిత రై (ఫైల్) బుల్లితెర నటులకు లింకులు డ్రగ్స్ భూతం టీవీ నటులనూ తాకింది. నిందితుడు షేక్ ఫాజిల్‌తో బుల్లితెర నటులు కలిసి ఫోటోలు ఒక్కొక్కటే బయట పడుతున్నాయి. గట్టిమేళ సీరియల్లో నటించిన రక్ష్ , అగ్నిసాక్షి విజయ్‌సూర్య, రాధారమణ, శ్వేతాప్రసాద్లు ఫాజిల్‌తో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో పలువురు నటీనటులు తమకు డ్రగ్స్‌తో సంబంధం లేదని చెప్పుకున్నారు. (బచ్చన్ ఫ్యామిలీకి మరింత భద్రత) కేంద్ర కారాగారంలో రాగిణి డ్రగ్స్ కేసులో సీసీబీ అరెస్ట్ చేసిన రాగిణి ద్వివేదిని పరప్పన అగ్రహారం జైలులోని కరోనా క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. సీసీబీ కస్టడీ ముగియగా ఆమె 2 వారాలు పరప్పన జైలులో ఉంటారు. వీఐపీ కావడంతో ఆమెకు గట్టి భద్రతను కల్పించారు. 10 రోజుల వరకు కరోనా పాజిటివ్ రాకపోతే ఆమెను సాధారణ గదికి తరలిస్తారు. జైలులో రాగిణి చాలా దిగులుగా బాధపడుతూ గడిపారు. అధికారులు ఇచ్చిన రోటీ, దాల్‌ను ఆరగించి పుస్తకం చదువుతూ తరువాత నిద్రపోయిన్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. ఉదయం కాలకత్యాలు తీర్చుకొని టిఫిన్ తిని పుస్తకం పఠనంలో నిమగ్నమయ్యారు. మరోవైపు నటి సంజన రెండు రోజుల సీసీబీ విచారణ కొనసాగుతోంది. ఆదిత్య ఆళ్వా మేనేజర్ అరెస్ట్ ఆదిత్య ఆళ్వా మేనేజర్ రామ్దాసను సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ల్యాప్‌టాప్, ఆఫీసు కంప్యూటర్ను స్వాధీనం చేసుకొన్నారు. అక్కడి ముగ్గురు పనివాళ్లను, ఇంటి సెక్యూరిటీ గార్డులను విచారించారు. ఇక్కడ గంజాయిని మాత్రమే సేవించేవారని వారు చెప్పినట్లు సమాచారం. పరారీలో ఉన్న ఆదిత్యా ఆళ్వా(ఫైల్) ఆదిత్య ఆళ్వాపై గురి కాంగ్రెస్ మాజీ మంత్రి, దివంగత జీవరాజ్ ఆళ్వా పుత్రుడు ఆదిత్య ఆళ్వా నివాసంపై సీసీబీ పోలీసులు మంగళవారం దాడి చేశారు. బెంగళూరు హెబ్బాళలోని హౌస్ ఆఫ్ లైఫ్ రిసార్ట్, ఇంటిలో సోదాలు జరిపారు. డ్రగ్స్ కేసు వెలుగుచూసినప్పటి నుంచీ ఆదిత్య అదృశ్యమయ్యాడు. అతని ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉంది. సీసీబీ పోలీసులు ఢిల్లీ, ముంబై తదితర నగరాల్లో నిఘా పెట్టారు. హెబ్బాళలోని ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అతని బంగ్లా నివాసంలో సోదాలు జరిగాయి. లాక్డౌన్ సమయంలో పెద్దపెద్ద పార్టీలు ఇక్కడ నిర్వహించారని ఆరోపణలున్నాయి. ఈ సోదాల్లో కొన్ని మత్తు పదార్థాలను పట్టుకున్నట్లు సమాచారం. ఆదిత్య బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌కు బావమరిది. ఇక నటీమణులు రాగిణి, సంజనలు బాగా పరిచయం. ఆదిత్య ఇంటి సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ నిందితుడు రవిశంకర్.. ఆదిత్య ఆళ్వా పేరు చెప్పినట్లు తెలిసింది. -
మేము సిద్ధమే అంటున్న హీరోయిన్స్
కథానాయికలంటే గ్లామర్‌కి మాత్రమే.. పాటల్లో కలర్ఫుల్గా కనిపించడానికే... సినిమాల్లో నాయికలకు సీన్లు ఉన్నా కథలో పెద్దంత సీన్ ఉండదు. అందుకే... కథతో పాటుగా ప్రయాణించే పాత్రలు ఇవ్వండి. ఛాలెంజింగ్ పాత్రలు రాయండి.. చాలెంజ్‌లు విసరండి. మేము సిద్ధమే అంటున్నారు కథానాయికలు. ఛాలెంజింగ్ పాత్రలు ఎంచుకుంటున్నారు. ఆ పాత్రలను ఛాలెంజింగ్‌గా తీసుకుంటున్నారు. వాళ్ల స్టోరీ ఏంటో చూద్దాం. కాజల్ అగర్వాల్ ఇప్పటివరకూ చాలా రకాల పాత్రలు చేశారు. కానీ తొలిసారి వయసుకు మించిన పాత్రను చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘భారతీయుడు 2’ చిత్రంలో కాజల్ 80 ఏళ్ల వృద్ధురాలిగా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కళరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్ కూడా నేర్చుకున్నారు. కాజల్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా పాల్గొంటారని సమాచారం. అంటే.. యంగ్ ఏజ్, ఓల్డేజ్ ఏజ్‌లో కనిపిస్తారని ఊహించవచ్చు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కోసం పల్లెటూరి అమ్మాయిగా మారిపోయారు రకుల్ ప్రీత్‌సింగ్. ఈ సినిమాలో రకుల్ పాత్ర డీ గ్లామరైజ్డ్గా ఉంటుంది కూడా. అంటే మేకప్ లేకుండా కనిపించనున్నారు. ఈ సినిమాలో రకుల్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. ఇక శ్రియను మనందరం ఇప్పటి వరకూ అన్నీ పాజిటివ్ పాత్రల్లోనే చూశాం. తనలోని విలన్ని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు నెగటివ్ యాంగిల్‌ను చూపించడానికి రెడీ అవుతున్నారు. హిందీ చిత్రం ‘అంధాధూన్’ తెలుగులో రీమేక్ కాబోతోంది. ఇందులో నితిన్ హీరో. ఈ సినిమాలో విలన్ పాత్రలో శ్రియ నటించనున్నారని టాక్. ‘సీటీ మార్’ చిత్రం కోసం కబడ్డీ కోచ్‌గా మారారు తమన్నా. కోచ్ ఎలా ఉండాలి? ఫిట్నెస్, బాడీ లాంగ్వేజ్ వంటి విషయాల మీద శ్రద్ధ పెట్టి ఈ పాత్ర చేస్తున్నారు తమన్నా. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ హీరో. ‘మూకుత్తి అమ్మన్’ అనే తమిళ చిత్రంలో అమ్మవారిగా కనిపించనున్నారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఈ పాత్ర చేస్తున్నన్ని రోజులు నియమ నిష్టలతో ఉన్నారట. మాంసాహారం ముట్టుకోలేదు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. పరుగుల రాణిగా మారబోతున్నారు తాప్సీ. ‘రాకెట్ రష్మి’ అనే చిత్రంలో అథ్లెట్‌గా నటిస్తున్నారామె. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది ఈ చిత్రం. ఈ పాత్ర కోసం డైట్ మార్చేశారు. వ్యాయామాలు చేస్తూ, రన్నింగ్ మీద దృష్టి పెట్టారు. అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో రష్మికా మందన్నా గ్రామీణ యువతిగా కనిపిస్తారట. అలానే చిత్తూరు యాసలో సంభాషణలు పలకనున్నారు. ఆల్రెడీ చిత్తూరు యాసను ప్రాక్టీస్ చేయడంతోపాటు గ్రామీణ యువతి హావభావాలను నేర్చుకుంటున్నారట. సమంత ఇటీవలే ఓ కొత్త దర్శకుడి సినిమాలో నటించడానికి అంగీకరించారట. ఈ సినిమాలో ఆమె మూగ మరియు చెవిటి అమ్మాయిగా కనిపించనున్నారు. ఇది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని టాక్. ప్రభాస్ ‘రాధే శ్యామ్’లో ఆయనకు జోడీగా నటిస్తున్నారు పూజా హెగ్డే. ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ రెండు పాత్రలకు మధ్య వ్యత్యాసం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట పూజా హెగ్డే. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత పాత్ర చేస్తున్నారు కంగనా రనౌత్. ‘తలైవి’ పేరుతో ఈ చిత్రం రూపొందుతోంది. ఇలా కొత్త పాత్రలు విసురుతున్న సవాల్‌ను స్వీకరించి శారీరకంగా లేదా మానసిక శ్రమను ఇష్టంగా తీసుకుంటున్నారు నాయికలు. ఇలాంటి చాన్స్‌లు అరుదుగా వస్తాయి కాబట్టి నిరూపించుకోవడానికి ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. శభాష్ అనిపించుకుంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. -
సందడి..సందడిగా...
మొన్నటి దాకా షూటింగ్స్ లేక లొకేషన్స్ అన్నీ వెలవెలబోయాయి. ఇప్పుడు ఒక్కో సినిమా సెట్స్ మీదకు వెళ్లడంతో కళకళలాడుతున్నాయి. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చిత్రీకరణలు మొదలుపెట్టింది ఇండస్ట్రీ. సెట్లో జనం తగ్గినా సందడి తగ్గకుండా పని చేసుకుంటున్నారు. చిత్రీకరణకు కావాల్సిన వాటితో పాటు శానిటైజర్లు, మాస్కులు ఉండేలా చూసుకుంటున్నారు. ఆ ‘ఆన్ లొకేషన్’ అప్డేట్స్ మీకోసం. సీనియర్ స్టార్ హీరోల్లో నాగార్జున షూటింగ్‌కి తొలి అడుగు వేశారు. ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్లో గత వారంలో జాయినయ్యారాయన. ‘నేను కూడా డాడీ’ అంటూ ఈ వారం నాగచైతన్య తన ‘లవ్‌స్టోరీ’ను తిరిగి ప్రారంభించారు. ‘‘కంటిన్యూస్‌గా 15 రోజుల పాటు షూటింగ్ చేయబోతున్నాం. లొకేషన్లో కేవలం 15 మంది మాత్రమే ఉండేలా చూసుకుంటున్నాం. షెడ్యూల్ పూర్తయ్యేవరకూ ఎవరూ ఇళ్లకు వెళ్లకుండా లొకేషన్ దగ్గరే ఉండేట్లు బస ఏర్పాటు చేశాం’’ అని ‘లవ్‌స్టోరీ’ నిర్మాతలు నారాయణ్ దాస్ కె. నారంగ్, పి. రామ్మోహన్ రావు తెలిపారు. సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’, అదా శర్మ థ్రిల్లర్ చిత్రం ‘?’ (సినిమా టైటిల్ క్వొశ్చన్ మార్క్), కీర్తీ సురేష్ ‘గుడ్ లక్ సఖీ’ (తన పాత్ర చిత్రీకరణను గురువారంతో పూర్తి చేసి, ఈ యూనిట్‌కి బైబై కూడా చెప్పారు కీర్తి), బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా తెలుగులో చేస్తున్న తొలి చిత్రం ‘బ్లాక్ రోజ్’, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ‘బెల్ బాటమ్’ చిత్రాలు చిత్రీకరణ తిరిగి ప్రారంభమయ్యాయి. ఇంకొన్ని చిత్రాల షూటింగ్ కూడా జరుగుతోంది. షూటింగ్ సందడి కనిపించే ‘ఆన్ లొకేషన్’ ఫొటోలను షేర్ చేశారు ఆయా చిత్రబృందాలు. ఆ ఫొటోలను ఇక్కడ చూడొచ్చు. ‘సోలో ‘బ్రతుకే సో బెటర్’ బెల్ బాటమ్ బ్లాక్ రోజ్ ’లవ్‌స్టోరీ’ ‘గుడ్ లక్ సఖీ’ -
8న సినీ ప్రముఖులతో కేంద్రం భేటీ
న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసి ఆన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో దేశంలోని అన్ని రంగాలు మెల్లమెల్లగా పునఃప్రారంభం అవుతున్నాయి. జిమ్ములు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు ఇప్పటికే తెరుచుకోగా మెట్రో సర్వీసులు మరి కొన్నిరోజుల్లో మొదలు కానున్నాయి. అయితే కేవలం విద్యా సంస్థలు, పార్కులు, సినిమా థియేటర్లు మాత్రమే ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం అన్‌లాక్ 4.0లో భాగంగా దేశంలో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. (సినిమాను కాపాడండి) ఈ క్రమంలో సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్‌ల ప్రారంభంపై ఈ నెల 8న సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులతో కేంద్ర హోం శాఖ అధికారులు భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో థియేటర్లు తెరుచుకునే తేదీ, పాటించాల్సిన నిబంధనలపై చర్చించనుంది. ఈ సమావేశం అనంతరం థియేటర్లు తెరుచుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టనుందనేది ఆసక్తిగా మారింది. (రాజ్‌నాథ్‌తో భేటీకి చైనా తీవ్ర ప్రయత్నం) కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా సుమారు ఐదు నెలలకు పైగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. దీని వల్ల విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్నో తెలుగు సినిమాలు వాయిద పడ్డాయి. చిన్న చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలైపోతున్నాయి. అయితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన స్టార్ హీరోల సినిమాలను ఓటీటీ విడుదల చేసే ధైర్యం చేయలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. -
సినిమాను కాపాడండి
‘‘సినిమాను కాపాడండి’’ అంటున్నారు థియేటర్స్ యాజమాన్యాలు. ‘సేవ్ సినిమా’ (సినిమాను కాపాడండి), సపోర్ట్ మూవీ థియేటర్స్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీటర్లో ట్రెండ్ ఆరంభించారు. ఈ విషయం గురించి ‘మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ పలు ట్వీట్స్‌లో ఇలా పేర్కొంది. ‘‘మన దేశ సంప్రదాయాల్లో సినిమా థియేటర్స్‌లో సినిమాకు వెళ్లడం ఓ పద్ధతి. మన దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా సినిమా థియేటర్స్ చాలా కీలకం. ఎన్నో వందల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తుంది. చాలా దేశాల్లో సినిమా థియేటర్స్ తెరవడానికి ఆయా ప్రభుత్వాలు అనుమతించాయి. భారత ప్రభుత్వం కూడా మా విన్నపాన్ని మన్నించాలని, సినిమా హాళ్లు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. సినిమా చూడటానికి ప్రేక్షకులు వచ్చేలా చేసే బాధ్యత మాది. పరిశుభ్రమైన వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉంటాం. విమానయానాలు, మెట్రో ట్రైన్స్, రెస్టారెంట్స్ ఓపెన్ చేసేందుకు అనుమతించినట్లుగానే సినిమా హాళ్లకు కూడా ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం’’ అని పేర్కొంది. ఈ విషయంలో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మరికొంతమంది సినీ ప్రముఖులు తమ మద్దతు తెలిపారు. -
ఇక్కడ మాఫియా లేదు
ప్రస్తుతం బాలీవుడ్లో నెపోటిజం (బంధుప్రీతి), అవుట్‌సైడర్స్ (సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేనివాళ్లు) అండ్ ఇన్సైడర్స్ (సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్లు) అనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దిన్ షా మాట్లాడుతూ– ‘‘అవుట్‌సైడర్స్, ఇన్సైడర్స్ గురించి ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోందో అర్థం కావడంలేదు. దీనికి ఎక్కడో ఓ చోట ఫుల్స్టాప్ పెట్టాల్సిందే. నేనెందుకు ఫుల్స్టాప్ పెట్టకూడదు అనిపించింది. అందుకే మాట్లాడుతున్నాను. 40–45 ఏళ్లుగా నేను నటుడిగా ఎంతో సంతృప్తిగా ఉన్నాను. నా నట వారసుడిగా నా కొడుకును నేను ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? ఒక బిజినెస్‌మేన్, లాయర్, డాక్టర్ ఎవరైనా తమ వారసులను తమ రంగంలో ఎంకరేజ్ చేయొచ్చు. దీనికి మాఫియా అని, బంధుప్రీతి అని పేర్లు పెట్టాల్సిన అవసరం ఏముంది? బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి నా కొడుక్కి అవకాశం రావడం సహజం. అయితే తనకు టాలెంట్ ఉంటేనే అవకాశం ఇస్తారు. కాకపోతే మొదట అవకాశం ఈజీ అవుతుంది. బయటినుండి వచ్చేవారికి ఆ ఛాన్స్ ఉండదు. అయితే అవకాశం తెచ్చుకుని, ప్రతిభ నిరూపించుకుంటే వారసులకన్నా కూడా దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఎవరి రికమండేషన్‌తో ఓంపురి ముంబైలో అడుగుపెట్టారు. ఎవరు రికమండ్ చేశారని నాకు అవకాశాలు వచ్చాయి. మేమంతా ఒంటరిగా పైకొచ్చినవాళ్లమే. ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మాఫియా అని కొందరు కథలు అల్లుతున్నారు. అందులో వాస్తవం లేదు. 45 ఏళ్లుగా నేనిక్కడే ఉన్నాను. నాకు ఎటువంటి ఇబ్బందిలేదు. ఇక్కడ మాఫియా లేదు’’ అన్నారు. -
షూటింగ్స్‌కి స్టార్ హీరోలు రెడీయా?
షూటింగ్స్ చేసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేసింది. కొన్ని గైడ్‌లైన్స్ సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం కూడా రైట్ రైట్ అంది. చిన్న చిన్నగా చిన్న సినిమాలు ప్రారంభమయ్యాయి. మరి భారీ సినిమాల సంగతేంటి? షూటింగ్స్‌కి స్టార్ హీరోలు రెడీయా? కరోనా తగ్గేవరకూ నో కాల్షీట్.. వ్యాక్సిన్ వచ్చే వరకూ నో క్యారవ్యాన్... అంటున్నారా? లేదా రంగంలోకి దిగేద్దాం. షూటింగ్ చేసేద్దాం అంటున్నారా? పెద్ద బడ్జెట్ సినిమాలు ప్రారంభించడానికి నిర్మాతలు సిద్ధమా? ప్రస్తుతం చిత్రీకరణల గురించి ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారు? ఇదే విషయాలను పలువురు నిర్మాతలను అడిగాం. వాళ్లు ఈ విధంగా చెప్పారు. ఆ విశేషాలు. షూటింగ్‌లు చేయాల్సిందే – దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ప్రస్తుతం షూటింగ్‌లు చేసేవాళ్లు చేస్తున్నారు. కానీ జాగ్రత్తలు తీసుకుని చేసుకోవాలి. ఇప్పటికే కార్మికులు ఎంతోమంది ఉపాధి కోల్పోయారు. కరోనా అనేది రెండు నెలలో, మూడు నెలలో అనుకుంటే షూటింగ్‌లైనా, మిగతా పనులైనా ఆపి కూర్చోవచ్చు. కరోనా మరో రెండు, మూడేళ్లు ఖచ్చితంగా ఉంటుంది. అప్పటివరకు పనులు చేయకుండా ఇంట్లోనే కూర్చుంటే ఎలా గడుస్తుంది? అందుకని షూటింగ్ చేయటం అవసరం అనుకున్న ప్రతి ఒక్కరూ కరోనా వస్తుందనుకొని ప్రిపేర్ అయ్యి షూటింగ్‌లు చేసుకోవాల్సిందే. అప్పుడే వారికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసేవాళ్లు చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు. కష్టాల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా వర్క్ చేయాల్సిందే. ఒకవేళ ఎవరికైనా షూటింగ్లో పాల్గొన్నపుడు కరోనా వస్తే భయపడకుండా ఆ రిస్క్‌ను తీసుకోవటానికి సిద్ధంగా ఉండాల్సిందే. తప్పదు మరి. కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే బడా నిర్మాతలు, హీరోలు ఇప్పట్లో షూటింగ్‌లు చేయకపోయినా పర్లేదు. మధ్యస్తంగా ఉండేవారు తప్పనిసరిగా షూటింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం షూటింగ్ అంటే రిస్కే – ఎఫ్డీసీ చైర్మన్, నిర్మాత పి. రామ్మోహన్రావు రెండు నెలల క్రితమే రెండు తెలుగు రాష్ట్రాలు షూటింగ్‌లు చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పర్మిషన్ ఇవ్వటంలో కొత్త పాయింటేం లేదు. ఏదేమైనా షూటింగ్లలో పాల్గొనటమా? లేదా అనేదే ఇక్కడ ప్రశ్న? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్లో పాల్గొనటం లైఫ్ రిస్కే. కానీ రిస్క్ అయినా çఫర్వాలేదు షూటింగ్ చేద్దాం అనుకునేవాళ్లు చేస్తున్నారు. వారి జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. కాకపోతే పెద్ద నటీనటులెవరూ షూటింగుల్లో పాల్గొనటం లేదు. ప్రస్తుతానికి ఈ పరిస్థితి ఎన్నాళ్లు ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేం. నేను, సునీల్ నారంగ్ నిర్మిస్తోన్న ‘లవ్‌స్టోరీ’ చిత్రం షూటింగ్‌ను సెప్టెంబర్ 7 నుండి చేయటానికి ప్లాన్ చేస్తున్నాం. హీరో నాగచైతన్య, దర్శకుడు శేఖర్ కమ్ముల షూటింగ్ చేయడానికి ముందుకొచ్చారు. కేవలం 15మందితో ఈ షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నాం. వారందరికీ మొదట కరోనా టెస్టులు చేయిస్తాం. అలాగే షూటింగ్ జరిగినన్ని రోజులూ ఎవరూ ఇంటికి వెళ్లం. అందరికీ లొకేషన్ దగ్గరే బస ఏర్పాటు చేయబోతున్నాం. షూటింగ్‌కి తొందరపడటంలేదు – పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ భాగస్వామి వివేక్ కూచిభొట్ల మేం ప్రస్తుతానికి చిన్న చిన్న ప్యాచ్ వర్క్ పనులు చేస్తున్నాం. ఎక్కువ క్రౌడ్ ఉండే సినిమాల షూటింగ్ చేయదలచుకోలేదు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో నాగశౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’, సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’, శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ సినిమాలు చేస్తున్నాం. కార్తికేయతో ఓ సినిమా చేస్తున్నాం. ఆ సినిమా చిత్రీకరణ ఫారిన్లో జరపాలి. ప్రస్తుతానికి షూటింగ్స్ చేయడంలేదు. థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో తెలియదు. అందుకే రిలీజ్ డేట్స్ కూడా ఫిక్స్ చేసుకోలేం. దాని వల్ల తొందరపడి షూటింగ్స్ స్టార్ట్ చేయాలని కూడా అనుకోవడం లేదు. కొన్ని రోజుల్లో ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమా చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నాం. అది కూడా సీన్లో ఎక్కువ మంది జనం లేని సన్నివేశాలే ముందు షూట్ చేస్తాం’’ అన్నారు. ధైర్యం ఉన్నోళ్లు చేసుకోవచ్చు – నిర్మాత డి. సురేశ్‌బాబు ప్రభుత్వం షూటింగ్‌లు చేసుకోవచ్చని చెప్పింది. అలాగే కొంతమంది షూటింగ్‌లు చేసుకుంటున్నారు కూడా. కానీ మా బ్యానర్లో తీసే సినిమాల షూటింగ్‌లు చేయటానికి మరో రెండు, మూడు నెలల సమయం పడుతుంది. నా ఆర్టిస్టులు, టెక్నీషియన్ల ఆరోగ్య భద్రత ఎంతో ముఖ్యం. అది నేనివ్వగలనని గ్యారంటీ లేదు. మా బేనర్లో తీస్తున్న ఓ సినిమాకి 27 రోజుల షూటింగ్ మిగిలి ఉంది. అవన్నీ యాక్షన్ సీక్వెన్స్‌లే. ప్రతి సీన్లో దాదాపు 50 నుంచి 100 మంది జూనియర్ ఆర్టిస్టులతో పాటు మెయిన్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ కలిపితే 150మంది వరకు అవుతారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అంతమందిని కాపాడగలమని నమ్మకం లేదు. రోడ్ మీదకి వెళ్లినప్పుడు మాస్క్ వేసుకుని వెళ్లాలని చెప్తే దాన్ని కూడా కొంతమంది సరిగ్గా ఆచరించటం లేదు. దాదాపు 30 శాతం మంది మాస్క్ పెట్టుకోమంటే అదేదో తప్పులా ఫీలవుతున్నారు. ఆ సంగతలా ఉంచితే ఇప్పుడు నేను త్వరత్వరగా షూటింగ్ పూర్తి చేసుకుని ఎక్కడ విడుదల చేయాలి? నేను వ్యక్తిగతంగా నా ఫ్యామిలీతో కానీ స్నేహితులతో కానీ సినిమా థియేటర్‌కి వెళ్లి ఇప్పట్లో సినిమా చూడను. కారణం ఏంటంటే క్లోజ్డ్ ఏసీ థియేటర్లలో ముక్కుకి, మూతికి మాస్క్ పెట్టుకుని నవ్వొస్తే నవ్వకుండా సినిమా ఫీల్‌ను ఎంజాయ్ చేయలేను. ఉపాధి కోసం షూటింగ్ చేయటం మంచిదే కానీ దాన్ని ఎవరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారనేది ఇక్కడ పాయింట్. ఉదాహరణకు టీవీ వాళ్లు ఉన్నారు. వాళ్లు ఈ రోజు షూటింగ్ చేసి ఆ కంటెంట్‌ను అమ్మితే ఓ యాభైవేల రూపాయలు లాభం వస్తుంది అనే గ్యారంటీ ఉంటుంది కాబట్టి వాళ్లు చేయొచ్చు. సినిమావాళ్లకి ఆ గ్యారంటీ ఎక్కడ ఉంటుంది? ఉపాధి కోసమే కదా బాలూ (ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం)గారు షూటింగ్ చేసింది. ఆయన పరిస్థితేంటి? లక్కీగా బయటపడ్డారు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఆయనకు, సినిమా పరిశ్రమకు ఎంత నష్టం జరిగేది. షూటింగ్ చేయటం, చేయకపోవటం అనేది పూర్తిగా వ్యక్తిగతం. కొంతమందికి చాలా ధైర్యం ఉంటుంది. వాళ్లు చేసుకోవచ్చు. నాలాంటి వాళ్లకు ధైర్యం ఉండదు. పరిస్థితులన్నీ నార్మల్ అయ్యాక, అన్నీ సక్రమంగా ఉన్నప్పుడే షూటింగ్స్ మొదలుపెడతాను. -
ఛలో ఫారిన్
సినిమా చిత్రీకరణలు మెల్లిగా ప్రారంభం అవుతున్నాయి. పకడ్బందీగా సినిమాలను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాయి చిత్రబృందాలు. విదేశీ షూటింగ్స్ వీలవుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంది. కానీ పక్కా ప్లానింగ్‌తో విదేశాల్లోనూ సురక్షితంగా చేయొచ్చు అని బాలీవుడ్లో ఓ చిత్రబృందం లండన్ వెళ్లి చూపించింది. మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా విదేశాలు ప్రయాణం అవుతున్నారు. ‘ఛలో ఫారిన్’ అంటున్న చిత్రబృందాల వివరాలు చూద్దాం. మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కనున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ షెడ్యూల్‌ను అమెరికాలో ప్లాన్ చేశారట. ఫారిన్ షెడ్యూల్‌తోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తారని టాక్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ టీమ్ అమెరికా ప్రయాణం ఉంటుందని సమాచారం. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రాధే శ్యామ్’. రాధా కృష్ణ దర్శకుడు. 1970ల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న లవ్‌స్టోరీ ఇది. లాక్డౌన్ ముందు వారం కూడా ఈ సినిమాలో ఓ కీలక షెడ్యూల్‌ను జార్జియాలో పూర్తి చేశారు చిత్రబృందం. కొన్ని కీలక ఎపిసోడ్ల కోసం మరోసారి విదేశాలు వెళ్తారని సమాచారం. యూవీ క్రియేషన్స్, గోపీ కృష్ణ మూవీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అక్షయ్ కుమార్: ఫారిన్లో షూటింగ్ ప్రారంభించిన తొలి చిత్రం అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బెల్ బాటమ్’. సుమారు 120 మందితో లండన్ వెళ్లింది ‘బెల్ బాటమ్’ టీమ్. 14 రోజులు క్వారంటైన్లో ఉండి ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించారు. సినిమా చిత్రీకరణ దాదాపు లండన్‌లోనే పూర్తి చేయనున్నారని సమాచారం. 1980లలో జరిగే కథాంశంగా ఈ చిత్రకథ ఉండబోతోంది. ఇందులో డిటెక్టివ్‌గా కనిపించనున్నారు అక్షయ్. హ్యూమా ఖురేషి, వాణీ కపూర్, లారా దత్తా ముఖ్య పాత్రలు చేస్తున్న ఈ చిత్రానికి రంజిత్ యం. తివారీ దర్శకుడు. ఆమిర్ ఖాన్: హాలీవుడ్ క్లాసిక్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ను ‘లాల్ సింగ్ చద్దా’గా హిందీలో రీమేక్ చేస్తున్నారు ఆమిర్ ఖాన్. ఈ ఏడాది డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. అయితే కోవిడ్ వల్ల వచ్చే ఏడాదికి విడుదలను పోస్ట్‌పోన్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణ సగం వరకూ అయిందట. మిగతా భాగాన్ని టర్కీలో పూర్తి చేస్తారట. దీనికి సంబంధించిన లొకేషన్స్ చూడటానికి ఇటీవలే టర్కీ కూడా వెళ్లి వచ్చారు ఆమిర్. త్వరలోనే ఈ చిత్రబృందం టర్కీ ప్రయాణం కానుంది. ఇందులో కరీనా కపూర్ కథానాయిక. అద్వైత్ చందన్ దర్శకుడు. షారుక్ ఖాన్: ‘జీరో’ (2018) తర్వాత రెండేళ్లు విరామం తీసుకున్నారు షారుక్. తాజాగా రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యారు. ఉపాధి కోసం వలస వెళ్లే హీరో చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని టాక్. పంజాబ్, కెనడా బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా షూటింగ్ జరగనుంది. సుమారు కొన్ని నెలలపాటు కెనడాలో చిత్రీకరణ కోసం ప్లాన్ చేస్తుందట చిత్రబృందం. ప్రస్తుతం ప్రయాణానికి కావాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. -
అవుట్‌సైడర్స్‌కి ప్లస్ అదే!
‘‘నెపోటిజమ్ కేవలం సినిమా పరిశ్రమలో మాత్రమే కాదు.. ప్రతి పరిశ్రమలోనూ ఉంది. అలానే బాలీవుడ్లో నెపోటిజమ్ ఉంది. బాలీవుడ్ ఒక ఫ్యూడల్ వ్యవస్థలా పని చేస్తోంది’’ అన్నారు హిందీ నటి స్వరా భాస్కర్. ‘తను వెడ్స్ మను, ప్రేమ్ రతన్ ధన్ పాయో, వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేశారు స్వర. ప్రస్తుతం బాలీవుడ్లో ‘ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్ సైడర్స్’ అనే చర్చ సాగుతోంది. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని ఇలా పంచుకున్నారు స్వరా భాస్కర్. ‘‘నెపోటిజమ్ గురించి అందరూ ఎలా అనుకుంటారంటే... ఒక్క సినిమాలో స్టార్ కిడ్ని పరిచయం చేస్తే చాలు వాళ్ల కెరీర్ సెట్ అయిపోయినట్టే అనుకుంటారు. కానీ అలా జరగదు. ప్రతీ సినిమాకి కష్టపడాలి. నిరంతర కృషే మనల్ని స్టార్‌గా నిలబెడుతుంది. అవుట్‌సైడర్‌గా ఉంటూ స్టార్ కిడ్స్ పరిస్థితి చూస్తే జాలిగా అనిపిస్తుంటుంది. వాళ్ల ఒత్తిడి, వాళ్ల మీద ఉండే అంచనాలు అలాంటివి. కానీ వాళ్లకు ఉండే అవకాశాలు తక్కువేం కాదు. అవుట్‌సైడర్‌గా మాకు కష్టంగా అనిపించే విషయాలు వాళ్లకు చాలా సులువుగా జరిగిపోతాయి. అయితే మనల్ని మనం నిరూపించుకోవడానికి ప్రస్తుతం చాలా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ‘వీళ్లు టాలెంట్‌తోనే ఎదిగారు’ అనే పేరు స్టార్ కిడ్స్‌తో పోల్చుకుంటే.. అవుట్‌సైడర్స్‌కి త్వరగా ఏర్పడుతుంది. అదే అవుట్‌సైడర్స్‌కి ప్లస్’’ అన్నారు. బాలీవుడ్లో ఉండే పోటీ గురించి చెబుతూ– ‘‘సినిమా అనేది పెద్ద పోటీ ప్రపంచం. నిరంతరం ఎవరో ఒకరితో మనం మనకు తెలిసోతెలియకో పోటీ పడుతూనే ఉంటాం. బయట చాలా మంది స్టార్ కిడ్స్‌కి చాలా పొగరు, వాళ్ల పవర్‌ను ఇతరుల మీద రుద్దాలనుకుంటారు అని అభిప్రాయపడుతుంటారు. కానీ ఇండస్ట్రీలో నేను రెండు రకాల వాళ్లతో (ఇన్సైడర్స్, అవుట్‌సైడర్స్) పని చేశా. ఎదుటివారితో చాలా చక్కగా ప్రవర్తించి, కష్టపడే మనస్థత్వం ఉన్నవాళ్లు, టైమ్ విషయంలో కచ్చితంగా ఉండేవాళ్లు ఎక్కువగా ఇన్సైడర్సే. కొందరు అవుట్‌సైడర్స్ స్టార్‌డమ్‌ను తలకెక్కించుకొని వాళ్ల స్టార్ స్టేటస్‌ను దుర్వినియోగం చేయడం గమనించాను. ఇది నేను ఎవ్వర్నీ ఉద్దేశించి చెప్పడం లేదు. నా అనుభవం ద్వారా చెబుతున్నాను. స్టార్‌డమ్‌ను దుర్వినియోగం చేయడానికి బ్యాక్‌గ్రౌండ్‌తో పని లేదు’’ అని వివరించారు స్వరా భాస్కర్. -
షూటింగ్స్ ప్రారంభించుకోండి!
కరోనా వల్ల ఏర్పడ్డ అనిశ్చితి అలానే ఉంది. సినిమా షూటింగ్స్ పరిస్థితి అయోమయంగా మారింది. ఒకటీ అరా తప్పిస్తే పెద్దగా షూటింగ్స్ జరుగుతున్న దాఖలాలు కనిపించడంలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఆల్రెడీ చాలా వరకూ సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతి ప్రకటించాయి. తాజాగా కేంద్రప్రభుత్వం కూడా సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతి ఇచ్చింది. అలాగే ఆరోగ్య శాఖ సూచనల మేరకు కొన్ని గైడ్ లైన్స్ కూడా తయారు చేసింది. ఆ గైడ్ లైన్స్ ఈ విధంగా.. ► కెమెరా ముందు ఉన్నప్పుడు తప్ప నటీనటులతో సహా సెట్లో ఉండే ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ► కాస్ట్యూమ్స్, విగ్, మేకప్ సామాన్లు ఒకరివి ఒకరికి వాడటం వీలైనంత తగ్గించేయాలి. ► చిత్రీకరణకు సంబంధించిన ప్రదేశాల్లో (కెమెరా ముందు కాకుండా) ఆరు అడుగులు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ► సెట్లో వీలైనన్ని చోట్ల హ్యాండ్ వాష్ చేసుకునే ఏర్పాటు చేయాలి. పని ప్రదేశాల్లో ఉమ్మేయడం నిషేధం. ► ఆరోగ్య సేతు యాప్‌ను (కోవిడ్ సోకిన వారికి మనం ఎంత దగ్గర/దూరంలో ఉన్నామో తెలియజేసే ప్రభుత్వం యాప్) అందరూ ఉపయోగించేలా చేయాలి. ► మెడికల్ టీమ్‌ను అందుబాటులో ఉంచాలి. మేకప్ గదులు, వ్యానిటీ వ్యాన్స్, బాత్రూమ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ► సెట్లో అడుగుపెట్టే చోట థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరి. కోవిడ్ లక్షణాలున్న వారిని అనుమతించకూడదు. ► పార్కింగ్ ప్రదేశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. అక్కడ కూడా వీలైనంత దూరం పాటించగలిగేలా చూసుకోవాలి. ► వీలైతే కోవిడ్ జాగ్రత్తలను తెలిపే పోస్టర్లు, వీడియోలను ఏవీలు రూపంలో ప్రదర్శించగలగాలి. ► పని చేసిన ప్రదేశంలో ఎవరికైనా పాజిటివ్ అని నిర్ధారణ అయితే వెంటనే శానిటైజ్ చేయాలి. ► అనారోగ్యం అనిపిస్తే వెంటనే టీమ్‌కు త్వరగా రిపోర్ట్ చేయాలి. అశ్రద్ధ చేయకూడదు. ► లొకేషన్లో తక్కువ మంది ఉండేలా చూసుకోవాలి. విజిటర్స్‌ను, ఆడియన్స్‌ను లొకేషన్లోకి అనుమతించకూడదు. ► స్టూడియోల్లో ఒకేసారి రెండు మూడు సినిమా యూనిట్లు ప్యాకప్ చెప్పకుండా టైమింగ్స్ విషయంలో జాగ్రత్తలుపడాలి. ► సినిమా పరికరాల్ని ఉపయోగించే ప్రతి ఒక్కరూ గ్లౌజ్ ధరించాలి. మేకప్ ఆర్టిస్ట్‌లు, హైయిర్ డ్రెస్సర్లు తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాలి. ‘‘ఈ నిర్ణయాన్ని అందరూ గౌరవిస్తారని, ముఖ్యంగా సినిమాకు సంబంధించిన వాళ్లు హర్షిస్తారని అనుకుంటున్నాం. సినిమా అనేది ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకమైనది. అలానే సినిమా ఎంతో మందికి ఉపాధి కలిగిస్తుంది. సినిమా నిర్మాణం అనేది పెద్ద వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థ తిరిగి పుంజుకోవాలి, ఎప్పటిలానే మళ్లీ పరిగెత్తాలని షూటింగులకు ప్రభుత్వం అనుమతించింది’’ అన్నారు సమాచార మరియు ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. -
కమలాకర్ రెడ్డి మృతి తీరని లోటు
‘‘పంపిణీదారుడు, నిర్మాత గుండాల కమలాకర్ రెడ్డి మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు’’ అని నిర్మాత చదలవాడ శ్రీనివాస్ అన్నారు. నల్గొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాకర్ రెడ్డి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ఆయన సంతాప సభలో చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘20 ఏళ్ల క్రితం ‘అభయ్’ సినిమాతో కమలాకర్ రెడ్డి, జనార్దన్ నాకు పరిచయం. కమలాకర్ మన మధ్య లేకపోయినా అతని మంచి ఆశయాలు మనతోనే ఉంటాయి’’ అన్నారు. ‘‘300 యోధులు, 1000 బీసీ, బలాదూర్’ వంటి ఎన్నో మంచి చిత్రాలను పంపిణీ చేశారు కమలాకర్ రెడ్డిగారు. ముంబయ్‌లో ఉన్న పెద్ద పెద్ద సంస్థలు కమలాకర్‌గారి కె.ఎఫ్.సి సంస్థను సంప్రదించేవి. జనార్దన్‌గారు కమలాకర్‌గారి కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నా’’ అన్నారు నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్. ‘‘మంచి సినిమాలు చేస్తూ పంపిణీదారునిగా మంచి పేరున్న కమలాకర్ రెడ్డిగారు మన మధ్య లేకపోవడం బాధాకరమైన విషయం’’ అని ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు, నిర్మాత ముత్యాల రామ్‌దాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు వి.ఎల్. శ్రీధర్, ‘ఈనాడు’ సినిమా నిర్మాత కుమార్ బాబు, ‘మాతృదేవోభవ’ దర్శకుడు అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆరు చిత్రాలు.. 750 కోట్లు
‘మీరు క్షేమంగా తిరిగి రావాలి.. వచ్చేస్తారు’... సంజయ్ దత్‌ని ఉద్దేశించి ఆయన అభిమానులు అంటున్న మాటలివి. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందని ఇటీవల సంజయ్ దత్ ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షలు నిర్వహిస్తే ఊపిరి తిత్తుల క్యాన్సర్ అని తేలింది. సంజయ్ ఆరోగ్యం ఏమవుతుందో అని ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలయింది. ప్రస్తుతం ఆయన చేతుల్లో ఉన్న సినిమాల సంగతేంటి? అనే చర్చ కూడా ఇండస్ట్రీ సర్కిల్లో మొదలయింది.ఈ అనారోగ్యానికి సంబంధించిన చికిత్స కోసం అమెరికా వెళతారని, సింగపూర్ ప్రయాణం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ముందస్తు చికిత్స కోసం ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరారు సంజయ్ దత్. ఆయన చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి. సంజయ్ దత్ కోలుకుని వచ్చేవరకూ ఆ చిత్రాల షూటింగ్స్ ప్లాన్ చేయడానికి లేదు. ఇక ఆ సినిమాల వివరాలు చూద్దాం. రణ్ బీర్ కపూర్ హీరోగా యశ్ రాజ్ సంస్థ ఓ భారీ పీరియాడికల్ చిత్రం నిర్మిస్తోంది. ‘షంషేర్’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సంజయ్ దత్తో తలపడనున్నారు రణ్‌బీర్ కపూర్. సంజయ్‌ది పవర్ఫుల్ విలన్ రోల్. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయింది. ఈ సినిమా చిత్రీకరణలోనే సంజయ్ దత్ అస్వస్థతకు గురయ్యారు. సుమారు 50 శాతం చిత్రీకరణ మిగిలి ఉందని సమాచారం. అజయ్ దేవగన్ హీరోగా 1971 ఇండో–పాక్ యుద్ధం సమయంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’. ఇందులో కీలక పాత్ర చేస్తున్నారు సంజయ్ దత్. ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా మిగిలి ఉంది. ఈ సినిమాను హాట్ స్టార్‌లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. సంజయ్ దత్ చేస్తున్నవాటిలో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్రం ‘కేజీఎఫ్ 2’. తొలి భాగం సాధించిన భారీ విజయంతో రెండో భాగం పై అంచనాలు ఏర్పడ్డాయి. సెకండ్ పార్ట్‌లో విలన్‌గా నటిస్తున్నారు సంజయ్. ఓ షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. ‘‘చికిత్స వీలైనంత త్వరగా పూర్తి చేసి షూటింగ్లో పాల్గొంటానని సంజయ్ పేర్కొన్నారు’’ అని ఈ చిత్రబృందం తెలిపింది. ఇటీవలే ఈ చిత్రంలో సంజయ్ లుక్ కూడా విడుదల చేశారు. పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఆధారంగా ‘పృథ్వీరాజ్’’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అక్షయ్ కుమార్ హీరో. ఈ సినిమాలోనూ సంజయ్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కూడా 50 శాతం మిగిలి ఉంది. అలానే ఆయన ముఖ్య పాత్రలో నటిస్తున్న ‘తోర్భాజ్’ కూడా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. లాక్డౌన్ కారణంగా కొన్ని చిత్రాల షూటింగ్స్‌కి బ్రేక్ పడింది. త్వరలో మళ్లీ చిత్రీకరణ ప్రారంభించాలని ఈ చిత్రాల నిర్మాతలు అనుకుంటున్నారు. ఈలోపు సంజయ్ దత్ ఇలా అనారోగ్యంతో ఆస్పత్రిపాలయ్యారు. ఆయన త్వరగా కోలుకొని చిత్రీకరణలో పాల్గొనాలని కోరుకుందాం. గెట్ వెల్ సూన్ సంజూ! మహేష్ భట్ దర్శకుడిగా కమ్ బ్యాక్ ఇస్తున్న చిత్రం ‘సడక్ 2’. 1991లో సంజయ్ దత్తో మహేష్ భట్ చేసిన ‘సడక్’ సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. ‘హాట్ స్టార్’లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేశారట. 750 కోట్ల బిజినెస్ సంజయ్ దత్ చేతిలో ఉన్న సినిమాల్లో ‘షంషేర్, పృథ్వీ రాజ్, కేజీఏఫ్ 2’ భారీ బడ్జెట్ చిత్రాలే. మిగతావి మీడియమ్ రేంజ్ చిత్రాలు. ఆయన కమిట్ అయన ఆరు చిత్రాల బడ్జెట్ సుమారు 750 కోట్లు అని సమాచారం. సంజయ్ చేతిలో ఉన్న సినిమాలు 1. సడక్ 2 (పూర్తయింది) 2. భూజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. 3. కేజీఎఫ్ 2 4. షంషేర్ 5. పృథ్వీరాజ్ 6. తొర్భాజ్ -
వర్చువల్ వరం!
మనకు తెలియని సరికొత్త ప్రపంచంలోకి, ఎప్పుడూ చూడని ప్రదేశంలోకి తీసుకెళ్లి ప్రేక్షకులను నోరెళ్లబెట్టేలా చేయడం సినిమాకు కొత్త కాదు. ఎప్పటికప్పుడు మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో సినిమా తీసే విధానం మారుతూ వస్తోంది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఒక్క యాక్టరే ఇద్దరుగా కనబడితే సంబరపడిపోయాం. ఆ తర్వాత గ్రాఫిక్స్ మాయాజాలం చూశాం. 3డీ సినిమాలు వచ్చాయి. లైవ్ యాక్షన్ టెక్నాలజీతో సినిమాలు వచ్చాయి. మారుతున్న సాంకేతికత, ప్రేక్షకుడి అభిరుచి – సినిమాను కొత్త విధానాలు అనుసరించేలా చేస్తూ వస్తోంది. ప్రస్తుతం ‘వర్చువల్ ప్రొడక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్’తో మన దేశంలో సినిమా రూపొందనుంది. కరోనా వల్ల ఏర్పడ్డ పరిస్థితుల్లో ఈ టెక్నిక్కే భవిష్యత్తు కాబోతోందా? వేచి చూడాలి. ఇండియాలో ఇదే తొలిసారి! మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఆయన హీరోగా తెరకెక్కబోయే కొత్త చిత్రాన్ని పూర్తిగా ‘వర్చువల్ ప్రొడక్షన్’ పద్ధతిలో చిత్రీకరించనున్నట్టు ప్రకటించారు. ఈ పద్ధతిలో తెరకెక్కనున్న పూర్తి స్థాయి తొలి భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఈ చిత్రానికి కాన్సెప్ట్–డైరెక్షన్ గోకుల్ రాజ్ భాస్కర్. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని పృథ్వీరాజ్ నిర్మాణ సంస్థ పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్‌తో పాటు మ్యాజిక్ ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. టైటిల్ ఇంకా ప్రకటించని ఈ చిత్రం 5 భాషల్లో (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) విడుదల కానుంది. ‘‘సినిమాలు తెరకెక్కించడంలో ఇదో కొత్త చాప్టర్. పరిస్థితులు మారుతున్నప్పుడు, కొత్త ఛాలెంజ్‌లు ఎదురవుతున్నప్పుడు మనం కూడా కొత్త పద్ధతులను అనుసరించాలి. ఈ కథ త్వరగా మీ అందరికీ చెప్పాలనుంది’’ అని పేర్కొన్నారు పృథ్వీరాజ్. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఏంటీ వర్చువల్ ప్రొడక్షన్? నిజమైన లొకేషన్స్‌లో సినిమాను చిత్రీకరించలేనప్పుడు గ్రీన్ మ్యాట్ (గ్రీన్ స్క్రీన్) ఉపయోగించి చిత్రీకరణ జరుపుతారు. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా అక్కడే (నిజమైన లొకేషన్లో) చిత్రీకరించినట్టు మారుస్తారు. ప్రస్తుతం సినిమాల్లో కొన్ని సన్నివేశాలను ఇలానే తీస్తున్నారు. దీనితో వచ్చిన చిక్కేంటి? అంటే పోస్ట్ ప్రొడక్షన్ అయ్యే వరకు ఆ సన్నివేశం ఎలా వస్తుందో ఎవ్వరికీ పక్కాగా తెలియదు. సరిగ్గా కుదరకపోతే ప్రేక్షకుడి పెదవి విరుపులు వినాల్సి వస్తుంది. వర్చువల్ ప్రొడక్షన్ విషయానికి వస్తే.. సినిమా మొత్తం స్టూడియోలోనే పూర్తి చేయొచ్చు. ఇది పెద్ద ప్లస్ పాయింట్. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇది పెద్ద ప్లస్ పాయింట్. లొకేషన్స్ కోసం అటూ ఇటూ తిరిగే పని పూర్తిగా తగ్గిపోతుంది. నటీనటులందరూ గ్రీన్ మ్యాట్ ముందే నటిస్తారు. 3డీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల నిజమైన లొకేషన్లో ఉన్నభావన కలుగుతుంది. ఇంకో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే సన్నివేశం చిత్రీకరిస్తున్నప్పుడే సీన్ ఎలా ఉండబోతోందో దర్శకుడు మానిటర్ లో చూసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్‌తో పెద్దగా పని ఉండదు. ఈ టెక్నాలజీ వల్ల వినూత్న కథలకు మరింత ఆస్కారముంటుంది. పండోరా గ్రహం టెక్నిక్ అదే ఆల్రెడీ హాలీవుడ్లో ‘వర్చువల్ ప్రొడక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్’తో సినిమాలు తెరకెక్కుతున్నాయి కూడా. జేమ్స్ కామెరూన్ ఈ టెక్నాలజీని ఉపయోగించే ‘అవతార్’ని (2019) సృష్టించగలిగారు. ఈ సినిమాను మొత్తం వర్చువల్ ప్రొడక్షన్ ఉపయోగించే పూర్తి చేశారు. ఈ చిత్ర కథాంశం ‘పండోరా’ అనే గ్రహంలో జరుగుతుంది. అదంతా ఊహాజనిత ప్రదేశం. దానికి ఈ టెక్నాలజీ బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్స్ కూడా ఈ టెక్నాలజీతో పాటు మరింత సాంకేతికతతో తెరకెక్కుతున్నాయి. ఇదే టెక్నాలజీతో ‘లయన్ కింగ్, రెడ్ ప్లేయర్ వన్’ వంటి చిత్రాలు తెరకెక్కాయి. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్స్ జరగడమే పూర్తిగా తగ్గిపోయింది. పరిస్థితులు ఎప్పుడు మామూలుగా మారుతాయో తెలియదు. మళ్లీ ఎప్పటిలా సినిమా చిత్రీకరణలు చేయగలమా? లేదా? అనే చిన్న సందేహం చాలామందిలో ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఎదురయ్యే ఛాలెంజ్‌లను ఎదుర్కొని సినిమాలు తీయడానికి ఇలాంటి కొత్త పద్ధతులను అనుసరించాల్సి ఉంటుంది. ఈ కొత్త పద్ధతులు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని ఇవ్వలేకపోతే మాత్రం ప్రయత్నం వృథా అవుతుంది. అందుకే ప్రేక్షకుడిని మెప్పించేలా సినిమా ఉండాలి.. అలాగే నిర్మాతకు నాలుగు డబ్బులు మిగలాలి. అప్పుడే ‘వర్చువల్’లాంటి టెక్నాలజీలు వరం అవుతాయి. -
స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే
ఆ నడకలో ఓ స్టయిల్... సిగిరెట్ అలవోకగా ఎగరేయడం ఓ స్టయిల్... కూలింగ్ గ్లాస్‌ని కూల్‌గా ఎగరేయడం ఓ స్టయిల్... అందుకే ‘స్టయిలు స్టయిలులే.. ఇది సూపర్ స్టయిలులే..’ పాట రజనీకాంత్ స్టయిల్‌కి తగ్గట్టు ఉంటుంది. కండక్టర్‌గా ఉన్నప్పుడు ప్రయాణికులకు టికెట్లు తెంచారు రజనీ. యాక్టర్ అయ్యాక ప్రేక్షకులు ఆయన సినిమా టిక్కెట్లు తెంచారు. నేటితో తమిళ పరిశ్రమకు రజనీ పరిచయమై 45 ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రయాణం గురించి స్పెషల్ స్టోరీ. సరిగ్గా ఇదే రోజు (ఆగస్ట్ 15), నలభై ఐదేళ్ల క్రితం తమిళ సినిమాకు ఓ కొత్త ముఖం పరిచయం అయింది. అప్పుడెవ్వరూ ఉహించి ఉండకపోవచ్చు.. తమిళ సినిమాకి ముఖం అతనే అవుతాడని. దర్శకుడు బాలచందర్ కనుగొన్న ముత్యాల్లో ఒకరు రజనీకాంత్. కె. బాల చందర్ దర్శకత్వంలో ‘అపూర్వ రాగంగళ్’ చిత్రం ద్వారా పరిచయం అయ్యారు రజనీకాంత్. ఆ సినిమాలో కమల్ హాసన్ హీరో. రజనీ కీలక పాత్ర చేశారు. తర్వాత కన్నడంలో ‘కథా సంగమ’లో ఓ చిన్న పాత్ర చేశారు. వెంటనే తెలుగు చిత్రం ‘అంతులేని కథ’కి రజనీని తీసుకున్నారు బాలచందర్. ‘మూండ్రు ముడిచ్చు’ సినిమాలో ప్రాముఖ్యం ఉన్న పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో రజనీ గాల్లోకి సిగిరెట్ విసిరేసే విధానానికి విజిల్స్ పడ్డాయి. రజనీ అనేవాడు ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యాడు. ‘చిలకమ్మ చెప్పింది’ సినిమాలో తొలిసారి పూర్తిస్థాయి లీడ్ రోల్ లో నటించారు రజనీ. తెలుగులో హీరో అయినప్పటికీ తమిళంలో పూర్తి స్థాయి హీరోగా మారలేదు రజనీ. దర్శకుడు ఎస్పీ ముత్తురామన్ ఆ ప్రయోగం చేశారు. ‘భువనా ఒరు కేళ్విక్కురి’లో విలన్ గా కాకుండా మంచి పాత్రలో కనబడ్డారు. ప్రయోగం ఫలించింది. ఆ తర్వాత ఎస్పీ– రజనీ కాంబినేషన్లో సుమారు 24 సినిమాలు వచ్చాయి. ఒక్క ఏడాదిలో 20 సినిమాలు 1978 రజనీకు మరచిపోలేని ఏడాది. ఆ సంవత్సరం తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఆయనవి 20 సినిమాలు విడుదలయ్యాయి. ‘భైరవి’తో తమిళంలో సోలో హీరోగా తొలి సినిమా చేశారు. ‘వణకత్తుక్కురియ కాదలియే’లో రజనీకు ఇంట్రడక్షన్ సాంగ్ పెట్టారు. ఆ తర్వాత అదే ట్రెండ్ అయింది. ‘ముళ్ళుమ్ ములరుమ్’ మంచి పేరు తెచ్చిపెట్టింది. యాక్టింగ్‌కి టాటా నాలుగేళ్లలో సుమారు 50 సినిమాలు పూర్తి చేశారు రజనీ. అయినప్పటికీ సాలిడ్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ కొదవయింది. ఇంకా నటుడిగా కొనసాగుదామా? ఆపేద్దామా? అనే ఆలోచనలో పడ్డారట రజనీ. కానీ 1980లో వచ్చిన ‘బిల్లా’ ఆయన ప్రయాణాన్ని మార్చేసింది. ఆ తర్వాత ‘తిల్లు ముల్లు’ (1981)లో వంటి కామెడీ టచ్ ఉన్న సినిమా చేశారు రజనీ. అప్పటికి మంచి కమర్షియల్ హీరోగా దూసుకెళుతున్న రజనీ ఆధ్యాత్మిక సినిమా ‘శ్రీ రాఘవేంద్ర’ (1985) చేశారు. ఇందులో రాఘవేంద్ర స్వామి పాత్రను చేశారు రజనీ. ఇది ఆయనకు నూరవ సినిమా. రజనీ స్టార్ నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన పీరియడ్ 1990–2000. ఆ పదేళ్లల్లో చేసిన ’దళపతి’, ‘అన్నామలై’, ‘బాషా’, ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘నరసింహ’ వంటి బ్లాక్‌బస్టర్స్ ఉన్నాయి. 2000 –2020 ‘నరసింహా’ సూపర్ సక్సెస్ తర్వాత రజనీ చేసిన ‘బాబా’ ఘోరపరాజయాన్ని చవి చూసింది. ఆ తర్వాత మూడేళ్లు విరామం తీసుకుని, మళయాళ చిత్రం ‘మణిచిత్ర తాళు’ తమిళ రీమేక్ ‘చంద్రముఖి’లో నటించారు. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్ లో ‘శివాజీ’ చేశారు. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే ‘రోబో’(2010) వచ్చింది. ఇండియన్ ఇండస్ట్రీలో అప్పటి వరకు అంత నిర్మాణం (దాదాపు 200 కోట్ల బడ్జెట్)తో ఏ సినిమా తెరకెక్కలేదు. ఆ తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో బాధపడ్డారు రజనీ. నాలుగేళ్ల విరామం తర్వాత తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో రజనీ చేసిన ‘కొచ్చాడియాన్’ (విక్రమ సింహా), ఆ తర్వాత చేసిన ‘లింగ’ అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ‘కబాలి’ కూడా హైప్ ను మ్యాచ్ చేయలేకపోయింది. ఆ తర్వాత ‘కాలా, 2.0, పేట్టా, దర్బార్’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు రజనీకాంత్. హిమాలయాలకు.. రజనీ విడిగా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఒకసారి ఓ గుడికి మామూలు లుంగీ, చొక్కాతో వెళ్లిన రజనీని గుర్తు పట్టక ఒకావిడ 10 రూపాయలు ఇచ్చింది. రజనీ నవ్వుతూ ఆ నోటుని తీసుకున్నారు. లగ్జరీ కారు ఎక్కుతున్న ఆయన్ను చూసిన ఆవిడ ‘రజనీకాంత్’ అని గ్రహించింది. దగ్గరకెళ్లి క్షమాపణ చెబితే, రజనీ నవ్వేశారు. ఏడాదికి ఓసారి హిమాలయాలకు వెళతారు. కొన్ని రోజులపాటు ధ్యానం చేస్తారు. పై పై మెరుగులకు ప్రాధాన్యం ఇవ్వడం వృథా అంటారు రజనీ. అందుకే స్టార్ అయినప్పటికీ సామాన్యుడిలానే ఉంటారు. దటీజ్ రజనీకాంత్. రజనీ పంచ్ డైలాగ్స్ ► అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశ పడే మగవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. (నరసింహ) ► ఈ బాషా ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టు. (బాషా) ► దేవుడు శాసిస్తాడు. ఈ అరుణాచలం పాటిస్తాడు. (అరుణాచలం) ► నాన్నా పందులే గుంపుగా వస్తాయి సింహం సింగిల్‌గా వస్తుంది. (శివాజీ) ► నా దారి రహదారి. బెటర్ డోంట్ కమిన్ మై వే. (నరసింహ). -
కొత్తవారి కోసం వేదిక ఏర్పాటు చేస్తున్నా!
‘‘దివంగత నటుడు, దర్శక–నిర్మాత ఎం. ప్రభాకర రెడ్డిగారిది మా పక్క ఊరు. ఆ పరిచయం వల్ల ఆయన నన్ను సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. ఆయన తీసుకుని రాకుంటే నాకు ఇండస్ట్రీలో ఓ వేదిక దొరికేది కాదు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను’’ అని దర్శకుడు, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్.శంకర్ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘ఎన్కౌంటర్’ 1997 ఆగస్టు 14న విడుదలైంది. రెండో చిత్రం ‘శ్రీరాములయ్య’ 1998 ఆగస్టు 14న విడుదలైంది. దర్శకునిగా నేటితో ఆయన ప్రయాణం 23ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో శంకర్ చెప్పిన విశేషాలు. ► ఈ 23 ఏళ్ల ప్రయాణం ఎలా అనిపిస్తోంది? ఇండస్ట్రీలో నా ప్రయాణం 36 ఏళ్లు. అయితే దర్శకునిగా మాత్రం 23 ఏళ్లు. నా మొదటి చిత్రం ‘ఎన్కౌంటర్’, రెండో సినిమా’ శ్రీరాములయ్య’ ఏడాది గ్యాప్‌లో ఒకే రోజు విడుదలయ్యాయి. ఇది అనుకోకుండా జరిగింది. ప్రతి సినిమాని ఓ కమిట్మెంట్తో చేశా. సినిమా అనేది నాకు ఇష్టమైన వృత్తి కావడంతో 100శాతం సంతృప్తిగా ఉంది. ► ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చాక మీరు సినిమాలు తీయడం తగ్గించినట్టున్నారే? అలాంటిదేం లేదు. ఓ వైపు సేవ చేస్తున్నాను. మరోవైపు కథలు రాసుకుంటున్నాను. నాకు కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో అంతర్జాతీయ స్థాయి స్టూడియో కట్టేందుకు భారతదేశంలోని వివిధ స్టూడియోలతో పాటు విదేశాల్లోని వాటిని కూడా పరిశీలిస్తున్నా. వాటి డిజైన్స్ తీసుకుంటున్నా. ► కేసీఆర్‌తో ఓ సినిమా చేయాలనుకున్నారట? 2001 నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. ఆయన, నేను కలిసి ‘బతుకమ్మ’ సినిమా చేద్దామనుకున్నాం. తెలంగాణ ఎందుకు రావాలి? అని కేసీఆర్‌గారి వద్ద మంచి కథ ఉండేది. నా దర్శకత్వంలోనే ఆ సినిమా చేద్దామనుకున్నాం. అప్పటికి నాకు వరుస హిట్స్ ఉన్నాయి. బాగా వర్కవుట్ అయ్యేది? కానీ చేయలేకపోయాం. ‘జై బోలో తెలంగాణ’ సినిమాకి నాకు ఉత్తమ దర్శకుడిగా అవార్డు వచ్చింది. దానిపైనా కొందరు కోర్టుకు వెళితే ‘ఎందుకివ్వకూడదు? ఆయన ఆ అవార్డుకు అర్హుడే’ అంటూ ఆ కేసు కొట్టేశారు. ఆ సినిమా విడుదల తర్వాత తెలంగాణ ప్రభుత్వం అవార్డు ఇవ్వడంలో తప్పేం లేదని ఆంధ్రలోనూ చాలామంది అనుకున్నారు. ► దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? 2008 నుంచి 2010 వరకూ తొలిసారి అధ్యక్షుడిగా చేశా. 2018న మళ్లీ ఎన్నికై కొనసాగుతున్నా. డైరెక్టర్స్ వెల్ఫేర్‌కి సంబంధించి చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాం. ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం. దానికి అధ్యక్షుడిగా రాఘవేంద్రరావుగారు, మేనేజింగ్ ట్రస్టీగా నేను ఉన్నాను. కరోనా సమయంలో సభ్యులకు 5వేల రూపాయల చొప్పున ఇచ్చాం. చిరంజీవిగారి ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘కరోనా క్రైసిస్ చారిటీ’(సీసీసీ) ద్వారా సినీ కార్మికులకు ఇప్పటికే రెండు విడతలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. వినాయక చవితికి మూడో విడత ఇవ్వబోతున్నాం. ► కొత్త ప్రాజెక్టులు ఏమైనా? రెండు సినిమాలకు కథలు రెడీ చేశా. వాటికి నేనే దర్శకత్వం వహిస్తా. ► కొత్తవారికి అవకాశాలు కల్పించడానికి ఓ సంస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నారని విన్నాం... అవును. నాకు సినిమా నేపథ్యం లేదు. చాలా కష్టాలు ఎదుర్కొన్నా..మెట్టు మెట్టు ఎక్కుతూ వచ్చా.. డా. ఎన్ ప్రభాకర్ రెడ్డిగారు అవకాశం ఇవ్వడం వల్ల నేను ఇండస్ట్రీకి వచ్చాను. కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనతో ‘ఆయుధం’ సినిమా ద్వారా ఐదు మంది పాటల రచయితలను పరిచయం చేశా. ఆ తర్వాత చాలా మంది అవకాశాల కోసం నన్ను సంప్రదించారు. కానీ నేను అందరికీ ఇవ్వలేను కదా? అందుకే ప్రతిభ ఉన్న కొత్తవారిని ప్రోత్సహించేందుకు ఓ వేదిక ఉంటే బాగుంటుందనిపించింది. ‘వేదిక’ అనే ఓ సంస్థని ఏర్పాటు చేస్తున్నా. దీని ద్వారా నూతన నటీనటులు, రచయితలు, దర్శకులు, సింగర్స్, సంగీతం... ఇలా అన్నివర్గాల వారిని ప్రోత్సహిస్తాం. ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తాం.. ఇప్పటికే ఐదు వెబ్ సిరీస్‌కి కథలు రెడీ చేయించాం. కొత్తవారికి ఓ ‘వేదిక’ ఉందనేలా చేస్తాం. ► హైదరాబాద్‌లో ఫిల్మ్ స్టూడియో కట్టబోతున్నానన్నారు.. ఆ ప్రయత్నాలు ఎంత వరకూ వచ్చాయి? 1984 తర్వాత ప్రభుత్వాలు స్టూడియోలు కట్టుకునేందుకు ఎవరికీ స్థలాలు ఇవ్వలేదు. 2003లో స్టూడియో కోసం ఓసారి దరఖాస్తు చేసినా పట్టించుకోలేదు. 2012లో మళ్లీ దరఖాస్తు చేయగా పరిశీలనలోకి వెళ్లింది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, కేసీఆర్‌గారు సీఎం అయ్యారు. స్టూడియో కోసం 15 ఎకరాల స్థలం కావాలని ఆయన్ని కోరగా 2019 జూన్‌లో 5 ఎకరాలు నాకు కేటాయించారు. ఏ స్టూడియోకి అయినా 10 నుంచి 15 ఎకరాలుండాలి. కానీ 5 ఎకరాల్లోనే చాలెంజింగ్‌గా తీసుకుని అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయి. – దేరంగుల జగన్ -
మీరు లేకపోతే నేను లేను!
రజనీకాంత్... కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ సినిమా సూపర్ స్టార్. స్టయిల్‌తో, గ్రేస్‌తో భాష, ప్రాంతానికి సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. రజనీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 45 ఏళ్లు కావస్తోంది. 1975లో ‘అపూర్వ రాగంగళ్’ ద్వారా తెరపై కనిపించారు. ఇన్నేళ్లుగా తనను ఆదరిస్తున్న వారికి ట్విట్టర్ ద్వారా రజనీ ధన్యవాదాలు తెలియజేశారు. ‘‘సినిమాల్లో నా ప్రయాణం 45 ఏళ్లుగా సాగుతోంది. నన్ను ఆదరించిన వాళ్లకు, ఈ ప్రయాణంలో తోడ్పడినవాళ్లకు, మరీ ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను లేను’’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్. -
హీరోయిన్స్; భ‘లేడీ విలన్లు’
హీరోయిన్స్ అంటే...? ఐ క్యాండీగా స్క్రీన్‌ను కలర్ఫుల్గా మార్చేవాళ్లు. బబ్లీనెస్‌తో హీరోను బబుల్‌గమ్‌లా చుట్టుకునేవాళ్లు. పాటల వరకూ కనిపించి వెళ్లిపోయేవాళ్లు. హీరోయిన్ల పాత్రల డిజైన్‌లో మనకు తరచూ వినిపించే కామెంట్స్ ఇవి. హీరోయిన్‌కి స్ట్రాంగ్ రోల్స్‌తో వస్తున్న సినిమాలు తక్కువే. మెల్లిగా ఈ ధోరణి మారుతున్నట్టు కనిపిస్తోంది. లేడీ ఓరియంటెడ్ సినిమాల ఆదరణ పెరుగుతోంది. హీరోయిన్లు పవర్ ఫుల్ రోల్స్ చేస్తున్నారు. నెగటివ్ రోల్స్‌లోనూ కనిపిస్తున్నారు. సీత మంచి అమ్మాయి అనే పాత్రలే కాకుండా నెగటివ్ సైడ్‌ని ఆవిష్కరించి భలేడీ విలన్లు అనిపించు కుంటున్నారు. విలన్ – నయన్ హిందీ చిత్రం ‘అంధాధూన్’ ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. టబు, ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ఇది. ఇందులో టబు చేసిన నెగటివ్ షేడ్ ఉన్న పాత్రకు విశేష స్పందన లభించింది. ప్రస్తుతం ‘అంధాధూన్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. టబు పోషించిన పాత్రకు నయనతారను సంప్రదించినట్టు సమాచారం. నయన్ కూడా ఈ ప్రాజెక్ట్‌కి సుముఖంగానే ఉన్నట్టు సమాచారం. ఈ పాత్ర విషయానికి వస్తే.. తనకు ఇబ్బందిగా అనిపిస్తే చంపేయడానికి కూడా వెనకాడని పాత్ర తనది. సినిమా కథకు కీలకమైన పాత్ర ఇది. నయనతార టెర్రరిస్ట్ స్యామ్ సమంత తన కెరీర్లో ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. కమర్షియల్ సక్సెస్‌తో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘ఓ బేబీ’తో మంచి ఫామ్‌లో ఉన్నారు. తాజాగా వెబ్స్పేస్లోకి అడుగుపెడుతున్నారు స్యామ్. వెబ్ ఎంట్రీ స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేశారు. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ‘ది ఫ్యామిలీ మేన్’ సిరీస్ రెండో పార్ట్‌లో సమంత కూడా జాయిన్ అయ్యారు. ఇందులో సమంత నెగటివ్ పాత్రలో నటించారు. టెర్రరిస్ట్‌గా కనిపిస్తారని సమాచారం. చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే ప్రసారం కానుంది. సమంత కనులతో దోచారు దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘కనులు కనులను దోచాయంటే’. ఫిబ్రవరిలో విడుదలయిన ఈ చిత్రం మంచి హిట్ అయింది. ఇందులో రీతూ అమాయకంగా కనిపించే దొంగ పాత్ర చేశారు. తెలివిగా ప్లాన్ చేసి మోసాలు చేశారు. ‘పెళ్లి చూపులు’తో ఒకలాంటి ఇమేజ్ ని సంపాదించుకొని ఇలాంటి పాత్ర చేయడంలో రీతు విభిన్నత కనిపిస్తుంది. ‘కనులు కనులను..’ చిత్రంతో తాను నెగటివ్ క్యారెక్టర్స్ చేయగలనని నిరూపించుకున్నారు రీతూ వర్మ. ‘కనులు కనులు దోచాయంటే’లో రీతూ వర్మ సీతతో వీజీ కాదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటించిన చిత్రం ‘సీత’. తేజ దర్శకుడు. ఈ సినిమాలో కాజల్ పాత్రలో కొంచెం నెగటివ్ యాంగిల్ ఉంది. తనది పక్కా ప్రాక్టికల్ బిజినెస్ ఉమెన్ పాత్ర. డబ్బు కోసం తెలివితేటలతో మోసం చేయడం తప్పు కాదని నమ్మే పాత్ర తనది. అందులో పెద్ద తప్పు కూడా లేదనుకుంటుంది ఆ పాత్ర. అప్పటివరకూ పాజిటివ్ క్యారెక్టర్స్ లో కనిపించిన కాజల్ ‘సీత’లో అందుకు భిన్నంగా కనిపించి, ప్రసంశలు దక్కించుకోగలిగారు. ‘సీత’లో కాజల్ అగర్వాల్ బోల్డ్ ఎంట్రీ తొలిసారి తెరపై కనబడినప్పుడే ప్రేక్షకుల ప్రేమను పొందాలనుకుంటారు ఎవరైనా. కానీ పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా ‘ఆర్ఎక్స్ 10’లో భిన్నమైన పాత్ర ఎంచుకున్నారు. ఈ సినిమాలో కొంచెం హాట్‌గా కనిపించారు. అలాగే సినిమాలో ఆమెది విలన్ పాత్ర. స్వార్థం కోసం ప్రేమించి మోసం చేయడానికి కూడా వెనకాడని పాత్ర తనది. మామూలుగా పాజిటివ్ క్యారెక్టర్స్ కన్నా నెగటివ్ క్యారెక్టర్స్ చేయడం కష్టం అంటారు. ఆ విధంగా తొలి సినిమాతోనే పాయల్ నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. ‘ఆర్ఎక్స్ 100’లో పాయల్ నల్ల విలన్ తమిళ నటి వరలక్ష్మి హీరోయిన్గా, లేడీ విలన్‌గా తమిళ సినిమాల్లో తరచూ కనిపిస్తున్నారు. ‘నల్ల’ విలన్ (మంచి విలన్) అని పేరు తెచ్చుకున్నారు కూడా.. ఆ మధ్య ‘సర్కార్, పందెం కోడి 2, తెనాలి రామకష్ణ’ చిత్రాల్లో నెగటివ్ ఛాయలున్న పాత్రల్లో కనిపించారు. ‘సర్కార్, తెనాలి రామకృష్ణ’ సినిమాల్లో పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలిగా ఆమె వేసిన ఎత్తులకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న ‘క్రాక్’లోను పవర్ ఫుల్ నెగటివ్ పాత్రలో కనిపించనున్నారు వరలక్ష్మి. వరుసగా విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ‘భలే’డీ విలన్ అనిపించుకుంటున్నారు వరలక్ష్మి. ‘పందెం కోడి 2’లో వరలక్ష్మీ మహా విలన్ అనిపించుకోవాలని... హీరోయిన్గా 49 సినిమాలు పూర్తి చేశారు హన్సిక. 50వ సినిమా మైలురాయి గుర్తుండిపోయేలా ఉండాలని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నారు. ప్రస్తుతం ‘మహా’ అనే చిత్రం చేస్తున్నారామె. ఇందులో హన్సిక పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. ‘హన్సిక మహా విలన్’ అని అందరితో అనిపించుకోవాలనే పట్టుదలతో నటనపరంగా చాలా కేర్ తీసుకున్నారట ఈ బ్యూటీ. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ‘మహా’లో హన్సిక ‘పాటల కోసం హీరోయిన్’ అనే గ్లామరస్ క్యారెక్టర్స్ కే పరిమితం కాకుండా వీలు కుదిరినప్పుడల్లా విలన్ పాత్రల్లో భ‘లేడీ విలన్లు’ అనిపించుకుంటున్న నాయికలను అభినందించాల్సిందే. -
మాలీవుడ్; అన్ లాక్
సినిమా నిర్మాణం అంటే వందల రోజుల పని. వందల మంది కష్టం. ప్రస్తుతం సినిమా నిర్మాణానికి కరోనా అడ్డుపడుతోంది. ఇక ముందు షూటింగులు ఎలా చేయాలా? అని ఆలోచనలో పడ్డారు దర్శక–నిర్మాతలు. పాత పద్ధతి పనికిరాదన్నప్పుడు కొత్త ఆలోచన పుడుతుంది. కొత్త దారి తయారవుతుంది. మలయాళం ఇండస్ట్రీ కరోనా ఛాలెంజ్‌ను స్వీకరించింది. స్టూడియోల గేట్లు అన్ లాక్ చేసింది. మేకప్ కిట్స్ అన్ లాక్ చేసింది. కార్ వ్యాన్లు అన్ లాక్ అయ్యాయి. ఇలా ఇప్పటివరకూ లాక్ చేసినవాటిని ‘అన్ లాక్’ చేసి, కొన్ని సినిమాల షూటింగ్‌ను మొదలుపెట్టింది. కొన్నింటిని పూర్తి చేసింది కూడా. ఆ వివరాలు... సౌత్ ఇండస్ట్రీలలో మలయాళం ఇండస్ట్రీ కాస్త చిన్నది. ‘లోకల్ ఈజ్ ఇంటర్నేషనల్’ అనేది వాళ్ల నినాదం. ఎక్కువ శాతం సినిమాలు కేరళ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించేస్తారు. దాదాపు సినిమాలన్నీ తక్కువ బడ్జెట్ లో పూర్తి చేస్తారు. మరీ ముఖ్యంగా కథలో బలం ఉండటమే ప్రధానంగా చూస్తారు. గత నాలుగైదేళ్లలో పలు ఉత్తమ సినిమాలు అందించిన ఇండస్ట్రీ ఇది. ప్రముఖ హీరోలందరూ ఏడాదికి కనీసం మూడు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటారు. ఇంత విరివిగా సినిమాలు చేసే ఇండస్ట్రీకి (అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల లాగానే) కరోనా షాక్ తగిలింది. మూడు నెలలు సినిమాల నిర్మాణం ఆగిపోయింది. అయితే త్వరగా తేరుకొని, పని ప్రారంభించిన తొలి ఇండస్ట్రీ ఇదే కావడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలతో పోల్చితే మలయాళ పరిశ్రమలో ఎక్కువగా షూటింగులు జరుగుతున్నాయి. కరోనా తర్వాత సగంలో ఆగిపోయిన సినిమాలను మళ్లీ మొదలుపెట్టడంతోపాటు కొత్త సినిమాలను కూడా ప్రకటించింది మాలీవుడ్. ప్రకటించడమే కాదు చిత్రీకరణ ప్రారంభించిది కూడా. లాక్ డౌన్ తర్వాత మొదలైన చిత్రాలు, వాటి విశేషాలు. లవ్ ‘అనురాగ కరిక్కిన్ వెళ్ళం, ఉండా’ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు ఖాలీద్ రెహ్మాన్. ప్రస్తుతం షైన్ టామ్ చాకో, రాజిష విజయన్ ముఖ్య తారలుగా ఆయన ‘లవ్’ అనే చిత్రం తెరకెక్కించారు. లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వం విధించిన గైడ్ లైన్స్ అనుసరిస్తూ ఈ షూటింగ్ ను ప్రారంభించారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయడానికి నెల రోజులు కూడా తీసుకోలేదు. జూన్ 22న ప్రారంభించి, జులై 15 కల్లా షూటింగ్ పూర్తి చేసేశారు. సీ యూ సూన్ ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఉన్న ఉత్తమ నటుల్లో ఫాహద్ ఫాజిల్ ఒకరు. ఇటీవల ఆయన సినిమాలను దేశ వ్యాప్తంగా చూస్తున్నారు. తాజాగా లాక్ డౌన్ తర్వాత ఓ ప్రయోగం చేపట్టారు ఫాహద్. దర్శకుడు మహేష్ నారాయణ్ తో కలసి ఓ సినిమా చేశారు. సుమారు 75 నిమిషాలు నిడివి ఉండే ఓ సినిమాను ప్లాన్ చేశారు ఈ ఇద్దరూ. ‘సీ యూ సూన్’ టైటిల్‌తో ఈ సినిమాను పూర్తిగా ఐ ఫోన్లో చిత్రీకరించారు. ఇందులో ఫాహద్ తో పాటు పలువురు మలయాళ యంగ్ యాక్టర్స్ కూడా నటించారు. ఒక్కో యాక్టర్ షూటింగ్ పార్ట్ ఒక్కోసారి చేశారు. దీంతో ఎక్కువ మంది యాక్టర్స్ ఒకేసారి లొకేషన్లో కలుసుకునే అవకాశం కూడా తక్కువ. ఈ సినిమాను ఓటీటీ కోసమా థియేట్రికల్ రిలీజ్ కోసమా? ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్ పూర్తయింది. ఏ సినిమా షూటింగ్ ప్రారంభించాలా? వద్దా? అనే చర్చ ఆ మధ్య కేరళ ఇండస్ట్రీ లోనూ జరిగింది. షూటింగ్ వద్దు అని కొంత మంది వాదిస్తే, షూటింగ్ వాయిదా వేస్తున్నంత కాలం ఇండస్ట్రీలో పని చేసేవాళ్లకు ఇబ్బందే అనేది ఇంకొందరి వాదన. అలాంటి వారిలో దర్శకుడు లిజో జోస్ పెల్లిసేరి ఒకరు. ‘అంగమలై డైరీస్, జల్లి కట్టు’ వంటి పాపులర్ చిత్రాలు తెరకెక్కించారు లిజో. లాక్ డౌన్ లో ‘ఏ’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇదో రొమాంటిక్ సినిమా అని టాక్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం. హగల్ నటి, దర్శకురాలు రీమా కళింగల్, షరాఫుద్దీన్ ముఖ్య పాత్రల్లో నూతన దర్శకుడు హర్ష ‘హగల్’ అనే చిత్రాన్ని కూడా లాక్ డౌన్ తర్వాతే ప్రకటించారు. ఈ సినిమాను దర్శకుడు ఆషిక్ అబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జులైలో ప్రారంభం అయింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. షూటింగులు జరుగుతున్నప్పటికీ కేరళలో తయారయే సినిమాల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు నిర్మాణంలో ఉన్నవి తక్కువే. అన్ని కథలూ తక్కువ మందితో, తక్కువ టీమ్ తో చెప్పేవి కావు. పరిస్థితులు చక్కబడి ఎప్పటిలాగానే సినిమాల షూటింగ్స్‌తో అన్ని ఇండస్ట్రీలు కళకళలాడాలని కోరుకుందాం. షూటింగ్‌కి రెడీ మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా షూటింగ్ కి రెడీ అయ్యారని సమాచారం. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో దుల్కర్ ఓ సినిమా చేయనున్నారు. రోషన్ ఆండ్రూ దర్శకత్వం వహించనున్నారు. పూర్తి స్థాయి పోలీస్ పాత్రలో తొలిసారి నటించనున్నారు దుల్కర్. ఈ సినిమా చిత్రీకరణ ఆగస్ట్ రెండో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. థియేటర్ లోనే రిలీజ్ మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన కొన్ని చిత్రాల షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. అయితే ఓటీటీలో ఇవి విడుదలవుతాయి అని కొందరు అనుకున్నారు. కానీ అవి థియేటర్ లోనే రిలీజ్ అని చిత్రబందాలు పేర్కొన్నాయి. మోహన్ లాల్ నటించిన పీరియాడిక్ చిత్రం ’అరబికడలింటే సింహం : మరాక్కర’ మార్చిలో విడుదల కావాలి. కరోనా వల్ల వాయిదా పడింది. మమ్ముట్టి నటించిన ’వన్’ కూడా వేసవిలో విడుదల కావాలి. ఇందులో మమ్ముట్టి ముఖ్య మంత్రి పాత్రలో నటించారు.