CCI
-
మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల ధాటికి కూలిపోయిన గోడౌన్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పూడూరు గ్రామంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి నిల్వ చేసిన గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోడౌన్ పరిసర ప్రాంతాల్లో పెద్దఎత్తున పొగలు కమ్ముకున్నాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలు అదుపుచేసే ప్రయ్నతం చేస్తున్నారు. భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో గోడౌన్ కుప్పకూలింది. రూ.కోట్లలో నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. మంటలు చెలరేగిన వెంటనే కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. -
ఏపీలో పత్తి కొనుగోలులో జాప్యం: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి,ఢిల్లీ:ఏపీలో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని,పత్తి కొనుగోలులో జాప్యం జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో సోమవారం(నవంబర్ 25) ఆయన ఒక పోస్టు చేశారు. ‘పత్తి ధరలు పడిపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో కేవలం 20 పత్తి కొనుగోలు కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి.కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.కొంత తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా సీసీఐకి ఆదేశాలు ఇవ్వాలి’అని విజయసాయిరెడ్డి కోరారు. -
రూ. 213 కోట్లు జరిమానా.. అప్పీలుకు మెటా
న్యూఢిల్లీ: వాట్సాప్ గోప్యతా పాలసీకి సంబంధించి కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ. 213 కోట్లు జరిమానా విధించడంపై అప్పీలుకెళ్లనున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం మెటా వెల్లడించింది. 2021లో అమల్లోకి తెచ్చిన అప్డేట్లో యూజర్ల వ్యక్తిగత మెసేజీల గోప్యతకు భంగం కలిగించే మార్పులేమీ చేయలేదని స్పష్టం చేసింది.వాస్తవానికి డేటా సేకరణ, వినియోగంపై మరింత స్పష్టతనివ్వడంతో పాటు పలు బిజినెస్ ఫీచర్లను కూడా ప్రవేశపెట్టామని పేర్కొంది. వివిధ సేవలతో ప్రజలు, వ్యాపార సంస్థలకు వాట్సాప్ ఎంతో ఉపయోగకరమైనదిగా ఉంటోందని, ఇదంతా మెటా సహకారంతోనే సాధ్యపడుతోందని వివరించింది.మాతృసంస్థ మెటాతో యూజర్లు తమ డేటాను తప్పనిసరిగా షేర్ చేసుకునేలా 2021లో పాలసీని అప్డేట్ చేయడం పోటీ నిబంధనలకు విరుద్ధమంటూ సీసీఐ రూ. 213 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. -
మెటాకు రూ.213 కోట్ల జరిమానా.. కంపెనీ రియాక్షన్
వాట్సాప్ గోప్యత పాలసీ 2021 అప్డేట్కి సంబంధించి అనుచిత వ్యాపార విధానాలను అమలు చేసినందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) రూ.213 కోట్ల జరిమానా విధించింది. వీటిని సరిదిద్దుకునేందుకు నిర్దిష్ట వ్యవధిలోగా తగు చర్యలు తీసుకోవాలని మెటా, వాట్సాప్‌లను ఆదేశించింది. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.వాట్సాప్ తన ప్లాట్‌ఫాం ద్వారా సేకరించే డేటాను సర్వీస్ అందించడానికైతే తప్ప అయిదేళ్ల వరకు ప్రకటనలపరమైన అవసరాల కోసం ఇతర మెటా కంపెనీలకు షేర్ చేయకూడదని సీసీఐ పేర్కొంది. ఇతరత్రా అవసరాల కోసం షేర్ చేసుకునేటప్పుడు కచ్చితమైన వివరణ ఇవ్వాలని తెలిపింది. 2021 ఫిబ్రవరి నాటి పాలసీ అప్డేట్ ప్రకారం వాట్సాప్‌ను ఉపయోగించుకోవడాన్ని కొనసాగించాలంటే యూజర్లు తమ డేటాను మెటా కంపెనీలతో షేర్ చేసుకోవడానికి తప్పనిసరిగా అంగీకరించాలనే షరతును చేర్చారు. అంతకు ముందు ఇది ఐచ్ఛికంగానే ఉండేది. గుత్తాధిపత్యం ఉన్న మెటాతో డేటాను షేర్ చేయడాన్ని తప్పనిసరి చేయడం వల్ల ప్రకటనల మార్కెట్లో పోటీ సంస్థలకు అవరోధాలు ఏర్పడే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది.ఇదీ చదవండి: బైబ్యాక్, డివిడెండ్ పాలసీలో మార్పులుమెటా స్పందనడేటా షేరింగ్ విషయంలో సీసీఐ వాదనల్లో నిజం లేదని మెటా ప్రతినిధులు తెలిపారు. ఈ అంశంపై అప్పీల్‌కు వెళ్తామన్నారు. 2021 పాలసీ అప్డేట్ను సమర్థిస్తూ, వినియోగదారుల వ్యక్తిగత సందేశాల గోప్యత విధానాలను మార్చలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో యూజర్లకు ఆప్షన్ ఉన్నట్లు తెలిపారు. పాలసీని అంగీకరించనందుకు ఏ ఒక్క వినియోగదారుడి ఖాతా తొలగించలేదన్నారు. డేటా సేకరణ, దాని వినియోగంలో పారదర్శకతకు మెటా పెద్దపీట వేస్తోందని చెప్పారు. భారతదేశంలో వాట్సాప్ ఒక ప్రధాన ప్లాట్‌ఫామ్‌గా నిలిచిందని, వ్యాపారాలు, ప్రభుత్వ సేవలు, చిన్న సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి వీలు కల్పిస్తోందని కంపెనీ పేర్కొంది. -
రోడ్డెక్కిన పత్తి రైతు
నాదెండ్ల: కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పత్తి కొనుగోలు కేంద్రంలో రైతులకు మద్దతు ధర లభించటం లేదని, సాకులు చెబుతూ పత్తిని కొనుగోలు చేయకుండా తిరస్కరిస్తున్నారంటూ సోమవారం రైతులు రోడ్డెక్కారు. పల్నాడు జిల్లా గణపవరంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న వెంకటకృష్ణ ఎంటర్‌ప్రైజెస్‌లో ఇటీవల సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. నిబంధనల పేరుతో 90 శాతం పత్తి లోడులను తిరస్కరిస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి.. పత్తి లోడు ట్రాక్టర్లను జాతీయ రహదారికి అడ్డంగా నిలిపి దిగ్బంధనం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తేమ 12 శాతం మించిందని, పత్తిలో కాయ ఉందని, తడిసిపోయిందంటూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క రోజు కూడా రైతులకు న్యాయం జరగలేదని వాపోయారు. గత ప్రభుత్వంలో సీసీఐ కొనుగోలు కేంద్రంలో రైతులకు పూర్తిగా న్యాయం జరిగిందని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షానికి ఎకరాకు 2–3 క్వింటాళ్ల మేర దిగుబడి నష్టపోయామని, కూలి ధరలు పెరిగి సాగు భారంగా మారిందన్నారు. రైతులు ఆందోళనకు దిగారన్న సమాచారంతో రూరల్ సీఐ సుబ్బానాయుడు సిబ్బందితో చేరుకుని రైతులతో మాటా్లడారు. సీఐ తాను ఉన్నతాధికారులతో మాట్లాడతానని సర్దిచెప్పి ఆందోళన విరమింపచేశారు. అనంతరం సీసీఐ బయ్యర్ రమే ష్ బాబు, రైతులతో సంప్రదింపులు చేశారు. -
పోటీ లేకుండా చేస్తున్న స్విగ్గీ, జొమాటో
ముంబై: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ జొమాటో, స్విగ్గీలు పోటీతత్వ చట్టాలను ఉల్లంఘించినట్లు కాంటిషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తులో తేలింది. కొన్ని రెస్టారెంట్ల భాగస్వాములతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకొని ఇరు సంస్థలు అనైతిక వ్యాపారాలకు పాల్పడినట్లు పేర్కొంది.‘తక్కువ కమీషన్ తీసుకుంటూ జొమాటో ఒప్పందం కుదుర్చుకుంది. తన ఫ్లాట్‌ఫామ్‌పై నమోదైతే, వ్యాపారాభివృద్ధికి తోడ్పాడతామంటూ స్విగ్గీ హామీలిస్తోంది. తద్వారా ఇరు సంస్థలు తమకు పోటీ లేకుండా పొటీతత్వ చట్టాలను అతిక్రమించాయి’ అని సీసీఐ పత్రాలు స్పష్టం చేశాయి. -
రిలయన్స్, వాల్ట్ డిస్నీ డీల్‌కు ఆమోదం.. షరతులివే..
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీల మీడియా అసెట్స్ విలీన ప్రతిపాదనకు దాదాపు రెండు నెలల తర్వాత కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం కొన్ని షరతులు విధిస్తూ మంగళవారం 48 పేజీల ఉత్తర్వులను జారీ చేసింది.సీసీఐ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇరు సంస్థలు ఏడు టీవీ చానళ్లను విక్రయించాలి. వీటిలో స్టార్ జల్సా మూవీస్, కలర్స్ మరాఠీ, హంగామా మొదలైనవి ఉన్నాయి. అలాగే క్రికెట్ ఈవెంట్ల ప్రసారాల అడ్వర్టైజ్మెంట్ స్లాట్లకు సంబంధించి బండిల్డ్ విధానంలో వసూలు చేయకూడదు. ఐపీఎల్, ఐసీసీ, బీసీసీఐ వంటి కీలక క్రికెట్ మ్యాచ్‌ల ఫీడ్‌ను ప్రసార భారతితో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు, ఇరు సంస్థల ఓటీటీ ప్లాట్‌ఫాంలు (స్టార్‌కి చెందిన డిస్నీప్లస్‌హాట్‌స్టార్, రిలయన్స్‌లో భాగమైన వయాకామ్18కి చెందిన జియోసినిమా) వేర్వేరుగా కొనసాగుతాయి.ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా.. -
పత్తి విక్రయానికి స్లాట్ బుకింగ్
సాక్షి, హైదరాబాద్: ఈ సీజన్‌కు సంబంధించి పత్తి పంట మార్కెట్లోకి వస్తోంది. రైతులు పత్తిని విక్రయించాలంటే గతంలో భారత పత్తి సంస్థ (సీసీఐ) కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించేవారు. అయితే ఈ విషయంలో రైతులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సీసీఐ అధికారులు తాజాగా ‘వాట్సాప్ టాప్ యాప్’ను రూపొందించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖకు దీనిని అనుసంధానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీసీఐ కేంద్రాల కొనుగోళ్ల తాజా వివరాలను యాప్‌లో అందుబాటులో ఉంచుతారు. దీంతో రైతు ఎప్పు డు సరుకు తీసుకెళ్లాలనే సమాచారం నుంచి నగదు జమ వరకు సకల వివరాలు తెలుసుకోవచ్చు. ఏ రోజు, ఎప్పుడు మార్కెట్‌కు వెళ్లాలో నిర్ణయించుకుని, రైతులు దీని ద్వారానే స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించింది.మార్కెట్, తేదీ, సమయం నిర్దేశించుకొని స్లాట్‌ను బుక్ చేసుకొని ఆ ప్రకారం మార్కెట్‌కు వెళితే సరిపోతుంది. కాగా, స్లాట్ బుకింగ్ సదుపాయాన్ని మాత్రం తొలుత పైలట్ ప్రాజెక్టుగా నిర్మల్ మార్కెట్లో అమలు చేయనున్నారు. అనంతరం ఇతర మార్కెట్లకు విస్తరించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం స్లాట్ బుకింగ్ సదుపాయం లేని జిల్లాల్లోని మార్కెట్లలో కొనుగోలు ప్రక్రియ, రద్దీ తదితర వివరాలను రైతులు తెలుసుకునేందుకు వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 8897281111 నంబర్ వాట్సాప్ ద్వారా సమగ్ర సమాచారం తెలుసుకోవచ్చు. హాయ్ అని వాట్సాప్‌లో మెసేజ్ పెడితే సమగ్ర సమాచారం మనముందు ఉంటుంది. అలాగే అత్యంత ముఖ్యమైనది.. ఆయా కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండే సమయాన్ని వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అమ్మిన పంట మొత్తం రైతు ఖాతాలో జమ అయ్యేవరకు దీని ద్వారా వివరాలు తెలుసుకునే సదుపాయం కల్పించారు. 21.46 లక్షల మంది రైతుల వివరాలు నిక్షిప్తంవాట్సాప్ యాప్‌లో రైతులకు అవసరమైన సమగ్ర సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. ఆ యాప్‌లో 21,46,263 మంది పత్తి రైతుల వివరాలు ఉన్నాయి. కాగా, వ్యవసాయ శాఖ వద్ద వివరాలు నమోదు చేసుకున్న రైతులకే ఈ యాప్ అందుబాటులో ఉంటుంది. రైతులు తమ వద్ద ఎంత పత్తి నిల్వ ఉంది? అనే వివరాలను తొలుత యాప్‌లో నమోదు చేయాలి. అప్పుడు స్థానిక సీసీఐ/జిన్నింగు మిల్లు పరిధిలో కొనుగోలుకు ఎంత సమయం పడుతుందో సమాచారం అందుతుంది. సీరియల్లో ఉన్న వాహనాల సంఖ్య, లోడింగ్, అన్లోడింగ్ వివరాలు కనిపిస్తాయి. పంటను విక్రయించిన తర్వాత తక్‌పట్టీ వివరాలు, ధరల వివరాలు, నగదు ఎన్ని రోజుల్లో జమ అవుతుందో కూడా తెలుసుకోవచ్చు. ‘యాప్’లో వివరాలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అందుబాటులో ఉంటాయి. దీంతో రైతు తన పంటను ఇంటి దగ్గర్నుంచి తెచ్చుకుని వెంటనే అమ్ముకునే సౌలభ్యం కలుగుతుంది.వాట్సాప్ యాప్‌తో రైతులకు ప్రయోజనంవాట్సాప్ యాప్ ద్వారా పత్తి రైతులకు మరింత ప్రయోజనం ఉంటుంది. దీనిని ఈ ఏడాదే అందుబాటులోకి తీసుకువచ్చాం. నిర్మల్ మార్కెట్లోనైతే స్లాట్ బుకింగ్ సదుపాయం కూడా కల్పించాం. దీనిని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తాం. రైతులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలి. – లక్ష్మణుడు, అడిషనల్ డైరెక్టర్, మార్కెటింగ్‌శాఖ -
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై దర్యాప్తు వాయిదా!
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) డైరెక్టర్ జనరల్(డీజీ) చేసిన విధానపరమైన లోపాల కారణంగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై జరుగుతున్న దర్యాప్తును కర్ణాటక హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ-కామర్స్ దిగ్గజాలు వివిధ నిబంధనలు ఉల్లంఘించాయని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలోనే దర్యాప్తు చేపట్టింది. ఈమేరకు డైరెక్టర్ జనరల్ ఆగస్టు 9న ప్రాథమిక దర్యాప్తు నివేదికను సమర్పించింది. అయితే దర్యాప్తు వివరాలను కోర్టులో తెలియజేసే సమయంలో జరిగిన విధానపరమైన లోపం వల్ల సమగ్ర దర్యాప్తును తాత్కాలికంగా నిలిపేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.ప్రాథమిక దర్యాప్తులోని వివరాల ప్రకారం..ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంపెనీలు దేశీయంగా ఎఫ్‌డీఐ నిబంధనలు పాటించడంలేదు. నియమాలకు విరుద్ధంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్లోనే ప్రత్యేకంగా ప్రోడక్ట్ లాంచ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. మార్కెట్లో వీలుకాని రాయితీలు ఇస్తున్నాయి. ప్రధానంగా మొబైల్ ఫోన్ బ్రాండ్లపై నిర్దిష్ట విక్రయదారులతో కుమ్మక్కై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. దాంతో చిన్న రిటైలర్లు(ఆఫ్‌లైన్) తీవ్రంగా నష్టపోతున్నారు.ఇదీ చదవండి: యుద్ధంలో విమానాల టార్గెట్‌పై ఐఏటీఏ వ్యాఖ్యలుప్రాథమిక దర్యాప్తునకు సంబంధించి కోర్టుకు వివరాలు వెల్లడించే సమయంలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలను ‘థర్డ్ పార్టీస్’గా డైరెక్టర్ జనరల్ వర్గీకరించింది. కానీ ఇటీవల కోర్టులో వివరాలు తెలిపే సమయంలో ‘ఆపోజిట్ పార్టీస్(విరుద్ధ సంస్థలు)’గా అభివర్ణించింది. దాంతో కోర్టు స్పందిస్తూ డైరెక్టర్ జనరల్ కంపెనీలను సంబోధించిన తీరును తప్పుపట్టింది. ఇరు సంస్థలను ఆపోజిట్ పార్టీస్ అని అభివర్ణించేందుకు కమిషన్ నుంచి ఏదైనా అనుమతులు తీసుకున్నారా అని ప్రశ్నించింది. దీనిపై వివరణ కోరుతూ విచారణను ఈ నెల 21కు వాయిదా వేసింది. అప్పటివరకు డైరెక్టర్ జనరల్ నిర్వహిస్తున్న సమగ్ర దర్యాప్తును నిలిపేయాలని ఆదేశించింది. ఇదిలాఉండగా, సంస్థల వర్గీకరణకు సీసీఐ ధ్రువీకరణ తప్పనిసరి. -
ఆర్ఐఎల్ – డిస్నీ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) మీడియా విభాగం, వాల్ట్ డిస్నీ మధ్య విలీనానికి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో దేశీయంగా రూ.70,000 కోట్ల మీడియా దిగ్గజం ఆవిర్భవించనుంది. ఆరు నెలల క్రితమే ప్రకటించిన డీల్‌ను గుత్తాధిపత్య విధానాలను అడ్డుకునే సీసీఐ పరిశీలించింది. ఈ నేపథ్యంలో తొలుత కుదుర్చుకున్న డీల్ నిర్మాణంలో 2 సంస్థలు కొన్ని సవరణలూ ప్రతిపాదించాయి. తాజా డీల్‌కు సీసీఐ అనుమతి మంజూరు చేసింది. స్వచ్ఛంద సవరణలు: ఆర్ఐఎల్, వయాకామ్18 మీడియా ప్రైవేట్, డిజిటల్18 మీడియా, స్టార్ ఇండియా ప్రైవేట్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ మధ్య కుదిరిన ఒప్పందంలో స్వచ్ఛంద సవరణల తదుపరి డీల్‌కు ఆమోదముద్ర వేసినట్లు ‘ఎక్స్’ ద్వారా సీసీఐ వివరించింది. అయితే రెండు పారీ్టల ప్రతిపాదిత సవరణలను వెల్లడించలేదు. తాజా డీల్ ప్రకారం ఆర్ఐఎల్, అనుబంధ సంస్థలు విలీన కంపెనీలో 63.16% వాటాను పొందనున్నాయి. మిగిలిన 36.84% వాటా వాల్డ్ డిస్నీకి దక్కనుంది. విలీన సంస్థ రెండు స్ట్రీమింగ్ సరీ్వసులు, 120 టీవీ చానళ్లను కలిగి ఉండనుంది. వెరసి దేశీయంగా అతిపెద్ద మీడియా హౌస్‌గా అవతరించనుంది. విలీన సంస్థ ఇలా.. ఆర్ఐఎల్కు గల మీడియా సంస్థలలో నెట్వర్క్ 18 ప్రధానమైనదికాగా.. 18 వార్తా చానళ్లను కలిగి ఉంది. కలర్స్ బ్రాండ్‌తో ఎంటర్టైన్మెంట్ చానల్‌తోపాటు క్రీడా చానళ్లను నిర్వహిస్తోంది. మనీకంట్రోల్.కామ్, బుక్‌మైషో సైట్లతోపాటు కొన్ని మ్యాగజీన్లను ప్రచురిస్తోంది. మరోవైపు ఆర్ఐఎల్ జియోçస్టూడియోస్సహా కేబుల్ డి్రస్టిబ్యూషన్ కంపెనీలు డెన్, హాథవేలో మెజారిటీ వాటాలను కలిగి ఉంది. 21 సెంచురీ ఫాక్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ ఆస్తుల కొనుగోలు ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ దేశీయంగా 2020లో ప్రారంభమైంది. ఇందుకు 71.3 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. తద్వారా స్టార్ ఇండియా, హాట్స్టార్లను సొంతం చేసుకుంది. ఎంటర్టైన్మెంట్, సినిమా, స్పోర్ట్స్ తదితర చానళ్లను కలిగి ఉంది. -
వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనంపై ..సీసీఐకి రిలయన్స్ అభ్యర్ధన
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీనం ప్రక్రియను ముమ్మరం చేశారు. రూ.70వేల కోట్ల విలువైన ఎంటర్ టైన్మెంట్ విభాగానికి చెందిన ఆ రెండు సంస్థల్ని విలీనం చేసేందుకు గాను అనుమతి కావాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నుండి క్లియరెన్స్‌ను అభ్యర్థించింది.పీటీఐ నివేదిక ప్రకారం..ఈ ఏడాది ఫిబ్రవరిలో ముఖేష్ అంబానీ చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య ఒప్పందం కుదిరింది. తమ మీడియా వ్యాపారాలైన వయాకామ్ 18, స్టార్ ఇండియా విలీనానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇరు సంస్థలు కలిసి రూ.70,352 కోట్ల విలువైన జాయింట్ వెంచర్ ఏర్పాటుకు నిర్ణయించాయి. సంయుక్త సంస్థలో రిలయన్స్ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డీల్ గురించి ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాలకు తెర దించుతూ ఫిబ్రవరిలో అధికారిక ప్రకటన విడుదల చేశాయి.ఈ ఒప్పందంలో భాగంగా రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18 స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో విలీనం కానుంది. జాయింట్ వెంచర్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్ నేతృత్వం వహిస్తుంది. విలీన సంస్థలో రిలయన్స్‌కు 16.34 శాతం, వయాకామ్ 18కు 46.82 శాతం, డిస్నీకి 36.84 శాతం చొప్పున వాటాలు దఖలు పడనున్నాయి. -
గూగుల్, యాపిల్‌పై సీసీఐ విచారణ.. నివేదిక రాగానే చర్యలు!
న్యూఢిల్లీ: అన్యాయమైన వ్యాపార విధానాలు అవలంభిస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో గూగుల్, యాపిల్‌పై విచారణ జరుపుతున్నట్టు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్పర్సన్ రవ్నీత్ కౌర్ తెలిపారు. స్మా ర్ట్ టెలివిజన్, అలాగే వార్తల కంటెంట్ విభాగంలో దాని ఆధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేసిందని, అలాగే యాప్ స్టోర్‌కు సంబంధించి వ్యతిరేక పోటీ పద్ధతులను యాపిల్ అవలంభిస్తోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో విచారణకు సీసీఐ ఆదేశించింది. సీసీఐ ఇన్వెస్టిగేషన్ విభాగమైన డైరెక్టర్ జనరల్ నుంచి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని కౌర్ తెలిపారు. కంపెనీల పోటీ వ్యతిరేక పద్ధతులకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాలు లభించిన సందర్భంలో పూర్తిస్థాయి విచారణను సీసీఐ డైరెక్టర్ జనరల్‌కు అప్పగిస్తుంది. ఇంతకుముందు ఆండ్రాయిడ్ సిస్టమ్, ప్లేస్టోర్‌కు సంబంధించిన కేసులలోనూ గూగుల్‌కి వ్యతిరేకంగా సీసీఐ ఆదేశాలు జారీ చేసింది. -
ఎయిరిండియా-విస్తారా విలీనం: సీసీఐ షోకాజ్ నోటీసులు!
