NCLT
-
ఎన్పీఏ కేసులు.. ఆర్థిక శాఖ కీలక సూచనలు
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ), జాతీయ అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఏఆర్సీఎల్) వద్ద ఎన్పీఏ కేసుల సత్వర పరిష్కారానికి వీలుగా బ్యాంక్‌లను కేంద్ర ఆర్థిక శాఖ కీలక సూచనలు చేసింది. విధానపరమైన జాప్యం, కేసుల విచారణలో వాయిదాలను సాధ్యమైన మేర తగ్గించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని, ఆయా కేసుల పురోగతిని పర్యవేక్షించాలని కోరింది.వసూలు కాని నిరర్థక రుణ ఖాతాలను ఎన్ఏఆర్సీఎల్కు విక్రయించడం లేదంటే దివాలా పరిష్కార చర్యలు కోరుతూ ఎన్సీఎల్టీ ముందుకు బ్యాంక్‌లు తీసుకెళ్లడం తెలిసిందే. ఎన్సీఎల్టీలో కేసుల తాజా సమాచారాన్ని బ్యాంక్‌లు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా కార్పొరేట్ శాఖ ఒక పోర్టల్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది. ఎన్ఏఆర్సీఎల్, ఎన్సీఎల్టీలో కేసుల పరిష్కార యంత్రాంగం సమర్థతను పెంచడం, నిర్వహణ సవాళ్ల పరిష్కారం కోసం కేంద్ర ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు అధ్యక్షతన తాజాగా సమావేశం జరిగింది.కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసే విషయమై ఇందులో చర్చించినట్టు ఆర్థిక శాఖ తన ప్రకటనలో తెలిపింది. రూ.95,711 కోట్ల విలువతో కూడిన 22 మొండి ఖాలాలను ఎన్ఏఆర్సీఎల్ సొంతం చేసుకోగా, రూ.1.28 లక్షల కోట్ల విలువ చేసే మరో 28 ఎన్పీఏ ఖాతాలను బ్యాంక్‌లు పరిష్కరించుకున్నట్టు సమావేశంలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది. -
జెట్ ఎయిర్వేస్ కథ కంచికి..
న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన జెట్ ఎయిర్వేస్ దివాలా పరిష్కార ప్రక్రియలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కంపెనీని లిక్విడేట్ చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, పరిష్కార ప్రణాళిక నిబంధనలను పాటించనందుకు గాను జలాన్ కల్రాక్ కన్సార్షియం (జేకేసీ) ఇన్వెస్ట్ చేసిన రూ. 200 కోట్ల మొత్తాన్ని జప్తు చేయాలని సూచించింది. ఇక రూ. 150 కోట్ల పర్ఫార్మెన్స్ గ్యారంటీని క్లెయిమ్ చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సారథ్యంలోని కన్సార్షియానికి అనుమతినిచ్చింది. రాజ్యాంగంలోని 142 ఆరి్టకల్ కింద సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా బెంచ్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. తాజా పరిణామాలతో పాతికేళ్ల పైగా సాగిన జెట్ ఎయిర్వేస్ ప్రస్థానం ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్సీఎల్ఏటీకి అక్షింతలు.. జేకేసీ సమర్పించిన పనితీరు ఆధారిత బ్యాంక్ గ్యారంటీని (పీబీజీ) పాక్షిక చెల్లింపు కింద సర్దుబాటు చేసేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) అనుమతించడాన్ని సుప్రీం కోర్టు ఆక్షేపించింది. దివాలా కోడ్ (ఐబీసీ) సూత్రాలకు విరుద్ధంగా పేమెంట్ నిబంధనలను పూర్తిగా పాటించకుండానే ముందుకెళ్లేందుకు జేకేసీకి వెసులుబాటునిచ్చినట్లయిందని వ్యా ఖ్యానించింది.జెట్ ఎయిర్వేస్ పరిష్కార ప్రణాళిక ఆమోదం పొంది అయిదేళ్లు గడిచినా కూడా కనీస పురోగతి కూడా లేదని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దివాలా కేసుల విషయంలో ఈ తీర్పు ఓ ’కనువిప్పు’లాంటిదని, ఆర్థికాంశాలకు సంబంధించి ఇచ్చిన హామీలను సకాలంలో తీర్చాల్సిన అవసరాన్ని ఈ ఉత్తర్వులు స్పష్టం చేస్తాయని పేర్కొంది. 1992లో ప్రారంభం.. ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు సేల్స్ ఏజంటుగా వ్యవహరించిన నరేశ్ గోయల్ 1992లో జెట్ ఎయిర్వేస్ను ప్రారంభించారు. తొలుత ముంబై–అహ్మదాబాద్ మధ్య ఎయిర్ ట్యాక్సీ సర్వీసుగా కంపెనీ కార్యకలాపాలు మొదలుపెట్టింది. ఒక దశలో జెట్ ఎయిర్వేస్కి 120 పైగా విమానాలు ఉండేవి. ఇదీ చదవండి: అనిల్ అంబానీకి షాక్!.. రిలయన్స్ పవర్‌పై మూడేళ్ళ నిషేధం1,300 మంది పైలట్లు, 20,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉండేవారు. అయితే, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో 2019లో కంపెనీ తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేసింది. అప్పటికి జెట్ ఎయిర్వేస్ వివిధ బ్యాంకులకు రూ. 8,500 కోట్ల రుణాలతో పాటు పలువురు వెండార్లు, ప్యాసింజర్లకు ఇవ్వాల్సిన రీఫండ్లు, ఉద్యోగుల జీతాలకు సంబంధించి వేల కోట్ల రూపాయలు బాకీ పడింది. దీంతో 2019 జూన్‌లో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) జెట్ ఎయిర్వేస్పై దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో దివాలా పరిష్కార ప్రక్రియ కింద 2021లో కంపెనీని జేకేసీ దక్కించుకుంది. 2024 నుంచి కార్యకలాపాలు పునఃప్రారంభించనున్నట్లు కూడా జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. అయితే, నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తాన్ని జేకేసీ సకాలంలో చెల్లించకపోవడంతో వివాదం చివరికి సుప్రీం కోర్టుకు చేరింది. గురువారం బీఎస్ఈలో జెట్ ఎయిర్వేస్ షేరు ధర 5 శాతం లోయర్ సర్క్యూట్‌తో 34.04 వద్ద క్లోజయ్యింది. -
జగన్ ను రాజకీయంగా దెబ్బతీయడానికే కుట్ర..?
