Gail
-
ఏఎం గ్రీన్‌తో గెయిల్ ఒప్పందం
దేశంలో స్థిరమైన ఇంధన పరిష్కారాల అభివృద్ధికి గెయిల్ (ఇండియా) లిమిటెడ్, ఏఎం గ్రీన్ బీవీ (AMG) సంస్థలు జట్టుకట్టాయి. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈమిథనాల్ ఉత్పత్తి కోసం కార్బన్ డయాక్సైడ్ (CO2) దీర్ఘకాలిక సరఫరా, దేశం అంతటా హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అన్వేషణపై భాగస్వామ్యం దృష్టి సారిస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో గెయిల్ తెలిపింది.గెయిల్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్) రాజీవ్ సింఘాల్ సమక్షంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్‌ప్లోరేషన్ & ప్రొడక్షన్) సుమిత్ కిషోర్, ఏఎం గ్రీన్ గ్రూప్ ప్రెసిడెంట్ మహేష్ కొల్లి అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.ఒప్పందంలో భాగంగా ఈమిథనాల్ను ఉత్పత్తి కోసం కార్బన్ డయాక్సైడ్ దీర్ఘకాలిక సరఫరా కోసం అధ్యయనాలను చేపట్టాలని రెండు కంపెనీలు భావిస్తున్నాయి. ప్రతిపాదిత ఇమిథనాల్ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టడానికి గెయిల్‌కి కూడా ఈక్విటీ ఆప్షన్ ఉంటుంది. అలాగే దేశం అంతటా 2.5 గిగావాట్స్ వరకు సోలార్/విండ్ హైబ్రిడ్ పునరుత్పాదక ప్రాజెక్టుల ఏర్పాటును సంయుక్తంగా అన్వేషించాలని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. -
గెయిల్లొ 391 ఉద్యోగాలు (ఫోటోలు)
-
గెయిల్‌కు బీపీసీఎల్ ముడిసరుకు సరఫరా
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో నెలకొల్పుతున్న పెట్రోకెమికల్ ప్లాంటుకు అవసరమైన ముడిసరుకు కోసం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)తో గెయిల్ (ఇండియా) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ రూ. 63,000 కోట్లు. దీని ప్రకారం 15 ఏళ్ల పాటు గెయిల్‌కు చెందిన ఉసార్ ప్లాంటుకు బీపీసీఎల్ తమ ఎల్పీజీ దిగుమతి కేంద్రం నుంచి ఏటా 6 లక్షల టన్నుల ప్రొపేన్ గ్యాస్‌ను సరఫరా చేయ నుంది. ఉసార్‌లో 5,00,000 టన్నుల సామర్థ్యంతో గెయిల్ దేశీయంగా తొలి ప్రొపేన్ డీహైడ్రోజినేషన్ (పీడీహెచ్) ప్లాంటును నిర్మిస్తోంది. ఈ ప్లాంటు 2025 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఫరి్నచర్ ఉపకరణాలు, బొమ్మలు మొదలైన వాటిలో ఉపయోగించే పాలీప్రొపిలీన్ తయారీ ప్లాంటుకు ఇది అనుసంధానమై ఉంటుంది. -
మూడేళ్లలో రూ. 30 వేల కోట్లు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ దిగ్గజం గెయిల్ (ఇండియా) భారీ స్థాయిలో కార్యకలాపాలు విస్తరించనుంది. వచ్చే మూడేళ్లలో రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. గెయిల్ (ఇండియా) వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చైర్మన్ సందీప్ కుమార్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 10,000 కోట్ల మేర పెట్టుబడి వ్యయాలు చేసినట్లు వివరించారు. (ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు) రాబోయే మూడేళ్లలో పైప్లైన్ల ఏర్పాటు, ప్రస్తుతం కొనసాగుతున్న పెట్రోకెమికల్ ప్రాజెక్టులు, నిర్వహణపరమైన పెట్టుబడులు, గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులు మొదలైన వాటి కోసం రూ. 30,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు గుప్తా చెప్పారు. ఇటీవలే కొనుగోలు చేసిన ప్రైవేట్ రంగ జేబీఎఫ్ పెట్రోకెమికల్స్‌తో తమ పోర్ట్‌ఫోలియోలో మరో కొత్త రసాయన ఉత్పత్తి (ప్యూరిఫైడ్ టెరిఫ్తాలిక్ యాసిడ్ – పీటీఏ) చేరినట్లు ఆయన తెలిపారు. మహారాష్ట్రలోని ఉసార్‌లో తాము తొలిసారిగా 50,000 టన్నుల ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (ఐపీఏ) ఉత్పత్తి సామర్థ్యంతో స్పెషాలిటీ కెమికల్ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. ఇలాంటి వాటి తోడ్పాటుతో తమ పెట్రోకెమికల్స్ / కెమికల్స్ పోర్ట్‌ఫోలియో సామర్థ్యం వార్షికంగా 3 మిలియన్ టన్నులకు చేరగలదని వివరించారు. అంతర్జాతీయంగా ఎల్ఎన్జీ (ద్రవీకృత సహజ వాయువు) దిగ్గజాల నుంచి దీర్ఘకాలికంగా కొనుగోళ్లు జరిపే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటు సహజ వాయువులో హైడ్రోజన్‌ను ఏయే స్థాయిలో కలిపితే ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై అధ్యయనం చేస్తున్నట్లు గుప్తా చెప్పారు. -
గెయిల్ గూటికి జేబీఎఫ్ పెట్రోకెమికల్స్
న్యూఢిల్లీ: దివాలా పరిష్కార చర్యల్లో ఉన్న జేబీఎఫ్ పెట్రోకెమికల్స్ కంపెనీని ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ కొనుగోలు చేయనుంది. రూ.2,079 కోట్లతో గెయిల్ వేసిన బిడ్‌కు జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆమోదం లభించింది. పెట్రోకెమికల్స్ వ్యాపారాన్ని విస్తరించాలన్న పట్టుదలతో గెయిల్ కొంతకాలంగా ఉంది. ఇప్పుడు జెబీఎఫ్ కొనుగోలుతో కంపెనీ తన లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లేందుకు వీలు పడుతుంది. తాము ఇచ్చిన రుణాలను జేబీఎఫ్ చెల్లించక పోవడంతో రుణదాతలు ఎన్సీఎల్టీ అనుమతితో విక్రయానికి పెట్టారు. దీనికి గెయిల్ సమర్పించిన పరిష్కార ప్రణాళికకు ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ బెంచ్ ఆమోదం తెలిపినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్) ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ కర్సార్షియంతో పోటీ పడి మరీ గెయిల్ జేబీఎఫ్ బిడ్డింగ్‌లో విజేతగా నిలిచింది. ఐడీబీఐ బ్యాంక్ రూ.5628 కోట్లను రాబట్టుకునేందుకు జేబీఎఫ్‌ను వేలం వేసింది. కొనుగోలు లావాదేవీ ఇంకా పూర్తి కావాల్సి ఉందని గెయిల్ తెలిపింది. జేబీఎఫ్కు మంగళూరు సెజ్‌లో 1.25 మిలియన్ టన్నుల టెరెఫ్తాలిక్ యాసిడ్ తయారీ ప్లాంట్ ఉంది. గెయిల్‌కు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని పతా వద్ద పెట్రోకెమికల్ ప్లాంట్ ఉంది. ఇక్కడ 8,10,000 టన్నుల వార్షిక పాలీమర్స్ తయారు చేయగలదు. వచ్చే ఏడాదికి మహారాష్ట్రలోని ఉసార్‌లో ప్రొపేన్ డీహైడ్రోజెనేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది (ఇదీ చదవండి: ‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) -
మన లక్ష్యం రూ.10,000 కోట్లు: గెయిల్
న్యూఢిల్లీ: వాటా మూలధనాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రభుత్వ రంగ యుటిలిటీ దిగ్గజం గెయిల్ ఇండియా తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా స్పెషాలిటీ కెమికల్స్, శుద్ధ ఇంధన బిజినెస్‌లను జత చేసుకునే ప్రణాళికల్లో ఉన్నట్లు పేర్కొంది. సహజవాయు రవాణా, పంపిణీ బిజినెస్‌కు జతగా మరిన్ని విభాగాలలోకి ప్రవేశించే యోచనలో ఉన్నట్లు తెలియజేసింది. రానున్న మూడు, నాలుగేళ్లలో అమలుచేయ తలపెట్టిన విస్తరణ ప్రణాళికలకు అనుగుణంగా వాటా మూలధనాన్ని ప్రస్తుత రూ. 5,000 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు పెంచుకునేందుకు వాటాదారుల అనుమతిని కోరినట్లు వెల్లడించింది. జాతీయ గ్రిడ్‌ను సృష్టించే బాటలో కంపెనీ నేచురల్ గ్యాస్ పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. 2030కల్లా ప్రధాన ఇంధన బాస్కెట్‌కు 15 శాతం సహజవాయు సరఫరాలను ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా రానున్న 3–4ఏళ్లలో గెయిల్ సుమారు రూ. 30,000 కోట్ల పెట్టుబడి వ్యయ ప్రణాళికలు వేసింది. వీటిలో కొంతమేర అంతర్గత వనరులు, మరికొంత రుణాలు, ఈక్విటీ మార్గంలో సమకూర్చుకోవాలని చూస్తున్నట్లు వాటాదారులకు గెయిల్ తాజాగా తెలియజేసింది. మరోవైపు వాటాదారులకు బోనస్ షేర్ల జారీ ప్రతిపాదన సైతం ఉన్నట్లు పేర్కొంది. చదవండి: ఇదే టార్గెట్.. రూ.12,000 కోట్ల ఆస్తులు అమ్మాల్సిందే! -
గెయిల్ లాభం జూమ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ యుటిలిటీ దిగ్గజం గెయిల్ ఇండియా ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్-జూన్(క్యూ1)లో నికర లాభం 51 శాతం జంప్‌చేసి రూ. 3,251 కోట్లకు చేరింది. గతేడాది క్యూ1లో కేవలం రూ. 2,157 కోట్లు ఆర్జించింది. నేచురల్ గ్యాస్ మార్కెటింగ్ మార్జిన్లు భారీగా మెరుగుపడటం ఇందుకు సహకరించింది. మొత్తం ఆదాయం రెట్టింపై రూ. 38,033 కోట్లను తాకింది. గత క్యూ1లో రూ. 17,702 కోట్ల టర్నోవర్ అందుకుంది. పన్నుకుముందు లాభం ఐదు రెట్లు ఎగసి రూ. 2,318 కోట్లకు చేరింది. గత క్యూ1లో ఇది రూ. 450 కోట్లు మాత్రమే. ప్రస్తుత సమీక్షా కాలంలో గెయిల్ స్టాండెలోన్ నికర లాభం 91 శాతం దూసుకెళ్లి రూ. 2,915 కోట్లయ్యింది. ఈ కాలంలో పైపులైన్లు, పెట్రోకెమికల్స్, భాగస్వామ్య సంస్థ ఈక్విటీ పెట్టుబడులకుగాను రూ. 1,975 కోట్లు వెచ్చించింది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ షేరు గురువారం 0.6 శాతం నీరసించింది. శుక్రవారం కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ ఏకంగా 4 శాతం పతనమైంది. -
గెయిల్ కొత్త చైర్మన్ సందీప్ కే గుప్తా!
న్యూఢిల్లీ: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ప్రస్తుతం ఫైనాన్స్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సందీప్ కుమార్ గుప్తా, భారత్ అతిపెద్ద గ్యాస్ యుటిలిటీ సంస్థ గెయిల్ (ఇండియా) చీఫ్‌గా ఎంపికయ్యారు. పది మంది అభ్యర్థుల ఇంటర్వ్యూ తర్వాత 56 సంవత్సరాల గుప్తాను గెయిల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా ఎంపికచేసినట్లు ప్రభుత్వ రంగ సంస్థల నియామకాల ఎంపిక బోర్డ్ (పీఈఎస్బీ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 31వ తేదీన ప్రస్తుత సీఎండీ మనోజ్ జైన్ పదవీ విరమణ అనంతరం గుప్తా నూతన బాధ్యతలను చేపడతారు. అయితే అంతకుముందు ఆయన నియామకానికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి అవినీతి నిరోధక సంస్థలు ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. -
లాభాల్లో ప్రభుత్వ కంపెనీ..షేర్ హోల్డర్లకి బంపరాఫర్!
న్యూఢిల్లీ: పీఎస్‌యూ యుటిలిటీ దిగ్గజం గెయిల్ (ఇండియా) లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి(2021–22) రెండో మధ్యంతర డివిడెండును ప్రకటించింది. వాటాదారులకు షేరుకి రూ. 5(50 శాతం) చొప్పున చెల్లించేందుకు బోర్డు అనుమతించినట్లు మహారత్న కంపెనీ గెయిల్ వెల్లడించింది. ఇందుకు ఈ నెల 22 రికార్డ్ డేట్‌కాగా.. మొత్తం చెల్లింపులకు రూ. 2,220 కోట్లకుపైగా వెచ్చించనుంది. కంపెనీ ఇప్పటికే 2021 డిసెంబర్లో షేరుకి రూ. 4 చొప్పున డివిడెండును చెల్లించింది. వెరసి ఈ ఏడాదిలో ఒక్కో షేరుకీ రూ. 9 చొప్పున మొత్తం రూ. 3,996 కోట్లకుపైగా డివిడెండు కింద వెచ్చిస్తున్నట్లు కంపెనీ చైర్మన్, ఎండీ మనోజ్ జైన్ వెల్లడించారు. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికమని తెలియజేశారు! కాగా.. ప్రస్తుతం కంపెనీలో గల 51.45% వాటా ప్రకారం ప్రభుత్వం రెండో మధ్యంతర డివిడెండుకింద రూ. 1,142 కోట్లు అందుకోనుంది. చదవండి: మే 12వరకూ ఎల్ఐసీకి గడువు -
సస్పెన్షన్‌లో రంగనాథన్: గెయిల్
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలపై సీబీఐ అరెస్ట్ చేసిన సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ రంగనాథన్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రభుత్వ రంగ గ్యాస్ యుటిలిటీ సంస్థ– గెయిల్ (ఇండియా) ధ్రువీకరించింది. ప్రైవేటు కంపెనీలకు పెట్రోకెమికల్ ప్రొడక్టుల అమ్మకాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తూ లంచాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై రంగనాథన్‌ను రెండు రోజుల క్రితం సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో ఆరుగురిని కూడా సీబీఐ అరెస్ట్ చేసింది. రంగనాథన్సహా పలువురి నివాసాలపై జరిగిన సీబీఐ దాడుల్లో దాదాపు రూ.1.25 కోట్లు డబ్బు, అంతే మొత్తం విలువైన ఆభరణాలు, కొన్ని కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ‘గెయిల్ ఎంప్లాయీస్ (కాండక్ట్ డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్, 1986లోని రూల్ 25 ప్రకారం దాఖలైన అధికారాలను అమలు చేస్తూ ఈఎస్ రంగనాథన్‌ను 2022 జనవరి 18వ తేదీ నుంచి అమలయ్యేలా సస్పెండ్‌చేస్తూ భారత్ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు’’ అని గెయిల్ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. -
గెయిల్ డైరెక్టర్ రంగనాథన్ అరెస్ట్
న్యూఢిల్లీ: లంచాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గెయిల్ మార్కెటింగ్ వ్యవహారాల డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్‌గేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. నోయిడాలో ఆయనకు ఉన్న నివాసంలో సోదాలు నిర్వహించి రూ.1.3 కోట్లతో పాటు విలువైన ఆభరణాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 2021లో గెయిల్ డైరెక్టర్‌ను ఇరువులు మధ్యవర్తులు ఎలా కలిశారు, లంచం ఎలా ఇచ్చారన్న విషయాన్ని సీబీఐ ఎఫ్ఐఆర్ వివరించింది. పెట్రో కెమికల్ ఉత్పత్తులను రాయితీపై అందజేస్తే లంచాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీల యజమానులతో కూడా నిందితులు సమావేశం అయ్యారని ఎఫ్ఐఆర్ తెలిపింది. సీబీఐ జరిపిన దాడుల్లో రంగనాథన్ సహాయకుడు ఎన్ రామకృష్ణన్ నాయర్ నివాసం కూడా ఒకటి. ఈ నివాసం నుంచి రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో రంగనాథన్, నాయర్లతోపాటు పవన్ గౌర్, రాజేష్ కుమార్, యునైటెడ్ పాలిమర్ ఇండస్ట్రీస్‌కు చెందిన సౌరభ్ గుప్తా, బన్సల్ ఏజెన్సీస్‌కి చెందిన ఆదిత్య బన్సాల్ ఉన్నారు. -
గెయిల్ డైరెక్టర్ రంగనాథన్ అరెస్ట్
న్యూఢిల్లీ: లంచాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై గెయిల్ మార్కెటింగ్ వ్యవహారాల డైరెక్టర్ ఈఎస్ రంగనాథన్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్ట్‌గేషన్ (సీబీఐ) అరెస్ట్ చేసింది. నోయిడాలో ఆయనకు ఉన్న నివాసంలో సోదాలు నిర్వహించి రూ.1.3 కోట్లతో పాటు విలువైన ఆభరణాలు, పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు కూడా సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే కేసులో మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం నవంబర్ 2021లో గెయిల్ డైరెక్టర్‌ను ఇరువులు మధ్యవర్తులు ఎలా కలిశారు, లంచం ఎలా ఇచ్చారన్న విషయాన్ని సీబీఐ ఎఫ్ఐఆర్ వివరించింది. పెట్రో కెమికల్ ఉత్పత్తులను రాయితీపై అందజేస్తే లంచాలు అందించేందుకు సిద్ధంగా ఉన్న కంపెనీల యజమానులతో కూడా నిందితులు సమావేశం అయ్యారని ఎఫ్ఐఆర్ తెలిపింది. సీబీఐ జరిపిన దాడుల్లో రంగనాథన్ సహాయకుడు ఎన్ రామకృష్ణన్ నాయర్ నివాసం కూడా ఒకటి. ఈ నివాసం నుంచి రూ.75 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్లో రంగనాథన్, నాయర్లతోపాటు పవన్ గౌర్, రాజేష్ కుమార్, యునైటెడ్ పాలిమర్ ఇండస్ట్రీస్‌కు చెందిన సౌరభ్ గుప్తా, బన్సల్ ఏజెన్సీస్‌కి చెందిన ఆదిత్య బన్సాల్ ఉన్నారు. -
అవన్నీ అనవసరమైన భయాందోళనలు
న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ కేంద్రాలు మూతపడే పరిస్థితి వస్తుందని ఢిల్లీ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పలు రాష్ట్రాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో సంక్షోభ నివారణకు కేంద్రం మల్లగుల్లాలు పడుతోంది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోకుండా అవసరమైన అన్ని వనరులు వినియోగించేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్.కె.సింగ్ ఎన్టీపీసీ, రిలయెన్స్ ఎనర్జీ సహా వివిధ విద్యుదుత్పత్తి కేంద్రాలు, విద్యుత్ సరఫరా కంపెనీలు, విద్యుత్ అధికారులతో ఆదివారం భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్‌కు తగిన బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసర భయాందోళనలు వద్దని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి కేంద్రాల్లో 4 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, విద్యుత్ సరఫరాకు ప్రమాదం ఏమీ లేదని భరోసా ఇచ్చారు. సమాచార లోపమే కారణం గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), ఢిల్లీలోని డిస్కమ్‌ల మధ్య సమాచార లోపం వల్లే అనవసర ఆందోళనలు తలెత్తాయని చెప్పారు. ఢిల్లీ డిస్కమ్‌లకి, గెయిల్‌కి మధ్య కాంట్రాక్టు పూర్తి అయిపోవడంతో ఇక గ్యాస్ సప్లయ్ చేయలేమని గెయిల్ రాసిన లేఖతో విద్యుత్ ప్రమాదం ముంచుకొస్తోందన్న భయం తలెత్తి ఉండవచ్చునని మంత్రి అభిప్రాయపడ్డారు. ‘విద్యుత్ సంక్షోభం ముంచుకొస్తోందంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాసిన లేఖపై లెఫ్ట్‌నెంట్ జనరల్ నాతో మాట్లాడారు. అలాంటి పరిస్థితి రాదని వాళ్లకి చెప్పాను. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకు అవసరమయ్యే గ్యాస్ సరఫరా చేయమని గెయిల్ సీఎండీని ఆదేశించాం. సరఫరా కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు’అని మంత్రి తెలిపారు. బొగ్గు గనులున్న ప్రాంతాల్లో భారీ వర్షాలతో తవ్వకాలు నిలిచిపోవడం, సరఫరా మందగించడం, అంతర్జాతీయంగా బొగ్గు ధరలు భారీగా పెరగడంతో భరించలేని కంపెనీలు ఉత్పత్తిపై చేతులెత్తేస్తున్నాయి. గుజరాత్లో టాటా పవర్ ఉత్పత్తి నిలిపివేత విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గుపైనే ఆధారపడిన టాటా పవర్ అధిక ధరలకు బొగ్గు కొనలేక గుజరాత్‌లోని ముంద్రా ప్లాంట్‌లో ఉత్పత్తి ఆపేసింది. ఈ ప్లాంటు ద్వారా గుజరాత్‌కు 1,850 మెగావాట్లు, పంజాబ్‌కు 475, రాజస్తాన్‌కు 380, మహారాష్ట్రకు 760, హరియాణాకు 380 మెగావాట్లు విద్యుత్ సరఫరా చేయాల్సి ఉంది. బొగ్గు నిల్వలు ఎంత ఉన్నాయంటే.. బొగ్గు నిల్వలపై కేంద్ర విద్యుత్ శాఖ, బొగ్గు గనుల శాఖ వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. విద్యుదుత్పత్తికి అవసరమైన బొగ్గును సరఫరా చేస్తున్నట్టు స్పష్టం చేశాయి. కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి కాలరీస్ కంపెనీ, క్యాప్టివ్ కోల్‌మైన్స్, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు అన్నీ కలుపుకుంటే అక్టోబర్ 9న మొత్తంగా 19.2 లక్షల టన్నులు సరఫరా చేస్తే , విద్యుత్ ప్లాంట్లలో 18.7 లక్షల టన్నులు వినియోగించారు. అంటే వినియోగానికి మించి సరఫరా ఉందని, కొన్ని రోజులు గడిస్తే బొగ్గు నిల్వలు పెరుగుతాయని విద్యుత్ శాఖ వెల్లడించింది. బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ మరో ప్రకటనలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు దాదాపుగా 72 లక్షల టన్నులున్నాయని, ఇవి నాలుగు రోజులకి సరిపోతాయని పేర్కొంది. కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) దగ్గర 400 లక్షల టన్నుల స్టాకు ఉందని, విద్యుత్ ప్లాంట్లకు దానిని సరఫరా చేస్తున్నట్టుగా వివరించింది. దేశవ్యాప్తంగా విద్యుత్ కేంద్రాలకి రోజుకి 18.5 లక్షల టన్నుల బొగ్గు అవసరమైతే ప్రస్తుతం రోజుకి 17.5 లక్షల టన్నులు సరఫరా చేస్తున్నామని, వర్షాల కారణంగా పంపిణీ కాస్త నెమ్మదించిందని అంగీకరించింది. గత ఏప్రిల్ నుంచి సెపె్టంబర్ వరకు దేశీయంగా లభించే బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి 24 శాతం పెరిగిందని వివరించింది. అప్పట్లో ఆక్సిజన్‌కూ కొరత లేదన్నారు: సిసోడియా కేంద్రం ప్రతీ సమస్యని తేలిగ్గా తీసుకుంటోందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. బొగ్గు సంక్షోభం తరుముకొస్తున్నా ఏమీ లేదని అంటోందని మండిపడ్డారు. కోవిడ్ రెండో వేవ్ సమయంలో ఆస్పత్రులు, డాక్టర్లు ఆక్సిజన్‌కి కొరత ఉందని మొరపెట్టుకున్నా అలాంటిదేమీ లేదని మభ్యపెట్టిందని, ఫలితంగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దేశంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరిపడినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని, అనవసరంగా లేనిపోని భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కే. సింగ్ వ్యాఖ్యల నేపథ్యంలో సిసోడియా విలేకరులతో మాట్లాడారు. ‘‘కేంద్ర విద్యుత్ మంత్రి బొగ్గుకి కొరత లేదని అంటున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధానికి అలా లేఖ రాసి ఉండకూడదని కూడా అన్నారు. ఒక కేంద్రమంత్రిగా ఆయన చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు’’అని సిసోడియా అన్నారు. సమస్య నుంచి పారిపోవాలని కేంద్రం భావిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కొరతని, ఇప్పటి బొగ్గు సమస్యతో పోలుస్తూ కేంద్రంపై సిసోడియా విరుచుకుపడ్డారు. -
ఈసీఐఎల్‌లో ఆర్టిసన్ ఉద్యోగాలు, చివరి తేది మరో నాలుగు రోజులే
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్).. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఆర్టిసన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 04 ► అర్హత: ఫిట్టర్ ట్రేడులో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. అసెంబ్లీ ఆఫ్ మెకానికల్, ప్రెసిషన్ మెకానికల్ పని అనుభవం ఉండాలి. ► వయసు: 31.08.2021 నాటికి 25ఏళ్లు మించకూడదు. ► వేతనం: నెలకు రూ.18,564 చెల్లిస్తారు. ► పని ప్రదేశం: మైసూరు ► ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తులకు చివరి తేది: 17.09.2021 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ecil.co.in గెయిల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్).. ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► పోస్టులు: ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు ► విభాగాలు: ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/తత్సమాన ఉత్తీర్ణతతోపాటు గేట్–2022కు దరఖాస్తు చేసుకోవాలి. ► ఎంపిక విధానం: గేట్–2022లో సాధించిన స్కోర్ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021 ► వెబ్సైట్: www.gailonline.com -
గెయిల్(ఇండియా) లిమిటెడ్‌లో 220 పోస్టులు
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ మహారత్న సంస్థ.. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్).. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 220 ► పోస్టుల వివరాలు: మేనేజర్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్. ► విభాగాలు: మార్కెటింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, సివిల్, హెచ్ఆర్, లా తదితరాలు. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.08.2021 ► వెబ్సైట్ : https://www.gailonline.com -
పెట్రోకెమ్, రెన్యూవబుల్స్‌పై గెయిల్ దృష్టి
న్యూఢిల్లీ: పెట్రోకెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, రెన్యూవబుల్స్ విభాగాలలో విస్తరణపై దృష్టి పెట్టినట్లు పీఎస్‌యూ దిగ్గజం గెయిల్ ఇండియా చైర్మన్ మనోజ్ జైన్ తాజాగా పేర్కొన్నారు. సహజవాయువు కాకుండా ఇతర విభాగాలలో బిజినెస్‌ను విస్తరించే కొత్త ప్రణాళికల్లో ఉన్నట్లు తెలియజేశారు. ‘2030 వ్యూహాలు’ పేరుతో మెరుగుపరచిన భవిష్యత్ ప్రణాళికలను అనుసరించనున్నట్లు వివరించారు. వచ్చే దశాబ్దానికిగాను సరికొత్త ప్రయాణాన్ని సాగించనున్నట్లు తెలియజేశారు. పరిశ్రమలో వస్తున్న మార్పులు, తద్వారా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో ఈ వ్యూహాలు సహకరించనున్నట్లు వివరించారు. అంతేకాకుండా కొత్త విభాగాలలో విస్తరణ, వృద్ధికి దోహదం చేయగలవని అభిప్రాయపడ్డారు. కంపెనీ దేశీయంగా 70 శాతం గ్యాస్‌ను 13,340 కిలోమీటర్ల పరిధిలో గల ట్రంక్ పైప్‌లైన్ ద్వారా వివిధ ప్రాంతాలకు రవాణా చేసే సంగతి తెలిసిందే. దేశీయంగా మొత్తం సహజవాయువు అమ్మకాల్లో 55 శాతం వాటా కంపెనీదే. 17.5 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. రూ. 8,800 కోట్లు మహారాష్ట్ర రాయిగఢ్ జిల్లాలోని ఉసార్‌లోగల ఎల్పీజీ ప్లాంటును పాలీప్రొపిలీన్ కాంప్లెక్స్‌గా మార్పిడి చేస్తోంది. ఇందుకు రూ. 8,800 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తోంది. తద్వారా 2022–23కల్లా 5 లక్షల టన్నుల తయారీ సామర్థ్యాన్ని అందుకోనుంది. దీనిలో భాగంగా పాలీఎథిలీన్, పాలీప్రొపిలీన్‌లకు భవిష్యత్‌లో పెరగనున్న డిమాండును అందుకునే అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోంది. ఇక మరోవైపు కంపెనీకి గల 120 మెగావాట్ల పవన, సౌర విద్యుదుత్పత్తి సామర్థ్యాలను 1 గివావాట్‌కు పెంచుకునే ప్రణాళికలు వేసింది. ఇందుకు రానున్న మూడు, నాలుగేళ్లలో రూ. 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇతర రంగాలలో విస్తరిస్తున్నప్పటికీ గ్యాస్ బిజినెస్ కీలక విభాగంగా నిలవనున్నట్లు మనోజ్ పేర్కొన్నారు. వెరసి జాతీయ గ్యాస్ గ్రిడ్‌లో భాగంగా ప్రాధాన్యతగల సెక్షన్ల ఏర్పాటుకు రూ. 32,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలియజేశారు. 7,500 కిలోమీటర్లమేర ఏర్పాటు చేయనున్న లైన్లలో దేశ తూర్పు ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు. -
జనరల్ ఇన్సూరెన్స్- గెయిల్.. జూమ్
ప్రపంచ మార్కెట్ల బలహీనతలు, జూన్ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టుల ముగింపు నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 177 పాయింట్లు క్షీణించి 34,692కు చేరగా.. 54 పాయింట్ల వెనకడుగుతో నిఫ్టీ 10,251 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరం(2019-20) చివరి త్రైమాసికంలో సాధించిన ఫలితాల కారణంగా పీఎస్‌యూ కౌంటర్లు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(జీఐసీ ఆర్ఈ), గెయిల్ ఇండియా లిమిటెడ్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి ప్రస్తావించదగ్గ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జీఐసీ ఆర్ఈ గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో జీఐసీ ఆర్ఈ నికర లాభం 98 శాతం జంప్‌చేసి రూ. 1197 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం మాత్రం నామమాత్ర వెనకడుగుతో రూ. 1101 కోట్లకు పరిమితమైంది. స్థూల ప్రీమియం ఆదాయం 14 శాతం పుంజుకుని రూ. 9217 కోట్లకు చేరగా.. పూర్తిఏడాదికి 15 శాతం అధికమై రూ. 51,030 కోట్లుగా నమోదైంది. ఈ నేపథ్యంలో జీఐసీ ఆర్ఈ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 4.5 శాతం జంప్‌చేసి రూ. 160 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 165ను సైతం అధిగమించింది. గెయిల్ ఇండియా గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో గెయిల్ ఇండియా నికర లాభం మూడు రెట్లు ఎగసి రూ. 3018 కోట్లను తాకింది. పన్నుకు ముందు లాభం 47 శాతం జంప్‌చేసి రూ. 2556 కోట్లకు చేరింది. అయితే మొత్తం ఆదాయం 5 శాతం క్షీణించి రూ. 17,753 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో గెయిల్ ఇండియా షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం .5 శాతం లాభపడి రూ. 105 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 107 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. బుధవారం సైతం ఈ షేరు దాదాపు 3 శాతం బలపడింది. -
స్టాక్స్ వ్యూ
టైటాన్ కంపెనీ బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.793 టార్గెట్ ధర: రూ.1,070 ఎందుకంటే: టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ఇటీవలనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక విక్రయ అంచనాలను విడుదల చేసింది. ఈ క్యూ1లో అంతంతమాత్రంగా ఉన్న జ్యుయలరీ విభాగం అమ్మకాలు ఈ క్యూ2లో పుంజుకున్నాయి. పెళ్లి ముహూర్తాలు తక్కువగా ఉండటం, పుత్తడి ధరలు అధికంగా ఉండటం, పరిశ్రమకు రుణ లభ్యత కటకటగా ఉండటం, వినియోగదారుల డిమాండ్ బలహీనంగా ఉండటం వంటి ప్రతికూలతలు జ్యుయలరీ పరిశ్రమలో నెలకొన్నాయి. అయితే జ్యుయలరీ పరిశ్రమలో పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నా, కొత్త కలెక్షన్ ఆఫర్ల కారణంగా ఈ కంపెనీ మార్కెట్ వాటా పెరిగింది. గుల్నాజ్ బ్రాండ్ కింద విలువైన రాళ్లతో కూడిన ఆభరణాలను, మియా బ్రాండ్ కింద వెండి ఆభరణాల కలెక్షన్లను అందుబాటులోకి తెచ్చింది. వీటికి వినియోగదారుల నుంచి మంచి స్పందనే లభిస్తోంది. ఇక బ్రాండ్ ప్రచారం జోరుగా ఉండటం, కొత్త ఉత్పత్తుల ఆఫర్ల కారణంగా వాచ్‌ల సెగ్మెంట్ కూడా మంచి విక్రయాలను సాధించింది. మార్కెటింగ్ విస్తృతంగా ఉండటం, డిస్కౌంట్ల ధరల కారణంగా కళ్ల జోళ్ల విభాగం కూడా జోరుగానే వృద్ధి సాధించింది. ఈ క్యూ2లో ఈ కంపెనీ కొత్తగా ఆరు తనిష్క్ స్టోర్లను ప్రారంభించింది. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకూ కొత్తగా ఏర్పాటు చేసిన స్టోర్ల సంఖ్య 16కు పెరిగింది. కంపెనీ ఆఫర్ చేస్తున్న ‘స్కిన్న్’ బ్రాండ్.. డిపార్ట్మెంటల్ స్టోర్లలో అత్యధికంగా అమ్ముడయ్యే సెంట్ బ్రాండ్‌గా నిలిచింది. ఈ బ్రాండ్ కింద కంపెనీ కొత్తగా ఆఫర్ చేసిన అమల్పి బ్లూ మంచి అమ్మకాలు సాధిస్తోంది. సేమ్ స్టోర్స్ సేల్స్ గ్రోత్ (ఎస్‌ఎస్‌ఎస్‌జీ) జోరుగా ఉండనుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ ఆదాయం 20 శాతం పెరగగలదని, అలాగే మార్జిన్లు కూడా మంచి వృద్ధి సాధించగలవని అంచనా వేస్తున్నాం. రెండేళ్లలో షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 28 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. గెయిల్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.332 టార్గెట్ ధర: రూ.450 ఎందుకంటే: గెయిల్ కంపెనీకి సంబంధించిన నాలుగు గ్యాస్ పైప్లైన్ల తుది టారిఫ్‌లను పెట్రోలియమ్ అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్(పీఎన్జీఆర్బీ) ఖరారు చేసింది. ఈ నాలుగు గ్యాప్ పైప్లైన్లలో ముఖ్యమైనదైన దహేజ్–ఉరాన్–పన్వేల్/దభోల్ పైప్‌లైన్ టారిఫ్ 54 శాతం పెరిగింది. ఇతర మూడు గ్యాప్ పైప్లైన్లు చిన్నవే అయినప్పటికీ, వీటి టారిఫ్‌లు 161–691 శాతం రేంజ్లో పెరిగాయి. ఈ టారిఫ్‌ల పెరుగుదల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంపెనీ షేర్‌వారీ ఆర్జన (ఈపీఎస్) 1 శాతం, అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం ఈపీఎస్ 4 శాతం వరకూ పెరుగుతాయని అంచనా. హజీరా–విజయ్‌పూర్–జగదీశ్‌పూర్(హెచ్వీజే), దహేజ్–విజయ్‌పూర్ పైప్‌లైన్(డీవీపీఎల్)లకు సంబంధించి ఒకే టారిఫ్ ప్లాన్ ఉండాలన్న గెయిల్ ప్రతిపాదనను పీఎన్జీఆర్బీ ఆమోదిస్తే, గెయిల్ పనితీరుపై దీర్ఘకాలంలో చెప్పుకోదగ్గ సానుకూల ప్రభావం చూపుతుంది. గ్యాస్ అమ్మకాలు నిలకడగా ఉండటం, పైప్లైన్ల విస్తరణ, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్(సీజీడీ) జోరు పెరుగుతుండటం, ఎల్పీజీ, పెట్రో కెమికల్స్ ధరలు పెరుగుతుండటం.. ఇవన్నీ సానుకూలాంశాలు. 2016–17లో రూ.48,902 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి కల్లా రూ.73,782 కోట్లకు పెరుగుతుందని అంచనా. అలాగే నికర లాభం రూ.3,503 కోట్ల నుంచి రూ.5,945 కోట్లకు పెరుగుతుందని భావిస్తున్నాం. -
కొత్త వ్యాపారాల్లోకి గెయిల్!
