న్యూఢిల్లీ: చలనచిత్ర పరిశ్రమలోని సంఘాలు సభ్యులు కానివారిని నిషేధించడం, బహిష్కరించడం మానుకోవాలని కాంపిటీషన్ కమిషన్ స్పష్టం చేసింది. వాటాదారుల మధ్య విభేదాలను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలను పరిశీలించాలని శుక్రవారం సూచించింది.
దేశంలో చిత్ర పంపిణీపై మార్కెట్ అధ్యయనాన్ని సీసీఐ ఈ సందర్భంగా విడుదల చేసింది. పరిశ్రమ అనుసరించేలా వివిధ స్వీయ నిబంధనలను రూపొందించింది. మల్టీప్లెక్స్‌లు, నిర్మాతలు, వర్చువల్ ప్రింట్ ఫీ (వీపీఎఫ్), సినిమాతో ముడిపడి ఉన్న సంఘాలు, డిజిటల్ సినిమాలకు సంబంధించిన స్వీయ నియంత్రణలను ప్రతిపాదించింది.
నిర్మాతల వాణిజ్య స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా చిత్రాల ప్రదర్శనలో వాణిజ్యంపై మల్టీప్లెక్స్‌లు ఎలాంటి నియంత్రణ ఉంచరాదని ఈ సందర్భంగా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment