హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైపులైన్ పేలుడు ఘటనలో కేంద్ర ప్రభుత్వం, పెట్రోలియం శాఖ, గెయిల్కు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ ప్రమాదంపై వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. నగరం ప్రమాదంలో 21మంది మృతి చెందారు. జూన్ 27న 13 మంది సజీవ దహనం కాగా ఇద్దరు కిమ్స్ ఆస్పత్రిలో, ఐదుగురు కాకినాడ అపోలో ఆస్పత్రిలో చనిపోయిన సంగతి తెలిసిందే.
నగరం ఘటనపై కేంద్రం, గెయిల్కు హైకోర్టు నోటీసులు
Published Mon, Jul 14 2014 12:38 PM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM
Advertisement
Advertisement