![Ysrcp Mp Vijayasai Reddy Tweet On Cotton Farmers In Andhra pradesh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/11/25/vijayasaireddy.jpg.webp?itok=PU_GgSXe)
సాక్షి,ఢిల్లీ:ఏపీలో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని,పత్తి కొనుగోలులో జాప్యం జరుగుతోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో సోమవారం(నవంబర్ 25) ఆయన ఒక పోస్టు చేశారు.
‘పత్తి ధరలు పడిపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో కేవలం 20 పత్తి కొనుగోలు కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి.కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.కొంత తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా సీసీఐకి ఆదేశాలు ఇవ్వాలి’అని విజయసాయిరెడ్డి కోరారు.
![ఏపీలో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు: విజయసాయిరెడ్డి](https://www.sakshi.com/s3fs-public/inline-images/v_2.jpg)
Comments
Please login to add a commentAdd a comment