న్యూఢిల్లీ: గెయిల్ కంపెనీ ఇతర వ్యాపారాల్లోకి ప్రవేశించాలని యోచిస్తోంది. ప్రస్తుతం ఈ కంపెనీ గ్యాస్, పెట్రో కెమికల్స్ వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఈ వ్యాపారాలు కాకుండా సౌరశక్తి ప్లాంట్ల ఏర్పాటు, ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన బ్యాటరీ చార్జింగ్ స్టేషన్ల నిర్మాణం, స్టార్టప్‌లలో పెట్టుబడులు, తదితర రంగాల్లోకి విస్తరించాలని భావిస్తోంది. ఈ వ్యాపారాల నిర్వహణకు కంపెనీ చార్టర్లో సవరణలు చేయాలి. అందుకోసం వాటాదారుల ఆమోదాన్ని గెయిల్ కోరింది. కంపెనీ ఎంఓఏలో (మెమొ రాండమ్ ఆఫ్ అసోసియేషన్) ప్రధాన లక్ష్యాల క్లాజులో ఆరు కొత్త సెక్షన్లను చేర్చడానికి ఆమోదం తెలిపాలని వాటాదారులకు పంపిన నోటీసులో గెయిల్ కోరింది. వచ్చే నెల 11న కంపెనీ 34వ వార్షిక సాధారణ సమావేశం జరగనుంది. స్టార్టప్‌లలో పెట్టుబడి... తమప్రధాన వ్యాపారాలైన నేచురల్ గ్యాస్, పెట్రో కెమికల్స్, ఎనర్జీ సంబంధిత స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు కంపెనీ పేర్కొంది. వీటితో పాటు ఆరోగ్య, సామాజిక, పర్యావరణ, రక్షణ, భద్రత సంబంధిత స్టార్టప్‌లలోనూ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ స్టార్టప్‌లలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఇన్వెస్ట్ చేస్తామని తెలిపింది. స్పెషల్ పర్పస్ వెహికల్స్(ఎస్పీవీ), ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్(ఏఐఎఫ్), ఫండ్ ఆఫ్ ఫండ్స్(ఎఫ్ఓఎఫ్), ట్రస్ట్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేయనున్నామని వివరించింది. ‘‘పర్యావరణ పరిరక్షణలో భాగంగా బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లను, చార్జింగ్ సర్వీసులను ఆరంభించాలనుకుంటున్నాం. సొంత వినియోగానికే కాకుండా, విక్రయానికి కూడా వెసులుబాటుండేలా సౌరశక్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. హైడ్రో కార్బన్ పైప్లైన్ల రంగంలో ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ (ఈపీసీ), ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్(ఈపీసీఎమ్), ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ(పీఎమ్‌సీ)సేవలను అందించ గల సత్తా ఉంది. ఈ మేరకు అవకాశాలను అందిపుచ్చుకోవాలని కూడా చూస్తున్నాం’’ అని కంపెనీ తెలిపింది. గ్యాస్ మీటర్లు, సీఎన్జీ కిట్లు వంటి ఉపకరణాల తయారీ, పంపిణీ, మార్కెటింగ్‌లకు సంబంధించిన వ్యాపారంలో కూడా ప్రవేశించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. గురువారం జీవిత కాల గరిష్టానికి చేరిన నేపథ్యంలో గెయిల్ షేర్లో శుక్రవారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో ఈ కంపెనీ షేర్ బీఎస్ఈలో 1.6 శాతం క్షీణించి రూ.387 వద్ద ముగిసింది. -
సిటీ గ్యాసు బిడ్లలో అదానీ ముందంజ
న్యూఢిల్లీ: పట్టణాల్లో సహజవాయువు పంపిణీ ప్రాజెక్టులకు సంబంధించిన బిడ్లలో అదానీ గ్రూపు ముందంజలో నిలిచింది. 52 పట్టణాల్లో ఈ సంస్థ బిడ్లు వేసి టాప్ బిడ్డర్‌గా నిలిచింది. ప్రభుత్వరంగ గెయిల్ 30 పట్టణాల పట్ల ఆసక్తి చూపిస్తూ బిడ్లు వేసింది. ఇక, రిలయన్స్–బీపీ మాత్రం చివరి నిమిషంలో తప్పుకోవడం గమనార్హం. అదానీ గ్యాస్ లిమిటెడ్ 32 పట్టణాల్లో సొంతగాను, 20 పట్టణాల్లో ఐవోసీతో కలసి బిడ్లు వేసింది. దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో ఉన్న 174 జిల్లాల్లోని పట్టణాలు, సమీప ప్రాంతాల్లో... పైపుల ద్వారా వంట గ్యాస్ సరఫరాకు సంబంధించి 86 పర్మిట్లకు తొమ్మిదో విడతలో భాగంగా ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ ఢిల్లీలో ఇప్పటికే సీఎన్జీ సరఫరా చేస్తుండగా, మరో 13 పట్టణాల్లో అనుమతులకు బిడ్లు దాఖలు చేసింది. ఎస్సెల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఏడు బిడ్లు దాఖలు చేసింది. గెయిల్, మహానగర్ గ్యాస్, గుజరాత్ స్టేట్ ప్రెటోలియం కార్ప్ (జీఎస్పీసీ) కూడా ఇందులో పాల్గొన్నాయి. అయితే, ఆర్ఐఎల్, బ్రిటన్‌కు చెందిన బీపీ 50: 50 జాయింట్ వెంచర్ ‘ఇండియా గ్యాస్ సొల్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్’ మాత్రం బిడ్లు దాఖలు చేయలేదని విశ్వసనీయ వర్గాలు తెలియజేశాయి. ఈ తొమ్మిదో విడతకు ముందు ఎనిమిది దశల్లో కేంద్రం మొత్తం 91 భౌగోళిక ప్రాంతాలను కవర్ చేసే విధంగా లైసెన్స్‌లను జారీ చేసింది. ఇంద్రప్రస్థ గ్యాస్, గెయిల్ గ్యాస్ లిమిటెడ్ వంటివి వీటిని దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన మేఘ ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ రెండు ప్రాంతాల్లో లైసెన్సులు దక్కించుకుని దాదాపుగా సరఫరాకు సిద్ధమయింది. మొత్తంగా ప్రస్తుతానికి 24 కోట్ల జనాభా నివసిస్తున్న ప్రాంతాలు ఈ సేవల పరిధిలోకి వచ్చాయి. ప్రాథమిక ఇంధన విభాగంలో సహజవాయువు వాటా ప్రస్తుతం 6 శాతంగా ఉంటే, దాన్ని 15 శాతానికి పెంచాలన్నది కేంద్రం లక్ష్యం. అలాగే, 2020 నాటికి కోటి ఇళ్లకు పైపుల ద్వారా వంట గ్యాస్ అందించాలన్నది మోదీ సర్కారు సంకల్పం. -
కాకినాడ ఓఎన్జీసీ క్రాకర్ యూనిట్‌పై నీలినీడలు
సాక్షి, అమరావతి : కాకినాడలో రూ.40,000 కోట్లతో హెచ్‌పీసీఎల్, గెయిల్‌తో కలసి ఏర్పాటు చేయదల్చిన క్రాకర్ యూనిట్ ఆర్థికంగా లాభసాటి కాదన్న ఆలోచనలో కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఇంకా ఈ ప్రాజెక్టుపై ఎటువంటి చర్యలు తీసుకోలేదంటున్నారు ప్రభుత్వరంగ ఓఎన్జీసీ సీఎండీ శశి శంకర్. నాగాయలంక బావుల నుంచి గ్యాస్, చమురును వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడానికి వచ్చిన శశిశంకర్ ‘సాక్షి’తో మాట్లాడారు. కేజీ బేసిన్లో పెట్టుబడుల దగ్గర నుంచి సామాజిక కార్యక్రమాల వరకు పలు అంశాలపై ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాలు ప్రత్యేకంగా.. రాష్ట్రంలో పెట్టుబడుల విస్తరణ గురించి వివరిస్తారా? ఓఎన్జీసీ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. కేజీ బేసిన్లో ఆఫ్‌షోర్ బావి కేజీ డబ్ల్యూఎన్ 98/2 ఒక్కదానిపైనే సుమారుగా రూ. 35,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నాం. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు వేగంగా నడుస్తున్నాయి. అదే విధంగా నాగాయలంక బ్లాక్‌లో రూ. 2,800 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేశాం. ఇవి కాకుండా గడిచిన ఒక్క ఏడాదే 22 బావులను తవ్వాము. వచ్చే మూడేళ్లలో సహజవాయువు ఉత్పత్తిని రెట్టింపు చేయాలన్న లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలకపాత్ర పోషించనుంది. మూడేళ్లలో గ్యాస్ ఉత్పత్తిని 24 బిలియన్ క్యూబిక్ మీటర్ల నుంచి 50 బిలియన్ క్యూబిక్ మీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. కాకినాడలో క్రాకర్ ప్రాజెక్టు ప్రతిపాదన ఎంత వరకు వచ్చింది? గెయిల్, హెచ్పీసీఎల్తో కలసి రూ. 40,000 కోట్లతో క్రాకర్ యూనిట్ ఏర్పాటు చేయాలనుకున్నాం. కానీ పరిస్థితులు దీనికి అనుకూలంగా లేవు. ప్రారంభంలో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ గురించి ఆలోచించినా ఇప్పుడు ఈ ప్రాజెక్టు ఆర్థికంగా లాభమా కాదా అన్నదానిపై ఇంకా చర్చిస్తున్నాం. ఇంకా ఎటువంటి తుది నిర్ణయం తీసుకోలేదు. ఓఎన్జీసీ హెచ్‌పీసీఎల్ విలీనంపై... ఓఎన్జీసీలో హెచ్‌పీసీఎల్ విలీన ప్రతిపాదనను ఆపేశాము. చమురు ఉత్పత్తికి..విక్రయించే రిటైల్ సంస్థల వ్యాపారానికి చాలా తేడా ఉంది. అందుకే మా గ్రూపునకు చెందిన రిఫైనరీ, రిటైల్ సంస్థ ఎంఆర్‌పీఎల్‌ను హెచ్పీసీఎల్లో విలీనం చేయాలనుకుంటున్నాం. అంతర్జాతీయంగా చాలా దేశాల్లో కూడా చమురు ఉత్పత్తి సంస్థలు రిటైల్ వ్యాపారాన్ని వేరే సంస్థ ద్వారా చేస్తున్నాయి. మేము కూడా ఇక్కడే అదే విధానాన్ని అమలు చేయాలనుకుంటున్నాం. రాష్ట్రంలో అమలు చేస్తున్న సామాజిక కార్యక్రమాల గురించి... రాష్ట్రం నుంచి వస్తున్న లాభాల్లో రెండు శాతం కంటే ఎక్కువగానే సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నాం. గతేడాది రాష్ట్రంలో సామాజిక కార్యక్రమాల కోసం రూ. 67 కోట్లు వ్యయం చేశాము. ఈ కార్యక్రమం కింద 4,500 మరుగుదొడ్లు నిర్మించాం. గతేడాది రాజమండ్రి ఆన్సైట్ నుంచి ఓఎన్జీసీకి రూ. 306 కోట్ల లాభం వచ్చింది. అయినా ఆన్సైట్ యూనిట్ ఏకంగా రూ. 18 కోట్లు సామాజిక కార్యక్రమాలకు, మరో రూ. 14 కోట్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమాల కింద వినియోగించాం. ఇవన్నీ మా సైట్లు ఉన్న గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్న మౌలిక వసతులకు అదనం. ఈ మౌలిక వసుతల కల్పనను నిర్వహణ వ్యయం కిందే పరిగణిస్తున్నాం. -
మార్చి నాటికి గెయిల్ విభజన
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగానికి చెందిన గ్యాస్ మార్కెటింగ్, పంపిణీ దిగ్గజం గెయిల్‌ను వచ్చే ఏడాది మార్చి నాటికల్లా రెండు కంపెనీలుగా విభజించాలని కేంద్రం యోచిస్తోంది. గ్యాస్ మార్కెటింగ్ విభాగాన్ని ఒక కంపెనీగాను, పైప్లైన్ల నిర్వహణ విభాగాన్ని మరో సంస్థగాను ఏర్పాటు చేయనుంది. పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ బోర్డు (పీఎన్జీఆర్బీ) చైర్మన్ డీకే సరాఫ్ ఈ విషయం తెలిపారు. విభజన ప్రక్రియ ఈ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు సరాఫ్ పేర్కొన్నారు. గెయిల్ ఇప్పటికే గ్యాస్ పైప్‌లైన్, మార్కెటింగ్ వ్యాపార విభాగాలకు సంబంధించిన ఖాతాలు వేర్వేరుగానే నిర్వహిస్తున్న నేపథ్యంలో విభజన ప్రక్రియ సులభతరంగానే ఉండగలదని ఆయన తెలిపారు. 1984లో ఓఎన్జీసీ నుంచి గ్యాస్ వ్యాపార కార్యకలాపాలను విడగొట్టి గెయిల్ ఏర్పాటు చేశారు. గ్యాస్ వినియోగాన్ని పెంచేందుకే: మరిన్ని ద్రవీకృత సహజ వాయువు టెర్మినల్స్ నిర్మించేందుకు, పైప్‌లైన్ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు అవసరమయ్యే భారీ పెట్టుబడులను ఆకర్షించడానికి.. అలాగే గ్యాస్ వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచడానికి గెయిల్ కార్యకలాపాల విభజన తోడ్పడగలదని భావిస్తోంది. ప్రస్తుతం చాలా మటుకు విద్యుత్ ప్లాంట్లు, సెరామిక్.. గ్లాస్ తదితర చిన్న పరిశ్రమలు ఖరీదైన, కాలుష్యకారకమైన నాఫ్తా, డీజిల్, బొగ్గు వంటి ఇంధనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే, భవిష్యత్‌లో వీటిని గ్యాస్ వైపు మళ్లించేందుకు, గెయిల్‌తో సంబంధం లేకుండా నేరుగా గ్యాస్‌ను కొనుగోలు చేసుకునేందుకు తాజా విభజన తోడ్పడగలదని కేంద్రం భావిస్తోంది. -
గెయిల్, ఐవోసీ నుంచి ఓఎన్జీసీ ఔట్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలైన ఐవోసీ, గెయిల్‌లో తనకున్న వాటాలను విక్రయించడానికి ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) సిద్ధమయింది. ఇందుకోసం కేంద్రం నుంచి అనుమతి పొందింది. ‘‘మా ప్రతిపాదనకు కేంద్రం ఇటీవలే ఆమోదముద్ర వేసింది. అయితే షేర్ల విక్రయానికి సరైన సమయం కోసం వేచి చూస్తున్నాం’’ అని ఓఎన్జీసీ వర్గాలు తెలియజేశాయి. ఈ వాటాల విక్రయం ద్వారా వచ్చిన నిధులను హెచ్‌పీసీఎల్ కొనుగోలు కోసం ఓఎన్జీసీ ఉపయోగించుకోనుంది. దేశీయంగా అతి పెద్ద రిఫైనరీ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఓఎన్జీసీకి 13.77 శాతం వాటాలున్నాయి. మంగళవారం నాటి షేరు ధర ప్రకారం వీటి విలువ సుమారు రూ. 26,200 కోట్లు. ఇక గెయిల్ ఇండియాలో ఓఎన్జీసీకి రూ.3,847 కోట్ల విలువ చేసే 4.86 శాతం వాటాలున్నాయి. చమురు రిఫైనింగ్, మార్కెటింగ్ సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్లో (హెచ్‌పీసీఎల్) కేంద్ర ప్రభుత్వానికి చెందిన 51.11 శాతం వాటాలను ఓఎన్జీసీ కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం రూ.36,915 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఓఎన్జీసీ దగ్గర ఇప్పటికే రూ.12,000 కోట్ల పైగా నగదు నిల్వలున్నాయి. హెచ్‌పీసీఎల్ కొనుగోలుకు సంబంధించి రూ. 18,060 కోట్ల రుణ సమీకరణ కోసం మూడు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓఎన్జీసీ తెలిపింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్‌లు ఇందులో ఉన్నాయని స్టాక్ ఎక్సే్చంజీలకు వివరించింది. పీఎన్బీ నుంచి రూ. 10,600 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ. 4,460 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ నుంచి రూ. 3,000 కోట్లు సమీకరిస్తున్నట్లు తెలిపింది. -
గ్యాస్ పైపులైన్లు వేయటానికే గెయిల్!