న్యూఢిల్లీ: టాటా గ్రూప్ విమానయాన సంస్థలు ఎయిర్ ఇండియా–విస్తారా విలీన ప్రతిపాదనపై కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది. దీనిపై సంబంధిత పార్టీలకు సీసీఐ షోకాజ్ నోటీసులు పంపినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ రెండు సంస్థల విలీన ప్రతిపాదన భారత్ విమానయాన రంగానికి ప్రతికూలంగా ఉంటుందని, ఈ రంగంపై వీటికి గుత్తాధిపత్యం లభిస్తుందని వస్తున్న విమర్శలపై ఎందుకు విచారణ చేపట్టకూడదో తెలియజేయాలని ఎయిర్ ఇండియాకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఫెయిర్–ట్రేడ్ రెగ్యులేటర్ పేర్కొన్నట్లు సమాచారం. ఒప్పందం తీరిది... విస్తారా, ఎయిర్ ఇండియా టాటా గ్రూప్‌లో భాగంగా ఉన్న రెండు వేర్వేరు విమానయాన సంస్థలు. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు విస్తారాలో 49 శాతం వాటా ఉంటే, టాటా సన్స్ వాటా 51 శాతంగా ఉంది. ఎయిర్ ఇండియాలో 25.1 శాతం వాటాను సింగపూర్ ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేయనున్న ఒప్పందం ప్రకారం విస్తారాను ఎయిర్ ఇండియాతో విలీనం చేస్తున్నట్లు గత ఏడాది నవంబర్‌లో టాటా గ్రూప్ ప్రకటించింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్ విమానయాన రంగంలో ఈ ఒప్పందం అతిపెద్ద ఏకీకరణ ఒప్పందంగా సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. ఈ ఒప్పందం సాకారమైతే, దేశంలో అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్‌గా అలాగే ఇండిగో తర్వాత రెండవ అతిపెద్ద దేశీయ క్యారియర్‌గా ఎయిర్ ఇండియా రూపాంతరం చెందుతుంది. విలీనానికి సంబంధిత సంస్థలు ఈ ఏడాది ఏప్రిల్‌లో సీసీఐ అనుమతి కోరాయి. వీటిలో టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీస్పీఎల్), ఎయిర్ ఇండియా లిమిటెడ్, టాటా ఎస్ఐఏ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్‌లు ఉన్నాయి. కాగా, తాజా పరిణామంపై ఎయిర్ ఇండియా ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. సీసీఐ సంతృప్తి చెందకపోతే.. తాజా నోటీసులకు సంబంధిత సంస్థలు పంపిన ప్రతిస్పందనలకు సీసీఐ సంతృప్తిపడకపోతే... ఈ విషయంలో కమిషన్ రెండవ దశ చర్యలు చేపడుతుంది. దీనిలో ప్రతిపాదిత ఒప్పందం వివరాలను బహిరంగ పరచాలని పార్టీలకు సూచిస్తుంది. దీనిపై సంబంధిత వర్గాల అభిప్రాయాలనూ ఆహ్వానించి వాటిని పరిశీలిస్తుంది. ఒప్పందంపై తన తుది నిర్ణయం తీసుకునే ముందు సంస్థల నుండి సీసీఐ అదనపు సమాచారాన్ని పొందవచ్చు. పోటీ సంబంధ ఆందోళనలను పరిష్కరించడానికి గత సందర్భాల్లో సంస్థలు సీసీఐకి స్వయంగా పరిష్కార చర్యలను సమర్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని సీసీఐ ఆమోదించడం, షరతులతో కూడిన ఆమోదాలను ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
సీసీఐ చైర్పర్సన్ నియామకంలో విశేషం! మొదటిసారిగా..
న్యూఢిల్లీ: కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్‌గా రవనీత్ కౌర్ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిని ఓ మహిళ పూర్తి స్థాయిలో చేపట్టడం ఇదే మొదటిసారి. రవనీత్ కౌర్ 1988 పంజాబ్ కేడర్ ఐఏఎస్ అధికారి. కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ సీసీఐ చైర్ పర్సన్‌గా కౌర్‌తో ప్రమాణం చేయించినట్టు ట్విటర్లో సీసీఐ ప్రకటించింది. సీసీఐ చైర్మన్‌గా అశోక్ కుమార్ గుప్తా పదవీ కాలం 2022 అక్టోబర్‌లో ముగిసింది. అప్పటి నుంచి ఈ పదవికి పూర్తి స్థాయి చైర్పర్సన్ లేరు. కౌర్ నియామకంతో ఈలోటు భర్తీ అయింది. సీసీఐ సభ్యురాలు సంగీత వర్మ గత సంవత్సరం అక్టోబర్ నుంచి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. గూగుల్, యాపిల్‌తో సహా డిజిటల్ స్పేస్‌కు సంబంధించిన వివిధ కేసులను అనుసరిస్తున్న సమయంలో రవనీత్ కౌర్ సీసీఐ పగ్గాలను చేపట్టారు. అలాగే జీఎస్టీ లాభదాయకతకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను సీసీఐ పరిష్కరిస్తోంది. ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే.. -
Google vs CCI: గూగుల్‌కు మరో ఎదురుదెబ్బ..కానీ..!
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్ మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ( సీసీఐ) విధించిన జరిమానాను సమర్ధించింది. ఆండ్రాయిడ్ మార్కెట్లో దాని ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసిన ఆరోపణలపై గూగుల్‌పై విధించిన రూ.1,337.76 కోట్ల జరిమానాను సమర్థించింది. ఈ పెనాల్టీ మెుత్తాన్ని చెల్లించేందుకు ట్రైబ్యూనల్ గూగుల్‌కు 30 రోజుల పాటు గడువిచ్చింది. అయితే ఈ తీర్పుపై గూగుల్ సుప్రీం కోర్టును ఆశ్రయించవచ్చని భావిస్తున్నారు. (ఇదీ చదవండి: Gold Price March 29th పసిడి రయ్..రయ్! పరుగు ఆగుతుందా?) అయితే మరో భారీ ఊరట కూడా లభించింది.ఎన్సీఎల్ఏటీ చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్, సభ్యుడు (టెక్నికల్) డాక్టర్ అలోక్ శ్రీవాస్తవతో కూడిన బెంచ్ సీసీఐ జారీ చేసిన నాలుగు కీలక ఆదేశాలను పక్కన పెట్టింది. సీసీఐ ఆర్డర్‌లోని 617.3, 617.9, 617.10 617.7 పేరాల్లో జారీ చేసిన ఆదేశాలను కోర్టు పక్కన పెట్టింది. అలాగే ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులను(OEM) 11 అప్లికేషన్ల మొత్తం Google సూట్‌ను ప్రీ ఇన్స్టాల్ చేయమని గూగుల్ కోరడం అన్యాయమని ఎన్సీఎల్ఏటీ స్పష్టం చేసింది. ఆండ్రాయిడ్ ఫోర్క్‌లను అభివృద్ధి చేయడం, పంపిణీ చేయడం నుంచి OEMలను నిషేధించే యాంటీ ఫ్రాగ్మెంటేషన్ అగ్రిమెంట్ షరతులను తప్పుపట్టింది. (సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్ టైకూన్ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు) మరోవైపు కంపెనీ ఒప్పందాల కార్యాచరణతో పోటీ యాప్‌లను ముందే ఇన్స్టాల్ చేయకుండా నిరోధించ లేదని పేర్కొంది. మార్కెట్లో ఆధిపత్యం పొందడమంటే ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేయడం కాదని, వినియోగదారుల్లో గూగుల్ ప్రజాదరణ పొందడమని గూగుల్ వాదిస్తోంది. సీనియర్ న్యాయవాది అరుణ్ కథ్పాలియా Google LLC తరపున వాదించారు. -
రిలయన్స్ ‘మెట్రో’ డీల్ ఓకే, రూ.2,850 కోట్లతో కొనుగోలు
న్యూఢిల్లీ: ‘మెట్రో క్యాష్ అండ్ క్యారీ ఇండియా’ని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ) సొంతం చేసుకునేందుకు కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ) ఆమో దం తెలిపింది. జర్మనీకి చెందిన మెట్రో ఏజీ భారత్‌లోని తన హోల్‌సేల్ కార్యకలాపాలను విక్రయించేందుకు రిలయన్స్‌తో ఈ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. మెట్రో క్యాష్ అండ్ క్యారీలో 100 శాతం వాటాలను రూ.2,850 కోట్లతో కొనుగోలు చేసేందుకు రిలయన్స్ తప్పనిసరి ఒప్పందంపై సంతకాలు చేసింది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్, మెట్రో క్యాష్ అండ్ క్యారీ కొనుగోలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు ట్విట్టర్లో సీసీఐ ప్రకటించింది. ఇవీ చదవండి: ఇషా ట్విన్స్‌కు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్ ముఖేష్ అంబానీ లగ్జరీ కార్లు.. రోల్స్ రాయిస్ నుంచి ఫెరారీ వరకు -
పెండింగ్ డీల్స్‌కు మోక్షం.. ఆరు ఒప్పందాలకు సీసీఐ ఆమోదం
న్యూఢిల్లీ: దాదాపు మూడు నెలల విరామం తర్వాత కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) విలీనాలు, కొనుగోలు ఒప్పందాలను పరిశీలించడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆరు డీల్స్‌కు ఆమోదం తెలిపింది. కీమెడ్‌లో 20 శాతం వాటాను ప్రైమ్ టైమా లాజిస్టిక్స్ టెక్నాలజీస్ ద్వారా అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ శోభనా కామినేని కొనుగోలు చేస్తుండటం, లాంకో అన్పారా పవర్ (ఎల్ఏపీఎల్)ను మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా (ఎంఈఐఎల్) కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందాలు వీటిలో ఉన్నాయి. కీమెడ్ ప్రధానంగా ఔషధాల హోల్‌సేల్ విక్రయం, పంపిణీ వ్యాపారం చేస్తోంది. అటు హంట్స్మాన్ ఇంటర్నేషనల్‌ను ఆర్చ్‌రోమా ఆపరేషన్స్ కొనుగోలు చేయడం, హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ గ్లోబల్‌లో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ కేకేఆర్ వాటాలు దక్కించుకోవడం, హిందుస్తాన్ పోర్ట్స్‌లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (ఎన్ఐఐఎఫ్) వాటాలు తీసుకోవడానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఉన్నాయి. దీనితో నవంబర్ 3 వరకు పెండింగ్‌లో ఉన్న డీల్స్‌ను సీసీఐ క్లియర్ చేసినట్లయింది. సాధారణంగా నిర్దిష్ట పరిమితి దాటిన ఒప్పందాలకు సీసీఐ ఆమోదముద్ర అవసరమవుతుంది. అయితే, 2022 అక్టోబర్ 25న చైర్పర్సన్ అశోక్ కుమార్ గుప్తా రిటైరైన తర్వాత కోరం లేకపోవడంతో సీసీఐ విలీన, కొనుగోలు డీల్స్ పరిశీలన చేపట్టలేదు. ఫలితంగా పలు డీల్స్ పెండింగ్‌లో పడిపోయిన నేపథ్యంలో కేంద్రం నిర్దిష్ట నిబంధనను అమల్లోకి తేవడంతో పరిశీలన మళ్లీ మొదలైంది. -
వెనక్కు తగ్గిన గూగుల్.. యూజర్లు డిఫాల్ట్ సెర్చి ఇంజిన్ ఎంచుకోవచ్చు
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్‌కి సంబంధించి గుత్తాధిపత్యం కేసులో కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) విధించిన జరిమానాపై ఊరట లభించకపోవడంతో టెక్ దిగ్గజం గూగుల్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ఫోన్లలో డిఫాల్ట్ సెర్చి ఇంజిన్‌ను ఎంచుకోవడానికి భారత యూజర్లకు అవకాశం కల్పిస్తామని తెలిపింది. అలాగే ప్రత్యామ్నాయ బిల్లింగ్ సిస్టమ్‌ను కూడా ఎంచుకునే ఆప్షన్ కూడా వచ్చే నెల నుంచి కల్పించనున్నట్లు పేర్కొంది. స్థానిక చట్టాలకు కట్టుబడి వ్యవహరించడానికి తాము కట్టుబడి ఉన్నామని గూగుల్ స్పష్టం చేసింది. గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలకు లైసెన్సుకు ఇస్తుంది. అయితే, తన సొంత యాప్స్‌ను ముందస్తుగా ఇన్స్టాల్ చేయాలనే షరతు కూడా విధిస్తుంటుంది. ఇలాంటి ధోరణులు పోటీ సంస్థలను దెబ్బతీయడమే అవుతుందంటూ సీసీఐ ఆండ్రాయిడ్ కేసులో రూ. 1,338 కోట్లు, ప్లే స్టోర్ కేసులో రూ. 936 కోట్లు గూగుల్‌కు జరిమానా విధించింది. వీటిపై స్టే విధించాలంటూ గూగుల్ సుప్రీం కోర్టుకు వెళ్లినా ఊరట లభించలేదు. చదవండి: Union Budget 2023: కేంద్రం శుభవార్త.. రైతులకు ఇస్తున్న సాయం పెంచనుందా! -
సుప్రీంలోనూ గూగుల్‌కు ఎదురుదెబ్బ!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు.. దేశ అత్యున్నత న్యాయస్థానంలోనూ ఊరట దక్కలేదు. గూగుల్‌కు వ్యతిరేకంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) కొనసాగించిన దర్యాప్తులో ఎలాంటి లోటుపాట్ల లేవని సుప్రీం కోర్టు గురువారం స్పష్టం చేసింది. అంతేకాదు.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు(స్టే ఇచ్చేందుకు) నిరాకరించిన సుప్రీం కోర్టు.. నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ దగ్గరే తేల్చుకోవాలని గూగుల్‌కు సూచించింది. మరోవైపు గూగుల్ దాఖలు చేసిన అప్పీల్‌పై మార్చి 31వ తేదీలోగా తేల్చాలని ఎన్సీఎల్ఏటీ NCLAT ని ఆదేశించింది సుప్రీం కోర్టు. అంతేకాదు సీసీఐ విధించిన జరిమానాలో పది శాతాన్ని వారంరోజుల్లోగా డిపాజిట్ చేయాలని గూగుల్‌కు స్పష్టం చేసింది. భారత్‌లో గూగుల్ అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్‌కు పాల్పడుతోందని, ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల వ్యవస్థలో గుత్తాధిపత్యాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని గుర్తించిన సీసీఐ.. గూగుల్‌కు రూ. 1,337 కోట్ల పెనాల్టీ విధించింది. ఈ ఆదేశాలపై స్టే విధించాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించింది గూగుల్. అయితే.. సీసీఐ ఆదేశాలపై ఇంటీరియమ్ స్టేకు ఎన్సీఎల్ఏటీ కూడా నిరాకరించడంతో సుప్రీంను ఆశ్రయించింది గూగుల్. ఇక గూగుల్ పిటిషన్‌పై వాదనల సందర్భంగా.. ఇది జాతీయ స్థాయి ప్రాధాన్యతాంశమని సీసీఐ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ ఎన్ వెంకటరమణన్ బెంచ్‌కు తెలిపారు. ఈ వ్యవహారాన్ని భారత్ ఏ విధంగా పరిష్కరిస్తుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందన్నారు. అయితే ఎన్సీఎల్ఏటీకి మాత్రం మరోసారి పంపొద్దన్న ఆయన విజ్ఞప్తిని మాత్రం కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు గూగుల్.. CCI ఆదేశాల వలన భారతదేశంలో పరికరాలు మరింత ఖరీదైనవిగా మారతాయని తెలిపింది. తద్వారా సురక్షితంకానీ యాప్స్ ద్వారా వినియోగదారులకు, జాతీయ భద్రతకు ముప్పు వాటిల్ల వచ్చని వాదించింది. ఇదిలా ఉంటే.. సీసీఐ గూగుల్ రెండు వేర్వేరు కేసుల్లో జరిమానా విధించింది. ఆండ్రాయిడ్ ఆధిపత్యానికి సంబంధించిన వ్యవహారంలో రూ.1,300 కోట్ల జరిమానా విధించింది. అంతేకాదు.. యాప్ డెవలపర్ల ఆంక్షలతో ఇబ్బంది పెట్టడం ఆపేయాలని, గూగుల్ ప్లే స్టోర్ బయటకూడా వాళ్ల యాప్‌లు అప్లోడ్ చేసుకునేందుకు అనుమతించాలని స్పష్టం చేసింది. అయితే గూగుల్ ఈ ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సీసీఐ ఆదేశాలను గనుక పాటిస్తే.. యాప్ డెవలపర్లు అధికంగా చెల్లింపులు చేయాల్సి వస్తుందని తెలిపింది. -
గూగుల్ వివాదం.. జాతీయ ప్రాధాన్యతాంశం
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల వ్యవస్థలో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ టెక్ దిగ్గజం గూగుల్ కు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) జరిమానా విధించిన కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో బుధవారం వాదనలు కొనసాగాయి. ఇది జాతీయ స్థాయి ప్రాధాన్యతాంశమని సీసీఐ తరఫున వాదిస్తున్న అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్ వెంకటరమణన్ తెలిపారు. ఈ వ్యవహారాన్ని భారత్ ఏ విధంగా పరిష్కరిస్తుందోనని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోందని పేర్కొన్నారు. దీన్ని తిప్పి నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)కి పంపి.. గూగుల్‌కు ’రెండో ఇన్నింగ్స్’ ఆ డే అవకాశం ఇవ్వొద్దని స్వయంగా సుప్రీం కోర్టే విచారణ జరపాలని కోరారు. అటు గూగుల్ తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ..ఏఎస్జీ సూచనలతో తాము కూడా ఏకీభవిస్తున్నామ ని, ఈ వివాదానికి శాశ్వత ముగింపు పలకాల ని కోరుకుంటున్నామని విన్నవించారు. ఇరు పక్షా ల వాదనలు విన్న మీదట తదుపరి విచారణను సుప్రీం కోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ కేసులో గూగుల్‌కు సీసీఐ రూ. 1,338 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
డిజిటల్ వినియోగానికి ఎదురుదెబ్బ: గూగుల్
న్యూఢిల్లీ: గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) తమకు జరిమానా విధించడంపై టెక్ దిగ్గజం గూగుల్ స్పందించింది. కనెక్టివిటీకి అడ్డంకులను తొలగించే దిశగా సురక్షితమైన స్మార్ట్ఫోన్లను అందుబాటులోకి తేవాల్సిన దశలో ఇలాంటి ఆదేశాలు ఇవ్వడం వల్ల దేశీయంగా డిజిటల్ వినియోగం వేగవంతం కాకుండా విఘాతం కలుగుతుందని వ్యాఖ్యానించింది. గూగుల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం విషయంలో గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ రూ. 1,338 కోట్లు, ప్లే స్టోర్‌కి సంబంధించి అనుచిత విధానాలపై మరో రూ. 936 కోట్ల మొత్తాన్ని సీసీఐ జరిమానా విధించిన సంగతి తెలిసిందే. చదవండి: ఇంకోసారి, వందల మంది ఉద్యోగుల్ని తొలగించిన ఓలా! -
’గూగుల్’ కేసులో తాత్కాలిక స్టేకు ఎన్సీఎల్ఏటీ నిరాకరణ
న్యూఢిల్లీ: ప్లే స్టోర్ విధానాలపై కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) జరిమానా విధించిన కేసులో ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించిన టెక్ దిగ్గజం గూగుల్‌కు ఊరట దక్కలేదు. దీనిపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) నిరాకరించింది. సీసీఐ విధించిన రూ. 936 కోట్లలో పది శాతాన్ని వచ్చే నాలుగు వారాల్లోగా రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. ప్లే స్టోర్ విధానాల్లో గూగుల్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ సీసీఐ ఈ పెనాల్టీ విధించింది. మరోవైపు, ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల విషయంలో ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను సవాలు చేస్తూ గూగుల్ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సోమవారం వాదనలు విననుంది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల విషయంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ సీసీఐ రూ. 1,337 కోట్లు జరిమానా విధించగా, దానిపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు ఎన్సీఎల్ఏటీ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనూ 10 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేయాలంటూ ఆదేశించింది. గతేడాది అక్టోబర్‌లో వారం రోజుల వ్యవధిలోనే ఈ రెండు కేసులకు సంబంధించి గూగుల్‌కు సీసీఐ మొత్తం రూ. 2,200 కోట్ల మేర జరిమానా విధించింది. చదవండి: కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న బీఓబీ! -
‘అది కుదరదు’.. గూగుల్‌కు ఊహించని ఎదురుదెబ్బ!
కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) జరిమానా విధించిన కేసులో టెక్ దిగ్గజం గూగుల్‌కు ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్)లో ఎదురుదెబ్బ తగిలింది. సీసీఐ ఆదేశాలపై మధ్యంతర స్టే విధించేందుకు ఎన్సీఎల్ఏటీ బుధవారం నిరాకరించింది. అలాగే జరిమానాలో 10 శాతాన్ని డిపాజిట్ చేయాలని ఆదేశించింది. అటు సీసీఐకి నోటీసులు ఇవ్వడంతో పాటు మధ్యంతర స్టేపై తదుపరి విచారణను ఫిబ్రవరి 13కు వాయిదా వేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టంకు సంబంధించి దేశీయంగా గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందనే ఆరోపణలపై సీసీఐ రూ. 1,337.76 కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫాంను ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ యూజర్లకు యాప్స్‌ను అన్ఇన్స్టాల్ చేసేందుకు, తమకు కావాల్సిన సెర్చ్ ఇంజిన్‌ను ఎంచుకునేందుకు వీలు కల్పించాలని గతేడాది అక్టోబర్‌లో సూచించింది. సీసీఐ ఆదేశాలు జనవరి 19 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, వీటిపై తక్షణం స్టే విధించాలంటూ ఎన్సీఎల్ఏటీని గూగుల్ ఆశ్రయించింది. భారతీయ యూజర్లు, డెవలపర్లు, తయారీ సంస్థలకు ఆండ్రాయిడ్‌తో గణనీయంగా ప్రయోజనాలు చేకూరాయని, భారత్ డిజిటల్‌కు మారడంలో ఇది తోడ్పడిందని పిటిషన్లో వివరించింది. బుధవారం జరిగిన విచారణలో గూగుల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. గూగుల్ గుత్తాధిపత్య దుర్వినియోగానికి పాల్పడిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. చదవండి: కొత్త సంవత్సరంలో దిమ్మతిరిగే షాకిచ్చిన అమెజాన్.. ఆ 18 వేల మంది పరిస్థితి ఏంటో! -
గూగుల్‌కు భారీ షాక్.. రూ.2,274 కోట్ల జరిమానా చెల్లించాల్సిందే!
