Government of India
-
ఉత్తర – దక్షిణ సంకటం
ఊహించినట్లే జరుగుతోంది. ‘డీలిమిటేషన్’ భూతం మనల్ని వెంటాడుతోంది. జనాభా లెక్కలు దగ్గర పడిన కొద్దీ అది మనకు ఇంకా చేరువ అవుతోంది. అయినా మోదీ ప్రభుత్వం ఈ సమస్యను తేలిగ్గా తీసుకుంటోంది. కానీ ‘నియోజక వర్గాల పునర్విభజన’ భయాలు అలా కొట్టేయదగినవి కావు. ఎందుకని? కారణం వెరీ సింపుల్. ఇందులో బుర్ర బద్దలు కొట్టుకోవల్సిందేమీ లేదు. నియోజక వర్గాలు జనాభాపరంగా సైజులో సమానంగా ఉండాలి. ఇప్పుడలా లేవు. కాబట్టి దేశవ్యాప్తంగా నియోజక వర్గాలు ఒకే సైజులో ఉండేట్లు వాటిని పునర్ విభజించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో, జనసంఖ్య వేగంగా పెరిగిన రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల్లో కంటే ఎక్కువ నియోజక వర్గాలు ఏర్పడతాయి. మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 వద్దే స్థిరంగా ఉంచేట్లయితే, జనాభా నియంత్రణ పటిష్ఠంగా అమలు చేసిన రాష్ట్రాల్లో సహజంగానే నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుంది. ఆ మేరకు ఇతర రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి. ఒకరి నష్టం మరొకరికి లాభం అవుతుంది. సంఖ్య పెరిగినా ఒరిగేదేంటి?మిలన్ వైష్ణవ్, జేమీ హింట్సన్‌ల అధ్యయనం సూచించిందిదే! అన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ పార్లమెంటు నియోజకవర్గాలు తగ్గు తాయి. ఉదాహరణకు కేరళ, తమిళనాడు చెరో 8 సీట్లు కోల్పోతాయి. ఆంధ్ర, తెలంగాణలు రెంటికీ కలిపి చూస్తే అవీ ఇన్ని స్థానాలు నష్ట పోతాయి. కర్ణాటక నుంచి 2 స్థానాలు ఎగిరిపోతాయి. జనాభాను నియంత్రించిన ఇతర రాష్ట్రాలూ ఇలాగే దెబ్బతింటాయి. పశ్చిమ బెంగాల్ నాలుగు, ఒడిషా మూడు, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమా చల్ ప్రదేశ్ ఒక్కో నియోజకవర్గం పోగొట్టుకుంటాయి. ఇక అనేక ఉత్తరాది రాష్ట్రాల స్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఉత్తర ప్రదేశ్ జాబితాకు 11 స్థానాలు అదనంగా కలుస్తాయి. బిహార్ 10, రాజస్థాన్ 6, మధ్యప్రదేశ్ 4 సీట్లు పెంచుకుంటాయి. ఫలితంగా, 543లో 226 సీట్లతో ఇప్పటికే ఆధిపత్యం చలాయిస్తున్న ‘హిందీ హార్ట్‌ల్యాండ్’ డీలిమిటేషన్ అనంతరం తన ప్రాబల్యాన్ని విశేషంగా 259కి పెంచుకుంటుందని యోగేంద్ర యాదవ్ తేల్చారు. దక్షిణాది రాష్ట్రాలు అన్నిటికీ కలిపి ప్రస్తుతం 129 సీట్లు ఉన్నాయి. పునర్విభ జన అనంతరం ఇవి 26 సీట్లు కోల్పోతాయని యోగేంద్ర యాదవ్ లెక్క గట్టారు. దీంతో పార్లమెంటులో వాటి ప్రాతినిధ్యం, పలుకుబడి గణనీయంగా క్షీణిస్తాయని వేరే చెప్పనక్కర్లేదు.డీలిమిటేషన్ సమయంలో దీన్ని దృష్టిలో పెట్టుకుని లోక్ సభ సీట్ల సంఖ్య పెంచే వీలుందని అంటున్నారు. ఇది కొంచెం నయం. కానీ అలా చేస్తే సమస్య తీవ్రత తగ్గుతుందా? మొత్తం స్థానాల సంఖ్య పెంచినా, ప్రతి రాష్ట్ర నియోజకవర్గాలూ అదే నిష్పత్తిలో పెరుగుతాయి. అదీ ఉత్తరాదికే అనుకూలిస్తుంది. ఉత్తరాది–దక్షిణాది నిష్పత్తి ప్రకారం చూస్తే, దక్షిణాది రాష్ట్రాలకు ఒరిగేదే ఉండదు. వాటి సీట్ల సంఖ్య పెరిగినా ప్రయోజనం ఉండదు. వాటి ప్రాతినిధ్యం, పలుకు బడి పూర్వస్థితికి అంటే ఇప్పటి స్థాయికి చేరుకోవు. కాబట్టి, ఈ చర్య కూడా దక్షిణాది భయాలను తొలగించేది కాదు. పరిస్థితి ఏమీ మారదు. ఆ మధ్య ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ లెక్క వేసింది. సమస్యను ఈ గణాంక విశ్లేషణ తేటతెల్లం చేస్తుంది. ఇప్పటికిప్పుడు ఐదు దక్షి ణాది రాష్ట్రాలకు కలిపి మొత్తం 543లో 129 సీట్లు ఉన్నాయి. అంటే 24 శాతం. ప్రస్తుత లోక్ సభ సీట్ల సంఖ్యను 790కి పెంచారే అనుకుందాం. అప్పుడు ఈ రాష్ట్రాల నియోజకవర్గాలు 152కి పెరుగుతాయి. నిజమే. కానీ మొత్తంలో వాటి వాటా కేవలం 19 శాతానికి కుదించుకు పోతుంది. తమిళనాడు విషయం చూస్తే, దాని వాటా ఇప్పుడున్న 7.2 నుంచి 5.4 శాతానికి పడిపోతుంది.ఏ విధంగా చూసినా దక్షిణాది రాష్ట్రాల క్షోభ అర్థం చేసుకో దగినదే!ఉత్తరాది బాధకానీ రెండో వైపు నుంచి చూస్తే, ఉత్తరాదిదీ సంకట స్థితే! ఆర్. జగన్నాథన్ గణాంక విశ్లేషణ ప్రకారం, మారిన జనాభా నేపథ్యంలో కేరళ పార్లమెంటు సభ్యుడు సగటున 18 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదే రాజస్థాన్ ఎంపీ సగటున 33 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తాడు. ఈ రకంగా చూసుకుంటే తమకు ఉండవలసిన వారి కంటే చాలా తక్కువ మంది ఎంపీలు ఉన్నారని, ఇది అన్యాయమని హిందీ బెల్టు కూడా వాదించగలదని జగన్నాథన్ అభిప్రాయపడుతున్నారు. ఇది నిజంగా భారత ప్రజాస్వామ్యానికే డైలమా! అసలు సమస్య ఇది: నియోజకవర్గాల పునర్విభజన చేస్తే ఉత్తరాది ఆందోళన పరిష్కారం అవుతుంది. అయితే, ఈ చర్య దక్షిణా దికి క్షోభ కలిగిస్తుంది. యోగేంద్ర యాదవ్ వాదిస్తున్నట్లు డీలిమి టేషన్‌ను వాయిదా వేయడం – లేదా శాశ్వతంగా రద్దు చేయడం ద్వారా యథాతథ స్థితి కొనసాగించవచ్చు. దక్షిణాది భయాలు తొలగి పోతాయి. మరి ఉత్తరాది వారు తమకు జరుగుతుందని భావిస్తున్న అన్యాయం మాటేమిటి? అది అలాగే మిగిలిపోతుంది. కాబట్టి, ఎలా చేసినా ఏదో ఒక పక్షం నష్టపోవడం తప్పదు.మరి దీనికి పరిష్కారం లేదా? ఇది చిటికేసినంత సులభంగా పరిష్కరించే సమస్య అయితే కాదు. నిజం చెప్పాలంటే, మన ప్రజా స్వామ్యం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో కచ్చితంగా ఇదొకటి. వాస్తవానికి వ్యవస్థలో పెను ఉపద్రవానికి దారి తీయగల ఒక నిర్మాణలోపం ఇది. దీన్ని తేలిగ్గా తీసిపారేయడమో, దాటవేయడమో సరైన వైఖరి కాదు. సవాలును సవాలుగా స్వీకరించి అమీతుమీ తేల్చుకోవాల్సిందే. ఇదంత సులభం కాకపోవచ్చు. పోనీ మరొక ప్రత్యామ్నాయం ఉందా?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
‘క్రీడాకారులకు ప్రత్యేక ఐడీ’
సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. ఇందు కోసం భిన్నమైన పలు కార్యక్రమాలు చేపట్టిందని ఆయన వెల్లడించారు. మాండవియా అధ్యక్షతన భారత క్రీడా రంగం మెరుగుదల, భవిష్యత్తుకు సంబంధించి శుక్రవారం ప్రత్యేక ‘చింతన్ శిబిర్’ ప్రారంభమైంది. నగర శివార్లలో కన్హా శాంతి వనంలో జరుగుతున్న రెండు రోజుల ఈ శిబిరం శనివారం ముగుస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన క్రీడా శాఖల మంత్రులు, క్రీడా పరిపాలకులు, సీనియర్ ప్రభుత్వాధికారులతో పాటు కేంద్ర క్రీడాశాఖ సహాయ మంత్రి రక్ష ఖడ్సే కూడా దీనికి హాజరయ్యారు. ప్రపంచ క్రీడల్లో భారత్ స్థాయిని మరింత పెంచే దిశగా పలు ఆలోచనలను పంచుకున్న వీరంతా అందుకు తగిన విధంగా రూట్ మ్యాప్ కోసం తమ వంతు సూచనలు అందించారు. ముఖ్యంగా 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో భారత్ పెద్ద సంఖ్యలో పతకాలు సాధించే లక్ష్యంతోపాటు 2036 ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యం ఇచ్చే అంశంపై ఈ కార్యక్రమంలో చర్చ జరిగింది. ఒలింపిక్స్‌ను మన దేశం నిర్వహించాలనే కలకు ఈ చింతన్ శిబిర్ నుంచి తొలి అడుగు పడాలని మాండవియా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో దేశంలో ఉన్న క్రీడా ప్రతిభ వృథా కాకుండా ఉండేందుకు తాము ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.‘ప్రతిభాన్వేషణలో ఖేలో ఇండియా వంటి పథకాలు కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 937 ఖేలో ఇండియా కేంద్రాలు సమర్థంగా పని చేస్తున్నాయి. 9–14 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఆటగాళ్లను గుర్తించి తీర్చిదిద్దితే ఒలింపిక్స్‌లో మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు సాంకేతికతను వాడుకోవడం కూడా కీలకాంశం. దీని కోసం ప్రభుత్వం ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. ఆటగాళ్ల వివరాలను ఒకే చోట నమోదు చేసి ప్రత్యేక ఐడీలు ఇవ్వబోతున్నాం. అలా చేస్తే వారిని తగిన రీతిలో ప్రోత్సహిస్తూ పురోగతిని పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది’ అని మాండవియా వెల్లడించారు. ఒలింపిక్ మిషన్ కోసం జాతీయ క్రీడా సమాఖ్యలు మరింత సమర్థంగా పని చేయాల్సి ఉంటుందన్న కేంద్ర మంత్రి... ఆటగాళ్ల సెలక్షన్స్‌లో పారదర్శకత పాటిస్తే తల్లిదండ్రులు మరింత పెద్ద సంఖ్యలో తమ పిల్లలను క్రీడల వైపు తీసుకొస్తారని విశ్లేషించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారంతా క్రీడాభివృద్ధి కోసం తమ సలహాలు అందించారు. దేశవ్యాప్తంగా జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్లను ఏర్పాటు చేయాలని, అందుబాటులో ఉన్న స్టేడియంలు తదితర మౌలిక సౌకర్యాలను సమర్థంగా వాడుకునేలా చూడాలని వారు సూచించారు. -
సీఈఏ పదవీ కాలం పొడిగింపు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి అనంత నాగేశ్వరన్ పదవీకాలాన్ని కేంద్రం మరో రెండేళ్ల పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో నాగేశ్వరన్ మార్చి 31, 2027 వరకు పదవిలో కొనసాగనున్నారు. కేవీ సుబ్రమణియన్ స్థానంలో 2022, జనవరి 28న సీఈఏగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. వివిధ ఆర్థిక విధానాలపై ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడంతో పాటు కేంద్ర బడ్జెట్‌కు ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టే ఆర్థిక సర్వేను రూపొందించడం సీఈఏ కార్యాలయం ప్రధాన బాధ్యత. నాగేశ్వర్ సీఈఏగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు 2019 నుంచి 2021 వరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలిలో పార్ట్‌టైం సభ్యుడిగా పనిచేశారు. భారత్, సింగ్‌పూర్‌లో అనేక బిజినెస్ స్కూల్స్‌లో బోధించారు. నాగేశ్వరన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ డిగ్రీని పొందారు. 1994లో మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం నుంచి ఫైనాన్స్‌లో డాక్టరేట్ పట్టా అందుకున్నారు. -
బీఎస్ఎన్ఎల్ లాభాల సిగ్నల్
న్యూఢిల్లీ: టెలికం రంగ ప్రభుత్వ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో రూ. 262 కోట్ల నికర లాభం ఆర్జించింది. వెరసి సుమారు 17 ఏళ్ల తదుపరి తిరిగి లాభాల్లోకి ప్రవేశించినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలియజేశారు. ఇది ప్రస్తావించదగ్గ కీలక మలుపు అంటూ వ్యాఖ్యానించారు. బీఎస్ఎన్ఎల్ ఇంతక్రితం 2007లో మాత్రమే త్రైమాసికవారీగా లాభాలు ఆర్జించడం గమనార్హం! కంపెనీకిది అతిముఖ్యమైన రోజుగా సింధియా పేర్కొన్నారు. కంపెనీ కొంతకాలంగా సరీ్వసులను విస్తరించడంతోపాటు వినియోగదారులను పెంచుకోవడంపై దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. బీఎస్ఎన్ఎల్ మొబిలిటీ, ఫైబర్ టు హోమ్(ఎఫ్టీటీహెచ్), లీజ్డ్ లైన్ సరీ్వసులలో 14–18 శాతం వృద్ధిని సాధించినట్లు సిందియా తెలిపారు. మరోవైపు సబ్స్క్రయిబర్ల సంఖ్య సైతం 2024 డిసెంబర్లో 9 కోట్లకు ఎగసినట్లు వెల్లడించారు. జూన్‌లో ఈ సంఖ్య 8.4 కోట్లు మాత్రమే. -
పట్టు చీరల వనం.. ధర్మవరం
సాక్షి, పుట్టపర్తి : మగువలు మెచ్చే పట్టు చీరలు.. వివాహం కోసం ప్రత్యేకంగా చీరలు, ఫంక్షన్లలో స్పెషల్ లుక్కుతో ఆకట్టుకునే డిజైన్లు తయారీలో ధర్మవరం నేతన్నలు ఆరితేరిపోయారు. తరతరాలుగా మగ్గాల పైనే తమ నైపుణ్యాన్ని రంగరించి రకరకాల పట్టుచీరలు తయారు చేస్తున్నారు. సింగిల్ త్రెడ్, డబుల్ త్రెడ్, వెండి జరీ, బంగారు జరీ చీరలు, జాకాడీ డిజైన్లతో అత్యద్భుతంగా నేసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నైతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. రాష్ట్రంలో 28 వేల మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతంగా ధర్మవరం పట్టణం ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఇక్కడి పట్టు మార్కెట్లో సగటున వారానికి రూ.100 కోట్ల వరకు పట్టుచీరల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ధర్మవరం పట్టణ విశిష్టతను గుర్తించి భారత ప్రభుత్వం ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్)ను ఇవ్వడం నేతన్నల ప్రతిభకు గర్వ కారణంగా చెప్పవచ్చు. శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరంతో పాటు కొత్తచెరువు, గోరంట్ల, బుక్కపట్నం, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం ప్రాంతాల్లోనూ మగ్గాలు ఉన్నాయి. ధర్మవరంలో మగ్గాలతో పాటు 18 చేనేత అనుబంధ రంగాల ద్వారా సుమారు లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా డిజైన్లు మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా ధర్మవరంలోని డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్తరకాల డిజైన్లు రూపొందిస్తున్నారు. ధర్మవరంలో పట్టుచీరల డిజైన్లు రూపొందించడంలో సుమారు వందమంది మంచి నైపుణ్యం సంపాదించారు. వివాహాలు, ఇతర శుభకార్యాల దగ్గర నుంచి సినీ మోడళ్లు, సెలబ్రిటీల వరకు వినూత్న డిజైన్లను తయారు చేస్తున్నారు. ఒక్కో పట్టు చీర రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉంటుంది. బంగారం తాపడంతో పట్టుచీరలు తయారు చేయడం ధర్మవరం నేతన్నల ప్రత్యేకం. విదేశాలకు ఎగుమతులు ధర్మవరంలో తయారైన పట్టుచీరలు ఇతర రాష్ట్రాలతో పాటు అమెరికా, సౌదీ అరేబియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రంలో తయారైన పట్టుచీరలకు ధర్మవరం పట్టుమార్కెట్ ప్రధానం. ధర్మవరం పట్టణంలో సుమారు రెండు వేల పట్టుచీరల దుకాణాలు ఉన్నాయి. ఈ సిల్క్ షాపుల ద్వారా నేతన్నల వద్ద పట్టుచీరలను కొనుగోలు చేసి, ఆపై షోరూంలకు హోల్‌సేల్‌గా ఎగుమతి చేస్తారు. వారానికి రూ.వంద కోట్ల వ్యాపారం సగటున ధర్మవరం నేసేపేటలోని మార్కెట్లో వారానికి రూ.100కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అంచనా. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ధర్మవరం పట్టణాన్ని, చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని నేతన్నలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదరణ కరువైందని.. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఏటా నేతన్న నేస్తం పథకం కింద ఏటా రూ.24వేల లబ్ధి చేకూరేదని వివరించారు. ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు ధర్మవరం నేతన్న ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం గత 2014లో ధర్మవరం పట్టుచీరలు, పావుడాలకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఇచి్చంది. దీని ద్వారా ధర్మవరం పట్టుచీర డిజైన్లు ఎక్కడా తయారు చేయకూడదు. ఒక వేళ ఇతరప్రాంతాల్లో ధర్మవరం నేతన్నల డిజైన్లు నేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.విమానాశ్రయం వస్తే బాగుంటుంది శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు తర్వాత ధర్మవరంలో చేనేత రంగం మరింత వృద్ధి చెందింది. అయితే పుట్టపర్తిలో విమానాశ్రయం ఆధునీకరించి.. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తే.. వివిధ దేశాలకు పట్టుచీరల ఎగుమతులు సులభమవుతాయి. మన దేశ పట్టును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఫలితంగా వ్యాపారం మరింత ఊపందుకుంటుంది. – రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం ఆధునిక ఫ్యాషన్‌కు అనుగుణంగా డిజైన్లు ప్రస్తుత ఫ్యాషన్ పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్లు ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నాం. మేము తయారు చేసే చీరలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, ఎక్కువగా అమెరికా, సౌదీ దేశాలకు పంపుతుంటాం. పట్టుచీరల్లో నేను తయారు చేసిన డిజైన్లకు రాష్ట్ర స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో ఒక అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. – నాగరాజు, క్లస్టర్ డిజైనర్, ధర్మవరంగణాంకాలు ఇలా... చేతి మగ్గాలు : 28 వేలు పట్టుచీరల దుకాణాలు : 2వేలు మగ్గాలపై ఆధారపడ్డ కుటుంబాలు : 30 వేలు మగ్గాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు : లక్ష మంది అనుబంధ రంగాల ద్వారా : మరో 20 వేల మందికి ఉపాధి రోజుకు పట్టుమార్కెట్ సగటు టర్నోవర్ : రూ.7 కోట్లు శుభకార్యాల సీజన్లో వారంలో పట్టుచీరల లావాదేవీలు : రూ.100 కోట్లు -
సాగుకు ఊతమేది?
భారత్‌ను అభివృద్ధి పథంలో పయనింపజేసే కీలకమైన నాలుగు ఇంజిన్లలో వ్యవసాయం ఒకటని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వ్యవసాయ అభివృద్ధి– ఉత్పాదకతల్లో సాధించే ప్రగతి... గ్రామీణ భారతం తిరిగి పుంజుకోవ డానికీ, సౌభాగ్యవంతం కావడానికీ దారితీస్తుందని ఆమె 2025–26 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. కానీ అందుకు తగిన కేటా యింపులు చేయడం మాత్రం మరిచారు. భూతాపం పెరుగు తున్న నేపథ్యంలో ప్రకృతిలో సంభవిస్తున్న వాతావరణ ప్రతి కూల ప్రభావాలు, అతివృష్టి, అనావృష్టి, సారం లేని నేలలు, నాణ్యత లేని విత్తనాలు వల్ల సగటు రైతులు పంట దిగుబడిలో తీవ్ర మార్పులు ఎదుర్కొంటున్నారు. బడ్జెట్లో ఈ పరిస్థితి నుంచి వారిని బయటపడవేయడానికి ఎట్లాంటి నిధులూ లేవు. ఈ ఏడాది వ్యవసాయ బడ్జెట్ రూ. 1,27,290.16 కోట్లుగా ప్రకటించారు. ఇది 2024–25లో రూ.1,22,528 కోట్లు, 2023–24లో రూ. 1,16,788 కోట్లుగా ఉంది. 2025–26 మొత్తం బడ్జెట్ అంచనా (బీఈ) రూ. 50,65,345 కోట్లు. అంటే వ్యవసాయానికి మొత్తం బడ్జెట్లో ఇచ్చింది కేవలం 2.51 శాతం మాత్రమే అన్నమాట. వ్యవసాయం, వ్యవసాయ పరిశోధన, చేపలు, పాడి పశువుల శాఖలకు కలిపి మొత్తం రూ. 1,45,300.62 కోట్లు. గత ఏడాది ఇది రూ. 1,39,607.54 కోట్లుగా ఉంది. వ్యవసాయ పరి శోధనకు గతేడాది రూ. 9,941.09 కోట్లు ఇస్తే ఈసారి రూ. 10,466.39 కోట్లు కేటాయించారు (పెరుగుదల 5.2 శాతం).ఆశ్చర్యంగా, పంటల దిగుబడి ప్రభుత్వ లెక్కలలో పెరుగుతోంది. అననుకూల పరిస్థితుల వల్ల కేరళ రాష్ట్రంలో 3 పంటలు పండించే ప్రాంతంలో ఒకే పంట వేస్తున్నారు. గత 10 ఏండ్లలో వేల ఎకరాల వ్యవసాయ భూమి రోడ్లకు, ఇంకా ఇతర అభివృద్ధి పనులకు మళ్ళింది. దాదాపు 100 నదులు ఎండిపోయాయి. ఇవేవీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పంటల దిగుబడి మీద వ్యతిరేక ప్రభావం చూపకపోగా... దిగుబడి పెర గడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పంటల విలువ పెరిగింది అని ఆర్థిక సర్వే చెబుతున్నది. అంటే ధరలు పెరిగినాయి. దీని వలన రైతుల ఆదాయం పెరగలేదు. కాగా ఆహార వస్తువుల ధరలు పెరిగాయి. అందువల్ల సాధారణ పౌరులకు అనేక పంట ఉత్పత్తులు అందుబాటులోకి రాకుండా పోతున్నాయి.ఆర్థిక మంత్రి తన 2024–25 బడ్జెట్ ప్రసంగంలో 9 ప్రాధాన్యాలను ప్రస్తావించారు. వ్యవసాయంలో దిగుబడి పెంచడం, వ్యవసాయాన్ని దృఢంగా సవాళ్ళను ఎదుర్కునే విధంగా తయారు చేయటం వంటివి ఇందులో ఉన్నాయి. అయితే ఏడాది గడిచేటప్పటికి ఈ ప్రాధాన్యాలు మరిచి పోయారు. పశుగణ అభివృద్ధికి, మత్స్య రంగానికి కలిపి రూ. 7,544 కోట్ల కేటాయింపు జరిగింది. వ్యవసాయ రంగ పెరుగు దలలో ఆర్థిక సర్వే కీలకంగా గుర్తించిన ఈ రెండు రంగాల మీద ప్రభుత్వం బడ్జెట్ పెరుగుదల 5 శాతం లోపే. మొత్తం బడ్జెట్ దిశ మారలేదు. ఈ రంగాల అభివృద్ధిని నిలువరిస్తున్న మౌలిక అంశాల మీద మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రధానంగా నీటి వనరుల కాలుష్యం, పశువులకు దొరకని దాణా వంటి అంశాల మీద దృష్టి లేనే లేదు. వ్యవసాయ పరిశోధనలకు రూ. 9,504 కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖ ఆఫీసు ఖర్చులు 167 శాతం పెంచిన ప్రభుత్వం, ‘ప్రధాన మంత్రి పంటల బీమా పథకా’నికి 13 శాతం కోత విధించింది. ఈ సారి ఇచ్చింది కేవలం రూ. 13,625 కోట్లు మాత్రమే. ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో, నకిలీ విత్తనాల బారిన పడి, రైతులకు పంట నష్టం పెరుగుతుంటే ఆదుకునే ఒకే ఒక్క బీమా పథకం తగ్గించడం శోచనీయం.రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీల కొరత, వ్యవ సాయ కూలీ భారం వంటి అంశాల మీద ఆర్థిక సర్వేతో పాటు బడ్జెట్ కూడా ప్రస్తావించలేదు. గ్రామీణ భారతంలో ఉన్న భూమి లేని వారి ఉపాధికి, దాని రక్షణకు కేటాయింపులు లేవు. గ్రామీణ శ్రామిక శక్తికి అవసరమైన వసతుల కల్పనకు, సంక్షేమానికి, ఉపాధి రక్షణకు నిధులు మృగ్యం. వ్యవసాయంతో గ్రామీణ శ్రామిక శక్తి అనుసంధానం గురించిన కేటాయింపులు లేవు. పెరుగు తున్న ఉష్ణోగ్రతల వల్ల శ్రామికుల ఉత్పాదకత శక్తి పడి పోతున్నది. ఆహార ద్రవ్యోల్భణం వల్ల సరైన పరిమాణంలో పౌష్టిక ఆహారం శ్రామిక కుటుంబాలకు అందడం లేదు. ఈ సమస్యలను ప్రభుత్వం గుర్తించకపోవటం దురదృష్టకరం.భారత ప్రభుత్వం పెరుగుతున్న ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల మీద ఖర్చు చేయడం లేదు. కరోనా లాంటి కష్టకాలంలో ఉపాధి ఇచ్చి ఆదుకున్న వ్యవసాయానికి కాకుండా ఇతర రంగాలకు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధమైంది. వ్యవసాయంలో ఉపాధిని తగ్గించే డిజిటలీకరణకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. పెరుగుతున్న భూతాపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోక పోగా హాని కలిగించే పనుల మీద దృష్టి సారించడం మంచిది కాదు. కేంద్ర బడ్జెట్లో తీవ్ర మార్పులు అవసరం ఉన్నాయి. దార్శనిక నిధుల కేటాయింపుల అవసరం ఎంతైనా ఉంది.డా‘‘ దొంతి నరసింహారెడ్డి వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు -
కెనడాలో ఆలయంపై దాడి.. భారత్ తీవ్ర ఆందోళన
ఢిల్లీ: కెనడాలో ఆలయంపై దాడి జరిగిన నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రత గురించి కేంద్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కెనడాలో భారతీయుల భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. కెనడాలోని అంటారియో ప్రావిన్స్‌లోని బ్రాంప్టన్‌లోని ఒక హిందూ దేవాలయంలో జరిగిన సంఘటనపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు.‘‘ఉగ్రవాదులు, వేర్పాటువాదులు చేస్తున్న హింసాత్మక చర్యలను ఖండిస్తున్నాం. అన్ని ప్రార్థనా స్థలాలకు తగినంత రక్షణ ఉండేలా చూడాలని కెనడాకు పిలుపునిచ్చింది. హింసకు పాల్పడే వారిపై విచారణ జరుగుతుందని కూడా మేం భావిస్తున్నాం. భారత ప్రభుత్వం.. కెనడా దేశంలో భారత పౌరుల భద్రత, భద్రత గురించి తీవ్ర ఆందోళనగా ఉంది. భారతీయ, కెనడియన్ పౌరులకు కాన్సులర్ సేవలను అందించే చర్యలు కొనసాగుతున్నాయి. ఆలయం లోపల సహాయక చర్యలకు శిబిరం నిర్వహించాం’’అని తెలిపారు.చదవండి: హిందూ ఆలయంపై ఖలిస్తానీ మద్దతుదారుల దాడి -
సైనిక విమాన తయారీకి ఊపు
మూడేళ్ల క్రితం యూరప్ కంపెనీ ‘ఎయిర్‌బస్’తో 56 సి–295 రవాణా విమానాలను కొనడానికి భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో 16 స్పెయిన్‌లో తయారవుతాయి, మిగతా 40 ఇండియాలో ‘టాటా’(టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. సైనిక రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం ఉపాధికి కూడా తోడ్పడుతుంది. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద తొలి సి–295 విమానం 2026లో అందుబాటులోకి రానుంది. మొత్తం 40 విమానాలను 2031కల్లా అందించడం ద్వారా టీఏఎస్ఎల్ తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది.భారత వైమానిక దళానికి చెందిన పాత అవ్రో విమానాల స్థానంలో 56 సి–295 రవాణా విమానాలను కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ 2021 సెప్టెంబర్ లో రూ. 21,935 కోట్ల ఒప్పందంపై సంతకాలు చేసింది. ‘ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్’తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ప్రకారం, మొదటి 16 విమానాలను స్పెయిన్‌లోని సెవిల్లెలో దాని తుది అసెంబ్లింగ్ (విడిభాగాల కూర్పు) కేంద్రం నుంచి సరఫరా చేయాల్సి ఉంది. మిగతా 40 విమానాలను భారత్, స్పెయిన్ కుదుర్చుకున్న పారిశ్రామిక భాగస్వామ్య ఒప్పందం ప్రకారం మన దేశానికి చెందిన టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) తయారు చేస్తుంది. భారత్‌లో రవాణా విమానాల తయారీకి ఈ తరహా సహకారం ఇదే మొదటిది. ప్రధాని మోదీ 2022 అక్టోబర్ 30న గుజరాత్‌లోని వడోదరలో టీఏఎస్ఎల్ చివరి దశ విడిభాగాల కూర్పు సదుపాయానికి శంకు స్థాపన చేశారు. అప్పటి ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధురీకి 2023 సెప్టెంబర్ 13న స్పెయిన్‌లోని సెవిల్లెలో తొలి విమానాన్ని అందజేశారు. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ విమానం 2023 సెప్టెంబర్ 25న హిందాన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో లాంఛనంగా భారత వైమానిక దళంలో చేరింది. ‘రైనోస్’ అని కూడా పిలిచే ఐఏఎఫ్ 11 స్క్వాడ్రన్ ఇప్పటికే ఆరు సి–295 విమానాలను నడుపుతోంది.తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీసి–295 బహుళ ప్రాయోజక సైనిక రవాణా విమానంగా రుజువు చేసుకుంది. 9.5 టన్నుల పేలోడ్, 70 మంది ప్రయాణికులు లేదా 49 మంది పారాట్రూపర్లను తీసుకెళ్లగల సామర్థ్యంతో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) శక్తిని గణనీయంగా పెంచింది. పగలు, రాత్రి తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ నడిచే సామర్థ్యం ఉన్న ఈ విమానాన్ని ప్రపంచవ్యాప్తంగా వివిధ వైమానిక దళాలు ఉప యోగిస్తున్నాయి. ఇంకా పలు సామర్థ్యాలు ఎయిర్‌బస్ సి–295 సొంతం. సైనిక రవాణా, ఆకాశమార్గంలో రవాణా, పారాట్రూపింగ్, వైద్య సహాయం కోసం తరలింపు, సముద్రప్రాంత గస్తీ, జలాంత ర్గాములను ఎదుర్కొనే యుద్ధ పరికరాలు, పర్యావరణ పర్యవేక్షణ, సరిహద్దు పహారా, వాటర్ బాంబర్, గాలి పరంగా ముందస్తు హెచ్చరి కలు వంటి విస్తృత శ్రేణి మిషన్ లలో ఇది సమర్థంగా పని చేస్తుంది.స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో శాంచెజ్‌తో కలిసి మోదీ అక్టోబర్ 28న వడోదరలో టీఏఎస్ఎల్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. దేశంలో ఇదే తొలి ప్రైవేట్ సైనిక విమాన తయారీ కేంద్రం. మేక్ ఇన్ ఇండియా కింద తయారు చేసే తొలి సి–295 విమానం 2026 సెప్టెంబర్‌లో అందుబాటులోకి రానుంది. చివరి విమానం 2031 ఆగస్టు నాటికి అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్ట్ దేశంలో విమాన రంగ అభివృద్ధికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇందులో దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న అనేక ఎంఎస్ఎంఈలు విమానాల విడి భాగాలను అందిస్తాయి. ఇప్పటికే 33 ఎంఎస్ఎంఈలను ఎయిర్‌బస్ గుర్తించింది. హైదరాబాద్‌లోని టీఏఎస్ఎల్ ప్రధాన కేంద్రంలో విమా నాల విడిభాగాల తయారీ ప్రారంభమైంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమి టెడ్ (బీఈఎల్), భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అందించిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ (ఈడబ్ల్యూ) వ్యవస్థలను ఇప్పటికే విమానంలో అనుసంధానం చేశారు. అయితే, ఒప్పంద చర్చల తుది దశలో ఎక్కువ కాలం జాప్యం కావడంతో వీటిని అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. పెరిగే ఉపాధి కల్పనతాజా ప్రయత్నం వైమానిక రంగంలో ఉపాధి కల్పనను పెంచు తుందని రక్షణ శాఖ చెబుతోంది. దేశంలో ఏరోస్పేస్, రక్షణ రంగంలో 42.5 లక్షలకు పైగా పనిగంటలతో ప్రత్యక్షంగా 600 అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలకు, 3,000కు పైగా పరోక్ష ఉద్యోగాలకు, అదనంగా 3,000 మధ్యతరహా నైపుణ్య ఉపాధి అవకా శాలకు వీలు కలుగుతుంది. ఇతర ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ దారుల (ఓఈఎం) నుంచి ఎయిర్‌బస్ తెప్పించే ఏరో ఇంజిన్, ఏవి యానిక్స్ మినహా అధిక శాతం నిర్మాణ భాగాలు భారత్‌లోనే తయారవుతాయి. ఒక విమానంలో ఉపయోగించే 14,000 విడి భాగాలలో 13,000 భాగాలు దేశంలోని ముడిసరుకుతోనే తయారవుతాయి. అయితే టీఏఎస్ఎల్ సకాలంలో 40 విమానాలను తయారు చేయడమే అసలైన పరీక్ష. ఇప్పటివరకు చాలా కార్యకలాపాలు ఎయిర్‌బస్ ద్వారా జరుగుతున్నాయి. టీఏఎస్ఎల్ కేవలం వాటిని అమలు చేస్తోంది. భారత వైమానిక రంగ సుస్థిర వృద్ధి కోసం స్థానిక ఉత్పత్తి, డీజీ ఏక్యూఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ ఎష్యూరెన్స్) ద్వారా నాణ్యత నియంత్రణ, ‘సెమిలాక్’ ద్వారా భవిష్యత్తు ధ్రువీకరణ, దేశీయ తనిఖీ పరీక్షలు, మూల్యాంకనంపై దృష్టి సారించాలి.రక్షణ రంగం అంచెలంచెలుగా ఎదగడానికి గత పదేళ్లలో భారత ప్రభుత్వం చేసిన కృషి దోహదపడింది. రూ. 43,726 కోట్ల నుంచి రూ. 1,27,265 కోట్లకు పెరిగిన రక్షణ ఉత్పత్తుల్లో 21 శాతం వాటా ప్రైవేటు రంగానిదే. పదేళ్ల క్రితం రూ.1,000 కోట్ల లోపు ఉన్న రక్షణ ఎగుమ తులు గత ఏడాది రూ. 21,000 కోట్లకు పైగా పెరిగాయి. కొన్ని విధాన సంస్కరణలతో పాటు మూలధన పరికరాల కొనుగోలు కోసం డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్స్ – 2020లో స్వదేశీ డిజైన్, డెవలప్మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఐడీడీఎం) కేటగిరీకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఈ గణాంకాలను సాధించడానికి దోహదపడింది. కొత్తగా కేటాయించిన రక్షణ బడ్జెట్లో 75 శాతాన్ని దేశీయ పరిశ్రమల ద్వారా కొనుగోళ్లకు కేటాయించారు. జాయింట్ యాక్షన్ (శ్రీజన్) పోర్టల్ ద్వారా స్వయం సమృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం, సానుకూల స్వదేశీకరణ జాబితాలు (పీఐఎల్), ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్స్‌లెన్స్ (ఐడీఈఎక్స్) ఏర్పాటు, 2024 సెప్టెంబర్ నాటికి రూ. 50,083 కోట్ల పెట్టుబడి అంచనాతో ఉత్తరప్రదేశ్, తమిళనాడుల్లో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు వంటి అనేక ఇతర చర్యలను ప్రభుత్వం తీసుకుంది. 2013 మేలో రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ) జారీ చేసిన తరువాత ఎయిర్‌బస్‌తో ఒప్పందం కుదుర్చు కోవడానికి రక్షణ మంత్రిత్వ శాఖకు ఆరేళ్ళు పట్టింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడానికి, ఒప్పందం తదుపరి చర్చలకు ఇంకా చాలా చేయాల్సి ఉంది.దేశంలో సి –295 సైనిక రవాణా విమానాల ఉమ్మడి తయారీలో ఎయిర్‌బస్ – టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) భాగ స్వామ్యం ఇప్పటివరకు సవాళ్లను ఎదుర్కొంటున్న భారత వైమానిక రంగానికి ఆశ, ప్రేరణగా నిలుస్తోంది. అయితే సివిల్ సర్టిఫైడ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉన్నందున ఈ ఎయిర్ క్రాఫ్ట్ వెర్షన్లను టీఏఎస్ఎల్ విస్తరిస్తుందో లేదో చూడాలి. ఈ భాగస్వామ్యం పూర్తి ప్రయోజనాలను పొందడానికి దేశంలో ఉత్పత్తి, భవిష్యత్తు ఎగుమ తులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆత్మనిర్భరత సాధన దిశగా భవిష్యత్ ప్రయాణం క్లిష్టంగా అనిపించినప్పటికీ, ఎయిర్‌బస్, టీఏ ఎస్ఎల్ మధ్య ఈ భాగస్వామ్యం ద్వారా అడుగులు ముందుకు పడ్డాయి. టీఏఎస్ఎల్ నిర్ణీత సమయానికి 40 విమానాలను తయారు చేయడం ద్వారా తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే ఈ తరహా భాగస్వామ్యాల విషయంలో ప్రభుత్వ రంగం ఐఏఎఫ్ అంచనాలను అందుకోలేదన్నది గత అనుభవాలు చెబుతున్న పాఠం. మరి ఈ ఒప్పందం సఫలమైతే దేశంలో ప్రైవేట్ రంగ భాగ స్వామ్యం మరింత ప్రబలమవుతుంది. వాటి సహకారం లేకుండా 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కల నెరవేరదు.అనిల్ గోలానిఎయిర్ వైస్ మార్షల్ (రిటైర్డ్) వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్అడిషనల్ డైరెక్టర్ జనరల్ -
ఢిల్లీ కాలుష్యం: కేంద్రంపై సుప్రీం అసహనం
ఢిల్లీ: ఢిల్లీలో కాలుష్యం పెరిగి గాలి నాణ్యత క్షిణించటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఢిల్లీలో కాలుష్యానికి దారితీసే పొరుగు రాష్ట్రాల్లో భారీగా పంట వ్యర్థాలను తగులబెట్టటంపై సుప్రీం కోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని సవరణల ద్వారా పళ్లు లేని చట్టంగా మార్చడంపై కేంద్రాన్ని నిలదీసింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఐశ్వర్య భాటి స్పందిస్తూ.. 10 రోజుల్లో నిబంధనలను ఖరారు చేస్తామని, చట్టం అమలులోకి వస్తుందని కోర్టుకు తెలిపారు.‘‘మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లుతున్నాం. ఈ అంశంలో కేంద్రం ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయలేదు. పర్యావరణ పరిరక్షణ చట్టం శక్తిలేని చట్టంగా మార్చారు. శిక్ష నుంచి విముక్తి పొందటం కోసం సెక్షన్ 15 తీసుకువచ్చారు. పెనాల్టీ విధింటం కూడా కేంద్ర పభుత్వానికి సాధ్యం కావటం లేదు’’ సుప్రీంకోర్టు అహనం వ్యక్తం చేసింది.Air Pollution: Supreme Court takes strong exception on Punjab and Haryana governments not taking any action against people for stubble burning.Supreme Court says if these governments are really interested in implementing the law there will have been at least one prosecution.… pic.twitter.com/ykmhWlza4g— ANI (@ANI) October 23, 2024 పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాల కార్యదర్శి (పర్యావరణ), అదనపు ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం)కి షోకాజ్ నోటీసులు అందజేశామని ఏఎస్జీ తెలిపారు. 10 రోజుల్లో, సెక్షన్ 15 పూర్తిగా అమలు చేయబడుతుందని అన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం పర్యావరణాన్ని పరిరక్షించడానికి సిద్ధంగా ఉంటే.. సెక్షన్ 15కి సవరణకు ముందే చర్యలు తీసుకునేవాళ్లు. కానీ, ఇదంతా రాజకీయం కోసమే చేస్తున్నారు తప్ప మరేమీ చేసిందేమీ లేదని సుప్రీం కోర్టు పేర్కొంది. -
కాల పరీక్షలో మన విదేశీ సంబంధాలు
దశాబ్దాలుగా భారతీయులకు, ప్రత్యేకించి పంజాబ్ నుండి వలస వెళ్తున్నవారికి కెనడా చేరుకోవలసిన ప్రదేశంగా ఉంటోంది. అంతేకాదు, భారత్ అణు సామర్థ్యాన్ని పెంపొందించుకోవడంలో సహాయపడే వ్యూహాత్మక భాగస్వామి కెనడా. అటువంటి దేశంతో భారత్ సంబంధాలు ఎందుకు క్షీణిస్తున్నట్లు? కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తమ సిక్కు పౌరులను భారత్ హత్య చేయిస్తుందని ఆరోపించడం, దాదాపు అటువంటి ఆరోపణనే అమెరికా కూడా చేయడం వాతావరణాన్ని వేడెక్కించింది. ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది... కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఈ అంశంపై బహిరంగ ప్రకటనకు ఎందుకు వెళ్లాయి? రెండవది... భారతదేశంపై ఇలా ఆరోపణలు మోపడం ఎక్కడదాకా వెళ్ళి ఆగుతుంది?గత దశాబ్దంలో ప్రపంచ వలస ప్రస్థానాలకు చెందిన ఒక ముఖ్యమైన కథ ఏమిటంటే... భారతీయ వలసలు గణనీయంగా పెరగడం. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, సింగపూర్ నుంచి దుబాయ్ వరకు, పోర్చుగల్ నుంచి ఇజ్రాయెల్ వరకు భారతీయుల వలసలు నానాటికీ పెరుగుతున్నాయి. 2014లో కెనడాలో కేవలం 38,364 మంది భారతీయులు శాశ్వత పౌరులుగా మారారు. 2022 నాటికి ఈ సంఖ్య ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిలో 1,18,095కి చేరుకుంది. దీనికి విరుద్ధంగా, 2022లో కేవలం 30 వేల మంది చైనీయులు మాత్రమే కెనడాకు తరలి వెళ్లారు. దశాబ్దాలుగా భారతీయులకు, ప్రత్యేకించి పంజాబ్ నుండి వలస వచ్చిన వారికి కెనడా చేరుకోవలసిన ప్రదేశంగా ఉంటోంది. పైగా, భారతదేశ అణు సామర్థ్యాన్ని పెంపొందించడంలో సహాయపడే వ్యూహాత్మక భాగస్వామి కెనడా. అలాంటప్పుడు, రెండు దేశాల మధ్య సంబంధాలు ఎందుకు మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి పడిపోయాయి?భారతదేశం, ఆంగ్లోస్పియర్ (ఇంగ్లిష్ భాష, సంస్కృతి ప్రధానంగా ఉండే) దేశాల మధ్య సమస్య ఉందని స్పష్టమవుతోంది. విదే శాంగ విధానం, జాతీయ భద్రతతో స్వప్రయోజనాలు నెరవేర్చేందుకు దేశీయ రాజకీయ వ్యూహాలను ట్రూడో మిళితం చేశారని భారత అధి కారులు అభియోగాలు మోపారు. ట్రూడోకి కెనడియన్ సిక్కుల ఓటు అవసరం కాబట్టి వారి ఖలిస్తానీ ఆకాంక్షలకు అనుగుణంగా ఉన్నారు; ఆయన ప్రభుత్వం డ్రగ్ పంపిణీదారులు, భారత వ్యతిరేక ఉగ్రవాదు లకు ఆశ్రయం ఇస్తోందనీ వీరు ఆరోపించారు. దీనికి ప్రతిగా కెనడా పౌరులను హత్య చేయడానికి భారత ఇంటెలిజెన్స్ అధికారులు, దౌత్య వేత్తలు కుట్ర పన్నారని ట్రూడో ప్రభుత్వం ఆరోపించింది.మరోవైపు అమెరికా ఈ వివాదంలోకి అడుగుపెట్టి, కెనడియన్ సిక్కు హత్యను, అమెరికన్ సిక్కుపై ఇదే విధమైన ప్రయత్నానికి ముడి పెట్టింది. దీంతో దౌత్యపరమైన గందరగోళం ప్రారంభమైంది. త్వర లోనే ఇది పెద్ద గొడవగా మారి పరాకాష్ఠకు చేరింది. కెనడా, అమెరికా, బ్రిటన్లలో ఖలిస్తానీ అనుకూల క్రియాశీలత గురించి భారత్ ఫిర్యాదు... దేశీయ భద్రతా సమస్యలపై ఆధారపడింది. పాశ్చాత్య ప్రభుత్వాలు భారతదేశ ఆందోళనల పట్ల సున్నితంగా వ్యవహరించడం లేదన్న మోదీ ప్రభుత్వ దృక్పథాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే, దౌత్యవేత్తలు, సీనియర్ ప్రభుత్వ అధికారులతో సహా భారతీ యులకు వ్యతిరేకంగా కెనడా, అమెరికా చేసిన నేరారోపణలు తీవ్రమై నవి. ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొదటిది... కెనడా, అమెరికా ప్రభుత్వాలు ఈ అంశంపై బహిరంగ ప్రకటనకు ఎందుకు వెళ్లాయి? రెండోది... భారత్‌పై ఇలా ఆరోపణలు మోపడం ఎక్కడ దాకా వెళ్ళి ఆగుతుంది? రెండవ ప్రశ్న విషయానికి వస్తే, అమె రికా, కెనడా రెండూ పేర్లను కూడా పేర్కొన్నాయి. పైగా భారతీయు లపైనే తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యతను ఉంచాయి.మొదటి ప్రశ్న ముఖ్యమైనది. ఎందుకంటే కెనడా, అమెరికాలు భారతదేశంతో సహేతుకంగానే మంచి దౌత్య సంబంధాలను కలిగి ఉన్నాయి. పైగా చాలావరకు విచక్షణతో ఇవి విషయాలను నిర్వహించ గలవని ఆశించవచ్చు. మొదటి ప్రశ్నకు సంబంధించి కెనడియన్ సిక్కు ఓటర్లతో ఎన్నికల ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనే ఆశతో ట్రూడో పక్షపాత రాజకీయాలు ఆడుతున్నారనేది భారత ప్రభుత్వ అధికారిక అభియోగం. ‘సరిహద్దు’ ఉగ్రవాద దాడులకు సంబంధించిన ఆరో పణలతో భారత రాజకీయ నాయకులు రాజకీయ పెట్టుబడి పెట్టారని పాకిస్తాన్ ఆరోపిస్తున్న రీతిని ఇది బాగా ధ్వనిస్తోంది. దేశీయ రాజకీ యాలతో జాతీయ భద్రతా సమస్యలను కలపడం రెండు మార్గాలనూ తొలగించివేస్తుంది. పైగా అటువంటి ఆరోపణలను మూడవ పక్షం వారు ఎలా చూస్తున్నారనే అంశంపై జాగ్రత్తగా ఉండాలి. బహుశా, ట్రూడో ప్రభుత్వాన్ని భారతదేశం విస్మరించే స్థాయిలో ఉందనే అభిప్రాయాన్ని కొందరు అర్థం చేసుకోవచ్చు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి ప్రాథమిక ఆరోపణలు వచ్చినప్పుడు న్యూఢిల్లీలో ఇదే ప్రధానమైన అభిప్రాయంగా ఉండేది. తర్వాత, అమెరికా గడ్డపై కూడా, గురుపథ్వ సింగ్ పన్నూన్‌ను చంపడానికి భారత అధికారులు కుట్ర పన్నారని అమెరికా ఆరోపించడమే కాకుండా, చట్టపరమైన చర్యలను కూడా ప్రారంభించడం ద్వారా ముందడుగు వేసింది. ఇదంతా కేవలం స్నేహితుల మధ్య ఉన్న అపార్థం, అపమ్మకాల వ్యవహారమా? లేక దీంట్లో పెద్ద సమస్యలు ఇమిడి ఉన్నాయా? ఇంగ్లిష్ భాషాధిక్య దేశాలైన ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, అమెరికా తమ ’ఫైవ్ ఐస్’ కూటమి ద్వారా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని పంచుకున్న విషయం తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే, ట్రూడో ఎక్కువ ఓట్లను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించడం ఏమంత విశ్వసనీయమైన ప్రతిస్పందనగా అనిపించదు. మరీ ముఖ్యంగా, పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలు తమను లక్ష్యంగా చేసుకుంటున్నాయని భారత ప్రభుత్వం ఎందుకు విశ్వసిస్తోందనే ప్రశ్నను అడిగి తీరాలి.ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్ గత వారం తన విజయదశమి ప్రసంగంలో, పాశ్చాత్య ‘ఉదారవాద, ప్రజాస్వా మ్యాలు’ బంగ్లాదేశ్‌లో చేసినట్లుగా భారతదేశంలో ‘అరబ్ స్ప్రింగ్’ తరహా ‘వర్ణ విప్లవాలను’ ప్రదర్శించాలని యోచిస్తున్నాయని పరోక్షంగా ఆరోపించారు. పాశ్చాత్య ప్రజాస్వామ్య దేశాలతో సంబంధాలను వీక్షిస్తున్న ఈ విధానం భారతీయ విదేశీ, జాతీయ భద్రతా విధానాలకు సంబంధించి పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది.ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన పదవీ కాలంలో చేసిన అనేక ప్రసంగాలలో ‘భారతదేశం బాగుండాలని ప్రపంచం కోరుకుంటోంది, కానీ మన సవాళ్లు స్వదేశంలో ఉన్నాయి’ అని తరచుగా చెప్పే వారు. అంతర్జాతీయ సమాజం, ముఖ్యంగా ఉదారవాద ప్రజాస్వామ్యాలు కలిసి జిహాదీ తీవ్రవాదం, నిరంకుశ చైనా పెరుగుదలపై భారతదేశంలాగే ఆందోళన చెందుతున్నాయనీ, అందువల్లే పాశ్చాత్య ఉదారవాద, ప్రజాస్వామ్య పాలనపై గురిపెట్టిన ఈ రెండు ప్రమాదాలకు వ్యతిరేకంగా భారతదేశం ఎదుగుదలకు అవి మద్దతునిచ్చాయన్న దృక్పథంపై ఈ అంచనా ఆధారపడి ఉంది.ఈ దృక్కోణం మారిందా? భారతదేశం ఇకపై ఆంగ్లోస్పియర్ను ‘మిత్రుడు’గా లేదా కనీసం దాని పురోగతిలో భాగస్వామిగా చూడ లేదా? చైనా, పాకిస్తాన్‌లు రెండింటినీ తన జాతీయ భద్రతకు ప్రమా దకారులుగా ప్రకటించిన భారత్ అదే సమయంలో పశ్చిమ ఉదార వాద ప్రజాస్వామ్యాలను దూరం చేసుకోగలదా? విదేశాంగ విధాన నిర్వాహకులు, జాతీయ భద్రతను నిర్వహించే వారి ఆలోచనల మధ్య తప్పు అమరిక ఏదైనా ఉందా? కెనడా ప్రధాని ట్రూడో ఇలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తారు.కొనసాగుతున్న పశ్చిమాసియా సంఘర్షణలో పెరుగుతున్న అమెరికా ప్రమేయం పెనుమంటగా మారడంతోపాటు భారత ఆర్థిక వ్యవస్థపై తక్షణ పర్యవసానాలను కలిగిస్తుంది. మొత్తంమీద ప్రపంచ పర్యావరణం నేడు భారత ఆర్థికవృద్ధికి, పెరుగుదలకి చాలా తక్కువ అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మోదీ ప్రభుత్వం, సంఘ్ పరివార్లు పశ్చిమ దేశాలపై, వాటి సంస్థలపై క్రమం తప్పకుండా విమర్శలు గుప్పించడం చూస్తే... పశ్చిమ దేశాలతో భారత్ సంబంధాలు పరీక్షకు గురవుతున్నట్లు, విశ్వాస సంక్షోభాన్ని కూడా ఎదుర్కొంటున్నట్లు అనిపిస్తుంది. ట్రూడో వ్యవహారం కేవలం ఒక తీవ్రమైన అనారోగ్యపు లక్షణం కావచ్చు!సంజయ బారువ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు మీడియా సలహాదారు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో...) -
తదుపరి సీజేఐ జస్టిస్ ఖన్నా
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియ మొదలైంది. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ఇందుకు శ్రీకారం చుట్టారు. తన వారసునిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు. కేంద్రం లాంఛనంగా ఆమోదం తెలిపిన అనంతరం జస్టిస్ ఖన్నా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు. నవంబర్ 10న జస్టిస్ చంద్రచూడ్ రిటైరవనున్నారు. అనంతరం 11న జస్టిస్ ఖన్నా సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరు నెలలకు పైగా సేవలందించి 2025 మే 13న రిటైరవుతారు. జస్టిస్ చంద్రచూడ్ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి ఖన్నాయే. సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిగా ఉన్నవారే తదుపరి సీజేఐ కావడం పరిపాటి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లు. జస్టిస్ చంద్రచూడ్ దాదాపు రెండేళ్లుగా సీజేఐగా సేవలందిస్తుండటం తెలిసిందే. తదుపరి సీజేఐ పేరును సూచించాల్సిందిగా కేంద్ర న్యాయ శాఖ గత శుక్రవారం ఆయన్ను అభ్యరి్థంచింది. చరిత్రాత్మక తీర్పులు జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయ కోవిదునిగా పేరొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఈవీఎంలు సురక్షితమైనవని, బూత్‌ల ఆక్రమణ, బోగస్ ఓటింగ్‌లకు చెక్ పెడతాయని స్పష్టం చేయడమే గాక ఎన్నికల్లో వాడకాన్ని సమరి్థస్తూ తీర్పు ఇచ్చారు. వీవీప్యాట్ల ద్వారా ఈవీఎం ఓట్లను నూరు శాతం వెరిఫై చేయాలంటూ దాఖలైన కేసును కొట్టేసిన ఆ ధర్మాసనానికి ఆయనే సారథి. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమైనదంటూ తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యులు. జమ్మూ కశీ్మర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమరి్థంచిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా ఆయన ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీస్‌అథారిటీ (ఎన్ఏఎల్ఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా సేవలందిస్తున్నారు.హైకోర్టు సీజే కాకుండానే... జస్టిస్ ఖన్నా 1960 మే 14న జని్మంచారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్లో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యునిగా నమోదు చేసుకున్నారు. తీస్‌హజారీ జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా కెరీర్ మొదలు పెట్టారు. అనంతరం ఢిల్లీ హైకోర్టుతోపాటు పలు ట్రిబ్యునళ్లలో న్యాయవాదిగా పలు ప్రతిష్టాత్మక కేసులను వాదించి సమర్థునిగా పేరు తెచ్చుకున్నారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఏడాది అనంతరం శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. ఏ హైకోర్టుకూ ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే నేరుగా ఈ ఘనత సాధించిన అతి కొద్దిమందిలో ఒకరిగా నిలిచారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఆర్ ఖన్నాకు ఆయన మేనల్లుడు. 1973లో కేశవానంద భారతి కేసులో మౌలిక నిర్మాణ సిద్ధాంతానికి సంబంధించి చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా సభ్యుడు. ఎమర్జెన్సీ వేళ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు వంటి ప్రాథమిక హక్కులను కూడా సస్పెండ్ చేయవచ్చంటూ 1976లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుతో విభేదించిన ఏకైక సభ్యునిగా ఆయన సుప్రసిద్ధులు. ఈ కారణంగా తనను కాదని జూనియర్‌ను సీజేఐగా నియమించడంతో న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు. చదవండి: పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కన్నెర్ర -
ఉచితాలపై సుప్రీంలో పిటిషన్.. కేంద్రం, ఈసీకి నోటీసులు
ఢిల్లీ: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల ఉచిత హామీలపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా స్పందన కోరుతూ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. బెంగుళూరుకు చెందిన శశాంక్ జె శ్రీధర ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి డీ.వై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కేంద్రానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.ఉచితాలను లంచంగా పరిగణించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు అయింది. ఉచితాల నియంత్రణకు ఈసీ కఠిన చర్యల చేపట్టాలని పిటిషన్ శశాంక్ కోరారు. దీంతో గత దాఖలైన పలు పిటిషన్లతో కలిపి విచారిస్తామన్న సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా చూడాలని పిటిషనర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తక్షణమే సమర్థవంతమైన చర్యలు తీసుకునేలా పోల్ ప్యానెల్‌ను ఆదేశించాలని అభ్యర్థించారు.చదవండి: శంకర్ దయాళ్ శర్మకు గిఫ్ట్‌గా వచ్చిన ఏనుగు.. అసలు ఆ కథేంటి? -
జమిలి ఎన్నికల ఆలోచనను విరమించుకోండి: కేరళ తీర్మానం
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించటంపై ఆలోచనను విరమించుకోవాలని కేరళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం కేరళ అసెంబ్లీలో సీఎం పినరయి విజయన్ ప్రభుత్వం తీర్మానం చేసింది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికం, దేశ సమాఖ్య నిర్మాణానికి హానికరమని తీర్మానంలో పేర్కొన్నారు.Kerala Legislative Assembly passed a resolution urging the central government to withdraw its proposed 'One Nation, One Election' reform, describing it as undemocratic and detrimental to the nation's federal structure.— ANI (@ANI) October 10, 2024కొన్నేళ్ళుగా చెబుతూ వస్తున్న ‘ఒకే దేశం... ఒకే ఎన్నిక’ ప్రతిపాదనపై కేంద్రంలోని అధికార బీజేపీ ఇటీవల మరో అడుగు ముందుకు వేసింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని కమిటీ ఈ ప్రతిపాదనపై ఇచ్చిన నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం లాంఛనంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనపై ఓ బిల్లును రానున్న పార్లమెంట్ శీతకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు భోగట్టా.ఈ ప్రతిపాదనకు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీతో రాజ్యాంగ సవరణలు అవసరం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రతిపాదనను కేంద్రంతో పాటు రాష్ట్రాలూ ఆమోదించాల్సి ఉంటుంది. వెరసి, రాజ్యాంగపరంగానూ, ఆచరణలోనూ అనేక అవరోధాలున్న ఈ ప్రతిపాదనపై రాగల నెలల్లో పెద్దయెత్తున రచ్చ రేగడం ఖాయం. -
నా హత్యకు కుట్ర: పన్నూ
న్యూఢిల్లీ: తనను హత్య చేయడానికి భారత ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపిస్తూ ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల అమెరికా కోర్టును ఆశ్రయించాడు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు ఫర్ సదరన్ డి్రస్టిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌లో దావా వేశాడు. దీనిపై న్యాయస్థానం స్పందించింది. భారత ప్రభుత్వంతోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, భారత నిఘా సంస్థ ‘రా’ మాజీ అధినేత సమంత్ గోయల్, ఉద్యోగి విక్రమ్ యాదవ్, భారత వ్యాపారవేత్త నిఖిల్‌గుప్తాకు తాజాగా సమన్లు జారీ చేసింది.సమన్లు అందుకున్న వ్యక్తులు 21 రోజుల్లోగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 23వ తేదీ దాకా అమెరికాలో పర్యటించనున్నారు. ఇంతలోనే అమెరికా కోర్టు భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గురు పత్వంత్‌సింగ్ పన్నూకు కెనడాతోపాటు అమెరికా పౌరసత్వం ఉంది. ఉగ్రవాది వేసిన దావాపై సమన్లా? గురు పత్వంత్ సింగ్ పన్నూ వేసిన దావాపై తమకు అమెరికా కోర్టు సమన్లు జారీ చేయడం పట్ల భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉగ్రవాది అయిన పన్నూ వేసిన దావాపై భారత ప్రభుత్వానికి సమన్లు జారీ చేయడం పూర్తిగా అసమంజసమని పేర్కొన్నారు. ప్రభుత్వంపై పన్నూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. పన్నూ ప్రాతినిధ్యం వహిస్తున్న ఖలిస్తాన్ సంస్థపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం–1967 కింద నిషేధం అమల్లో ఉందని గుర్తుచేశారు. దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో ఆ సంస్థకు ప్రమేయం ఉందని విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. -
విదేశాల్లో కీలక ఖనిజాలపై ఎన్ఎండీసీ దృష్టి
న్యూఢిల్లీ: విదేశాల్లో కీలక ఖనిజ వనరులపై దృష్టి సారించినట్టు ప్రభుత్వరంగ ఐరన్ ఓర్ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ ప్రకటించింది. పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధన వనరులకు కేంద్రం ప్రాధాన్యం ఇస్తుండడం తెలిసిందే. వీటి కోసం కాపర్, లిథియం, నికెల్, కోబాల్ట్ అవసరం ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వరంగ సంస్థలు విదేశాల్లో ఈ కీలకమైన ఖనిజాల అన్వేషణ అవకాశాలను పరిశీలిస్తుండడం తెలిసిందే. ఇందులో ఎన్ఎండీసీ కూడా ఒకటి. ‘‘లిథియం, కోబాల్ట్, నికెల్ తదితర ఖనిజ అవకాశాలను సబ్సిడరీ సంస్థ లెగసీ ఇండియా ఐరన్ ఓర్ ద్వారా పరిశీలిస్తున్నాం. ఆస్ట్రేలియాలో లిథియం మైనింగ్ కూడా ఈ అన్వేషణలో భాగంగా ఉంది’’అని ఎన్ఎండీసీ తన ప్రకటనలో వివరించింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి 8 మిలియన్ టన్నుల కోకింగ్ కోల్ ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపింది. దీంతో దిగుమతులపై ఆధారపడడం తగ్గుతుందని పేర్కొంది. 2030 నాటికి రెట్టింపు స్థాయిలో 100 మిలియన్ టన్నుల ఐరన్ ఓర్ ఉత్పత్తి లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు చెప్పింది. రూ.2,200 కోట్ల పెట్టుబడులు:‘‘కేవలం ఉత్పత్తి పెంపునకే మా కార్యాచరణ పరిమితం కాదు. బాధ్యతతో చేయడం ఇది. పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించి, సమాజానికి సానుకూల ఫలితాలు అందించేందుకు కట్టుబడి ఉన్నాం’’అని ఎన్ఎండీసీ సీఎండీ అమితవ ముఖర్జీ వివరించారు. 45 మిలియన్ టన్నుల నుంచి 100 మిలియన్ టన్నుల ఉత్పత్తికి విస్తరించేందుకు పెద్ద మొత్తం నిధులు అవసరం పడతాయంటూ.. 2024–25లోనే ఇందుకు రూ.2,200 కోట్లు కేటాయించినట్టు ఎన్ఎండీసీ తెలిపింది. స్లర్నీ పైపులైన్, కొత్త ప్రాసెసింగ్ ప్లాంట్లపై పెట్టుబడులు పెట్టనున్నట్టు, సామర్థ్య విస్తరణకు, పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించేందుకు ఇవి కీలకమని వివరించింది. కేకే లైన్ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా రైలు ద్వారా ఐరన్ ఓర్ రవాణాను విస్తరించనున్నట్టు తెలిపింది. ఐరన్ ఓర్ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునేందుకు వీలుగా బచేలీలో 4 మిలియన్ టన్నుల బెనిఫికేషన్ ప్లాంట్, నాగర్నార్లో 2 మిలియన్ టన్నుల పెల్లెట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించింది. -
మణిపూర్‌లో హింస.. కేంద్రానికి సీఎం బిరేన్ సింగ్ డిమాండ్!
ఇంఫాల్: మణిపూర్‌లో చోటు చేసుకుంటున్న దాడులతో అక్కడి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. జిరిబామ్ జిల్లాలో శనివారం జరిగిన హింసలో ఆరుగురు మృతి చెందారు. దాడుల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతా కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న యూనిఫైడ్ కమాండ్ నియంత్రణ కోసం సీఎం ఎన్ బీరెన్ సింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యూనిఫైడ్ కమాండ్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు, రాష్ట్ర భద్రతా సలహాదారు, సైన్యం నిర్వహిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర భద్రతా సమస్యలను పరిష్కరించడానికి యూనిఫైడ్ కమాండ్ నియంత్రణను సీఎం కోరుతున్నట్లు తెలుస్తోంది.సీఎం బీరెన్ సింగ్, బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి తమ డిమాండ్లను లేఖను రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ఆచార్యకు అందజేసినట్లు అధికారవర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ డిమాండ్ల జాబితాలో ప్రముఖంగా.. యూనిఫైడ్ కమాండ్ అప్పగించడం ద్వారా రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వానికి తగిన అధికారాలు, బాధ్యతలు ఉంటాయని పేర్కొన్నట్లు తెలుస్తోంది. సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 355 మణిపూర్‌లో అమలులో ఉందని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తెలియజేయలేదని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఆర్టికల్ 355 ప్రతి రాష్ట్రాన్ని దురాక్రమణ, అంతర్గత దాడుల నుంచి రక్షించే బాధ్యతను కేంద్రానికి ఇచ్చింది. ఇక.. ఈ ఆర్టికల్‌ను విధించడం అంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాడానికి కేంద్రం సిద్ధమైనట్లే అని సమాచారం.గత ఏడాది మేలో జాతుల మధ్య చెలరేగిన హింసను నిర్మూలించిచి శాంతిని నెలకొల్పాలని లేఖలో డిమాండ్ చేశారు. సీఎం బిరేన్ సింగ్‌లో సహా బీజేపీ ఎమ్మెల్యేలు మణిపూర్ సమగ్రతను కాపాడాలని, సరిహద్దు ఫెన్సింగ్‌ను పూర్తి చేయాలి, అక్రమ వలసదారులందరినీ బహిష్కరించాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. మణిపూర్‌లో మైతేయి, కుకీ తెగల మధ్య చెలరేగిన సింసలో ఇప్పటి వరకు 220 మంది మృతిచెందగా.. సుమారు 50 వేల మంది అంతర్గతంగా నిరాశ్రయులయ్యారు. -
మూలధన వ్యయాల వృద్ధిపై కేంద్రం దృష్టి
న్యూఢిల్లీ: ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ మూలధన వ్యయాల వేగవంతంపై కేంద్రం దృష్టి సారించింది. రూ. 500 కోట్లకు మించిన వ్యయానికి సంబంధించిన నిబంధనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ సడలించింది. ఏప్రిల్‌తో ప్రారంభమైన ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 11.11 లక్షల కోట్ల క్యాపెక్స్‌ను(మూలధన వ్యయం) బడ్జెట్ అంచనా వేసిన సంగతి తెలిసిందే. 2023–24 ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే ఇది 11.1 శాతం ఎక్కువ. సార్వత్రిక ఎన్నికల కారణంగా కొన్ని నెలలపాటు మందగించిన ప్రభుత్వ వ్యయాలను తిరిగి వేగవంతం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి.మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 15 నెలల కనిష్ట స్థాయిలో 6.7 శాతంగా నమోదుకావడానికి ఎన్నికల సందర్భంగా మూలధన వ్యయాల్లో నెమ్మదే కారణమన్న విశ్లేషణలు వచ్చిన సంగతి తెలిసిందే. మూలధన వ్యయాలకు సంబంధించి అనుమతించిన తాజా సడలింపులను అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు కచ్చితంగా పాటించవలసి ఉంటుంది. సింగిల్ నోడల్ ఏజెన్సీ (ఎస్ఎన్ఏ), సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (సీఎన్ఏ), మంత్లీ ఎక్స్పెండిచర్ ప్లాన్ (ఎంఈపీ), స్కీమ్ అలాగే నాన్–స్కీమ్ ఖర్చుల కోసం మంత్రిత్వ శాఖలు రూపొందించిన త్రైమాసిక వ్యయ ప్రణాళిక (క్యూఈపీ)లు సీలింగ్‌ల మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలి. క్యాపెక్స్ కోసం త్రైమాసిక లక్ష్యాలు మరోవైపు రోడ్డు, రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్టీహెచ్), టెలికాం శాఖ కోసం బడ్జెట్ మూలధన వ్యయాలపై జరిగిన ఒక సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, వివిధ మంత్రిత్వ శాఖలు క్యాపెక్స్ కోసం త్రైమాసిక లక్ష్యాలను నిర్దేశించుకోవడం అవసరమని అన్నారు. సంవత్సరంలో మిగిలిన నెలల్లో వ్యయాలను వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ప్రాముఖ్యతను ఉద్ఘాటించారు. రోడ్డు, రవాణా– రహదారుల మంత్రిత్వ శాఖకు బడ్జెట్ క్యాపెక్స్ కేటాయింపులు 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.42 లక్షల కోట్లు ఉంటే, ప్రస్తుత 2024–25లో 90% వృద్ధితో రూ. 2.72 లక్షల కోట్లకు ఎగశాయి. 2024–25కు సంబంధించిన క్యాపెక్స్ ప్రణా ళికల గురించి ఎంఓఆర్టీహెచ్ సెక్రటరీ కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. వివిధ చర్యల ద్వారా ప్రైవేట్ మూలధనాన్ని ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆస్తుల రీసైక్లింగ్ లక్ష్యాలను కూడా చేరుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆర్థికమంత్రికి సెక్రటరీ తెలియజేసినట్లు సమాచారం. క్యాపెక్స్ వ్యయాల వేగవంతంపై ఆర్థిక మంత్రి వివిధ మంత్రిత్వశాఖలు, సమావేశమవుతున్నారు. -
విశాఖ రైల్వే జోన్‌కు తీవ్ర అన్యాయం
విశాఖపట్నం, సాక్షి: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ మరోసారి ఏపీని మోసం చేసింది. విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. తాజాగా విశాఖకు జోన్ ఇవ్వకుండానే ఒడిషాకు రాయగడ డివిజన్ ఇచ్చారు. ఇదే సమయంలో రాయగడ డీఆర్ఎం కార్యాలయానికి టెండర్ కూడా ఇచ్చారు. రాయగడ డివిజన్ ఏర్పాటుతో విశాఖ రైల్వే జోన్ తీవ్రంగా నష్టపోనుంది. ఆదాయం వచ్చే ప్రాంతమంతా ఒడిషాలో కలిసిపోతుందని విశాఖ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వాల్తేరు డివిజన్ రద్దువైపు అడుగులు పడుతున్నాయి. దశాబ్దాలుగా విశాఖపట్నం రైల్వే జోన్ కల నెరవేరటం లేదు. 2019 ఎన్నికలకు ముందు రైల్వే జోన్ ఇస్తామని కేంద్రం ప్రకటన చేసింది. ఈ మేరకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైల్వే జోన్ కోసం సరిపడా భూమి ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. కాగా, వాల్తేర్ డివిజన్‌తో కలిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. కానీ, రైల్వే జోన్‌పై కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతోంది. రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కూటమి నేతలు ఎటువంటి ఒత్తిడి చేయకపోవటం గమనార్హం. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మెదపటం లేదు. -
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదంపై కేంద్రానిదే బాధ్యత: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదం అంతం కాబోతోందని కేంద్ర చెబుతోంది, కానీ అలా జరగుతున్నట్లు తమకు కనిపించటంలేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘జమ్ము కశ్మీర్లో ఇటీవల దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాద ఘటన మొదటి కాదు. నిజం ఏమింటే.. గత ఏడాది నుంచి ఇక్కడ ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్ములోని పలు ప్రాంతాల్లో కూడా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇక్కడ చోటు చేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాలి. ఇప్పటివరకు 55 మంది సైనికులు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితులో అసలు ప్రభుత్వం ఏం చేస్తోందని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం మాత్రం తరచూ జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదం తగ్గుతోందని చెబుతోంది. కానీ, ఇక్కడి పరిస్థితిని చూస్తే ఉగ్రవాదం ఇంకా కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. అదీకాక ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఏమాత్రం చర్యలు తీసుకోవటం లేదు. కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.ఇటీవల జమ్ము కశ్మీర్ ఉగ్రవాదం పెరగడానికి ఇక్కడి ప్రాంతీయ పార్టీల రాజకీయాలే కారణమని డిజీపీ ఆర్ఆర్ స్వైన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. డీజీపీ చేసిన వాఖ్యలను మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. ‘డీజేపీ రాజకీయ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రాజకీయాలను రాజకీయ నాయకులకు వదిలిపెట్టాలి. ఆయన జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదం ఎలా కరికట్టాలో చర్యలు తీసుకోవటంలో దృష్టి పెట్టాలి. డీజీపీగా ఆయన పని.. ఆయన చేస్తే.. మా పని మేము చేస్తాం’అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. -
అమెరికాలో మరో రెండు వీసా దరఖాస్తు కేంద్రాలు
వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రం సియాటెల్‌లో కొత్తగా రెండు వీసా, పాస్‌పోర్టు కేంద్రాలను భారత ప్రభుత్వం ప్రారంభించింది. పసిఫిక్ తీరంలోని 9 వాయవ్య రాష్ట్రాల్లో ఉండే సుమారు 5 లక్షల మంది భారత సంతతి ప్రజల అవసరాలను ఇవి తీరుస్తాయని సియాటెల్‌లోని భారత కాన్సుల్ జనరల్ ప్రకాశ్ గుప్తా చెప్పారు. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్, బెల్వ్యూల్లో శుక్రవారం వీసా, పాస్‌పోర్టు కేంద్రాలను ప్రారంభించామన్నారు. ఇటీవలే సియాటెల్‌లో భారత కాన్సులేట్ ఏర్పాటైంది. అలాస్కా, ఇడహో, మొంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, ఒరెగాన్, సౌత్ డకోటా, వాషింగ్టన్, వ్యోమింగ్ రాష్ట్రాలు ఈ కాన్సులేట్ పరిధిలోకి వస్తాయి. న్యూయార్క్, అట్లాంటా, షికాగో, హూస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కోల్లో ఐదు చోట్ల ఇప్పటికే భారత కాన్సులేట్లు నడుస్తున్నాయి. భారత ప్రభుత్వం తరఫున వీటిని వీఎఫ్ఎస్ గ్లోబల్ సంస్థ నిర్వహిస్తోంది. -
ఎంపీని కానిస్టేబుల్ కొట్టడం దేనికి సంకేతం?
హిమాచల్ ప్రదేశ్ మండీ లోక్ సభ స్థానం నుండి నూతనంగా ఎన్నికైన ప్రముఖ సినీ తార కంగనా రనౌత్‌ను చండీగఢ్ విమానాశ్రయంలో సెక్యూరిటీ విధులను నిర్వహిస్తున్న కుల్విందర్ కౌర్ అనే సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెంప మీద కొట్టడం దేశ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎందుకు కొట్టావు అని సదరు ఎంపీ అడిగినప్పుడు రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు ఈ చెంప దెబ్బ అని దురుసుగా సమాధానం చెప్పడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఆ కానిస్టేబుల్ సోదరుడు కిసాన్ మజ్దూర్ సంఘ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడం, ఆమ్ ఆద్మీ సపోర్టుగా ఉండడం బట్టి చూస్తే– కంగనా రనౌత్‌పై దాడి యాదృచ్చికంగా జరిగింది కాదనీ, ఇది ఒక ప్రణాళికా బద్ధంగానే జరిగిందనే భావన కలుగక మానదు. నూతనంగా ఎన్నికైన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సమగ్రమైన విచారణ జరిపి, దేశ ప్రజలకు వాస్తవ విషయాలు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. రైతు వ్యతిరేక చట్టాల ఉద్యమం పేరుతో రైతుల ముసుగులో ఖలిస్థాన్ వేర్పాటు వాదుల మద్దతుదారులు రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటపై ఖలిస్థాన్ జెండాను ఎగరవేయడం, శాంతి భద్రతలను పరిరక్షించడానికి వచ్చిన అనేకమంది పోలీసుల తలలు పగలగొట్టడం వంటి దృశ్యాలు దేశ ప్రజల స్మృతి పథంలో ఇప్పటికీ స్థిరంగానే ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ప్రతిపక్షాలు తమ రాజకీయ స్వార్థం కోసం రైతు చట్టాల వ్యతిరేక ఉద్యమకారులను రెచ్చగొడుతున్నాయనీ, పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో అనేక చోట్ల హింస చెలరేగి శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందనీ నిఘా వర్గాలు హెచ్చరించడంతో పోలీసులు సందర్భోచితంగా సంయమనం పాటించారు. దీంతో దేశానికి పెద్ద ముప్పే తప్పింది.ప్రభుత్వ విధానాలపైనా, దేశంలో జరుగుతున్న అనేక సంఘటనలూ, ఉద్యమాలపైనా అనేకమంది వ్యతిరేకంగా, అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. అలాగే ఒక పౌరురాలిగా కంగనా కూడా రైతు ఉద్యమంపై వ్యాఖ్య చేశారు. ఈ చెంప దెబ్బ ఆ వ్యాఖ్యలు చేసినందుకే కొట్టానని కౌర్ చెప్పిన సమాధానం నమ్మశక్యంగా లేదు. సిక్కు తీవ్రవాద భావాలు కుల్విందర్ కౌర్ మనసులో ఎవరైనా నాటి ఉండవచ్చునేమో! ఈ కోణంలో ఎందుకు ఆలోచించకూడదు? 1984 అక్టోబర్ 31న భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని కాల్చి చంపిన ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్‌లు సిక్కులు అనే విషయం మరవకూడదు. నాడు వారు ‘ఖలిస్థాన్’ వేర్పాటు వాద భావజాలాన్ని తలకెక్కించుకుని ఆ ఘాతుకానికి ఒడిగట్టారు.సిక్కు వేర్పాటు వాద నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ 2023 జూన్ 18న కెనడాలో హత్యకు గురైన తర్వాత, కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలలో ఖలిస్థాన్ వేర్పాటు వాదుల మద్దతుదారులు భారతదేశానికి వ్యతిరేకంగా, హిందువులకు వ్యతిరేకంగా ప్రకటనలు గుప్పించారు. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో... నిజర్ హత్య వెనుక భారత ప్రభుత్వ నిఘా వర్గాలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా అమెరికా దౌత్యవేత్తలు మాట్లాడడం, భారత ప్రభుత్వం ఇందుకు ఆధారాలు చూపించాలని కౌంటర్ వేయడం వంటి వాటి నేపథ్యంలో ఈ సంఘటనను పరిశీలించాలి. ఉల్లి బాల రంగయ్య వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు -
మొదటి నూరు రోజులు కీలకం
ఆర్థిక మాంద్యం నేపథ్యంలో 1933లో అమెరికాలో గద్దెనెక్కిన రూజ్వెల్ట్ ప్రభుత్వం తొలి వంద రోజుల్లో కొన్ని మేలైన నిర్ణయాలు తీసుకుంది. అప్పటి నుంచీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తొలి వంద రోజుల్లో ఏం చేస్తుందనే ఆసక్తి మొదలైంది. కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వం ముందున్న అతి పెద్ద సవాలు ఉపాధి! దేశవ్యాప్తంగా అప్రెంటిస్‌షిప్ కార్యక్రమం ఒకదాన్ని మొదలుపెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. చిన్న, సన్నకారు రైతులతోపాటు కౌలు రైతులకూ రుణాలు అందుబాటులోకి తేవాలి. వంద కోట్ల కంటే ఆర్థిక సంపద ఎక్కువగా ఉన్న వారిపై ఒక శాతం పన్ను విధించాలి. దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుంది.కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా తొలి వంద రోజుల్లో ఏం జరుగుతుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొత్త ప్రభుత్వపు ప్రాథమ్యాలు అర్థమయ్యేదిప్పుడే మరి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో కొన్నింటినైనా అమలు చేసేందుకు ఇదే మంచి తరుణం కూడా. తద్వారా కొత్త ప్రభుత్వ కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి. ప్రజల్లో విశ్వాసమూ నెలకొంటుంది. అలాగే దేశీ, విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం చూరగొనడమూ సాధ్యమవుతుంది. స్పష్టమైన మెజారిటీతో గద్దెనెక్కిన ప్రభుత్వం కూడా కొంత సమయం తరువాత ప్రజా విశ్వాసం కోల్పోవచ్చు. కాబట్టి ఈ తొలి రోజులను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి ఈ తొలి వంద రోజుల భావన ఎప్పుడో 1933లో అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్ మొదలుపెట్టారు. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గద్దెనెక్కిన రూజ్వెల్ట్ ప్రభుత్వం తొలి వంద రోజుల్లో కొన్ని మేలైన నిర్ణయాలు తీసుకుంది. రైతులతోపాటు నిరుద్యోగులు, యువత, పరిశ్రమలకు ఉపశమనం కలిగించేలా తక్షణ సాయం ప్రకటించడం, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే ఉద్దీపన కార్యక్రమాలు చేపట్టడం వీటిల్లో ఉన్నాయి. ఇదే సమయంలో బంగారంపై ప్రైవేట్ యాజమాన్యాన్ని తొలగించడం వంటి విప్లవాత్మక నిర్ణయాలు ఈ సమయంలోనే జరిగాయి. మనుగడ సాగించలేని బ్యాంకుల బరువును వదిలించుకునేందుకు బ్యాంకింగ్ హాలిడేను ప్రకటించారు. వాణిజ్య, పెట్టుబడులకు వేర్వేరుగా బ్యాంకింగ్ వ్యవస్థల ఏర్పాటుకు దారితీసిన గ్లాస్–స్టీగాల్ చట్టం ఈ సమయంలోనే అమల్లోకి వచ్చింది. భారత్‌లో కొత్తగా కొలువైన ప్రభుత్వానికి రూజ్వెల్ట్ తరహాలో ఆర్థిక మాంద్య సమస్య లేదు. పైగా ఆర్థిక రంగం పటిష్టంగానే ఉంది. గత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు చాలామందిని ఆశ్చర్యపరుస్తూ పైకి ఎగబాకింది. అలాగే ద్రవ్యోల్బణం కూడా ఓ మోస్తరు స్థాయిలో మాత్రమే కొనసాగుతోంది. బ్యాంకింగ్ రంగ ఆరోగ్యం కూడా బాగానే కనబడుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు రికార్డు స్థాయిలో రూ.1.4 లక్షల కోట్ల లాభాలు నమోదు చేశాయి. స్టాక్ మార్కెట్ కూడా మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. ఈ స్థూల ఆర్థికాంశాలన్నీ బాగా ఉన్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం తొలి వంద రోజుల ప్రాథమ్యాలు ఏముంటే బాగుంటుంది? నాలుగు నిర్దిష్టమైన సూచనలు:కొత్త ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు ఉపాధి కావచ్చు. అంతర్జాతీయ కార్మిక సంఘం, ఇన్ స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ నివేదికల ప్రకారం దేశంలోని నిరుద్యోగుల్లో 83 శాతం మంది 29 ఏళ్ల కంటే తక్కువ వయసు కలిగిన వారు. ఇదే సమయంలో దేశం మొత్తమ్మీద నైపుణ్యమున్న, అర్ధ నైపుణ్యమున్న ఉద్యోగుల కొరత చాలా తీవ్రంగా ఉంది. కాబటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు దేశవ్యాప్తంగా అప్రెంటిస్‌షిప్ కార్యక్రమం ఒకదాన్ని మొదలుపెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఈ రకమైన కార్యక్రమానికి ప్రస్తుతమున్న వాటి కంటే మెరుగైన చట్టపరమైన మద్దతు అవసరమవుతుంది. ప్రస్తుత కార్మిక చట్టాల ప్రకారం.. అప్రెంటిస్ అయినా, ఇతరులైనా ఆరు నెలలపాటు పనిచేస్తే వారిని శాశ్వత ఉద్యోగులుగా చేయాలి. ఫలితంగా పారిశ్రామిక వేత్తలు అప్రెంటిస్‌లకు కూడా అవకాశాలిచ్చే అవకాశం తక్కువ అవుతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. అప్రెంటిస్ సర్టిఫికెట్ దేశవ్యాప్తంగా చెల్లుబాటయ్యేలా చేయాలి. కేంద్ర ప్రభుత్వ అధికారిక ముద్ర కూడా ఈ సర్టిఫికెట్‌కు అవసరమవుతుంది. జాతీయ అప్రెంటిస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి పై అంశాలన్నింటినీ చేర్చడం ద్వారా నిరుద్యోగ సమస్య, నైపుణ్యాల లోటు, ఉద్యోగార్హతల సమస్యలను పరిష్కరించవచ్చు. దీంతోపాటు అగ్నివీర్ కార్యక్రమాన్ని ప్రస్తుతమున్న నాలుగేళ్ల నుంచి ఏడు లేదా ఎనిమిదేళ్లకు పెంచడం (షార్ట్ సర్వీస్ కమిషన్ కార్యకాలానికి దగ్గరగా) కూడా నిరుద్యోగ సమస్య సమసిపోయేందుకు ఉపయోగపడుతుంది. ఇక రెండో సూచన... పంట ఉత్పత్తులకిచ్చే కనీస మద్దతు ధరకు చట్టపరమైన రక్షణ కల్పించడం గురించి. కనీస మద్దతు ధర సాఫల్యానికి మార్కెట్ ధరలన్నీ గణనీయంగా తగ్గాలి. అయితే కనీస మద్దతు ధర వల్ల ధరలపై ఒత్తిడి పెరిగే అవకాశమూ ఉంటుంది. కానీ మొత్తమ్మీద అటు రైతుకు, ఇటు ప్రభుత్వానికి ఉభయ తారకం. కొత్త ప్రభుత్వం కనీస మద్దతు ధరతోపాటు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులపై నియంత్రణలకు దూరంగా ఉంటామన్న సూచన కూడా చేయాల్సి ఉంటుంది. నియంత్రణలు రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి.మూడవ సూచన: చిన్న, సన్నకారు రైతులతోపాటు కౌలు రైతులకూ రుణాలు అందుబాటులోకి తేవాలి. దేశంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో 40 శాతం కౌలు రైతులే పండిస్తున్నారు. భూ యజమానులతో వీరికి నామమాత్రపు ఒప్పందం మాత్రమే ఉంటుంది. ఈ కారణంగా రుణ సౌకర్యం లభించడం కష్టమవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సమస్యను అధిగమించేందుకు కొన్ని వినూత్న పద్ధతుల ఆవిష్కరణ జరిగింది. ఇలాంటి ప్రయత్నాల మదింపు జరిపి జాతీయ స్థాయి విధానాన్ని రూపొందించి అమలు చేయాల్సిన అవసరముంది. సాధారణంగా పంట రుణాలన్నవి నాలుగు నుంచి ఆరు నెలల కాలానికి అవసరమవుతుంటాయి. ఇంత చిన్న కాలావధి అనేది నిరర్థక ఆస్తుల నిర్వచనం కిందకు రాదు. దీనికి తగిన నమూనా రూపొందించాలి. అలాగే చిన్న, సన్నకారు రైతులు, ఔత్సాహిక చిన్నస్థాయి పారిశ్రామిక వేత్తలకూ రుణ సౌకర్యం పెద్దగా ఉండటం లేదు. అకౌంట్ అగ్రిగేటర్స్ వంటివి అందుబాటులో ఉన్న ఈ కాలంలో కేవలం కొలాటరల్ ఆధారంగా కాకుండా... క్యాష్ ఫ్లో ఆధారంగా రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలి. పైగా... చాలామంది చిన్నస్థాయి పారిశ్రామిక వేత్తలకు ఆర్థికాంశాలపై అవగాహన తక్కువే. ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు గట్టి ప్రయత్నమే జరగాలి. అంతేకాకుండా... చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు వర్కింగ్ క్యాపిటల్ లభ్యత పెరిగేందుకు 2006 నాటి చిన్న, మధ్యతరహా పరిశ్రమల చట్టంలోని 45 రోజుల నిబంధనను కఠినంగా అమలు చేసే ప్రయత్నం జరగాలి. నాలుగో సూచన... ఫైనాన్షియల్ వెల్త్ (స్టాక్స్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి– అన్నీ ‘పాన్’తో అనుసంధానించి ఉంటాయి) విలువ రూ.వంద కోట్ల కంటే ఎక్కువగా ఉన్న వారిపై కొద్దిగా ఒక శాతం పన్ను విధించడం. దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక అంతరాన్ని తగ్గించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుంది. ఈ పన్ను ద్వారా సేకరించిన మొత్తాలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక విద్యాభివృద్ధికి కేటాయించవచ్చు. ఈ నిధులు రాష్ట ప్రభుత్వాలకు కాకుండా... నేరుగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు చేరాలి. ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే ఇలా నేరుగా ఆర్థిక వనరులను అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రొ‘‘ అజీత్ రానాడే వ్యాసకర్త పుణెలోని ‘గోఖలే ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్’ వైస్ ఛాన్స్లర్ (‘ద మింట్’ సౌజన్యంతో) -
బెంగాల్లో పౌరసత్వ సర్టిఫికేట్లు జారీ
కోల్‌కతా: నూతన పౌరసత్వ సవరణ చట్టంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న పలువురికి సిటిజన్‌షిప్ సర్టిఫికేట్లను కేంద్రం బుధవారం జారీ చేసింది. పశ్చిమ బెంగాల్‌తో పాటు, హర్యానా, ఉత్తరఖండ్ రాష్ట్రాల్లో మొదటి విడత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నవారికి సిటిజన్‌షిప్ సర్టిఫికేట్లను అధికారులు అందజేశారు. 2019లో పార్లమెంట్లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం నియమ, నిబంధనలను మార్చి 11న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన విషయం తెలిసిందే. చట్టం నిబంధనలు నోటీఫై అయిన రెండు నెలల అనంతరం మే 15న తొలిసారి మొదటి విడతగా 14 మందికి భారత పౌరసత్వ సర్టిఫికేట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి తాము వ్యతిరేకమని, అమలు చేయమని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్న విషయం తెలిసిందే. సీఏఏ మానవత్వాన్ని అవమానించటమేనని, దేశ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని మండిపడ్డ సంగతి విధితమే.సీఏఏలో ఏముంది...!► సీఏఏ–2019 చట్టం ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు.► 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు.► అంతకుముందు కనీసం ఏడాది నుంచి భారత్‌లో ఉంటున్నవాళ్లకు, 14 ఏళ్లలో కనీసం ఐదేళ్లు ఉన్నవాళ్లకు పౌరసత్వం కల్పిస్తారు. గతంలో 11 ఏళ్లుండగా ఐదేళ్లకు తగ్గించారు.► ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరముండదు. ఈ మేరకు పౌరసత్వ చట్టం–1955కు మోదీ సర్కారు సవరణలు చేసింది.► అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురల్లోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు. -
ఆ మూలసూత్రాలను అందుకుంటేనే...
భారతదేశం పునర్నిర్మాణంలో ప్రతి సందర్భంలోను డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ సూత్రాలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నాయి. అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని ఆయన సూత్రాలతోనే పునర్నిర్మించాలి అనే నూతన భావన మన నాయకులకు ఉంటే అంబేడ్కర్ కుల నిర్మూలన భావాన్ని, సామ్యవాద భావాల్ని తప్పక ఆచరించవలసిన చారిత్రక సందర్భం ఇది. నిజానికి దేశాన్ని రక్షించాల్సిన వారు దేశంలో నేడు మత వైరుద్ధ్యాలు పెంచడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అశోకుడు, అక్బరు వంటి మహా చక్రవర్తులే మత సామరస్యం కోసం ప్రయత్నం చేస్తే, ఇప్పటి నాయకులు మతాధిపత్యం కోసం ప్రచారం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 13న జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలు పోటెత్తి ఓటెయ్యడం ఒక సామాజిక, సాంస్కృతిక పరిణామం. మహిళకు రాజకీయ అస్తిత్వం పెరిగింది అనడానికి ఇది ఒక నిదర్శనం. మహిళలు ఎక్కడ చైతన్యవంతం అవుతారో అక్కడ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాలు త్వరితం అవుతాయని అంబేడ్కర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో 81.86 శాతం ఓట్లు పోయ్యాయి. నడి ఎండలో కూడ ప్రజలు నిలబడి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మరోప్రక్క కుల, మతం, మద్యం, డబ్బు ప్రభావం కూడా బలంగానే ఎన్నికల మీద ఉంది. ఎన్నికల సంగ్రామంలో ఈసారి సోషల్ మీడియా కీలకపాత్ర పోషించింది. ఒక రకంగా సామాజిక వేదికలపై పెద్ద యుద్ధమే నడిచింది. పార్టీలు, అభ్యర్థుల వారీగా ఏర్పడ్డ గ్రూపుల్లో ఓటింగ్ సందర్భంగా రాతలతో కత్తులు దూశారు. ఫేక్ ఫోటోలు, ఫేక్ ఆడియోలతో పాటు ఫేక్ వార్తలను క్షేత్రస్థాయిలో వైరల్ చేశారు. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారు అయోయయానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఇలా వుంటే మొత్తం భారతదేశం వ్యాప్తంగా పెను వృక్షాలు కూలుతున్న చప్పుళ్లు వినబడుతున్నాయి. కొన్ని అధికార పీఠాలు బీటలు వారుతున్నాయి. మే 15న భువనేశ్వర్‌లోని భువనంగిరిలో ఇండియా కూటమి నాయకుడు రాహుల్‌గాంధీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో భాజపా నెగ్గితే ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం అవుతాయని, దేశాన్ని 22 మంది బిలియనీర్లు పాలిస్తారని, రాజ్యాంగ పుస్తకాన్ని భాజపా చించి అవతల పారేస్తుందని అన్నారు. బడుగు వర్గాలకు ప్రయోజనాలు లభించటానికి కారణమే రాజ్యాంగం అని తమ చేతిలోని రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ చెప్పారు. 22 మంది బిలియనీర్లు తీసుకున్న రూ. 16 లక్షల కోట్ల రుణాలను కేంద్ర సర్కారు మాఫీ చేసిందని, ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 24 ఏళ్ల పాటు వేతనాలు చెల్లించేందుకు అయ్యే మొత్తంతో ఇది సమానమని వివరించారు. ‘‘రైతుల, విద్యార్థుల రుణాలను మాఫీ చేయలేదు. చిరు వ్యాపారులకు రుణాలే ఇవ్వలేదు. జీయస్టీ మొత్తమంతా ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు వెళ్లిపోతోంది. మేం వచ్చాక కులగణనతో విప్లవాత్మక ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనను తీసుకువస్తాం. దేశంలో దేశంలో 50 శాతం మంది ఓబిసీలు, 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనార్టీలు, 5 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారున్నారు. ఈ 90 శాతం మందికిపైగా ప్రజలు మోదీ పాలనలో వంచితులయ్యారు. ఎన్ని రకాల అబద్ధాలను భాజపా చెప్పినా జూన్ 4 తర్వాత ప్రధాని పదవిలో మోదీ ఉండరు’’ అని రాహుల్ ఉద్ఘాటించారు.మోడీ ప్రభుత్వంలో రాజ్యం కంటే కూడా కార్పోరేట్ శక్తులు బలపడ్డాయి. విశ్వవిద్యాలయాలు అన్నింటిలో మతోన్మాద భావాలను ప్రచారం చేస్తూ శాస్త్ర జ్ఞానాన్ని వక్రీకరిస్తున్నాయి. అందుకే శ్రీనగర్‌లో మే 15న మాట్లాడుతూ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎస్పీ)అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఇలా విమర్శించారు. భవిష్యత్తులో తాను పదవిలో లేకపోయినా దేశం మనుగడ సాగిస్తుందన్న విషయాన్ని ప్రధాని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్ అనంత్‌నాగ్‌లోని షాంగుస్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మనం కలిసి జీవించాలి. దేశాన్ని రక్షించాలి. పదవి ఎల్లకాలం ఉండదు. కానీ దేశం శాశ్వతం. ఆయన (మోడీ) ఏ దేశాన్ని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారో అది వినాశకరమైనది’’ అన్నారు.నిజానికి దేశాన్ని రక్షించాల్సిన ప్రధానమంత్రి దేశంలో మత వైరుధ్యాలు పెంచడం ఆశ్చర్యకరం. అశోకుడు, అక్బరు వంటి మహా చక్రవర్తులే మతసామరస్యం కోసం ప్రయత్నం చేస్తే, మోడీ ప్రభుత్వం మతాధిపత్యం కోసం ప్రచారం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీసిందని సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులందరూ భావిస్తున్నారు. మోడీ ఆవేశపూరితమైన ప్రసంగాల్లో 400 సీట్లు వస్తున్నాయని చెప్పుకుంటున్నా 150 నుంచి 200కే పరిమితం అవుతారని కమ్యూనిస్టు నాయకులు చెబుతున్నారు. బీజేపీకి బలమైన ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఈ ఎన్నికల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనే బీజేపీకి ఎదురు గాలి వీస్తున్నది. పైకి డాంబికంగా 370–400 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకుంటున్నా ఏ సర్వేలోనూ ఆఖరికి బీజేపీని బలపరిచే విశ్లేషకులు సైతం 250కి మించి రావని చెప్పాల్సిన పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం ఈ దశాబ్దంలో ఏ సోషల్ మీడియాలోనైతే దళిత బహుజన మైనార్టీ స్త్రీల మీద, రాజ్యాంగం మీద, మానవ హక్కుల మీద, విద్యార్థుల ప్రతిభ మీద, దళితుల జీవన సంస్కృతి మీద, ముస్లింలు జీవించే హక్కు మీద దాడి చేసిందో అదే సామాజిక మాధ్యమాన్ని ఉపయుక్తం చేసుకొని ఈ సామాజిక శ్రేణుల అన్నింటిలో వున్న మే«ధావర్గం ఎదురుదాడి ప్రారంభించింది. నిజానికి మోడీ ద్వంద్వ భావజాల ఘర్షణలో ఇరుక్కుపోయారా అనిపిస్తుంది. ఏ ప్రజలైతే ఏ బడుగువర్గాలైతే అధిక ఓట్ల శక్తిగా ఉన్నాయో, ఆ వర్గాల జీవన వ్యవస్థలను ధ్వంసం చేస్తూ చేస్తూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ఈ వర్గాలను మతం పేరుతో ఓట్లు అడుగుతున్న సందర్భంగా, తమ కాళ్ల కింద పునాదులు తొలగిపోతున్న స్థితిలో కేవలం మతోన్మాద నినాదం ఫలిస్తుందా? అనేది ఇప్పుడు మోడీ ముందు నిలబడిన పెద్ద ప్రశ్నలా కనిపిస్తోంది.ఉత్తర ప్రదేశ్ కేంద్రంగా మొత్తం భారతదేశం గురించి మనం ఆలోచించినప్పుడు అన్ని మతాల్లో బానిసలుగా బతుకుతున్న వారికి సమాన గౌరవ జీవన వ్యవస్థ లేకపోవటం కనిపిస్తోంది. మతోన్మాద నినాదం గౌరవం ఇవ్వదు. ఆచరణ గౌరవం ఇస్తుంది. భారతదేశంలో కుల గణన చేయిస్తామని కాంగ్రెస్ పేర్కొన్నాక ఓబిసీలు ఆలోచనలో పడినట్లే ఉంది. తమకు రిజర్వేషన్ హక్కు వస్తుందని, రిజర్వేషన్ వల్ల విద్య, ఉద్యోగ హక్కులు విస్తృతం అవుతాయని ఓబిసీలు భావించడం ద్వారా భారతదేశంలో అతి పెద్ద సామాజిక తరగతి ‘ఇండియా’ కూటమి వైపు మొగ్గుతుందనక తప్పదు. ‘ఇండియా’ కూటమికి నూతన దశ వస్తున్న ఈ తరుణంలో అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని ఆయన సూత్రాలతోనే పునర్నిర్మించాలి అనే నూతన భావన ఆ కూటమికి ఉంటే అంబేడ్కర్ కుల నిర్మూలన భావాన్ని, సామ్యవాద భావాల్ని తప్పక ఆచరించవలసిన చారిత్రక సందర్భం ఇది. ఆ పరిణతి మాత్రం ‘ఇండియా’ కూటమికి వచ్చినట్టు లేదు. అంబేడ్కర్ పరిశ్రమలను జాతీయం చేయండి, భూములను జాతీయం చేయండి అనే ప్రధాన సూత్రాన్ని ముందుకు తెచ్చారు. ఆయా రాష్ట్రాల ఆధిపత్య కులాల పార్టీ నుంచి వస్తున్న ‘ఇండియా’ కూటమి ఇంకా సామాజిక, సామ్యవాద భావాలను పరిపుష్టం చేయవలసిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాల్లో చారిత్రక, సాంస్కృతిక శాస్త్ర జ్ఞాన పునరుజ్జీవనానికి కూడా వీరు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మండల కమిషన్ రిపోర్ట్స్‌ను, సచార్ కమిటీ రిపోర్ట్స్‌ను, రిపబ్లికన్ పార్టీలోని మూల సూత్రాలను ‘ఇండియా’ కూటమి తీసుకోగలిగితే నిజమైన ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది. భారతదేశం పునర్నిర్మాణంలో ప్రతి సందర్భంలోను డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ సూత్రాలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నాయి. ఈసారైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ఒక దళిత ప్రధానమంత్రిని ప్రకటించగలిగిన విశాలతను సంతరించుకోవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా భారతదేశంలోని రాజకీయ నాయకుల వ్యక్తిత్వ నిర్మాణంలో నైతికత, అవినీతి రహిత, రుజువర్తన జీవన విధానం, మానవతా స్పృహ, సామాజిక విప్లవ భావన, ఆర్థిక స్వావలంబనా దృష్టి అనుసరణీయం అవ్వవలసి ఉంది. రాజకీయ నీతిశాస్త్ర అధ్యయనం ఈనాటి చారిత్రక కర్తవ్యం. అంబేడ్కర్ రాజకీయ జీవన మార్గమే దేశానికి దిక్సూచి.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు -
జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్‌లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. జూన్ 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ మంజూరులో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని రోడ్డు రవాణా సంస్థ డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత సులభ తరం చేస్తూ.. వాహనదారులు ఆర్టీఓ కార్యాలయాల్లోనే కాకుండా ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్ల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందే వెసులు బాటు కల్పించింది. కాలేజీ విద్యార్ధి నుంచి ఉద్యోగి వరకు ప్రతి ఒక్కరూ వాహనాల్ని విరివిరిగా వినియోగిస్తున్నారు. అయితే అందుకు కావాల్సిన డ్రైవింగ్ లైసెన్స్ కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే స్లాట్ బుకింగ్, డ్రైవింగ్ టెస్ట్, బయో మెట్రిక్ ఇలా వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కార మార్గంగా కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనల్ని కేంద్రం అమల్లోకి తేనుంది.ఇక కేంద్రం విధించిన నిబంధనలకు లోబడి ఉంటే ప్రైవేట్ డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లే డ్రైవింగ్ టెస్టులు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేసేందుకు అనుమతి ఉంది. ఇందుకోసం కేంద్రం విధించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఆ నిబంధనలు ఎలా ఉన్నాయంటే ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలకు కొత్త నిబంధనలు ఈ సదుపాయానికి కనీసం ఒక ఎకరం భూమి ఉండాలి. 4 వీలర్ వాహనాల కోసం డ్రైవింగ్ కేంద్రాలకు అదనంగా 2 ఎకరాల స్థలం ఉండాలి. డ్రైవింగ్ శిక్షణా కేంద్రం తప్పనిసరిగా తగిన పరీక్షా సౌకర్యాన్ని కలిగి ఉండాలి. ట్రైనర్లు కనీసం ఉన్నత పాఠశాల డిప్లొమా లేదా తత్సమాన విద్యను కలిగి ఉండాలి. కనీసం 5 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి. ట్రైనర్లు బయోమెట్రిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి.లైట్ వెహికల్ ట్రైనింగ్ తప్పనిసరిగా 4 వారాలలోపు పూర్తి చేయాలి. కనీసం 29 గంటల శిక్షణ ఉంటుంది. భారీ మోటారు వాహనాలకు 38 గంటల శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణను 6 వారాల్లోగా పూర్తి చేయాలి.ఫీజు వివరాలు ఇలా..లెర్నర్ లైసెన్స్: రూ 200లెర్నర్ లైసెన్స్ పునరుద్ధరణ: రూ. 200అంతర్జాతీయ లైసెన్స్: రూ 1000శాశ్వత లైసెన్స్: రూ. 200 Most People don't know this fact. Delhi is the only state with 100% Automated Testing Tracks. No one can ask for bribes, there's zero human intervention and will ensure no one cheats.This can be easily done by every state, but they won't get regular commission if they do...!! pic.twitter.com/43lCx9SQg2— Dr Ranjan (@AAPforNewIndia) May 20, 2024ఆటోమేటేడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్మరోవైపు ఢిల్లీ ప్రభుత్వం ఆటోమేటేడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్‌లపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. సాధారణంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం డ్రైవింగ్ టెస్ట్‌లో అర్హులు కావాలి. ఈ టెస్ట్‌ను ట్రాక్‌ల మీద ఆర్టీఓ అధికారులు నిర్వహిస్తారు. కానీ ఢిల్లీలో అలా కాదు వాహనదారుల సౌకర్యార్ధం ఆటోమేటేడ్ టెస్టింగ్ ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ట్రాకుల వల్ల వాహనదారులు ఎలాంటి దళారులతో పనిలేకుండా సులభంగా డ్రైవింగ్ టెస్ట్‌లో పాల్గొనవచ్చు. మారుతీ సుజుకి సంస్థ ఇక.. మారుతీ సుజుకి సంస్థ తన ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్న్ లాడో సరాయ్లో గతేడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సరికొత్త సదుపాయాన్ని ప్రారంభించిన అనంతరం కంపెనీ.. ఢిల్లీ టెస్టింగ్ ట్రాక్‌లలో 100 శాతం ఆటోమేటిక్ సౌకర్యాన్ని సాధించిందని తెలిపింది. ఇక.. రాజధానిలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం పూర్తిగా కంప్యూటరైజ్డ్ ప్రక్రియ అవుతుందని మారూతీ సుజుకి పేర్కొంది. టెస్ట్ ట్రాక్‌లు సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (CMVR)కి అనుగుణంగా రూపొందించబడినట్లు తెలిపింది. -
సైనిక్ స్కూళ్ల ప్రైవేటికరణ: ఖర్గే ఆరోపణలను ఖండించిన కేంద్రం
ఢిల్లీ: దేశంలోని సైనిక్ స్కూల్స్‌పై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర రక్షణ శాఖ ఖండించింది. సైనిక స్కూళ్లను ‘ప్రైవేటుపరం’ చేయాలనే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. ఖర్గే చేసిన ఆరోపణలను ఖండించింది. ‘సైనిక స్కూళ్లలోని ఎంపిక విధానంలో రాజకీయ, సిద్ధాంతపరంగా దరఖాస్తు దారులపై ఎటువంటి ప్రభావం చూపించదు. ఈ పథకం లక్ష్యాలు, అమలును రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సైనిక్ స్కూల్స్‌పై చేస్తున్నవి వక్రీకరించే, తప్పుదారి పట్టించే ఆరోపణలు’ అని రక్షణ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే.. సైనిక స్కూళ్ల ప్రైవేటీకరణ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇందుకు సంబంధించి చేసుకున్న ఎంఓయులను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్రపతి రాసిన లేఖలో కోరారు. సైనిక్ స్కూల్స్‌ను కూడా రాజకీయం చేయడానికి ప్రభుత్వం కఠోర ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇక.. ఆర్టీఐ రిపోర్టు ఆధారంగా.. సుమారు 62 శాతం సైనిక్ స్కూల్స్ బీజేపీ, బీజేపీ అనుబంధ సంస్థ ఆర్ఎస్ఎస్ నేతలకు చెందినవిగా తెలిపారు. పక్షపాత రాజకీయాలకు దూరంగా సాయుధ బలగాలను వేరుగా ఉంచడం భారత ప్రజాస్వామ్యంలో అనుసరిస్తున్న సంప్రదాయమని, దానిని కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని అన్నారు. ఆర్ఎస్ఎస్ వ్యూహంలో భాగంగా సాయుధ బలగాల సహజ స్వభావాన్ని, నైతికతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని అన్నారు. జాతీయ ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని సైనిక్ స్కూల్స్ ప్రైవేటీకరణ విధానాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని కోరారు. వాటిపై చేసుకున్న ఎంఓయూలు కూడా చెల్లనివిగా ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని ఖర్గేలో రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
‘ఫ్యాక్ట్ చెక్ యూనిట్’ నోటిఫికేషన్‌పై సుప్రీం స్టే
ఢిల్లీ: కేంద్రం విడుదల చేసిన ‘ఫ్యాక్ట్ చెక్’ నోటిఫికేషన్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడింది. ఫేక్ న్యూస్‌ను అడ్డుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో ‘ఫ్యాక్ట్ చెక్ (నిజనిర్ధారణ)’ యూనిట్‌కు సంబంధించి కేంద్ర ఐటీ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసిన తెలిసిందే. కాగా కేంద్ర ఐటీ శాఖ ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను నోటిఫై చేయగా.. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని ‘ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని నోటిఫై చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే గురువారం దీనిపై సుప్రీం కోర్టు విచారణ జరిపి.. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నోటిఫికేషన్‌పై స్టే విదిస్తున్నట్లు పేర్కొంది. ఆన్లైన్ కంటెంట్‌లో ఫేక్, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను తీసుకువస్తామని కేంద్రం గతేడాది ఏప్రిల్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే దీనికోసం ఐటీ రూల్స్-2021కి కూడా కేంద్రం సవరణలు చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యంగ విరుద్ధంగా ఉన్నాయిని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుపై మధ్యంత స్టే ఇవ్వడానికి ముంబై హైకోర్టు నిరాకరించింది. ముంబై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయముర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 11 ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. అయితే బాంబే హైకోర్టు ముందుకు వచ్చిన ప్రశ్నలను పరిశీలించాల్సి అవసంరం ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. ఇక.. అంతవరకు మార్చి 20 (బుధవారం) కేంద్రం జారీ చేసిన నోటిఫికేష్‌పై స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
CAAపై స్టేకు సుప్రీం నిరాకరణ.. పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు
న్యూఢిల్లీ: కేంద్రం ఇటీవల అమలులోకి తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సూప్రీం కోర్టు ఇవాళ(మంగళవారం) విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఏఏపై స్టే ఇచ్చేందుకు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. సీఏఏపై స్టే కోరుతూ సుప్రీంలో దాఖలైన 230 పిటిషన్లపై మూడు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది. ఇక.. ఏప్రిల్ 8వ తేదీలోగా కేంద్రం తన స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కోరింది. ఈ పిటిషన్లపై ఏప్రిల్ 9న వరకు విచారణ వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. సీఏఏ కింద పౌరసత్వం పొందలేకపోయిన ముస్లిం వలసవాదులపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని, ఈ కారణం ఆధారంగా స్టే ఇవ్వాలని కేరళకు చెందిన ఇండియన్ ముస్లిం లీగ్ పిటిషన్లో కోరిన విషయం తెలిసిందే. సీఏఏ సెక్షన్ 6బి కింద ఎవరికి పౌరసత్వాలివ్వకుండా స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లే కాక పలు సంస్థలు, ఇతర వ్యక్తులు కూడా సీఏఏపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చదవండి: ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన: టీఎంసీ ఆరోపణలు -
‘కేరళలో సీఏఏను అమలు చేయబోము’
తిరువనంతపురం: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీకి ఇప్పుడు సీఏఏ గుర్తుకువచ్చిందని మండిపడుతున్నారు. మరోవైపు.. కేరళ సీఎం పినరయి విజయన్ సీఏఏ అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పౌరసత్వ సవరణ చట్టం దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని పేర్కొన్నారు. కేరళలో సీఏఏను అమలు చేయబోమని సీఎం పినరయి స్పష్టం చేశారు. ముస్లిం మైనార్టీలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించే పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎట్టపరిస్థితుల్లో కేరళలో అమలు చేయమన్నారు. ఈ విషయాన్ని తమ ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు చెప్పిందని సీఎం పినరయి గుర్తుచేశారు. ఆదే మాటపై తమ ప్రభుత్వం కట్డుబడి ఉంటుందని తెలిపారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేరళ ప్రజలు ఏకతాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు. చదవండి: సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు -
సీఏఏ అమలుపై ప్రతిపక్షాల విమర్శలు
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుందని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే వివాదాస్పద సీఏఏ చట్టం అమలు నిర్ణయంపై మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఏఏ చట్టాన్ని సైతం ఎన్నికల పావుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాడుకుంటోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ‘2019లో సీఏఏ చట్టం చేయబడితే.. మోదీ ప్రభుత్వానికి ఆ చట్టం విధివిధానాలు నోటీఫై చేయటానికి నాలుగేళ్ల మూడు నెలలు పట్టింది. అయినా మోదీ మాత్రం తన ప్రభుత్వం సమయానుకూలంగా పని చేస్తుందని చెప్పుకుంటారు. సీఏఏ నియమాలను నోటీపై చేయటానికి తీసుకున్న సమయం మోదీ చెప్పే అబద్ధాలకు మరో నిదర్శనం’ అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కేసులో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై సుప్రీం కోర్టు కన్నెర్ర జేసిన విషయాన్ని పక్కదోవ పట్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ఇవాళ సీఏఏ అమలు నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. दिसंबर 2019 में संसद द्वारा पारित नागरिकता संशोधन अधिनियम के नियमों को अधिसूचित करने में मोदी सरकार को चार साल और तीन महीने लग गए। प्रधानमंत्री दावा करते हैं कि उनकी सरकार बिल्कुल प्रोफेशनल ढंग से और समयबद्ध तरीक़े से काम करती है। सीएए के नियमों को अधिसूचित करने में लिया गया इतना… — Jairam Ramesh (@Jairam_Ramesh) March 11, 2024 ‘దేశంలోని పౌరులు జీవనోపాధి కోసం బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు.. ఇతరుల కోసం ‘పౌరసత్వ చట్టం’ తీసుకురావడం వల్ల ఏమి జరుగుతుందని సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. బీజేపీ ఆటకట్టించే రాజకీయం ఇప్పుడు ప్రజలకు అర్థమైందని అన్నారు. తమ పదేళ్ల పాలనలో లక్షలాది మంది పౌరులు దేశ పౌరసత్వాన్ని ఎందుకు వదులుకున్నారో బీజేపీ ప్రభుత్వం వివరించాలని నిలదీశారు. जब देश के नागरिक रोज़ी-रोटी के लिए बाहर जाने पर मजबूर हैं तो दूसरों के लिए ‘नागरिकता क़ानून’ लाने से क्या होगा? जनता अब भटकावे की राजनीति का भाजपाई खेल समझ चुकी है। भाजपा सरकार ये बताए कि उनके 10 सालों के राज में लाखों नागरिक देश की नागरिकता छोड़ कर क्यों चले गये। चाहे कुछ हो… — Akhilesh Yadav (@yadavakhilesh) March 11, 2024 ‘మీరు ఆరు నెలల ముందు సీఏఏ చట్టం నియమాలు నోటీఫై చేసి ఉండాల్సింది. దేశానికి మంచి జరిగితే.. మేము ఎల్లప్పుడూ మద్దతిస్తాం, అభినందిస్తాం.. కానీ, దేశానికి కీడు జరిగితే మాత్రం టీఎంసీ వ్యతిరేకిస్తుంది. రంజాన్ నెల ప్రారంభమయ్యే ముందు రోజే ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు’ అని సీఎం మమతా బెనర్జీ అన్నారు. Aap chronology samajhiye, pehle election season aayega phir CAA rules aayenge. Our objections to CAA remain the same. CAA is divisive & based on Godse’s thought that wanted to reduce Muslims to second-class citizens. Give asylum to anyone who is persecuted but citizenship must… — Asaduddin Owaisi (@asadowaisi) March 11, 2024 సీఏఏ అమలు నిర్ణయంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘ఎన్నికల సీజన్ వస్తున్న సమయంలో సీఏఏ నియమాలు అమల్లోకి వచ్చాయి. సీఏఏపై తమ అభ్యంతరాలు ఇంకా అలాగే ఉన్నాయి. సీఏఏ అనేది విభజన, ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడాలని కోరుకునే గాడ్సే ఆలోచన విధానం. హింసించబడిన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి. కానీ పౌరసత్వం అనేది మతం లేదా జాతీయతపై ఆధారపడి ఉండకూడదు. ఈ నిబంధనలను ఐదేళ్లుగా ఎందుకు పెండింగ్‌లో ఉంచారో? ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో ప్రభుత్వం వివరించాలి. ఎన్పీఆర్-ఎన్ఆర్సీతో పాటు.. సీఏఏ కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడానికి ఉద్దేశించబడింది. ఇది మరే ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడదు. సీఏఏ, ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వచ్చిన భారతీయులు.. మళ్లీ వ్యతిరేకించడం తప్ప మరో మార్గం లేదు’ అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ‘ఎక్స్’ వేదికగా అన్నారు. -
కేంద్రం కీలక నిర్ణయం.. అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం
ఢిల్లీ: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి పౌరసత్వ సమరణ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు కేంద్రం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా 2019 డిసెంబర్ 11న పార్లమెంట్లో సీఐఐ చట్టానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అఫ్గనిస్తాన్, బంగ్లాదేష్, పాకిస్తాన్లో హింసకు గురై.. 2014కు ముందు భారత్‌కు వచ్చిన వారందరికీ భారత పౌరసత్వం వర్తించనుంది, హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బైద్దులు, పార్మీలకు వర్తించనుంది. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. video courtesy: DD INDIA LIVE -
CAA: నెల రోజుల్లో పౌరసత్వ చట్టం అమలు!
ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం (సీఏఏ) అమలు అంశంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఏఏను నెల రోజుల్లో దేశమంతటా అమలు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆన్లైన్ పోర్టల్.. రిజిస్ట్రేషన్ల కోసం సిద్ధమైంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సైతం సీఏఏ అమలుపై డ్రై రన్లను పూర్తి చేసిందని విశ్వనీయవర్గాలు ద్వారా తెలుస్తోంది. గత నెల కేంద్ర మంత్రి శంతను ఠాకూర్ అతిత్వరలో వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టం(సీఏఏ) అమలులోకి వస్తుందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అప్పడు మరోసారి వివాదాస్పద పౌరసత్వ చట్టంపై తీవ్ర దుమారం రేగింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సీఏఏను మళ్లీ తెరమీదకు తీసుకువస్తుందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. దేశవ్యాప్తంగా భారీ నిరసనల మధ్య 2019లో పౌరసత్వ సవరణ చట్టం ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇక.. చట్టం అమలు విషయంలో కూడా దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అసోం తదితర రాష్ట్రాల్లో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం అమలు చేయటంలో తాత్కాలికంగా జాప్యం చేస్తూ వచ్చింది. అయితే లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ప్రవేశపెట్టక ముందే.. సీఏఏను అమలు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏమిటీ చట్టం... పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్రైస్తవులకు సీఏఏ వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది. ► గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు. ► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు. ► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి. ► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది. -
CG Case: కేంద్రానికి సుప్రీం కోర్టు అల్టిమేటం!
న్యూఢిల్లీ: కోస్ట్‌గార్డుకు చెందిన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలనే విషయంలో మహిళా అధికారుల అభ్యర్థనను వదిలిపెట్టలేమని మంగళవారం సుప్రీంకోర్టు పేర్కొంది. కోస్ట్‌గార్డుకు చెందిన మహిళా అధికారులకు శాశ్వత కమిషన్‌లో చోటు కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. కోస్ట్ గార్డుకు చెందిన మహిళా అధికారులకు సంబంధించిన శాశ్వత కమిషన్‌ను ఇప్పటికీ ఎందుకు ఏర్పాటు చేయటం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. మీకు(కేంద్ర ప్రభుత్వం) ఏర్పాటు చేయటం చేతకాకపోతే చెప్పండి.. మేం ఏర్పాటు చేస్తాం అని పేర్కొన్నారు. కావున త్వరగా శాశ్వత కమిషన్‌లో మహిళా కోస్ట్ గార్డు అధికారులకు చోటు కల్పించాలని చీఫ్ జస్టిస్.. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణీని ఆదేశించారు. ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేయవల్సిందిగా కోస్ట్‌గార్డును కోరుతామని అటార్నీ జనరల్.. సుప్రీం కోర్టుకు తెలియజేశారు. అదేవిధంగా నేవి, ఆర్మీతో పోల్చితే కోస్ట్‌గార్డు భిన్నమైనదని అటర్నీ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్ తదుపరి విచారణను సుప్రీం కోర్టు మార్చి 1కి వాయిదా వేసింది. ఇక.. ఇండియన్ కోస్ట్‌గార్డు అధికారి ప్రియాంక త్యాగి దాఖలు చేసిన పిటిషన్‌పై ఫిబ్రవరి 19 విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కోస్ట్ గార్డు విషయంలో మహిళా అధికారుల పట్ల ఎందుకు తేడాలు చూపుతున్నారు. మహిళా అధికారులు కోస్ట్ గార్డులో ఎందుకు ఉండకూడదు?. దేశ సరిహద్దుల్లో మహిళలు ప్రహారా కాస్తున్నప్పుడు.. సముద్ర తీరం గస్తీ కాయటంలో తప్పేంటీ?. మీరే(కేంద్ర ప్రభుత్వం) నారీ శక్తి గురించి మాట్లాడుతున్నారు.. దాన్ని ఆచరణలో చూపించండి’ అని కేంద్రాన్ని సుప్రీం కోర్టు తప్పుపట్టింది. -
నూతన క్రిమినల్ చట్టాలు అమలు ఎప్పటి నుంచో తెలుసా?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మూడు నూతన క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు నూతన చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులు చట్టంగా మారాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మూడు క్రిమినల్ బిల్లులను పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన విషయం తెలిసిందే. ఇండియన్ పీనల్ కోడ్–1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్–1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం చదవండి: నూతన క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం -
Padma Awards 2024: అసామాన్య పద్మశ్రీలు
స్త్రీలు జీవానికి జన్మనివ్వడమే కాదు.. జీవాన్ని కాపాడతారు కూడా! ఈసారి భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీలలో కొందరు అసామాన్యమైన స్త్రీలు తమ జీవితాన్ని కళ, పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, ఔషధ మొక్కలు వీటన్నిటిలోని జీవాన్ని కాపాడుకుంటూ రావడం కనిపిస్తుంది. ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన పర్బతి బారువా... లక్షలాది మొక్కలు నాటి ఆకుపచ్చదనం నింపిన చామి ముర్ము... విస్మరణకు గురైన ఔషధ మూలికలకు పూర్వ వైభవాన్ని తెచ్చిన యానుంగ్... కొబ్బరి తోటలు తీయటి కాయలు కాచేలా చేస్తున్న అండమాన్ చెల్లమ్మాళ్... గోద్నా చిత్రకళకు చిరాయువు పోసిన శాంతిదేవి పాశ్వాన్... వీరందరినీ పద్మశ్రీ వరించి తన గౌరవం తాను పెంచుకుంది. ఏనుగుల రాణి భారతదేశ తొలి మహిళా మావటి పర్బతి బారువాకు భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ప్రకటించింది. ఆమె పరిచయం. ఇది సంతోషించదగ్గ విషయం. అస్సాంలో, పశ్చిమ బెంగాల్లో, ఒరిస్సాలో ఎక్కడైనా అటవీ ఏనుగులు అదుపు తప్పి, తల తిక్కగా వ్యవహరిస్తూ ఉంటే పర్బతి బారువాకు పిలుపు వచ్చేది... వచ్చి వాటిని కాస్త పట్టుకోమని, మాలిమి చేయమని. ఇన్నేళ్లకు 69 ఏళ్ల వయసులో ఈ ‘ఏనుగుల రాణి’కి, ఏనుగుల కోసం జీవితాన్ని అంకితం చేసిన రుషికి భారత ప్రభుత్వం నుంచి ‘పద్మశ్రీ‘ స్వీకరించమని పిలుపు వచ్చింది. మన దేశంలోనే కాదు ఆసియాలోనే ప్రమాదస్థాయిలో పడిపోతున్న గజరాజుల సంరక్షణకు, వాటిని ఎలా కనిపెట్టుకోవాలో తెలిపే జ్ఞానాన్ని సముపార్జించి పంచినందుకు ఆమెకు ఈ పురస్కారం ఇవ్వడం సంతోషించాల్సిన సంగతి. కళ్లు తెరవగానే ఏనుగు ‘నాకు ఊహ తెలిసిన వెంటనే నా కళ్ల ఎదురుగా ఏనుగు ఉంది’ అంటుంది పర్బతి. అస్సాంలోని ధుబ్రీ జిల్లాకు చెందిన గౌరిపూర్ సంస్థానం పర్బతి కుటుంబీకులది. పర్బతి తండ్రి రాజా ప్రతాప్ చంద్ర బారువా సంస్థానం మీద వచ్చే పరిహారంతో దర్జాగా జీవిస్తూ 40 ఏనుగులను సాకేవాడు. అంతేకాదు అతనికి ఏనుగులతో చాలా గొప్ప, అసామాన్యమైన అండర్స్టాండింగ్ ఉండేది. వాటి ప్రతి కదలికకూ అతనికి అర్థం తెలుసు. మహల్లో ఉండటం కన్నా కుటుంబం మొత్తాన్ని తీసుకుని అడవుల్లో నెలల తరబడి ఉండటానికి ఇష్టపడే రాజా ప్రతాప్ తన తొమ్మిది మంది సంతానంలో ఒకతైన పర్బతికి ఏనుగుల మర్మాన్ని తెలియచేశాడు. 9 ఏళ్ల వయసు నుంచే పర్బతి ఏనుగులతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. 16 ఏళ్ల వయసులో మొదటిసారి అటవీ ఏనుగును పట్టి బంధించగలిగింది. అది చూసి తండ్రి మెచ్చుకున్నాడు. కష్టకాలంలో ఏనుగే తోడు 1970లో భారత ప్రభుత్వం (విలీనం చేసుకున్న) సంస్థానాలకిచ్చే భరణాన్ని ఆపేయడంతో పర్బతి తండ్రి పరిస్థితి కష్టాల్లో పడింది. రాబడి లేకపోవడంతో ఏనుగులే అతని రాబడికి ఆధారం అయ్యాయి. ఏనుగులను అమ్మి, టింబర్ డిపోలకు అద్దెకిచ్చి జీవనం సాగించాడు. ఆ సమయంలో పర్బతి ఏనుగుల గురించి మరింత తెలుసుకుంది. ఇంకా చెప్పాలంటే ఏనుగు కళ్లను చూసి దాని మనసులో ఏముందో చెప్పే స్థితికి పర్బతి చేరుకుంది. ఏనుగుల ప్రవర్తనకు సంబంధించిన ఆమె ఒక సజీవ ఎన్‌సైక్లోపిడియాగా మారింది. క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్ బీబీసీ వారు ‘క్వీన్ ఆఫ్ ఎలిఫెంట్స్’ పేరుతో పర్బతి మీద డాక్యుమెంటరీ తీయడంతో ఆమె గురించి లోకానికి తెలిసింది. ఉదయం నాలుగున్నరకే లేచి ఏనుగుల సంరక్షణలో నిమగ్నమయ్యే పర్బతి దినచర్యను చూసి సలాం చేయాల్సిందే. ‘ఏనుగును మాలిమి చేసుకోవాలంటే ముందు దాని నమ్మకం, గౌరవం పొందాలి. లేకుంటే ఏనుగులు మావటీలను చంపేస్తాయి. వాటికి జ్ఞాపకశక్తి ఎక్కువ. ఒక ఏనుగు తనను ఇబ్బంది పెడుతున్న మావటిని అతను నిద్రపోతున్నప్పుడు వెతికి మరీ చంపింది’ అంటుంది పర్బతి. కాని నమ్మకం పొందితే ఏనుగుకు మించి గొప్ప స్నేహితుడు లేదని అంటుంది. ‘ఒకో ఏనుగు రోజుకు 250 కిలోల పచ్చగడ్డి తింటుంది. దానికి అనారోగ్యం వస్తే ఏ మొక్క తింటే ఆరోగ్యం కుదుటపడుతుందో ఆ మొక్కను వెతికి తింటుంది. అది తినే మొక్కను బట్టి దాని ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని వైద్యం చేయించాలి’ అంటుందామె. ‘ఎవరికైనా విశ్రాంతి ఉంటుంది కాని మావటికి కాదు. మావటి పని డ్రైవర్ ఉద్యోగం కాదు. కారు గ్యారేజ్‌లో పెట్టడానికి. జీవంతో నిండిన ఏనుగుకు మావటి అనుక్షణం తోడు ఉండాలి’ అంటుందామె. అస్సాం అటవీశాఖలో ‘చీఫ్ ఎలిఫెంట్ వార్డెన్’గా పని చేసిన ఆమె ఇప్పుడు పర్యావరణ సంరక్షణ కోసం పని చేస్తోంది. నారియల్ అమ్మ దక్షిణ అండమాన్‌లోని రంగచాంగ్కు చెందిన 67 ఏళ్ల కామాచీ చెల్లమ్మాళ్ సేంద్రియ కొబ్బరి తోటల పెంపకంలో చేసిన విశేష కృషికి ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది. దక్షిణ అండమాన్‌లో ‘నారియల్ అమ్మ’గా ప్రసిద్ధి చెందింది. వర్షాకాలం తరువాత నేలలో తేమను సంరక్షించడానికి కొబ్బరి ఆకులు, పొట్టు మొదలైన వాటితో సేంద్రియ ఎరువు తయారుచేసింది. ‘నాకు పద్మశ్రీ ప్రకటించారు అని ఎవరో చెబితే నేను నమ్మలేదు. అయోమయానికి గురయ్యాను. అండమాన్‌లోని ఒక మారుమూల గ్రామంలో నివసించే నాకు ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన అవార్డ్ ఎందుకు ప్రకటిస్తారు అనుకున్నాను. ఆ తరువాత నేను విన్న వార్త నిజమే అని తెలుసుకున్నాను’ అంటున్న చెల్లమ్మళ్ ఆగ్రో–టూరిజంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. తమ ప్రాంతంలోని రకరకాల పంటలు, సుగంధ ద్రవ్యాల తోటలు, చేపల పెంపకం...మొదలైనవి ఆగ్రో–టూరిజానికి ఊతం ఇస్తాయి అని చెబుతుంది చెల్లమ్మాళ్. అవమానాలను అధిగమించి గోద్నా చిత్రకళలో చేసిన విశేష కృషికి బిహార్‌లోని మధుబని జిల్లా లహేరిఆగంజ్ ప్రాంతానికి చెందిన శాంతిదేవి పాశ్వాన్ ఆమె భర్త శివన్ పాశ్వాన్లు పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక అయ్యారు. గోద్నా చిత్రకళ ద్వారా ఈ దంపతులు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. అమెరికా నుంచి జపాన్ వరకు వీరి చిత్రాలను ప్రదర్శించారు. తన కులం కారణంగా ఎన్నో అవమానాలకు గురైన శాంతిదేవి, వాటిని అధిగమించి జీ20 సదస్సులో పాల్గొనే స్థాయి వరకు ఎదిగింది. శాంతిదేవి, శివన్ పాశ్వన్ దంపతులు ఇరవైవేల మందికి పైగా గోద్నా చిత్రకళలో శిక్షణ ఇచ్చారు. ఆది రాణి అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన యానుంగ్ జమెహ్ లెగో ఆది తెగ సంప్రదాయ వైద్య విధానాన్ని పునరుద్ధరించడంలో చేసిన కృషికి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్ జిల్లాకు చెందిన 58 సంవత్సరాల యానుంగ్ను అభిమానులు ‘ఆది రాణి’ అని పిలుచుకుంటారు. లక్షమందికి పైగా ఔషధమూలికలపై అవగాహన కలిగించించిన యానుంగ్ ఏటా 5,000 ఔషధ మొక్కలను నాటుతుంది. ప్రతి ఇంటిలో హెర్బల్ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకునేలా కృషి చేస్తోంది. ఆర్థికపరిమితులు ఉన్నప్పటికీ విస్మరణకు గురైన ఆది తెగ సంప్రదాయ వైద్య వ్యవస్థను, సాంప్రదాయ జ్ఞానాన్ని సజీవంగా ఉంచడానికి తన జీవితాన్ని అంకితం చేసింది యానుంగ్. మొక్కవోని ఆత్మస్థైర్యం ‘మొక్కలు నాటడానికి నువ్వు ఏమైనా కలెక్టర్ వా!’ అని ఊరి మగవాళ్లు చామిని వెక్కిరించేవాళ్లు. మొక్కలు నాటడం అనే పుణ్యకార్యం వల్ల ఉత్త పుణ్యానికే ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇంటి నుంచి బయటికి వచ్చిన చామి కూలి పనులు చేసుకుంటూనే 36 ఏళ్ల రెక్కల కష్టంతో 28 లక్షలకు పైగా మొక్కలు నాటింది. ఝార్ఖండ్‌కు చెందిన చామి ముర్ము ‘పద్మశ్రీ’ పురస్కారానికి ఎంపికైంది.... తన గ్రామం భుర్సాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక సమావేశానికి హాజరు కావడం ద్వారా పర్యావరణ కార్యకర్తగా చామీ ముర్ము ప్రయాణం ప్రారంభమైంది. ‘మా ప్రాంతంలో ఎటు చూసినా బంజరు భూములు కనిపించేవి. బాధగా అనిపించేది. ఇలాంటి పరిస్థితిలో మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నాను. అయితే మొక్కలు నాటడం మా ఊరిలోని మగవాళ్లకు నచ్చలేదు. ఇంట్లో కూడా గొడవలు జరిగాయి. ఈ గొడవల వల్ల సోదరుడి ఇంటికి వెళ్లాను. అతడితో కలిసి రోజూ కూలి పనులకు వెళ్లేదాన్ని. ఒకవైపు జీవనోపాధిపై దృష్టి పెడుతూనే మరోవైపు ప్రకృతికి మేలు కలిగించే పనులు చేయడం ప్రారంభించాను’ అంటుంది చామీ ముర్ము. పదో తరగతి వరకు చదువుకున్న చామి మొక్కలు నాటడం, చెట్ల పరిరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నందుకు కొంతమందికి అకారణంగా శత్రువు అయింది. 1996లో చామి నాటిన మొక్కలను ధ్వంసం చేశారు కొందరు. ‘ఇక ఆపేద్దాం. ఎందుకు లేనిపోని గొడవలు’ అని కొందరు మహిళలు చామిని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు. అయితే చామి మాత్రం ఆనాటి నుంచి రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం ప్రారంభించింది. ఆమె ఉత్సాహం ముందు ప్రతికూలశక్తులు తోకముడిచాయి. ‘నన్ను నేను ఒంటరిగా ఎప్పుడూ భావించలేదు. నాకు పెద్ద కుటుంబం ఉంది. నేను నాటిన 28 లక్షలకుపైగా మొక్కలు నా బంధువులే’ అంటుంది చామి. ఝార్ఖండ్‌లోని వెనబడిన జిల్లా అయిన సరైకెలా ఖరావాన్లో రైతులు వ్యవసాయం కోసం వర్షంపై ఆధారపడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సాగునీటి అవసరాల కోసం వాటర్షెడ్లను నిర్మించడానికి చామి కృషి చేస్తోంది. 2,800 స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేసింది. వేలాది మంది మహిళలు బ్యాంకుల నుంచి రుణాలు పొందేలా, సొంత వ్యాపారం ప్రారంభించేలా చేసింది. తనకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై స్పందిస్తూ ‘ఈ అవార్డు రావడం గౌరవంగా భావిస్తున్నాను. పర్యావరణ స్పృహతో మొదలైన నా ప్రయాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి స్ఫూర్తి ఇస్తుంది’ అంటుంది చామి. ఒంటరిగా అడుగులు మొదలు పెట్టినప్పటికీ అంకితభావం కలిగిన వ్యక్తులు సమాజంపై సానుకూల ప్రభావం చూపించగలరు అని చెప్పడానికి చామీ ముర్ము ప్రయాణం బలమైన ఉదాహరణ. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన చామీ ముర్ము పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారతకు ప్రతీకగా నిలుస్తోంది. టింబర్ మాఫియాపై పోరాడిన చామీ ముర్మును ‘లేడీ టార్జన్ ఆఫ్ ఝార్ఖండ్’ అని అభిమానులు పిలుచుకుంటారు. -
బిహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న
న్యూఢిల్లీ: దివంగత బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయన 24 జనవరి, 1924 బిహార్‌లోని సమస్తీపూర్‌లో జన్మించారు. బడుగు, బలహీలన వర్గాల కోసం ఠాకూర్ చేసిన కృషికి గుర్తింపుగా.. ఆయన శత జయంతి సందర్భంగా భారతరత్న ప్రకటించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. జననేత ‘జననాయక్’గా కర్పూరి ఠాకూర్ ప్రసిద్ధి. ఆయన రెండు సార్లు బిహార్‌కు ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. మొదటి సారి 1970 డిసెంబర్ నుంచి 1971 వరకు బిహార్ సీఎంగా పనిచేశారు. రెండో సారి 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ సీఎంగా సేవలు అందించారు. కర్పూరి ఠాకూర్ 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు చదవండి: Subhash Chandra Bose Jayanti Special: సుభాష్ చంద్రబోస్ ఏం చదువుకున్నారు? -
హఫీజ్ సయీద్‌ను అప్పగించండి
న్యూఢిల్లీ: 26/11 ముంబై దాడుల సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్‌ను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు అధికారికంగా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక వినతిని పాకిస్తాన్ ప్రభుత్వానికి పంపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సయీద్‌ను అప్పగించడానికి చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని కోరినట్లు తెలియజేశాయి. భారత్ రూపొందించిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో హఫీజ్ సయీద్ ఉన్నాడు. అతడి తలపై అమెరికా ప్రభుత్వం 10 మిలియన్ డాలర్ల బహుమానం ప్రకటించింది. 2008 నాటి ముంబై దాడులకు వ్యూహ రచన చేసిన హఫీజ్ సయీద్‌ను విచారించేందుకు భారత ప్రభుత్వం ప్రయతి్నస్తోంది. అతడిని తమకు అప్పగించాలని భారత్ పదేపదే కోరుతున్నా పాకిస్తాన్ పట్టించుకోవడం లేదు. -
చైనాలో నిమోనియా కలకలంపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ: చైనాలో కొత్తగా నిమోనియా కేసులు వెలుగుచూస్తుండటంపై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలో సమగ్రస్థాయిలో ఆరోగ్య సంసిద్ధతపై సమీక్ష నిర్వహించుకోవాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటన జారీచేసింది. ‘ఉత్తర చైనాలో చిన్నారుల్లో శ్వాససంబంధ కేసుల ఉధృతి కనిపిస్తోంది. ఈ పరిస్థితిని భారత సర్కార్ నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పుటికిప్పుడు భయపడాల్సిన పని లేదు. కానీ ముందు జాగ్రత్త చర్యగా మీమీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆరోగ్య సన్నద్ధతపై సమీక్ష నిర్వహించుకోండి’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనా యంత్రాంగాలకు లేఖ రాశారు. ‘‘ ఇంఫ్లూయెంజా తరహా కేసు(ఐఎల్ఐ), అత్యంత తీవ్రమైన శ్వాస(ఎస్ఏఆర్ఐ) కేసుల విషయంలో కోవిడ్‌కాలంలో అనుసరించిన విధానాలనే ఇప్పుడు పాటించండి. ఈ తరహా కేసులు, ముఖ్యంగా చిన్నారుల్లో కనిపిస్తే జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమగ్ర వ్యాధి నిఘా వ్యవస్థల నేతృత్వంలో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోండి. ఈ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు సంబంధిత పోర్టల్‌లో అప్లోడ్ చేయండి. అనుమానిత కేసుల శాంపిళ్లను వైరస్ రీసెర్చ్, డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీలకు పంపించండి. ఇలాంటి ముందస్తు, అప్రమత్త చర్యల ద్వారానే ఆరోగ్య అత్యయక స్థితి దాపురించకుండా పౌరులను కాపాడగలం’’ అని లేఖలో కార్యదర్శి పేర్కొన్నారు. ఉత్తర చైనాలో శ్వాస సంబంధ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదికలో వెల్లడైంది. ఇన్‌ఫ్లూయెంజా, మైకోప్లాస్మా నిమోనియా, సార్స్–కోవ్–2 కేసుల ఉధృతి ఎక్కువగా ఉంది. చలికాలం కావడంతో చైనాలో సాధారణంగానే మైకోప్లాస్మా నిమోనియా కేసులు ఎక్కువగా వెలుగుచూస్తుంటాయి. ‘‘కేసులపై అదనపు సమాచారం ఇవ్వాలని చైనా యంత్రాంగాన్ని డబ్ల్యూహెచ్ఓ కోరింది. అంతమాత్రాన పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కాదు’’ అని కార్యదర్శి స్పష్టంచేశారు. -
ఢిల్లీలో భూటాన్ రాజుకు ఘనస్వాగతం
న్యూఢిల్లీ: భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్చుక్కు ఆదివారం ఢిల్లీలో భారత ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. విదేశాంగమంత్రి ఎస్.జైశంకర్ విమానాశ్రయంలో ఆయనకు ఆహ్వానం పలికారు. అనంతరం ఆయనతో భేటీ అయ్యారు. భారత్‌లో రాజు వాంగ్‌చుక్ ఎనిమిది రోజుల పర్యటన ఈ నెల 3న అస్సాం రాజధాని గువాహటిలో మొదలైంది. పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు. -
పటిష్ఠతే పరమావధి!
అనుమానం పెనుభూతం! ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు కార్యక్రమమైన మన ‘ఆధార్’ విశ్వసనీయతపై ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఏవో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. భారత సర్కార్ ఎప్పటికప్పుడు ఆ అనుమానాల్నీ, ఆరోపణల్నీ కొట్టిపారేస్తున్నా అవి మాత్రం ఆగడం లేదు. ప్రపంచశ్రేణి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన తాజా నివేదికలో ఆధార్ భద్రత, వ్యక్తిగత గోప్యతలపై లేవనెత్తిన ప్రశ్నలతో ఈ అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఎలాంటి సాక్ష్యాధా రాలూ పేర్కొనకుండా, అర్థం లేని ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ ప్రభుత్వం సహజంగానే ఈ నివేదికను కొట్టిపారేసింది. అయితే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద శ్రామికులకు జరిపే చెల్లింపులు సహా సమస్తం ఇకపై ఆధార్‌తోనే జరపాలని ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్ని స్తున్న వేళ మూడీస్ నివేదికలోని మాటలు కొంత ఆందోళన రేపుతున్నాయి. సత్వరమే ఆ అనుమా నాల్ని నివృత్తి చేసి, ఆధార్ సందేహాతీతమైనదని మరోసారి చాటాల్సిన అవసరం ఏర్పడింది. న్యూయార్క్ కేంద్రంగా నడిచే రేటింగ్ ఏజెన్సీ మూడీస్ గురువారం విడుదల చేసిన పరిశోధనా నివేదిక ఆ మధ్య కొత్తగా రంగప్రవేశం చేసిన ‘వరల్డ్ కాయిన్’తో మన ఆధార్‌ను పోల్చింది. విస్తృత పరిమాణం, సృజనాత్మక ఆలోచన రీత్యా రెండూ ప్రత్యేకంగా నిలిచాయని ప్రశంసించింది. అయితే, భద్రత, గోప్యతలే అసలు సమస్యలంటూ కొన్ని ప్రాథమికమైన ప్రశ్నలు వేసింది. ఉష్ణోగ్రత, ఉక్క పోత ఎక్కువగా ఉండే చోట ఆధార్ లాంటి బయోమెట్రిక్ సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు సమర్థంగా పనిచేస్తుందన్నది సదరు నివేదిక అనుమానం. ఆధార్ ధ్రువీకరణలో ఇబ్బందుల వల్ల పలుమార్లు సేవలు అందడం లేదనేది దాని వాదన. అన్నిటి కన్నా ముఖ్యంగా, ఆధార్ వ్యవస్థ సురక్షితమేనా, అందులోని వ్యక్తిగత సమాచారం గోప్యమేనా అన్నది మూడీ సంధిస్తున్న ప్రశ్న. దేశంలో 120 కోట్లమందికి పైగా బయోమెట్రిక్, జనసంఖ్యా సంబంధ వివరాలను ఈ ఆధార్ బృహత్ యజ్ఞంలో నమోదు చేశారు. ఎవరికి వారికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించారు. వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్, వన్‌టైమ్ పాస్వర్డ్ లాంటì పద్ధతుల్లో వ్యక్తులు తమ గుర్తింపును నిర్ధారించి, ప్రభుత్వ, ప్రైవేట్ సేవలను అందుకొనే వీలు కల్పించారు. మొదట కొంత తటపటాయింపు ఉన్నా, క్రమంగా ఆధార్ నమోదు, దాని వినియోగం విస్తరించింది. బలహీనవర్గా లకు అందించే ప్రభుత్వ సహాయాలకే కాదు... చివరకు బ్యాంకు ఖాతాల ఆరంభం, మొబైల్ కనెక్షన్, పన్నుల చెల్లింపు సహా అనేక రోజువారీ పనులకు సైతం ఆ నంబర్ తప్పనిసరైంది. దళారుల బాధ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే సంక్షేమ పథకాల సాయం అందేలా ఆధార్ బాట వేసింది. ఆధార్ వ్యవహారాలన్నీ చూసే కేంద్ర సంస్థగా ‘భారత యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ’ (యూఐడీఎఐ) వ్యవహరిస్తోంది. చిత్రం ఏమిటంటే, సదరు సంస్థకు నాలుగేళ్ళుగా నాధుడు లేడు. ఎట్టకేలకు గత నెలలో ప్రభుత్వం ఓ తాత్కాలిక ఛీఫ్‌ను నియమించింది. ఇలాంటి చర్యలు ఆధార్ నిర్వహణ పట్ల పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అలాగే, ఈ సంస్థపై ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా’ (కాగ్) నిరుడు విడుదల చేసిన నివేదిక సైతం ఆధార్ నమోదు ప్రక్రియలో లోపాలు, తప్పుడు బయోమెట్రిక్ లాంటి అనేక అంశాలను ఎత్తిచూపడం గమనార్హం. ఆధార్‌లో నమోదైన సమాచారపు భద్రత, వ్యక్తిగత గోప్యత గాలికి పోయే ప్రమాదాన్ని హెచ్చరించింది. ఇవాళ్టి మూడీస్ నివేదిక కన్నా చాలా ముందే మన ‘కాగ్’ వ్యక్తం చేసిన ఈ భయాలపై ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నదీ సమాచారం లేదు. కేంద్రంలో గడచిన ‘ఐక్య ప్రగతిశీల కూటమి’ (యూపీఏ) ప్రభుత్వ హయాంలో ఆరంభమైన ప్పటి నుంచి ఆధార్‌పై భిన్న వాదనలు వస్తూనే ఉన్నాయి. ఆధార్‌కు అనేక సానుకూలతలు ఉన్నప్ప టికీ ఈ ప్రక్రియ, వినియోగం నిర్దుష్టమైనదేమీ కాదని సర్కార్ నుంచి సామాన్యుల దాకా అందరికీ తెలుసు. ఇవాళ్టికీ గ్రామీణ భారతావనిలో డిజిటల్ గుర్తింపు చూపలేనివారికి రేషన్ అంద ట్లేదనీ, కొన్ని ఆకలి చావులకు అదీ ఒక కారణమనీ వార్తలొచ్చాయి. ఆధార్ లోపానికీ, ఆ చావులకూ కారణం లేదన్న ఖండనలూ విన్నాం. అయితే, అతిగా టెక్నాలజీపై ఆధారపడి, సాయం పొందా ల్సినవారిని తృణీకరించడం, అసలు లక్ష్యాన్ని విస్మరించడం అమానవీయతే! రోజూ పనిపాటలతో శ్రమించే వారి చేతిరేఖలు చెరిగిపోతే అది వారి పాపమా? కంటిపాపల స్కానింగ్, వన్‌టైమ్ పాస్వర్డ్ లాంటివి కూడా ఉన్నా నెట్ సౌకర్యం లేని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో వాటి మీద పూర్తిగా ఆధారపడలేం. అలాగే, అంచెలంచెల సైబర్ భద్రత ఉందని సర్కారు చెబుతున్నప్పటికీ, అనేక సందర్భాల్లో ఆధార్ సమాచారం గంపగుత్తగా లీకవడం చూశాం. ఈ సమాచార నిధి సైబర్ దొంగల చేతిలో పడితే పర్యవసానాలూ తీవ్రమే! అందుకే, లోపాలను ప్రస్తావించినవారిని నిందించే కన్నా, వాటిని సరిదిద్దడంపై దృష్టి పెట్టడం తక్షణ కర్తవ్యం. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న కేంద్రీకృత విధానం బదులు సమాచార గోప్యత, రక్షణ కోసం మూడీస్ సూచించినట్లుగా ఆధార్‌కు వికేంద్రీకరణ విధానాన్ని అవలంబించడం మంచిదేమో చూడాలి. తద్వారా ఒక అంచెలో ఉల్లంఘన జరిగినప్పటికీ, అక్కడితో నష్టనివారణ చేయగలమని గుర్తించాలి. ఇటీవల జీ–20లోనూ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)లో అద్భుతమంటూ మనం చెప్పుకున్న ఆధార్ వ్యవస్థపై సమగ్ర సమీక్ష జరపాలి. పూర్తి లోపరహితంగా మార్చే పని మొదలుపెట్టాలి. ఓటర్ల జాబితా సహా సమస్తానికీ ఆధారంగా అనుసంధానించాలని అనుకుంటున్న వేళ అది మరింత అవసరం. -
ఈ పరిస్థితి మారేదెట్లా?
భారత – కెనడా సంబంధాలు కొంతకాలంగా ఇరుకునపడ్డ మాట నిజమే కానీ, గత వారం రోజుల పరిణామాలతో అధఃపాతాళానికి పడిపోయాయి. కెనడా పౌరుడైన ఓ ఖలిస్తానీ సిక్కును భారత్ హతమార్చిందంటూ ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో గత వారం చేసిన ఆరోపణ ఒక్కసారిగా పరిస్థితిని దిగజార్చింది. భారత ప్రభుత్వం ఆ ఆరోపణల్ని తీవ్రంగా ఖండించడం, కెనడా తన మాట వెనక్కి తీసుకోకపోవడం, వరుస దౌత్యవేత్తల బహిష్కరణలు... కొద్దిరోజులుగా వేడిని పెంచుతూ వస్తున్నాయి. భారత్‌లో పర్యటించదలచినవారికి అనేక జాగ్రత్తలు చెబుతూ కెనడా ప్రత్యేక సూచన లిస్తే, కెనడా దేశస్థులకు వీసాల జారీని భారత్ నిలుపు చేసింది. ఆలస్యంగానైనా నిద్ర లేచిన భారత సర్కార్ సదరు ఖలిస్తానీ మద్దతుదార్లకు దేశంలో ఉన్న ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవడం మొదలెట్టింది. తాజాగా ఐరాస వేదికపైనా అంతర్లీనంగా కెనడా వైఖరిని ఎండగట్టింది. వరుస చూస్తే,రెండు దేశాల మధ్య దౌత్యఘర్షణకు ఇప్పుడప్పుడే తెర పడేలా కనపడట్లేదు. ఈ వ్యవహారంలో తప్పంతా కెనడా ప్రధానిదే. వారం క్రితం భారత్‌పై తీవ్ర ఆరోపణతో రెండు దేశాల మధ్య దౌత్య తుపాను రేపిన ట్రూడో ఇప్పటి వరకు సాక్ష్యం చూపలేకపోయారు. అదేమంటే, ‘ఫైవ్ ఐస్’ గూఢచర్య కూటమి సేకరించిన సమాచారమే ఈ ఆరోపణకు ఆధారమని కెనడా దేశపు మీడియాలో లీకులు వస్తున్నాయి. ఆ మాటకొస్తే ట్రూడో హయాంలో భారత్‌కు వ్యతిరేకంగా జరిగిన అరాచకాలు అనేకం. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యను కొని యాడే శకటాలు, దౌత్యవేత్తలపై హింసను ప్రేరేపిస్తూ ‘‘కిల్ ఇండియా’’ పేరిట పోస్టర్లు, హిందూ ఆలయాలపై దాడుల లాంటివన్నీ ఆయన ఏలుబడిలో ఎగసిపడ్డవే. కెనడాలోని సిక్కు ఓట్ల కోసం తీవ్రవాద సభలకు సైతం ఆయన హాజరయ్యారు. అప్పట్లోనే భారత దౌత్యవేత్తలు తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కెనడా ప్రయోజనాల కన్నా తన స్వప్రయోజనాలకే ట్రూడో పెద్ద పీట వేస్తున్నట్టున్నారు. ఖలి స్తానీ మద్దతుదారుల్ని సంతోషపరచి, నాలుగు ఓట్లు ఎక్కువ సంపాదించాలన్నదే ఆయన తాప త్రయంగా కనిపిస్తోంది. పరిణతి లేని ఆయన రాజకీయ చర్యలపై నిపుణులైన కెనడా దౌత్యవేత్తలు ఇప్పటికే పెదవి విరిచారు. 2018లో భారత పర్యటన సందర్భంగా నేరస్థుణ్ణి విందుకు ఆహ్వానించి ఫోటోలు దిగి రచ్చ రేపిన ట్రూడో తన తాజా చర్యలతో ఏకంగా భారత్‌తో బంధానికే పూర్తిగా నిప్పంటించేశారు. నిజానికి, భారత అభ్యర్థనపై 2016 నుంచి ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్‌లో ఉన్న తీవ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ జూన్ 18న గుర్తు తెలియని దుండగుల తుపాకీ కాల్పులకు చనిపో యాడు. నాలుగు నెలల తర్వాత ట్రూడో నిద్ర లేచి, అది భారత్ చేసిన హత్య అనడం విడ్డూరం. పడిపోతున్న ప్రతిష్ఠను నిలబెట్టుకొనేందుకే జస్టిన్ ట్రూడో ఇలా అంతర్జాతీయంగా భారత్‌పై బురద జల్లాలని ప్రయత్నిస్తున్నారు. గతంలో 1968 నుంచి 1984 మధ్య కెనడా ప్రధానిగా పనిచేసిన ఆయన తండ్రి ప్రియర్ ట్రూడో సైతం ఇలాగే పెడసరంగా వ్యవహరించారు. సిక్కు తీవ్రవాది తల్విందర్ సింగ్ పర్మార్‌ను అప్పగించమని అభ్యర్థిస్తే నిరాకరించారు. చివరకు ఆ తీవ్రవాది ఓ ఉగ్రసంస్థకు అధిపతై, 1985లో ఎయిరిండియా విమానాన్ని బాంబు పెట్టి పేల్చేసి, 329 మంది మరణానికి కారణ మయ్యాడు. 2016లో తండ్రి లానే కొడుకు ప్రధాని కాగానే, ఆ కేసులో శిక్షపడ్డ ఏకైక వ్యక్తి పెరోల్‌పై విడుదలయ్యాడు. 2018లో ట్రూడో భారత్ సందర్శించినప్పుడు అప్పటి పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ తాము అన్వేషిస్తున్న తీవ్రవాదుల జాబితాను అందజేశారు. తాజాగా మరణించిన నిజ్జర్ పేరూ అందులో ఉంది. ఈసారి పెద్ద ట్రూడో బాటలోనే చిన్న ట్రూడో చర్యలేమీ చేపట్టలేదు. నిజ్జర్ మరణంపై ఇంతవరకు చేసిన దర్యాప్తు, అనుమానితులు, అదుపులో తీసుకున్న పేర్లేమీ కెనడా చెప్పట్లేదు. ఇండియాపై ఆరోపణలు చేసి పది రోజులవుతున్నా తన వాదనకు బలం చేకూర్చే సాక్ష్యమేమీ ట్రూడో చూపలేకపోయారన్నది గుర్తించాలి. ఈ గొడవ ఇలా నడుస్తుండగానే, నాజీ సంబంధాలున్న ఓ వయోవృద్ధుడిని శుక్రవారం కెనడా పార్లమెంట్ గౌరవించి, మరో తప్పు చేసింది. ఆఖరికి స్పీకర్ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తాము నెత్తిన పెట్టుకుంటున్న వ్యక్తుల నేపథ్యం తెలుసుకోవడంలో కెనడా పాలనా యంత్రాంగం విఫలమవుతోందనడానికి ఇది మరో మచ్చుతునక. భారత్ సైతం విదేశీగడ్డపై నివసిస్తూ, మాతృదేశానికి ద్రోహం చేయాలని చూస్తున్నవారిపై ఇకనైనా కఠినంగా వ్యవహరించాలి. ఈ ఖలిస్తానీలకు నిధులెక్కడ నుంచి వస్తున్నాయి, వారికి తెరచాటు అండదండ ఎవరనేది కనిపెట్టి, సాక్ష్యాధారాలతో అంతర్జాతీయంగా బట్టబయలు చేయాలి. దేశంలో ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్ల లాంటి వంద తలనొప్పులున్న ట్రూడో నిరాధార ఆరోప ణలకు దిగే కన్నా ముందు ఆ సమస్యలపై దృష్టి పెట్టాలి. ఎనిమిదేళ్ళ క్రితం ఎన్నుకున్న తనను 63 శాతం మంది ఇప్పుడు వ్యతిరేకించడానికి కారణాలు గ్రహించాలి. ఎన్నికల్లో ఓట్లు, సీట్లు, నిధుల కోసం ఆయన పార్టీ వర్గాలు ఖలిస్తానీ అనుకూల వర్గాలపై అతిగా ఆధారపడడం మానుకోవాలి. పౌరుల భావస్వేచ్ఛను పరిరక్షించాల్సిందే కానీ, ఆ మిషతో తీవ్రవాదం సాగిస్తే సహించబోమని అక్కడి సిక్కు ప్రవాసీలకూ స్పష్టం చేయాలి. కెనడాకు 10వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి భారత్. అక్కడి పర్యాటకుల సంఖ్యలో నాలుగో స్థానం మనదే. కెనడాకెళ్ళే విద్యార్థుల్లో 40 శాతం మనవాళ్ళే. అందుకే ఎన్నికల్లో గెలుపోటముల కన్నా దేశాల మధ్య దశాబ్దాల బంధం ముఖ్యమని ట్రూడో గ్రహించాలి. భారత్ సైతం పరిస్థితిని చక్కదిద్దడమెలాగో ఆలోచించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి. ఇరుపక్షాలకూ కావాల్సిన అమెరికా మధ్యవర్తిత్వమూ అందుకు కలిసిరావచ్చు. -
వర్ధమాన మార్కెట్ల ఇండెక్స్‌లో జీసెక్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి వర్ధమాన మార్కెట్ల(ఈఎం) ఇండెక్స్‌లో భారత ప్రభుత్వ సెక్యూరిటీ(జీసెక్)లను చేర్చే ప్రణాళికల్లో ఉన్నట్లు గ్లోబల్ ఫైనాన్షియల్ దిగ్గజం జేపీ మోర్గాన్ తాజాగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ బాండ్ల ద్వారా సమీకరించే రుణ వ్యయాలు తగ్గే వీలుంది. భారత ప్రభుత్వ బాండ్ల(ఐజీబీ)ను 2024 జూన్ 28 నుంచి 2025 మార్చి 31వరకూ 10 నెలలపాటు ఇండెక్సులో చేర్చనుంది. ఫలితంగా ఇండెక్స్ వెయిటేజీ ప్రతీ నెలా ఒక శాతంమేర పెరగనుంది. వెరసి జీబీఐ–ఈఎం గ్లోబల్ డైవర్సిఫైడ్ ఇండెక్స్‌లో ఇండియా వెయిటేజీ గరిష్టంగా 10 శాతాన్ని తాకవచ్చని అంచనా. ఇక జీబీఐ–ఈఎం గ్లోబల్ ఇండెక్స్‌లో సుమారు 8.7 శాతానికి చేరే వీలున్నట్లు జేపీ మోర్గాన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. పలు విదేశీ ఫండ్స్.. గ్లోబల్ ఇండెక్సుల ఆధారంగా పెట్టుబడులు చేపట్టే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు భారీగా పుంజుకునేందుకు ఇది సహకరించనుంది. అంతేకాకుండా విదేశాల నుంచి ప్యాసివ్ పెట్టుబడులు భారీ స్థాయిలో తరలి వచ్చేందుకు వీలుంటుంది. పరిశ్రమలకు దేశీయంగా మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఆహా్వనించదగ్గ పరిణామం జేపీ మోర్గాన్ తాజా ప్రణాళికలపై స్పందనగా.. ఇది ఆహా్వనించదగ్గ పరిణామమంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పట్టిచూపుతున్నదని వ్యాఖ్యానించారు. ఇది జేపీ మోర్గాన్ సొంతంగా తీసుకున్న నిర్ణయంకాగా.. భారత్‌కున్న భారీ వృద్ధి అవకాశాలు, స్థూల ఆర్థిక విధానాలపట్ల ప్రపంచ ఫైనాన్షియల్ సంస్థలు, మార్కెట్లకున్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. దేశీ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా భారీగా లాభపడుతున్న దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల మాదిరి భారత్ ప్రభుత్వ బాండ్లలోనూ దీర్ఘకాలిక పెట్టుబడిదారులు లబ్ది పొందుతారని తెలియజేశారు. దేశీ కరెన్సీ బలపడేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఇండెక్సులలో లిస్టయ్యే వీటికి లాకిన్ అవసరం ఉండదని స్పష్టం చేశారు. 10 శాతం వాటా జేపీ మోర్గాన్ ఇండెక్స్‌కుగల 240 బిలియన్ డాలర్ల విలువలో ఇండియాకు 10 శాతం వాటా లభించనుంది. వెరసి 24 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు వీలుంది. ఇది భారత్ బేస్ రేటులో మార్పులు తీసుకురానుండగా.. ఈల్డ్ భారీగా తగ్గనుంది. దీంతో భారత ప్రభుత్వ రుణ వ్యయాలు దిగిరానున్నట్లు ఏయూఎం క్యాపిటల్ నేషనల్ హెడ్ వెల్త్ ముకేష్ కొచర్ పేర్కొన్నారు. ఇక గ్లోబల్ ఇండెక్సులలో ఐజీబీకి చోటు లభించడం ద్వారా రిస్కులకంటే లాభాలే అధికంగా ఉండనున్నట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. నెలకు 1.5–2 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు వీలున్నట్లు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ అంచనా వేసింది. ఇది ప్రపంచస్థాయిలో భారత ప్రొఫైల్‌కు బలిమినివ్వడంతోపాటు.. దేశీయంగా మూలాలు మరింత పటిష్టంకానున్నట్లు అభిప్రాయపడింది. ప్రభుత్వ సెక్యూరిటీలకు డిమాండును మరింత పెంచనున్నట్లు యాంఫి పేర్కొంది. -
రాక్షస మూక
► జమూకశ్మిర్లోని అనంత్‌నాగ్ జిల్లాలో బుధవారం భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆర్మీ కల్నల్, మేజర్, డీఎస్పీ మృతి చెందడం తీవ్ర విషాదాన్ని సృష్టించింది. ముష్కరుల దుశ్చర్యకు దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముగ్గురు ఉన్నతాధికారులను బలి తీసుకున్న రాక్షస మూక కోసం వేట ముమ్మరంగా సాగుతోంది. ఎన్కౌంటర్లో ముగ్గురి మరణానికి నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధంగా పనిచేస్తున్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్(టీఆర్ఎఫ్) కారణమని ప్రాథమికంగా గుర్తించారు. పాకిస్తాన్ ప్రభుత్వ అండదండలతో ఈ ‘ప్రతిఘటన దళం’ రాక్షస దళంగా చెలరేగిపోతోంది. ప్రస్తుతం జమ్మూకశ్మిర్ అధికార యంత్రాంగానికి పెనుసవాలుగా మారింది. భద్రతా సిబ్బందితోపాటు సామాన్య ప్రజలను పొట్టన పెట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో అసలు ఏమిటీ టీఆర్ఎఫ్? దాని పుట్టుపూర్వోత్తరాలేమిటో తెలుసుకుందాం.. టార్గెట్ కశ్మిరీ పండిట్లు.. ►జమ్మూకశ్మిర్‌కు స్వయం ప్రతిపత్తి కలి్పస్తున్న ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం 2019 ఆగ స్టులో రద్దు చేసి పారేసింది. ఈ పరిణామాన్ని ఉగ్రవాదులు ఏమాత్రం జీరి్ణంచుకోలేకపోయారు. ఆర్టికల్ 370ని రద్దు చేసిన కొంత కాలానికే అదే సంవత్సరం ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ పురుడు పోసుకుంది. పురుడు పోసింది లష్కరే తోయిబా నాయకత్వమే. నిఘా వర్గాలకు దొరక్కుండా ఆన్లైన్ ద్వారా సభ్యులను చేర్చుకోవడం, నిధులను సేకరించడం మొదలుపెట్టారు. ఇతర ఉగ్రవాద ముఠాల్లోని కొందరు సభ్యులు సైతం టీఆర్ఎఫ్లో చేరిపోయారు. పాకిస్తాన్ సైన్యంతోపాటు పాకిస్తాన్ నిఘా సంస్థ ‘ఐఎస్ఐ’ మద్దతు కూడా దొరకడంతో కశ్మీర్ లోయలో టీఆర్ఎఫ్ అత్యంత చురుగ్గా మారిపోయింది. కార్యకలాపాలను ఉధృతం చేసింది. పదుల సంఖ్యలో ఉగ్రవాద దాడులకు పాల్పడింది. టీఆర్ఎఫ్ ప్రధాన లక్ష్యం భారత జవాన్లు, జమ్మూకశ్మిర్‌లోని మైనారీ్టలే. కశ్మిరీ పండిట్లను అంతం చేయడమే ధ్యేయంగా దాడులకు దిగుతోంది. పాక్ నుంచి ఆయుధాలు, డ్రగ్స్ స్మగ్లింగ్ ►టీఆర్ఎఫ్ అరాచకాలు పెరిగిపోతుండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద ఈ ఏడాది జనవరిలో టీఆర్ఎఫ్పై నిషేధం విధించింది. సంస్థ కమాండర్ షేక్ సజ్జాద్ గుల్‌ను యూఏపీఏలోని నాలుగో షెడ్యూల్ కింద ఉగ్రవాదిగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని రోజ్ అవెన్యూ కాలనీకి చెందిన షేక్ సజ్జాద్ గుల్ చిన్నప్పటి నుంచి ఉగ్రబాట పట్టాడు. 2018 జూన్‌లో జరిగిన కశ్మిరీ జర్నలిస్టు షుజాత్ బుఖారీ హత్య వెనుక అతడి హస్తం ఉన్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. టీఆర్ఎఫ్ లష్కరే తోయిబాకు అనుబంధంగా వ్యవహరిస్తోందని రాజ్యసభలో కేంద్ర హోంశాఖ ప్రకటించింది. భద్రతా సిబ్బందిని, మైనార్టీలను హత్య చేయడంతోపాటు పాకిస్తాన్ భూభాగం నుంచి ఆయుధాలు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు పాల్పడుతోందని, అక్కడి నుంచి ఉగ్రవాదులను భారత్‌లోకి చేరవేస్తోందని వెల్లడించింది. ఎందుకు సృష్టించారు? ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నందుకు గాను పాకిస్తాన్‌ను పారిస్‌కు చెందిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్‌్కఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే లిస్టులో చేర్చింది. దీంతో నిషేధిత ఉగ్రవాద సంస్థలకు నేరుగా నిధులు అందించే మార్గం మూసుకుపోయింది. నిధులు ఆగిపోవడంతో లష్కరే తోయిబా, దాని అధినేత హఫీజ్ సయీద్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర య్యాయి. అందుకే లష్కరే తోయిబాకు అనుబంధంగా ద రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను సృష్టించా రు. పాకిస్తాన్ సర్కారు నేరుగా టీఆర్ఎఫ్కు నిధులు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఉగ్రవాద సంస్థ అని గానీ, మతపరమైన సాయుధ దళం అని గానీ చెప్పకుండా స్థానిక ప్రతిఘటన దళంగా మభ్యపెట్టడానికి టీఆర్ఎఫ్ అని నామకరణం చేసినట్లు స్పష్టమవుతోంది. ఉధృతంగా చేరికలు.. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2022లో జమ్మూకశ్మిర్‌లో భద్రతా దళాలు 90కిపైగా అపరేషన్లు నిర్వహించాయి. ఈ ఆపరేషన్లలో 42 మంది విదేశీ ఉగ్రవాదులు సహా మొత్తం 172 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో 108 మంది టీఆర్ఎఫ్కు చెందినవారే కావడం గమనార్హం. అలాగే 2022లో దాదాపు 100 మంది యువకులు ఉగ్రవాద సంస్థల్లో చేరగా, వీరిలో ఏకంగా 74 మంది కేవలం టీఆర్ఎఫ్లోనే చేరడం గమనార్హం. దీన్నిబట్టి టీఆర్ఎఫ్ నుంచి ఎదురవుతున్న ముప్పును అర్థం చేసుకోవచ్చు. నిషేధించిన మరుసటి రోజే ‘హిట్ లిస్ట్’.. ►భారత్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 44 ఉగ్రవాద సంస్థలను ప్రభుత్వం యూఏపీఏ కింద నిషేధించింది. వీటన్నింటిలో టీఆర్ఎఫ్ అత్యంత చురుగ్గా పని చేస్తున్నట్లు గుర్తించారు. నిషేధం విధించిన మరుసటి రోజే ఈ సంస్థ ‘హిట్ లిస్ట్’ విడుదల చేసింది. అందులో ఉన్న వ్యక్తులందరినీ అంతం చేస్తామని హెచ్చరించింది. సామాన్య యువకులను ఉగ్రవాదం వైపు మళ్లించడానికి టీఆర్ఎఫ్ సోషల్ మీడియాను ఉపయోగించుకుంటోంది. ‘సైకలాజికల్ ఆపరేషన్లు’ చేస్తోంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారిని ప్రేరేపిస్తోంది. యువకుల మనసు మార్చేసి ఉగ్రవాదులుగా తయారు చేస్తోంది. టీఆర్ఎఫ్ జమ్మూకశ్మిర్‌లోని మైనార్టీ సిక్కులను కూడా లక్ష్యంగా చేసుకుంది. ప్రత్యేక పోలీసు అధికారులుగా(ఎస్పీఓ) పనిచేస్తున్న సిక్కు యువకులపై రాస్ట్రియ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఏజెంట్లు అనే ముద్ర వేస్తోంది. టీఆర్ఎఫ్ దాడుల్లో సిక్కులు సైతం బాధితులుగా మారుతున్నారు. టీఆర్ఎఫ్ ముష్కరులు భారత భద్రతా దళాలపై యుద్ధమే సాగిస్తున్నారని చెప్పొచ్చు. అధునాతన ఆయుధాలతో భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకొని కాల్పులకు పాల్పడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గోండి లిపిని గుర్తించాలి
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ గుంజాల గోండి లిపిని భారత ప్రభుత్వం గుర్తించేలా తగు చర్యలు తీసుకోవాలని ఆద్య కళా మ్యూజియం డైరెక్టర్ ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన రాష్ట్రపతి భవన్లో ముర్మును కలిసి తాము సేకరించిన ఆదివాసీ కళాఖండాలను సంరక్షించడంతోపాటు సాహిత్య రంగాల్లో రాణిస్తున్న ఆదివాసులకు తగు గౌరవం కల్పించేలా చొరవ తీసుకోవాలని జయదీర్ రాష్ట్రపతికి కోరారు. -
ప్రక్షాళన అవసరమే కానీ...
ఎప్పుడో 19వ శతాబ్దంలో తొలిసారిగా చట్టంగా రూపుదాల్చిన భారత నేరసంహితను సమూలంగా మార్చేందుకు ఒక అడుగు ముందుకు పడింది. భారత క్రిమినల్ న్యాయ వ్యవస్థను మారుస్తూ,కేంద్ర ప్రభుత్వం ఆగస్ట్ 11న లోక్‌సభలో మూడు కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టింది. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) –1860 స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’, తొలిసారిగా 1898లో చట్టమై ఆనక కొద్దిగా మార్పులు జరిగిన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) – 1973 బదులు ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ – 1872 స్థానంలో ‘భారతీయ సాక్ష్య బిల్లు’ రానున్నాయి. మధ్యలో కొద్ది మినహా గణనీయమైన మార్పులేమీ చేయని భారత సర్కార్ 160 ఏళ్ళ పైచిలుకు క్రితం బ్రిటీషు వారి చట్టాలను సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా మార్చాలను కోవడం సహేతుకమే. అయితే, కొత్త బిల్లుల్ని తీసుకొచ్చే ముందు న్యాయనిపుణులతో, ప్రతిపక్షా లతో ఎంత లోతుగా చర్చించారు? ఇది ప్రశ్నార్థకం. ఈ పరిస్థితుల్లో 3 బిల్లుల్నీ సమీక్షించి, సిఫా ర్సులు చేయడానికి ప్రభుత్వం వాటిని పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపడం స్వాగతనీయం. బిల్లుల్లోని అంశాలపై ప్రజలతో సంప్రతింపులు జరిపి, సిఫార్సులు చేసేందుకు కరోనా కాలంలో 2020 మేలో ప్రభుత్వం నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఆ సంప్రతింపుల ప్రక్రియ విధి విధా నాలు అయోమయమే. వచ్చిన అభ్యర్థనల్ని పరిశీలించి, విశ్లేషించడానికి సదరు నిపుణుల సంఘం ఏ పద్ధతిని అనుసరించిందీ తెలీదు. ఆ నిపుణుల సంఘం ప్రభుత్వానికి ఇచ్చిన సిఫార్సుల్ని ప్రజాక్షేత్రంలో పెట్టనేలేదు. వచ్చిన సిఫార్సులకూ, ప్రభుత్వం బిల్లుల్లో పెట్టిన అంశాలకూ పొంతన ఉండివుండ దని కూడా నిపుణుల మాట. ఇన్ని లోపాలున్నాయి గనకే కొత్త బిల్లుల సామర్థ్యం సందేహాస్పాదం. బ్రిటీషు పాలనా అవశేషాలను తొలగించడమే ధ్యేయమంటూ మోదీ సర్కార్ చెబుతున్న మాట లకూ, కొత్త చట్టాల్లో నిజంగా ఉన్న అంశాలకూ మధ్య ఎంత పొంతన ఉందో చెప్పలేం. క్రిమినల్ న్యాయ వ్యవస్థకు ఈ ప్రక్షాళన సర్వరోగ నివారణి అంటున్నా అదీ అనుమానమే. ఎందుకంటే, పాత చట్టాల్లోని అనేక అంశాలు యథాతథంగా ఈ కొత్త బిల్లుల్లోనూ చోటుచేసుకున్నాయి. కొన్ని మార్పులు ప్రతిపాదించారు కానీ, అవి వ్యవస్థలోని సంక్షోభంపై ఏ మేరకు ప్రభావం చూపుతాయో చెప్పలేం. పైపెచ్చు, కొత్త బిల్లులు ప్రతిపాదించిన కొన్ని మార్పులు ఆందోళన రేపుతున్నాయి. పాత రాజద్రోహ చట్టాన్ని తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి, సామాజిక కార్య కర్తలు, జర్నలిస్టులపై తరచూ దుర్వినియోగమవుతున్న ఈ చట్టానికి గత ఏడాది మేలోనే సుప్రీమ్ కోర్ట్ అడ్డుకట్ట వేసి, సమీక్షను పెండింగ్‌లో పెట్టింది. లా కమిషన్ మాత్రం ఐపీసీలో రాజద్రోహానికి సంబంధించిన ‘సెక్షన్ 124ఏ’ను కొనసాగించాలనీ, శిక్షను పెంచాలనీ రెండునెలల క్రితం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ సెక్షన్‌ను తొలగించాలని సర్కార్ నిర్ణయించడం ఆశ్చర్యమే. లార్డ్ మెకాలే 1837లో రూపకల్పన చేయగా, 1862లో అమలులోకి వచ్చిన ఐపీసీలో రాజద్రోహ చట్టం లేదు. 1870లో దాన్ని చేర్చి, స్వాతంత్య్ర సమరాన్ని అణిచేసేందుకు విస్తృతంగా వినియోగించారు. 1898లో పరిధిని విస్తరించారు. స్వాతంత్య్రం వచ్చాకా ఈ చట్టం కొనసాగుతూ వచ్చింది. దాని రాజ్యాంగబద్ధతపై కోర్టులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశాయి. కొత్త బిల్లులో రాజద్రోహమనే పేరు తొలగించినా, సార్వభౌమాధికారానికి హానికారక చర్యలు శిక్షార్హమంటూ కొత్త మాట తగిలించారు. ఏ చర్యలు ఈ నేరమనేది స్పష్టత లేనందున పోలీసుల ఇష్టారాజ్యపు అరెస్ట్‌లకు అధికారం దఖలు పడుతోంది. అలాగే, ఇప్పటి దాకా ఐపీసీలో లేని వ్యవస్థీకృత నేరం, తీవ్రవాద నేరాలు, మూకదాడి లాంటివీ కొత్తగా చేర్చారు. వివాదాస్పద ‘ఉపా’ చట్టం నుంచి తీసుకున్నవీ ఇందులో ఉండడం విషాదం. అలాగే, సీఆర్పీసీ కింద అరెస్టయిన వ్యక్తిని గరిష్ఠంగా 15 రోజులే పోలీస్ కస్టడీలో ఉంచవచ్చు. కొత్త చట్టంలో చేసిన నేరాన్ని బట్టి 60 నుంచి 90 రోజుల దాకా కస్టడీని పొడిగించవచ్చు. ఇదీ దుర్విని యోగమయ్యే ముప్పుంది. అయితే ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఎఫ్ఐఆర్ నమోదు అవకాశమివ్వడం, పోలీసు సోదా – స్వాధీనాల వేళ తప్పనిసరి వీడియో రికార్డింగ్ లాంటివి బాధితుల హక్కుల్ని కాపాడతాయి. ఎలక్ట్రానిక్ సాక్ష్యాధారాల్ని వినియోగిస్తూ, ఫోరెన్సిక్స్‌కు పెద్ద పీట వేయడం బాగానే ఉన్నా, ఆ సాక్ష్యాల సేకరణ, విశ్లేషణ, వాటిని కోర్టుల్లో వినియోగించే తీరుపై స్పష్టత లేదు. విచారణతోనే జైళ్ళలో మగ్గుతున్న జనం, క్రిక్కిరిసిన జైళ్ళ లాంటి దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం దిశగా ఆలోచించ లేదు. బెయిల్ నిర్ణయంలో చేపట్టాల్సిన సంస్కరణల్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం మన కోర్టుల్లో 4.7 కోట్లపైగా కేసులు పెండింగ్‌లో ఉంటే, మూడింట రెండొంతులు క్రిమినల్ కేసులే. క్రిమినల్ న్యాయవ్యవస్థలో సంస్కరణలపై జస్టిస్ మలిమత్ కమిటీ తన నివేదికను సమర్పించి రెండు దశాబ్దాలు దాటింది. 2007లో మాధవ్ మీనన్ కమిటీ సహా అనేకం వచ్చాయి. చివరకిప్పుడు రథం కదిలింది. కానీ, ఇంగ్లీష్ పేర్లు తీసేసి సంస్కృత, హిందీ పేర్లు పెట్టి, కొత్త సీసాలో పాత సారా నింపితే లాభం లేదు. దశాబ్దాల తర్వాతి ఈ ప్రయత్నమూ చిత్తశుద్ధి లోపించి, అసంతృప్తినే మిగిలిస్తే అంతకన్నా అన్యాయం లేదు. కొత్త చట్టాలకు సర్కార్ మరింత కసరత్తు చేయాలి. పార్లమెంట్లో క్షుణ్ణంగా చర్చించాలి. నేరన్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరమే కానీ, వట్టి చట్టాలు మారిస్తే సరిపోదు. వ్యవస్థకూ, పౌరులకూ మధ్య బంధంలో మార్పు తేవాలి. అప్పుడే వలసవాద వాసనలు వదులుతాయి. అలాకాక ఎన్నేళ్ళయినా పాత పాలకులనే నిందించడం అసమంజసం. అది ఇన్నేళ్ళ సొంత తప్పుల్ని కాలమనే తివాచీ కిందకు నెట్టేసే విఫలయత్నమే! -
బియ్యమో... రామచంద్రా!
గడచిన కొద్దిరోజులుగా అమెరికాలోని దుకాణాల వద్ద భారతీయుల భారీ క్యూలు ఓ హాట్ టాపిక్. రానున్న రోజుల్లో బియ్యానికి కొరత రావచ్చనే భయంతో, నిల్వ చేసుకొనేందుకు ప్రవాస భారతీయులు పెద్దయెత్తున కొనుగోళ్ళకు దిగడంతో తలెత్తిన దృశ్యమది. ఉరుము లేని పిడుగులా బాస్మతి బియ్యం మినహా మిగతా రకాల తెల్ల బియ్యం ఎగుమతుల్ని తక్షణమే నిషేధిస్తూ భారత సర్కార్ గత గురువారం తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో రేపు ఇలాంటి దృశ్యాలు ఇంకేం తలెత్తు తాయో తెలీదు. అది ఫలించక ఇప్పుడు నిషేధమే విధించారు.. ప్రపంచ బియ్యం మార్కెట్‌ను ఇది ఆశ్చర్యపరిచినప్పటికీ, పెరిగిపోతున్న ధాన్యం ధరలను నియంత్రించడం రానున్న ఎన్నికల దృష్ట్యా పాలకులకు అనివార్యమైంది. దేశీయంగా సరఫరా పెంచడానికీ, ద్రవ్యోల్బణానికి ముకుతాడు వేసేందుకూ బియ్యం ఎగుమతులపై ఈ తక్షణ నిషేధం ఉపకరిస్తుందని సర్కార్ భావన. అందుకే, 10 నెలల క్రితం బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం వేసి, ఆంక్షలు పెట్టిన పాలకులు అది ఫలించక ఇప్పుడు నిషేధమే విధించారు. భారత్ మాటెలా ఉన్నా ఇది ప్రపంచానికి ప్రాణసంకటమే. ఇటీవలే నల్లసముద్రపు ఆహార ధాన్యాల ఒప్పందాన్ని రష్యా రద్దు చేసుకోవడంతో వివిధ దేశాల్లో గోదుమలు, మొక్కజొన్నల ధర నింగికెగసింది. ఇప్పుడు భారత బియ్యం ఎగుమతి నిషేధమూ తోడయ్యేసరికి, ప్రపంచ ఆహార ధరలు ఇంకా పెరగవచ్చని ఆందోళన రేగుతోంది. Rice bag NRIs standing in line to collect rice in the US,just like how they stand in front of a ration shop.pic.twitter.com/L0YqEwqrsa— Брат (@B5001001101) July 25, 2023 అత్యధిక బియ్యం ఎగుమతి మన దేశం నుంచే.. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా బియ్యం ఎగుమత య్యేది మన దేశం నుంచే! ప్రపంచ పామాయిల్ ఎగుమతుల్లో ఇండొనేసియా, మలేసియా ఎలాగో బియ్యానికి సంబంధించి మనం అలా! ఎగుమతుల్లో 40 శాతానికి పైగా మన దేశానివే! ఇప్పుడు మన ఉత్పత్తుల్లో ఉన్నతశ్రేణిదిగా భావించే బాస్మతి మినహా మిగతా రకాల బియ్యానికి తాజా నిషేధం వర్తిస్తుంది. పెరిగిన అంతర్జాతీయ అమ్మకాలు సైతం ఈ నిషేధానికి కారణం. గత ఆర్థిక సంవత్సరం భారత్ నుంచి బియ్యం ఎగుమతులు 23 శాతం పెరిగాయి. ఈ ఏడాదిలో జూన్ వరకు మన బియ్యం అంతర్జాతీయ అమ్మకాలు 35 శాతం హెచ్చాయి. వెరసి, గత నెల రోజుల్లో దేశంలో బియ్యం రేటు 3 శాతం పెరిగింది. ఏడాది క్రితంతో పోలిస్తే 11.5 శాతం పెరిగిందని సర్కారే చెబుతోంది. అదేసమయంలో, దేశీయంగా వరి ఉత్పత్తి పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఒకపక్క పంజాబ్, హర్యానా లాంటి చోట్ల వర్షాలతో వరి పంట దెబ్బతింది. మరోపక్క అదనులో తగినంత వర్షాలు పడక కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు వగైరాల్లో వరి నాట్లు ఆలస్యమయ్యాయి. దీంతో భవిష్యత్తులో బియ్యం సరఫరాకు కొరత రావచ్చు. అదే జరిగితే నింగినంటుతున్న ధరలు నేలకు రావడం కష్టమే. ఎన్నికల వేళ అది దెబ్బ తీస్తుందని భావించిన పాలకులు ఎగుమతులపై నిషేధాస్త్రం సంధించారు. మన దేశపు బియ్యం ఎగుమతుల్లో 25 నుంచి 30 శాతం ఇప్పుడు నిషేధానికి గురైన ఈ బాస్మతీయేతర తెల్ల బియ్యమే. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మన దేశం 1.7 కోట్ల టన్నులకు పైగా బియ్యాన్ని భారత్ ఎగుమతి చేస్తోంది. నిషేధంతో ఈ ఎగుమతులు 40 శాతం పడిపోవచ్చు. ఈ నిషేధం తాత్కాలికమేనా? సహజంగానే దీనిపై దేశంలోని ఎగుమతిదారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఈ నిషేధం తాత్కాలికమేననీ, మహా అయితే ఆరు నెలల వరకే ఉండచ్చనీ, ప్రపంచ వాణిజ్య సంస్థ బరిలోకి దిగాక పరిస్థితి చక్కబడుతుందనే ఆశ లేకపోలేదు. బంగ్లాదేశ్, అంగోలా, గినియా, కెన్యా, నేపాల్ సహా 140కి పైగా దేశాలకు మన దేశం బియ్యం ఎగుమతి చేస్తోంది. థాయిలాండ్, వియత్నామ్, పాకిస్తాన్, మయన్మార్ లాంటి ఇతర ఎగుమతి దేశాలూ ఉన్నా భారత నిర్ణయంతో ఏర్పడ్డ లోటును అవి భర్తీ చేయలేవు. ఫలితంగా, విపణిలో ఇతర ఆసియా దేశాల నుంచి వచ్చే బియ్యం ధరలూ పెరిగాయి. బియ్యం ఎగుమతిలో ప్రపంచంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్న థాయిలాండ్, వియత్నామ్‌ల బియ్యం రేటు హెచ్చింది. రష్యా యుద్ధంతో ఉక్రెయిన్ నుంచి ఎగుమతులకు ఆటంకం చాలదన్నట్టు అమెరికాలో ధాన్యం పండించే ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావంతో సతమతమవుతున్నాయి. ఈసారి అమెరికాలో గోదుమల దిగుబడి తగ్గవచ్చు. 16 ఏళ్ళలో ఎన్నడూ లేనంత తక్కువకు నిల్వలు పడిపోవచ్చు. గోదుమలు, బియ్యం – రెంటికీ అగ్రరాజ్యంలో కటకట రావచ్చు. గత ఏడాది మేలో గోదుమల ఎగుమతిపై నిషేధం, సెప్టెంబర్‌లో విరిగిన బియ్యంపైన నిషేధం, బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం సుంకం విధింపు... ఆ వరుసలో వచ్చినదే భారత సర్కార్ తాజా ఉత్తర్వు. ఈ ఏడాది మే నుంచి పంచదార ఎగుమతుల్నీ ఆపారు. ఇవన్నీ తిరోగామి చర్యలైనా, దేశీయ సరఫరాలో ఇబ్బందులతో అనివార్యమైంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పుంజుకుంటున్నా, నాట్లలో జరిగిన జాప్యం దెబ్బతీయవచ్చు. ఇక, ఎల్‌నినో పొంచి ఉండనేవుంది. So it begins. India has banned some rice exports and now people are panic buying up rice. pic.twitter.com/ujpm66ER3n— Ian Miles Cheong (@stillgray) July 23, 2023 జబ్బలు చరుచుకున్నాం.. మరి నిషేధం విధించాల్సి రావడమేమిటి? వీటన్నిటి మధ్య ఈ ఏటి దిగుబడి పరిస్థితి ఏమిటో ఇప్పుడే చెప్పలేం. కానీ, గత ఆర్థిక సంవత్సరం బియ్యం, గోదుమలు – రెండూ ఎన్నడూ లేనంత అధిక దిగుబడినిచ్చాయని జబ్బలు చరుచుకున్నాం. ప్రపంచానికి మనమే ఆహారం అందిస్తున్నామన్నాం. తీరా అప్పుడు గోదుమలు, ఇప్పుడు బియ్యంపై ఇలా నిషే«ధం విధించాల్సి రావడమేమిటి? ఇది బేతాళ ప్రశ్న. అలాగే, ఏళ్ళ తరబడి కష్టంతో ప్రపంచ విపణిలో ఎగుమతిదారుగా సంపాదించుకున్న పేరుకు ఈ నిషేధపుటుత్తర్వులు చేటు చేస్తాయి. గుండుగుత్తగా ఎగుమతులపై నిషేధమనే కన్నా, నిర్ణీత కనీస ధరకు తక్కువైతే ఎగుమతుల్ని అను మతించబోమని చెప్పవచ్చు. దేశీయంగా ఆహార ధరలు నియంత్రించాలంటే పాలకులు ప్రత్యామ్నా యాలు ఆలోచించక తప్పదు. వాణిజ్య విధానాన్ని ఘడియకోసారి మార్చడం మార్గం కానే కాదు! -
నీతి ఆయోగ్ చెప్పినా పైసా ఇవ్వలేదు.. కేంద్రంపై కేటీఆర్ గరం గరం
సాక్షి, హైదరాబాద్: కేంద్రంపై మంత్రి కేటీఆర్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. నీతి ఆయోగ్ చెప్పినా తెలంగాణ రాష్ట్రానికి మోదీ సర్కార్ నయా పైసా ఇవ్వలేదని దుయ్యబట్టారు. విభజన చట్టంలో పొందుపరిచిన ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని చెప్పుకొచ్చారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఎన్నో అంశాల్లో మద్దతు ఇచ్చామని తెలిపారు. కేంద్రానికి మనం రూపాయి ఇస్తే 46 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా తెలంగాణ సాధించుకున్నామని అన్నారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన అభయ్ త్రిపాఠి స్మారక ఉపన్యాసం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని కొత్త రాష్ట్రం – సవాళ్లు అనే అంశంపై ప్రసంగించారు. బోర్లు ఎక్కువ, అందుకే 24 గంటలు అవసరం కేటీఆర్ మాట్లాడుతూ.. ‘1950 నుంచి 2014 వరకు దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్నో సవాళ్లు, సందేహాలు ఉండే. తెలంగాణ ఏర్పడితే ఇక్కడ ఇతర ప్రాంతాల వారి భద్రతపై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కేసీఆర్ ప్రతి ఇంటికి తాగునీరు అందించారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరథ పథకం అమలు చేశాం. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా వ్యవసాయ బోర్లు ఉన్నాయి. కాబట్టి కరెంట్ ఎక్కుక అవసరం పడుతుంది. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల విద్యుత్‌ను ఉచితంగా అందజేస్తున్నాం. కాళేశ్వరంతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైంది. ప్రపంచంలోనే లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఐటీ సెక్టార్లో ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును హైదరాబాద్ దాటేసింది’ అని కేటీఆర్పేర్కొన్నారు. -
ఒబామా వ్యాఖ్యలపై సీతారామన్ మండిపాటు
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మైనారిటీల హక్కుల్ని కాపాడలేకపోతే, ఆ దేశం ఎప్పటికైనా విడిపోయే ప్రమాదం ఉందంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఒబామా హయాంలోనే అమెరికా.. సిరియా, యెమెన్, సౌదీ అరేబియా, ఇరాక్ తదితర ఆరు ముస్లిం మెజారిటీ దేశాలపై వేలాది బాంబులు వేసిందని ఆరోపించారు. ఇది నిజం కాదా? అటువంటి వ్యక్తి ఇలాంటి ఆరోపణలు చేస్తే నమ్మేదెవరు?’ అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోదీని ఓవైపు ముస్లిం మెజారిటీ దేశాలు కీర్తిస్తుంటే మరోవైపు అమెరికా మాజీ అధ్యక్షుడు భారత్‌లోని ముస్లింల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని నిర్మలా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 13 దేశాల నుంచి అత్యున్నత పౌర పురస్కారాలు అందుకున్నారు, అందులో ఆరు ముస్లిం మెజారిటీ దేశాలని ఆమె గుర్తుచేశారు. -
ఆలోచన రేపుతున్న ఆరోపణలు
నూరుపూలు వికసించనీ... వేయి భావాలు సంఘర్షించనీ అంటారు. కానీ, మనమిప్పుడు ఏ చిన్న వ్యతిరేక వ్యాఖ్యనైనా సహించలేని స్థితికి వచ్చేశామా? డిజిటల్, సోషల్ మీడియా విప్లవంతో జనం సమాచారం పంచుకోవడం నుంచి స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తీకరణ దాకా – సమస్తం మారిపోయిన వేళ ప్రభుత్వాల నియంత్రణ ఎంత? ప్రతి ఒక్కరికీ అందుబాటుతో మీడియా ప్రజాస్వామికీకరణతో పాటు విచ్చలవిడితనమూ పెరిగే ప్రమాదం ఉన్నందున ఈ భారీ టెక్ సంస్థల బాధ్యత ఎంత? కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ట్విట్టర్ మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సీ సోమవారం చేసిన సంచలన ఆరోపణలు ఇలాంటి ఎన్నో ప్రశ్నల్ని మరోసారి లేవనెత్తాయి. అమెరికన్ యూట్యూబ్ షో ‘బ్రేకింగ్ పాయింట్స్’కు డోర్సీ ఇచ్చిన ఇంటర్వ్యూ భారత ప్రభుత్వానికీ, పాపులర్ సోషల్ మెసేజింగ్ వేదికకూ మధ్య కొనసాగుతున్న పోరులో కొత్త సంగతులను సోమవారం రాత్రి బయటపెట్టింది. రైతుల ఉద్యమ సమయంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పలు ట్విట్టర్ ఖాతాలను స్తంభింపజేయాల్సిందిగా భారత ప్రభుత్వం నుంచి పలు అభ్యర్థనలు వచ్చాయనేది ఆయన కథనం. అంతకన్నా ఆందోళనకరమైనవి ఏమిటంటే – ప్రభుత్వ డిమాండ్లకు తలొగ్గకపోతే, భారత్‌లో ట్విట్టర్‌ను మూసివేయిస్తామనీ, దేశంలోని సంస్థ ఆఫీసులపైన, ఉద్యోగుల ఇళ్ళపైన దాడులు చేయిస్తామనీ గద్దె మీది పెద్దలు బెదిరించారట. డోర్సీ చేసిన ఈ ఆరోప ణలు తీవ్రమైనవి. సహజంగానే ప్రభుత్వం ఆ ఆరోపణల్ని పూర్తిగా తోసిపుచ్చింది. అంతమాత్రాన కేంద్రంలో గడచిన తొమ్మిదేళ్ళ పైచిలుకు బీజేపీ హయాం సంప్రదాయ మీడి యాకైనా, సోషల్ మీడియాకైనా సవ్యంగా ఉందనుకోలేం. పత్రికలు, టీవీ ఛానళ్ళ నుంచి వెబ్సైట్లు, సోషల్ మీడియా దాకా అన్నిటినీ నయానో, భయానో తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి పాలకులు ప్రయత్నిస్తున్న తీరు కొత్తేమీ కాదు. కొన్ని జాతీయ టీవీ ఛానళ్ళను బీజేపీ పెద్దలు, వారి మిత్రులు, ఆశ్రితులు హస్తగతం చేసుకోవడమూ బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో ట్విట్టర్ మాజీ పెద్ద చేసిన ఆరోపణలు అసత్యమో, సత్యమో కానీ... అసహజమని మాత్రం అనిపించట్లేదు. తొమ్మిదేళ్ళ చరిత్ర చూస్తే నమ్మశక్యంగానే ఉన్నాయి. అదే సమయంలో ట్విట్టర్ సారథ్యం వదిలేసిన ఇంతకాలానికి డోర్సీ ఇప్పుడు ఈ అంశాలను ఎందుకు లేవనెత్తుతున్నారన్నదీ ఆలోచించాల్సినదే! ట్విట్టర్ పులు కడిగిన ముత్యం అనుకోలేం. పలు సందర్భాల్లో ఏకపక్షంగా వ్యవహరించిన చరిత్ర దానిది. పారదర్శకత లేకుండా ఈ తోక లేని పిట్ట తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన చర్యలు కూడా సవాలక్ష. స్వయంగా డోర్సీ సైతం వివాదాలకు అతీతులేమీ కాదు. 2018లో భారత్‌లో పర్యటించినప్పుడు ఆయన వివాదాస్పద పోస్టర్‌ను చేత ధరించిన ఘటన ఇప్పటికీ విశ్లేషకులకు గుర్తే. అలాగే, ఆయన హయాంలో ట్విట్టర్ తన అల్గారిథమ్ ద్వారా నచ్చినవారిని పెంచుతూ, నచ్చనివారిని తుంచుతూ నడిచిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ట్విట్టర్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ సైతం అలాంటి కొన్ని అంతర్గత పత్రాలను బయటపెట్టారు. కొన్ని వార్తా కథనాలను నిరో ధిస్తూ, కొన్ని ఖాతాలను స్తంభింపజేశాక ఇలాంటి వేదికలకు ఇక తటస్థత ఎక్కడున్నట్టు? పారదర్శ కత, జవాబుదారీతనం లేనప్పుడు ట్విట్టరే కాదు... ఏ సోషల్ మీడియా వేదికకైనా పవిత్రత, గౌరవం ఏం ఉంటాయి? పాలకులను అవి వేలెత్తి చూపితే, మూడు వేళ్ళు వాటినే వెక్కిరిస్తాయి. అలాగని ఆ లోపాలే సందుగా... పాలక పక్షాలు, ప్రభుత్వాలు సోషల్ మీడియా సహా సమస్త భావప్రసార వేదికల పైనా స్వారీ చేస్తుంటే సమర్థించలేం. సోమవారం ఒకపక్కన ‘కోవిన్’ పోర్టల్ లోని పౌరుల సమాచారం అంగట్లో లభిస్తున్నట్టు బయటపడ్డ కొద్ది గంటల్లోనే, డోర్సీ సంచలన ఆరోపణలూ రావడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ, వార్తలనైనా, వ్యాఖ్యలనైనా... నోటితో ఖండించడమే తప్ప సర్కార్ తన సమర్థత, నిర్దోషిత్వాలను నిరూపించుకొనేందుకు ప్రయత్నించడం లేదు. నిజానికి, 2021 ఫిబ్రవరిలో సైతం దాదాపు 250 ఖాతాలనూ, ట్వీట్లనూ తొలగించమంటూ పాలకుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు ట్విట్టర్ ప్రతిఘటించింది. బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు చేసిన వివాదాస్పద ట్వీట్‌కు ‘మ్యానిప్యులేటెడ్ మీడియా’ అని ట్యాగ్ తగిలించేసరికి, 2021 మే నెలలో తన కార్యాలయాలపై ఢిల్లీ పోలీసు దాడులను ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరకు ఇలా రహస్యంగా, అడ్డగోలుగా సాగుతున్న ఈ సెన్సార్షిప్ డిమాండ్లపై కర్ణాటక హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ వేసింది. అప్పుడైనా, ఇప్పుడైనా ప్రభుత్వం ఆరోపణల్ని తోసిపుచ్చడానికే పరిమితమైంది. ధ్రువీకృత జర్నలిస్టులు, వార్తా సంస్థల ఖాతాలు పోస్ట్‌లను సైతం స్తంభింపజేయమంటూ మన దేశం నుంచి ట్విట్టర్‌కు వస్తున్న డిమాండ్లే ఎక్కువట. 2021 ద్వితీయార్ధంలో మొత్తం 326 లీగల్ డిమాండ్లొస్తే, అందులో 114 మన దేశానివే. మొత్తం మీద పాలకులకు ప్రజా ఉద్యమాలు, ప్రతికూల వ్యాఖ్యలంటే దడ పుడుతున్నట్టుంది. రైతు ఉద్యమమైనా, రెజ్లర్ల నిరసనైనా సర్కార్ శైలి ఒకటే– ముందు ఉదాసీనత, తర్వాత అణచివేత. ప్రజాక్షేత్రంలో వ్యవహారం బెడిసి కొడుతోందనిపిస్తే – ఆఖరికి అత్యవసర కంటి తుడుపు కార్యాచరణ. ఏ రకంగా చూసినా ఇది సరి కాదు. ట్విట్టర్ సహా అన్నీ జవాబుదారీతనంతో, స్థానిక చట్టాలకు కట్టుబడాలి. అదెంత ముఖ్యమో, బెదిరింపు ధోరణులు ప్రజాస్వామ్య విలువలకే మచ్చ అని పాలకులు గ్రహించడం అంత కీలకం. ఆ రెండూ జరగనంత కాలం ఇవాళ డోర్సీ... రేపు మరొకరు... పేరు మారవచ్చేమో కానీ, ఆరోపణల తీరు, సారం మారవు. -
డేటా భారతంలో లీకుల భాగోతం
రకరకాల సందర్భాల్లో, డిజిటల్ వేదికల్లో మనం అందజేస్తున్న వ్యక్తిగత సమాచారం ఏ మేరకు సురక్షితం? చాలాకాలంగా వేధిస్తున్న ఈ ప్రశ్న సోమవారం మరోసారి ముందుకొచ్చింది. కోవిడ్ టీకాకరణకు డిజిటల్ బుకింగ్ సర్వీస్ వేదికైన ప్రభుత్వ పోర్టల్ ‘కోవిన్’ డేటాబేస్ నుంచి ప్రముఖుల వ్యక్తిగత డేటా సైతం టెలిగ్రామ్ యాప్‌లో దర్శనమిచ్చి, మనవాళ్ళ సమర్థతను వెక్కిరించింది. మలయాళ మీడియా ‘ది ఫోర్త్’ తన యూట్యూబ్ వీడియోలో చూపిన డేటా చోరీ వైనం దిగ్భ్రాంతికరం. అనేక వార్తాసంస్థలూ సదరు టెలిగ్రామ్ బాట్‌ను పరీక్షించి, లీక్ నిజమేనని నిర్ధారించాయి. ప్రభుత్వ సైబర్ భద్రతా సంస్థ ‘ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్’ దీనిపై విచారణ చేపట్టిందే తప్ప, కనీసం అప్రమత్తత జారీ చేయకపోవడం విచారకరం. ప్రభుత్వం అసలీ వార్తల్నే కొట్టిపారే యడం మరీ విడ్డూరం. కానీ, కోవిన్లోనే లభించే మైనర్లు, మేజర్ల సమాచారం ఈ లీకుల్లో ఉంది. ఇది అనుమానాల్ని పెంచుతోంది. సైబర్ సెక్యూరిటీ, డేటా చట్టాల తక్షణావసరాన్ని గుర్తు చేస్తోంది. గతంలో 2018లోనే మన ఆధార్ డేటాబేస్ నుంచి భారీగా లీక్ జరిగినట్టు వార్తలొచ్చాయి. ఆ హ్యాకింగ్‌ను ప్రభుత్వం ఇప్పటి దాకా బాహాటంగా ప్రస్తావించ లేదు. ‘కోవిన్’ సంగతికే వస్తే, 2021 జూన్‌లోనూ ‘కోవిన్’ పోర్టల్ హ్యాకైంది. 15 కోట్ల మంది భారతీయుల డేటా అంగట్లో అమ్ముడైంది. అప్పుడూ మన సర్కార్ అదేమీ లేదంది. ఇక గత ఏడాది జనవరిలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. అప్పుడూ డేటాబేస్ ‘సురక్షితంగా ఉంద’ని నేషనల్ హెల్త్ అథారిటీ వాదించింది. కానీ, అసలు గోప్యతా విధానమంటూ ఏదీ లేకుండానే ‘కోవిన్’ జనంలోకి వచ్చింది. చివరకు 2021లో ఢిల్లీ హైకోర్ట్ ఆదేశించాక, తప్పక విధాన ప్రకటన చేసింది. తాజా ఉదంతంలో ‘కోవిన్’ వేదిక నుంచి ‘నేరుగా ఉల్లంఘన’ జరగలేదని ప్రభుత్వం తెలివిగా జవాబిచ్చింది. గతంలో కోవిన్‌లో కాక వేరెక్కడో చోరీ అయిన సమాచారమే ఇదంటోంది. మరి ఒకప్పుడు ఇలాంటి చోరీలే జరగలేదన్న సర్కార్... ఇప్పుడు తాజా చోరీ సమాచారం పాతదే అంటోందంటే ఏది నిజం? ఏది అబద్ధం? అసలీ వార్తలన్నీ ‘ఆధారరహితం, తుంటరి చేష్టలు’ అన్నది ఎప్పటి లానే సర్కారు వారి పాత పాట. ఒకవేళ అదే నిజమనుకున్నా, ప్రభుత్వ సంస్థల చేతుల్లోని డిజిటల్ డేటా భద్రత, సత్వరమే వ్యక్తిగత డేటా రక్షణ చట్టం అవసరమైతే ఉంది. తాజా రచ్చ మరోసారి మనకు చెబుతున్న పాఠం అదే. ఢిల్లీలోని వైద్యసంస్థ ఎయిమ్స్ గత 8 నెలల్లో రెండుసార్లు సైబర్ దాడులకు గురైన సంగతి అంత తేలిగ్గా మర్చిపోలేం. వ్యక్తిగత ఆరోగ్య వివరాలు, అలాగే ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ సమాచారం ఉన్న ఇతర పత్రాలకు మరింత భద్రత అవసరమని తాజా ఘటన అప్రమత్తం చేసింది. ‘వందకోట్ల సార్లు యత్నించినా ఆధార్ భద్రతను ఛేదించడం అసాధ్యమంటూ 2018లో అప్పటి ఐటీ మంత్రి పార్లమెంట్ సాక్షిగా బల్లగుద్దారు. కానీ, మరిప్పుడు తాజా డేటా ఉల్లంఘనలో మొబైల్ నంబర్‌ను బట్టి ఆధార్ వివరాలు అంత కచ్చితంగా టెలిగ్రామ్ బాట్లో ఎలా వస్తున్నాయి? నిజానికి శరవేగంతో అన్నీ డిజిటలీకృతమవుతున్న ప్రపంచంలో కొత్త ముప్పు – వ్యక్తిగత డేటా లీకులు. అది ఇప్పుడు ప్రపంచమంతా ఉన్నదే. లక్షలాది రిటైల్ కస్టమర్లతో లావాదేవీలు నడిపే డొమినో ఇండియా నుంచి 18 కోట్ల మంది సమాచారం లీకు సహా అనేక పోర్టల్స్ నుంచి వ్యక్తిగత డేటా అంగట్లో సరుకు కావడం కొన్నేళ్ళుగా మన దేశంలో ఆనవాయితీ అయింది. 2020 నుంచి చూస్తే, అమెరికా, రష్యా, ఇరాన్‌ల తర్వాత ప్రపంచంలోనే అధికంగా 14 కోట్ల డేటా గోప్యత ఉల్లంఘనలు జరిగిన దేశం మనదే. ఇంత జరుగుతున్నా వ్యక్తిగత డేటా రక్షణపై దేశంలో ఇప్పటికీ సరైన చట్టం లేదు. భారత్‌లో 2017లో డేటా గోప్యత బిల్లు తొలిసారిగా రూపుదిద్దుకున్నప్పటి నుంచి ఇప్పటికీ కొత్త చట్టం పనులు నత్తనడక నడుస్తున్నాయి. గడచిన వర్షాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అనుకున్నా, చివరకు దాన్ని పక్కన పడేసి, 2022 డిసెంబర్లో కొత్త ముసాయిదాను తెచ్చారు. అనేక విడతల సలహా సంప్రతింపులు జరిపినా, కొత్త బిల్లు ఇంకా పార్లమెంట్ మెట్లెక్కనే లేదు. కాగా, కేంద్రం త్వరలోనే ప్రతిపాదిత ‘డిజిటల్ ఇండియా’ చట్టాన్నీ, అలాగే సవరించిన ‘డిజి టల్ డేటా పరిరక్షణ బిల్లు 2022’నూ పార్లమెంట్లో పెడుతుందని సమాచారం. అలాగే అన్ని రకాల ప్రభుత్వ డేటా నిల్వ, అందుబాటు, భద్రతా ప్రమాణాలకు ఉమ్మడి చట్రాన్నిచ్చే ‘నేషనల్ డేటా గవ ర్నెన్స్ పాలసీ’ని ఖరారు చేస్తున్నామని అమాత్యుల మాట. భవిష్యత్తులో అవి ఊరట కావచ్చేమో. అయితే, ఇకనైనా సంస్థలు తాము సేకరించిన వ్యక్తిగత డేటాను ఒక్కసారికే, సదరు నిర్ణీత ప్రయోజనానికే వాడుకొనేలా చట్టంలో కట్టుదిట్టాలు చేయడం కీలకం. సంస్థలపైనే బాధ్యత మోపాలి. అలాగే, డేటా చోరీ అనుమానం రాగానే సంభావ్య బాధితులందరికీ సదరు సంస్థలు సమాచారమివ్వడం తప్పనిసరి చేయాలి. దానివల్ల వారు వెంటనే పాస్వర్డ్లు మార్చుకొని, సురక్షితులయ్యే వీలుంటుంది. అయినా, ప్రభుత్వం చేతిలోని ‘కోవిన్’ లాంటి వాటి నుంచే డేటా లీకవుతూ పోతే పౌరులకిక ఏం నమ్మకం మిగులుతుంది? సమస్తం డిజిటలైన వేళ ఉల్లంఘనలు తప్పవనుకున్నా, నష్టాన్ని తగ్గించడం, డేటా గోప్యతకు చట్టబద్ధ రక్షణ కల్పించడం ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వ కనీస కర్తవ్యం. లీకైన కోట్లాది ప్రజల డేటా నేరగాళ్ళ చేతిలో పడితే ఆర్థికంగా, సామాజికంగా చెలరేగే సంక్షోభం అనూహ్యం. అందుకే, ఈ లీకుల్ని కొట్టిపారేసే వైఖరి వదిలి, సర్కార్ కఠిన చర్యలకు దిగాలి. ప్రతిదానికీ పుట్టుపూర్వోత్తరాలన్నీ సేకరించే ధోరణి మాని, వీలైనంత వరకు అతి తక్కువ డేటానే సేకరించే పద్ధతి మేలంటున్న పౌరసమాజం మాటల్నీ పట్టించుకోవాలి. -
విశ్వ సమానత్వాన్ని తిరస్కరిస్తారా?
జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన వివక్షను నిషేధించే చట్టాలు అమెరికా, కెనడాల్లోని కొన్ని రాష్ట్రాలు ఆమోదించాయి. వీటిని ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులు వ్యతిరేకించారు. అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారనీ, ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారనీ వారు ఆరోపించారు. భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయులు సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, ఎవరైనా అలాంటి శాసనాలను ఎందుకు వ్యతిరేకించాలి? అమెరికాలో పలువురు వలస భారతీయుల కేంద్రంగా ఉన్న సుసంపన్న రాష్ట్రం కాలిఫోర్నియా సెనేట్‌లో 2023 మార్చి 22న కుల వివక్ష వ్యతిరేక బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందినట్లయితే, ప్రపంచంలోనే కులాన్ని మరింత మౌలికంగా చర్చించే మొదటి చట్టం అవుతుంది. భారత రాజ్యాంగం అస్పృశ్యతను రద్దు చేసింది కానీ కులాన్ని కాదు. హిందుత్వ ప్రవాసులు ఇలాంటి కీలక పరిణామం చోటు చేసుకోబోదని భావించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీ శక్తులు కూడా అలాంటి ఘటన జరగకూడదని భావించాయి. కానీ ప్రపంచం వీరి పరిధిని దాటిపోయింది. జాతి, మతం, లింగం, లైంగిక ధోరణితోపాటు కుల ప్రాతిపదికన పౌరులు, పెద్దలు లేదా పిల్లలపై వివక్షను నిషేధించే చట్టాన్ని సియాటిల్ సిటీ కౌన్సిల్(అమెరికా), టొరొంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్(కెనడా) ఆమోదించినప్పుడు పలువురు ఆర్ఎస్ఎస్, బీజేపీ మేధావులు వ్యతి రేకించారు. ఇలాంటి శాసనాలను ‘హిందూఫోబియా’గా వారు ఖండించారు.అటువంటి శాసనాలను వ్యతిరేకిస్తూ పలు పత్రికలు, సోషల్ మీడియా వేదికల్లో రాశారు, మాట్లాడారు. సాధారణంగా మానవ సమానత్వం వైపు, ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నప్పటికీ భారతీయుల సమానత్వం వైపు నిలబడుతున్నట్లయితే, అలాంటి శాస నాలను ఎందుకు వ్యతిరేకించాలి? వివక్షకు సమర్థనా? సియాటిల్ సిటీ కౌన్సిల్ ఇటీవలే ఆమోదించిన తీర్మానంలో వివక్ష వ్యతిరేక చట్టాలకు కులాన్ని కూడా జోడించడాన్ని ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రిక పాంచజన్య ‘సంస్థాగత మార్గం ద్వారా అమెరికాలో హిందూఫోబియాను ప్రోత్సహిస్తున్నారు, అమెరికాలో హిందూ ప్రతిభ పురోగతిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్నారు’ అని పేర్కొన్నట్టుగా ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది. ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ ఈ వాదననే మరింత ముందుకు తీసుకు పోయారు. కుల వివక్షకు సంబంధించిన ఈ తప్పుడు జెండాను ఎత్తుతున్న బృందాలు సాధారణంగా హిందూభయంతో ఉంటు న్నాయని ఆయన ఒక జాతీయ దినపత్రికలో రాశారు. ప్రపంచంలో హిందూ మతానికి హాని కలిగించడానికే ఈ వివక్షా కార్డును ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అమెరికా కేంద్రంగా వ్యవహరించే పరిశోధనా సంస్థ ‘ఈక్వాలిటీ ల్యాబ్’నూ, అలాగే అమెరికా, కెనడా, యూరప్ తదితర ప్రాంతాల్లో అలాంటి కుల వ్యతిరేక చట్టాలు, శాస నాలపై పనిచేసే పౌర సమాజ బృందాలనూ పశ్చిమ దేశాల్లోని హిందూఫోబిక్ గ్రూపులుగా రామ్ మాధవ్ తప్పుపట్టారు. పాంచజన్య ఆరెస్సెస్ అధికార పత్రిక. వివక్షా వ్యతిరేక చట్టం హిందూఫోబియాకు సంకేతమనీ, భారతీయ ప్రతిభ పురోగతిని అడ్డుకునే కుట్ర అనీ అది పేర్కొంటోంది. భారత్ లేదా ప్రపంచంలో గణనీయ సంఖ్యలో భారతీయులు నివసిస్తున్న చోట సంస్థాగత శాసనాలను రూపొందించకుండా కులవివక్ష సమస్యను పరిష్కరించడం ఎలా? వివక్షను ప్రదర్శిస్తున్న వారు అలాంటి వివక్షా వైఖరి తప్పు అని ఎన్నడూ భావించరు. ఒక వ్యక్తి లేదా వర్గ మానసిక లక్షణాల్లో వివక్షా పూరితమైన ప్రవర్తన భాగమవుతుంది. హిందూ మతానికి సంబంధించి, అలాంటి వివక్షను ఆధ్యాత్మిక పాఠ్య గ్రంథాల ద్వారా సమర్థిస్తున్నారు. దానికి పవిత్రతను కల్పిస్తున్నారు. వివక్షాపూరిత అనుభవాలెన్నో! భారతీయ వలసల్లో కుల వివక్ష ఎలా పనిచేస్తోందని అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో ఇప్పటికే కొన్ని అధ్యయనాలు జరిగాయి. స్కూల్, కాలేజీ, పిల్లలు, యువత రోజువారీగా అను భవిస్తున్న వేదనకు సంబంధించిన ఇవి గాథలను వర్ణించాయి. వ్యక్తుల కుల నేపథ్యాన్ని తెలుసుకోవడానికి, అమలవుతున్న వివక్షా పద్ధతు లను కనుగొనడానికి సంబంధించిన యంత్రాంగాలను పలు నివేది కలు వెలికి తెచ్చాయి. ఉదాహరణకు, తెన్ మొళి సౌందరరాజన్ తాజా పుస్తకం ‘ద ట్రామా ఆఫ్ కాస్ట్ – ఎ దళిత్ ఫెమినిస్ట్ మెడిటేషన్ ఆన్ సర్వైవర్‌షిప్, హీలింగ్, అబాలిషన్’ అమెరికాలోని భారతీయ వలస ప్రజలలో వివక్షకు సంబంధించిన అసంఖ్యాక ఘటనలను గుది గుచ్చింది. ఈమె రెండో తరం భారతీయ అమెరికన్ దళిత మహిళ. టొరొంటో శాసనాలను రూపొందించిన తర్వాత, కెనడాలోని ఒక కాలేజీ విద్యార్థి త్రినా కుమార్ తన జీవితంలో ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని సమగ్రంగా వర్ణించారు. తమ వేదనా గాథలను చెబు తున్న, భవిష్యత్తును ప్రేమిస్తున్న యువ మహిళగా ఆమె కనిపిస్తారు. ‘‘గ్రేటర్ టొరొంటో పాఠశాలల్లో కులపరమైన వేధింపును చాలానే ఎదుర్కొన్నాను. ఈ వేధింపు నాకు అయోమయం కలిగించింది. ప్రత్యేకించి మేమంతా కెనడియన్లమే అయినప్పటికీ నా తోటి క్లాస్ మేట్లకు కులం అంటే ఇంత ప్రాధాన్యం ఎందుకు అని నేను ఆశ్చర్య పడ్డాను’’ అని ఆమె చెబుతున్నారు. ‘‘వారి అగ్రకుల సంప్రదాయా లను నేను అనుసరించలేదు, దళిత క్రిస్టియన్ గా ఉంటున్నందుకు వారు నన్ను ఆటపట్టించేవారు’’ అని ఆమె చెప్పారు. క్రిస్టియన్లు మెజారిటీగా ఉంటున్న దేశంలో వారు ఇలా చేస్తున్నారు. ఇది క్రిస్టోఫోబియా కాదా? పాశ్చాత్య కులతత్వ వలస ప్రజల్లో ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక సంక్షోభాన్ని సృష్టించింది. అయితే, అమెరికాలో కుల వివక్షపై ఈక్వా లిటీ ల్యాబ్స్ అధ్యయనాన్ని రామ్ మాధవ్ తోసిపుచ్చారు. ఇలాగైతే, మొత్తంగా గోధుమవర్ణపు భారతీయులు తమ మీద శ్వేత అమెరికన్లు వివక్ష ప్రదర్శిస్తారని ఎలా ఆరోపించగలరు? సమానత్వం కోసం పనిచేస్తున్న గ్రూపులెన్నో! అమెరికా, కెనడాల్లో కుల వివక్షా వ్యతిరేక చట్టాలపై ఈక్వాలిటీ ల్యాబ్స్ ఒక్కటే పనిచేయలేదు. ఉత్తర అమెరికా అంబేడ్కర్ అసోసి యేషన్, బోస్టన్ స్టడీ గ్రూప్, పెరియార్ అంబేడ్కర్ స్టడీ సర్కిల్,అంబేడ్కర్ బుద్ధిస్ట్ అసోసియేషన్, అంబేడ్కర్ కింగ్ స్టడీ సర్కిల్, అంబేడ్కర్ ఇంటర్నేషనల్ మిషన్ వివక్షను ఎండగట్టడానికీ, పీడిత కుల వలస ప్రజలను చైతన్యవంతం చేయడానికీ కృషి చేశాయి. భారత్‌లో కులం, మానవ అస్పృశ్యత ఎలా పనిచేస్తున్నాయో, దాన్ని అమెరికా, యూరప్, కెనడా, ఆస్ట్రేలియాల్లో ఎలా విస్తరింపజేస్తున్నారో పాశ్చాత్య సమాజాలకు తెలియపర్చేందుకు ఈ సంస్థలు బహుముఖ కార్యక్రమాలను చేపడుతూ వచ్చాయి. ఎక్కడ ఉన్నా సరే... కుల అణచివేత, దాని కార్యకలాపాలు ఎంత అమానుషంగా ఉంటు న్నాయో ఈ దేశాల్లోని నల్లవారికీ, శ్వేత జాతీయులకూ తెలియజెప్పేందుకు ఈ సంస్థలు తమ వనరులనూ, మానవ శ్రమనూ చాలా వెచ్చించాయి. కులవ్యవస్థ గురించి, దాని అమానుషమైన ఆచరణ గురించి ప్రపంచానికి అవగాహన కల్పించడంలో తప్పేముంది? మానవ సమా నత్వం కోసం నిలబడకుండా ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రజాస్వామ్యం కోసం ఎలా నిలబడతాయి? జాతి వివక్ష, ఇతర దేశాల పట్ల దురభిప్రాయం, దానికి సంబంధించిన అసహనాలకు వ్యతిరేకంగా డర్బన్ లో ఐక్యరాజ్యసమితి సదస్సు జరిగిన 2001 నుంచి ప్రపంచం చాలా దూరం పయనించింది. ఆనాటి సదస్సులో జాతి సమస్యతోపాటు కుల సమస్యను కూడా చర్చించడానికి అనుమతించలేదు. ఆనాడు ఐ.రా.స. అంగా లకు కుల వ్యవస్థ గురించి ఏమీ తెలియదనే చెప్పాలి. కుల సమస్యను అంతర్గత అంశం అని ప్రకటించి, దానిపై ఎలాంటి చర్చను కూడా అనుమతించడానికి బీజేపీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం సుముఖత చూపడం లేదు. హిందూఫోబియా పేరిట వివక్షను, అసమాన త్వాన్ని, జాతి హత్యాకాండను విశ్వగురువు ఎందుకు ప్రేమిస్తున్నారు? హిందూయిజం మానవ సమానత్వాన్ని కోరుకోవడం లేదని దీని అర్థం కాదా? ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
డిజిటల్ అగ్రగామిగా భారత్!
ఆధార్, ఏకీకృత చెల్లింపు వ్యవస్థలు, డేటా పంపిణీ... ఈ మూడూ కలిసి భారత్‌ను ‘ప్రపంచ డిజిటల్ అగ్రగామి’గా నిలబెట్టాయని ‘స్టాకింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ : లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ డిజటల్ జర్నీ’ అనే శీర్షికతో తాజాగా విడుదల చేసిన కార్యాచరణ పత్రంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వెల్లడించింది. ఈ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించడం ద్వారానే భారత్ మహమ్మారి కాలంలో నిరుపేద కుటుంబాలకు చెప్పుకోదగిన వాటాతో మద్దతును వేగంగా అందివ్వగలిగిందని, డిజిటల్ అకౌంట్ అగ్రిగేటర్ ద్వారా ఆర్థిక సేవల సులభ సంప్రాప్యత నుంచి దాదాపు 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు లబ్ధి పొందారని, దీన్నింకా వేగంగా తమ సొంతం చేసుకుంటున్నారని ఆ పత్రం ప్రశంసించింది. అదే సమయంలో భారత్‌లో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇప్పటికీ లేదని ఐఎమ్ఎఫ్ పత్రం పేర్కొంది. పౌరుల గోప్యతను కాపాడటానికి డేటా ఉల్లంఘనలకు పాల్పడిన వారిని జవాబుదారీగా చేయడానికి దృఢమైన డేటా పరిరక్షణ చట్టం రూపకల్పన తప్పనిసరి అని సూచించింది. మానవ జీవితాలను, ఆర్థిక వ్యవస్థను మార్చి వేస్తున్న ప్రపంచ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్ర క్చర్ని భారతదేశం నిర్మించిందని, ఇది అనేక దేశాలు అనుసరించాల్సిన పాఠం అవుతుందని తాజా ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. ‘ఇండియా స్టాక్’ అనేది భారత్‌లో సాధారణంగా ఉపయోగిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐలు) సెట్‌కి సామూహిక పేరు. దీంట్లో మూడు విభిన్నమైన పొరలు ఉంటున్నాయి. అవి, 1. ప్రత్యేక గుర్తింపు (ఆధార్), 2. కాంప్లిమెంటరీ చెల్లింపు వ్యవస్థలు (ఏకీకృత చెల్లింపు ఇంటర్ఫేస్, ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్, ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీస్), 3. డేటా పంపిణీ (డిజీలాకర్, అకౌంట్ అగ్రిగేటర్). ఇవన్నీ కలిసి అనేక పబ్లిక్, ప్రైవేట్ సేవలకు.. ఆన్ లైన్, కాగిత రహిత, నగదు రహిత, గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే డిజిటల్ సంప్రాప్య తను కల్పించాయని ‘స్టాకింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ : లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ డిజటల్ జర్నీ’ అనే శీర్షికతో కూడిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కార్యాచరణ పత్రం తెలిపింది. ఈ మదుపు ప్రయో జనం భారత్ వ్యాప్తంగా అనుభవంలోకి రావడమే కాకుండా కోవిడ్ 19 మహమ్మారి కాలంలో దేశానికి ఎంతో సేవచేసిందని ఆ పత్రం వెల్లడించింది. ప్రభుత్వ ఖజానా నుంచి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంటుకు నేరుగా సామాజిక భద్రతా చెల్లింపుల పంపిణీని సులభతరం చేయడంలో ఆధార్ సహక రించిందని అది పేర్కొంది. దీనివల్ల లీకేజీలను తగ్గించడం, అవినీతిని అరికట్టడం, విస్తృతిని పెంచడం, సమర్థంగా కుటుంబాల వద్దకు చేరు కోవడానికి ఒక సాధనాన్ని అందించడంలో ఇది సహకరించింది అని వ్యాఖ్యానించింది. విస్తృతంగా డిజిటల్ చెల్లింపులు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర ప్రభుత్వ సంస్కరణల కారణంగా 2021 మార్చి వరకు జీడీపీలో 1.1 శాతం వ్యయాన్ని ఆదా చేసినట్లు భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించడం ద్వారా భారత్ మహమ్మారి కాలంలో నిరుపేద కుటుంబాలకు చెప్పుకోదగిన వాటాతో మద్దతును వేగంగా అందించగలిగింది. మహమ్మారి ఆవహించిన తొలి నెలల కాలంలో నిరుపేద కుటుంబాల్లో 87 శాతం కనీసం ఒక లబ్ధి పథకాన్నయినా అందుకున్నారు. సృజనాత్మక ఆవిష్కరణను, పోటీని పెంచడానికి, మార్కెట్లను విస్తరించడానికి, ప్రభుత్వ ఆదాయ సేకరణను పెంచుకోవడానికి, ప్రభుత్వ వ్యయ సమర్థతను మెరుగుపర్చుకోవడానికి ఇండియా స్టాక్ ఒక ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడింది. డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వవ్యాప్తమయ్యాయి. దేశంలో అన్ని చెల్లింపుల లావాదేవీల్లో యూపీఐ చెల్లింపులు 68 శాతంగా ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల ఉపయోగం చిన్న వర్తకుల కస్టమర్ పునాదిని విస్తరించింది, వారి నగదు ప్రవాహాన్ని నమోదు చేసి, ద్రవ్య సంప్రాప్యతను మెరుగుపర్చింది. పెరిగిన ప్రభుత్వ రాబడి 2021 ఆగస్టులో మొదటిసారి ప్రారంభించి నది మొదలు ‘అకౌంట్ అగ్రిగేటర్’ ద్వారా ఆర్థిక సేవల సులభ సంప్రాప్యత నుంచి దాదాపు 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు లబ్ధి పొందారని, దీన్ని వేగంగా తమ సొంతం చేసుకుంటున్నారని ఆ పత్రం తెలిపింది. డిజిటలీకరణ అనేది ఆర్థిక వ్యవస్థ అధికారికీకరణను కూడా బలపర్చింది. 2017 జూలై నుంచి 2022 మార్చి మధ్యలో జీఎస్టీ కోసం 88 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వ రాబడులు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ సర్వీస్ ప్రొవిజన్‌ను కూడా క్రమబద్ధీకరించారు. ఉదాహరణకు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్లను ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా పౌరులు పొందవచ్చు. అదేవిధంగా, ఇండియా స్టాక్ ‘నో యువర్ కస్టమర్’ నిబంధ నలను డిజిటలీకరించి, సులభతరం చేసింది. ఖర్చు లను తగ్గించింది. ఇ–కేవైసీని ఉపయోగిస్తున్న బ్యాంకులు సమ్మతి ఖర్చును 12 అమెరికా డాలర్ల నుంచి 6 అమెరికన్ సెంట్లకు తగ్గించుకున్నాయి. మహిళలే లక్ష్యంగా జన్‌ధన్ ఖర్చుల్లో ఈ తగ్గుదల తక్కువ ఆదాయం ఉన్న క్లయింట్లు కొత్త ఉత్పత్తుల అభివృద్ధి కోసం సేవలను మరింతగా ఆకర్షిస్తూ, లాభాలు ఆర్జించడానికి వీలు కల్పించింది. ఆర్థిక అభివృద్ధిలో అందర్నీ భాగస్వామ్యం చేయడానికి సంబంధించి ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ ఆ పత్రం ఇలా చెప్పింది. ‘‘తక్కువ ఖర్చుతో కూడిన బ్యాంక్ ఖాతాకు అవకాశం కల్పించడం వల్ల బ్యాంక్ ఖాతా లతో వ్యక్తుల కవరేజీ రెట్టింపు అయింది. జన్ ధన్ పథకం ఆర్థికంగా అర్హత లేనివారిని, ప్రత్యేకించి గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకుంది. ఈ పథకం కింద 2022 ఆగస్టు నాటికి 46 కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలను పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తెరిచారు. డిజిటల్ బ్యాక్‌బోన్ ను ఉపయోగించడం వల్ల భారత్ తన వ్యాక్సిన్ పంపిణీని శరవేగంగా చేయగలడమే కాదు... భారీస్థాయి అంతర్గత వలసలు వంటి సవాళ్లను అధిగమించింది’’ అని ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. కో–విన్ లో పొందుపర్చిన టెక్నాలజీని ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జమైకాలలో కూడా అమలు పర్చారు. ఇది ఆయా దేశాల వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను సులభతరం చేసింది. డేటా పరిరక్షణ తప్పనిసరి సవాళ్ల విషయానికి వస్తే, భారత్‌లో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇప్పటికీ లేదని ఐఎమ్ఎఫ్ పత్రం పేర్కొంది. పౌరుల గోప్యతను కాపాడ టానికి; కంపెనీలు, ప్రభుత్వాలు విచక్షణారహితంగా డేటా సేకరించడాన్ని నిరోధించడానికి; డేటా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీలు, ప్రభు త్వాలను జవాబుదారీగా చేయడానికి దృఢమైన డేటా పరిరక్షణ చట్ట రూపకల్పన తప్పనిసరి. సముచితమైన రీతిలో డేటా నిర్వహణకు, సైబర్ భద్రత రంగంలో తగిన మదుపులు పెట్టడానికి ఇది చాలా అవసరం. సామాజిక సహాయం మరింత దృఢంగా, స్వీకరించదగినదిగా చేసే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విషయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) కూడా సహకరిస్తుంది. ఉదాహరణకు, రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ పథకాల మధ్య డేటా పంపిణీకి ఆధార్‌ను ఉపయోగించవచ్చని ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. చివరగా, డీపీఐ (డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)ని ప్రభావితం చేయడానికి కాలక్రమాలు, నాణ్యత, సాధారణ ప్రభుత్వ ద్రవ్య నివేదికల కవరేజీ వంటివాటిని భారత్ గణనీయంగా మెరుగుపర్చుకుంది. అదే సమయంలో తన పౌరుల కోసం ప్రభుత్వ రంగ జవాబుదారీతనాన్ని మెరుగుపర్చుకోవడంలో ద్రవ్యపరమైన పారదర్శకతను విస్తరించడం అనేది కీలక అంశంగా ఉంటోంది. – ఎమ్. ముఖేశ్ రాణా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా -
ఇథనాల్ కలిపిన పెట్రోలుతో ఎవరికి ప్రయోజనం?
దేశీయ ఇంధన అవసరాలు తీర్చడానికీ, ఇంధన దిగుమతి భారం తగ్గించడానికీ, వాయు, కర్బన కాలుష్యాలను తగ్గించడానికీ ఇథనాల్ కలిపిన పెట్రోలు పరిష్కారమని భారత ప్రభుత్వం ఎన్నో వెసులు బాట్లు కల్పించి ప్రోత్సహిస్తున్నది. ఆహార ధాన్యాలైన బియ్యం, గోధుమలు, మొక్కజొన్నల నుండి ఇథనాల్ ఉత్పత్తి చేయడానికి సత్వర పర్యావరణ అనుమతులూ, సబ్సిడీలూ, వడ్డీ రాయితీతో రుణాలూ మంజూరు చేసి 2025 నాటికి 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నది. ఇథనాల్‌ను పెట్రోలుకు కలపడం కొత్తేమీ కాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుండీ వాడుతున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, ఇతర ఐరోపా దేశాలూ; కెనడా, చైనా కూడా మిశ్రమ ఇంధనాన్ని ప్రస్తుతం వాడుతున్నాయి. శాస్త్రీయ అధ్యయనాలు ఇథనాల్‌ను ఇంధనంగా వాడడం లోని నష్టాలను వెలుగులోకి తెచ్చాయి. 2023 మార్చి13న ఐపీసీసీ విడుదల చేసిన నివేదిక, తాపం పెరుగుదల 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు మించకుండా నిరోధించడానికి శిలాజ ఇంధనాలకు సత్వర ముగింపు పలకాలని స్పష్టం చేసింది. కొత్తగా నిర్మిస్తున్న ఇథనాల్ ప్లాంట్లు కనీసం 30 ఏళ్లు పని చేస్తాయి. మరి 2070 నాటికి నికర జీరో కర్బన ఉద్గారాలెలా సాధ్యమవుతాయి? అమెరికా ప్రభుత్వ శక్తి (ఎనర్జీ) విభాగం ‘ఇ20... పెట్రోల్ కంటే 7.7 శాతం తక్కువ ఇంధన శక్తి కలిగి ఉంటుందని’ నిర్ధారించింది. ఒక లీటరు పెట్రోల్... 1.073 లీటర్ల మిశ్రమ ఇంధనానికి సమానం. పరిశీలనల్లో పెట్రోలునూ, మిశ్రమ ఇంధనాన్నీ వాడినప్పుడు దాదాపు కర్బన ఉద్గారాలు అదేస్థాయిలో ఉంటాయని తేలింది. ప్రతి ఇథనాల్ ప్లాంట్కీ ఒక బొగ్గుతోకానీ, బయోమాస్‌తో కానీ నడిచే పవర్ ప్లాంట్‌కు అనుమతిస్తున్నారు. వాటి ఉద్గారాలు అదనం. ఇంకా ప్రతి లీటరు ఇథనాల్ ఉత్పత్తికి 0.76 కిలోల కార్బన్– డై–ఆక్సైడ్ విడుదలవుతుంది. దానిని పూర్తిగా పట్టి గాలిలో చేరకుండా ఆపే వ్యవస్థ లేదు. అంటే మొత్తం ఉత్పత్తయిన కార్బన్– డై–ఆక్సైడ్ చివరికి గాలిలోకి చేరుతుంది. భూతాపానికి దోహద పడుతుంది. అంటే లక్ష్యం తిరగబడుతుందన్న మాట. చమురు దిగుమతుల ఆర్థిక భారం తగ్గించడానికి ఇథనాల్ ఇంధనం పరిష్కారంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇ10 ఇంధనం అందుబాటులోకి వచ్చింది. అయినా పెరుగుతున్న డిమాండ్ వల్ల చమురు దిగుమతి భారం తగ్గ లేదన్నది స్పష్టం. విదేశీ మారక ద్రవ్యం ఖర్చు పెరిగింది కాని తగ్గ లేదు. ఇంకా తగిన ఇథనాల్ ఉత్పత్తి లేక ఇథనాల్ దిగుమతి కూడా పెరిగింది. దేశీయ చమురు ఉత్పత్తులు గణనీ యంగా క్షీణిస్తున్నందునా, చమురు వినియోగం పెరుతున్నందునా, ఇథనాల్ కలపడం చమురుపై ఆధారపడడం నుండి విముక్తం చేయదు. కర్బన ఉద్గారాలు పారిస్ ఒప్పందానికి అనుగుణంగా తగ్గవు. చెరకు, బియ్యం, మొక్క జొన్నల నుండి ఇథనాల్ ఉత్పత్తి నీటి వనరులపై భారం పెంచుతుంది. ఇథనాల్ ప్లాంట్ల ప్రతిపాదనలు లీటర్ ఇథనాల్‌కు 8 నుండి 10 లీటర్ల నీరు కావాలంటున్నాయి. చెరకు నుండి లీటరు ఇథనాల్ ఉత్పత్తికి దాదాపు మూడు వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. ఆహార పంటలను ఇంధన ఉత్పత్తికి తరలించడం వల్ల అదనపు భూమిని సాగులోకి తేవలసి వస్తుంది. దానివల్ల భూవిని యోగం మార్పు వస్తోంది. అందువల్ల ఉద్గారాలు పెరుగుతాయి. భూతాపం వల్ల పంటల దిగుబడి గణనీయంగా తగ్గడంతో ఆహార కొరత సమస్య ఉత్పన్నమవుతుంది. రైతులకు ఇథనాల్ ఉత్పత్తితో ఒరిగేదేమీ లేదు. ప్రభుత్వమే సబ్సిడీ ధరకు కంపెనీలకు బియ్యం సరఫరా చేస్తుంది. కిలో బియ్యం రూ. 20కు ఇస్తున్నది. అంటే కిలోకు రూ.17 సబ్సిడీ ఇస్తున్నది. ఒక లీటరు ఇథనాల్ ఉత్పత్తికి 2.22 కిలోల బియ్యం సబ్సిడీ ధరకు ఇస్తున్నారు. లీటరు ఇథనాల్ ఉత్పత్తికి బియ్యంపై రాయితీ రూ. 37.74. ఎఫ్‌సీఐ సరఫరా ధర రూ. 37 కు బియ్యం కొంటే లీటరు ఇథనాల్‌కు కావలసిన బియ్యం ధర రూ. 83.78. ప్రభుత్వం నిర్ణయించిన ఇథనాల్ ధర లీటరుకు 56.87. లీటరు పెట్రోలుకు ఇంధన శక్తిలో సమాన మైన 1.51 లీటర్ల ఇథనాల్ ఉత్పత్తికి వాడే బియ్యం ఖరీదు రూ.126.5. ఆ పైన ఉత్పత్తి ఖర్చులు ఎటూ ఉంటాయి. అంటే మిశ్రమ ఇంధనం పెట్రోలు కంటే ప్రియమన్న మాట. ప్రస్తుతం రోడ్డుపైనున్న వాహనాలేవీ ఇ20 ఇంధనాన్ని వాడ డానికి పనికిరావు. కొత్తగా వచ్చే వాహనాలను అందుకు అను వుగా రూపొందించినా ఇ20 అవసరం తక్కువే ఉంటుంది. అనువుగా మార్చని వాహనాలలో ఇ20 వాడితే ఇంజన్‌కు జరిగే నష్టం గణనీయం. ఇథనాల్ ఇంధనంతో జాతికీ, వాతావరణానికీ ప్రయోజనమేమిటో చర్చ జరగాలి. – డా‘‘ కలపాల బాబూరావు, విశ్రాంత శాస్త్రవేత్త -
వెంటాడు... వేటాడు...
పరిశోధన, ప్రజా విధానాలకు సూచన, సలహాల్లో యాభై ఏళ్ళుగా కృషి చేస్తూ, స్వర్ణోత్సవం జరుపుకోవడమనేది ఉత్సాహంగా ముందుకు అడుగేయాల్సిన సందర్భం. కానీ, అందుకు విరుద్ధంగా అడుగులు ముందుకు పడకుండా పాలకులే అడ్డం పడితే? పౌర విధానానికి సంబంధించి దేశంలోకెల్లా అత్యంత గౌరవనీయమైన ఢిల్లీకి చెందిన మేధావుల బృందమైన ‘సెంటర్ ఫర్ పాలసీ రిసెర్చ్’ (సీపీఆర్) విషయంలో ఇప్పుడు జరుగుతున్నది అలానే ఉంది. ఆ సంస్థకు విదేశీ విరాళాలు, ఆర్థిక సహాయం అందే వీలు లేకుండా ‘విదేశీ సహాయ (నియంత్రణ) చట్టం’ (ఎఫ్సీఆర్ఏ) కింద రిజిస్ట్రేషన్‌ను ఆరు నెలల పాటు కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 27న ఉత్తర్వులివ్వడం జాతీయ, అంతర్జాతీయ మేధావులను ఉలిక్కిపడేలా చేసింది. విద్యావిషయిక కార్యక్రమాలకే లైసెన్స్ ఇచ్చామనీ, కానీ సీపీఆర్ మాత్రం విదేశీ విరాళాలను పుస్తక ప్రచురణ లాంటి వాటికీ వినియోగిస్తోందనీ ఆ ఉత్తర్వుల ఆరోపణ. అయిదు నెలల క్రితం గత సెప్టెంబర్‌లో ఢిల్లీలోని సీపీఆర్ కార్యాలయం, అలాగే ఆక్స్‌ఫామ్ ఇండియా, పలు డిజిటల్ మీడియా సంస్థలకు నిధులిచ్చే బెంగళూరుకు చెందిన ‘ఇండిపెండెంట్ అండ్ పబ్లిక్ స్పిరిటెడ్ మీడియా ఫౌండే షన్’ (ఐపీఎస్ఎంఎఫ్)లపై ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ విరుచుకుపడింది. సర్వేలు నిర్వహించింది. ఆ వెంటనే సిబ్బందికి సమన్లు వెళ్ళాయి. దానికి కొనసాగింపుగా పన్ను మినహాయింపును రద్దు చేస్తామని హెచ్చరిస్తూ, షోకాజ్ నోటీసు వెళ్ళాయి. ఒక రకంగా దాని కొనసాగింపే – ఇప్పుడీ లైసెన్స్ రద్దు. నిజానికి, లాభాపేక్ష రహిత స్వచ్ఛంద సంస్థగా 1976 నుంచి సీపీఆర్‌కు పన్ను మినహాయింపు లభిస్తోంది. వచ్చే 2027 దాకా మినహాయింపు ఉన్నా, ఇప్పుడీ బెదిరింపులు గమనార్హం. ఆదాయపు పన్ను లెక్కల్లో తేడాలుంటే విచారించడం తప్పు కాదు. చట్టం ముందు అందరూ సమానులే గనక ఏమన్నా తప్పు చేసినట్టు రుజువైతే చర్యలు తీసుకోవడమూ తప్పనిసరే. కానీ, మనసులో ఏదో పెట్టుకొని, ఏ చిన్న లోపం కనిపించినా, వెంటాడి వేధించాలని అనుకుంటేనే అది హర్షించలేని విషయం. ఆ సంస్థ బాధ్యుల్లోని పరిశోధకులు కొందరు ప్రభుత్వ విధానాల్ని తప్పుబడుతూ ఇటీవల రాసిన వ్యాసాలే దీనికి హేతువని ఓ బలమైన విమర్శ. ఎక్కడా, ఏ తప్పూ చేయలేదని తేలినప్పటికీ, సాంకేతిక కారణాలే సాకుగా సీపీఆర్ లాంటి స్వతంత్ర మేధాసంస్థను వేధిస్తున్నారన్నది స్పష్టం. కొండను తవ్వి ఎలుకను పట్టే ఈ దీర్ఘకాల ప్రక్రియతో మానసికంగా వేధించడమే పాలక వర్గాల పరమార్థంగా కనిపిస్తోంది. నిజానికి, సీపీఆర్ అనేది దేశంలోని అగ్రేసర స్వతంత్ర పరిశోధనా సంస్థల్లో ఒకటి. విభిన్నరంగాలకు చెందిన పరిశోధకులు, వృత్తినిపుణులు, విధాన నిర్ణేతలతో కూడిన మేధావుల బృందం ఇది. ఈ లాభాపేక్ష రహిత సంస్థ 50 ఏళ్ళ క్రితం 1973లో ఏర్పాటైంది. ప్రభుత్వ విధానాల్లోని వివిధ అంశాలపై ఈ సంస్థలోని బుద్ధిజీవులు దృష్టి సారిస్తుంటారు. ఆర్థికవేత్త – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి వై.వి. చంద్రచూడ్ సహా పలువురు మేధావులు ఈ సంస్థ కార్యవర్గంలో మాజీ సభ్యులు. అనేక కేంద్ర శాఖలతో, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలతోనూ కలసి పనిచేసిన ఈ సంస్థను భారత ప్రభుత్వం గుర్తించింది. దశాబ్దాలుగా పన్ను మినహాయింపూ ఇస్తోంది. గత ఏడాదీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర శాఖల నుంచి సీపీఆర్‌కు నిధులు వచ్చాయి. మరి, ఉన్నట్టుండి సీపీఆర్ జీవితం మీద పాలకులకు ఎందుకు విరక్తి కలిగినట్టు? దీనికి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో పనిచేస్తున్న ‘జన అభివ్యక్తి సామాజిక్ వికాస్ సంస్థ’ (జస్వాస్) సహా దాదాపు 30 సంస్థలకు డేటా సేకరణ, పర్యావరణ చట్టం సహా పలు అంశాల్లో పరిశోధనకు సీపీఆర్ నిధులిచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లో ఏనుగులు తిరిగే జీవవైవిధ్య ప్రాంతం హస్‌దేవ్‌లో బొగ్గు గనుల అక్రమ తవ్వకంపై ఆదివాసీ ఉద్యమంలో జస్వాస్ ట్రస్టీ అయిన ఒక పరిశోధకుడి భాగం కూడా ఉంది. ఆ గనులు పాలకుల ఆశీస్సులున్న వ్యాపార సంస్థవనీ, ఆ ఉద్యమానికీ – సీపీఆర్‌తో జస్వాస్ భాగస్వామ్యానికీ సంబంధం లేకున్నా పాలకులకు అది కోప కారణమైందనీ విశ్లేషకుల మాట. కారణాలు ఏమైనా, ఏలినవారికి కోపమొస్తే బండి నడవడం కష్టమనే విషయం తాజా సీపీఆర్ లైసెన్స్ రద్దుతో మరోసారి రుజువు చేస్తోంది. గమనిస్తే – ఐటీ విభాగం తన నోటీసుల్లో పేర్కొన్న పరిశీలనలు, చేసిన ఆరోపణలు దాని పరిధిని దాటి ఉన్నాయి. ఇది పాలకులపై అనుమానాలకు ఊతమిస్తోంది. సీపీఆర్ మాత్రం తమ కార్యకలాపాలన్నీ చట్టబద్ధమైనవేననీ, ప్రభుత్వ సంస్థలు తమ ఆదాయ వ్యవహారాలను ఎప్పటి కప్పుడు ఆడిట్ చేస్తూనే ఉన్నాయనీ స్పందించింది. రాజ్యాంగ విలువల స్ఫూర్తితో ఈ వివాదం వీలైనంత త్వరలో సమసిపోతుందని అభిలషించింది. ఆ అభిలాష వాస్తవరూపం ధరిస్తే సంతో షమే. అయితే, పాలకులు తమ చేతుల్లోని దర్యాప్తు సంస్థలనూ, విభాగాలనూ దుర్వినియోగం చేయ డానికి ఏ మాత్రం వెనుకాడని గతం, వర్తమానమే భయపెడుతున్నాయి. నిబంధనల్లోని సాంకేతిక అంశాలను ఆయుధంగా చేసుకొని, భావప్రకటన స్వేచ్ఛకున్న అవకాశాల్ని అడ్డుకోవాలని పాలకులు చూడడం ఆందోళన రేపుతోంది. ఐటీనైనా, విదేశీ స్వార్థ ప్రయోజనాలు మన దేశ రాజకీయాలను ప్రభావితం చేయరాదని పెట్టుకున్న ఎఫ్సీఆర్ఎ లాంటి నియంత్రణ వ్యవస్థనైనా ప్రభుత్వేతర సంస్థల పీక నులమడానికి వాడితే అది అప్రజాస్వామికమే కాదు... అచ్చమైన ప్రతీకారమే! -
విదేశీ వర్సిటీలకు మరింత స్వేచ్ఛ
సాక్షి, హైదరాబాద్: విదేశీ విశ్వవిద్యాలయాలకు భారత ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. తొలిసారిగా అవి భారత్‌లో సొంతంగా క్యాంపస్‌లు నెలకొల్పేందుకు, అడ్మిషన్ల విధానం, ఫీజుల విషయంలో సొంత నిర్ణయాలు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. నిధులను సొంత దేశాలకు బదిలీచేసేందుకు తదితర నిబంధనలకు సంబంధించిన ముసాయిదా ప్రతిని యూజీసీ విడుదలచేసింది. అయితే ఆ వర్సిటీలో భారతీయ క్యాంపస్‌లలో కోర్సులకు సంబంధించి ప్రత్యక్ష తరగతులను నిర్వహించాలి. ఆన్లైన్, దూర విద్యా కోర్సులకు అనుమతి ఇవ్వబోమని యూజీసీ చైర్పర్సన్ జగదీశ్ చెప్పారు. విదేశీ వర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థ(హెచ్ఈఐ)లు ఇక్కడ క్యాంపస్‌ల ఏర్పాటు అనుమతులను యూజీసీ నుంచి తీసుకోవాలి. సంబంధిత వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాక ఈ నెల చివరికల్లా తుది నిబంధనలను రూపొందిస్తారు. ముసాయిదా ప్రకారం విదేశీ వర్సిటీలు తమ కోర్సుల్లో విద్యార్థుల అడ్మిషన్లు, ఫీజులపై స్వీయనియంత్రణ కల్గిఉంటాయి. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా.. ‘నూతన జాతీయ విద్యావిధానంలో పేర్కొన్నట్లు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల స్థాయి విద్యాబోధన భారతీయ విద్యార్థులకు అందుబాటులో ఉండాలి. విదేశీ వర్సిటీలతో అనువైన ఫీజుల్లోనే అంతర్జాతీయ విద్యార్హతలు మన విద్యార్థులకు దఖలుపడతాయి. వర్సిటీలు స్వదేశానికి పంపే నిధులకు ఫారెన్ ఎక్సే్ఛంజ్ మేనేజ్మెంట్(ఫెమా) చట్టం,1999 వర్తిస్తుంది. ఇవి తమ వార్షిక ఆడిట్ యూజీసీకి సమర్పిస్తారు’ అని జగదీశ్ అన్నారు. ర్యాంక్‌లు పొందిన వాటికే.. అత్యున్నత ర్యాంక్ పొందిన వర్సిటీలకే భారత్‌లో క్యాంపస్‌ల ఏర్పాటుకు అవకాశమిస్తారు. అంటే ప్రపంచం మొత్తంలో 500 లోపు ర్యాంక్ లేదా సబ్జెక్ట్ వారీగా ర్యాంక్ లేదా స్వదేశంలో దిగ్గజ వర్సిటీలకే భారత్‌లో అవకాశం దక్కనుంది. తర్వాత వాటి దరఖాస్తుల పరిశీలనకు యూజీసీ స్థాయీ సంఘాన్ని ఏర్పాటుచేయనుంది. దేశంలో న్యాక్ గ్రేడ్ పొందిన దేశీ వర్శిటీల సమన్వయంతో ఈ వర్సిటీలు పనిచేసే వీలుంది. దరఖాస్తు చేసిన 45 రోజుల్లో అనుమతులు లభిస్తాయి. కమిషన్ సూచించిన సమయంలో క్యాంపస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఫీజులు తదితర వివరాలను ప్రవేశాలకు 60 రోజుల ముందే వెల్లడించాలి. సరైన సంస్కరణలతో దేశీయ వర్సిటీలను బలోపేతం చేయాల్సిందిపోయి విదేశీ వర్సిటీలు తేవడం ఏంటని కొందరు విద్యావేత్తలు పెదవివిరిచారు. ‘ప్రభుత్వ నూతన విద్యా విధానం ప్రకారం యూజీసీకే చరమగీతం పాడనున్నారు. అలాంటి యూజీసీ నేతృత్వంలో సంస్కరణలు తేవడం ఏంటి ?. గతంలో విదేశీ వర్సిటీల బిల్లును 2012–13 కాలంలో యూపీఏ సర్కార్ తెచ్చేందుకు సిద్ధమైంది. కానీ ఆనాడు దీనిని బీజేపీ, వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. రాజ్యసభ స్థాయీ సంఘం కూడా తప్పుబట్టింది. ఇప్పుడు అదే బీజేపీ ఇప్పుడు ఇలా విరుద్ధంగా వ్యవహరిస్తోంది’ అని విద్యావేత్త, ఢిల్లీ యూనివర్సిటీ మహిళా ప్రొఫెసర్ అభా దేవ్ అన్నారు. -
ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో హైవే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి మన రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు 255 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. రూ.4,706 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారి నిర్మించనున్నారు. రహదారిలో అంతర్భాగంగా ఇప్పటికే కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. కాగా, రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణ ప్రక్రియ కూడా తాజాగా చేపట్టింది. రహదారి నిర్మాణం ఇలా... తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే 255 కి.మీ. రహదారి(ఎన్‌హెచ్167కె)ని ఏడు ప్యాకేజీల కింద నిర్మిస్తారు. అందులో తెలంగాణలో 91 కి.మీ. రహదారిని రూ.2,406 కోట్లతో నిర్మించేందుకు డీపీఆర్‌ను రూపొందించారు. మొదటి ప్యాకేజీ కింద రూ.886.69 కోట్లు, రెండో ప్యాకేజీ కింద రూ.1,082.40 కోట్లు, మూడో ప్యాకేజీ కింద రూ.436.91కోట్లతో పనులు చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. ఇక ఏపీలో 164 కి.మీ. మేర రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో రహదారి నిర్మాణానికి ప్రణాళికను రూపొందించారు. మొత్తం నాలుగు ప్యాకేజీల కింద నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు ఈ రహదారిని నిర్మిస్తారు. అందులో మొదటి ప్యాకేజి కింద 62.57 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి రూ.785 కోట్లతో పనులకు డీపీఆర్‌ను తాజాగా ఖరారు చేశారు. మిగిలిన మూడు ప్యాకేజీల కింద పనులను రూ.1,515 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ఎన్హెచ్ఏఐ డీపీఆర్‌ను రూపొందిస్తోంది. నాలుగు ప్యాకేజీల డీపీఆర్‌లు ఖరారు అయ్యాక 2023 ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిన్నరలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
PG Medical Seats: కేంద్రం కీలక నిర్ణయం.. ఆంధ్రప్రదేశ్‌కు 630 పీజీ వైద్యసీట్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో పీజీ వైద్యసీట్ల పంట పండింది. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఈ ప్రభుత్వం ఒకేసారి 630 పీజీ వైద్యసీట్లను తెచ్చింది. ఈమేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అండర్ సెక్రటరీ చందన్‌కుమార్ ఆంధ్రప్రదేశ్ సర్కారుకు అనుమతిస్తూ లేఖ రాశారు. ఈ మేరకు ఎంవోయూ పంపిస్తున్నామని, దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలేజీల వారీగా ఎంవోయూకు ఆమోదం తెలపాలని సూచించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యకళాశాలలు పీజీలు, సీనియర్ రెసిడెంట్లతో కళకళలాడనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలున్నాయి. ఆయా కాలేజీలు రెండునెలల కిందట సెంట్రల్ స్పాన్సర్షిప్ కింద 688 సీట్లకు ప్రతిపాదన పంపించాయి. ఈ ప్రతిపాదనలు పరిశీలించిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ 630 పీజీ వైద్యసీట్లకు ఆమోదముద్ర వేసింది. భారీగా నియామకాలు చేసినందునే.. రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా కనివినీ ఎరుగని రీతిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం జరిపినందునే పీజీ సీట్లు మంజూరు చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. గత మూడున్నరేళ్లలో దాదాపు 455 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించారు. 2,500 మందికిపైగా పారామెడికల్ సిబ్బందిని నియమించారు. దీంతోపాటు నాడు–నేడులో భాగంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. ఇవన్నీ చేయడం వల్లనే కేంద్రం కొత్త పీజీ వైద్యసీట్లకు ఆమోదముద్ర వేసింది. తాజాగా మంజూరైన సీట్లలో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆర్థోపెడిక్స్ ఇలా సుమారు 18 విభాగాలకు సంబంధించిన పీజీ వైద్యసీట్లు ఉన్నాయి. అత్యధికంగా ఆంధ్రా మెడికల్ కళాశాలకు 128 సీట్లు రాగా అత్యల్పంగా నెల్లూరు మెడికల్ కాలేజీకి 5 సీట్లు వచ్చాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు కొత్తగా పీజీ వైద్యసీట్లతో పాటు సూపర్ స్పెషాలిటీ సీట్లు కూడా వచ్చాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా కొత్తగా సీట్లొచ్చాయి. దీనివల్ల సామాన్యులకు స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ పరిధిలో సీట్లు పెరగడం పేద వైద్యవిద్యార్థులకూ మంచి పరిణామం. – డాక్టర్ హరిచరణ్, వైస్ ప్రిన్సిపాల్, కర్నూలు మెడికల్ కాలేజీ -
సీసీఐకు తాత్కాలిక చైర్పర్సన్ సంగీతా వర్మ నియామకం
న్యూఢిల్లీ: ప్రభుత్వం తాజాగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)కు తాత్కాలిక చైర్‌పర్సన్‌గా సంగీతా వర్మను నియమించింది. ప్రస్తుత ఫుల్‌టైమ్ చైర్‌పర్శన్ అశోక్ కుమార్ గుప్తా మంగళవారం వైదొలగడంతో ప్రభుత్వం సంగీతా వర్మకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. సీసీఐలో సభ్యురాలైన వర్మ బుధవారం(26) నుంచి మూడు నెలలపాటు చైర్‌పర్సన్‌గా కొనసాగుతారు. పూర్తిస్థాయి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేసేటంతవరకూ లేదా తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకూ వర్మ బాధ్యతలు నిర్వహిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలియజేసింది. మంగళవారం రాజీనామా చేసిన గుప్తా 2018 నవంబర్‌లో సీసీఐకు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించారు. -
భారత్ చేతికి 4వ విడత స్విస్ ఖాతాల వివరాలు
న్యూఢిల్లీ/బెర్న్: స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న భారతీయులు, దేశీ సంస్థలకు సంబంధించిన మరిన్ని వివరాలు భారత ప్రభుత్వానికి అందాయి. ఆటోమేటిక్ వార్షిక సమాచార మార్పిడి (ఏవోఈఐ) ఒప్పందం కింద స్విట్జర్లాండ్ నాలుగో విడత వివరాలు (వరుసగా నాలుగో ఏడాది) వీటిని అందజేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో వందల కొద్దీ వ్యక్తిగత, కార్పొరేట్ల, ట్రస్టుల ఖాతాలు ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, తదుపరి విచారణలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉన్నందున పేర్లు, వివరాల విషయంలో గోప్యత పాటిస్తున్నట్లు వివరించారు. తదుపరి విడత స్విస్ ఖాతాల వివరాలు మళ్లీ 2023 సెప్టెంబర్‌లో భారత్‌కు అందనున్నాయి. ఏవోఈఐ కింద ఈ ఏడాది 101 దేశాలకు 34 లక్షల ఖాతాల వివరాలు అందించినట్లు, ప్రతిగా ఆయా దేశాల నుంచి 29 లక్షల ఖాతాల వివరాలు పొందినట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) వెల్లడించింది. సంపన్నులు అక్రమంగా సొమ్ము దాచుకునేందుకు స్విస్ బ్యాంకులు ఉపయోగపడుతున్నాయన్న అపప్రదను తొలగించుకునే ప్రయత్నాల్లో భాగంగా 2018 నుంచి స్విట్జర్లాండ్ ఏఈవోఐ అమలు చేస్తోంది. భారత్‌తో ఒప్పందం 2019 నుంచి అమల్లోకి వచ్చింది. -
ఆలోచన అక్కర్లేదా?!
ఇది ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ అవార్డుల సీజన్. కొద్దిరోజులుగా వివిధ రంగాల్లో నోబెల్ విజేతల పేర్లు ప్రకటిస్తుంటే, అంతకు పక్షం రోజుల క్రితం మన దేశంలో గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోయిన ఓ దుర్మార్గం ఆలస్యంగా బయట కొచ్చింది. శాస్త్రీయ పరిశోధనలో ప్రతిభను గుర్తించి ఏటా ఇచ్చే 300 అంతర్గత అవార్డులు, ఉపకార వేతనాలు, ఫెలోషిప్లను ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. వివిధ రంగాల్లో అవార్డుల ఎంపికను క్రమబద్ధీకరించడానికంటూ కేంద్ర హోమ్ సెక్రటరీ సారథ్య సమావేశంలో గత నెల 16న చడీచప్పుడు లేకుండా పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం దిగ్భ్రాంతికరం. శాస్త్రీయ దృక్పథాన్నీ, పరిశోధననూ పెంచాల్సిన రోజుల్లో ఆ స్ఫూర్తికి అశనిపాతం. దేశంలో అవార్డుల ఎంపిక వ్యవస్థను పారదర్శకంగా, నిష్పాక్షికంగా తీర్చిదిద్దాలనే ప్రధాని ఆలోచన మంచిదే కావచ్చు. దాని అంతరార్థం, శాస్త్రవేత్తల సమూహానికి కలిగించే నష్టమే చర్చనీయాంశం. అవార్డులైనా... రివార్డులైనా ప్రతిభను ప్రోత్సహించడానికి! ఆయా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్నవారిని గుర్తించి, గౌరవించడానికి!! సంక్లిష్టమైన శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అవి మరింత కీలకం. 1940లు, 50లలో భారతీయ శాస్త్రవేత్తల్లో సుప్రసిద్ధుడూ, సీఎస్ఐఆర్ సంస్థాపకుడూ అయిన ప్రొఫెసర్ శాంతిస్వరూప్ భట్నాగర్ జన్మదినమైన సెప్టెంబర్ 26ను మన శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా జరుపుకొంటారు. ప్రతి ఏటా సరిగ్గా ఆ రోజునే భారత ప్రభుత్వం సైతం మన దేశంలో కృషి చేస్తున్న అత్యుత్తమ ప్రతిభావంతులైన 45 ఏళ్ళ వయస్సు లోపు శాస్త్రవేత్తలను గౌరవిస్తూ, భట్నాగర్ ప్రైజ్ ప్రకటిస్తుంది. కానీ, ఈసారి ప్రభుత్వ అవార్డు ప్రకటనలు లేకపోగా, ప్రభుత్వానికి పైసా ఖర్చు లేని ప్రైవేట్ ధర్మనిధి పురస్కారాల్ని సైతం ఎత్తివేస్తున్నట్టు చావుకబురు చల్లగా చెప్పింది. ఉన్నత స్థాయి సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాల సమాచారాన్ని బయటపెట్టి, గమ్మున ఊరకుంది. ఇప్పుడిక శాస్త్ర, సాంకేతిక విభాగంలో అవార్డుల సంఖ్య 207 నుంచి 4 జాతీయ అవార్డులకే పరిమితం. అంతరిక్షం, భూవిజ్ఞానం, అణు ఇంధన శాఖల్ని సైతం అవార్డులన్నీ ఎత్తేయమని కేంద్రం పేర్కొంది. ఏలికలు అకస్మాత్తుగా ఇలా అవార్డులు ఎత్తేయడానికి హేతుబద్ధత ఏమిటో అంతుపట్టదు. పొదుపుచర్యల్లో భాగంగా ఇలా చేశారనుకోవడానికీ వీల్లేదు. ఎందుకంటే, ఈ అవార్డులన్నిటికీ కలిపి ఏటా అయ్యే ఖర్చు అతి స్వల్పం. పోనీ, అర్హత లేని వారికి అవార్డులిస్తారనే మిషతో ఈ ఎత్తివేత జరిగిందా అంటే అదీ లేదు. సాధారణంగా ఏ అవార్డుల ఎంపికలోనైనా పక్షపాతం, దురభిప్రాయాల్ని కొట్టిపారేయలేం. ఇప్పటిదాకా శాస్త్రవేత్తల అవార్డుల్లో తప్పుడు ఎంపికలు అతి తక్కువ. ప్రస్తుతమున్న ఎంపిక ప్రక్రియలో అధిక శాతం అత్యుత్తమ ప్రతిభావంతులకే పట్టం కట్టారు. మరి ఏలినవారి ఈ హఠాన్నిర్ణయానికి కారణం? శాస్త్ర సాంకేతిక రంగాల్లోని బహుకొద్ది శాస్త్రవేత్తలే నేటి పాలకుల ప్రశ్నార్హమైన శాస్త్రీయ అజెండాతో అంటకాగుతున్నారు. అవార్డులన్నిటినీ కేంద్రీకృతం చేయడం వల్ల ఎంపిక కమిటీలపై ప్రభుత్వం పట్టు బిగుస్తుంది. దరిమిలా అయినవాళ్ళకు అవార్డులు వడ్డించి, వారిని వివిధ పరిశోధక సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో కీలక స్థానాల్లో కూర్చోబెట్టే వీలొస్తుంది. ఇదే తాజా ప్రభుత్వ నిర్ణయంలో పరమార్థమని వాదన. అలాగే, పలువురు ప్రముఖ శాస్త్రవేత్తలు వివిధ సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ సైన్స్ విధానాలను మీడియాలో విమర్శించారు. మింగుడుపడని పాలకులు వారి రెక్కలు కత్తిరించడానికే ఈ చర్య చేపట్టారని ఒక కథనం. యువ శాస్త్రవేత్తలకిచ్చే ఫెలోషిప్‌లు గతంలో ఎప్పుడో అరుదుగా ఆలస్యమయ్యేవి. కానీ, మూడేళ్ళుగా సమయానికి ఫెలోషిప్‌లు, గ్రాంట్లు రాక పరిశోధనకు అవసరమైన సరుకులు, సామగ్రి వారు కొనుక్కోలేకపోతున్నారు. కుటుంబాల్ని పోషించుకోలేని పీహెచ్డీ విద్యార్థులు సగంలోనే పరిశోధనకు మంగళం పాడుతున్నారు. ఇప్పుడు అవార్డులను ఎత్తివేయడమంటే ప్రోత్సాహాన్ని ఆపేయడమే కాదు.... శాస్త్రీయ పరిశోధన పట్ల ఆసక్తిని మరింత నీరుగార్చి, నిరుత్సాహపరచడం! అసలు మన దేశంలో సరికొత్త పరిశోధనలకు ప్రేరణనిస్తూ, శాస్త్రవేత్తల వెన్నుతట్టేందుకు ఉన్న అవార్డులే తక్కువ. ఖజానాకు ఖర్చు లేని ప్రైవేట్ ధర్మనిధి పురస్కారాల్నీ ఎత్తేయడం ఏ రకంగా సమంజసం? ఇప్పటికే దేశం. ప్రాథమిక శాస్త్రీయ పరిశోధనలకు వచ్చే యువతీ యువకులు తగ్గారు. ఇతర రంగాల్లోని భారీ వేతనాలిచ్చే ఉద్యోగాల వైపు మళ్ళుతున్నారు. తాజా చర్యతో సర్కార్ ఎలాంటి సంకేతాలిస్తోంది? పాత అవార్డుల స్థానంలో నోబెల్ తరహాలో ‘విజ్ఞాన్ రత్న’ పేరిట ఉన్నత శ్రేణి జాతీయ అవార్డులు కొన్ని తెస్తామని సర్కారు వారి మాట. ఈ కొత్తవి పరిశోధనలో అన్ని విభాగాలకూ, పరిశోధకులకూ వర్తిస్తాయో లేదో తెలీదు. అవార్డులు తీసేస్తే, వాటి కోసం ఇచ్చిన ధర్మనిధులు ఏమవుతాయి? వాటిని దేనికి వినియోగిస్తారు? జవాబు లేని ప్రశ్నలెన్నో! శాస్త్రీయ పరికరాల కొనుగోలుపై జీఎస్టీని కేంద్రం ఇటీవలే 5 శాతం నుంచి 18 శాతానికి పెంచింది. ఇది పలు సంస్థల పరిశోధన బడ్జెట్‌కు మోయలేని భారమవుతోంది. అలాగే, విదేశీ పరిశోధకుల్ని ఆహ్వానించాలన్నా, విదేశీ విశ్వవిద్యాలయంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకోవాలన్నా లెక్కలేనన్ని అనుమతులు అడ్డం పెట్టి, వ్యవహారం సంక్లిష్టం చేసింది. పరిశోధనలో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని దాదాపు అసాధ్యం చేసింది. నమ్మకాలు, విశ్వాసాలకే తప్ప హేతుబద్ధత, తార్కిక విశ్లేషణకు చోటు లేకుండా పోతున్న రోజుల్లో, పాలనలో శాస్త్రీయ దృష్టికి ప్రోత్సాహం ఇలానే ఉంటుందేమో! ఏమైనా ఉత్తమాటలు చెప్పి ఉన్నవాటన్నిటినీ ఎత్తేయడం... మబ్బులు చూపిస్తూ ముంతలో ఉన్న నీళ్ళు ఒలకబోయడమే!! -
నేతాజీ ‘అస్థికల’కు డీఎన్ఏ టెస్ట్ డిమాండ్!
న్యూఢిల్లీ: భారత స్వాతంత్య్ర సంగ్రామ యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలుగా భావిస్తున్న వాటిని భారత్‌కు రప్పించాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆయన ఒక్కగానొక్క కుమార్తె అనితా బోస్ పాఫ్ ఈ మేరకు భారత ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ నేతాజీ కుమార్తె స్పందించడం గమనార్హం. 1945 ఆగస్ట్ 18న తైవాన్ వద్ద జరిగిన విమానప్రమాదంలో నేతాజీ తుది శ్వాస విడిచారని, ఆయన అస్థికలు జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచారని ప్రతీతి. ‘‘అస్థికలను భారత్ తేవాల్సిన సమయమొచ్చింది. అవి మా నాన్నవే అని చెప్పేందుకు నేటి డీఎన్ఏ టెస్టింగ్ విధానం సాయపడనుంది. ఇందుకు జపాన్ ప్రభుత్వం, రెంకోజీ ఆలయ ప్రధాన పూజారి గతంలోనే అంగీకరించారు. దేశ స్వేచ్ఛ కంటే నేతాజీకి ఆయన జీవితంలో మరేదీ ముఖ్యంకాదు. భారతజాతి స్వేచ్ఛావాయువులు పీల్చాలని నేతాజీ కలలుగన్నారు. ఆ కల నేడు నెరవేరింది. కానీ.. ఆయనిప్పుడు లేరు. కనీసం ఆయన అస్థికలనైనా భరతమాత(స్వదేశం) చెంతకు చేరుద్దాం’ అని అనిత బోస్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. నేతాజీ అవశేషాలకు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించాలని ఆయన కుటుంబం చాలా ఏళ్ల నుంచి విజ్ఞప్తి చేస్తోంది. విషయంలో జపాన్, రెంకోజీ ఆలయాలు సిద్ధంగా ఉన్నా.. భారత ప్రభుత్వం నుంచి స్పందన కొరవడిందని జపాన్ విదేశాంగ శాఖ గతంలో ప్రకటించింది. ఇదీ చదవండి: 38 ఏళ్ల తర్వాత మంచు దిబ్బల నడుమ లాన్స్ నాయక్ చంద్రశేఖర్ -
వాడుకున్నప్పుడు వాటా ఇవ్వాల్సిందే.. గూగుల్, ఫేస్‌బుక్‌కు ఫీజు!
న్యూఢిల్లీ: సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌లలో వచ్చే వార్తాంశాలపై ఆ సంస్థల నుంచే ఫీజు వసూలు చేసేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలను భారత ప్రభుత్వం రూపొందిస్తోంది. ప్రస్తుతం వార్తా సంస్థల్లో తయారయ్యే వార్తాంశాలను గూగుల్, ఫేస్బుక్ తదితర సంస్థలు యథేచ్చగా వాడుకుంటూ ఎలాంటి ప్రతిఫలం ఇవ్వడం లేదు. తమకు అన్యాయం జరుగుతోందంటూ ఆయా వార్తా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే భారత ప్రభుత్వం తాజాగా.. వార్తాంశాల ద్వారా వచ్చే ఆదాయంలో వాటాను వార్తా సంస్థలకు అందజేసేందుకు, లేని పక్షంలో ఆయా కంపెనీల నుంచి జరిమానా వసూలు చేసేందుకు ఉద్దేశించిన నిబంధనలకు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. -
జైహింద్ స్పెషల్: 47కు 32 ఏళ్ల ముందే భారత్‌కు స్వాతంత్య్రం!
భరతమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు పలువురు వీరులు వివిధ మార్గాల్లో దశాబ్దాలపాటు పోరాడారు. కొందరు అహింసా మార్గం, మరికొందరు పోరాట మార్గంలో పయనించగా ఇంకొందరు దౌత్యమార్గంలో దేశ స్వాతంత్రం సాధించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. ప్రపంచంలో బ్రిటిష్‌కు వ్యతిరేకంగా ఉన్న ఇతర దేశాల మద్దతు సంపాదించి ఇండియాలో బ్రిటిష్ రాజ్‌ను కూలదోయాలని ప్రవాసీ భారతీయులు చాలామంది చాలా రకాల మార్గాలను అనుసరించారు. ఇలాంటి ప్రయత్నాల్లో ఉన్న వారికి మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అఫ్గనిస్థాన్ ఒక అవకాశంగా దక్కింది! చదవండి: స్వతంత్ర భారతి: బోఫోర్స్ కుంభకోణం అక్కడ మనవాళ్లు ప్రపంచ యుద్ధంలో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉన్న దేశాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఒకదశలో ఇండియాలో తమ పాలన అంతమవుతుందన్నంత భయాన్ని బ్రిటిషర్లలో ఈ ప్రభుత్వం రేకెత్తించింది. కానీ చివరకు అఫ్గాన్ అమీర్ బ్రిటిష్ ఒత్తిడికి తలొగ్గడంతో ప్రవాస భారత ప్రభుత్వం అర్ధంతరంగా ముగిసింది. అయితే ఆ ప్రభుత్వం అనుకున్న లక్ష్యాన్ని పూర్తిగా సాధించలేకున్నా భారతీయ ప్రజల్లో రాజకీయ అవగాహన పెంచేందుకు, వివిధ దేశాల్లో భారతదేశం పట్ల సానుభూతి పెరిగేందుకు దోహదం చేసింది. అలా మొదలైంది భారత స్వాతంత్య్రం కోసం అఫ్గన్ అమీర్, రష్యా జార్; చైనా, జపాన్ల మద్దతు సంపాదించే లక్ష్యంతో టర్కీ, జర్మనీ సహకారంతో పలువురు ప్రవాస భారతీయులు ప్రయత్నించారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాల్లోని భారతీయ జాతీయవాదులు, ప్రచ్ఛన్నంగా పనిచేస్తున్న భారతీయ విప్లవకారులు జర్మనీ ఆర్థిక సహాయంతో భారత జాతీయోద్యమాన్ని ఉద్ధృతం చేయవచ్చని భావించారు. వీరి ప్రయత్నాల్లో భాగంగా బెర్లిన్–ఇండియన్ కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ బ్రిటిషర్లపై దాడి చేసేందుకు గిరిజనులను ప్రోత్సహించడం కోసం ఇండో–ఇరానియన్ సరిహద్దు వద్దకు ఒక ఇండో–జర్మన్–టర్కిష్ బృందాన్ని పంపింది. మరోవైపు దేవ్‌బందీ మౌలావి ఉబైద్ అల్లా సింధీ, మహమూద్ అల్ హసన్ నేతృత్వంలో మరొక బృందం 1915 అక్టోబరులో భారతదేశంలోని గిరిజన ప్రాంతంలో ముస్లిం తిరుగుబాటును ప్రారంభించే ప్రణాళికలతో కాబూల్‌కు వెళ్లింది. ఈ రెండు బృందాలు 1915 డిసెంబర్ 1న కలుసుకొని రాజా మహేంద్ర ప్రతాప్ అధ్యక్షుడిగా తొలి భారతీయ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఈ ప్రభుత్వంలో మౌలానా బర్కతుల్లా ప్రధానమంత్రిగా, దేవబందీ మౌలావి ఉబైద్ అల్లా సింధీ హోం మంత్రిగా, దేవబందీ మౌలావి బషీర్ యుద్ధ మంత్రిగా, చంపక్రామన్ పిళ్లై విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు. ఈ ప్రభుత్వానికి ఆఫ్ఘన్ ప్రభుత్వం నుండి అంతర్గతంగా గణనీయమైన మద్దతు లభించింది. అయితే అమీర్ హబీబుల్లా మాత్రం బహిరంగంగా మద్దతు ప్రకటించడానికి నిరాకరించాడు. అయినప్పటికీ అఫ్గాన్ లోని పత్రికలు, ఇతర ప్రముఖులు ప్రవాస భారతీయ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడం విశేషం. విదేశీ సాయం కోసం 1917 లో రష్యాలో ఫిబ్రవరి విప్లవం తరువాత, మహేంద్ర ప్రతాప్ ప్రభుత్వం కొత్త సోవియట్ ప్రభుత్వంతో సంబంధాలు పెట్టుకుంది. 1918 లో మహేంద్ర ప్రతాప్ బెట్రోలిన్ లో జర్మన్ కైసర్‌ను, పెట్రోగ్రాడ్‌లో లియోన్ ట్రాట్సీకని (సోవియట్ నాయకుడు) కలుసుకున్నారు. బ్రిటిషు ఇండియాకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అతడు వారిద్దరినీ కోరాడు. సిరాజ్–ఉల్–అక్బర్ అనే పత్రిక 1916 మే 4 సంచికలో ప్రభుత్వ ఉద్దేశాల గురించి రాజా మహేంద్ర ప్రతాప్ రాసిన వ్యాసం ప్రచురించింది. ‘‘జర్మన్ కైజర్ స్వయంగా నాకు దర్శనమిచ్చాడు. ఇంపీరియల్ జర్మన్ ప్రభుత్వంతో భారతదేశం, ఆసియా సమస్యపై చర్చించి తగిన మద్దతు పొందాక నేను తూర్పు వైపు ప్రయాణం ప్రారంభించాను. ఈ ప్రయాణంలో ఈజిప్ట్ ఖేదీవ్తో, టర్కీ యువరాజులు, మంత్రులతో, అలాగే ప్రఖ్యాత ఎనీవర్ పాషాతో, పవిత్ర ఖలీఫ్, సుల్తాన్–ఉల్–మువాజిమ్తో సంప్రదింపులు జరిపాను. నేను భారతదేశపు అంశాన్ని ఒట్టోమన్ ప్రభుత్వంతో చర్చించాను. వారి నుండి అవసరమైన గుర్తింపును కూడా పొందాను. జర్మనీ, టర్కీ అధికారులు, మౌల్వీ బరాకతుల్లా సాహిబ్ ఇప్పటికీ నాతోనే ఉన్నారు’’ అని ప్రతాప్ ఈ వ్యాసంలో పేర్కొన్నారు. అయితే ప్రవాస ప్రభుత్వ యత్నాలను బ్రిటన్ అన్ని రకాలుగా అడ్డుకుంది. తొలుత సాయం చేస్తానన్న అమీర్ చివర్లో బ్రిటన్ ఒత్తిడికి తలొగ్గి మద్దతు ఉపసంహరించుకున్నాడు. దీంతో ప్రవాస ప్రభుత్వం మూతపడింది, అందులో సభ్యులు బ్రిటీష్‌వారి నుంచి తప్పించుకునేందుకు ఇతర దేశాలకు వలస వెళ్లారు. పరోక్ష ప్రభావం ఇతర దేశాల మద్దతు కూడగట్టేందుకు ఏర్పాటైన ప్రవాస భారతీయ ప్రభుత్వం మూడు నాలుగేళ్లు మాత్రమే ఉనికిలో ఉంది. అయితే ఈ ప్రభుత్వం, దీని సూచనలు అటు ఇండియాలో ఇటు అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావాలు చూపాయి. అఫ్గన్‌లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వనందుకు నిరసనగా పలు రాజకీయ మార్పులు జరిగి చివరకు అమీర్ హత్యకు, అటు తర్వాత మూడో ఆంగ్లో అఫ్గన్ యుద్ధానికి, చివరగా అఫ్గన్ స్వాతంత్య్రానికి దారి తీశాయి. ఈ ప్రభుత్వ ఏర్పాటు భారతదేశంలో రాజకీయ పురోగతిని ప్రభావితం చేసిందని చాలా మంది చరిత్రకారులు భావించారు. బ్రిటిష్ ఇండియా సరిహద్దుల్లోనే ప్రతాప్ ప్రభుత్వం ఉండటం, బోల్షివిక్ సహాయం కోరుతూ ప్రతాప్ తాత్కాలిక ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు.. భారతదేశంలో తమ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పుగా బ్రిటిషర్లు భయపడ్డారు. దీంతో రౌలత్ కమిటీ ఏర్పాటు చేసి భారతదేశంలో మిలిటెంట్ ఉద్యమాల మధ్య ఉన్న సంబంధాలను అంచనా వేశారు బ్రిటిషర్లు. ఈ కమిటీ సిఫారసులపై ఆధారపడి బ్రిటిషు ప్రభుత్వం భారత రక్షణ చట్టం 1915 కు పొడిగింపుగా రౌలత్ చట్టాన్ని తీసుకువచ్చింది. దీనికి వ్యతిరేకంగా జలియన్ వాలాబాగ్‌లో ఏర్పాటైన సమావేశంపై డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు జరపడం భారతీయులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. తత్ఫలితంగా దేశ స్వాతంత్రోద్యమం మరింత వేగం పుంజుకుంది. – దుర్గరాజు శాయి ప్రమోద్ -
కేంద్రంపై కోర్టుకెక్కిన ట్విట్టర్
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నూతన నిబంధనల మేరకు రాజకీయ కంటెంట్‌ను తొలగించాలన్న ప్రభుత్వ ఆదేశాలను సవాల్ చేస్తూ సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రభుత్వం బ్లాక్ చేయాలని కోరిన కంటెంట్‌కు, ఐటీ చట్టంలోని సెక్షన్ 69–ఏకు ఎలాంటి సంబంధం లేదని అందులో పేర్కొంది. రాజకీయ పార్టీల అధికారిక ఖాతాల నుంచి పోస్ట్ చేసిన సమాచారాన్ని నిరోధించడం, పౌర వినియోగదారులకు ఇచ్చిన వాక్ స్వాతంత్య్రం హామీకి భంగం కలిగించడమేనంది. ప్రభుత్వం చెబుతున్న వివాదాస్పద ఖాతాలపై న్యాయసమీక్ష జరపాలని కోర్టును కోరింది. ఈ పరిణామంపై ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. ‘కోర్టును ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. అదే సమయంలో ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి వ్యవహరించాల్సిందే’అని ఆయన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. జూలై 4వ తేదీలోగా తమ ఉత్తర్వులను అమలు చేయకుంటే చట్టపరమైన రక్షణలు రద్దవుతాయంటూ జూన్ 28వ తేదీన ట్విట్టర్‌కు హెచ్చరికలు పంపింది. అంటే, ట్విట్టర్ ఉన్నతాధికారులకు జరిమానా, ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. దీనిపైనా తాజాగా కర్ణాటక హైకోర్టులో ట్విట్టర్ సవాల్ చేసింది. (క్లిక్: కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తికి బెదిరింపులు) -
సర్కారీ కొలువుల జాతర
కొత్తగా పది లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్టు వెలువడిన కథనం చిరకాలంగా కొలువుల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగ యువతలో ఉత్సాహాన్ని నింపింది. ఈ నిర్ణయం పర్యవసానంగా వచ్చే ఏడాదిన్నరకాలంలో 77 మంత్రిత్వశాఖల పరిధిలోని వివిధ విభా గాల నుంచి వరస నోటిఫికేషన్లు హోరెత్తుతాయి. కొత్తగా ఉద్యోగాలిస్తే జీతాల కోసం అదనంగా ప్రతి నెలా రూ. 4,500 కోట్లు వ్యయమవుతుందని ఒక అంచనా. అంటే ఏటా ప్రభుత్వానికి రూ. 54,000 కోట్ల అదనపు ఖర్చుంటుంది. ఈ ఉద్యోగులకు ఇచ్చే శిక్షణ వగైరాలకయ్యే వ్యయం అదనం. వీరందరికీ మున్ముందు పదోన్నతులు ఇవ్వాల్సివచ్చినప్పుడు ఎదురయ్యే సమస్యలు సరేసరి. అసలు ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయి రిక్రూట్మెంట్ ఆచరణలో సాధ్యమేనా అన్న సందేహం కూడా వస్తుంది. ఒక క్రమపద్ధతిలో అవసరానికనుగుణంగా ఉద్యోగాలు భర్తీ చేస్తే సమస్యలుండవు. ఆ విభాగాలు ఎలాంటి అంతరాయమూ లేకుండా సేవలందించడం సాధ్యమవుతుంది. అలా కాకుండా ఒకేసారి జాతర మాదిరిగా ఉద్యోగాల భర్తీ చేపడితే నిరుద్యోగులకూ ఇబ్బందే. ఏ ఉద్యోగం వస్తుందో, ఏది రాదో తెలియక అన్ని పరీక్షలకూ హాజరుకావాల్సి వస్తుంది. తాము అధికారంలో కొచ్చాక ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది. ఆ విషయంలో అడపా దడపా విమర్శలు వస్తున్నా కేంద్రంలోని పెద్దలు పట్టించుకోలేదు. ఉద్యోగాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలేనా అని కొందరు సచివులు ఎదురు ప్రశ్నించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగ పెనుభూతం యువతరాన్ని ఎంతగా పీడిస్తున్నదో తెలియడానికి కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకంపై బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్, గురుగ్రామ్ తదితరచోట్ల వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలే నిదర్శనం. రైల్వే ఆస్తులను, బస్సులను ధ్వంసం చేయడం, రహదారుల దిగ్బంధం వంటి ఘటనలు చూస్తుంటే యువత ఎంతగా నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయారో అర్ధమవు తుంది. 1994 గణాంకాల ప్రకారం కేంద్రంలో 41.76 లక్షల ఉద్యోగాలుండేవి. 2014 నాటికి వాటి సంఖ్య 39.9 లక్షలు. 2021 లెక్కల ప్రకారం కేంద్ర సిబ్బంది 34.5 లక్షల మంది. వీరుగాక చిన్నా చితకా ఉద్యోగాలతో సహా కేంద్రంలో 24.30 లక్షలమంది కాంట్రాక్టు నియామకాల కింద పనిచేస్తు న్నారు. కేంద్ర సిబ్బందిలో 92 శాతం మంది కేవలం ఐదు మంత్రిత్వ శాఖల్లో ఉంటారని చెబుతారు. ఇందులో 40 శాతం వాటాతో రైల్వేలు అగ్రభాగాన ఉంటే... హోంశాఖలో 30 శాతం, రక్షణ (పౌరవిభాగం)లో 12 శాతం సిబ్బంది ఉంటారు. నిజానికి బయట దొరికే ఉద్యోగాలతో పోలిస్తే ప్రభుత్వ ఉద్యోగాల శాతం చాలా తక్కువ. మన జీడీపీ ఘనంగా కనబడటానికి తోడ్పడుతున్న సేవారంగంలో ఉద్యోగాలకు ప్రత్యేక నైపుణ్యాలు అవసరమవుతాయి. పైగా అక్కడా సాంకేతికత పెరిగి గతంతో పోలిస్తే ఉద్యోగావకాశాలు క్షీణిస్తున్నాయి. ఏటా కొత్తగా ఉద్యోగ మార్కెట్లోకి వచ్చేవారు కోటీ 20 లక్షలమంది అని ఒక అంచనా. వీరిలో ఎందరికి ఉద్యోగాలు దొరుకుతాయి? వీరికన్నా చాలా ఏళ్లముందునుంచీ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారి మాటేమిటి? పాశ్చాత్య దేశాల్లో ప్రభుత్వోద్యోగాల కోసం ఎగబడే ధోరణి కనబడదు. అక్కడ రెండు రంగాల్లో లభించే వేతనాలకూ పెద్దగా వ్యత్యాసం ఉండదు. కానీ మన దేశంలో వేరు. ప్రభుత్వ సిబ్బందికి నిర్ణీత వ్యవధిలో వేతన సవరణ సంఘాల సిఫార్సులు వస్తాయి. కాస్త వెనకో ముందో వాటిని అమలు చేస్తారు. ఇవిగాక ప్రైవేటు రంగంతో పోలిస్తే ఇతరత్రా సదుపాయాలు, క్రమం తప్పకుండా వచ్చే పదోన్నతులు అదనం. ప్రైవేటు రంగ సిబ్బంది యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాలి. కార్మికసంఘాలు బలహీనపడ్డాయి గనుక ఉద్యోగులకు దినదినగండంగా ఉంటున్నది. లేబర్ కోర్టులు వగైరాలవల్ల పెద్దగా ఒరిగేది ఉండదు. ప్రైవేటు రంగంలో కూడా మెరుగైన పరిస్థితు లుండేలా చర్యలు తీసుకుంటే ప్రభుత్వాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు లేకపోగా... రేపో మాపో అమల్లోకి రానున్న లేబర్ కోడ్ వల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నమవు తాయని బీజేపీ అనుకూల కార్మికసంఘంతో సహా అన్ని సంఘాలూ ఆరోపిస్తున్నాయి. ఈ కారణాల వల్లే ప్రభుత్వోద్యోగాల కోసం ఎగబడేవారు నానాటికీ పెరుగుతున్నారు. నిరుద్యోగంపై కేవలం కేంద్రాన్ని మాత్రమే తప్పుబట్టడం కుదరదు. ఏ పార్టీ అధికారంలో ఉందన్నదానితో నిమిత్తం లేకుండా 90వ దశకం మధ్యనుంచీ అన్ని రాష్ట్రాల్లోనూ సర్కారీ కొలువులు తగ్గిపోయాయి. తాను అధికారంలోకొస్తే యువతకు ఉద్యోగాలిస్తాననీ, లేనట్టయితే నిరుద్యోగ భృతి ఇస్తాననీ 2014 ఎన్నికల్లో వాగ్దానం చేసిన చంద్రబాబు తాను పాలించిన ఐదేళ్లూ ఉద్యోగాలూ ఇవ్వలేకపోయారు, నిరుద్యోగ భృతిని కూడా అందించలేకపోయారు. చివరకు 2019లో అధికారం లోకొచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం భారీయెత్తున యువతకు ఉద్యోగాలిచ్చింది. కేంద్ర స్థాయిలో క్రమం తప్పకుండా నియామకాలు చేపట్టే ప్రధాన సంస్థల్లో యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ప్రధానమైనవి. వీటిద్వారా గత ఐదేళ్లలో నాలుగున్నర లక్షలమందిని తీసుకున్నట్టు కేంద్రం చెబుతున్నది. ఇవిగాక ప్రస్తుతం వివిధ విభాగాల్లో పది లక్షల ఉద్యోగాలు ఖాళీగా పడివున్నాయి. కొలువుల భర్తీపై కేంద్రం తాజా ప్రకటనను విపక్షాలు తప్పుబడుతున్నాయి. రానున్న ఎన్నికల కోసమే ఈ ఆర్భాటమంటున్నాయి. కావొచ్చు... ఉద్దేశాలు ఏమైనప్పటికీ యువతకు ఉద్యోగ కల్పన నిర్ణయాన్ని హర్షించాల్సిందే. -
పేరరివాలన్ విడుదలకు మొగ్గు
సాక్షి, చెన్నై: రాజీవ్ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ విడుదలకు సుప్రీంకోర్టు పరోక్షంగా మొగ్గు చూపింది. ఈ మేరకు న్యాయమూర్తి నాగేశ్వ రరావు బెంచ్ బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. నేపథ్యం ఇదీ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో నింధితులుగా ఉన్న నళిని, మురుగన్, శాంతన్, పేరరివాలన్ సహా ఏడుగురికి తొలుత విధించిన కోర్టు ఉరి శిక్ష విధించింది. కాలక్రమేనా అది యావజ్జీవ శిక్షగా మారిన విషయం తెలిసిందే. అయితే శిక్షా కాలం ముగిసినా వీరంతా (30 ఏళ్లుగా) జైలుకే పరిమితమై ఉన్నారు. దీంతో తమను విడుదల చేయాలని కోరుతూ నిందితులు ఒక్కొక్కరిగా కోర్టును ఆశ్రయిస్తున్నారు. అలాగే, వీరి విడుదలకు గత ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని గవర్నర్ తుంగలో తొక్కడాన్ని కోర్టుల్లో ప్రస్తావిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో నిందితులు ఒకరి తర్వాత మరొకరు కోర్టు ద్వారా పెరోల్ పొందే పనిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ వ్యవహారంలో నిందితులకు అనుకూలంగానే వ్యవహరించింది. ఇక పేరరివాలన్, నళిని ప్రస్తుతం పెరోల్‌పై విడుదలై బయట ఉన్నారు. అయితే, పెరోల్‌పై బయటకు వచ్చినా, ఇంట్లో నిత్యం పోలీసు పహారా మధ్య కాలం గడపాల్సిన పరిస్థితి ఉందని, ఇది కూడా ఓ జైలుగానే మారిందంటూ పేరరివాలన్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పేరరివాలన్‌కు బెయిల్ లభించింది. అదే సమయంలో తనకు ఈ కేసు నుంచి విముక్తి కలి్పంచాలని కోరుతూ పేరరివాలన్ దాఖలు చేసిన పిటిషన్ బుధవారం జస్టిస్ నాగేశ్వరరావు బెంచ్‌ముందు విచారణకు వచ్చింది. విడుదల చేయవచ్చుగా..? రాజీవ్ హత్య కేసులో పేరరివాలన్ నిందితుడు అన్న విషయంలో సరైన వివరాలు కేంద్రం వద్ద లేదని.. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చినా, ఆంక్షలు తప్పడం లేదని ఆయన తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. విడుదల విషయంలో చేసిన తీర్మానంపై గవర్నర్ నిర్ణయం తీసుకోక పోవడం, ఆయన్ని విడుదల చేసే అధికారం కేంద్రానికి ఉందా..? రాష్ట్రానికి ఉందా..? అనే విషయంపై కేంద్ర బృందాలు ఇంకా నివేదిక ఇవ్వకపోవడం వంటి అంశాన్ని గుర్తు చేస్తూ తమ వాదనల్ని వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ, ఈ చిక్కుల నేపథ్యంలో పేరరివాలన్‌ను విడుదల చేయవచ్చుగా..? అని వ్యాఖ్యనించింది. ఇంతకీ విడుదల అధికారాలు ఎవరికి ఉన్నాయి..? ఈ ఆంక్షల చట్రంలో అతడు ఎందుకు చిక్కుకోవాలి..? అని సుప్రీంకోర్టు బెంచ్ ప్రశ్నించింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది. -
కొంత ఫోర్టిఫైడ్ రైస్ తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఈ యాసంగి సీజన్‌కు సంబంధించి కేంద్రం కోరిన విధంగా సీఎమ్మార్ కింద ముడిబియ్యంతో పాటు కొంత మేర బాయిల్డ్ ఫోర్టిఫైడ్ బియ్యం (పోషకాలు కలిపిన బలవర్ధక ఉప్పుడు బియ్యం) తీసుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కోరింది. కేంద్రం ఎంత కావాలంటే అంత ఫోర్టిఫైడ్ రైస్ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. దీనిపై పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అధికారులు మంగళవారం ఢిల్లీ వెళ్లి ఎఫ్‌సీఐ, కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయి పరిస్థితిని వివరించినట్లు తెలిసింది. ఈ అంశాన్ని అధికారులు పరిశీలిస్తామన్నారని, స్పష్టమైన హామీ లభించలేదని సమాచారం. కాగా గత యాసంగికి సంబంధించిన సీఎంఆర్ గడువు పొడిగింపును మరో నెల పొడిగించాలన్న విజ్ఞప్తికీ కేంద్రం నుంచి స్పష్టమైన హామీ దక్కలేదని తెలిసింది. గత యాసంగి సీజన్లో 5 లక్షల టన్నుల ఫోర్టిఫైడ్ రైస్‌ను ఎఫ్‌సీఐ రాష్ట్రం నుంచి తీసుకుంది. ధాన్యం కొనుగోలుకు మార్గదర్శకాలు ఈ యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలుకు పౌరసర ఫరాల శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు లంతా ఒకేసారి రాకుండా టోకెన్లు జారీ చేయాలని, డీఫాల్ట్ మిల్లర్లకు ఈ సీజన్లో ధాన్యం కేటాయిం చొద్దని నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తెలంగాణలోకి రాకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మిల్లుల్లో తనిఖీలు వాయిదా ఈ నెల 28 నుంచి మిల్లుల్లో చేపట్టాల్సిన తనిఖీలను ఎఫ్‌సీఐ వాయిదా వేసింది. తనిఖీల వల్ల సీఎంఆర్‌కు ఆటంకం కలుగుతుందని పౌరసరఫరాల కమిషనర్ ఎఫ్‌సీఐకి లేఖ రాయగా తాత్కాలికంగా వాయిదా వేసింది. మే మొదటి వారంలో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. -
సంస్థానాల రేడియో... బ్రిటిష్ కనుసన్నల్లోనే!
తొలుత బ్రిటిష్ ప్రభుత్వం రేడియో ప్రసారాల పట్ల ఆసక్తి చూప లేదు. కానీ 1927 నుంచీ తన ధోరణిని మార్చు కున్నది. ఒకవైపు పరికరాల దిగుమతి, మరోవైపు రేడియో లైసెన్సుల జారీ తమ అధీనంలోనే పెట్టు కుని... ప్రసారాల నియంత్రణ, సెన్సార్షిప్, ప్రభుత్వ వ్యతిరేకులు రేడియో వినియోగించక పోవడం వంటి అంశాల పట్ల దృష్టి ఎక్కువగానే పెట్టింది. అదే సమయంలో వివిధ సంస్థానాలలో రేడియోపట్ల ఆసక్తి చూపినవారికి అడ్డు చెప్పలేదు. కేవలం హైదరాబాద్, మైసూరు, బరోడా, తిరువాన్కూరు సంస్థానాలలో మాత్రమే రేడియో ప్రసారాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సంస్థా నాల రేడియో ప్రసారాలకు సంబంధించి హైదరా బాద్ కొంచెం విభిన్నంగా కనబడుతోంది. నిజాం స్వాధీనం చేసుకున్న, ‘నిజాం రేడియో’ లేదా ‘దక్కన్ రేడియో’గా పేరుగాంచిన కేంద్రం 1935 ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 411 మీటర్లపై పని చేయడం మొదలు పెట్టింది. మరే సంస్థానానికీ లేని రీతిన నిజాం రేడియోకు రెండవ ట్రాన్స్ మీటరు ఔరంగాబాద్ నుంచి పనిచెయ్యడం అదే సంవత్సరంలో కొంతకాలం తర్వాత మొదలైంది. హైదరాబాద్ తర్వాత మొదలైంది మైసూరులో సైకాలజీ ప్రొఫెసర్ డా. ఎమ్వీ గోపాల స్వామి ప్రారంభించిన 30 వాట్ల రేడియో ట్రాన్స్ మీటర్. వీరి నిర్వహణలోనే అది 1935 సెప్టెంబర్ 10 నుంచీ 1942 దాకా నడిచి, పిమ్మట మైసూరు సంస్థానం చెప్పుచేతల్లోకి వచ్చింది. మైసూరు సంస్థానం రేడియోకు సంబంధించి ఒక ప్రత్యేకత వుంది. ఆ రేడియో కేంద్రాన్ని వారు ‘ఆకాశవాణి’ అని వ్యవహరించేవారు. బ్రిటిష్‌వాళ్ల నిర్వహణలో సాగే రేడియోకు ‘ఆలిండియా రేడియో’ అని 1936 జూన్ 8న నామ కరణం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1958లో ఆలిండియా రేడియోకు ‘ఆకాశవాణి’ అనే పేరును కూడా స్వీకరించారు. హైదరాబాద్, ఔరం గాబాద్, మైసూరులలో రేడియో ప్రసారాలు ప్రారంభమైన పిదప 1943 మార్చి 12న తిరువా న్కూరు సంస్థానం (తిరువనంతపురం)లో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. బరోడా బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్ పేరున రేడియో కేంద్రానికి 1939 మే 1వ తేదీన బరోడా సంస్థా నంలో పునాదిరాయి వేసినట్టు తెలుస్తోంది. ప్రసా రాలు ఎప్పుడు మొదలయ్యాయో సమాచారం పూర్తిగా అందుబాటులో లేదు గానీ, బీబీసీలో పని చేసిన నారాయణ మీనన్ 1947లో ఈ రేడియో స్టేషన్లో పనిచేశారు. వీరే తరువాతి కాలంలో ఆలిండియా రేడియో డైరెక్టర్ జనరల్‌గా 1965–68 మధ్య కాలంలో పనిచేశారు. హైదరాబాద్, ఔరం గాబాద్, మైసూరు, తిరువాన్కూరు, బరోడా రేడియో కేంద్రాల ప్రసారాలు బ్రిటిష్ పాలకులకు అనువుగానే సాగాయి. ఇంతవరకూ చర్చించిన రేడియో ప్రసారాలు స్వాతంత్య్రోద్యమానికిగానీ, ఉద్యమంలో పాల్గొన్న ప్రజలకు గానీ తోడ్పడిన సందర్భాలు దాదాపు లేవు. 1932లో బొంబాయి స్టేషన్ డైరెక్టర్ ప్రకారం... ఏదో ఒక రేడియో కేంద్రం స్వాతంత్య్రో ద్యమానికి అనుకూలంగా పనిచేస్తున్నట్టు... విన బడిన ప్రసారాల వల్ల తెలుస్తోందని ఇంటెలిజెన్స్ నివేదికలో పేర్కొన్నారని పార్థసారథి గుప్తా... ‘రేడియో అండ్ ది రాజ్ 1921–47’(1995) పుస్తకంలో పేర్కొన్నారు. నాలుగు సంస్థానాలలో బరోడా రేడియో కేంద్రాన్ని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం 1948 డిసెంబరు 16న తన అజమా యిషీలోకి తీసుకున్నది. హైదరాబాద్, ఔరంగా బాద్, మైసూరు, తిరువాన్కూరు కేంద్రాలన్నీ 1950 ఏప్రిల్ 1వ తేదీన భారతదేశ ప్రభుత్వం అధీనంలోకి వచ్చి ఆలిండియా రేడియోగా కొనసా గాయి. ఔరంగాబాద్ కేంద్రం కొంతకాలం ఆలిం డియా రేడియోగా పనిచేసి 1953లో మూత పడింది. పాలకులకు పూర్తిగా దోహదపడిన చరిత్ర కలిగిన రేడియో ప్రసారాలుగా ఇవి మిగిలి పోయాయి. డా. నాగసూరి వేణుగోపాల్ ఆకాశవాణి విశ్రాంత ఉన్నతోద్యోగి మొబైల్: 94407 32392 -
ఒకే దేశంలో ద్వంద్వ ప్రమాణాలా?
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల దేశ రైతాంగం ఆందోళన చెందుతున్నది. వారి నిర్ణయాలు పరిశీలిస్తే రైతులపై వారికున్న కక్ష, దుగ్ధలు అర్థమవు తాయి. వ్యవసాయ రంగంలో కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్రం మూడు సాగు చట్టాలు తీసుకువచ్చి విఫలమైంది. ఇప్పుడు వ్యవసాయ కరెంట్ మోటర్లకు మీటర్లు బిగించే చట్టాన్ని తెచ్చి రైతులకు భారాన్ని మోపేందుకు ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే రైతులు అనేక వ్యయభారాలతో కుంగి పోతున్నారు. దీనికి తోడు ఇప్పుడు కరెంటు బిల్లులను వడ్డించాలనడం విడ్డూరం. రైతులను క్లిష్ట పరిస్థితుల నుంచి బయట పడే సేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్ని స్తోంది. అందులో భాగంగానే ఉచిత విద్యుత్తును అందిస్తు న్నది. అయినా కేంద్రం తెచ్చే రైతు వ్యతిరేక చట్టాల వల్ల మీటర్లను బిగించే పరిస్థితి ఏర్పడుతున్నది. దేశంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడేండ్లయింది. కానీ సామాన్య ప్రజానీకానికి, రైతాంగానికి వారితో ఒరిగిందేమీ లేదు. కాగా కష్టాలు పెరిగాయి. ముఖ్యంగా తెలంగాణ మీద కేంద్రం వివక్ష చూపుతున్నది. రైతులను నట్టేట ముంచడమే పనిగా పెట్టుకున్నది. రైతులు ఏ పంట పండించినా దానికి గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిదే. అయినా పంటల కొను గోళ్లపై ఆంక్షలు పెట్టడం వ్యవసాయ రంగాన్ని దెబ్బ తీయడమే. ఆరేండ్లలో వరికి రూ. 470 మద్దతు ధర పెంచిన కేంద్ర ప్రభుత్వం... యూరియా, ఎరువులు, విత్తనాలు, పెట్రోల్, డీజిల్ ధరలను అంతకన్నా ఎక్కువగా పెంచింది. ఇదంతా రైతాంగాన్ని దోచుకోవడమే. ఇప్పటికైనా కేంద్రం దిగిరాకుంటే, కేంద్రంపై ఉద్యమ స్ఫూర్తితో యుద్ధం తప్పదు. తెలంగాణ రైతుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి అలుపెరుగని పోరాటం చేస్తున్నది. కేంద్ర వ్యవసాయ విధానంలోని డొల్లతనాన్ని టీఆర్ఎస్ బట్టబయలు చేస్తున్న తీరును పలువురు జాతీయ విపక్ష నేతలు ప్రశంసిస్తున్నరు. ఇప్పుడు జరగాల్సింది ఇదేన ంటున్నరు. ఒకవైపు టీఆర్ఎస్ రైతుల బాగు కోసం పోరాడుతుంటే మన రాష్ట్ర విపక్ష నేతలు సహాయ నిరాకరణతో పీత రాజకీయాలు చేస్తున్నరు. దేశానికి రైతే వెన్నెముక అని మాటల్లో చెప్తూనే మోదీ సర్కార్ కర్షకులను కన్నీట ముంచుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనమంటే కొర్రీలు పెడుతూ తెలంగాణ రైతులను మార్కెట్ శక్తుల కోరలకు బలి చేస్తున్నది. తెలంగాణలో యాసంగి పంటగా వచ్చే వరిధాన్యాన్ని కొనేది లేదని చెప్పటం బాధ్యతా రాహిత్యమే కాదు, వివక్షాపూరితం కూడా. వానకాలం నుంచి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. రైతుల ఇబ్బందులు, కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యం కొన్నది. కేంద్రం మాత్రం రైతులను ఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తున్నది. సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం ప్రాజెక్టు కింద పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించారు. దీంతో ఈ ప్రాంతానికి పుష్కలంగా సాగునీరు అంది వరి విస్తీర్ణం పెరిగింది. ఈ విషయం తెలుసుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో కిరికిరీ పెడుతోంది. ఒకే దేశంలో రెండు విధానాలు ఎలా ఉంటాయి? పంజాబ్ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ప్రాంత రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరనేది సూటి ప్రశ్న! దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమా ధానం చెప్పడం లేదు. పైగా అవమానిం చేలా కేంద్ర మంత్రి మాటలున్నాయి. గత యాసంగితో పోల్చుకుంటే ఈ సారి రాష్ట్ర ప్రభుత్వ సూచనతో రైతులు వరి సాగును కొంత తగ్గించారు. అయినా ధాన్యం కొనుగోలు చేయలేమని సవా లక్ష కారణాలను కేంద్రం ఏకరువు పెడుతోంది. మరో నెల రోజులైతే, యాసంగి ధాన్యం రైతుల చేతికి వస్తుంది. ఈ లోగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. తెలంగాణ ప్రజలను నూకలు తినమని అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్టీకి నూకలు చెల్లడం ఖాయం. నూకలు తినాలన్న వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకో వాల్సిందే. తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుండడంతో వారు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా వ్యవహ రించాల్సిన కేంద్రం, తెలంగాణ రైతాంగాన్ని తిప్పలు పెట్డడం సరికాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు రేషన్ బియ్యం పరిస్థితి దారుణంగా ఉండేది. నూకలు, పురుగుల బియ్యం సరఫరా అయ్యేవి. పంజాబ్ నుంచి వచ్చిన బియ్యం ఏ మాత్రం నాణ్యత లేకుండా ఉండేవి. అలాంటి బియ్యం తిన్న అనుభవమున్న తెలంగాణ ప్రజలకు... రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానికంగా పండించిన ధాన్యాన్ని ఆడించిన తర్వాత వచ్చిన నాణ్యమైన బియ్యాన్నే ప్రభుత్వం పంపిణీ చేస్తు న్నది. ఈ తరుణంలో యాసంగి బియ్యాన్ని మర ఆడించి వచ్చిన నూకల బియ్యాన్ని మీ ప్రజలకు తినడం అలవాటు చేయండని కేంద్రమంత్రే అనడం చూస్తే వారి అహంకారం ఏంటో అర్థమవుతుంది. ఇదంతా చూస్తుంటే... రాష్ట్రం ఏర్పాటుకు ముందు పరిస్థితి రావాలని కేంద్రం కోరుకుంటున్నట్లుంది. తెలం గాణ ఏర్పడిన తర్వాత అన్ని రంగాలకూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తున్నది. కేంద్రం పెద్దన్న పాత్రలో ఉంటూ రాష్ట్రానికి న్యాయం చేయాల్సిందిపోయి అన్యాయం చేస్తోంది. అన్ని రాష్ట్రాలనూ సమానంగా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం తమకు నచ్చిన చోట ఒకలా, నచ్చని చోట మరోలా చూస్తున్నది. ఇలా పక్షపాతంతో... కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ రాష్ట్ర రైతాంగాన్ని గోస పెట్టడం ఎంతవరకు సమంజసమో కేంద్రం ఆలోచించాలి. -పువ్వాడ అజయ్ కుమార్ వ్యాసకర్త రాష్ట్ర రవాణా శాఖ మంత్రి -
కేంద్రం కాదంటే కొనుడే!
సాక్షి, హైదరాబాద్: యాసంగి ధాన్యం సమస్యపై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని తనకు అనుకూలంగా మలుచుకునే యోచనలో ఉంది. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయని కేసీఆర్ సర్కార్ ఈనెల రెండోవారంలో అనూహ్య నిర్ణయం ప్రకటించి రైతుల మద్దతు పొందేలా ప్రణాళిక సిద్ధం చేస్తోందని సమాచారం. ఆదివారం మొదలు 11వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేయడం ద్వారా ధాన్యం విషయంలో బీజేపీని దోషిగా నిలబెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు.. 11న ఢిల్లీలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో కలిసి మహాధర్నా నిర్వహించిన అనంతరం.. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా రైతాంగానికి అండగా నిలిచే ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని చాటి చెప్పనుంది. రైతులకు అండగా నిలవడం ద్వారా పడే దాదాపు రూ.2,000 కోట్ల ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నెల 11 తర్వాత మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. భారం భరించడం వైపే మొగ్గు.. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇందులో ఇప్పటివరకు కొనసాగుతున్న విధానం మొదటిది. అంటే రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి కనీస మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేసి ఉప్పుడు బియ్యంగా ఎఫ్‌సీఐకి పంపించడం. అయితే ఇందుకు కేంద్రం ససేమిరా అంటోంది. ఉప్పుడు బియ్యం తీసుకునే ప్రసక్తి లేదని, ముడి బియ్యంగా ఇస్తే ఎంతైనా తీసుకుంటామని తేల్చి చెబుతోంది. నిర్ణయాన్ని రైతులకే వదిలేయాలనేది రెండో ప్రత్యామ్నాయం. యాసంగిలో వరి వేయవద్దని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోమని యాసంగి పంట వేసే సమయంలోనే ప్రభుత్వం చెప్పింది. అయినా రాష్ట్ర వ్యాప్తంగా 36 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. రాష్ట్ర ప్రభుత్వం కొనదు కనుక.. రైతులు నేరుగా మిల్లర్లు, దళారులకు విక్రయిస్తే కనీస మద్దతు ధర ప్రసక్తే ఉండదు. క్వింటాలుకు రూ.500 వరకు రైతులు నష్టపోయే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయి. అందువల్ల ఈ ప్రతిపాదనకు సీఎం కేసీఆర్ సుముఖంగా లేరని తెలిసింది. మద్దతు ధర రాకపోతే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఇక మూడో ప్రత్యామ్నాయం.. ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేయడం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారమైనప్పటికీ, ఈ ప్రత్యామ్నాయంపైనే కేసీఆర్ సర్కార్ దృష్టి సారించినట్లు తెలిసింది. ముడి బియ్యంతో నష్టమెంత? ఇప్పటివరకు సాగిన విధానంలో.. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి, బియ్యంగా రూపంలో (కస్టమ్ మిల్లింగ్ రైస్) ఎఫ్‌సీఐకి అప్పగించి కేంద్రం నుంచి డబ్బులు వసూలు చేసుకునేది. ఈ విధానంలో 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంటుంది. అయితే యాసంగిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా మిల్లింగ్‌లో నూకల శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో గత కొన్నేళ్లుగా ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి కేంద్రానికి ఇస్తున్నారు. అయితే ఉప్పుడు బియ్యానికి డిమాండ్ లేదంటూ గత ఏడాది నుంచి ఈ విధానంపై పేచీ పెడుతోంది. కేవలం ముడి బియ్యం మాత్రమే తీసుకుంటామనిని చెబుతోంది. ఉప్పుడు కాకుండా ముడిబియ్యమే..! కేంద్రం చెప్పినట్లు ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా కాకుండా ముడిబియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి ఇచ్చే ప్రతిపాదనపై పౌరసరఫరాలు, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు తమ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు తెలిసింది. సాధారణంగా 100 కిలోల ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మారిస్తే యాసంగిలో 68 కిలోల బియ్యం వస్తుంది. ఒకవేళ ముడిబియ్యంగా మారిస్తే 100 కిలోల ధాన్యాన్ని మర పట్టిస్తే నూకలు పోను 40 కిలోల నుంచి 50 కిలోల వరకు బియ్యం వచ్చే అవకాశం ఉన్నట్లుగా నివేదికల్లో వివరించినట్లు తెలిసింది. నూకలను ఇతర అవసరాలకు వినియోగించడం ద్వారా ఎంతమేర నష్టాన్ని పూడ్చుకోవచ్చు అనే దానిపై కూడా నివేదిక రూపొందించినట్లు తెలిసింది. బియ్యం లోటు నష్టాన్ని మిల్లర్లకు చెల్లించేలా.. ముడిబియ్యంగా మార్చి ఇచ్చే పక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు భారం పడవచ్చని అంచనా వేసినట్లు తెలిసింది. కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి, ముడిబియ్యంగా మార్చే ప్రక్రియలో బియ్యం లోటు వల్ల ఏర్పడే నష్టాన్ని మిల్లర్లకే నేరుగా చెల్లించి ఎఫ్‌సీఐ లెక్కల ప్రకారం 68 కిలోల బియ్యాన్ని తీసుకునేలా ప్రణాళిక సిద్ధమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని సాధ్యమైనంత వరకు బద్నాం చేసి, తర్వాత కొనుగోలు కేంద్రాల ద్వారా తానే ధాన్యం సేకరించాలనే వ్యూహంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. అధికారులు, మిల్లర్లతో మంత్రి సమావేశం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్ర, శనివారాల్లో సంస్థ ఎండీ అనిల్‌కుమార్‌తో పాటు మిల్లర్ల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుందన్న విషయమై చర్చించారు. నష్టాన్ని భరిస్తే తాము ధాన్యం మిల్లింగ్‌కు తీసుకుని ముడి బియ్యం ఇచ్చేందుకు సిద్ధమేనని మిల్లర్లు చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లింగ్ చేస్తే వచ్చే నష్టాన్ని లెక్కలు వేశారు. దీనిపై కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
కేంద్రంపై ‘వరి పోరు’కు కార్యాచరణ సిద్ధం చేసిన టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: ఉగాది తర్వాత ఉగ్ర తెలంగాణను చూపిస్తామని ప్రకటించిన టీఆర్ఎస్.. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడం లక్ష్యంగా ఆ మేరకు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసింది. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమం తరహాలో కేంద్ర ప్రభుత్వానికి సెగ తగిలేలా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలను రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితుల్లోకి నెట్టడం కూడా ఉద్యమ కార్యాచరణలో అంతర్భాగంగా ఉండనుందని పేర్కొంటున్నాయి. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వారం రోజులుగా ఉద్యమ వ్యూహానికి పదును పెట్టే పనిలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో పాటు పార్టీకి చెందిన కొందరు కీలక నేతలతో ఆందోళన, నిరసన కార్యక్రమాలు ఎలా ఉండాలనే అంశంపై గత మూడు, నాలుగు రోజులుగా వరుస భేటీలు నిర్వహించారు. పది రోజుల అమెరికా పర్యటన నుంచి తిరిగివచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావుతో కూడా సీఎం ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వరి పోరుకు సంబంధించిన ఉద్యమ కార్యాచరణను కేసీఆర్ ఈ నెల 3న మీడియా సమావేశంలో స్వయంగా వెల్లడించనున్నారు. శాంతియుత పద్ధతుల్లో నిరసనలు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా, ఏ ఒక్క వర్గానికి నష్టం కలగకుండా కేంద్రంపై ఒత్తిడి పెరిగేలా నిరసన కార్యక్రమాలకు కేసీఆర్ రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. బంద్‌లు, రాస్తారోకోలు వంటివి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉండటం, విద్యార్థులకు పరీక్షల సీజన్ ప్రారంభమవుతుండటంతో క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలు వినూత్నంగా ఉండాలని సీఎం భావిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో సడక్ బంద్, వంటా వార్పు వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి తెలంగాణ వాదాన్ని తీసుకెళ్లిన రీతిలోనే వరి పోరును కూడా శాంతియుత పద్ధతిలోనే చేపట్టాలనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగరవేయాలని పార్టీ కేడర్‌కు ఇప్పటికే సంకేతాలు వెళ్లాయి. రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీల ఇళ్ల ముట్టడితో పాటు ధాన్యం కొనుగోలుపై వైఖరి చెప్పాలంటూ అడుగడుగునా నిలదీసేలా నిరసన చేపట్టాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 14న గద్వాల నుంచి తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్రను కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రారంభించనున్నారు. ఆ సమయానికే ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకునేలా టీఆర్ఎస్ కార్యాచరణ ఉంటుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ వేదికగా సీఎం నేతృత్వంలో నిరసన రాష్ట్రంలో రైతు ఉద్యమాన్ని తీవ్రతరం చేసిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ నిరసనకు దిగుతారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా పరిషత్ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు ఇందులో పాల్గొంటారు. రైతు సంఘాలు, భావ సారూప్య రాజకీయ పార్టీలకు చెందిన సీఎంలు, పలువురు నేతలను కూడా ఈ దీక్షకు ఆహ్వానించాలనే యోచనలో ఉన్నారు. ‘తెలంగాణ ఉద్యమంలో అనేక వినూత్న నిరసన రూపాలను చూశాం. అలాగే ఉగాది తర్వాత మొదలయ్యే రైతు ఉద్యమంలోనూ సరికొత్త ఉద్యమ రూపాలను చూస్తారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్షను ఎత్తి చూపడంతో పాటు వరి కొనుగోలుకు కేంద్రం దిగివచ్చేలా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి..’అని టీఆర్ఎస్ కీలక నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. -
మెడిసిన్ విదేశాల్లోనే ఎందుకు?
-
కీవ్ నుంచి బయటపడండి.. భారత ఎంబసీ హెచ్చరికలు
ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. యుద్ధం మరింత తీవ్రతరం కావడంతో.. రాజధాని కీవ్‌లో ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చని, తక్షణమే కీవ్‌ను వీడాలని ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు మంగళవారం హెచ్చరికలు జారీ చేసింది. రష్యా బలగాలు భారీగా కీవ్ నగరం వైపుగా కదులుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రైళ్లు, ఇతర మార్గాల ద్వారా అత్యవసరంగా కీవ్ నుంచి బయటపడాలని భారత పౌరులకు(విద్యార్థులతో సహా) ఎంబసీ ద్వారా సూచించింది కేంద్ర ప్రభుత్వం. పరిస్థితి ఏ క్షణం ఎలాగైనా మారొచ్చని.. జాగ్రత్తగా సరిహద్దులకు చేరాలని ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్‌లోని పౌరులను తక్షణమే తరలించేలా సీ-17 విమానాలను పంపాలని కేంద్రం నిర్ణయించింది. త్వరగతిన తరలింపు ప్రక్రియను కొనసాగించాలని అనుకుంటోంది. మరోవైపు అమెరికా సహా పలు దేశాలు కీవ్‌లోని రాయబారులను తరలించింది. Advisory to Indians in Kyiv All Indian nationals including students are advised to leave Kyiv urgently today. Preferably by available trains or through any other means available. — India in Ukraine (@IndiainUkraine) March 1, 2022 -
ఉక్రెయిన్ ఉద్రిక్తతలు: తెలుగు రాష్ట్రాల హెల్ప్‌లైన్ నెంబర్లు ఇవే
ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో.. అక్కడున్న ఇతర దేశాల పౌరుల భద్రతపై భయాందోళనలు నెలకొన్నాయి. సంక్షోభ సమయం నుంచి ఇప్పటి వరకు చాలామంది ఉక్రెయిన్ను వీడగా.. పరిస్థితి ఇక్కడిదాకా వస్తుందని ఊహించని వాళ్లు.. ప్రత్యేకించి విద్యార్థులు తరగతుల నేపథ్యంలో అక్కడే చిక్కుకుపోయారు. ఈ పరిణామాల నడుమ.. తెలుగు రాష్ట్రాల విద్యార్థులను సురక్షితంగా రప్పిస్తామని తల్లిదండ్రులకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు భరోసా ఇస్తున్నాయి. ఉక్రెయిన్‌లో చిక్కుకున తెలుగు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల భద్రతపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సీఎస్ సమీర్ శర్మ, సీఎంఓ అధికారులు, సలహాదారు జితేష్ శర్మ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను సురక్షితంగా రప్పించే విషయమై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సీఎం వైఎస్ జగన్ ఫోన్ చేసి మాట్లాడారు. తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కోరగా.. కేంద్రం అన్నిరకాలుగా చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా వివరించారు జైశంకర్. అనంతరం ప్రత్యేక హెల్ప్లైన్లపై అధికారులకు సూచనలు చేశారు. APNRTS హెల్ప్‌లైన్ నెంబర్: 0863-2340678 ఏపీ హెల్ప్‌లైన్ వాట్సాప్ నెంబర్ +918500027678 ఢిల్లీలో సంప్రదించాల్సిన అధికారులు: శివ శంకర్- 9871999055 రామారావు-9871990081 సాయిబాబు- 9871999430 ఉక్రెయిన్‌లోని వార్ జోన్లో చిక్కుకుపోయిన పిల్లల తల్లిదండ్రులు విశాఖపట్నంలోని సర్క్యూట్ గెస్ట్ హౌస్‌లో రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిని కలిశారు. వారి సమస్యలను విని విదేశాంగ మంత్రి జైశంకర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అండగా ఉంటామని హామీ ఇచ్చారు విజయసాయి రెడ్డి. అంతేకాదు ఉక్రెయిన్‌లోని తెలుగు ప్రజలు 9871999055 & 7531904820 ద్వారా సాయం కోరవచ్చని రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ ద్వారా తెలిపారు. The worried parents of children stuck in the war zone in #Ukraine met me at Circuit Guest House,Visakhapatnam. Heard their concerns & assured them of support in bringing their plight to the notice of Hon'ble CM Sri @YSJagan garu & External Affairs Minister Sri @DrSJaishankar. 1/2 pic.twitter.com/6wrkdAyFM3 — Vijayasai Reddy V (@VSReddy_MP) February 25, 2022 తెలంగాణ ప్రభుత్వం: ఉక్రెయిన్‌లో చదువుతున్న తమ రాష్ట్ర విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురావాలని కేంద్ర విదేశాంగ మంత్రికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. వారి తరలింపునకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ నుంచి సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో మెడిసిన్ చేస్తున్నట్టు సమాచారం. వీరిలో సగానికి పైగా విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. తమను రక్షించాలని.. త్వరగా ఇండియాకి వచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ అనేక కాల్స్ హెల్ప్‌లైన్ నంబర్లకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌తో పాటు న్యూఢిల్లిలోని తెలంగాణ భవన్లో హెల్ప్లైన్లు ఏర్పాటు చేశారు. Humble appeal to Sri @DrSJaishankar Ji on the plight of students from Telangana stranded in Ukraine🙏 We appeal to Govt of India to arrange for special aircrafts & Telangana Govt is ready to bear the full travel expenses for these students so we can bring them home safe &soonest — KTR (@KTRTRS) February 25, 2022 న్యూఢిల్లీ, తెలంగాణ భవన్‌కు సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్లు విక్రమ్ సింగ్ మాన్, ఐపీఎస్ : 7042566955 చక్రవర్తి, పీఆర్వో: 9949351270 నితిన్, ఓఎస్డీ: 9654663661 తెలంగాణ సెక్రటేరియట్, హైదరాబాద్ హెల్ప్ లైన్ నెంబర్లు చిట్టిబాబు, ఏఎస్వో: 040-23220603 : 9440854433 ఈమెయిల్ ఐడీ: so_nri@telangana.gov.in -
తప్పుడు వార్తలపై చర్యలేవి?
న్యూఢిల్లీ: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో తపుపడు వార్తల తొలగింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని సోషల్ మీడియా దిగ్గజాలు ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్‌ను కేంద్రం ప్రశ్నించింది. తాము ఫేక్ న్యూస్‌గా పేర్కొన్నవాటిని తొలగించడంలో ఈ కంపెనీలు విఫలమయ్యాయని కేంద్రం తీవ్రంగా స్పందించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీలు చర్యలు తీసుకోకపోవడంతో తాము అలాంటి వార్తలను తొలగించాల్సివస్తోందని, దీంతో తమపై విమర్శలు వస్తున్నాయని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే కంపెనీలకు తప్పుడు వార్తల విషయంలో ఎలాంటి ఆదేశాలను ఇవ్వలేదని సదరు వర్గాలు తెలిపాయి. గతంలో పలు యూట్యూబ్ చానెళ్లు, ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లను తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నాయని కేంద్రం నిషేధించింది. ఈ విషయంపై మరింతగా చర్చించేందుకు సమాచార శాఖ టెక్ కంపెనీలతో సమావేశమైనట్లు తెలిపాయి. -
కేంద్రంపై కేసీఆర్ సర్కార్ లేఖాస్త్రం! ఏయే అంశాలపై లెటర్స్ రాశారంటే..
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాల్లో నిలదీసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖాస్త్రాలు సంధిస్తోంది. ఇప్పటికే పలు అంశాలపై వరుసగా లేఖలు రాయగా.. నెలాఖరు నుంచి కేంద్ర బడ్జెట్ సమా వేశాలు మొదలవుతుండటంతో మరిన్ని లెటర్లు రాసేందుకు సిద్ధమైంది. తద్వారా రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు, రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనకు నిధు లివ్వడంలో వివక్ష వంటి అంశాలపై కేంద్రం వైఖరిని ఎత్తిచూపాలని భావిస్తోంది. అదే సమయంలో.. బీజేపీ రాష్ట్ర ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం చేస్తున్నదేమీ లేదనే సందేశాన్ని ప్రజల్లోకి పంపేలా వ్యూహాన్ని సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి నేతృత్వంలో.. ఎరువుల ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహ రించుకోవాలంటూ ఈ నెల 12న ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్వయంగా లేఖ రాశారు. తాజాగా ఆలిండియా సర్వీస్ రూల్స్‌కు కేంద్రం ప్రతిపాదిం చిన సవరణలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయంటూ మరో లేఖ రాశారు. మరోవైపు రాష్ట్ర కేబినెట్లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వేర్వేరుగా కేంద్ర మంత్రులకు అరడజను లేఖలు రాశారు. గిరిజన అసెంబ్లీ నియోజకవర్గాలపై దృష్టి సారిస్తామం టూ బీజేపీ నేతలు చేసిన ప్రకటనల నేపథ్యంలో.. ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, మేడారం జాతరకు జాతీ య హోదాపై మంత్రి సత్యవతి రాథోడ్ కేంద్ర మంత్రులకు లేఖలు రాశారు. ఇక రాష్ట్ర విభ జన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ.. బడ్జెట్ సమావేశాల సమయంలో మరిన్ని లేఖలు రాసేందుకు మంత్రులు సిద్ధమవుతున్నారు. గిరిజన యూని వర్సిటీ, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు, కాళేశ్వరం లేదా పాలమూరు పథకానికి జాతీయ హోదా, కాజీపేట రైల్వే వేగన్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ వంటి అంశాలను లేఖల ద్వారా కేంద్రానికి గుర్తు చేయాలని భావిస్తున్నారు. బీజేపీ వైఖరిని ఎత్తిచూపేందుకే! ఓవైపు లేఖల ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రశ్నిస్తూనే.. మరోవైపు సామాజిక మాధ్యమాలు, మీడియా సమావేశాల ద్వారా బీజేపీ వైఖరిని నిలదీసే వ్యూహాన్ని టీఆర్ఎస్ అనుసరిస్తోంది. ఖాళీగా ఉన్న 15.62 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ మీటర్ల బిగింపు వంటి అంశాల్లో కేంద్రం వైఖరిపై ప్రశ్నలు సంధిస్తోంది. సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలు, ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్ మీడియం, పసుపుబోర్డు ఏర్పాటు, మేడారం జాతర నిర్వహణకు కేంద్ర నిధులు వంటి అంశాలను టీఆర్ఎస్ నేతలు, మంత్రులు తరచూ వివిధ రూపాల్లో లేవనెత్తుతున్నారు. ‘‘ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన బీజేపీ.. ఇతర అంశాల్లోనూ అదే రీతిలో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరుతోపాటు ఆ పార్టీ రాష్ట్ర ఎంపీల పనితీరును ప్రజలను వివరించేందుకు టీఆర్ఎస్ వ్యూహం పన్నింది. అందులో భాగంగానే లేఖల ద్వారా రాష్ట్ర అంశాలను కేంద్రంతోపాటు ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం’’ అని టీఆర్ఎస్ ఎంపీ ఒకరు పేర్కొన్నారు. -
చేనేత సంస్థ పోచంపల్లికి వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభు త్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎం టీపీ)తో పాటు అనేక టెక్స్టైల్, అపారెల్ పార్కులు ఏర్పాటుచేస్తోంది. కేఎంటీపీలో యాంగ్వాన్, కైటెక్స్ వంటి దిగ్గజ టెక్స్టైల్, అపారెల్ పరిశ్రమలు కార్య కలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసు కుంటున్నాయి. రాష్ట్రంలో 40 వేలకు పైగా చేనేత కార్మికులు ఉండగా.. సుమారు 35 వేలకు పైగా మరమగ్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో జౌళి రంగంలో సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇందుకోసం సాంకేతిక శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఉన్న అనుకూలతల దృష్ట్యా పోచంపల్లిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్ టీ) ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి పలు మార్లు ప్రతి పాదనలు పంపింది. ఐఐటీహెచ్ ఏర్పా టుకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చేం దుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సానుకూల సంకేతాలు అందడం లేదు. ఏపీ వెంకటగిరిలో ఐఐహెచ్‌టీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం పది ఐఐహెచ్‌టీలు ఉం డగా, ఆరు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, మరో ఆరు రాష్ట్రాల టెక్స్టైల్ కమిషనర్ల పరిధిలో పనిచేస్తు న్నాయి. వారణాసి (ఉత్తరప్రదేశ్), సాలెమ్ (తమిళ నాడు), గువాహటి (అస్సాం), జోధ్‌పూర్ (రాజ స్తాన్), బార్ఘార్ (ఒడిశా), శాంతిపూర్ (పశ్చిమబెం గాల్) లోనివి కేంద్రం పరిధిలో ఉన్నాయి. వెంకట గిరి (ఏపీ), గదగ్ (కర్ణాటక), కన్నూరు (కేరళ), చంపా (ఛత్తీ‹స్‌గఢ్) ఐఐటీహెచ్లు రాష్ట్రాల పరిధి లో ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రస్తు తం తెలంగాణ విద్యార్థులకు వెంకటగిరి ఐఐటీ హెచ్లో మెరిట్ ప్రాతిపదికన ప్రవేశాలు లభిస్తున్నా యి. టెన్త్ చదివిన వారికి మెరిట్ ప్రాతిపదికన ఐఐహెచ్‌టీల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు దక్కితే స్టైపెండ్ కూడా లభిస్తుంది. 2024 నుంచి ప్రవేశాలు కష్టమే వెంకటగిరి ఐఐహెచ్‌టీలో 60 సీట్లు ఉండగా తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర కోటాలో 13 సీట్లు పోగా ఏపీ, తెలంగాణ విద్యార్థు లకు 47 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విభజన చట్టం మేరకు 2023–24 విద్యా సంవత్సరం తర్వాత తెలంగాణ విద్యార్థులకు వెంకటగిరీ ఐఐటీ హెచ్లో ప్రవేశాలు నిలిచిపోనున్నాయి. విభజన సమయంలోనే ఒడిశాలోని బార్‌ఘర్ ఐఐటీహెచ్‌లో తెలంగాణ విద్యార్థులకు 8 సీట్లు ప్రత్యేకించారు. అయితే కోవిడ్ పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లో ఉన్న ఐఐటీహెచ్‌లకు వెళ్లేందుకు రాష్ట్ర విద్యార్థులు విము ఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐఐటీహెచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగు తోంది. ఐఐటీహెచ్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర విద్యార్థులు స్పిన్నింగ్, వీవింగ్ (నేత), డిజైనింగ్, డైయింగ్ (అద్దకం), ప్రింటింగ్ (ముద్రణ), గార్మెంట్ మేకింగ్ (దుస్తుల తయారీ), మార్కెటింగ్, మేనేజ్మెంట్ తదితర అంశాల్లో శాస్త్రీయ పద్దతుల్లో శిక్షణ, నైపుణ్యం పొందేందుకు అవకాశం లభిస్తుంది. నైపుణ్యాలు పెంపొందుతాయి ప్రస్తుతం చాలామంది యువకులు చేనేత రంగం వైపు వైపు వస్తున్నారు. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ మానేసి సొంతంగా 25 మగ్గాలు పెట్టి 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. నేనే స్వతహాగా డిజైన్లు తయారు చేసి చీరెలను తయారు చేయి స్తాను. ఐఐహెచ్‌టీ ఏర్పాటు ద్వారా సాంకేతిక పరి జ్ఞానం పెరిగి కొత్తకొత్త డిజైన్లు సృష్టించేందుకు అవకాశం ఏర్పడుతుంది. నాణ్యత పెరుగుతుంది. మరింత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సాంప్రదాయ డిజైన్లకు నవీన పోకడలు చేనేత ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే అగ్ర గామిగా ఉంది. అంతర్జాతీయంగా పేరొందిన ఇక్క త్తో పాటు గద్వాల పట్టు, కొత్తకోట పైఠానీ, వరం గల్ డర్రీస్ ఇలా లెక్కలేనన్ని నేత ఉత్పత్తులకు తెలంగాణ ప్రసిద్ది. ఇలాంటి చోట ఐఐహెచ్‌టీ లాంటి పేరొందిన సంస్థ ఏర్పాటు చేస్తే సాంప్రదాయ డిజైన్లకు నవీన పోకడలు జోడించి వస్త్ర రంగంలో నూతన ఆవిష్కరణలకు బాటలు వేయొచ్చు. – యర్రమాద వెంకన్న నేత, చైర్మన్, అఖిల భారత పద్మశాలి సంఘం (చేనేత విభాగం) -
5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ప్రకటన విడుదల చేసిన కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: ప్రతి రోజూ మరింత ఎక్కువ మంది అర్హులైన వయోజనులకు కోవిడ్ టీకాలను వేయాలని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు కోవిడ్‌పై సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వివరాలతో కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘క్రిస్మస్, కొత్త ఏడాది నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే రాష్ట్రాలు కంటైన్మెంట్ చర్యలు, ఆంక్షలు విధించాలి. ఆంక్షలు విధిస్తే కనీసం 14 రోజులపాటు అమలుచేయాలి. తొలి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్, అర్హులైన వారికి రెండు డోస్‌లూ ఇవ్వాలి. తొలి, రెండో డోస్‌లు పూర్తి చేయడంలో జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ శాతం నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ’అని కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొంది. ‘కరోనా పాజిటివిటీ రేటు 10శాతం కన్నా పెరిగినా, ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయమున్న ఐసీయూ పడకలు 40 శాతానికి మించి నిండినా స్థానికంగా కంటైన్మెంట్ చర్యలు వెంటనే తీసుకోవాలి’అని ప్రకటనలో సూచించింది. (చదవండి: ఆవు తల్లితో సమానం) -
TS: నమ్మలేక.. లేఖ అడుగుతున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రస్తుత వానాకాలానికి సంబంధించి కేంద్రం నిర్దేశించిన మేరకంటే అధికంగా వచ్చే ధాన్యాన్ని సేకరించే విషయమై రాష్ట్రానికి కేంద్రం లిఖితపూర్వక హామీ ఇవ్వాలని తెలంగాణ మంత్రులు, ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంతైనా కొంటామని నోటి మాటలు చెబితే కుదరదని, అదే విషయాన్ని స్పష్టం చేస్తూ రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసేందుకు ఢిల్లీ వచ్చిన మంత్రులు నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం తెలంగాణ భవన్లో విలేకరులతో మాట్లాడారు. ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, కేఆర్ సురేశ్‌రెడ్డి, నేతకాని వెంకటేశ్, పసునూరి దయాకర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రం డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్రం పరిస్థితి ఏమిటి? మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రస్తుత వానాకాలానికి సంబంధించి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని కేంద్రం చెప్పింది. కేంద్రంతో ఎంఓయూ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ లక్ష్యాన్ని మరింత పెంచాలని కోరారు. కొనుగోళ్లు మొదలయ్యాక దీనిపై చర్చిద్దామని కేంద్రమంత్రి అన్నారు. ఇప్పటికే 55 లక్షల టన్నుల సేకరణ పూర్తవగా, మంగళవారానికి కేంద్ర లక్ష్యం మేరకు కొనుగోళ్లు పూర్తవుతాయి. అయితే కేంద్రాల్లో మరో 12 నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉంది. భూపాలపల్లి, ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వరి కోతలు జరిగితే మరో 5 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల అదనంగా కొనుగోళ్లు చేస్తామని కేంద్రం నోటిమాటలు చెబితే చెల్లుబాటు కాదు. ఎంత వస్తే అంత తీసుకుంటామని లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలి..’అని డిమాండ్ చేశారు. అదనంగా వచ్చే ధాన్యాన్ని రాష్ట్రం సేకరించాక కేంద్రం డబ్బులు ఇవ్వకుంటే రాష్ట్రం పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంతో ఇప్పటికే అనేక చేదు అనుభవాలు ఉన్న దృష్ట్యా లిఖిత పూర్వక హామీ కోరుతున్నామని చె ప్పారు. ఈ అంశాన్ని రైతు ప్రయోజనాల కోణంలో చూడాలని కోరారు. కేంద్రమంత్రి కలిసే వరకు మంత్రులు వేచి చూస్తున్నారని స్పష్టం చేశారు. కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అయోమయానికి గురి చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ప్రస్తుత వానాకాలం సేకరణపై తాము నిలదీస్తుంటే, ఆయన గత యాసంగి సేకరణపై మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి నెలా 10 లక్షల మెట్రిక్ టన్నుల «ధాన్యం మిల్లింగ్ చేస్తున్నా, ఎఫ్‌సీఐ మాత్రం నెలకు 5 లక్షల టన్నులు మాత్రమే తీసుకుంటోందని, దీనికి కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా ధాన్యం సేకరణ పెరుగుతున్నా, కేంద్రం అదనంగా ఒక్క గోదామును ఎందుకు కట్టలేదని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. మంత్రులకు టైమ్ ఇవ్వని పీయూష్ ► మూడురోజులుగా ఎదురుచూపులు ► నేటి మధ్యాహ్నం భేటీకి అవకాశం సాక్షి న్యూఢిల్లీ: ప్రస్తుత వానాకాలంలో అదనపు ధాన్యం కొనుగోళ్ల విషయమై కేంద్రంతో చర్చించేందుకు ఢిల్లీకి వచ్చిన రాష్ట్ర మంత్రుల బృందానికి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం కూడా సమయమివ్వలేదు. ఆయన అపాయింట్మెంట్ కోసం శనివారం నుంచి మంత్రులు వేచి చూస్తున్నారు. సోమవారం పార్లమెంట్లో ఏదో ఒక సమయంలో కలుస్తానని పీయూష్ సమాచారం ఇచ్చారు. దీంతో సోమవారం రోజంతా మంత్రులు ఎదురుచూసినా సమావేశం మాత్రం ఖరారు కాలేదు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో ఎంపీ కేకే టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు పార్లమెంట్ ఆవరణలో పీయూష్‌ను కలిసి మంత్రుల బృందానికి సమయమివ్వాలని కోరారు. బిజీ షెడ్యూల్ కారణంగా సోమవారం కుదరదని చెప్పిన ఆయన.. మంగళవారం అన్ని రాష్ట్రాల పౌరసరఫరాల శాఖ మంత్రులతో ఏర్పాటు చేసిన భేటీకి ముందు రాష్ట్ర మంత్రులను కలిసేందుకు సమయమిస్తానని చెప్పినట్టు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రులు పీయూష్‌ను కలిసే అవకాశాలున్నాయి. -
మేం స్వతంత్రంగా వ్యవహరించలేం
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరే తమ వైఖరి అని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం గురువారం హైకోర్టుకు నివేదించింది. తమది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయినందువల్ల స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదని స్టీల్ ప్లాంట్ తరఫు న్యాయవాది డబ్ల్యూబీ శ్రీనివాస్ హైకోర్టుకు నివేదించారు. ప్రైవేటీకరణకు అనుకూలంగాకానీ, వ్యతిరేకంగాకానీ తమ వైఖరిని చెప్పలేమన్నారు. ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌నే తాము అన్వయింప చేసుకుంటున్నామని ఆయన వివరించారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తన వైఖరిని స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రైవేటీకరణపై ఫిబ్రవరి 2న తుది విచారణ మొదలు పెడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ లోపు ప్రైవేటీకరణ విషయంలో ఏవైనా కీలక పరిణామాలు ఉంటే వాటిని కోర్టు దృష్టికి తీసుకొచ్చి, ముందస్తు విచారణ కోరవచ్చునంటూ పిటిషనర్లకు హైకోర్టు స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను సవాలు చేస్తూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణతో పాటు మరొకరు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ వాదనలు వినిపిస్తూ, స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిందన్నారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇంకా కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తరఫు న్యాయవాది స్పందించారు. జేడీ లక్ష్మీనారాయణ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయంగా పలు మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం సూచించగా.. వాటిని కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఈ వ్యాజ్యాలపై వీలైనంత త్వరగా విచారణ జరిపి కేంద్రం నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరారు. -
కోవాగ్జిన్ కంటే కోవిషీల్డ్ టీకా ఉత్పత్తి 5 రెట్లు ఎక్కువ
న్యూఢిల్లీ: దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం నెలకు 25–27.5 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకా ఉత్పత్తి చేస్తుండగా, భారత్ బయోటెక్ నెలకు 5నుంచి 6 కోట్ల డోసుల కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ రెండు సంస్థలు తమ ఉత్పత్తి సామర్థ్యంలో 90% మేర సాధించినట్లు ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి మంగళవారం లోక్‌సభకు వెల్లడించారు. చదవండి: 2011 ఎస్ఈసీసీ డేటాలో లోపాలు! -
ఒమిక్రాన్: రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కొత్త రకం కరోనా వేరియంట్ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. ఓమిక్రాన్ రకం వైరస్‌ను గుర్తించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో కఠినంగా స్క్రీనింగ్ నిర్వహించాలని తెలిపారు. ఇంటెన్సివ్ కంటైన్మెంట్, చురుకైన నిఘా, వ్యాక్సినేషన్ విస్తృతం చేయాలంటూ రాష్ట్రాలకు సూచించారు. కోవిడ్-19 పరీక్షలను పెంచాలని ఆదేశించారు. కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల సంఖ్య తగ్గినట్లు తెలిపారు. కోవిడ్ హాట్స్పాట్లను గుర్తించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పాజిటివిటీ రేటు 5శాతం కంటే ఎక్కువున్న ప్రాంతాలపై రాష్ట్రాలు దృష్టిసారించాలని తెలిపారు. చదవండి: Tamil Nadu Rains: తమిళనాడులో రెడ్ అలర్ట్!! 2 వందల యేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు.. తగినంత వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కేంద్రం అందజేసిన నిధులను సమర్థవంతంగా వైద్య సదుపాయాల కల్పన కోసం వినియోగించాలని పేర్కొన్నారు. కొత్త రకం మ్యుటేషన్లను గుర్తించే జీనోమ్-సీక్వెన్సింగ్ పరీక్షలను పెంచాలని తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సార్స్-కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం ల్యాబ్‌లను వినియోగించుకోవాలని సూచించారు. తప్పుడు సమాచారంతో భయాందోళనలు, అపోహలు చెలరేగకుండా ఎప్పటికప్పుడు సరైన సమాచారం అందించేలా ప్రెస్ బ్రీఫింగ్, కోవిడ్ బులెటిన్లను విడుదల చేయాలని పేర్కొన్నారు. ఓమిక్రాన్ రకం వైరస్ ప్రస్తుతం బ్రిటన్, జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, బోట్స్వానా, ఇజ్రాయిల్, హాంగ్‌కాంగ్ (చైనా) దేశాల్లో గుర్తించిన విషయం తెలిసిందే. చదవండి: సౌతాఫ్రికా నుంచి ఇద్దరు: హమ్మయ్య.. వారికి సోకింది ఒమిక్రాన్ కాదు డెల్టా -
గుప్పెడైనా ‘ఉప్పుడు’ వద్దు.. యాసంగి వరి వద్దు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో వచ్చే యాసంగి (రబీ) సీజన్లో వరిసాగు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇకముందు బాయిల్డ్ రైస్ (ఉప్పు డు బియ్యం) ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకునే ప్రసక్తి లేదని మరోమారు తేల్చిచెప్పింది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని రాష్ట్రానికి సూచించింది. ధాన్యం కొనుగోళ్లకు వార్షిక లక్ష్యాన్ని ప్రకటించాలని, ప్రస్తుత వానాకాలంలో ఎక్కువ మొత్తంలో ధాన్యం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన డిమాండ్లను పక్కనపెట్టింది. కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు నేపథ్యంలో ప్రధాని మోదీ ఓ కమిటీని నియమిం చనున్నారని.. పంట కొనుగోళ్లు, మార్పిడి, కనీస మద్దతు ధరలపై ఆ కమిటీ ప్రతిపాదనలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఢిల్లీలో కేంద్ర మంత్రితో భేటీ అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి, ఇతర నేతలు, అధికారులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కోటి టన్నులు సేకరించాలి.. తెలంగాణలో ధాన్యం సేకరణ అంశంపై నాలుగు రోజుల కింద మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని బృందం కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఆ చర్చల్లో ఎలాంటి స్పష్టతరాకపోవడంతో.. వ్యవసాయ అధికారులతో చర్చించి 26వ తేదీన ధాన్యం కొనుగోళ్లపై తమ విధానాన్ని స్పష్టం చేస్తామని కేంద్రమంత్రి చెప్పారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి తొమ్మిది గంటలకు.. మంత్రులు మహమూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి, టీఆర్ఎస్ పార్లమెంట్ పక్షనేత నామా నాగేశ్వర్రావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, బీబీ పాటిల్, సీఎస్ సోమేశ్‌కుమార్ తదితరులు పీయూష్ గోయల్‌తో గంట పాటు సమావేశమయ్యారు. రాష్ట్రంలో ధాన్యం దిగుబడులు, యాసంగిలో వరిసాగు పరిస్థితిని కేంద్రమంత్రికి నివేదించారు. తెలంగాణ నుంచి ఏటా 1.50 కోట్ల టన్నుల ధాన్యం సేకరించాలని కోరారు. ప్రస్తుత (వానాకాలం) సీజన్లో కేంద్రం 60లక్షల టన్నుల ధాన్యం (40 లక్షల టన్నుల బియ్యం) సేకరిస్తామని చెప్పిందని.. కనీసం కోటి టన్నుల ధాన్యం సేకరించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి.. అంత స్థాయిలో ధాన్యం సేకరించలేమని తేల్చిచెప్పారు. 40 లక్షల టన్నుల బియ్యానికి అదనంగా మరో 10 లక్షల టన్నుల వరకు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. కానీ హామీ ఇవ్వలేదు. వరిసాగును పక్కనపెట్టండి యాసంగిలో ఉప్పుడు బియ్యం తీసుకునే పరిస్థితులు లేనందున వరిసాగును పూర్తిగా పక్కనబెట్టి.. పప్పుదినుసులు, నూనె గింజల సాగు, పంట మార్పిడి వైపు రైతులను ప్రోత్సహించాలని కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ సూచించారు. ఇప్పటికిప్పుడు వరి నుంచి రైతులను ఇతర పంటల వైపు మళ్లించడం సాధ్యం కాదని రాష్ట్ర మంత్రులు వాదించినా.. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించలేదని తెలిసింది. ఇక వార్షిక కొనుగోలు లక్ష్యాన్ని ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్ స్పష్టం చేశారని పేర్కొన్నట్టు సమాచారం. దేశవ్యాప్తంగా పంటల పరిస్థితి ఆధారంగా కొనుగోళ్లపై నిర్ణయం ఉంటుందని.. వ్యవసాయశాఖ, ఆహారశాఖ సహా పలు శాఖలు కలిసి దీనిపై అంచనాలు రూపొందించాల్సి ఉంటుందని స్పష్టం చేసినట్టు తెలిసింది. కేంద్ర మంత్రి చెప్పిన సమాధానాలపై మంత్రులు అసంతృప్తి వ్యక్తంచేసినా.. అంతకుమించి ఏమీ చేయలేమని చెప్పినట్టు తెలుస్తోంది. యాసంగిలో వరి వద్దన్నారు.. కేంద్రమంత్రితో భేటీ అనంతరం రాష్ట్ర ప్రతినిధులతో కలిసి మంత్రి నిరంజన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రం తీరు పూర్తి నిరాశాజనకంగా ఉందని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ప్రయోజనాల కోసం చర్చలకు వచ్చాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తప్పకుండా పరిష్కారం చూపుతుందని ఆశించాం. సానుకూలంగా నిర్ణయం వస్తుందని భావించాం. కానీ ఎలాంటి హామీ రాలేదు. యాసంగిలో వరి వద్దని గట్టిగా చెప్పారు. వార్షిక ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని ప్రకటించాలని కోరినా.. ముందుగా చెప్పలేమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం పోటెత్తుతోంది. ఇప్పుడైనా ఎంత ధాన్యం సేకరిస్తారో చెప్పాలని కోరాం. కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వకుండా.. గత ఏడాది మాదిరే సేకరిస్తామంటూ దాటవేశారు’’ అని నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేంద్రమంత్రితో చర్చించిన అంశాలను సీఎం కేసీఆర్‌కు వివరిస్తామని, అందుకు అనుగుణంగా సీఎం రైతులకు దిశానిర్దేశం చేస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ నేతలు వరి సాగు చేయాలంటూ ప్రకటనలు చేస్తున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. ఆ రకంగా మాట్లాడొద్దని రాష్ట్ర బీజేపీ నేతలకు చెప్పామని, ఇక ముందు అలా ప్రకటనలు చేయబోరని కేంద్రమంత్రి వివరించారని తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం తప్పకుండా పరిష్కారం చూపుతుందని ఆశించాం. కానీ ఎలాంటి హామీ రాలేదు. కేంద్రం తీరు బాధాకరం. యాసంగిలో వరి వద్దని గట్టిగా చెప్పారు. కేంద్ర అధికారులు యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోబోమని అంటున్నారు కాబట్టి వరి వేయొద్దని అంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న వానాకాలం ధాన్యం కొనుగోళ్లను పెంచాలని కోరినా స్పందించలేదు. – మంత్రి నిరంజన్‌రెడ్డి మేము నేరుగా వరి వద్దని చెప్పలేదు. యాసంగిలో వచ్చే ఉప్పుడు బియ్యం కొనలేని పరిస్థితుల్లో పంటల మార్పిడికి వెళ్లాలని సూచించాం. ప్రస్తుత వానాకాలంలో నిర్ణయించిన టార్గెట్‌ను పూర్తి చేయడంపై మొదట దృష్టి సారించాలని రాష్ట్ర ప్రతినిధులకు స్పష్టం చేశాము. – కేంద్ర ప్రభుత్వ వర్గాలు -
టమాట, ఉల్లి ధరలపై కేంద్రం కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం టమాటా, ఉల్లి ధరలపై కీలక ప్రకటన చేసింది. ఉత్తరాది రాష్ట్రాల్లో దిగుబడి పెరిగి ధరలు తగ్గుతాయని తెలిపింది. నవంబర్ 25 నాటికి దేశంలో కిలో టమాట సగటు ధర రూ.67 ఉంటుందని, గత ఏడాదితో పోల్చితే 63 శాతం టమాట ధర పెరిగిందని తెలిపింది. అకాల వర్షాల కారణంగా పంటనష్టం, సరఫరాపై ప్రభావంతో టమాట ధరలు పెరిగాయని పేర్కొంది. ఖరీఫ్, లేట్ ఖరీఫ్ సీజన్ నుంచి 69 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నామని తెలిపింది. గతేడాది ఇదే సమయానికి 70.12లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిదని, గతేడాదితో పోల్చితే టమాట దిగుబడి తగ్గింది వెల్లడించింది. ఇప్పటికే మార్కెట్లలోకి ఖరీఫ్ సీజన్ ఉల్లిపాయలు చేరుకుంటున్నాయని,సెప్టెంబర్‌లో పంజాబ్, యూపీ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అకాల వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతినడం వల్ల దిగుబడి ఆలస్యమైందని తెలిపింది. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోనూ కురిసిన భారీ వర్షాల కారణంగా టమాట పంట దెబ్బతినడంతో పాటు రవాణాపై కూడా ప్రభావం పడిందని పేర్కొంది. దేశవ్యాప్తంగా నవంబర్ 25 నాటికి సగటు ఉల్లిపాయ ధర రూ.39 ఉంటుందని, గతేడాదితో పోల్చితే 32 శాతం ఉల్లిపాయ ధర తగ్గిందని తెలిపింది. 2019, 2020 కంటే ఉల్లిపాయ ధర ప్రస్తుత తక్కువేనని పేర్కొంది. ఉల్లిపాయ ధర నియంత్రించేందుకు బఫర్ నిల్వల నుంచి విడుదల చేశామని వెల్లడించింది. కేంద్రం వద్ద ఉన్న 2.08 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వల నుంచి ఉల్లిని విడుదల చేసినట్లు కేంద్రంపేర్కొంది. బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయని నాగాలాండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకున్నాయని చెప్పింది. ధరల నియంత్రణ పథకం కింద రాష్ట్రాలకు 50:50 నిష్పత్తిలో, ఈశాన్య రాష్ట్రాలకు 75:25 నిష్పత్తిలో వడ్డీ రహిత అడ్వాన్సులను కేంద్రంఅందించింది. ఏపీ, తెలంగాణ సహా 6 రాష్ట్రాలకు రూ.164.15 కోట్ల కేంద్ర వాటా విడుదల చేసినట్లు పేర్కొంది. ఆహార వస్తువుల ధరలను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు రాష్ట్రాలు నిధులు వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించింది. నిత్యావసరాల ధరలను తగ్గించేందుకు రాష్ట్రాలు సైతం ధరల నియంత్రణ నిధిని ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. -
కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు కేంద్రం కసరత్తు
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల ఆహార కార్యదర్శులతో గ్రూపు ఏర్పాటు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల పథకానికి అవసరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కార్యదర్శుల బృందం రూపొందించనుంది. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేలా పూర్తి పారదర్శకంగా ఉండేలా పథకాన్ని రూపొందించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. ఈనెల 29న మరోసారి కేంద్ర, రాష్ట్రాల ఆహార కార్యదర్శులు సమావేశం కానున్నారు. -
యూపీని ఒక్కటి చేస్తుంది
ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంత అభివృద్ధిలో బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. గత ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి పేదరికంలోకి, మాఫియా గుప్పిట్లోకి నెట్టేశాయి. – మోదీ సుల్తాన్పూర్: పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధిపరంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక్కటిగా చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ప్రాంత అభివృద్ధిలో బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందన్నారు. దేశంలోనే అత్యంత పొడవైన రహదారి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేని మంగళవారం ప్రారంభించిన అనంతరం ప్రధాని ఒక ర్యాలీనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభోత్సవానికి వాయుసేనకు చెందిన హెర్క్యులస్ సీ–130జే విమానంలో మోదీ వచ్చారు. మోదీకి గవర్నర్ ఆనందీబెన్, రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈ సందర్భంగా మిరాజ్, జాగ్వార్, సుఖోయ్, ఏఎన్–32 యుద్ధ విమానాల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. లక్నో–ఘజియాపూర్ మధ్య 341 కి.మీ. పొడవునా ఈ ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించారు. పేదలు, మధ్యతరగతి వారు, రైతులు, వ్యాపారులు అందరికీ ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఎనలేని లబ్ధి చేకూరుతుందని చెప్పారు. గత యూపీ సీఎంలు తమ సొంతూళ్లను అభివృద్ధి చేసి మిగిలిన ప్రాంతాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతోనే (కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారం) సాధ్యపడుతుందని ప్రధాని అన్నారు. 2014లో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత యూపీలో చేపట్టే ప్రాజెక్టులకు అప్పడు అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మోకాలడ్డిందని ఆరోపించారు. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులు పట్టాలెక్కాయని చెప్పారు. -
శతకోటి సంబరం!
ఇది సంతోషించాల్సిన విజయం. సంబరం చేసుకోవాల్సిన సందర్భం. తొమ్మిది నెలల క్రితం అనేక అనుమానాల మధ్య మొదలై, సవాలక్ష సమస్యలను దాటి గురువారం నాటికి అన్నీ కలిపి 100 కోట్ల కోవిడ్ టీకా డోసులు వేయడంలో మన దేశం సఫలమైంది. ప్రపంచం ముంగిట సగర్వంగా నిలిచింది. ఇప్పటికి 22 నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న ఓ మహమ్మారిపై పోరాటంలో... దేశవాళీ టీకాల రూపకల్పనతో భారత్ సృష్టించిన చరిత్ర ఇది. వంద కోట్లకు పైగా జనాభా ఉన్న రెండు ప్రపంచ దేశాల్లో ఒకటిగా టీకాకరణలో భారత సువర్ణాధ్యాయం ఇది. జూన్‌లో చైనా వంద కోట్ల మార్కు దాటాక, మళ్ళీ ఆ పని సాధ్యం చేసింది మనమే. విధాన రూపకర్తల మొదలు టీకా తయారీదార్లయిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ లాంటి సంస్థలు, అనుమానాలను తీర్చి టీకాలను ప్రజలకు చేర్చిన డాక్టర్లు, సుదూర ప్రాంతాలకు ప్రయాణించిన సామాన్య ఆరోగ్య కార్యకర్తల దాకా కొన్ని కోట్ల మంది కృషి ఫలితం ఇది. మన దేశంలో ఈ జనవరి 16న మొదలైన ఈ తొమ్మిది నెలల ప్రయాణంలో ఎన్నో ఘట్టాలు. ముఖ్యంగా సెకండ్ వేవ్ విజృంభించిన ఈ ఏడాది వేసవిలో టీకాల కొరత నుంచి ఇప్పుడు టీకాలు దండిగా దొరికే రోజుల దాకా చూశాం. తొలి డోసు అనుమానాల నుంచి మూడోదైన బూస్టర్ డోస్‌కు సై అనే దాకా వచ్చాం. నెల మొత్తం మీద 7 కోట్ల డోసుల తయారీకే ఆపసోపాలు పడిన క్షణాల నుంచి ఇప్పుడు నెలకు 20 కోట్ల డోసుల తయారీకి పురోగమించాం. కావాల్సిన ఔషధాలు, ఆక్సిజన్ దొరక్క అవస్థ పడిన రోజులు పోయి... కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్–వి సహా అనేక టీకాలు అందుబాటులో ఉండడం చూశాం. పడవలు, డ్రోన్లతోనూ టీకాల రవాణా చేశాం. తొలి రోజుల్లో సమస్యలెదురైనా, దేశీయంగా రూపొందించిన కోవిన్ యాప్ ద్వారా టీకాలపై సమాచారం, తక్షణ డిజిటల్ సర్టిఫికెట్లు విజయవంతంగా అందుకున్నాం. ఈ సుదీర్ఘ ప్రయాణంలో 100 కోట్ల డోసుల విజయం ఓ మైలురాయే. మరిన్ని సవాళ్ళు ముందున్నాయి. ఈ ఏడాది చివరి కల్లా 100 కోట్ల వయోజన భారతీయులకు పూర్తిగా టీకాలు వేయాలన్న ప్రభుత్వ లక్ష్యం అనుకున్నంత సులభం కాదు. అది సాధించాలంటే, టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సి ఉంది. ఈ బృహత్తర యజ్ఞంలో ఇప్పటికి మన దేశంలోని వయోజనుల్లో (18 ఏళ్ళ వయసు దాటినవారు) నూటికి 75 మందికి కనీసం ఒక డోసయినా టీకా వేసినట్టయింది. అదే సమయంలో మరో 25 శాతం మంది వయోజనులు ఇంకా టీకా ఫస్ట్ డోస్‌కే నోచుకోవాల్సి ఉంది. నిజానికి రెండు డోసులూ వేస్తేనే టీకా వేయడం పూర్తయి, కరోనా నుంచి పూర్తి రక్షణ వచ్చినట్టు లెక్క. అందుకే, శతకోటి డోసులు పూర్తయినంత మాత్రాన శతాధిక కోట్ల భారతీయులకూ టీకా వేయడం పూర్తయినట్టు కాదు. తలా రెండు డోసులు పడేవరకూ ప్రతి ఒక్కరూ సురక్షితమూ కాదు. అమెరికా తర్వాత అత్యధికంగా 3.4 కోట్ల పైగా కోవిడ్ కేసులు వచ్చింది మన దేశంలోనే. అమెరికా, బ్రెజిల్ తరువాత అధికంగా 4.52 లక్షల పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోయిందీ భారత్‌లోనే. క్లిష్టమైన ఈ ప్రయాణంలో ప్రాణాంతక వైరస్ నుంచి దేశం ఎన్నో పాఠాలు నేర్చుకుంది. ప్రజారోగ్యంపై, ప్రాథమిక ఆరోగ్య వసతులపై దృష్టి పెట్టాల్సిన అవసరం పాలకులకు మరోసారి గుర్తొచ్చింది. లాక్డౌన్లు, వలస జీవుల వెతలు, దెబ్బతిన్న సామాజిక, ఆర్థిక వ్యవస్థల నడుమనే సమష్టి కృషితో దేశం కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ వచ్చింది. 278 రోజుల్లో ఇలా శతకోటి డోసులు పూర్తయ్యాయంటే, సగటున రోజుకు 36 లక్షల టీకాలు వేసినట్టు లెక్క. కానీ, జనవరి నుంచి చూస్తే, ఏప్రిల్, సెప్టెంబర్ వగైరాల్లో టీకాప్రక్రియ వేగవంతం కావడం, అనేక కారణాలతో మధ్యలో మందకొడిగా సాగడం గమనార్హం. ప్రధాని మోదీ 71వ పుట్టినరోజైన సెప్టెంబర్ 17న రికార్డు స్థాయిలో 2 కోట్లకు పైగా డోసులు పడ్డాయి. కానీ,ఆ వేగం తగ్గి, అక్టోబర్‌లో సగటున రోజుకు 53 లక్షలే వేయగలిగాం. కానీ, డిసెంబర్ ఆఖరుకు అర్హులైన భారతీయులందరికీ టీకా అనే లక్ష్యం సాధించాలంటే, ఇకపై రోజూ 1.2 కోట్లకు పైగా డోసులు వేయాలి. అలాగే, పిల్లలు, యువకులకు ఇప్పటికీ టీకాలు వేయాల్సి ఉంది. 12 ఏళ్ళు పైబడిన వారందరికీ తొలిసారిగా సూదితో అవసరం లేని జైకోవ్–డి టీకాను దేశీయంగా రూపొందించడం ఒక శుభసూచకం. అయితే, ఇప్పటికీ పట్టణ – గ్రామీణ ప్రాంతాల మధ్య, అలాగే స్త్రీపురుషుల మధ్య టీకాకరణలో అంతరం ఆలోచించాల్సిన విషయం. పురుషులతో పోలిస్తే 6 శాతం తక్కువ మంది స్త్రీలు టీకాలు వేసుకున్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. ఈ అంతరాలను సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మన దేశంలో కోవిడ్ కేసులు రోజూ సగటున 20 వేల లోపే ఉండడం, తెలుగు రాష్ట్రాలు రెండూ కలిపినా వెయ్యి లోపలే కేసులు నమోదవుతుండడం సంతోషించదగ్గ విషయమే. కానీ, ఇక్కడే అసలు చిక్కు. తొలి డోసు తర్వాత నిర్ణీత గడువు దాటినా కొన్ని లక్షల మంది రెండో డోసు వేసుకోకపోవడం ఆందోళనకరం. అలాగే, షరతుల సడలింపులతో కోవిడ్ నిబంధనల్ని గాలికి వదిలేయడం ఇప్పటికే ఎక్కువైంది. మాస్కులు, భౌతిక దూరాలు మానేయడం మనకే ముప్పు. మాస్కులు ధరించడం... గాలి, వెలుతురు ఉండే చోట పనిచేయడం... కరోనాకు పండగగా మారే ఉత్సవాలకు దూరంగా ఉండడమే అసలు టీకా అని నిపుణులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. వేరియంట్లకు వ్యాక్సిన్లు, ఉత్పరివర్తనాలకు (మ్యూటెంట్లకు) మాస్కులు ఇదే రక్షణ మంత్రం అన్నది నిపుణుల నినాదం. అందుకే, శతకోటి సంబరంతో చప్పట్లు కొట్టి, పాటలు పాడి, దీపాలు వేసి సేదతీరితే సరిపోదు. మానవాళికి ముప్పు ఇంకా తొలగిపోలేదు. రూపు మార్చుకొంటున్న వైరస్‌తో అమెరికాలో 90 వేలు, బ్రిటన్‌లో 50 వేలు, రష్యాలో 33 వేలకు పైగా రోజువారీ కేసులు వస్తున్నాయని మర్చిపోకూడదు. అగ్రరాజ్యాలలోనే పరిస్థితి ఇలా ఉంటే, మామూలు దేశాల పరిస్థితి ఊహించుకోవచ్చు. థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్న మన దేశంలో కరోనా టీకాల రెండు డోసులూ ఇప్పటికి చేరింది 30 శాతం (29.1 కోట్ల) మందికే! ఆ సంగతి మనం మర్చి పోకూడదు. అర్హులందరికీ టీకా లక్ష్యం చేరితే, పొరుగుదేశాలతో పాటు ఆఫ్రికా లాంటి చోట్లకు మన ‘వ్యాక్సిన్ మైత్రి’ దౌత్యంతో స్నేహవారధి నిర్మించుకోవచ్చు. అసలైన ప్రయాణం ఇంకా ముందుంది. -
గెజిట్‌పై బోర్డులతో మరోమారు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ అమలు అంశంపై కేంద్రం మరోమారు రంగంలోకి దిగనుంది. అక్టోబర్ 14 నుంచే గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రావాల్సి ఉన్నా.. తెలుగు రాష్ట్రాల నుంచి సరైన మద్దతు కరువైన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై బోర్డులతో చర్చించనుంది. ఒకట్రెండు రోజుల్లోనే కేంద్ర జల శక్తి శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీ రెండు బోర్డుల చైర్మన్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించి, తదుపరి నిర్ణయాలు చేసే అవకాశాలున్నాయని తెలిసింది. అమలుకు నోచని గెజిట్ కేంద్రం వెలువరించిన గెజిట్ ప్రకారం.. కేంద్రం గుర్తించిన ప్రాజెక్టులు, వాటి పరిధిలోని ప్రధాన పనులు, రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో సహా అందరూ బోర్డుల పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పించడంతో పాటు నీటి విడుదల, విద్యుదుత్పత్తి, వినియోగం అంశాలను బోర్డులే చూడాల్సి ఉంది. అయితే ఇరు రాష్ట్రాల చర్చల్లో గోదావరిలో కేవలం పెద్దవాగు, కృష్ణాలో 15 ఔట్లెట్లను మాత్రమే అప్పగించే అంశంపై కొంత సానుకూలత ఏర్పడింది. అయితే ఇందులోనూ కృష్ణాలోని విద్యుదుత్పత్తి కేంద్రాలను బోర్డులకు అప్పగించేందుకు తెలంగాణ ససేమిరా అంటోంది. విద్యుదుత్పత్తి కేంద్రాలు లేకుండా ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటే ఫలితం ఉండదని ఏపీ అంటుండటంతో గెజిట్ అమలు ముందుకు కదలడం లేదు. దీంతో పరిస్థితిని బోర్డులు కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాయి. ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై మార్గనిర్దేశకత్వాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్రం, ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై సమావేశం ఏర్పాటు చేస్తామని సమాచారమిచ్చింది. గురు లేక శుక్రవారాల్లో గెజిట్ అమలులో నెలకొన్న సమస్యలపై చర్చించనుంది. డీపీఆర్లపైనా చర్చ కృష్ణా, గోదావరి నదీ బేసిన్లలో అనుమతి తీసుకోకుండా నిర్మాణం చేస్తున్న ప్రాజెక్టులకు ఆర్నెల్లలోగా అనుమతి తీసుకోవాలని, ఒకవేళ అనుమతి తీసుకోవడంలో విఫలమైతే.. ఆ ప్రాజెక్టులు పూర్తయినా వాటి నుంచి నీటిని సరఫరా చేయడాన్ని ఆపేయాల్సిందేనని గెజిట్‌లో కేంద్రం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు కొన్ని ప్రాజెక్టుల డీపీఆర్‌లను కేంద్రానికి అందించాయి. ముఖ్యంగా తెలంగాణ సీతారామ, తుపాకులగూడెం, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు, చౌట్పల్లి హన్మంత్‌రెడ్డి ప్రాజెక్టుల డీపీఆర్‌లను అందించింది. ఈ ప్రాజెక్టుల డీపీఆర్ అంశాలపైనా కేంద్రం బోర్డులతో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటివరకు అందించిన ప్రాజెక్టుల డీపీఆర్‌లు, వాటిపై రాష్ట్రాలను కోరిన వివరణలు, వాటికి సమాధానాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. -
సాక్షి కార్టూన్ 20-10-2021
-
TS: కిలో కూడా ఎక్కువ కొనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గత యాసంగిలో ఉత్పత్తి అయిన బియ్యం సేకరణ విషయంలో కేంద్రం ఏమాత్రం కనికరం చూపడం లేదు. గతంలో సేకరించిన మాదిరే బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) ఎక్కువగా తీసుకోవాలని పదేపదే కోరుతున్నా..ఒక్క కిలో కూడా ఎక్కువ తీసుకోబోమని తేల్చి చెబుతోంది. 2019–20కి సంబంధించి మిగిలిపోయిన లక్ష మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను తీసుకునేందుకు ఎట్టకేలకు అంగీకరించిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ), గత యాసంగికి సంబంధించి 50 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తీసుకోవాలన్న రాష్ట్ర వినతికి మాత్రం ససేమిరా అంటోంది. అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా బాయిల్డ్ రైస్ నిల్వలు ఎక్కడివక్కడే పేరుకుపోయే అవకాశం ఉంది. లక్ష టన్నుల సీఎంఆర్‌కు సానుకూలం 2019–20 ఏడాదికి సంబంధించి తాను కొనుగోలు చేసిన 64.17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌర సరఫరాలశాఖ సీఎంఆర్ కింద మిల్లర్లకు అప్పగించింది. ఈ ధాన్యం మిల్లింగ్ అనంతరం 43.59 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాల్సి ఉంది. అయితే గడువులోగా 42.54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించగా, సుమారు లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగింత ఆలస్యమైంది. దీంతో ఈ బియ్యం తీసుకునేందుకు కేంద్రం నిరాకరిస్తోంది. ఈ బియ్యం విలువ దాదాపు రూ.400 కోట్ల వరకు ఉంటుంది. ఈ బియ్యం తీసుకోవాల్సిందిగా గతంలో పలుమార్లు కోరినా కేంద్రం ససేమిరా అంటూ వస్తోంది. అయితే పది రోజుల కిందట మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్‌లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో చర్చించగా, లక్ష టన్నులు తీసుకునేందుకు ఓకే చెప్పారు. నెల రోజుల్లో డెలివరీ ఇవ్వాలని సూచించడంతో రాష్ట్రానికి పెద్ద ఉపశమనం లభించింది. బాయిల్డ్ రైస్‌పై మాత్రం స్పందన కరువు రాష్ట్రంలో 2020–21 యాసంగికి సంబంధించిన మొత్తం 62.84 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 50 లక్షలు బాయిల్డ్ రైస్, మరో 12.84 లక్షల రారైస్ (పచ్చిబియ్యం) తీసుకోవాలని రాష్ట్రం కోరుతోంది. అయితే కేవలం 24.57 లక్షల మెట్రిక్ టన్నుల మేర మాత్రమే బాయిల్డ్ రైస్ ఇచ్చి, మిగతాదంతా రారైస్ ఇవ్వాలని కేంద్రం పట్టుబడుతోంది. 24.57 లక్షల టన్నుల్లో ఇప్పటికే 16 లక్షల టన్నుల మేర సేకరిం చగా, మిగతా ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్రం అదనంగా బాయిల్డ్ రైస్ సేకరణ చేయలేమని చెబుతుండటంతో నిల్వల ఖాళీ రాష్ట్రానికి పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారుతోంది. 80 లక్షలు కోరితే 60 లక్షలకు ఓకే... సాగు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత వానాకాలంలో రాష్ట్రంలో 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో 80 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యాన్ని సేకరించాల్సిందిగా కేంద్రాన్ని రాష్ట్రం కోరుతోంది. అయితే మొదట 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తీసుకుంటామన్న ఎఫ్‌సీఐ.. తర్వాత రాష్ట్ర సంప్రదింపుల నేపథ్యంలో 60 లక్షల మెట్రిక్ టన్నులకు అంగీకరించింది. దీంతో మిగతా 20 లక్షల టన్నుల ధాన్యంపై సందిగ్ధత నెలకొంది. చదవండి: TS: ఎగుమతులతోనే రైతు ఆదాయం రెట్టింపు -
మృతి చెందాక కూడా 8 మందికి జీవితం ఇవ్వొచ్చు!
దానాలన్నిటిలో అవయవదానం గొప్పది అంటారు పెద్దలు. ఒక్క మాటలో చెప్పాలంటే మరణం తర్వాత కూడా మనం జీవించి ఉండగలిగే మహద్భాగ్యం అని చెప్పొచ్చు. ఒక మరణించిన వ్యక్తి అవయవాలను ఇతరులకు దానం చేయడం ద్వారా ఒకరి జీవితం ముగిసినప్పటికీ మరొకరి జీవితం రూపంలో మరో ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. మరణానంతరం ఎంతో విలువైన అవయవాలను మట్టిపాలు చేయటం కంటే మన అవయవాలను దానం చేయడం ద్వారా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపిన వారవుతాం. ఒక మనిషి అవయవాలను దానం చేయడం వలన వాటి అవసరం ఉన్న వారి ప్రాణాలు నిలబెట్టొచ్చంటున్నారు వైద్యులు. ఒక వ్యక్తి అవయవ దానం చేయడం ద్వారా దాదాపు 50 మంది నిరుపేదలకు సహాయం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక అధికారిక సమాచారం ప్రకారం భారతదేశంలో ప్రతి ఏటా దాదాపు 5 లక్షల మంది ప్రజలు అవయవ దాతలు లేక మరణిస్తున్నారు. ఇక అవయవ దానం విషయానికి వస్తే.. దేశంలో ఒక మిలియన్ మందికి గానూ 0.26 శాతం మంది మాత్రమే చేస్తున్నట్టు సమాచారం. శరీరంలోని ఏ అవయవాలను దానం చేయవచ్చు.. సాధారణంగా అవయవ దానం రెండు రకాలు కాగా మరణం తర్వాత చేసే అవయవ దానం మోదటిది అయితే సజీవ అవయవ దానం రెండవది. ఒక వ్యక్తి అవసరమైన వారికి సహాయం చేయడానికి తన శరీరంలోని మూత్రపిండాలు, క్లోమం కొంత భాగాన్ని దానం చేయవచ్చు. అలాగే మరణించిన వ్యక్తి యొక్క గుండె, కాలేయం, కిడ్నీలు, పేగులు, ఊపిరితిత్తులు, పాంక్రియాస్ దానం చేయొచ్చు. కార్నియా, గుండె కవాటాలు, చర్మం, ఎముకలు తదితర అవయవాలను సహజ మరణం పొందిన వారి నుంచే స్వీకరిస్తారు. అలాగే బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి శరీర అవయవాలతో 8 మందికి ప్రాణం పోయొచ్చు. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్, చిన్న పేగును మార్పిడి చేయవచ్చు. వీటితో పాటు చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాలను అవసరమైన రోగులకు దానం చేయవచ్చు. ఏదైనా ప్రమాదం కారణంగా లేదా ఇన్ఫెక్షన్ కారణంగా కంటి చూపు కోల్పోయిన వారికి కార్నియాను రీప్లేస్ చేయడం ద్వారా తిరిగి చూపు ప్రసాదించవచ్చు. కాలిన గాయాల బాధితులకు చర్మం మార్పిడి చేస్తారు. గుండె బైపాస్ సర్జరీ చేయించుకునే వారికి దాతల నరాలను ఉపయోగిస్తారు. అవయవాలను ఎవరు దానం చేయగలరు.. ఏ వ్యక్తి అయినా అవయవ దానం చేయవచ్చు. దీనికి సంబంధించి వయస్సుపై ఎలాంటి నిర్బంధమూ లేదు. నవజాత శిశువుల నుండి 90 ఏళ్ల వృద్ధులకు వరకు అవయవ దానాలు విజయవంతమయ్యాయి. అయితే 18 ఏళ్లలోపు వ్యక్తి మాత్రం తన అవయవాలను దానం చేయాలనుకుంటే, వారి తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. ఏ అవయవ మార్పిడికి ఎంత సమయం.. అవయవ దాత శరీరం నుంచి గుండెను తీసిన తర్వాత దాన్ని 4 గంటల్లోగా అవసరమైన వారికి అమర్చాలి. ఊపిరితిత్తులు కూడా అంతే. మూత్రపిండాలను శరీరం నుంచి వేరు చేసిన 30 గంటల్లోగా మార్పిడి చేయొచ్చు. కాలేయం, పాంక్రియాస్ 12 గంటల్లోగా మార్పిడి చేయాలి. అయితే వ్యక్తుల శరీర స్వభావాలను బట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏర్పడతాయి. అమర్చిన శరీర భాగాన్ని స్వీకర్త శరీరం అంగీకరించక తన రోగ నిరోధక వ్యవస్థ దాన్ని తిరస్కరించి దాడి చేస్తుంది. ఇక దీన్ని నివారించడానికి వైద్యులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందుకోసం కొన్నిసార్లు జీవిత కాలంపాటు స్వీకర్త ఔషధాలు వాడాల్సి వస్తుంది. నియమ నిబంధనలు.. అవయవ దానం చేసేవారి కోసం భారత ప్రభుత్వం కొన్ని రూల్స్‌ను రూపొందించింది. వాటిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. లేదంటే చట్ట పరమైన చర్యలు తీసుకుంటారు. ఎవరైనా అవయవ దానం చేయాలనుకుంటే దాని కోసం వారు ప్రతిజ్ఞ ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది. -
కన్ఫ్యూజ్ కావొద్దు.. వేరు వేరు రకాల టీకాలు వేసుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ల మార్పిడికి అనుమతి లేదని కేంద్రం తేల్చిచెప్పింది. మొదటి డోసు ఏ కంపెనీ టీకా వేసుకుంటారో రెండో డోసు కూడా అదే వేసుకోవాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు పలు అనుమానాలను నివృత్తి చేస్తూ తాజాగా నివేదిక విడుదల చేసింది. కోవిన్ యాప్‌తో అందరికీ ఒకే వ్యాక్సిన్ అందేలా ఏర్పాటు చేసినట్లు తెలిపింది. మొదటి డోసు ఏ టీకా వేశారో రెండో డోస్ కూడా అదే వేసేలా నిర్వాహకులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని పేర్కొంది. అయితే రెండు డోసుల టీకాలు ఎంతకాలం కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయన్న దానిపై స్పష్టత లేదని కేంద్రం తెలిపింది. భవిష్యత్తులో రెండో డోసు తర్వాత బూస్టర్ డోసు అవసరంపై ఇంకా నిర్ణయించలేదని స్పష్టం చేసింది. రెండు డోసుల కరోనా టీకా తీసుకున్న తర్వాత కూడా మాస్క్ ధరించాల్సిందేనని, భౌతికదూరం పాటించాల్సిందేనని తెలిపింది. తద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా తమను, చుట్టుపక్కల వారి ని రక్షించుకోవడం తప్పనిసరని పేర్కొంది. టీ కాలు పొందిన వ్యక్తుల్లో యాంటీబాడీస్ ఎంతకాలం ఉంటాయో నిర్ధారణ కాలేదని, అందు వల్ల కరోనా జాగ్రత్తలు పాటించాలని తెలిపింది. అన్ని టీకాలు పరివర్తన చెందిన వైరస్ నుండి కూడా తగిన స్థాయిలో రక్షణను అందిస్తాయని భావిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. మరికొన్ని అంశాలు.. ► కరోనా నుంచి కోలుకున్న వారికి 3 నెలల తర్వాత టీకా వేయవచ్చు. మోనోక్లోనల్ యాంటీబాడీస్ వేసుకున్న వారికి 3 నెలలపాటు టీకాను వాయిదా వేయాలి. అలాగే మొదటి డోస్ తీసుకున్న తర్వాత కరోనా సోకితే రెండో మోతాదును క్లినికల్ రికవరీ నుంచి 3 నెలలు వాయిదా వేయాలి. ► కోవిన్ పోర్టల్‌లో ప్రభుత్వ, ప్రైవేటు కరోనా టీకా కేంద్రాల్లో వివిధ వ్యాక్సిన్ల లభ్యత వివరాలు ఉంటాయి. లబ్ధిదారులు వారికి నచ్చిన టీకా వేయించుకోవచ్చు. ► వ్యాక్సిన్ సురక్షితంగా ఉందని నిర్ధారణ అయింది. టీకా తయారీ కంపెనీలు క్లినికల్ ట్రయల్స్ ఏ దశలోనూ నమూనా పరిమాణాన్ని తగ్గించలేదు. అయితే ఇది సాధారణంగా వ్యాక్సిన్ పరీక్షించే దానికంటే పెద్దది. చాలా టీకాలు 2 లేదా 3 నెలల పరిశీలన వ్యవధిలో 70 నుంచి 90% సామర్థ్యాన్ని చూపించాయి. ఊ అన్ని టీకాలు కరోనా సంక్రమణను నివారించడంలో బాగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక రోగులు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ టీకాతో మేలే తప్ప నష్టం ఉండదు. ► టీకా షెడ్యూల్ మొత్తం రెండు విడతలు పూర్తయిన తర్వాత తగినన్ని యాంటీబాడీస్ వస్తాయి. ► కరోనా టీకా మహిళల సంతానోత్పత్తిని ప్రభావితం చేయదు. అన్ని టీకాలను మొదట జంతువుల్లో, తర్వాత మనుషుల్లో పరీక్షించారు. టీకాల భద్రత, సమర్థతపై భరోసా ఇచ్చాకే వాటిని ఉపయోగించడానికి అనుమతి ఇచ్చాం. ► టీకా తీసుకునే ముందు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ ద్వారా పరీక్షించాల్సిన అవసరం లేదు. -
మరో 392 మంది తరలింపు
న్యూఢిల్లీ: తాలిబన్ ముష్కర మూకల కబంధ హస్తాల్లో చిక్కుకున్న అఫ్గానిస్తాన్ నుంచి తమ పౌరులు, భాగస్వాముల తరలింపును భారత ప్రభుత్వం వేగవంతం చేసింది. ఆదివారం మూడు వేర్వేరు విమానాల్లో 392 మందిని వెనక్కి తీసుకొచ్చింది. వీరిలో ఇద్దరు అఫ్గానిస్తాన్ చట్టసభ సభ్యులు సైతం ఉండడం విశేషం. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు(ఐఏఎఫ్) చెందిన సి–17 సైనిక రవాణా విమానంలో కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ సమీపంలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు తరలించిన మొదటి బృందంలో 168 మంది ఉన్నారు. వీరిలో 107 మంది భారతీయులు కాగా, 23 మంది అఫ్గాన్ సిక్కులు, హిందువులు. 87 మందిని శనివారం కాబూల్ నుంచి తజికిస్తాన్ రాజధాని దుషాన్‌బెకు చేర్చగా, వారిని ఆదివారం ఏఐ 1956 ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌లో భారత్‌కు తరలించారు. వీరిలో ఇద్దరు నేపాల్ జాతీయులు ఉన్నారు. ఇక మరో 135 మందికిపైగా భారతీయులను కొద్ది రోజుల క్రితం అమెరికా, నాటో విమానాల్లో ఖతార్ రాజధాని దోహాకు తరలించారు. వారందరినీ ఇప్పుడు ప్రత్యేక విమానంలో దోహా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. కాబూల్ నుంచి తరలించిన వారిలో ఇద్దరు అఫ్గాన్ చట్టసభ సభ్యులు అనార్కలీ హోనర్యార్, నరేంద్రసింగ్ ఖల్సా, వారి కుటుంబ సభ్యులు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కష్టకాలంలో అండగా నిలుస్తున్న భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటిదాకా 590 మంది.. భారత ప్రభుత్వం అఫ్గాన్ నుంచి తమ పౌరుల తరలింపు ప్రక్రియను ఆగస్టు 16న ప్రారంభించింది. ఇప్పటిదాకా దాదాపు 590 మందిని వెనక్కి తీసుకొచ్చింది. అమెరికాతోపాటు ఇతర మిత్రదేశాల సహకారం, సమన్వయంతో భారత్ ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తోంది. సోమవారం కూడా మరో బృందం భారత్‌కు చేరుకోనున్నట్లు తెలిసింది. ఇండియా వీసాలున్న అఫ్గాన్ పౌరులు కాబూల్ ఎయిర్‌పోర్టుకు చేరుకోకుండా తాలిబన్లు అడ్డంకులు సృష్టిస్తున్నారు. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరోధిస్తున్నారు. -
అఫ్గాన్ నుంచి పాఠాలు నేర్చుకోండి
శ్రీనగర్: అఫ్గానిస్తాన్ పరిణామాల నుంచి భారత ప్రభుత్వం ఇప్పటికైనా పాఠాలు నేర్చుకోవాలని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ హితవు పలికారు. శనివారం కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో పార్టీ కార్యకర్తల భేటీలో ఆమె మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌లోని భాగస్వామ్య పక్షాలతో కేంద్రం చర్చలు జరపాలని, 2019లో రద్దు చేసిన ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అఫ్గాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడాన్ని ప్రస్తావిస్తూ తమను పరీక్షించవద్దంటూ పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పొరుగు దేశంలో ఏం జరిగిందో చూడండి, పరిస్థితిని అర్థం చేసుకొని చక్కదిద్దండి అని సూచించారు. సూపర్ పవర్ అమెరికా తట్టాబుట్టా సర్దుకొని అఫ్గాన్ నుంచి తోక ముడిచిందన్నారు. కశ్మీర్లో చర్చల ప్రక్రియ ప్రారంభించడానికి భారత ప్రభుత్వానికి ఇప్పటికీ అవకాశం ఉందని చెప్పారు. ఆమె వ్యాఖ్యలపై జమ్మూకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ పట్ల మెహబూబాకు దురభిప్రాయం ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. -
కేంద్ర ప్రభుత్వ తీరుపై ఏపీ హైకోర్టు సీరియస్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది. ఉపాధి హామీ నిధుల చెల్లింపుల అంశంపై మంగళవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. 2014 నుంచి 2019 వరకు చెల్లింపులకు సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని గతంలో కేంద్రానికి హైకోర్టు ఆదేశింది. ఈ క్రమంలో కేంద్రం ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారంరోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈనెల 17లోపు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అఫిడవిట్ దాఖలు చేయకపోతే బాధ్యులకు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హైకోర్టు హెచ్చరించింది. -
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదన్న కేంద్రం
సాక్షి, న్యూ ఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీలు సజ్దా అహ్మద్ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రం పేర్కొంది. అదే విధంగా ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, భాగస్వాముల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపింది. -
రూ. 5,000 కోట్లతో భారీ సోలార్ పీవీ ప్లాంట్
న్యూఢిల్లీ: ఫస్ట్ సోలార్ ఐఎన్‌సీ 684 మిలియన్ డాలర్లతో (సుమారు రూ.5,000 కోట్లు) భారత్‌లో సమగ్ర ఫోటోవోల్టిక్ (పీవీ) థిన్ ఫిల్మ్ సోలార్ మాడ్యూళ్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రణాళికతో ఉన్నట్టు ప్రకటించింది. తమకు ప్రోత్సాహకరమైన రాయితీలతో కూడిన అనుమతి భారత ప్రభుత్వం నుంచి లభించినట్టయితే.. ఈ సమగ్ర పీవీ తయారీ కేంద్రం 2023 రెండో అర్థభాగంలో కార్యకలాపాలు ప్రారంభించే వీలుంటుందని తెలిపింది. తమిళనాడులో ఏర్పాటు కానున్న ఈ కేంద్రంతో 1,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభిస్తుందని అంచనా. ఆకర్షణీయమైన మార్కెట్ ‘‘ఫస్ట్ సోలార్కు భారత్ ఆకర్షణీయమైన మార్కెట్. వేడి, తేమతో కూడిన వాతావరణం మా మాడ్యూల్ సాంకేతికతకు అనుకూలంగా ఉంటుంది. భారత్ సహజసిద్ధంగా సుస్థిరమైన మార్కెట్. అభివృద్ధి చెందుతున్న దేశం కావడంతో ఇంధనానికి డిమాండ్ ఉంది. ఏటా 25 గిగావాట్ల సోలార్ ఇంధనాన్ని వచ్చే తొమ్మిదేళ్లలో సాధించాలన్న స్పష్టమైన లక్ష్యంతో ఉంది. మా ప్రతిపాదిత తయారీ కేంద్రం 3.3 గిగావాట్ల సామర్థ్యంతో ఉంటుంది’’ అని ఫస్ట్ సోలార్ సీఈవో మార్క్‌విడ్‌మార్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పది అతిపెద్ద సోలార్ పీవీ తయారీ కంపెనీల్లో ఒకటైన ఫస్ట్ సోలార్ మిగిలిన వాటికి భిన్నమైన టెక్నాలజీని అమలు చేస్తుండడం గమన్హాం. -
కరోనాపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను తాజాగా పొడిగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టినా మరికొన్నాళ్లు ఈ మార్గదర్శకాలు పాటించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు గైడ్‌లైన్స్‌ను మరికొన్నాళ్లు పొడిగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 31వ తేదీ వరకు మార్గదర్శకాలను పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. కేసులు తగ్గుతున్నాయని ఆత్మ సంతృప్తి చెందవద్దని ఈ సందర్భంగా హెచ్చరించింది. కొన్ని రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల, ఆర్ ఫ్యాక్టర్ అధికంగా ఉండడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. పండుగల నేపథ్యంలో రద్దీ ప్రాంతాల్లో ప్రజలు కరోనా మార్గదర్శకాలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది. స్థానికంగా కరోనా పరిస్థితులకు అనుగుణంగా ఆంక్షల సడలింపులపై నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కరోనా నియంత్రణకు పంచ వ్యూహం సిద్ధం చేసింది. టెస్ట్.. ట్రాక్.. ట్రీట్.. టీకా.. కరోనాగా పేర్కొంది. మార్గదర్శకాలకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు పంపారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో కేంద్రం అఫిడవిట్
సాక్షి, అమరావతి: విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం తన అఫిడవిట్లో పలు కీలక అంశాలను పొందుపరిచింది. స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగులకు రాజ్యాంగ భద్రత ఉందనేది సరికాదని, అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తామని పేర్కొంది. ఉద్యోగులు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దనడం సరికాదని తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ నిర్ణయం తీసుకుందని, స్టీల్‌ప్లాంట్‌ను 100శాతం ప్రైవేటీకరణ చేస్తామని అఫిడవిట్లో చెప్పింది. ఇప్పటికే బిడ్డింగ్‌లు ఆహ్వానించామని పేర్కొంది. అదే విధంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై పిల్ వేసిన జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎన్నికల్లో పోటీచేశారని, రాజకీయ లబ్ధి కోసమే ఆయన పిటిషన్ వేశారని తెలిపింది. ఈ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని కేంద్రం ప్రభుత్వం ఏపీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
లేపాక్షి ఆలయానికి కేంద్ర గుర్తింపు
-
పెగసస్‌పై ఐరాస దర్యాప్తు జరపాలి: పాక్
ఇస్లామాబాద్: భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. ఈ మేరకు పాకిస్తాన్ ఫారిన్ ఆఫీసు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సొంత పౌరులతోపాటు విదేశీయులపైనా భారత ప్రభుత్వం›గూఢచర్యం చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నట్లు వెల్లడించింది. భారత ప్రభుత్వం నిఘా పెట్టిన వారి జాబితాలో తమ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం ఉండడం తీవ్ర ఆందోళనకరమైన విషయమని పేర్కొంది. భారత్ ఒక బాధ్యతాయుతమైన దేశంగా వ్యవహరించాలని, ఈ విషయంలో అంతర్జాతీయ నిబంధనలన పాటించాలని పాకిస్తాన్ విదేశాంగ శాఖ తెలిపింది. చట్టవిరుద్ధ గూఢచర్యానికి స్వస్తి పలకాలంది. ‘పెగసస్’పై ఇజ్రాయెల్‌లో కమిటీ ఏర్పాటు జెరూసలేం: భారత్‌లో పెగసస్ స్పైవేర్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ నుంచి భారత ప్రభుత్వం ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసి, ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా కోసం ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. నిఘా సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గు తేల్చడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం పెగసస్ స్పైవేర్ లైసెన్సుల ప్రక్రియను సమీక్షించే పనికి ఈ కమిటీకి అప్పగిస్తామన్న సంకేతాలను ఇజ్రాయెల్ సర్కారు ఇచ్చింది. కమిటీ నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్ఎస్ఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ షాలెవ్ హులియో స్వాగతించారు. -
ఇద్దరి హక్కులకూ భద్రత
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి జలాలపై రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించేలా బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని స్వాగతిస్తూనే అందులో కొన్ని అంశాలపై సవరణలను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు దక్కిన 512, తెలంగాణకు దక్కిన 299 టీఎంసీలను పంపిణీ చేయడంపైనే కృష్ణా బోర్డు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించేలా చూడాలని విజ్ఞప్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి, ఎడమ కాలువ ఆయకట్టుకు గోదావరి వరద జలాలను మళ్లించగా.. అక్కడ మిగిలే కృష్ణా నీటిని తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు మళ్లించుకునే స్వేచ్ఛ కల్పించడం ద్వారా ఆ ప్రాంతాల సాగు, తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి మార్గం సుగమం చేయాలని కేంద్రాన్ని కోరాలని భావిస్తోంది. విభజన చట్టం 11వ షెడ్యూల్లో అప్పటికే నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగుగంగ, గాలేరు–నగరి, వెలిగొండ, హంద్రీ–నీవా, తెలంగాణలోని నెట్టెంపాడు (22 టీఎంసీలు), కల్వకుర్తి (25 టీఎంసీలు) కేంద్రం అనుమతి ఇచ్చిందని.. ఇప్పుడు వాటికి ఆర్నెళ్లలోగా మళ్లీ అనుమతి తీసుకోవాలంటూ విధించిన నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరనుంది. విభజన చట్టం ద్వారా ఆ ప్రాజెక్టులకు కల్పించిన రక్షణను కొనసాగించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని గుర్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బోర్డులను ఏర్పాటు చేసిన ఏడేళ్ల తర్వాత వాటి పరిధిని ఖరారు చేయడాన్ని స్వాగతిస్తూనే కొన్ని మార్పులు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తుంగభద్ర బోర్డు పరిధిలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీ.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ), దిగువ ప్రధాన కాలువ (ఎల్లెల్సీ) ఇప్పటికే తుంగభద్ర బోర్డు పరిధిలో ఉన్నాయి. తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా హెచ్చెల్సీకి కేటాయించిన 32.5, ఎల్లెల్సీకి కేటాయించిన 29.5 టీఎంసీలను దామాషా పద్ధతిలో తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తోంది. వాటికి తుంగభద్ర జలాశయంలో నీటిని విడుదల చేసినప్పుడు రాష్ట్ర సరిహద్దులోనూ టెలీమీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు లెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో హెచ్చెల్సీ, ఎల్లెల్సీలను మళ్లీ కృష్ణా బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని, వాటిని పరిధి నుంచి తప్పించాలని కేంద్రానికి వి/æ్ఞప్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద లెక్కిస్తే చాలు.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తారు. ఈ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే ప్రాంతమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని కేటాయించిన నీటిని విడుదల చేసేటప్పుడు టెలీమీటర్ల ద్వారా లెక్కిస్తే సరిపోతుంది. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన ఉన్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, నిప్పులవాగు ఎస్కేప్ ఛానల్, వెలిగోడు రిజర్వాయర్, తెలుగుగంగ లింక్ కెనాల్, ఎస్సార్బీసీ నుంచి అవుకు రిజర్వాయర్ వరకు కాలువల వ్యవస్థలను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని అక్కడ నీటిని లెక్కించాల్సిన అవసరం లేదని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల బోర్డుకు భారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తున్నారు. అందువల్ల పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వరకే కృష్ణా బోర్డు పరిధిని పరిమితం చేసేలా కేంద్రానికి సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టులకు అనుమతి లేదంటే ఎలా? వెంకటనగరం ఎత్తిపోతల 2006 నాటికే పూర్తయిందని, తెలుగుగంగ ఆయకట్టును స్థిరీకరించడానికి చేపట్టిన సిద్ధాపురం ఎత్తిపోతల, ఎల్లెల్సీ ఆయకట్టు స్థిరీకరణకు చేపట్టిన గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం 2008 నాటికే పూర్తైందని, ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ఆ ప్రాజెక్టులకు అనుమతి లేదనడం సరి కాదని కేంద్రానికి వివరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే పూర్తై ఆయకట్టుకు నీళ్లందిస్తున్న ప్రాజెక్టులకు ఆర్నెళ్లలోగా అనుమతి తీసుకోవాలనే నిబంధనను ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రతిపాదించనుంది. ఎగువ రాష్ట్రాలతో సంబంధం లేని ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి ఎందుకు? కృష్ణా డెల్టాకు నీళ్లందించే ప్రకాశం బ్యారేజీ, గోదావరి డెల్టాకు నీళ్లందించే ధవళేశ్వరం బ్యారేజీ, పోలవరం, పోలవరం దిగువన తొర్రిగడ్డ పంపింగ్ స్కీం, వెంకటనగరం ఎత్తిపోతల, పుష్కర, పురుషోత్తపట్నం, తాడిపూడి, పట్టిసీమ, చింతలపూడి ఎత్తిపోతల వల్ల ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలకు ఎలాంటి విఘాతం కలగదని నీటిపారుదలరంగ నిపుణులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వాటిని కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిలోకి తేవడం వల్ల అదనపు భారం మినహా ఎలాంటి ప్రయోజనం ఉండదని పేర్కొంటున్నారు. ఈ దృష్ట్యా వాటిని బోర్డుల పరిధి నుంచి తప్పించాలని కేంద్రానికి ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి తీసుకుంటే సరి.. గోదావరి పరీవాహక ప్రాంతం(బేసిన్)లో ఉమ్మడి ప్రాజెక్టులు ఏవీ లేవు. కానీ.. కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లు ఉమ్మడి ప్రాజెక్టులు. జూరాల, పులిచింతల ఉమ్మడి ప్రయోజనాలతో ముడిపడిన ప్రాజెక్టులు. ఇందులో శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల స్పిల్ వేలు, వాటికి అనుబంధంగా ఉన్న విద్యుదుత్పత్తి కేంద్రాలు, వాటిపై ఆధారపడ్డ ఆయకట్టుకు నీటిని విడుదల చేసే ప్రధాన ప్రాంతాలు(ఇన్‌టేక్‌లు), ఎత్తిపోతల పథకాల పంప్‌హౌస్‌లను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకుని నీటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, పులిచింతలలో విద్యుదుత్పత్తి కేంద్రాన్ని బోర్డు పరిధిలోకి తీసుకుని నిర్వహిస్తే సరిపోతుందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల బోర్డుపై అదనపు భారం తగ్గుతుందని పేర్కొంటున్నారు. బోర్డుల పరిధి విస్తృతమైతే వాటి పరిధిలోని ప్రాజెక్టులు, కాలువల వ్యవస్థ నిర్వహణకు భారీ ఎత్తున వ్యయం అవుతుందని, దీనివల్ల రెండు రాష్ట్రాలపైనా ఆర్థికంగా తీవ్ర భారం పడుతుందని విశ్లేషిస్తున్నారు. నీటి లభ్యత ఆధారంగా దామాషాలో పంపిణీ.. రెండు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో నీటి లభ్యత బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన మేరకు 811 టీఎంసీలు ఉంటే 66 : 34 నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయాలని, ఒకవేళ వర్షాభావంతో లభ్యత తగ్గితే అదే నిష్పత్తిలో దామాషా పద్ధతిలో నీటి పంపిణీ చేసేలా కృష్ణా బోర్డుకు నిర్దేశించాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమైంది. 2019–20, 2020–21 తరహాలోనే బేసిన్లో భారీ ఎత్తున వరద వస్తే.. శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేసి వరద జలాలు సముద్రంలో కలిసే సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎవరు ఏ స్థాయిలో నీటిని మళ్లించుకున్నా వాటిని పరిగణలోకి తీసుకోకూడదని వి/æ్ఞప్తి చేయనుంది. తద్వారా దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలని కోరనుంది. -
జల వివాదం: పర్మిషన్ లేకుంటే ప్రాజెక్టుల మూత!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి జలాలను వినియోగించుకుంటూ తెలంగాణ, ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలని బోర్డుల పరిధిపై వెలువరించిన గెజిట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లో ప్రస్తావించినంత మాత్రాన అనుమతి లేని ప్రాజెక్టులను ఆమోదించినట్టు కాదని పేర్కొంది. ఆరు నెలల్లోగా అనుమతి తీసుకోవడంలో విఫలమైతే ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టాల్సి ఉంటుందని.. అవి పూర్తయినా కూడా నీటి వినియోగించుకోవడానికి వీల్లేదని హెచ్చరించింది. గెజిట్‌లో పేర్కొన్న మేరకు అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులివే కృష్ణా నదిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) ఎస్ఎల్బీసీ సామర్థ్యం మరో పది టీఎంసీలు పెంపు కల్వకుర్తి ఎత్తిపోతల కల్వకుర్తి ఎత్తిపోతల సామర్థ్యం అదనంగా 15 టీఎంసీలు పెంపు పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ డిండి ఎత్తిపోతల ఎలిమినేటి మాధవరెడ్డి లిఫ్టు భక్త రామదాస ఎత్తిపోతల తుమ్మిళ్ల ఎత్తిపోతల నెట్టెంపాడు ఎత్తిపోతల నెట్టెంపాడు సామర్థ్యం అదనంగా 3.4 టీఎంసీలు పెంపు దేవాదుల లిఫ్టు ద్వారా గోదావరి జలాలు కృష్ణా బేసిన్‌కు మళ్లించే ప్రాజెక్టు (వీటిలో కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలను విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించింది) కృష్ణానదిపై ఏపీ చేపట్టిన ప్రాజెక్టులు తెలుగు గంగ వెలిగొండ హంద్రీ-నీవా గాలేరు-నగరి ముచ్చుమర్రి ఎత్తిపోతల సిద్ధాపురం ఎత్తిపోతల గురు రాఘవేంద్ర (ఇందులో మొదటి నాలుగింటిని విభజన చట్టం 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించింది) ఉమ్మడిగా చేపట్టిన ప్రాజెక్టు మున్నేరు పునర్ నిర్మాణం గోదావరిపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు కంతనపల్లి బ్యారేజీ కాళేశ్వరంలో అదనపు టీఎంసీ పనులు రామప్ప- పాకాల మళ్లింపు తుపాకులగూడెం బ్యారేజీ మోదికుంటవాగు ప్రాజెక్టు చౌట్పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతల కందుకుర్తి ఎత్తిపోతల బీఆర్ అంబేడ్కర్ ప్రాణహిత గూడెం ఎత్తిపోతల ముక్తేశ్వర్ ఎత్తిపోతల సీతారామ ఎత్తిపోతల (రాజీవ్ దుమ్ముగూడెం) పట్టిసీమ ఎత్తిపోతల పురుషోత్తపట్నం ఎత్తిపోతల చింతలపూడి ఎత్తిపోతల వెంకటనగరం ఎత్తిపోతల -
కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను పున: ప్రారంభించండి: డీఎస్‌జీఎంసీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను పున: ప్రారంభించాలని ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనెజ్మెంట్ కమిటీ(డీఎస్‌జీఎంసీ) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. గత ఏడాది మార్చి నెలలో కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ కారిడార్‌ను మూసివేశారు. అయితే తాజాగా దేశంలో కరోనా నియంత్రణలోకి వస్తున్న సమయంలో మళ్లీ తిరిగి కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను ప్రారంభించాలని కోరారు. దేశంలోని పలు రాష్ట్రాలు కరోనా నియంత్రణ కోసం విధించిన లాక్డౌన్ నిబంధనలు తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కర్తార్‌పూర్ కారిడార్‌ను తిరిగి ప్రారంభించాలని కోరుతున్నట్లు డీఎస్‌జీఎంసీ అధ్యక్షుడు మంజిందర్ సింగ్ సిర్సా తెలిపారు. ఇక ఈ కారిడార్‌ను నవంబర్, 2019న గురునానాక్ దేవ్ 550 జయంతి సందర్భంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే కరోనా మహామ్మరి కారణంగా గత ఏడాది మార్చి నుంచి మూసివేశారు. ఈ కారిడార్ పార్రంభానికి ముందు భారత్‌లోని సిక్కు భక్తులు పంజాబ్‌లోని డేరాబాబా నానక్ అంతర్జాతీయ సరిహద్దు వద్ద గురుద్వారా కార్తాపూర్ సాహిబ్‌ను బైనాక్యులర్ల ద్వారా దర్శించుకునేవారు. అయితే ప్రస్తుతం బైనాక్యులర్లు సదుపాయం కూడా లేదని మంజింద్ సింగ్ తెలిపారు. సిక్కు మత వ్యవస్థాకులు గురు నానక్ దేవ్ ఆయన జీవితంలో చివరి18 ఏళ్లు పాకిస్తాన్ నారోవల్ జిల్లాలోని గురుద్వారాలో గడిపారు. ఈ కారిడార్ ద్వారా సిక్కు మత భక్తులు వీసా లేకుండానే పాకిస్తాన్‌లోని గురుద్వారాను సందర్శించుకుంటున్న విషయం తెలిసిందే. -
డిసెంబర్‌కు టీకాలు కష్టమే!
