vaccination
-
వ్యాక్సిన్ వ్యతిరేకితో భారత్‌కు నష్టం?
అమెరికా అధ్యక్షపీఠాన్ని డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధిరోహించనున్నారు. ఇప్పటికే తన వద్ద పనిచేసే మంత్రులను నియమిస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఆరోగ్య, ప్రజా సేవల మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేక ఉద్యమకారుడు రాబర్ట్ ఎఫ్ కెనెడీ జూనియర్‌ను నియమించనున్నట్లు ప్రకటించారు. అయితే ఇందుకు సెనెట్‌లో ఆమోదం లభించాల్సి ఉంటుంది. అమెరికాకు అత్యధికంగా భారత ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఈ తరుణంలో కెనెడీ నియామకం పట్ల భారత కంపెనీలు కొంత ఆందోళన చెందుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.‘ప్రజారోగ్యం విషయంలో మందుల కంపెనీల మోసాలు, తప్పుడు సమాచారం తదితరాలతో అమెరికన్లు చాలాకాలంగా నలిగిపోయారు. కెనెడీ వీటికి అడ్డుకట్ట వేసి అమెరికాను మళ్లీ గొప్పగా, ఆరోగ్యంగా మారుస్తారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆహార భద్రత, వైద్య పరిశోధన, సామాజిక భద్రత, మెడికేర్ వంటి కీలక వ్యవహారాలను ఆయన పర్యవేక్షిస్తారు’ అని ట్రంప్ తన సోషల్ మీడియా హాండిల్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు.2023 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు 7.55 బిలియన్ డాలర్లు (రూ.62,615 కోట్లు) విలువ చేసే ఫార్మా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసింది. యాంటిసెరా, వ్యాక్సిన్లు, టాక్సిన్లు, గ్రంథులు.. వంటి వాటిని ఎగుమతి చేస్తున్నారు. అమెరికాకు ఎగుమతి చేసే దేశీయ కంపెనీల్లో ప్రధానంగా సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, అరబిందో ఫార్మా, లుపిన్ లిమిటెడ్.. వంటి కంపెనీలున్నాయి. వీటితోపాటు ప్రధానంగా కరోనా సమయం నుంచి ‘వ్యాక్సిన్ మైత్రి’లో భాగంగా దేశీయంగా తయారైన కొవాక్సిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు అమెరికాకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. ఆరోగ్య మంత్రిగా వ్యాక్సిన్ వ్యతిరేకిగా ఉన్న కెనెడీ నియామకం ఫార్మా కంపెనీల్లో కొంత ఆందోళన కలిగిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో రియల్టీ జోరు!‘మేక్ అమెరికా హెల్దీ అగైన్’ నినాదానికి కెనెడీ పూర్తిగా న్యాయం చేస్తారని ట్రంప్ విశ్వాసం వెలిబుచ్చారు. తన రెండో విడత పాలనలో ప్రజారోగ్యం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కెనెడీకి పూర్తి స్వేచ్ఛనిస్తానని ట్రంప్ పదేపదే చెప్పుకొచ్చారు. టీకాలు తదితరాలను తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తికి ఏకంగా ఆరోగ్య శాఖ అప్పగించడం పట్ల తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉండగా, నిబంధనల ప్రకారం యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ ఎఫ్‌డీఏ) ధ్రువపరిచిన ఫార్మా ఉత్పత్తుల ఎగుమతికి ఎలాంటి ఢోకా లేదని కొందరు నిపుణులు చెబుతున్నారు. -
వ్యాక్సిన్స్ వికటించి బొమ్మలా ఉండే అమ్మాయి, దారుణంగా! వీడియో వైరల్
అరుదైన రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఒక యువతి చికిత్స తీసుకుందామని వెళ్లి ఇపుడు మరింత ప్రమాదంలో పడిపోయింది. చికిత్సలో భాగంగా ఆమె తీసుకున్న వ్యాక్సీన్లు వికటించడంతో మృత్యువుతో పోరాడుతోంది. అంతేకాదు దీనికి సంబంధించిన ఖర్చులు భారీగా ఉండటంతో వైద్య నిధుల సమీకరణకు నానా బాధలుపడుతోంది. విషయం ఏమిటంటే..ఫ్లోరిడాకు చెందిన 23 ఏళ్ల అలెక్సిస్ లోరెంజ్ పరోక్సిస్మల్ నాక్టర్నల్ హిమోగ్లోబినూరియా (PNH)తో భాపడుతోంది. దీనికి చికిత్స కోసం కాలిఫోర్నియాలోని UCI మెడికల్ సెంటర్లో చేరింది.నివేదికల ప్రకారం, ఆమె చికిత్సను కొనసాగించే ముందు టెటనస్, మెనింజైటిస్ ,న్యుమోనియాకు టీకాలు వేయించుకోవాలిన ఆసుపత్రి వైద్యులు కోరారు. అయితే టీకాలు ఏకకాలంలో ఇవ్వడంతో భయంకరమైన రియాక్షన్ వచ్చింది. టీకాలు వేసిన పది నిమిషాల్లోనే ఆమె పరిస్థితి దారుణంగా క్షీణించింది. తాత్కాలిక అంధత్వం,దవడలు బిగుసుకుపోయాయి. ఒళ్లంతా రక్తం పేరుకుపోయిన మచ్చలు. ఒక దశలో తల పగిలిపోతుందా అన్నంత బాధ. దీనికి తోడు వాంతులతో ఇబ్బంది పడుతోంది. ఫలితంగా ఆమెను ప్రత్యేక చికిత్స కోసం లాస్ ఏంజిల్స్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. లోరెంజ్కి కాలిఫోర్నియాలో ఆరోగ్య బీమా లేకపోవడం నిధులను సేకరించే పనిలో ఉన్నారు ఆమె బంధువులు, స్నేహితులు. Alexis Lorenze suffering reactions from 3 vaccines administered to her: meningitis, pneumonia, and tetanus at UCI Medical Center (Anaheim California). I'd give this woman a lot of C to begin with. #VaccineSideEffects https://t.co/whOja2HeGs pic.twitter.com/Hwy1wVuVir— Robert, C.N., Pharm Tech. (@Robertvegan7) September 17, 2024తన పరిస్థితిపై లోరెంజ్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మె మొదట రక్త రుగ్మత కోసం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. రక్త మార్పిడి చేయించుకుంది. రక్తమార్పిడి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ, పూర్తిగా తగ్గలేదని ఆమె వాపోయింది. టీకాలు వేసుకోవాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారని, బలవంతంగా తీసుకున్న మూడు వ్యాక్సిన్ల కారణంగా తన పరిస్థితి దారుణంగా తయారైందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు టీకాలు తీసుకున్న తర్వాత, ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించటానికి దారితీసిందనికుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం లోరెంజ్ నెమ్మదిగాకోలుకుంటోందని ఆమెకోసం కేటాయించిన స్పెషల్ నర్సు వెల్లడించారు. -
డెంగీకి రెండేళ్లలో టీకా!
సాక్షి, హైదరాబాద్: సీజన్ మారిందంటే ప్రజలను బెంబేలెత్తించే డెంగీ వ్యాధికి చెక్ పడే అవకాశం కన్పిస్తోంది. భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), పాన్ ఆసియా బయోటెక్ కంపెనీలు కలిసికట్టుగా తయారు చేస్తున్న టీకా ‘డెంగీఆల్’ కీలకమైన మూడో దశ ప్రయోగాలకు సిద్ధమైంది. ఈ దశలోనూ ఆశించిన ఫలితాలు వస్తే టీకా అందుబాటులోకి రావడమే తరువాయి అవుతుంది. ఈ టీకా తయారీ ప్రక్రియ యావత్తూ దేశీయంగానే జరిగిందని, డెంగీపై పోరాటంలో టీకా అభివృద్ధి కీలక మలుపు అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం: నడ్డాఏదైనా వ్యాధి నివారణకు అభివృద్ధి చేసే టీకా మూడు దశల ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పాన్ ఆసియా బయోటెక్ డెంగీఆల్పై ఇప్పటివరకు రెండు దశల ప్రయోగాలను పూర్తి చేసింది. తాజాగా బుధవారం హరియాణాలోని రోహతక్‌లో ఉన్న పండిట్ భగవత్ దయాళ్ శర్మ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మూడో దశ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. డెంగీఆల్ మూడో దశకు చేరుకోవడం ప్రజారోగ్య సంరక్షణపై ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పూర్తిగా స్వదేశీ టెక్నాలజీల సాయంతో ఈ టీకాను అభివృద్ధి చేయడం ఆరోగ్య రంగంలో ఆత్మ నిర్భర్ భారత్‌కు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.కోవిడ్‌కు ముందే రెండు దశలు పూర్తిడెంగీ వ్యాధికి ప్రస్తుతం ఎలాటి టీకా లేకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో కనీసం నాలుగు రకాల డెంగీ వైరస్‌లను నియంత్రించే లక్ష్యంతో టీకా తయారీ ప్రయత్నాలు మొదలయ్యాయి. అమెరికా లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అభివృద్ధి చేసిన ఒక టెట్రా వేలంట్ టీకా ప్రపంచ వ్యాప్తంగా ప్రీ క్లినికల్, క్లినికల్ ట్రయల్స్‌లో ప్రభావశీలంగా కనిపించింది.అయితే దేశంలోని పాన్ ఆసియా బయోటెక్‌కు కూడా ఇది అందుబాటులోకి రావడంతో ఆ కంపెనీ ఐసీఎంఆర్‌తో కలిసి ప్రయోగాలు మొదలుపెట్టింది. తొలి, మలి దశ ప్రయోగాలు కోవిడ్‌కు ముందు 2018 – 19లోనే పూర్తి చేసింది. మూడో దశ ప్రయోగాల కోసం 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 19 కేంద్రాలను ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 10,335 మందిపై జరిగే మూడో దశ ప్రయోగాల్లో భాగంగా టీకాలు తీసుకున్న వారిని రెండేళ్ల పాటు పరిశీలించనున్నారు. -
పిల్లల భవిష్యత్ కోసం.. అబ్ ఇండియా బనేగా 7-స్టార్
పిల్లలకు వచ్చే వ్యాధులను దూరం చేయడానికి.. వారి భవిష్యత్తకు మద్దతుగా నిలబడటానికి జీఎస్కే (GSK) 'అబ్ ఇండియా బనేగా 7-స్టార్' అనే కార్యక్రమం ప్రారంభించింది. భారతదేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని ఈ ప్రచారం ద్వారా తల్లిదండ్రులకు తెలియజేస్తోంది.అబ్ ఇండియా బనేగా 7-స్టార్ ద్వారా పోలియో, చికెన్‌పాక్స్, హెపటైటిస్ A, హెపటైటిస్ బి, మెనింజైటిస్, మీజిల్స్, గవదబిళ్లలు, రుబెల్లా, న్యుమోనియా, ఇన్ఫ్లుఎంజా, డిఫ్తీరియా, టెటానస్, పెర్టుసిస్, హైబి ఇన్ఫెక్షన్ వంటి 14 వ్యాధులకు వ్యతిరేఖంగా 7 టీకాలు పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతామని జీఎస్కే వెల్లడించింది. ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వయసున్న పిల్లలకు ఈ 7 టీకాలను వేయాలని ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) సిఫార్సు చేస్తోంది.పిల్లల మొదటి పుట్టిన రోజు నుంచి.. కొన్ని వ్యాధులను నివారించడానికి టీకాలు చాలా అవసరమని జీఎస్కే మెడికల్ డైరెక్టర్ డాక్టర్ షాలినీ మీనన్ వెల్లడించారు. టీకాల ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచవచ్చని.. ఈ విషయాలను తల్లితండ్రులకు తెలియజేయడానికి ఈ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.జీఎస్కే ప్రారంభించిన ఈ కార్యక్రమం గురించి టీవీ, రేడియో, సోషల్ మీడియా, ఓటీటీ వంటి మల్టిపుల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ప్రచారం చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా షెడ్యూల్ గురించి తెలుసుకోవడానికి వైద్యులను సంప్రదించాలి లేదా 'మైవ్యాక్సినేషన్ హబ్.ఇన్' వంటి సైట్లను సందర్సించాల్సి ఉంటుంది. -
వ్యాక్సిన్ ఇప్పిద్దాం...మహిళల ప్రాణాలు కాపాడదాం
రాజ్యసభ సభ్యురాలిగా మొదటిసారి సమావేశాల్లో పాల్గొన్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధామూర్తి భారతీయ పేద మహిళల్లో ఇటీవల అత్యధికంగా చోటు చేసుకుంటున్న సర్వైకల్ క్యాన్సర్ మరణాల గురించి మాట్లాడారు. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం వేక్సిన్ ఇవ్వాల్సిన ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేశారు. నిజమే. సర్వైకల్ క్యాన్సర్ గురించి ఇది చైతన్యం కలిగించాల్సిన సమయం. ప్రభుత్వం పూనుకోవాల్సిన సమయం.కొన్ని అధ్యయనాల ప్రకారం మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాప్తి 7% నుంచి 27% మందిలో కనిపిస్తోంది. ఇవన్నీ క్యాన్సర్‌గా మారనప్పటికీ, చాలా కేసుల్లో క్యాన్సర్ ముప్పు మాత్రం ఉంటుంది. పద్ధెనిమిదేళ్ల తర్వాత పెళ్లయ్యే యువతులతో పోలిస్తే అంతకంటే ముందుగానే వివాహమయ్యేవారిలో ఇది ఆరు శాతం ఎక్కువ. ప్రస్తుత అంచనాల ప్రకారం ప్రతి ఏడాది 1,23,907 మంది మహిళల్లో దీన్ని కనుగొంటుండగా... ఏటా 77,348 మంది మరణిస్తున్నట్లు అంచనా. గణాంకాల ప్రకారం సంఖ్యాపరంగా పదిహేనో ఏటి నుంచి 44 ఏళ్ల మహిళల్లో వస్తూ, వారిని మృత్యుముఖానికి నెట్టే క్యాన్సర్లలో ఇది రెండో అతి పెద్దది.ఏమిటీ సర్వైకల్ క్యాన్సర్? మహిళల్లో యోని (వెజైనా) తర్వాత వచ్చే భాగమే సర్విక్స్. ఇది గర్భాశయానికి కింద ఉంటుంది. అంటే ఇది యోనికీ, గర్భాశయానికీ (యుటెరస్)కూ మధ్యన సన్నటి దారిలా ఉండే సర్విక్స్ గర్భాశయానికి ముఖద్వారంలా ఉంటుంది కాబట్టే దీన్ని ‘గర్భాశయ ముఖద్వారం’ అనీ, దీనికి వచ్చే క్యాన్సర్‌ను ‘సర్వైకల్ క్యాన్సర్’ (గర్భాశయ ముఖద్వార క్యాన్సర్) అని అంటారు. నిజానికి మిగతా క్యాన్సర్లతో పోలిస్తే గర్భాశయ ముఖద్వారపు క్యాన్సర్‌ను చాలా సులువుగా నివారించవచ్చు. క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించడం మంచి పరిష్కారం. దీని చికిత్స కూడా చాలా సులభం. ఎంత ముందుగా గుర్తిస్తే దీనికి అంత సమర్థంగా, తేలిగ్గానూ చికిత్స అందించవచ్చు. సాధారణంగా పల్లెల్లో కంటే పట్టణాల్లో, నగరాల్లో వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ ఈ క్యాన్సర్ విషయానికి వస్తే ఇది గ్రామీణ ప్రాంతాల స్త్రీలలో ఇది చాలా ఎక్కువగా కనిపిస్తోంది. చాలా చిన్నవయసులోనే అందునా పద్ధెనిమిదేళ్ల వయసు కంటే చాలా తక్కువ వయసులోనే అక్కడ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తూ ఉండటం ఇందుకు ఒక కారణమని కొంతమంది పరిశీలకుల విశ్లేషణ. అయితే ఇంతటి తీవ్రమైన వ్యాప్తిలోనూ అదృష్టం ఏమిటంటే... ఈ క్యాన్సర్ రావడానికి ముందర కనీసం 10 ఏళ్ల ముందుగానే కనుగొనగలిగేలా దీనికి చాలా ఎక్కువ వ్యవధిగల ప్రీ–క్యాన్సరస్ దశ ఉంటుంది. ఈ సమయంలో కనుగొనగలిగితే దాన్ని దాదాపు పూర్తిగా నయం చేయడానికి అవకాశముంటుంది.ప్రధాన రకాలు... సర్వైకల్ క్యాన్సర్లలో రెండు ప్రధాన రకాలుంటాయి. మొదటిది తరచుగా కనిపించే ‘స్క్వామస్ సెల్ కార్సినోమా’ అనే రకం. రెండోది ‘అడెనోకార్సినోమా’ తరహాకు చెందినదైతే, ఆపరేషన్ ద్వారా తొలగించగల దశలో ఉంటే, సర్జరీ ద్వారా ఆ భాగాన్ని తొలగించవచ్చు. ఇది కాస్త అరుదు. రిస్క్ ఫాక్టర్లు...హెచ్‌పీవీ వైరస్ సోకడం అనేది సర్వైకల్ క్యాన్సర్‌కు ఓ ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్. చాలామందిలో ఈ హెచ్‌పీవీ వైరస్ దానంతట అదే నశించిపోతుంది. అలా ఒకవేళ నశించకపోతే అది కొంతకాలానికి అది క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదమముంది. అలాగే పొగ తాగడం, ఎయిడ్స్, ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువకాలం గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి కూడా సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీసే రిస్క్‌ఫ్యాక్టర్లలో కొన్ని.చికిత్స ప్రక్రియలు... ఈ క్యాన్సర్ల మొదటి, రెండో దశల్లో శస్త్రచికిత్స అయినా, రేడియోథెరపీ, కీమోథెరపీ... ఈ మూడూ బాగానే పనిచేస్తాయి. అయితే ఈ అన్ని చికిత్సా ప్రక్రియలకు వాటివాటి ప్రయోజనాలూ, దుష్ప్రభావాలూ రెండూ ఉంటాయి. చికిత్సకు ముందు ఈ రెండు అంశాలనూ పరిగణనలోకి తీసుకొని చికిత్స ప్రక్రియను డాక్టర్లు నిర్ణయిస్తారు. సర్జరీతో సాధారణ జీవితానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. సర్జరీ తర్వాత వారం లేదా పది రోజుల్లోనే సాధారణ జీవితం గడిపేలా బాధితులు కోలుకోగలరు. సర్జరీ విజయావకాశాలు 75% నుంచి 90% వరకు ఉంటాయి. పైగా చిన్నవయసులోనే దీని బారిన పడ్డవారికి డాక్టర్లు సాధారణంగా శస్త్రచికిత్సనే సూచిస్తుంటారు. ఆ తర్వాత కూడా క్రమం తప్పకుండా డాక్టర్ల పర్యవేక్షణలో ఉండటం అవసరం. ఇక సర్జరీతో వచ్చే దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువే. ఇది ఎంతమాత్రమూ ప్రాణాంతకం కాదు. ఇక కొద్దిమందిలో సర్జరీ తర్వాత కాంప్లికేషన్లు వస్తే / సర్జరీ అంటే భయపడేవారికి డాక్టర్లు ‘రాడికల్ రేడియోథెరపీ’ అనే చికిత్స చేస్తారు. హెచ్‌పీవీతో సమర్థమైన నివారణమామూలుగా శక్తిమంతమైన వైరస్, బ్యాక్టీరియాలను తట్టుకోవడానికి మన శరీరం ‘యాంటీబాడీస్’ ను తయారుచేస్తుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్‌ను తెచ్చిపెట్టే హెచ్‌పీవీ వైరస్ విషయంలో మాత్రం మహిళల దేహం ఎలాంటి యాంటీబాడీస్లనూ తయారు చేయదు. అందువల్ల ఒకసారి హెచ్‌పీవీ వైరల్ ఇన్ఫెక్షన్ వస్తే అది జీవితాంతం శరీరంలో ఉండిపోయి సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. అదే హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను మహిళకు తొమ్మిది నుంచి 26 ఏళ్ల వయసు లోగా ఇప్పిస్తే యాంటీబాడీస్‌ను తయారుచేసి, సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది. కేవలం బాలికలు, యువతులకే కాకుండా బాలురు, యువకులకూ కూడా ఇచ్చే అత్యాధునిక వ్యాక్సిన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే పురుషులు క్యారియర్లుగా మారి దీన్ని మహిళలకు వ్యాప్తి చేస్తారు కాబట్టి మగవాళ్లకూ ఇచ్చే వ్యాక్సిన్లు రూపొందాయి. ఇవి ఒకటి రెండు రకాలకే గాక... మరిన్ని రకాల సర్వైకల్ క్యాన్సర్లను నివారిస్తాయి. 9 నుంచి 14 ఏళ్ల మగపిల్లల్లో రెండు డోసులూ, పధ్నాలుగేళ్లు దాటిన వారికి 0, 2, 6 నెలల్లో వరసగా ఇవ్వాలి. కారణాలుసర్విక్స్ మహిళ జీవితంలో ఎన్నో దశల్లో అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది. అందువల్ల అక్కడ అతి వేగంగా జరిగే కణవిభజన కారణంగా క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలెక్కువ. సర్వైకల్ క్యాన్సర్‌కు ముఖ్యమైన కారణాల్లో హ్యూమన్ పాపిలోమా వైరస్ (హెచ్‌పీవీ) ప్రధానం. ఈ వైరస్ లైంగికంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దాదాపు సగం జనాభాలో వాళ్ల జీవితంలో ఏదో ఒక సమయంలో హెచ్‌పీవీ వైరస్‌ను కలిగి ఉంటారు. అయితే అందరిలోనూ ఇది సర్వైకల్ క్యాన్సర్‌కు దారితీయదు. దురదృష్టవశాత్తూ కేవలం కొంతమందిలోనే క్యాన్సర్‌ను కలగజేస్తుంది. మల్టిపుల్ పార్ట్నర్స్ తో సెక్స్‌లో పాల్గొనేవారికీ హెచ్‌పీవీ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ.నివారణ... సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణలో పాప్‌స్మియర్ మంచి పరీక్ష. ఇరవయొక్క ఏళ్లు నిండిన మహిళలు మొదలుకొని, లైంగిక జీవితం ప్రారంభమై మూడేళ్లు దాటిన ప్రతి మహిళా తప్పనిసరిగా క్రమంతప్పకుండా పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోవాలి. సర్వైకల్ క్యాన్సర్ విషయంలో మరో వెసులుబాటు ఏమిటంటే ఇది రావడానికి దాదాపు పదేళ్లు ముందుగానే దీన్ని కనుగొనడానికి అవసరమైనంత ‘ప్రీ–క్యాన్సరస్ దశ’ దీనికి ఉంది డా‘‘ కావ్య ప్రియ వజ్రాల లీడ్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ – రిస్క్ ఆబ్స్టెట్రీషియన్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్మహిళల్లో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ కు వ్యాక్సిన్‌ను ప్రభుత్వమే అందజేస్తే మహిళాలోకానికి చాలా మేలు చేసినట్లవుతుంది. తమ కుటుంబానికే తొలి ప్రాధాన్యమిచ్చే స్త్రీలు సొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసి, ఏ నాలుగో దశలోనో, మూడో దశలోనో హాస్పిటల్స్‌కు వస్తూ, చేజేతులా మరణాన్ని తెచ్చుకుంటున్నారు. అదే తొమ్మిది నుంచి 45 ఏళ్ల వయసులోనే వారికీ వ్యాక్సిన్ ఇప్పిస్తే ఎన్నో మరణాలను నివారించగలం. కోవిడ్ టైమ్‌లో దేశం మొత్తానికి వ్యాక్సిన్ ఇప్పించిన మనకు ఇదేమీ కష్టం కాబోదు. ప్రైవేటు సంస్థల్లో దీన్ని దాదాపు రూ. 1,400 నుంచి రూ. 1,500 లకు అమ్ముతున్నారు. వ్యాక్సిన్ తయారీ సంస్థలతో ప్రభుత్వం చర్చలు జరిపి, చవగ్గా ఏ ఏడువందల రూపాయలకో ఇప్పించగలిగితే అత్యంత నిరుపేద మహిళల ప్రాణాలనూ మనం కాపాడ గలిగినవాళ్లమవుతాం. – సుధామూర్తి రాజ్యసభ సభ్యురాలు, సమాజ సేవిక -
పాకిస్తాన్లో పోలియో కేసుల కలకలం
పోలియోమైలిటీస్ వ్యాధిని వాడుక భాషలో పోలియో అని పిలుస్తుంటారు. ఇది ఒక రకమైన అంటు వ్యాధి. వైరస్ కారణంగా వ్యాప్తిచెంది, మానవ నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు వయసుగల చిన్నారులు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి ఇప్పుడు పాకిస్తాన్‌ను వణికిస్తోంది.పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్లోగల క్వెట్టాలో పోలియో కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. తాజాగా ఐదో కేసు వెలుగు చూసింది. ఇది ఏప్రిల్ 29న వెలుగు చూడగా, జూన్ 8న నిర్ధారణ అయ్యింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) నివేదిక ప్రకారం బాధిత చిన్నారి తొలుత అతిసారం, వాంతులు తదితర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని చికిత్స కోసం క్వెట్టాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతున్న తరుణంలో 10 రోజుల తర్వాత ఆ చిన్నారి శరీరంలోని దిగువ భాగం బలహీనంగా మారింది. తరువాత పోలియో వ్యాధి ఆ చిన్నారి శరీరానికంతటికీ వ్యాపించింది. దీంతో బాధిత చిన్నారిని కరాచీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ఎన్ఐసీహెచ్)కు తరలించారు. అక్కడ ఆ చిన్నారికి అక్యూట్ ఫ్లాసిడ్ పక్షవాతం (ఏఎఫ్‌పీ) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వైద్య చికిత్స అందించినప్పటికీ వ్యాధి సోకిన చిన్నారి మే 22న మృతి చెందింది. దీనిపై వైద్యారోగ్యశాఖ విచారణ చేపట్టింది.బాధిత చిన్నారి రక్త నమూనాలను సేకరించారు. ఆ చిన్నారి తోబుట్టువులలో ఒకరికి వైల్డ్ పోలియోవైరస్ టైప్ వన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాగా ఆ చిన్నారికి పోలియో వ్యాక్సిన్ వేయించని కారణంగానే మృతి చెందిందా? అనే కోణంలో వైద్యశాఖ విచారణ చేస్తోంది. -
వేగంగా బీసీజీ వ్యాక్సినేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్షయ(టీబీ) వ్యాధి నియంత్రణ చర్యల్లో భాగంగా వైద్యశాఖ బాసిల్లస్ కాల్మెట్–గ్వెరిన్ (బీసీజీ) వ్యాక్సిన్‌ను వేగంగా పంపిణీ చేస్తోంది. రాష్ట్రంలోని 12జిల్లాల్లో టీకా పంపిణీని ఈ నెల 12న ప్రారంభించింది. తొలి రెండు వారాల్లోనే 16.98శాతం టీకా పంపిణీ పూర్తిచేసింది. కరోనా వ్యాప్తి సమయంలో అవలంబించిన టీటీటీ (ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్) విధానాన్ని టీబీ నియంత్రణలోను వైద్యశాఖ పాటిస్తోంది. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్షల తరహాలో వీలైనంత ఎక్కువ మందికి టీబీ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికి ఉచితంగా వైద్యం, మందులు, పౌష్టికాహారం అందిస్తున్నారు. 2025 నాటికి టీబీ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పెద్దలకు ఉచితంగా టీకా పంపిణీ చేస్తున్నారు. హైరిస్క్ వర్గాలకు... క్షయ వ్యాధి బారినపడే అవకాశం ఉన్న హైరిస్క్ వ్యక్తులను గుర్తించి వారికి టీకా పంపిణీ వేస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, టీబీతో బాధపడుతున్న వ్యక్తుల కుటుంబ సభ్యులు, టీబీ చరిత్ర కలిగిన వారితోపాటు ధూమపానం చేసేవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, చ.మీ.కు 18కిలోల కంటే తక్కువ బాడీ మాస్ ఇండెక్స్ కలిగిన వ్యక్తులు.. ఇలా ఆరు వర్గాలకు చెందిన వారికి తొలి దశలో టీకా పంపిణీ చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, అన్నమయ్య, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, నంద్యాల, పల్నాడు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, విజయనగరం, వైఎస్సార్ జిల్లాల్లో ఆరు వర్గాలకు చెందినవారు 50లక్షల మంది వరకు ఉన్నట్టు వైద్యశాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. తొలి మూడు నెలల్లో 20లక్షల మందికి టీకా వేయాలని లక్ష్యం కాగా, రెండు వారాల్లోనే 16.98 శాతం 3,39,640 మందికి పూర్తిచేశారు. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 45,891మందికి, నెల్లూరులో 38,602మందికి, వైఎస్సార్ జిల్లాలో 37,995మందికి టీకాలు వేశారు. ప్రస్తుతం ఎంపికచేసిన 12 జిల్లాల్లో ప్రతి గురువారం బీసీజీ వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇప్పటికే పిల్లలకు టీకా ఇప్పటికే వైద్యశాఖ పిల్లలకు సాధారణ టీకాలతోపాటు టీబీకి సంబంధించిన టీకాను వేస్తోంది. వైద్యశాఖ 2022లో ఉచితంగా వ్యాక్సినేషన్ ప్రారంభించింది. తొమ్మిది నెలల్లోపు పిల్లలకు మూడు డోసులుగా ఈ టీకాను వేస్తున్నారు. పుట్టిన ఆరు వారాలలోపు ఒక డోసు, 14 వారాల్లోపు రెండో డోసు, చివరిగా 9 నెలల వయసులోపు మూడో డోసు వేస్తున్నారు. మూడు డోసుల టీకా వేసుకున్న పిల్లలకు న్యుమోనియా నుంచి రక్షణ లభిస్తుందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. -
COVID-19 Vaccination టీకాతో సమస్యలు నిజం!
కొవిడ్-19 వాక్సినేషన్, గుండెపై ప్రభావానికి అనేక వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. వివిధ దేశాల్లో ఈ టీకా తీసుకున్న వారిలో(భారత్ మినహా) గుండె సమస్యలు, మెదడు, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. గులియన్ బారే సిండ్రోమ్, మయోకార్డిటిస్, పెర్కిర్డిటిస్ , సెరిబ్రల్ వీనస్ సైనస్ థ్రాంబోసిస్ (CVST) లాంటి కేసులు కనీసం 1.5 రెట్లు పెరిగాయని ఈ స్టడీ వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం, ఆక్లాండ్ విశ్వవిద్యాలయంలో COVID-19 టీకాతో తీవ్ర ప్రమాదం ఉందో లేదో నిర్ధారించేందుకు ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద వ్యాక్సిన్ అధ్యయనం అని తెలుస్తోంది. భారత్ మినహా, వివిధ దేశాల్లో 9.9 కోట్లమంది వాక్సిన్ తీసుకున్న వారిని విశ్లేషించారు. 13 రకాల ప్రభావాలను పరీశీలించారు. వివిధ దేశాల్లో 9.9 కోట్లమందిలో ద గ్లోబల్ కొవిడ్ సేఫ్టీ ప్రాజెక్ట్ పేరుతో ఈ పరిశోధన నిర్వహించింది. Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్ ప్రపంచ ఆరోగ్య సంస్థ, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ తాజా పరిశోధన కీలక డాటా సేకరించింది. మోడర్నా(mRNA),కోవిషీల్డ్ (ChadOX1) వ్యాక్సిన్ల తర్వాత ఊహించిన దానికంటే ఎక్కువ దుష్ప్రభావాలున్నాయని కనుగొంది. ముఖ్యంగా ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 టీకా తీసుకున్నవారిలో చాలా అరుదైన రక్తం గడ్డకట్టే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనం పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేసే Guillain-Barre సిండ్రోమ్‌ను గుర్తించారు ఇది కండరాలకు తీవ్ర హాని కలిగించవచ్చు, సుదీర్ఘ చికిత్స తీసుకోవాలి. ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. ఈ టీకా డోస్ తీసుకున్న వారిలో 6.9 రెట్లు ఎక్కువ ప్రమాదం ఉందని అధ్యయనం కనుగొంది. వెడ్డింగ్ సీజన్: ఇన్స్టెంట్ గ్లో, ఫ్రెష్ లుక్ కావాలంటే..! కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తో గుండెపై తీవ్ర దుష్ప్రభావాలు, గుండెపోటు,పక్షవాతం,రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో గుండె సమస్యలు, మెదడు రక్తనాళాల్లో గడ్డకట్టడం వంటివి 1.5 రెట్లు పెరిగాయట. ఈ తరహా టీకాలే భారత్‌లోనూ పెద్ద సంఖ్యలో తీసుకున్నారని, దీని ప్రభావం ఏంటన్నది మాత్రం శాస్త్రీయంగా బయటకు రాలేదనినిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ కోవిడ్ వ్యాక్సిన్ సేఫ్టీ ప్రాజెక్ట్ కింద అర్జెంటీనా, న్యూ సౌత్ వేల్స్ , ఆస్ట్రేలియాలోని విక్టోరియా, బ్రిటిష్ కొలంబియా , కెనడా, డెన్మార్క్‌లోని అంటారియోతో సహా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ , స్కాట్లాండ్ పలు ప్రదేశాల్లో డి COVID-19 వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రతికూల సంఘటనలపై ఎలక్ట్రానిక్ హెల్త్‌కేర్ డేటాను సేకరించింది. కాగా కరోనా మహమ్మారి ప్రారంభం తరువాత ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 13.5 బిలియన్ల కంటే ఎక్కువ టీకాలు తీసుకున్నట్టు సమాచారం. అయితే ఈ పరిశోధనపై వాక్సిన్ తయారీదారులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఏడు టీకాలతో 7-స్టార్ రక్షణ : పిల్లల టీకాలపై జీఎస్కే ప్రచారం
ప్రముఖ ఫార్మా సంస్థ గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (GSK) పిల్లలకు క్లిష్టమైన రక్షణను అందించే టీకాల గురించి అవగాహన కల్పిస్తోంది. ఒకటి నుండి రెండేళ్ల మధ్య వయస్సున్న పిల్లలకు అందించాల్సిన టీకాలపై జనవరి 25 నుంచి ప్రచారాన్ని ప్రారంభించింది. 1-2 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఏడు కీలకమైన టీకాల ద్వారా '7-స్టార్ ప్రొటెక్షన్' అందించాలంటూ తల్లిదండ్రులను కోరుతోంది. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ (IAP) పిల్లలకు ఏడు టీకాలును సిఫార్సు చేస్తోంది, చికెన్‌పాక్స్ హెపటైటిస్ ‘ఏ’ తొలి డోస్ , ఎంఎంఆర్ (MMR) మెనింజైటిస్ రెండో డోస్, పీసీవీ DTP Hib IPV బూస్టర్ డోస్, ఫ్లూ వార్షిక మోతాదు ప్రధానంగా ఉన్నాయి. పలు రకాల ఇన్ఫెక్షన్లనుంచి కాపాడి, రోగ నిరోధక వ్యవప్తను బలోపేతం చేసే టీకాలు వేయవలసిన అవసరంపై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పిస్తోంది. బిడ్డ పుట్టిన తొలి ఏడాదిలో టీకాలపై ఎక్కువ ఆసక్తి ఉన్నప్పటికీ, రెండో సంవత్సరంలో టీకాలు వేయించుకోని వారి సంఖ్య పెరుగుతోందని జీఎస్కే తెలిపింది. దీంతో పాక్షికంగా టీకాలు తీసుకుంటున్న పిల్లల సంఖ్య దేశంలో బాగా పెరుగుతోందని పేర్కొంది. అంటే తొలి ఏడాది శ్రద్దగా వాక్సీన్లు వేయించిన తల్లిదండ్రులు, రెండో ఏడాదికి వచ్చేసరికి మునుపటి శ్రద్ధ చూపించడలేదు. అలా కాకుండా క్రమంగా తప్పకుండా పిల్లలకు టీకాలు వేయిస్తే వారి ఆరోగ్య భవిష్యత్తుకు బంగారు బాట వేసినట్టు అవుతుందనే సందేశంతో జీఎస్కే ఈ ప్రచారాన్ని చేపట్టింది. పాక్షికవ్యాక్సినేషన్ వల్ల పిల్లల్ని తీవ్రమైన సమస్యలకు గురి చేస్తుందని జీఎస్కే చెబుతోంది. అందుకే రెండో సంవత్సరంలో కూడా క్రమం తప్పకుండా టీకాలు వేయించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. ఇది పిల్లల్ని చాలా రోగాల నుంచి పిల్లలను కాపాడుతుందంటోంది. అలాగే రెండో ఏడాదిలో టీకాలను తీసుకోని పిల్లలు స్వయంగా ప్రమాదంలో పడటంతోపాటు, ఇంట్లో వారి మిగిలిన తోబుట్టువులను, అమ్మమ్మ తాత,నానమ్మ తదితర వృద్ధులకు ఇన్ఫెక్షన్ వ్యాపించి వారిని మరింత ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని కంపెనీ పత్రికా ప్రకటన తెలిపింది. టీకాలతో నివారించగలిగే చికెన్‌పాక్స్, మీజిల్స్ , ఫ్లూ వంటి వ్యాధులు గత మూడేళ్లలో దేశంలో బాగా వ్యాపించాయని జీఎస్కే ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ , మెడికల్ అఫైర్స్, డాక్టర్ రష్మీ హెగ్డే తెలిపారు. పిల్లల అభివృద్ధిపై టీకాల దీర్ఘకాలిక ప్రభావాన్ని నొక్కి వక్కాణించిన ఆయన సంబంధిత టీకాలను పూర్తి చేయడం ద్వారా ఆరోగ్య కరమైన సంతోషకరమైన బాల్యం అందించినట్టు అవుతుందన్నారు. రెండేళ్ల వయసున్న పిల్లల ఎదుగుదలకు భరోసా ఇచ్చే టీకాల గురించి తెలిదండ్రులకు అవగాహన కల్పించడమే తమ ప్రచార లక్ష్యమని హెగ్డే వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల వైద్యుల క్లినిక్‌లలో టెలివిజన్, సోషల్ మీడియా, పోస్టర్లు వంటి బహుళ ఛానెల్‌లలో ప్రచారాన్ని ప్రారంభించింది. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా వివరాలపై మరింత సమాచారం కోసం శిశు వైద్యులను సంప్రదించాలి. 7 కీలకమైన VPDల గురించి అదనపు సమాచారాన్ని MyVaccinationHub.inలో కూడా పొందవచ్చు. -
అన్ని వేరియంట్లకు ఒకే టీకా?
బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) సైంటిస్టులు వినూత్నమైన కోవిడ్–19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. సార్స్–కోవ్–2కు చెందిన అన్ని రకాల సబ్ వేరియంట్లను ఇది సమర్థంగా ఎదుర్కొంటోందని చెబుతున్నారు. భవిష్యత్తులో పుట్టుకొచ్చే వేరియంట్లపైనా పోరాడగలదని అంటున్నారు. కాగా, ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ నేతృత్వంలో ఐఐఎస్సీ మాలిక్యులర్ బయోఫిజిక్స్ యూనిట్ బృందం తయారు చేసిన ఈ టీకాకు ఆర్ఎస్2 అని పేరుపెట్టారు. కోవిడ్–19పై జరుగుతున్న పోరాటంలో ఈ వ్యాక్సిన్ ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని సైంటిస్టులు అభివర్ణించారు. ఇది వేడిని తట్టుకోగలదని, చల్లని ప్రదేశంలో నిల్వ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా వైరస్‌కు చెందిన స్పైక్ ప్రొటీన్లలోని రెండు కాంపోనెంట్ల సమ్మేళంతో ఆర్ఎస్2 టీకాను అభివృద్ధి చేశారు. ఇదొక సింథటిక్ యాంటీజెన్. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాలతో పోలిస్తే ఆర్ఎస్ఈ టీకా మరింత ఎక్కువ రక్షణ ఇస్తుందని ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇందులోని ఎస్2 అని సబ్ యూనిట్ వైరస్ మ్యుటేషన్లను సమర్థంగా తట్టుకుంటుందని పేర్కొన్నారు. -
బూస్టర్ డోసు అవసరమా? నిపుణులు ఏమంటున్నారు?
దేశంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న కరోనా వైరస్‌లోని కొత్త సబ్-వేరియంట్ జేఎన్.1 భారతదేశంలోకి ప్రవేశించింది. కేరళలో తొలి కేసు నమోదైన తర్వాత గోవా, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం బూస్టర్ డోసు లేదా నాలుగో వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియా సార్స్- కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం చీఫ్ ఎన్కే అరోరా మాట్లాడుతూ.. కొత్త సబ్-వేరియంట్లు వ్యాప్తి చెందుతున్నప్పటికీ కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. డాక్టర్ అరోరా మాట్లాడుతూ.. 60 ఏళ్లు పైబడిన వారు, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే, ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోని పక్షంలో ముందుజాగ్రత్త చర్యగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సాధారణ ప్రజలకు నాలుగో డోసు అవసరం లేదని చెప్పారు. ఓమిక్రాన్‌లోని ఈ కొత్త సబ్-వేరియంట్‌కు సంబంధించిన కేసులు తీవ్రంగా లేవని, వైరస్ సోకిన వారిని ఆసుపత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని అన్నారు. జేఎన్.1 సబ్‌వేరియంట్ లక్షణాలు.. జ్వరం, ముక్కు కారటం, దగ్గు, కొన్నిసార్లు విరేచనాలు, తీవ్రమైన శరీర నొప్పులు అని తెలిపారు. ఇవి సాధారణంగా ఒక వారం రోజులలో తగ్గిపోతాయన్నారు. కాగా కోవిడ్-19 పరీక్షలను పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించిన డేటాలోని వివరాల ప్రకారం దేశంలో ఆదివారం కొత్తగా 656 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కి చేరుకుంది. ఇది కూడా చదవండి: పెల్లుబికిన భక్తి ప్రవాహం.. చార్ధామ్ యాత్రలో భక్తుల రద్దీ! -
ఆకస్మిక మరణాలకు.. టీకాకు సంబంధం లేదు!
అకస్మాత్తుగా తీవ్రస్థాయి వ్యాయామంతో ముప్పు.. పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. కుప్పకూలిన 22 ఏళ్ల యువకుడు!.. వ్యాయామం చేస్తూండగా గుండెపోటు.. 42 ఏళ్ల యాక్టర్ మృతి.. పాతికేళ్లకే గుండెపోటు.. ఆకస్మిక మరణం!.. ఇలాంటి శీర్షికలు వార్తాపత్రికల్లో మీరూ చూసే ఉంటారు. కోవిడ్ తరువాత ఇలాంటి ఆకస్మిక మరణాలు మరీ ముఖ్యంగా తక్కువ వయసు వారిలో ఎక్కువయ్యాయి అన్న చర్చ కూడా జరిగే ఉంటుంది. అయితే ఇందులో వాస్తవం లేదంటోంది భారత వైద్య పరిశోధన సమాఖ్య (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, క్లుప్తంగా ఐసీఎంఆర్). కోవిడ్ టీకాలతోనే గుండె జబ్బుల ముప్పు పెరిగిందన్నది ప్రజల్లో ఉన్న అపోహ మాత్రమేనని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అధ్యయన పూర్వకంగా స్పష్టం చేస్తున్నారు. కోవిడ్ కంటే ముందు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం మొదలుకొని కుటుంబ ఆరోగ్య చరిత్ర, మితిమీరిన మద్యపానం, అలవాటు లేని తీవ్రమైన పనులు కొనసాగించడం వంటివి యువత ఆకస్మిక మరణాలకు కారణాలు కావచ్చునని వీరు అంటున్నారు. కోవిడ్ తరువాత యువకులు ఆకస్మికంగా గుండెజబ్బుల కారణంగా మరణిస్తున్నారన్న వదంతులు ప్రబలుతున్న సమయంలో ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా ఒక అధ్యయనం చేపట్టారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 47 టెరిటరీ ఆసుపత్రుల్లో నిర్వహించిన ఈ అధ్యయనం ద్వారా అసలు సమస్య ఏమిటన్నది తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఈ అధ్యయనంలో 18 - 45 మధ్య వయస్కుల ఆకస్మిక మరణాల కారణాలను విశ్లేషించారు. ఈ మరణాల్లో కొంతమంది సెలబ్రిటీలూ ఉండటం గమనార్హం. ‘‘కోవిడ్ వ్యాధి, టీకాలకు ఈ మరణాలకు సంబంధం ఉందన్న ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో అసలు కారణాలేమిటో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం చేపట్టాం’’ అని ఐసీఎంఆర్ ఒక ప్రకటనలో తెలిపింది. 3645 మంది వివరాలతో... ఐసీఎంఆర్ అధ్యయనంలో భాగంగా మొత్తం 3645 మంది వివరాలను విశ్లేషించారు. ఇందులో కోవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరి ఆ తరువాత 24 గంటల్లోనే మరణించిన వారు కూడా ఉన్నారు. వీరందరూ 18 - 45 మధ్య వయస్కులే. ఆకస్మిక మరణానికి కారణం కాగల వ్యాధులు, సమస్యలు ఏవీ లేనివారే. అక్టోబరు 2021 - మార్చి 2023 మధ్యకాలంలో వీరు ఆకస్మికంగా మరణించారు. ఆకస్మిక మరణాలకు గుండె సంబంధిత సమస్యలే కారణమైనప్పటికీ అన్నీ కార్డియాక్ అరెస్ట్ (అకస్మాత్తుగా గుండె పనిచేయకుండా పోవడం) ఫలితంగానూ జరగలేదని ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడియమాలజీ డైరెక్టర్ శాస్త్రవేత్త మనోజ్ ముర్హేకర్ తెలిపారు. మరణించిన వారి సమచారాన్ని, కోవిడ్ బాధితులను పోల్చి చూసినప్పుడు టీకాలే మరణానికి కారణమని సూచించే ఏ అంశమూ బయటపడలేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘వాస్తవానికి టీకాలు మరణాలను అడ్డుకుంది. ఆకస్మిక మరణాలకు ఇతర కారణాలు ఉండి ఉండవచ్చు’’ అని ఆయన వివరించారు. కోవిడ్ -19 టీకాలు, వ్యాధి, చికిత్స తరువాత ఆరోగ్యం వంటి విషయాలపై తాము కొంతమందిని ఇంటర్వ్యూ చేశామని, కుటుంబంలో ఆకస్మిక మరణాల చరిత్ర ఏమైనా ఉందా? అన్నదీ పరిశీలించామని, ధూమపానం, మత్తుముందుల వాడకం, మద్యపానం ఎంత తరచుగా చేస్తారు? మరణానికి రెండు రోజుల ముందు అతిగా శ్రమించారా? వంటి వివరాలు అడిగి తెలుసుకున్నామని... ఇలాంటి కారణాల వల్లనే చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసిందని మనోజ్ ముర్హేకర్ తెలిపారు. ‘‘మద్యపానం ఎంత తరచుగా తీసుకుంటూంటే ఆకస్మిక మరణానికి అవకాశాలు అంత ఎక్కువగా పెరిగాయి’’ అని వివరించారు. రెండు డోసుల టీకాతో రక్షణ... కోవిడ్ వ్యాధి నివారణకు రెండు డోసుల టీకాలు వేసుకున్న వారు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశాలు తక్కువైనట్లు తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్ చెబుతోంది. అయితే కోవిడ్-19 కారణంగా మరణాలు ఎలా సంభవిస్తాయన్న అంశం ప్రస్తుతానికి పూర్తిగా అర్థం కావడం లేదని తెలిపింది. అయితే సార్స్ కోవ్-2 వ్యాధి వల్ల గుండెజబ్బు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువవుతుందని మాత్రం ఈ అధ్యయనం అంగీకరించడం గమనార్హం. ఆకస్మిక మరణాలకూ కారణమవుతుందా? అన్న విషయంపై మాత్రం తగినంత సమాచారం లేదని ఐసీఎంఆర్ చెబుతోంది. కోవిడ్ టీకాల కారణంగా ఆకస్మిక మరణాలు పెరిగాయని కొంతమంది తగిన సాక్ష్యాధారాల్లేకుండా మాట్లాడుతున్రాను. వ్యాక్సీన్లతో మరణాలు తగ్గాయని చెప్పేందుకు రుజువులు ఉన్నాయి. ముప్ఫై ఏళ్ల పైబడ్డ వారు.. అప్పటివరకూ తరచూ వ్యాయామం చేయకుండా.. అకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం మొదలుపెడితే వారిలో ఆకస్మిక మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఆకస్మాత్తుగా తీవ్రస్థాయిలో శ్రమించడం వల్ల గుండె రక్తనాళాల్లో అప్పటివరకూ పేరుకుపోయిన గార లాంటి పదార్థం ముక్కలై గుండెపోటుకు దారితీయవచ్చు’’ అని వైద్య నిపుణులు కొందరు చెబుతున్నారు. చదవండి: డయాబెటిస్ పేషెంట్స్.. ఇకపై ఆ బాధ తీరినట్లే -
కొవిన్ పోర్టల్‌లో డేటా లీక్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం
సాక్షి, ఢిల్లీ: కొవిన్ పోర్టర్‌లోని డేటా లీక్ అయ్యిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డేటా లీక్ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. ఆరోగ్య శాఖకు చెందిన కొవిన్ పోర్టల్ పూర్తిగా సురక్షితమని స్పష్టం చేసింది. ఆ పోర్టల్‌లోని సమాచారం గోప్యంగా ఉందని వెల్లడించింది. ఈ క్రమంలనే డేటా లీక్ వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. కాగా, డేటా లీక్ అంశంపై కేంద్రం స్పందించింది. ఈ సందర్బంగా కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో కొవిన్ పోర్టర్‌లోని డేటా లీక్ అయిందన్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది. ఎలాంటి ఆధారం లేకుండానే లీకైనట్లు ప్రచారం జరిగిందని స్పష్టం చేసింది. ఈ ఘటనపై నివేదిక సమర్పించాలని సీఈఆర్టీని కేంద్రం కోరింది. ఇదే సమయంలో కొవిన్ పోర్టల్ పూర్తిగా సేఫ్. ఇందులోని డేటాను సీక్రెట్‌గా ఉంచేందుకు వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్, యాంటీ-డీడీఓఎస్, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇలా అన్ని భద్రతా ప్రమాణాలతో పోర్టల్‌ను రూపొందించినట్టు స్పష్టం చేసింది. ఇక, ఓటీపీ అథెంటికేషన్‌తో మాత్రమే కొవిన్ పోర్టల్‌లోని డేటాను చూడగలమని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఓటీపీ లేకుండా కొవిన్ పోర్టల్‌లోని సమాచారాన్ని ఏ బాట్‌లోనూ షేర్ చేయలేమని కేంద్రం పేర్కొంది. డేటా లీక్ వార్తలపై తాము దర్యాప్తు చేపటినట్టు కేంద్రం వెల్లడించింది. కాగా, కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం కొవిన్ పోర్టల్‌ను కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఫోన్ నంబర్, ఆధార్ నంబర్లో భారతీయులు టీకా తీసుకున్నారు. ఇందులో వ్యక్తుల పేర్లు, ఆధార్ వివరాలు, ఫోన్ నంబర్‌తో పాటు ఏయే తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్ వేసుకున్నారు వంటి సమాచారం ఉంటుంది. ఇది కూడా చదవండి: టీకా వేయించుకున్నారా? డాటా లీక్ -
అవన్నీ గుండెపోట్లు కావు.. గుండెపోటు ఎవరికి వస్తుంది?
సాక్షి, హైదరాబాద్: నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోతున్నారు..నృత్యం చేస్తూ నేలరాలిపోతున్నారు. జిమ్ చేస్తూ జీవితాలు ముగిస్తున్నారు. జోకులేస్తూనే ప్రాణాలొదిలేస్తున్నారు. వీరిలో మధ్య వయసు్కలు, యువత, కొన్ని సందర్భాల్లో 15 ఏళ్ల లోపు వారూ ఉంటున్నారు. దీంతో ఆరోగ్యవంతుల్ని సైతం గుండెపోటు భయం పట్టిపీడిస్తోంది. అనుమానాలతో ఆస్పత్రులకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే అన్ని ఆకస్మిక మరణాలకూ గుండెపోట్లనే కారణంగా పరిగణించలేమని వైద్యులు చెబుతున్నారు. జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించడంలో జాప్యం కూడా ఆకస్మిక మరణాలకు దారితీస్తోందని వారంటున్నారు. జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో మార్పులతో ఈ పరిస్థితుల్ని అధిగమించవచ్చని స్పష్టం చేస్తున్నారు. భయం..భయం.. గుండె పనితీరు గురించిన రకరకాల భయాలు, సందేహాలతో వైద్యుల్ని సంప్రదిస్తున్నవారు ఇటీ వల పెరిగారని ఆన్లైన్ హెల్త్‌కేర్ ప్రొవైడర్ ‘ప్రాక్టో’అధ్యయనం తేల్చింది. గుండె పనితీరు గురించి సందేహాలతో హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణె నగరాల నుంచీ వైద్యుల్ని సంప్రదించిన వారిలో 56% మంది 30–39 సంవత్సరాల మధ్య వయస్కు లేనని వెల్లడించింది.వీరిలో 75% మంది పురుషులు, 25% మహిళలు ఉన్నారు. ఈ నేపథ్యంలో గతేడాది తాము 100 మందికి పైగా కార్డియాలజిస్టులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుప్రాక్టో నిర్వాహకులు తెలిపారు. టీకా కారణం కాదు యువకులు, మధ్య వయస్కు లు ఆకస్మికంగా తీవ్రమైన అనారోగ్యాలకు గురికావడం ఒక్క ఏడాదిలో 31% నుంచి 51%కి పెరిగిందని కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వే వెల్లడించింది. అయితే ఇవి కరోనా టీకాలు వేసిన, వేయని వారిలో కూడా కనిపిస్తున్నాయని తెలిపింది. బ్రిటిష్ మెడికల్ జర్నల్ నివేదిక ప్రకారం.. కోవిడ్ 19 వ్యాక్సిన్లు తీసుకున్న 1,00,000 మందిలో 1.7% మంది మాత్రమే మయోకార్డిటిస్ (కరోనా నేపథ్యంలో గుండె సంబంధిత వ్యాధికి గురికావడం)కు గురయ్యే అవకాశం ఉంది. గుండెపోటు ఎవరికి వస్తుంది? గుండెకు రక్తం సరఫరా చేసే ధమనులలో ఆకస్మిక అడ్డంకులు ఏర్పడటం వల్ల గుండెపోటు సంభవిస్తుంది. ‘ధమనిలో కొవ్వు ఫలకం ఏర్పడి ఇది రక్తనాళంలోకి ప్రవేశించి, గడ్డ కట్టి, అకస్మాత్తుగా ఉక్కిరిబిక్కిరి చేయడాన్నే గుండెపోటుగా పేర్కొంటారు. ‘సాధారణంగా ధూమపానం చేసే వ్యక్తులు, కూర్చుని ఉద్యోగం చేసేవారు, ఊబకాయం కలిగినవారు, తక్కువ రక్తపోటు లేదా తీవ్రమైన మధుమేహం లేదా అధిక కొలెస్ట్రాల్ స్థాయిలున్నవారిలో ఈ పరిస్థితి రావచ్చు..’అని వైద్యులు చెబుతున్నారు. ‘శిక్షణ లేకుండా లేదా అతిగా వ్యాయామం చేయడం వల్ల కూడా కరోనరీ నాళాలలో ఫలకాలు పగిలి, గుండె ఆగిపోవడానికి దారితీయవచ్చు..’అని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విజయకుమార్ చెప్పారు. వ్యాయామశాలకు వెళ్లేవారిలో, ప్రొటీన్ సప్లిమెంట్లను తీసుకోవడం పెరిగిందని, వైద్యుల పర్యవేక్షణ లేకపోతే అది ప్రమాదమని స్పష్టం చేశారు. జీవనశైలిలో మార్పులతో.. జీవనశైలిలో మార్పులు చాలావరకు యుక్త వయస్కులలో అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అలాగే కొన్ని జన్యుపరమైన వ్యాధుల్ని గుర్తించడంలో ఆలస్యం కూడా ఆకస్మిక మరణాలను తెస్తోంది. నిజానికి ప్రతి ఆకస్మిక మరణాన్నీ హార్ట్ ఎటాక్‌గా పరిగణించలేం. మొత్తం ఆకస్మిక మరణాల్లో 3 శాతమే గుండె పోటు కారణంగా సంభవిస్తాయి. ఆహారపు అలవాట్లు, దినచర్యలో మార్పుచేర్పులతో జీవనశైలిని సరైన విధంగా తీర్చిదిద్దుకోవాలి. అలాగే ఏ మాత్రం సందేహం ఉన్నా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. – డా.ఆర్.కె.జైన్, కార్డియాలజిస్ట్, కిమ్స్ ఆసుపత్రి కార్డియో వ్యాస్క్యులర్వ్యాయామాలు అవసరం.. ధూమపానం, మద్యపానం, మధుమేహం, అధిక కొలె్రస్టాల్ వంటి వాటి వల్ల కావచ్చు, ఆధునిక జీవనశైలి వల్ల కావచ్చు గుండె బలహీనపడటం సాధారణమైపోయింది. హృద్రోగాల వల్ల కోల్పోయిన గుండె సామర్థ్యాన్ని తిరిగి దశలవారీగా సంతరించుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని కార్డియో వాసు్క్యలర్ వ్యాయామాలు చేయడం అవసరం. అవి గుండె పంపింగ్ సామర్థ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిన అవసరాన్ని, మందుల వాడకాన్ని తగ్గిస్తాయి. – డాక్టర్ మురళీధర్, ఈఎస్ఐసీ ఆసుపత్రి -
కరోనాతో జాగ్రత్త: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి మళ్లీ వేగంగా పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు ముఖ్య కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా వ్యవహరించాలని, కోవిడ్–19 మేనేజ్మెంట్ కోసం సన్నద్ధం కావాలని సూచించారు. కరోనా లక్షణాలు ఎక్కడ అధికంగా వ్యాప్తిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు గుర్తించాలని చెప్పారు. ఎమర్జెన్సీ హాట్స్పాట్లలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని కోరారు. కోవిడ్–19 వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రజా చైతన్యం ద్వారానే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలి గతంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేశాయని, చక్కని ఫలితాలు సాధించాయని మాండవీయ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సమన్వయంతో పనిచేయాలన్నారు. పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆరోగ్య శాఖ సన్నద్ధతపై ఈ నెల 8, 9న జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులకు పిలుపునిచ్చారు. 10, 11న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై మాక్‌డ్రిల్స్ నిర్వహించాలన్నారు. కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా వైరస్ నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని వివరించారు. టెస్ట్–ట్రాక్–ట్రీట్–వ్యాక్సినేట్‌తోపాటు కోవిడ్–19 నియంత్రణ చర్యల పటిష్ట అమలుతో సత్ఫలితాలు లభిస్తాయని వెల్లడించారు. అర్హులైన వారందరికీ కరోనా టీకాలు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. కోవిడ్–19 బాధితులకు ఆసుపత్రుల్లో సరిపడా పడకలు సిద్ధంగా ఉండేలా, ఔషధాలు లభ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమీక్షా సమావేశంలో పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతోపాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు పాల్గొన్నారు. 6 వేల మార్కు దాటిన కోవిడ్ కేసులు దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 203 రోజుల తర్వాత 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,050 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో యాక్టివ్ కేసులు 28,303కు చేరుకున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. మొత్తం కేసులు 4.47 కోట్లకు చేరాయి. దీంతోపాటు, మరో 14 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాలు 5,30,943కు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేట్ 3.39%కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06%గా ఉంది. ప్రతి 10 లక్షల జనాభాకు 100 టెస్టులు ఎక్స్‌బీబీ.1.5తోపాటు బీక్యూ.1, బీఏ.2.75, సీహెచ్.1.1, ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీఎఫ్, ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని వెల్లడించింది. ఇతర వేరియంట్ల ప్రభావం బాగా తగ్గిందని పేర్కొంది. ఎక్స్‌బీబీ.1.16 అనే వేరియంట్ వ్యాప్తి ఫిబ్రవరిలో 21.6 శాతం ఉండగా, మార్చిలో 35.8 శాతానికి చేరిందని వివరించింది. అయితే, వైరస్ వ్యాప్తి పెరిగినప్పటికీ ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు పెద్దగా నమోదు కాలేదని స్పష్టం చేసింది. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు నిత్యం సగటున 100 కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, హరియాణాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు పేర్కొంది. -
TS: కరోనా టీకా వికటించి 37 మరణాలు
సాక్షి, హైదరాబాద్: కరోనా టీకా వేసుకున్న తర్వాత దాని దుష్ప్రభావాల ఫలితంగా తెలంగాణలో 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. కోవిడ్ టీకా ప్రారంభమైన 2021 జనవరి 16 నుంచి ఈ ఏడాది మార్చి 15వ తేదీ వరకు సంభవించిన మరణాలు, టీకా తర్వాత దుష్ప్రభావాలపై ఒక నివేదికను వెలువరించింది. నివేదిక ప్రకారం టీకా తర్వాత దు్రష్పభావాల కారణంగా దేశంలో 92,479 మంది ఆసుపత్రుల పాలయ్యారు. అందులో తెలంగాణలోనే 10,370 మంది ఆసుపత్రుల్లో చేరారు. ఈ తరహా కేసుల్లో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉండగా, మధ్యప్రదేశ్ మొదటి స్థానంలోఉంది. ఆ రాష్ట్రంలో 10,513 ఘటనలు చోటుచేసుకున్నాయి. గుజరాత్లో 10,127 ఘటనలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఈ మూడు రాష్ట్రాల్లోనే పదివేలకు పైగా ఇటువంటి ఘటనలు నమోదయ్యాయి. అలాగే మహారాష్ట్రలో 8,212, పశ్చిమబెంగాల్లో 8,130, కర్ణాటకలో 6,628 మంది ఆసుపత్రులపాలయ్యారు. కాగా, టీకా అనంతరం దేశంలో మొత్తం 1,156 మంది మరణించారు. అందులో అత్యధికంగా కేరళలో 244 మంది మృతి చెందారు. ఆ తర్వాత మహారాష్ట్రలో 102 మంది, ఉత్తరప్రదేశ్‌లో 86 మంది మరణించారు. మధ్యప్రదేశ్‌లో 85, కర్ణాటకలో 75, పశి్చమ బెంగాల్లో 70 మంది మరణించారు. కాగా, ఛత్తీస్‌గఢ్‌లో కేవలం ఒకరే మృతిచెందడం గమనార్హం. ప్రతి 19.03 లక్షల డోసులకు ఒక మరణం.. దేశంలో ఇప్పటివరకు కోట్లాది మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. అందులో కరోనా టీకా వేసుకున్న ప్రతీ 23 వేల మందిలో ఒకరు ప్రతికూల ప్రభావాలతో ఆసుపత్రుల్లో చేరారు. తెలంగాణలో ఇప్పటివరకు 3.24 కోట్ల మంది కరోనా టీకా మొదటి డోసు వేసుకున్నారు. ఇందులో 3.15 కోట్ల మంది రెండో డోసు, అలాగే 1.35 కోట్ల మంది బూస్టర్ డోసు తీసుకున్నారు.మొత్తం మూడు డోసులు కలిపి 7.75 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. కాగా, రాష్ట్రంలో టీకా తీసుకున్నవారిలో 37 మంది చనిపోయారు. ఇప్పటివరకు దేశంలో 220 కోట్ల టీకా డోసులు ఇచ్చారు. అంటే ప్రతి 19.03 లక్షల డోసులకు ఒక మరణం సంభవించింది.తెలంగాణలో ప్రతీ 20.96 లక్షల డోసులకు ఒక మరణం సంభవించింది. వీటిని దుష్ప్రభావాలతో ఆస్పత్రుల్లో చేరిన తర్వాత జరిగిన మరణాలుగానే ప్రభుత్వం ప్రకటించింది. అంతేగానీ కరోనా వ్యాక్సిన్ వల్లే నేరుగా సంభవించిన మరణాలుగా ప్రకటించలేదని నిపుణులు అంటున్నారు. కోవిడ్ వ్యాప్తితీవ్రతతో సంభవించిన మరణాలతో పోలిస్తే టీకా అనంతర మరణాలు చాలా స్వల్పమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 8.42 లక్షల మందికి కరోనా సోకగా, అందులో 8.38 లక్షల మంది కోలుకున్నారు. కరోనా కారణంగా అధికారికంగా 4,111 మంది చనిపోయారు. ఇతర వ్యాక్సిన్లతోనూ ఇలాగే మరణాలు ఇతర వ్యాక్సిన్లతోకూడా ఇదే తీరులో మరణాలు సంభవిస్తాయి. ప్రతీ మిలియన్ వ్యాక్సిన్ డోసుల్లో ఒక మరణం సంభవిస్తుంది. కరోనా వ్యాక్సిన్ అనంతరం జరుగుతున్న మరణాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అయితే మరే ఇతర వ్యాక్సిన్ కూడా కరోనా టీకా అంత పెద్ద ఎత్తున అన్ని వర్గాలకు వేసినట్లు లేదు. అయినా కూడా సాధారణ స్థాయిలోనే మరణాలు ఉన్నాయి. కరోనా టీకాతోనే కాకుండా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు మృతిచెందితే వారిని కూడా టీకా అనంతర మరణాల జాబితాలో చేర్చే అవకాశముంది. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. –ప్రొఫెసర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
భారీగా కేసులు.. మళ్లీ కరోనా టెన్షన్
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల్లో మళ్లీ భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఐదు నెలల తర్వాత.. రెండు వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 2, 151 కేసులు నమోదు కాగా, క్రియాశీలక కేసుల సంఖ్య 11,903కి చేరినట్లయ్యింది. గత ఐదు నెలల కాలంలో కరోనా కేసులు ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే తొలిసారి. కొన్నిరోజులుగా దేశంలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళతో పాటు యూపీలోనూ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. అయితే.. సోమవారంతో పోలిస్తే మంగళవారం దేశవ్యాప్త కేసుల్లో కాస్త తగ్గుదల కనిపించింది. కానీ, తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్కల్లో కొత్త కేసులు 2 వేలకుపైగా వెలుగు చూశాయి. కేంద్రం ఇప్పటికే కరోనా కేసుల పెరుగుదలపై అన్ని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో అత్యున్నత స్థాయి సమీక్ష జరిగింది కూడా. ఒమిక్రాన్ ఉపవేరియెంట్ ఎక్స్‌బీబీ 1.16 విజృంభణ వల్లే కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. టెస్టుల సంఖ్య పెంచితే.. కేసుల సంఖ్య కూడా ఎక్కువే బయటపడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇక మ్యూటెంట్ వేరియెంట్‌తో రిస్క్ రేట్ తక్కువే అయినప్పటికీ.. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, కాబట్టి ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, వ్యాక్సినేషన్లోనూ పాల్గొనాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ. -
కొనసాగుతున్న హెపటైటిస్ – బీ టీకా పంపిణీ
సాక్షి, అమరావతి: హెపటైటిస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. హెపటైటిస్–బీ బారిన పడేందుకు ఎక్కువ అవకాశాలున్న హెచ్ఐవీ బాధితులకు టీకా పంపిణీని గత నెలలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రారంభించింది. రాష్ట్రంలోని 55 యాంటి రెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉంచింది. హెచ్ఐవీ బాధితులకు స్క్రీనింగ్ నిర్వహించి హెపటైటిస్–బీ నెగెటివ్‌గా నిర్ధారణ అయిన వారికి టీకా వేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 54,805 మందికి తొలి డోసు వేశారు. రెండో డోసు 3,002 మందికి వేశారు. వచ్చే వారంలో హెచ్ఐవీ హైరిస్క్ వర్గాలకు టీకా పంపిణీ ప్రారంభిస్తున్నారు. ఏపీ శాక్స్ హై రిస్క్ వర్గాలుగా గుర్తించిన 3,923 మంది ట్రాన్స్జెండర్లు, 1,16,616 మంది మహిళా సెక్స్ వర్కర్లు, 23,623 మంది పురుష స్వలింగ సంపర్కులు, 1,741 ఇన్‌జెక్టింగ్ డ్రగ్ యూజర్స్.. మొత్తం 1,45,903 మందికి టీకా పంపిణీ లక్ష్యం. ఈ క్రమంలో దేశంలోనే హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ వర్గాలకు టీకా ఇస్తున్న తొలి రాష్ట్రంగా ఏపీ నిలుస్తోంది. తొలి డోసు వేసుకున్న నెలకు రెండో డోసు, తరువాత రెండు నెలలకు చివరి డోసు టీకా వేస్తారు. హెపటైటిస్ నియంత్రణలో భాగంగా ఇప్పటికే వైద్యులు, వైద్య సిబ్బందికి వందశాతం టీకా పంపిణీ చేశారు. కొత్తగా విధుల్లో చేరుతున్న వారికి కూడా టీకా వేస్తున్నారు. వైద్యశాఖ అంచనాల ప్రకారం రాష్ట్రంలో 2.3 శాతం జనాభా హెపటైటిస్ – బీ, 0.3 శాతం హెపటైటిస్–సీతో బాధపడుతున్నారు. శృంగారం, రక్తమార్పిడి, సిరంజిలు, టూత్‌బ్రెష్, రేజర్లు వంటి వివిధ రూపాల్లో హెపటైటిస్–బీ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది. హెచ్ఐవీ బాధితులు, హైరిస్క్ వర్గాల వారు హెపటైటిస్–బీ బారిన పడటానికి ఎక్కువ అవకాశాలుంటాయని, అందువల్ల వీరు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని రాష్ట్ర హెపటైటిస్ వ్యాధి నియంత్రణ కార్యక్రమం ప్రత్యేకాధికారి డాక్టర్ నీలిమ తెలిపారు. దగ్గరలోని ఏఆర్టీ కేంద్రానికి వెళ్లి స్క్రీనింగ్ చేయించుకుని టీకా వేయించుకోవాలన్నారు. హెపటైటిస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయించి, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. -
వ్యాక్సిన్‌తో తగ్గని కరోనా.. ఫైజర్ సీఈవోకి చుక్కలు చూపించిన జర్నలిస్ట్‌లు!
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరయిన ఫైజర్ సీఈవో అల్బర్ట్ బౌర్లకు చేదు అనుభవం ఎదురయింది. కరోనా కట్టడి విషయంలో .. ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నా.. ఫలితం మాత్రం అంత గొప్పగా లేదంటూ కొందరు మీడియా ప్రతినిధులు అల్బర్ట్‌ను ప్రశ్నించారు. వరల్డ్ ఎకనామిక్ సదస్సు నుంచి బయటకు వచ్చి రూం వైపు అడుగులు వేస్తుండగా అల్బర్ట్‌ను చుట్టుముట్టారు మీడియా ప్రతినిధులు. మానవాళిని తప్పుదోవ పట్టించి.. అసత్యాలు, అబద్దాలతో తప్పుడు ప్రచారం చేశారని, వ్యాక్సిన్ల విక్రయించేముందు ఎంతో భరోసా ఇచ్చినా అవేవీ అమలు కాలేదని ప్రశ్నించారు. ఫైజర్ కంపెనీని నమ్మి వ్యాక్సిన్లు తీసుకున్న ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంత జరిగినా.. అల్బర్ట్ మాత్రం నోరు మెదపలేదు. వ్యాక్సిన్ వల్ల వైరస్ సంక్రమణ పూర్తిగా ఉండదని ముందుగానే తెలిసినా.. దాన్ని రహస్యంగా ఉంచారా అని విలేకరులు ప్రశ్నించారు. కరోనా వల్ల చనిపోయిన వారికి ఏం సమాధానం చెబుతావని నిలదీశారు.నీ మీద ఎందుకు క్రిమినల్ కేసులు పెట్టకూడదని అడిగినా..అల్బర్ట్ మాత్రం మౌనంగా ఉండిపోయారు. కరోనా విక్రయాల ద్వారా 2.3 బిలియన్ డాలర్లు ఫైజర్‌కు వచ్చాయని, అసలు ఈ మొత్తం వ్యాక్సిన్ తతంగం వెనక ఎవరు కమీషన్లు ఇచ్చారని అడిగారు. కరోనా వ్యాప్తిని అడ్డుకుని మానవుల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశ్యంతో 2020 ఏప్రిల్‌లో వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది ఫైజర్. అమెరికా ప్రభుత్వం ఆమోదించిన తొలి కోవిడ్ కట్టడి వ్యాక్సిన్ కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఫైజర్‌ను మాత్రమే ఎంపిక చేసుకున్నాయి. దాదాపు ఒకటిన్నర బిలియన్ డోసులను ఫైజర్ విక్రయించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యాక్సిన్లు తీసుకున్న కొందరిలో గుండెపోటు సమస్యలు తలెత్తాయని ఫిర్యాదులు వచ్చినా.. అవి వ్యాక్సిన్ వల్లే వచ్చాయని శాస్త్రీయంగా పూర్తి స్థాయిలో నిరూపితం కాలేదు. 🚨WE CAUGHT HIM! Watch what happened when @ezralevant and I spotted Albert Bourla, the CEO of Pfizer, on the street in Davos today. We finally asked him all the questions the mainstream media refuses to ask. Full story: https://t.co/wHl204orrX SUPPORT: https://t.co/uvbDgOk19N pic.twitter.com/c3STW8EGH3 — Avi Yemini (@OzraeliAvi) January 18, 2023 -
గమనించాల్సిన సైన్సు పరిణామాలు
కొత్త ఏడాదిలో శాస్త్ర విజ్ఞాన పరంగా చాలా అంశాలు ఆసక్తిగా నిలుస్తున్నాయి. కోవిడ్‌కు ముక్కు ద్వారా వేసుకునే టీకాతో పాటు, అధిక ఉష్ణోగ్రతల్లోనూ స్థిరంగా ఉండే టీకా రానున్నాయి. మొత్తంగానే కోవిడ్ పీడ విరగడైందని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించే అవకాశం ఉంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్ తొలి ప్రయత్నంలో భాగంగా ఆదిత్య–ఎల్1ను ఈ ఏడాదే ప్రయోగించనున్నారు. ‘ఇస్రో’ ఈ ఏడాదిలోనే చంద్రయాన్–3ను కూడా ప్రయోగించనుంది. అణు విద్యుత్తు రంగంలో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు పని చేయనున్నాయి. డిజిటల్ పేమెంట్స్ పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ప్రవేశపెట్టనున్న డిజిటల్ రూపాయి ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. కొత్త సంవత్సరంలో అప్పుడే నాలుగైదు రోజులు గడిచిపోయాయి. కాకపోతే ఫీలింగ్ మాత్రం గత ఏడాది జనవరి మాదిరిగానే ఉంది. ఒమిక్రాన్ వేరియంట్ ఆవిర్భావంతో కోవిడ్ ఇంకోసారి విజృంభిస్తుందేమో అన్న బెంగ గత ఏడాదిదైతే, కొత్త రూపాంతరంతో ఏం చిక్కు వస్తుందో అన్న భయం ఈసారి వెంటాడుతోంది. సమస్య కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఆరోగ్య వ్యవస్థ మొత్తానికీ సవాలు విసరగలగటం ఆందోళ నకరం. కాకపోతే దేశం ఇప్పటికే సంసిద్ధమై ఉన్న కారణంగా కొంచెం నింపాదిగా ఉండవచ్చు. అయితే ఈ ఏడాది ప్రశ్న కోవిడ్ ఇంకోసారి విజృంభిస్తుందా, లేదా? అన్నది కాదు. ఈ పీడ శాశ్వతంగా విరగడ అవుతుందా, కాదా? అన్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రియాసస్ మాత్రం కొంత ఆశావహంగానే ఉన్నారు. ఈ ఏడాది ఏదో ఒక సమయంలో కోవిడ్ శని వదిలిందని ప్రకటించే అవకాశమున్నట్లు చెబుతున్నారు. జనవరిలోనే జరిగే డబ్ల్యూహెచ్ఓ అత్యవసర కమిటీ సమావేశాల్లోనే ఈ అంశంపై చర్చ జరగనుంది. వేడిలోనూ పనిచేసే టీకా కోవిడ్–19 ప్రపంచానికి ముప్పు అన్న హెచ్చరికను డబ్ల్యూహెచ్ఓ తొలగించినప్పటికీ వైరస్‌తో ప్రమాదం లేదని అర్థం కాదు. ఇప్పటికే ఉన్న అనేకానేక శ్వాసకోశ సంబంధిత వ్యాధుల జాబితాలోకి ఇది కూడా చేరిపోయి అప్పుడప్పుడూ అక్కడక్కడా వచ్చిపోతూ ఉంటుంది. ఆరోగ్య వ్యవస్థలు మాత్రం నిత్యం ముంగాళ్లపై ఉండా ల్సిన పరిస్థితి. అదే సమయంలో శాస్త్రవేత్తలు కొత్త టీకాలు, చికిత్స లను కనుక్కునే ప్రయత్నాల్లో ఉంటారు. భారత దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన నాసల్ వ్యాక్సీన్ (ముక్కు ద్వారా తీసు కునేది) అందరి దృష్టిలో ఉంది. అత్యవసర పరిస్థితుల్లో, బూస్టర్ డోసుగా వాడేందుకు ఈ టీకాకు అనుమతులు లభించాయి. ఈ టీకా వేయడం మొదలుపెడితే విస్తృత సమాచారం అందుబాటులోకి వస్తుంది. తద్వారా టీకా సామర్థ్యం ఏమిటన్నదీ తెలిసిపోతుంది. ఈ ఏడాది గమనించాల్సిన ఇంకో కోవిడ్ వ్యాక్సీన్ వేడిని కూడా తట్టుకునే రకానిది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు లోని స్టార్టప్ కంపెనీ మైన్వాక్స్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాయి. ఇప్పటివరకూ జరిగిన అధ్యయనాల ప్రకారం... ఈ టీకా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా రూపాంతరితాలను నాశనం చేయగల యాంటీబాడీలను తయారు చేయగలదని తేలింది. చండీగఢ్‌లోని సీఎస్ఐఆర్–ఐఎంటెక్తోపాటు, ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రిపేర్డ్నెస్లలో ఈ టీకాను పరీక్షించారు. మానవ ప్రయోగాలు ఈ ఏడాది ప్రారంభం కావచ్చు. ఇప్పటివరకూ తయారైన టీకాలను రిఫ్రిజరేటర్లలో భద్రపరచాల్సిన అవసరముండగా... కొత్త టీకా అధిక ఉష్ణోగ్రతల్లోనూ స్థిరంగా ఉంటుంది. దీనివల్ల ఎంతో ప్రయోజన ముంటుందన్నది తెలిసిన విషయమే. ఆదిత్యుడి పైకి చూపు ఈ ఏడాది శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అందరూ ఎదురు చూస్తున్న ప్రయోగాల్లో ఆదిత్య–ఎల్1 ముఖ్యమైందని చెప్పాలి. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు భారత్ తొలి ప్రయత్నమిది. సుమారు 400 కిలోల బరువుండే ఈ ఉపగ్రహంలో స్వదేశీ పరిజ్ఞానంతో సిద్ధం చేసిన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్‌ను ఏర్పాటు చేశారు. శ్రీహరికోట నుంచి ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే దీని ప్రయోగం జరిగే అవ కాశం ఉంది. కరోనాగ్రాఫ్తోపాటు ఆదిత్య–ఎల్1లో ఇంకో ఆరు పేలోడ్స్ ఉంటాయి. భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు శూన్యంగా ఉండే లగ్రానిగన్ పాయింట్ (ఎల్1)లో ఉంటూ ఈ ఉపగ్రహం సూర్యుడిని పరిశీలిస్తుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాదిలోనే చంద్రయాన్–3ను కూడా ప్రయోగించ నుంది. చంద్రుడి ఉపరితలం పైకి సురక్షితంగా దిగడాన్ని పరీక్షించేం దుకు చంద్రయాన్–2 ఉపయోగపడగా, తాజాగా చంద్రయాన్–3లో ఒక లాండర్, ఓ రోవర్ రెండూ ఉంటాయి. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా వీటిని జాబిల్లిపైకి చేర్చనున్నారు. మళ్లీ గగన్‌యాన్ మిస్? ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో గగన్‌యాన్ ఒకటి. అయితే అది ఈ ఏడాది కూడా డెడ్‌లైన్‌ను అందుకోకపోవచ్చు. 2018 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ ‘‘భరత మాత ముద్దుబిడ్డ ఒకరు 2022 లేదా అంతకంటే ముందుగానే భారతీయ రాకెట్లో అంతరిక్షంలోకి ఎగురు తారు’’ అని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి ఇటీవల లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ, గగన్‌యాన్‌ను 2024 నాలుగో త్రైమాసికంలో ప్రయోగించే అవకాశం ఉన్నట్లు తెలపడం ప్రస్తావించాల్సిన అంశం. సిబ్బంది తప్పించు కునేందుకు అవసరమైన వ్యవస్థ, పారాషూట్ ఆధారంగా వేగాన్ని తగ్గించుకునేందుకు చేయాల్సిన ఏర్పాట్ల విషయంలో జాప్యం జరగడం వల్ల గగన్‌యాన్ మరోసారి వాయిదా పడింది. ఈ ప్రయో గాలు ఈ ఏడాది చివరిలో జరగవచ్చు. 2024 రెండో త్రైమాసికంలో సిబ్బంది లేకుండా ఒక ప్రయోగాన్ని నిర్వహించి ఆ తరువాత అసలు ప్రయోగం చేపట్టవచ్చు. గగన్‌యాన్‌లో పాల్గొనే వ్యోమగాముల ఎంపిక ఇప్పటికే జరిగిపోయింది. వీరు రష్యాలో తొలిదశ శిక్షణ పూర్తి చేసుకుని ప్రస్తుతం బెంగళూరులో ఇతర శిక్షణలు పొందుతున్నారు. చిన్న అణు రియాక్టర్లకు సమయం? ఈ ఏడాది దేశంలో అణు విద్యుత్తు రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లకు సంబంధించి కొంత కదలిక కనిపించవచ్చు. కాలుష్య రహిత విద్యుత్తును ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏర్పడటం వల్ల, పైగా ఉక్రెయిన్ యుద్ధం పుణ్యమా అని ప్రపంచస్థాయిలో విద్యుత్తు రంగం తీరుతెన్నులు మారి పోయాయి. భారీస్థాయి అణు రియాక్టర్ల మాదిరిగా కాకుండా, 300 మెగావాట్ల సామర్థ్యమున్న ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లను ఫ్యాక్టరీల్లో తయారు చేసే సౌలభ్యం ఉంది. పెద్ద రియాక్టర్లనైతే విద్యుత్తు కేంద్రం ఏర్పాటు చేసే స్థలంలోనే అమర్చాల్సి ఉంటుంది. దీనివల్ల నిర్మాణానికి చాలా సమయం పట్టేస్తుంది. ఈ నేపథ్యంలోనే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ల తయారీలో ప్రైవేట్ కంపెనీలకూ అవ కాశం కల్పించేందుకు ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. డిజిటల్ రూపాయి కూడా.. రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ రూపాయిని అందుబాటులోకి తేనుండటం ఈ ఏడాది ఎదురు చూడాల్సిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానపరమైన అంశాల్లో ఒకటి. దీంతోపాటు జన్యుమార్పిడి ఆవాల పంట క్షేత్ర ప్రయోగాలు, జీ20 అధ్యక్ష స్థానంలో భాగంగా చేపట్టనున్న సైన్స్ డిప్లొ మసీ, కృత్రిమ మేధ రంగాల్లోని మార్పులనూ నిశితంగా చూడాల్సి ఉంటుంది. డిజిటల్ పేమెంట్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో డిజిటల్ రూపాయి ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది. భౌతిక రూపాయి కున్నంత భద్రత, ఫీచర్లు, నమ్మకం డిజిటల్ రూపాయికీ ఉంటాయని ఆర్బీఐ చెబుతోంది. గోప్యత ఎంత వరకన్నది ఒక సందేహమే. ఈ ఏడాది జరగనున్న జీ20 సమావేశాలు భారతదేశంలో జరుగుతున్న సైన్స్, టెక్నాలజీ ఇన్నొవేషన్లను ప్రపంచానికి పరిచయం చేసేందుకు చక్కటి అవకాశాల్ని కల్పిస్తున్నాయి. జీ20 సభ్యదేశా లన్నింటికీ మరింత దగ్గరయ్యేందుకు సైన్స్ డిప్లొమసీని ఉపయోగించు కోవాలి. ఇందులో భాగంగానే కోయంబత్తూరు, లక్ష్యద్వీప్, అగర్తలా, ఇండోర్, రాంచీ, సిమ్లా, డయూ, ఇటానగర్, దిబ్రూఘర్‌లలో శాటి లైట్ ఈవెంట్లు, సైన్స్ శాఖల మంత్రుల సమావేశాలు ఏర్పాటు చేశారు. అయితే... వీటిల్లో ఏ ఒక్కటీ సైన్సు, టెక్నాలజీలకు హబ్ అయిన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లేదా అహ్మదాబాద్‌లలో నిర్వ హించకపోవడం ఆశ్చర్యకరమైన విషయం! దినేశ్ సి. శర్మ. వ్యాసకర్త సైన్సు అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో). -
గుడ్ న్యూస్.. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులు ఫ్రీ..!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్–19 పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పుణేలోని వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దాతృత్వం చాటుకుంది. 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను భారత ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ అధికార వర్గాలు తెలియజేశాయి. రూ.410 కోట్ల విలువైన 2 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసులను ఉచితంగా అందజేస్తామంటూ సీరం సంస్థ ప్రతినిధి ప్రకాశ్‌కుమార్ సింగ్ కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాశారని వెల్లడించాయి. ఈ డోసులు ఎలా అందజేయాలో చెప్పాలంటూ ఆయన కోరారని పేర్కొన్నాయి. సీరం సంస్థ ఇప్పటికే 170 కోట్లకు పైగాడోసులను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. చదవండి: కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే భారత్‌లోకి ఎంట్రీ..! -
భారత్ బయోటెక్ కీలక నిర్ణయం.. బూస్టర్ డోస్ నాజల్ వ్యాక్సిన్ రెడీ!
