
న్యూఢిల్లీ: కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా రవనీత్ కౌర్ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని ఓ మహిళ పూర్తి స్థాయిలో చేపట్టడం ఇదే మొదటిసారి. రవనీత్ కౌర్ 1988 పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ సీసీఐ చైర్ పర్సన్‌గా కౌర్‌తో ప్రమాణం చేయించినట్టు ట్విటర్లో సీసీఐ ప్రకటించింది. సీసీఐ చైర్మన్‌గా అశోక్ కుమార్ గుప్తా పదవీ కాలం 2022 అక్టోబర్‌లో ముగిసింది.
అప్పటి నుంచి ఈ పదవికి పూర్తి స్థాయి చైర్‌పర్సన్ లేరు. కౌర్ నియామకంతో ఈలోటు భర్తీ అయింది. సీసీఐ సభ్యురాలు సంగీత వర్మ గత సంవత్సరం అక్టోబర్ నుంచి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. గూగుల్, యాపిల్‌తో సహా డిజిటల్ స్పేస్‌కు సంబంధించిన వివిధ కేసులను అనుసరిస్తున్న సమయంలో రవనీత్ కౌర్ సీసీఐ పగ్గాలను చేపట్టారు. అలాగే జీఎస్టీ లాభదాయకతకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను సీసీఐ పరిష్కరిస్తోంది.
ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే..