శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం కాబోతోందని కేంద్ర చెబుతోంది, కానీ అలా జరగుతున్నట్లు తమకు కనిపించటంలేదని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
‘జమ్ము కశ్మీర్‌లో ఇటీవల దోడా జిల్లాలో జరిగిన ఉగ్రవాద ఘటన మొదటి కాదు. నిజం ఏమింటే.. గత ఏడాది నుంచి ఇక్కడ ఉగ్రవాద దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. జమ్ములోని పలు ప్రాంతాల్లో కూడా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. ఇక్కడ చోటు చేసుకుంటున్న ఆందోళనకర పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వం, పోలీసులు బాధ్యత వహించాలి.
ఇప్పటివరకు 55 మంది సైనికులు మృతి చెందారు. ఇలాంటి పరిస్థితులో అసలు ప్రభుత్వం ఏం చేస్తోందని డిమాండ్ చేస్తున్నాం. కేంద్రం మాత్రం తరచూ జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం తగ్గుతోందని చెబుతోంది. కానీ, ఇక్కడి పరిస్థితిని చూస్తే ఉగ్రవాదం ఇంకా కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. అదీకాక ఉగ్రవాదాన్ని అరికట్టడానికి ఏమాత్రం చర్యలు తీసుకోవటం లేదు. కేంద్రం చర్యలు తీసుకోవాలి’ అని అన్నారు.
ఇటీవల జమ్ము కశ్మీర్ ఉగ్రవాదం పెరగడానికి ఇక్కడి ప్రాంతీయ పార్టీల రాజకీయాలే కారణమని డిజీపీ ఆర్‌ఆర్ స్వైన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. డీజీపీ చేసిన వాఖ్యలను మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు.
‘డీజేపీ రాజకీయ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. రాజకీయాలను రాజకీయ నాయకులకు వదిలిపెట్టాలి. ఆయన జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదం ఎలా కరికట్టాలో చర్యలు తీసుకోవటంలో దృష్టి పెట్టాలి. డీజీపీగా ఆయన పని.. ఆయన చేస్తే.. మా పని మేము చేస్తాం’అని ఒమర్ అబ్దుల్లా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment