న్యూఢిల్లీ: ప్రతి రోజూ మరింత ఎక్కువ మంది అర్హులైన వయోజనులకు కోవిడ్ టీకాలను వేయాలని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలిచ్చింది. గురువారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ రాష్ట్రాలు కోవిడ్‌పై సంసిద్ధతకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వివరాలతో కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది.
‘క్రిస్మస్, కొత్త ఏడాది నేపథ్యంలో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే రాష్ట్రాలు కంటైన్‌మెంట్ చర్యలు, ఆంక్షలు విధించాలి. ఆంక్షలు విధిస్తే కనీసం 14 రోజులపాటు అమలుచేయాలి. తొలి డోస్ తీసుకున్న వారికి రెండో డోస్, అర్హులైన వారికి రెండు డోస్‌లూ ఇవ్వాలి. తొలి, రెండో డోస్‌లు పూర్తి చేయడంలో జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్ శాతం నమోదవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ’అని కేంద్రం ఆ ప్రకటనలో పేర్కొంది. ‘కరోనా పాజిటివిటీ రేటు 10శాతం కన్నా పెరిగినా, ఆయా ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయమున్న ఐసీయూ పడకలు 40 శాతానికి మించి నిండినా స్థానికంగా కంటైన్‌మెంట్ చర్యలు వెంటనే తీసుకోవాలి’అని ప్రకటనలో సూచించింది.
(చదవండి: ఆవు తల్లితో సమానం)
Comments
Please login to add a commentAdd a comment