న్యూఢిల్లీ: సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియాలో జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ (జీల్) విలీన ప్రతిపాదనకు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ నుంచి ఆమోదం లభించింది. ఈ విషయాన్ని జీల్ ప్రకటించింది. స్టాక్ ఎక్సే్చంజ్‌ల నుంచి ఆమోదం లభించడం బలమైన, సానుకూల ముందడుగుగా జీల్ పేర్కొంది. దీనివల్ల విలీనానికి సంబంధించి తదుపరి చర్యలు చేపట్టేందుకు వీలుంటుందని వివరించింది.
అయితే, ఈ ప్రతిపాదిత విలీనం అన్నది ఇంకా నియంత్రణ సంస్థల అనుమతులకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. సెబీ, ఎన్‌సీఎల్‌టీల, సీసీఐ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. గతేడాది డిసెంబర్‌లో ఈ రెండు మీడియా సంస్థలు తప్పనిసరి విలీనానికి ఒప్పందం చేసుకోవడం గమనార్హం. నాడు ప్రకటించిన మేరకు విలీనానంతర సంస్థలో కల్వర్ మ్యాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేటు లిమిటెడ్‌కు 52.03% వాటా ఉంటే, జీ వాటాదారులకు 47.07% వాటా లభించనుంది. జీల్ ఎండీ, సీఈవోగా ఉన్న పునీత్ గోయెంకా.. విలీనం తర్వా త సంస్థకు ఎండీ, సీఈవోగా కొనసాగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment