kerala
-
కేరళ సీఎం తొలి ప్రామిస్
-
కేరళం సీఎంగా సతీశనే ఎందుకు?
పది రోజుల సస్పెన్స్‌కు తెర దించుతూ కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ పేరును ప్రకటించింది కాంగ్రెస్ హైకమాండ్. తమకు ఎంతో దగ్గరైన సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌ను పక్కనపెట్టి మరీ లాయర్ నుంచి లీడర్‌గా ఎదిగిన సతీశన్‌కు ఆ అవకాశం ఇవ్వడం కాస్త ఆశ్చర్యం కలిగించేదే!. అయితే.. ఈ ఎంపికను గమనిస్తే అనేక రాజకీయ గణాంకాలు కనిపిస్తున్నాయి. కేరళం కొత్త సీఎంగా వీడీ సతీశన్ ఎంపిక కావడం ఒక సాధారణ నిర్ణయం కాదు. ప్రధానంగా.. ప్రజా మద్దతు కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన ఎల్డీఎఫ్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి కుంభకోణాలను బట్టబయలు చేశారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసు, కేఐఐఎఫ్బీ ఫండింగ్ వివాదం, ఇతర కుంభకోణాల ఆధారంగా విజయన్ ప్రభుత్వాన్ని ఏకిపారేశారు. ఈ పోరాటం వల్ల ఆయనకు ‘క్లీన్ లీడర్’ గా ప్రజల్లో విశ్వసనీయత పెరిగింది.మిత్రపక్షాల బలం.. కేసీ వేణుగోపాల్‌కు కాంగ్రెస్‌లో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లభించింది. అయితే మరో కాంగ్రెస్ నేత రమేష్ చెన్నితాలతో పోలిస్తే వీడీ సతీశన్‌కు పార్టీలో మద్దతుదారుల సంఖ్యా బలం తక్కువే. అయినపపటికీ మిత్రపక్షాలు ఆయన సీఎం అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ వచ్చాయి. కేరళలో ముస్లిం లీగ్, ఇతర చిన్న పార్టీల మద్దతు లేకుండా కాంగ్రెస్ స్థిరమైన ప్రభుత్వం సాధ్యం కాదు. కాబట్టి మిత్రపక్షాలకు దగ్గరగా ఉన్న సతీశన్‌ను ఎంపిక చేయడం వ్యూహాత్మక నిర్ణయంగా అధిష్టానం భావించింది.మరోవైపు.. ఎన్నికల ప్రచారంలో ‘‘నేను సీఎం పోస్ట్ కోసం లేను.. పార్టీ కోసమే ఉన్నా అని ప్రకటించడం’’ కేసీ వేణుగోపాల్‌కు పెద్ద మైనస్ అయ్యింది. ఇది వీడీ సతీశన్‌కు మిత్రపక్షాల్లో, కేడర్‌లో మరింత సింపథీ తెచ్చి పెట్టింది. కేసీ అనుకూల వర్గం ఆయన పేరిట పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. ఓన్లీ వీడీ అంటూ పార్టీ కేడర్‌తో పాటు సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. సమర్థుడనే ట్యాగ్ లైన్.. 2001 నుంచి పరవూర్ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తూ వస్తున్నారాయన. 2021 నుంచి 2026 మధ్య ప్రతిపక్ష నేతగా పని చేశారు. కేరళంలో యూడీఎఫ్ విక్టరీలో వీడీ సతీశన్‌ది కీలక పాత్ర అనే చెప్పొచ్చు. పైగా ఆయనకు ఉన్న న్యాయవాది నేపథ్యం, కిందస్థాయి నుంచి ఎదిగిన వైనం, అదనంగా సామాజిక సేవా దృక్ఫథం, .. ప్రజలు మాత్రమే కాదు పార్టీ కేడర్ ప్రజలు ఆయన్ని సమర్థుడైన నాయకుడిగా భావించడం మొదలుపెట్టాయి. కాంగ్రెస్ పెద్దలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. దీంతో కిందిస్థాయి వాళ్లకూ కాంగ్రెస్‌లో సీఎం అయ్యేందుకు అవకాశం ఉంటుంది అని సింబాలిక్‌గా చెప్పడానికి ఓ అవకాశం దొరికింది. వీడీ సతీశన్‌కు పాలనలో ప్రత్యక్ష అనుభవం లేకపోవచ్చు. కానీ, ప్రతిపక్ష నేతగా చేసిన పోరాటం అసామాన్యమైనది. మిత్రపక్షాల మద్దతు, ప్రజల్లో ఉన్న విశ్వసనీయత.. అన్నీ కలిపి ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి పెంచి ఆయనను సీఎం సీటులో కూర్చోబెట్టగలిగాయి. -
కేరళ కొత్త సీఎం VD. సతీశన్
-
కేరళం సీఎంని ప్రకటించిన ఏఐసీసీ
తిరువనంతపురం: కేరళం సీఎంగా వీడీ సతీషన్ నియామకమయ్యారు. ముఖ్యమంత్రిగా ఆయన పేరును అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. సతీషన్ నేపథ్యంఆయన పూర్తిపేరు వడక్కేయిల్ దామోదరన్ సతీషన్, నెట్టూరు, ఎర్నాకులం జిల్లాలో మే 31, 1964న ఆయన జన్మించారు. పనంపిల్లి నగర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యాబ్యాసం పూర్తి చేశారు. వృత్తిరీత్యా న్యాయవాదైన సతీషన్.. NSUI ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎమ్మెల్యేగా 2001లో మొదటిసారిగా పారావూర్ నియోజకవర్గం నుంచి కేరళ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి నుండి వరుసగా ఐదుసార్లు (2001, 2006, 2011, 2016, 2021) అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.అనంతరం 2021లో కేరళ అసెంబ్లీ ఎన్నికల తర్వాత, రమేష్ చెన్నితాల స్థానంలో ఆయనను కేరళ శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అప్పటి నుంచి రాష్ట్ర సమస్యలపై గత ప్రభుత్వాన్ని పలుసార్లు ఎండగడుతూ వచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో ఆయన కీలక పాత్ర పోషించారు.కాగా కేరళం ముఖ్యమంత్రి సీటుపై తొలి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వీడీ సతీషన్, రమేశ్ చెన్నితల, కేసీ వేణుగోపాల్‌ల మధ్య ముఖ్యమంత్రి పదవికై తీవ్ర పోటీ నడిచింది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ సన్నిహితులైన కేసీ వేణుగోపాల్‌కు ముఖ్యమంత్రి పదవి దాదాపు ఖరారైనేట్లేనని అంతా భావించారు. కాగా ఆశ్చర్యంగా ఆయనే పోటీ నుంచి తప్పుకోవడంతో వీడీ సతీషన్ పేరు అధిష్ఠానం ఖరారు చేసింది. -
కేరళం ముఖ్యమంత్రిపై వీడనున్న సస్పెన్స్
తిరువనంతపురం: కేరళం ముఖ్యమంత్రి అభర్థిపై మరికోద్దిసేపట్లో ఉత్కంఠ వీడనుంది. ఈ రోజు ముఖ్యమంత్రి అభర్థిని ప్రకటిస్తామని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏవరనే అంశం ఈ రోజు తేలనుంది. అయితే సీఎం రేసులో రాహుల్ గాంధీ విధేయులు కేసీ వేణుగోపాల్ ముందజంలో ఉన్నట్లు సమాచారం.ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలొచ్చి పదిరోజులు దాటింది. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో పాటు మంత్రివర్గం కొలువుదీరింది. అయితే కాంగ్రెస్ అధికారం సాధించిన ఒక్క కేరళలో మాత్రం ఇంకా ముఖ్యమంత్రి ఎవరనే అంశమే స్పష్టత రాలేదు. దీంతో ఈ విషయమై ఎవరు సీఎం కానున్నారనే అంశం మరికొద్దిసేపట్లో తేలనుంది.నిన్న (బుధవారం) పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో 40 నిమిషాల పాటు తుది మంతనాలు జరిపాక నూతన ముఖ్యమంత్రి అంశంలో స్పష్టత వచ్చిందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతమైన అన్ని ప్రక్రియలను ఆచరిస్తూ సీఎం పేరును ప్రకటిస్తున్నామని వ్యాఖ్యానించారు. కాగా ముఖ్యమంత్రి పదవి రేసులో కేరళ అసెంబ్లీలో విపక్షనేత వీడీ సతీశన్, సీనియర్ కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లు బరిలో ఉన్నారు.కాగా వీడీ సతీశన్‌ది లోక్‌సభ ఎన్నికలతో పాటు యూడీఎఫ్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. మరో వైపు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్‌కు రాహుల్ గాంధీ అత్యంత సన్నిహితులు. అంతే కాకుండా ఈ విషయమై వీరిద్దరు ఇదివరకే చర్చలు జరిగినట్లు సమాచారం.అయితే సీఎం ఈ విషయంలో వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అధిష్ఠానం వీరిద్దరివైపూ కాకుండా రమేష్ చెన్నితల వైపు మెుగ్గు చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించనుందా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
కేరళ సీఎం ఎంపిక నేడే
న్యూఢిల్లీ: ఫలితాలొచ్చి పది రోజులైనా కేరళ ముఖ్యమంత్రి పదవికి ఎవరు అర్హులనే అంశాన్ని తేల్చుకోలేక తీవ్రంగా సతమతమవుతున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఎట్టకేలకు గురువారం సీఎం పేరును ప్రకటించనుంది. రోజుల తరబడి సస్పెన్స్, సంప్రదింపులు, లాబీయింగ్, మంతనాల మారథాన్‌కు ముగింపు పలుకుతూ గురువారం ముఖ్యమంత్రి పేరును ప్రకటించబోతున్నామని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ బుధవారం ఢిల్లీలో వెల్లడించారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో 40 నిమిషాల పాటు తుది మంతనాలు జరిపాక నూతన ముఖ్యమంత్రి అంశంలో స్పష్టత వచ్చిందని జైరాం రమేశ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కూటమి కేరళ శాసనసభ స్థానాల్లో భారీ మెజార్టీతో గెల్చిన విషయం విదితమే. ప్రజాస్వామ్యయుతమైన అన్ని ప్రక్రియలను ఆచరిస్తూ సీఎం పేరును ప్రకటిస్తున్నామని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. తొలి నుంచీ ముఖ్యమంత్రి పదవి రేసులో కేరళ అసెంబ్లీలో విపక్షనేత వీడీ సతీశన్, సీనియర్ కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(వ్యవస్థాగతం) కేసీ వేణుగోపాల్‌లు బరిలో ఉన్నారు. -
ఒక్కొక్కరికీ రూ. 5 వేలు పెట్రోలు మాత్రమే! ఎక్కడ?
కేరళలో ఒక వైపు ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం నడుస్తుండగానే మరో సంచలన వార్త దావాలనంలా వ్యాపించింది. ఇంధన విక్రయాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పెట్రోల్ బంకుల్లో నిల్వలు అకస్మాత్తుగా అయిపోకుండా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పలు నివేదికల ప్రకారం, కేరళలోని ఇంధన కేంద్రాలు బల్క్ ఇంధన అమ్మకాలపై ఆంక్షలు విధించినట్లు సమాచారం ఒక్కో వ్యక్తికి గరిష్టంగా రూ. 5,000 విలువైన పెట్రోల్‌ను , డీజిల్‌ను 200 లీటర్లను విక్రయించనున్నాయి.ఎందుకీ నిర్ణయం?రిటైల్ అవుట్లెట్లలో ఇంధనం నిరంతరం అందుబాటులో ఉండేలా చూడటం, అధిక డిమాండ్ ఉన్న సమయంలో నిల్వలు పూర్తిగా ఖాళీ అవ్వకుండా నిరోధించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం బంకులకు కేవలం కొన్ని రోజులకు సరిపడా స్టాక్‌ను మాత్రమే సరఫరా చేస్తున్నాయి. దీనివల్ల బంకు యజమానులు జాగ్రత్తగా ఇంధనాన్ని విక్రయించాల్సి వస్తోంది. ముందస్తు చెల్లింపులు (Advance payments) చేయాల్సి రావడం క్రెడిట్ సౌకర్యాలు రద్దు కావడంతో పెట్రోల్ బంకుల నిర్వహణ కష్టతరంగా మారింది.ఇదీ చదవండి: ప్రసాదంగా నాణేలు : ఎక్కడుందీ గుడి? వీడియో వైరల్పంపిణీదారుల స్పందనకేరళ స్టేట్ పెట్రోలియం ట్రేడర్స్ అసోసియేషన్ మరియు ఇంధన పంపిణీదారులు దీనిపై వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఇంధన కొరత ఏమీ లేదు. కేవలం రవాణా పరమైన జాప్యాలు , పంపిణీని క్రమబద్ధీకరించడానికి మాత్రమే ఈ పరిమితులు విధించారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం సుమారు రెండు నెలలకు సరిపడా ముడి చమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.ఈ ఆంక్షల వల్ల సాధారణ వినియోగదారుల కంటే భారీగా ఇంధనం కొనేవారు (Bulk buyers) , లాజిస్టిక్స్ ఆపరేటర్లపై ఎక్కువ ప్రభావం పడే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ఆయిల్ కంపెనీలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, అందుకే పంపిణీలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని నివేదికలు పేర్కొన్నాయి.ఇదీ చదవండి: ప్రతీక్ యాదవ్‌కు యోగి నివాళులు : కీలకంగా పోస్ట్‌మార్టం నివేదిక -
వయనాడ్ మరో అమేథీ?.. కాంగ్రెస్‌లో కలకలం
వయనాడ్: కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కేరళలో పదేళ్ల తర్వాత సాధించిన ఘన విజయం మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలేలా ఉంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుండగానే, కాంగ్రెస్ అధిష్టానంపై సొంత పార్టీ వర్గాలే తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నాయి. ముఖ్యంగా అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను టార్గెట్ చేస్తూ, సొంత ఇలాకా వయనాడ్‌లో వెలసిన పోస్టర్లు ఇప్పుడు రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ తీవ్ర సంచలనంగా మారాయి.వయనాడ్ మరో అమేథీ కానుందా?వయనాడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం సమీపంలో రాత్రికి రాత్రే వెలసిన పోస్టర్లు కేరళ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేస్తున్నాయి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కనుక కేరళ ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే.. ‘వయనాడ్ ఖచ్చితంగా తదుపరి అమేథీగా మారుతుంది’ అంటూ ఆ పోస్టర్లలో తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా, కేరళ ప్రజలు అధిష్టానం తీసుకునే ఇలాంటి ‘మూర్ఖపు నిర్ణయాలను’ ఎన్నటికీ క్షమించరని, రాహుల్, ప్రియాంకలు ఇక వయనాడ్ నియోజకవర్గం నుంచి గెలవడం మర్చిపోవాలని ఆ పోస్టర్లలో ఘాటుగా విమర్శించారు. అమేథీలో ఎలాగైతే కాంగ్రెస్ పట్టు కోల్పోయిందో, భవిష్యత్తులో వయనాడ్‌లో కూడా అలాగే జరుగుతుందని వారు అంటున్నారు. Wayanad, Keralam: Posters targeting Congress MPs Rahul Gandhi and Priyanka Gandhi Vadra have appeared near the Wayanad District Congress Committee office amid ongoing suspense over Kerala's next Chief Minister following the UDF's election victory pic.twitter.com/z62QGaq9Rb— IANS (@ians_india) May 13, 2026భగ్గుమన్న అసమ్మతి.. సీఎం పీఠం కోసం పోరుఅధిష్టానం అండతో సీఎం రేసులో ఉన్న కేసీ వేణుగోపాల్‌ను రాహుల్ గాంధీకి కేవలం ‘బ్యాగ్ క్యారియర్’గా మాత్రమే పోస్టర్లలో అభివర్ణించడం గమనార్హం. ఆయనకు సీఎం పదవి ఇస్తే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గానూ 102 స్థానాలు సాధించి, యూడీఎఫ్ చారిత్రాత్మక విజయం నమోదు చేసింది. అయితే ముఖ్యమంత్రి పీఠం కోసం సీనియర్ నేతలు వీడీ సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో పార్టీలో ఆధిపత్య పోరు రచ్చకెక్కింది.ఢిల్లీలో ముమ్మర మంతనాలు.. నేడే క్లైమాక్స్ఈ తీవ్ర ఉత్కంఠ నడుమ, ముఖ్యమంత్రి ఎంపికపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం కసరత్తు ముమ్మరం చేసింది. మంగళవారం ఢిల్లీలో కేరళ మాజీ కేపీసీసీ అధ్యక్షులతో రాహుల్ గాంధీ స్వయంగా వరుస సమావేశాలు నిర్వహించి, వారి అభిప్రాయాలను సేకరించారు. పార్టీ పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ ఇప్పటికే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నారు. బుధవారం మధ్యాహ్నానికల్లా కేరళ తదుపరి ముఖ్యమంత్రి పేరును పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.ఇది కూడా చదవండి: ప్రతీక్ యాదవ్: ‘సయోధ్య’ కుదిరిన వేళ.. సాగనంపిన కాలం! -
కేరళ ఉత్కంఠ.. ఇరకాటంలో కాంగ్రెస్!
కేరళలో కాంగ్రెస్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై సంక్షోభం కొనసాగుతోంది. పార్టీలో తీవ్ర అంతర్గత పోరు నడుమ.. హస్తినలో కీలక సమావేశం జరగబోతోంది. దీంతో ఇవాళ సాయంత్రం లోపు కీలక నిర్ణయం వెలువడవచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే.. ఇరకాటంలో పడేసేందుకు బీజేపీ రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది.కాంగ్రెస్‌లో ప్రస్తుతం సీఎం రేసులో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత వీ.డి. సతీశన్ ఇద్దరూ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. అదనంగా రమేశ్ చెన్నితాల కూడా చేరడంతో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. పార్టీ కేంద్ర పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్‌లు క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయసేకరణ చేపట్టినట్లు తెలుస్తోంది. అందులో కేంద్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న కేసీ వేణుగోపాల్‌కు 63 మంది ఎమ్మెల్యేల్లో 47 మంది మద్దతు ఇస్తున్నారు. ఈ పోరులో రెండో ఎంపికగా రమేష్ చెన్నితల పేరును కొందరు ఎమ్మెల్యేలు సూచించినట్లు సమాచారం. అయితే వీడీ సతీశన్‌కు ప్రజల్లో విస్తృత ఆదరణ కనిపిస్తోంది. దీంతో టాప్ ప్రయారిటీగా వేణుగోపాల్ వైపే అధిష్టానం మొగ్గు చూపిస్తోంది. ఈ తరుణంలో..ఈ పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది యూడీఎఫ్ మిత్రపక్షం ఐయూఎంఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్). సీఎం ఎంపికలో జాప్యంపై అసంతృప్తితో ఉన్న ఐయూఎంఎల్.. అనూహ్యంగా సతీశన్‌కు మద్దతు ప్రకటించింది. అయితే కాంగ్రెస్‌లోని ఒక వర్గం ఈ నిర్ణయంతో విబేధిస్తోంది. ఇప్పటికే బీజేపీ తరచూ కాంగ్రెస్‌ను ఓ మతానికి అనుకూల పార్టీ అని విమర్శిస్తోంది. ఈ దశలో ఐయూఎంఎల్ ఒత్తిడికి లొంగితే.. ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లే అవుతుందని కొందరు కేరళ కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు.ఇదిలా ఉండగానే.. సతీశన్ తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. కేవలం ఐదారుగురు ఎమ్మెల్యేల సపోర్ట్ ఉన్న ఆయన.. ముఖ్యమంత్రి పదవి తప్ప మరేమీ అంగీకరించబోనని హైకమాండ్‌కు స్పష్టం చేసినట్లు సమాచారం. సతీశన్‌ను ఎంపిక చేస్తే మరో సమస్య ఏమిటంటే.. ఆయనకు పరిపాలనా అనుభవం లేదు. వేణుగోపాల్ మాత్రం రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన నాయకుడు. రాష్ట్రవ్యాప్తంగా సతీశన్‌ను సీఎం చేయాలని పోస్టర్లు కనిపించడం, ఆయన పార్టీని ఒత్తిడికి గురి చేస్తున్నారని కొందరు భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఇప్పటికే వర్గపోరు, బహిరంగ శక్తి ప్రదర్శనలు ఆపాలని సూచించారు.మరోవైపు.. అనుభవజ్ఞుడైన వేణుగోపాల్‌ను సీఎం చేస్తే.. ఆయన లోక్‌సభ సభ్యత్వం వదులుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక అసెంబ్లీ సీటు, ఒక లోక్‌సభ సీటుకు ఆరు నెలల్లో ఉపఎన్నికలు జరగాలి. అదనంగా, కాంగ్రెస్ కేంద్ర స్థాయిలో కొత్త ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీని నియమించాల్సి ఉంటుంది. అయితే.. కేసీ వేణుగోపాల్ ఛాయిస్ పైనా బీజేపీ సెటైర్లు వేస్తోంది.సోషల్ మీడియాలో కాంగ్రెస్ సీఎం ఎంపిక విషయంలో కేరళ బీజేపీకి.. జాతీయ బీజేపీకి మధ్య పోరు నడుస్తోంది. ఆయన కేరళలో ఉండాలని కేరళ బీజేపీ, లేదు ఢిల్లీలో ఉండాలని జాతీయ బీజేపీ కోరుకుంటోంది అని కాంగ్రెస్ సంక్షోభాన్ని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయ్యింది. దానికి బీజేపీ నేత రాజీవ్ చంద్రశేఖర్ వెటకారంగా స్పందించారు. ఇది నిజమని నేను ధృవీకరించను.. అలాగే ఖండించను కూడా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య కాంగ్రెస్ లోపల జరుగుతున్న నాయకత్వ పోరును ఎగతాళి చేస్తూ, బీజేపీకి రాజకీయ వ్యంగ్యంగా మారింది.అసెంబ్లీ గడువు ఈ నెల 23వ తేదీ వరకు ఉంది. ఎంతకంత కంగారు?. పార్టీ హైకమాండ్ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా పార్టీ శ్రేణులకే కాదు.. యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలకు కూడా సంతృప్తికలిగించేదిగా ఉండాలి. ఇదొక ప్రజాస్వామిక ప్రక్రియ అని రమేశ్ చెన్నితాల మీడియా ముందు వ్యాఖ్యానించడం గమనార్హం.ఈ గందరగోళం నడుమ.. సందిగ్ధానికి చెక్ పెట్టేందుకు ఢిల్లీ హైకమాండ్ నాయకత్వం నడుం బిగించింది. కేరళ మాజీ పీసీసీ అధ్యక్షులతోపాటు సీనియర్ నేతలతో చివరిగా చర్చలు చేపట్టాలని నిర్ణయించింది. మంగళవారం ఢిల్లీలో జరిగే చర్చలకు అధిష్టానం కబురందుకున్న వారిలో ఎంఎం హస్సన్, వీఎం సుధీరన్, ఎం. రామచంద్రన్, కె.మురళీధరన్, కన్నూర్ ఎంపీ కె.సుధాకరన్ ఉన్నారు. వీరితో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్యనేత రాహుల్ గాంధీ చర్చలు జరుపుతారు. ఈ సమావేశాలతో.. ఇవాళ సాయంత్రానికో.. లేదంటో రేపటికల్లా కేరళ సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రానుందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ నిర్ణయం ఏదైనా సరే కేరళ రాజకీయ సమీకరణాలను మాత్రమే కాదు, జాతీయ స్థాయిలోనూ ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. -
కేరళ సీఎం ఎంపికలో అదే అనిశ్చితి
న్యూఢిల్లీ/తిరువనంతపురం: కేరళ తదుపరి సీఎం ఎవరన్న దానిపై సోమవారం కూడా ఊహాగానాలు, సస్పెన్స్ కొనసాగుతోంది. కాగా, ఈ సందిగ్ధానికి చెక్ పెట్టేందుకు అత్యున్నత నాయకత్వం నడుం బిగించింది. కేరళ మాజీ పీసీసీ అధ్యక్షులతోపాటు సీనియర్ నేతలతో చివరిగా చర్చలు చేపట్టాలని నిర్ణయించింది. ఈ సమావేశాలతో సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రానుందని చెబుతున్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగే చర్చలకు అధిష్టానం కబురందుకున్న వారిలో ఎంఎం హస్సన్, వీఎం సుధీరన్, ఎం. రామచంద్రన్, కె.మురళీధరన్, కన్నూర్ ఎంపీ కె.సుధాకరన్ ఉన్నారు. వీరితో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, ముఖ్యనేత రాహుల్ గాంధీ చర్చలు జరుపుతారు. ఒకట్రెండు రోజుల్లోనే వ్యవహారం కొలిక్కి వస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. 48 గంటల్లోనే దీనిపై స్పష్టత రానుందని ఓ నేత తెలిపారు. సీఎం రేసులో ఉన్న రమేశ్ చెన్నితాల, ఏఐసీపీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్, గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్లతో రాహుల్, ఖర్గేలు చర్చలు జరిపిన తర్వాత కూడా కాంగ్రెస్ అంతిమ నిర్ణయం తీసుకోలేకపోవడం గమనార్హం. ఈ జాప్యంపై యూడీఎఫ్‌లోని కీలక పక్షమైన ఐయూఎంఎల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. అనిశ్చితి ఇలాగే కొనసాగితే పరిణామాలు వేరుగా ఉంటాయని హెచ్చరిస్తోంది. ఆలస్యం కారణంగా ప్రజలతోపాటు తమ కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని ఐయూఎంల్ మలప్పురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హమీద్ తెలిపారు. ఎంపికలో కాలయాపనపై రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు బదులిచ్చారు. ‘అసెంబ్లీ గడువు ఈ నెల 23వ తేదీ వరకు ఉంది. ఎంతకంత కంగారు?’అని ప్రశ్నించారు. ‘పార్టీ హైకమాండ్ తీసుకునే ఎలాంటి నిర్ణయమైనా పార్టీ శ్రేణులకే కాదు, యూడీఎఫ్ భాగస్వామ్య పక్షాలకు కూడా సంతృప్తికలిగించేదిగా ఉండాలి. ఇదొక ప్రజాస్వామిక ప్రక్రియ’అని రమేశ్ చెన్నితాల పేర్కొన్నారు. -
సీఎం విజయ్ కోసం 650కిలో మీటర్ల కాలినడక .. సోషల్ మీడియాలో వైరల్!
సాక్షి,చెన్నై: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దండ పార్టీలను మట్టికరిపించిన టీవీకే అధినేత విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయనను కలిసేందుకు ఓ యువజంట చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన రఫీ, షహానా భార్యాభర్తలు. రఫీ డ్రైవర్‌గా పనిచేస్తూనే డైలీ వ్లాగ్స్ చేస్తుంటారు. ఈ దంపతులకు హీరో విజయ్ అంటే ఎనలేని అభిమానం. ఆ అభిమానం ఇప్పుడు హద్దులు దాటి, కేరళ నుంచి సుమారు 650 కిలోమీటర్ల దూరంలో చెన్నైలో సీఎం విజయ్ను కలుసుకోవడానికి కాలినడకన ప్రయాణం ప్రారంభించారు.ఆకలేసినప్పుడు హోటల్లో తినడం, లేకపోతే రోడ్డు పక్కనే వండుకోవడం చేస్తున్నారు. ఇందుకోసం కావాల్సిన సామాగ్రిని వెంట తీసుకెళ్లారు. రాత్రివేళల్లో పెట్రోల్ బంకులు, షాపుల వద్ద టెంట్ వేసుకుని నిద్రిస్తున్నారు. మే 7న ప్రారంభమైన వారి ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది.ఈ ప్రయాణంలో అనుభవాలను వీడియోల రూపంలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తున్నారు. నెటిజన్లు వారికి మద్దతు తెలుపుతుండగా, మరికొందరు అభిమానం వెర్రి తలలు అంటే ఇదేనేమో.. బస్సు, ట్రైన్లో వెళ్లొచ్చు కదా, కాలినడకన రావాల్సిన అవసరమా? అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.రఫీ దంపతులు మాట్లాడుతూ.. మాకు విజయ్, ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ఆయన రాజకీయ పార్టీని ప్రారంభించి, ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావడానికి సిద్ధమవుతున్నప్పుడు ఆయన్ని ప్రత్యక్షంగా చూడాలనే కోరిక మరింత బలపడింది. అందుకే చెన్నై వరకు నడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.కేరళ జంట 650 కి.మీ నడిచి చెన్నై చేరుకోవడం, తలపతి విజయ్ను కలవాలని ప్రయత్నించడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అభిమానులు ‘పీక్ తలపతి క్రేజ్’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి ఖచ్చితమైన అపాయింట్మెంట్ లేదా అధికారిక ఏర్పాట్లు లేకపోయినా, చెన్నై చేరుకున్న తర్వాత ఆ అవకాశం తప్పకుండా లభిస్తుందని వారు ఆశాభావంతో ఉన్నారు.రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన పార్టీ టీవీకే, సంకీర్ణ భాగస్వాముల మద్దతుతో అసెంబ్లీ ఎన్నికల్లో 108 సీట్లు గెలిచి మెజారిటీ సాధించింది. -
ఎస్ఐఆర్తో మాకూ లాభం జరిగిందేమో!: శశిథరూర్
ఎస్ఐఆర్పై దేశంలో ఒకపక్క దుమారం చెలరేగుతుండగా.. ఇంకోపక్క తిరువనంతపురం ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ఈ అంశంపై ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. బెంగళూరు (దక్షిణ) నియోజకవర్గ ఎంపీ తేజస్వీ సూర్యతో కలిసి ఆయన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జరిగిన చర్చలో శశిథరూర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ పేరుతో వివిధ రాష్ట్రాల్లో లక్షలాది ఓట్లను తొలగించిన ఎస్ఐఆర్ ప్రక్రియ కేరళలో తమకు లాభం చేకూర్చి ఉండవచ్చునని అన్నారు. బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఇటీవలే వెల్లడై ఓట్ల చోరీ అంశం మరోసారి చర్చనీయాంశమైన ప్రస్తుత తరుణంలో శశిథరూర్ వ్యాఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కూడా శశిథరూర్ వ్యాఖ్యానిస్తూ.. ‘అక్కడ సుమారు 91 లక్షల మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరిలో 34 లక్షల మంది తాము ఓటింగ్‌కు అర్హులమని, జాబితాలో తమ పేర్లు చేర్చాలని అప్పీల్ చేశారు కూడా. అయితే ఒకొక్కరి వివరాలను పరిశీలించి చేర్చాల్సి ఉన్నందున వీరిలో కొన్ని వందల మందికి మాత్రమే మళ్లీ అవకాశం దక్కింది. ఫలితంగా సుమారు 31 నుంచి 32 లక్షల మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. బెంగాల్లో టీఎంసీ కంటే బీజేపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం కూడా కొంచెం అటు ఇటుగా 30 లక్షలు కావడం’ అని ఆయన వ్యాఖ్యానించారు.#WATCH | San Francisco, USA: Speaking at the roundtable on 'India, That is Bharat: Growth Governance and Identity' at Stanford India Conference, Congress MP Shashi Tharoor says, "About the SIR... there are legitimate questions to answer. Look at the Bengal case. 91 lakh names… pic.twitter.com/QpysPZcVV1— ANI (@ANI) May 10, 2026ఓటర్ల జాబితాలో అవకతవకలను సవరించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ అభ్యంతరం పెట్టలేదని, డూప్లికేట్ ఓటర్లు, మరణించిన, వలస వెళ్లిన వారి పేర్లు తొలగించడం అవసరం కూడా అని ఆయన అన్నారు ఈ క్రమంలోనే కేరళలో ఎస్ఐఆర్ ప్రక్రియ తమకు ఎలా ఉపయోగపడిందో వివరిస్తూ శశిథరూర్ ఏమన్నారంటే.. ‘వాస్తవానికి ఎస్ఐఆర్ అన్నది కేరళలో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చి ఉండవచ్చు. ఎందుకంటే లెఫ్ట్ ప్రభుత్వం చాలాకాలంగా ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతోంది. ఒకే ఓటరు మూడు నాలుగు చోట్ల నమోదు చేసకోవడం, డూప్లికేట్ ఓటర్లు చాలామంది ఉన్నారు. వీరందరి తొలగింపు ఫలితంగా కాంగ్రెస్‌కు మెజార్టీ లాభించి ఉండవచ్చు’ అని అన్నారు.కొందరిని ఒంటరి వాళ్లను చేశారు..దేశంలో మైనార్టీ వర్గాలను ఒంటరులను చేయడం గత దశాబ్ద కాలంలో ఎక్కువైందని, బీజేపీ అగ్రనేతలు మొదలుకొని సామాన్యుల వరకూ మైనార్టీలను ఉగ్రవాదుల మాదిరిగా చూస్తూండటం దీనికి కారణమని శశిథరూర్ వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యతో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉన్నప్పటికీ బీజేపీ మార్కు రాజకీయాల విషయంలో మాత్రం తన వైఖరి నిక్కచ్చిగానే ఉంటుందని స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో ఈ దేశంలోని మైనార్టీలు తమ పట్ల ఎందుకింత వివక్ష ఏర్పడిందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు. ‘మా పూర్వీకులు ఈ మట్టిలోనే కలిసిపోయారు. అయినా మమల్ని వేరుగా ఎందుకు చూస్తున్నారు’ అని వారు భావిస్తున్నారని, విభజన గాయాలను రెచ్చగొడుతూ మైనార్టీలను అణచివేసే ప్రయత్నం చేయడం ద్వారా బీజేపీ తప్పు చేస్తోందని వ్యాఖ్యానించారు. -
మత్తు వల్లకాడుగా మారుతున్న కేరళ
తిరువనంతపురం: దేవుని సొంత దేశంగా పేరొందిన ‘కేరళ’ ఇప్పుడు డ్రగ్స్ మత్తులో తూగుతోంది. ఒకప్పుడు వీధుల్లో మాత్రమే గంజాయి కనిపించేది. ఇప్పుడైతే ఏకంగా ఫైవ్ స్టార్ హోటళ్లలో విలాసవంతమైన ‘ఎండీఎంఏ’ డ్రగ్ పార్టీలు దర్శనమిస్తున్నాయి. 590 కిలోమీటర్ల భారీ తీరప్రాంతం, మారుమూల రైల్వే నెట్‌వర్క్‌ను వాడుకుంటూ కొకైన్, హెరాయిన్ వంటి సింథటిక్ డ్రగ్స్ కేరళకు వెల్లువలా పోటెత్తుతున్నాయని ‘మాతృభూమి’ తన కథనంలో పేర్కొంది. వలస కార్మికులను పావులుగా వాడుకుంటూ, ఎలైట్ క్లాస్ ప్రజలే లక్ష్యంగా సాగుతున్న ఈ హైటెక్ డ్రగ్ మాఫియా వ్యవహారం ఇప్పుడు పోలీసులకు, కేంద్ర దర్యాప్తు సంస్థలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం డ్రగ్స్ రవాణా కేంద్రంగానే కాకుండా.. భారీ మాదకద్రవ్యాల వినియోగ మార్కెట్‌గా కేరళ ఎలా మారిందో దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగుచూశాయి.గంజాయి నుంచి సింథటిక్ డ్రగ్స్ వైపు.. కేరళలో డ్రగ్స్ వినియోగం మరింతగా పెరిగిపోయింది. గంజాయి కన్నా తక్కువ స్థలం ఆక్రమించే, దాచడానికి సులభంగా ఉండే హెరాయిన్, ఎండీఎంఏ, ఎక్స్టసీ వంటి హై-ఎండ్ సింథటిక్ డ్రగ్స్ వైపు స్మగ్లర్లు మొగ్గుచూపుతున్నారు. హెరాయిన్‌కు వాసన లేకపోవడం, స్మగ్లర్లకు భారీగా లాభాలు రావడం దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా కొచ్చి వంటి నగరాల్లో విలాసవంతమైన ఫైవ్ స్టార్ హోటళ్లలో ప్రైవేట్ పార్టీల ముసుగులో డాక్టర్లు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్‌లో కొచ్చిలో ఏకంగా 183.55 గ్రాముల ఎండీఎంఏ, 93.51 గ్రాముల ఎక్స్టసీ పిల్స్‌తో కెవిన్ బి. మాథ్యూ అనే వ్యక్తి పట్టుబడటం కలకలం రేపింది. ఆ తర్వాత మార్చి 28న కడవంత్రలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా కొకైన్, మెథాంఫెటమైన్ పట్టుబడటం ఈ హై-ప్రొఫైల్ నెట్వర్క్ తీవ్రతను కళ్లకుకట్టింది.డ్రగ్ కొరియర్లుగా వలస కూలీలు.. ఎలైట్ పార్టీల సంగతి పక్కన పెడితే.. ఈ డ్రగ్ నెట్‌వర్క్‌లో వలస కార్మికులను పావులుగా వాడుతుండటం దర్యాప్తు సంస్థలను మరింత కలవరపెడుతోంది. అస్సాం, ఇతర ఈశాన్య రాష్ట్రాల నుంచి కేరళకు పనుల కోసం వచ్చే అమాయక కూలీలను ఏజెంట్లు బెదిరిస్తున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే ఉద్యోగాలు పీకేస్తామని, సొంతూళ్లకు పంపేస్తామని భయపెట్టి, వారిని డ్రగ్స్ కొరియర్లుగా మారుస్తున్నారు. గత 18 నెలల కాలంలోనే డ్రగ్స్ కేసుల్లో దాదాపు 103 మంది వలస కార్మికులు అరెస్ట్ కావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. మాదకద్రవ్యాల పంపిణీ కోసం వీరు ‘డెడ్ డ్రాప్స్’ అనే సరికొత్త, అత్యంత పకడ్బందీ వ్యూహాన్ని వాడుతున్నారు. కొరియర్లు డ్రగ్స్ ఉన్న బ్యాగులను తమ వద్ద ఉంచుకోకుండా, రైల్వే స్టేషన్లలో ముందుగా మాట్లాడుకున్న రహస్య ప్రదేశాల్లో వదిలేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత స్థానిక డిస్ట్రిబ్యూటర్లు వచ్చి వాటిని తీసుకెళ్తారు. దీనివల్ల అసలు స్మగ్లర్ల మూలాలను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది.అంతర్రాష్ట్ర ముఠాల వలయం.. ఈ డ్రగ్ మాఫియా మూలాలు కేవలం కేరళకే పరిమితం కాలేదు. జాతీయ, అంతర్జాతీయ ముఠాలతో వీరికి లోతైన సంబంధాలున్నాయి. కొచ్చిలోకి ప్రవేశిస్తున్న ఎండీఎంఏ, మెథాంఫెటమైన్లో ఎక్కువ భాగం బెంగళూరు, కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుంచి వస్తుండగా.. హెరాయిన్ సరఫరా ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాలతో ముడిపడి ఉంది. గోల్డెన్ క్రెసెంట్ (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్), గోల్డెన్ ట్రయాంగిల్ (మయన్మార్, థాయ్‌లాండ్) లాంటి అంతర్జాతీయ మార్గాల నుంచి వచ్చే కార్టెల్స్ కేరళను ఒక ప్రధాన లాంచ్‌ప్యాడ్‌గా ఎంచుకున్నాయి. ఇక్కడికి చేరిన డ్రగ్స్‌ను చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి, పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలకు సైతం తరలిస్తున్నారు. యువతలో పెరుగుతున్న ఆదాయం, గ్లోబల్ నైట్‌లైఫ్ సంస్కృతిపై ఆకర్షణ ఈ మార్కెట్ విస్తరణకు ఆజ్యం పోస్తున్నాయి. నిఘా పెంచినా, రైల్వే స్టేషన్లలో తనిఖీలు ముమ్మరం చేసినా, ఈ భారీ డిమాండ్ ముందు భద్రతా సంస్థల ప్రయత్నాలు సరిపోవడం లేదని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: Watermelon Death: 70 శాతంతో పాస్ .. చూసేందుకే లేవు చిట్టి తల్లీ..! -
కేరళం సీఎం అభ్యర్థి ఫిక్స్.. రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్..?
తిరువనంతపురం: కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఫలితాలు వెలువడి దాదాపు వారం రోజులు గడుస్తోన్నా ఇంకా ముఖ్యమంత్రి ఎవరనే విషయం తేలలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళం ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేసీ వేణుగోపాల్ వైపు మెుగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నివాసంలో జరిగిన అధికారిక భేటీకి ముందే రాహుల్ గాంధీ కేసీ వేణుగోపాల్‌తో విడిగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవి అంశమై ఇరు నేతలు సుధీర్గంగా చర్చలు జరపునున్నట్లు సమాచారం. కాగా కేరళం ముఖ్యమంత్రి విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్, శశిథరూర్‌లు సీఎం అభ్యర్థులుగా ప్రచారం జరిగింది.కాగా ఇటీవల వేణుగోపాల్‌కు వ్యతిరేకంగా కేరళలో పోస్టర్లు వెలిశాయి. దీని వెనుక సతీశన్ హస్తం ఉందనే ఆరోపణలు రావడంతో రాహుల్ గాంధీ ఆయనను నేరుగా ప్రశ్నించారు. వేణుగోపాల్ సీఎం కావడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు సతీశన్ అంగీకరించారు. మెుదటి నుంచి వేణుగోపాల్ ఎంపికను మరో కీలక నేత వీడీ సతీశన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వేణుగోపాల్ తన పదవిని ఉపయోగించి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని అధిష్టానం వద్ద సైతం ఫిర్యాదు చేశారు.కాగా సతీషన్, రమేష్ చెన్నితల వంటి స్థానిక నేతలకు కేరళలో మంచి పట్టు ఉంది. ముఖ్యంగా ముస్లిం లీగ్ మద్దతు సైతం సతీశన్‌కు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఇంత బలంగా సతీశన్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ కేసీ వేణుగోపాల్ వైపే మెుగ్గు చూపుతున్నట్లు సమాచారం. రాబోయే రెండు రోజుల్లో పార్టీ శ్రేణులను ఒప్పించి కేసీ వేణుగోపాల్‌ను ముఖ్యమంత్రిగా ప్రకటించే దిశగా హైకమాండ్ ప్రయత్నాలు సైతం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే స్థానిక నేతల వ్యతిరేకతను కాంగ్రెస్ ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా 140 స్థానాలు ఉన్న కేరళ అసెంబ్లీలో యూడీఎఫ్ కూటమి 102 సీట్లు గెలుచుకుంది. ఇందులో కాంగ్రెస్ 63, ఐయూఎమ్ఎల్ 22 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. -
‘2026 తీర్పు’: పీఠం కదిలింది.. చరిత్ర మారింది!
భారతదేశ రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక కీలక మలుపుగా నిలిచాయి. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలు దేశ రాజకీయ గమనాన్ని మార్చేలా ఉన్నాయి. అస్సాం, పుదుచ్చేరిల్లో యథాతథ స్థితి కొనసాగినప్పటికీ, మిగిలిన మూడు రాష్ట్రాల్లో వచ్చిన మార్పులు సామాన్యులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒకవైపు ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం, మరోవైపు జాతీయ పార్టీల వ్యూహాలు, ఇంకోవైపు సరికొత్త రాజకీయ శక్తుల ఉద్భవం వెరసి.. భారతదేశ సమాఖ్య వ్యవస్థ, ప్రజాస్వామ్య భవిష్యత్తుపై కొత్త చర్చకు తెరలేపాయి.కేరళలో కాంగ్రెస్ పునరుజ్జీవంకేరళ రాజకీయ చరిత్రలో ఎల్డిఎఫ్ , యూడిఎఫ్ కూటములు దశాబ్దాలుగా మారుతూ అధికారంలోకి వస్తున్నాయి. అయితే 2021లో పినరయి విజయన్ నాయకత్వంలోని ఎల్డిఎఫ్ వరుసగా రెండోసారి విజయం సాధించి, ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. అయితే గడిచిన ఐదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ సరికొత్త నాయకత్వంతో, రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లోకి దూసుకు వెళ్ళింది. ఫలితం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. లౌకికవాదాన్ని, ఆర్థిక పురోగతిని, సమాఖ్య స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు కేరళలో బలపడిన యూడిఎఫ్ భాగస్వామ్య పక్షాలపై ఉంది.తమిళనాట ‘విజయ్’ మేజిక్తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ ఈసారి ఫలితాలు అత్యంత సంక్లిష్టంగా ఉన్నాయి. 2021లో ఘనవిజయం సాధించిన ఎంకె స్టాలిన్ ప్రభుత్వం ఆర్థిక వృద్ధి, సంక్షేమ పథకాల్లో అద్భుతంగా రాణించినప్పటికీ, ఇతర అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా సినీ హీరో విజయ్ రాజకీయ అరంగేట్రం ఒక పెను తుఫానులా మారింది. రెండేళ్ల క్రితం పెట్టిన టీవీకే పార్టీ.. ఎన్నికలకు పది రోజుల ముందు పుంజుకుని ఏకంగా 108 నియోజకవర్గాల్లో జయకేతనం ఎగురవేసింది. ఎటువంటి భారీ ప్రచారాలు లేకుండా, కేవలం సోషల్ మీడియా మీమ్స్, పాటలు, విజయ్ ప్రసంగాలతోనే ఈ విజయం సాధించడం విశేషం. మేజిక్ ఫిగర్‌కు 11 సీట్ల దూరంలో నిలిచిన టీవీకేకు కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు తెలపడంతో నూతన ప్రభుత్వానికి మార్గం సుగమం అయ్యింది.బెంగాల్లో తృణమూల్ వెనుకంజదేశ రాజకీయ దిశను మార్చగల సత్తా ఉన్న పశ్చిమ బెంగాల్ ఫలితాలు ఈసారి దిగ్భ్రాంతిని కలిగించాయి. పదేళ్లుగా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ, అక్కడ బలమైన శక్తిగా ఎదిగింది. గత మూడు పర్యాయాలుగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌పై వ్యతిరేకత ఒక కారణమైతే, ఓటర్ల జాబితాలో జరిగిన భారీ మార్పులు మరో ప్రధాన కారణం. అనేక కుటుంబాల్లో తలిదండ్రులకు ఓటు హక్కు ఉంటే పిల్లలకు లేకపోవడం, కొన్నిచోట్ల వైరుధ్యాలు తలెత్తడం వంటి అంశాలు ప్రజాస్వామ్యంపై మచ్చగా నిలిచాయి. న్యాయవ్యవస్థ కూడా ఈ విషయంలో ఓటర్లను ఆదుకోలేకపోయింది. వరుస విజయాలతో ఉన్న దీదీకి ఈ ఓటమి గట్టి ఎదురుదెబ్బగా మారింది.ఈశాన్యంలోనూ కమలనాథుల హవా పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత బీజేపీ ఆధిపత్యం దేశవ్యాప్తంగా దాదాపు పూర్తయింది. మహారాష్ట్ర, గుజరాత్ వంటి పశ్చిమ రాష్ట్రాల నుండి హిందీ బెల్ట్ వరకు, ఇప్పుడు తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోనూ కమలనాథుల హవా నడుస్తోంది. అయితే, దక్షిణాది ఐదు రాష్ట్రాలు మాత్రం బీజేపీకి ఇప్పటికీ ఇనుప కోటలుగానే మిగిలాయి. కేరళ, తమిళనాడులో పాగా వేయడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలను అక్కడి ఓటర్లు తిప్పికొట్టారు. కేరళలో 3, తమిళనాడులో 1 సీటుకు మాత్రమే బీజేపీ పరిమితమైంది. ఉత్తరాదిని శాసిస్తున్నా, దక్షిణాది మాత్రం బీజేపీని సుదూరంగానే ఉంచింది.సమాఖ్య వ్యవస్థకు పొంచి ఉన్న ముప్పు?బీజేపీ వరుస విజయాలు సాధిస్తే భవిష్యత్తులో ఏకపార్టీ పాలన వైపు, హిందూత్వ భావజాలం వైపు రాజ్యాంగ సవరణలు జరిగే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే అవకాశం ఉందంటున్నారు. దేశాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా, లౌకిక రాజ్యంగా ఉంచాలంటే ప్రతిపక్షాల ఐక్యత అనివార్యం. 2024లో కొంత విజయం సాధించిన ఇండియా కూటమి ఆ తర్వాత నెమ్మదించినట్లు కనిపిస్తోంది. అయితే పశ్చిమ బెంగాల్ ఓటమి తర్వాత మమతా బెనర్జీ కూటమిని బలోపేతం చేస్తానని ప్రకటించారు. అటు స్టాలిన్ కూడా బీజేపీని సైద్ధాంతిక శత్రువుగా పరిగణిస్తున్నారు. కొత్తగా పుంజుకున్న విజయ్ (టీవీకే) కూడా ఈ కూటమిలోకి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రాల స్థాయిలో విభేదాలు ఉన్నప్పటికీ, జాతీయ స్థాయిలో దేశ భవిష్యత్తు కోసం ఈ పార్టీలన్నీ ఏకతాటిపైకి రావడం ఇప్పుడు చారిత్రక అవసరం అని విశ్లేషకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: కేబినెట్లో ఏకైక మగువ.. ఎవరీ అగ్నిమిత్ర పాల్? -
కేరళం సీఎంపై ఉత్కంఠ.. రంగంలోకి రాహుల్
-
కేరళం సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న ఉత్కంఠ
-
పినరయి కారుపై మోజు.. కుంజుమోన్ సీటుకు ‘క్లోజు’!
కన్నత్తూర్: పాతికేళ్ల పాటు ఒకే నియోజకవర్గానికి రారాజుగా వెలుగొందిన ఓ సీనియర్ రాజకీయ నేత తన తొలి ఓటమిని తట్టుకోలేకపోతున్నారు. కన్నత్తూర్ నియోజకవర్గంపై తన ముద్ర తొలిసారి చెరిగిపోవడంతో ఆర్ఎస్పీ(ఎల్) నేత కోవూరు కుంజుమోన్ మీడియా సమక్షంలో కన్నీరుమున్నీరయ్యారు. 2001 నుంచి వరుస విజయాలు సాధించిన ఆయన, తాజా ఎన్నికల్లో ఆర్ఎస్పీ అభ్యర్థి ఉల్లాస్ కోవూరు చేతిలో ఏకంగా 25 వేల భారీ ఓట్ల తేడాతో ఘోర పరాజయం పాలవ్వడం కేరళ రాజకీయాల్లో సంచలనంగా మారింది.రాజకీయ ప్రస్థానం.. ఊహించని షాక్ కుంజుమోన్ రాజకీయ ప్రస్థానంలో 2016లో కీలక మార్పు చోటుచేసుకుంది. అప్పటివరకు ఉన్న మాతృసంస్థ (ఆర్ఎస్పీ) యూడీఎఫ్‌లో చేరడంతో, ఆయన విడిపోయి లెనినిస్ట్-మార్క్సిస్ట్ వర్గాన్ని స్థాపించి ఎల్డీఎఫ్తో జతకట్టారు. అప్పటినుంచి కన్నత్తూర్ను తన కంచుకోటగా నిలుపుకున్నారు. అయితే తాజా అనూహ్య ఓటమిపై ఆయన స్పందిస్తూ.. ‘నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వ నిధులన్నీ తీసుకొచ్చాను, ప్రజల మధ్యే ఉన్నాను, ఓటమిని అంగీకరిస్తున్నాను’ అని అన్నారు.ప్రచార లోపమే కొంపముంచిందా?తన ఓటమికి ప్రజల్లో వ్యతిరేకత కంటే, తాను చేసిన పనులను ప్రచారం చేసుకోకపోవడమే ప్రధాన కారణమని కుంజుమోన్ విశ్లేషించారు. ‘కిఫ్బీ’ తదితర నిధులతో ఏకంగా రూ. 1,010 కోట్ల అభివృద్ధి పనులు చేశానని ఆయన గుర్తుచేశారు. ‘నేను ప్రచార ఆర్భాటాలకు పోయే వ్యక్తిని కాను. కానీ రోడ్లు, పాఠశాలల నిర్మాణం వంటి పనులను ప్లెక్సీలు, ప్రకటనల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సింది’ అని ఆయన పేర్కొన్నారు. తాను చేసిన అభివృద్ధిని చాటుకోవడంలో విఫలమవ్వడమే ఈ పరాజయానికి దారితీసిందని కుంజుమోన్ అభిప్రాయపడ్డారు.కారు కొంటే తప్పా..? కన్నీటి పర్యంతం మీడియా సమావేశంలో ఆయన వ్యక్తిగత జీవితం, ఇటీవల కొన్న కొత్త కారు గురించి ప్రస్తావన రాగానే కుంజుమోన్ తీవ్ర భావోద్వేగానికి గురై, వెక్కి వెక్కి ఏడ్చారు. ‘కామ్రేడ్ పినరయి విజయన్ నల్ల కారులో ప్రయాణిస్తుంటే చూసి, నాకూ అలాంటి కారు కొనుక్కోవాలనిపించింది. నా పొదుపు మొత్తాన్ని చిట్ ఫండ్స్ లో దాచుకుని, ఆ 27 లక్షలతో కారు కొన్నాను. అందులో తప్పేముంది?’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓటమి బాధ ఉన్నప్పటికీ, ప్రజాసేవలో కొనసాగుతానని, నియోజకవర్గంలో మిగిలిపోయిన ప్రాజెక్టుల కోసం పోరాడతానని ఆయన తెలిపారు.ఇది కూడా చదవండి: ఓటింగ్‌లో సునామీ.. థర్డ్ జెండర్లకు ఒరిగిందేమీ.. -
కేరళ సీఎంగా ఆయనే?
న్యూఢిల్లీ: కేరళ ముఖ్యమంత్రి ఎంపిక ఘట్టం తుది దశకు చేరుకుంది. ముఖ్య మంత్రి కుర్చీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)కేసీ వేణుగోపాల్ కూర్చునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అధిష్టానం పంపిన పరిశీలకులు అజయ్ మాకెన్, ముకుల్ వాస్నిక్ బుధ, గురువారాల్లో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో వేర్వేరుగా మాట్లాడి అభిప్రాయాలు సేకరించారు.పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడా మాట్లాడి, అభిప్రాయాలను సేకరించారు. ఇందుకు సంబంధించిన తుది నివేదికను వారు శుక్రవారం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. అంతిమ నిర్ణయం ఇప్పుడు ఖర్గే చేతుల్లో ఉంది. దీనిపై త్వరలోనే ఆయన నిర్ణయం ప్రకటిస్తారని భావిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యేల్లో అత్యధికులు కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపినట్లు విశ్వసనీయ వర్గాలంటున్నాయి.సీఎం పదవిని చేపట్టేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడితోపాటు అగ్ర నేత రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ముఖ్యమంత్రి పదవి ఆయన్ని వరించే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్ నేత, గత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న వీడీ సతీశన్ వైపు కూడా మొగ్గు చూపినట్లు సమాచారం. మరో సీనియర్ నేత రమేశ్ చెన్నితాల కూడా సీఎం రేసులో ఉన్నారు. -
మహిళా ఎమ్మెల్యేకు షాకిచ్చిన కాంగ్రెస్ నేత
తిరువనంతపురం: కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) ప్రధాన కార్యాలయంలో ఓ షాకింగ్ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళా ఎమ్మెల్యేను కౌగిలించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత ప్రయత్నించారు. కొత్తగా ఎన్నికైన కొల్లాం ఎమ్మెల్యే అడ్వకేట్ బిందు కృష్ణ.. లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి వచ్చారు.అయితే, ఆమెకు ఇష్టం లేకపోయినప్పటికీ, సీనియర్ నాయకుడు చెరియన్ ఫిలిప్ ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆమె అసౌకర్యానికి గురవుతూ అడ్డుకున్నప్పటికీ.. ఆయన వెనక్కి తగ్గకపోవడం వివాదాస్పదమైంది. పార్టీ నాయకులు, మీడియా సమక్షంలోనే జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఆ పార్టీ నేత చెరియన్ ఫిలిప్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసలేం జరిగింది?వైరల్ అవుతున్న వీడియోలో ఎమ్మెల్యే బిందు కృష్ణ సమావేశానికి చేరుకుని.. మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ పార్టీ కార్యాలయం వైపు వెళ్లడం కనిపిస్తోంది. తెలుపు, పసుపు రంగు చీర ధరించిన ఆమె.. మొదట ఒక పార్టీ కార్యకర్తకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత చెరియన్ ఫిలిప్ ఆమె వద్దకు వచ్చారు. బిందు కృష్ణ కరచాలనం చేయడానికి తన చేతిని చాచారు. కానీ ఫిలిప్ మాత్రం ఆమెను కౌగిలించుకోవడానికి ముందుకు కదిలారు. ఆయన ఆమె మెడపై ఒక చేయి వేసి, ఆమె చాచిన చేతిని కిందకు నొక్కడానికి ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.Intern: Shocking news. A newly elected young woman MLA was seen being forcibly hugged by a senior leader.Rajdeep: What is this party culture? What example are we setting? Netas don’t even know how to conduct themselves.Intern: Cherian Philip tried to forcibly hug Kollam MLA… pic.twitter.com/JqTvSKEIoI— Lala (@FabulasGuy) May 7, 2026ఒక్కసారిగా షాక్..బిందు కృష్ణ.. ఈ చర్యతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆమె ఆయనను పక్కకు నెట్టివేస్తూ ప్రతిఘటించారు. ఆమె వెనక్కి తగ్గినప్పటికీ.. ఫిలిప్ రెండోసారి కూడా ఆమెను కౌగిలించుకోవడానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. చివరికి ఆమె చేతులు జోడించి నమస్కరిస్తూ అక్కడి నుండి ముందుకు సాగిపోయారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడున్న పలువురు జర్నలిస్టులు, పార్టీ కార్యకర్తలు నవ్వుతూ కనిపించడంపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆమె ఒక ఎమ్మెల్యే..ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళా ఎమ్మెల్యే ఇబ్బంది పడుతున్నా కూడా ఫిలిప్ పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. రాజకీయాల్లో సీనియారిటీ ఉన్నంత మాత్రాన వ్యక్తిగత సరిహద్దులను అతిక్రమించే హక్కు ఎవరికీ లేదని.. అయిష్టత వ్యక్తం చేసిన వెంటనే వెనక్కి తగ్గాలని నెటిజన్లు హితవు పలుకుతున్నారు. ఆమె ఒక ఎమ్మెల్యే.. ఈ వయసులో కూడా ఆయన ఇలా అసభ్యంగా ప్రవర్తించడం దారుణం అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
కేరళ సీఎం పీఠంపై తొలగని సస్పెన్స్
-
కేరళ సీఎం పదవిరేసులో ముగ్గురు!
లెఫ్ట్ కూటమి పరిపాలనా కోటగోడలను బద్దలుకొడుతూ పదేళ్ల తర్వాత కేరళలో అధికారపీఠాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి ఎట్టకేలకు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధంచేసుకుంది. అయితే రాష్ట్రపరిపాలనా రథాన్ని ముందుండి నడిపించే రథసారథి ఎవరనే చర్చ ఇప్పుడు మొదలైంది. గతంలో కేరళ రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షనేతగా ఉండి సీఎం పినరయి విజయన్ ప్రభుత్వ వైఫల్యాలను విజయవంతంగా ఎండగట్టిన వీడీ సతీశన్‌కు సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఊహాగానాలు ఎక్కువయ్యాయి. అయితే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ అగ్రనాయకుడు రాహుల్‌గాందీకి అత్యంత సన్నిహిత నేతగా మెలుగుతున్న కేసీ వేణుగోపాల్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ఆస్కారముందని కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్ద చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేశ్ చెన్నితల సైతం సీఎం రేసులో ముందుకు దూసుకుపోతున్నారని కేరళ మీడియా కోడైకూస్తోంది. పార్టీ నేతలందర్నీ సమన్వయం చేసే సత్తా, పరిపాలనా అనుభవం, ఢిల్లీలో మాట నెగ్గించుకురాగల పరపతి ఉన్న నేతకే సీఎం పదవి దక్కే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఎవరిని సీఎం పదవి వరిస్తుందనేది కేరళలో చర్చనీయాంశమైంది. ఈ ముగ్గురు కీలకనేతల గురించి క్లుప్తంగా.. వీడీ సతీశన్ వీడీ సతీశన్ ఐదేళ్లుగా విపక్షనేతగా కొనసాగుతూ ప్రజసమస్యలపై అసెంబ్లీలో ప్రజావాణిని బలంగా విన్పించి ఓటర్లలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎంగా ఈయనకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) పార్టీ మద్దతు కూడా ఉంది. సతీశన్ సీఎం అయితే మైనార్టీల బాగోగులనూ పట్టించుకుంటారని ఐయూఎంఎల్ అధ్యక్షుడు పనక్కడ్ సాదిఖ్అలీ తంగల్ అన్నారు. పినరయి విజయన్ ప్రభుత్వహయాంలో జరిగిన అవినీతి, బంధుప్రీతి, అసమర్థ పాలనపై సతీశన్ ప్రజాక్షేత్రంలో బలంగా ఎండగట్టారు. యువకుడిగా కేరళ స్టూడెంట్స్ యూనియన్‌లో సభ్యునిగా ఉన్నకాలం నుంచి లాయర్‌గా తర్వాత కాంగ్రెస్‌నేతగా పాతికేళ్లకుగాపైగా కేరళ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఎర్నాకులం ఈయనకు పెట్టని కోట. పార్టీ అధిష్టానం వద్ద సైతం సతీశన్‌కు మంచి పేరుంది. పరవూర్‌లో సీపీఐ నేత టైసన్ మాస్టర్‌పై భారీ మెజారీ్టతో గెలిచి ప్రజల్లో తనకున్న ఆదరణను మరోసారి నిరూపించుకున్నారు. రమేశ్ చెన్నితల 70 ఏళ్ల రమేశ్ చెన్నితల సొంత రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించారు. పారీ్టకి గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా సేవలందించారు. గత యూడీఎఫ్ ప్రభుత్వంలో రాష్ట్ర హోం, విజిలెన్స్ శాఖమంత్రిగా పనిచేశారు. విద్యార్థి నేతగా ఉంటూ ఈస్థాయికి ఎదిగారు. 1982లోనే విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐకి ఆలిండియా అధ్యక్షునిగా పనిచేశారు. ఇండియన్ యూత్ కాంగ్రెస్‌కు సైతం అధ్యక్షునిగా చేశారు. కేరళ అసెంబ్లీలో గతంలో విపక్షనేతగా ఉంటూ ప్రభుత్వవిధానాలపై ఉద్యమించారు. సతీశన్ కంటే ముందు విపక్షనేతగా పనిచేసిన కాలంలో యూడీఎఫ్ కూటమి మిత్రపక్షాల మధ్య ఐక్యత పెంచడంలో సపలమయ్యారు. జిల్లా నేతలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. తాజా ఎన్నికల్లో హరిపాద్ నియోజకవర్గంలో సీపీఐ నేత జిస్మన్పై భారీ మెజారీ్టతో నెగ్గారు. అలప్పుజ జిల్లాలో గెలిచిన ఏకైక యూడీఎఫ్ అభ్యర్థి ఈయనే. తద్వారా జిల్లాపై తనకు ఎంత పట్టు ఉందనేది నిరూపించుకున్నారు. కేసీ వేణుగోపాల్ అటు ఢిల్లీలో ఇటు కేరళలో నెగ్గుకురాగల విలక్షణమైన నేపథ్యమున్న నేతగా కేసీ వేణుగోపాల్ నిలిచారు. అలప్పుజ నుంచి గతంలో ఎంపీగా గెలిచారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రస్తుతం అత్యంత కీలకమైన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి(వ్యవస్థాగతం) హోదాలో కొనసాగుతూ అగ్రనాయకులు సోనియా గాం«దీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీలకు కుడిభుజంగా ఉన్నారు. కేఎస్‌యూ, యూత్ కాంగ్రెస్ విభాగాల్లో కష్టపడిపనిచేసి ఏఐసీసీ పదవి పొందేస్థాయికి ఎదిగారు. రాష్ట్ర నేతలకు, కేంద్ర నాయకత్వానికి మధ్య సంధాన కర్తగా ఉంటూ చాన్నాళ్లుగా చక్కటి సమన్వయం సాధించారు. అధినాయకత్వానికి దగ్గరగా ఉన్న కారణంగా ఈయనకు సీఎం పదవి దక్కినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని రాజకీయపండితులు విశ్లేషిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మాజీ సీఎం వెహికిల్‌పై ఇన్ని ట్రాఫిక్ చలాన్లా..?
తిరువనంతపురం: కేరళం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు దెబ్బమీద దెబ్బ పడుతుంది. ఇదివరకే అధికారం కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆయనకు ఇప్పుడు ఆ రాష్ట్ర ట్రాఫిక్ నిబంధనలు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. ఆయన సీఎంగా వినియోగించిన కారుపై గత రెండేళ్లుగా 18 ఫైన్ చలాన్లు పడ్డాయని ఆ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వాటి జరిమానాలు సైతం ఇదివరకూ చెల్లించలేదని పేర్కొన్నారు.ఇటీవల జరిగిన కేరళం ఎన్నికల్లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఈ కూటమికి కేవలం 35 స్థానాలు మాత్రమే వచ్చాయి. దీంతో పదేళ్లపాటు సీఎంగా ఉన్న పినరయి విజయన్ సీఎంకు పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలుమార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలు తెలిపాయి. గత రెండేళ్లుగా ఆయన కారు 18 సార్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు గురైందని రూ.13,750 జరిమానాలు విధించబడ్డాయని పేర్కొన్నాయి.అందులో అధికంగా సీట్‌బెల్ట్ లేకుండా ప్రయాణించడం వల్ల 12 సార్లు జరిమానాలు పడ్డాయని పేర్కొన్నారు. జనవరి 2025లో కోవలం- కరోడే జాతీయ రహదారిపై గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించారని దానికి కూడా జరిమానా విధించబడిందని తెలిపారు. అదే విధంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వీ గోవిందన్ ప్రయాణించిన కేఎల్ 7 ఆర్ గల కారుపై సైతం 18 చలాన్లు ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు నివేదికలు అందించారు.తాజాగా ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన చిత్రాలను విడుదల చేశారు. అయితే పినరయి విజయన్ రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ట్రాఫిక్ నిబంధనలు అత్యంత పకడ్బందీగా అమలు చేసేందుకు ఆ రాష్ట్రంలో ఏఐ కెమెరాలు అమర్చారు. ఇప్పుడు ఆ కెమెరాలలోని మాజీ సీఎం కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన చిత్రాలు ఉండడం విశేషం. -
కేరళలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సమావేశం
కేరళలో అల్లు అర్జున్‌కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐకాన్ స్టార్ సినిమాలను మలయాళ ప్రేక్షకులు బాగా ఆదరిస్తుంటారు. ఈ నేపథ్యంలో కేరళ త్రివేండ్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేరళ స్టేట్, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.కేరళ రాష్ట్ర అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ మీటింగ్ జరిగింది. అసోసియేషన్ చేపట్టబోయే కార్యక్రమాలు భవిష్యత్ ప్రణాళికలపై ఈ కార్యక్రమంలో చర్చించారు. కేరళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ ప్రభు సారథ్యంలో జరిగిన ఈ ఫ్యాన్స్ మీటింగ్ లో అసోసియేషన్ ను మరింత బలపర్చడం, విస్తరించడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అభిమానులకు చేరువకావడంపై డిస్కషన్స్ చేశారు.అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఏఏఎఫ్ఏ) దేశంలో అతిపెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ గా ఏర్పడింది. అన్ని ప్రాంతాల్లో ఏఏఎఫ్ఏ తమ కార్యక్రమాలను చేపడుతోంది. సౌత్ ఇండియాలో సమావేశాలను విజయవంతంగా పూర్తి చేసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఇకపై నార్త్ ఇండియాలోనూ తమ యాక్టివిటీస్ చేసేందుకు సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ జూన్ 4న సౌత్ ఇండియా లెవెల్ గ్రాండ్ మీటింగ్ ఏర్పాటు చేయబోతోంది. వివిధ రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ ఈ మీటింగ్ లో పాల్గొనబోతున్నారు. -
చరిత్ర సృష్టించకపోగా.. నవ్వుల పాలయ్యారు!
ఎన్నికల టైంలో సవాళ్లు.. ప్రతి సవాళ్లు సాధారణంగా కనిపించే వ్యవహారమే. అయితే అది అతిగా ఉంటేనే జనాల్లో నవ్వుల పాలయ్యేది. కేరళలో ఇప్పుడు ఆ తండ్రీ కొడుకులది అదే తరహా పరిస్థితి. ఎలక్షన్ టైంలో ఈ ఇద్దరూ తమ నోటికి పని చెప్పడంతో.. వాళ్ల కలను తారుమారు చేసి ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు!.. పీసీ జార్జ్.. కేరళ రాజకీయాలపై నాలుగు దశాబ్దాలుగా ప్రభావం చూపించిన నేత. పూన్జార్ నియోజవకర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వ్యక్తి. కేరళ కాంగ్రెస్(జోసెఫ్ గ్రూప్), అటుపై ఇండిపెండెంట్ అభ్యర్థిగానూ నెగ్గిన ట్రాక్ రికార్డు ఆయనది. అలాంటి వ్యక్తి సొంత పార్టీ పెట్టాడు. ఓటమి చవిచూశాడు. తన పార్టీని బీజేపీలో విలీనం చేశాడు. బీజేపీ నుంచి పోటీ చేసి తాను ఓడడమే కాదు.. తన తనయుడ్ని ఓడగొట్టారు. పీసీ జార్జ్ ఎన్నికల ముందు తన విజయంపై ఎంతలా ధీమా వ్యక్తం చేశారంటే.. ‘‘నేను పూన్జార్లో భారీ మెజారిటీతో గెలుస్తా. నేనే కాదు.. బీజేపీ తరఫున పోటీ చేస్తున్నా. నా తనయుడు షోన్ జార్జ్ కూడా గెలుస్తాడు. మేం ఇద్దరం కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టిన తండ్రీకొడుకులుగా చరిత్ర సృష్టిస్తాం. ఎవరికైనా సందేహం ఉంటే ఒక కోటి రూపాయల పందానికి రెడీ’’ అంటూ సవాల్ విసిరాయాన. కట్ చేస్తే.. పూన్జార్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీసీ జార్జ్ చిత్తుగా ఓడారు. అక్కడ యూడీఎఫ్ అభ్యర్థి ఎం.జె. సెబాస్టియన్ నెగ్గారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి సెబాస్టియన్ కులతుంకల్ రెండో స్థానంలో నిలవగా.. పీసీ జార్జ్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఇటు పాళాలో షోన్ జార్జ్‌కు వరుసగా రెండోసారి పరాభవం తప్పలేదు. 2021లో కేరళ కాంగ్రెస్(ఎం) ఎమ్మెల్యే జోస్ కే మణి రాజ్యసభకు వెళ్లారు. ఆ స్థానంలో ఉప ఎన్నిక జరగ్గా.. షోన్ జార్జ్ ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. అయితే.. మణి సి కప్పన్ చేతిలో షోన్ ఓడారు. ఇప్పుడు ఎన్డీయే అభ్యర్థిగా మరోసారి పోటీ చేసినా షోన్ నెగ్గలేకపోయారు. మళ్లీ మణి సి కప్పన్ నెగ్గగా.. ఇక్కడ కూడా షోన్ మూడో స్థానానికే పరిమితమయ్యారు. దీంతో ఆ తండ్రీకొడుకుల మీద ‘కోటి రూపాయలెక్కడ?’ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. పీసీ జార్జ్ ఒకప్పుడు కేరళ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేతనే. అయితే గత కొంతకాలంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నానుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా మతపరంగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలు ఎదుర్కొనేలా చేశాయి. ఒకవైపు బీజేపీ కేరళలో క్రిస్టియన్ కమ్యూనిటీని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే.. ఈ తండ్రీకొడుకులు మాత్రం తమ నోటికి పని చెబుతూ ముస్లిం ఓట్లను దూరం చేశారు. దీంతో.. బీజేపీకి ముస్లిం ఓటు బ్యాంకు దూరంగా ఉండడంతో పాటు ఒకేసారి కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆ తండ్రీకొడుకుల కల చెదిరినట్లైంది. అయితే గత ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీ.. ఈ ఎన్నికల్లో మూడు సీట్లు గెల్చుకోవడం ఆ పార్టీకి కాస్త ఊరట ఇచ్చే అంశమే!. -
కేరళలో యూడీఎఫ్.. తదుపరి సీఎం ఇతనే?
తిరువనంతపురం: దశాబ్దకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్(యూడీఎఫ్) కేరళలో అధికారపీఠాన్ని కైవసంచేసుకుంది. రాష్ట్ర శాసనసభలో మొత్తం 140 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో యూడీఎఫ్ కూటమి ఏకంగా 102 స్థానాల్లో ఘన విజయం సాధించింది. కేరళలో గెలిచి కాంగ్రెస్ దక్షిణాదిన మూడో రాష్ట్రంలో అధికారపగ్గాలు చేపట్టబోతోంది. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కొలువుతీరిన విషయం తెల్సిందే. కేరళలో వరుసగా రెండు పర్యాయాలు గెలిచిన వామపక్ష పారీ్టల సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కూటమి ఈసారి అధికారానికి ఆమడదూరంలో ఆగిపోయింది. శబరిమల ఆలయ వివాదం మొదలు ముఖ్యమంత్రి కుటుంబసభ్యుల అవినీతి, ప్రభుత్వవ్యతిరేకత దాకా ఎన్నో అంశాలు అధికారకూటమి పుట్టిముంచాయి. దీంతో ఎల్డీఎఫ్ కూటమి కేవలం 35 చోట్ల గెలిచింది. కొన్ని జిల్లాల్లో ఎల్డీఎఫ్ పార్టీల అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవలేదు. 50 ఏళ్ల తర్వాత దేశంలో..ప్రభుత్వ వ్యతిరేకత అనూహ్యంగా పెరిగిపోవడంతో ఆ ధాటికి ఐదేళ్లు మంత్రిపదవులు వెలగబెట్టిన వీణా జార్జ్, ఆర్ బిందు, కేబీ గణేశ్, వీఎన్ వాసనన్సహా 13 మంది నేతలు సోమవారంనాటి ఫలితాల్లో ఓటమిని చవిచూడకతప్పలేదు. 21 మంది కేబినెట్ మంత్రుల్లో ముఖ్యమంత్రి విజయన్, పీఏ మొహమ్మెద్ రియాస్, కె.రాజన్, జీఆర్ అనిల్, కేఎన్ బాలగోపాల్, పీ.ప్రసాద్, సాజి చెరియాన్ మాత్రం గెలిచారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధర్మదం స్థానంలో విజయం సాధించారు. సీపీఐ(ఎం) పార్టీలో అత్యధిక మంది అభ్యర్థులు ఓడిపోయారు. ముఖ్యంగా కేరళ కాంగ్రెస్(ఎం) పార్టీ అభ్యర్థులు ఒక్కరు కూడా గెలవలేదు. ఎల్డీఎఫ్ కనీ్వనర్ టీపీ రామకృష్ణన్ సైతం తన సిట్టింగ్ స్థానం పెరాంబ్రలో ఓడిపోయారు. కేరళలో ఓటమితో వామపక్ష పారీ్టలు తొలిసారిగా 50 ఏళ్ల తర్వాత దేశంలో మరే రాష్ట్రంలోనూ అధికారంలోలేకుండా పోయాయి. ద్విముఖ పోరుగా తయారైన కేరళలో హిందూత్వ బీజేపీ తొలిసారిగా మూడుచోట్ల విజయం సాధించి పార్టీ విస్తరణకు ఉపక్రమించింది. తిరువనంతపురం కార్పోరేషన్ పరిధిలోని నిమోమ్, కళాకూట్టం నియోజకవర్గాలతోపాటు కొల్లం జిల్లాలోని ఛథనూర్లలో బీజేపీ అభ్యర్థులు విజయబావుటా ఎగరేశారు. కేరళ శాసనసభలో విపక్ష నేత, కాంగ్రెస్ అభ్యర్థి వీడీ సతీశన్ పరవూర్ నియోజకవర్గంలో సీపీఐ నేత ఈటీ టైసన్ మాస్టర్‌పై 20,600 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. తొలి 17 రౌండ్లలో వెనుకబడిన సతీశన్ తర్వాత పుంజుకుని జయకేతనం ఎగరేశారు. 2001 నుంచి వరసబెట్టి ఇక్కడి నుంచే సతీశన్ గెలుస్తున్నారు. ఈయనకు ఇది ఐదో విజయం. ఈసారి ఎన్నికల్లో అన్ని పారీ్టల నుంచి 11 మంది మహిళా అభ్యర్థులు గెలుపొందారు. ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్ అగ్రనేత సతీశన్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. మెరుగుపడ్డ ఓట్ల శాతం ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ సాధించిన ఓట్ల శాతం బాగా మెరుగుపడింది. పోలైన ఓట్లలో కాంగ్రెస్ 28.79 శాతం ఓట్లను సాధించింది. తర్వాత సీపీఐ(ఎం) 21.77 శాతం ఓట్లను సాధించింది. తర్వాత కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమిలోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) 11.01 శాతం ఓట్లు సాధించింది. అయితే స్థానిక ఎన్నికల్లో 15 శాతం ఓట్లను సాధించిన బీజేపీ తాజా ఫలితాల్లో కేవలం 11.42 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. సీపీఐ 6.64 శాతం ఓట్లు సాధించింది. సోమవారం ఓట్ల లెక్కింపు తర్వాత కూటమి ఓడిపోయిన వార్త తెలియగానే ముఖ్యమంత్రి పదవికి సీపీఎం అగ్రనేత పినరయి విజయన్ రాజీనామాచేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కు అందజేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని విజయన్‌కు గవర్నర్ సూచించారు.ఇది కూడా చదవండి: దీదీ పతనం.. కాంగ్రెస్‌కు ఊపిరి -
ఇది పెద్ద దెబ్బే.. ‘లెఫ్ట్’ కళ తప్పింది!
న్యూఢిల్లీ: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ). ఒకప్పుడు కీలకమైన, బలమైన పార్టీ. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక 1951–52లో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించిన ప్రతిపక్షం. ఆ తర్వాత పశి్చమ బెంగాల్‌కు 23 ఏళ్ల పాటు సీఎంగా పనిచేసిన సీపీఎం నేత జ్యోతిబసుకు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో 1996లో ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం సైతం వచ్చింది అయితే, పార్టీ పొలిట్‌బ్యూరో అందుకు వ్యతిరేకత తెలపడంతో ఆయన వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని చారిత్రక తప్పిదంగా ఆ పార్టీయే ఒప్పుకుంది.తిరిగి 2008లో, మన్మోహన్ సింగ్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి 60 మంది సభ్యులున్న వామపక్ష కూటమి మద్దతు ఉపసంహరించుకుంది. భారత్– అమెరికా అణు ఒప్పందమే ఇందుకు కారణం. అప్పట్లో వామపక్షాలు కేరళ, పశ్చిమబెంగాల్, త్రిపురల్లో అధికారంలో ఉన్నాయి. ఆ తర్వాత కేవలం 20 ఏళ్ల కాలంలోనే దేశంలో కమ్యూనిస్టుల ప్రాభవం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకుంది. ఓటర్లు వామపక్ష భావనను వీడి క్రమక్రమంగా దూరంగా వెళ్లిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణం. కేరళలో పినరయి విజయన్ సారథ్యంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) ఓటమి కమ్యూనిస్టులకు తాజాగా పెద్ద దెబ్బ. దీంతో, 1970 తర్వాత దేశంలో కమ్యూనిస్ట్‌లు మొదటిసారిగా అధికారం కోల్పోవడం గమనార్హం. చారిత్రక విజయం.. దేశ రాజకీయ చరిత్రలో వామపక్షాలది విశిష్టమైన స్థానం. 1951–52లో దేశంలో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో, లోక్‌సభలోని ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ అత్యధిక స్థానాలను గెలుచుకున్నది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) మాత్రమే. కేవలం ఐదేళ్ల తర్వాత, 1957లో కేరళ ఎన్నికల్లో విజయం సాధించి, ప్రపంచంలోనే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వంగా నిలిచి వామపక్షాలు చరిత్ర సృష్టించాయి.కంచు కోటలు బెంగాల్, త్రిపుర 1977లో పశి్చమ బెంగాల్లో సీపీఎం అధికారాన్ని దక్కించుకుంది. దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ఒకే పార్టీ సుదీర్ఘకాలం పాటు పాలించిన రికార్డు సృష్టించింది. ఆ పార్టీ నేత జ్యోతి బసు ముఖ్యమంత్రిగా 23 ఏళ్లపాటు కొనసాగారు. ఆ తర్వాత 2000లో బుద్ధదేవ్ భట్టాచార్య బాధ్యతలు చేపట్టారు. మరో 11 ఏళ్ల పాటు అక్కడ వామపక్షాల పాలన సాగింది. కేరళలో అధికారం మారుతూ వచ్చినప్పటికీ, త్రిపురలో మాత్రం వామపక్షాలు సుస్థిర విజయాన్ని అందుకున్నాయి. 1993లో త్రిపురలో 60 స్థానాలకు గాను 44 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేశాయి. దశరథ్ దేబ్ 1998 వరకు, ఆపై మాణిక్ సర్కార్ వరుసగా 20 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. క్షీణత..ఆపై పతనం: వామపక్షాల క్షీణత ముందుగానే మొదలైనప్పటికీ, 2011లో అది పతనం దిశగా సాగింది. నందిగ్రామ్, సింగూర్ భూసేకరణ నిరసనలతోపాటు మార్పు నినాదంతో ముందుకు వచి్చన మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రజలను తనవైపు తిప్పుకోవడంలో విజయం సాధించింది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో 2006లో వామపక్ష కూటమికి 235 సీట్లుండేవి. టీఎంసీ దెబ్బకు వామపక్ష కూటమి బలం 62 స్థానాలకు పడిపోయింది. ఆ తర్వాత త్రిపురలో కూడా కమ్యూనిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామం. అప్పట్లో దేశవ్యాప్తంగా వచి్చన కాషాయ అనుకూల పవనాల తాకిడికి వామపక్షాల కంచుకోట త్రిపుర కూడా కూలిపోయింది. అసెంబ్లీలోని 60 స్థానాల్లో బీజేపీ 36 గెలుచుకోగా, కమ్యూనిస్టుల బలం 50 నుంచి కేవలం 16కి పడిపోయింది. ఆ ఒక్కటీ పోయింది ఆ తర్వాత కాలంలో వామపక్షాలకు ఊరటగా నిలిచింది కేరళ మాత్రమే. 2016లో పినరయి విజయన్ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన లెఫ్ట్ ఫ్రంట్, 2021లో కూడా మళ్లీ గెలిచి కేరళలో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుందనే ఆనవాయితీని తిరగరాసింది. అయితే, తాజా ఎన్నికల్లో వామపక్షాలు దక్షిణాది రాష్ట్రాన్ని కూడా కోల్పోయాయి. మొత్తం 140 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మెజారిటీ సీట్లను గెల్చుకుంది. -
కేరళం సీఎం రేసు కోసం తీవ్రమైన పోటీ..!
కేరళంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గెలుపుతో సీఎం రేసు హాట్ టాపిక్‌గా మారింది. దశాబ్ద కాలం తర్వాత కేరళంను కాంగ్రెస్ దక్కించుకోవడంతో అక్కడ కాస్త జోష్ వచ్చింది. ఓవరాల్‌గా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను చూస్తే కేరళంలో మాత్రమే కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మాత్రమే ఆధిక్యాన్ని కనబర్చింది. కేరళంలో ఉన్న 140 అసెంబ్లీ సీట్లకు గాను 102 సీట్లను యూడీఎఫ్ దక్కించుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. మరి సీఎం ఎవరు?కాంగ్రెస్ ఎక్కడైనా అధికారంలోకి వచ్చిందంటే సీఎం రేసు కోసం తీవ్రమైన పోటీ ఉంటుంది. ఇప్పుడు కేరళంలో అదే రిపీట్ అవుతుంది. ప్రస్తుతం కేరళంలో సీఎం పీఠం కోసం కాంగ్రెస్ ముఖ్యనేతల్లోనే పోరు తీవ్రంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం కేరళంలో సీఎం రేసులో ఉన్న వారిలో వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్‌తో పాటు శశిథరూర్ కూడా ఉన్నారు. మాకు చాలా మందే ఉన్నారు..ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి.ఇప్పటివరకూ ముగ్గురు మాత్రమే సీఎం రేసులో ఉన్నారనుకుంటే ఇప్పుడు శశిథరూర్ సైతం ఆ జాబితాలో చేరిపోయారు. వివాదాస్పద ఎంపీగా పేరున్న శశిథరూర్ తాజా వ్యాఖ్యలు తనను కూడా సీఎం అభ్యర్థికి అర్హుడుననే సంకేతాలిచ్చాయి. మరి ఆయనే స్వయంగా ఆ జాబితాలో చేరిపోయారా.. లేక కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతోనే ఇలా వ్యాఖ్యానించారా అనేది తర్వాత తెలుస్తుంది. ప్రస్తుతానికి నలుగురు అభ్యర్థులు సీఎం రేసులో ఉండగా, ఇంకా ఎవరైనా వచ్చి ఆ జాబితాలో చేరిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తుది నిర్ణయం హైకమాండ్‌దే అని శశిథరూర్ వ్యాఖ్యానించడం కూడా ఆసక్తికరంగా మారింది. హైకమాండ్ దగ్గర శశిథరూర్ మంచి మార్కులు ఉన్నాయా అంటే అది పూర్తిగా అవునని చెప్పలేం.సందర్భం వచ్చిన ప్రతీసారి ప్రధాని మోదీకి జై కొట్టే శశిథరూర్.. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ కోపానికి తరుచు గురవుతూ వస్తూనే ఉన్నారు. మరి అటువంటి సమయంలో శశిథరూర్‌ను అధిష్టానం పరిగణలోకి తీసుకుంటుందా అనేది వేచి చూడాలి. సతీశన్‌ది కీలక పాత్రకేరళంలో కాంగ్రెస్ విజయం సాధించడంలో వీడీ సతీశన్‌ది కీలక పాత్ర. ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నేతగా, ఎమ్మెల్యేగా ఉన్నారాయన. యువతలో విపరీతమైన ఆదరణ ఉన్న సతీశన్‌కు సీఎం పీఠం దక్కుతుందని అంచనాలు ఉన్నప్పటికీ పోటీ గట్టిగా ఉండటంతో ఏమౌతుందో చివర వరకూ చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం సీఎం పీఠంపై సతీశన్ ఆశలు పెట్టుకున్నారు. మరి ఆ ఆశలు అనుభవంలోకి వస్తాయా.. లేక అడియాశలుగా మిగిలిపోతాయనేది అధిష్టానమే నిర్ణయించాలి. రమేశ్ చెన్నితలది అనుభవం..కేరళం కాంగ్రెస్‌లో సీనియర్‌గా పేరున్న రమేశ్ చెన్నితలకు విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. అలాగే ఆర్గనైజేషన్‌లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. కేరళ స్టూడెంట్స్ యూనియన్ ప్రారంభం; తరువాత నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎదిగారు. 1982లో హరిపాడ్ నుండి మొదటిసారి గెలుపొందారు. 1989–1998లో కోట్టాయం, మావేలికర నియోజకవర్గాల నుండి ఎంపీగా గెలిచి సేవలందించారు. 1986-87లొ గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశారు. 2005 నుంచి 2014 వరకు కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. 2014 నుంచి 2016 వరకూ హోమ్ అండ్ విజిలెన్స్ మంత్రిగా పనిచేశారు. 2016 నుంచి 2021 వరకూ కేరళ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉన్నారు. కాంగ్రెస్ అధినాయకత్వంతో సన్నిహితంగా..కేరళలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్. ప్రస్తుతం ఆయన లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు మరియు 2026లో యూడీఎఫ్ ఘన విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థులలో ఒకరిగా పరిగణించబడుతున్నారు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి మంత్రిగా కూడా పనిచేశారు. మూడుసార్లు ఎంపీగా కూడా గెలిచారు. ఈయనకి రాజకీయ అనుభవం విశేషంగానే ఉంది. 2019 నుండి కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.కాంగ్రెస్ అధినాయకత్వానికి అతి దగ్గరగా ఉండే వేణుగోపాల్ అంటే హైకమాండ్‌కు బాగా నమ్మకం ఎక్కువ. దాంతో కేసీ వేణుగోపాల్ కూడా సీఎం అభ్యర్థి కోసం చివరి వరకూ రేసులో ఉండటం ఖాయం.ఈ నలుగురితోనే సరా.. ఇంకా వస్తారా?ప్రస్తుతానికి ఈ నలుగురు మాత్రమే సీఎం రేసులో ఉన్నారు. మరి ఇంకే ఎవరైనా పోటీకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చాలా రాష్ట్రాల్లో పలు బుజ్జగింపుల తర్వాతే సీఎం అభ్యర్థిని కాంగ్రెస్ ప్రకటిస్తూ రావడం చూస్తునే ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఎవరైనా తాను కూడా సీఎం అభ్యర్థినేని పోటీ కొస్తే మాత్రం అధిష్టానికి తలనొప్పులు తప్పవు. ఏది ఏమైనా కేరళంలో కాంగ్రెస్ విజయం సాధించింది కాబట్టి ఆ పార్టీ ఇప్పుడు విజయోత్సవ మూడ్‌లో ఉంది. రేపట్నుంచి సీఎం కుర్చీ కోసం రేసు మొదలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకుల మాట. -
కామ్రేడ్లకు భారీ షాక్.. చివరి కోట పతనం!
న్యూఢిల్లీ: భారత రాజకీయ ముఖచిత్రంపై ఒక సంచలన మార్పు చోటుచేసుకుంది. అర్ధ శతాబ్దం పాటు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టుల పాలన ఇప్పుడు చరిత్రలో మిగిలిపోయింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఓటమి పాలుకావడంతో, 50 ఏళ్ల తర్వాత దేశంలో ఏ ఒక్క కమ్యూనిస్టు ముఖ్యమంత్రి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇది కామ్రేడ్ల రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ఒక పరిణామం అని విశ్లేషకులు అంటున్నారు.కూలిపోయిన చివరి కంచుకోటఒకప్పుడు దేశంలో అత్యంత బలమైన రాజకీయ శక్తిగా వెలుగొందిన వామపక్షాలకు ఇంతకాలం కేరళ చివరి కంచుకోటగా మిగిలింది. 1977 నుండి 2011 వరకు పశ్చిమ బెంగాల్‌ను, 1993 నుండి 2018 వరకు త్రిపురను పాలించిన కమ్యూనిస్టులు.. అక్కడ వరసగా తృణమూల్ కాంగ్రెస్, బీజేపీల చేతిలో పరాజయం పాలయ్యారు. కేరళలో మాత్రం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారే సంప్రదాయాన్ని 2021లో తిరగరాసి అధికారాన్ని నిలబెట్టుకున్న లెఫ్ట్ ఫ్రంట్, తాజా ఎన్నికల్లో మాత్రం తన ఆఖరి కోటను కోల్పోయింది. దీంతో 1977 తర్వాత తొలిసారిగా దేశం కమ్యూనిస్ట్ పాలన లేని శకంలోకి అడుగుపెట్టింది.జాతీయ రాజకీయాల్లో చేజారిన పట్టుకేరళలో ఎదురైన ఈ ఘోర పరాజయం వామపక్షాల జాతీయ రాజకీయ ప్రాబల్యంపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఇన్నాళ్లూ కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల అండతో సీపీఎం, సీపీఐ, తదితర వామపక్ష పార్టీలు జాతీయ స్థాయిలో తమ బలానికి మించి ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఒకప్పుడు దేశ గతిని శాసించిన ఈ పార్టీలు.. ఇప్పుడు తమ ఉనికిని కాపాడుకోవాల్సిన దయనీయ స్థితికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ మూడు కీలక రాష్ట్రాల నుండి వామపక్షాలకు కేవలం ఒక్క పార్లమెంటు సభ్యుడు మాత్రమే ఉండటం వారి రాజకీయ పతనానికి అద్దం పడుతోంది.యూపీఏ కాలం నుంచి మొదలైన క్షీణతకమ్యూనిస్టుల పతనం ఒక్కరోజులో జరిగింది కాదు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో 59 స్థానాలు గెలుచుకుని యూపీఏ-1 ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన వామపక్షాలు, ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తూ వచ్చాయి. ఇండో-యూఎస్ అణు ఒప్పందం నేపథ్యంలో మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత, 2009లో వారి బలం 24 సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత 2014లో 10, 2019లో ఐదు స్థానాలకు దిగజారింది. ప్రస్తుతం సీపీఎం, సీపీఐలకు లోక్‌సభలో ఆరుగురు ఎంపీలు మాత్రమే ఉండగా, అందులో నలుగురు తమిళనాడులో డీఎంకే, ఒకరు రాజస్థాన్‌లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన వారే కావడం గమనార్హం.ఇది కూడా చదవండి: స్టాలిన్, పినరయికి షాక్... ఉత్కంఠ పోరులో దీదీ! -
స్టాలిన్, పినరయికి షాక్... ఉత్కంఠ పోరులో దీదీ!
న్యూఢిల్లీ: తాజా ఎన్నికల ఫలితాల లెక్కింపులో ఎవరూ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఉద్ధండులైన ముఖ్యమంత్రులు తమ సొంత కోటల్లోనే చతికిలబడుతున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళలో సీఎం పినరయి విజయన్ తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉండగా, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీతో ఆధిక్యం దోబూచులాడుతోంది.కొళత్తూరులో స్టాలిన్‌కు షాక్తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ సృష్టించిన సునామీలో డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి కొళత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్ 4,000కు పైగా ఓట్ల వెనుకంజలో ఉన్నారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 24,993 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతుండగా, స్టాలిన్‌కు కేవలం 20,982 ఓట్లు వచ్చాయి. ఇక అన్నాడీఎంకే అభ్యర్థి పి.సంతాన కృష్ణన్ 5,982 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా టీవీకే ఏకంగా 112 స్థానాల్లో దూసుకుపోతుండగా, అన్నాడీఎంకే కూటమి 72, డీఎంకే కేవలం 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.ధర్మదంలో తడబడుతున్న పినరయికేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సైతం తొలిసారి చేదు అనుభవం ఎదురవుతోంది. ధర్మదం నియోజకవర్గంలో ఆరో రౌండ్ కౌంటింగ్ తర్వాత ఆయన కాంగ్రెస్ అభ్యర్థి, అడ్వకేట్ వీపీ అబ్దుల్ రషీద్ చేతిలో 600 ఓట్ల తేడాతో వెనుకబడ్డారు. ఇప్పటివరకు పినరయికి 32,455 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కేవలం సీఎం మాత్రమే కాకుండా ఆయన కేబినెట్లోని పలువురు మంత్రులు కూడా వెనుకంజలో ఉండటం అధికార ఎల్డీఎఫ్ కూటమిని కుంగదీసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి వారికి గట్టి పోటీనిస్తోంది.భవానీపూర్‌లో దీదీ ఉత్కంఠ పోరుమరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొంటున్నారు. తొలి రౌండ్లలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి కన్నా వెనుకబడిన ఆమె తరువాత క్రమంగా పుంజుకున్నారు. నాలుగో రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి మమత 17,244 ఓట్లు సాధించి, బీజేపీ అభ్యర్థిపై 8,000కు పైగా ఓట్ల ఆధిక్యాన్ని సొంతం చేసుకున్నారు. క్షణక్షణానికి మారుతున్న ఈ ట్రెండ్స్ తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. -
అక్కడ అంతా కొత్త కొత్తగా..వింత వింతగా..!
ఒక ఊరిలో నడుస్తోంటే ప్రతీ ఒక్కరు రెండు సార్లు కనిపిస్తే ఎలా ఉంటుంది?! కేరళలోని మలప్పురం దగ్గర ఉండే ‘కోడిని’ అనే ప్రాంతానికి వెళ్లినప్పుడు మనకి అదే అనిపిస్తుంది. మొదటిసారి ట్రావెల్ చేసే వారికి ఇది చాలా వింతగా, ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుంది. స్పెషల్ ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ కావాలనే వారికి ఇది చాలా ఈజీగా, మనసును హత్తుకున్నట్టుగా అనిపిస్తుంది. ఒక అద్దం ముందు నిలబడినట్టుగా ప్రతీ చోట జనాలు కనిపిస్తూ ఉంటే ఎవరికరైనా చాలా కొత్తగా అనిపిస్తుంది కదా!అక్కడ అడుగు పెట్టగానే పచ్చని పొలాలు, చల్లని గాలి మనకు స్వాగతం పలుకుతాయి. ఆర్కిటెక్చర్ చాలా సింపుల్‌గా, మన ఊర్లో ఉన్నట్టే అనిపిస్తుంది. అక్కడక్కడ తిరిగే కవల పిల్లలు చూస్తుంటే ఒక్కసారిగా మనం ఎక్కడున్నాం అనే అనుభూతి కలుగుతుంది. ఆ గాలిలో నడుస్తుంటే మనం ఒక వింత స్వప్నంలో ఉన్నామన్న భావన కలుగుతుంది. ప్రతీ తోటలో, ప్రతీ ఇంటి ముందు ఒక కొత్త కళ కనిపిస్తుంది. మనుషుల చిరునవ్వులు, వారి అమాయకత్వం మనసుకు చాలా హాయిని ఇస్తాయి.సందర్శనీయ ప్రదేశాలుకవలల నగరం లేదా ట్విన్ టౌన్ అని పిలిచే ఈ ప్రాంతంలో తిరుగుతూ అక్కడి స్థానికులతో మాట్లాడటం ఒక గొప్ప అనుభవం. దగ్గరలో ఉన్న కడలుండి బర్డ్ శాంక్చువరీలో రంగురంగుల పక్షులను చూడటం లేదా నీలాంబుర్లోని తోటలను సందర్శించడం మనసుకు ప్రశాంతతను ఇస్తాయి.ఏం తినాలి?కేరళ స్థానిక రుచులు అయిన వేడి వేడి పుట్టు, కడల కర్రీ తప్పకుండా ట్రై చేయాల్సిన ఫుడ్ అని చెప్పవచ్చు. స్థానిక టీ స్టాల్స్ దగ్గర లభించే వేడి భోజనం, బనానా ఫ్రిట్టర్స్ అక్కడ కూర్చొని తినడం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.ఎప్పుడు వెళ్లాలి?సెప్టెంబర్ నుంచి మార్చి వరకు వాతావరణం చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఏప్రిల్, మే నెలల్లో కూడా వెళ్లవచ్చు. అప్పుడూ అక్కడి పచ్చదనం మనసును హాయిగా ఉంచుతుంది. కానీ చలికాలంలో వెళ్లడం ఉత్తమం. మీరు ఎప్పుడు వెళ్లినా కూడా స్థానికులు చాలా మర్యాదగా పలకరిస్తారు. మొత్తం ఫ్రెండ్లీ వాతావరణం ఉంటుంది.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి కోజికోడ్‌కు డైరెక్ట్ విమానాలు ఉంటాయి. ట్రైన్లో వెళ్తే కోజికోడ్ లేదా తిరూర్ దగ్గర దిగి సుమారు 40 కిమీ రోడ్ జర్నీ చేయాలి. బస్సులో వెళ్లాలని ప్లాన్ చేస్తే కోజికోడ్ లేదా మలప్పురంకి డైరెక్ట్ సర్వీసులు ఉంటాయి. అక్కడి నుంచి లోకల్ బస్ లేదా క్యాబ్‌తో కోడిని ఈజీగా చేరుకోవచ్చు. ఈ ప్రయాణం మనలోని క్యూరియాసిటీకి ఒక సమాధానంతోపాటు ప్రకతితో మమేకం అయ్యే ఒక అవకాశం. ప్రపంచంలోని వింతల గురించి ఆలోచించినప్పుడు కోడిని మీకు తప్పకుండా గుర్తుకు రావాలి అంటే ఒకసారి మీరు అక్కడికి వెళ్లిరావాలి మరి!.(చదవండి: కేదార్నాథ్: మంచుకొండల్లో ఓంకార నాదం) -
నేడే కౌంటింగ్.. అందరి చూపు బెంగాల్ పైనే!
దేశమంతటా తీవ్ర ఉత్కంఠ సృష్టిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల భవితవ్యం మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. మరో కీలక రాష్ట్రం తమిళనాడులో ఎవరు గెలుస్తారన్న దానిపై ఆసక్తి పెరిగిపోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) నిక్షిప్తమైన ప్రజాతీర్పు సోమవారం బహిర్గతం కానుంది. సరిగ్గా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 8.30 గంటలకు ఈవీఎంలు తెరుచుకుంటాయి. సమయం గడిచేకొద్దీ అభ్యర్థుల జాతకాలు, పార్టీల బలాబలాలు తెలిసిపోతాయి. ఐదు రాష్ట్రాల్లో ప్రజల ఆశీస్సులతో కొత్తగా అధికారంలోకి వచ్చేది ఎవరో, ప్రజాతీర్పును శిరసావహించి కుర్చీ నుంచి దిగిపోయేది ఎవరో స్పష్టమైపోతుంది. ఫలితాల సరళిపై మధ్యాహ్నంకల్లా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. అనధికార వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా కౌంటింగ్ సిబ్బందికి తొలిసారిగా ఈసీఐనెట్ ద్వారా క్యూఆర్ కోడ్ ఆధారిత ఫొటో గుర్తింపు కార్డులను అందజేసింది. అన్ని కేటగిరీల సిబ్బందికి ఈ కార్డులను తప్పనిసరి చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అత్యంత కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలో వెల్లడి కానున్న ప్రజాభిప్రాయం రాబోయే రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు గోవా, కర్ణాటక, నాగాలాండ్, గుజరాత్, మహారాష్ట్రలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, సోమవారమే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బెంగాల్లో రికార్డు స్థాయి ఓటింగ్ ఎవరికి లాభమో? పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలుండగా, ఒక స్థానంలో ఈ నెల 21న రీపోలింగ్ నిర్వహించబోతున్నారు. మిగిలిన 293 స్థానాల ఓట్ల లెక్కింపు కోసం 77 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 432 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించింది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావడానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విపరీతంగా శ్రమించింది. ఈసారి బెంగాల్లో కచ్చితంగా జెండా పాతాలన్న లక్ష్యంతో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి పోరాడింది. ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా సహా ఆ పార్టీ అగ్రనేతలు ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించగా, రికార్డుస్థాయిలో 92.47 శాతం ఓటింగ్ నమోదయ్యింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బెంగాల్ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో భారీగా ఓటింగ్ నమోదు కావడం ఇదే మొదటిసారి. దక్షిణ పరిగణాల జిల్లాలో 15 బూత్‌ల్లో శనివారం రీపోలింగ్ చేపట్టగా, 87 శాతం ఓటింగ్ నమోదయ్యింది. గెలుపు తమదేనని తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌దే మళ్లీ విజయమని అంచనా వేయగా, మరికొన్ని బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధించబోతున్నట్లు వెల్లడించాయి. బెంగాల్లో ఎన్నికలు ముగిసినప్పటికీ రాజకీయ వేడి ఇంకా తగ్గలేదు. అక్కడక్కడా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి హింసాకాండ చోటుచేసుకోకుండా 2.5 లక్షల మంది పారామిలటరీ జవాన్లను ఎన్నికల సంఘం మోహరించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలే ఇవే కావడంతో ఫలితాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కౌంటింగ్ ప్రక్రియపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తంచేశారు. ఈవీఎంలను తారుమారు చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కోల్‌కతాలో ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూమ్‌ను ముట్టడించేందుకు ప్రయతి్నంచారు. మమతా బెనర్జీ ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈవీఎంల ట్యాపరింగ్‌కు అవకాశమే లేదని వివరణ ఇచ్చింది. తమిళనాడులో విజయం విజయ్‌దేనా?తమిళనాట ఓట్ల లెక్కింపునకు సమగ్రమైన మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలుండగా, కౌంటింగ్‌కు మొత్తం 62 కేంద్రాలు సిద్ధం చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి అర్చనా పటా్నయక్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగ్గా, 85.15 శాతం ఓటింగ్ రికార్డయ్యింది. కౌంటింగ్ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాలుపంచుకుంటున్నారు. ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్ అబ్జర్వర్లను నియమించింది. రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ స్పష్టంచేయగా, విజయ్ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్ మై ఇండియా’ ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. అస్సాంలో 258 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈశాన్య రాష్ట్రం అస్సాంలో విజయం పట్ల అధికార బీజేపీ ధీమాగా ఉంది. ఎగ్జిట్‌పోల్స్ సైతం ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలియజేశాయి. 126 అసెంబ్లీ స్థానాలున్న అస్సాంలో ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించగా, 85.96 శాతం ఓటింగ్ నమోదయ్యింది. 35 జిల్లాల్లో మొత్తం 40 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా పూర్తయ్యేలా అన్ని ఏర్పాట్లూ చేసినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 25 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను రంగంలోకి దించారు. ఈసారి ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులతోపాటు 258 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగడం గమనార్హం. అధికార ఎన్డీయేలో బీజేపీతోపాటు అస్సాం గణ పరిషత్, బోడో పీపుల్స్ ఫ్రంట్ ఉన్నాయి. కాంగ్రెస్ కూటమిలో రాయ్జోర్ దళ్, ఏజేపీ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఏపీహెచ్ఎల్సీ తదితర పార్టీలు ఉన్నాయి. కేరళలో వామపక్షాలకు చేదు అనుభవమే! కమ్యూనిస్టులకు గట్టి పట్టున్న కేరళ అసెంబ్లీలో మొత్తం 140 స్థానాలు ఉండగా, ఏప్రిల్ 9న జరిగిన పోలింగ్‌లో 79.63 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈసారి వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే హోరాహోరీగా తలపడ్డాయి. అధికార ఎల్డీఎఫ్పై యూడీఎఫ్ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. కేరళలో తమ బలం పెరిగిందని, రెండంకెల్లో సీట్లు గెల్చుకోవడం ఖాయమని ఎన్డీయే విశ్వాసం వ్యక్తంచేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 43 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 వేల మందికిపైగా భద్రతా సిబ్బంది, ఎన్నికల అధికారులు కౌంటింగ్ విధుల్లో భాగస్వాములవుతున్నారు. ఒక బూత్‌లో నమోదైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఉన్న ఓట్ల సంఖ్యకు మధ్య వ్యత్యాసాలు ఉన్న సందర్భాల్లో వీవీప్యాట్ స్లిప్‌లను కూడా లెక్కిస్తామని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. పుదుచ్చేరిలో మళ్లీ ఎన్డీయే! కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 అసెంబ్లీ స్థానాలుండగా ఆరు కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆలిండియా ఎన్.ఆర్.కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ), బీజేపీ, అన్నాడీఎంకే, ఎల్జేకే పార్టీలతో కూడిన అధికార ఎన్డీయే మరోసారి విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. విపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్, డీఎంకే, వీసీకే పార్టీలున్నాయి. – సాక్షి, నేషనల్æడెస్క్2 -
ఆలయంలో ఏనుగు బీభత్సం, ఒకరి మృతి
కేరళలోనిఒక దేవాలయంలో ఏనుగు ఉన్నట్టుండి హింసాత్మకంగా మారిపోయింది.అంగమాలిలో ఉన్న కిడంగూర్ మహావిష్ణు ఆలయంలోకి తీసుకొచ్చిన ఏనుగు అకస్మాత్తుగా దాడిచేయడంతో విషాద సంఘటన చోటుచేసుకుంది. దాదాపు రెండు గంటల పాటు ఏనుగు ఆగ్రహం కొనసాగడంతో స్థానికులు, భక్తులు భయాందోళనకు లోనయ్యారు. శుక్రవారం (మే 1) ఉదయం సుమారు 9:45 గంటల సమయంలో, 'మయ్యానాడ్ పార్థసారథి' అనే ఏనుగు బీభత్సం సృష్టించింది. ఒక వ్యక్తిపై దాడిచేసి, వాహనాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఒక వ్యక్తి మరణించగా, మావటి ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడిని కొల్లాంకు చెందిన లారీ డ్రైవర్ విష్ణు (40)గా గుర్తించారు. కొల్లంనుంచి లారీలో ఈ గజరాజును ఈయనే తరలించినట్టు సమాచారం.https://t.co/U4Fc8bGCAp https://t.co/PSIgJrW4fP— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) May 2, 2026పోలీసుల కథనం ప్రకారం, భక్తులు,స్థానికులలో భయాందోళనలు వ్యాపించడంతో, ఆ ఏనుగు ప్రజలపై దాడి చేసి, ఆలయ ప్రాంగణం సమీపంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలను ధ్వంసం చేసింది. కార్లను పల్టీ కొట్టించింది. ద్విచక్ర వాహనాలను నుజ్జునుజ్జు చేసింది, అలాగే ఆలయ ప్రాకార కుడ్యాన్ని ధ్వంసం చేసింది. దాదాపు రెండు గంటల తర్వాత, అటవీ అధికారులు పోలీసులు మత్తు మందు (tranquilizers) ఉపయోగించి దానిని అదుపులోకి తీసుకువచ్చారు.ఆలయ కార్యక్రమానికి ముందు స్నానం చేయిస్తున్నప్పుడు కర్రతో కొట్టడం వల్లే ఏనుగు దూకుడుగా ప్రవర్తించిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.ఇదీ చదవండి : Yoga సైనస్‌తో బాధపడుతున్నారా? కపాలభాతితో చెక్ -
బెంగాల్ కిరీటం బీజేపీదే!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో రాజకీయ మార్పు నకు ప్రజలు పట్టం కట్టబోతున్నారని ‘టుడేస్ చాణక్య’ఎగ్జిట్‌పోల్ స్పష్టంచేసింది. బెంగాల్ అధికార కిరీటం ఈసారి బీజేపీకి దక్కడం ఖాయమని అంచనా వేసింది. రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 294 ఉండగా మెజార్టీ మార్కు 147 స్థానాలు. బీజేపీ 192కిపైగా స్థానాలు గెల్చుకొని స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నట్లు స్పష్టంచేసింది. చాణక్య ఎగ్జిట్‌పోల్ ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ దాదాపు 100 సీట్లు గెల్చుకొనేందుకు ఆస్కారం ఉన్నట్లు తేలింది. ఇతరులు కేవలం 2 స్థానాలకే పరిమితం అవుతారని చాణక్య తెలియజేసింది. ఈ ఫలితాలు వాస్తవ రూపం దాలిస్తే పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అది అతిపెద్ద మార్పు అవుతుందని రాజకీయ పండితులు చెబుతున్నారు. 15 ఏళ్లుగా నిరాటంకంగా సాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ ఆధిపత్యానికి తెరపడినట్లేనని అంటున్నారు. బీజేపీకి అనుకూలంగా ప్రజల మద్దతు బలంగా ఏకీకృతం అవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది ఓటర్ల ప్రాధాన్యతలో నిర్ణయాత్మక మార్పును తెలియజేస్తోంది. బెంగాల్లో ఇప్పటికే మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ బీజేపీ విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. మరికొన్ని ఎగ్జిట్‌పోల్స్ తృణమూల్ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపించాయి. మమతా బెనర్జీ పార్టీ వరుసగా నాలుగోసారి అధికారంలోకి రాబోతున్నట్లు వివరించాయి. మొత్తానికి ఈ ఎన్నికల్లో రెండు కీలకమైన పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం సాగుతుందని పేర్కొన్నాయి. 2021 ఎన్నికల్లోనూ ఇలాంటి పరిణామాన్నే అంచనా వేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్‌కు విజయం దక్కింది. ఆ పార్టీ 215 సీట్లు గెల్చుకుంది. బీజేపీ 77 స్థానాలు మాత్రమే దక్కించుకొని ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. తమిళనాట రెండో స్థానంలో విజయ్ పార్టీ తమిళనాడులో దళపతి విజయ్ నిర్ణయాత్మక శక్తిగా అవతరించబోతున్నట్టు టుడేస్ చాణక్య స్పష్టంచేసింది. విజయ్ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) ఈ ఎన్నికల్లో 30 శాతం ఓట్లతో దాదాపు 63 సీట్లు సాధించబోతున్నట్లు తెలియజేసింది. అధికార డీఎంకేకు 125 స్థానాలు, విపక్ష అన్నాడీఎంకేకు కేవలం 45 స్థానాలు దక్కే వీలున్నట్లు వివరించింది. విజయ్ పార్టీ రెండో స్థానంలో నిలవబోతున్నట్లు తెలిపింది. సామాజికవర్గాల పరంగా చూస్తే బీసీల్లో 29 శాతం మంది, అత్యంత వెనుకబడిన వర్గాల్లో 27 శాతం మంది, ఎస్సీలు, క్రైస్తవుల్లో 34 శాతం మంది విజయ్ పార్టీకి ఓటు వేసినట్లు తెలుస్తోంది. ముస్లింలు మాత్రం అధికార డీఎంకేకు మద్దతు పలికినట్లు స్పష్టమవుతోంది. యువతలో టీవీకేకు అమితాదరణ కనిపించింది. 30 ఏళ్లలోపు ఓటర్లు, ప్రధానంగా తొలిసారి ఓటు వేసినవారు, విద్యార్థులు నిరుద్యోగులు దళపతి పార్టీకి జైకొట్టారు. మరోవైపు మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ మళ్లీ డీఎంకే గెలుపు ఖాయమని తెలియజేశాయి. ‘యాక్సిస్ మై ఇండియా’మాత్రమే విజయ్ పార్టీ జయకేతనం ఎగురవేయబోతున్నట్లు తేల్చిచెప్పింది. కేరళలో యూడీఎఫ్‌కు విజయావకాశాలు కేరళలో అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ మధ్యగట్టి పోటీ నెలకొన్నట్లు టుడేస్ చాణక్య ప్రకటించింది. అయితే, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు విజయావకాశాలు ఉన్నట్లు తెలిపింది. 140 సీట్లకు గాను యూడీఎఫ్‌కు దాదాపు 69 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. అస్సాంలో బీజేపీ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుందని వెల్లడించింది. 126 సీట్లకు గాను బీజేపీ 50 శాతం ఓట్లతో ఏకంగా 102 సీట్లు గెల్చుకుంటుందని పేర్కొంది. బెంగాల్ ఎగ్జిట్‌పోల్స్ ప్రకటించని ‘యాక్సిస్ మై ఇండియా’ పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్‌ను ‘యాక్సిస్ మై ఇండియా’ప్రకటించలేదు. బుధవారం ఇతర రాష్ట్రాల ఫలితాలను ప్రకటించినప్పటికీ బెంగాల్ విషయం ప్రస్తావించలేదు. గురువారం ప్రకటిస్తారని భావించగా.. అది సాధ్యం కాలేదు. బెంగాల్లో భయానక వాతావరణం నెలకొందని, ఇతరులతో మాట్లాడేందుకు ప్రజలు ఇష్టపడడం లేదని, శాంపిల్ సేకరించే పరిస్థితి కూడా లేదని ‘యాక్సిస్ మై ఇండియా’అధినేత ప్రదీప్ గుప్తా చెప్పారు. అసంపూర్ణమైన సమాచారంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ప్రకటించలేమని నిస్సహాయత వ్యక్తంచేశారు. -
కప్పు టీ.. కోటిన్నర విరాళం: ఆశ్రమం కోసం అద్భుతం
ఒక్క కప్పు టీ తాగితే ఎంత అవుతుంది? పది రూపాయలు.. మహా అయితే వంద రూపాయలు! కానీ అదే టీ కప్పు కోటిన్నర రూపాయల నిధిని సమకూర్చింది. కేరళలోని కోజికోడ్ జిల్లా ఎడచేరిలో జరిగిన ఈ అద్భుతం.. మనుషుల్లో ఇంకా మమకారం మిగిలేవుందని, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటారని మరోసారి నిరూపించింది. అప్పుల్లో కూరుకుపోయిన ఒక ఆశ్రమాన్ని కాపాడుకునేందుకు ఊరంతా ఏకమై చేసిన ఈ ‘ఛాయ్ ఛాలెంజ్’ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.అంచనాలను తలకిందులు చేసిన జనప్రవాహంఅనాథలు, వృద్ధుల సంరక్షణ కోసం నెలకు రూ.25 లక్షలు ఖర్చు చేసే ‘తణల్’ ఆశ్రమం ఆర్థిక ఇబ్బందుల్లో పడటంతో, నిర్వాహకులు ‘ఛాయ్ తణల్’ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కేవలం 5,000 మంది వస్తారని భావిస్తే, ఏకంగా 18,000 మంది తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎడచేరి వీధులన్నీ జనసంద్రమయ్యాయి. భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడినా సరే.. ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కిలోమీటర్ల మేర క్యూ కట్టి మరీ ప్రజలు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఒక్కరోజే నగదు రూపంలో రూ. 57.42 లక్షలు రాగా, హామీలతో కలిపి మొత్తం రూ. 1.41 కోట్లు సమకూరడం విశేషం.ఒంటిపై నగలను కూడా విరాళంగా ఇచ్చి..ఈ సేవా యజ్ఞంలో కేవలం డబ్బు మాత్రమే కాదు, మనసున్న మనుషులు తమ సర్వస్వాన్ని అందించారు. కొందరు మహిళలు తమ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను తీసి నిర్వాహకుల చేతిలో పెట్టి కన్నీళ్లు పెట్టించారు. వచ్చిన వారందరికీ టీతో పాటు సుమారు 13,000 అరటికాయ బజ్జీలు (పళమ్ పోరి) వడ్డించారు. బజ్జీలు అయిపోతే సమోసాలు, అవి కూడా అయిపోతే బిస్కెట్లు అందించారు. ఇలా ఏదీ అందకపోయినా, ఆశ్రమానికి సాయం చేయాలన్న తపనతో జనం క్యూలోనే నిలబడ్డారు.సంగీత హోరులో సాగిన సేవప్రముఖ గాయకులు ప్రేమ్‌కుమార్ వడకర, సల్వాన్ వడకర తమ పాటలతో అక్కడ పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. గానలహరి మధ్య ప్రజలు ఉత్సాహంగా విరాళాలు అందజేశారు. వార్షికంగా రూ.నాలుగు కోట్ల ఖర్చులతో ఇబ్బంది పడుతున్న ‘తణల్’ ఆశ్రమానికి, ఈ ఒక్కరోజు స్పందన కొండంత అండగా నిలిచింది. ఒక టీ కప్పు సాక్షిగా కోజికోడ్ ప్రజలు రాసిన ఈ మమతానురాగాల కథ దేశవ్యాప్తంగా అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఇది కూడా చదవండి: ‘పాక్‌లో జమ్మూ?’.. నాలిక్కరుచుకుని నేపాల్ క్షమాపణలు! -
ఊహించని విధంగా 5 రాష్ట్రాల.. ఎగ్జిట్ పోల్స్
-
ఎగ్జిట్ పల్స్.. అంచనాలు తారుమారు
-
పినరయ్‌కి షాక్ తప్పదా? కేరళలో యూడీఎఫ్‌కే పట్టం!
సాక్షి, తిరువనంతపురం: కేరళలో అధికార మార్పు సంప్రదాయానికే మళ్లీ రాష్ట్ర ప్రజలు ఓటేశారని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలింది. కేరళలో వరుసగా 2016, 2021లో అధికారంలోకి వచ్చిన వామపక్షాల ఎల్డీఎఫ్ కూటమికి ఈ సారి భంగపాటు తప్పదని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమికి పీఠం ఖాయమని సర్వేలో వెల్లడైంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో మెజార్టీకి 71 సీట్లలో గెలవాలి. కేరళ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ 75-85, ఎల్డీఎఫ్ 55-65, ఎన్డీఏ 0-3 స్థానాల్లో గెలిచే అవకాశాలున్నాయని సర్వేలో తేలింది. యూడీఎఫ్ కూటమి ఎల్డీఎఫ్ కంటే 2 శాతం ఆధిక్యత కనబరుస్తుందని సర్వేలో వెల్లడైంది. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం పనితీరుపై సర్వేలో 55.1 శాతం సంతృప్తి వ్యక్తం చేసినా ఎల్డీఎఫ్కు మళ్లీ అధికారం కట్టబెట్టక పోవడం ఇక్కడ విశేషం. ఎల్డీఎఫ్కు మరోసారి అవకాశం ఇవ్వమని 42 శాతం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పినయర్ విజయన్‌కు 22.3 శాతం మద్దతివ్వగా, కాంగ్రెస్ నేత సతీషన్‌కు 14.5 శాతం మద్దతిచ్చారు. ఎన్నికల్లో పార్టీకి ప్రాధన్యతిచ్చామని 51.8 శాతం చెప్పగా, 33.1 శాతం మంది అభ్యర్థులను బట్టి ఓటు వేశామని చెప్పారు.కేరళలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభావం నామమాత్రంగానే కనిపించింది. రాష్ట్రంలో ఎన్డీఏ మూడో ప్రత్యామ్నాయంగా ఎదగలేదని సర్వేలో వెల్లడైంది. 59.4 శాతం మంది రాష్ట్రంలో మూడు ఫ్రంట్ అవసరం లేదని సర్వేలో చెప్పారు.కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై 50.9 శాతం అసంతృప్తి వ్యక్తం చేశారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రచారంపై కేరళలో ఆసక్తి కనిపించలేదు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ముఖాముఖి పోటీ జరిగిన కేరళలో పదేళ్ల వామపక్ష ప్రభుత్వానికి ప్రజలు బ్రేకులు వేసినట్టు పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది.యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ : యూడీఎఫ్(కాంగ్రెస్ కూటమి) 78 నుంచి 90 స్థానాలుపినరయ్ విజయ్ కూటమి,ఎల్డీఎఫ్కి 49 నుంచి 62 స్థానాలుబీజేపీ ఒకటి నుంచి 3 స్థానాల్లో విజయం సాధించే అవకాశంఆత్మసాక్షి.ఎగ్జిట్‌పోల్స్ UDF 76-81LDF 61-66BJP 3- 4ఇతరులు 1 -
మళయాళీ బంగారం మహా కాస్ట్లీగురూ!
-
విశ్వాసానికి మరణం లేదు: కన్నీరు పెట్టిస్తున్న శునకం!
మలప్పురం: మనిషికి, మూగజీవికి మధ్య ఉండే బంధం కేవలం అన్నం పెట్టే దగ్గరే ఆగిపోలేదు.. అది రెండు ఆత్మల అనుసంధానమని కేరళలోని మలప్పురం సాక్షిగా మరోసారి రుజువైంది. ఎడవన్న ప్రాంతానికి చెందిన అమీనా అనే వృద్ధురాలు, తన ఇంటి ముందుకు వచ్చే ఒక వీధి కుక్కకు రోజూ ప్రేమతో అన్నం పెట్టేది. ఈ నేపధ్యంలో ఆ మూగజీవికి ఆమె ప్రాణప్రదమైన స్నేహితురాలిగా మారిపోయింది. అమీనా చూపిన ఆదరణను ఆ మూగ జీవి గుండెల్లో పదిలంగా దాచుకుంది.ఒక రోజు అమీనా తన ఇంటి బయట అనారోగ్యంతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయినప్పుడు ఆ మూగజీవి విలవిల్లాడిపోయింది. తన ప్రాణదాత ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే తట్టుకోలేక, ఆ వీధి కుక్క ఆపకుండా అరుస్తూ, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించింది. దాని అరుపులు విని, స్థానికులు స్పందించే లోపే, అమీనా ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. అయితే ఆ మూగ జీవి తనను ఆదుకున్న యజమాని ఇక లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది.అమీనా అంతిమ యాత్ర మొదలైనప్పుడు, ఆ కుక్క కూడా అందరితో కలిసి మౌనంగా అడుగులు వేసింది. మసీదు శ్మశానవాటిక వరకు ఆ భౌతికకాయాన్ని అనుసరిస్తూ వెళ్లి, అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండిపోయింది. స్థానికులు చెబుతున్న ప్రకారం.. ఆమె మరణానికి కొన్ని రోజుల ముందు నుంచే ఆ కుక్క శ్మశానవాటిక పరిసరాల్లో తచ్చాడుతూ కనిపించింది. బహుశా ఆ మూగజీవికి అమీనా దూరం కాబోతోందనే ముందస్తు సంకేతం అందిందేమోనని పలువురు కంటతడి పెట్టుకున్నారు.అంత్యక్రియలు ముగిసి రోజులు గడుస్తున్నా, ఆ శునకం తన యజమానిని మరువలేకపోతోంది. అమీనా కుటుంబ సభ్యులు ఎప్పుడు సమాధిని సందర్శించడానికి వచ్చినా, ఆ కుక్క అక్కడే ప్రత్యక్షమవుతోంది. ఎటువంటి అలికిడి చేయకుండా, ఆమె సమాధి పక్కనే గంటల తరబడి నిశ్శబ్దంగా కూర్చుని నిరీక్షిస్తోంది. తన ఆకలి తీర్చిన మనిషి తిరిగి రాదని తెలిసినా, ఆ సమాధి వద్ద అది చూపుతున్న స్వచ్ఛమైన ప్రేమ.. అందరికీ ఒక గొప్ప పాఠంలా నిలుస్తోంది.ఇది కూడా చదవండి: ఈసీకి మహువా మోయిత్రా షాక్: బైక్ వద్దన్నారని.. -
పడకపై కాటు - షాకింగ్ ఘటన! వేసవిలో సర్పాల ముప్పు
-
కేరళలో యాక్షన్
హీరోయిన్ రష్మికా మందన్న యాక్షన్ బాట పట్టారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె రచన, దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఈశ్వరీ రావు, గురు సోమసుందరం, రావు రమేశ్ ఇతర పాత్రలుపోషిస్తున్నారు. అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ తాజా షెడ్యూల్ కేరళలో ప్రారంభం అయింది. ‘‘యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న చిత్రం ‘మైసా’. ఈ మూవీలో రష్మిక గోండు గిరిజన అమ్మాయిగా కనిపించనున్నారు.పాన్ ఇండియాగా రూపొందుతోన్న ఈ మూవీలో తన కెరీర్లో అత్యంత సవాల్‌తో కూడిన పాత్ర చేస్తున్నారు రష్మిక. 15 రోజుల పాటు జరగనున్న యాక్షన్ ప్యాక్డ్ షూటింగ్ షెడ్యూల్‌ను కేరళలో ప్రారంభించాం. కేచా ఖంపక్దీ మాస్టర్ హై ఓల్టేజ్ యాక్షన్ కొరియోగ్రఫీని అందిస్తున్నారు. రష్మికతో పాటు కీలక నటీనటులు పాల్గొంటున్న ఈ యాక్షన్ షెడ్యూల్ సినిమాలో మేజర్ హైలెట్‌గా నిలిచేలా ఉంటుంది. అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ యాక్షన్ సన్నివేశాలను పర్యవేక్షిస్తున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: జేక్స్ బిజోయ్, కెమెరా: శ్రేయాస్ పి. కృష్ణ. -
ఆడుకుంటూ ఆడుకుంటూ ఘోర ప్రమాదం.. బుడ్డోడిని కాపాడిన పోలీసులు
-
‘ముండతికోడ్’ గుణపాఠం.. ఇక రోబోలకు బాణసంచా!
తిరువనంతపురం: కేరళలోని త్రిస్సూర్ జిల్లా ముండతికోడ్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ఘోర ప్రమాదం 15 నిండు ప్రాణాలను బలిగొనడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటన తర్వాత భవిష్యత్తులో ఇలాంటి మారణహోమాలు పునరావృతం కాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం, నిపుణులు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), రోబోటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించి ఫ్యాక్టరీలను సురక్షితంగా మార్చేందుకు, ప్రమాదాలను ప్రాథమిక దశలోనే నివారించేందుకు కసరత్తు మొదలైంది.శబ్దాల కంటే దృశ్యాలకే ప్రాధాన్యంప్రమాదాల తీవ్రతను తగ్గించేందుకు బాణసంచా ప్రదర్శనల విధానంలో భారీ మార్పులు రావాలని కేరళ దేవస్వం మంత్రి వీ.ఎన్. వాసవన్ పేర్కొన్నారు. కేవలం భారీ శబ్దాలతో దద్దరిల్లేలా కాకుండా, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ క్రీడలలో మాదిరిగా కనువిందు చేసే సురక్షితమైన రంగుల ప్రదర్శనలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ దిశగా ఇప్పటికే అధికారులతో చర్చలు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, ప్రాణనష్టం లేని ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.మనుషులకు బదులు రోబోలుప్రమాదకరమైన బాణసంచా తయారీ, పేల్చే విధానంలో మనుషుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గించాలని ‘బెటర్ కొచ్చి రెస్పాన్స్ గ్రూప్’ (BKRG) ప్రతిపాదించింది. చేతులతో నిప్పు పెట్టే విధానానికి బదులుగా ఎలక్ట్రానిక్ టైమింగ్ సిస్టమ్స్ వినియోగించాలని కోరుతోంది. చైనాలోని హునాన్ ప్రావిన్స్ తరహాలో, తయారీ కేంద్రాల్లో ప్రమాదకరమైన పనులను రోబోలు, ఆటోమేటెడ్ వ్యవస్థల ద్వారా చేయిస్తే ప్రాణాపాయాన్ని దాదాపుగా నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల మానవ తప్పిదాలు జరగకుండా కచ్చితత్వంతో కూడిన ఉత్పత్తి సాధ్యమవుతుంది.ఏఐ సాంకేతికతతో ముందస్తు హెచ్చరికలుఫైర్క్రాకర్ యూనిట్లలో భద్రతను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలకంగా మారనుంది. థర్మల్ సెన్సార్లు, కెమెరాల సాయంతో ఉష్ణోగ్రత, పొగ, తేమ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించే ఏఐ వ్యవస్థలు.. మంటలు చెలరేగే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తాయి. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే, ఏఐ సాధనాలు క్షణాల్లో ప్రతిస్పందించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే మార్గాలను సూచిస్తాయి. మెషిన్ లెర్నింగ్ సాయంతో ప్రాణనష్టాన్ని కనీస స్థాయికి తగ్గించేలా ఈ అత్యాధునిక వ్యవస్థలు పనిచేస్తాయి.ఇది కూడా చదవండి: రగిలిపోతున్న బెంగాల్ ఓటర్లు.. ఈ సారీ తగ్గేదేలే? -
ఎంత పనిచేశాడు.. అందరికీ చెమటలు పట్టించాడుగా!
కేరళంలో ఒక బుడ్డోడు చేసిన పని తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరుగెట్టించింది. అటు పోలీసులకు కూడా ముచ్చెమటలు పట్టించింది. చివరికి కథ సుఖాంతం కావడంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అలా ఎలా చేశావురా బుడ్డోడా అంటూ అందరూ నవ్వులు పువ్వులయ్యారు. ఇంతకీ అసలేమైంది అంటే..ఇంట్లో ఆడుకుంటూ, ఆడుకుంటూ ఒక బాలుడు అల్యూమినియం వంట పాత్రలో ఇరుక్కుపోయాడు. ఇక ఆ పాత్రలోంచి బయటికి రాలేక నానా కష్టాలు పడ్డాడు. తల్లిదండ్రుల ప్రయత్నాలు కూడా విఫలం కావడంతో పోలీసులను ఆశ్రయించారు. ఎట్టకేలకు అగ్నిమాపక మరియు రెస్క్యూ సర్వీసెస్ బృందం ఆ బాలుడిని విజయవంతంగా రక్షించింది. చాలా అప్రమత్తంగా, కట్టర్ ద్వారా ఆ పాత్రను కట్ చేసి బాలుడికి విముక్తి ప్రసాదించారు. ఈ తతంగం జరుగుతున్నంత సేపు ఆ బాలుడు ఏడ్చి గోల చేయకుండా, ప్రశాంతంగా పోలీసులకు సహకరించడం విశేషం. దీంతో నెటిజన్లు జాగ్రత్తలను గుర్తు చేస్తూనే ఫన్నీగా స్పందించారు. ఇట్లాంటి అల్లరి పిడుగులు చాలామంది ఉన్నారు. వీరి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ కమెంట్స్ చేశారు. తల్లిదండ్రులారా, దయచేసి ఇంట్లోని వస్తువుల విషయంలో మీ పిల్లల పట్ల మరింత జాగ్రత్తగా ఉండండి. వారిపై ఒక కన్నేసి ఉంచండి! అంటూ ఈ వీడియోను పోస్ట్ చేయడంతో ఇది నెట్టింట వైరల్‌గా మారింది. A child in Kerala got stuck inside an aluminium cooking pot while playing at home. Fire and Rescue Services team successfully rescued the kid.Parents, please be extra careful and keep an eye on your children around household items!#Kerala #ChildSafety pic.twitter.com/DMG3ydxdJd— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) April 23, 2026 -
తల్లి కాబోతున్న మోనాలిసా.. పోలీసులకు భర్త ట్విస్ట్ !
కుంభమేళాలో పూసలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ సోషల్‌మీడియాలో గుర్తింపు పొందిన ‘మోనాలిసా భోంస్లే’ తల్లి కాబోతున్నట్లు ఆమె భర్త ఫర్మాన్ తెలిపాడని కథనాలు వస్తున్నాయి. తల్లిదండ్రులను కాదని కేరళకు చెందిన ఫర్మాన్ అనే యువకుడిని ప్రేమించి మార్చి 11న ఒక ఆలయంలో వివాహం చేసుకుంది. అయితే, పోలీసు దర్యాప్తులో మోనాలిసా మైనర్ అని తేలడంతో ఆమె భర్తపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా మోనాలిసాను విచారణకు హాజరు కావాలని తెలిపారు.మోనాలిసా పుట్టిన ఆసుపత్రి రికార్డుల ప్రకారం పెళ్లి జరిగిన నాటికి ఆమె వయసు 16 ఏళ్ల 2 నెలల 12 రోజులేనని అధికారికంగా తేలింది. దీంతో మోనాలిసా భర్తపై పోక్సో కేసు నమోదు చేయడంతో చిక్కుల్లో పడ్డాడు. ఈ అంశంపైన ఆమెను విచారించాలని పోలీసులు ప్రయత్నం చేశారు. అయితే, తన భార్య మోనాలిసా ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో ఈ విచారణ కోసం ప్రయాణం చేయలేదని మధ్యప్రదేశ్ పోలీసులతో ఫర్మాన్ ఖాన్ తెలియజేశారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మోనాలిసా కేరళలో ఉంది.మోనాలిసా తల్లి కాబోతుందని ఫర్మాన్ పోలీసులు వద్ద తెలిపారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఆమె నిజంగానే తల్లి కాబోతుందా..? లేదా కేసు నుంచి తప్పించుకునేందుకు ఫర్మాన్ ఏమైనా ప్లాన్ చేశాడా అనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. -
అసలేంటి ‘ఆపరేషన్ నుంఖోర్'?.. సినీ ప్రముఖులకు లింకేంటి?
మున్నార్: 'ఆపరేషన్ నుంఖోర్' దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. భూటాన్ నుంచి అక్రమంగా వాహనాలను దిగుమతి చేసుకుంటున్నారనే ఆరోపణలపై విచారణలో భాగంగా భూటాన్ కస్టమ్స్ ప్రతినిధుల బృందం కేరళకు చేరుకుంది. భూటాన్ కస్టమ్స్ కమిషనర్ నేతృత్వంలోని 10 మంది బృందం.. మున్నార్‌లో భారత కస్టమ్స్ అధికారులతో సమావేశమైంది. సరిహద్దు కార్ల అక్రమ రవాణాపై భూటాన్ కస్టమ్స్ బృందం దృష్టి పెట్టింది.కాగా, భారీ వాహనాల స్మగ్లింగ్ ముఠాను ‘ఆపరేషన్ నుంఖోర్’ గుట్టురట్టు చేసిన సంగతి తెలిసిందే. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో భారీ పన్ను ఎగవేత రాకెట్ ఇటీవల బయటపడింది. దీని ద్వారా సుమారు 15,849 లగ్జరీ కార్లను ఎటువంటి కస్టమ్ డ్యూటీ (పన్నులు) చెల్లించకుండా భూటాన్ నుండి భారత్‌లోకి అక్రమంగా తరలించినట్లు తేలింది. భూటానీ భాషలో 'నుంఖోర్' అంటే 'వాహనం' అని అర్థం.ఈ స్మగ్లింగ్ వ్యవహారం కేరళ సినీ పరిశ్రమకు కూడా పాకింది, ముఖ్యంగా పలువురు ప్రముఖ నటుల పేర్లు ఇందులో వినిపిస్తున్నాయి. కేరళలో 35-40 లగ్జరీ కార్లపై జరిగిన ప్రాథమిక విచారణతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నేషనల్ వెహికల్ రిజిస్ట్రీని డిజిటల్ ఆడిట్ చేయగా.. నకిలీ పత్రాలు, సర్టిఫికేట్లు సృష్టించినట్లు తేలింది. ఈ వాహనాలను రాయబార కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలకు చెందినవంటూ నమ్మించేలా హై-క్వాలిటీ నకిలీ డాక్యుమెంట్లను తయారు చేశారు.భూటాన్‌తో సరిహద్దులు ఈశాన్య రాష్ట్రాల గుండా లగ్జరీ కార్లను భారత్‌లోకి తెచ్చారు. భారీ కస్టమ్ డ్యూటీని తప్పించుకోవడానికి వీటిని హిమాచల్ ప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ చేయించారు. కేవలం అస్సాంలోనే ఇలాంటి 464 వాహనాలు రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. కేరళలో ఇప్పటివరకు 50కి పైగా వాహనాలను అధికారులు సీజ్ చేశారు. ఈ రాకెట్ వల్ల ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. ఈ కేసులో పలువురు సినీ ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చాయి. నిబంధనలను తుంగలో తొక్కి.. తప్పుడు మార్గాల్లో వీరు లగ్జరీ కార్లను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఆ నటీనటులు ఎవరనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.భారత్-భూటాన్ సరిహద్దు నిర్వహణ సదస్సు 20వ తేదీన (సోమవారం) మున్నార్‌లో ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో 'ఆపరేషన్ నమ్‌ఖోర్'పై కీలక విషయాలు వెల్లడించే అవకాశముంది. CBIC స్పెషల్ సెక్రటరీ యోగేంద్ర గార్గ్, భూటాన్ ప్రతినిధి సోనమ్ జామ్త్సో అధ్యక్షత వహించారు. స్మగ్లింగ్‌ను అరికట్టడానికి కఠినమైన భద్రతా చర్యలు, సరిహద్దు తనిఖీలను బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం 'ఆపరేషన్ నుంఖోర్' దేశవ్యాప్తంగా విస్తరించింది. కస్టమ్స్ మరియు DRI (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు నిరంతరం సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ విచారణలో మరికొందరి ప్రముఖుల పేర్లు బయటపడే అవకాశం ఉంది.ఇటీవల కస్టమ్స్ అధికారులు 'ఆపరేషన్ నుంఖోర్' పేరుతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పన్ను ఎగవేసి, నకిలీ పత్రాలతో దేశంలోకి దిగుమతి అవుతున్న విదేశీ వాహనాలను టార్గెట్‌గా చేసుకుని కేరళలోని 35 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ ఆఫరేషన్లో మొత్తం 38 విలాసవంతమైన కార్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో మలయాళ నటులు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్, అమిత్ చకలక్కల్ చెందిన వాహనాలు కూడా ఉండటం గమనార్హం. -
బాణసంచా యూనిట్లో పేలుడు 13 మంది మృతి
త్రిస్సూర్: కేరళలోని త్రిస్సూర్ జిల్లాలోని ఓ బాణసంచా తయారీ యూనిట్లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ముండత్తికోడ్‌లో మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల వేళ చోటుచేసుకున్న పేలుడు ఘటనలో కనీసం 13 మంది ప్రాణాలు కోల్పోయారు. పేలుడు తీవ్రతకు వీరి శరీరాలు ఛిద్రమయ్యాయని సమాచారం. పేలుడు శబ్దాలు కిలోమీటర్ల మేర వినిపించాయి. ఘటనలో ముగ్గురు మహిళలు సహా మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 70 శాతం కాలిన గాయాలతో త్రిస్సూర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.ఈ నెల 26వ తేదీన త్రిస్సూర్ పూరమ్ పండుగ కోసం స్థానిక ఆలయం యాజమాన్యంలో పొలాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్లలో బాణసంచా తయారీ చేపట్టారు. పేలుళ్లు ప్రారంభమైన సమయంలో అక్కడ కనీసం 40 మంది ఉన్నట్లు సమాచారం. ఎక్కువ మంది స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు చెబుతున్నారు.అందరూ సమీప ముండత్తికోడ్, కుందన్నూర్ ప్రాంతాలకు చెందిన వారేనని, వలస కార్మికులెవరూ లేరని అధికారులు అంటున్నారు. ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. -
కేరళంలో భారీ పేలుడు, పలువురు మృతి
కేరళంలోని త్రిస్సూర్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. త్రిస్సూర్ రానున్న పూరం ఉత్సవానికి ఏర్పాటు చేసిన బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు మృతి చెందారు. నలభై మందికి పైగా గాయపడినట్లు సమాచారం. బారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తిరువంబడి డివిజన్‌కు చెందిన బాణసంచా ముడిసరుకులను నిల్వ ఉంచే ముండతికొట్టెలోని బాణసంచా ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఈ భారీ పేలుడు శబ్దం కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి వినిపించినట్లు తెలిసింది. పేలుడుకు గల కచ్చితమైన కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. మృతుల సంఖ్యను ధృవీకరిస్తూ, త్రిస్సూర్ నగర పోలీస్ కమిషనర్ నకుల్ రాజేంద్ర దేశ్‌ముఖ్ ఐపీఎస్, ఫ్యాక్టరీ లోపల ఇంకాఎంతమంది కార్మికులు చిక్కుకున్నారో తెలియదన్నారు. అయితే మధ్యాహ్నం ఫ్యాక్టరీకి సరఫరా చేసిన భోజన ప్యాకెట్ల ఆధారంగా, అక్కడ సుమారు 40 మంది కార్మికులు ఉన్నారని స్థానికులు అంచనా వేశారు. శుక్రవారం జరగనున్న తిరువంబడి సెక్షన్ నమూనా ప్రదర్శన కోసం ఈ యూనిట్ బాణసంచాను తయారు చేస్తున్నట్లు సమాచారం.కొనసాగుతున్నసహాయక చర్యలుఅగ్నిమాపక సిబ్బంది మంటలనార్పేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ పేలుళ్లు ఎడతెరిపి లేకుండా కొనసాగడంతో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాద స్థలానికి దారితీసే రహదారులు ఇరుకుగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. అగ్నిమాపక, సహాయక బృందాలు సమీపంలోని గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించి మంటలను అదుపులోకి తెచ్చాయి.గాయపడిన వారిని త్రిస్సూర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మరోఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన వారికి త్రిస్సూర్ జనరల్ ఆసుపత్రితో సహా సమీపంలోని ఆసుపత్రులలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారందరికీ నిపుణుల వైద్య సంరక్షణ అందేలా చూడాలని ఆరోగ్యశాఖా మంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. 108 అత్యవసర సేవల అంబులెన్స్‌లతో సహా, తగినన్ని అంబులెన్స్‌లను సంఘటనా స్థలానికి పంపాలని, అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి సమీపంలోని ఆసుపత్రులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆమె ఆదేశించారు. -
మతాచారాలపైనా న్యాయ సమీక్ష
న్యూఢిల్లీ: మతాచారాలపై కూడా న్యాయ స్థానాలు సమీక్ష చేపట్టవచ్చని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇలాంటి సందర్భాల్లో న్యాయమూర్తులు తమ వ్యక్తిగత నమ్మకాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై తీర్పులిచ్చేటప్పుడు అంతరాత్మ సాక్షిగా, విస్తృత రాజ్యాంగ చట్రాన్ని మాత్రమే మార్గదర్శకంగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంతోపాటు వివిధ ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలో ఏర్పాటైన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్, ప్రస్తుత అంశం కేవలం హిందూ ఆచారాలకు లేదా శబరిమలకు సంబంధించింది కాదన్నారు. అన్ని మతాలు, విశ్వాసాలు, మనస్సాక్షికి సంబంధించిన అంశాలను నియంత్రించే రాజ్యాంగ చట్రానికి సంబంధించిందని ధావన్ అన్నారు. సమాజంలో విభేదాలు ఉన్నప్పుడు వాటి మధ్య సామరస్యం సాధించడమే న్యాయస్థానం లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఏ వ్యక్తి అయినా ఒక మతాన్ని ప్రశ్నించవచ్చు కానీ, అది గౌరవప్రదమైనది, నిజాయతీతో కూడినదై ఉండాలన్నారు. మతాచారాలను సమీక్షకు గురిచేయడం చాలా అయోమయానికి తావిచ్చే అంశమని ధావన్ అభిప్రాయపడ్డారు. శబరిమల ఆచార సంరక్షణ సమితి తరఫున సీనియర్ లాయర్ వి.గిరి వాదనలు వినిపిస్తూ..శబరిమల ఆలయంలోకి 10–50 ఏళ్ల మహిళలను మినహాయించాలన్న ఉమ్మడి వివేకం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రతి ఆలయానికి కొన్ని విశిష్ట ఆచారాలుంటాయని ఆరాధనలో అవి కూడా భాగంగా కొనసాగుతుంటాయని గిరి తెలిపారు. ఇటువంటి వాటన్నిటినీ ఒకే గాటనకట్టి ఆర్టికల్ 25(1) హక్కును ఇవి ఉల్లంఘిస్తున్నాయా, బలపరుస్తున్నాయనా అని చూడటం సరికాదని తెలిపారు. ‘ఆర్టికల్ 25(1) ప్రకారం, నేను అనుసరించే మతాన్ని, అంటే విగ్రహారాధనతో సహా హిందూ మతాన్ని ఆచరించడమే నా ప్రాథమిక హక్కు అని’ పేర్కొన్నారు. అంతకుమునుపు, ఆత్మన్ ట్రస్ట్ తరఫున లాయర్ ఎంఆర్ వెంకటేశన్..‘రుతుస్రావం సమయంలో మహిళలు స్వచ్ఛందంగా దేవాలయాల్లోకి, పూజా మందిరాల్లోకి ప్రవేశించరు. అది క్రమశిక్షణ, విశ్వాసంతో పెనవేసుకుపోయిన ఆచారం. ఇందులో వివక్షకు తావులేదు. దీనికి శాస్త్రీయ వివరణ ఇవ్వలేను. శాస్త్రం ముగిసినప్పుడు నమ్మకం మొదలవుతుంది’అని తెలిపారు. కాగా, ఈ అంశంపై ఐదు రోజులపాటు జరిగిన విచారణ వచ్చే వారం కూడా కొనసాగనుంది. -
అది మాకు కష్టమైన పనే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: సామాజిక సంక్షేమం, సంస్కరణల పేరిట ఏ మతంలోని సారాన్నీ తీసివేయలేమని సుప్రీంకోర్టు విస్తృత రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. శబరిమల ఆలయంలో తరుణ వయస్సు మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ ఇచ్చిన ఆదేశంపై పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది. సామాజిక సంస్కరణ పేరిట మతానికి సంబంధించిన ఆచారాలను తొలగించలేమని తొమ్మిది న్యాయమూర్తుల బెంచ్ తెలిపింది. లక్షలాది మంది నమ్మకాల్ని తప్పు అని ప్రకటించడం అత్యంత కష్టమైన పనుల్లో ఒకటని పేర్కొంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ ప్రస్తుతం శబరిమల కేసుకు సంబంధించిన కీలక రాజ్యాంగ ప్రశ్నలపై వాదనలు వింటోంది.ముఖ్యంగా మత స్వేచ్ఛ, సామాజిక సంస్కరణ మధ్య సమతుల్యతపై చర్చ జరుగుతోంది. 2018లో సుప్రీంకోర్టు అన్ని వయస్సుల మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం ఇవ్వాలని తీర్పు ఇచ్చింది. పరిమితులను అత్యవసర మత ఆచారంగా పరిగణించలేమని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ తెలిపింది. 10 నుంచి 50 సంవత్సరాల మధ్య మహిళలు, బాలికలు ఆలయంలోకి రాకూడదనే ఆచారాన్ని దాదాపు అంటరానితనంతో సమానమని పేర్కొంది.తాజాగా జరిగిన విచారణ సమయంలో మత సంబంధిత విషయాల్లో ప్రజాహిత వ్యాజ్యాల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై వాదనలకు స్పందిస్తూ.. లక్షలాది మంది నమ్మకాల్ని తప్పు అని కోర్టు ఎలా ప్రకటించాలన్నదే అత్యంత కఠినమైన సమస్యగా ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానించారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని అనుచితమని ప్రకటించడం న్యాయస్థానాలకు కష్టమైన పనేనని తెలిపారు. ట్రావెన్కోర్ దేవస్థాన మండలి తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. మతంపై నమ్మకం లేని వారు వాటిని ప్రశ్నిస్తూ దాఖలు చేసే పిటిషన్లను విచారణకు స్వీకరించడం సరైనదేనా? అని అన్నారు. అయ్యప్ప ఆలయాలు ఎన్ని ఉన్నా శబరిమలలోని ఆలయం చాలా విశిష్టమైనదని తెలిపారు. ఆచారాలను మహిళలపై వివక్షగా భావించొద్దని అన్నారు. 10-50 ఏళ్ల మధ్య వయసున్న బాలికలు, మహిళల ప్రవేశంపై మాత్రమే ఆంక్షలున్నాయని చెప్పారు. -
పిలిస్తే పలికే దైవం కృష్ణా... గురువాయురప్పా...
కృష్ణా... గురువాయురప్పా..! ఈ ఒక్క మాట మనకి బాగా పరిచయం ఉన్న కేరళంలో ఎక్కువ వినిపిస్తుంటుంది. కేరళం పేరు వింటే మనకి గుర్తుకు వచ్చే దేవాలయం గురువాయూర్. శ్రీ కృష్ణ దేవాలయాలలో కేరళలో ఉన్న గురువాయురప్పన్ దేవాలయం ఎంతో విశిష్టమైనది.ఆయనను బాలగోపాలుడిగా భక్తితో కొలుస్తారు. ఆర్ద్రతతో కృష్ణా... గురువాయురప్పా అనిపిలిస్తే పలుకుతాడని కేరళవాసుల నమ్మకం. ఎంతో మంది కృష్ణ భక్తులు భక్తితో పలవరిస్తుంటారు. బాలగోపాలుడు ఇక్కడ అల్లరి చేస్తూ తిరుగుతాడు అని చూసిన వాళ్ళు చెప్తుంటారు. కురూరమ్మ బిల్వమంగళుడు వీరి ఇంట్లో అల్లరి కన్నయ్య తిరుగాడేవాడని ఇక్కడివారి నమ్మకం. అందుకే ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు తామే కురూరమ్మ బిల్వమంగళుడిగా భావిస్తుంటారు. మన తెలుగు వారు అయ్యప్ప మాల వేసుకుని దర్శనం తరువాత లేదా ముందు ఇక్కడ అల్లరి కన్నాయని గురువాయూర్ లో దర్శనం తప్పనిసరిగా దర్శనం చేసుకుంటారు. తాము రాధాకృష్ణులమని భావించి తులసి మాలలు వేసుకుని గురువాయూర్‌లో వివాహం చేసుకోవడం గొప్ప అనుభూతి. అలాగే అల్లరి కన్నయ్యకి నృత్యం, ఆటపాటలు అంటే ఇష్టం. అందుకే ప్రతిరోజు అరంగేట్రం సంగీత కచేరీలు జరుగుతుంటాయి. కన్నయ్యకి పాలు, బియ్యం పంచదార వేసి పాయసం చేసి నైవేద్యం పెడతారు. పసిపిల్లలను తులాభారం చేయిస్తారు. అలాగే మొక్కు తీర్చడానికి ఏనుగులు సమర్పించేవారు. ఆ విధంగా సుమారు 38 ఏనుగులతో పునాథూర్ కోటలో చూడవచ్చు. విదేశాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వస్తారు. ఈ ఏనుగులతో పరుగు పందాలు, ఏనుగులకు విందు కార్యక్రమాలు ఉంటాయి మరి కృష్ణష్టామి రోజు విశేషమైన పూజలు జరుపుతారు. కేరళ వాళ్ళ కొత్త సంవత్సరాది రోజు ఉదయం ఈ కన్నయ్యని ముందుగా చూస్తారు. దానిని విషు కని అంటారు. గురువు, వాయువు కలిసి నదిలో దొరికిన విగ్రహం ఇక్కడ బాల గోపాలుడి దర్శనం. ఈ ఆలయం త్రిచూర్ రైల్వే స్టేషన్‌కి 20 కిలోమీటర్లు లేదా కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలో ఉంది. – ఈఎస్. మాధవన్ (చదవండి: శక్తిపీఠం-సిద్ధ పీఠం వ్యత్యాసాలు..?) -
ఏసీ లేకుండానే ఇల్లు కూల్‌గా..! ఎలాగో తెలుసా..?
ఇప్పుడంటే ఆధునిక టెక్నాలజీతో అత్యంత విలాసవంతమైన ఫ్లోరింగ్ పద్ధతులు, ఇరానీ మార్బుల్స్ వంటి వాటితో ఏసితో పనిలేకుండానే కూల్‌గా ఉంచుకుంటున్నారు. అయితే ఇవన్నీ అత్యంత ఖర్చుతో కూడుకున్నవి, ధనవంతులకే పరిమితమైనది. కానీ నాటి రోజుల్లోనే తక్కువ ఖర్చుతోనే ఏసీలతో పనిలేకుండానే చక్కగా ఇంటిని కూల్‌గా ఉంచే ఫ్లోరింగ్ పద్ధతిని వినియోగించేవారిని తెలుసా. ఏకంగా 300 ఏళ్ల నాటి క్రితం ఈ పద్ధతిని వినియోగించారు మన పూర్వీకులు. పైగా చాలా సహజ పద్ధతితలో తక్కువ ఖర్చుతో చేయడం విశేషం. ప్రస్తుతం ఈ టెక్నిక్ అంతరించిపోయే దశలో ఉంది. మరి అద్భుతమైన కళాత్మక టెక్నిక్ గురించి తెలుసుకుందామా.ఇది పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయంగా పేర్కొనవచ్చు. ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా సహజ పద్ధతిలో ఇంటిని కూల్‌గా ఉంచుకునే గొప్ప టెక్నిక్ ఇది. భారత్‌లో ముఖ్యంగా కొన్ని ప్రముఖ నగరాల్లో ఎండలు ఏ రేంజ్లో దంచికొడుతుంటాయో చెప్పాల్సిన పనిలేదు. అలా అని ఏసీలు, కూలర్లు వినియోగిస్తే..ఆ తర్వాత కరెంట్ బిల్లులు జేబు చిల్లుపెట్టే రేంజ్లో వచ్చి హడలెత్తిస్తాయి. పైగా ఎక్కువ గంటలు ఏసీలో ఉండటం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అలాంటప్పుడు దాదాపు 300 ఏళ్ల క్రితం కూలర్లు, ఏసీల మాట ఎత్తని ఆ రోజుల్లోనే మన పూర్వీకులు సహజంగా ఇంటిని చల్లగా ఉంచుకునే సాంప్రదాయ ఫ్లోరింగ్ పద్ధతిని కనుగొన్నారు. ఇదెలా ఉంటుందంటే..మార్బుల్స్, టైల్స్‌పై ఆధారపడని కాలంలో దీనిని ప్రవేశ పెట్టారు. దీని కోసం సిమెంట్‌గానీ, రసాయనాలు గానీ వినియోగించరు. ఇందులో ఉపయోగించే పదార్థాలు కేవలం నీరు, ఐరన్ ఆక్సైడ్, సున్నం మాత్రమే. నాటి మేస్త్రీలు వీటిని తమ చేతులతో కలిపి ఫ్లోరింగ్ చేసేవారు. ఆ మిశ్రమం గట్టిపడ్డాక..అద్దంలాంటి తళతళలాడే మెరుపు కోసం.. కొబ్బరి నూనెతో గంటల తరబడి పాలిష్ చేసేవారు. కొబ్బరినూనె రంగులేని మెరుపును సృష్టించడంలో సహాయపడటం తోపాటు చల్లదనాన్ని కూడా పెంచుతుంది. ఈ ప్రభావాన్ని సింథటిక్ పాలిష్‌లతో సాధించలేము. వేసవికాలంలో మధ్యాహ్నం సూర్యుడి భగభగలు ఎంత గరిష్టంగా ఉన్నా..ఈ ఫ్లోరిగ్ పాదాల కింద మంచు మాదిరి చల్లదనాన్ని అందించడం విశేషం. దీని అద్భుతమైన మన్నికే అత్యంత విలక్షణంగా ప్రత్యేకంగా నిలబెడుతుంది. అంతేగాదు ఈ ఫ్లోర్ ఉపరితలం ఎంత అందంగా మెరుస్తూ ఉంటుందటే..పాదాల అడుగులు దాన్ని అరిగిపోయేలా చేయకుండా మరింత నునుపుగా ఉంచడం విశేషం. ఈ ఫ్లోరింగ్ పద్ధతిని కేరళలో ఎక్కువగా వినియోగించేవారట.అంతేకాదండోయ్ ఈ ఫ్లోరింగ్ పది దశాబ్దాల వరకు ఎలాంటి గీతలు లేకుండా మన్నికగా ఉంటుందట. సాధారణంగా ఈ ఫ్లోరింగ్ ఎరుపు, గోధుమ ఛాయతో సహజమైన మెరుపుతో ఉంటుందట. అయితే ప్రస్తుతం ఈ విధమైన ఫ్లోరింగ్ చేసే కార్మికులు కొద్దిమందే ఉన్నారట. ఈ అద్భుతమైన నైపుణ్యం రాను రాను కనుమరుగవుతుండటం బాధకరం. View this post on Instagram A post shared by The Better India (@thebetterindia) (చదవండి: ఫిట్‌నెస్‌పై ఇంత క్రేజా?!) -
Kerala: హైకమాండ్ వార్నింగ్.. ఆగని ‘సీఎం’ ఫైట్!
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఇంకా మూడు వారాల సమయం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో అప్పుడే రాజకీయ సెగలు మొదలయ్యాయి. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం ‘కుర్చీలాట’ షురూ అయ్యింది. అధిష్టానం కఠిన హెచ్చరికలు జారీ చేసినా, సోషల్ మీడియా వేదికగా కొందరు నేతలు తమ వర్గానికే పట్టం కట్టాలని డిమాండ్ చేస్తుండటంతో కేరళ రాజకీయాలు మరింతగా వేడెక్కాయి.వివాదాలకు కేంద్ర బిందువుడీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ షియాస్ ఇటీవల మాట్లాడుతూ తదుపరి ముఖ్యమంత్రి ఎర్నాకులం నుండి ఉండాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఈ చర్చ ఊపందుకుంది. దానికి తోడు ఎమ్మెల్యే కాని వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కావచ్చా? అనే ప్రశ్నకు కేపీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన సమాధానం అంచనాలను అమాంతం పెంచేసింది. సీనియర్ నాయకులు వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ ఈ విషయంపై నేరుగా స్పందించకుండా పార్టీ విధానమే శిరోధార్యమని సమాధానాన్ని దాటవేస్తున్నారు. గతంలో కరుణాకరన్, ఆంటోనీ, ఊమెన్ చాందీ వంటి నాయకుల కాలంలో ఉన్న స్పష్టత ఇప్పుడు లోపించింది. అయినప్పటికీ, తుది నిర్ణయం తీసుకునే ముందు అధిష్టానం ఖచ్చితంగా ఎమ్మెల్యేలతో చర్చిస్తుందని భావిస్తున్నారు.రేసులో ఉన్న ప్రధాన అభ్యర్థులుముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటిది వీడీ సతీశన్. ఒకవేళ యూడీఎఫ్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించిన సతీశన్, కాంగ్రెస్ గెలిస్తే సీఎం పీఠానికి ప్రాధాన్యత కలిగిన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. భారీ మెజారిటీ వస్తే అది ఆయన నాయకత్వ విజయంగానే పరిగణిస్తారు. ఇక రెండో అభ్యర్థి మాజీ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల. పార్టీలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవం అతిపెద్ద బలం. ఒకవేళ స్వల్ప మెజారిటీ మాత్రమే వస్తే, అందరినీ కలుపుకుపోయే ఆయన విధానం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఢిల్లీ నుంచి అనూహ్య ఎంట్రీ?ఈ ఇద్దరితో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు కూడా తెరపైకి రావడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. జాతీయ స్థాయిలో సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉన్నందున, హైకమాండ్ ఆయనను రాష్ట్ర రాజకీయాలకు పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్, సీపీఎం పార్టీలలో ఎమ్మెల్యేలు కాని వారిని కూడా ముఖ్యమంత్రులుగా చేసిన చరిత్ర ఉండటంతో ఆయన అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు. ఈ ముగ్గురిలో కేరళ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి దక్కుతాయో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.ఇది కూడా చదవండి: బెంగాల్ రణరంగం: జెన్ జెడ్ చేతిలో ‘బ్రహ్మాస్త్రం’ -
మోనాలిసా భర్తకు దక్కిన ఊరట
సోషల్ మీడియా సెన్సేషన్ మోనాలిసా భోస్లే ప్రేమపెళ్లి వ్యవహారంలో మరో మలుపు చోటు చేసుకుంది. ఆమె మైనర్ అంటూ భర్త మహ్మద్ ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అతనికి ఊరట లభించింది. ఫర్మాన్‌ను ఇప్పట్లో అరెస్ట్ చేయడానికి వీల్లేదని కేరళ హైకోర్టు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కిందటి ఏడాది ఆరంభంలో జరిగిన ప్రయాగ్‌రాజ్(యూపీ) మహా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఓ ఫొటోగ్రాఫర్ కంట పడి ఇంటర్నెట్ సెన్సేషన్‌గా నిలిచింది మధ్యప్రదేశ్‌కు చెందిన మోనాలిసా భోస్లే. మోడలింగ్ అటుపై మూవీ ఆఫర్స్‌తో వార్తల్లోకి ఎక్కింది. అయితే అనూహ్యంగా ప్రేమ పెళ్లి చేసుకుని ఒక్కసారిగా సంచలన చర్చకు దారి తీసింది.ఇటు మత కోణంలో ఆమె వివాహంపై పెద్ద రచ్చే నడిచింది. అదే సమయంలో తన కూతురు మైనర్ అని పేర్కొంటూ పోలీసులను ఆశ్రయించి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు మోనాలిసా తండ్రి. దీంతో మైనర్ కిడ్నాప్, బలవంతపు వివాహం నేరాల కింద కేసు నమోదు అయ్యింది. ఈలోపు ఇటు షెడ్యూల్ ట్రైబ్స్ కమిటీ కూడా ఆమెకు 16 ఏళ్లు అని తేల్చింది. దీంతో పోక్సో కేసు నమోదు అయ్యింది. అయితే ఈ ఆరోపణల్ని ఆ జంట మీడియా సమావేశం పెట్టి మరీ తోసిపుచ్చింది. ఈ జనవరితో 18 ఏళ్లు నిండాయని.. ఇందుకు సంబంధించిన అధికారిక పత్రాలు(ఆధార్‌కార్డ్, బర్త్ సర్టిఫికెట్) కూడా ఉన్నాయని.. ఇష్టపూర్వకంగానే తమ వివాహం జరిగిందని ఆ జంట చెబుతోంది. పెద్దలు కూడా తమ వివాహానికి అంగీకరించారని.. ఆ తర్వాత కొందరి ప్రొద్భలంతో కేసు పెట్టారని మోనాలిసా ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టులో పిటిషనర్ వేశారు. ఇంతకు ముందు..మార్చి 23వ తేదీన కేరళ హైకోర్టు అరెస్ట్ విషయంలో తాత్కాలిక ఊరట ఇచ్చింది. అయితే నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు త్వరగతిన తమను అనుమతించాలని మధ్యప్రదేశ్ పోలీసులు కేరళ హైకోర్టును మరోసారి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఇవాళ మరోసారి గడువును పొడిగించింది. తాజా తీర్పుతో మే 20వ తేదీ దాకా ఫర్మాన్‌ను అరెస్ట్ చేయడానికి వీల్లేకుండా పోయింది. ఈలోపు ఆమె మైనర్ అవునా? కాదా? ఆ వివాహం చెల్లుబాటు అవుతుందా? వాళ్లు సమర్పించినవి సరైన పత్రాలేనా?.. అనే అంశాలపై దర్యాప్తు కొనసాగనుంది.మిస్సింగ్ కలకలం?మోనాలిసా కనిపించడం లేదంటూ ఫర్మాన్ ఖాన్ పెట్టిన ఓ వీడియో నిన్నంత వైరల్ అయ్యింది. తామిద్దరం రాజస్థాన్‌కు వెళ్లామని.. అజ్మీర్‌లో ఆమె కనిపించకుండా పోయిందని.. ఆమె కోసం అంతా గాలిస్తున్నానంటూ ఆ వీడియోలో చెప్పాడతను. అయితే.. ఆమె మిస్ కావడం వెనుక ఫర్మాన్ ప్రమేయం ఉండి ఉండొచ్చని మోనాలిసా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత 15-20 రోజులుగా తమ కూతురు తమతో మాట్లాడడం లేదని.. ఇప్పుడు అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోందని.. కేసు నుంచి తప్పించుకునేందుకే ఈ డ్రామాలు ఆడుతున్నారని.. పోలీసులు ఎలాగైనా ఆమె జాడ కనిపెట్టాలని కోరుతున్నారు. -
‘అనుక్షణం అవమానమే’.. బీడీఎస్ విద్యార్థి ఆఖరి ఆడియో
కన్నూర్: తమ కుమారుడు చక్కగా చదువుకుని, డాక్టర్ అవుతాడని ఆశపడిన ఆ పేద తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. విద్య బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఓ విద్యార్థి పాలిట శాపంగా మారారు. కేరళలోని కన్నూర్ డెంటల్ కాలేజీలో మొదటి సంవత్సరం బీడీఎస్ చదువుతున్న తిరువనంతపురానికి చెందిన నితిన్ రాజ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.కుల వివక్ష, అధ్యాపకుల వేధింపులే తన కొడుకును బలి తీసుకున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, ప్రాణాలు తీసుకునే ముందు నితిన్ రికార్డ్ చేసినట్టుగా భావిస్తున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, కంటతడి పెట్టిస్తోంది. నితిన్ తండ్రి వైఎల్ రాజన్ పెయింటింగ్ కార్మికుడు. ఎన్నో కష్టాలకోర్చి కొడుకును డెంటల్ కాలేజీలో చదివిస్తున్నాడు. అయితే క్యాంపస్ లోపల, బయట నితిన్ తీవ్రమైన కులపరమైన వివక్షను ఎదుర్కొన్నాడని, సీనియర్ల ర్యాగింగ్‌కు గురయ్యాడని ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తల్లిదండ్రులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కాలేజ్ లైబ్రరీ భవనం పైనుంచి కింద పడి నితిన్ రక్తపు మడుగులో కనిపించాడు. ఎమర్జెన్సీ వార్డుకు తరలించే లోపే అతడు ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యాజమాన్యం ఓరల్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ కె. రామ్, డాక్టర్ సంగీతలను సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించింది. తాజాగా లీకైన ఆడియోలో నితిన్ చెప్పిన విషయాలు కలవర పెట్టేలా ఉన్నాయి.‘క్లాసులో అందరి ముందూ నన్ను ఇడియట్ అని అవమానించారు. ఇటీవల సర్జరీ అయిన మా అమ్మను కూడా చులకన చేస్తూ మాట్లాడారు. మూడు మార్కులు కట్ చేసి.. ‘వెళ్లి మీ అమ్మానాన్నలకు ఈ సర్ ప్రైజ్ ఇవ్వు’ అని హేళన చేశారు. ఎంత భరించాలో అంతా భరించాను, చివరికి కోపంతో ఎదురుతిరిగాను’ అని నితిన్ ఆ ఆడియోలో వాపోయాడు. క్యాంపస్ గేటు దాటితే కాళ్లు, చేతులు నరికేస్తామని టీచర్లు బెదిరించారని, డాక్టర్ సంగీత లాంటి వారు ఇదంతా చూస్తూ నిలబడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.ఇది కూడా చదవండి: న్యూజెర్సీలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి -
ఓటెత్తిన కేరళ
తిరువనంతపురం: కేరళ 16వ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 78.12% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ నేత సతీశన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, బీజేపీ రాష్ట్ర చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ తదితరులున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) రతన్ యూ కేల్కర్ తెలిపారు. అక్కడక్కడా సాంకేతిక లోపాలు తలెత్తాయన్నారు. రెండు పోలింగ్ బూత్‌లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ప్రస్తుత సరళిని బట్టి చూస్తే 90 శాతం వరకు ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 74.06 శాతం మంది ఓటేయగా, ఈసారి అంతకుమించి తరలిరావడం విశేషం. అసెంబ్లీలోని మొత్తం 140 నియోజకవర్గాల్లో 2.71 కోట్ల ఓటర్లున్నారు. 1987 ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 80.54 శాతం ఓటింగ్ నమోదైంది. మరోసారి భారీగా ఓటింగ్ నమోదు కావడంపై వివిధ పార్టీలు తమకు అనుకూలమైన విశ్లేషణలు విన్పిస్తున్నాయి. సర్ ప్రక్రియ వల్లే ఈ స్థాయిలో ఓటర్లు తరలివచ్చారని సీపీఎం నేత మోహనన్ పేర్కొన్నారు. గతంలో ఓటింగ్ శాతాలు భారీగా ఉన్నప్పుడు ఫలితాలు యూడీఎఫ్‌కే అనుకూలంగా వచ్చాయని కాంగ్రెస్ నేత దీప్తి మేరీ వర్గీస్ గుర్తు చేశారు. అయితే, ఈ దఫా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లే ఓటింగ్ శాతం పెరిగినట్లు బీజేపీ నేత షైజు విశ్లేషించారు. ఇది తమ పారీ్టకి అనుకూల అంశమన్నారు.పుదుచ్చేరిలో 89.87%పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి గురువారం జరిగిన పోలింగ్‌లో ఏకంగా 89.87 శాతం పోలింగ్ నమోదైంది. 1964లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొంది, భారత్‌లో విలీనమయ్యాక పుదుచ్చేరిలో దాదాపు 90 శాతం మంది ఓటర్లు తరలివచ్చి ఓటేయడం ఇదే మొదటిసారి. గతంలో ఇక్కడ జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలన్నిటిలోనూ ఇదే రికార్డని చీఫ్ ఎలక్టోరల్ అధికారి పి.జవహర్ తెలిపారు. ఇది చరిత్రాత్మకం, అసాధారణమని ఆయన పేర్కొన్నారు. ఒక్క స్వల్ప ఘటన మినహా పుదుచ్చేరి, కారైకాల్ మొత్తమ్మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రారంభమైన ఉదయం 7 గంటలకే జనం పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకున్నారు. ఎండలు మండిపోతున్నా లెక్కచేయలేదు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అవకాశమి చ్చారు. సీఎం ఎన్.రంగస్వామి, లోక్‌సభ ఎంపీ వీ వైతిలింగం, డీఎంకే నేత ఆర్.శివ, హోంమంత్రి నమశ్శివాయం ఓటు వేసిన వారిలో ఉన్నారు. అస్సాంలో 85% మైనారిటీల ప్రాబల్యమున్న చోట్ల 90 శాతంపైనే గువాహటి: అస్సాం అసెంబ్లీకి గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల నాటికి 85.64 శాతం మంది ఓటేశారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 126 స్థానాలకు ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గత 2021లో జరిగిన ఎన్నికల్లో 82.04 శాతం ఓటింగ్ నమోదైంది. 2016 శాతం అత్యధికంగా 84.72 మంది ఓటేయడం రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర ప్రజలు ఈదఫా గత రికార్డును తిరగరాయడం విశేషం. ఓ వైపు వర్షం కురుస్తున్నా జనం లెక్క చేయలేదు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఈసీ పేర్కొంది. దాల్గావ్ నియోజకవర్గంలో అత్యధికంగా 95.83 శాతం మంది ఓటేయగా, అత్యల్పంగా న్యూ గువాహటిలో 72.10 మంది ఓటేశారు. మైనారిటీల ప్రాబల్యమున్న 19 నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. 2023లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలివి. గురువారం సీఎం హిమంత బిశ్వ శర్మ, భార్య, పిల్లలతో కలిసి వచ్చి కామ్రూప్ (మెట్రో) గారాల్ బునియాదీ స్కూల్ బూత్‌లో ఓటేశారు. జోర్హాత్లోని డీసీబీ స్కూల్ బూత్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఓటేశారు. ఓటేసిన మరికొందరు ప్రముఖుల్లో కేంద్ర మంత్రి పబిత్రా మర్ఘరెటా, ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా తదితరులున్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావడంపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును, నయా అస్సాంను కోరుకుంటున్నారనేందుకు ఇదే సంకేతమని విశ్లేషించారు. ఓటరు శాతం భారీగా నమోదు కావడాన్ని చారిత్రక పరిణామంగా సీఎం హిమంత అభివరి్ణంచారు. ఫలితం ఇప్పటికే నిర్ణయమైపోయిందని వ్యాఖ్యానించారు. తమ పాలన పట్ల ప్రజలు సంతృప్తి, సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పోలింగ్ సంబంధిత ఘర్షణల్లో 30 మంది గాయపడినట్లు ఐజీ అఖిలేశ్ కుమార్ తెలిపారు. -
విడిగా ఉంచడం విభజనకు దారితీయొచ్చేమో
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి 10–50 ఏళ్ల వయసు మహిళలకు ప్రవేశం నిరాకరించే విధానం కారణంగా సమాజంలో విభజన తలెత్తవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆలయ ప్రవేశం నుంచి మహిళలను దూరంపెట్టడం హిందుత్వంపై ప్రతికూల ప్రభావం పడే ఆస్కారముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. రుతుక్రమ వయసు మహిళలనూ ఆలయంలోకి అనుమతించాలంటూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును సమీక్షించాలంటూ 50కిపైగా దాఖలైన పిటిషన్లకు సంబంధించిన వాదోపవాదనలను వరసగా మూడోరోజూ సుప్రీంకోర్టు ఆలకించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాహ్, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్, జస్టిస్ ప్రసన్న బి.వరాలే, జస్టిస్ ఆర్.మహదేవన్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట గురువారం నాయర్ సర్వీస్ సొసైటీ, అయ్యప్ప సేవా సమాజం, క్షేత్ర సంరక్షణ సమితుల తరఫున సీనియర్ న్యాయవాది సీవీ వైద్యనాథన్ వాదనలు విన్పించారు. ‘‘ప్రత్యేకంగా ఒక మతశాఖకు సంబంధించి ఆలయంలోకి ఎవరిని అనుమతించాలి? ఎవరు పూజించాలి? ఎవరు దర్శనం చేసుకోవాలి? అనేది ఆ మతశాఖ ఇష్టం’’అని అన్నారు. ఈ వాదనతో జస్టిస్ నాగరత్న విభేదించారు. ‘‘వెంకటరమణ దేవరు ఆలయంలోకి గౌడ సారస్వత్ బ్రాహ్మణులను మినహా ఎవరినీ రానివ్వబోమని అంటున్నారు. ఒక నిమిషం శబరిమల ఆలయ వివాదం విషయం పక్కనబెడదాం. కేవలం మా వర్గీయులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తాం, వేరే వాళ్లకు ప్రవేశం లేదు అని అనడం హిందుత్వంలో మంచిదికాదు. అంతిమంగా మతంపై ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవాలి’’అని అన్నారు. జడ్జి నాగరత్న వ్యాఖ్యలతో ధర్మాసనంలోని మరో జడ్జి జస్టిస్ అరవింద్ కుమార్ ఏకీభవించారు. భక్తులను ఇలా దూరం పెడితే సమాజంలో విభజనలు తలెత్తుతాయని ఆయన వ్యాఖ్యానించారు. అయినాసరే వైద్యనాథన్ తన వాదనలకు కట్టుబడ్డారు. ‘‘తమ వర్గీయులకే ఆలయంలో ప్రాధాన్యత దక్కాలనే ఆలయ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి నిధులను ఆశించబోవు. ప్రైవేట్ దాతల నుంచిగానీ ప్రజల నుంచిగానీ విరాళాలు స్వీకరించబోవు. ఆలయాలు వాళ్లపై ఆధారపడవు’’అని అన్నారు. -
కేరళలో బీజేపీ ఖాతా కూడా తెరవదు: శశిథరూర్
తిరువనంతపురం: కేరళలో బీజేపీ భవితవ్యంపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ ఎన్నటికీ అధికారంలోకి రాలేదని అన్నారు. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన.. మీడియాతో మాట్లాడారు. కేరళలో బీజేపీ ఎప్పటికీ అధికారంలోకి రాదు. ఆ పార్టీ అకౌంట్ కూడా ఓపెన్ చేయదు. అసలు ఆ పార్టీ ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపించబోదు. ఇక్కడ పోటీ ఎల్డీఎఫ్-యూడీఎఫ్ మధ్యే ప్రధానంగా ఉండబోతోంది. విజయన్ పాలనలో కనీసం ఇళ్లు కూడా నిర్మించలేకపోయారు. భారీగా పోలింగ్ నమోదు అవుతోంది. దీనిని మా యూడీఎఫ్ అధికారానికి సంకేతంగా భావిస్తున్నా అని అన్నారాయన. 2011లో తమ ప్రభుత్వానికి కేరళ ప్రజలు అధికారం ఇచ్చారని.. ఆ సమయంలో తక్కువ మెజారిటీ దక్కిందని ఆయన గుర్తు చేశారు. అయితే ఈసారి మాత్రం భారీ మెజారిటీతో అధికారం కట్టబెడతారని ఆశిస్తున్నట్లు తెలిపారాయన. Thiruvananthapuram, Keralam: Congress MP Shashi Tharoor says, "Last time we had an opportunity to run the government in 2011, the people gave us a very, very narrow majority. This time I'm hoping for a better number, a more comfortable basis for our government to make a real… pic.twitter.com/Fiz3BWtIR4— IANS (@ians_india) April 9, 2026 -
'బుజ్జి ఫొటోగ్రాఫర్'..! జస్ట్ 18 నెలల వయసుకే..