న్యూఢిల్లీ: పోటీ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నందుకు విధించిన పెనాల్టీని నిర్ణీత గడువులోపు చెల్లించనందుకు గూగుల్‌కు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) డిమాండ్ నోటీసులు జారీ చేసింది. గూగుల్‌కు వ్యతిరేకంగా సీసీఐ అక్టోబర్ చివర్లో రెండు ఆదేశాలు జారీ చేసింది. రెండు కేసుల్లోనూ మొత్తం రూ.2,274 కోట్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ముందు గూగుల్ సవాల్ చేసింది. వీటిపై ట్రిబ్యునల్ ఇంకా విచారణ నిర్వహించాల్సి ఉంది. పెనాల్టీ చెల్లించేందుకు గూగుల్‌కు ఇచ్చిన 60 రోజుల గడువు ఈ నెల 25నే ముగిసింది. దీంతో గూగుల్‌కు సీసీఐ డిమాండ్ నోటీసులు జారీ చేసినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. వాస్తవానికి సీసీఐ నిబంధనల కింద జరిమానా చెల్లించేందుకు 30 రోజుల గడువే ఉంటుంది. సీసీఐ ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్లామని, స్టే రాకపోతే చెల్లించాల్సి వస్తుందని గూగుల్ పేర్కొంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ రూపంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందని, అనుచిత వ్యాపార విధానాలను అనుసరిస్తోందంటూ సీసీఐ అక్టోబర్ 20న రూ.1337.76 కోట్ల జరిమానాను విధించడం గమనార్హం. ప్లేస్టోర్ విధానాలపరంగా తనకున్న అధిక మార్కెట్ వాటాతో అనైతిక విధానాలు అనుసరిస్తున్నందుకు రూ.936 కోట్ల జరిమానా విధించాలంటూ అక్టోబర్ 25న మరో కేసు విషయంలో సీసీఐ ఆదేశించింది. చదవండి: న్యూ ఇయర్లో లేఆఫ్స్ బాంబ్.. భారీ ఎత్తున గూగుల్,అమెజాన్ ఉద్యోగుల తొలగింపు! -
సీసీఐ ఆదేశాలపై ఎన్సీఎల్ఏటీకి గూగుల్
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ వ్యవస్థకు సంబంధించి అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తోందంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) భారీ జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ అపీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీని టెక్ దిగ్గజం గూగుల్ ఆశ్రయించింది. ఈ ఆదేశాల వల్ల ఆండ్రాయిడ్ భద్రతా ఫీచర్లను విశ్వసించే తమ భారతీయ యూజర్లు, వ్యాపారాల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని, మొబైల్ పరికరాల రేట్లు పెరిగేందుకు కూడా దారి తీయవచ్చని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. ఈ నేపథ్యంలోనే సీసీఐ ఆదేశాలపై స్టే విధించాలని కోరుతూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తమ యూజర్లు.. భాగస్వాముల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌లకు సంబంధించి గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ కంపెనీపై సీసీఐ రూ. 1,338 కోట్ల భారీ జరిమానా విధించింది. అలాగే, అనుచిత వ్యాపార విధానాలు మానుకోవాలని కూడా ఆదేశించింది. చదవండి: బీభత్సమైన ఆఫర్: జస్ట్ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్! -
Zee-Sony merger: మూడు ఛానెళ్లు అమ్మకానికి..
న్యూఢిల్లీ: ప్రతిపాదిత మెగా విలీన ప్రతిపాదనకు సంబంధించి మూడు చానెళ్ల విక్రయంపై సీసీఐ విధించిన నిబంధనలకు మీడియా గ్రూప్‌లు సోనీ, జీ అంగీకరించాయి. హిందీ చానెళ్లయిన బిగ్ మ్యాజిక్, జీ యాక్షన్, జీ క్లాసిక్‌లను విక్రయించేలా విలీన ఒప్పందానికి స్వచ్ఛందంగా మార్పులు చేస్తూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)కి ప్రతిపాదన సమర్పించాయి. బుధవారం విడుదల చేసిన 58 పేజీల ఉత్తర్వుల్లో సీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. వివరాల్లోకి వెడితే.. సీఎంఈ (గతంలో సోనీ పిక్చర్స్ – ఎస్పీఎన్ఐ)లో జీ ఎంటర్టైన్మెంట్ (జీల్), బంగ్లా ఎంటర్టైన్మెంట్ (బీఈపీఎల్) విలీనానికి అక్టోబర్ 4న సీసీఐ కొన్ని షరతులతో కూడిన ఆమోదం తెలిపింది. ఆయా విభాగాల్లో పోటీపై ప్రతికూల ప్రభావం పడకుండా మూడు హిందీ చానెళ్ల విక్రయానికి కొన్ని నిబంధనలు విధించింది. వీటి ప్రకారం సదరు చానెళ్లను స్టార్ ఇండియా లేదా వయాకామ్18కి విక్రయించకూడదు. వాటిని నడిపే ఆర్థిక సత్తా, అనుభవం ఉన్న కొనుగోలుదారులకే అమ్మాలి. ఈ మేరకు విలీన ఒప్పందంలో స్వచ్చందంగా మార్పులు చేసి సమర్పించాలని సీసీఐ సూచించింది. దానికి అనుగుణంగానే జీ, సోనీ తమ ప్రతిపాదనలను సమర్పించాయి. -
టెక్ దిగ్గజం గూగుల్‌కు మరో భారీ షాక్
-
వారం రోజుల వ్యవధిలో.. గూగుల్‌కు సీసీఐ రూ. 936.44 కోట్ల ఫైన్
వారం రోజుల వ్యవధిలోనే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. కమిషన్ ఆఫ్ కాంపిటీషన్ (సీసీఐ) రూ. 936.44 కోట్ల ఫైన్ విధించింది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల విభాగంలో గూగుల్ తన గుత్తాదిపత్యాన్ని గూగుల్‌కు సీసీఐ రూ.1,338 కోట్ల జరిమానా విధించింది. అనైతిక వ్యాపార కార్యకలాపాలు మానుకోవాలని హితువు పలికింది. ఆ జరిమానాపై గూగుల్ స్పందించింది. సీసీఐ తమపై విధించిన జరిమానా భారతీయ వినియోగదారులు, వ్యాపారానికి ఎదురు దెబ్బ అని గూగుల్ పేర్కొంది. సీసీఐ తీర్పును సమీక్షించి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. తమ ఆండ్రాయిడ్ అనేక అవకాశాలు సృష్టించిందని గూగుల్ తెలిపింది. దాంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వేలాది వ్యాపారాలు విజయానికి మద్దతుగా నిలిచిందని పేర్కొంది. సీసీఐ నిర్ణయం భారత్‌లో మొబైల్ డివైజ్‌ల ధరలు పెరిగేందుకు దారి తీస్తుందని గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. Case Nos. 07 of 2020, 14 of 2021 and 35 of 2021 CCI imposes a monetary penalty of ₹ 936.44 Crore on Google for anti-competitive practices in relation to its Play Store policies. Read the full order here: https://t.co/GDR820ffYg Press release: https://t.co/7HEPJeHVK3#Antitrust pic.twitter.com/TbTa6vbCXl — CCI (@CCI_India) October 25, 2022 ఈ తరుణంలో మరోమారు సీసీఐ..గూగుల్‌కు భారీ ఎత్తున ఫైన్ విధించడం చర్చాంశనీయంగా మారింది. మార్కెట్లో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తూ ప్లేస్టోర్ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతూ పేమెంట్ యాప్స్, అండ్ పేమెంట్ సిస్టంను ప్రమోట్ చేస్తుందని ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో గూగుల్‌కు పైన పేర్కొన్న భారీ మొత్తాన్ని ఫైన్ విధిస్తున్నట్లు తెలిపింది. చదవండి👉 ‘టిమ్‌కుక్’ను ట్రోల్ చేయాలనుకుంది, పాపం..అడ్డంగా దొరికిపోయిన గూగుల్? -
పండగ వేళ ఓయో, మేక్‌మై ట్రిప్‌లకు సీసీఐ భారీ షాక్
సాక్షి,ముంబై: ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ సంస్థలు మేక్‌మై ట్రిప్, గోఐబిబో, ఓయోలకు భారీ షాక్ తగిలింది. యాంటీ కాంపిటీటివ్, అక్రమ విధానాలకు పాల్పడుతున్నారంటూ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)భారీ జరిమానా విధించింది. ఏకంగా రూ.392 కోట్ల మేర ఫైన్ విధిస్తూ బుధవారం సీసీఐ ప్రకటించిన నిర్ణయం వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. (జోయాలుక్కాస్‌లో దీపావళి క్యాష్‌బ్యాక్ ఆఫర్లు) హోటల్ విభాగంలో అన్యాయమైన వ్యాపార విధానాలకు పాల్పడినందుకు మేక్ మై ట్రిప్-గోఇబిబో. రూ. 223.48 కోట్లు, ఓయోకు రూ. 168.88 కోట్ల నగదు జరిమానాలు విధించింది. ఈ మేరకు సీసీఐ 131 పేజీల ఆర్డర్‌ను జారిచేసింది. పలు హోటళ్లు, రెస్టారెంట్లతో ఈ ఏజెన్సీల అక్రమ ఒప్పందాలు మార్కెట్లో పోటీని దెబ్బ తీసేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది. ఈ ధోరణి వినియోదారుల హక్కుల్ని దెబ్బతీయడం తోపాటు, గుత్తాధిపత్యానికి తెర తీస్తుందని సీసీఐ చురకలేసింది. అంతేకాదు తమ ద్వారా బుక్ చేసుకున్న ధర కంటే తక్కువకు ఇతరులకు గదులను కేటాయించకుండా ఆంక్షలు విధించడంపై మండిపడింది. తక్షణమే దీన్ని సవరించుకోవాలని, ముఖ్యంగా, ధర, గది లభ్యతపై హోటళ్లు/గొలుసు హోటళ్లతో ఉన్న ఒప్పందాలను రద్ద చేసుకోవాలని కూడా ఆదేశించింది. ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీల మీద ఇంత భారీ మొత్తంలో ఫైన్ విధించడం ఇదే తొలిసారి. (ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు) నాస్డాక్-లిస్టెడ్ ఎంఎంటీ తన ప్లాట్‌ఫారమ్‌లో ఓయోకి అనుకూలంగా వ్యవహరిస్తోందని తేలిందని సీసీఐ ఆరోపించింది. ఇది ఇతర సంస్థ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీస్తుందని తెలిపింది. ఓయో, మేక్‌మైట్రిప్‌ల మధ్య ఒప్పందాలు ఉన్నాయని, దీని కారణంగానే వారు తమ ప్లాట్‌ఫారమ్‌లో ఓయోకు ప్రాధాన్యతనిస్తూ, ఇతర సంస్థలను దెబ్బ తీస్తున్నాయని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ రెస్టారెంట్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా విమర్శించింది. కాగా మేక్‌మై ట్రిప్‌ను 2000 సంవత్సరంలో దీప్ కల్రా స్థాపించారు. 2017లో, ఎంఎటీ ఐబిబో గ్రూప్ హోల్డింగ్‌ని స్వాధీనం చేసుకుంది. అప్పటినుంచి మేక్ మై ట్రిప్ బ్రాండ్ పేరుతో తన వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. -
సినిమాకు స్వీయ నియంత్రణ:సీసీఐ
న్యూఢిల్లీ: చలనచిత్ర పరిశ్రమలోని సంఘాలు సభ్యులు కానివారిని నిషేధించడం, బహిష్కరించడం మానుకోవాలని కాంపిటీషన్ కమిషన్ స్పష్టం చేసింది. వాటాదారుల మధ్య విభేదాలను పరిష్కరించడానికి ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలను పరిశీలించాలని శుక్రవారం సూచించింది. దేశంలో చిత్ర పంపిణీపై మార్కెట్ అధ్యయనాన్ని సీసీఐ ఈ సందర్భంగా విడుదల చేసింది. పరిశ్రమ అనుసరించేలా వివిధ స్వీయ నిబంధనలను రూపొందించింది. మల్టీప్లెక్స్‌లు, నిర్మాతలు, వర్చువల్ ప్రింట్ ఫీ (వీపీఎఫ్), సినిమాతో ముడిపడి ఉన్న సంఘాలు, డిజిటల్ సినిమాలకు సంబంధించిన స్వీయ నియంత్రణలను ప్రతిపాదించింది. నిర్మాతల వాణిజ్య స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా చిత్రాల ప్రదర్శనలో వాణిజ్యంపై మల్టీప్లెక్స్‌లు ఎలాంటి నియంత్రణ ఉంచరాదని ఈ సందర్భంగా తెలిపింది. -
గూగుల్‌పై మరో కేసు..విచారణకు సీసీఐ ఆదేశం
న్యూఢిల్లీ: న్యూస్ కంటెంట్ ఆదాయ పంపకంలో సహేతుకంగా వ్యవహరించడం లేదంటూ సెర్చి ఇంజిన్ దిగ్గజం గూగుల్‌పై మరో కేసు దాఖలైంది. ఈ మేరకు న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ (ఎన్బీడీఏ) చేసిన ఫిర్యాదుపై లోతుగా విచారణ జరపాల్సిందిగా కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే గూగుల్‌పై కొనసాగుతున్న దాదాపు ఇదే తరహా రెండు కేసులతో కలిపి దీన్ని కూడా దర్యాప్తు చేయాలని పేర్కొంది. డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్, ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ వేర్వేరుగా చేసిన రెండు ఫిర్యాదులపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. సీసీఐలో భాగమైన డైరెక్టర్ జనరల్ (డీజీ) ఈ కేసులను దర్యాప్తు చేసి నివేదిక సమర్పిస్తారు. సెర్చి ఇంజిన్‌లో తమ వెబ్‌లింకులు ప్రముఖంగా కనిపించాలంటే గూగుల్ కు తప్పనిసరిగా కంటెంట్ సమకూర్చాల్సి వస్తోందని, కానీ గూగుల్ మాత్రం దీనికి ప్రతిగా అరకొర ప్రతిఫలమే ఇస్తోందని ఎన్బీడీఏ ఆరోపిస్తోంది. చదవండి👉 గూగుల్‌కు భారీ షాక్! -
ఎన్నారైలు రాష్ట్రంలో ఐటీ కంపెనీలు పెట్టాలి
సాక్షి, ఆదిలాబాద్/కైలాస్‌నగర్: ‘‘విదేశాల్లో ఉన్న మనవాళ్లు ఇక్కడ ఐటీ కంపెనీల ఏర్పాటుకు ముందుకు రావాలి. రాష్ట్రంలోని ఐటీ పార్కుల్లో కంపెనీలు పెట్టాలి. వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నిరకాల ప్రోత్సాహకాలు ఇస్తాం..’’ అని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ద్వితీయశ్రేణి నగరాలకూ ఐటీ పరిశ్రమలను విస్తరించాలన్నది ప్రభుత్వ విధానమని.. ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతంలో ఐటీ కంపెనీ ఏర్పాటవడం హర్షించదగ్గ విషయమని చెప్పారు. సోమవారం మంత్రి కేటీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఇటీవల మాతృమూర్తిని కోల్పోయిన ఎమ్మెల్యే జోగు రామన్న నివాసానికి వెళ్లి పరామర్శించారు. తర్వాత ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీడీఎన్టీ ల్యాబ్ ప్రతినిధులతో ఏర్పాటుచేసిన సెమినార్లో పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రూరల్ టెక్నాలజీ పాలసీ అమలు సీఎం కేసీఆర్ దార్శనికతకు నిదర్శనమని కేటీఆర్ చెప్పారు. ఒకప్పుడు ఆదిలాబాద్ అంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేదని, అటువంటి పరిస్థితి నుంచి ఐటీ మ్యాప్‌లోకి వచ్చిందని పేర్కొన్నారు. వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ తదితర ద్వితీయశ్రేణి పట్టణాల్లోనూ ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయని.. స్థానిక యువతకు అవకాశాలు కల్పిస్తే హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలతో పోటీపడతారని చెప్పారు. ఎమ్మెల్యే జోగు రామన్న విజ్ఞప్తి మేరకు ఆదిలాబాద్‌లో ఐటీ పార్క్‌ను ఐదెకరాల్లో ఏర్పాటు చేస్తామని, త్వరలో దానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. గుట్టలు, వాగులు, వంకలు, పచ్చని మైదానాలు, జలపాతాలు, అద్భుత సాంస్కృతిక సంపదలు ఆదిలాబాద్ సొంతమని.. ఇక్కడి ప్రదేశాలను ప్రమోట్ చేయడంపై దృష్టిపెట్టాలని పర్యాటక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కోరుతున్నానని చెప్పారు. సిమెంట్ కార్పొరేషన్‌పై స్పందించట్లేదు ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను తిరిగి తెరిపించేందుకు చాలా ప్రయత్నాలు చేశామని, కానీ స్పందన లేదని కేటీఆర్ చెప్పారు. సీసీఐని తెరిపించేందుకు జోగు రామన్న నాయకత్వంలో జేఏసీ ఉద్యమం చేసిందని గుర్తు చేశారు. అంతకుముందు ఆదిలాబాద్‌లో చాకలి ఐలమ్మ విగ్రహానికి మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాగా ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన మంత్రులకు నిరసన సెగ తగిలింది. 317 జీవో బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులు మంత్రుల కార్యక్రమ వేదిక ఎదుట ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకునే యత్నం చేశారు. తమను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని ఆరు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
వయాకామ్18 మీడియాలో జియో సినిమా ఓటీటీ విలీనం!
న్యూఢిల్లీ: వయాకామ్18 మీడియాలో జియో సినిమా ఓటీటీ విలీన ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ట్వీట్ ద్వారా సోమవారం ఈ విషయం వెల్లడించింది. బోధి ట్రీ సిస్టమ్స్ (బీటీఎస్)తో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, వయాకామ్18 ప్రకటించాయి. దీని ప్రకారం వయాకామ్18లో బీటీఎస్ రూ. 13,500 కోట్లు, రిలయన్స్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీసెస్ రూ. 1,645 కోట్లు ఇన్వెస్ట్ చేస్తా యి. ఒప్పందంలో భాగంగా జియో సినిమా ఓటీటీ యాప్‌ను వయాకామ్18కి బదలాయించారు. చదవండి: ఇన్ఫినిక్స్ నుంచి తొలి 55 ఇంచెస్ టీవీ.. తక్కువ ధరకే వావ్ అనిపించే ఫీచర్లు! -
చిప్ కార్డు సంస్థల కుమ్మక్కు.. విచారణకు ఐబీఏ డిమాండ్!
న్యూఢిల్లీ: బ్యాంకులకు చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను సరఫరా చేసే సంస్థలు కుమ్మక్కైన అవకాశాలపై విచారణ జరపాలంటూ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ)ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) కోరింది. చిప్‌ల కొరత పేరుతో వివిధ వెండర్లు కార్డుల రేట్లను పెంచేస్తున్నట్లు, పెంపు పరిమాణం దాదాపు ఒకే రకంగా ఉంటున్నట్లు తమకు పలు ఫిర్యాదులు అందాయని తెలిపింది. ఇదంతా చూస్తుంటే వెండర్లు కుమ్మక్కయ్యే ఇలా చేస్తుండవచ్చన్న అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై విచారణ జరపాలంటూ సీసీఐకి లేఖ రాయడంతో పాటు అటు ఆర్థిక శాఖకు కూడా ఐబీఏ విషయాన్ని తెలియజేసింది. సీనియర్ బ్యాంకు అధికారి వివరణ ప్రకారం.. గతేడాది 4–5 కార్డు సంస్థలు చిప్‌ల కొరత వల్ల ధరలు పెంచాల్సి వస్తోందంటూ బ్యాంకులను సంప్రదించాయి. అప్పట్లో ఒక్కో కార్డు ధరను రూ. 35 నుంచి రూ. 42కి పెంచేందుకు బ్యాంకులు అంగీకరించాయి. అయితే, అవే వెండర్ సంస్థలు మూడు నెలల క్రితం మళ్లీ రేట్లు పెరిగాయంటూ బ్యాంకులను సంప్రదించాయి. దీంతో కార్డులు లేకుంటే వ్యాపారం దెబ్బతింటుందనే భయంతో ఒక పెద్ద ప్రైవేట్ బ్యాంకు రూ. 10 మేర పెంచేందుకు అంగీకరించిందని అధికారి తెలిపారు. గత కొద్ది నెలలుగా కార్డులకు డిమాండ్ పెరుగుతుండటంతో బ్యాంకులే పెరిగిన రేటు భారాన్ని మోస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది జూలై ఆఖరు నాటి 92.81 కోట్ల డెబిట్ కార్డులు, 8 కోట్ల పైగా క్రెడిట్ కార్డులు ఉన్నాయి. ఏప్రిల్ మొదలైన ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా 20 లక్షల పైచిలుకు కార్డులు జారీ అయ్యాయి. -
పీవీఆర్–ఐనాక్స్ విలీనం వాటిని దెబ్బతీస్తాయ్.. సీసీఐకు ఫిర్యాదు
న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్ చైన్ కంపెనీలు పీవీఆర్ లిమిటెడ్, ఐనాక్స్ లీజర్ విలీనం పోటీ నిబంధనలను దెబ్బతీస్తాయంటూ కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) వద్ద ఫిర్యాదు దాఖలైంది. విలీనం కారణంగా సినిమా పంపిణీ పరిశ్రమలో పోటీతత్వానికి తెరపడుతుందంటూ లాభరహిత సంస్థ కన్జూమర్ యూనిటీ అండ్ ట్రస్ట్ సొసైటీ(సీయూటీఎస్) ఆరోపించింది. ఈ అంశంపై దర్యాప్తు చేయవలసిందిగా సీసీఐను అభ్యర్థించింది. ఈ ఏడాది మార్చి 27న పీవీఆర్, ఐనాక్స్ లీజర్ విలీన అంశాన్ని ప్రకటించిన విషయం విదితమే. తద్వారా దేశవ్యాప్తంగా 1,500 తెరలతో అతిపెద్ద మల్టీప్లెక్స్ నెట్‌వర్క్‌కు తెరతీసేందుకు నిర్ణయించాయి. దీంతో చిన్న నగరాలు, పట్టణాలలో మరింత విస్తరించే వీలున్నట్లు తెలియజేశాయి. విలీనం తదుపరి పీవీఆర్ ఐనాక్స్‌గా ఆవిర్భవించనున్న కంపెనీ భవిష్యత్‌లో కొత్త మల్టీప్లెక్స్‌లను ఇదే బ్రాండుతో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నాయి. దీంతో వినియోగదారులకు అధిక టికెట్ ధరలు తదితరాల విషయంలో అవకాశాలు తగ్గిపోతాయని సీసీఐకు దాఖలు చేసిన ఫిర్యాదులో సీయూటీఎస్(కట్స్) అభిప్రాయపడింది. కాగా.. జూన్ 21న స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి డీల్‌కు గ్రీన్‌సిగ్నల్ లభించడం గమనార్హం! చదవండి: స్టాక్ మార్కెట్: ఒక్కరోజులోనే రూ.2.94 లక్షల కోట్లు ఆవిరి.. కారణమిదే! -
సోనీలో జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి ఓకే
న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాలో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీల్) విలీన ప్రతిపాదనకు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నుంచి ఆమోదం లభించింది. ఈ విషయాన్ని జీల్ ప్రకటించింది. స్టాక్ ఎక్సే్చంజ్‌ల నుంచి ఆమోదం లభించడం బలమైన, సానుకూల ముందడుగుగా జీల్ పేర్కొంది. దీనివల్ల విలీనానికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని వివరించింది. అయితే, ఈ ప్రతిపాదిత విలీనం అన్నది ఇంకా నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. సెబీ, ఎన్‌సీఎల్‌టీల, సీసీఐ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబర్లో ఈ రెండు మీడియా సంస్థలు తప్పనిసరి విలీనానికి ఒప్పందం చేసుకోవడం గమనార్హం. నాడు ప్రకటించిన మేరకు విలీనానంతర సంస్థలో కల్వర్ మ్యాక్స్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్‌కు 52.03% వాటా ఉంటే, జీ వాటాదారులకు 47.07% వాటా లభించనుంది. జీల్ ఎండీ, సీఈవోగా ఉన్న పునీత్ గోయెంకా.. విలీనం తర్వా త సంస్థకు ఎండీ, సీఈవోగా కొనసాగనున్నారు. -
పోరాట కేంద్రంగా ‘సీసీఐ’ సెల్ఫీ పాయింట్
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్ట రీని పునఃప్రారంభించాలనే ఉద్యమి స్తున్న సీసీఐ సాధన కమిటీ కొత్త పోరాట రూపాన్ని ఎంచుకుంది. నెల రోజులుగా ఆందోళన చేస్తున్న కమిటీ.. తమ పోరాటాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం ‘ఐ లవ్ సీసీఐ’ పేరుతో ఆదిలాబాద్ పట్టణంలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసింది. పట్టణ ప్రజలు, యువకులు ఇక్కడ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసి కేంద్రానికి చేరేలా షేర్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న సెల్ఫీ పాయింట్ వద్ద మొదటి ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీఐ పునరుద్ధరణ అంశం ప్రజా ఉద్యమంగా మారు తుందన్నారు. సెల్ఫీ పాయింట్ వద్ద ప్రతిఒక్కరూ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని కోరారు. సీసీఐ పునఃప్రారంభానికి కేంద్రం అనుమతి ఇచ్చే వరకూ పోరాటం కొనసాగుతుందని సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్ విజ్జగిరి నారాయణ, నర్సింగ్, రమేశ్, శివ, కిరణ్, మనోజ్, సూరజ్ తెలిపారు. -
ఎస్బీఐ సైనేజీ కేసు,7 సంస్థలకు సీసీఐ జరిమానా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలు, ఆఫీసులు, ఏటీఎంలకు సైనేజీలను సరఫరా చేసేందుకు సంబంధించిన బిడ్‌ను రిగ్గింగ్ చేసిన కేసులో 7 సంస్థలు, వాటి అధికారులకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) జరిమానా విధించింది. మొత్తం రూ. 1.29 కోట్లు కట్టాలని ఆదేశించింది. అలాగే ఇకపై పోటీని దెబ్బతీసే విధానాలకు పాల్పడవద్దని హెచ్చరించింది. ఆయా కంపెనీలకు చెందిన తొమ్మిది మంది అధికారులు రూ. 54,000 పైచిలుకు జరిమానా కట్టాల్సి రానుంది. వివరాల్లోకి వెడితే.. పలు ప్రదేశాల్లో ఎస్బీఐ బ్రాంచీలు, కార్యాలయాలు, ఏటీఎంలకు ఉన్న సైనేజీ స్థానంలో కొత్త సైనేజీ సరఫరా, ఇన్స్టాలేషన్ కోసం 2018 మార్చిలో ఎస్బీఐ ఇన్ఫ్రా మేనేజ్మెంట్ సొల్యూషన్స్ సంస్థ బిడ్లు ఆహ్వానించింది. అయితే, ఈ టెండర్ విషయంలో బిడ్డర్లు కుమ్మక్కయ్యారంటూ ఆరోపణలు రావడంతో సుమోటో ప్రాతిపదికన సీసీఐ విచారణ చేసింది. బిడ్డింగ్ ప్రక్రియ సజావుగా జరగకుండా .. ధరల అంశంలో కంపెనీలన్నీ కూడబలుక్కుని మార్కెట్‌ను తమలో తాము పంచుకున్నట్లు ఇందులో తేలింది. దీంతో సీసీఐ తాజా ఆదేశాలు ఇచ్చింది. వీటి ప్రకారం డైమండ్ డిస్ప్లే సొల్యూషన్స్ ఏజీఎక్స్ రిటైల్ సొల్యూషన్స్, ఒపల్ సైన్స్, ఎవెరీ డెనిసన్ తదితర సంస్థలకు జరిమానా విధించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలు చిన్న, మధ్యతరహా కోవకి చెందినవే కావడం, విచారణలో సహకరించడంతో పాటు తమ తప్పులను అంగీకరించిన నేపథ్యంలో శిక్ష విషయంలో సీసీఐ కొంత ఉదారత చూపింది. పెనాల్టీని ఆయా సంస్థల టర్నోవరులో 1 శాతానికి పరిమితం చేసింది. -
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్, టైక్స్‌టైల్ పార్క్
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్‌లో త్వరలో ఐటీ టవర్‌తోపాటు టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామరావు అన్నారు. ఎన్డీబీఎస్ ఇండియా ఎండీ, సంజీవ్ దేశ్‌పాండే ఐటీ టవర్ ఏర్పాటుకు ముందుకు వచ్చారని వెల్లడించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆదిలాబాద్ జిల్లాలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ను పునరుద్ధరిస్తే కొత్త కంపెనీ తరహాలో రాయితీలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లామని వివరించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, పలువురు జిల్లా నేతలు బుధవారం మంత్రి కేటీఆర్‌తో ప్రగతి భవన్లో భేటీ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఉపాధి అవకాశా లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుం డగా, కేంద్రం మాత్రం ప్రభుత్వరంగ సంస్థను అమ్మేందుకు కుట్ర చేస్తోందన్నారు. సిర్పూర్ పేపర్ మిల్లును రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తే, సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రం తెరలేపింద న్నారు. ఆదిలాబాద్ సీసీఐ యూనిట్ పునరుద్ధర ణకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సీసీఐ సాధన సమితి ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ చేపడ తామని ఆ జిల్లా నేతలు వెల్లడించారు. ఈ విష యమై బీజేపీ ఎంపీపై ఒత్తిడి తెస్తామన్నారు. అటవీ భూములపై హక్కులిచ్చేందుకు సానుకూలం ఆదివాసీ రైతులు సాగుచేసుకుంటున్న అటవీ భూములపై హక్కులు కల్పించే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కేటీ రామారావు అన్నారు. టీఆర్ఎస్కి చెందిన ఆదివాసీ ప్రజాప్రతినిధులు, ఆదివాసీ సంఘాల ప్రతినిధులు బుధవారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఆదివాసీలకు సంబంధించిన అన్ని సమస్యలపై త్వరలో ఆదివాసీ ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తమ తెగలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సంఘాల ప్రతినిధులు కేటీఆర్‌ను కోరారు. భేటీలో ప్రభుత్వ విప్ కాంతారావు, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో పాటు పలువురు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఆదివాసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
చిక్కుల్లో యాపిల్..విచారణకు ఆదేశాలు
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్‌కు భారీ షాక్ తగిలింది. భారత్‌లో యాపిల్ అనైతిక బిజినెస్ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ఆదేశాలు జారీ చేసింది. "టుగెదర్ వుయ్ ఫైట్ సొసైటీ" అనే ఫిర్యాదుదారు ప్రకారం.. యాపిల్ యాప్ స్టోర్‌లో థర్డ్ పార్టీ యాప్ స్టోర్లను అనుమతించరు. అటువంటి సర్వీసులను ఆఫర్ చేయడంకు యాప్ డెవలపర్లతో అగ్రిమెంట్లు చేసుకుంటూ వారిని నిరోధించే ప్రయత్నం చేస్తుందంటూ ఫిర్యాదు దారుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు నేపథ్యంలో సీసీఐ యాపిల్‌పై విచారణ చేపట్టాలంటూ 20పేజీల లేఖను రాసింది. ఆ లేఖలో అగ్రిమెంట్లు ద్వారా యాప్ డిస్ట్రిబ్యూటర్లు, యాప్ స్టోర్ డెవలపర్లు యాప్ మార్కెట్లోకి వెళ్లలేకపోతున్నారని పేర్కొంది. అందుకే సంస్థ డైరెక్టర్ జనరల్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలని సీసీఐ ఆదేశాలు జారీ చేసింది. చదవండి: స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కింగ్..జనవరి నుంచి ఆ స్మార్ట్ ఫోన్ ఇక కనిపించదు! -
మరోసారి తెరపైకి టాటా - ఎయిరిండియా డీల్..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆమోదం లభించింది. సోమవారం ఒక అధికారిక ప్రకటనలో సీసీఐ ఈ విషయం పేర్కొంది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎయిరిండియాను టాటా గ్రూప్ సంస్థ టాలేస్ ప్రైవేట్ లిమిటెడ్ .. వేలంలో రూ. 18,000 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో 100 శాతం వాటాలు, ఎయిరిండియా ఎస్ఏటీఎస్ ఎయిర్పోర్ట్ సర్వీసెస్ (ఏఐఎస్ఏటీఎస్)లో 50 శాతం వాటాలను టాలేస్ కొనుగోలు చేస్తోంది. దీని ప్రకారం రూ. 2,700 కోట్ల మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించి, మరో రూ. 15,300 కోట్ల రుణాన్ని టేకోవర్ చేస్తుంది. చదవండి: ఆ మహానుభావుడు ఉంటే ఎంతో సంతోషించేవాడు.. ఎమోషనలైన రతన్ టాటా -
అమెజాన్‌కు భారీ షాక్ ఇచ్చిన సీసీఐ
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు సీసీఐ భారీ షాక్ ఇచ్చింది. అమెజాన్, ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఎఫ్‌సిపిఎల్) మధ్య కుదిరిన ఒప్పందాన్ని 2019లో ఆమోదించిన కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), ఇప్పుడు ఆ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఎఫ్‌సిపిఎల్ తో జరిగిన రూ.1400 కోట్ల ఒప్పందానికి అమెజాన్ ఆమోదం కోరుతూ కీలక సమాచారాన్ని దాచిపెట్టినట్లు ఆరోపిస్తూ సీసీఐ అమెజాన్ కు 60 రోజుల నోటీసు జారీ చేసింది. అప్పటి వరకు ఈ డీల్ నిలుపుదల చేస్తున్నట్లు స్పష్టంచేసింది. అలాగే, అమెజాన్‌కు రూ.202 కోట్లు జరిమానా కూడా విధించింది. ఎఫ్‌సిపిఎల్ అనేది ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్(ఎఫ్ఆర్ఎల్) ప్రమోటర్ ఎంటిటీ. 2019లో అమెజాన్-ఎఫ్‌సిపిఎల్ ఒప్పందం వాస్తవ ఉద్దేశ్యాన్ని వెల్లడించడంలో విఫలం చెందడం అనేది కాంపిటీషన్ చట్టంలో రెగ్యులేషన్ 5 సెక్షన్ 6, సబ్ సెక్షన్ (2) & కాంబినేషన్ రెగ్యులేషన్స్ సబ్ రెగ్యులేషన్స్(4), (5) ఉల్లంఘనలకు సమానమని సీసీఐ తన ఉత్తర్వుల్లో సూచించింది. అమెజాన్ ప్రతినిధి ఒకరు ఈ విషయంపై మాట్లాడుతూ.. "మేము కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదించిన ఉత్తర్వులను సమీక్షిస్తున్నాము, తదుపరి చర్యలకు సంబంధించి తగిన సమయంలో వెల్లడిస్తాము" అని చెప్పారు. "చట్టం సెక్షన్ 6(2) కింద అమెజాన్-ఎఫ్‌సిపిఎల్ ఒప్పందం వాస్తవ ఉద్దేశ్యాన్ని తెలియజేయడంలో విఫలమైనందుకు చట్టంలోని సెక్షన్ 43ఎ కింద కమిషన్ జరిమానా విధించడానికి అవకాశం ఉంది. జరిమానా అనేది మొత్తం టర్నోవర్ లేదా ఆస్తులలో ఒక శాతం వరకు ఉండే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాల వల్ల కమిషన్ అమెజాన్‌పై రెండు వందల కోట్ల రూపాయల జరిమానా విధిస్తుంది" అని సీసీఐ తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఫ్యూచర్ గ్రూప్ విషయంలో న్యాయపోరాటం సాగిస్తున్న వేళ సీసీఐ నిర్ణయం అమెజాన్‌ను ఇరకాటంలో పెట్టింది. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్‌లో 2019లో అమెజాన్ 200 మిలియన్ డాలర్ల మేర(49 శాతం) పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్ కూపన్స్‌కు 7.3 శాతం మేర ఫ్యూచర్ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుంచి 10 ఏళ్లలోపు ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు దఖలు పడింది. (చదవండి: అమెరికా బాట పట్టిన బైజూస్.. రూ.30వేల కోట్ల నిధుల సమీకరణ) -
భారత్ యాక్షన్.. గూగుల్ కౌంటర్ రియాక్షన్
యాప్ మార్కెట్లో భారత్ నుంచి ఎదురైన ప్రతికూలతపై గూగుల్ కౌంటర్ రియాక్షన్ ఇచ్చింది. తమకి వ్యతిరేకంగా ఆరోపణలతో కూడిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నివేదిక బయటకు రావడంపై గూగుల్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారానికి వ్యతిరేకంగా రిట్ పిటిషన్ దాఖలు చేయడంతోపాటు ముందు ముందు తమ హక్కులకు భంగం వాటిల్లకుండా పరిరక్షించాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. యాప్ మార్కెటింగ్‌లో ఇతరులకు స్థానం ఇవ్వకపోవడం, డివైజ్ తయారీదారులపై ఒత్తిడి లాంటి అలియన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్(ADIF) ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీసీఐ రెండేళ్లుగా దర్యాప్తు నిర్వహించింది. ఈ మేరకు సీసీఐ దర్యాప్తు విభాగం ‘ డైరెక్టర్ జనరల్’ గూగుల్‌పై వెల్లువెత్తిన ఆరోపణల్ని నిర్ధారించింది కూడా. అయితే అక్కడితో ఆగకుండా ‘గూగుల్ ఆండ్రాయిడ్ వ్యవహారాల్లో అనైతికంగా ప్రవర్తించిందని, వ్యాపార సూత్రాల్ని విస్మరించింద’ని పేర్కొంటూ పలు అంశాలతో కూడిన నివేదికను లీక్ చేసింది. దీంతో గూగుల్ ఘాటుగా ప్రతిస్పందించింది. అయితే తమకు వ్యతిరేకంగా సీసీఐ దర్యాప్తు విభాగం ‘డీజీ’ వ్యవహరించడంపై గూగుల్ రంగంలోకి దిగింది. గురువారం ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. గోప్యంగా ఉంచాల్సిన నివేదికను బయటపెట్టడం పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక మీదట దర్యాప్తునకు సంబంధించిన వివరాలేవీ బయటకు రాకుండా సీసీఐ దర్యాప్తు విభాగాన్ని నిలువరించాలని హైకోర్టును అభ్యర్థించింది గూగుల్. ప్రభుత్వ విభాగాల గోప్యపు నివేదికలు బయటపెట్టడం.. అవతలి వ్యక్తుల ప్రాథమిక హక్కుల్ని భంగపరచడమే అవుతుందని గూగుల్ వాదిస్తోంది. మరోవైపు డీజీ దర్యాప్తులోని అంశాలు కేవలం ఆరోపణలేనని, అవి తుదితీర్పుపై ప్రభావం చూపించకపోవచ్చనే గూగుల్ చెబుతోంది. నివేదికగానీ, నోటీసులుగానీ తమదాకా రాలేదని, అందుకే ఈ అంశంపై సమీక్ష దిశగా కూడా ఆలోచన చేయట్లేదని పేర్కొంది. డివైజ్ తయారీదారుల సామర్థ్యం తగ్గించడంతో పాటు, ప్రత్యామ్నాయ వెర్షన్లను(ఫోర్క్స్) బలవంతంగా వాళ్లపై రుద్దిందనేది సీసీఐ(డీజీ విభాగం) తన దర్యాప్తులో గుర్తించింది. తాజాగా అనధికారికంగా ఒక నివేదికను విడుదల చేసిన సీసీఐ.. గూగుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే విషయంపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చదవండి: భారత్‌లోనూ యాపిల్‌కు చేదు అనుభవం! -
Google: గూగుల్‌పై సంచలన ఆరోపణలు నిజమే!
టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్‌కు భారీ షాక్ తగిలింది. ప్రపంచంలో గూగుల్‌కి రెండో అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌లో అక్రమాలకు పాల్పడుతోందనే ఆరోపణలు నిజమని తేలింది. ఈ మేరకు రెండేళ్ల తర్వాత ఆరోపణల్ని నిర్ధారించుకున్న దర్యాప్తు ఏజెన్సీ.. గూగుల్‌పై తీసుకునే చర్యల విషయంలో ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. యాప్ మార్కెటింగ్‌లోనూ గూగుల్‌కు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్. అలాంటిది అక్రమంగా మిగతా పోటీదారులను దెబ్బతీసి లాభపడిందనే ఆరోపణలు గూగుల్‌పై వెల్లువెత్తాయి. ఒక్క గూగుల్ మాత్రమే కాదు.. అమెజాన్, యాపిల్ సహా అరడజను కంపెనీలను ఈ తరహా ఆరోపణలే చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తు చేపట్టింది. చదవండి: కమిషన్ కక్కుర్తిపై యాపిల్ గప్‌చుప్ అక్రమాల ఆరోపణలివే.. తయారీ కంటే ముందే తమకు, తమతో ఒప్పందాల్ని కుదుర్చుకున్న కంపెనీల యాప్‌ల్ని ఇన్స్టాల్ చేయాలని డివైజ్ తయారీదారులను ఒత్తిడి చేసిందనేది గూగుల్‌పై మోపబడిన ప్రధాన ఆరోపణ. యాప్ మార్కెటింగ్‌లో ఇతరులకు స్థానం ఇవ్వకపోవడం భారత చట్టాల ప్రకారం నేరం కూడా. ఈ మేరకు సదరు వేధింపులపై అలియన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్(ADIF) ఫిర్యాదు చేయడంతో సీసీఐ 2019లో దర్యాప్తు మొదలుపెట్టింది. డివైజ్ తయారీదారుల సామర్థ్యం తగ్గించడంతో పాటు, ప్రత్యామ్నాయ వెర్షన్లను(ఫోర్క్స్) బలవంతంగా వాళ్లపై రుద్దిందనేది సీసీఐ తన దర్యాప్తులో గుర్తించింది. తాజాగా అనధికారికంగా ఒక నివేదికను విడుదల చేసిన సీసీఐ.. అధికారిక ప్రకటనతో పాటు, గూగుల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే విషయంపై త్వరలో ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనేది కాంపిటీషన్ యాక్ట్, 2002 ను అమలు చేయడానికి ఏర్పాటైన చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ. మే 2009 నుంచి ఇది పూర్తి స్తాయిలో పని చేస్తోంది.వ్యాపారంలో పోటీ కార్యకలాపాలను నియంత్రించడం దీని బాధ్యత. ఒకవేళ అవినీతి, అవకతవకలు నిర్ధారణ అయితే భారీ జరిమానాలు విధించే అధికారం ఉంది సీసీఐకి. చర్చల దిశగా గూగుల్! ఇక గూగుల్‌కి ఎదురుదెబ్బ నేపథ్యంలో అలియన్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా ఫౌండేషన్(350 స్టార్టప్స్, ఫౌండర్స్, ఇన్వెస్టర్స్) హర్షం వ్యక్తం చేసింది. అంతేకాదు తాజాగా యాప్ మార్కెటింగ్ కట్టడికి దక్షిణ కొరియా తీసుకున్న నిర్ణయం లాంటిదే.. కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలని ADIF కోరుతోంది. అయితే ఈ ఆరోపణల్ని ఖండిస్తూనే.. సీసీఐతో చర్చలకు సిద్ధపడుతోంది గూగుల్. ఆండ్రాయిడ్ మార్కెట్లో పోటీతత్వం ఎలా ఉందనే విషయాన్ని, ఆవిష్కరణలకు తాము ఎలాంటి ప్రోత్సాహం అందిస్తున్నామనే విషయాన్ని సీసీఐ బెంచ్ ఎదుట హాజరై వివరించబోతున్నట్లు గూగుల్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇదీ చదవండి: సౌత్ కొరియా చేసింది ఇదే.. మరి భారత్ సంగతి? -
భారత్‌లోనూ యాపిల్‌కు చేదు అనుభవం!
యాప్ మార్కెటింగ్ కమిషన్ వ్యవహారంలో భారత్‌లోనూ యాపిల్‌కు చేదు అనుభవం ఎదురయ్యేలా కనిపిస్తోంది. నిన్నగాక మొన్న దక్షిణ కొరియా ప్రత్యేక చట్టం ద్వారా గూగుల్, యాపిల్ కమిషన్ కక్కుర్తికి దెబ్బేసిన విషయం తెలిసిందే. అయితే యాప్ డెవలపర్స్ నుంచి బలవంతపు కమిషన్ వసూళ్ల ద్వారా పోటీదారులను దారుణంగా దెబ్బ తీస్తోందనే ఆరోపణలపై యాపిల్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాజస్తాన్‌కు చెందిన ‘టుగెదర్ వీ ఫైట్ సొసైటీ’ అనే ఎన్జీవో సీసీఐలో ఫిర్యాదు చేసింది. యాప్ మార్కెట్లో మధ్యవర్తిగా ఉండడం ద్వారా కస్టమర్లకు, డెవలపర్లకు మధ్య సమన్వయాన్ని యాపిల్ కంపెనీ దెబ్బతీస్తోందని ఫిర్యాదులో పేర్కొంది ఆ సంస్థ. అంతేకాదు ఇతరులకు పోటీలో అవకాశం లేకుండా పోతోందని తెలిపింది. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో సీసీఐ దర్యాప్తునకు ఆదేశించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీసీఐలో దాఖలైన ఫిర్యాదుపై స్పందించేందుకు యాపిల్ నిరాకరించింది. ఇక ఈయూలోనూ యాపిల్ దాదాపు ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొంటోంది. ఇక కిందటి ఏడాది కొన్నిస్టార్టప్స్ చేసిన ఫిర్యాదు ఆధారంగా.. గూగుల్‌పై సీసీఐ విచారణ నడుస్తున్న విషయం తెలిసిందే. తమ ప్లేస్టోర్ల ద్వారా యాప్ పేమెంట్స్ ఛార్జీలు 30 శాతం వసూలు చేస్తున్న గూగుల్, యాపిల్ లాంటి టెక్ దిగ్గజాల తీరు.. పలు దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతోంది. అయితే వీటి యాప్ మార్కెటింగ్ ఆధిపత్యానికి చెక్ పెట్టాలనే ప్రయత్నాలకు దక్షిణ కొరియా బీజం వేయగా.. ఇప్పుడు మరికొన్ని దేశాలు ఆ బాటలో పయనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీసీఐ విధులు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనేది కాంపిటీషన్ యాక్ట్, 2002 ను అమలు చేయడానికి ఏర్పాటైన చట్టబద్ధమైన భారత ప్రభుత్వ సంస్థ. మే 2009 నుంచి ఇది పూర్తి స్తాయిలో పని చేస్తోంది.వ్యాపారంలో పోటీ కార్యకలాపాలను నియంత్రించడం దీని బాధ్యత. ఒకవేళ అవినీతి, అవకతవకలు నిర్ధారణ అయితే భారీ జరిమానాలు విధించే అధికారం ఉంది సీసీఐకి. చదవండి: గూగుల్, యాపిల్‌కు భారీ దెబ్బ! క్లిక్ చేయండి: వాట్సాప్‌కు షాక్ -
మారుతి సుజుకిపై భారీ జరిమానా విధించిన సీసీఐ
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకిపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) 27 మిలియన్ డాలర్ల(₹200 కోట్ల) జరిమానా విధించింది. 2019లో మారుతి తన డీలర్లను వారు అందించే డిస్కౌంట్లను పరిమితం చేయాలని బలవంతం చేస్తుందనే వచ్చిన ఆరోపణలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పరిశీలిస్తుంది. మారుతి సుజుకి చర్య వల్ల డీలర్ల మధ్య పోటీని సమర్థవంతంగా అణచివేస్తుంది, డీలర్లు స్వేచ్ఛగా పనిచేస్తే వినియోగదారులు తక్కువ ధరలకు కార్లను పొందే అవకాశం ఉంటుందని రాయిటర్స్ నివేదించింది.(చదవండి: రూ.9 వేలకే రియల్మీ ట్రిపుల్ రియర్ కెమెరా స్మార్ట్‌ఫోన్) దర్యాప్తు తర్వాత సీసీఐ జారీ చేసిన ఒక ఉత్తర్వులో ఇక నుంచి అటువంటి విధానాలకు పాల్పడకుండా "నిలిపివేయాలి/విరమించుకోవాలని" మారుతిని కోరింది. అలాగే, జరిమానాను 30 రోజుల్లోగా డిపాజిట్ చేయాలని కంపెనీని కోరింది. ఈ విషయంపై మారుతి సుజుకి యాజమాన్యం ఇంకా స్పందించలేదు. దీంతో మారుతి సుజుకి షేర్లు నేడు పడిపోయి బిఎస్ఈలో ₹6,835.00(0.23%) వద్ద ఉన్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మొత్తం ఉత్పత్తి సంవత్సరానికి 58 శాతం పెరిగి 1,70,719 యూనిట్లకు చేరుకుంది. ఏడాది క్రితం కాలంలో కంపెనీ మొత్తం 1,07,687 యూనిట్లను ఉత్పత్తి చేసిందని మారుతి సుజుకి ఇండియా(ఎంఎస్ఐ) రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది. -
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు సుప్రీం షాక్ !
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీలు ఫ్లిప్ కార్ట్, అమెజాన్‌లకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆ కంపెనీలపై సీసీఐ జరుపుతున్న విచారణను నిలిపేందుకు నిరాకరించింది. యాంటీ కాంపిటీటీవ్ ప్రాక్టీస్‌లకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై విచారణ మీద స్టే విధించేందుకు భారత సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు తమ సైట్లలో అమ్మే వస్తువుల్లో అన్ని రకాల వస్తువులకు సమ ప్రాధాన్యం ఇవ్వడం లేదని, కొన్ని వస్తువుల అమ్మకానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ఢిల్లీ వ్యాపార మహాసంఘం కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కి ఫిర్యాదు చేసింది. ఆ రెండు కంపెనీలు కావాలనే కొందరు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించింది. దీనిపై తొలుత కర్నాటక హై కోర్టు విచారణ చేపట్టింది. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీల మీద ప్రాధమిక విచారణ జరపాలంటూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఈ కంపెనీలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ కేసు విచారణ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు తమతంట తామే విచారణకు ముందుకు వస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అందుకు ఆ రెండు కంపెనీలకు నాలుగు వారాల గడువు ఇచ్చారు. దీంతో పాటు గతంలో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపైనా సుప్రీం కోర్టు స్పందించింది. కర్నాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి మాకేం కనిపించడం లేదని పేర్కొంది. -
Tata Motors: టాటా మోటార్స్‌కు సీసీఐ షాక్!
సాక్షి,ముంబై: దేశీయ అత్యధిక వాణిజ్య వాహనాల అమ్మకందారు టాటా మోటార్స్‌కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. డీలర్షిప్ ఒప్పందాలకు సంబంధించి అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఫిర్యాదులపై విచారణకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 4న 45 పేజీల విచారణ పత్రాల టాటా మోటార్స్‌కు పంపింది.నిబంధనలకు విరుద్ధంగా తన డామినెంట్ పొజిషన్‌ను ఉపయోగించుకొని టాటామోటార్స్ వాణిజ్య వాహనాల డీలర్షిప్ ఒప్పందంలో అన్యాయమైన నిబంధనలు, షరతులను విధిస్తోందన్న ఫిర్యాదుదారులను సీసీఐ ప్రాథమికంగా విశ్వసిస్తోంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాల్సిందిగా డైరెక్టర్ జనరల్‌ను దర్యాప్తు విభాగం ఆదేశించింది. టాటా మోటార్స్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, టాటా మోటార్స్ ఫైనాన్స్ లిమిటెడ్‌పై రెండు ఫిర్యాదులు రావడంతో సీసీఐ తాజా ఆదేశాలు జారీ చేసింది. కాంపిటీషన్ కమిషన్ యాక్ట్ సెక్షన్ 4 లోని నిబంధనలకు విరుద్ధంగా టాటా మోటార్స్ వాణిజ్య వాహనాల కోసం డీలర్ షిప్ ఒప్పందాలు చేసుకుంటుందన్న ఆరోపణలను ప్రాధమిక విచారణలో నిజమేనని సీసీఐ తేల్చింది ఈనేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. సెక్షన్ 3 (4), కాంపటీషన్ చట్టంలోని సెక్షన్ 4లోని నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయనేది సీసీఐ వాదన. సీసీఐ ఆదేశాలు తమ దృష్టికి వచ్చాయని సంస్థ ప్రతినిధి ధృవీకరించారు. ప్రస్తుతం పబ్లిక్ డొమైన్లో ఉన్న ఆర్డర్ కాపీని సమీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. అవసరమైన చర్యల నిమిత్తం న్యాయ సలహాదారులను సంప్రదిస్తున్నామని చెప్పారు. చదవండి: పెట్రో పరుగు: ఇవాళ ఎంత పెరిగిందంటే! కరోనా మరణ మృదంగం: సంచలన అంచనాలు -
టాటా గ్రూప్ కిట్టీలోకి బిగ్‌బాస్కెట్!
న్యూఢిల్లీ: ఆన్లైన్ గ్రోసరీ ప్లాట్‌ఫామ్ బిగ్‌బాస్కెట్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకి టాటా సన్స్ కంపెనీ టాటా డిజిటల్ లిమిటెడ్(టీడీఎల్)కు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో బిగ్‌బాస్కెట్‌లో 64.3 శాతం వాటాను టీడీఎల్ సొంతం చేసుకోనుంది. తద్వారా ఇటీవల వేగవంత వృద్ధి సాధిస్తున్న ఆన్లైన్ గ్రోసరీ మార్కెట్లో టాటా గ్రూప్ భారీ అడుగులు వేయనున్నట్లు విశ్లేషకులు చెప్పారు. డీల్‌లో భాగంగా బిగ్‌బాస్కెట్.కామ్ యజమాని సూపర్‌మార్కెట్ గ్రోసరీ సప్లైస్(ఎస్జీఎస్)లో టాటా సన్స్ సొంత అనుబంధ సంస్థ టీడీఎల్ మెజారిటీ వాటాను కొనుగో లు చేయనుంది. బిగ్‌బాస్కెట్ ద్వారా ఎస్జీఎస్.. బీటూబీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అలాగే బిగ్‌బాస్కెట్ ద్వారా బీటూసీ అమ్మకాలు చేపడుతున్న ఇన్నోవేటివ్ రిటైల్ కాన్సెప్్ట్సలోనూ ఎస్జీఎస్ పూర్తి వాటాను కలిగి ఉంది. 2011లో ఏర్పాటైన బిగ్‌బాస్కెట్ దేశవ్యాప్తంగా 25 పట్టణాలలో కార్యకలాపాలు విస్తరించింది. అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు.. గ్రోఫర్స్‌తో బిగ్‌బాస్కెట్ పోటీ పడుతుండటం తెలిసిందే. చదవండి: లాక్డౌన్ భయం.. భారీగా బ్యాంకుల నుంచి నగదు విత్ డ్రా? -
ఫ్యూచర్ గ్రూప్ త్రిశంకు స్వర్గం వీడేదెప్పుడో?
ముంబై, సాక్షి: ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందం కారణంగా కార్పొరేట్ దిగ్గజాలు అమెజాన్ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య ఇటీవల తలెత్తిన వివాదాలపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. ట్రిలియన్ డాలర్ల(సుమారు రూ. 74 లక్షల కోట్లు) విలువైన దేశీ కన్జూమర్ మార్కెట్ కొద్ది నెలలుగా పలు కార్పొరేట్ దిగ్గజాలను ఆకట్టుకుంటోంది. ఇందుకు అనుగుణంగా రిటైల్ రంగ గ్లోబల్ దిగ్గజం వాల్‌మార్ట్.. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌ను సొంతం చేసుకోవడం ద్వారా కార్యకలాపాలు విస్తరిస్తోంది. మరోపక్క ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ సైతం పలు విభాగాలలో అమ్మకాలు పెంచుకుంటోంది. ఇక దేశీయంగా రిలయన్స్ రిటైల్ ద్వారా మార్కెట్లో విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం వేగంగా అడుగులు వేస్తూ వస్తోంది. ఈ బాటలోనే ఆర్థికంగా దెబ్బతిన్న ఫ్యూచర్ గ్రూప్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సీసీఐ ఓకే కిశోర్ బియానీ కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ ఆస్తుల విక్రయానికి ముకేశ్ అంబానీ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో రూ. 24,713 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. తద్వారా ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ బిజినెస్‌లను ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌కు విక్రయించనుంది. అయితే ఇందుకు అమెజాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. డీల్ కుదుర్చుకోవడంలో ఫ్యూచర్ గ్రూప్ నిబంధనలను అతిక్రమించినట్లు ఆరోపించింది. సింగపూర్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కోర్టులో ఫిర్యాదు చేయడం ద్వారా ఒప్పందాన్ని నిలిపివేయమంటూ స్టే తెచ్చుకుంది. కాగా.. అమెజాన్‌కు వ్యతిరేకంగా ఫ్యూచర్ రిటైల్ సైతం ఈ నెల 7న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. మరోవైపు గత వారం దేశీయంగా కాంపిటీషన్ కమిషన్(సీసీఐ).. రిలయన్స్- ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం గమనార్హం! డీల్ అత్యవసరం అమ్మకాలు మందగించడం, తీవ్రతర పోటీ, రుణ భారం వంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న ఫ్యూచర్ గ్రూప్ కోవిడ్-19 కారణంగా మరిన్ని సమస్యలలో చిక్కుకుంది. చెల్లింపుల సమస్యలు తలెత్తడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో డీల్ కుదుర్చుకుంది. అయితే గతేడాది ఫ్యూచర్ గ్రూప్‌లోని అన్‌లిస్టెడ్ కంపెనీలలో 49 శాతం వాటాను యూఎస్ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసింది. తద్వారా గ్రూప్‌లోని ప్రధాన లిస్టెడ్ కంపెనీ ఫ్యూచర్ రిటైల్‌లో వాటా కొనుగోలుకి తమకు హక్కు ఉన్నదంటూ వాదిస్తోంది. అయితే నిబంధనలకు అనుగుణంగానే ఆర్ఐఎల్తో డీల్ కుదుర్చుకున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ వాదిస్తోంది. ఈస్ట్ ఇండియా కంపెనీ ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందం నేపథ్యంలో కార్పొరేట్ దిగ్గజాలు అమెజాన్, ఆర్ఐఎల్ మధ్య వివాదం తలెత్తడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. రెండు కంపెనీల అధిపతులు జెఫ్ బెజోస్, ముకేశ్ అంబానీ ప్రపంచ సంపన్నులు కావడంతో అంతర్జాతీయంగా కార్పొరేట్ వర్గాలు దృష్టిసారించినట్లు చెబుతున్నారు. కాగా.. ఆర్ఐఎల్తో డీల్ విఫలమైతే దివాళా పరిస్థితికి చేరనున్నట్లు ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధులు పేర్కొనడంతో వివాద పరిష్కారానికి ప్రాధాన్యత పెరిగినట్లు తెలియజేశారు. తద్వారా పలువురు ఉపాధి కోల్పోయే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు. ఫ్యూచర్ రిటైల్ తరఫున ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే స్పందిస్తూ.. అమెజాన్ 21వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీవలే ప్రవరిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టుకు తెలియజేశారు. చేస్తే మాతోనే బిజినెస్ చేయాలి. లేదంటే మూసివేయాల్సిందే అంటున్నట్లు వ్యవహరిస్తున్నదని విన్నవించారు. ఫ్యూచర్ రిటైల్‌లో అమెజాన్‌కు పెట్టుబడులు లేవని చెప్పారు. అయితే రిటైల్ ఆస్తుల కొనుగోలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్ సన్నద్దంగా ఉన్నదని తెలియజేశారు. అమెరికన్ బిగ్‌బ్రదర్ వంటి కంపెనీ దేశీ బిజినెస్ డీల్స్‌ను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉన్నదని వ్యాఖ్యానించారు. కాగా.. అమెజాన్.. అమెరికన్ బిగ్ బ్రదర్ లేదా ఈస్ట్ఇండియా కంపెనీ కాదని దీనికి సమాధానంగా అమెజాన్ తరఫున వాదిస్తున్న మాజీ అటార్నీ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం కోర్టుకు తెలియజేశారు. నిజానికి ఫ్యూచర్ గ్రూప్‌లో ఇన్వెస్టర్‌గా ఆర్థికంగా ఆదుకునేందుకే అమెజాన్ చూసినట్లు పేర్కొన్నారు. దేశీయంగా అమెజాన్ 6.5 బిలియన్ డాలర్లు వెచ్చించడం ద్వారా వేలకొద్దీ ఉద్యోగాల కల్పనను చేసినట్లు ఈ సందర్భంగా కోర్టుకు తెలియజేశారు. కాగా.. దివాళా పరిస్థితుల నుంచి ఫ్యూచర్ గ్రూప్‌ను రక్షించాలంటే వీలైనంత త్వరగా డీల్‌కు అనుమతి లభించవలసి ఉన్నట్లు రిలయన్స్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. -
సీసీఐ ఓకే: ఆర్ఐఎల్, ఫ్యూచర్ షేర్లు గెలాప్
ముంబై, సాక్షి: రిటైల్ బిజినెస్‌ల విక్రయానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఫ్యూచర్ గ్రూప్ కౌంటర్లకు ఒక్కసారిగా డిమాండ్ పుట్టింది. ఈ బాటలో రిలయన్స్ రిటైల్ ద్వారా ఫ్యూచర్ గ్రూప్ ఆస్తుల కొనుగోలుకి డీల్ కుదుర్చుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కౌంటర్ సైతం ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. వెరసి ఈ కౌంటర్లన్నీ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. అప్పర్ సర్క్యూట్స్ ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఫ్యూచర్ గ్రూప్‌లోని పలు లిస్టెడ్ కంపెనీల షేర్లు అప్పర్ అనుమతించినమేర అప్పర్ సర్య్యూట్లను తాకాయి. కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరువుకావడంతో ఫ్యూచర్ రిటైల్ షేరు 10 శాతం జంప్‌చేసింది. రూ. 79 ఎగువన ఫ్రీజయ్యింది. ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ ఫ్యాషన్స్ సైతం 10 శాతం లాభపడి రూ. 90.5 వద్ద నిలిచింది. ఈ బాటలో ఫ్యూచర్ సప్లై చైన్ సొల్యూషన్స్ 5 శాతం పురోగమించి రూ. 103 సమీపంలో ఫ్రీజయ్యింది. ఇదే విధంగా ఫ్యూచర్ కన్జూమర్ 5 శాతం పెరిగి రూ. 8.25 వద్ద, ఫ్యూచర్ ఎంటర్ప్రైజ్ 5 శాతం పుంజుకుని రూ. 10.40 వద్ద ఫ్రీజయ్యాయి. ఇక డైవర్సిఫైడ్ దిగ్గజం ఆర్ఐఎల్ షేరు 3.2 శాతం బలపడి రూ. 1,959 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1,970 వరకూ ఎగసింది. కాగా.. ఆర్ఐఎల్తో ఫ్యూచర్ గ్రూప్ కుదుర్చుకున్న ఒప్పందానికి ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. డీల్‌ను నిలిపివేయమంటూ భాగంగా సింగపూర్ ఆర్బిట్రేషన్ కోర్టులో ఫిర్యాదు చేసింది. తద్వారా తాత్కాలిక ఉత్తర్వులను సైతం పొందింది. ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్ తదితర బిజినెస్‌ల కొనుగోలుకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 24,713 కోట్లకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. -
గూగుల్ పే.. ఎందుకు ఇలా?
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ చెల్లింపు విధానాలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దృష్టి సారించింది. గూగుల్ పే, గూగుల్ ప్లే స్టోర్ చెల్లింపు విధానాల్లో కంపెనీ అనుచిత వ్యాపార విధానాలు అమలు చేస్తోందన్న ఆరోపణలపై లోతుగా విచారణ జరపాలంటూ డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. గూగుల్‌కు చెందిన ‘పే’ అనేది డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫాం కాగా ‘ప్లే’ అనేది ఆండ్రాయిడ్ సాధనాలు, ఉత్పత్తులకు సంబంధించి యాప్ స్టోర్. తన గుత్తాధిపత్యంతో పోటీ సంస్థలను దెబ్బతీసే విధంగా గూగుల్ విధానాలు ఉంటున్నాయని సీసీఐ వ్యాఖ్యానించింది. ప్లేస్టోర్‌లోని పెయిడ్ యాప్స్, ఇన్–యాప్ కొనుగోళ్లకు తప్పనిసరిగా గూగుల్ ప్లే చెల్లింపు విధానాన్నే ఉపయోగించాలంటూ గూగుల్ నిబంధన విధించడం వల్ల డెవలపర్లకు వేరే ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే అవకాశం లేకుండా పోతోందని పేర్కొంది. భారీగా ఫీజులు వసూలు చేయడం వల్ల డెవలపర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని సీసీఐ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో అల్ఫాబెట్ (గూగుల్ మాతృసంస్థ), గూగుల్ ఎల్ఎల్సీ, గూగుల్ ఐర్లాండ్, గూగుల్ ఇండియా, గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్‌పై విచారణ జరపాలని తమ డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది. (వాట్సాప్ సందేశాలు వారంలో మాయం!) జోరుమీదున్న యూపీఐ లావాదేవీలు ఎస్బీఐ నివేదికలో వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్‌కు ముందున్న స్థాయితో పోలిస్తే ప్రస్తుతం దేశంలో యూపీఐ లావాదేవీలు విలువ, పరిమాణం పరంగా 1.7 రెట్లు అధికమయ్యాయని ఎస్బీఐ వెల్లడించింది. అన్‌లాక్ తదనంతరం అయిదు నెలల కాలంలో భారత్‌లో వివిధ రంగాల్లో నెలకొన్న పరిస్థితులపై ఎస్బీఐ పరిశోధన నివేదికను విడుదల చేసింది. ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ రాసిన ఈ నివేదిక ప్రకారం.. సెప్టెంబరులో రుణాలు పెరిగినప్పటికీ అక్టోబరులో ఆ ఊపు అందుకోలేకపోయింది. రుణాల వృద్ధి 5.1 శాతం నమోదైంది. గతేడాది ఇది 8.9 శాతం. రెండవ త్రైమాసికంలో బ్యాంకుల పనితీరు మెరుగుపడింది. సూక్ష్మ రుణ సంస్థలు సైతం మెరుగైన పనితీరు కనబరిచాయి. మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలో ఉన్న ఆస్తులు తగ్గాయి. హామీ లేని రుణాలు 2020 సెప్టెంబరుతో పోలిస్తే అక్టోబరులో 48 శాతం తగ్గి రూ.1.02 లక్షల కోట్లు నమోదయ్యాయి. ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే ఎన్బీఎఫ్సీల్లో మ్యూచువల్ ఫండ్ల వాటా రూ.6,554 కోట్లు తగ్గి సెప్టెంబరులో రూ.47,678 కోట్లకు దిగొచ్చాయి. అక్టోబరులో జీఎస్టీ ఆదాయం గతేడాది ఇదే నెలతో పోలిస్తే 10 శాతం అధికమైంది. ఈ–వే బిల్లులు రికార్డు స్థాయిలో సెప్టెంబరులో 5.74 కోట్లు నమోదైతే, అక్టోబరులో ఈ సంఖ్య 6.42 కోట్లకు ఎగశాయి. అత్యవసర వస్తువులు తయారు చేసే కంపెనీలు మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించాయి. అత్యవసరం కాని ఉత్పత్తులు, సేవల్లో ఉన్న కంపెనీల ఆదాయం బలహీనపడింది. (యూట్యూబ్ యూజర్లకు గుడ్‌న్యూస్!) -
వాట్సాప్‌కు సీసీఐలో ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో ప్రబలశక్తిగా ఎదిగేందుకు వాట్సాప్ తన ప్రాబల్యాన్ని దుర్వినియోగం చేస్తోందని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌పై నమోదైన కేసును కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) బుధవారం తోసిపుచ్చింది. వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టిన డిజిటల్ పేమెంట్ వేదిక వాట్సాప్ పేను ప్రస్తుత యూజర్లు వాడుకోవాలని వారిపై ఒత్తిడి చేస్తోందంటూ మెసేజింగ్ యాప్‌పై సీసీఐలో ఈ ఏడాది మార్చిలో కేసు నమోదైంది. ఈ కేసును పరిశీలించిన మీదట వాట్సాప్ యాంటీట్రస్ట్ చట్టాలను ఉల్లంఘించినట్టు గుర్తించలేదని సీసీఐ స్పష్టం చేసింది. వాట్సాప్ పే సర్వీసును పూర్తిస్ధాయిలో ప్రారంభించనందున మార్కెట్లో కంపెనీ ప్రవర్తనను ఇప్పుడే అంచనా వేయలేమని పేర్కొంది. భారత్‌లో వాట్సాప్ యూజర్లందరిలో కేవలం 1 శాతానికే వాట్సాప్ పే బీటా వెర్షన్ అందుబాటులో ఉందని సీసీఐ జారీచేసిన ఉత్తర్వుల్లో ప్రస్తావించింది. వాట్సాప్ పేను త్వరలో పూరిస్తాయిలో తీసుకువచ్చేందుకు సన్నద్ధమవుతున్న వాట్సాప్‌కు సీసీఐ ఉత్తర్వులు ఊరట కల్పించాయి. మరోవైపు మెసేజింగ్ సర్వీస్‌ను వాడుకునేందుకు తమ యూజర్లు వాట్సాప్ పేను రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం లేదని సీసీఐకి వాట్సాప్ వివరణ ఇచ్చింది. ఇక వాట్సాప్ పేమెంట్ సీర్వసుల విస్తరణను సవాల్ చేస్తూ దాఖలైన కేసులను సుప్రీంకోర్టు విచారిస్తోంది. చదవండి : ఫేస్బుక్, వాట్సాప్‌లకు ధీటుగా ‘బిగ్రాఫి’ -
జియో, ఫేస్బుక్ డీల్ : కీలక అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ జియో, ఫేస్బుక్ మెగా ఒప్పందానికి సంబంధించి కీలక అనుమతి లభించింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఫేస్బుక్ 9.99 శాతం వాటా కొనుగోలుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఈ మేరకు యాంటీట్రస్ట్ వాచ్డాగ్ సీసీఐ ఇండియా బుధవారం ట్వీట్ చేసింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 9.99 శాతం వాటా కోసం ఫేస్బుక్ రూ .43,574 కోట్ల పెట్టుబడులును పెట్టనుంది. రిలయన్స్ ఇటీవలికాలంలో సాధించిన 11 మెగా డీల్స్ సిరీస్‌లో ఇది మొదటిది. ఏప్రిల్ 22 న ప్రకటించిన ఈ ఒప్పందంతో మార్క్ జుకర్‌బర్గ్ ఆధ్యర్యంలోని ఫేస్బుక్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా అవతరించింది. కాగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో చేసుకున్న ఒప్పందాల ద్వారా రిలయన్స్ రుణ రహిత సంస్థగా అవతరించింది. అలాగే 11 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ను అధిగమించి ఈ ఘనతను సాధించిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. (అది మా డీఎన్ఏలోనే ఉంది : అంబానీ) @CCI_India approves acquisition of 9.99% stake in Jio Platforms by Jaadhu Holdings LLC. — CCI (@CCI_India) June 24, 2020 చదవండి : ధనాధన్ జియో ఫేస్బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం -
మేక్మైట్రిప్, ఓయోలకు సీసీఐ షాక్
న్యూఢిల్లీ: అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆన్లైన్ ట్రావెల్ ఏజెన్సీ మేక్మైట్రిప్ (ఎంఎంటీ), హోటల్ సేవల సంస్థ ఓయోలపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ కంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆదేశించింది. ఓయో ప్రత్యర్థి ట్రీబో హోటల్స్ మాతృసంస్థ రబ్టబ్ సొల్యూషన్స్ ఫిర్యాదు మేరకు సీసీఐ ఈ మేరకు ఆదేశాలిచ్చింది. పోటీ నిబంధనలను ఉల్లంఘించాయన్న ప్రాథమిక ఆధారాలతో ఈ రెండు సంస్థల మీద సీసీఐ విచారణకు ఆదేశించడం ఆరు నెలల వ్యవధిలో ఇది రెండోసారి. ఓయోతో ఒప్పందం కుదుర్చుకున్న ఎంఎంటీ.. తన పోర్టల్‌లో ట్రీబో భాగస్వామ్య హోటళ్లను లిస్ట్ చేయకుండా మినహాయించడం, పోర్టల్‌లో చార్జీలపరంగా పరిమితులు విధించడం తదితర అంశాలపై ట్రీబో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన సీసీఐ.. మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ఎంఎంటీ దుర్వినియోగం చేస్తున్నట్లు ప్రాథమిక ఆధారాల బట్టి తెలుస్తోందని 13 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. -
సీసీఐపై సంచలన ఆరోపణలు, హైకోర్టుకు ఫ్లిప్‌కార్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పై మరో ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. సీసీఐ దర్యాప్తు ఉత్వర్వులపై ఇటీవల హైకోర్టు నిలుపుదల ఇచ్చిన నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ మరో రిట్‌పిటీషన్ దాఖల చేసింది. ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేకుండా చాలా మూర్ఖమైన, ఏ మాత్రం బుర్ర వాడకుండ సీసీఐ ఇచ్చిన ఆదేశాలంటూ ఫ్లిప్‌కార్ట్ సంచలన ఆరోపణలు చేసింది. ఈ కేసు వచ్చే వారం విచారణకు వచ్చే అవకాశం వుందని భావిస్తున్నారు. అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పిటిషన్లపై వాదలను కర్నాటక హైకోర్టు సంయుక్తంగా వింటుందా, లేక విడివిడిగా వింటుందా అనేది చూడాలి. దర్యాప్తును నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ, యాంటీ ట్రస్టు ఆరోపణలపై సీసీఐ దర్యాప్తు ఉత్తర్వులను పక్కన పెట్టాలంటూ ఫిబ్రవరి 18న పిటిషన్ వేసింది. 'ప్రైమా ఫేసీ' అంటే ఈ కామర్స్ సంస్థలు అనుసరిస్తున్న పద్ధతులు పోటీదారులకు హాని కలిగిస్తున్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేకుండానే సీసీఐ ప్రాధమిక దర్యాప్తునకు ఆదేశించిందని ఫ్లిప్‌కార్ట్ వాదించింది. ఇ-కామర్స్ మేజర్లు భారీ డిస్కౌంట్లతో తమకు నష్టం కలిగిస్తున్నారన్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఐఐటి) ఆరోపణలపై సంస్థ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన బాధ్యత వుందని వాదించింది. అయితే పనికిమాలిన, నిరాధారమైన ఆరోపణలపై స్పందించడంలో సీసీఐ విఫలమైందని ఆరోపించింది. తద్వారా తమ ప్రతిష్టకు భంగం కలగనుందని ఫ్లిప్‌కార్ట్ వాదించింది. అంతేకాదు తమ విలువైన సమయాన్ని కోల్పోవడంతో పాటు, చట్టపరమైన ఖర్చులు తప్పవని పేర్కొంది. కాగా పోటీ చట్టాలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెజాన్ సీసీఐ దర్యాప్తు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఫిబ్రవరి 10 న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఫిబ్రవరి 14న హైకోర్టు స్టే విధించింది. దీనిపై తమ స్పందనను ఎనిమిది వారాల్లోపల దాఖలు చేయాలని ఫ్లిప్‌కార్ట్ సహా సీసీఐ, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్‌ను కోరింది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) దర్యాప్తును మొదట పూర్తి చేయాలని హైకోర్టు అభిప్రాయపడింది. మరోవైపు గత సంవత్సరం, విదేశీ మారకద్రవ్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ రెండింటిపై ఈడీ దర్యాప్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే. చదవండి : ఉపశమనం కల్పించండి - అమెజాన్ ఈ-కామర్స్ సంస్థలకు భారీ ఊరట ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై సీసీఐ దర్యాప్తు -
ఈ-కామర్స్ సంస్థలకు భారీ ఊరట
సాక్షి, బెంగళూరు: ఆన్లైన్ దిగ్గజం అమెజాన్‌కు కర్నాటక హైకోర్టులో భారీ ఊరట లభించింది. యాంటీ ట్రస్ట్ విచారణపై అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, అమెజాన్, ఇతర ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీలపై దర్యాప్తును శుక్రవారం కోర్టు నిలిపివేసింది. రాయిటర్స్ కథనం ప్రకారం సీసీఐ దర్యాప్తును రెండు నెలల పాటు వాయిదావేసినట్టుగా న్యాయవాదులు వెల్లడించారు. దీంతో దేశంలోని ఈ కామర్స్ సంస్థలకు భారీ ఉపశమం లభించింది. కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు ఆదేశాలపై కోర్టు స్టే విధించింది. 13 జనవరి 2020 న సీసీఐ జారీ చేసిన ఆదేశాలను నిలిపివేయాలంటూ అమెజాన్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా తమకు ఉపశమనం కల్పించాలని కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. మరి తాజా పరిణామంపై దేశీయ చిన్న వ్యాపార సంస్థలు ఎలా స్పందించనున్నాయో చూడాలి. చదవండి : ఉపశమనం కల్పించండి - అమెజాన్ భారత్‌కు ఉపకారమేమీ చేయడం లేదు.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై సీసీఐ దర్యాప్తు -
ఉపశమనం కల్పించండి : అమెజాన్
సాక్షి, బెంగళూరు: ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు ఆదేశాలను నిలిపి వేయాలని తన పిటిషన్లో కోరింది. ఈమేరకు సోమవారం కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 13 జనవరి 2020 న సీసీఐ జారీ చేసిన ఆదేశాలను నిలిపివేయాలని విన్నవించింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా తమకు ఉపశమనం కల్పించాలని కోర్టును అభ్యర్థించింది. ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు తమ వ్యాపారంలో పోటీ చట్టాల నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయంటూ పలు సంఘాలు ఇదివరకే తీవ్ర ఆరోపణలు చేశాయి. ఫలితంగా రిటైలర్లకు అన్యాయం జరుగుతోందని ఆరోపించాయి. కొన్ని కంపెనీలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటూ మొబైల్‌ఫోన్ వంటి ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు అందజేస్తున్నాయని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో రిటైలర్లు, చిన్న వ్యాపారాలు భారీగా నష్టపోతున్నాయని పేర్కొంటూ వ్యాపారుల సంఘం ఇటీవల సీసీఐకి ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలో సీసీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతోపాటు భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌కు పెద్ద ఉపకారమేమీ చేయడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఈ వార్తలపై అమెజాన్ ఇండియా స్పందించాల్సి వుంది. చదవండి : ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై సీసీఐ దర్యాప్తు భారత్‌కు ఉపకారమేమీ చేయడం లేదు.. -
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై సీసీఐ దర్యాప్తు
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సోమవారం దర్యాప్తునకు ఆదేశించింది. భారీ డిస్కౌంట్లు, ఒక వస్తువు కొంటే మరొకటి పొందేలా ఆఫర్లు, ఎంపిక చేసిన అమ్మకందారులు మాత్రమే ప్లాట్‌ఫామ్‌లలో విక్రయాలు జరపడం వంటి అంశాల్లో ఈ సంస్థలు దుర్వినియోగానికి పాల్పడ్డ ఆరోపణలు వచ్చినట్లు సీసీఐ వెల్లడించింది. ఢిల్లీ వ్యాపార్ మహాసంఘ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది. ఈ అంశంపై స్పందించిన అమెజాన్.. తాము ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, దర్యాప్తును స్వాగతిస్తున్నామని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం సీసీఐ ఆర్డర్‌ను సమీక్షిస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. -
తగ్గిన సీసీఐ.. తలొగ్గిన మిల్లర్లు!
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): భారత పత్తి సంస్థ(సీసీఐ), తెలంగాణ పత్తి మిల్లర్ల మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్‌కు తాత్కాలికంగా తెరపడింది. బేళ్ల తయారీలో విధిస్తున్న నిబంధనలను పునః పరిశీలిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో వ్యాపారులు వెనక్కి తగ్గారు. ఈ మేరకు 2019–20 సీజన్ కోసం సీసీఐ మళ్లీ టెండర్లు ఆహ్వానించగా, దాఖలు చేసేందుకు మిల్లర్లు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని మూడు రీజియన్ల పరిధిలో 108 కేంద్రాల నుంచి టెండర్లు పిలవగా.. ఇందులో వరంగల్ పరిధిలో 55 కేంద్రాలు ఉన్నాయి. సీజన్‌కు ముందే సీసీఐ ఏర్పాట్లు.. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పత్తి కొనుగోళ్ల సీజన్‌కు ముందే బేళ్ల తయారీ, రవాణాకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటుంది. ఈ మేరకు జూలై లేదా ఆగస్టులో జిన్నింగు మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లు నుంచి టెండర్లు ఆహ్వానిస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయితేనే మార్కెట్లో పత్తి కొనుగోళ్లకు దిగుతుంది. ఎప్పటిలాగే ఈ యేడు కూడా 2019–20 సీజన్ కోసం జిన్నింగు, ప్రెస్సింగు, బేళ్ల రవాణాకు జూలై 26న టెండర్లు పిలిచింది. దాఖలుకు ఆగస్టు 14 వరకు గడువిచ్చింది. రాష్ట్రంలోని వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ రీజియన్ల పరిధిలోని 108 కేంద్రాల వ్యాపారుల నుంచి టెండర్లకు తెర తీయగా.. తెలంగాణ నుంచి ఎవరూ దాఖలు చేయలేదు. నిరుడు సీసీఐ అమల్లోకి తెచ్చిన నిబంధనలను నిరసిస్తూ రాష్ట్ర పత్తి వ్యాపారుల సంక్షేమ సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. లింట్, ట్రాష్, షార్టేజీ శాతం, బేళ్ల తయారీ ఛార్జీపై అసంతృప్తితో ఉన్న మిల్లర్లు టెండర్లకు దూరంగా నిలిచారు. ఈ వ్యవహారంపై గత నెల 18న ‘సాక్షి’లో ‘సీసీఐకి పత్తి మిల్లర్ల షాక్’ శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ అధికారులు సమస్యపై ఆరా తీశారు. ఈ మేరకు ఆగస్టు 25న హైదరాబాద్ గోల్కొండ హోటల్లో వ్యవసాయశాఖ, మార్కెటింగ్‌శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో ఇరువర్గాలతో చర్చలు జరిపారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సమస్య పరిష్కరించుకోవాలని మంత్రి వారికి సూచించారు. సీసీఐ హామీకి సమ్మతించిన మిల్లర్లు.. సీసీఐ షరతులపై నైరాశ్యంతో ఉన్న రాష్ట్ర పత్తి మిల్లర్ల సంక్షేమ సంఘం.. మంత్రి నిరంజన్‌రెడ్డి సూచనతో వెనక్కి తగ్గింది. ఈ మేరకు సంఘం ప్రతినిధులు ముంబయిలోని సీసీఐ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికి రెండుసార్లు చర్చలు జరిపారు. ఇప్పుడున్న దూది, దుమ్ము, తరుగు శాతంతో తమకు నష్టం వాటిల్లినట్లు ప్రతినిధులు సీసీఐ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బేళ్ల తయారీ ఛార్జీ తక్కువగా ఉందని, మిల్లుల నిర్వహణకు ఇవి ఏమాత్రం చాలడం లేదని వివరించారు. జిన్నింగు మిల్లులు ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను పూర్తిగా వివరించారు. ఈ మేరకు సడలించాల్సిన షరతులను విన్నవించగా, అధికారులు సానుకూలంగా స్పందించారు. టెండర్ల ప్రక్రియ పూర్తయ్యాక దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీసీఐ హామీ ఇవ్వగా, సంఘం ప్రతినిధులు సమ్మతించారు. దీంతో అధికారులు మూడు రీజియన్ల పరిధిలోని పత్తి మిల్లర్ల నుంచి గురువారం మళ్లీ టెండర్లు పిలిచారు. దాఖలుకు ఈ నెల 11 వరకు గడువిచ్చారు. ప్రస్తుతానికి సమస్య తీరడంతో వ్యాపారులు క్రమంగా టెండర్లు వేస్తున్నారు. వరంగల్ రీజియన్‌లో 55 కేంద్రాలు.. తెలంగాణలో సీసీఐకి మూడు రీజియన్లు ఉన్నాయి. వరంగల్, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లో వాటిని నిర్వహిస్తున్నారు. మూడు రీజియన్ల పరిధిలో సీసీఐ ఈసారి 108 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. వరంగల్ రీజియన్‌లో 55, మహబూబ్‌నగర్‌లో 29, ఆదిలాబాద్ రీజియన్‌లో 24 కేంద్రాలను నెలకొల్పేందుకు కసరత్తు పూర్తి చేసింది. పరిస్థితులకు అనుగుణంగా వీటిని పెంచే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట, కరీంనగర్, గోపాల్రావుపేట, గంగాధర, చొప్పదండి, హుజూరాబాద్, వేములవాడ, పెద్దపల్లి, కమాన్‌పూర్, సుల్తానాబాద్, మంథని, వెల్గటూర్ కేంద్రాలు సీసీఐ జాబితాలో ఉన్నాయి. ఈ నెలాఖరు నుంచి అన్ని కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లకు సిద్ధంగా ఉండేందుకు సీసీఐ సన్నాహాలు సాగిస్తోంది. -
సీసీఐకి మిల్లర్ల షాక్!
సాక్షి, జమ్మికుంట(హుజూరాబాద్): కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ పత్తి మిల్లర్లు షాకిచ్చారు. 2019–20 సీజన్‌కు సంబంధించి జిన్నింగ్, బేళ్ల తయారీకి సీసీఐ ఇటీవల టెండర్లు ఆహ్వానించగా.. రాష్ట్రం నుంచి ఎవరూ దాఖలు చేయలేదు. సీసీఐ అమలు పరుస్తున్న నిబంధనలను నిరసిస్తూ వ్యాపారులు మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. టెండర్లకు గడువు ముగియడంతో ఆ సంస్థ ఇప్పుడు పునరాలోచనలో పడింది. సీజన్ సమీపిస్తుండడంతో వ్యవహారం రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ చెంతకు చేరినట్లు తెలుస్తోంది. మద్దతు ధరల కోసం.. తెలంగాణలో పత్తి క్రయవిక్రయాల సీజన్ అక్టోబర్‌లో మొదలవుతుంది. నవంబర్ నుంచి కొనుగోళ్లు ఊంపదుకుని మార్చి వరకు నడుస్తాయి. ప్రధాన మార్కెట్లలో ఏడాది పొడవునా అమ్మకాలు సాగుతాయి. యార్డులో తొలుత ప్రైవేటు వ్యాపారులే పత్తి కొంటారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నూలు, దూది డిమాండ్‌ను బట్టి స్థానికంగా పత్తి ధరలు నిర్ణయిస్తారు. రైతులు తెచ్చే సరకుల్లో తేమ, పింజ పొడవుకు అనుగుణంగా తేడాలు వేస్తారు. మార్కెట్లో ధరలు పతనమైతే మద్దతు ధరల కల్పనకు సీసీఐ రంగంలోకి దిగుతుంది. సరకుల నాణ్యత పరీక్షించి నాలుగు గ్రేడ్లుగా విభజిస్తుంది. తేమశాతం 8 నుంచి 12 లోపు ఉన్న విడిపత్తినే కొంటుంది. నిబంధనల మేరకు ధరలు నిర్ణయించి రొక్కాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరిగితే వాణిజ్య కొనుగోళ్లూ చేపడుతుంది. ఇలా వివిధ కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన సరకులను సమీపంలోని జిన్నింగు మిల్లులకు తరలించి దూదిగా మారుస్తుంది. బేళ్ల రూపంలో దూదిని నిల్వ చేసి, సమయానుకూలంగా వ్యాపారం నిర్వహిస్తుంది. బేళ్ల ఎగుమతిలోనూ సీసీఐ పాత్ర కీలకం. టెండర్లకు దూరంగా మిల్లర్లు.. సీజన్‌కు ముందే సీసీఐ అధికారులు రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ఎంపిక చేస్తారు. సేకరించే పత్తిని జిన్నింగు, ప్రెస్సింగు చేసి బేళ్లుగా మార్చేందుకు సమీపంలోని పత్తి మిల్లుల నుంచి ఆన్లైన్ టెండర్లు ఆహ్వానిస్తారు. నిబంధనల ప్రకారం కోట్‌చేసిన వ్యాపారులకు పనులు అప్పగిస్తారు. ఈ తంతు ఏటా నిర్వహిస్తారు. కాగా.. గతంలో పత్తి జిన్నింగు, ప్రెస్సింగు కలుపుకొని బేలు తయారీకి రూ.1050 చొప్పున మిల్లర్లకు చార్జీ ఇచ్చేవారు. 2013–14 సంవత్సరం నుంచి 2017–18 వరకు ఈ ధరనే వర్తింపజేశారు. 2018–19 నుంచి సీసీఐ అధికారులు కొత్త నిబంధనలను తీసుకొచ్చారు. బేలు తయారీ చార్జీని రూ.1104 దాకా పెంచారు. దీనికితోడు మిల్లర్లకు లింట్, ట్రాష్, షార్టేజీ లింకు పెట్టారు. క్వింటాలు పత్తి నుంచి తీసే లింట్ (దూది) శాతాన్ని ఒకే సీజన్లో 30.9 నుంచి 33 కిలోలకు పెంచుతూ(నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు) పోయారు. క్వింటాలు పత్తిలో షార్టేజీని 3.25 నుంచి 2.25 శాతం వరకు, దూదిలో ట్రాష్(దుమ్ము)ను 3.5 నుంచి 2.5 శాతం వరకు తగ్గిస్తూ వచ్చారు. వ్యతాస్యం ఏర్పడితే మిల్లర్లకు ఇచ్చే చార్జీల్లో కోత విధించారు. దీన్ని వ్యాపారులు వ్యతిరేకించినా రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ జోక్యంతో అమలుపర్చారు. ఈ విధానం నష్టాలు కలిగించడంతో బేళ్ల తయారీకి మిల్లర్లు వెనకడుగు వేశారు. సీజన్లో రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చివరికి తలొగ్గారు. ఈ క్రమంలో 2019–20 సీజన్ కోసం జూలై 26న సీసీఐ టెండర్లు పిలిచింది. దాఖలుకు ఆగస్టు 14 వరకు గడువు విధించింది. ఈ నెల 15న టెండర్లు తెరిచిన సీసీఐ అధికారులు విస్తుపోయారు. రాష్ట్రంలో 350 పత్తిమిల్లులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 45 పత్తి మిల్లులు ఉండగా.. ఒక్క టెండరు కూడా దాఖలు కాలేదు. సీసీఐ షరతులపై విముఖంగా ఉన్న వ్యాపారులు సమష్టిగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బేళ్ల తయారీకి ఇస్తున్న చార్జీని మరింత పెంచాలని, లింట్, ట్రాష్, షార్జేజీ శాతాన్ని సడలించాలనే పట్టుతో ఉన్నారు. దీనిపై పునరాలోచనలో పడిన భారత పత్తి సంస్థ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. సర్కారు దరికి సమస్య.. సీసీఐకి వ్యాపారులకు మధ్య తలెత్తే వివాదాలపై రాష్ట్ర సర్కారే చొరవ చూపుతోంది. నిరుడు సమస్య ఉత్పన్నమైనప్పుడు కూడా మార్కెటింగ్‌శాఖ జోక్యం చేసుకుని సమస్యకు తెరదింపింది. ఈయేడు మిల్లర్లు టెండర్లకు దూరంగా ఉండడంతో ప్రభుత్వం మళ్లీ రంగంలోకి దిగాల్సిన పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 14 లక్షల హెక్టార్లలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2.50లక్షల హెక్టార్లలో పత్తి సాగవుతోంది. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి 18 లక్షల టన్నుల దిగుబడి రావొచ్చని అంచనా. మరో నెలన్నరలో పత్తి క్రయవిక్రయాల సీజన్ మొదలు కానుండగా.. రైతులకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండాల్సిన అవసరం నెలకొంది. మద్దతు ధరల కల్పనకూ ఇది అనివార్యం. రాష్ట్రంలో సీసీఐ ఏటా సుమారు 150 కేంద్రాలు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 12 కేంద్రాలను నెలకొల్పుతోంది. జిన్నింగు మిల్లుల సమస్య తీర్చకుంటే పత్తి కొనుగోళ్లకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అదే జరిగితే రైతులకు ఇబ్బందులు తప్పవు. ఇదే అదునుగా దళారులు రెచ్చిపోతారు. రైతుల శ్రమఫలాన్ని గద్దల్లా తన్నుకుపోతారు. మార్కెట్లోనూ ధరలు పతనం అవుతాయి. సీసీఐ, మిల్లర్లకు మద్య నడుస్తున్న కోల్డ్‌వార్ ఇప్పటికే మార్కెటింగ్‌శాఖ దరికి చేరింది. రేపోమాపో ఇరువర్గాలతో చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. -
ట్రేడ్‌వార్ : భారత్ టార్గెట్ గూగుల్
సాక్షి , న్యూఢిల్లీ : భారత మార్కెట్లో 99శాతం వాటాను కలిగి ఉన్న గూగుల్ ఆండ్రాయిడ్ ఇతరులను మార్కెట్లోకి రాకుండా అడ్డుకుంటుందనే ఫిర్యాదుల నేపథ్యంలో గూగుల్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై కాంపీటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా దర్యాప్తు ప్రారంభించింది. మొబైల్ తయారీదారులు, గూగుల్ మధ్య ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) మార్కెట్ వాటా ఆరోపణలపై వీటి మధ్య ఒప్పంద వివరాలను ఇవ్వాలని సిసిఐ దర్యాప్తు విభాగం మొబైల్ తయారీదారులను కోరింది. గూగుల్‌తో చేసుకున్న నిబంధనలు, షరతులపై సమాచారం కోరుతూ శాంసంగ్, షావోమి, కార్బన్, లావాతో సహా పలు హ్యాండ్సెట్ తయారీదారులకు సిసిఐ డైరెక్టర్ జనరల్ లేఖలు జారీ చేశారు. ఏప్రిల్ 2011 నుంచి ఎనిమిది సంవత్సరాలలో మొబైల్ యాప్స్, సేవలను ఉపయోగించడానికి గూగుల్ ఏదైనా ఆంక్షలు విధించిందో లేదో కూడా సీసీఐ వివరాలు అడిగింది. ఏప్రిల్ 2011 నుంచి మార్చి 2019 వరకు వార్షిక ప్రాతిపదికన ఆండ్రాయిడ్ ఓఎస్ మరియు గూగుల్ సేవలను ఉపయోగించుకోవడం కోసం గూగుల్‌కు చెల్లించిన లైసెన్స్ ఫీజు లేదా రాయల్టీ వివరాలను కూడా కోరింది. నోటీసులు అందుకున్నట్లు కంపెనీలు ధృవీకరించినా ఈ విషయంపై వారు స్పందించడానికి నిరాకరించారు. దర్యాప్తుకు సహకరిస్తామని గూగుల్ తెలిపింది. విచారణలో భాగంగా సీసీఐ ముందు హాజరుకావడానికి గూగుల్ అత్యున్నత అధికారులను పిలుస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ట్విట్టర్ యాజమాన్యాన్ని విచారణకు పిలిచిన తర్వాత విచారణ ఎదుర్కొనే మరో మల్టీనేషనల్ కంపెనీ గూగుల్ అవుతుంది. 2012లో కూడా గూగుల్ తన ఆధిపత్యస్థానాన్ని దుర్వినియోగం చేసిందనే ఫిర్యాదుపై 2018లో 136 కోట్ల రూపాయల భారీ జరిమానాను భారత్ విధించింది. అయితే ఇంతవరకూ గూగుల్ జరిమానాపై స్పందించలేదు. ఆండ్రాయిడ్ మార్కెట్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిన కేసులో దోషిగా తేలడంతో యూరోపియన్ యూనియన్ గత ఏడాది 5 బిలియన్ డాలర్లు (రూ .35,000 కోట్లు) చెల్లించాలని గూగుల్‌ను ఆదేశించడం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ వర్గాల్లో ఈ అంశం సంచలనం రేపినా గూగుల్ ఇంతవరకూ ఒక్క రూపాయి చెల్లించలేదు. పూర్తి వివరాలు కోరిన సీసీఐ సిసిఐ కోరిన ఇతర వివరాలలో 2011 మరియు 2019 మధ్య స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ద్వారా మొబైల్ ఫోన్ల వార్షిక అమ్మకం ఎంత ఉంది, అదే కాలంలో గూగుల్ లేదా దాని యూనిట్లలో ఏదైనా గూగుల్ యాప్‌లను కోరుకునే కంపెనీలు ఇతర యాప్‌లను ఎందుకు ఎంచుకోకూడదు, హ్యాండ్సెట్ తయారీదారులు తమ సొంత యాప్ స్టోర్స్, వారి యాప్‌ల సంఖ్య, పరిశోధన, అభివృద్ధిపై వార్షిక పెట్టుబడులు, యాప్ స్టోర్ల నిర్వహణ, అప్‌గ్రేడ్, వార్షిక ఆదాయం గురించి సమాచారాన్ని గూగుల్‌తో ఎందుకు పంచుకోవలసి ఉంటుంది?, స్మార్ట్ఫోన్లలో ప్రత్యర్థుల యాప్ స్టోర్స్‌ను ఇన్స్టాల్ చేసుకునే వెసులుబాటు ఉందా? తదితర పూర్తి వివరాలను సిసిఐ కోరింది. అమెరికాకు చెక్ పెట్టే భాగంలోనే భారత్‌లో అమెరికా వస్తువులకు సుంకం రేట్లు భారీగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ విమర్శించడం తెలిసిందే. ఇందులో భాగంగా భారత వస్తువులపై సుంకాన్ని భారీగా పెంచుతామని హెచ్చరించారు. దీనికి ధీటుగా భారత్ కూడా ప్రతిస్పందించింది. ఈ చర్యల్లో భాగంగానే కాలిఫోర్నియా ప్రధానకేంద్రంగా గల గూగుల్‌ను నియంత్రించి ట్రేడ్‌వార్‌పై అమెరికా చర్యలను కట్టడి చేయాలని భారత్ భావిస్తుందని పరిశీలకులు అంటున్నారు. -
‘వరల్డ్‌కప్‌లో పాక్‌తో ఆడొద్దు’
ముంబై: పుల్వామా ఉగ్రదాడి నేపధ్యంలో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని ఇప్పటికే యావత్ భారతావని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తుండగా, తాజాగా పాక్‌తో క్రికెట్ మ్యాచ్‌లను మొత్తం నిషేధించాలనే ప్రతిపాదనను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తెరపైకి తీసుకొచ్చింది. ఇప్పటికే బ్రాబోర్న్ స్టేడియంలో పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను తొలగించిన సీసీఐ.. వరల్డ్‌కప్ వంటి మెగాటోర్నీలో సైతం పాక్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడొద్దని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి విజ్ఞప్తి చేసింది. (చదవండి:పాక్ క్రికెట్‌కు షాక్ మీద షాక్.. పీసీబీ స్పందన) ‘దాడి జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ఘటనపై మాట్లాడటానికి ఆ దేశ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ ముందుకు రాలేదు. దీనిపై ఇమ్రాన్ కనీసం స్పందించాల్సి ఉంది. మన జవాన్ల మీద జరిగిన దాడిని మేం మూకుమ్మడిగా ఖండిస్తున్నాం. సీసీఐ క్రీడా రంగానికి చెందిందే కావచ్చు. కానీ మాకు దేశమే ముఖ్యం. తర్వాతే క్రీడలు. ఈ దాడిపై ఇమ్రాన్ ఖాన్ కచ్చితంగా మాట్లాడి తీరాలి. ఆయన పాకిస్తాన్ ప్రధాని. వాళ్ల దేశం వైపు ఏ తప్పూలేకపోతే ఆయన ఎందుకు మాట్లాడటం లేదు?..అందుకే వరల్డ్ కప్‌లో టీమిండియా..పాకిస్థాన్‌తో ఆడకూడదు. ఈ మేరకు బీసీసీఐని కోరాం’ అని సీసీఐ సెక్రటరీ సురేశ్ బఫ్నా తెలిపారు. త్వరలో ఆరంభమయ్యే వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా టీమిండియా-పాక్‌ల మధ్య జూన్ 16 న మ్యాచ్ జరగాల్సి ఉంది. (చదవండి:పాక్ క్రికెటర్ల ఫొటోలు తొలగింపు) -
ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను తీసేశారు..