-
రూ.7.7 కోట్లు బాకీ.. కంపెనీపై దివాలా చర్యలు
రుణ చెల్లింపుల్లో విఫలమైనందుకు గాను సిస్కా ఎల్ఈడీ లైట్స్పై దివాలా చట్టం కింద చర్యలు తీసుకోనున్నారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి రూ.7.70 కోట్ల బాకీల వసూలు కోసం రుణదాత సన్‌స్టార్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది.సిస్కా ఎల్ఈడీ లైట్స్ బోర్డును రద్దు చేసి దివాలా పరిష్కార ప్రొఫెషనల్‌గా దేవాశీష్ నందాను ఎన్సీఎల్టీ నియమించింది. సన్‌స్టార్ సరఫరా చేసిన ఉత్పత్తుల నాణ్యతపై వివాదం నెలకొందని, ఆ కంపెనీ దివాలా చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందన్న సిస్కా వాదనలను తోసిపుచ్చింది. సన్‌స్టార్‌కి సిస్కా రుణం చెల్లించాల్సి ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉన్నట్లు ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పిటీషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు వివరించింది.ఇదీ చదవండి: అదానీ ప్రాజెక్ట్‌పై కొత్త ప్రభుత్వం పునఃపరిశీలనఎస్ఎస్కే గ్రూప్‌లో భాగంగా ఉన్న సిస్కా ఎల్ఈడీ లైట్స్‌కి ఎలక్ట్రికల్ గృహోపకరణాల సంస్థ సన్‌స్టార్ ఇండస్ట్రీస్ 60 రోజుల క్రెడిట్ వ్యవధితో ఉత్పత్తులను సరఫరా చేసేది. తొలినాళ్లలో సక్రమంగానే చెల్లింపులు జరిపినప్పటికీ 2023 మార్చి నుంచి జులై వరకు పంపిన 25 ఇన్వాయిస్లను చెల్లించకుండా డిఫాల్ట్ కావడంతో సన్‌స్టార్ ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. -
ఎన్సీఎల్ఏటీలో కాఫీ డే సంస్థకి ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో కాఫీ డే ఎంటర్ప్రైజెస్ (సీడీఈఎల్)కి ఊరట లభించింది. కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఇచ్చిన ఆదేశాలపై ఎన్సీఎల్ఏటీ తదుపరి విచారణ వరకు స్టే విధించింది. కంపెనీ పిటీషన్‌పై మూడు వారాల్లో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ఐడీబీఐ ట్రస్టీషిప్ సరీ్వసెస్ (ఐడీబీఐటీఎస్ఎల్)ను ఆదేశించింది. వివరాల్లోకి వెడితే, రూ. 228.45 కోట్ల మొత్తాన్ని చెల్లించడంలో డిఫాల్ట్ అయిన కాఫీ డే సంస్థపై దివాలా ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్‌ని ఐడీబీఐటీఎస్ఎల్ ఆశ్రయించింది. దీన్ని విచారణకు స్వీకరించిన ఎన్సీఎల్టీ, కంపెనీ కార్యకలాపాల నిర్వహణ కోసం తాత్కాలిక పరిష్కార నిపుణుడిని నియమించింది. అయితే, సస్పెండ్ అయిన కంపెనీ బోర్డు సీఈవో మాళవిక హెగ్డే ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించగా తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
దివాలా అస్త్రం నుంచి బయటపడ్డ బైజూస్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ దివాలాకు సంబంధించిన ఎన్సీఎల్టీ వివాదాన్ని పరిష్కరించుకుంది. ఈమేరకు బీసీసీఐతో కుదుర్చుకున్న రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. బెంగళూరు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన రూలింగ్‌ను అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్– చెన్నై బెంచ్) కొట్టివేసింది. దాంతో బైజూస్‌కు ఊరట లభించినట్లయింది.బీసీసీఐ స్పాన్సర్షిప్ కోసం కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం బైజూస్ డబ్బు చెల్లించాల్సి ఉంది. ఈమేరకు కుదిరిన రూ.158 కోట్ల పరిష్కార ఒప్పందాన్ని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించింది. అయితే, అండర్‌టేకింగ్‌లో పేర్కొన్న నిర్దిష్ట తేదీల్లో చెల్లింపులు చేయడంలో ఏదైనా వైఫల్యం జరిగితే, తిరిగి బైజూస్‌పై దివాలా ప్రక్రియ పునరుద్ధరించేలా హెచ్చరికతో కూడిన ఉత్తర్వులను అప్పీలేట్ ట్రిబ్యునల్ జారీ చేసింది. అమెరికా రుణదాతలు చేసిన ఆరోపణల ప్రకారం.. బైజూస్ తాను తీసుకున్న రుణాలను నిర్దిష్ట లక్ష్యాలకు కాకుండా ‘రౌండ్–ట్రిప్పింగ్’కు వినియోగించుకుందని పేర్కొన్నారు. గతంలో చేసిన ఈ ఆరోపణలను కూడా అప్పీలేట్ ట్రిబ్యునల్ కొట్టివేసింది. దానికి తగిన సాక్ష్యాలను అందించడంలో రుణదాతలు విఫలమయ్యారని పేర్కొంది. బైజూస్ వ్యవస్థాపకులు రవీంద్రన్ సోదరుడు–రిజు రవీంద్రన్ తన షేర్ల విక్రయం ద్వారా వచ్చిన మొత్తాలను ఇప్పటివరకూ రుణ చెల్లింపులకు వినియోగించినట్లు పేర్కొంటూ... రౌండ్ ట్రిప్పింగ్ ఆరోపణలకు సాక్ష్యాలు లేవని తెలిపింది. రుణ చెల్లింపుల షెడ్యూల్ ఇదీ... ఒప్పందం ప్రకారం, రిజు రవీంద్రన్ జూలై 31న బీసీసీఐకి బైజూస్ చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లు చెల్లించారు. శుక్రవారం (ఆగస్టు 2న) మరో రూ.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. మిగిలిన రూ.83 కోట్లను ఆగస్టు 9న ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించనున్నారు. వివాదమేమిటీ? బీసీసీఐ, బైజూస్‌లు 2019 జూలై 25న కుదుర్చుకున్న ’టీమ్ స్పాన్సర్ ఒప్పందం’ కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం..భారత క్రికెట్ జట్టు కిట్‌పై తన ట్రేడ్‌మార్క్/బ్రాండ్ పేరును ప్రదర్శించే ప్రత్యేక హక్కు బైజూస్‌కు ఉంది. అలాగే క్రికెట్ సిరీస్‌ల ప్రసార సమయంలో ప్రకటనలు, ఆతిథ్య హక్కులనూ కలిగి ఉంది. 2023 మార్చి 31 తేదీ వరకూ ఈ సర్వీసులు బైజూస్‌కు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సంబంధించి బైజూన్ (కార్పొరేట్ డెబిటార్), ఆపరేషనల్ క్రెడిటార్ (బీసీసీఐ)కు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 2022లో జరిగిన భారత్–దక్షిణాఫ్రికా క్రికెట్ సిరీస్‌కు సంబంధించి బైజూస్ ఒక ఇన్వాయిస్పై రూ. 25.35 కోట్లు చెల్లించింది. తదుపరి ఇన్వాయిస్లకు చెల్లించడంలో విఫలమైంది. రూ.143 కోట్ల బ్యాంక్ గ్యారెంటీని బీసీసీఐ క్యాష్ చేసుకున్నప్పటికీ అది పూర్తి బకాయిని కవర్ చేయలేకపోయింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, ఆసియా కప్, ఐసీసీ టి20లతో సహా సిరీస్‌లు, టూర్లకు ఆగస్టు 2022 నుంచి జనవరి 2023 మధ్య స్పాన్సర్షిప్ రుసుము రూ.158.9 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీనితో బీసీసీఐ బైజూస్‌పై ఎన్సీఎల్టీ బెంగళూరు బెంచ్‌ను ఆశ్రయించింది. బైజూన్ రూ.159 కోట్లు చెల్లించడంలో విఫలమైందని పేర్కొంటూ, మాతృ సంస్థ థిక్ అండ్ లేర్న్పై దివాలా చర్యలకు అనుమతించాలని కోరింది. ఈ పిటిషన్‌ను జులై 16న అనుమతిస్తూ, ఎన్సీఎల్టీ మధ్యంతర దివాలా పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) పంకజ్ శ్రీవాస్తవను నియమించింది. దాంతో సంస్థ ఫౌండర్ అండ్ సీఈఓ రవీంద్రన్ ఐఆర్‌పీకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని కూడా ఎన్సీఎల్టీ స్పష్టం చేసింది. అయితే దీనిపై బైజూస్ అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది.కష్టాల కడలిలో... బైజూస్ విలువ ఒకప్పుడు 22 బిలియన్ డాలర్లుగా ఉండేది. అయితే మహమ్మారి నియంత్రణలను సడలించిన తర్వాత పాఠశాలలను తిరిగి తెరవడం ఎడ్టెక్ సంస్థకు గొడ్డలిపెట్టయ్యింది. బ్లాక్‌రాక్ ఇటీవల సంస్థ విలువను 1 బిలియన్ డాలర్లను తగ్గించింది. రెండేళ్ల క్రితం ఫైనాన్షియల్ రిపోరి్టంగ్ డెడ్లైన్లను పాటించడంలో విఫలమవడం, రాబడి అంచనాలకు 50 శాతానికి పైగా తగ్గించడం వంటి అంశాలతో కంపెనీ కష్టాలు తీవ్రమయ్యాయి. ప్రోసస్ అండ్ పీక్ 15సహా బైజూస్ మాతృసంస్థలో పెట్టుబడిపెట్టిన వారంతా ఫిబ్రవరిలో జరిగిన అసాధారణ సమావేశంలో (ఈజీఎం) ‘‘తప్పుడు నిర్వహణ విధానాలు– వైఫల్యాల‘ ఆరోపణలతో రవీంద్రన్‌ను సీఈఓగా తొలగించాలని వోటు వేశారు. అయితే రవీంద్రన్ ఈ ఆరోపణలను ఖండించారు. ఈ వోటింగ్ చట్టబద్దతను ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం కొనసాగుతోంది.భారీ విజయమిది: బైజూస్ ఎడ్టెక్ సంస్థకు, వ్యవస్థాపకులకు ఇది భారీ విజయమని బైజూస్ ఒక ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వ్యవస్థాపకులు బైజూ రవీంద్రన్ ఈ పరిణామంపై మాట్లాడుతూ, తాజా ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వు్య కేవలం చట్టపరమైన విజయం మాత్రమే కాదని, గత రెండేళ్లలో బైజూ కుటుంబం చేసిన వీరోచిత ప్రయత్నాలకు నిదర్శనమని అన్నారు. తమ వ్యవస్థాపక బృందం సభ్యులు సవాళ్లను ఎదుర్కొంటూ, అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని పేర్కొంటూ, వారి త్యాగం నిరుపమానమైందన్నారు. ప్రతి ఒక్కరికీ తాను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు. ప్రతి కష్టం పోరాడాలన్న తమ దృఢ నిశ్చయాన్ని పటిష్ట పరిచాయని అన్నారు. -
రూ.947 కోట్ల మోసం.. త్వరలో బిల్డప్ బాబాయ్ ఆస్తుల వేలం.. ఎన్సీఎల్టీ నోటీసులు
ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ ఆస్తుల వేలం జరగబోతుంది. ఈమేరకు కంపెనీ స్థిరచరాస్తులను వేలం వేస్తున్నట్లు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రకటించింది. నోటీసులో తెలిపిన వివరాల ప్రకారం..రూ.360 కోట్ల విలువైన ఆస్తులను వేలం వేయనున్నారు.కంపెనీ బ్యాంకుల కన్సార్టియం వద్ద దాదాపు రూ.947 కోట్లు అప్పు చేసింది. దాన్ని తిరిగి తిరిగిచెల్లించకపోవడంతో నిరర్థక ఆస్తిగా మారింది. ఎలాగైనా ఆ డబ్బును రాబట్టుకునేందుకు బ్యాంకులు కేంద్రాన్ని ఆశ్రయించాయి. దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం ఆ కేసును సీబీఐకు అప్పగించింది. 2019లోనే ఈ కంపెనీ డైరెక్టర్లపై కేసు నమోదు చేసింది. బ్యాంక్రప్సీ బోర్డు(ఐబీబీఐ) ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) తాజాగా ఆస్తులు వేలం వేయాలని నిర్ణయించింది. దాంతో కంపెనీ చేసిన అప్పులను కొద్ది మొత్తంలో తగ్గించవచ్చనే ఉద్దేశంతో ఎన్సీఎల్టీ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.సీబీఐ ఛార్జ్‌షీట్..రూ.947.70 కోట్ల రుణాల మోసానికి సంబంధించి రఘురామకృష్ణంరాజు, ఆయన కంపెనీ ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్‌తో పాటు మరో 15 మందిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) 2019లో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇండ్-భారత్ రుణదాతల కన్సార్టియం నుంచి రూ.947 కోట్లు తీసుకుని చెల్లించకుండా మోసం చేస్తున్నట్లు సీబీఐ తెలిపింది. ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(పీఎఫ్సీ) రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్ఈసీ), ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (ఐఐఎఫ్‌సీఎల్) నుంచి కంపెనీకు చెందిన తమిళనాడులోని టుటికోరిన్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం అప్పు చేసినట్లు చెప్పింది.ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆర్కే ఎనర్జీ (రామేశ్వరం), సిబా సీబేస్, ఇండ్ భారత్ పవర్ జెన్‌కామ్, ఇండ్ భారత్ ఎనర్జీ ఉత్కల్, ఇండ్ భారత్ పవర్ వంటి కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన మధుసూధన్ రెడ్డి పేరును కూడా సీబీఐ ఛార్జ్షీటులో పేర్కొంది. కంపెనీ కాంట్రాక్టర్లు సోకియో పవర్ ప్రైవేట్ లిమిటెడ్, వై.నాగార్జున రావు, సీఏలు ఎంఎస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ జాబాద్తో పాటు కంపెనీ భాగస్వామ్యంలో ఉన్న టిఆర్ చద్దా అండ్ కంపెనీ, ఇండ్ భారత్ గ్రూప్‌కు చెందిన సి.వేణును నిందితులుగా చేర్చారు.ఇదిలాఉండగా, ఐబీబీఐ-ఎన్సీఎల్టీ ఆధ్వర్యంలో ఆస్తుల వేలానికి వెళ్తున్న కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా తమ బినామీల ద్వారా తిరిగి వాటిని దక్కించుకునే ప్రమాదం ఉంది. ముందుగా అప్పుచేసి కొనుగోలు చేసిన ఆస్తుల విలువతో పోలిస్తే ఆక్షన్‌లో దక్కించుకున్న వాటికి వ్యత్యాసం ఉంటుంది. దాంతో భారీగా లాభపడవచ్చని కొన్ని కంపెనీలు దురుద్దేశంతోనే దివాలా ప్రక్రియకు నమోదు చేసుకుంటాయి. రాజకీయమైనా, వ్యాపారమైనా సమర్థంగా నిర్వహించే సత్తా ఉంటేనే విజయం సాధిస్తారు. రాజకీయ ప్రచారంలో భాగంగా నీతులు చెబుతున్న రఘురామ వాటిని పాటించడేమో. బ్యాంకులకు అప్పులు కట్టకుండా ఎగనామం పెడితే ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలను మోసం చేసినట్లే. ఈ విషయాన్ని ప్రజలు గమనించరని భావిస్తున్నాడేమో పాపం. ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో ప్రజలు తనకు సరైన గుణపాఠం చెబుతారని తెలుస్తుంది.ఇదీ చదవండి: గోల్డ్‌ఫైనాన్స్ తీసుకుంటే రూ.20వేలే ఇస్తారట! మిగతా డబ్బు..?ఆంద్రప్రదేశ్ రాజకీయాల్లో బిల్డప్బాబాయ్గా పేరున్న రఘురామకృష్ణరాజుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దిల్లీ, మహారాష్ట్రల్లో 19 కేసులు నమోదయ్యాయి. ఆయనపై దిల్లీలో సీబీఐ కేసులు కూడా ఉన్నాయి.ఇండ్ భారత్ పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్‌గా ఉండి ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించడం, రూ.25 కోట్ల చెల్లింపులు చేయకపోవడానికి సంబంధించి మహారాష్ట్రలోని థానేలో ఆర్థిక నేరాల విభాగం 2022 జనవరి 27న ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి హైదరాబాద్ కోర్టులో రెండు కేసులు, ముంబై కోర్టులో ఒక కేసు కొనసాగుతున్నాయి. -