కొందరు చిన్నారులు వయసు పెరిగే కొద్ది తమలోని అసాధారణ ప్రతిభను కనబరుస్తారు. ఇంకొందరు బైబర్త్ నైపుణ్యం పెంపొందించుకుంటారు. వయసుకి వారి ప్రదర్శించే ప్రతిభకు పొంతనలేని వారి సామర్థ్యం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసేలా కట్టిపడేస్తుంది. అలాంటి కోవకు చెందిందే కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన నాలుగేళ్ల పిహు. ఆమె పిట్ట కుంచెం కుత ఘనం అన్నట్లుగా ఫోటోగ్రఫీలో అసామాన్య ప్రజ్ఞతో ఆకట్టుకుంటోంది. ఆమె ఏ వయసులో కెమెరా పట్టుకుని క్లిక్ మనిపించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేరళలోని పాలక్కాడ్ నగరానికి చెందిన నాలుగేళ్ల పిహు వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన తండ్రి విపిన్దాస్, తల్లి శ్రీ హేమ శ్రీధరన్ దంపుతుల పెద్ద కుమార్తె. తన వయసు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే ఆమె మాత్రం తన చిట్టి చేతులతో కెమెరాతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఈ చిన్నారి కెమెరాల పట్ల అసాధారణమైన ఆసక్తిని కనబరుస్తోంది. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అయిన తండ్రి విపిన్ దాస్ అడుగుజాడల్లో నడిచేస్తోంది. అంత చిన్న వయసులోనే ఆ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడం విశేషం. పైగా తన టాలెంట్‌తో ఆ అభిరుచి తన డీఎన్ఏలోనే ఉంది అని చెప్పకనే చెబుతోంది పిహు. కేవలం 18 నెలల వయసులోనే బొమ్మ కెమరా కాకుండా, ఒరిజనల్ కెమెరాను పట్టుకుంది. ఆ పరికరం తన బరువులో దాదాపు సగం బరువు అయినా..ఆమె దానిని జాగ్రత్తగా ఎత్తి తనకు ఇష్టమైన ఏనుగు బొమ్మ ఫోటోని తీసింది. అది చూసిన తల్లిదండ్రులు ఓ చిన్న పసిపాప తీసిన ఫోటోనేనా..? అని విస్తుపోయారు. పైగా అంత చిన్నవయసులోనే కెమెరాలోని రకారకాల లెన్స్‌లు, గింబల్ వంటి వాటిపై ఆకస్తి చూపించేది. ప్రతి బటన్ ఎలా పనిచేస్తుందనేది తల్లిదండ్రులను అడిగి తెలుసుకునేది. అయితే తల్లిదండ్రులు అంత చిన్నవయసుకు కెమెరా ఎందుకని బొమ్మ కెమెరా ఇచ్చేందుకు యత్నిస్తే అస్సలు ఒప్పుకునేది కాదని చెప్పుకొచ్చారు. ఎలా నేర్చుకుందంటే..పిహు ఫొటోలు అందంగా తీయడం ఎలా నేర్చుకుందంటే..తన స్నేహితుడి బిడ్డ పుట్టినరోజు వేడుకలో సదరాగా ఇచ్చిన చిన్న కెమెరాను ప్రోఫెషనల్ కెమెరా మ్యాన్లు పట్టుకున్నట్లుగా పట్టుకుని ఫొటోలు తీసిందని చెబుతున్నారు ఆమె తండ్రి విపిన్ దాస్. అక్కడే తీస్తున్న ఇతర ఫొటోగ్రాఫర్లను పరిశీలిస్తూ తీయడం నేర్చుకుందని, పైగా ఆ వేడుకలో తీసిన పది ఫొటోలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలా అప్పటి నుంచి పిహు తండ్రి తోపాటు అవుట్డోర్ ఫొటోషూట్లకు వెళ్లడం ప్రారంభించింది. అలాగే తన తల్లి శ్రీహేమ రెండోసారి గర్భవతి అయినప్పుడు తల్లికి ఆ చిన్నారి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌గా మారింది. నేచురల్ వెలుగులో అద్భుతమైన పోర్ట్రెయిట్లను తీసింది ఆ చిన్నారి. View this post on Instagram A post shared by Humans of Bombay (@officialhumansofbombay) ఆ చిన్నారికి పేరొచ్చింది అప్పుడే..గతేడాది నవంబర్‌లో రాజకీయ నాయకుడు, ఎంపీ షఫీ పరంబిల్ ఆమె వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో పిహు పేరు మారుమ్రోగిపోయింది. ఆ వీడియోలో పిహు ఎంపీకి సంబంధించిన కొన్ని ఫొటోలు క్లిక్‌మనిపించింది. అంత ఎవరా ఆ చిన్నారి అంటూ తెలుసుకోవడం ప్రారంభించారు. ఇక తన కూతురుకి ఏ యాంగిల్ ఫోటోలు తీస్తే బాగా వస్తాయనే దానిపై మంచి పట్టుందని చెబుతున్నారు విపిన్ దాస్. View this post on Instagram A post shared by Shafi Parambil (@shafi_parambil) ఇవేగాక ఆమె ఇటీవలే, పాలక్కాడ్‌లోని శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగే పదిరోజుల వార్షిక రథోత్సవమైన ప్రసిద్ధ కల్పతి రథోత్సవంలో సైతం అద్భుతంగా ఫొటోలు తీసిందన్నారు. అక్కడ కమనీయ దృశ్యాలను చాలా అద్భుతంగా కెమెరాలో బంధించిందని చెప్పారు. అంతేకాదండోయో ఈ చిన్నారి పిహుకి 'cam_girl_pihu' అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది. దానిని ఆమె తల్లిదండ్రులే నిర్వహిస్తున్నారు.(చదవండి: నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్‌చేస్తే..) -
మూడు రాష్ట్రాల్లో పోలింగ్ కు సర్వం సిద్ధం
-
అస్సాం, కేరళలో నేడే పోలింగ్
అస్సాం, కేరళల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. రెండు రాష్ట్రాల్లోనూ గురువారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా వాటితో పాటే జరగనుంది. పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. కేరళ, పుదుచ్చేరిల్లో ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ జరగనుంది. అస్సాంలో మాత్రం పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదింటికే ముగుస్తుంది. మూడు చోట్లా తమిళనాడు, పశ్చిమబెంగాల్‌తో పాటు మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు.కేరళలో కూటముల పోరుకేరళలో సీపీఎం సారథ్యంలోని పాలక ఎల్డీఎఫ్ కూటమి హ్యాట్రిక్‌పై కన్నేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకోవడం తెలిసిందే. రాష్ట్రంలో ఒక పార్టీ, లేదా కూటమి వరుసగా రెండోసారి నెగ్గడం అదే తొలిసారి. ఎల్డీఎఫ్ ఆశలకు గండికొట్టి ఈ సారి ఎలాగైనా విజయం సా ధించాలని కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష యూడీఎఫ్ కూటమి సర్వశక్తులూ ఒడ్డుతోంది. దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా మారిన కేరళలో ఈసారి ఎలాగైనా గట్టిగా ఉనికి చాటుకోవాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ స్థానాల్లో ముక్కోణపు పోరు నెలకొంది.ప్రచార హోరుమూడు కూటములూ నెల రోజులకు పైగా హోరాహోరీ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. గురువారం జరిగే పోలింగ్‌లో 2.71 కోట్ల మంది ఓటర్లు వాటి భాగ్యరేఖలను తేల్చనున్నారు. ఎన్డీఏ కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్టార్ ప్రచారకులుగా నిలిచారు. యూడీఎఫ్ తరఫున కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎల్డీఎఫ్ కూటమికి మాత్రం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంతా తానై ప్రచార ప్రక్రియను ముందుండి నడిపించారు. సుపరిపాలన, అభివృద్ధి ఈసారి కూడా తమను ఒడ్డుకు చేరుస్తాయని ఎల్డీఎఫ్ ఆశలు పెట్టుకుంది. అయితే ఇటీవలి స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బలు ఆ కూటమిని భయపెడు తున్నాయి. దీనికి ప్రభుత్వ వ్యతిరేకత తోడై తమ విజయం ఖాయమని యూడీఎఫ్ విశ్వసిస్తోంది. సీపీఎం, బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ తాము చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారని ఆ కూటమి భావిస్తోంది. కొన్నేళ్లుగా కేరళలో ఓటు బ్యాంకును పెంచుకుంటూ వస్తున్న బీజేపీ, ఈసారి దాన్ని ఎలాగైనా సీట్ల రూపంలోకి మార్చాలని పట్టుదలగా ఉంది. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కలిసొస్తుందని నమ్ముతోంది. – తిరువనంతపురంఅస్సాంలో హోరాహోరీఅస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ కూటములు హోరాహోరి తలపడ్డాయి. వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, ఆ పార్టీ ఆశలకు గండి కొట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఈసారి సర్వశక్తులూ ఒడ్డింది. రెండు పార్టీలూ ఎప్పట్లాగే పలు ప్రాంతీయ పక్షాలతో జట్టు కట్టి బరిలోకి దిగాయి. హిమంత దూకుడు: బీజేపీ తరఫున మోదీ, అమిత్ షా రెండేసిసార్లు ప్రచారంలో పాల్గొన్నా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మే అన్నీ తానై వ్యవహరించారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు, దూకుడైన ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కూడా ఎక్కువగా పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్పైనే ఆధారపడింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను అత్యధికంగా 99 చోట్ల అభ్యర్థులను బరిలోకి దించింది. దాని భాగస్వాముల్లో రైజోర్ దళ్ 13, ఏజేపీ 10, సీపీఎం 3, ఏపీహెచ్ఎల్సీ 2 చోట్ల పోటీలో ఉన్నాయి. ఇక బీజేపీ 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. భాగస్వాములు ఏజీపీ 26, బీపీఎఫ్ 11 చోట్ల బరిలో దిగాయి. పలు స్థానాల్లో స్నేహపూర్వక పోటీలు ఇరు కూటములకూ తలనొప్పిగా మారాయి. 9 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఇద్దరేసి అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటం విశేషం! రాష్ట్రవ్యాప్తంగా 59 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. జాలూక్బారీ స్థానం నుంచి వరుసగా ఆరోసారి విజయం సాధించాలని సీఎం హిమంత ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ సభ్యుడైన పీసీసీ చీఫ్ గౌరవ్ జోర్హాట్ నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో అస్సాంలో 6.42 లక్షల మంది తొలిసారి ఓటేయనున్నారు! – గువాహటిపుదుచ్చేరిలో టీవీకే ఉనికి చాటేనా?పుదుచ్చేరిలో సీఎం ఎన్.రంగస్వామి సారథ్యంలోని ఏఐఎన్ఆర్సీ, బీజేపీ, అన్నాడీఎంకేలతో కూడిన ఎన్డీఏ కూటమి ఈసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డింది. దానికి పోటీగా విపక్ష డీఎంకే, కాంగ్రెస్‌లతో కూడిన ఇండియా కూటమితో పాటు సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూడా తొలిసారి బరిలో దిగింది. ప్రజల ముఖ్యమంత్రిగా రంగస్వామికి ఉన్న పేరుపైనే ఎన్డీఏ కూటమి ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని డీఎంకే, కాంగ్రెస్ భావిస్తున్నాయి. వాటిలో విజయ్ పార్టీ ఎవరికి నష్టం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తమిళ జాతీయవాది సీమాన్ సారథ్యంలోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) కూడా దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. – చెన్నై -
శాంసన్ మంచి మనసు.. సెల్ఫీ అడిగిన అభిమానికి ఊహించని సర్ప్రైజ్
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ తన మంచి మనసు చాటుకున్నాడు. సంజూ తన అభిమానికి మర్చిపోలేని బహుమతిని అందించాడు. ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్‌కు సంజూ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. సీఎస్కే తమ చివరి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న ఆర్సీబీతో తలపడంది. అయితే చెన్నై ఆడబోయే తదుపరి మ్యాచ్‌కు వారం రోజుల గ్యాప్ లభించడంతో సంజూ తిరువనంతపురంకు వెళ్లాడు. ఈ క్రమంలో సంజూ మంగళవారం ముండూరు-తూత రోడ్డులో ఫోన్ కాల్ మాట్లాడటం కోసం రోడ్డు పక్కన తాను కారు ఆపాడు. అయితే అదే సమయంలో కేబుల్ టెక్నీషియన్‌గా పనిచేసే శబరీష్, తన స్నేహితుడు మణికంఠన్‌తో కలిసి బైక్‌పై క్రికెట్ ఆడటానికి వెళ్తున్నాడు. కార్లో సంజూ ఉండడంతో చూసి తన బైక్‌ను అతడు ఆపాడు. శాంసన్ తన ఫోన్ కాల్ ముగించిన తర్వాత శబరీష్‌తో ఎంతో ఆప్యాయంగా మాట్లాడు. ఫొటో దిగుదామా అని సంజూనే స్వయంగా అడిగాడు. శబరీష్ తన ఫోన్ తీసి సెల్ఫీ తీసుకున్నాడు. అయితే ఆ ఫోన్ డిస్ప్లే పూర్తిగా పగిలిపోయి ఉండటాన్ని సంజూ గమనించాడు. దీంతో వెంటనే సంజూ తన వద్ద ఉన్న రూ. 40,000 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను శబరీష్‌కు బహుమతిగా ఇచ్చాడు. సదరు అభిమాని సంతోషంలో మునిగితేలిపోయాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో దుమ్ములేపిన సంజూ శాంసన్.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం తన మార్క్‌ను చూపించలేకపోతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు.చదవండి: IPL 2026: జోస్ బట్లర్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 23 పరుగులు! వీడియో -
కోర్టు ఉత్తర్వు.. అయ్యప్ప స్వామి యాత్రికులపై పరిమితి
తిరువనంతపురం: కేరళ హైకోర్టు కీలక ఉత్తర్వును జారీ చేసింది. 2026–27 మండల-మకర విళక్కు యాత్రా కాలంలో శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్యపై పరిమితి విధించింది.స్వామివారి దర్శనానికి రోజుకు గరిష్టంగా 75,000 మంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని పేర్కొంది. భక్తుల భద్రతను పర్యవేక్షించడం, రద్దీని నియంత్రించడం మరియు క్యూ లైన్లలో భక్తులు ఇబ్బంది పడకుండా చూడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.కేరళ కోర్టు తీర్పు ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అయ్యప్పస్వామి యాత్రికులకు వర్తిస్తుంది. కోర్టు తీర్పుతో స్వామి దీక్షకు వెళ్లే భక్తులు ముందుగానే తమ దర్శన టిక్కెట్లను 'వర్చువల్ క్యూ' ద్వారా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, భక్తులు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ వెబ్సైట్ ద్వారా వర్చువల్ బుకింగ్ లేదా నీలక్కల్, వండిపెరియార్, పంపా, ఎరుమేలి మరియు చెంగన్నూర్ లోని కౌంటర్ల ద్వారా భౌతికంగా బుకింగ్ చేసుకునే స్పాట్ బుకింగ్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. -
కేరళ ‘చరిత్ర’ ను తిరగ రాస్తారా? ఎవరీ రాజీవ్ చంద్రశేఖర్!
రాజీవ్ చంద్రశేఖర్. ఇంజనీర్‌గా మొదలుపెట్టి, వ్యాపారవేత్తగా మారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేత. దేన్ని ఎక్కడ ఎలా ముగించాలి, ఎప్పుడు కొత్త మార్గాల్లో అడుగువేయాలనే ఎరుక కలిగిన వ్యక్తి. కేరళ బీజేపీ సారథిగా పార్టీ అసెంబ్లీ ఎన్నికల పోరాటాన్ని ముందుండి నడుపుతున్నారు. బీజేపీకి అందని రాష్ట్రమైన కేరళలో ఈసారి ఎలాగైనా గెలుపు అందించి చరిత్రను తిరగరాయాలని పట్టుదలగా ఉన్నారు. మోదీ హవాను పసిగట్టి రాజీవ్ 2006లో రాజకీయ రంగప్రవేశం చేశారు. కర్ణాటకలోని అధికార జేడీ(ఎస్), బీజేపీ కూటమి ఆశీస్సులతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. పాలనా సంస్కరణలు, జాతీయ భద్రత, సాయుధ దళాల సిబ్బంది, ముఖ్యంగా మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కృషి చేశారు. 2012, 2018లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. దేశ రాజకీయాలు మోదీకి అనుకూలంగా మారుతున్నాయని రాజీవ్ ముందే పసిగట్టారు. 2014కు ముందు నుంచే మోదీని సమరి్థంచడం ప్రారంభించారు. 2020లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అయ్యారు. 2021లో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి అయ్యారు. డిజిటల్ పాలన, డేటా భద్రతా విధానాలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. డిజిటల్ ఇండియా, ఇంటర్నెట్ పాలన, సాంకేతిక విధానాల్లో లోతైన పరిజ్ఞానమున్న పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. 2023లో కేరళ బీజేపీ సారథిగా పగ్గాలందుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ శశిథరూర్ చేతిలో ఓడారు. కేరళ చరిత్రలో బీజేపీ గెలిచిన ఏకైక అసెంబ్లీ స్థానం నెమోమ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆసక్తికర నేపథ్యం రాజీవ్ చంద్రశేఖర్ స్వస్థలం కేరళలో త్రిసూర్ జిల్లాలోని దేశమంగళం. 1964లో అహ్మదాబాద్‌లో మలయాళీ నాయర్ కుటుంబంలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ వైమానిక దళంలో ఎయిర్ కొమొడోర్గా పనిచేశారు. దాంతో రాజీవ్ బాల్యం దేశమంతటా భిన్న సంస్కృతుల మధ్య గడిచింది. ఆయన మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. స్టార్టప్‌ల గురించి కనీసం వినని 1981లో ఢిల్లీకి చెందిన ఓ ఐటీ స్టార్టప్‌లో ఉద్యోగం సంపాదించారు. తండ్రి ప్రోత్సాహంతో అమెరికాకు వెళ్లి ఇలినాయీ వర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశారు. ఇంటెల్‌లో డిజైన్ ఇంజనీర్‌గా చేసి భారత్‌కొచ్చారు. బీపీఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు నంబియార్ కుమార్తె అంజును పెళ్లాడారు. 2005లో జుపిటర్ క్యాపిటల్ అనే పెట్టుబడి సంస్థను స్థాపించారు. రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడే ఏషియానెట్ కమ్యూనికేషన్స్‌లో 51 శాతం వాటా కొనుగోలు చేసి మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. 2017లో యాంకర్ అర్నాబ్ గోస్వామితో కలిసి రిపబ్లిక్ టీవీని స్థాపించారు.ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్‌పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు!జేబులో పెన్సిల్ : ముఖ్య విషయాలు నోట్ చేసుకోవడానికి రాజీవ్ చంద్రశేఖర్ జేబులో నిత్యం పెన్సిల్ ఉంచుకుంటారు. ‘‘ప్రతిదాన్నీ తిరగరాయడం ఆయనకిష్టం. చివరకు చరిత్రను కూడా’’అని విపక్ష నేతలు చమత్కరిస్తుంటారు! ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండి – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ టెకీది సాహసమా..? నాటకమా..?
కర్ణాటకలోని మూడవ ఎత్తైన శిఖరం టేడీయాండమోల్ (Tadiandamol) వద్ద ట్రెకింగ్‌కు వెళ్లి అడవిలో దారి తప్పిన కేరళకు చెందిన 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ జి.ఎస్. శరణ్య కథ సుఖాంతమైంది అనుకుంటే..సర్వత్రా ఈ ఘటనపై అనుమానాలు వెల్లువెత్తాయి. అసలు ఆమె నిజంగానే తప్పిపోయిందా..? నాటకమా.. ? అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. ఆ టెకీ శర్యణ తానెలా తప్పిపోయిందో చెప్పిన విధం కూడా అనుమానాస్పదంగా ఉండటంతో ఈ ఘటనపై పెద్దఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు రావడంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు . అసలు ఎందుకిలా అంటే..కేరళలోని కోజికోడ్ జిల్లా, నడపురానికి చెందిన 36 ఏళ్ల ఐటీ నిపుణురాలు శరణ్య, ఏప్రిల్ 2న కర్ణాటకలోని కొడగులో ఉన్న ఎత్తైన శిఖరం తడియండమోల్ను అధిరోహించడానికి బయలుదేరింది. ఆమె తన బృందంతో తప్పిపోయి నాలుగురోజుల తర్వాత రెస్కూ అధికారులు ఆమె ఆచూకుని కనిపెట్టి సురక్షితంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అయితే అలా నాలుగు రోజుల పాటు మనుషులెవ్వరూ వెళ్లలేని ఆ దట్టమైన అడవిలో ఒక్కత్తే ఉండటమే ఆశ్చర్యం అనుకుంటే ఆమె కేవలం నీళ్లు తాగుతూ ఉండటం మరింత ఆశ్చర్యానికి లోనుచేసింది. ఎందుకంటే రెస్క్యూ బృందాలు ఆమెను గుర్తించి తీసుకొచ్చినప్పుడూ.. శరణ్య ముఖంలో ఏ మాత్రం అలసిపోయినట్లు గానీ, తప్పిపోయిన బడలికగానీ కనిపించకపోవడంతో సర్వత్ర అనుమానాలకు దారితీసింది. అదీగాక క్రూర మృగాలతో నిండిన ఆ అడవిలో ఆమె బతికి బయటపడే అవకాశమే లేదు, ఇదంతా ఆమె కావాలనే ఆడిన నాటకంగా ఆరోపణలు చేస్తున్నారు. అంతేగాదు ఆమె ప్రభుత్వం, ప్రజల విలువైన సమయాన్ని, డబ్బుని వృధా చేసినందుకుగానూ శరణ్యపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ జరపాలని బిజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు టెకీ శరణ్య అదృశ్యం కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నపోక్లు పోలీస్ స్టేషన్లో కేను కూడా నమోదైంది. ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేకుండా సమగ్ర దర్యాప్తు చేయాలని ఫిర్యాదులో కోరారు బీజేపీ నాయకులు. అయితే దీనిపై పోలీసులు ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు కానీ ఒక పిటిషన్‌గా దర్యాప్తు చేయాలని నిర్ణయించారు. అలాగే పోలీసులు రెస్క్యూలో ఆమెను చూసి మాట్లాడినప్పుడు ఎలాంటి అనుమానాలు కలగలేదని, కానీ ఇప్పుడు అనుమానాలు లేవనెత్తుతున్నందున ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని పేర్కొన్నారు రెస్క్యూ పోలీసులు. ట్రెక్కింగ్ వెళ్లినప్పుడూ శరణ్యలా కాకూడదంటే..ఇలా ట్రెక్కింగ్ వంటి సాహసయాత్రలకు వెళ్లేటప్పుడూ..ఎండింగ్ పాయింట్ చేరుకునేవరకూ వెళ్లే మార్గం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు జరిగిన అది తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది. అందువల్ల రూట్ మ్యాపును తప్పనిసరిగా ఫాలో అవ్వాలి. మారు మూల ప్రాంతాల్లో నెట్వర్క్ సమస్యలు ఉంటాయి. టెక్నాలజీపై పూర్తిగా ఆధారపడకుండా మాన్యువల్ మ్యాప్‌ను ఫాలో అవ్వాలి. ఎక్కువగా ట్రెక్కింగ్ చేసేవారు బృందాలుగా విడిపోవాలి. అలా వంతుల వారీగా గ్రూపుకు నాయకత్వం వహించేవారిని అనుసరించడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా బృందంలో చర్చలు జరుపుతూ ఉండాలి. ఇలా చేస్తే ట్రెక్కింగ్‌లో మంచి అనుభూతి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.సాహసయాత్రకు సిద్ధమైన ట్రెక్కింగ్ ప్రియులు పర్వతాలపైకి వెళ్లే సమయంలో పైకి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. తేమ ప్రాంతాల్లో రాళ్లపై నాచు పట్టి ఉండడం వల్ల కిందకి జారిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల ట్రెక్కింగ్ చేసేటప్పుడు వేసే ప్రతి అడుగు చాలా దృఢంగా ఉండాలి. ట్రెక్కీలు వెళ్లే దారి మధ్యలో ఎండిపోయిన చెట్లు, రాళ్లు, విష పురుగులు, సర్పాలు, కీటకాలు, తేళ్లు ఉంటాయి. కాబట్టి సౌండ్ వచ్చే షూస్ ను వేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇవి అలికిడికి దూరంగా వెళ్లిపోతాయి.(చదవండి: మంచు కమలం..ముమ్మాటికీ ఇది అందరూ చూడలేరు!) -
కేరళ వరదలు.. సంచలన ఆడియో విడుదల
తిరువనంతపురం: కేరళ రాష్ట్రాన్ని 2018లో వణికించిన మహా వరదలు ప్రకృతి విపత్తు కాదు, కేవలం కొందరి ధనదాహంతో జరిగిన ‘మానవ తప్పిదమే’ అని వెల్లడించే ఒక సంచలన ఆడియో వెలుగులోకి వచ్చింది. అవినీతి, ఇసుక మాఫియాల వల్లే ఆ ఘోరం జరిగిందని ఆరోపిస్తూ మువట్టుపుజ ఎమ్మెల్యే, యూడీఎఫ్ అభ్యర్థి మ్యాథ్యూ కుజల్నాదన్ ఒక ఆడియో క్లిప్‌ను తాజాగా విడుదల చేశారు.వివరాల్లోకి వెళితే.. కుజల్నాదన్ విడుదల చేసిన ఈ ఆడియో, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి కె. కృష్ణన్‌కుట్టి మాట్లాడినట్లుగా భావిస్తున్నారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి మాథ్యూ టి. థామస్ హయాంలో జరిగిన అవకతవకలు, లంచగొండితనమే ఈ భయంకరమైన వరదలకు కారణమని ఆ ఆడియోలో వెల్లడవుతోంది. ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు చెందిన కోట్ల రూపాయల ఇసుక నిల్వలను కాపాడేందుకు తోట్టప్పల్లి స్పిల్‌వేను ఒక నెల ముందే తెరవాల్సి ఉన్నా.. ఉద్దేశపూర్వకంగానే మూసి ఉంచారని ఆ ఆడియోలో ఆరోపించారు.చీఫ్ ఇంజనీర్ జోషితో పాటు అప్పటి సీపీఎం ఎమ్మెల్యే జార్జ్ థామస్ సోదరి, మంత్రి మాథ్యూ టి. థామస్ కుమ్మక్కై.. కాంట్రాక్టర్‌కు రూ. 300 కోట్ల లాభం చేకూర్చేందుకు స్పిల్‌వే గేట్లు ఎత్తకుండా జాప్యం చేశారని అందులో పేర్కొన్నారు. ఒకవేళ గేట్లు సకాలంలో తెరిచి ఉంటే ఆ ఖనిజ ఇసుక కొట్టుకుపోయేది. ఒక ప్రైవేట్ విద్యుత్ కంపెనీకి రూ.8 కోట్ల లాభం చేకూర్చడానికి మణియార్ ప్రాజెక్టులో చట్టవిరుద్ధంగా నీటిని నిల్వ చేశారని ఆ ఆడియో ద్వారా తెలుస్తోంది. ఆ తర్వాత అకస్మాత్తుగా ఆ అదనపు నీటిని వదలడం వల్లే చెంగన్నూర్ లాంటి ప్రాంతాలు సర్వనాశనం అయ్యాయని అందులో పేర్కొన్నారు.దీనికి తోడు తమిళనాడుకు మళ్లించాల్సిన దాదాపు 1,400 క్యూసెక్కుల నీటిని, పొరుగు రాష్ట్రంలో జరుగుతున్న రూ.200 కోట్ల నిర్మాణ ప్రాజెక్టును కాపాడేందుకు ఉద్దేశపూర్వకంగా చాలకుడి నదీ పరీవాహక ప్రాంతంలోకి మళ్లించారని మరో తీవ్ర ఆరోపణ వెలుగుచూసింది. నీటి ప్రవాహం తమ పనులకు ఆటంకం కలిగించకుండా కాంట్రాక్టర్లు అధికారులకు భారీగా ముడుపులు చెల్లించారని ఆడియోలో ఉంది. కేరళ ప్రజల ప్రాణాలు, ఆస్తులను పణంగా పెట్టి ఈ నేత ఎన్ని కోట్లు వెనకేసుకున్నారో సమాధానం చెప్పాలని కుజల్నాదన్ మీడియా సమావేశంలో సూటిగా ప్రశ్నించారు. ఈ ఆడియో వ్యవహారం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.ఇది కూడా చదవండి: శబరిమల వివాదం: సుప్రీంకోర్టులో కేంద్రం కీలక వాదన -
వార్నీ.. వేలికి సిరా ఉంటే చాలు.. ఆఫర్లే ఆఫర్లు!
తిరువనంతపురం: ఓటు వేయడం మన ప్రాథమిక బాధ్యతే కాదు.. అది ఇప్పుడు అదిరిపోయే ఆఫర్లను కూడా అందిస్తోంది. ఏప్రిల్ 9న జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు ఎన్నికల సంఘం పలు సంస్థలతో కలిసి వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ప్రముఖ ‘కేఫ్ కాఫీ డే’(సీసీడీ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటు వేసినట్లు వేలిపై ఉన్న సిరా చుక్కను చూపిస్తే చాలు.. కాఫీపై ఏకంగా 25 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.ముందు వచ్చిన వారికే ఛాన్స్..ఓటింగ్ శాతాన్ని, ముఖ్యంగా యువత భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఎన్నికల సంఘం, కేఫ్ కాఫీ డే సంయుక్తంగా ఈ ఆఫర్‌ను తీసుకువచ్చాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యు. కేల్కర్ వెల్లడించారు. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు.. రాష్ట్రంలోని ప్రతి కేఫ్ కాఫీ డే ఔట్లెట్లో.. సిరా చుక్కను చూపించిన మొదటి 15 మంది కస్టమర్లకు మాత్రమే ఈ 25శాతం రాయితీ లభిస్తుంది. ముందుగా ఓటు వేసిన వారికే ఈ లక్కీ ఛాన్స్ దక్కనుంది.తొలి ఓటుకు తీయని ‘హల్వా’..యువతను ఆకట్టుకునేందుకు కేవలం కాఫీ డిస్కౌంట్ మాత్రమే కాదు.. తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకునే యువ ఓటర్లకు సాంప్రదాయబద్ధంగా తీయటి ‘హల్వా’ను బహుమతిగా ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఉబెర్ ఉచిత రైడ్స్.. రూ.1 కే బియ్యం పిండిఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు ప్రఖ్యాత క్యాబ్ సేవల సంస్థ ‘ఉబెర్’ సైతం ముందుకు వచ్చింది. ఎర్నాకులం, తిరువనంతపురం నగరాల్లో.. పోలింగ్ స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించే ఓటర్లకు ఉచిత రైడ్లను ఉబెర్ అందిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ 'సప్లైకో' (SupplyCo) స్థానిక ప్రజల ప్రయోజనార్థం మరో ప్రత్యేక పథకాన్ని పరిశీలిస్తోంది. ఎన్నికల ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 10, 11 తేదీలలో కేవలం ఒక్క రూపాయినే (Re 1) బియ్యం పిండిని అందించే యోచనలో ఉంది. మొత్తానికి.. ఓటర్లలో ఉత్సాహం నింపి, ఈ ప్రజాస్వామ్య పండుగలో అందరినీ భాగస్వాములను చేసేందుకు కేరళలో ముందెన్నడూ చూడని రీతిలో ఆఫర్లు సిద్ధమయ్యాయి.ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ.. షాకిస్తున్న కేరళ సర్కారు వైఖరి! -
మీ డేటా పాతది
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి, కేరళ సీఎం విజయన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలకు ఎక్స్ వేదికగా విజయన్ ఘాటుగా స్పందించగా, ఆ వ్యాఖ్యలకు దీటుగా బదులిస్తూ రేవంత్ మరింత ఘాటైన లేఖ రాశారు. అను భవజ్ఞులైన రాజకీయ నాయకుడనే గౌరవంతో ఎక్స్ వేదికగా మీ స్పందనను చదివానని, అందులో తప్పుదారి పట్టించే అంశాలతోపాటు ముఖ్యాంశాల్లో లోపాలు కనిపించాయని, రెండు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నిజాలను తెలియజేయడం తన బాధ్యతగా భావిస్తూ ఈ లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు ఈనెల 7న త్రివేండ్రంకు వస్తానని, అన్ని విషయాలపై గణాంకాలతో సహా చర్చ జరుపుదామని విజయన్ను ఆహ్వానించారు. లేఖలో ఏముందంటే...⇒ నేను కేరళ వ్యవస్థలను ఎక్కడా తప్పుపట్టలేదు. మీ ఎల్డీఎఫ్ పాలనలోని లోపాలను మాత్రమే ఎత్తిచూపాను. ⇒ మీరు నీతిఆయోగ్ ఇచ్చిన ఎస్డీజీ 2023–24 గురించి మాట్లాడారు. కానీ ఆ డేటా పాతది. తెలంగాణను వినాశనం చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాలన చరమాంకంలో ఇచ్చిన గణాంకాలను పట్టుకుని మా ప్రభుత్వం గురించి చెబుతున్నారు. 2023, డిసెంబర్లో ఆ పాలన అయిపోయింది. ⇒ 2025 తర్వాతి కాలంలో దేశంలోనే సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా కేరళ నిలుస్తుందని మీ పోస్ట్‌లో చెప్పారు. మరి ఇప్పుడు 2026, ఏప్రిల్ నడుస్తోంది. మీ రాష్ట్రం 100 శాతం అక్షరాస్యత సాధించిందా? ⇒ కేరళలో పేదరికం తెలంగాణ కంటే తక్కువ స్థాయిలో ఉందన్నది వాస్తవమే. కానీ అది 60 కంటే ఎక్కువ సంవత్సరాల ప్రగతిశీల పాలన ద్వారా సాధ్యమైంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన గణనీయ సంపద ద్వారా జరిగింది. 12 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ–బీఆర్ఎస్ ద్వారా వారసత్వంగా పేదరికం వచ్చింది. అయితే, 60 ఏళ్ల తర్వాత మీరెక్కడున్నారు... అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో మేమేం సాధించామన్నది ప్రశ్న.⇒ కాంగ్రెస్ పార్టీనే బీజేపీకి బీ–టీం అని అసంబద్ధ ఆరోపణ చేశారు. 2020లో జరిగిన కేరళ బంగారం కుంభకోణంలో స్వయంగా మీ ముఖ్య కార్యదర్శిని ఈడీ అరెస్టు చేసింది. కీలక నిందితుడు నేరుగా మీ కార్యాలయ ప్రమేయం గురించి దర్యాప్తు సంస్థలకు చెప్పాడు. ఈ విషయంలో ఈడీ జరిపిన సోదాలు, సీబీఐ విచారణలో ఎక్కడా కేరళ సీఎం కార్యాలయానికి ఉన్న లింకుల గురించి ప్రస్తావనకు రాలేదు. కానీ గాంధీ కుటుంబాన్ని మాత్రం ఢిల్లీ పెద్దలు నిత్యం వేధిస్తున్నారు. ఎవరు ఎవరికి బీ–టీం అనేది కేరళ ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నా. ⇒ మా రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నాం. బీజేపీ–బీఆర్ఎస్ల వాట్సాప్ అభిప్రాయాలను వల్లించకుండా మేం జీతాలు ఇస్తున్నామో లేదో తెలుసుకునేందుకు ఓ బృందాన్ని పంపి స్వతంత్రంగా విచారించుకోండి. ⇒ తలసరి ఆదాయంలో మాది దేశంలోనే రెండో స్థానం. దక్షిణాదిలోనే కాదు పెద్ద రాష్ట్రాల్లోనూ మేమే నంబర్‌వన్. దేశంలో భౌగోళికంగా 3.5 శాతం, జనాభా పరంగా 3 శాతం కూడా లేని తెలంగాణ జీడీపీలో 5 శాతం పాలుపంచుకుంటోంది. ⇒ మీ రాష్ట్రంలో చురుకైన యువత ఉండటం మీకు అదనపు వనరు. సుమారు 35 లక్షల మంది కేరళీయులు విదేశాల్లో ఉంటున్నారు. ఏటా 1.5 లక్షల కోట్లు వారి ద్వారా వస్తున్నాయని అంచనా. పశ్చిమాసియా భగ్గుమంటున్నా గల్ఫ్ దేశాల్లో ఉన్న మలయాళీల్లో ఒక్కరూ తిరిగి రాష్ట్రానికి రాలేదంటే కారణం మీ రాష్ట్రంలో ఉద్యోగాలు లేకపోవడమే.⇒ మీరు ఆరోపించినట్టు బుల్డోజర్లు ఏ పేద కుటుంబాన్నీ నష్టపర్చలేదు. బుల్డోజర్ బాధితులంటూ మీరు ఆరోపణలు చేసిన వారికి డబుల్బెడ్రూం ఇళ్లు, ఆర్థిక సాయం, మార్కెట్‌విలువ కంటే ఎక్కువ పరిహారం చెల్లించాం. ⇒ చివరగా మీ పాలన వద్దని,∙కాంగ్రెస్ మోడల్‌ను కేరళ ప్రజలు కోరుకుంటున్నారు. -
కేరళకు సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి కేరళ వెళ్లారు. ఆయన మంగళవారం మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఉదయం 8.30 గంటలకు కోవలం నియోజకవర్గంలో రోడ్ షో, 10.30 గంటలకు మావెలికరలో రోడ్ షో, మధ్యాహ్నం 2 గంటలకు పతానపురం రోడ్ షోలో రేవంత్ పాల్గొంటారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. -
నో ఫుడ్,నో ఫోన్, చిమ్మ చీకటి, భయంకర శబ్దాలు : కట్ చేస్తే!
అడవుల్లో తప్పిపోయి నాలుగురోజుల పాటు తిండీ తిప్పలు లేకుండా ఒంటరిగా గడిపింది. ఎటు చూసినా భయంకరమైన శబ్దాలతో తీవ్ర భయభ్రాంతులకు లోనైంది. మరోవైపు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. చివరికి క్షేమంగా బయటపడిన వైనం విశేషంగా నిలిచింది. అసలేం జరిగింది?కేరళలోని కోజికోడ్‌కు చెందిన జి.ఎస్. శరణ్య (36), కొచ్చిలోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం 8 గంటలకు 12 మంది సభ్యుల బృందంతో కలిసి ట్రెకింగ్ బయలుదేరారు. కొండపైకి చేరి, కిందకు దిగుతుండగా, మిగిలినవారితో పోలిస్తే వేగంగా నడిచి ముందుకు వెళ్లింది. ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు, వారు ఒక బండరాయిపై కూర్చుని కనిపించారు. వస్తారులే అని అక్కడే కూచ్చుంది. మళ్ళీ వెనక్కి తిరిగి చూసేసరికి, వారు ఎక్కడా కనిపించలేదు. పిట్‌స్టాప్‌కు చేరుకుని ఇతర ట్రెక్కర్ల కోసం వెతికింది. అలా శరణ్య ఆ అడవుల్లో దారి తప్పిపోయింది. ఇదీ చదవండి: 5 నెలల్లో మూడోది : మెరైన్ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణంహోమ్ స్టే యజమానికి ఫోన్ చేసి తాను దారి తప్పానని, అధికారులకు తెలియజేయమని సమాచారం ఇచ్చింది. నేను తప్పిపోయిన అన్న మెసేజ్ స్నేహితులికిచ్చేలోపే ఫోన్ స్విచాఫ్ అయిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న శరణ్య, ఒక వాగు పక్కన ఉన్న పెద్ద రాయిపై కూర్చుని తనను ఎవరైనా రక్షిస్తారా అని ఎదురు చూస్తూ గడిపింది. ట్రెకింగ్ వెళ్లినందువల్ల వెంట పెద్దగా ఆహారం కూడా ఏమీ తీసుకెళ్లలేదు. కేవలం అర లీటర్ వాటర్ బాటిల్ మాత్రమే ఉంది. ఇక తప్పని పరిస్థితుల్లో ఆకలిని తట్టుకునేందుకు వాగులోని నీటినే రోజుకు 3 లీటర్ల చొప్పున తాగుతూ కాలం గడిపింది.చుట్టూ చీకటి, భయంకరమైన శబ్దాలుపైగాఅది వన్యప్రాణులు సంచరించే ప్రాంతం అది. ఏనుగులు తిరిగే ఆ ప్రాంతంలో రాత్రిపూట నాలుగు వైపుల నుంచీ వింత శబ్దాలు వినిపించినా, ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో నిలబడింది. చివరికి ఒక మారుమూల ప్రాంతంలో స్థానిక నివాసితులు ఆమెను గుర్తించారు. ఒక భావోద్వేగభరిత క్షణాలమధ్య తన ఇద్దరు మామయ్యలు, ఒక సోదరుడు , ఆఫీసు సహోద్యోగులను కలుసుకుంది. ఆదివారం నాడు ఆమె అడవి నుండి బయటకు రావడంతో రెస్క్యూ టీమ్, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఘటపై స్పందిస్తూ ఆశ్చర్యకరంగా తనకు పెద్దగా ఆకలి, భయం వేయలేదని తన అనుభవాన్ని శరణ్య గుర్తు చేసుకుంది. భవిష్యత్తులో కూడా తాను ట్రెకింగ్ కొనసాగిస్తానని ఆమె ధైర్యంగా చెప్పడం విశేషం -
ఈళవ ఓట్లే కీలకం
కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు తారస్థాయికి చేరింది. పాలక ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు పోటాపోటీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ కూడా ఈసారి రాష్ట్రంలో గట్టిగా ఉనికి చాటుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ఈళవ సామాజికవర్గం ఓట్లపై అన్ని పార్టీలూ కన్నేశాయి. ఆరు జిల్లాల్లో కనీసం 53 అసెంబ్లీ స్థానాల్లో వీరి ఓట్లు నిర్ణాయకంగా మారనున్నాయి. ఈళవల ప్రాబల్యం కేరళ జనాభాలో హిందువులు 54.73%. ముస్లింలు 26.56%, క్రైస్తవులు 18.38 శాతమున్నారు. హిందూ జనాభాలో ఈళవ సామాజికవర్గం అత్యధికంగా 21.60 శాతం ఉంది. తర్వాత నాయర్లు 14.9 శాతం, ఎస్సీలు 9 శాతం, ధీవర 3 శాతం, ఓబీసీ 3 శాతం, బ్రాహ్మణులు 2 శాతం, ఎస్టీలు ఒక శాతం చొప్పున ఉన్నారు. ట్రావెన్కోర్ ప్రాంతంలో ఈళవ సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంది. మొ త్తం 6 జిల్లాల్లో 53 అసెంబ్లీ స్థానాల్లో 40 శాతం నుంచి 70 శాతం దాకా ఈళవ వర్గం ఓటర్లే ఉన్నా రు! తిరువనంతపురం జిల్లా లో 14 స్థానాలు, కొల్లంలో 11, కొట్టాయంలో 9, అలప్పుజలో 9, పత్థనంతిట్టలో 5, ఇడుక్కిలో 5 స్థానాల్లో ఫలితాలను వీరే శాసిస్తున్నారు. ఓట్ల కోసం పాట్లు ఈళవ ఓట్ల కోసం పార్టీలన్నీ తలపడుతున్నాయి. కేరళలో అణగారిన వర్గాలకు జరిగిన చారిత్రక అన్యాయాలపై పోరాడింది తామేనని వామపక్షాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఒకప్పటి నంగేలి పోరాటాన్ని, చన్నార్ తిరుగుబాటును గుర్తు చేస్తున్నాయి. ఎన్సీఈఆర్టీ 9వ తరగతి చరిత్ర పుస్తకం నుంచి ట్రావెన్కోర్ కుల పోరాటాల అధ్యాయాన్ని తొలగించడం కేరళలో వివాదంగా మారింది. దీన్ని బీజేపీ కుట్రగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివరి్ణంచారు. ఆ పాఠాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా బోధించేలా చర్యలు తీసుకున్నారు. ఈళవ ఓటుబ్యాంకును కొల్లగొట్టేందుకు బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది.ఓటింగ్ సరళిలో మార్పులిలా కేరళ హిందూ ఓటర్లలో అత్యధికులు వామపక్ష కూటమి వైపే నిలుస్తున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ ఓటర్లలో 48% లెఫ్ట్‌కు మద్దతిచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటికి అది 50 శాతానికి పెరిగింది. 25% కాంగ్రెస్ వైపు నిలవగా 21% బీజేపీకి మద్దతిచ్చారు. అయితే కులాలవారీగా సమీకరణాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఈళవ వర్గం: 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 49 శాతం వామపక్షాలకు, 28 శాతం కాంగ్రెస్ కు, 18 శాతం బీజేపీకి ఓటు వేశారు. 2021 నాటికి ఇది లెఫ్ట్‌కు 53 శాతానికి, బీజేపీకి 23 శాతానికి పెరగ్గా కాంగ్రెస్‌కు 21 శాతానికి పడిపోయింది. నాయర్లు: 2016లో 45 శాతం లెఫ్ట్ కూటమికే ఓటేశారు. 2021 నాటికి ఇది 32 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌కు 2016లో 20 శాతం మంది ఓటేయగా 2021కల్లా 38 శాతానికి పెరిగింది. నాయర్లలో బీజేపీకి ఆదరణ 33 శాతం నుంచి 27 శాతానికి తగ్గింది. ఎస్సీలు: లెఫ్ట్‌కు కంచుకోటలా మారారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 51 శాతం ఎల్డీఎఫ్కు ఓటేయగా 2021 నాటికి అది ఏకంగా 69 శాతానికి పెరిగింది.శరత్చంద్ర ముక్తవరం -
అదృష్టం అంటే ఆమెదే.. చెత్తలో ‘టికెట్’కు రూ. కోటి!
అలప్పుజ: అదృష్టం తలుపు తట్టడమే కాదు.. ఒక్కోసారి చెత్తబుట్టలో నుంచి కూడా పలకరిస్తుందని కేరళకు చెందిన ఓ మహిళ విషయంలో నిరూపితమయ్యింది. తెలియక పారేసిన లాటరీ టికెట్ ఆమెను రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిని చేసింది. తృటిలో చేజారిన మహాభాగ్యం తిరిగి దక్కిన ఈ ఆసక్తికరమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.కేరళలోని అలప్పుజ జిల్లా తలవాడి పంచాయతీ పరిధిలోని ఎడతువా ప్రాంతానికి చెందిన కుంజమ్మ అనే మహిళ, అంబలప్పుజా-తిరువల్లా రాష్ట్ర రహదారి పక్కన ఒక చిన్న దుకాణాన్ని నడుపుకుంటూ తన జీవనం సాగిస్తున్నారు. రోజూవారీ వ్యాపారంతో పాటే ఆమె స్థానికంగా ఉండే జార్జ్‌కుట్టి అనే లాటరీ విక్రేత వద్ద రెండు ‘కారుణ్య’ లాటరీ టికెట్లను కొనుగోలు చేశారు. గురువారం నాడు లాటరీ ఫలితాలు వెలువడగా, కుంజమ్మ ఎంతో ఆసక్తిగా తన వద్ద ఉన్న లాటరీ నంబర్లను ఫలితాలతో సరిచూసుకున్నారు. అయితే తాను కొన్న రెండు టికెట్లలో ఒక దానికి మాత్రమే రూ. 5,000 కన్సోలేషన్ బహుమతి వచ్చినట్లు ఆమె గమనించారు. తనకు దక్కిన అదృష్టం అంతేనని సరిపెట్టుకున్న కుంజమ్మ, రెండో టికెట్‌కు ఎలాంటి బహుమతీ రాలేదని భావించి, దానిని తన దుకాణంలో ఉన్న చెత్తబుట్టలో పారేశారు.అయితే అసలు కథ అప్పుడే మొదలైంది. లాటరీ ఫలితాలను నిశితంగా గమనించిన కుంజమ్మ సోదరుడు ఆమెకు ఒక కళ్లు చెదిరే వార్తను చెప్పారు. పనికిరాదని ఆమె చెత్తలో పారేసిన ఆ రెండో టికెట్‌కే ఏకంగా రూ. ఒక కోటి మొదటి బహుమతి వరించిందన్నాడు. ఆ మాట విన్న వెంటనే కుంజమ్మకు ఒక్కసారిగా అవాక్కయ్యారు. చేతిదాకా వచ్చిన అదృష్టాన్ని తానే స్వయంగా చెత్తపాలు చేశానని గ్రహించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా, రాత్రికి రాత్రే తన సోదరుడిని వెంటబెట్టుకుని ఆమె తిరిగి తన దుకాణానికి పరుగులు తీశారు. ఇద్దరూ కలిసి ఆ చెత్తబుట్టలో వెతకడం ప్రారంభించారు. కాసేపటి తర్వాత వారి నిరీక్షణ ఫలించింది. చెత్తలో పారేసిన ఆ కోటి రూపాయల లాటరీ టికెట్ ఎట్టకేలకు దొరికింది. అది చూసి ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన స్థానికుంగా సంచలనంగా మారింది.ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచం.. మూడు సరికొత్త సంచలనాలు -
దేవుని సొమ్ముకే ఎసరు.. ఆలయాల్లో బంగారం మాయం!
తిరువనంతపురం: శబరిమల తరహాలోనే కేరళలోని పలు ప్రసిద్ధ దేవాలయాల్లో స్వామివారి ఆభరణాలు కనుమరుగవుతున్నాయి. తాజాగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెలుగులోకి వచ్చిన నిజాలు భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. సరైన పర్యవేక్షణ, రికార్డుల నిర్వహణ లేకపోవడంతో గుడిలోని దేవుని సొమ్ముకే రక్షణ లేకుండా పోయింది.కొచ్చికి చెందిన ఆర్టీఐ కార్యకర్త కె. గోవిందన్ నంబూతిరి దాఖలు చేసిన దరఖాస్తుకు.. కొచ్చిన్ దేవస్వం బోర్డు పరిధిలోని త్రిస్సూర్ గ్రూప్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఇచ్చిన సమాధానాలతో ఈ విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. గతంలో శబరిమల ఆలయంలో వెలుగుచూసిన ఆరోపణల మాదిరిగానే.. ఇప్పుడు త్రివేండ్రంలోని శ్రీవరాహం ఆలయం, కొచ్చిన్ దేవస్వం బోర్డు పరిధిలోని పుల్లు భగవతి ఆలయం, త్రిపుణితుర పూర్ణత్రయీశన్ ఆలయాల నుంచి స్వామివారి బంగారం మాయమైనట్లు అధికారికంగా నిర్ధారణ అయింది.ఏ గుడిలో ఎంత మాయమైందంటే..పుల్లు భగవతి ఆలయం: కొచ్చిన్ దేవస్వం బోర్డు త్రిస్సూర్ గ్రూప్ కిందకు వచ్చే ఈ గుడిలో ఏకంగా 40.50 గ్రాముల బరువున్న ఏడు బంగారు గొలుసులు అదృశ్యమయ్యాయి.శ్రీవరాహం ఆలయం: ఇక్కడ 7.750 గ్రాముల బరువున్న రెండు పురాతన బంగారు గొలుసులు కనిపించలేదు. త్రిపుణితుర పూర్ణత్రయీశన్ ఆలయం: ఈ ప్రసిద్ధ ఆలయంలో స్వామివారి కిరీటం నుంచి 663 మిల్లీగ్రాముల బంగారం మాయమైంది.నిర్వహణలో డొల్లతనంపలు దేవస్వం బోర్డు ఆలయాల్లో స్వామివారి ఆభరణాలకు (తిరువాభరణం) సంబంధించి కనీస రిజిస్టర్లను కూడా సరిగ్గా నిర్వహించడం లేదని ఈ ఆర్టీఐ నివేదిక ద్వారా వెల్లడయ్యింది. అధికారుల బాధ్యతారాహిత్యానికి, నిల్వల ట్రాకింగ్‌లో ఉన్న లోపాలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. కాగా శబరిమల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ‘స్వదేశ్ దర్శన్’ పథకం కింద మంజూరు చేసిన నిధుల వినియోగంపై కూడా నంబూతిరి కీలక వివరాలు వెల్లడించారు. ఆర్టీఐ పత్రాల ప్రకారం.. కేంద్రం రూ.46.53 కోట్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు కేవలం రూ.36.27 కోట్లు మాత్రమే వినియోగించినట్లు తెలుస్తోంది.ఇది కూడా చదవండి: పాక్‌లో ‘పెట్రో’ మంట: ప్రధాని మాస్టర్ ప్లాన్ ఇదే! -
మైనార్టీలపై దాడిచేసిన వారితో దోస్తీనా!
అలప్పుజ/ఇడుక్కి/కొచ్చి: మణిపూర్, ఛత్తీస్‌గఢ్‌ల లో మైనార్టీలపై దారుణ దాడులకు తెగబడిన బీజేపీతో కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ కూటమి అంటకాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపణల నిప్పులు కురిపించారు. కేరళ శాసనసభ ఎన్నికల సందర్భంగా శనివారం అలప్పుజ, ఇడుక్కి, ఇర్నా కులం జిల్లాలోని కట్టప్పణ, ఫోర్ట్ కొచ్చి, కున్నథునాడ్ల లో ప్రచార ర్యాలీల్లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు కేరళ నర్సులపై దాడులు జరిగా యి. మణిపూర్‌లో చర్చిలను తగలబెట్టారు. ఇలాంటి హే యదాడులకు పాల్పడుతు న్న (బీజేపీ) వాళ్లతో సీఎం విజయన్ చెలిమి చేస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కు లపై దాడిచేసే వాళ్లతో సీఎం రహస్య పొత్తు పెట్టుకున్నా రు. వామపక్ష సిద్ధాంతాలు ఒంటబట్టించుకుని కూడా సీఎం ఎలా ఇలాంటి వాళ్లతో జతకడతారు? ఆయన కు కనీసం సిగ్గు అన్పించట్లేదా? దీనికి సీఎం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. తన కుమార్తె (వీణ)ను ఒక కేసు నుంచి కాపాడేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. కేంద్ర దర్యాప్తునకు, ప్రధాని మోదీకి సీఎం భయపడుతున్నారు’’ అని అన్నారు. కేరళలో వెలుగుచూసిన కొచ్చి మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్), ఎక్సోలాజిక్ సొల్యూషన్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని వీణపై కేసు నమోదవడం తెల్సిందే. ‘‘మన వామ పక్ష నేత(సీఎం) తన కుమార్తెను కాపాడుకునేందుకు మతవాద(బీజేపీ) పార్టీ పంచనచేరారు. తన పిల్లల కోసం సీఎం ప్రజలను గాలికొదిలేశారు. మతవాద పార్టీ ఎలా ఆడిస్తే సీఎం అలా ఆడుతు న్నారు’ అని రాహుల్ అన్నారు. ‘‘ఎల్డీఎఫ్ను అదృశ్య శక్తి నడిపిస్తోంది. ఆ అదృశ్య శక్తి ఒక మత శక్తి. అది భారతరాజ్యాంగాన్ని యథాతథంగా ఒప్పుకోదు. విడగొట్టడం, విద్వేషం రెచ్చగొట్టడం దాని ఏకైక లక్ష్యం. కేరళలో ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్, సీపీఐ(ఎం) బంధాన్ని స్పష్టంగా చూడొచ్చు’’ అని అన్నా రు. ‘‘అమెరికా అధ్యక్షుడి అనుమతి లేకుండా మోదీ సర్కార్ ఏ దేశం నుంచీ చము రు కొనలేని దుస్థితి దాపురించింది. ఏ దేశం నుంచి మనం చమురు, గ్యాస్ కొనాలో ట్రంపే నిర్ణయిస్తున్నారు’’ అని రాహుల్ ఆరోపించారు. ‘‘కేరళలో రైతులకు ఎల్డీఎఫ్ సర్కార్ నుంచి తోడ్పాటు కరువైంది. తేయాకు, రబ్బర్, యాలకుల సాగు తగ్గిపోయింది. రైతులు రుణాల ఊబిలో చిక్కుకుంటున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోంది. ఇడుక్కిలో వైద్యసంరక్షణ వ్యవస్థ నాశనమైంది. అందుకే అత్యవసర వైద్యం కోసం జనం కొట్టాయంకు వెళ్తున్నారు. ఇక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరికి ఉద్యోగం లేదు. మేం అధికారంలోకి వస్తే యూడీఎఫ్ కూటమి హామీలను నెరవేరుస్తుంది’’ అని రాహుల్ భరోసా ఇచ్చారు. -
ఓటింగ్‌పై గల్ఫ్ దెబ్బ!
కేరళలో ప్రతి ఎన్నికల్లోనూ ప్రవాస ఓటర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. వీరిలో అత్యధికులు గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డవారే. కన్నూర్ మొదలుకుని పాలక్కాడ్ దాకా కనీసం 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రవాసుల ఓట్లు నిర్ణాయకంగా మారుతుంటాయి. దాంతో ఎన్నికల వేళ పార్టీలన్నీ గల్ఫ్ ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి పెడతాయి. వారిని ఓటింగ్‌కు రప్పించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నిస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాల్లోని మలయాళీలు ఈసారి ఓటేసేందుకు వచ్చే అవకాశాలు పెద్దగా కన్పించడం లేదు. ఇది పార్టీల విజయావకా శాలను గణనీయంగా ప్రభావితం చేయడం ఖాయమని భావిస్తున్నారు.కేరళలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోనూ గల్ఫ్ ఓటర్లది కీలక పాత్రగా ఉంటూ వస్తోంది. ఆ దేశాల్లో 2.25 లక్షల మంది దాకా ఓటర్లున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వారిలో కనీసం 60 శాతం పైచిలుకు ఓటింగ్ నమోదవడం పరిపాటి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం దెబ్బతో ఈసారి మాత్రం పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. గల్ఫ్ నుంచి భారత్‌కు విమాన సర్వీసులు బాగా తగ్గిపోయాయి. దీనికి తోడు టికెట్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. రూ.8 వేల నుంచి 13 వేలలోపు ఉండే టికెట్లు ఏకంగా రూ.60 వేల దాకా ఎగబాకాయి! పైగా సెలవులు తీసుకుని వస్తే ఉద్యోగం ఊడే పరిస్థితి! దాంతో ఈసారి ఓటింగ్ కోసం వచ్చే మలయాళీల సంఖ్య బాగా తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. 10 శాతం ఓటింగ్ నమోదైనా గొప్పేనని భావిస్తున్నారు!మలబార్లో కీలకంఉత్తర కేరళ ప్రాంతంలో, ముఖ్యంగా మలబార్ ప్రాంతంలో ప్రవాసుల ఓట్లు కీలకంగా మారుతుంటాయి. ఇక్కడ వాటి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటమే గాక అతి స్వల్ప మెజారిటీలు నమోదవుతుండటమే ఇందుకు కారణం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పెరింతల్మన్న అసెంబ్లీ స్థానంలో కేవలం 38 ఓట్ల తేడాతో, కుట్టియాడిలో 333 ఓట్ల మెజారిటీతో ఫలితం తేలింది! తనూర్, త్రితల వంటి చోట్ల మెజారిటీ 5,000 ఓట్ల లోపే నమోదైంది. ఇలాంటి స్థానాల్లో ప్రవాసుల ఓట్లు వేలాదిగా ఉండటం విశేషం. కుట్టియాడి అసెంబ్లీ స్థానం పరిధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 16 వేల పైచిలుకు ప్రవాస ఓటర్లున్నారు!! నాదపురంలో 12,424 మంది, తిరూర్‌లో 8,601, కళ్లియసెరిలో 8,097 మంది ప్రవాస ఓటర్లున్నారు. స్వల్ప మెజారిటీలు నమోదయ్యే ఇలాంటి స్థానాల్లో ప్రవాసుల ఓట్లే నిర్ణాయకంగా ఉంటూ వస్తున్నాయి. కానీ ఈసారి వారు భారీ సంఖ్యలో స్వదేశానికి వచ్చి ఓటేసే పరిస్థితులు కన్పించకపోవడంతో పార్టీలు కూడా వారిపై ఆశలు వదులుకుంటున్నాయి. స్థానిక ఓట్లపైనే మరింతగా దృష్టి పెడుతూ గెలుపు వేటలో పడ్డాయి. గల్ఫ్ ఓటర్లపై గట్టి పట్టున్న విపక్ష యూడీఎఫ్ కూటమికి ఇది ఒకరకంగా ఎదురుదెబ్బేనని ఓవర్సీస్ ఇండియన్ కల్చరల్ కాంగ్రెస్ (ఓఐసీసీ) పశ్చిమాసియా కన్వీనర్ కె.టి.ఎ.మునీర్ అభిప్రాయపడ్డారు. ‘‘గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డ యూడీఎఫ్ కార్యకర్తల్లో 30 శాతం మంది, మద్దతుదారుల్లో 60 శాతం మంది ఈసారి ఓటింగ్‌కు రాలేకపోవచ్చు. విమాన టికెట్ల ధరలు నాలుగింతలు, అంతకుమించి పెరగడమే ఇందుకు ప్రధాన కారణం’’ అంటూ ఆయన వాపోయారు. వారు గల్ఫ్ నుంచే ఓటేసేలా ఇ–ఓటింగ్ సదుపాయం అందుబాటులో ఉంటే తమకెంతో కలిసొచ్చేదని అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కేరళలో ఎల్డీఎఫ్ ఇక ఇంటికే..
తిరువల్ల/తిరువనంతపురం: కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి కౌంట్‌డౌన్ మొదలైందని తేల్చిచెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తంచేశారు. శనివారం కేరళ రాష్ట్రం పథనంతిట్ట జిల్లాలోని తిరువల్లలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో వామపక్షాల పాలనకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసిందన్నారు. ఎల్డీఎఫ్ను ఓడించడమే ధ్యేయంగా బీజేపీ కార్యకర్తలు శ్రమిస్తున్నారని చెప్పారు. ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాలకు గాను ఆరు రాష్ట్రాలతోపాటు గోవాలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అద్భుతంగా అభివృద్ధి చేశామని తెలిపారు. అదే తరహాలో కేరళలోనూ అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రకటించారు. అవినీతి, మతతత్వమే అవరోధాలు కేరళలో ప్రగతికి ఎన్నెన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకంజలోనే ఉండిపోయిందని ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు కేరళను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారి కూడా అధికారంలోకి రాకపోయినప్పటికీ ఇక్కడి అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం అందిస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధుల కంటే ఐదు రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చామని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలతో ప్రధానంగా మహిళలే అత్యధికంగా లబ్ధి పొందారని వెల్లడించారు. కేరళలో ప్రగతికి అవినీతి, మతతత్వం అతిపెద్ద అవరోధాలుగా మారాయన్నారు. అవి తొలగిపోవాలంటే ఎల్డీఎఫ్ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీకి బీ–టీమ్ అంటూ ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లు సరస్పరం నిందలు వేసుకుంటున్నాయని చెప్పారు. నిజానికి కేరళలో ఎ–టీమ్ బీజేపీ మాత్రమేనని స్పష్టంచేశారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ల మధ్య రహస్య స్నేహం సాగుతోందన్నారు. అవి రెండు ఒకే నాణేనికి బొమ్మా బొరుసుల్లాంటివని విమర్శించారు. అందుకే ఆ రెండు పక్షాలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఎల్డీఎప్, యూడీఎఫ్‌ల అరాచకాలపై దర్యాప్తు జరిపిస్తామని, దోషులను శిక్షిస్తామని ప్రకటించారు. పశ్చిమాసియా యుద్ధంపై కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. వారి నోటిదురుసు వల్ల పశ్చిమాసియాలోని భారతీయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. రాజకీయాలు, ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయని అన్నారు. గల్ఫ్‌లో మన భారతీయుల సంక్షేమం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తిరువనంతపురంలో భారీ రోడ్ షో ప్రధాని మోదీ కేరళ రాజధాని తిరువనంతపురంలో శనివారం సాయంత్రం రోడ్ షోలో పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు. వీధులు కిక్కిరిసిపోయాయి. నగరం జనసంద్రాన్ని తలపించింది. మోదీ ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బీజేపీ అభ్యర్థులు పాలుపంచుకున్నారు. ఒకటిన్నర కిలోమీటర్ల మేర సాగిన మో దీ రోడ్ షో అంచనాలకు మించి విజయవంతం కావడంతో బీజేపీలో ఉత్సాహం నెలకొంది. -
కేరళలో హైడ్రామా.. శశిథరూర్ కాన్వాయ్ అడ్డగింత, దాడి
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో షాకింగ్ ఘటన వెలుగు చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న కొందరు దుండగులు ఆయన గన్‌మెన్‌పై దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల వేళ ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది.వివరాల మేరకు.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నాడు కేరళలోని మలప్పురం జిల్లాలో పర్యటించారు. అక్కడ ప్రచారం ముగిసిన తర్వాత వాండూర్‌లో జరగనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్తుండగా, తిరువల్లి చెల్లితోడు వంతెన సమీపంలో ఎంపీ కాన్వాయ్‌ని కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదానికి దిగారు. ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.భద్రతా సిబ్బంది ఫిర్యాదు ఆధారంగా వాండూర్ పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.కలికావుకు చెందిన ఉమ్మారా అనే నిందితుడిపై నాన్బెయిలాబుల్ కేసు నమోదైనట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. కాగా, కేరళలో ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.Malappuram, Keralam: A complaint has been filed alleging that the convoy of Congress MP Shashi Tharoor was blocked near Thiruvalli Chellithodu bridge while he was travelling to an election campaign event in Wandoor. The complaint claims that Tharoor’s gunman was assaulted… pic.twitter.com/CVqZ25TzbP— IANS (@ians_india) April 3, 2026 -
‘మెస్సీ బృందం మమ్మల్ని మోసం చేసింది’
అర్జెంటీనా ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ బృందం తమను మోసం చేసిందని కేరళ క్రీడామంత్రి అబ్దురహిమన్ ఆరోపించారు. కేరళలో పర్యటించి మ్యాచ్ ఆడేందుకు మెస్సీ, అర్జెంటీనా టీమ్‌కు స్పాన్సర్ల ద్వారా రూ. 250 కోట్లు ఇచ్చినట్టు చెప్పాడు. అయితే, డబ్బులు తీసుకొన్న తర్వాత హామీని నిలబెట్టుకోలేదన్నాడు. మరో ఐదు దేశాలను కూడా ఇలాగే మోసగించిన విషయం తమ విచారణలో తెలిసిందన్నాడు. ‘డబ్బు తీసుకొంటారు.. కానీ, ఆడటానికి రారు. అర్జెంటీనా జట్టుపై కేసు వేయాల్సిన పరిస్థితి. వారు తప్పకుండా నష్టపరిహారం చెల్లించాల’ని అబ్దురహిమన్ డిమాండ్ చేశాడు. గత డిసెంబర్లో మెస్సీ భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. కోల్‌కతా, హైదరాబాద్‌లో మెస్సీ బృందం ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడింది.కాగా ఈ ఏడాది జూన్ 11 నుంచి ఫిఫా ప్రపంచకప్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే ఫిఫా 48 జట్లతో కూడిన వివరాలను, మ్యాచ్‌లకు సంబంధించి పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. కాగా రెండురోజుల క్రితం ఫిఫా ప్రపంచకప్ కోసం అర్జెంటీనా ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతు న్న సంగతి తెలిసిందే. సొంతగడ్డపై జాంబియాతో ఆడిన మ్యాచ్ మెస్సీకి చివరిదనే ప్రచారం జరిగిన వేళ.. మైదానంలోనే మెస్సీ కంటతడి పెట్టిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.ఫిఫా ప్రపంచకప్‌కు ఇప్పటికే అర్హత సాధించిన అర్జెంటీనా గ్రూప్-జేలో ఉంది. ఇదే గ్రూప్‌లో ఉన్న అల్జీరియా, ఆస్ట్రియా, జోర్డాన్లతో అర్జెంటీనా మ్యాచ్‌లు ఆడనుంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు ఫిఫా ప్రపంచకప్‌కు అమెరికా, కెనడా, మెక్సికోలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.చదవండి: ‘ఎందుకంత ద్వేషం.. నేను ఆడడం ఇష్టం లేదా?’ -
రూ. 3 వేలకు పింఛను పెంపు
కోజికోడ్: కేరళ అసెంబ్లీ ఎన్నికలకుగాను అధికార ఎల్డీఎఫ్ మేనిఫెస్టోను సీఎం పినరయి విజయన్ గురువారం విడుదల చేశారు. సంపూర్ణ పేదరిక నిర్మూలన, పింఛను రూ.3 వేలకు పెంపు, ఉద్యోగావకాశాల పెంపు, పెట్టుబడులను ఆకర్షించడం..తదితర కీలక హామీలు ఇందులో ఉన్నాయి. సామాజిక న్యాయంతోకూడిన ఆర్థికాభివృద్ధి, రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ మేనిఫెస్టో ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం విజయన్ చెప్పారు. మేనిఫెస్టోలోని మొత్తం 950 ప్రతిపాదనలను ప్రజలందరికీ సులువుగా అర్థమయ్యేలా 60–సూత్రాల కార్యక్రమంగా సంక్షిప్తం చేశామన్నారు. ప్రజా సంక్షేమమే కేంద్రంగా అభివృద్ధి, పారిశ్రామిక విధానాలను రూపొందిస్తామ న్నారు. నెలవారీ సంక్షేమ పింఛను మొత్తాన్ని ప్రస్తుతమిస్తున్న రూ.1,600 నుంచి రూ.2 వేలకు పెంచనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాల కుట్రలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్, వామపక్షాలు మత ఛాందసవాద శక్తులతో చేతులు కలుపుతున్నాయని, సమాజాన్ని విభజించి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు సాగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గురువారం కేరళలో జరిగిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గాంధేయ సిద్ధాంతాన్ని వదిలేసిందని, మావోయిస్టు ముస్లిం లీగ్ కాంగ్రెస్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లు సొంత ఎజెండా కోసం సమాజంలో మనుషుల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు. అదే సమయంలో మన విశ్వాసాలను దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను కించపర్చాయని విమర్శించారు. అయ్యప్ప ఆలయ బంగారం విషయంలో ఆ రెండు కూటములు నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. సహకార బ్యాంకుల్లో ఉన్న ప్రజల కష్టార్జితాన్ని దురి్వనియోగం చేస్తున్నాయని ఆక్షేపించారు. దేశాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ మాత్రం దేశ ప్రతిష్టను దిగజార్చడమే పనిగా పెట్టుకుందన్నారు. విదేశాల్లోని పరిస్థితుల గురించి కాంగ్రెస్ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, దానివల్ల అక్కడ నివసిస్తున్న భారతీయులు ఇబ్బంది పడాల్సి వస్తోందని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. కేరళలో ఇప్పటిదాకా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువత బతుకులు బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని తేల్చిచెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లాలని, బీజేపీకి ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి సూచించారు. -
తెలంగాణే 'గ్యారంటీ'!
సాక్షి హైదరాబాద్: కేరళలో యూడీఎఫ్ గ్యారంటీల అమలు సాధ్యమా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారని.. దానికి సమాధానం తెలంగాణ రాష్ట్రమే అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. యూడీఎఫ్ మేనిఫెస్టోపై విమర్శలు చేసేవారు.. ఆ హామీలు తెలంగాణలో ఎలా అమలు అవుతున్నాయో వచ్చి చూడాలని, వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. విజయన్, ఆయన మంత్రులు కూడా ప్రత్యక్షంగా వచ్చి పరిశీలించుకోవచ్చని సవాల్ విసిరారు. గురువారం కొచ్చిలో ఐదు ఇందిరమ్మ గ్యారంటీలతో కూడిన యూడీఎఫ్ మేనిఫెస్టోను ఆవిష్కరించిన అనంతరం రేవంత్ మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, మొదటి కేబినెట్ సమావేశం నుంచే గ్యారంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నా మని ముఖ్యమంత్రి చెప్పారు. రుణమాఫీ, రైతు భరోసా, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం గురించి వివరించారు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ –2047 మేరకు తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిలపనున్నామని చెప్పారు. తమ రాష్ట్రం వృద్ధిరేటు 10.8%గా ఉందని, పన్నులు పెంచకుండానే అభివృద్ధి సాధ్య మని తాము నిరూపించామని రేవంత్ పేర్కొన్నారు. యూడీఎఫ్ స్వర్ణయుగ పాలన ఖాయం అవినీతి, కుటుంబ పాలన అంశంలో కేరళ సీఎం పినరయి విజయన్, మాజీ సీఎం కేసీఆర్‌ల మధ్య అనేక పోలికలు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కేరళలో పదేళ్లుగా విజయన్ ప్రభుత్వం కొనసాగుతుంటే 2014 నుంచి సుమారు పదేళ్లపాటు కేసీఆర్ తెలంగాణను పాలించారని చెప్పారు. కుటుంబ పాలన, అవినీతి, అసమర్థ పాలన విషయంలోనూ ఇద్దరి మధ్య పోలికలు ఉన్నా యన్నారు. దేశాన్ని, కేరళనూ మోదీ బ్రదర్స్ పాలిస్తున్నారని మోదీ.. విజయన్ను ఉద్దేశించి విమర్శించారు. దేవుడి సొంత రాష్ట్రంలో ఆయన ఆస్తికే రక్షణ లేకుండా పోయిందంటూ పరోక్షంగా శబరిమల బంగారం ఉదంతాన్ని ప్రస్తావించారు. వచ్చే ఎన్నికలతో కేరళలో విజయన్ పాలన ముగిసి యూడీఎఫ్ స్వర్ణ యుగ పాలన మొదలవుతుందని చెప్పారు. కార్యక్రమంలో కేరళ కాంగ్రెస్ నేతలతోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ పాల్గొన్నారు. -
ఇపుడా పని..క్యాబ్ బుక్ చేసినంత ఈజీ : ఆనంద్ మహీంద్ర ట్వీట్
పారిశ్రామిక వేత్త, మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర మరో ఆసక్తికర కథనాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. ఆధునిక కాలంలో పెరుగుతున్న టెక్నాలజీ, భారతీయులు దాన్ని వినియోగించుకుంటున్నతీరుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. అత్యంత సాంప్రదాయకమైన, స్థానిక సేవలను కూడా డిజిటలైజ్ చేస్తున్నామంటూ ఆనందాన్ని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఆయన షేర్ చేసిన వీడియో నెట్టింట సందడిగా మారింది. ఆనంద్ మహీంద్ర తన ట్వీట్లో ఏమన్నారంటే..క్యాబ్‌ని బుక్ చేసుకున్నంత సులభంగా ఇపుడు కేరళలో కొబ్బరి కాయలను తీసే వ్యక్తిని (Coconut Harvester) పిలిపించుకోవచ్చు. ఒక శిక్షణ పొందిన వృత్తినిపుణుడులా యూనిఫాం ధరించి, అవసరమైన పరికరాలతో సైకిల్‌పై వచ్చి తన పనిని పూర్తి చేసుకొని వెళ్లిపోతాడు. ఈ ఉదంతంలో తనను బాగా ఆకట్టుకున్న మరో విషయం ఏమిటంటే.. ఆ చెట్లు ఎక్కిన యువకుడు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవాడు అంటూ రాసుకొచ్చారు.అలాగే తన కరీర్ ప్రారంభం నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో గ్రూప్ స్టీల్ బిజినెస్‌లో పనిచేస్తున్నప్పుడు, ఫర్నేస్ , ఫౌండ్రీ షాపుల్లో పనిచేసే వాళ్లకోసం ఎదురు చూడాల్సి వచ్చేది. వీరిలో చాలా మంది తమ ఇళ్లకు దూరంగా వచ్చినవారే. ముఖ్యంగా వీరంతా బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి ఉపాధి వెతుక్కుంటూ వచ్చేవారు. <In Kerala, apparently you can now call a coconut harvester the same way you book a cab. A uniformed professional arrives on a cycle, equipped, trained, and ready to work.We often speak about India’s services economy in terms of IT exports or global capability centres. But… pic.twitter.com/3MvKRWxdHh— anand mahindra (@anandmahindra) April 2, 2026 భారతదేశ సేవా రంగాన్ని (Services Economy) గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సాధారణంగా ఐటీ ఎగుమతులు లేదా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల గురించే చర్చించుకుంటాం. కానీ ఇపుడు పరిస్థితి చాలా మారింది.కానీ మనం మన అత్యంత సాంప్రదాయ, అతి స్థానిక సేవలను కూడా డిజిటలైజ్ చేస్తున్నామన్నారు. గతంలో భారీ పరిశ్రమలలో మాత్రమే కనిపించిన ఈ ఆశలు, ఆకాంక్షలు.. నేడు సాంకేతికతతో కూడిన సరికొత్త సేవా రంగాలలో కూడా మార్గాలను వెతుక్కుంటున్నాయి మెరుగైన భవిష్యత్తు కోసం ప్రజలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలి వెళ్లడం, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మారడం, అభివృద్ధి చెందిన అనేది నిజంగా శక్తివంతమైన ఆర్థిక చోదక శక్తి మాత్రమే కాదు, ఇది దేశ సమగ్రతకు (Integration) కూడా ఒక గొప్ప బలం అని అభివర్ణించారు. ఆయా రాష్ట్రాలు ఈ వలస కార్మికులను సాదరంగా ఆహ్వానించినంత కాలం ఈ ప్రగతి ఇలాగే కొనసాగుతుంది! అన్నారు.ఇదీ చదవండి: లక్ష రూపాయలా? నా కొద్దు బాబూ : ఇంట్రస్టింగ్ స్టోరీ -
‘నిజాలు కక్కించే’.. మైండ్ బ్లోయింగ్ ఏఐ డివైజ్!
కాసరగోడ్: నేరస్తుల నుంచి నిజాలు రాబట్టేందుకు పోలీసులు ఇకపై ‘థర్డ్ డిగ్రీ’ ప్రయోగించాల్సిన అవసరం లేదు. నిందితుడు నిజం చెబుతున్నాడా లేక అబద్ధమా అనేది క్షణాల్లో తేల్చేసే ఒక అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరికరాన్ని కేరళ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘సస్పెక్ట్ ఎమోషనల్ మానిటరింగ్ సిస్టమ్’ (ఎస్‌ఈఎంఎస్) పేరుతో రూపొందించిన ఈ సాంకేతికత, నేర విచారణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.ఇది ఎలా పనిచేస్తుంది?ఈ వ్యవస్థలో నిందితుడి మణికట్టుకు ఒక బయోమెట్రిక్ బ్యాండ్‌ను అమరుస్తారు. విచారణ జరిపే అధికారి కెమెరా కలిగిన స్మార్ట్ గ్లాసెస్ ధరిస్తారు. ఈ సమయంలో నిందితుడి ముఖ కవళికలు, గొంతులో వచ్చే మార్పులు, హృదయ స్పందన రేటు, చర్మ ప్రతిచర్యలను బయోమెట్రిక్ బ్యాండ్ నిశితంగా పరిశీలిస్తుంది. బ్లూటూత్ ద్వారా కంప్యూటర్‌కు అనుసంధానమై ఉండే ఈ వ్యవస్థ, నిందితుడు అబద్ధం చెప్పే సమయంలో కలిగే అతిసూక్ష్మమైన శారీరక, మానసిక మార్పులను రియల్ టైమ్‌లో విశ్లేషించి, విచారణాధికారికి తెలియజేస్తుంది.ప్రత్యేకతలు ఇవే..మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఆధారంగా పనిచేసే ఈ ఎస్‌ఈఎంఎస్, ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) సాంకేతికతను కూడా ఉపయోగిస్తుంది. దీనివల్ల విచారణ అధికారికి నిందితుడి మానసిక స్థితికి సంబంధించిన హెచ్చరికలు నేరుగా లైవ్ వీడియో ఫీడ్‌లోనే కనిపిస్తాయి. సాధారణంగా లై డిటెక్టర్ లేదా నార్కో అనాలిసిస్ వంటి పరీక్షలకు కోర్టు లేదా నిందితుడి అనుమతి తప్పనిసరి. కానీ, ఎస్‌ఈఎంఎస్ విషయంలో చట్టపరమైన అనుమతులు లభిస్తే, అటువంటి నిబంధనల అవసరం ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు.రూపకర్తలు వీరే..జైన్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ మెబిన్ విల్సన్ థామస్, క్రైస్ట్ యూనివర్సిటీకి చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సంతోష్ కె. రాజన్, అమెజాన్ ఎగ్జిక్యూటివ్ అనలిస్ట్ అంజనా పి. నాయర్ సంయుక్తంగా ఈ పరికరాన్ని తయారు చేశారు. ఇప్పటికే దీనికి పేటెంట్ లభించడం విశేషం. ఈ అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తే, కేవలం మాటలతోనే నిజాలను బయటకు తీయవచ్చని, తద్వారా హింసాత్మక విచారణలకు స్వస్తి పలకవచ్చని పరిశోధకులు అంటున్నారు.ఇది కూడా చదవండి: ‘బెంగాల్ తీరు’పై ‘సుప్రీం’ తీవ్ర ఆగ్రహం -
డియర్ లీడర్స్.. ‘ఆమె’ కరుణిస్తేనే కుర్చీ!