ముంబై: పుల్వామాలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తొలగించింది. బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను తీసివేయాల్సిందిగా మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ‘ఆల్ రౌండర్’ విభాగంలో ఇమ్రాన్ ఖాన్ ఫొటోను, క్రికెట్ జట్టు విభాగంలో పాకిస్తాన్ ఫొటోలను అక్కడ ఉంచారు. ఆ టీమ్‌లో ఇమ్రాన్ కూడా ఉండటంతో ఈ ఫొటోలను అక్కడ నుంచి తీసేశారు. భారతీయ ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని మేనేజింగ్ కమిటీ సీనియర్ ఒకరు తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..‘ఈ ఘోర దాడి వెనక ఏ దేశ హస్తం ఉందో మాకు తెలుసు. మా దేశ ప్రజల మనోభావాలే మాకు ముఖ్యం. వాటిని దృష్టిలో ఉంచుకుని పాక్ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్ ఫొటోలను తొలగించాం’ అని పేర్కొన్నారు. మన దేశ జవాన్లపై దాడి జరిగి 40 మంది అమరులైనప్పటికీ ఈ ఘటనపై ఇమ్రాన్ మౌనం వహించడాన్ని సీసీఐ తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత్ ఒక అడుగు ముందుకేస్తే, తాము పది అడుగులు ముందకేస్తామని ఇమ్రాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వ్యాఖ్యానించారు. అయితే తాజాగా పాక్ అండతోనే భారత జవాన్లపై ఉగ్రదాడి జరిగిందని భావిస్తున్న తరుణంలో ఇమ్రాన్ మాత్రం నోరు మెదకపోవడం చర్చనీయాంశమైంది. -
సీసీఐ కార్యదర్శిగా పి.కె. సింగ్
న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొత్త కార్యదర్శిగా పి.కె.సింగ్ నియమితులయ్యారు. ఇప్పటిదాకా సీసీఐకి ఆయన న్యాయపరమైన అంశాలపై సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. కార్యదర్శి పోస్టులో నియామకం కోసం సీసీఐ సెప్టెంబర్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, సీసీఐకి అయిదేళ్ల పాటు సలహాదారుగా అనుభవమున్న వారిని కూడా ఎంపిక చేయొచ్చన్న నిబంధన మేరకు సింగ్‌ను నియమించినట్లు సంస్థ తెలిపింది. గుత్తాధిపత్య ధోరణులు, నిర్బంధ వాణిజ్య విధానాల నివారణ కమిషన్ స్థానంలో 2003లో సీసీఐ ఏర్పాటైంది. వ్యాపార రంగం లో పోటీ సంస్థలను దెబ్బతీసే ధోరణులకు చెక్ చెప్పేందుకు, విలీనాలు.. కొనుగోళ్ల డీల్స్‌ను నియంత్రించేందుకు సీసీఐ ఏర్పాటైంది. -
మూడుపువ్వులు ఆరుకాయలు
మంచిర్యాలఅగ్రికల్చర్: పత్తి కొనుగోలు వ్యాపారంలో దళారులు రంగప్రవేశం చేసి అక్రమ పద్ధతిలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. నేరుగా గ్రా మాల్లో రైతుల వద్దకు వెళ్లి పత్తి కొనుగోలు చేస్తున్నారు. తుకాల్లో మోసాలకు పాల్పడుతూ ఇష్టం వచ్చిన రేటుకు కొనుగోలు చేస్తూ రైతులను నష్టపరుస్తున్నారు. జిల్లాలో అధికారులు సాధారణ ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. అక్రమ కొనుగోళ్లపై పర్యావేక్షణ కొరవడడంతో దళారులకు మూడుపువ్వులు ఆరుకాయలుగా మారింది. తూకాల్లో భారీ మోసం అంతర్జాతీయ మార్కెట్లో పత్తి డిమాండ్ పెరుగుతోంది. ఇదే అదనుగా భావించిన కొంత మంది వ్యాపారులు సొమ్ము చేసుకునేందుకు రైతుల వద ్దకు చేరుతున్నారు.క్వింటా పత్తికి ప్రభుత్వ మద్దతు ధర రూ.5450 ధర ఉండగా.. దళారులు అద నంగా రూ.100 నుంచి రూ. 200 చెల్లిస్తూ తూకా ల్లో మాయజలం ప్రదర్శించి రైతులను నష్టపరు స్తున్నారు. క్వింటా పత్తికి 6 నుంచి 10 కిలోల వర కు తూకాల్లో మోసానికి పల్పడుతున్నారు. దీంతో రైతులు క్వింటాళుకు రూ. 500 నుంచి రూ. 600 వరకు నష్టపోతున్నారు. నిబంధనలను తుంగలో తొక్కి మార్కెట్ కమిటీ ఆదాయానికి గండి కొడుతున్నారు. సేస్ రూపకంగా మార్కెట్‌కు రావాల్సిన ఫీజు రాకుండా పోతుంది. గ్రామాల్లో కొనుగోలు చేసిన పత్తిని రాత్రికి రాత్రే బొలేరో, టాటా మ్యాక్స్, డీసీఎం వాహనాల ద్వారా తరలిస్తున్నా రు. పత్తి పంటలు సాగు చేసిన సమయంలో పెట్టు బడులు కోసం ఇచ్చిన అప్పులను తిరిగి తీసుకునేందుకు కొందరు ఈ వ్యాపారం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు జిల్లాలో సీసీఐ మందమర్రి, హాజిపూర్, మంచిర్యాల, నస్పూర్ మండలాలకు మంచిర్యాల మార్కెట్‌కమిటీ ద్వారా ముల్కల్లలోని జిన్నింగ్ మిల్లులో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి, కాసిపేట, నెన్నెల, భీమిని, తాండూర్, కన్నెపెల్లి మండలాలకు బెల్లంపల్లి మార్కెట్ పరిధిలోని రేపల్లివాడలోని జిన్నింగ్ మిల్లులో, లక్సెట్టిపేట, దండెపల్లి, జన్నారం మండలాల రైతుల సౌకర్యార్థంకోసం లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీముఖి ఇండస్ట్రీస్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి, భీమారం, జైపూర్ మండలాల రైతుల కోసం చెన్నూర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మూడు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అయినా ఈ ఏడాది సీసీఐ ఇప్పటి వరకు ఒక్క క్వింటా పత్తి సైతం కొనుగోలు చేయలేదు. మద్దతు ధర కంటే ఎక్కువగానే ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తుండడంతో రైతులు అటువైపు మొగ్గు చూపుతున్నారు. కొరవడిన పర్యవేక్షణ పత్తి అక్రమ కొనుగోళ్లపై దృష్టి సారించి మార్కెట్ ఆదాయానికి గండి పడకుండా రైతులు నష్టపోకుండా చూడాల్సిన అధికారులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. పత్తి కొనుగోలు సీజన్లో మార్కెటింగ్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాల్సి ఉంది. కానీ అధికారులంతా ఎన్నికల విధుల్లో ఉండడంతో దళారులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. జిల్లాలో కొనుగోలు చేస్తున్న పత్తిని భైంసా, ఆదిలాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈప్రాంతంలోని జిన్నింగ్ మిల్లుల్లో ప్రైవేటు వ్యాపారులు ఎక్కువగా ధర చెల్లిస్తుండడంతో కొనుగోలు చేసిన పత్తిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. -
ఇంటెల్‌పై సీసీఐ విచారణ
న్యూఢిల్లీ: భారత మార్కెట్లో ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలకు సంబంధించి చిప్ తయారీ దిగ్గజం ఇంటెల్‌పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విచారణకు ఆదేశించింది. బెంగళూరుకు చెందిన వేలాంకని ఎలక్ట్రానిక్స్ ఫిర్యాదుతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. వేలాంకని సంస్థ.. దేశీయంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల డిజైనింగ్, తయారీ కార్యకలాపాలు సాగిస్తోంది. వీటికి కీలకమైన ప్రాసెసర్స్, చిప్సెట్స్, మదర్‌బోర్డు/సర్వర్ బోర్డులు మొదలైన వాటిని ఇంటెల్ తయారు చేస్తోంది. అయితే, ప్రధానమైన రిఫరెన్స్ డిజైన్ ఫైల్స్‌ను ఇచ్చేందుకు ఇంటెల్ నిరాకరించిందని, తద్వారా సర్వర్ బోర్డులను రూపొందించకుండా తమను నిరోధించినట్లయిందని వేలాంకని ఆరోపించింది. ఫలితంగా మార్కెట్లో తమ అవకాశాలను దెబ్బతీసినట్లయిందని పేర్కొంది. -
విమానయాన సంస్థలపై సీసీఐ జరిమానా
న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మూడు విమానయాన సంస్థలపై రూ.54 కోట్ల మేర జరిమానా విధించింది. సరుకుల రవాణాపై సర్ చార్జీ విధించే విషయమై అనుచిత వ్యాపార విధానాలకు పాల్పడినందుకు సీసీఐ ఈ జరిమానా విధించింది. జెట్ ఎయిర్వేస్పై రూ.39.81 కోట్లు, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్(ఇండిగో)పై రూ.9.45 కోట్లు, స్పైస్‌జెట్‌పై రూ.5.10 కోట్ల చొప్పున జరిమానాను సీసీఐ వడ్డించింది. ఇదే ఫిర్యాదుపై మూడేళ్ల కాలంలో సీసీఐ ఉత్తర్వులు జారీ చేయడం ఇది రెండోసారి. ఇలాంటి పోటీ వ్యతిరేక విధానాలను విడనాడాలని ఆయా విమాన సంస్థలను తాజాగా సీసీఐ ఆదేశించింది. అయితే అప్పుడు విధించిన జరిమానా(రూ.257 కోట్లు) కంటే ఇప్పుడు వడ్డించిన జరిమానా తక్కువ కావడం విశేషం. 2015, నవంబర్‌లో సీసీఐ (అప్పట్లో కాంపిటీషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్) జెట్ ఎయిర్వేస్పై రూ.152 కోట్లు, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌పై రూ.64 కోట్లు, స్పైస్‌జెట్‌పై రూ.43 కోట్ల చొప్పున జరిమానా విధించింది. ఈ జరిమానాలపై ఆయా కంపెనీలు అప్పీల్ చేయడంతో ఆ ఉత్తర్వులను సీసీఐ పక్కనపెట్టింది. విచారణ అనంతరం తాజాగా సీసీఐ తక్కువ జరిమానాలను విధించింది. ఫ్యూయల్ సర్‌చార్జీ ముసుగులో రవాణా చార్జీలను అధికంగా విధించడం వినియోగదారులపై భారాన్ని మోపడమే కాకుండా ఆర్థిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని సీసీఐ వ్యాఖ్యానించింది. ఈ విషయంలో నిబంధనలను ఉల్లంఘించలేదంటూ ఎయిర్ ఇండియా, గో ఎయిర్‌లపై ఎలాంటి జరిమానాను సీసీఐ విధించలేదు. -
గూగుల్‌కి సీసీఐ 136 కోట్ల జరిమానా
-
పంటకు 'మంట'
సాక్షి, హైదరాబాద్/తల్లాడ/బోయినపల్లి/బేల: ఇటు ప్రకృతి.. అటు పురుగులు.. ఓ వైపు వ్యాపారుల మాయాజాలం.. మరోవైపు ప్రభుత్వాల నిర్లక్ష్యం.. నలువైపుల నుంచీ దాడితో పత్తి రైతు చిత్తవుతున్నాడు. ప్రకృతి పగబట్టి నట్లుగా అవసరమైనప్పుడు వాన కురవక.. వద్దనుకున్నప్పుడు వరుస వర్షాలతో అతలాకుతలం అవుతున్నాడు. సీజన్లో తొలుత మంచి వర్షాలు కురిశాయని విత్తనాలు వేస్తే.. ఆ తర్వాత వర్షాలు కురవక కొంత, నాసిరకం విత్తనాలతో మొలకెత్తక మరికొంత నష్టపోయాడు. తర్వాత వర్షాల మధ్య విరామం (డ్రైస్పెల్)తో గులాబీరంగు కాయతొలుచు పురుగు ఉధృతంగా సోకి పత్తిపంట దెబ్బతిన్నది. ఇంతా చేసి దిగుబడి దశ దాకా వస్తే.. అనవసర సమయంలో అధిక వర్షాలు పడి పత్తి రంగు మారింది, తేమ శాతం పెరిగిపోయింది. ఆఖరుకు మిగిలిన ఆ కాస్త పత్తినీ మార్కెట్‌కు పట్టుకొస్తే.. వ్యాపారుల మాయాజాలం, ప్రభుత్వాల నిర్లక్ష్యం, సీసీఐ అడ్డగోలు నిబంధనలు మరింతగా కుంగదీశాయి. కనీసం పత్తి ఏరే కూలీలకు సరిపడా సొమ్ముకూడా రాని దుస్థితిలో రైతులు పంట పండించిన చేతులతోనే దానికి నిప్పు పెడుతున్నారు. పత్తి ఏరడం కూడా వృథా అనుకుంటూ కన్నీళ్లతో పంటను దున్నేస్తున్నారు. పండించిన చేతితోనే నిప్పు గులాబీ పురుగు ఉధృతితో పంట దెబ్బతినడంతో ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సాంగిడి గ్రామ రైతులు పత్తి పంటకు నిప్పు పెట్టారు. ఆదివారం గ్రామానికి చెందిన సామ నర్సారెడ్డి 9 ఎకరాలు, ఉపేందర్ 6, సునీల్ 5, కన్నె గణేశ్ 9 ఎకరాల్లో పత్తి చేనును దహనం చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం ఖాదర్‌గూడెంకు చెందిన ఔరగొండ పోశయ్య ఆరున్నర ఎకరాల్లో పత్తి పంట వేశారు. పంట దెబ్బతిని, దిగుబడి సరిగా లేక.. పంట మొత్తాన్ని తొలగించి దహనం చేసేశారు. సాగు పెట్టు బడి కోసం చేసిన అప్పులు భారం మిగిలిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ నిబంధనల శాపం పత్తి కొనుగోళ్లకు సంబంధించి భారతీయ పత్తి సంస్థ (సీసీఐ) విధించిన నిబంధనలు కఠినంగా ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవలి వర్షాలతో రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పత్తి నల్లబడింది. అటు వాతావరణంలో మార్పులతో పత్తిలో తేమ శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో నిబంధనలకు అనుగుణంగా లేదంటూ సీసీఐ పత్తిని కొనుగోలు చేయడం లేదు. సీసీఐ నిబంధనల ప్రకారం పత్తిలో 8 శాతం తేమ ఉంటే క్వింటాల్‌కు రూ. 4,320కు, 9 శాతముంటే రూ. 4,277కు, 10 శాతముంటే రూ. 4,234, 11 శాతముంటే రూ. 4,190కి, 12 శాతం తేమ ఉంటే రూ. 4,147కు కొనుగోలు చేయాలి. అంతకుమించి తేమ శాతం ఉంటే సీసీఐ కొనుగోలు చేయదు. ప్రస్తుతం రాష్ట్రంలో పత్తి నాణ్యంగా ఉన్నా గాలిలో తేమ ఎక్కువగా ఉండటంతో పత్తిలోనూ తేమ శాతం ఎక్కువగా ఉంటోంది. దానిని సాకుగా చూపుతూ సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేయడం లేదు. దీంతో వ్యాపారులు పత్తికి రూ.3 వేల నుంచి రూ.4 వేలలోపే చెల్లిస్తూ రైతులను దగా చేస్తున్నారు. కేంద్రంలో చలనం లేదు: హరీశ్‌రావు తేమ శాతం ఎక్కువగా ఉన్న పత్తిని, రంగు మారిన పత్తిని బీ, సీ గ్రేడ్ల కింద సీసీఐ కొనుగోలు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా, లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వం లో చలనం లేదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రం పత్తి రైతులకు బాసటగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పత్తి రైతుల సమస్యలపై ఆదివారం సచివాల యంలో జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులతో హరీశ్‌రావు సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సెప్టెం బర్, అక్టోబర్లలో కురిసిన అకాల వర్షాలకు పత్తి పంట దెబ్బతి న్నదని చెప్పారు. పత్తి రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఇందుకు పూర్తి సహకారం అందించాలని జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులను కోరారు. నాణ్యమైన పత్తిని మద్దతు ధర కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలని.. రంగు మారిన, ఎక్కువ తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తేమ శాతం ఒకసారి నిర్ణయించాక మళ్లీ ఎక్కువ తక్కువంటూ కోతలు వేయవద్దని, చార్జీల పేరి సొమ్ము వసూళ్లు చేయకూడదని సూచించారు. రైతులకు నష్టం కలిగించే చర్యలను సహించబోమని, క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ఇక ఇన్పుట్ సబ్సిడీ, ఇతర ప్రోత్సాహకాలకు సంబంధించి జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు పలు సమస్యలను ప్రస్తావించారని.. వాటిని సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హరీశ్‌రావు చెప్పారు. రైతులు కూడా తొందరపడి తక్కువ ధరకు పత్తి అమ్ముకోవద్దని.. త్వరలోనే పత్తికి మంచి డిమాండ్ ఉంటుం దని సూచించారు. రాష్ట్రంలో 80 సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, 120 జిన్నింగ్ మిల్లులను కూడా కొనుగోలు కేంద్రాలుగా ప్రభుత్వం గుర్తించినట్టు హరీశ్‌రావు చెప్పారు. సమావేశంలో మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, జిన్నిం గ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మణుడు తదితరులు పాల్గొన్నారు. గత్యంతరం లేకనే.. ‘‘సరిగా దిగుబడి లేకపోవడం, అక్కడక్కడా వచ్చిన కొద్ది పత్తి కూడా తీయాలంటే కూలీల ఖర్చుకు కూడా సరిపోయేలా లేదు. అందుకే పత్తి పంటను తీసేస్తున్నాం..’’ – గొడుగునూరి లక్ష్మీరెడ్డి, రైతు వర్షాలతో పంట దెబ్బతింది ‘‘ఈసారి పత్తి బాగా ఎదిగింది. కానీ అధిక వర్షాలతో పూత, పిందె రాలిపోతోంది. కొద్దిగా నిలిచినా ఉపయోగం కనిపించట్లేదు. అందుకే తొలగిస్తున్నాం..’’ – వేమిరెడ్డి గురవారెడ్డి, రైతు ఆశ చచ్చి.. కడుపు మండి.. గతేడాది రాష్ట్రంలో పత్తికి మంచి డిమాండ్ కనిపించింది. మద్దతు ధరకు మించి మరీ రైతుకు గిట్టుబాటు అయింది. దాంతో ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా రైతులు పత్తి పంట వైపు మొగ్గుచూపారు. దీంతో సాధారణ విస్తీర్ణం కంటే అధికంగా పత్తి సాగయింది. కానీ ప్రకృతి సహకరించలేదు. తొలుత వర్షాలు బాగానే కురిసినా.. తర్వాత డ్రైస్పెల్ ఏర్పడటం, గులాబీ కాయతొలుచు పురుగు దాడి, పత్తి దిగుబడి దశలో వర్షాలతో పంట బాగా దెబ్బ తినిపోయింది. దాంతో రైతుల ఆశలు అడియాసలయ్యాయి. చివరికి పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి ఏర్పడింది. చివరికి ఆశ చచ్చిపోయి.. కడుపు మండిన రైతులు తాము పండించిన పంటను తమ చేతులతోనే తొలగించేస్తున్నారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లిలో నిమ్మ అంజిరెడ్డి అనే రైతు మూడెకరాల్లోని పత్తి పంటను ట్రాక్టర్‌తో దున్నించేశారు. పంట ఇటీవలి వర్షాలతో రంగు మారింది. ఏరి విక్రయించినా కనీస ధర కూడా లభించే రిస్థితి లేదని.. సమీపంలోని మార్కెట్ యార్డుల్లో ఉన్న సీసీఐ కేంద్రాల్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం కాలేదని.. దాంతో పంటను తొలగించానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా తల్లాడ పరిసరాల్లోని పలువురు రైతులు కూడా కొద్దిరోజులుగా పత్తి పంటను ట్రాక్టర్లు, రోటవేటర్లతో దున్నించేస్తున్నారు. నారాయణపురం, తల్లాడ గ్రామాల్లో ఇప్పటికే 30 మంది రైతులు వంద ఎకరాల్లో పత్తికి కలుపు మందు కొట్టి దున్నించారు. పెనుబల్లి, కల్లూరు, వేంసూరు మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. -
అక్రమాలు జరిగితే జైలుకే
♦ పత్తి కొనుగోళ్లపై అధికారులు, వ్యాపారులకు హరీశ్ హెచ్చరిక ♦ మంత్రులు, సీసీఐ అధికారులతో సమీక్ష ♦ విక్రయించిన రెండు రోజుల్లో రైతు ఖాతాలోకి డబ్బు ♦ అక్టోబర్ 20లోగా కొనుగోలు కేంద్రాలన్నీ ప్రారంభించాలి సాక్షి, హైదరాబాద్: రైతుల ముసుగులో వ్యాపారులు పత్తిని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)కి అమ్ముకోకుండా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెటింగ్ మంత్రి టి.హరీశ్‌రావు ఆదేశించారు. ఈ విషయంలో తప్పులు చేస్తే అధికారులు, వ్యాపారులు, సిబ్బందిపై కఠిన చర్యలకు వెనకాడబోమని హెచ్చరించారు. అవసరమైతే కేసులు పెట్టి జైలుకు పంపుతామని హెచ్చరించారు. ‘‘పత్తి అమ్మిన 48 గంటల్లోపు డబ్బును రైతు ఖాతాకు నేరుగా జమ చేయాలి. కొనుగోలు కేంద్రాలన్నీ వారంలో ఆరు రోజులు పూర్తిస్థాయిలో పనిచేయాలి’’అని ఆదేశించారు. పత్తి కొనుగోళ్లపై బుధవారం సచివాలయంలో మంత్రుల బృందంతో ఆయన సమీక్ష జరిపారు. మంత్రులు ఈటల, తుమ్మల, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పత్తి కొనుగోళ్లపై ఈ నెల 18న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని హరీశ్ పేర్కొన్నారు. అక్టోబర్ 3 నుంచి 20లోగా పత్తి కొనుగోలు కేంద్రాలన్నింటినీ ప్రారంభించాలని సీసీఐని ఆదేశించారు. ‘‘చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈ ఏడాది పత్తి పండిస్తున్నందున తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. పత్తి కొనుగోలు కేంద్రాలను 92 నుంచి 143కు పెంచాలని ఇటీవల కేంద్ర జౌళి మంత్రిని కోరాను. జిన్నింగ్ మిల్లులను కూడా అవసరమైన మేరకు కొనుగోలు కేంద్రాలుగా నోటిఫై చేయాలని కోరాను. కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి శుక్రవారం రాష్ట్రానికి వస్తున్నారు. పత్తి కొనుగోలు ఏర్పాట్లను సమీక్షిస్తారు’’అని వివరించారు. రైతులకు ఆందోళన వద్దు రైతులకు అందోళన వద్దని హరీశ్ భరోసా ఇచ్చారు. వారు పత్తిని మార్కెట్లో గానీ, ధర తగ్గితే సీసీఐకి గానీ అమ్మడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ‘‘యార్డుల్లో ధర నిర్ణయమయ్యాక వేరే కారణాలతో రైతుకు ధర తగ్గిస్తే సహించబోం. రైతులు పత్తిని ఎక్కువ దూరం తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, పండించిన ప్రాంతానికి దగ్గరగా ఉండే మిల్లులను నోటిఫై చేసేలా చూడాలి. వారు యార్డుల్లో, కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రైతుల గుర్తింపుకు యార్డుల్లోనే కంప్యూటర్లను ఏర్పాటు చేయండి’’అని కలెక్టర్లను కోరారు. పత్తి కొనుగోలు కేంద్రాలన్నింటినీ స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రులతో ప్రారంభించాలన్నారు. జిల్లాల్లో కేంద్రాల వివరాలు రైతులకు తెలిసేలా తక్షణం కరపత్రాలు, వాల్ పోస్టర్లు ముద్రించి ప్రచారం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ‘‘రోజుల తరబడి యార్డుల్లో, కేంద్రాల్లో వేచి ఉండకుండా పత్తిని కొనుగోలు చేయించాలి. అవసరమైన సిబ్బందిని మార్కెటింగ్, రెవెన్యూ, వ్యవసాయ తదితర శాఖల నుంచి తీసుకోండి’’ అని ఆదేశించారు. -
వొడాఫోన్, ఐడియా విలీనానికి సీసీఐ ఆమోదముద్ర
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజాలు వొడాఫోన్, ఐడియాల విలీన ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) ఆమోదముద్ర వేసింది. ఇరు సంస్థలకు సీసీఐ అప్రూవల్ లేఖలు పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆదిత్య బిర్లా గ్రూప్‌లో భాగమైన ఐడియా, వొడాఫోన్ ఇండియా మార్చి 20న విలీన ప్రతిపాదనను ప్రకటించడం తెలిసిందే. 40 కోట్ల మంది కస్టమర్లు, 35% మార్కెట్ వాటా, ఆదాయాల మార్కెట్లో 41% వాటాతో విలీన కంపెనీ దేశీయంగా అతి పెద్ద టెల్కోగా ఆవిర్భవించగలదని ఇరు సంస్థలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. విలీనంతో రూ. 80,000 కోట్ల ఆదాయం గల కంపెనీ ఆవిర్భవించనుంది. విలీన సంస్థలో వొడాఫోన్‌కు 45.1%, ఐడి యా ప్రమోటర్లకు 26% వాటాలు ఉండనున్నాయి. -
పేటీఎంలో పెట్టుబడులకు సీసీఐ ఆమోదం
న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్‌లో జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ 20% వాటాలు కొనుగోలు చేసే ప్రతిపాదనకు కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఆమోదముద్ర వేసింది. సీసీఐ ఈ మేరకు మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో పోస్ట్ చేసింది. పేటీఎంలో 1.4 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 9,079 కోట్లు) ఇన్వెస్ట్ చేసినట్లు సాఫ్ట్‌బ్యాంక్ మే నెలలో వెల్లడించింది. -
లాకర్లలో ఏం జరిగినా మాది బాధ్యత కాదు!