సుజనా అప్పుల లెక్క తీయండి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడు, విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి, మాజీ ఎంపీ వై. సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా మలిగి మధుసూదన రెడ్డిని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ నియమించింది. సుజనా చౌదరి అప్పుల లెక్కలు తీయాలని ఆదేశించింది. సుజనా చౌదరి దివాలా పరిష్కార ప్రక్రియకు ఇప్పటికే అంగీకరించిన ఎస్‌సీఎల్‌టీ.. ఆ తీర్పు పూర్తి ప్రతిని తాజాగా విడుదల చేసింది. దివాలా ప్రక్రియ ముగిసే వరకు సుజనా (రుణ గ్రహీత) ఆస్తుల క్రయవిక్రయాలు, ఇతరుల పేరిట బదిలీ చేయడం లాంటివి చెల్లవని తేల్చిచెప్పింది. దివాలా ప్రక్రియ అంతా ఎలా నిర్వహించాలో ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్‌పూరి ధర్మాసనం రిజల్యూషన్ ప్రొఫెషనల్‌కు స్పష్టంగా వివరించింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్బీఐకి రూ. 562,84,30,310 (అసలు, వడ్డీ కలిపి) రుణ బకాయి పడిందని, దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఇచ్చినందున, ఆయనను దివాలాదారునిగా ప్రకటించి, రుణ పరిష్కార ప్రక్రియ ప్రారంభించాలని కోరుతూ బ్యాంకు 2021లో ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఎన్సీఎల్టీ మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషల్ (ఐఆర్పీ)గా మధుసూదన్ రెడ్డిని నియమించింది. వ్యకిగత హామీదారుకు రుణాల చెల్లింపు కోసం బ్యాంక్ సమయం ఇచ్చిందని, అయినా చెల్లించడంలో ఆయన విఫలమయ్యారని ఐఆర్పీ నివేదిక అందజేశారు. పిటిషన్‌ను అనుమతించి దివాలా ప్రక్రియను ప్రారంభించవచ్చని చెప్పారు. ఈ నివేదికను పరిశీలించి, ఇరుపక్షాల వాదనలు విన్న ఎన్సీఎల్టీ తీర్పు వెలువరించింది. తీర్పులో ప్రధానాంశాలు.. సుజనా చౌదరిపై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభిస్తున్నాం. ఆయన వ్యక్తిగత హామీదారుగా ఉన్నందున అన్ని అప్పులపై 180 రోజుల పాటు మారటోరియం వర్తిస్తుంది. ఈ సమయంలో ఆయన తన ఆస్తుల క్రయవిక్రయాలు, ఇతరులకు బదిలీ వంటి లావాదేవీలు నిషేధం. మా ఉత్తర్వుల కాపీ ఎన్సీఎల్టీ వెబ్సైట్లో అప్లోడ్ చేసిన 7 రోజుల్లోగా సుజనాకు అప్పులు ఇచ్చిన వారి నుంచి వివరాలు కోరుతూ రిజల్యూషన్ ప్రొఫెషనల్ పూర్తి వివరాలతో పబ్లిక్ నోటీస్ జారీ చేయాలి. వ్యక్తిగత హామీదారు సుజనా, కార్పొరేట్ రుణగ్రహీత స్ప్లెండిడ్ కంపెనీ ఉంటున్న రాష్ట్రంలో విస్తృత సర్కులేషన్ ఉన్న ఆంగ్ల, మాతృ భాష (తెలుగు) పత్రికల్లో ఈ నోటీసులు ప్రచురించాలి. ఆ తర్వాత రుణ దాతలు క్లెయిమ్‌లు సమర్పించేందుకు 21 రోజుల సమయం ఇవ్వాలి. 30 రోజుల్లోగా రిజల్యూషన్ ప్రొఫెషనల్ రుణదాతల జాబితా, ఇతర వివరాలన్నీ సిద్ధం చేయాలి. రుణదాతలకు ఎలా చెల్లింపులు చేస్తారో సుజనా నివేదిక ఇవ్వాలి. రుణదాతల జాబితా, సుజనా నివేదికను ఎన్సీఎల్టీ బెంచ్ (అడ్జ్యుడికేటింగ్ అథారిటీ)కి రిజల్యూషన్ ప్రొఫెషనల్ అందజేస్తారు. చివరి క్లెయిమ్ అందిన 21 రోజుల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలి. అప్పటి నుంచి 28 రోజుల్లోగా రిజల్యూషన్ ప్రొఫెషనల్ రుణదాతలతో సమావేశం ఏర్పాటు చేయాలి. ఈ సమావేశం అవసరం లేదని రిజల్యూషన్ ప్రొఫెషనల్ సిఫార్సు చేస్తే, దానికి కారణాలను తెలపాలి. సుజనా నివేదికను రుణదాతలకు అందజేసి, వారి అభిప్రాయం తీసుకుని, ఆ వివరాలను ఎన్సీఎల్టీకి సమర్పించాలి’ అని పేర్కొంది. సుజనా చెల్లింపుల విధానానికి రుణదాతలు అంగీకరిస్తే అంతటితో ప్రక్రియ ముగుస్తుంది. లేదంటే ఆస్తులు వేలం వేసి చెల్లించేలా దివాలా ప్రక్రియ ముందుకు వెళ్లనుంది. -
సుజనా చౌదరి దివాలా
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నేత, మాజీ ఎంపీ, ఎన్డీఏ కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ బెంచ్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దివాళా పరిష్కారకర్త (రెజల్యూషన్ ప్రొఫెషనల్)ను నియమిస్తూ.. ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఆయన ఆస్తుల క్రయవిక్రయాలను నిలిపివేసింది. దివాలా ప్రక్రియకు వెళ్లిన స్లె్పండిడ్ మెటల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఎస్బీఐలో రూ. 500 కోట్లకు రుణం తీసుకుంది. దీనికి సుజనా చౌదరి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఇచ్చారు. దీంతో సుజనా చౌదరి వ్యక్తిగత దివాలా ప్రక్రియ ప్రారంభించి, పరిష్కారాన్ని చేపట్టాలని ఎస్బీఐ 2021లో ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసింది. ఆయన ఆస్తుల మదింపు చేపట్టి, వేలం ద్వారా ఎస్బీఐ రుణాలను చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌పై ఎన్సీఎల్టీ జ్యుడిషియల్ సభ్యుడు రాజీవ్ భరద్వాజ్, టెక్నికల్ సభ్యుడు సంజయ్ పూరి బెంచ్ విచారణ జరిపి, తాజా ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వీవీఎస్ఎన్ రాజు వాదనలు వినిపించారు. రుణదాతకు ఏదైనా కంపెనీ, వ్యక్తులు రుణాన్ని ఎగవేసినప్పుడు దానికి వ్యక్తిగతంగా గ్యారెంటీ ఉన్న వాళ్లు బాధ్యత వహించాలని చట్టం చెబుతోందన్నారు. గతంలో సుప్రీంకోర్టు కూడా ఈ విషయాన్ని పలు తీర్పుల సందర్భంగా చెప్పిందన్నారు. హామీదారుగా ఉన్న సుజనా చౌదరి తప్పకుండా బాధ్యత వహించేలా ఆదేశాలివ్వాలని కోరారు. సుజనా తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తికావడం, మధ్యంతర పరిష్కార ప్రక్రియ (ఐఆర్పీ) ఇచ్చిన నివేదికను పరిశీలించిన బెంచ్.. సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియకు అనుమతించింది. దీంతో బీజేపీ నేతకు షాక్ తగిలినట్లయింది. దీని ప్రకారం దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకు పరిష్కారకర్తను నియమిస్తారని, ఆయన సుజనా అప్పులు, ఆస్తులను పరిశీలించి, ఆయా రుణదాతలకు ఇవ్వాల్సిన నిష్పత్తి మేరకు పరిష్కారాన్ని సూచిస్తారని సమాచారం. -
ఒకప్పుడు షేర్ ధర రూ.2,700.. ఇప్పుడు ‘జిరో’.. భారీగా నష్టపోయిన ఇన్వెస్టర్లు..
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్ నుంచి త్వరలో డీలిస్ట్ అవ్వబోతుంది. రిలయన్స్ క్యాపిటల్‌ను హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ కొనుగోలు చేసిన తరుణంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. ఇకపై దేశీయ స్టాక్ మార్కెట్లలో రిలయన్స్ క్యాపిటల్ షేర్లు ట్రేడ్ అవ్వవు. ఎందుకంటే కంపెనీ కొత్త యజమాని హిందూజా గ్రూప్ షేర్లను డీలిస్ట్ చేయాలని నిర్ణయించటమే దీనికి ప్రధాన కారణం. వాస్తవానికి 2008లో కంపెనీ షేర్ ధర ఒక్కోటి రూ.2,700 కంటే ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం షేర్ ధర దాదాపు 99 శాతం క్షీణించి రూ.11 వద్ద ఉంది. షేర్ల డీలిస్టింగ్ జరిగితే ఈక్విటీ షేర్ హోల్డర్ల ఇన్వెస్ట్మెంట్ సున్నా కాబోతోంది. కొత్తగా కొనుగోలు చేసిన కంపెనీ పాత కంపెనీలోని ఇన్వెస్టర్లకు ఎలాంటి వాటాలు ఇవ్వబోదని వెల్లడైంది. దీనివల్ల అనిల్ అంబానీ కంపెనీలో షేర్లు కలిగి ఉన్న వ్యక్తులకు భారీగా నష్టం జరగనుంది. ఇప్పటికే రిలయన్స్ క్యాపిటల్‌పై నియంత్రణ సాధించేందుకు హిందూజా గ్రూప్ కంపెనీ ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ సమర్పించిన రూ.9,650 కోట్ల రిజల్యూషన్ ప్లాన్‌ను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) గత మంగళవారం ఆమోదించింది. ఇదీ చదవండి: మరో గ్లోబల్ బ్రాండ్‌ను తీసుకొస్తున్న అంబానీ కంపెనీ ఇందులో రుణదాతలు 63 శాతం బకాయి నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీకి వ్యతిరేకంగా క్లెయిమ్ చేసిన మొత్తం రూ.38,526.42 కోట్లలో రూ.26,086.75 కోట్ల క్లెయిమ్‌లను మాత్రమే ట్రిబ్యునల్ ఆమోదించింది. -
అప్పులతో కుంగిన అనిల్ అంబానీ కంపెనీకి ఊరట..
ముంబై: అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ క్యాపిటల్‌కి భారీ ఊరట లభించింది. రుణభారంతో కుంగిన రిలయన్స్ క్యాపిటల్‌కి సంబంధించి హిందుజా–ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ ప్రతిపాదించిన రూ. 9,650 కోట్ల పరిష్కార ప్రణాళికకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం కంపెనీ రుణదాతలు భారీగా 63 శాతం రుణాలను వదులుకోవాల్సి వస్తుంది. అలాగే, ప్రణాళిక అమల్లో భాగంగా ఆర్‌క్యాప్ షేర్లను ఇండస్‌ఇండ్‌కు బదలాయించాక, దాన్ని స్టాక్ ఎక్స్చేంజీల నుంచి తొలగిస్తారు. మొత్తం రూ. 38,526 కోట్ల రుణాల క్లెయిమ్‌లకు గాను ఎన్సీఎల్టీ రూ. 26,086 కోట్ల క్లెయిమ్లనే అనుమతించింది. కానీ, 2023 జూన్‌లో బిడ్ వేసిన ఇండస్ఇండ్ అందులో రూ. 9,661 కోట్లు (37%) కడతానని ప్రతిపాదించింది. రిలయన్స్ క్యాపిటల్ కార్యకలాపాల పునర్వ్యవస్థీకరణకు మార్గాన్ని అందించడంలో ఎన్సీఎల్టీ ఆమోదం కీలకమని గమనించవచ్చు. -
ఎడ్టెక్ కంపెనీకు నోటీసులు.. ఎందుకో తెలుసా..
ఫ్రాన్స్ కంపెనీ పిటీషన్ దాఖలు చేయడంతో బైజూస్ సంస్థ తాజాగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) నోటీసులు అందుకుంది. ఫ్రాన్స్‌కు చెందిన టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ సర్వీసెస్ పిటీషన్ వేయడంతో బైజూస్‌కు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) నోటీసులు ఇష్యూ చేసింది. బైజూస్ ఎడ్టెక్ కంపెనీ రూ.4 కోట్లు అప్పు పడిందని, దాన్ని తిరిగి చెల్లించడం లేదని ఈ పిటీషన్లో టెలీపెర్ఫార్మెన్స్ బిజినెస్ పేర్కొంది. నిబంధనల ప్రకారం నోటీసులపై బైజూస్ రెండు వారాల్లో స్పందించాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా, టెలీపెర్ఫార్మెన్స్తోపాటు ఇతర కొన్ని ఔట్సోర్సింగ్ ఏజెన్సీలతో 2022 మధ్య వరకు బైజూస్ వ్యాపారం చేసింది. ఈ కంపెనీలు బైజూస్‌కు కాలింగ్ ఏజెంట్ల సేవలందించేవి. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా టెలీపెర్ఫార్మెన్స్, కోజెంట్ బైజూస్‌కు నిధులు నిలిపేసినట్లు తెలిసింది. ఇదీ చదవండి: వడ్డీ రేట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం! వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టర్మ్‌లోన్-బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును గతంలో ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
కమిటీతోనైనా కథ ముగిసేనా?
సాక్షి, హైదరాబాద్: నష్టాలతో మూత పడిన నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్ (ఎన్డీఎస్ఎల్) ఆస్తులను విక్రయించి బ్యాంకులు, ఇతర సంస్థలకు బకాయి లు చెల్లించాల్సిందిగా సుమారు నాలుగున్నర ఏళ్ల క్రితం నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తీర్పుని చ్చింది. నిజాం షుగర్స్ పునరుద్ధర ణ మార్గాలు మూసుకుపోవడంతో ఆస్తుల విక్ర యం (లిక్విడేషన్) మినహా మరో మార్గం లేదని గతంలోనే స్పష్టం చేసింది. ఎన్సీఎల్టీ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసినా ఏళ్ల తరబడి నిజాం దక్కన్ షుగర్స్ భవితవ్యం కొలిక్కిరావడం లేదు. ఈ నేపథ్యంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఎన్డీఎస్ఎల్ను తిరిగి తెరిపిస్తామంటూ ‘పునరుద్ధరణ కమిటీ’ని ప్రకటించింది. ఈ కమిటీలో మరో మంత్రి దామోదర రాజనర్సింహ సహ చైర్మన్‌గా, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి.సుదర్శన్‌రెడ్డి, రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్‌తో పాటు ఆర్థిక, పరిశ్రమ లు, వ్యవసాయ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. ఎన్డీఎస్ఎల్ను తిరిగి తెరవడం లక్ష్యంగా ఏర్పాటైన నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలనే ప్రభుత్వ ఆదేశాలు ఎంత మేర ఫలిస్తాయనే చర్చ జరుగుతోంది. చంద్రబాబు హయాంలో ప్రైవేటు పరం ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పాలనలో 1937లో ఏర్పాటైన నిజాం చక్కెర కర్మాగారం (ఎన్ఎస్ఎల్) 1990వ దశకం నాటికి నష్టాల బాట పట్టింది. నష్టాల నుంచి నిజాం షుగర్స్‌ను గట్టెక్కిస్తామనే నెపంతో 2002లో నాటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 51 శాతం వాటాను డెల్టా పేపర్ మిల్లుకు విక్రయించింది. దీంతో దశాబ్దాల తరబడి ఎన్ఎస్ఎల్గా పేరొందిన నిజాం షుగర్స్ ఎన్‌డీఎస్‌ఎల్‌గా పేరు మార్చుకుంది. ప్రైవేటు సంస్థకు 51 శాతం వాటా అప్పగించడంపై అప్పట్లో పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే నష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితి లేకపోవడంతో ఎన్డీఎస్ఎల్ను మూసివేస్తున్నట్లు 2015 డిసెంబర్లో యాజమాన్యం ప్రకటించింది. పరిశ్రమ ఆస్తులను విక్రయించి అప్పులు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఎన్డీఎస్ఎల్ యాజమాన్యం ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం రైతుల భాగస్వామ్యంతో సహకార రంగంలో ఎన్డీఎస్ఎల్ను నడిపేందుకు 2015 ఏప్రిల్‌లో కార్యదర్శుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. డెల్టా పేపర్ మిల్లుకు చెందిన 51 శాతాన్ని టేకోవర్ చేయడంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి 3 నెలల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా జీఓఎంఎస్ 28ను కూడా జారీ చేసింది. ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన ఎన్డీఎస్ఎల్ అప్పులు పెరిగినందున దివాలా పరిశ్రమగా గుర్తించాలని ఎన్డీఎస్ఎల్ 2017లో నేషనల్ కంపెనీ ఆఫ్ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. అప్పులు తీర్చేందుకు కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రిసొల్యూషన్ ప్రాసెస్ ప్రారంభించాలని కోరడంతో రుణదాతలతో సంప్రదింపులు జరిపేందుకు ఎన్సీఎల్టీ లిక్విడేటర్‌ను కూడా నియమించింది. 2017 అక్టోబర్ నుంచి 2018 సెపె్టంబర్ వర కు 11 పర్యాయాలు రుణదాతలతో సంప్రదింపులు జరిపినా పునరుద్ధరణ అంశం కొలిక్కి రాలే దు. పరిశ్రమ కొనుగోలుకు ముందుకు వ చ్చిన కొన్ని సంస్థలు ఎన్డీఎస్ఎల్ ఆస్తులు, అప్పులు పరిశీలించి వెనకడుగు వేశాయి. నాలుగున్నరేళ్ల క్రితం సంస్థకు రూ.360 కోట్ల అప్పులు ఉండగా, ఆస్తుల విలువ కూడా అంతే ఉన్నట్లు తేలింది. సంస్థ పునరుద్ధరణ, అమ్మకం ప్రయత్నాలు కొలి క్కి రాకపోవడంతో ఎన్సీఎల్టీ లిక్విడేషన్‌కు అనుమతిచ్చింది. ఎన్సీఎల్టీ తీర్పుపై 2019లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా, నేటికీ ఆ కేసులో పురోగతి లేదు. ఎన్డీఎస్ఎల్పై ఇప్పటికే హౌజ్‌కమిటీ, కార్యదర్శుల కమిటీ వంటివి ఏర్పాటైనా సంస్థ మనుగడపై స్పష్టత ఇవ్వ లేకపోయాయి. ఈ నేపథ్యంలో నిజాం దక్కన్ షుగర్స్‌ను పునరుద్ధరిస్తామంటూ తాజాగా కమిటీని ఏర్పాటు చేసింది. రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని గడువు నిర్దేశించింది. -
బైజూస్‌పై దివాలా పిటిషన్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)–బెంగళూరులో దివాలా పిటిషన్ దాఖలైంది. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల మేర టర్మ్ లోన్–బీ (టీఎల్‌బీ) ఇచి్చన రుణదాతల్లో 80 శాతం సంస్థలు కలిసి గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ద్వారా దీన్ని దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దివాలా పిటిషన్ విషయం ఇంకా బహిరంగంగా వెల్లడి కాలేదు. బైజూస్ ఈ వ్యవహారమంతా నిరాధారమైనదని పేర్కొంది. రుణదాతల చర్యలపై అమెరికా కోర్టుల్లో పలు కేసులు నడుస్తుండగా ఎన్సీఎల్టీని ఆశ్రయించడం సరికాదని వ్యాఖ్యానించింది. అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రుణాలను తీర్చేసుకునేందుకు టీఎల్‌బీ రుణదాతలతో చర్చలు జరుపుతున్నట్లు బైజూస్ చెబుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకులు కాకుండా సంస్థాగత ఇన్వెస్టర్లు ఇచ్చిన రుణాన్ని టీఎల్‌బీ లోన్‌గా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టీఎల్‌బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును ఆశ్రయించారు. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించిన అశ్నీర్ గ్రోవర్.. కారణం అదేనా..
ప్రముఖ మొబైల్ యాప్ భారత్‌పే కో-ఫౌండర్, సంస్థ మాజీ ఎండీ అశ్నీర్ గ్రోవర్ కంపెనీ యాజమాన్యంపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)ను ఆశ్రయించారు. ప్రస్తుత భారత్‌పే బోర్డు అధికార దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. భారత్‌పే ఎండీగా తనను తిరిగి సంస్థలో నియమించాలని కోరుతూ ఆయన ఎన్‌సీఎల్‌టీను ఆశ్రయించారు. కంపెనీ రిసీలియెంట్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బోర్డు నిబంధనలను తారుమారు చేసి, యాజమాన్యంలో చట్టవిరుద్ధ మార్పులు చేసిందని చెప్పారు. ఆయన రాజీనామా అనంతరం 2022 మార్చి ఒకటో తేదీ నుంచి జారీ చేసిన షేర్లు / ఈఎస్ఓపీఎస్‌కు సంబంధించిన కంపెనీ నిర్ణయాలను తిరగదోడాలని డిమాండ్ చేశారు. దీనిపై కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అడిటింగ్‌కు ఆదేశించాలని ఎన్సీఎల్టీని కోరారు. భారత్‌పే సంస్థ నుంచి తన భార్య మాధురి జైన్ తొలగింపు చట్ట విరుద్ధమని, ఆమెను తిరిగి ఉద్యోగంలో నియమించాలన్నారు. తన రాజీనామా తర్వాత బోర్డులో కొత్తగా నియమించిన సభ్యులను తొలగించాలని అభ్యర్థించారు. కంపెనీల చట్టం-2013లోని 241, 242 సెక్షన్ల ప్రకారం పిటిషన్ దాఖలు చేసిన అశ్నీర్ గ్రోవర్..అణచివేతకు పాల్పడుతూ అధికార దుర్వనియోగంతో తనను తొలగించినందుకు కంపెనీ ప్రస్తుత యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదీ చదవండి: ఫ్యుయల్ ఆదా అవ్వాలంటే ఇది యాక్టివేట్ చేయాల్సిందే..! ఇటీవల గ్రోవర్ పిటిషన్ ఎన్సీఎల్టీ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే నెల 11కు వాయిదావేసింది. తన పిటిషన్‌కు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు సమర్పించినట్లు తెలిసింది. అశ్నీర్ గ్రోవర్ తన పిటిషన్లో కంపెనీ కో ఫౌండర్ శస్వత్ నక్రానీతోపాటు చైర్మన్ రజనీష్ కుమార్, మాజీ సీఈఓ కం డైరెక్టర్ సుశీల్ సమీర్ తదితర 12 మందిని ప్రతివాదులుగా చేర్చారు. -
అనిల్ అంబానీ ఆస్తులు అమ్మకానికి గ్రీన్ సిగ్నల్.. జాబితాలో ఉన్నవేంటో తెలుసా?
గత కొన్ని సంవత్సరాలకు ముందు ఇండియన్ టెలికాం రంగంలో పెను మార్పులు తీసుకువచ్చిన అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన కొన్ని రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించేందుకు ముంబై ఎన్‌సిఎల్‌టి ట్రిబ్యునల్ ఆమోదం తెలిపినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్ ఇటీవల తెలిపింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్)కి చెందిన రిజల్యూషన్ ప్రొఫెషనల్ కంపెనీకి చెందిన కొన్ని అపరిమిత ఆస్తుల విక్రయాన్ని చేపట్టేందుకు ఎన్‌సిఎల్‌టి నుంచి అనుమతి కోరుతూ దాఖలు చేసిన దరఖాస్తు విషయంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ ఆర్డర్‌ను దాఖలు చేసింది. ఈ ట్రిబ్యునల్ ఆమోదం కోసం రిజల్యూషన్ ప్లాన్‌ను సమర్పించిన తర్వాత CIRP రెగ్యులేషన్స్‌లోని రెగ్యులేషన్ 29 ప్రకారం దరఖాస్తుదారు/RP కార్పొరేట్ రుణగ్రహీత ఆస్తులను విక్రయించవచ్చని ఈ ట్రిబ్యునల్ స్పష్టం చేస్తుంది. విక్రయానికి ఎంచుకున్న ఆస్తులలో భూమి, భవనంతో కూడిన RCom చెన్నై హాడో ఆఫీస్ ఉన్నాయి. అంతే కాకుండా చెన్నైలోని అంబత్తూర్లో సుమారు 3.44 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్, పూణేలో 871.1 చదరపు మీటర్ల ల్యాండ్, భువనేశ్వర్ బేస్డ్ ఆఫీస్ స్పేస్, క్యాంపియన్ ప్రాపర్టీస్ షేర్లలో పెట్టుబడి, రిలయన్స్ రియల్టీ షేర్లలో పెట్టుబడి వంటివి విక్రయించనున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: బిలినీయర్స్ జాబితాలో కొత్త వ్యక్తి.. మద్యం అమ్ముతూ అరుదైన ఘనత వాస్తవానికి 2016లో ముఖేష్ అంబానీ రిలయన్స్ జియో ప్రారంభించిన తర్వాత అనిల్ అంబానీ సంస్థ పరిస్థితి చాలా దిగజారింది. అన్న ప్రకటించిన డేటా వార్ కారణంగా తమ్ముడు భరించలేని నష్టాల్లోకి జారుకున్నాడు. ఆ విధంగానే కంపెనీ తన బ్యాంక్ రుణాలను చెల్లించటంలో డిఫాల్ట్ అయి చివరికి దివాలా ప్రక్రియలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. -
బీసీసీఐకి రూ.158 కోట్లు బాకీ.. బైజూస్‌కు నోటీసులు
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి బాకీ పడిన రూ. 158 కోట్లకు సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ‘బైజూస్’ సంస్థకు నోటీసులు జారీ చేసింది. భారత క్రికెట్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్‌కు స్పందిస్తూ ఎన్సీఎల్టీ ఈ నోటీసులు ఇచ్చింది. ‘దీనిపై స్పందించేందుకు బైజూస్‌కు రెండు వారాల గడువు ఇచ్చాం. ఆపై మరో వారం రోజుల్లో బీసీసీఐ తమ అభ్యంతరాలను దాఖలు చేయాలి’ అని ఆదేశించిన ఎన్సీఎల్టీ... ఈ కేసును డిసెంబర్ 22కు వాయిదా వేసింది. 2019లో భారత క్రికెట్ జట్టు ప్రధాన స్పాన్సర్‌గా వచ్చిన బైజూస్ సంస్థ తర్వాతి రోజుల్లో దివాళా తీయడంతో బీసీసీఐకి రూ. 158 కోట్లు బాకీ పడింది. -
ఎన్సీఎల్టీ గ్రీన్ సిగ్నల్..రూ. 51,424 కోట్లు మొండి బాకీలు వసూలు!
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) 180 దివాలా పరిష్కార ప్రణాళికలకు ఆమోదముద్ర వేసింది. ఇంత అత్యధిక సంఖ్యలో ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ లభించడం ఇప్పటివరకూ ప్రథమం. దీనితో మొత్తం రూ. 51,424 కోట్ల మొండి బాకీలు వసూలయ్యాయి. చివరిసారిగా 2019 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 1.11 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రావడం ఇదే తొలిసారి. అప్పట్లో 77 ప్రణాళికలకు ఎన్సీఎల్టీ ఆమోదం తెలిపింది. వీటిలో ఎస్సార్ స్టీల్, మోనెట్ ఇస్పాత్ వంటి భారీ ప్రతిపాదనలు ఉన్నాయి. తాజాగా గత ఆర్థిక సంవత్సరంలో ఎన్సీఎల్టీ 1,255 దివాలా ప్రక్రియ దరఖాస్తులను విచారణకు స్వీకరించింది. రూ. 1,42,543 కోట్లకు క్లెయిమ్‌లు రాగా అందులో 36 శాతం సొమ్మును రుణదాతలకు పొందగలిగారు. దివాలా బోర్డు ఐబీబీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. ►2023 ఆర్థిక సంవత్సరం ఆఖరు వరకూ ఎన్సీఎల్టీ 678 ప్రణాళికలను క్లియర్ చేసింది. రుణదాతలు రూ. 2.86 లక్షల కోట్లు రాబట్టుకోగలిగారు. ►ఎన్సీఎల్టీకి దేసవ్యాప్తంగా 31 బెంచ్‌లు ఉండగా, వాటిలో 28 పనిచేస్తున్నాయి. ట్రిబ్యునల్‌లో న్యాయమూర్తులు, సహాయక సిబ్బంది కొరత ఉంది. ప్రెసిడెంట్ సహా 63 మంది జ్యుడిషియల్, టెక్నికల్ సిబ్బందిని మంజూరు చేయగా ప్రస్తుతం 37 మందే ఉన్నారు. గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం 15 మంది సిబ్బందిని నియమించింది. ఎన్సీఎల్టీ బెంచ్ పనిచేయాలంటే కనీసం ఒక జ్యుడిషియల్, ఒక టెక్నికల్ సభ్యులు ఉండాలి. ►ఎన్సీఎల్టీ బెంచ్‌లు ఇప్పటివరకు 6,567 కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రణాళికలను (సీఐఆర్‌పీ) పరిశీలించగా వాటిలో 4,515 సీఐఆర్పీలపై విచారణ ముగిసింది. ► తయారీ, రియల్ ఎస్టేట్ రంగాల సంస్థలు అత్యధికంగా సీఐఆర్పీపరమైన ప్రక్రియను ఎదుర్కొంటున్నాయి. మొత్తం కేసుల్లో తయారీ రంగ వాటా 39 శాతం, రియల్ ఎస్టేట్ 21 శాతం, నిర్మాణ రంగం 11 శాతం, హోల్‌సేల్..రిటైల్ ట్రేడ్ వాటా 10 శాతంగా ఉంది. ►నిర్దేశిత గరిష్ట గడువు 330 రోజుల్లోగా తగిన కొనుగోలుదారు ఎవరూ ముందుకు రాకపోవడంతో 76 శాతం పైగా కేసులు లిక్విడేషన్‌కు దారి తీశాయి. -
జీ ఎంటర్టైన్మెంట్కు ఎన్సీఎల్ఏటీలో ఊరట
న్యూఢిల్లీ: సోనీతో విలీనానికి సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్కు ఊరట లభించింది. ఈ డీల్‌కు అనుమతులను పునరాలోచన చేయాలంటూ బీఎస్ఈ, ఎన్ఎస్ఈలను సూచిస్తూ ఎన్సీఎల్టీ ఇచ్చిన ఉత్తర్వులను ఎన్సీఎల్ఏటీ తోసిపుచ్చింది. ఈ వ్యవహరంలో జీ ఎంటర్టైన్మెంట్ తన వాదనలు వినిపించేందుకే ఎన్సీఎల్టీ అవకాశం ఇవ్వలేదని, ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని పే ర్కొంది. ఇరు పక్షాల వాదనలు విని కొత్తగా ఉత్తర్వులు జారీ చేయాలంటూ కేసును తిరిగి ఎన్సీఎల్టీకి పంపించింది. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్, జీ ఎంటర్టైన్మెంట్ విలీనానికి 2021లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం విలీన సంస్థలో సోనీకి 50.86 శాతం, జీ వ్యవస్థాపకులకు 4 శాతం, మిగతా వాటా జీ ఎంటర్టైన్మెంట్ ఇతర షేర్హోల్డర్లకు ఉంటుంది. అయితే, షిర్పూర్ గోల్డ్ రిఫైనరీలో నిధుల మళ్లింపునకు సంబంధించి జీ ప్రమోటర్ల పేర్ల ప్రస్తావన ఉందన్న అంశంతో ఎన్ఎస్ఈ, బీఎస్ఈ .. విలీన స్కీముపై ఎన్సీఎల్టీకి సందేహాలను తెలియజేశాయి. దీనితో విలీనానికి గతంలో ఇచ్చిన అనుమతులను పునఃసమీక్షించుకుని, తదు పరి విచారణ తేదీలోగా, తగు నిర్ణయం తీసుకోవాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) సూచించింది. దీన్ని సవాలు చేస్తూ జీ ఎంటర్టైన్మెంట్ పిటీషన్ వేయడంతో నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ తాజా ఆదేశాలు ఇచ్చింది. -
ఎన్సీఎల్ఏటీలో గో ఫస్ట్‌కు ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎస్‌సీఎల్‌ఏటీ) సోమవారం సంక్షోభంలో ఉన్న ఎయిర్‌లైన్ గో ఫస్ట్‌పై దివాలా పరిష్కార ప్రక్రియను సమర్థించింది. దీనితో సంక్షోభంలో పడిన వాడియా గ్రూప్ సంస్థ– గో ఫస్ట్ నుండి తమ విమానాలను వెనక్కి తీసుకునేందుకు ఎయిర్‌క్రాఫ్ట్ లీజర్లు చేసిన ప్రయత్నాలకు తక్షణం అడ్డుకట్ట పడింది.. క్లెయిమ్‌లపై ఎన్సీఎల్టీకి వెళ్లవచ్చు... క్లెయిమ్‌లకు సంబంధించి ఎయిర్‌క్రాఫ్ట్ లీజర్లు అలాగే గో ఫస్ట్ మధ్యంతర రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్పీ) నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎస్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించాలని చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల అప్పిలేట్ బెంచ్ ఆదేశించింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గో ఫస్ట్‌కు మే నెల 10వ తేదీన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) కాస్త ఊరటనిస్తూ, కంపెనీ స్వచ్ఛందంగా దాఖలు చేసిన దివాలా పిటీషన్‌ను విచారణకు స్వీకరించింది. అలాగే ఆర్థిక వ్యవహారాలు, చెల్లింపులకు సంబంధించి మారటోరియం విధించింది. మే 4న మధ్యంతర పరిష్కార నిపుణుడిగా (ఐఆర్పీ) అభిలాష్ లాల్‌ను నియమించడంతో పాటు ఏ ఉద్యోగినీ తీసివేయకూడదని ఆదేశించింది. అలాగే, రద్దయిన మేనేజ్మెంట్.. తక్షణ ఖర్చుల కోసం రూ. 5 కోట్ల మొత్తాన్ని ఐఆర్పీ వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది. తమ విజ్ఞప్తులను కూడా తెలుసుకున్న తర్వాతే గో ఫస్ట్ దివాలా పిటీషన్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ సంస్థకు విమానాలను లీజుకిచ్చిన కంపెనీల అభ్యంతరాలను ఎన్సీఎల్టీ తోసిపుచ్చింది. దీనితో దివాలా విచారణ పూర్తయ్యే వరకూ ఇతరత్రా దావాల నుంచి గో ఫస్ట్‌కు రక్షణ లభించనట్లయ్యింది. సంస్థ ఆస్తులను బదిలీ చేయడానికి గానీ రుణ దాతలు రికవర్ చేసుకోవడానికి గానీ ఈ ఉత్తర్వు్యలతో వీలుండదు. -
స్పైస్‌జెట్‌కు ఎన్సీఎల్టీ నోటీసులు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌పై దివాలా పరిష్కార ప్రక్రియ కింద చర్యలు తీసుకోవాలంటూ కంపెనీకి ఎయిర్‌క్రాఫ్టులను లీజుకి ఇచ్చిన ఎయిర్‌క్యాజిల్ (ఐర్లాండ్) పిటీషన్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) విచారణ జరిపింది. స్పైస్‌జెట్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మే 17కు వాయిదా వేసింది. నోటీసుల జారీ ప్రక్రియ సాధారణమేనని, ఎన్సీఎల్టీ తమకు ప్రతికూలంగా ఉత్తర్వులేమీ ఇవ్వలేదని స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి తెలిపారు. సెటిల్మెంట్ కోసం ఇరు పక్షాలు చర్చలు జరుపుతున్న విషయాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుందని పేర్కొన్నారు. ఇకపైనా చర్చలను కొనసాగించవచ్చని వివరించారు. స్పైస్‌జెట్‌పై ఎయిర్‌క్యాజిల్ ఏప్రిల్ 28న పిటిషన్ దాఖలు చేసింది. అయితే, తమ దగ్గర ఎయిర్‌క్యాజిల్ విమానాలేమీ లేవని, ఈ పిటిషన్‌తో తమ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావమూ ఉండబోదని స్పైస్‌జెట్ గత వారం తెలిపింది. ఎన్సీఎల్టీ వెబ్సైట్ ప్రకారం స్పైస్‌జెట్‌పై ఇప్పటికే రెండు దివాలా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనానికి ఎన్సీఎల్టీ ఆమోదం
హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ), ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) సహా అన్ని రెగ్యులేటరీ సంస్థల నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఈ విలీనాన్ని వాటాదారులు కూడా ఆమోదించారు. ఇదీ చదవండి: ఇంత తిన్నావేంటి గురూ.. పిజ్జాల కోసం డామినోస్ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా? హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల విలీనానికి స్టాక్ ఎక్స్ఛేంజీలు, కాంపిటీషన్ కమిషన్ ఆమోదం తెలిపాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 100 శాతం పబ్లిక్ షేర్‌హోల్డర్ల యాజమాన్యంలో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన ప్రస్తుత వాటాదారులకు బ్యాంక్‌లో 41 శాతం వాటా ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్ కంటే పెద్దది ఈ విలీనం తర్వాత ప్రతి హెచ్డీఎఫ్సీ వాటాదారు ప్రతి 25 షేర్లకు హెచ్డీఎఫ్సీ బ్యాంకుకు చెందిన 42 షేర్లను పొందుతారు. 2021 డిసెంబర్ బ్యాలెన్స్ షీట్ ప్రకారం.. ఈ విలీనం తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ షీట్ రూ. 17.87 లక్షల కోట్లు. నికర విలువ రూ. 3.3 లక్షల కోట్లకు చేరుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కంటే రెట్టింపు పరిమాణంలో దేశంలో మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరిస్తుంది. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? -
గెయిల్ గూటికి జేబీఎఫ్ పెట్రోకెమికల్స్
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చర్యల్లో ఉన్న జేబీఎఫ్ పెట్రోకెమికల్స్ కంపెనీని ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ కొనుగోలు చేయనుంది. రూ.2,079 కోట్లతో గెయిల్ వేసిన బిడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం లభించింది. పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించాలన్న పట్టుదలతో గెయిల్ కొంతకాలంగా ఉంది. ఇప్పుడు జెబీఎఫ్ కొనుగోలుతో కంపెనీ తన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీలు పడుతుంది. తాము ఇచ్చిన రుణాలను జేబీఎఫ్ చెల్లించక పోవడంతో రుణదాతలు ఎన్సీఎల్టీ అనుమతితో విక్రయానికి పెట్టారు. దీనికి గెయిల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ ఆమోదం తెలిపినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్) ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ కర్సార్షియంతో పోటీ పడి మరీ గెయిల్ జేబీఎఫ్ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. ఐడీబీఐ బ్యాంక్ రూ.5628 కోట్లను రాబట్టుకునేందుకు జేబీఎఫ్‌ను వేలం వేసింది. కొనుగోలు లావాదేవీ ఇంకా పూర్తి కావాల్సి ఉందని గెయిల్ తెలిపింది. జేబీఎఫ్కు మంగళూరు సెజ్‌లో 1.25 మిలియన్ టన్నుల టెరెఫ్తాలిక్ యాసిడ్ తయారీ ప్లాంట్ ఉంది. గెయిల్‌కు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని పతా వద్ద పెట్రోకెమికల్ ప్లాంట్ ఉంది. ఇక్కడ 8,10,000 టన్నుల వార్షిక పాలీమర్స్ తయారు చేయగలదు. వచ్చే ఏడాదికి మహారాష్ట్రలోని ఉసార్‌లో ప్రొపేన్ డీహైడ్రోజెనేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది (ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) -
’గూగుల్’ కేసులో తాత్కాలిక స్టేకు ఎన్సీఎల్ఏటీ నిరాకరణ
న్యూఢిల్లీ: ప్లే స్టోర్ విధానాలపై కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) జరిమానా విధించిన కేసులో ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించిన టెక్ దిగ్గజం గూగుల్‌కు ఊరట దక్కలేదు. దీనిపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) నిరాకరించింది. సీసీఐ విధించిన రూ. 936 కోట్లలో పది శాతాన్ని వచ్చే నాలుగు వారాల్లోగా రిజిస్ట్రీలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 17కు వాయిదా వేసింది. ప్లే స్టోర్ విధానాల్లో గూగుల్ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ సీసీఐ ఈ పెనాల్టీ విధించింది. మరోవైపు, ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల విషయంలో ఎన్సీఎల్ఏటీ ఉత్తర్వులను సవాలు చేస్తూ గూగుల్ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సోమవారం వాదనలు విననుంది. ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్‌ల విషయంలో గూగుల్ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తోందంటూ సీసీఐ రూ. 1,337 కోట్లు జరిమానా విధించగా, దానిపై తాత్కాలిక స్టే ఇచ్చేందుకు ఎన్సీఎల్ఏటీ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులోనూ 10 శాతం మొత్తాన్ని డిపాజిట్ చేయాలంటూ ఆదేశించింది. గతేడాది అక్టోబర్‌లో వారం రోజుల వ్యవధిలోనే ఈ రెండు కేసులకు సంబంధించి గూగుల్‌కు సీసీఐ మొత్తం రూ. 2,200 కోట్ల మేర జరిమానా విధించింది. చదవండి: కొత్త ఏడాదిలో కస్టమర్లకు షాక్.. కీలక నిర్ణయం తీసుకున్న బీఓబీ! -
టొరంట్‌కు ఎన్సీఎల్టీ రిలీఫ్
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న రిలయన్స్ క్యాపిటల్ విక్రయ అంశాన్ని ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ తాజాగా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది. దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న ఆర్‌క్యాప్ కొనుగోలుకి హిందుజా గ్రూప్ చివర్లో దాఖలు చేసిన సవరించిన బిడ్‌పై స్టే ఆర్డర్ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ వివరాల ప్రకారం.. ఆర్‌క్యాప్ రుణ పరిష్కార ప్రణాళికలో భాగంగా రూ. 8,640 కోట్ల బిడ్‌తో టొరంట్ గ్రూప్ గరిష్ట బిడ్డర్‌గా నిలిచింది. అయితే తదుపరి హిందుజా గ్రూప్ రూ. 9,000 కోట్లకు సవరించిన బిడ్‌ను డిసెంబర్ 21న ఈవేలం ముగిశాక దాఖలు చేసినట్లు టొరంట్ గ్రూప్ ఎన్సీఎల్టీకి ఫిర్యాదు చేసింది. వేలం ముగిసిన తదుపరి రోజు హిందుజా గ్రూప్ సంస్థ ఇండస్ఇండ్ బ్యాంక్ తొలి ఆఫర్‌ను రూ. 8,100 కోట్లను తదుపరి రూ. 9,000 కోట్లకు సవరించినట్లు టొరంట్ గ్రూప్ ఫిర్యాదులో పేర్కొంది. ఈ అంశంపై వచ్చే వారం విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది. కాగా.. మరోపక్క రిలయన్స్ క్యాప్ రుణదాతలు అటు టొరంట్ గ్రూప్, ఇటు హిందుజా గ్రూప్‌తో రిజల్యూషన్‌పై చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.