పలు దేశాల్లో కరోనా వైరస్ వేరియంట్ల వ్యాప్తి నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి కట్టడి కోసం పలు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై మరోసారి ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బూస్టర్ డోస్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. భారత్ బయోటెక్ సంస్థ కరోనా వ్యాక్సిన్ విషయంలో మరో అప్డేట్ ఇచ్చింది. ముక్కు ద్వారా అందించే(నాజల్ స్ప్రే) కోవిడ్ వ్యాక్సిన్‌ను త్వరలో దేశంలో బూస్టర్ డోస్‌గా తీసుకువస్తున్నట్టు పేర్కొంది. గోవాగ్జిన్ టీకా నుంచి నాజల్ వ్యాక్సిన్ రూపంలో దీన్ని అందించనున్నారు. డీజీసీఏ నుంచి తుది ఆమోదం పొందిన వెంటనే బూస్టర్ డోస్ రిలీజ్చేయనున్నట్టు సమాచారం. జాతీయ మీడియా సమాచారం మేరకు నాజల్ వ్యాక్సిన్‌కు అనుమతులు చివరి దశకు చేరుకున్నాయని, వచ్చే వారంలో టీకా అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది. 18 ఏళ్లుపైన వయసు ఉన్న వారికి బూస్టర్ డోస్‌గా నాజల్ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. నాజల్ వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం? నాజల్ వ్యాక్సిన్లు ఇంజెక్షన్ ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌తో పోలిస్తే అదనపు ప్రయోజనాలను కలిగి వున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అలాగే, నాజల్ వ్యాక్సిన్లను నిల్వ సౌలభ్యం, పంపిణీలో సులభంగా ఉంటుంది. నాజల్ వ్యాక్సిన్లు వైరస్.. మానవ శరీరంలోకి ప్రవేశించే ముక్కు , ఎగువ శ్వాస కోశం వద్ద రక్షణను అందిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. #Breaking | Bharat Biotech’s nasal Covid vaccine to be rolled out as booster dose #6PMPrime #Covid #India | @Akshita_N @milan_reports pic.twitter.com/HutHQ7tLMj — IndiaToday (@IndiaToday) December 22, 2022 -
మహారాష్ట్రకు మరో టెన్షన్.. మీజిల్స్ వైరస్‌తో చిన్నారులు మృతి
కరోనా సమయంలో వైరస్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మహారాష్ట్రను తాజాగా మీజిల్స్ వైరస్ టెన్షన్ పెడుతోంది. మీజిల్స్ కేసులు రోజురోజుకు పెరుగుతుండటం మహారాష్ట్రవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో, అప్రమత్తమైన ప్రభుత్వం చిన్నారులకు వ్యాక్సినేషన్ చేస్తోంది. వివరాల ప్రకారం.. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మీజిల్స్ వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది. శనివారం మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకింది. దీంతో, ఈ వైరస్ సోకిన చిన్నారుల సంఖ్య 300కి చేరువైంది. కేసుల పెరుగుతున్న క్రమంలో అలర్ట్ అయిన అధికారులు బీఎంసీ పరిధిలోని పలు ప్రాంతాల్లో 1,34,833 మంది 9 నెలల నుంచి 5 ఏండ్ల మధ్య వయస్సున్న చిన్నారులకు మీజిల్స్-రుబెల్లా స్పెషల్ డోసులను పంపిణీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గత రెండు నెలల్లోనే 2 వందల కేసులు నమోదకావడం అక్కడి వైద్యాధికారులను టెన్షన్ పెడుతోంది. అయితే, గతకొన్నేండ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. మరోవైపు.. ఈ వైరస్ కారణంగా చిన్నారులు మృతిచెందడం కలవరపాటుకు గురిచేస్తోంది. ఇక, నవంబర్ 22వ తేదీన బీవండిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ చిన్నారి చనిపోయాడు. కాగా, నవంబర్ 20వ తేదీన వైరస్ బారినపడిన చిన్నారి ఒంటిపై దద్దుర్లతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిలోనే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే, చిన్నారికి అటాప్సీ టెస్టు చేసిన తర్వాత మీజిల్స్ కారణంగా చనిపోయినట్టు నిర్ధారించారు. ఇక, మీజిల్స్ కారణంగా ఈ ఏడాది 13 మంది చిన్నారులు మృతిచెందారు. మరోవైపు.. మీజిల్స్ కేసులు మహారాష్ట్రతోపాటు బీహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళలోనూ నమోదు అవుతున్నాయి. BMC prepares list of nearly 1.4 lakh Mumbai children for extra measles shot https://t.co/2KLGyJsHYT Download the TOI app now:https://t.co/2Rmi5ecUTa — Vinod KumarTOI🇮🇳 (@vinod904) November 27, 2022 -
AP: ఆయుష్మాన్‌భవ: గర్భిణులకు, పిల్లలకు పది రకాల వ్యాక్సిన్లు
చిన్నారులను దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపడుతోంది. మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి కాన్పు జరిగే వరకు, పుట్టిన శిశువుల నుంచి యుక్తవయస్సు వచ్చే వరకు క్రమం తప్పకుండా టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రణాళికతో నిర్వహిస్తోంది. వారంలో రెండు రోజులు ప్రభుత్వాస్పత్రుల్లోనూ, క్షేత్రస్థాయిలోనూ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందు కోసం ముందుగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేలా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. తల్లి గర్భం నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగిడిన నాటి నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవుతోంది. అయితే వ్యాక్సినేషన్‌పై అవగాహన లేకపోవడంతో చిన్నారులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఒంగోలు అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఇమ్యూనైజేషన్ ప్రక్రియ గర్భిణులు, నవజాత శిశువుల మరణాలకు చెక్ పెట్టడంతో పాటు చిన్నారుల భవిష్యత్‌కు ఎంతగానో ఉపకరిస్తుంది. శిశువు నుంచి వృద్ధాప్యం వరకు ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి వ్యాక్సినేషన్ రక్షణ కల్పిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం కలిగిన వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జిల్లా కేంద్రంలో నిర్దేశించిన వాతావరణంలో భద్రపరిచి అన్ని పీహెచ్సీ, యూపీహెచ్సీ, ఎంసీహెచ్, ఏరియా ఆస్పత్రులకు వాక్సిన్లను అవసరం మేరకు సరఫరా చేస్తోంది. ప్రతి బుధ, శనివారాల్లో అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియలో డాక్టర్లు, నర్సులతో పాటు ఆశా వర్కర్లు, అంగన్వాడీలు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆస్పత్రులు లేని గ్రామాలకు ముందు రోజే ప్రజలకు వ్యాక్సినేషన్ ప్రక్రియపై తెలియజేసి బుధ, శనివారాల్లోనే ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జిల్లాలో 64 పీహెచ్‌సీలు, 18 యూపీహెచ్‌సీలు, 8 సీహెచ్‌సీలు, 2 ఏరియా ఆస్పత్రులు, మాతా శిశు వైద్యశాల, మార్కాపురంలోని జిల్లా ఆస్పత్రి, ఒంగోలు జీజీహెచ్‌లో వ్యాక్సిన్లు వేస్తారు. ఈ ఏడాదికి జిల్లాలో ఏడాదికి 42,062 జీరో డోసులు టార్గెట్ ఉండగా ఇప్పటి వరకు 20,603 డోసుల ప్రక్రియ పూర్తయింది. టీకాలు.. పది రకాలు గర్భిణులకు, పిల్లలకు మొత్తం పది రకాల వ్యాక్సిన్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయి. వాటిలో రెండు రకాలు చుక్కల మందు, ఒక రకం ద్రావణం, ఏడు రకాల ఇంజక్షన్లు ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లు పుట్టిన క్షణం నుంచి 16 ఏళ్ల వయసు వరకు నిర్దేశించిన వయసు ప్రకారం ఆయా డోసులు వేయించుకోవాల్సి ఉంది. వ్యాక్సిన్‌కు సంబంధించి పుట్టిన ప్రతి బిడ్డకు వ్యాక్సినేషన్ కార్డు ఇచ్చి అందులో వ్యాక్సినేషన్ వివరాలు పొందుపరుస్తారు. గర్భిణులు, పిల్లలకు డీటీ (డిప్టీరియా టెటానస్) ఈ టీకా గర్భం దాల్చిన తొలి రోజుల్లో మొదటి డోసు, తర్వాత నాలుగు వారాలకు రెండో డోసు, ఆ తర్వాత బూస్టర్ డోసు వేస్తారు. చిన్న పిల్లల వ్యాక్సినేషన్ మొదటిగా పుట్టిన సమయంలో బీసీజీ (క్షయ) ఓపీవీ వ్యాక్సిన్ జీరో మోతాదుతో పాటు హెపటైటీస్ బీ పుట్టిన వెంటనే మోతాదు ఇస్తారు. 6 వారాల వయసులో ఓపీవీ–1 (పోలియో రాకుండా) చుక్కల మందు, రోటా–1 (విరోచనాలు రాకుండా) చుక్కల మందుతో పాటు ఎఫ్‌ఐపీవీ–1 ఇంజక్షన్ (పోలియో రాకుండా), పెంటావాలెంట్ (డిప్టీరియా, కంఠసర్పి, ధనుర్వాతం, కామెర్లు, మెదడువాపు రాకుండా) టీకాలు వేస్తారు. పది వారాల వయసులో ఓపీవీ, పెంటావాలెంట్, రోటా టీకాలు రెండో డోసు వేస్తారు. 14 వారాలకు ఓపీవీ, పెంటావాలెంట్, రోటా మూడో డోసుతో పాటు ఎఫ్‌ఐపీవీ రెండో డోసు వేస్తారు. 9 నెలలకు తట్టు, రుబెల్లా రాకుండా ఎంఆర్ వ్యాక్సిన్‌తో పాటు విటమిన్ ఏ ద్రావణం ఇస్తారు. 16 నుంచి 24 నెలలకు డీపీటీ మొదటి బూస్టర్, ఓపీవీ బూస్టర్‌తో పాటు ఎంఆర్ రెండో డోసు వేస్తారు. 5,6 సంవత్సరాలకు డీపీటీ రెండో బూస్టర్ మోతాదు, 10–16 సంవత్సరాలకు టీడీ వ్యాక్సిన్ వేస్తారు. టీకాలపై ప్రతి ఒక్కరూ అవగాహనతో ఉండాలి గర్భం దాల్చిన సమయం నుంచి ప్రసవం అనంతరం పుట్టిన బిడ్డ వరకు సకాలంలో టీకాలు వేయించాలి. టీకాల కాల పరిమితి ఆశా వర్కర్లు, అంగన్వాడీల ద్వారా తెలుసుకుని సకాలంలో పిల్లలకు టీకాలు వేయించాలి. టీకాల వలన ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులు, ప్రాణాంతక వ్యాధుల నుంచి పిల్లలను కాపాడవచ్చు. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరం నిర్దేశించిన రోజుల్లో క్రమం తప్పకుండా జరుగుతోంది. – ఏఎస్ దినేష్‌కుమార్, కలెక్టర్ ఇమ్యూనైజేషన్ ప్రక్రియ పక్కాగా పర్యవేక్షిస్తాం జిల్లాలో నిర్వహించే ఇమ్యూనైజేషన్ ప్రక్రియను ఎప్పటికప్పుడు పక్కాగా పర్యవేక్షిస్తున్నాం. ప్రజలకు టీకాలపై అవగాహన కల్పిస్తూ చైతన్య పరుస్తున్నాం. ప్రతి ఆస్పత్రిలో ప్రతి బుధ, శనివారాల్లో వ్యాక్సినేషన్ నిర్వహిస్తూ వ్యాక్సినేషన్ కార్డులో నమోదు చేస్తున్నాం. ఆశాలు, అంగన్వాడీల ద్వారా వ్యాక్సినేషన్ సమయాన్ని కూడా తల్లిదండ్రులకు ముందుగానే గుర్తు చేసేలా చర్యలు తీసుకున్నాం. ప్రజలు టీకాలపై అవగాహనతో ఉండి పిల్లలకు తప్పనిసరిగా టీకాలు వేయించి పోలియో, ఇతర ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ పొందాలి. – పద్మజ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి -
ప్రజారోగ్య సంరక్షణలో ఏపీ ది బెస్ట్.. ర్యాంకులు ప్రకటించిన కేంద్రం
సాక్షి, అమరావతి: ప్రజారోగ్య సంరక్షణలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. గర్భిణులకు చెకప్‌లు, 9–11 నెలల పిల్లలకు టీకాలు వేయడం వంటి అంశాల్లో దేశంలోనే తొలి స్థానంలో ఏపీ నిలిచింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన హెచ్ఎంఐఎస్ 2021–22 అనాలసిస్ రిపోర్ట్‌లో వెల్లడైంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు, గర్భిణులకు ఆరోగ్య సంరక్షణ, ఇమ్యునైజేషన్ సహా 13 అంశాలపై పెద్ద, చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా (మూడు విభాగాలుగా) పనితీరు ఆధారంగా ర్యాంక్‌లు కేటాయించింది. ఈ ర్యాంకులు ఇవ్వడానికి హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా తొలిసారిగా దేశంలోని 735 జిల్లాల్లోని 1,64,440 సబ్ సెంటర్లు, 32,912 పీహెచ్‌సీలు, 15,919 కమ్యునిటీ హెల్త్ సెంటర్లు, 2,970 సబ్ జిల్లా ఆస్పత్రులు, 1,264 జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లోని 2.17 లక్షల ఆరోగ్య సేవలను మ్యాపింగ్ చేసినట్లు హెచ్ఎంఐఎస్ ఈ–బుక్ బులెటిన్‌లో పేర్కొంది. కొత్త పోర్టల్‌లో వ్యక్తి నిర్ధిష్ట వినియోగదారు ఆధారాలు, రియల్ టైమ్ డేటా ఎంట్రీ, రియల్ టైమ్ మానిటరింగ్, నేషనల్ ఐడెంటిఫికేషన్ నంబర్, స్థానిక ప్రభుత్వ డైరెక్టరీ (అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్) ఉన్నట్లు తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 9 నుంచి 11 నెలల పిల్లలకు టీకాలు ఇవ్వడం (ఇమ్యునైజేషన్)లో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీకి నంబర్–1 ర్యాంక్ రాగా.. తెలంగాణకు 5, తమిళనాడుకు 11 ర్యాంక్‌లు లభించాయి. ఇదే సందర్భంలో గర్భిణులకు ప్రసవానికి ముందు నాలుగు ఏఎన్సీ చెకప్‌లు నిర్వహించడంలోనూ దేశంలోనే నంబర్–1 ర్యాంక్‌ను ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. ఆ తరువాత స్థానాల్లో వరుసగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక ఉండగా.. పొరుగున ఉన్న తెలంగాణ 13వ ర్యాంక్‌కు పరిమితమైంది. ఆరోగ్య సేవలకు సంబంధించిన అన్ని అంశాల పనితీరులోనూ దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఏపీకి రెండో ర్యాంక్ దక్కింది. బెడ్ ఆక్యుపెన్సీలోనూ.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, అంతకన్నా పెద్ద ఆస్పత్రుల్లో బెడ్ ఆక్యుపెన్సీ విషయంలో ఏపీ 57.8 శాతంతో దేశంలోనే రెండోర్యాంకులో నిలిచింది. జాతీయస్థాయిలో బెడ్స్ ఆక్యుపె న్సీ 27.9 శాతమే ఉంది. ఎటువంటి దుష్ఫ్రభావాలు లేకుండా సురక్షితంగా ఉండేందుకు గర్భిణులకు టెటానస్ టాక్సాయిడ్ ఇంజెక్షన్లు వేయడంలో ఆంధ్రప్రదేశ్ 103.9 శాతంతో రెండవ ర్యాంకులో ఉంది. జాతీయ స్థాయిలో ఈ ఇంజెక్షన్లను 73.9 శాతమే వేశారు. ఇంటి దగ్గర డెలివరీల్లో 69.0 శాతం మేర స్కిల్ బర్త్ అటెండెంట్స్ హాజరవుతున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ మూడో ర్యాంకులో నిలిచింది. జాతీయ స్థాయిలో 17.5 శాతం మాత్రమే హాజరు ఉంది. ఇనిస్టిట్యూషన్ డెలివరీల్లో ఆంధ్రప్రదేశ్ 70.7 శాతంతో 6వ ర్యాంకు పొందింది. జాతీయ స్థాయిలో 53.4 శాతమే ఇనిస్టిట్యూషన్ డెలివరీలున్నాయి.