న్యూఢిల్లీ: గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,774 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి దేశంలో మొత్తం 92,281 కేసులు యాక్టివ్ కేసులున్నాయి. 306 మంది ఒకే రోజు మరణించారు. 8,464 రికవరీలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,90,510కు చేరింది. అలాగే కరోనా మృతుల సంఖ్య 4,75,434కు చేరినట్లు ఆరోగ్య శాఖ ఆదివారం మీడియాకు తెల్పింది.
అన్ని రాష్ట్రాల కంటే కేరళలో అత్యధికంగా 3,795 కేసులు, మహారాష్ట్రలో 807 కేసులు, తమిళనాడులో 681, పశ్చిమ బెంగాల్‌లో 610 కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల రికార్డు 0.65 శాతంగా ఉంది. కాగా గడచిన 69 రోజులతో పోల్చితే రెండు శాతం తక్కువ అని డేటా తెల్పుతోంది. అలాగే రికవరీ రేటు 98.36 శాతం ఉందని ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటన్ తెల్పుతోంది.
చదవండి: ఎయిర్‌పోర్టులో పోర్న్ వీడియో చిత్రీకరణ.. మోడల్‌కు 18 యేళ్ల జైలు శిక్ష!
COVID19 | India reports 7,774 new cases, 306 deaths and 8,464 recoveries in the last 24 hours; Active caseload at 92,281 pic.twitter.com/pUMkvjVcY4
— ANI (@ANI) December 12, 2021
Comments
Please login to add a commentAdd a comment