న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చర్యల్లో ఉన్న జేబీఎఫ్ పెట్రోకెమికల్స్ కంపెనీని ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ కొనుగోలు చేయనుంది. రూ.2,079 కోట్లతో గెయిల్ వేసిన బిడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఆమోదం లభించింది. పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించాలన్న పట్టుదలతో గెయిల్ కొంతకాలంగా ఉంది. ఇప్పుడు జెబీఎఫ్ కొనుగోలుతో కంపెనీ తన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీలు పడుతుంది. తాము ఇచ్చిన రుణాలను జేబీఎఫ్ చెల్లించక పోవడంతో రుణదాతలు ఎన్‌సీఎల్‌టీ అనుమతితో విక్రయానికి పెట్టారు. దీనికి గెయిల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్‌సీఎల్‌టీ అహ్మదాబాద్ బెంచ్ ఆమోదం తెలిపినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్)
ఇండియన్ ఆయిల్, ఓఎన్‌జీసీ కర్సార్షియంతో పోటీ పడి మరీ గెయిల్ జేబీఎఫ్ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. ఐడీబీఐ బ్యాంక్ రూ.5628 కోట్లను రాబట్టుకునేందుకు జేబీఎఫ్‌ను వేలం వేసింది. కొనుగోలు లావాదేవీ ఇంకా పూర్తి కావాల్సి ఉందని గెయిల్ తెలిపింది. జేబీఎఫ్‌కు మంగళూరు సెజ్‌లో 1.25 మిలియన్ టన్నుల టెరెఫ్తాలిక్ యాసిడ్ తయారీ ప్లాంట్ ఉంది. గెయిల్‌కు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని పతా వద్ద పెట్రోకెమికల్ ప్లాంట్ ఉంది. ఇక్కడ 8,10,000 టన్నుల వార్షిక పాలీమర్స్ తయారు చేయగలదు. వచ్చే ఏడాదికి మహారాష్ట్రలోని ఉసార్‌లో ప్రొపేన్ డీహైడ్రోజెనేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది (ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!)
Comments
Please login to add a commentAdd a comment