సాక్షి, హైదరాబాద్: సమయం లేదు మిత్రమా.. శరణమా... రణమా? తేల్చుకోవాల్సిన తరుణమిదే!! ఊహూ.. కొన్నేళ్ల క్రితం నాటి సినిమా డైలాగ్ ఏమాత్రం కాదిది. కోవిడ్‌పై పోరులో అత్యంత కీలకమైన వ్యాక్సిన్ల విషయంలో నిర్ణయాత్మకంగా వ్యవహరించాల్సిన సమయం ఇదని చెప్పే ప్రయత్నం మాత్రమే. రెండో దశ కరోనా శాంతిస్తున్న ఈ తరుణంలో ఇంకో దఫా ఆ మహమ్మారి విరుచుకుపడేలోపు అందరినీ వ్యాక్సిన్ రక్షణ ఛత్రంలోకి తీసుకురావాల్సిందే. కానీ.. భారత్ ఆ పని చేయగలదా? ప్రభుత్వం లక్ష్యించినట్టుగా ఈ ఏడాది చివరికల్లా అరు ్హలైన వారందరికీ వ్యాక్సిన్లు అందివ్వగలమా? అసలు సమస్య ఎక్కడుంది? పరిష్కారానికి జరుగుతున్న ప్రయత్నాలేమిటి? కరోనా మహమ్మారి మానవాళిని కబళించడం మొదలై 18 నెలలు దాటింది. అనూహ్యమైన ఈ విపత్తును ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు అతితక్కువ కాలంలోనే వ్యాక్సిన్ అస్త్రాన్ని సిద్ధం చేశారు కూడా. కానీ.. ఈ ఏడాది జనవరిలో మొదలైన టీకా కార్యక్రమం ఐదు నెలలు గడుస్తున్నా నత్తనడకనే సాగుతోంది. డాక్టర్ వి.కె.పాల్ నేతృత్వంలోని కమిటీ 2021 జూలై నాటికల్లా 30 కోట్ల మందికి టీకాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరోగ్య సమస్యలు ఉన్న వారు, యాభై ఏళ్ల పైబడ్డవారు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు ఇందులో ఉన్నారు. కానీ.. జూన్ ఐదవ తేదీ నాటికి ప్రభుత్వ గణాంకాల ప్రకారమే ఈ వర్గాల వారిలో కేవలం 19.5 కోట్ల మందికి మాత్రమే టీకాలందాయి. ఉత్పత్తి సమస్యలు ఒకవైపు.. విధానపరమైన లోపాలు ఇంకోవైపు చుట్టుముట్టి లక్ష్య సాధన ఇంకాస్త దూరం అనేలా చేస్తున్నాయి. జనవరి పదహారో తేదీన దేశంలో టీకా కార్యక్రమం మొదలు కాగా.. ముందుగా ఊహించినట్లు తొలినాళ్లలో కొంత స్తబ్ధత ఏర్పడింది. టీకా వేసుకుంటే ఏమవుతుందో? అన్న ఆందోళన, చూద్దాం ఏమవుతుందో అన్న నిరాసక్తత దీనికి కారణమయ్యాయి. అయితే మార్చి రెండవ వారానికి దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ ఎక్కువవడం మొదలు కావడంతో టీకా కార్యక్రమానికి కొంత ఊపు వచ్చింది. దీంతో ఏప్రిల్ నెలలో ఒకట్రెండు రోజులపాటు 36 లక్షల టీకాలు ఇవ్వడం సాధ్యమైంది. కానీ.. ఆ తరువాత ఇది గణనీయంగా తగ్గిపోతూ వచ్చింది. ఏప్రిల్ నెలతో పోలిస్తే మే నెలలో ఇది 34 శాతం వరకూ పడిపోయింది. ఏప్రిల్‌లో సగటున రోజుకు 28.5 లక్షల మందికి టీకాలివ్వగా మే నెలలో ఇది 18.7 లక్షలకు పడిపోయింది. ఆగస్టు నుంచి మొదలై డిసెంబర్ నాటికి 216 కోట్ల టీకాలు అందుబాటులోకి వస్తాయని, వాటితో లక్ష్యాన్ని సాధిస్తామని ప్రభుత్వం చెబుతున్నా పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఆరు రెట్లు ఎక్కువైతేనే... ఈ ఏడాది డిసెంబర్‌కల్లా దేశంలో అర్హులైన వారందరికీ రక్షణ కల్పించాలంటే.. టీకా కార్యక్రమం వేగం ఆరు రెట్లు పెరగాలి అని నిపుణులు చెబుతున్నారు. మే నెలలో కేవలం 5.8 కోట్ల మందికి టీకాలివ్వడం సాధ్యమైందని, జూన్ నుంచి నెలకు 36 కోట్ల మందికి టీకాలిస్తేనే డిసెంబర్‌కల్లా అర్హులైన అందరికీ రెండు డోసుల టీకాలివ్వడం పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకూ 23 కోట్ల మందికి టీకాలిచ్చినా.. ఇందులో రెండు డోసులు పూర్తి చేసుకున్న వారి సంఖ్య చాలా తక్కువన్నది తెలిసిందే. ఆగస్టు – డిసెంబరు మధ్యకాలంలో 216 కోట్ల డోసులు సేకరించగలమన్న ప్రభుత్వ ప్రకటన కూడా ఆచరణలో అసాధ్యంగానే కనిపిస్తోంది. భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్లు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు కోవాగ్జిన్ తయారీ టెక్నాలజీని ఇతర కంపెనీలకు అప్పగించినా ఈ అంకెను చేరుకోవడం కష్టమే. ఈ రెండు కంపెనీలు కాకుండా.. కేంద్రం బయలాజికల్ ఈ నుంచి కార్డివాక్స్ టీకాలు 30 కోట్లు సేకరిస్తామని ప్రకటించగా.. ఈ టీకా ప్రస్తుతం ప్రయోగాల దశలోనే ఉండటం గమనార్హం. అలాగే జైడస్ క్యాడిల్లా కంపెనీ నుంచి 50 లక్షల టీకాలు సేకరించాలి. కానీ ఈ జై–కోవ్డీ టీకాకు అనుమతులు ఇంకా లభించాల్సి ఉంది. ఫైజర్ ఈ ఏడాది చివరికల్లా 5 కోట్ల డోసులు మాత్రమే ఇవ్వగలమని చెప్పింది. వచ్చే ఏడాది మొదట్లోనే తాము భారత్‌కు టీకాలు సరఫరా చేయగలమని మోడెర్నా స్పష్టం చేసింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేయనున్న నోవావ్యాక్స్, రష్యా తయారీ స్పుత్నిక్‌లను పరిగణలోకి తీసుకున్నా ఏడాది చివరికల్లా అవసరమైనన్ని టీకాలు ఉత్పత్తి కావడం కష్టసాధ్యమే. ప్రభుత్వ అంచనాల ప్రకారం జూన్‌లో టీకాల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతున్నా అది రోజుకు 40 లక్షల వరకూ మాత్రమే ఉండటం గమనార్హం. 4 రెట్ల వేగంతో 70 శాతం అర్హులైన వారిలో 70% మందికి డిసెంబర్‌లోగా రెండు డోసుల టీకాలు ఇవ్వాలన్నా టీకా కార్యక్రమం వేగం కనీసం నాలుగు రెట్లు ఎక్కువ కావాలి. ఎక్కువ జనాభా ఉన్న యూపీ, బిహార్ వంటి రాష్ట్రాల్లో ప్రస్తుతం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ వేగంతో టీకాలిస్తేనే సాధ్యం. యూపీలో ప్రస్తుతం రోజుకు లక్షన్నర టీకాలు ఇస్తున్నారు. రోజుకు 14 లక్షల టీకాలు ఇస్తేగానీ లక్ష్యాన్ని చేరుకోలేము. తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో 18 ఏళ్ల పైబడ్డ వారు ఎక్కువగా ఉన్న విషయం ప్రస్తావనార్హం. దేశం మొత్తానికి సంబంధించి ఒక సమగ్రమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళిక లేని నేపథ్యంలో టీకా కార్యక్రమం ఆలస్యమవుతోందనే అభిప్రాయం నిపుణుల్లో వ్యక్తమవుతోంది. -
కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ అపోహలపై కేంద్రం వివరణ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాపంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. అయితే కరోనా వ్యాక్సిన్ ప్రక్రియపై రకరకాల అపోహలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రక్రియ అపోహలపై కేంద్రం వివరణ విడుదల చేసింది. విదేశాల నుంచి వ్యాక్సిన్ల దిగుమతుల కోసం కేంద్రం ప్రయత్నించడం లేదనే మాట నిజం కాదని తెలిపింది. ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థలతో ఇప్పటికే పలు దఫాలుగా సంప్రదింపులు, చర్చలు జరిగాయని పేర్కొంది. అంతర్జాతీయంగా కొనుగోళ్లు అంత సునాయాసమేమీ కాదని, అంతర్జాతీయంగా డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి లేకపోవడం వల్ల కంపెనీలు తమ ప్రాధాన్యత తాము నిర్ణయించుకున్నాయని చెప్పింది. రష్యాలోని స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కి క్లినికల్ ట్రయల్స్ అనుమతులు, దిగుమతులు వేగంగా జరిగాయని, అంతర్జాతీయ వ్యాక్సిన్ తయారీ సంస్థలను భారత్‌లో తయారుచేసి, ఇక్కడి మార్కెట్‌కు అందించి, ఆ తర్వాత ప్రపంచానికి ఎగుమతి చేయాల్సిందిగా కోరుతున్నామని వివరించింది. ఇతర దేశాల వ్యాక్సిన్లకు భారత్‌లో అనుమతి ఇవ్వలేదన్న వార్తలు కూడా నిజం కాదని అమెరికా, యూరోపియన్ యూనియన్, యూకే, జపాన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన వ్యాక్సిన్లకు భారత్‌లో అనుమతిస్తూ ఏప్రిల్‌లోనే ప్రకటన జారీ చేశామని గుర్తుచేసింది. దేశీయ ఉత్పత్తి సామర్థ్యం పెంచడంలోనూ కేంద్ర ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని, కోవాక్సిన్ నెలకు 1కోటి డోసుల ఉత్పత్తి సామర్థ్యం నుంచి అక్టోబర్ నాటికి 10 కోట్ల డోసుల ఉత్పత్తి సామర్థ్యానికి చేరుకుంటుందని తెలిపింది. కోవిషీల్డ్ నెలకు 6.5 కోట్ల డోసుల నుంచి 11కోట్ల డోసులకు పెరగనుందని, స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌ను డాక్టర్ రెడ్డీస్ సమన్వయంతో మరో 6 కంపెనీల్లో ఏకకాలంలో ఉత్పత్తి చేయనుందని పేర్కొంది. జైడస్ క్యాడిలా, బయోలాజికల్-ఈ, జెన్నోవా సంస్థల దేశీయ వ్యాక్సిన్లు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయని కేంద్రం వివరించింది. కంపల్సరీ లైసెన్సింగ్ అనేది సాధ్యపడే అంశం కాదు ఇందుకు అవసరమైన మానవ వనరుల తయారీ, శిక్షణ, బయోసేఫ్టీ ల్యాబొరేటరీలు వంటి అనేకాంశాలు ఇందులో మిళితమై ఉంటాయని, టెక్నాలజీ బదిలీ ద్వారా ఇప్పటికే భారత్ బయోటెక్ మరో 3 సంస్థలతో కలిసి కోవాక్సిన్ ఉత్పత్తి చేస్తోందని తెలిపింది. మోడెర్నా సంస్థ 2020లోనే తమ వ్యాక్సిన్లను ఇంకెవరు తయారు చేసినా కేసులు వేయబోమని చెప్పింది. అయినా ఇప్పటి వరకు ఎవరూ చేయలేకపోయారు. లైసెన్సింగ్‌తో మాత్రమే ఇది సాధ్యపడదని పేర్కొంది. వ్యాక్సిన్ల తయారీ అంత సులభమైన అంశమైతే అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఈ వ్యాక్సిన్ల కొరత ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించింది. మరికొన్ని అంశాలు: ► వ్యాక్సిన్ల సేకరణలో కేంద్రం బాధ్యతల నుంచి తప్పుకుని రాష్ట్రాలకు వదిలేయలేదు. ►రాష్ట్రాల అభ్యర్థన మేరకే వ్యాక్సిన్ల సేకరణ వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించాం. ►ప్రపంచంలో ఏ దేశంలోనూ చిన్నారులకు కోవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వడం లేదు. ►ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇప్పటి వరకు చిన్నారులకు వ్యాక్సినేషన్ విషయంలో ఎలాంటి సిఫార్సులు చేయలేదు. ►వాట్సాప్ గ్రూపుల్లో కొందరు రాజకీయ నాయకులు ప్రచారం చేసే ప్యానిక్ సమాచారం ఆధారంగా చిన్నారులకు వ్యాక్సినేషన్ అంశాన్ని నిర్ణయంచలేము. ►రాజకీయ నాయకులు రాజకీయమే చేయాలనుకుంటారు. వ్యాక్సినేషన్లపై నిర్ణయం తీసుకోవాల్సింది శాస్త్రవేత్తలు, నిపుణులు అని కేంద్రం గుర్తు చేసింది. చదవండి: CoronaVirus: మన కాక్టెయిల్ ట్రయల్స్‌కి పర్మిషన్ -
Reserve Bank Of India: కేంద్రానికి 99,122 కోట్ల డివిడెండ్
ముంబై: కఠిన ద్రవ్య పరిస్థితులతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న కేంద్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పెద్ద ఊరట నిచ్చింది. ఆర్థికవేత్తల అంచనాలకు మించి రూ.99,122 కోట్ల డివిడెండ్‌ను కేంద్రానికి ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. గవర్నర్ శక్తికాంత్‌దాస్ నేతృత్వంలో సమావేశమైన ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్, రూ.99,122 కోట్ల మిగులు (డివిడెండ్ చెల్లింపుగా దీనిని పిలుస్తారు)ను కేంద్రానికి బదలాయించాలని నిర్ణయించింది. మార్చి 31వ తేదీతో ముగిసిన తొమ్మిది నెలల ‘అకౌంటింగ్ కాలంలో’ మార్కెట్ ఆపరేషన్లు, పెట్టుబడుల వంటి కార్యాకలాపాల ద్వారా తాను పొందిన మొత్తంలో వ్యయాలుపోను మిగులును కేంద్రానికి ఆర్బీఐ బదలాయిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ అత్యధికంగా జరిపిన రూ.1.76 లక్షల కోట్ల బదలాయింపుల తర్వాత జరుపుతున్న భారీ మొత్తం ఇది. చదవండి: Policybazaar: నిబంధనల ఉల్లంఘన.. 25 లక్షలు ఫైన్ -
తప్పంతా మీదే.. ముందు చూపు లేకుండా వ్యాక్సినేషన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలకు టీకాలు అందించే విషయంలో ప్రభుత్వం ముందు చూపు లేకుండా వ్యవహరించడం వల్లనే వ్యాక్సిన్ల కొరత సమస్య ఎదురైందని సీరమ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేశ్ జాదవ్ ఆరోపించారు. హీల్‌హెల్త్ సంస్థ నిర్వహించిన సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. ‘కేంద్రం తొలుత మూడు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ వారియర్లకు వ్యాక్సిన్లు ఇవ్వాలని నిర్ణయించింది. దానికి తగ్గట్టే మేము ప్రభుత్వానికి 6 కోట్ల డోసుల టీకాలు సరఫరా చేశాం. ఆ తర్వాత మమ్మల్ని సంప్రదించకుండానే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్లు ఇస్తామని కేంద్రం ప్రకటించింది. కోవీషీల్డ్ వ్యాక్సిన్ల ఉత్పత్తి పరిమితమే అని తెలిసి కూడా 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు ఇవ్వడం మొదలుపెట్టారు. దీంతో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లకు... టీకాలు తీసుకుంటున్న జనాలకు మధ్య పొంతన లేకుండా పోయింది. దాని ఫలితమే నేడు టీకాల కొరతకు దారి తీసింది’ అన్నారు. గుణపాఠం ప్రస్తుతం ఎదుర్కొంటున్న వ్యాక్సిన్ల కొరత మనకో గుణపాఠం లాంటిందన్నారు సురేశ్ జాదవ్. ఉత్పత్తి సామర్థ్యం, నిల్వల ఆధారంగా వ్యాక్సినేషన్ చేయడం సరైన పద్దతని అన్నారు. దీని కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్నినియమాలు రూపొందించింది. వాటిని పాటించాలన్నారు. ఇక కరోనాను ఎదుర్కొవాలంటే టీకా ఒక్కటే పరిష్కారమని తెలిసి కూడా కొందరు వ్యాక్సినేషన్ చేయించుకోమంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటూ సందేహాలు వ్యక్తం చేస్తుంటారని సురేశ్ జాదవ్ విస్మయం వ్యక్తం చేశారు. -
పన్నులు తగ్గిస్తే.. పరిధి పైపైకి!
న్యూఢిల్లీ: బీమా పాలసీలపై పన్నుల భారాన్ని తగ్గిస్తే.. వాటి ధరలు అందుబాటులోకి వచ్చి మరింత మందికి చేరువ అవుతాయంటూ ఈ రంగం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. బడ్జెట్ ముందస్తు సూచనల్లో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ ముందు పలు డిమాండ్లను వినిపించింది. 2021–22 బడ్జెట్లో పన్ను రాయితీలను ప్రకటించాలని, దాంతో బీమా ప్లాన్లు మరింత ఆకర్షణీయంగా మారతాయని జీవిత బీమా పరిశ్రమ కోరింది. సెక్షన్ 80సీ కింద బీమా ఉత్పత్తులకు మరింత పన్ను మినహాయింపులను ప్రత్యేకించాలని.. దాంతో పన్ను ఆదా సాధనంగా వీటిని మరింత మంది కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారంటూ వివరించింది. జీవిత బీమా ప్రీమియం చెల్లింపులపై సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు ఉన్నాయి. ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.1.5లక్షల ఆదాయానికే పన్ను మినహాయింపు పొందగలరు. దీన్ని రూ.2లక్షలకు పెంచాలని లేదా బీమా ప్రీమియం చెల్లింపుల కోసం ప్రత్యేక ఉప పరిమితిని అయినా తీసుకురావాలంటూ ఈ పరిశ్రమ కోరింది. ప్రత్యేక విభాగం..: జీవిత బీమా పాలసీలకు చేసే చెల్లింపులపై పన్ను ప్రయోజనాల కోసం రానున్న బడ్జెట్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తారని భావిస్తున్నట్టు ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ సంజయ్ తివారీ తెలిపారు. మోటారు బీమా, టర్మ్, యూనిట్ లింక్డ్ (యులిప్) ప్లాన్లపై ప్రస్తుతం 18 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. ఎండోమెంట్ ప్లాన్లను సేవింగ్ సాధనంగా పరిగణిస్తూ వీటికి సంబంధించి మొదటి ఏడాది ప్రీమియంపై 4.5 శాతం, తర్వాతి సంవత్సరం నుంచి 2.25 శాతం జీఎస్టీని అమలు చేస్తున్నారు. సింగిల్ ప్రీమియం యాన్యుటీ ప్లాన్లపై జీఎస్టీ 1.8 శాతంగా ఉంది. ఎన్పీఎస్, బీమా ఉత్పత్తుల మధ్య పన్నుల పరంగా అంతరం ఉంది. దీంతో ఎన్‌పీఎస్‌తో పోల్చినప్పుడు పెన్షన్/యాన్యుటీ ప్లాన్ల విషయంలో ఒకే హోదా కల్పించాలని బీమా కంపెనీలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. సెక్షన్ 80సీ కింద రూ.1.5లక్షలకు అదనంగా.. సెక్షన్ 80సీసీడీ కింద ఎన్‌పీఎస్‌లో గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50వేల పెట్టుబడులపై పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంది. ఇదే విధమైన ప్రయోజనాలను బీమా కంపెనీలు ఆఫర్ చేస్తున్న రిటైర్మెంట్ ప్లాన్లపై అందించాలని కోరుతున్నట్టు ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్ ఎండీ, సీఈవో కామేష్రావు తెలిపారు. స్విస్ ఆర్ఈ డేటా ప్రకారం.. దేశంలో బీమా తలసరి ప్రీమియం 2019–20లో 78 డాలర్లు (రూ.5,850)గా ఉంటే, అంతర్జాతీయంగా ఇది 818 డాలర్లు (రూ.61,350)గా ఉంది. బీమా వ్యాప్తి (జీడీపీలో ప్రీమియం శాతం) 2019–20లో 3.76 శాతంగా ఉంది. జీవిత బీమా వ్యాప్తి దేశీయంగా 2.82 శాతంగా ఉంటే, అంతర్జాతీయ సగటు 3.55%. ఆరోగ్యరంగానికి కేటాయింపులు పెంచాలి.. ‘‘ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వం తన వ్యయాలను బడ్జెట్లో ప్రస్తుతమున్న 1.2% నుంచి కనీసం 2.5%కి అయినా వచ్చే మూడేళ్ల కాలంలో పెంచాల్సి ఉంది. ఇందులో అధిక భాగం నిధులను ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి, ఆధునికీకరణకు వినియోగించాలి. ఈ దిశగా 2021–22 బడ్జెట్ తొలి అడుగు వేస్తుందని ఆశిస్తున్నాము’’ అని మణిపాల్ హాస్పిటల్స్ ఎండీ, సీఈవో దిలీప్ జోస్ తెలిపారు. ఈ కామర్స్‌కీ చేయూత దేశంలో ఏటేటా భారీగా విస్తరిస్తున్న ఈ కామర్స్ రంగానికీ వచ్చే బడ్జెట్లో కేంద్రం ప్రోత్సాహకాలను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఈ కామర్స్ దిగుమతులు, ఎగుమతులకు ఒకే విడతలో పెద్ద ఎత్తున అనుమతులు ఇవ్వడం ఇందులో భాగంగా ఉండనుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘దేశంలో ఈ కామర్స్ రంగం (ఆన్లైన్ వేదికలపై విక్రయాలు నిర్వహించే సంస్థలు) ఎన్నో రెట్లు వద్ధి చెందింది. దీంతో భారీ మొత్తంలో దిగుమతులు చేసుకుంటూ.. తిరిగి భారత్ నుంచి ఎగుమతులు చేస్తుండడంతో నియంత్రణ, సదుపాయాల పరంగా సమతుల్యత అవసరం’ అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వ్యవసాయానికి భారీ రుణ సాయం! రూ.19లక్షల కోట్లకు పెంచే అవకాశం న్యూఢిల్లీ: దేశంలో రైతు ఆదాయాన్ని 2020 నాటికి రెట్టింపును చేయాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్ర సర్కారు.. ఇందు కోసం సాగు రంగానికి రుణ వితరణ (క్రెడిట్) లక్ష్యాన్ని రూ.19లక్షల కోట్లకు పెంచనుంది. ఫిబ్రవరి 1న తీసుకురానున్న బడ్జెట్లో ఈ మేరకు ప్రకటన ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయరంగానికి క్రెడిట్ లక్ష్యాన్ని కేంద్రం రూ.15లక్షల కోట్లుగా నిర్దేశించుకోగా.. దీంతో పోలిస్తే 35 శాతానికి పైగా పెరగనుంది. నిజానికి ఏటా సాగు రంగానికి రుణ లక్ష్యాన్ని కేంద్రం పెంచుతూ వస్తోంది. అంతేకాదు, నిర్దేశించుకున్న లక్ష్యాన్ని మించి రుణ వితరణ కూడా నమోదవుతోంది. 2017–18 సంవత్సరానికి రూ.10 లక్షల కోట్ల లక్ష్యాన్ని పెట్టుకోగా, రూ.11.68 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. అలాగే, 2016–17లోనూ రూ.9లక్షల కోట్ల లక్ష్యాన్ని మించి.. రూ.10.66 లక్షల కోట్లకు పెరిగింది. నామమాత్రపు వడ్డీ... వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలపై 9 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. దీనిపై కేంద్రం రాయితీలు ఇస్తోంది. 2 శాతం రాయితీపోగా 7 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తే చాలు. అది కూడా సకాలంలో రుణాలను తిరిగి చెల్లించేస్తే మరో 3 శాతాన్ని ప్రోత్సాహకంగా అందిస్తోంది. వెరసి నికర వడ్డీ రేటు 4 శాతమే అవుతోంది. -
ఇక 15 ఏళ్ల ప్రభుత్వ వాహనాలు తుక్కుతుక్కే!
న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ) చెందిన వాహనాలు 15 ఏళ్లు పైబడిన పక్షంలో వాటికి కూడా స్క్రాపేజీ (తుక్కు) విధానాన్ని అమలు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2022 ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయనుంది. దీనిపై త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ దీనికి ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. పర్యావరణ అనుకూల విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో 15 ఏళ్లు పైబడిన వాహనాలకు స్క్రాపేజీ విధానాన్ని అమల్లోకి తెచ్చేలా మోటార్ వాహనాల చట్టానికి సవరణలను 2019లో ప్రభుత్వం ప్రతిపాదించింది. -
రిటర్నుల దాఖలు; మరోసారి పొడిగింపు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలు గడువును మూడో విడత పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో 2019–20 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తులు తమ ఆదాయపన్ను రిటర్నులను (ఆడిట్ అవసరం లేనివారు) జనవరి 10 వరకు ఎటువంటి ఆలస్యపు రుసుము లేకుండా దాఖలు చేసుకోవచ్చు. తమ ఖాతాలను ఆడిట్ చేసుకోవాల్సిన వ్యక్తులకు, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల వివరాలను రిపోర్ట్ చేయాల్సిన వారు.. అలాగే, ఆడిట్ అవసరమున్న వ్యాపార సంస్థలు, కంపెనీలకు జనవరి 31 వరకు ఉన్న రిటర్నుల గడువును ఫిబ్రవరి 15 వరకు పొడిగించింది. ట్యాక్స్ ఆడిట్ నివేదికల సమర్పణకు జనవరి 15 వరకు తాజాగా అవకాశం కల్పించింది.(చదవండి: న్యూవిస్టాడోమ్ కోచ్‌తో మరుపురాని ప్రయాణం!) ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది. గతేడాదితో పోలిస్తే ఇప్పటి వరకు ఐటీఆర్‌ల దాఖలులో తగ్గుదల కనిపిస్తోంది. దీంతో మరికొంత గడువు ఇస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక వివాద్ సే విశ్వాస్ పథకం కింద డిక్లరేషన్ గడువును కూడా ప్రభుత్వం జనవరి 31 వరకు పొడిగించింది. అలాగే, 2019–20 ఆర్థిక సంవత్సరపు వార్షిక జీఎస్టీ రిటర్నుల గడువును రెండు నెలలు అంటే ఫిబ్రవరి 28 వరకు ప్రభుత్వం పొడిగించింది. కరోనా కారణంగా ఏర్పడిన సవాళ్ల కారణంగా నిబంధనలను పాటించేందుకు ఉన్న ఇబ్బందులను దృష్టిలోకి తీసుకుని గడువును పొడిగించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది -
‘ఫైజర్’ వ్యాక్సిన్ దిగుమతికి అన్ని ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారీని సమర్థంగా ఎదుర్కొనే ఫైజర్–బయోఎన్‌టెక్ వ్యాక్సిన్‌కు డిసెంబర్ 2వ తేదీన బ్రిటన్ ప్రభుత్వం అనుమతిచ్చింది. రెండోవారం నుంచి అక్కడి ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడం కూడా మొదలయింది. ఇప్పటి వరకు ఈ వ్యాక్సిన్‌కు అనుమతిచ్చిన ఏకైక దేశం బ్రిటన్. ఈ వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకునేందుకు భారత్ కూడా సన్నహాలు చేస్తోంది. అందుకుతగ్గ ఏర్పాట్లను కూడా చేసుకుపోతోంది. ఫైజర్ వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీస్ సెల్సియస్ వాతావరణంలో నిల్వ చేయాల్సి ఉండడంతో అందుకు తగిన విధంగా కార్గో విమానంలో, విమానాశ్రయంలో, అక్కడి నుంచి దేశంలోని నలుమూలలకు వ్యాక్సిన్‌ను తరలించేందుకు తగిన శీతల కంటేనర్లను, వాటిలో వచ్చే ఫైజర్ వ్యాక్సిన్ డోసులను నిల్వచేసే శీతల ల్యాబ్‌ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు దేశ వాణిజ్య రాజధాని ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాట్లు చకా చకా జరగిపోతున్నాయి. (చదవండి : ఆస్ట్రాజెనెకా సురక్షితం.. ప్రభావవంతం) వ్యాక్సిన్‌ను మైనస్ 70 డిగ్రీస్ సెల్సియస్ వాతావరణంలో భద్రపర్చడమంటే అంటార్కిటికలో శీతాకాలంలో ఉండే ఉష్ణోగ్రతకన్నా తక్కువలో భద్రపర్చడం. వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకొని భద్రపర్చడంతోపాటు, దాన్ని దేశం నలుమూలలకు రవాణా చేయడంతో ఈ శివాజీ విమానాశ్రయం కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటికే 30 వేల టన్నుల మందులను నిల్వచేసే శీతల గిడ్డంగులు కలిగి ఉండడం వల్లనే శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రం ఎంపిక చేసింది. సంవత్సరానికి మూడున్నర లక్షల టన్నుల మందులను హాండిల్ చేయగల సామర్థ్యం కలిగిన ‘ఎక్స్పోర్ట్ ఫార్మా ఎక్స్‌లెన్స్ సెంటర్’ నాలుగువేల చదరపు మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. మొత్తం ఆసియాలోనే అతిపెద్ద అతిశీతల కేంద్రం ఇదే. రెండు డిగ్రీల నుంచి ఎనిమిది డిగ్రీల లోపు ఉష్ణోగ్రత కలిగిన ‘కూల్‌టేనర్లు’ కూడా ఈ శీతల గిడ్డంగికి ఉన్నాయి. అవి కార్గో విమానంలో వచ్చే మందులను ఈ కూల్‌టేనర్లు శీతల గిడ్డంగికి తీసుకొస్తాయి. ప్రస్తుతం ఈ అతిశీతల గిడ్డంగిలో ఉన్న అన్ని ఔషధాలను వాటి గమ్యస్థానాలకు పంపించి, కోవిడ్ వ్యాక్సిన్లను భద్రపర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయమై త్వరలోనే ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు విమానాశ్రయం అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. ప్రభుత్వ సంస్థలు, కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీదారులు, వాటి రవాణాదారులు, ప్రభుత్వ మందుల నియంత్రణా యంత్రాంగం ప్రతినిధులు, దేశంలోని ఇతర విమానాశ్రయాల ప్రతినిధులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ అధికార ప్రతినిధి వివరించారు. కార్గో విమానాల్లో శీతల కంటేనర్ల ద్వారా వ్యాక్సిన్ డోస్‌లను తీసుకరావడం, వాటిని నేరుగా విమానాశ్రయంలోని అతిశీతల గిడ్డంగికి తరలించడం, అక్కడి నుంచి దేశంలోని నిర్దేశిత శీతల ల్యాబ్‌లు లేదా గిడ్డంగులకు తరలించడం, అక్కడి నుంచి వాటిని వైద్య సిబ్బందికి, వినియోగదారులకు చేరవేయడంలో ఎక్కడా ఆటంకాలు ఎదురుకాకుండా ఈ టాస్క్‌ఫోర్స్ చూసుకుంటుంది. ఒక్క వ్యాక్యంలో చెప్పాలంటే ఎక్కడా శీతోష్ణస్థితిలో మార్పులు రాకుండా చూసుకోవడంతోపాటు వ్యాక్సిన్ డోస్‌లను తయారుచేసే కంపెనీల నుంచి వాటిని వినియోగదారులకు చేరేవేసే వరకు అన్ని బాధ్యతలను ఈ టాస్క్‌ఫోర్స్ నిర్వహించాల్సి ఉంటుంది. టాస్క్‌ఫోర్స్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు విమానాశ్రయ అధికారులు కూడా ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారులకు అందజేసేందుకు 24 గంటలు పనిచేసే ‘కస్టమర్ సర్వీస్ సెంటర్’ను కూడా అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. -
విశ్వాస పునరుద్ధరణ కీలకం
సాగు రంగ సంస్కరణల కోసమంటూ కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు నిరసనగా జరుగుతున్న ఉద్యమం మంగళవారం నిర్వహించే దేశవ్యాప్త బంద్‌తో మరింత ఉధృతమయ్యే అవకాశంవుంది. ఈ చట్టాలు ఇప్పటికే రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. పంజాబ్‌లో చిరకాలంగా బీజేపీకి మిత్రపక్షంగా వుంటున్న అకాలీదళ్ ఎన్డీఏకు దూరమైంది. గత కొన్ని రోజులుగా రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రం సాగిస్తున్న చర్చలు ఇంకా ఒక కొలిక్కిరాలేదు. చట్టాల రద్దు తప్ప మరి దేనికీ అంగీకరించబోమని రైతు సంఘాలు అంటున్నాయి. బుధవారం కూడా చర్చలు కొనసాగుతాయి గనుక ఒక ఆమోదయోగ్యమైన పరిష్కారం కుదురుతుందని ఆశించాలి. ఆ సంగతలావుంచితే ఆందోళన తీవ్రత పెరగడానికి మొదటినుంచీ కేంద్రం అనుసరిస్తున్న వైఖరే కారణమని చెప్పాలి. రైతులతో నేరుగా ముందే చర్చించి వుంటే, ఆ సంస్కరణలవల్ల కలుగుతాయంటున్న లాభాల గురించి వారికి అవగాహన కలిగిస్తే ఆందోళన ఈ స్థాయిలో సాగేది కాదు. అయితే తాము చర్చించామన్నదే కేంద్రం జవాబు. కరోనా వైరస్ సమస్యవల్ల 90 లక్షలమందికిపైగా రైతులతో వెబినార్ల ద్వారా మాట్లాడామంటున్నది. తమనెవరూ ఆహ్వానించలేదని, చర్చించలేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఇక పార్లమెంటులో దాదాపు చర్చే జరగలేదు. బిల్లులకు చాలాముందే ఆర్డినెన్స్‌లు తీసుకురావడం, ఆ తర్వాత వాటి స్థానంలో తీసుకొచ్చిన బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందడంలాంటి కారణాలవల్ల రైతుల్లో సందేహాలు బలపడటానికి ఆస్కారం ఏర్పడింది. బిల్లుల్ని క్లాజులవారీగా క్షుణ్ణంగా చర్చించేలా సెలెక్ట్ కమిటీకి పంపివుంటే వేరుగా వుండేది. సాగు రంగంలో సంస్కరణలు అవసరమే అనుకున్నా వాటిని ఆదరా బాదరాగా తీసుకొస్తున్నారన్న అభిప్రాయం కలిగేలా ప్రవర్తించడం... రైతులపై బాష్పవాయుగోళాల, వాటర్ కేనన్ల ప్రయోగం సర్కారు తప్పిదం. దేశంలో ఏమూలనున్న రైతులైనా తమ దిగుబడులు ఎక్కడైనా అమ్ముకోవడానికి తాజా సంస్కరణలు అవకాశమిస్తున్నాయని, ఇందువల్ల మంచి ధర వచ్చినచోటే తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి వారికి వీలవుతుందని కేంద్రం వాదన. ఆ చట్టాల వల్ల లబ్ధిపొందామని చెబుతున్న రైతులతో ఒకటి, రెండు చానెళ్లు కార్యక్రమాలు కూడా రూపొందించాయి. అయితే రైతులకు మేలు కలిగే నిబంధనలున్నమాట వాస్తవమే అయినా, వాటికి తగిన రక్షణలు కల్పిం చకపోతే రైతులకు నష్టం కలుగుతుందని అకాలీదళ్ ఆర్డినెన్సుల జారీ సమయంలోనే తెలిపింది. వాటిని ఆపమని కోరింది. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) విషయంలో చట్టపరమైన రక్ష ణలుండాలని కోరింది. అయినా కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రెచ్చగొడుతున్నారని బీజేపీ చేస్తున్న ఆరోపణ నిజమే అనుకున్నా ఆర్డినెన్సులు రూపొందించే దశలోనే దాన్ని అంచనా వేసివుండాల్సింది. కేవలం వదంతులు, అపోహలతోనే ఇంత పెద్ద ఉద్యమం నడుస్తోందని ఇప్పుడు నమ్మించే ప్రయత్నం చేయడం వల్ల ఫలితం వుండదు. ఇప్పుడున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేయడం వల్ల దళారుల గుత్తాధిపత్యం పోతుందని, రైతులు తమకు మంచి ధర వచ్చినచోట అమ్ముకోవచ్చని చెప్పడం బాగానే వున్నా...అందుకు తగిన ప్రత్యామ్నాయ వ్యవస్థలను ఏర్పర్చకుండా రైతులకు ఒరిగేదేమీ వుండదు. అలాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలను తమ ఏలుబడిలోని హరియాణా వంటి ఒకటి రెండు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసి చూపించవలసింది. వాటివల్ల మంచి ఫలితాలొస్తే రైతులే ఆ సంస్కరణల్ని స్వాగతిస్తారు. అందుకు భిన్నంగా హడావుడి ప్రదర్శించడం ఎందుకు? మన దేశంలో మెజారిటీ రైతులు చిన్న కమతాల్లో వ్యవసాయం సాగిస్తున్నవారే. వారు తమ దిగుబడికి ఎక్కడో బ్రహ్మాండమైన ధర పలుకుతోందని తెలుసుకుని అక్కడికెళ్లి అమ్ముకోవడం కుదిరే పనికాదు. వాస్తవానికి అన్ని రాష్ట్రాల్లోనూ మండీ వ్యవస్థ ఒకేలా లేదు. పంజాబ్, హరియాణా వంటిచోట్ల అవి బలంగా పనిచేస్తున్నాయి. దానికితోడు ప్రభుత్వం ఏటా ప్రకటించే మద్దతు ధర, సేకరణ విధానం కారణంగా అక్కడ పండించే ఉత్పత్తులకు మంచి రేటు పలుకుతోంది. గోధుమలు క్వింటాలుకు రూ. 1,900 పలుకుతుంటే మండీల వ్యవస్థ సరిగాలేని బిహార్ వంటిచోట్ల అది రూ. 800 మాత్రమే. వరి, గోధుమ తప్ప ఇతర దిగుబడులకు మద్దతు ధర ప్రకటించినా ఆ రేటుకు వారు అమ్ముకునేది తక్కువే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో బక్క రైతులకు తోడ్పడే రైతుబంధు, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అయితే కరోనా కాలంలో రైతులు పంటలు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు ప్రభుత్వం రూ. 3,900 కోట్లు వెచ్చించి మొక్కజొన్న, కందులు, ఉలవలు, జొన్నలు, పొగాకు, అరటి తదితర పంటల్ని కొనుగోలు చేసింది. రైతు సంక్షేమానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నచోట రైతులు ఆందోళనకు దిగే అవసరం ఏర్పడదు. కారణాలేమైనా... కారకులెవరైనా ప్రభుత్వం, రైతుల మధ్య ఇప్పుడు పరస్పర విశ్వాసం సన్నగిల్లిందన్నదైతే వాస్తవం. దాన్ని ఏమేరకు పునరుద్ధరించుకోగలమన్న అంశంపై శ్రద్ధ పెట్టడానికి బదులు ఎప్పటిలాగే రైతుల ఆందోళనపై కూడా ఖలిస్తానీ వేర్పాటువాదం, అర్బన్ మావోయిస్టు వంటి ముద్రలేయడం వల్ల ప్రయోజనం వుండదు. ఇలాంటి ఉద్యమాలు జరుగుతున్నప్పుడు స్వప్రయోజనం కోసం చొరబడే శక్తులు ఎప్పుడూ వుంటాయి. వాటిని ఉద్యమ నిర్వాహకులు గమ నించుకుని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కానీ మొత్తం ఉద్యమానికే ఆ రంగు పులమాలనుకోవడం మంచిది కాదు. ఈ బంద్ ప్రశాంతంగా జరగాలని, ప్రతిష్టంభన సాధ్యమైనంత త్వరగా ముగిసి, ఒక మెరుగైన పరిష్కారం లభించాలని అందరూ కోరుకుంటారు. -
వికీపీడియాకు కేంద్రం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపించిన వికీపీడియాపై కేంద్ర ప్రభుత్వ ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే తప్పును సరిదిద్దుకోకపోతే తగిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని భారత ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. లేహ్‌ను కేంద్రపాలిత ప్రాంత లద్దాఖ్‌లో కాకుండా జమ్మూ కశ్మీర్లో అంతర్భాగంగా గత నెలలో వికీపీడియా చూపించిన విషయం తెలిసిందే. దీనిని ట్విటర్ వేదికగా ఓ నెటిజన్ కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లారు. నెటిజన్ ట్వీట్‌పై స్పందించిన కేంద్రం.. వికీపీడియా యాజమాన్యానికి నోటీసులు జారీచేసింది. ఈ చర్య భారతదేశ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లేనని ప్రభుత్వం వికీపీడియాకు తెలియజేసింది. భారత ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 69ఎ ప్రకారం ఉత్తర్వు జారీ చేసింది. వికీపీడియా తప్పును సరిదిద్దుకోవాలని, లేకుంటే సంస్థపై నిషేధం విధించడంతోపాటు ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని 2020 నవంబర్ 27న జారీచేసిన నోటీసుల్లో పేర్కొంది. దీనిపై వికీపీడియా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. (చదవండి: జమ్మూ కశ్మీర్లో కాల్పులు.. నలుగురు హతం) -
ప్రభుత్వం నిషేధం విధించిన యాప్‌లివే..
సాక్షి, న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో 43 చైనా మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించింది. అలీబాబా గ్రూప్‌కి చెందిన ఈ కామర్స్ యాప్ అలీ ఎక్స్‌ప్రెస్ సహా కొన్ని డేటింగ్ యాప్‌లపై నిషేధం విధిస్తూ మంగళవారం ఉత్వర్వులు జారీ చేసింది. గల్వాన్ లోయలో భారత్‌తో ఘర్షణలకు దిగిన డ్రాగన్ దేశానికి బుద్ధి చెప్పడం కోసం ఈ ఏడాది జూన్ 29న తొలిసారిగా 59 యాప్‌లపై నిషేధం విధించిందించిన విషయం తెలిసిందే. చదవండి: మరో 47 చైనా యాప్‌లపై నిషేధం నిషేధం విధించిన యాప్‌లివే.. ► అలీ సప్లయర్స్ మొబైల్ యాప్ ► అలీబాబా వర్క్ బెంచ్ ► అలీ ఎక్స్‌ప్రెస్– స్మార్టర్ షాపింగ్ బెటర్ లివింగ్ ► అలీ పే క్యాషియర్ ► లాలామూవ్ ఇండియా – డెలివరీ యాప్ ► డ్రైవ్ విత్ లాలామూవ్ ఇండియా ► స్నాక్ వీడియో ► క్యామ్ కార్డ్ – బిజినెస్ కార్డు రీడర్ ► క్యామ్‌కార్డ్ – బీసీఆర్ (వెస్టర్న్) ► సోల్ – ఫాలో ది సోల్ టు ఫైండ్ యూ ► చైనీస్ సోషల్ ► డేట్ ఇన్ ఆసియా ► విడేట్ ► ఫ్రీడేటింగ్ యాప్ ► అడోర్ యాప్ ► ట్రూలీ చైనీస్ ► ట్రూలీఆసియాన్ ► చైనాలవ్ ► డేట్మైయాజ్ ► ఆసియాన్డేట్ ► ఫ్లర్ట్‌విష్ ► గైస్ ఓన్లీ డేటింగ్ ► ట్యుబిట్ ► వివర్క్చైనా ► ఫస్ట్ లవ్ లివ్ ► రేలా ► క్యాషియర్ వాలెట్ ► మ్యాంగో టీవీ ► ఎంజీటీవీ–హునాన్ టీవీ ► వుయ్‌టీవీ–టీవీ వెర్షన్ ► వుయ్‌టీవీ–సిడ్రామా ► వుయ్‌టీవీ లైట్ ► లక్కీ లైవ్ ► తావోబావో లైవ్ ► డింగ్‌టాక్ ► ఐడెంటిటీ వీ ► ఐల్యాండ్ 2 ► బాక్స్ స్టార్ ► హీరోస్ ఎవాల్వ్ ► హ్యాపీ ఫిష్ ► జెల్లిపాప్ మ్యాచ్ ► మంచికన్ మ్యాజ్ ► కాంక్విస్టా ఆన్లైన్ -
ఓటీటీలపై నిఘా
సాక్షి, న్యూఢిల్లీ: ఓటీటీ(ఓవర్ ద టాప్) పేరిట అశ్లీలం నేరుగా ప్రజల నట్టింట్లోకి చేరుతోందన్న ఆందోళనలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం దానికి అడ్డుకట్ట వేసే చర్యలు ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తదితర ఓటీటీ వేదికలను, ఇతర డిజిటల్ న్యూస్ వెబ్సైట్లు, కరెంట్ అఫైర్స్ కంటెంట్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ ద్వారా ప్రసారమయ్యే డిజిటల్ కంటెంట్‌పై ప్రస్తుతం దేశంలో ఎలాంటి నిఘా లేదు. నియంత్రణకు విధానాలు, నిబంధనలు లేవు. నెట్లో ప్రసారమయ్యే అశ్లీల, అనుచిత అంశాలపై కన్నేసి ఉంచేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు చట్టం గానీ, స్వతంత్ర సంస్థ గానీ లేవు. అందుకే కేంద్ర సర్కారు ఇలాంటి వ్యవహారాలపై నిఘా పెట్టే అధికారాన్ని సమాచార, ప్రసార శాఖకు కట్టబెట్టింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌పై రాష్ట్రపతి కోవింద్ సంతకం చేశారు. కోర్టు వివరణ కోరిన నెల రోజుల్లోపే... ఓటీటీలపై నిఘా కోసం కేంద్ర ప్రభుత్వం ‘గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) రూల్స్–1961’లో సవరణలు చేసింది. దీన్ని ఇకపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా(అలోకేషన్ ఆఫ్ బిజినెస్) 357వ అమెండ్మెంట్ రూల్స్–2020గా వ్యవహరిస్తారు. ఇది వెంటనే అమల్లోకి వస్తుంది. అశ్లీలంపై చర్యలు తీసుకొనే అధికారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 77 క్లాజ్(3) ప్రకారం కేంద్రానికి సంక్రమించింది. ఆన్లైన్ వేదికలపై లభ్యమయ్యే న్యూస్, ఆడియో, విజువల్ కంటెంట్, సినిమాలకు సంబంధించిన నియంత్రణ విధానాలను రూపొందించే అధికారం సమాచార, ప్రసార శాఖకు దక్కింది. ఓటీటీలు, డిజిటల్ మీడియా వేదికలపై నియంత్రణ కోసం ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు శశాంక్ శంకర్ జా, అపూర్వ అర్హతియా ఇటీవలే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం వివరణ కోరిన నెల రోజుల్లోనే కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. -
అలర్ట్.. జనవరి నుంచి ఇది మస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఫాస్టాగ్ అమల్లోకి రానుంది. డిజిటల్, ఐటీ ఆధారిత టోల్ ఫీజుల చెల్లింపు విధానాలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా అన్ని రకాల ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటింది. గతంలో మినహాయింపు పొందిన పాత వాహనాలు కూడా తప్పనిసరిగా ఫాస్టాగ్ తీసుకోవాల్సిందే. 2021 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. రవాణా వాహనాలకు ఫాస్టాగ్ పునరుద్దరించిన తర్వాతే ఫిట్మెంట్ సర్టిఫికెట్ జారీ చేయడం తప్పనిసరి అని చేసినట్లు తెలిపింది. కాబట్టి ఇకపై ప్రతి నాలుగు చక్రాల వాహనం ఫాస్టాగ్ చేయించుకోవాల్సిందే. టోల్ గేట్ల దగ్గర ట్రాఫిక్‌ను నియంత్రించాలనే లక్ష్యంతో ఫాస్టాగ్ విధానాన్ని కేంద్రం 2017 నుంచి అమలు చేస్తోంది. 2019 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ అమలును తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలతో పాటు పాత వాహనాలకు ఫాస్టాగ్ నుంచి మినహాయింపు ఇచ్చింది. అయితే తాజా ఉత్తర్వులతో వచ్చే ఏడాది నుంచి అన్ని రకాల ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ తప్పనిసరైంది. -
‘మా లేఖపై మోదీ ఇప్పటివరకు స్పందించలేదు’
సాక్షి, హైదరాబాద్: వరద సాయంపై ప్రతిపక్ష నేతలు బురద రాజకీయం చేస్తున్నారని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 లక్షల 30 వేల కుటుంబాలకు రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించామని తెలిపారు. హైదరాబాద్‌లోని నాలాలపై అక్రమ నిర్మాణాలున్నాయని, భారీ వర్షాలతో అపార నష్టం జరిగిందని వెల్లడించారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌తో రాబోయే విపత్తును ఎదుర్కొన్నామని, ప్రాణ నష్టం జరగకుండా చూశామని తెలిపారు. వరద సహాయక చర్యలపై ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆర్థికంగా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తే ఇప్పటి వరకు ప్రధాని స్పందించలేదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణపై ప్రధాని మోదీ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు అడిగిన వెంటనే సాయం చేస్తున్నారని అన్నారు. కర్ణాటక సీఎం లేఖ రాసిన నాలుగు రోజుల్లోనే స్పందించారని గుర్తు చేశారు. గుజరాత్ కూడా వరద సహాయం ప్రకటించారని తెలిపారు. ‘8,800 కోట్లు నష్టం జరిగిందని బీజేపీవాళ్లు చెప్పారు. మన నగరం మన బీజేపీ అంటున్నారు. ఎక్కడుంది వరద సాయం ఇవ్వని బీజేపీ మన నగరంలో ఎక్కడుంది. ఒక్క పైసా ఇవ్వలేని అసమర్ధులు.. మీరా మమ్మల్ని విమర్శించేది?’ అని బీజేపీ నేతలపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కిషన్‌రెడ్డి సహాయ మంత్రా? నిస్సహాయత మంత్రా చెప్పాలని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదని కేటీఆర్ జోస్యం చెప్పారు. -
హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్–ముంబై మధ్య బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఈ కారిడార్‌కు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి తాజాగా బిడ్లు పిలిచారు. దేశంలో హై స్పీడ్ రైల్వే కారిడార్ల నిర్మాణం కోసం గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ది నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’ఈ బిడ్లను ఆహ్వానించింది. దీనికి సంబంధించిన ప్రీ బిడ్ సమావేశం నవంబర్ 5న నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. నవంబర్ 11 నుంచి టెండర్ పత్రాల దాఖలు మొదలుకానుంది. నవంబర్ 17తో టెండర్ల దాఖలు గడువు ముగుస్తుంది. 18న డీపీఆర్ తయారీ సంస్థను ఎంపిక చేస్తారు. ప్రధాని మోదీ కృతనిశ్చయంతో ముందుకు.. హైదరాబాద్ నుంచి ముంబైకి పుణే మీదుగా 711 కి.మీ. నిడివితో బుల్లెట్ రైల్ కారిడార్‌ను నిర్మించేందుకు రైల్వే శాఖ గతంలో నిర్ణయించింది. దేశంలో హైస్పీడ్ రైళ్లు పట్టాలెక్కించాలని కృతనిశ్చయంతో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే తొలి బుల్లెట్ రైల్ కారిడార్ ముంబై– అహ్మదాబాద్ మధ్య సిద్ధమవుతోంది. 459 కి.మీ. నిడివి ఉన్న ఢిల్లీ–అమృత్సర్–చండీగఢ్, 865 కి.మీ. పొడవైన ఢిల్లీ–వారణాసి, 753 కి. మీ. దూరం ఉండే ముంబై– నాగ్‌పూర్, 886 కి.మీ. తో రూపొందే ఢిల్లీ–అహ్మదాబాద్ మార్గాలను హై స్పీడ్ కారిడార్లుగా నిర్మించాలని కేంద్రం నిర్ణయిం చింది. వీటి డీపీఆర్‌ల ప్రక్రియ ప్రారంభం కావటం విశేషం. చెన్నై– మైసూరు, వారణాసి–హౌరా ప్రాజెక్టులు కూడా ఉన్నా, వాటి డీపీఆర్ ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. ఈ ప్రక్రియ పూర్తి చేసి రెండేళ్లలో ప్రాజెక్టు పనులు ప్రారంభించే దిశగా కేంద్రం ఏర్పా ట్లు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్– నాగ్‌పూర్, హైదరాబాద్–చెన్నై సెమీ హైస్పీడ్ కారిడార్లకు సం బంధించిన ప్రతిపాదనలు పెండింగులో ఉన్నాయి. ఇందు లో రష్యా కంపెనీకి చెందిన ఇంజనీర్లు హైదరాబాద్–నాగ్‌పూర్ కారిడార్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక సమర్పించారు. అది సాధ్యమే నని అందులో స్పష్టం చేశారు. వచ్చే ఐదేళ్లలో ఇవి పూర్తవుతాయని భావిస్తున్నారు. -
మార్చి వరకు ఉచిత బియ్యం!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా నుంచి పేదలు ఇంకా పూర్తిగా కోలుకోని దృష్ట్యా పేదలకు ప్రస్తుతం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై వచ్చే నెల తొలి లేదా రెండో వారంలో కేంద్రం ప్రకటన చేస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద పేదలకు పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యం గడువు నవంబర్‌తో ముగియనుంది. అయితే పేద, మధ్యతరగతి కుటుంబాల ఆదాయాలు క్షీణించడం, వరదలతో పంటనష్టం సంభవిం చడం, నిర్మాణ రంగం ఇంకా కోలుకోక వలస కార్మికులు దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తుండటంతో ఉచిత బియ్యం పంపిణీని కొనసాగించాలంటూ వివిధ రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో పౌర సరఫరాలు, ఆర్థిక శాఖల అధికారులతో కేంద్రం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కరోనా వేళ ఆదుకునేందుకు... కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మార్చి నుంచి విధించిన లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పో యిన పేద, మద్య తరగతి రేషన్ కార్డుదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ నుంచి 3 నెలలపాటు ఉచితంగా ఒక్కొక్కరికీ 5 కిలోల బియ్యంతోపాటు కార్డున్న ఒక్కో కుటుంబానికి కిలో చొప్పున కందిపప్పు పంపిణీ చేసింది. రాష్ట్రంలో మొత్తంగా 2.80 కోట్ల మంది రేషన్ లబ్ధిదారులు ఉండగా వారిలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 1.91 కోట్ల మంది ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇస్తున్న 5 కిలోల ఉచిత బియ్యానికి అదనంగా మరో 7 కిలోలు కలిపి మొత్తంగా 12 కిలోలు అందించింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసినా పేదలకు సరైన ఉపాధి లభించట్లేదు. ఈ నేపథ్యంలోనే ఉచిత బియ్యం, కందిపప్పు పంపిణీని మార్చి వరకు పొడిగించాలని ఉత్తరాది రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. -
ఏకపక్షంగా బోర్డు పరిధి నిర్ణయించొద్దు
సాక్షి, హైదరాబాద్: గోదావరి బేసిన్ ప్రాజెక్టులను తన పరిధిలోకి తెచ్చుకునేలా సిద్ధం చేసిన ముసాయిదా నోటిఫికేషన్ ప్రతిపాదనలను కేంద్రానికి పంపొద్దని తెలంగాణ ప్రభుత్వం గోదావరి బోర్డుకు విన్నవించింది. ఏక పక్షంగా బోర్డు పరిధిని నిర్ణయించడం సమంజసం కాదని, ఇది పునర్విభజన చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం బోర్డుకు లేఖ రాసింది. గోదావరి బేసిన్లో తెలంగాణ, ఏపీల మధ్య ఎలాంటి ఉమ్మడి ప్రాజె క్టులు లేవని, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి నీటిని విడుదల చేసే రెగ్యులేటర్లు లేక ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా నిర్మించిన ప్రాజెక్టుల్లేవని పేర్కొంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్–87 ప్రకారం గతంలో ఉన్న అవార్డులు, అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టం–1956 మేరకు ఏర్పడ్డ ట్రిబ్యునల్ల తీర్పులకు లోబడి కేంద్రం బోర్డుల పరిధిని నోటిఫై చేయాల్సి ఉంటుందని గుర్తు చేసింది. అయితే గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకోవడానికి సంబంధించి ఎలాంటి అంశాల్లేవని పేర్కొంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త మార్గదర్శకాలను తెలంగాణ, ఏపీలోని గోదావరి ప్రాజెక్టులపై రుద్దరాదని స్పష్టం చేసింది. విభజన చట్టంలోని సెక్షన్–85 ప్రకారం ఏ నిర్ణయం తీసుకోవాలన్నా బోర్డు సమావేశంలో చర్చించాలని, అయితే గోదావరి బోర్డు చైర్మన్ ఏకపక్షంగా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించడం సమంజసం కాదని పేర్కొంది. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని తెలిపింది. వీటిని పరిగణనలోకి తీసుకొని తక్షణమే బోర్డు పరిధిని ఖరారు చేయాలని పంపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విన్నవించింది. -
ఎన్నికల వ్యయం 10 శాతం పెంపు
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, ఇతర రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వ్యయాన్ని 10 శాతం పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికల సంఘంతో విస్తృతంగా చర్చించిన తర్వాత కేంద్ర న్యాయశాఖ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఎన్నికల్లో వ్యయ పరిమితిని మరో 10శాతం పెంచుతూ కొత్తగా ఉత్తర్వులు జారీచేసింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఇన్నాళ్లూ రూ.70 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు దానిని రూ.77 లక్షలు చేశారు. అదే చిన్న రాష్ట్రాల లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే వారి ఖర్చుని రూ.54 లక్షల నుంచి రూ. 59 లక్షలకి పెంచారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖర్చుని రూ.28 లక్షల నుంచి రూ.30.8 లక్షలకి పెంచారు. చిన్న రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఉన్న రూ.20 లక్షల వ్యయం పరిమితిని రూ.22 లక్షలకి పెంచారు. కరోనా సంక్షోభం నేపథ్యంలోనే ఎన్నికల వ్యయ పరిమితిని పెంచినట్టుగా తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం 10శాతం వరకు ఎన్నికల వ్యయాన్ని పెంచుకోవడానికి సిఫారసు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. పోలింగ్ ముందు రోజు నుంచే రాజకీయ ప్రకటనలపై నిషేధం బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, వాల్మీకి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోలింగ్ రోజు, అంతకు ముందు రోజు అభ్యర్థులు ఎటువంటి రాజకీయ పరమైన ప్రకటనలు ఇవ్వకూడదని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324ని అనుసరించి ఎన్నికల కమిషన్ ఈ ప్రకటనలపై నిషేధం విధించింది. 2015 బిహార్ ఎన్నికల సందర్భంగా ఈసీ తొలిసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజు, దానికి ముందు రోజు ప్రకటనల్ని శాశ్వతంగా నిషేధించాలన్న ప్రతిపాదనలు ఏళ్ల తరబడి న్యాయమంత్రిత్వ శాఖ దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఎన్నికల సంఘం తనకున్న అధికారాలను ఉపయోగించి తాజాగా ఆదేశాలు జారీ చేసింది. -
‘కో ఇన్ఫెక్షన్’పై జర జాగ్రత్త!
న్యూఢిల్లీ: ప్రస్తుతం కోవిడ్‌తో పాటు ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఈ ‘కో ఇన్ఫెక్షన్’ను ఎదుర్కొనే దిశగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ సీజన్లో మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా, హెచ్1ఎన్1, స్క్రబ్ టైఫస్ తదితర వ్యాధులు ప్రబలే అవకాశముందని, అందువల్ల కరోనాతో పాటు, అవసరమైన చోట, ఆయా వ్యాధుల నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని సూచించింది. సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలే ప్రాంతాల్లో ఈ కో ఇన్ఫెక్షన్పై అప్రమత్తతతో వ్యవహరించాలని పేర్కొంది. కోవిడ్ సోకిన వారిలో ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయేమో నిర్ధారించాలని సూచించింది. కోవిడ్ లక్షణాలు, ఇతర సీజనల్ వ్యాధుల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయని, అందువల్ల వ్యాధి నిర్ధారణలో అప్రమత్తంగా ఉండాలంది. కో ఇన్ఫెక్షన్ ఉన్న సందర్భాల్లో వ్యాధి నిర్ధారణలో తప్పుడు (ఫాల్స్ నెగటివ్/ఫాల్స్ పాజిటివ్) ఫలితం వచ్చే అవకాశముందని హెచ్చరించింది. (చదవండి: కోవిడ్-19 : మృతుల్లో 45 శాతం వారే!) -
భారత్ చేతికి స్విస్ ఖాతాల వివరాలు
న్యూఢిల్లీ/బెర్న్: విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనంపై పోరులో భారత ప్రభుత్వం మరింత పురోగతి సాధించింది. స్విస్ బ్యాంకుల్లో ఖాతాలున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వివరాల రెండో సెట్‌ను అందుకుంది. ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందం (ఏఈవోఐ) కింద 2019 సెప్టెంబర్‌లో స్విట్జర్లాండ్ నుంచి మొదటి సెట్‌ను భారత్ అందుకుంది. తాజాగా ఈ ఏడాది భారత్ సహా 86 దేశాలతో ఆర్థిక ఖాతాల వివరాలను స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌టీఏ) పంచుకుంది. ఈ దేశాలతో గతేడాది స్థాయిలోనే సుమారు 31 లక్షల అకౌంట్ల సమాచార మార్పిడి జరిగిందని ఎఫ్‌టీఏ తెలిపింది. వీటిల్లో భారతీయ పౌరులు, సంస్థల ఖాతాల సంఖ్య గణనీయంగా ఉందని పేర్కొంది. పన్ను చెల్లింపుదారులు తమ రిటర్నుల్లో ఆర్థిక వివరాలను సక్రమంగా వెల్లడించారా లేదా అన్నది పన్ను అధికారులు పరిశీలించడానికి ఈ సమాచారం ఉపయోగపడుతుంది. -
బిల్లులపై రైతుల ఆందోళన ఎందుకు ?!
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో కార్పొరేట్ వ్యాపారుల సముచిత పాత్రకు వీలు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను పార్లమెంట్ ఆమోదించడం పట్ల రైతు లోకం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కార్పొరేట్ వ్యాపారుల లాభాపేక్షకు వ్యవసాయ ఉత్పత్తులకు ప్రస్తుతం ఇస్తోన్న ‘కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)’ కనుమరగవుతుందన్నదే వారి ఆందోళనకు అసలు కారణం. కనీస మద్దతు ధరపై కేంద్రం తీసుకొచ్చిన ఈ మూడు బిల్లులపై ప్రత్యక్షంగా ఎలాంటి ప్రభావం ఉండదు. పైగా కనీస మద్దతు ధరను కొనసాగిస్తామంటూ మోదీ ప్రభుత్వం పదే పదే స్పష్టం చేసింది. అయినప్పటికీ దేశంలోని రైతులు మోదీ ప్రభుత్వాన్ని నమ్మక పోగా, ఎందుకు వ్యవసాయ బిల్లులను శంకిస్తున్నారు ? పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులే ఎక్కువ ఆందోళన చెందుతున్నారు? ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీలు నిర్వహించే మార్కెట్లలోనే కాకుండా దేశంలో ఎక్కడైన బయటి ప్రైవేటు మార్కెట్లలో లేదా మండీల్లో రైతులు తమ వ్యవసాయోత్పత్తులను విక్రయించుకునేందుకు కేంద్రం తీసుకొచ్చిన ‘ది పార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్’ బిల్లు వీలు కల్పిస్తోంది. దీని వల్ల ప్రభుత్వ హయాంలోని మార్కెట్ కమిటీలు కనీస మద్దతు ధరకు గోధమలు, బియ్యం సేకరించడం తగ్గిపోతుందని, ఆమేరకు తాము నష్టపోతామన్నది రైతుల ఆందోళనని కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సీరజ్ హుస్సేన్ తెలిపారు. కాలక్రమంలో ప్రభుత్వ వ్యయసాయ మార్కెట్ కమిటీలు కూడా రద్దు కావచ్చని వారు ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. (చదవండి: రబీ పంటల ‘మద్దతు’ పెంపు) ప్రైవేటు మార్కెట్ శక్తుల వల్ల వ్యవసాయోత్పత్తుల ధరలు 15 నుంచి 20 శాతం వరకు పడిపోయే ప్రమాదం ఉందన్నది రైతుల భయం. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులే ఎక్కువ ఆందోళన చెందడానికి ప్రధాన కారణం ఆ రెండు రాష్ట్రాల నుంచే 80–90 శాతం వరకు కనీస మద్దత ధరపై ప్రభుత్వం వరి, గోధుమలను కొనుగోలు చేస్తుండడం. కేంద్ర ప్రభుత్వం డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వ గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా సేకరించిన గోధమలు, వరిలో 52 శాతం వాటా ఈ రెండు రాష్ట్రాలకు చెందినదే. కేంద్రం ఈ రెండు రాష్ట్రాలకే ప్రధానంగా ప్రాధాన్యం ఇవ్వడానికి ప్రధాన కారణం 1960లో కేంద్రం ‘హరిత విప్లవం’ ఈ రెండు రాష్ట్రాల నుంచే ప్రారంభించడం. హరిత విప్లవం కారణంగా ఈ రెండు రాష్ట్రాలో అధిక దిగుబడి ఎక్కువగా వచ్చింది. ఫలితంగా గోధుమలు, వరి రేట్లు పడిపోవడంతో కేంద్రం ‘కనీస మద్దతు ధర’ విధానాన్ని తీసుకొచ్చింది. ఆ తర్వాత రైతుల డిమాండ్‌పై ఈ విధానాన్ని కేంద్రం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. కనీస మద్దతు ధర వల్ల ఇప్పటికీ ఈ రెండు రాష్ట్రాలే లాభ పడుతున్నాయా? కనీస మద్దతు ధర ఎత్తివేయాలా? ఈ విధానాన్ని ఎత్తివేయాలా ? వద్దా ? అన్న అంశంపై గత కొన్నేళ్లుగా చర్చలు జరగుతున్నాయి. దేశవ్యాప్తంగా కేవలం 5.8 శాతం మంది రైతులే ఎంఎస్పీ కింద తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారని, ఈ విషయంలో పంజాబ్, హర్యానా రైతుల తర్వాత ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల రైతులే ఎంఎస్పీ కింద లబ్ధి పొందుతున్నారని 2015లో శాంత కుమార్ కమిటీ ఓ నివేదికలో తెలియజేసింది. ప్రభుత్వ ఏజెన్సీలు ఎక్కువగా పెద్ద రైతుల నుంచే కొనుగోళ్లు ఎక్కువ చేస్తున్నాయి. కేంద్రం 23 రకాల వ్యవసాయోత్పత్తులకు కనీస మద్దతు ధరలను ప్రకటించగా, వాటిలో వరి, గోధుమలనే ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఎంఎస్పీ కింద పప్పు దినుసల కొనుగోళ్లు పెరిగాయి. ఒకప్పుడు దేశంలో ఆహార ధాన్యాల కొరత ఉన్నప్పుడు పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు కేంద్రం ప్రాధాన్యత ఇచ్చిందని, ఇప్పుడు ఆ అవసరం లేదని, ఎంఎస్పీ కన్నా మార్కెట్ ధరలు తక్కువగా ఉండే ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాలకు ఎంఎస్పీ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని శాంత కుమార్ కమిటీ సిఫార్సు చేసింది. ఎంఎస్పీ స్కీమ్‌ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పిస్పూ కేంద్రం 1997లో చట్టంలో సవరణ తీసుకొచ్చింది. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదు. ఎంఎస్పీ అమలు చేయడం వల్ల ప్రభుత్వాలపై అధిక ఆర్థిక భారం పడుతోందని, ఈ విధానాన్ని ఎత్తివేయాలంటూ అధికార వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చోప చర్చలు జరగుతున్నాయి. కొత్త వ్యవసాయ బిల్లులో ఎంఎస్పీ విధానానికి తగిన రక్షణలు కల్పించక పోవడంతో ఎప్పుడైనా ఆ విధానానికి కేంద్రం చెల్లు చీటి చెప్పవచ్చన్నది రైతులకు వీడని శంక. (చదవండి: సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే) -
కేంద్రం తీరుపై సీఎం కేసీఆర్ తీవ్ర అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: కేంద్రం తెస్తున్న నూతన వ్యవసాయ బిల్లుతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. కేంద్రం విధానాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్ఎస్ ఎంపీలను ఆయన శనివారం ఆదేశించారు. బిల్లును అడ్డుకునేందుకు శాయశక్తులా కృషి చేయాలని చెప్పారు. నూతన వ్యవసాయ బిల్లు తేనేపూసిన కత్తి లాంటిదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రైతులకు నష్టం చేకూర్చి, కార్పొరేట్ శక్తులు లాభపడేలా బిల్లు ఉందని విమర్శించారు. వ్యవసాయ బిల్లును ముమ్మాటికీ వ్యతిరేకించి తీరుతామని స్పష్టం చేశారు. (చదవండి: రసవత్తరంగా రాజ్యసభ.. బిల్లు గట్టెక్కేదెలా!) శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పైకి మాత్రం రైతులు తమ పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని బిల్లులో చెప్తున్నారు. కానీ వాస్తవానికి ఇది వ్యాపారులకే మేలు చేసేలా ఉంది. వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం ఇది. కార్పోరేట్ మార్కెట్ శక్తులు దేశమంతా విస్తరించడానికి, వారికి దారులు బార్లా తెరవడానికి ఉపయోగపడే బిల్లుగా ఉంది. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. తమకున్న కొద్దిపాటు సరుకును రైతులు ఎన్నో రవాణా ఖర్చులు భరించి, లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మడం సాధ్యమవుతుందా? మొక్కజొన్నల దిగుమతిపై ప్రస్తుతం 50 శాతం సుంకం అమల్లో ఉంది. కేంద్రం దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. 70 నుంచి 75 లక్షల టన్నుల మొక్క జొన్నలను కేంద్రం ఇప్పటికే కొనుగోలు చేసింది. 35 శాతం సుంకం తగ్గియడం వల్ల ఎవరికి లాభం కలుగుతుంది. ఎవరి ప్రయోజనం ఆశించి ఈ పని చేసింది. దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలో ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకున్నారు. మన దేశంలో మొక్కజొన్నలు బాగా పండుతున్నాయి. సుంకం తగ్గించి మరీ మొక్కజొన్నలు దిగుమతి చేసుకుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏమిటి’అని సీఎం కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. కాగా, నూతన వ్యవసాయ బిల్లు లోక్‌సభలో గురువారం ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. బిల్లుపై నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకే పార్టీల ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇక బీజేపీ మిత్రపక్షం శిరోమణి అకాళీదళ్ కూడా నూతన వ్యవసాయ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించింది. నిరసనగా పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. (చదవండి: మహేశ్వరం దగ్గర ఉన్న ఇళ్లు 2016 నాటివి: భట్టి) -
లక్షణాల్లేకుంటేనే పరీక్ష హాల్లోకి..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా నీట్ సహా పలు పరీక్షలు ఈ నెలలో జరగనుండటంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా లక్షణాలు లేని వారినే పరీక్ష హాల్లోకి అనుమతించాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. కరోనా లక్షణాలు లేని విద్యార్థులు, సిబ్బందినే పరీక్ష హాలులోకి అనుమతించాలని ఆదేశించింది. విద్యార్థుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే సమీప ఆరోగ్య కేంద్రానికి పంపాలని, వారు వేరే విధానం ద్వారా పరీక్షలు రాసేలా చూడాలని సూచించింది. ఒకవేళ లక్షణాలు బయటపడిన తర్వాత కూడా వారు పరీక్ష రాస్తామంటే ప్రత్యేక ఐసోలేషన్ గదిలో పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. రెగ్యులర్ కోర్సుల విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలుంటే వారు కోలుకున్నాక మళ్లీ పరీక్ష రాయడానికి ఏర్పాట్లు చేయాలని కోరింది. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడే విద్యార్థులు వారి ఆరోగ్య పరిస్థితిపై స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని, అలా ఇవ్వని వారిని అనుమతించకూడదని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయకూడదని, ఆ జోన్లలోని సిబ్బంది, విద్యార్థులను కూడా పరీక్షా కేంద్రాలకు రానీయకూడదని ఆదేశించింది. అలాంటి విద్యార్థులకు ఇతరత్రా పద్ధతుల ద్వారా పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని, లేదంటే మరోసారి పరీక్షలు నిర్వహించేలా సన్నాహాలు చేయాలని సూచించింది. మరికొన్ని మార్గదర్శకాలు ► మాస్క్‌లు ఉపయోగిస్తేనే సిబ్బంది, విద్యార్థులను పరీక్షా ప్రాంగణంలోకి అనుమతిస్తారు. మాస్క్‌ను పరీక్ష అయిపోయేంత వరకు ధరించాలి. ► వయసు పైబడిన ఉద్యోగులు, సిబ్బంది, గర్భిణులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్న వారిని పరీక్ష విధుల్లో నియమించకూడదు. ► విద్యార్థుల మధ్య భౌతికదూరం ఉండేలా సీట్లు ఏర్పాటు చేయాలి. ► పరీక్ష కేంద్రాల వద్ద జనం గుమిగూడకుండా దశలవారీగా పరీక్షలను నిర్వహించాలి. ► పరీక్షా కేంద్రాల్లో మాస్క్‌లు, శానిటైజర్ల వంటివి సమకూర్చుకోవాలి. ► కరోనా నిబంధనలను విద్యార్థులకు చెప్పాలి. సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ► పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు అందరినీ థర్మల్ స్క్రీన్ చేయాలి. ► తనిఖీ చేసే సిబ్బంది తప్పనిసరిగా త్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్, గ్లోవ్స్ ధరించాలి. ► ఏసీ 24–30 డిగ్రీల మధ్యే ఉండాలి. ► ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. ► పరీక్షా కేంద్రానికి తీసుకొచ్చే వాహనాలను ముందే శానిటైజ్ చేయాలి. ► పరీక్ష కేంద్రంలోకి బ్యాగులు, పుస్తకా లు, ఫోన్లను అనుమతించకూడదు. ► అనారోగ్యానికి గురైతే తీసుకెళ్లేలా వీల్‌చైర్ సదుపాయం కల్పించాలి. ► ప్రశ్న, జవాబుపత్రాల పంపిణీకి ముం దు ఇన్విజిలేటర్లు చేతులను శానిటైజ్ చేసుకోవాలి. వాటిని తిరిగి ఇన్విజిలేటర్లకు అప్పగించే ముందు విద్యార్థులు కూడా శానిటైజ్ చేసుకోవాలి. ► ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరిగితే పరికరాలను సంబంధిత ద్రావణంతో తుడవాలి. -
గిరిజన రిజర్వేషన్లు పెంచండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6.5 శాతంగా ఉన్నాయని, జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే రిజర్వేషన్లు 9.08 శాతంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం కేంద్రానికి సమర్పించినట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతామని పేర్కొన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ కాన్క్లేవ్లో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రిజర్వేషన్ల అంశంతో పాటు రాష్ట్రానికి మంజూరు చేసిన గిరిజన యూనివర్సిటీ ప్రారంభం అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేంద్రం త్వరితంగా అనుమతులిస్తే వర్సిటీని అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్ స్కూళ్లను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
పబ్జీ ‘ఆట’కట్టు
-
పబ్జీ ‘ఆట’కట్టు
సాక్షి, న్యూఢిల్లీ: చైనా కవ్వింపు నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పబ్జీ సహా 118 చైనా మొబైల్ యాప్‌లను నిషేధిస్తూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. పబ్జీ మొబైల్ లైట్, బైదు, బైదు ఎక్స్‌ప్రెస్ ఎడిషన్, అలీపే, వాచ్‌లిస్ట్, వీచాట్ రీడింగ్, కామ్కార్డ్తో పాటు పలు గేమింగ్ యాప్‌లు నిషేధానికి గురైన వాటిలో ఉన్నాయి. దేశ భద్రతకు ముప్పుగా పేర్కొంటూ కేంద్రం వీటిపై కొరడా ఝళిపించింది. పబ్జీ గేమ్ పిల్లలు, యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందనే అభిప్రాయం ఉంది. భారత్‌లో పబ్జీ క్రియాశీల వినియోగదారులు 3.3 కోట్ల మంది ఉన్నారు. ప్రతిరోజూ మనదేశంలో 1.3 కోట్ల మంది దీన్ని ఆడుతున్నారు. లద్దాఖ్‌లో చైనాతో ఘర్షణల నేపథ్యంలో ఈ ఏడాది జూన్ 29న కేంద్ర ప్రభుత్వం... అత్యంత ప్రజాదరణ కలిగిన టిక్‌టాక్, యూసీ బ్రౌజర్‌తో సహా మొత్తం 59 చైనా యాప్‌లను నిషేధించిన విషయం తెలిసిందే. తర్వాత మరో 47 యాప్‌లను నిషేధిత జాబితాలో చేర్చింది. బుధవారం వేటుపడిన వాటితో కలిపితే ఇప్పటిదాకా భారత్ మొత్తం 224 చైనా యాప్‌లపై నిషేధం విధించింది. భారత్ లాంటి పెద్దమార్కెట్లో ఉనికి కోల్పోవడం ఈ చైనా కంపెనీలకు ఆర్థికంగా పెద్దదెబ్బే. టిక్‌టాక్‌పై భారత్ నిషేధం విధించాక... అమెరికా కూడా అదేబాటలో నడిచిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 15కల్లా టిక్‌టాక్ అమెరికా వ్యాపారాన్ని అమ్మివేయాలని, లేని పక్షంలో నిషేధం అమలులోకి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. దేశ భద్రతకు ముప్పు... ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 69 (ఎ), ప్రజల సమాచారం సంగ్రహించడాన్ని నిరోధించే విధానం, భద్రతల నిబంధనలు– 2009 పరిధిలో ఈ 118 యాప్‌లను నిషేధించింది. అందుబాటులో ఉన్న సమాచారం దృష్ట్యా ఆయా మొబైల్ యాప్‌లు భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ రక్షణ, ప్రజాభద్రతకు హాని కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నందున వాటిపై నిషేధం విధించినట్టు కేంద్రం వెల్లడించింది. కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ల శాఖకు వివిధ వర్గాల నుంచి ఆయా యాప్‌లపై అనేక ఫిర్యాదులు అందాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్ యాప్‌లను దుర్వినియోగం చేయడం, వినియోగదారుల డేటాను దొంగిలించడం, అనధికారికంగా భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు రహస్యంగా పంపించడం చేస్తున్నట్టు కేంద్రం గ్రహించింది. ఈ డేటా సంకలనం భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను చివరికి జాతీయ భద్రతను ప్రభావితం చేయడం ఆందోళన కలిగించే విషయమని, దీనిని నిరోధించే తక్షణ చర్యలో భాగంగా ఈ యాప్‌లను నిషేధిస్తున్నట్టు తెలిపింది. వ్యక్తిగత డేటా చౌర్యానికి పాల్పడుతున్నాయని పేర్కొంది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, హోం మంత్రిత్వ శాఖ కూడా ఈ హానికరమైన మొబైల్ యాప్స్ నిరోధించటానికి సమగ్రమైన సిఫారసు పంపింది. ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి కూడా వీటిని నిషేధించాలన్న డిమాండ్ ఉందని కేంద్ర ఐటీ శాఖ వివరించింది. -
పబ్జీ గేమ్‌ను నిషేధించిన కేంద్రం
-
దేశ వ్యాప్తంగా కనకదుర్గా ఫ్లైఓవర్ అందాలు
సాక్షి, విజయవాడ : దేశంలోనే అతి పొడవైన కనకదుర్గా ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది. ఇందుకు సన్నాహక ఏర్పాట్లకు ఆదివారం అడుగులు పడ్డాయి. దేశంలోనే అత్యద్భుత ఫ్లై ఓవర్ కావటంతో ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. సెప్టెంబరు 4వ తేదీన వర్చువల్ ప్రారంభోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఈ ఫ్లై ఓవర్ ఇంజనీరింగ్ అద్భుతాన్ని పరిచయం చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీని కోసం ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా డ్రోన్ బృందాన్ని విజయవాడకు పంపించింది.ఈ బృందం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫ్లైఓవర్ అందాలను చిత్రీకరించింది. చిత్రీకరణలో ఆర్అండ్బీ స్టేట్ హైవేస్ విభాగం అధికారులతో పాటు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ (మోర్టు) అధికారులు కూడా పాల్గొన్నారు. సెప్టెంబరు 4వ తేదీన ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా జాతీయ మీడియాలో ఫ్లైఓవర్‌కు సంబంధించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. స్పైన్ అండ్ వింగ్స్ టెక్నాలజీతో ఒంటి స్తంభంపై ఆరు వరసలతో నిర్మించిన ఫ్లై ఓవర్ కావటం చేత దీనికి ప్రాధాన్యత ఏర్పడింది. దేశంలో ఢిల్లీ, ముంబయిల్లో మాత్రమే ఈ తరహా ఫ్లై ఓవర్లు ఉన్నాయి. అయితే ఆ రెండింటి కంటే అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు.పైగా దేశంలోనే అతి పొడవైనది. ఈ టెక్నాలజీలో వై పిల్లర్స్ ఉండటం, వీటి నిడివి ఎక్కువగా ఉండటం కూడా ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఈ టెక్నాలజీలో దేశంలోని అతి పొడవైన ఆరు వరసల ఫ్లై ఓవర్ కావటంతో దేశానికి గర్వకారణమైన విషయంగా కేంద్రం భావిస్తోంది. -
దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) మరణంతో దేశంలో విషాదం నెలకొంది. ఆయన మరణం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీతో పాలు పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతిగా, కేంద్ర మంత్రిగా ఆయన అందించిన సేవలను స్మరించుకొనేందుకు దేశ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు సంతాపం ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. (చదవండి : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత) అలాగే రాష్ట్రపతి భవన్‌తో సహా అన్ని కార్యాలయాలపై జాతీయజెండా అవనతం చేయాలని కేంద్రం ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో ప్రణబ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు రక్షణ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. సైనిక వందనంతో వీడ్కోలు పలికేందుకు సన్నాహాలు చేస్తోంది. రేపు ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, గత కొంతకాలంగా కోవిడ్‌తో పాటు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రణబ్ సోమవారం సాయంత్రంతుది శ్వాస విడిచారు. -
రాష్ట్రాల కొంప ముంచిన ‘జీఎస్టీ’
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఒక దేశం, ఒక పన్ను’ అన్న సరికొత్త నినాదంతో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017లో జీఎస్టీ పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. పన్ను విధించే అధికారాలను రాష్ట్రాల నుంచి లాక్కోవడం వల్ల దేశంలో సమాఖ్య భారత స్ఫూర్తి దెబ్బతింటుందని, పైగా తమ ఆర్థిక పరిస్థితి దిగజారి పోతుందని కొన్ని రాష్ట్రాలు ఎంత మొత్తుకున్నా కేంద్ర ప్రభుత్వం వినిపించుకోలేదు. జీఎస్టీ పన్ను విధానం వల్ల రాష్ట్రాలకు ఏర్పడే ఆదాయం లోటును ఐదేళ్ల పాటు కేంద్రం భరిస్తుందని, జీఎస్టీ పరిహారం సెస్సు కింద ఈ మొత్తాలను చెల్లిస్తామని, ఈ విషయంలో మీరు నిశ్చింతగా ఉండాలంటూ రాష్ట్రాలకు కేంద్రం భరోసా కూడా ఇచ్చింది. 2020–21 సంవత్సరానికి రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ మొత్తం అంచనాలకు, వసూళ్లకు మధ్య ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల తేడా వచ్చింది. రాష్ట్రాలకు ఇస్తానన్న పరిహారపు సెస్సు వసూళ్లు 65 వేల కోట్ల రూపాయలను దాట లేదు. అంటే పరిహారపు సెస్సుపోనూ రాష్ట్రాలకు 2.35 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఇదే విషయమమై గురువారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించగా, కేంద్రం ఉచిత సలహాలతో చేతులు దులిపేసుకుంది. పన్నుల ఆదాయం తగ్గిన మొత్తాలకు ఆర్బీఐ నుంచి అప్పు తీసుకోవాల్సిందిగా కేంద్రం సలహా ఇవ్వడంతో రాష్ట్రాలు బెంబేలెత్తి పోతున్నాయి. (చదవండి : ఎన్‌పీసీఐకి షాక్ : ఎస్బీఐ కొత్త సంస్థ) ఆశించిన స్థాయిలో జీఎస్టీ వసూలు కాకపోవడం, కోవిడ్ మహమ్మారి విజృంభణతో దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని, ఈ కారణంగా రాష్ట్రాలకు పన్నుల ఆదాయాన్ని భర్తీ చేయలేక పోతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడంతో కొన్ని రాష్ట్రాలు మళ్లీ పాత పన్నుల విధానాన్నే ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. తమిళనాడు ఆది నుంచి నేటి వరకు కూడా జీఎస్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. జీఎస్టీ పన్ను విధానాన్ని రద్దు చేసి పాత పన్ను విధానాలనే తిరిగి ప్రవేశపెట్టాలని మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పుదుచ్ఛేరి ప్రభుత్వాలు డిమాండ్ చేస్తుండగా, జీఎస్టీ వల్ల పెద్దగా నష్టపోని బీహార్, బెంగాల్ ప్రభుత్వాలు మౌనం పాటిస్తున్నాయి. జీఎస్టీ కింద తమ రాష్ట్రానికి దాదాపు 5, 400 కోట్ల రూపాయలు రావాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది. -
సినిమా షూటింగ్‌లకు కేంద్రం అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారితో మూతపడ్డ థియేటర్లు, మార్కెట్లను కనీస జాగ్రత్తలు పాటిస్తూ తెరిచేందుకు కేంద్రం ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న అన్‌లాక్-3 ఆగస్టు 31తో ముగియనున్న తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా సినిమా షూటింగ్‌లకు కేంద్రం ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సినిమా, టీవీ సీరియళ్ల షూటింగ్‌లకు కేంద్రం అనుమతి ఇస్తున్నట్లు ఆదివారం ప్రకటించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షూటింగ్‌లు జరుపుకోవాలని అనుమతులు జారీ చేసింది. (పంజాబ్ ప్రభుత్వం: బ్రేక్ పడిన సినిమా షూటింగులకు అనుమతి!) షూటింగ్ దగ్గర ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. ఇక చిత్రీకరణ ప్రదేశంలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని పేర్కొంది. చిత్రీకరణలో పాల్గొనే నటీనటులు ఆరోగ్య సేతు యాప్‌ను ఉపయోగించాలని సూచించింది. సినిమా షూటింగ్ సమయంలో విజిటర్లను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని కేంద్రం ఆదేశించింది. హెయిర్ స్టైలిస్ట్‌లు, మేకప్ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించాలని పేర్కొంది. కాస్ట్యూమ్స్, లోకల్ మైక్‌లను ఎవరికి వారే ఉపయోగించుకోవాలని మార్గదర్శకాలను జారీ చేసింది. -
షెడ్యూల్ ప్రకారమే నీట్, జేఈఈ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(ఎన్ఈఈటీ–నీట్), సంయుక్త ప్రవేశ పరీక్ష (జేఈఈ) ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కరోనా కారణంగా పరీక్షలు వాయిదా వేయాలన్న విద్యార్థుల అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో వీటి నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఇప్పటికే జేఈ ఈ అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జారీ చేసింది. ఈ పరీక్షకు దాదాపు 8.6 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 6.5 లక్షల మంది అడ్మిట్‌కార్డులు డౌన్లోడ్ చేసుకున్నారు. జేఈఈ మెయిన్ ఎగ్జామ్ సెప్టెంబర్ 1 నుంచి 6 తేదీల్లో, జేఈఈ అడ్వాన్స్ పరీక్ష సెప్టెంబర్ 27న, నీట్ పరీక్ష సెప్టెంబర్ 13న జరగనుంది. నీట్‌కు సుమారు 16 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కరోనా సంక్షోభ నేపథ్యంలో కేంద్ర గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో శానిటైజేషన్ ఏర్పాట్లను చేయనున్నారు. ప్రతి విద్యార్థికి తాజా మాస్కులు, గ్లౌవ్స్‌ను అందిస్తారు. కరోనా నేపథ్యంలో పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నవారు పరీక్షా కేంద్రం, పరీక్ష నిర్వహణ నగరం మార్పును కోరే అవకాశాన్ని, అదికూడా ఐదుసార్లు మార్చుకునే వెసులుబాటును ఎన్టీఏ కల్పించింది. కాగా జేఈఈకి దరఖాస్తు చేసుకున్న వారిలో 120 మంది, నీట్ అభ్యర్థుల్లో 95వేల మంది ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
రాజధాని అంశంపై మరోసారి కేంద్రం స్పష్టత
-
రాజధాని అంశంపై మరోసారి కేంద్రం స్పష్టత
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో జోక్యం చేసుకోమని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో తీసుకునే నిర్ణయమే అని, అందులో తమ పాత్రేమీ ఉండదని తేల్చిచెప్పింది. ఇదే విషయాన్ని గతంలోనే ఏపీ హైకోర్టుకు కేంద్రం తెలియజేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన నోటీసులపై మరోసారి కేంద్రం స్పందిస్తూ మరోసారి తమ వైఖరిని వెల్లడించింది. రాజధానుల్ని నిర్ణయించుకునే హక్కు ఆయా రాష్ట్రాలకే ఉందని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టులో బుధవారం అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానులను ఏర్పాటు చేసే విషయంపై ఏపీ హైకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ అఫిడవిట్‌ను కేంద్ర ప్రభుత్వం సమర్పించింది. అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు దాఖలు చేసిన పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కేంద్రానికి కూడా నోటీసులు ఇచ్చినవ విషయం తెలిసిందే. -
చట్టంలో లోపాలుంటే కేంద్రానికి నివేదించండి
సాక్షి, హైదరాబాద్: చట్టంలో లోపాలుంటే వాటిని సరిచేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని లేదా పార్లమెంటును సంప్రదించాలని హైకోర్టు స్పష్టం చేసింది. చట్టాలలో ఉన్న లోపాలను సరిదిద్దాలని ఆదేశించే పరిధి తమకు లేదని పేర్కొంది. చట్టాలను రూపొందిం చడమనేది పార్లమెంట్ విధానపరమైన నిర్ణయమని, ఆ చట్టాలను మార్చాలంటూ ఆదేశించజాలమని, ఇటు వంటి అంశాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోజా లవని తేల్చిచెప్పింది. 2018లో భారతీయ శిక్షా స్మృతి లోని (ఐపీసీ) సెక్షన్ 376, 376–ఎ(అత్యాచారం)లో జరిగిన సవరణలో లోపముందని, 16 ఏళ్లలోపు అమ్మాయిపై లైంగిక దాడి జరిగిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయినా దోషికి మరణశిక్ష విధించే అవకాశం లేదంటూ నగరానికి చెందిన న్యాయవాది బి.నవప్రవళిక దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఐపీసీ సెక్షన్ 376, 376–ఎ లోపముందని, 16 ఏళ్లలోపు అమ్మాయిపై లైంగిక దాడి జరిగి, తర్వాత ఆ అమ్మాయి చనిపోయినా దోషులకు మరణశిక్ష విధించే అవకాశం లేదని పిటిషనర్ తరఫున న్యాయవాది డొమినిక్ ఫెర్నాండెజ్ నివేదించారు. ఈ లోపాన్ని సరిదిద్దేలా ఆదేశించాలని, లేకపోతే అనేకమంది దోషులు మరణశిక్ష నుంచి తప్పించుకునే అవకాశం ఉందన్నారు. ఈ వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. లైంగిక దాడికి గురైన 16 ఏళ్లలోపు అమ్మాయి చనిపోతే సెక్షన్ 376 (అత్యాచారం)తోపాటు సెక్షన్ 302 (హత్య) కింద విచారిస్తారని, సెక్షన్ 302 కింద మరణశిక్ష విధించవచ్చని ధర్మాసనం స్పష్టం చేస్తూ పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. జోక్యం చేసుకోలేం: ‘‘వాస్తవ పరిస్థితుల ఆధారంగా, ఏదైనా కేసును ఉదహరిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేసి ఉంటే బాగుండేది. ఇది న్యాయవర్సిటీల్లో అకడమిక్ అంశంగా చర్చించాల్సినది. నల్సార్ వర్సిటీ చాన్స్‌లర్‌గా నేను ఈ అంశంపై చర్చ జరగాలని భావిస్తున్నా. అంతేగానీ న్యాయస్థానాలు ఇటువంటి పిటిషన్లకు వేదికగా మారితే ప్రతి చట్టంలో లోపం ఉందంటూ వేల పిటిషన్లు వరదలా వచ్చి పడతాయి. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని చట్టాలను రూపొందిస్తాయి. ఆ చట్టంలో లోపం ఉంటే కేంద్ర న్యాయశాఖ మంత్రిని గానీ, పార్లమెంట్‌ను కానీ సంప్రదించి లోపాన్ని సరిచేయాలని కోరాలి. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. పిటిషనర్ ఈ లోపాన్ని సరిదిద్దాలంటూ కేంద్ర న్యాయశాఖకు వినతిపత్రం కూడా ఇవ్వలేదు. వినతి పత్రం ఇచ్చి ఉన్నా దానిపై ఏదో ఒక నిర్ణయం తీసుకో వాలని కేంద్రాన్ని ఆదేశించే వాళ్లం’’అని చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ అన్నారు. అయితే, చట్టంలో లోపాన్ని సరిదిద్దాలంటూ కేంద్ర న్యాయశాఖకు వినతిపత్రం సమ ర్పించామని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. పీపీల కొరత ఉంటే విచారణ ఎలా? ‘‘క్రిమినల్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇందుకు కారణం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (పీపీ) కొరత తీవ్రంగా ఉండటమే. పీపీలు లేకుండా క్రిమినల్ కేసుల ట్రయల్ ఎలా ముందుకు సాగుతుంది. ప్రభుత్వం వెంటనే అన్ని కోర్టుల్లో పీపీలను నియమించాలి. వరంగల్‌లో మూడు నెలల చిన్నారిపై లైంగిక దాడికి సంబంధించిన ఘటనలో రోజువారీ పద్ధతిలో విచారణ జరిగింది. ఇలాంటి అరుదైన కేసుల్లో తప్ప రోజువారీ పద్ధతుల్లో విచారణ చేపట్టాలని ఆదేశించలేం. క్రిమినల్ కేసుల సత్వర విచారణ జరిగి దోషులకు శిక్షలు పడాలంటే అన్ని కోర్టుల్లో పీపీలు ఉండాలి’’అని ధర్మాసనం పేర్కొంది. -
రాజధాని రాష్ట్ర పరిధిలోనిదే..
సాక్షి, అమరావతి: రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర పరిధిలోని విషయమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు గురువారంనాడు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. రాజధాని విషయం తమ పరిధిలోనిది కాదని, రాష్ట్ర పరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకు తన కౌంటర్లో చాలా స్పష్టంగా తెలిపిందని గుర్తుచేసింది. రాజధానితో సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను, ప్రణాళికలను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని అందులో పేర్కొంది. ప్రత్యేక హోదా డిమాండ్‌ను విడిచిపెట్టలేదు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలుపరిచేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను తాము విడిచిపెట్టలేదని, ప్రతీ సమావేశంలోనూ, పార్లమెంట్లో సందర్భం వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని కోర్టుకు తెలిపింది. ప్రత్యేక హోదా పునర్విభజన చట్టంలో భాగంగా ఉందని, అది లేకుండా రాష్ట్ర విభజన పరిపూర్ణం కాదంది. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయంది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం భరించే వ్యయంలో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగిలిన 10 శాతాన్ని కూడా వడ్డీ లేకుండా రాష్ట్రానికి రుణంగా ఇస్తుందని తెలిపింది. కేంద్ర నిధుల్లో ప్రాధాన్యత ఉంటుందని, ఎక్సైజ్ డ్యూటీ రాయితీలు, కస్టమ్స్, కార్పొరేట్, ఇన్కమ్ ట్యాక్స్‌లలో పలు మినహాయింపులు ఉంటాయని వివరించింది. ఇందుకోసమే ప్రత్యేక హోదా కోసం కేంద్రం వెంటపడుతూనే ఉన్నామని చెప్పింది. కార్యాలయాల తరలించరాదనడం న్యాయసమ్మతం కాదు.. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దుపై చట్టాలు అమల్లోకి వచ్చాయని, ఇవి అమల్లో ఉండగా కార్యాలయాలను ఎక్కడికీ తరలించరాదని పిటిషనర్ కోరడం న్యాయసమ్మతం కాదని తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదానివ్వడంతో పాటు పునర్విభజన చట్టంలోని పలు నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు హైకోర్టులో 2018లో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఎక్కడికీ తరలించకుండా ఉత్తర్వులివ్వాలంటూ 2020లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల రాజధాని కేసుల విచారణ సందర్భంగా ఈ వ్యాజ్యం విచారణకు రాగా, కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కౌంటర్ వేసింది. ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహరరావు కౌంటర్ దాఖలు చేశారు. హైకోర్టు ప్రిన్సిపల్ సీటు, బెంచ్‌లు ఎక్కడ ఉండాలన్న విషయం పునర్విభజన చట్టం, వికేంద్రీకరణ చట్టంలో చాలా స్పష్టంగా ఉందన్నారు. ఈ అంశంపై మహారాష్ట్ర వర్సెస్ నారాయణ శ్యాంరాం పురాణిక్ కేసులో సుప్రీంకోర్టు 1982లో చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. -
ప్రాజెక్టుల వ్యయాలు చెప్పండి
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరిస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రాజెక్టుల వివరాలన్నింటినీ ఒక్కొక్కటిగా సేకరిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టులకు బోర్డులు, కేంద్ర జల సంఘం, అపెక్స్ కౌన్సిల్‌తోపాటు పర్యావరణ అనుమతుల వివరాలను కోరింది. తాజాగా తెలంగాణలో రెండు నదీ బేసిన్లలోని కొత్త, పాత ప్రాజెక్టుల అంచనా వ్యయాలు, సవరించిన అంచనాలు, చేసిన ఖర్చు వివరాలను కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. వీలైనంత త్వరగా ఈ వివరాలను సమర్పించాలని ఆదేశించింది. అపెక్స్‌కు ముందే అన్నీ సేకరణ... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జల వివాదాలు మొదలైన అనంతరం ప్రాజెక్టుల వివరాలన్నింటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. కృష్ణా, గోదావరిపై అపెక్స్ కౌన్సిల్, గోదావరి బోర్డు, కేంద్ర జల సంఘం అనుమతి లేకుండా కాళేశ్వరం సహా ఏడు ఎత్తిపోతల పథకాలను నిలుపుదల చేయాలని బోర్డులు గతంలోనే రాష్ట్రాన్ని ఆదేశించగా ఇటీవలే కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సైతం లేఖ రాశారు. ఇందులో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సీడబ్ల్యూసీ సలహా కమిటీ 2018 జూన్‌లో 2 టీఎంసీల తరలింపునకే అనుమతి ఇచ్చింది. కానీ ఆ పథకాన్ని విస్తరించి 3 టీఎంసీలు తరలించేలా తెలంగాణ ప్రభుత్వం పనులు మొదలు పెట్టిందని, దీనికి ఆమోదం లేదనే విషయాన్ని కేంద్రం గుర్తుచేసింది. ఈ ఏడు ప్రాజెక్టులతోపాటే కృష్ణా నదిపై చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, కల్వకుర్తి, భక్త రామదాస వంటి ప్రాజెక్టుల్లో ఎన్నింటికి పర్యావరణ అనుమతులు ఉన్నాయో డీపీఆర్‌లు సమర్పించాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే కొత్తగా రెండు నదీ బేసిన్లలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలు, ఆ సమయంలో ప్రాజెక్టుల అంచనా వ్యయాలు, తర్వాత సవరించిన అంచనాలు, ఇందులో ఇంతవరకు చేసిన ఖర్చు వివరాలను తమకు అందజేయాలని రాష్ట్రాన్ని కోరింది. ఇప్పటికే తమ వద్ద అంచనాల వివరాలను పేర్కొన్న కేంద్రం... ఇందులో కాళేశ్వరం అంచనా వ్యయం రూ. 80,150 కోట్లు, పాలమూరు–రంగారెడ్డి అంచనా వ్యయం రూ. 35,200 కోట్లుగా ఉందని పేర్కొంది. ఈ ప్రాజెక్టులతోపాటు దేవాదుల, సీతారామ వంటి పథకాలపై కొత్త అంచనా వ్యయాలను అధికారికంగా ధ్రువీకరించేందుకే కేంద్రం అంచనా వ్యయాల వివరాలు కోరిందన్న చర్చ జలవనరుల శాఖ వర్గాల్లో జరుగుతోంది. -
మృతుల కుటుంబాలకు కేంద్రం ఆర్థిక సాయం
సాక్షి, న్యూఢిల్లీ: విజయవాడ అగ్నిప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి నిధులను విడుదలు చేసింది. ఇక ఇప్పటికే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ.50లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, విజయవాడలోని ఏలూరు రోడ్డు చల్లపల్లి బంగ్లా సమీపంలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్లో నిర్వహిస్తున్న ప్రైవేటు కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆసుపత్రిలో 30 మంది చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. (విజయవాడ అగ్ని ప్రమాదం: 10 మంది మృతి) -
కేంద్రం గుడ్డిగా వ్యవహరిస్తోంది: రాహుల్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఆశా ఆరోగ్య కార్యకర్తల సమ్మె నేపథ్యంతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. తమకు మెరుగైన సేవా పరిస్థితులు, ప్రయోజనాలు కల్పించాలని ఆశా కార్యకర్తలు రెండు రోజులపాటు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆశా కార్యకర్తల విషయంలో మౌనం వహిస్తోందని రాహుల్ విమర్శించారు. ప్రస్తుతం వారి సమస్యలను ఏమాత్రం వినిపించుకోకుండా గుడ్డిగా వ్యవహిస్తోందని విరుచుకుపడ్డారు. ఆశా వర్కర్లు దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి ఆరోగ్య రక్షకులుగా సేవలు అందిస్తారు. వారు నిజమైన ఆరోగ్యయోధులని అన్నారు. అటువంటి ఆరోగ్య కార్యకర్తలు నేడు తమ సొంత హక్కుల కోసం రోడ్లపై సమ్మెల చేయాల్సి వస్తోందని రాహుల్ కేంద్రంపై మండిపడ్డారు. (మోదీ ఎందుకు అబద్ధాలు చెబుతున్నారు?) ఆశా(అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్), అంగన్వాడీ, నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలోని కార్మికులకు సంబంధించిన పలు మీడియా నివేదికలను రాహుల్ తన ట్విటర్లో ట్యాగ్ చేశారు. నేషనల్ హెల్త్ మిషన్ శుక్రవారం నుంచి రెండు రోజులపాటు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొన్న విషయం తెలిసిందే. పది సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల పిలుపుతో దేశ వ్యాప్తంగా సుమారు ఆరు లక్షల మంది ఆశా వర్కర్లు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. -
పొగాకు రైతుకు మార్క్‌ఫెడ్ అండ
పొగాకు రైతులు ఈ ఏడాది కష్టాల నుంచి గట్టెక్కారు. వ్యాపారుల, తయారీదారుల, ఎగుమతిదారుల కబంధ హస్తాల నుంచి పొగాకు రైతును ఒడ్డున పడేసిన సంవత్సరంగా ఈ ఏడాది నిలవబోతోంది. వేలంలో ఈ మూడు రకాల వ్యాపారులు పొగాకు రైతును కీలుబొమ్మలాగా ఆడుకున్నారు. వ్యాపారులు వాళ్ల ఇష్టమొచ్చిన ధరకు కొనుగోలు చేస్తే నోరెత్తలేని దీనస్థితిలో ఇప్పటి వరకు రైతు మగ్గిపోయాడు. అయితే ఆ చీకటి రోజులకు చరమగీతం పాడుతూ, రైతులను నష్టాలపాలు చేస్తున్న వ్యాపారులకు చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కొనుగోళ్లలో వ్యాపారులకు పోటీగా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించింది. అంతే పొగాకు రైతులకు ఊహకు కూడా అందని విధంగా ప్రయోజనం చేకూరుతోంది. పొగాకు రైతు మోములో చిరునవ్వు చిగురించింది. ఒంగోలు సబర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక్క నిర్ణయంతో పొగాకు రైతుల ముఖాల్లో ఆనందం వెల్లి విరుస్తోంది. పొగాకు బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి ఏనాడు రాలేదు. 1976లో భారత ప్రభుత్వం వాణిజ్య పంట అయిన పొగాకు కోసం పొగాకు బోర్డును ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఎన్నో పోరాటాలు, పొగాకు రైతుల త్యాగాలు, ప్రాణదానాల ఫలితంగా 1984లో పొగాకు బోర్డు ఆధ్వర్యంలో పొగాకు వేలం కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయినా పొగాకు రైతు ప్రతి సంవత్సరం నష్టాలతోనే సహ జీవనం చేస్తూ వస్తున్నాడు. ఆ నష్టాల నుంచి పొగాకు రైతును ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బయటపడేశారు. ప్రకాశం, నెల్లూరు రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 24,153 పొగాకు బ్యారన్లు ఉండగా వాటిలో ఎస్బీఎస్ పరిధిలో 12,633, ఎస్ఎల్ఎస్ పరిధిలో 11,520 బ్యారన్ల కింద పొగాకును సాగు చేస్తున్నారు. అదేవిధంగా రెండు జిల్లాల్లో కలిపి రైతులు 30,811 మంది ఉన్నారు. వారిలో ఎస్బీఎస్ పరిధిలో 14,559 మంది రైతులు, ఎస్ఎల్ఎస్ పరిధిలో 16,252 మంది పొగాకు సాగు చేస్తున్నారు. 51 కోట్ల విలువైన పొగాకు కొనుగోళ్లు.. మార్క్‌ఫెడ్ సంస్థ వేలంలోకి దిగినప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.50 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేసింది. అందులో దాదాపు 90 శాతానికి పైగా పొగాకు ఒక్క లో గ్రేడ్ పొగాకు కావటం విశేషం. దీంతో ప్రకాశం జిల్లాతో పాటు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన పొగాకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రెండు జిల్లాల్లో కలిపి మొత్తం 12 పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. వాటిలో దక్షిణ ప్రాంత నల్లరేగడి నేలల్లో (ఎస్బీఎస్) ఆరు, దక్షిణ ప్రాంత తేలిక పాటి నేలల్లో (ఎస్ఎల్ఎస్) మరో ఆరు వేలం కేంద్రాలు ఉన్నాయి. ఎస్బీఎస్ పరిధిలోని రైతుల వద్ద రూ.36 కోట్ల విలువైన పొగాకు, ఎస్ఎల్ఎస్ పరిధిలోని రైతుల వద్ద రూ.15 కోట్ల విలువైన పొగాకును కొనుగోలు చేశారు. లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లే లక్ష్యంగా.. పొగాకు వ్యాపారులు రైతులు పండించిన పొగాకులో లో గ్రేడ్ పొగాకు అధికంగా ఉత్పత్తి అవుతోంది. అయితే వ్యాపారులు లో గ్రేడ్ పొగాకును అతి తక్కువ ధరకు కొనుగోలు చేయటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని గమనించిన ముఖ్యమంత్రి లో గ్రేడ్ పొగాకు కొనుగోలు లక్ష్యంగా మార్క్‌ఫెడ్‌ను వేలం ప్రక్రియలోకి దించారు. దీంతో ఇప్పటి వరకు ఇప్పటి వరకు 58 వేల పొగాకు బేళ్లు రైతుల వద్ద నుంచి మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగి సరిగ్గా ఆగస్టు 7వ తేదీతో 30 రోజులు అయింది. నాణ్యమైనది అత్యధికంగా కిలో రూ.208 పొగాకు బోర్డు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు నాణ్యమైన పొగాకు ధర కిలో రూ.208 పలికిన సందర్భాలే లేవు. అత్యధికంగా ధర పలికింది ఈ సంవత్సరమే. అదీ కూడా మార్క్‌ఫెడ్ పొగాకు వేలంలోకి రావటం వల్లనే సాధ్యమైంది. లో గ్రేడ్ పొగాకు కొనుగోళ్లే లక్ష్యంగా మార్క్‌ఫెడ్ రంగంలోకి దిగినప్పటికీ నాణ్యమైన పొగాకును కూడా కొనుగోలు చేయటానికి మార్క్‌ఫెడ్ అధికారులు నిర్ణయించారు. దీంతో పేరెన్నికగన్న పొగాకు వ్యాపారులతో మార్క్‌ఫెడ్ పోటీ పెంచింది. దీంతో నాణ్యమైన పొగాకును వ్యాపారులు అత్యధిక ధర కిలోకు రూ.208 చెల్లించి కొనాల్సిన పరిస్థితి ఎదురైంది. పోటీ వలన మేలిమి పొగాకుకు పలికిన అత్యధిక ధర కిలో: రూ.208 గతంలో గరిష్టంగా నాణ్యమైన పొగాకు ధర: రూ.202 ఇప్పటి వరకు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసిన బేళ్లు: 58 వేల పొగాకు బేళ్లు -
రైల్వే శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: వలస పాలన నాటి నుంచి అనాదిగా వస్తోన్న ఖలాసీ వ్యవస్థకు ముగింపు పలకాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అధికారుల ఇళ్ల వద్ద ప్యూన్లుగా పనిచేసే ఖలాసీలకు సంబంధించి ఎటువంటి కొత్త నియామకాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు టెలిఫోన్ అటెండెంట్ కమ్ డాక్ ఖలాసీల(టీఏడీకే)కు సంబంధించిన నియామక ప్రక్రియను సమీక్షిస్తున్నట్లు పేర్కొంటూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా జూలై 1, 2020 నాటికి చేపట్టిన నియామకాలను రైల్వే బోర్డు పునఃసమీక్షించే అవకాశం ఉందని పేర్కొంది. అన్ని రైల్వే సంస్థలకు ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.(రైల్వే సంస్కరణలకు గ్రీన్‌సిగ్నల్) కాగా టీఏడీకే గ్రూప్ డీ కేటగిరీ ఉద్యోగులు అన్న సంగతి తెలిసిందే. సీనియర్ రైల్వే అధికారుల నివాసాల వద్ద వీరు విధులు నిర్వర్తిస్తారు. ఫోన్ కాల్స్ అటెండ్ చేయడం, ఫైల్స్ అందించడం వంటి పనుల చేస్తారు. అయితే చాలా మంది అధికారులు టీఏడీకేలను తమ వ్యక్తిగత పనులకు ఉపయోగించుకుంటున్నారనే ఆరోపణలు వెల్లుతుతున్న విషయం తెలిసిందే. ఇక వివిధ విభాగాల్లో కాలానుగుణంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టిన రైల్వే శాఖ.. ఇప్పటికే డాక్ మెసేంజర్ వ్యవస్థకు చరమగీతం పాడిన విషయం తెలిసిందే. దీనికి బదులుగా వీడియో కాన్ఫరెన్స్‌లు లేదా మెయిల్స్ ద్వారా సమాచారం చేరవేయాలని అధికారులకు సూచించింది. కాగా రవాణా రంగంలో శతాబ్దిన్నరకు మించి అనుభవం గడించి, రోజూ 22,000 రైళ్లు నడుపుతూ ప్రపంచ రైల్వేల్లోనే నాలుగో స్థానం ఆక్రమించిన రైల్వే వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని పాలనా వ్యవహారాలను పర్యవేక్షించే రైల్వే బోర్డును కుదించాలని కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే నిర్ణయించింది. -
కర్ఫ్యూ ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడకపోగా, పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా సంస్థలు, సినిమా థియేటర్లు, బార్లు, భారీ సభలకు ఇప్పుడే అనుమతి ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో రైళ్లకు సైతం ఎర్రజెండా చూపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అన్‌లాక్–3 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల పలు కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. ఆగస్టు 5వ తేదీ నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతి ఇవ్వనున్నట్టు మార్గదర్శకాల్లో వెల్లడించింది. రాజకీయ, సామాజిక, మతపరమైన సమావేశాలకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రిపూట కర్ఫ్యూను ఆగస్టు 1 నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా హాళ్లు, బార్లు, సమావేశ మందిరాలకు ఎప్పటి నుంచి అనుమతి ఇచ్చేది తెలియజేస్తూ ప్రత్యేక ప్రకటన జారీ చేస్తామని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలను కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఆంక్షలు వీటిపైనే.. ► పాఠశాలలు, కళాశాలలు, విద్యా, శిక్షణా సంస్థలు ఆగస్టు 31 వరకు మూసి ఉంటాయి. ఆన్లైన్, డిస్టెన్స్ లెర్నింగ్‌కు అనుమతి ఉంటుంది. దీన్ని మరింతగా ప్రోత్సహించాలి. ► సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ థియేటర్లు, బార్లు, ఆడిటోరియమ్స్, అసెంబ్లీ హాల్స్, ఇదే కోవలోకి వచ్చే ఇతరత్రా అన్నీ మూసి ఉంటాయి. ► యోగా కేంద్రాలు, జిమ్‌లను ఆగస్టు 5 నుంచి తెరిచేందుకు అనుమతిస్తారు. ఇందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా ప్రామాణిక నిర్వాహక నియమావళిని(ఎస్ఓపీ) జారీ చేస్తుంది. ► హోంశాఖ అనుమతించినవి(వందేభారత్ మిషన్) మినహా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఉండవు. ► ఆగస్టు 31 వరకు మెట్రో రైళ్లకు అనుమతి లేదు. ► సామాజిక, రాజకీయ, క్రీడా, వినోదాత్మక, బోధన, సాంస్కృతిక, మతపరమైన వేడుకలు, భారీ సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు. ► ఆయా కార్యకలపాలకు అనుమతికి సంబంధించి తేదీలు, ప్రామాణిక నిర్వాహక నియమావళి(ఎస్ఓపీ) ప్రత్యేకంగా ప్రకటిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పంచాయతీ, మున్సిపల్, సబ్‌డివిజన్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఎట్ హోం వేడుకలకు అనుమతి ఉంటుంది. ఈ వేడుకల సందర్భంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. హెల్త్ ప్రొటోకాల్స్ పాటించాలి. కంటైన్మెంట్ జోన్ల వరకే నిబంధనలు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగుతాయి. కంటైన్మెంట్ జోన్లను జిల్లా అధికార యంత్రాంగం గుర్తిస్తుంది. ఆయా జోన్లలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. కానీ, ఇతరత్రా రాకపోకలకు అనుమతి లేదు. కంటైన్మెంట్ జోన్ల వెలుపల బఫర్ జోన్లను కూడా గుర్తిస్తారు. ► కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవచ్చు. అయితే రాష్ట్రంలో గానీ, రాష్ట్రాల మధ్య గానీ రాకపోకలపై ఆంక్షలు విధించరాదు. ఈ ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అక్కర్లేదు. ► 65 ఏళ్ల వయసు పైబడిన వారు, పదేళ్ల లోపు చిన్నారులు, ఇతర వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు ఆరోగ్య అవసరాలకు మినహా బయటకు రాకూడదు. ► వివాహ సంబంధిత వేడుకలకు 50 మందికి మించి అనుమతి లేదు. ► అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువ మంది హాజరు కాకూడదు. ► బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, పొగ తాగడం, పాన్, గుట్కా తీసుకోవడం నిషిద్ధం. ► అన్‌లాక్–3 మార్గదర్శకాలు ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. -
అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల
న్యూఢిలీ : కరోనా లాక్డౌన్ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31తో అన్‌లాక్ 2.0 గడువు ముగియనుండటంతో.. కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్‌లాక్ 3.0లో రాత్రిపూట ఉన్న కర్ఫ్యూను పూర్తిగా తొలగించారు. అయితే కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. మార్గదర్శకాలు.. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఆగస్టు 31 వరకు మూసివేత ఆగస్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్‌లకు అనుమతి సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్స్, మెట్రో రైలు మూసివేత కొనసాగింపు(అయితే పరిస్థితులను అంచనా వేసి వీటి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది) సాధారణ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు కంటైన్మెంట్ జోన్లలో అంక్షలు కొనసాగింపు భౌతిక దూరం, వైద్య నిబంధనలు పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, మత పరమైన సమావేశాలపై నిషేధం కొనసాగింపు(అయితే పరిస్థితులను అంచనా వేసి వీటి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది) -
లద్దాఖ్‌కు యుద్ధ విమానాలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ వెంట గస్తీ నిర్వహించేందుకు భారతీయ నౌకాదళానికి చెందిన పొసీడాన్ 8ఐ జలాంతర్గామి విధ్వంసక యుద్ధ విమానాన్ని భారత్ రంగంలోకి దింపింది. చైనా దళాల కదలికను గమనించేందుకు దీన్ని ఉపయోగించనున్నారు. అలాగే, మరికొన్ని ఎంఐజీ –29కే జెట్ విమానాలను కూడా త్వరలో నార్తర్న్ సెక్టార్‌లోని పలు కీలక వైమానిక కేంద్రాలకు తరలించనుంది. వీటి మోహరింపుతో వైమానిక దళ సామర్థ్యం, గగనతల ఆధిపత్యం మరింత మెరుగుపడుతుందని సంబంధిత వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ప్రస్తుతం నౌకాదళం వద్ద 40 ఎంఐజీ–29కే జెట్ విమానాలున్నాయి. ఇప్పటికే తూర్పు లద్దాఖ్, తదితర ప్రాంతాల్లోని కీలక ఎయిర్‌బేసెస్‌లో సుఖోయ్ 30 ఎంకేఐ, జాగ్వార్, మిరేజ్ 2000 యుద్ధ విమానాలను భారత్ సిద్ధంగా ఉంచింది. ఆగస్ట్ చివరినాటికి ఐదు రఫేల్ ఫైటర్ జెట్స్‌ను కూడా లద్దాఖ్‌లో సిద్ధంగా ఉంచాలని భారత్ భావిస్తోంది. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో భారత నౌకాదళం, అమెరికా నేవీతో కలిసి అండమాన్ నికోబార్ దీవుల్లో మిలటరీ డ్రిల్స్ నిర్వహించింది. ఈ డ్రిల్స్‌లో పాల్గొన్న అమెరికాకు చెందిన యూఎస్ఎస్ నిమిజ్ ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధ నౌక. మరోవైపు, డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ) దేశీయంగా రూపొందించిన డ్రోన్‌ను త్వరలో తూర్పు లద్దాఖ్‌లోని ఆర్మీ బేస్‌లకు పంపించనున్నారు. ఈ డ్రోన్‌కు ‘భారత్’ అని డీఆర్డీఓ నామకరణం చేసింది. ఎత్తైన ప్రాంతాల్లో, కఠిన వాతావరణ పరిస్థితుల్లో ఇది గస్తీ విధులు నిర్వహించగలదని డీఆర్డీఓ పేర్కొంది. -
నేటి నుంచి యూఎస్‌కు విమానాలు
న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించే దిశగా భారత ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. విమాన సర్వీసు లను ప్రారంభించేందుకు వీలుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలతో ప్రత్యేక ద్వైపాక్షిక ఒడంబడికలను కుదుర్చుకుంది. త్వరలో యూకేతోనూ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ వివరాలను విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి గురువారం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. పారిస్ నుంచి ఢిల్లీ, బెంగళూరు, ముంబైలకు జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు ఎయిర్ ఫ్రాన్స్ సంస్థ 28 విమాన సర్వీసులను నడుపుతుంది. అలాగే, ఈరోజు నుంచి 31 వరకు ఇరుదేశాల మధ్య అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 18 విమాన సర్వీసులను నడుపుతుంది. ఆ సంస్థ ఢిల్లీ– నెవార్క్‌ల మధ్య ప్రతీరోజు ఒక సర్వీసును, ఢిల్లీ– శాన్‌ఫ్రాన్సిస్కోల మధ్య వారానికి మూడు సర్వీసులను నడుపుతుంది. యూకేతో ఒప్పందం కుదిరిన తరువాత.. ఢిల్లీ, లండన్ల మధ్య రోజుకు రెండు సర్వీసులు ఉంటాయని పురి తెలిపారు. జర్మనీ నుంచి లుఫ్తాన్సా సర్వీసులుంటాయన్నారు. భారత్ నుంచి ఎయిర్ ఇండియా సంస్థ ఆయా దేశాలకు విమాన సర్వీసులను నడుపుతుందని వివరించారు. అంతర్జాతీయ సర్వీసులపై భారత్ ఇప్పటికే యూఏఈతో ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో దీపావళి నాటికి దేశీయ ట్రాఫిక్ కరోనా ముందున్న స్థాయితో పోలిస్తే.. 55 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. భౌతిక దూరంపై ప్రయాణికుల ఆందోళన కరోనా సమయంలో కొందరు విమాన ప్రయాణికులు భౌతిక దూరం నిబంధనను సరిగ్గా పాటించకపోవడాన్ని మిగతావారు ప్రధాన సమస్యగా భావిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. జూన్ 20 నుంచి జూన్ 28 వరకు ఆన్లైన్లో సుమారు 25 వేల మంది ప్రయాణికులను సర్వే చేశామని ఇండిగో ప్రకటించింది. -
కూల్చివేతకు అనుమతి అవసరమా.. కాదా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సచివాలయం కూల్చివేతకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమా.. వద్దా.. అనే విషయం స్పష్టం చేయాలని హైకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ‘భూమిని సిద్ధం చేయడం (ప్రిపరేషన్ ఆఫ్ ల్యాండ్)’అన్న పదానికి స్పష్టమైన అర్థం చెప్పాలని సూచించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న నిర్మాణాలకు అనుమతి అవసరమా.. కాదా.. భవిష్యత్తులో చేపట్టబోయే నిర్మాణాలు భూమిని సిద్ధం చేయడం అన్న అర్థానికి లోబడి ఉంటాయా లేదా అన్నది కూడా తెలపాలని సూచించింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ లేదా ఇతర హైకోర్టులు భూమిని సిద్ధం చేయడం అన్న పదానికి ఏమైనా నిర్వచనం చెప్పాయా అన్నది కూడా పరిశీలించి చెప్పాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సచివాలయ భవనాల కూల్చివేతను నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం వరకు ధర్మాసనం పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సచివాలయం కూల్చివేతకు ముందు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి పొందలేదని, ఈ నేపథ్యంలో కూల్చివేతలను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలని ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. కూల్చివేతలకు అనుమతులు తీసుకోవాల్సిందేనని పిటిషనర్ల తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పలు సుప్రీంకోర్టు తీర్పులను, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనలను సమర్పించారు. నూతన భవనాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి తీసుకోవాల్సి ఉందని, కూల్చివేయడానికి అనుమతి అవసరం లేదని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, రాష్ట్ర పర్యావరణ ప్రభావ అసెస్మెంట్ అథారిటీ ఇచ్చిన నివేదికలను, పలు సుప్రీంకోర్టు తీర్పులను ధర్మాసనానికి సమర్పించారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం... గతంలో తాము లేవనెత్తిన అంశాలకు సంబంధించి ఈ నివేదికలో స్పష్టమైన వివరణ లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ధర్మాసనం లేవనెత్తిన అన్ని అంశాలపై కేంద్ర పర్యావరణ విభాగం అధికారులు అధ్యయనం చేస్తున్నారని, శుక్రవారంలోగా స్పష్టమైన వివరణ ఇస్తామని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వర్‌రావు ధర్మాసనానికి నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఎన్జీటీ నోటీసులు... సచివాలయం భవనాల కూల్చివేత వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సచివాలయం భవనాల కూల్చివేతను సవాల్ చేస్తూ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హరిత ట్రిబ్యునల్ చెన్నై విభాగం జ్యుడీషియల్æ మెంబర్ జస్టిస్ కె.రామక్రిష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ సైబల్ దాస్‌గుప్తాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు విచారించి ప్రతివాదులుగా ఉన్న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి, పర్యావరణ ప్రభావ అసెస్మెంట్ కమిటీలకు నోటీసులు జారీ చేసింది.