న్యూఢిల్లీ: సహజ గ్యాసు పైపులైన్ల నిర్మాణంపై గెయిల్ దృష్టి సారించాలని, గ్యాస్ మార్కెటింగ్ ఎవరైనా చేయగలరని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ అన్నారు. గెయిల్ నుంచి గ్యాస్ మార్కెటింగ్ వ్యాపారాన్ని వేరు చేయనున్నట్టు వస్తున్న వార్తలను బలపరిచే విధంగా మంత్రి ప్రకటన ఉండడం గమనార్హం. అయితే, ప్రభుత్వం గెయిల్‌ను రెండుగా చేయనుందన్న సమాచారాన్ని మంత్రి ధ్రువీకరించడం, ఖండించడం వంటివేమీ చేయలేదు. మౌలిక సదుపాయాల కల్పనను పర్యావరణ అనుకూలమైన సహజ గ్యాసు రూపంలో అనుసంధానం కాని ప్రాంతాలకు తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రాధాన్యంగా చెప్పారు. దేశాన్ని గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 1984లో ఓఎన్జీసీ నుంచి గ్యాస్ వ్యాపారాన్ని వేరు చేస్తూ ఏర్పాటు చేసిందే గెయిల్. దేశవ్యాప్తంగా 11,000 కిలోమీటర్ల సహజ గ్యాసు పైపులైన్ నెట్వర్క్ ఈ సంస్థ పరిధిలో ఉంది. గెయిల్ నుంచి గ్యాస్ మార్కెటింగ్ వ్యాపారాన్ని వేరు చేయాలన్న అంశంపై ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు సమావేశాలు కూడా నిర్వహించగా, తుది నిర్ణయానికి రాలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. -
‘గెయిల్’పై దిగ్గజాల కన్ను!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) చమురు–గ్యాస్ రంగంలో విలీనాలు మరింత జోరందుకోనున్నాయి. పీఎస్‌యూ గ్యాస్ అగ్రగామి గెయిల్‌ను కొనుగోలు చేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) ఈ విషయంలో పోటీపడుతున్నాయి. సహజవాయువు ప్రాసెసింగ్, పంపిణీ చేసే గెయిల్‌ను కొనుగోలు చేయడం ద్వారా సమగ్ర ఇంధన వనరుల సంస్థగా ఎదగాలని ఈ కంపెనీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా ఐవోసీ, బీపీసీఎల్.. కేంద్ర చమురు శాఖకు తమ ప్రతిపాదనలు పంపించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే, గెయిల్ మాత్రం ప్రభుత్వ రంగ గ్యాస్, చమురు దిగ్గజం ఓఎన్జీసీలో విలీనమే సరైన నిర్ణయం కాగలదని భావిస్తోంది. గ్యాస్ ఉత్పత్తి చేసే దిగ్గజానికి తమ రవాణా, మార్కెటింగ్ నెట్వర్క్ తోడైతే.. సమగ్రమైన ఇంధన సంస్థగా ఎదగవచ్చని యోచిస్తోంది. గెయిల్‌లో ప్రభుత్వానికి 54.89 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు రూ. 46,700 కోట్లు. ఈ ఏడాది బడ్జెట్లో బీజం... దేశ, విదేశాల్లోని ప్రైవేట్ రంగ చమురు, గ్యాస్ దిగ్గజ సంస్థలకు దీటుగా ప్రభుత్వ రంగంలోనూ భారీ స్థాయి కంపెనీల రూపకల్పన దిశగా కసరత్తు చేస్తున్నట్లు 2017–18 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొనడం ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. విలీనాల అవకాశాలను సూచనప్రాయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక పీఎస్‌యూని మరో పీఎస్యూలో విలీనం చేయడం ద్వారా వాటిపై నియంత్రణ అధికారం కోల్పోకుండానే.. వాటాల విక్రయం ద్వారా నిధులు సమీకరించుకోవచ్చన్నది ప్రభుత్వ వ్యూహం. అదే సమయంలో అంతర్జాతీయ దిగ్గజాలతో పోటీపడే దీటైన కంపెనీల సృష్టికి, తద్వారా చమురు రేట్లలో హెచ్చుతగ్గులను ఎదుర్కొనడానికి ఇది ఉపయోగపడగలదని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే హెచ్‌పీసీఎల్ విలీన ప్రక్రియలో ఓఎన్జీసీ.. ఓఎన్జీసీ ప్రస్తుతం చమురు రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్ సంస్థ హెచ్‌పీసీఎల్‌ను కొనుగోలు చేసే పనిలో ఉంది. ఈ ప్రతిపాదనకు క్యాబినెట్ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. హెచ్పీసీఎల్లో ప్రభుత్వానికి ఉన్న 51.11% వాటాలను ఓఎన్జీసీ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ వాటా విలువ దాదాపు రూ. 33,000 కోట్లుగా ఉంటుంది. ఓఎన్జీసీ– హెచ్‌పీసీఎల్ డీల్ పూర్తయిన తర్వాతే.. గెయిల్ అంశాన్ని ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రతిపాదనలివీ.. దేశీయంగా అతి పెద్ద చమురు రిఫైనింగ్, ఇంధన మార్కెటింగ్ సంస్థ అయిన ఐవోసీ.. మరో రిఫైనర్‌ని లేదా గెయిల్ వంటి గ్యాస్ కంపెనీని కొనుగోలు చేయాలని యోచిస్తోంది. నగరాల్లో గ్యాస్ సరఫరా ప్రాజెక్టులు, గ్యాస్ మార్కెటింగ్ తదితర కార్యకలాపాలతో పాటు ఎల్ఎన్జీ టెర్మినల్స్ నిర్మాణం మొదలైనవి.. గెయిల్ వంటి గ్యాస్ సంస్థ కొనుగోలుకు తోడ్పడే అంశాలని భావిస్తోంది. దేశంలోనే అతి పెద్ద గ్యాస్ రవాణా, మార్కెటింగ్ కంపెనీ అయిన గెయిల్‌ని దక్కించుకుంటే సమగ్రమైన ఇంధన దిగ్గజంగా ఎదగవచ్చని యోచిస్తోంది. మరోవైపు, గ్యాస్ వ్యాపార విభాగంలో దిగ్గజంగా ఎదగడంపై కసరత్తు చేస్తున్న బీపీసీఎల్ కూడా గెయిల్‌పై తమ ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచింది. కొనుగోలు చేసేందుకు తమ మొదటి ప్రాధాన్యత గెయిల్‌కే ఉంటుందని పేర్కొంది. లేని పక్షంలో రెండో ప్రాధాన్యం కింద ఆయిల్ ఇండియా (ఆయిల్) ఉంటుందని వివరించింది. ప్రస్తుతం ఆయిల్లో కేంద్రానికి 66.13 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ రేటు ప్రకారం దీని విలువ రూ. 18,000 కోట్లు ఉంటుంది. ఈ విలీనాలు పూర్తయితే, ప్రభుత్వ రంగంలో మొత్తం చమురు–గ్యాస్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సంఖ్య మూడుకు చేరే అవకాశం ఉంది.