⇔ ప్రభుత్వ బ్యాంకుల ఒప్పందంలో నిబంధన ⇔ దర్యాప్తు కోరుతూ సీసీఐకి ఫిర్యాదు న్యూఢిల్లీ: బ్యాంకు లాకర్లలో ఏది దాచినా భద్రంగా ఉంటుందన్న భరోసాతో ఉన్నవారు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే. లాకర్లలో ఉంచినవి చోరీకి లేదా దోపిడీకి గురైతే ప్రభుత్వరంగ బ్యాంకులకు ఏ మాత్రం బాధ్యత లేదట. కుష్‌కల్రా అనే న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద లాకర్లపై సమాచారం కోసం దరఖాస్తు చేయగా, ఈ నిజాన్ని ఆర్బీఐ, 19 ప్రభుత్వరంగ బ్యాంకులు స్వయంగా వెల్లడించాయి. ఈ సమాధానంతో నివ్వెరపోయిన న్యాయవాది కుష్‌కల్రా... కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తలుపుతట్టారు. ఎస్బీఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు సహా అన్ని బ్యాంకులు కూటమిగా ఏర్పడి ఈ తరహా పోటీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయని సీసీఐకి ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. ఇలా కూటమిగట్టి సేవల మెరుగుదలను అడ్డుకోవడం మార్కెట్లో పోటీ, వినియోగదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందన్నారు. ఈ నేపథ్యంలో కాంపిటిషన్ చట్టం కింద బ్యాంకులపై దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. లాకర్లలో ఉంచిన వాటిపై బ్యాంకులు బాధ్యత తీసుకోనప్పుడు విలువైన వస్తువుల (ఆభరణాలు, పత్రాలు)కు బీమా చేయించి వాటిని ఇంట్లోనే ఉంచుకోవచ్చుగా అని ఆయన ప్రశ్నించారు. ‘‘ఏదైనా యుద్ధం /అల్లర్లు, దొంగతనం లేదా దోపిడీ చర్యల కారణంగా సేఫ్ డిపాజిట్ వోల్ట్(లాకర్లు)లో ఉంచిన వాటిని కోల్పోయినా, నష్టపోయినా బ్యాంకు అందుకు బాధ్యత వహించదు’’ అని లాకర్ల అద్దె ఒప్పందంలో బ్యాంకులు పేర్కొంటున్నట్టు కుష్‌కల్రా తెలిపారు. -
ఎయిర్టెల్ ఫిర్యాదును తోసిపుచ్చిన సీసీఐ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ జియో సంస్థలు గుత్తాధిపత్య కార్యకలాపాలకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ భారతీ ఎయిర్టెల్ చేసిన ఫిర్యాదును కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొట్టిపారేసింది. ఎయిర్టెల్ చేసిన ఆరోపణలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయంటూ... ‘‘ఒకవంక రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలో తనకున్న ఆధిపత్య స్థానాన్ని ఉపయోగించుకుని జియో సేవల్ని అందిస్తోందని, మరోవంక రిలయన్స్– జియో మధ్య పరస్పర పోటీ లేకుండా చూసుకునే ఒప్పందం కుదిరిందని ఎయిర్టెల్ చెబుతోంది. ఈ రెండూ ఎలా కుదురుతాయి?’’ అని సీసీఐ ప్రశ్నించింది. ఎయిర్టెల్ తన ఆరోపణలకు సరైన వివరణ ఇవ్వలేదని పేర్కొంది. జియో పోటీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని కూడా తెలిపింది. జియోలో ఆర్ఐఎల్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినంత మాత్రానా, ఆర్ఐఎల్ను కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘించిందనడానికి వీలులేదని స్పష్టంచేసింది. ఆర్ఐఎల్ టెలికం సర్వీసుల వ్యాపారంలో లేదని, అలాంటప్పుడు ఆ కంపెనీ చేసిన ఇన్వెస్ట్మెంట్లను పోటీ వ్యతిరేక కార్యకలాపాలుగా భావిస్తే పరిశ్రమ వృద్ధికి విఘాతం ఏర్పడుతుందని, కొత్త కంపెనీల విస్తరణ, అభివృద్ధి కుంటుపడుతుందని వివరించింది. -
ఎయిర్టెల్–టెలీనార్ విలీనానికి సీసీఐ ఓకే
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్, టెలీనార్ ఇండియా విలీనానికి కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెబీ, స్టాక్ ఎక్సే్చం జ్లు ఇప్పటికే ఆమోదం తెలియజేయడంతో గతవారం ఎయిర్టెల్, టెలీనార్ విలీనానికి అనుమతి కోరుతూ సీసీఐ ముందు దరఖాస్తు చేసుకున్నాయి. ఈ నెల 5న సీసీఐ నుంచి అనుమతి లభించినట్టు భారతీ ఎయిర్టెల్ బీఎస్ఈకి తెలియజేసింది. విలీనంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎయిర్టెల్, టెలీనార్ ఒప్పందానికి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టెలీనార్ ఇండియాకు చెందిన ఏపీ, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ (తూర్పు,పశ్చిమ) సర్కిళ్లలోని కార్యకలాపాలు, ఆస్తులన్నీ ఎయిర్టెల్ సొంతం అవుతాయి. దీంతో వృద్ధికి అపార అవకాశాలున్నాయనేది ఎయిర్టెల్ అంచనా. -
కోల్ ఇండియాకు సీసీఐ భారీ జరిమానా
న్యూఢిల్లీ: కాంపిటేషన్ కమీషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ కోల్ ఇండియాకు మరోసారి భారీ జరిమానా విధించింది. ఇంధన సరఫరాలో అక్రమాల నేపథ్యంలో రూ. 591 కోట్ల పెనాల్టీ విధించింది. మరోవైపు పోటీ వ్యతిరేక విధానాలనుంచి దూరంగా ఉండాలని ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్ ఆదేశించింది. 56 పేజీల ఆదేశాల్లో సీసీఐ కోల్ ఇండియా వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోల్ ఇండియా దాని మూడు అనుబంధ సంస్థలపై ఫిర్యాదుల నేపథ్యంలో శుక్రవారం సీసీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. మూడు సం.రాల (2009-10, 2011-12) కాలానికిగాను సంస్థ సగటు టర్నోవర్ పై 1 శాతం చొప్పున రూ.591.01కోట్ల జరిమానా విధించినట్టు పేర్కొంది. నాన్-కోకింగ్ కోల్ ఉత్పత్తి, సరఫరాల విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్న కోల్ ఇండియా.. మార్కెట్లో గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని సీసీఐ వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ, గుజరాత్ స్టేట్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ లు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సీసీఐ ఈ మేరకు తీర్పునిచ్చింది. కోల్‌ఇండియాతోపాటు దాని అనుబంధ సంస్థలైన మహానది కోల్‌ఫీల్డ్స్, వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, సౌత్ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్... ఇంధన సరఫరా ఒప్పందాల(ఎఫ్ఎస్ఏ) విషయంలో అన్యాయంగా/అసంబద్ధ నిబంధనలను విధిస్తోందనేది సీసీఐ తేల్చింది. ముఖ్యంగా ఇంధన సరఫరాలో న్యాయమైన , సమాన నమూనా, పరీక్ష ప్రక్రియ విధానంలో తగిన మార్పులు చేపట్టాలని కోల్ ఇండియాను ఆదేశించింది. ఇంధన సరఫరా ఒప్పందాల్లో మార్పులు చేయాలని కోరింది. అలాగే పాత, కొత్త పవర్ ప్రొడ్యూసర్స్‌కి, ప్రైవేట్, ప్రభుత్వ రంగ ప్రొడ్యూసర్స్ మధ్య ఏకరూపత ఉందో లేదో నిర్ధారించుకోవాలని తెలిపింది. అంతర్జాతీయ ఉత్తమ విధానాలతో పాటు, సాంప్లింగ్ సాధ్యత పై పవర్ ప్రొడ్యూసర్స్‌తో సంప్రదించే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. -
పత్తి కొనుగోళ్ల అక్రమాలపై ముగిసిన విచారణ
గుంటూరు: 2014-15 సీజన్లో పత్తి కొనుగోళ్లలో జరిగిన భారీ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల విచారణ పూర్తయింది. అక్రమాలకు సంబంధించి మొత్తంగా 26 మంది అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరికొంత మందిపై చర్యలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 89 మార్కెట్ యార్డుల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. రైతుల పేర్లతో డబ్బు డ్రా చేసినట్లు సంబంధిత అధికారులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. -
త్వరలో కొత్త మార్కెట్ చట్టం
- మార్కెట్ యార్డుల్లో ధాన్యం ఆరబెట్టే యంత్రాలు - నూతన జిల్లాల నేపథ్యంలో మరిన్ని రైతు బజార్లు - మార్కెట్ కమిటీ చైర్మన్ల అవగాహన సదస్సులో మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతమున్న మార్కెట్ చట్టంలో మార్పుచేర్పులు చేసి త్వరలో కొత్త మార్కెట్ చట్టం తీసుకొస్తామని మార్కెటింగ్‌శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్యదర్శులు, ఇతర అధికారులకు ఆదివారం ఇక్కడ జరిగిన అవగాహన సదస్సుకు మంత్రి హాజరయ్యారు. హరీశ్‌రావు మాట్లాడుతూ మార్కెట్ యార్డుల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత దేశంలో తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రిజర్వేషన్ల కారణంగా 56 మంది మహిళలు చైర్మన్లుగా ఎంపికయ్యారన్నారు. మొక్కజొన్న, వరి ధాన్యాన్ని ఆరబెట్టే యంత్రాలను మార్కెట్లలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. మొదట జనగాం మార్కెట్లో దీన్ని ఏర్పాటు చేస్తామని... దశలవారీగా అన్ని మార్కెట్ యార్డుల్లో ఆ యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 30 మార్కెట్ యార్డులను ఏర్పాటు చేశామని, మరో 10 యార్డులు పరిశీలనలో ఉన్నాయని హరీశ్ చెప్పారు. రైతు బంధు పథకం వల్ల గిట్టుబాటు ధర లేనప్పుడు రైతు ఉచితంగా మార్కెట్ యార్డులకు చెందిన గోదాముల్లో దాచుకోవచ్చని... ఆ సమయంలో షరతుల్లేకుండా వారికి ధాన్యం విలువలో 70 శాతం సొమ్ము ఇస్తామన్నారు. ఆరు నెలల్లో ఎప్పుడు ధర వచ్చినా వారు వచ్చి వాటిని విక్రయించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు చెరువులు బాగా నిండాయన్నారు. రైతుకు 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం రూ. 4,600 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రైతు, రైతు ఆధారిత, వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటిపై బడ్జెట్లో ప్రభుత్వం రూ.41 వేల కోట్లు ఖర్చు చేస్తోం దన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్లు తెల్లవారుజామునే మార్కెట్లకు వెళ్లి సాయంత్రం వరకు ఉండాలని, అప్పుడు సమస్యలు రావన్నారు. ‘నామ్’ అమలులో ఉన్న సర్వర్ సమస్యలను పరిష్కరించాలని హరీశ్‌రావు ఆదేశించారు. చాంబర్ ఆఫ్ కామర్స్, ట్రేడర్లతోనూ సమావేశం నిర్వహించి వారి సహకారాన్ని కోరతామన్నారు. గోదాములు, షెడ్ల నిర్మాణంలో నాణ్యత లోపించకుండా చూడాలన్నారు. చైర్మన్లు, కార్యదర్శులకు అవార్డులు కొత్త జిల్లాల నేపథ్యంలో మరిన్ని రైతు బజార్లు ఏర్పాటు చేస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఉల్లి, టమాటా పంటలకు కనీస మద్దతు ధర అమలు చేస్తున్నామన్నారు. బాగా పనిచేసే మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్యదర్శులకు టాప్-3 అవార్డులను ప్రతి రబీ, ఖరీఫ్ సీజన్లలో ఇస్తామన్నారు. కర్ణాటక, గుజరాత్‌లలో మార్కెట్లను పరిశీలనకు 2 విడతలుగా మార్కెట్ కమిటీ చైర్మన్లను ఆయా రాష్ట్రాలకు పంపిస్తామన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ కార్యదర్శి సి.పార్థసారధి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్లు బాగా పనిచేస్తే భవిష్యత్తులో రైతులను ఓటర్లుగా మార్చుకునే వీలుంటుందని... ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఎదిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించడంతో అందరూ చప్పట్లు చరిచారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కమిషనర్ జగన్మోహన్, మార్కెటింగ్ డెరైక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్, సీసీఐ ప్రతినిధి చొక్కలింగం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 90 పత్తి కొనుగోలు కేంద్రాలు నల్లగొండలో కాటన్ కార్పొరేషన్ బ్రాంచీ రాష్ట్రంలో 90 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిర్ణయించింది. పత్తి దిగుబడులు, కొనుగోలు అంశాలపై సీసీఐ డెరైక్టర్ చొక్క లింగంతో మంత్రి హరీశ్‌రావు ఆదివారం చర్చలు జరిపారు. అనంతరం మంత్రి కార్యాలయం ఓ ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం 84 కొనుగోలు కేంద్రాలుండగా మంత్రి హరీశ్‌రావు విన్నపం మేరకు కొత్తగా మరో 6 కొనుగోలు కేంద్రాలకు సీసీఐ అంగీకరించిందని తెలిపారు. ఈ నెలాఖరులోగా 45 పత్తి కొనుగోలు కేంద్రాలు, నవంబర్ చివరిలోగా మరో 45 కేంద్రాలను ప్రాధాన్యం ప్రకారం ప్రారంభించనున్నట్లు సీసీఐ డెరైక్టర్ తెలిపినట్లు వివరించారు. ఇప్పటివరకు ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో సీసీఐ కార్యాలయాలు పనిచేస్తున్నాయని, కొత్తగా నల్లగొండ జిల్లాలో మరో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సీసీఐ అంగీకరించినట్లు వెల్లడించారు. అయితే ఆదిలాబాద్ సీసీఐ కార్యాలయంతో కరీంనగర్ జిల్లాకు చెందిన పత్తి కొనుగోలు వ్యవహారాల పరిపాలన కార్యకలాపాలను అనుసంధానం చేయనున్నట్లు సీసీఐ డెరైక్టర్ తెలిపినట్లు పేర్కొన్నారు. క్వింటాలు పత్తికి మార్కెట్ ధర గతంలో రూ.4,010 ఉండగా, ఇప్పుడు రూ.4,160 ధర పలుకుతున్నట్లు సీసీఐ వెల్లడించిందన్నారు. -
సిమెంట్ కంపెనీలకు సీసీఐ
రూ. 6,715 కోట్ల జరిమానా న్యూఢిల్లీ: కూటమి కట్టి, ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా సిమెంట్ ధరలను తమ ఇష్టాను సారం నడిపించినందుకు 11 సిమెంట్ కంపెనీలకు, సిమెంటు తయారీదారుల సంఘాని(సీఎంఏ)కి రూ.6,715 కోట్ల మేర భారీ జరిమానా విధిస్తూ అనైతిక వ్యాపార విధానాల నిరోధక సంస్థ (సీసీఐ) ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఏసీసీ, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలు సైతం ఉన్నాయి. అన్ని సిమెంట్ కంపెనీలు కుమ్మక్కు కాకుండా, ధరలు, ఉత్పత్తి, సరఫరాను నియంత్రించే చర్యలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. కాంపిటీషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్ సూచనల మేరకు సీసీఐ బుధవారం ఈ ఆదేశాలు వెలువరించింది. కంపెనీలు, సీఎంఏ అనుసరించిన వ్యవహార శైలి వినియోగదారుల ప్రయోజనాలకు విఘాతకరమని సీసీఐ పేర్కొంది. నిర్మాణ, మౌలిక వసతుల రంగాలకు కీలకమైన సిమెంట్ విషయంలో ఈ చర్యలు ఆర్థిక వ్యవస్థకు కూడా చేటు అని వ్యాఖ్యానించింది. ‘సిమెంటు కంపెనీలు సీఎంఏ ప్లాట్ ఫామ్ ద్వారా ధరల వివరాలు, ఎంత మేర ఉత్పత్తి చేస్తుంది, సరఫరాల గురించి వివరాలను ఇచ్చిపుచ్చుకున్నారు. దాంతో ఉత్పత్తి, మార్కెట్లో సరఫరాలను నియంత్రించారు. సిమెంటు ధరలను నియంత్రించడం వ్యాపార పోటీ నిబంధనలకు విరుద్ధం’ అని సీసీఐ స్పష్టం చేసింది. ఏ కంపెనీపై ఎంత..?: ఏసీసీపై రూ.1,147.59 కోట్లు, జైప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ (రూ.1,323.60 కోట్లు), అల్ట్రాటెక్ సిమెంట్ (రూ.1,175.49కోట్లు), సెంచురీ (రూ.274.02కోట్లు), ఇండియా సిమెంట్స్ (రూ.187.48కోట్లు), జేకే సిమెంట్స్ (రూ.128.54 కోట్లు), లఫార్జ్ (రూ.490 కోట్లు), రామ్‌కో రూ.258.63 కోట్లు), ఏసీఎల్ (రూ.1,163.91 కోట్లు), బినాని (రూ.167.32 కోట్లు), సీఎంఏపై రూ.0.73 కోట్ల జరిమానా భారం పడింది. అనుచిత వ్యాపార విధానాలను అనుసరించినందుకు రూ.397.51 కోట్ల జరిమానా చెల్లించాలని శ్రీ సిమెంట్‌ను సీసీఐ ఆదేశించింది.