ఒకప్పుడు ఓటు వేయడానికి ఇంటి నుంచి బయటకు రావడానికే సంకోచించిన మహిళలు, ఇప్పుడు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలకమైన ‘నిర్ణయాత్మక శక్తి’గా అవతరించారు. ఇప్పుడు ఏ పార్టీ గెలవాలన్నా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్నా మహిళల మద్దతు తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది.సైలెంట్ ఓటర్లు కాదు.. డిసైడింగ్ ఫ్యాక్టర్గత మూడు దశాబ్దాలుగా మహిళల రాజకీయ చైతన్యం ఊహించని రీతిలో పెరిగింది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు మహిళలు పురుషులతో సమానంగా, కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కేవలం ఓటు వేయడమే కాదు, తమ ఓటుతో గెలుపోటములను తలకిందులు చేస్తున్నారు. అందుకే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు, నేరుగా నగదు బదిలీ వంటి పథకాలన్నీ ఈ ‘మహిళా ఓటు బ్యాంకు’ను ఆకట్టుకోవడానికేనని స్పష్టమవుతోంది.రాష్ట్రాల వారీగా మహిళల సత్తా ఇదే..అస్సాం: ఇక్కడ పెను మార్పు కనిపిస్తోంది. 2011లో కాంగ్రెస్ వైపు ఉన్న మహిళలు, 2021 నాటికి బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. సంక్షేమ పథకాలు, స్థానిక అంశాలు మహిళల ఓటింగ్ సరళిని పూర్తిగా మార్చేశాయి.పశ్చిమ బెంగాల్: ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పట్టు బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న అనుబంధం, మహిళా కేంద్రీకృత పథకాల వల్ల మహిళా ఓటర్లలో దాదాపు సగం మంది ఇప్పటికీ ‘దీదీ’ వెంటే నడుస్తున్నారు.కేరళ: మలయాళ గడ్డపై రాజకీయ విధేయతలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ మహిళా ఓట్లు ప్రధాన కూటముల మధ్య దాదాపు సమానంగా చీలిపోయినా, ఓటర్లు తమ అభిప్రాయాలను అంత సులభంగా మార్చుకోవడం లేదు.తమిళనాడు: ఇక్కడ మహిళల తీరు విభిన్నం. వీరు ఏ ఒక్క పార్టీకి కట్టుబడి ఉండరు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరును బట్టి తమ మద్దతును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అధికార మార్పిడికి కారకులవుతున్నారు. మొత్తానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల ఫలితాలను శాసించేది మహిళలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెజారిటీ ఓట్లతో గెలుపు మార్జిన్‌ను నిర్ణయించేది కూడా వారే కావడం విశేషం. -
సురేష్ గోపి నిజంగా గెలవలేదా?
కేరళ గడ్డపై కాషాయ జెండా ఎగురవేసి, చరిత్ర సృష్టించిన సూపర్ స్టార్, కేంద్ర మంత్రి సురేష్ గోపీకి ఊహించని షాక్ తగిలింది. ఆయన ఎన్నికల విజయంపై విచారణ జరిపి తీరాల్సిందేనని కేరళ హైకోర్టు తేల్చిచెప్పింది. తనపై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేయాలంటూ సురేష్ గోపి పెట్టుకున్న అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది దీంతో సురేష్ గోపికి కేంద్ర మంత్రి పదవి ఉంటుందా? ఊడుతుందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ పరిణామం కేరళ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.ఏమిటా ఆరోపణలు? ఎందుకీ వివాదం?2024 లోక్‌సభ ఎన్నికల్లో త్రిసూర్ నియోజకవర్గం నుంచి సురేష్ గోపీ గెలుపొందారు. అయితే ఆయన తన ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు మతపరమైన చిహ్నాలను, దైవచింతనను అడ్డం పెట్టుకున్నారని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ (ఏఐవైఎఫ్) నేత బినోయ్ ఏఎస్ కోర్టును ఆశ్రయించారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో మతాన్ని ఉపయోగించడం తీవ్రమైన నేరం. ఈ ఆరోపణలే ఇప్పుడు సురేష్ గోపీ మెడకు చుట్టుకున్నాయి.హైకోర్టు ఏమంది? మంత్రికి చుక్కెదురు!బినోయ్ దాఖలు చేసిన పిటిషన్లో పస లేదని, దానిని విచారించకుండానే కొట్టివేయాలని సురేష్ గోపీ హైకోర్టులో వాదించారు. కానీ జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ ధర్మాసనం ఈ వాదనను అంగీకరించలేదు. పిటిషనర్ లేవనెత్తిన అంశాల్లో వాస్తవాలు ఉన్నాయని, పూర్తిస్థాయి విచారణ ద్వారానే దీనికి ముగింపు పలకాలని స్పష్టం చేస్తూ, కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సురేష్ గోపీ ఇప్పుడు బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.బీజేపీకి గుండెల్లో రైళ్లుకేరళలో గత 70 ఏళ్లుగా ఒక్క లోక్‌సభ సీటు కూడా గెలవలేకపోయిన బీజేపీకి.. సురేష్ గోపీ 74,686 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయాన్ని అందించారు. ఆ విజయంతోనే ఆయన మోదీ క్యాబినెట్లో పెట్రోలియం, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఒకవేళ కోర్టు విచారణలో ఆయన దోషిగా తేలితే, ఆ విజయం రద్దు కావడమే కాకుండా, రాబోయే ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు పడే ప్రమాదం కూడా ఉంది.రాజకీయంగా ఇబ్బందికర పరిణామంకేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై ఇలాంటి విచారణ జరగడం రాజకీయంగా బీజేపీకి, సురేష్ గోపీకి పెద్ద తలనెప్పిగా మారింది. కోర్టు తదుపరి విచారణలో ఎలాంటి సాక్ష్యాధారాలు బయటకు వస్తాయోనని కేరళలోని వామపక్ష, కాంగ్రెస్ కూటములు ఆసక్తిగా గమనిస్తున్నాయి. కేరళలో బీజేపీ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్న ప్రత్యర్థులకు ఈ తీర్పు ఒక ఆయుధంగా మారింది.సురేష్ గోపీ తదుపరి అడుగు ఎటు?హైకోర్టు నిర్ణయంతో సురేష్ గోపీ ముందు ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి హైకోర్టులో విచారణను ఎదుర్కోవడం, రెండు ఈ ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడం. అయితే హైకోర్టు ఘాటుగా స్పందించిన తీరు చూస్తుంటే ఆయనకు ఇప్పట్లో ఊరట లభించేలా కనిపించడం లేదు. సినీ గ్లామర్‌తో రాజకీయాలను శాసించిన ఈ ‘మాస్ హీరో’కి, ఈ లీగల్ బ్యాటిల్ ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది.ఇది కూడా చదవండి: ఇండోనేషియా: 7.4 తీవ్రతతో భారీ భూకంపం -
త్రివేండ్రం కమ్యూనిస్టు, ఢిల్లీ కమ్యూనలిస్టు
సాక్షి, హైదరాబాద్: కేరళలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీ కమ్యూనలిస్టు ప్రధాని నరేంద్ర మోదీ, తివేండ్రం కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఓడగొడితేనే కేరళకు మంచి రోజులు వస్తాయన్నారు. మోదీ–విజయన్లవి విభిన్న భావజాలాలైనా, భావాలొక్కటేనని, ఎల్డీఎఫ్– బీజేపీ మధ్య ఒప్పందాలు ఉన్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న రేవంత్ రెడ్డి కేరళలో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. త్రివేండ్రం, నేమం, భరతన్నూర్, అలెప్పీ, కాయకుళం నియోజకవర్గాల్లో రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ కేరళ సీఎం పినరయి విజయన్ను ప్రధాని మోదీతో పోల్చారు. ప్రధాని మోదీకి, కేరళ సీఎం విజయన్‌కు తేడా ఏమీ లేదని, విజయన్ ద్వారా కేరళ భవిష్యత్తును అపహరించాలని మోదీ చూస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగానే బీజేపీ ఓటు బ్యాంకు విజయన్‌కు బదిలీ అయ్యేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్లను కేరళలోకి రానీయకుండా లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్ మాత్రమేనని అన్నా రు. కేరళ ప్రజలు బీజేపీ, ఎల్డీఎఫ్కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎవరినైనా బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐతో వేధిస్తుందని, విజయన్సర్కారుపై ఈగ కూడా వాలనీయదని ఆరోపించారు. కేరళ సమగ్రాభివృద్ధి యూడీఎఫ్ లక్ష్యమన్నారు. మలయాళంలో పలకరింపు గత పన్నెండేళ్లుగా ఢిల్లీలో... పదేళ్లుగా కేరళలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయని సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మోదీ, కేరళలో విజయన్ డబుల్ ఫెయిల్యూర్‌గా నిలిచారని ధ్వజమెత్తారు. ఇరువురి సిద్ధాంతాలు వేరైనా వైఫల్యాలు మాత్రం ఒకేలా ఉన్నాయని మండిపడ్డారు. నిరుద్యోగంతో ఇక్కడి యువత ఇబ్బంది పడుతోందని, అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. సోనియా గాంధీ దత్తత తీసుకున్న తెలంగాణ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని.. కేరళ కూడా అలానే ముందుకు వెళ్లాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. కేరళ అభివృద్ధికి రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తారని, వారిద్దరూ కేరళ కుటుంబ సభ్యుల్లా మారారని తెలిపారు. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ఓ సినిమాలో చెప్పిన ’నీ పో మోనే.. దినేశా..’ తరహాలో ’నీ పో మోనే విజయన్, యువర్ టైమ్ ఈజ్ ఓవర్’ (విజయన్ నీ సమయం అయిపోయింది.. వెళ్లిపో) అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. రేవంత్ మలయాళంలో పలకరించడంతో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. రాత్రికి ఎర్నాకులంలో బస చేసిన రేవంత్ గురువారం కూడా కేరళ ప్రచారంలో పాల్గొననున్నారు. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా రేవంత్‌తో కలిసి రోడ్‌షోలకు హాజరయ్యారు. కూనంనేని ఆక్షేపణ కేరళ సీఎం, మార్క్సిస్టు నేత పినరయి విజయన్ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉన్న సీపీఐ తప్పుపట్టింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విధానాలపై రేవంత్ విమర్శలు చేయొచ్చు కానీ, వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరైంది కాదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆక్షేపించారు. మోదీని విమర్శించవచ్చు కానీ, విజయన్ను మోదీతో పోల్చడం కూడా సరైంది కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న ఇండియా కూటమిలో వామపక్షాలు కూడా కీలక భాగస్వాములనే విషయాన్ని రేవంత్ గుర్తు పెట్టుకోవాలని కూనంనేని వ్యాఖ్యానించారు. -
తొమ్మిది పదుల వయసులో స్కూల్‌కి..! ఏకంగా 98% మార్కులు ..
తొమ్మిది పదుల వయసులో చదవాలనుకోవడమే ఓ గొప్ప. అలాంటిది ఏకంగా పాఠశాలకు వెళ్లి చదవుకోవడమే గాక, పరీక్షల్లో రికార్డు స్థాయి మార్కులతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. నడు వండిపోయి, కనికనిపించని కళ్లతో చదవాలనే ఆమె ఆసక్తి అందర్నీ అమితంగా ఆకర్షించింది. ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి వయసు ఎన్నటికి అడ్డంకి కాదని ఈ బామ్మ తన విజయంతో నిరూపించింది. ఆ బామ్మే కేరళకు చెందిన కార్త్యాయని అమ్మ. కేరళలోని అలప్పుజ జిల్లాలోని చెప్పాడ్ గ్రామంలో 1922లో జన్మించారు. తన తరంలోని చాలామంది అమ్మాయిలులాగే చదువు అనేది ఆమెకు అంత ప్రాధాన్యం లేనిదిగా ఉంది. ఆమెకు ఆ సమయంలో కనీసం ప్రాథమిక విద్యను చదువుకునే అవకాశం కూడా లేదు. పేదరికం, కుటుంబ బాధ్యతలు, ఆమెను చిన్న వయసులోనే బడికి దూరం చేశాయి. తరగతి గదులకు బదులుగా ఆమె బాల్యం పనితో నిండిపోయింది. చివరికి ఆమెకు పెళ్లై, ఆరుగురు పిల్లలను పెంచింది. ఏళ్ల తరబడి ఇంటి పనిమనిషిగా వీధి ఊడ్చే పనిచేస్తూ శారీరక శ్రమోత కూడిన పనులతో కుటుంబాన్ని పోషించుకునేది. ఆమెకు చదవడం, రాయడం ఇతరులకు తెలిసిన నైపుణ్యాలుగా మిగిలిపోయాయి. దశాబ్దాలుగా ఆమె జీవితం అలానే గడిచిపోయింది. అయితే ఆమె కథ అక్కడితో ఆగిపోలేదు. తొంభై ఏళ్ల వయసులో అనూహ్యమైన మలుపు తీసుకుంది. మళ్లీ చదువుపైకి ధ్యాస..ఆమెను చదువుపైకి ఆసక్తి కలిగించే క్షణం ఆమె కూతురు కారణంగానే వచ్చింది. ఆమె కూతురు 60 ఏళ్ల వయసులో అక్షరాస్యత తరగతిలో చేరి పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణత సాధించినప్పుడు ఈ బామ్మలో గొప్ప చైతన్యం వచ్చింది. నా కూతురే చేయగలిగినప్పుడు తను ఎందుకు చేయకూడదు అనుకుంది. అంతే అనుకున్నదే తడువుగా 96 ఏళ్ల వయసులో కార్తాయని అమ్మ కేరళ రాష్ట్ర అక్షరాస్యత మిషన్ అథారిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న కేరళ అక్షరలక్ష్యం అక్షరాస్యత కార్యక్రమంలో చేరారు. పాఠశాల విద్యను కోల్పోయిన పెద్దలకు చదవడం, రాయడం ప్రాథమిక గణితం నేర్పించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇక్కడ కార్త్యాయని అమ్మ చదువుకి అండగా మనవళ్లు, మునిమనవళ్లు నిలిచారు. వారు అక్షరాలు, పదాలు, అంకెలు నేర్చుకోవడంలో సహాయపడ్డారు. కొన్నిసార్లు ఇంట్లోనే మరికొన్ని సార్లు సాయంత్రం పూట మసక వెలుతురులో పాఠాలు జరిగేవి. నెమ్మదిగా ఆమెకు అక్షరమాల అర్థమవ్వడం మొదలైంది. ఆ తర్వాత బామ్మ 2018లో కేరళ వ్యాప్తంగా 40,000 మందికి పైగా అభ్యర్థులతో కలిసి అక్షరాస్యత పరీక్ష రాశారు. వారిలో ఆమెనే అత్యంత వయసు పైబడిన అభ్యర్థి. ఆ పరీక్ష మొత్తం రీడింగ్, రైటింగ్, గణితం ఇలా మూడిటిపై జరిగింది. ఎందో ఆసక్తిగా ఎదురుచూసిన ఫలితాలు వెలువడ్డాయి. ఆ తొంభై ఏళ్ల వృద్ధురాలు ఆ పరీక్షలో నూటికి 98 మార్కులు సాధించి మొత్తంలో కార్యక్రమంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో ఒకరిగా నిలిచింది. ఆమె రీడింగ్, గణితం రెండింటిలోనూ పూర్తి స్కోరు సాధించగా, రీడింగ్ దాదాపు వంద శాతం మార్కులు సాధించింది. ఆ బామ్మ విజయం స్థానికంగానే కాకుండా రాష్ట్రవ్యాపతంగా గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. మీడియా ఆ బామ్మను గొప్ప అక్షరాస్యత ఉద్యమానికి గౌరవనీయమైన "ఆదర్శప్రాయమైన అమ్మమ్మ"గా కీర్తించాయి. అంతేగాదు అధికారులు ఆమె విజయాలను ప్రశంసా పత్రాలతో సత్కరించడానికి ముందుకు రావడం విశేషం. 96 ఏళ్ల ఈ బామ్మ కథ వేలాదిమందికి, యువతకు స్ఫూర్తిగా నిలిచింది. ఆమె విజయానికి ఎంత గుర్తింపు లభించిందంటే..2019లో విద్యను ప్రోత్సహించే అంతర్జాతీయ సంస్థ అయిన కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపకయ్యేలా చేసింది. ఇక ఈ బామ్మ 2023 అక్టోబర్‌లో 101 ఏళ్ల వయసులో మరణించారు. ఆమెకు చదువుకోవాలన్న కోరిక ఉన్న దశాబ్దాలు సాధ్యం కాలేదు. దొరకిన అవకాశాన్ని ఈ వయసులోనా అనే సంశయానికి తావివ్వకుండా వినియోగించుకోవడం విశేషం. అలాగే అందర్నీ ఆశ్చర్యపరిచేలా రాణించి..మరణాంతరం కూడా ఆమె విజయం గుర్తుండిపోయేలా ప్రేరణగా నిలిచింది కార్త్యాయని. (చదవండి: పిల్లలను అలా పెంచాలి..! న్యూరో సెంటిస్ట్ పేరెంటింగ్ టిప్స్) -
యువ నటికి ప్రముఖ డైరెక్టర్ లైంగిక వేధింపులు..!
ప్రముఖ మలయాళ దర్శకుడు, నిర్మాత రంజిత్ బాలకృష్ణన్ అరెస్టు అయ్యారు. ఒక యువ నటి ఇచ్చిన ఫిర్యాదుతో కొచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇడుక్కిలో రంజిత్ బాలకృష్ణన్‌ను అదుపులోకి తీసుకుని.. అనంతరం కొచ్చి పోలీసులకు అప్పగించారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆయనను అరెస్ట్ చేశారు.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఒక సినిమా సెట్లో లైంగిక వేధింపులకు పాల్పడినట్లు యువ నటి ఫిర్యాదులో పేర్కొంది. సినిమా చిత్రీకరణ సమయంలో రంజిత్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని నటి తన ఫిర్యాదులో ఆరోపించింది. అయితే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లడానికి ముందే.. బాధితురాలు సినిమా నిర్మాణ సంస్థలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ICC)కి అధికారికంగా కంప్లైంట్ చేశారు. కమిటీ విచారణ అనంతరం ఈ కేసును కేరళ పోలీసులకు అప్పగించింది. అయితే నటి వివరాలు గోప్యంగా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.గతంలోనూ రంజిత్‌పై ఆరోపణలు..కాగా.. గతంలో బెంగాలీ నటి శ్రీలేఖ మిత్ర చేసిన వేధింపుల ఆరోపణల నేపథ్యంలో.. 2024లో రంజిత్ కేరళ చలనచిత్ర అకాడమీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత ఆయన తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. తనపై కావాలనే కొందరు టార్గెట్‌గా ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా మరో నటి ఫిర్యాదుతో ఆయనను అరెస్ట్ చేయడంతో ఈ టాపిక్ మలయాళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. -
విచిత్ర వివాదం.. హైకోర్టుకు ’ఎన్డీఏ అంజలి’
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం క్లైమాక్స్‌కు చేరుకుంటున్న వేళ ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. త్రిపుణితుర నియోజకవర్గం నుండి ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రముఖ నటి అంజలి నాయర్ తన పేరు విషయంలో కేరళ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాలెట్ పేపర్, ఈవీఎంలలో తన పేరును మార్చాలని ఆమె కోరుతున్నారు.అసలు సమస్య ఏమిటి?ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం.. అభ్యర్థుల జాబితాలో ఆమె పేరు ప్రస్తుతం ‘అంజలి పీవీ’వి. అని ఉంది. అయితే ఓటర్లకు ఆమె ‘అంజలి నాయర్’ గానే సుపరిచితురాలు. ఒకవేళ ఈవీఎంపై అంజలి పీవీ అని ఉంటే, సామాన్య ఓటర్లు గుర్తుపట్టలేరని, ఇది తన గెలుపు అవకాశాలపై, ఓట్ల శాతంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కోర్టులో వాదనలుతన ప్రచార సామాగ్రి, పోస్టర్లు, సోషల్ మీడియా పబ్లిసిటీ అంతా ‘అంజలి నాయర్’ అనే పేరుతోనే జరిగిందని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. నామినేషన్ పత్రాల్లో ఉన్న పేరుకు, ప్రచారంలో ఉన్న పేరుకు మధ్య వ్యత్యాసం ఉంటే ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని అంజలి నాయర్ కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కేరళ హైకోర్టు.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.సాంకేతిక ఇబ్బందులుఅయితే ఈ దశలో పేరు మార్పు చేయడం ఎన్నికల సంఘానికి పెను సవాలుగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే కేరళలో ఇప్పటికే కొన్ని విభాగాల్లో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. వృద్ధులు, వికలాంగుల కోసం ఇంటి వద్ద నుంచే ఓటు వేసే విధానం ఇప్పటికే ప్రారంభం కాగా, సర్వీస్ ఓటింగ్ కూడా త్వరలో మొదలుకానుంది. నామినేషన్ పత్రాల్లో ఉన్న పేరునే సాధారణంగా బ్యాలెట్ పేపర్‌పై ముద్రిస్తారు కాబట్టి, ఇప్పుడు మార్పులు చేయడం ఎంతవరకు సాధ్యమనేది ఉత్కంఠగా మారింది.ఇది కూడా చదవండి: కెనడా గ్యాంగ్‌వార్‌లో పంజాబ్ యువకుడి హత్య -
కేరళ ఎన్నికలు.. ఈసీ సరికొత్త ప్రయోగం
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషన్ సరికొత్త ప్రయోగం చేపట్టింది. పేరు ఓట్ స్వీటెన్డ్ కేరళ క్యాంపెన్. ఇందులో భాగంగా మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకునే వారికి హల్వా ప్యాకెట్లు అందజేశారు. ఇందుకుగాను, ప్రతి జిల్లాకు 200 చొప్పున హల్వా ప్యాకెట్లను అందజేస్తారు.ఏఏ బూత్‌లలో వీటిని ఫస్ట్ టైం ఓటర్లకు అందజేయాల్సిందీ జిల్లా ఎన్నికల అధికారులు నిర్ణయించి, ఆ మేరకు ఆయా బూత్‌లకు పంపిణీ చేయనున్నారు. కొత్త ఓటర్లకు ఉత్సాహం కలిగించడమే ఈ క్యాంపెయిన్ ఉద్దేశమని ఈసీ తెలిపింది. కాగా, కేరళ అసెంబ్లీ ఎన్నికల సమరం అంతకంతకూ రసవత్తరంగా మారుతోంది. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమైన ‘స్టార్ క్యాంపెయినర్ల’ జాబితాను ఆయా పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాయి. -
బీజేపీ ఎల్డీఎఫ్ రహస్య దోస్తీ
పథనంతిట్ట/కొట్టాయం: కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కూటమితో బీజేపీ రహస్య దోస్తీ కొనసాగిస్తోందని, రెండూ కలిసి పనిచేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాహుల్ ఆదూర్ పట్టణంలో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ‘‘మనం ఎన్నికల్లో ఒక్క కూటమిని మాత్రమే ఎదుర్కొంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఎల్డీఎఫ్ కూటమితో బీజేపీ లోపాయికారీ ఒప్పందం చేసుకుంది. అందుకే శబరిమల అంశంపై మోదీ ఏమీ మాట్లాడటం లేదు. దేశంలో ఎక్కడికెళ్లినా మతం, ఆలయాల ప్రస్తావన తెచ్చే మోదీ.. కేరళలో మాత్రం ఎందుకు శబరిమల అంశంపై మౌనం దాల్చారు?. ఎన్నికల ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటేనే మోదీ మతపరమైన అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారు. లేదంటే వాటి ఊసెత్తరు’’అని రాహుల్ వ్యాఖ్యానించారు. ‘‘దేశవ్యాప్తంగా తమకు గిట్టని పారీ్టలు, నేతలపై ఈడీని ఉసిగొల్పే మోదీ సర్కార్ కేరళలో మాత్రం ఎల్డీఎఫ్ కూటమి పారీ్టలు, నేతలను ఎందుకు వదిలేసింది? అదే నాపై అయితే డజన్లకొద్దీ కేసులు మోపి విచారణ పేరిట దర్యాప్తు సంస్థల కార్యాలయాల చుట్టూ తిప్పుతోంది. నాపై 36 కేసులు పెట్టారు. ఏకధాటిగా 55 గంటలపాటు విచారించారు. ఇలాంటి కఠిన చర్యలు కేరళ ముఖ్యమంత్రి లేదా ఎల్డీఎఫ్ నేతలపై ఎందుకు తీసుకోవట్లేదు?’’అని మోదీ ప్రభుత్వాన్ని రాహుల్ నిలదీశారు. ‘‘ఒక ప్రఖ్యాత ఆర్థికవేత్త చెప్పినట్లు మార్కెట్లో ఒక అదృశ్యశక్తి ఉందంటే అది మాత్రమే ఆర్థికవ్యవస్థను నడిపిస్తుందని అర్థం. అలాగే కేరళ ఎన్నికల్లో అదృశ్యశక్తి దాగి ఉంది. అదే బీజేపీ. దేశంలో బీజేపీని ఎదుర్కొనే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది. అందుకే కేరళలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా బీజేపీ కుటిలయత్నాలు చేస్తోంది. పాలక్కడ్‌లో మోదీ ఆదివారం మాట్లాడారుగానీ కీలక అంశాలను వదిలేశారు. అయ్యప్ప ఆలయంలో వామపక్ష నేతల చోరీని మోదీ మాటవరసకైనా ప్రస్తావించలేదు’’అని రాహుల్ అన్నారు. ఆర్ఎస్ఎస్కు మాత్రమే నిధులు అందాలేమో.. యూడీఎఫ్ కూటమి అభ్యర్థి చాందీ ఊమెన్‌కు మద్దతుగా రాహుల్ సోమవారం పథుప్పల్లి నియోజకవర్గంలో ప్రచారంచేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు సైకిల్ తొక్కి అక్కడి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా కేంద్రం తీసుకొచ్చిన విదేశీ విరాళాల(నియంత్రణ)చట్టం సవరణ బిల్లుపై రాహుల్ అభ్యంతరం వ్యక్తంచేశారు.‘‘హఠాత్తుగా ఎఫ్సీఆర్ఏ చట్టం తెచ్చారు. ఇందులో గమ్మత్తైన విషయమేంటంటే విదేశాల నుంచి ఇకపై కేవలం ఒక సంస్థ మాత్రమే విరాళాలు పొందే ఆస్కారముంది. అదే ఆర్ఎస్ఎస్. గౌతమ్ అదానీ ద్వారా విదేశీపెట్టుబడిదారులను మోదీ శాసిస్తున్నారు. మరోవైపు ప్రతిపాదిత ఎఫ్సీఆర్ఏ నిబంధనలతో ఆర్ఎస్ఎస్ మాత్రమే లబ్ధిపొందనుంది’’అని రాహుల్ వ్యాఖ్యానించారు. -
రైతులకు అండగా ‘టాప్కో’
చిన్న, సన్నకారు రైతులను కూడగట్టి పంచాయతీ స్థాయిలో వారికి అవసరమైన అన్ని రకాల సేవలు అందించటంలో తిరునెల్లి అగ్రి ప్రొడ్యూసర్ కంపెనీ (టాప్కో) ఆదర్శప్రాయమైన కృషి చేస్తోంది. కేరళలోని వాయనాడ్ జిల్లా తిరునెల్లి పంచాయతీలో 9 ఏళ్ల క్రితం 51 మంది రైతుల భాగస్వామ్యంతో ప్రారంభమైన ఈ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ ప్రకృతి వ్యవసాయ శిక్షణ, దేశీ వరి వంగడాల పరిరక్షణ, రైతులు పండించిన ప్రతి గింజనూ సమంజసమైన ధరకు కొనుగోలు చెయ్యటం కీలకపాత్ర పోషిస్తోంది. దేశీ వరి, కూరగాయ విత్తనాలను సుమారు 5 వేల మంది రైతులకు అందిస్తోంది. కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తోడ్పాటుతో ప్రతి మంగళవారం గ్రామస్థాయిలో వాతావరణ సంబంధమైన సూచనలు, సలహాలను అందించటం విశేషం.గ్రామ స్థాయిలో వాతావరణ సూచనలు: వరి, కాఫీ, మిరియాలు, దుంప పంటలు, కూరగాయలు.. ఈ ఐదు రకాల పంటలకు సంబంధించి పంచాయతీలోని 8 కొండ ప్రాంత గ్రామాల్లో ప్రతి 5 కిలోమీటర్లను ఒక యూనిట్‌గా తీసుకొని వాతావరణ సూచనలు ఇందిస్తోంది. భారత వాతావరణ శాఖ జిల్లా స్థాయి వాతావరణ సూచనలతో సరిపెట్టుకుంటూ ఉన్నందున తాము గ్రామ స్థాయి సూచనలు అందించటం రైతులకు ఉపయుక్తంగా ఉంటున్నదని టాప్కో సీఈవో, సేంద్రియ రైతు రమేశ్ కృష్ణన్ చెప్పారు. మైసూరులో ఇటీవల జరిగిన ఆషా కిసాన్ స్వరాజ్ సమ్మేళనంలో ఆయన ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. అనూహ్యంగా మారుతున్న వాతావరణ పరిస్థితులపై పంచాయతీ స్థాయిలో పరిశోధనలు చెయ్యటం, గమనించిన మార్పులను, వాటిని తట్టుకునేందుకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజెయ్యటం ద్వారా టాప్కో సత్ఫలితాలు సాధిస్తోంది. తిరునెల్లి పంచాయతీ కూడా ఏమీ వెనుకబడి లేదు. ఈ ఏడాది నుంచి ప్రతి వార్డులో ఉష్ణోగ్రత, గాలిలో తేమ, వర్షం తదితర వాతావరణ సమాచారాన్ని హ్యూమెస్ ట్రస్టు తోడ్పాటుతో ప్రతి రోజూ ఉదయం 8 గంటలకు పంచాయతీ ప్రజలకు అందిస్తోందన్నారు. ఉత్పత్తి వ్యయాన్ని బట్టి ధర: తమ సంస్థ సభ్యులైన రైతులు ఏమేమి పంటలు, ఎంత విస్తీర్ణంలో పండించాలన్నది ప్రతి ఏటా ఖరీఫ్‌కు ముందు క్రాప్ కేలండర్‌ను రూపొందించుకుంటున్నామని రమేశ్ కృష్ణన్ వివరించారు. ముఖ్యంగా అంతరించిపోతున్న సంప్రదాయ వరి వంగడాలను గుర్తించి, మార్కెట్ అవసరాల మేరకు సాగు చేయిస్తున్నామన్నారు. పూర్వం నుంచి వరి సాగు చేస్తున్న భూములను ఇతర అవసరాలకు మళ్లించకుండా రైతులకు నచ్చజెప్పటంతో పాటు సేంద్రియ సేద్యానికి, మార్కెటింగ్ సదుపాయం ద్వారా మంచి ఆదాయం రైతులకు అందించటానికి కృషి చేస్తున్నామన్నారు. ఏ రకం దేశీ వరి దాన్యం సగటున ఎకరానికి ధిగుబడి ఎంతో ఆ ఉత్పత్తి వ్యయాన్ని బట్టి సీజన్‌కు ముందుగానే రైతు నుంచి కొనుగోలు చేసే ధరను టాప్కో నిర్ణయించటం మరో విశిష్టత. ఎక్కువ దిగుబడి వచ్చే వంగడం ధాన్యం ధర తక్కువగా ఉంటుంది. తక్కువ దిగుబడి వచ్చే రకం ధర ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. ఎకరానికి 2 టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే రెడ్ రైస్ ధాన్యానికి కిలో రూ. 34, తక్కువ దిగుబడినిచ్చే రకానికి రూ.130 చెల్లిస్తున్నారు.వయనాడ్ తొండి, పాల్ తొండి, చెంతడి, వలై చెన్నెల్లు, నవార, గంధకశాల, జీరకశల, ముల్లంకైమ తదితర రకాల దేశీ వరి రకాల బియ్యం, పిండి, రవ్వ, అటుకులను టాప్కో ప్రత్యేక దుకాణంలో విక్రయిస్తున్నారు. స్థానిక వాతావరణానికి పూర్వకాలం నుంచి అనువుగా ఉండే పాత పంటలను పరిరక్షించుకోవటం, రసాయనాలు వాడకుండా ఆరోగ్యదాయక మైన ఆహారాన్ని ప్రజలకు అందించటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, ఈ పనులను రైతులకు గిట్టుబాటయ్యేలా చెయ్యటంలో తమ ఎఫ్పీసీ విజయం సాధిస్తోందని రమేశ్ కృష్ణన్ సంతోషంగా చెప్పారు. -
కేరళ వార్: సిల్వర్ స్క్రీన్ టు అసెంబ్లీ
దేశంలో అటు సినిమా, ఇటు రాజకీయం.. ఈ రెండూ నాణేనికి రెండు పార్శ్వాల వంటివని అంటుంటారు. వెండితెరపై వెలిగిన తారలు ప్రజాక్షేత్రంలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం దశాబ్దాలుగా కొనసాగుతోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. మాలీవుడ్ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి, తమదైన ముద్ర వేసిన ఐదుగురు ప్రముఖ దర్శకులు, నటుల ప్రస్థానం ఇలా..రాము కారియాట్: ట్రెండ్ సెట్టర్మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన వారిలో దిగ్గజ దర్శకులు రాము కారియాట్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ‘నీలకుయిల్’ (1954) తదితర గొప్ప చిత్రాలతో గుర్తింపు పొందిన ఆయన, జాతీయ అవార్డు గెలుచుకున్న 'చెమ్మీన్' (1967) సినిమాతో మరో చరిత్ర సృష్టించారు. కేరళలో సినిమా రంగానికి చెందిన వ్యక్తులు ఎన్నికల బరిలోకి దిగే సంప్రదాయాన్ని ఆయనే మొదలుపెట్టారు. 1965లో త్రిసూర్ జిల్లాలోని నాటిక నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఘనవిజయం సాధించారు. అయితే, ఆ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.ఇన్నోసెంట్: హాస్య చక్రవర్తి నుంచి పార్లమెంటు వరకు..ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో వందలాది చిత్రాల్లో నటించిన ఇన్నోసెంట్ వరీద్ తెక్కెతల.. తన కామెడీ టైమింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో మంచి అవకాశాలు ఉన్న దశలోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో చలకుడి నియోజకవర్గం నుంచి ఎల్డిఎఫ్ (ఎల్డీఎఫ్)మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఒక హాస్య నటుడిగా కేరళ ప్రజల హృదయాల్లో నిలిచిన ఆయన, పార్లమెంటు సభ్యుడిగానూ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.సురేష్ గోపి: కేరళలో బీజేపీ సత్తామలయాళ స్టార్ హీరో సురేష్ గోపి ప్రస్తుతం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘మణిచిత్రతాజు’ (1993) వంటి అద్భుతమైన చిత్రాల్లో నటించిన ఆయన, 2016లో అధికారికంగా బీజేపీలో చేరారు. 2019 సాధారణ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లోనూ పరాజయం ఎదురైనా ఆయన వెనకడుగు వేయలేదు. చివరకు 2024 లోక్‌సభ ఎన్నికల్లో అదే త్రిసూర్ నుంచి ఘనవిజయం సాధించి, కేరళ నుంచి బీజేపీ తరపున గెలిచిన తొలి ఎంపీగా చరిత్ర సృష్టించారు.గణేష్ కుమార్: రాజకీయ వారసుడునటుడు కేబీ గణేష్ కుమార్ అటు సినిమా, ఇటు రాజకీయం రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. సీనియర్ నాయకుడు ఆర్. బాలకృష్ణ పిళ్ళై కుమారుడైన గణేష్ కుమార్.. 2023 నుంచి కేరళ రవాణా శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. ‘మణిచిత్రతాజు’, ‘కమిషనర్’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన ఆయన, రాజకీయాల్లోనూ తన తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని కీలక నేతగా ఎదిగారు.రమేష్ పిషారోడి: 2026 బరిలో కొత్త ఆశప్రముఖ నటుడు, కమెడియన్ రమేష్ పిషారోడి ఇప్పుడు 2026 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పాలక్కాడ్ నియోజకవర్గం నుంచి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాహుల్ మామ్ కూటతిల్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, కాంగ్రెస్ అధిష్టానం పిషారోడిని బరిలోకి దించింది. రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోవాలని ఆయన సిద్ధమవుతున్నారు.కేరళ రాజకీయ ముఖచిత్రంలో సినీ సెలబ్రిటీల పాత్ర ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. 1965లో రాము కారియాట్ వేసిన పునాది నుంచి నేడు రమేష్ పిషారోడి వరకు ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఏప్రిల్ 9న జరగబోయే ఎన్నికల్లో మలయాళీ ఓటర్లు మరోసారి వెండితెర తారలకు పట్టం కడతారో లేదో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: Bengal Politics: ‘కురుక్షేత్రం’లో ‘ద్రౌపది’ గర్జన.. -
డెవర్లే... రైతులుగా...
కేరళ కోజికోడ్‌లోని ఆటోడ్రైవర్లకు ఇంట్లో భోజనం చేసే అవకాశం లేకపోవడంతో రెస్టారెంట్లలో తినేవారు. ఖర్చు కళ్లు తిరిగేలా ఉండేది. ఇలా అయితే కుదరదనుకొని డ్రైవర్లందరూ కలిసి ఒక చోట సొంతంగా వంటలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ ప్రయోగం సూపర్ హిట్ అయింది.డబ్బు ఆదాతోపాటు ఆరోగ్యం కూడా!ఇప్పుడు ఈ డ్రైవర్లు సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులుగా మారి మరోసారి సంతోషాన్ని సొంతం చేసుకున్నారు. భూస్వామి కోలకట్టిల్ బీజు దగ్గర భూమి లీజు తీసుకొని రైతుగా తొలి అడుగు వేశారు. ‘డ్రైవింగ్ చేసినంత సులభం కాదు... వ్యవసాయం అంటే’.... ఇలాంటి వెక్కిరింపులు ఎన్నో వినిపించినా వారు వెనక్కి తగ్గలేదు.తమ జీవనోపాధిని పణంగా పెట్టి బీడు నేలలోకి పాదం మోపారు.తెల్లవారుజామున తొలి వెలుగుతోనే పొలం పనులకు శ్రీకారం చుట్టేవారు. ఆ తరువాత డ్రైవర్‌గా రోడ్డు మీదికి వెళతారు. మళ్లీ సాయంత్రం ఇష్టంగా పొలంలోకి వస్తారు. రోజంతా ట్రాఫిక్ పొగల మధ్య ఉండే వారికి పచ్చటి పొలాల మధ్య ఉండడం ఇష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే...డ్రైవర్‌గా ఉన్నప్పుడు తప్ప మిగిలిన సమయమంతా పొలంలోనే ఉంటారు. తమ రెక్కల కష్టంతో పాలకూర, పప్పుధాన్యాలు, బెండకాయ, గుమ్మడికాయ, దోసకాయ వంటి పలు రకాల పంటలతో పచ్చని కూరగాయల తోటను సృష్టించారు. పంట సాగు చేయడానికి అవసరమైన డబ్బులను తామే సమకూర్చుకున్నారు. అత్యున్నత శ్రేణి విత్తనాలు, సహజ ఎరువులతో పంట పండించారు. అకాల వర్షాలు కురిసినప్పటికీ వారి కష్టానికి ప్రతిఫలం దక్కింది. చేనులో కోసిన కూరగాయలను ఇంటి అవసరాలకు ఉపయోగించడంతోపాటు, మార్కెట్ ధరకు వాటిని అమ్ముకున్నారు. ‘డ్రైవర్‌గా మాకు లైసెన్స్ ఉంది. ఇక రైతుగా మా లైసెన్స్... మేము పడే కష్టం’ అంటున్నాడు చంద్రశేఖరన్. ‘రోజంతా హారన్లు మోగించే మేము మొక్కలకు నీరు పోయడం పని కాదు. ప్రశాంతత’ అంటున్నాడు అబ్దుల్ రహీం. ‘జాతీయ రహదారిపై దొరకని విలువైన నిశ్శబ్దం ఇక్కడ దొరుకుతుంది’ అంటున్నాడు మహేష్ అనే రైతు. తాజా విషయానికి వస్తే... ఈ డ్రైవర్ రైతులు పెద్ద పంటలపై దృష్టి పెట్టారు. భవిష్యత్ కాలంలో వారు పూర్తిస్థాయి రైతులుగా మారినా ఆశ్చర్యం లేదు! ‘డ్రైవింగ్ చేసినంత సులభం కాదు... వ్యవసాయం అంటే’.... ఇలాంటి వెక్కిరింపులు ఎన్నో వినిపించినా వారు వెనక్కి తగ్గలేదు. -
భారత ఫుట్‌బాల్ జట్టుకు అవమానం!
భారత ఫుట్‌బాల్ జట్టుకు అవమానం ఎదురైంది. సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించని కారణంగా ఆటగాళ్లతో పాటు కోచ్‌ను స్టేడియంలోకి అనుమతించలేదు. ఏఎఫ్సీ ఆసియా కప్ క్వాలిఫయర్ టోర్నీలో భాగంగా మార్చి 31న కొచ్చిలోని జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలో హాంకాంగ్‌తో భారత జట్టు మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశానికి కోచ్ ఖలీద్ జమీల్, ఆటగాళ్లు అషిక్ కురియన్, సహల్ అబ్దుల్, బిజోయ్ వర్గీస్ స్టేడియానికి వచ్చారు. కానీ గ్రేటర్ కొచ్చిన్ డెవలప్మెంట్ అథారిటీకి కేరళ ఫుట్‌బాల్ సంఘం సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించకపోవడంతో ఆటగాళ్లను, కోచ్‌ను లోపలికి వెళ్లకుండా అధికారులు అడ్డుకున్నారు. అయితే మీడియా సమావేశానికి ముందు ఇలాంటి ఘటన జరగడం తమను ఆశ్చర్యానికి గురి చేసిందని కోచ్ ఖలీద్ జమీల్ తెలిపాడు. అయితే దశాబ్ద కాలంలో కొచ్చిలో భారత ఫుట్‌బాల్ జట్టు మ్యాచ్ ఆడనుండడం ఇదే తొలిసారి. అయితే కోచ్, ఆటగాళ్లను అడ్డుకోవడంపై కేరళ ఫుట్‌బాల్ అసోసియేషన్ (కేఏఎఫ్) అధ్యక్షుడు నవాస్ మీరన్ స్పందించాడు. ‘ఆసియా కప్ క్వాలిఫయర్ ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. సమాచార లోపం వల్ల ఈ సమస్య ఏర్పడింది. దీనిని త్వరలోనే పరిష్కరిస్తాం’ అని చెప్పుకొచ్చాడు. అయితే నివేదికల ప్రకారం స్టేడియంలో మ్యాచ్ ఆడేందుకు గ్రేటర్ కొచ్చి డెవలప్మెంట్ అథారిటీ తమకు రూ. 20 నుంచి 25 లక్షలు చెల్లించడంతో పాటు రూ. 3 లక్షలు అద్దె కూడా చెల్లించాలని డిమాండ్ చేసింది. అయితే చెల్లింపులకు కేఎఫ్ఏ సమయం కోరినప్పటికీ, విషయం తెలియని జీసీడీఏ సిబ్బంది కోచ్, ఆటగాళ్లను అడ్డుకున్నట్లు తెలిసింది. గతేడాది ఫిబ్రవరిలో చెల్లింపు వివాదం కారణంగా ఇండియన్ సూపర్‌లీగ్ (ఐఎస్ఎల్)లోనూ కేరళ బ్లాస్టర్స్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.చదవండి: PSL 2026: తొలిరోజే అనూహ్య పరిణామం! -
ఓట్లలో ముందంజ సీట్లలో వెనకంజ
తిరువనంతపురం: ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం అంటూ మహిళాభ్యున్నతి కోసం ఊదరగొట్టే రాజకీయ పార్టీలు తీరా సీట్ల కేటాయింపు దగ్గరికి వచ్చేసరికి ముఖం చాటేస్తున్నాయి. ఇందుకు కేరళ రాజకీయాలూ మినహాయింపు కాదని తేటతెల్లమైంది. గత నెల 21వ తేదీన కేరళ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. దీని ప్రకారం కేరళ ఓటర్లలో 1,32,20,811 మంది పురుషులు ఉంటే వాళ్లకంటే ఎక్కువగా 1,39,21,868 మంది మహిళలు ఉన్నారు. నారీ శక్తి వందన్ అధినియమ్ చట్టం ద్వారా శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఓపక్క ప్రకటించినా క్షేత్రస్థాయికి వచ్చేసరికి ఆ మాటలన్నీ నీటిలో ఉప్పు మూటలేనని రాజకీయ పార్టీలన్నీ మూకుమ్మడిగా తేల్చిచెప్పాయి. త్వరలో జరగబోయే కేరళ శాసనసభ ఎన్నికల్లో 140 స్థానాలకుగాను అన్ని ప్రధానపార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించాయి. వీటిలో చాలా తక్కువ స్థానాల్లో మాత్రమే మహిళా అభ్యర్థులను నిలబెట్టారు. మిగతా పార్టీలతో పోలిస్తే బీజేపీ అత్యధికంగా 14 చోట్ల మహిళా అభ్యర్థులను రంగంలోకి దింపింది. సీపీఐ(ఎం) 12 చోట్ల, కాంగ్రెస్ 9 చోట్ల, సీపీఐ ఐదు చోట్ల మహిళలకు సీట్లు ఇచ్చింది. మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తేగానీ మహిళలకు కోటాపై ఆలోచించేదిలేదని రాజకీయపార్టీల ఆలోచనగా ఉందని తాజా కేటాయింపులతో తేలిపోయింది. అయితే విపక్ష యూడీఎఫ్ కూటమిలో భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళలకు సీట్లు ఇవ్వడం విశేషం. 1957లో కేరళ శాసనసభ ఆవిర్భవించింది. అప్పట్నుంచి గణాంకాలను పరిశీలిస్తే ఏ ఒక్క శాసనసభలోనూ మహిళా ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం కనీసం 10శాతానికి చేరుకోలేదు. పార్టీలు మహిళలకు సీట్లు ఇవ్వడానికి మొదట్నుంచీ విముఖత చూపుతున్నాయని ఏప్రిల్9న బరిలో దిగనున్న కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పీసీ విష్ణునాథ్ అన్నారు. ‘‘శక్తిసామర్థ్యాలున్న మహిళా నేతలు ఎలాంటి చట్టం, కోటా లేకుండానే సీటు సాధించి విజయతీరాలకు చేరగలరు. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ప్రతి పార్టీ.. గెలుపు గుర్రాలనే నమ్ముకుంటోంది. మహిళా అభ్యర్థి అని కాకుండా ఇతరత్రా అంశాలకు ప్రాధాన్యతనిచ్చి సీటు కేటాయింపుపై తుది నిర్ణయం తీసుకుంటున్నాయి’’అని అన్నారు.ప్రాధాన్యత పెరగాలి: ఐద్వా నాయకురాలు‘‘ఎల్డీఎఫ్ కూటమి మొత్తంగా 18 మంది మహిళలకు సీట్లు ఇచ్చింది. ఇది ఏమాత్రం సరిపోదు. మాకు సీట్లు పెరగాలని ప్రతిసారీ గట్టిగా చెబుతున్నాం. పార్టీలు హామీలు ఇస్తున్నాయి. తీరా అభ్యర్తుల తుది జాబితా బయటికొచ్చేసరికి పరిస్థితి తారుమారవుతోంది’’అని సీనియర్ సీపీఐ(ఎం) నాయకురాలు, ఆలిండియా డెమొక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్(ఐద్వా) జాతీయ కార్యదర్శి పీకే శ్రీమతి అసహనం వ్యక్తంచేశారు. ‘‘కేరళలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే మోదీ సర్కార్ హఠాత్తుగా మహిళా రిజర్వేషన్ చట్టంపై మాట్లాడుతోంది. దమ్ముంటే తక్షణం ఆ చట్టం అమల్లోకి తేవాలి’’అని ఆమె వ్యాఖ్యానించారు. కేరళలో ఏప్రిల్ 9వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు. -
Kerala: ప్రచార ఖర్చుతో 100 ఇళ్లు.. ఈ నేత రూటే వేరు!
పుదుపల్లి: కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం ఆ అభ్యర్థి ప్రచారం అందరినీ ఆకర్షిస్తోంది. ఆర్భాటాలు లేవు, భారీ కటౌట్లు అసలే లేవు. కేవలం ఒక సైకిల్, ఒంటిపై తండ్రి బొమ్మ ఉన్న టీషర్ట్.. ప్రజల ఆశీస్సులు కోరుతూ పుదుపల్లి నియోజకవర్గంలో చాందీ ఊమెన్ సాగిస్తున్న ఎన్నికల ప్రచారం అందరినీ ఆకట్టుకుంటోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ తనయుడు, ప్రస్తుత యూడీఎఫ్ అభ్యర్థి చాందీ ఊమెన్ తనదైన శైలిలో ‘గ్రీన్ క్యాంపెయిన్’కు శ్రీకారం చుట్టారు.హోరెత్తే ప్రచారానికి స్వస్తిసాధారణంగా ఎన్నికలంటే వీధివీధినా వెలిసే భారీ ఫ్లెక్సీలు, మైకులతో హోరెత్తే ప్రచార రథాలు గుర్తొస్తాయి. కానీ, పుదుపల్లిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల పోస్టర్లు గోడల నిండా కనిపిస్తున్నా, చాందీ ఊమెన్ మాత్రం ఎక్కడా ఒక్క బ్యానర్ కూడా కట్టకుండా ప్రచారం సాగిస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘పశ్చిమాసియాలో యుద్ధం, మానవీయ సంక్షోభం నెలకొన్న వేళ.. ప్రచారం కోసం అనవసరంగా లక్షల రూపాయలు ఖర్చు చేయడం నాకు ఇష్టం లేదు. అది సరైన సమయం కాదు’ అని స్పష్టం చేశారు. అంతేకాదు ప్రచారం కోసం ఖర్చు చేసే నిధులను నియోజకవర్గంలోని పేదల కోసం 100 ఇళ్లు నిర్మించడానికి ఉపయోగిస్తానని ఆయన ప్రకటించారు. ఇప్పటికే 50 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, ప్రచార ఆర్భాటాల కంటే పేదలకు గూడు కల్పించడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.రోజూ సైకిల్‌పై..ప్రతిరోజూ ఉదయం 6:30 గంటలకే తన హైబ్రిడ్ సైకిల్‌పై చాందీ ఊమెన్ ప్రయాణం మొదలవుతుంది. తన తండ్రి ఫోటో ఉన్న వైట్ టీషర్ట్ ధరించి, గ్రామీణ ప్రాంతాల్లోని ఇరుకు దారుల్లో సైకిల్ తొక్కుతూ ప్రతి ఇంటిలోని వారినీ ఆయన పలకరిస్తున్నారు. ‘గతంలో పాదయాత్ర చేశాను, కానీ సైకిల్ అయితే గంటకు 31 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను నేరుగా కలుసుకునే అవకాశం నాకు దక్కుతోంది’ అని ఆయన వివరించారు. దారి పొడవునా స్కూలు పిల్లలతో ముచ్చటిస్తూ, వృద్ధుల యోగక్షేమాలు అడుగుతూ, సెల్ఫీలు ఇస్తూ సాగుతున్న ఆయన యాత్రకు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు.తండ్రి వారసత్వంపుదుపల్లి అంటే ఊమెన్ చాందీకి పెట్టని కోట. 2023 ఉప ఎన్నికల్లో తన తండ్రి సాధించిన మెజారిటీ (9,000) కంటే ఎక్కువగా, దాదాపు 37,000 ఓట్ల మెజారిటీతో చాందీ ఊమెన్ విజయం సాధించారు. తన తండ్రి తనకు ఇచ్చిన అతిపెద్ద సలహా ‘ఎప్పుడూ ప్రజలతోనే ఉండు, ఎవరినీ నొప్పించకు’ అని ఆయన గుర్తు చేసుకున్నారు. కేరళ ప్రభుత్వం తన నియోజకవర్గంపై వివక్ష చూపుతోందని, తన తండ్రిపై ఉన్న రాజకీయ కక్షతోనే నిధులు విడుదల చేయడం లేదని ఆయన విమర్శించారు.తండ్రి అడుగుజాడల్లోనే..చాందీ ఊమెన్ ప్రచార శైలిపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆయన ఏమాత్రం అలసట లేకుండా గంటల తరబడి సైకిల్ తొక్కుతూ మమ్మల్ని పలకరిస్తున్నారు. ఆయన తండ్రి లాగే నిరాడంబరంగా ఉండటం మాకు సంతోషంగా ఉంది’ అని ఓటర్లు అంటున్నారు. ఆయన వెనుక అనుచరులు, భద్రతా సిబ్బంది వాహనాలు ఉన్నప్పటికీ, చాందీ ఊమెన్ మాత్రం సామాన్యునిలా సైకిల్‌పైనే ప్రజల్లో మమేకమవుతున్నారు. ఎండ తీవ్రత పెరగకముందే ఉదయం 8:30 గంటల వరకు ప్రచారం ముగించి, కొద్దిసేపు టిఫిన్ విరామం తీసుకుని తిరిగి తన తదుపరి షెడ్యూల్లో బిజీ అయిపోతున్నారీ యువ నేత.ఇది కూడా చదవండి: West Bengal: శ్రీరామ నవమి టెన్షన్.. అంతటా హై అలర్ట్ -
సీఎం ఇంటర్వ్యూకి రూ.11 లక్షలా?.. వివాదంలో హీరో మోహన్‌లాల్?
తిరువనంతపురం: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ల మధ్య సాగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కేరళ రాజకీయాల్లో రచ్చ చేస్తోంది. ‘కందుం మిండియుం ఇరువర్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ. 11.21 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించడం తీవ్ర చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ చర్చ అధికార పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టింది.ఆర్టీఐ ద్వారా వెలుగులోకి..తిరువల్లకు చెందిన రిజో వల్లంకుళం అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వేసిన దరఖాస్తుతో ఈ ఖర్చుల వివరాలు బయటపడ్డాయి. ఈ ఇంటర్వ్యూ కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 11,21,000 ఖర్చు చేసినట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ వెల్లడించింది.రెండు రోజుల షూటింగ్ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘క్లిఫ్ హౌస్’లో రెండు రోజుల పాటు ఈ ఇంటర్వ్యూ చిత్రీకరణ జరిగింది. ప్రముఖ సినీ దర్శకుడు టీకే రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం దీనిని తెరకెక్కించింది. పినరయి విజయన్ రాజకీయ ప్రస్థానం, ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలతో రూపొందిన ఈ ఇంటర్వ్యూ టీజర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో తిరువనంతపురంలో జరిగిన ఒక భేటీలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రతిపాదన చేయగా, మోహన్‌లాల్ వెంటనే అంగీకరించినట్లు సమాచారం.విపక్షాల ధ్వజంప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పినరయి విజయన్ తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. కాగా మోహన్‌లాల్ 2011 ఎన్నికల సమయంలోనూ అప్పటి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కూడా ఇలాగే ఇంటర్వ్యూ చేశారు. అయితేఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ వివాదాస్పద ఇంటర్వ్యూ కేరళ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ‘గ్రేట్ ఎస్కేప్’: ఏడు శునకాల వింత కథ.. నెట్టింట వైరల్! -
ఎన్నికల విధుల ఒత్తిడి.. నదిలో దూకిన ఉపాధ్యాయుడు
కాసరగోడ్: త్వరలో ఎన్నికలు జరగనున్న కేరళలో విషాదం చోటుచేసుకుంది. కాసరగోడ్‌లో ఎన్నికల విధుల ఒత్తిడిని తట్టుకోలేక ఒక ఉపాధ్యాయుడు నదిలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం రేపుతున్నాయి.అసలేం జరిగింది?మొగ్రాల్ పుత్తూరుకు చెందిన బి. మహమ్మద్ సవాద్ (32) చెర్కల సెంట్రల్ గవర్నమెంట్ హయ్యర్ సెకండరీ స్కూల్లో అరబిక్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఆయన కుడ్లు విలేజ్ పరిధిలో బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్ఓ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం మొగ్రాల్ వంతెన వద్ద సవాద్ స్కూటర్ కనిపించడంతో అనుమానం వచ్చిన స్థానికులు నదిలో గాలించారు. రెండు పడవల మధ్య అపస్మారక స్థితిలో పడి ఉన్న సవాద్ను గుర్తించి వెంటనే వారు కాసరగోడ్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన చికిత్స పొందుతూనే కన్నుమూశారు.పని ఒత్తిడే కారణమా?సవాద్ మృతికి మితిమీరిన పని ఒత్తిడే కారణమని ఆయన సహోద్యోగులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ పనులను మార్చి 21లోపు పూర్తి చేయాలని అధికారులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని వారు చెబుతున్నారు. ‘ఈద్ పండుగ దృష్ట్యా గడువు పెంచాలని ఆయన అధికారులను కోరారు, కానీ అందుకు నిరాకరించారు’ అని తోటి ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా ఆస్పత్రి వద్ద పలువురు ఆందోళనకు దిగారు.పోలీసుల వాదన వేరేలా ఉంది..మరోవైపు సవాద్ వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనా స్థలంలో ఒక సూసైడ్ నోట్ కూడా లభ్యమైందని వారు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్డీవో బిను జోసెఫ్, ఏఎస్పీ అచ్యుత్ అశోక్ రంగంలోకి దిగి, పూర్తిస్థాయి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. మహమ్మద్ సవాద్కు తండ్రి షఫీ, తల్లి ఫౌసియా, నలుగురు తోబుట్టువులు ఉన్నారు. ఎన్నికల వేళ ఒక అధికారి ఇలా మరణించడం జిల్లాలో విషాద ఛాయలు నింపింది.ఇది కూడా చదవండి: ‘మన గ్యాస్‌ని ఎవర్రా ఆపేది?’.. భారత్‌కు అమెరికా గ్యాస్! -
బుజ్జాయిని ఎత్తుకుని..
న్యూఢిల్లీ: నిత్యం ఎన్నో అధికారిక కార్యక్రమాలు, సమావేశాలు, చర్చలతో క్షణం తీరకలేకుండా గడిపే ప్రధాని మోదీని ఒక ప్రత్యేక అతిథి అన్ని పనులూ పక్కనబెట్టిమరీ అతనితోనే ఆడుకునేలా చేశాడు. అతనే కేరళకు చెందిన ఓమీ. సీనియర్ మలయాళీ నటుడు కృష్ణకుమార్ తన కుమార్తెలు అహానా, దియా (ఓజీ), ఇషానా, హన్సికలతో పాటు శుక్రవారం మోదీని కలిశారు. ఓజీ తన కుమారుడు ఓమీని సైతం వెంట తీసుకొచ్చారు. ఓమీని మోదీ చాలాసేపు ఎత్తుకుని ఆడిస్తూ గడిపారు. సదరు ఫొటో వైరల్‌గా మారింది. దాన్ని మోదీ తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేయగా ఏకంగా లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఓమీ తల్లి ఓజీ తన ఆనందాన్ని ఒక పోస్టులో పంచుకున్నారు. ‘‘ప్రధానితో గడిపిన ఆనందమయ క్షణాలను మర్చిపోం. మోదీజీకి మేమెప్పుడూ పెద్ద అభిమానులం’’ అన్నారు. ‘‘అంతటి నాయకుడు బేషజాల్లేకుండా మమ్మల్ని సాదరంగా ఆహా్వనించి ఆప్యాయంగా మాట్లాడారు. అత్యున్నతమైన నేత సమక్షంలో ఉన్నామని మర్చిపోయేలా చేశారు. ఈరోజు మాకెంతో ప్రత్యేకం’’ అని అహానా కూడా ఒక పోస్ట్ పెట్టారు. -
కూటముల కోలాటం
కేరళలో ఈ అసెంబ్లీ ఎన్నికలు అధికార వామపక్ష కూటమి ఎల్డీఎఫ్కు అగ్నిపరీక్షగా, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష యూడీఎఫ్‌కు అస్తిత్వ పరీక్షగా మారాయి. దేశంలో మిగిలిన తమ ఏకైక కంచు కోటను వామపక్షాలు ఏ మేరకు కాపాడు కోగలవన్నది ఆసక్తికరం. కేరళలో ఐదేళ్లకోసారి పారీ్టలను గద్దె దింపే 40 ఏళ్ల ఆనవాయితీని బద్దలు కొడుతూ ఎల్డీఎఫ్ ఇప్పటికే వరుసగా రెండుసార్లు గెలిచింది. సీఎం పినరయి విజయన్ సారథ్యంలో ఈసారీ విజయ బావుటా ఎగరేసి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా హ్యాట్రిక్ కొట్టాలని ఆశపడుతోంది. ఆ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడం, ఇటు యూడీఎఫ్ కూటమిని, అటు రాష్ట్రంలో శరవేగంగా విస్తరిస్తున్న బీజేపీని నిలువరించడం అధికార కూటమికి అగి్నపరీక్షే కానుంది.కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార ఎల్డీఎఫ్ తమ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించింది. సామాజిక భద్రత పెన్షన్ పథకం వంటివాటినే ప్రచారంలో ఎక్కువగా ప్రస్తావిస్తూ వస్తోంది. కానీ నిరుద్యోగం, ప్రజల్లో అసంతృప్తి, పదేళ్లుగా అధికారంలో ఉన్నందున ప్రభుత్వ వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దాంతో ప్రజల్లో సీఎం విజయన్‌కు ఉన్న ఆదరణపైనే గట్టిగా ఆశలు పెట్టుకుంది. విపక్ష యూడీఎఫ్ మరో రకం సవాళ్లకు ఎదురీదుతోంది. వరుసగా రెండుసార్లు అధికారానికి దూరంగా ఉండటంతో కాంగ్రెస్ కూటమి ఆర్థికంగా బాగా బలహీనపడింది. ఇది ప్రచారంపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఈసారీ నెగ్గని పక్షంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి. దాంతో యూడీఎఫ్ ఈసారి సర్వశక్తులూ ఒడ్డుతోంది. విజయన్ సర్కారు అవినీతిని ప్రధానాంశంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. నిరుద్యోగం తదితరాలనూ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతపైనా గట్టిగానే ఆశలు పెట్టుకుంది. అయితే నేతల కుమ్ములాటలు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారాయి. ఇక బీజేపీ కొన్నేళ్లుగా కేరళలో తన బలాన్ని, ప్రతి ఎన్నికల్లోనూ ఓట్ల శాతాన్ని క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. అధికార, విపక్ష కూటములకు మూడో ప్రత్యామ్నాయంగా ఎదుగుతోంది. ఎల్డీఎఫ్పై నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, యూడీఎఫ్ పక్షాల్లో అనైక్యతకు ప్రధాని మోదీ జనాకర్షణ శక్తి, హిందూత్వ కార్డు తోడై మెరుగైన ఫలితాలొస్తాయని బీజేపీ ఆశలు పెట్టుకుంది. బీజేపీ సానుకూలతలు → రాష్ట్రవ్యాప్తంగా బలపడుతున్న సంకేతాలు → 2016తో పోలిస్తే పెరిగిన ఓట్ల శాతం → మోదీ కరిష్మా, హిందూత్వ కార్డు → ‘డబుల్ ఇంజిన్ సర్కారు’ప్రచారం ప్రతికూలతలు → సానుకూలతను ఓట్లుగా మలచడంలో వైఫల్యం → రాష్ట్రంలో సమర్థమైన నాయకులు లేకపోవడం → కరడుగట్టిన హిందూత్వ ముద్రఎల్డీఎఫ్ సానుకూలతలు → బూత్ స్థాయి దాకా పటిష్ట నిర్మాణం → ప్రజల్లో సీఎం విజయన్‌కు ఉన్న ఆదరణ → సంక్షేమ పథకాలు → యూడీఎఫ్ కూటమి పక్షాల అనైక్యత ప్రతికూలతలు → ఉద్యోగ కల్పన హామీల అమల్లో వైఫల్యం → నానాటికీ పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత → ద్వితీయ శ్రేణిలో నాయకత్వ లేమి → శబరిమల వివాదాలతో అప్రతిష్టయూడీఎఫ్ సానుకూలతలు → సెంట్రల్ కేరళపై తిరుగులేని పట్టు → క్రైస్తవ, ముస్లిం మైనారిటీ ఓటర్ల దన్ను → తాజా స్థానిక ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన → ఎల్డీఎఫ్పై ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూలతలు→ కూటమి పార్టీల్లో పెచ్చరిల్లిన వర్గ పోరు → ఓమెన్ చాందీ తర్వాత ఆ తరహా మాస్ ఇమేజీ ఉన్న నాయకుడు లేకపోవడం → సీపీఎంతో పోలిస్తే బూత్ స్థాయిలో బలహీన నిర్మాణం → గత అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన → ఎల్డీఎఫ్ వ్యతిరేక ఓట్లను బీజేపీ చీల్చే ప్రమాదం – సాక్షి, నేషనల్ డెస్క్ -
అభ్యర్థులుగా నటీమణులు.. ఓటర్ లిస్టులో పేర్లు మాత్రం..
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల వేళ ఎర్నాకుళం జిల్లాలో ఎన్డీఏకు ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. ఎన్డీఏలోని ‘ట్వంటీ20’ అనే పార్టీకి ట్విస్ట్ ఎదురైంది. ట్వంటీ20 పార్టీ ప్రకటించిన ఇద్దరు అభ్యర్థుల పేర్లు ఓటర్ల జాబితాలో లేవు. దీంతో వారు పోటీకి అనర్హులు.పెరుంబవూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ‘ట్వంటీ20’ అభ్యర్థిగా నటి లక్ష్మీ ప్రియ పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఆమె ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే, లక్ష్మీ ప్రియ పేరు ఓటర్ల జాబితాలో లేదన్న విషయం బయటకు వచ్చింది. దీంతో తాజాగా నిర్వహించాలనుకున్న రోడ్‌షోను చివరి నిమిషంలో రద్దు చేశారు. మొదట రోడ్ షో రద్దు లక్ష్మీ ప్రియకు ఆరోగ్య సమస్యలే కారణమని, అందుకే ప్రచారంలో పాల్గొనలేదని అన్నారు. లక్ష్మీ ప్రియ పేరు ఓటర్ల జాబితాలో లేదన్న విషయం బయటకు రావడంతో దీనిపై ‘ట్వంటీ20’ పార్టీ సీనియర్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో ఆమె పేరు లేకపోవడం నిజమైతే పెరుంబవూర్‌లో మరో అభ్యర్థిని నిలబెట్టాల్సి రావచ్చని తెలిపారు. ఇవాళ లక్ష్మీ ప్రియ స్థానంలో జీబీ వర్గీస్ పతిక్కల్ను ట్వంటీ20 పార్టీ పెరుంబవూర్ అభ్యర్థిగా ప్రకటించింది.లక్ష్మీప్రియ ప్రస్తుత నివాసం త్రిపుణితుర సమీపంలోని కారింగచిరలో ఉంది. ఆమె పేరు ఓటర్ల జాబితాలో నిజంగానే లేదని తెలిసింది. ఆమె గతంలో నివసించిన త్రిక్కాకరలో కూడా ఓటరు జాబితాలో ఆమె పేరు లేదు. దీనిపై ఆమె ఇప్పటివరకు స్పందించలేదు.లక్ష్మీ ప్రియ వివాదం మరవకముందే..లక్ష్మీ ప్రియ ఘటనను మరవకముందే అదే ట్వంటీ20 పార్టీలో అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. ఎట్టుమనూరు నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నటి వీణా నాయర్‌ను ప్రకటించారు. అయితే, ఆమె పేరు కూడా ఓటర్ల జాబితాలో నమోదు కాలేదని బయటపడింది. ఆమె స్థానంలో మరో అభ్యర్థిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. వీణా నాయర్ స్థానంలో కొత్త అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. తాను పోటీ చేయడం లేదని వీణా నాయర్ తెలిపారు. ఓటర్ల జాబితాలో పేర్లు లేని ఇద్దరు సినీ నటీమణులను అభ్యర్థులుగా ప్రకటించడం ఎన్డీఏకు ఇబ్బందికరంగా మారింది. మరోవైపు, త్రిపుణితుర నియోజకవర్గంలో నటి అంజలిని ట్వంటీ20 పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది. అక్కడ ఆమె ప్రచారం ఇప్పటికే ప్రారంభమైంది. -
డీఎస్పీగా సంజూ శాంసన్!?
టీ20 వరల్డ్‌కప్-2026ను గెలిచి టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. మూడు టీ20 ప్రపంచకప్ టైటిల్స్ గెలుచుకున్న ఏకైక జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. ఈ విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌ది కీలక పాత్ర. కీలకమైన సూపర్-8 మ్యాచ్‌తో పాటు సెమీస్, ఫైనల్లోనూ సంజూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.సంజూ కేవలం ఐదు మ్యాచ్‌లలోనే 80.25 సగటు 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీగా నిలిచాడు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం సంజూను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఉద్యోగంతో సత్కరించిందని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ విషయంపై కేరళ ఫ్యాక్ట్ చెక్ విభాగం స్పందించింది. ఇవన్ని అసత్య ప్రచారాలని, కేరళ ప్రభుత్వం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. వైరల్ అవుతున్న ఫోటోలు కేవలం ఏఐ ద్వారా సృష్టించినవి మాత్రమే. కాగా వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం తిరువనంతపురంలో శాంసన్‌ను కేరళ సర్కార్ ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గోన్నారు. అంతేతప్ప అతడికి నగదు బహుమతి కానీ, ఉద్యోగం కానీ ప్రకటించలేదు. చదవండి: T20 WC Final: ’అర్ష్‌దీప్ చేసిన పనికి అతడికి క్షమాపణలు చెప్పాను’ -
‘మలయాళ’ రాజకీయం మారుతోందా?
కేరళలో పొలిటికల్ హీట్ పెరిగింది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 140 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు పినరయి విజయన్ నేతృత్వంలోని వామపక్ష కూటమి పక్కా ప్లాన్‌తో ఉండగా.. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు హస్తం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇక, తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు కాషాయ పార్టీ బీజేపీ.. ఉవ్విళ్లూరుతోంది. దీంతో,‘గాడ్స్ ఓన్ కంట్రీ’ కేరళలో ముక్కోణపు పోటీ నెలకొంది. ఎన్నికల వేళ పార్టీల బలాబలాలు ఎలా ఉన్నాయి? కేరళ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉందంటే..విజయన్ 3.0 సాధ్యమేనా?ప్రస్తుతం కేరళలో పినరయి విజయన్ నేతృత్వంలో ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. గత రెండు ఎన్నికల్లో ఎల్డీఎఫ్ కూటమి భారీ విజయాలను దక్కించుకుంది. దీంతో 'విజయన్ '3.0' కోసం వామపక్షాలు వ్యూహ రచన చేస్తున్నాయి. అభివృద్ధి మార్కు పాలనతో హ్యాట్రిక్ కొట్టి చరిత్ర సృష్టించాలని సీపీఎం నాయకత్వంలోని కూటమి ఆశపడుతోంది. అయితే, విజయ్ పేరు, ఆయన నాయకత్వమే కూటమి పెద్ద సానుకూలత. ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోవడం కూటమికి కలిసొచ్చే అంశం. రాష్ట్రంలో ఏ కూటమికి, పార్టీకి కానీ ఇంత స్థాయి ఉన్న లీడర్ లేకపోవడం వామపక్షాలకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఇదే సమయంలో సీనియర్ లీడర్‌గా, సీఎంగా విజయన్‌కు అనుభవం కూడా ఉంది. అలాగే, సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ఎల్డీఎఫ్ భావిస్తోంది.మరోవైపు.. ఇటీవలి కాలంలో శబరిమల బంగారు ఆభరణాల మాయం వంటి అంశాలు విజయన్ ప్రభుత్వం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. ఈ పరిణామం హిందూ ఓటర్లను ప్రభావితం చేయవచ్చు. అలాగే, శబరిమల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని పలువురు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కేరళకు రావాల్సిన నిధులను కేంద్రం ఆపేస్తోందని, అప్పుల పరిమితిని తగ్గించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని ప్రాంతీయ సెంటిమెంట్‌ను రగిలిస్తోంది. ఇక, వయనాడ్ భూకంప బాధితులకు కేంద్రం నుంచి ఆశించిన సాయం అందలేదని ప్రభుత్వం ఆరోపిస్తున్నప్పటికీ, రాష్ట్ర యంత్రాంగం వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి.హస్త‘గతం’ అవుతుందా?కేరళలో పదేళ్లుగా అధికారానికి దూరమైన కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్‌కు ఈ ఎన్నికలు ఎంతో కీలకం కానున్నాయి. విజయన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని యూడీఎఫ్ భావిస్తోంది. రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ముస్లిం, క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడంలో యూడీఎఫ్ పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా జేడీఎస్ వంటి పార్టీలు ఎన్డీఏ వైపు వెళ్లడం, విజయన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మైనారిటీలు యూడీఎఫ్‌కు దగ్గర అయినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. గతంతో పోలిస్తే ఈసారి సీట్ల సర్దుబాటు విషయంలో మిత్రపక్షాల మధ్య పెద్దగా వివాదాలు తలెత్తకపోవడం యూడీఎఫ్ కలిసొచ్చే అంశం.అలాగే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని 20 స్థానాలకు గానూ 18 స్థానాలను యూడీఎఫ్ గెల్చుకుంది. ఈ విజయం యూడీఎఫ్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు యూడీఎఫ్‌కు ప్రతికూలంగా మారాయి. అలాగే, యూడీఎఫ్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే దానిపై స్పష్టత లేదు. అన్నింటికి మించి పాలక్కాడ్ మాజీ ఎమ్మెల్యే రాహుల్ మామ్కూటత్తిల్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీశాయి. ఈ వ్యవహారం కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది.కాషాయ జెండా ఎగిరేనా?కేరళ రాజకీయ చరిత్రలో బీజేపీ ఏనాడూ పెద్దగా విజయాలు సాధించిన దాఖలాలు లేవు. కేరళలో గతంలో ఒక్క సీటు కోసం పోరాడిన బీజేపీ ఇప్పుడు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఊహించని విధంగా విజయాలను అందుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం కార్పొరేషన్ గెలిచిన తర్వాత బీజేపీ కేడర్‌లో ఫుల్ జోష్ వచ్చింది. మరోవైపు.. కేంద్రంలోని పెద్దలు ప్రధాని మోదీ సహా పలువురు కేరళకు వెళ్లడం ప్రచారంలో పాల్గొనడం కాషాయదళానికి ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో కేరళంలో బలమైన ముద్ర వేయాలని బీజేపీ భావిస్తోంది. అలాగే, ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడం ద్వారా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోంది. దీంతో, హిందువుల ఓట్లపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.త్రిముఖ పోరు.. కేరళ రాజకీయాల్లో ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుందనే ఆనవాయితీ గతంలో ఉండేది. కానీ, 2021లో ఎన్నికల్లో ఆ ఆనవాయితీని సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ బద్దలు కొట్టింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే ఆసక్తి నెలకొంది. ఇక, 2021 ఎన్నికల్లో ఫలితాలు ఇలా ఉన్నాయి. ఎల్డీఎఫ్ మొత్తం 99 స్థానాలను గెల్చుకోగా.. అందులో సీపీఎం 62, సీపీఐ 17, కేరళ కాంగ్రెస్ (ఎం) 5, జేడీఎస్ 2, ఎన్సీపీ 2, ఇతరులు 11 సీట్లను సాధించాయి. ఇక యూడీఎఫ్ విషయానికి వస్తే, కాంగ్రెస్ 21 సీట్లు, ముస్లిం లీగ్ 15, కేరళ కాంగ్రెస్ 2, ఇతర మిత్రపక్షాలు 3 సీట్లను గెల్చుకున్నాయి. 2016 ఎన్నికల్లో గెలిచిన ఏకైక స్థానాన్ని (నెమమ్) కూడా బీజేపీ ఈ ఎన్నికల్లో కోల్పోయింది.మ్యాజిక్ ఫిగర్.. కేరళలో 140 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 71 స్థానాల్లో విజయం సాధించాలి. -
తెల్లారుతూనే ఘోరం.. ముగ్గురు మెడికోలు దుర్మరణం
కోజికోడ్: కేరళలో ఈరోజు (బుధవారం) తెల్లారుతూనే ఘోరం చోటుచేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కాబోయే డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారు. అతివేగమో లేదా అదుపు తప్పడమో తెలియదు కానీ, వారు ప్రయాణిస్తున్న ఈ స్కూటర్ విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.అసలేం జరిగింది?బుధవారం తెల్లవారుజామున సుమారు 1:40 గంటల ప్రాంతంలో కొయిలాండి సమీపంలోని కురువంగడ్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోజికోడ్‌లోని మలబార్ మెడికల్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఒకే ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రయాణిస్తున్నారు. కురువంగడ్ వద్దకు రాగానే స్కూటర్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని, పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిని కరుణాగపల్లికి చెందిన నంద కిషోర్ (22), కాయంకుళం వాసి అభియాన్ రెహమాన్ (19), అలనెల్లూరుకు చెందిన అభినవ్ సురేష్ (19)గా పోలీసులు గుర్తించారు. వీరంతా మలబార్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు.ఆస్పత్రికి తరలించే లోపే..ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే ఉన్న కొందరు లారీ డ్రైవర్లు వెంటనే స్పందించి, తీవ్రంగా గాయపడిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి చేరుకునే లోపే ముగ్గురు విద్యార్థులు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మృతదేహాలను మెడికల్ కాలేజీ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు కొయిలాండి పోలీసులు తెలిపారు. ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ కలచివేస్తోంది.ఇది కూడా చదవండి: విచ్చలవిడి ‘యూజర్ల’పై ప్రభుత్వం ఉక్కుపాదం -
ఎన్నికల బాజా!
ఈసారి ఏప్రిల్ అధిక ఉష్ణోగ్రతలతోపాటు ఎన్నికల వేడిని కూడా చవిచూడబోతోంది. నాలుగు రాష్ట్రాలు– తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఆదివారం ప్రకటించింది. బెంగాల్లో రెండు దఫాలుగా ఏప్రిల్ 23, 29ల్లో పోలింగ్ జరగనుండగా, మిగిలినచోట్ల 9న ఒకే దఫాతో ముగుస్తుంది. అన్నింటి ఫలితాలూ మే 4న వెలువడతాయి. 2006 నుంచి చూస్తే వేలంపాట మాదిరి అయిదు నుంచి ఎనిమిది దఫాలుగా పోలింగ్ సాగిన చరిత్రగల బెంగాల్లో ఈసారి కేవలం రెండు దఫాలతో సరిపెట్టారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరిపి 60.06 లక్షల మంది ఓటర్లను త్రిశంకు స్వర్గంలో ఉంచిన ఈసీ... ఆ విషయం తేలకుండానే బెంగాల్ ఎన్నికలు నిర్వహించబోతోంది. ఆ విషయంలో వచ్చిన ఫిర్యాదులను హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో ఏర్పడే అప్పిలేట్ ట్రిబ్యునళ్లు పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే 705 మంది ఆ పనిలో ఉన్నారు. రోజుకు లక్ష ఫిర్యాదుల్ని పరిష్కరిస్తున్నారు. అలా చూసుకుంటే నామినేషన్ల ఘట్టం ముగిసే ఏప్రిల్ 9 నాటికి 39 లక్షలమంది వినతులు పరిష్కారమవుతాయి. వారిలో ఎందరికి ఓటేసే భాగ్యం దక్కుతుందోగానీ... ఎటూ తేలకుండా 20 లక్షల మందికిపైగా మిగిలిపోతారు. ఎందుకంటే, ప్రజాప్రాతినిధ్య చట్టం 23(3) ప్రకారం నామినేషన్ల గడువు ముగిశాక ఎన్నికల జాబితా మారకూడదు. అధికారంలో ఉండగా ఏం చేసినా, ఎన్నికల సీజన్ వచ్చేసరికి వాగ్దానాలు వరదలై పారటం మనకు రివాజైంది. అధికారంలో ఉన్న వెసులుబాటు ఉపయోగించుకుని ఏదో పథకం పేరిట మహిళా ఓటర్ల ఖాతాలకు డబ్బు పంపిణీ సంప్రదాయం నిరుడు నవంబర్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ ఎన్డీయే కూటమి మొదలెట్టింది. దానికింద 75 లక్షల మంది మహిళలకు రూ.10,000 చొప్పున పంపిణీ అయ్యాయి. దీనికి మలి దశ కూడా ఉంటుందని చెప్పడం మరింత లాభించింది. మహిళలంతా ఎన్డీయేకు నీరాజనాలు పట్టారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా ఆ బాటలోనే 1.31 కోట్లమంది మహిళల ఖాతాలకు రూ. 5,000 చొప్పున గత నెలలో బదిలీ చేశారు. ఇవిగాక రాబోయే రోజుల్లో పార్టీలు విడుదల చేయబోయే మేనిఫెస్టోల నిండా ఎటూ ఉచితాల మోత మోగుతుంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో ఒక్క అస్సాంలో తప్ప మరెక్కడా బీజేపీ అధికారంలో లేదు. పుదుచ్చేరిలో మాత్రం ప్రాంతీయ పక్షం ఎన్నార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అధికార కూటమిలో భాగస్వామిగా ఉంది. ఓట్ల శాతం క్రమేపీ పెరుగుతూ వస్తున్న బెంగాల్లో ఈసారి నిర్ణయాత్మక పాత్ర పోషించగలమని ఆ పార్టీ విశ్వసిస్తోంది. కానీ వచ్చిన ఏ అవకాశాన్నయినా అంత తేలిగ్గా వదలని తృణమూల్ అధినేత, సీఎం మమతా బెనర్జీ ముందు ఎవరి ఎత్తుగడలైనా ఫలించటం అంత తేలిక కాదు. సినీ నటుడు విజయ్ కొత్తగా ప్రారంభించిన టీవీకే పార్టీతో పొత్తు ఖరారైతే తమిళనాడు తమ జోలెలో పడుతుందని బీజేపీ ఆశిస్తోంది. మిత్రపక్షం అన్నా డీఎంకేపై పెద్దగా ఆశలేమీ లేవు. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకేను ఢీకొనడం కష్టమే. కేరళలో వరసగా పదేళ్లు సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ ఏలుబడి సాగింది గనుక అక్కడ కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్‌లో బాగా ఆశలున్నాయి. 2014 నుంచి వరసగా అధికారంలోకొస్తున్న అస్సాంలో బీజేపీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంది. 2023 నాటి నియోజకవర్గాల పునర్విభజనతో ముస్లిం ప్రాతినిధ్యం ఉండే స్థానాలు 23కి పడిపోవడం, మొన్నటి బడ్జెట్లో మహిళలకూ, యువతకూ ప్రకటించిన రూ. 5,000 కోట్ల ఆర్థిక లబ్ధి చేకూర్చే పథకాలు ఆ ఆత్మవిశ్వాసానికి మూలం. కాంగ్రెస్ సంస్థాగత బలహీనతలు సరేసరి. ఈ ఎన్నికలు ఈసీ విశ్వసనీయతకు కూడా పరీక్ష. లోక్‌సభలో అభిశంసన తీర్మానం ఎదుర్కొనబోతున్న తరుణంలో ఈసారైనా తటస్థత పాటిస్తుందని అందరూ ఆశిస్తున్న తరుణంలో బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీ, హోం కార్యదర్శినీ మార్చింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విషయంలో వచ్చిన ఫిర్యాదులపై రెండేళ్లు దాటుతున్నా నిమ్మకు నీరెత్తినట్టున్న ఆ సంస్థ వైఖరి ఈ ఎన్నికల విషయంలో మారకపోతే మరిన్ని ఛీత్కారాలు తప్పవు. మొత్తానికి ఏ పార్టీ జాతకం ఏమిటో తెలియడానికి మే నాలుగో తేదీ వరకూ ఆగక తప్పదు. -
పాంచ్ పటాకా.. ఐదు రాష్ట్రాల్లో మోగిన అసెంబ్లీ ఎన్నికల నగారా
సాక్షి, న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కీలకమైన పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషీతో కలిసి ఢిల్లీలో మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, 29ల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. కేరళ (140), అస్సాం (126), పుదుచ్చేరి (30) అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నట్లు జ్ఞానేశ్ తెలిపారు. అన్నిచోట్లా మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడిస్తామని వివరించారు. ఇప్పటికే పార్టీల నేతలు, రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమై సలహాలు స్వీకరించామని ఆయన చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాల్లో ప్రవర్తన నియామవళి అమల్లోకి వచ్చింది. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో మొత్తం 824 అసెంబ్లీ స్థానాలు, 17.4 కోట్ల మంది ఓటర్లున్నట్టు సీఈసీ తెలిపారు. ‘‘మొత్తం 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 750 నుంచి 900 మంది ఓటర్లున్నారు. సుమారు 25 లక్షల సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని తెలియజేశారు. యువత పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హింస, ప్రలోభాలకు తావు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని, గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఈసీ పదవి నుంచి తనను తొలగించడానికి పార్లమెంటులో ప్రతిపక్షాలు నోటీసివ్వడంపై స్పందించేందుకు నిరాకరించారు.8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలుదేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మహారాష్ట్ర, కర్నాటకల్లో రెండేసి, గోవా, గుజరాత్, నాగాలాండ్, త్రిపురల్లో ఒక్కో స్థానాల్లో పోలింగ్ జరగనుంది. గోవా, కర్నాటక, నాగాలాండ్, త్రిపురల్లో ఏప్రిల్ 9న, గుజరాత్, మహారాష్ట్రలో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. -
ఎరుమేలిలో కొత్త చెక్ డ్యామ్ నిర్మాణం
ఎరుమేలిలో అయ్యప్ప భక్తులు పవిత్ర స్నానం చేయడానికి సరిపడా నీటి లభ్యతను నిర్ధారించేందుకు వలియంబలం ప్రాంతంలోని వలియ తోడ్ వద్ద కొత్త చెక్ డ్యామ్ నిర్మాణానికి 75 లక్షల రూపాయల నిధిని కేటాయించినట్లు పూన్జార్ ఎమ్మెల్యే Sebastian Kulathunkal ప్రకటించారు.ఇప్పటికే ఉన్న చెక్ డ్యామ్ పాతదై దెబ్బతిన్న కారణంగా నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల కొత్త చెక్ డ్యామ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు.ఈ కొత్త చెక్ డ్యామ్ 16 మీటర్ల వెడల్పు, 14.1 మీటర్ల పొడవుతో నిర్మించబడుతుంది. ఇది 1.8 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది.అదనంగా , ఈ చెక్ డ్యామ్‌లో మొత్తం 8 షట్టర్లు ఉంటాయి. వాటిలో 6 FRP షట్టర్లు, 2 యాంత్రిక (మెకానికల్) షట్టర్లు ఉంటాయి.ఈ మెకానికల్ షట్టర్ల వాడకం వల్ల యాత్రాకాలంలో అయ్యప్ప భక్తులకు అవసరమైన నీటి లభ్యతను నిర్ధారించడం మాత్రమే కాకుండా, నీటి ప్రవాహాన్ని నియంత్రించడమూ సులభం అవుతుంది అని ఎమ్మెల్యే తెలిపారు.(చదవండి: భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు) -
భూలోక స్వర్గం శబరిమల సన్నిధానం మీనమాస పూజలు
ఆ మణికంఠుని అపార కృపాకటాక్షాలతో, అత్యంత పవిత్రమైన మీనమాస పూజలు, శబరిమల ఉత్సవం 2026 కొరకు అయ్యప్ప సన్నిధాన ద్వారాలు తెరుచుకున్నాయి. "స్వామియే శరణం అయ్యప్ప" అనే నామస్మరణతో ఆ దివ్య దర్శనానికి తరలి వెళ్దాం.మీనమాస పూజల షెడ్యూల్నడ తెరిచే సమయం: మార్చి 14, 2026 (శనివారం) సాయంత్రం 5:00 గంటలకు.నడ మూసివేత: మార్చి 19, 2026 (గురువారం) రాత్రి 10:00 గంటలకు (అత్తాజ పూజ, హరివరాసనం అనంతరం).శబరిమల ఉత్సవం, పంగుని ఉత్తరం 2026వార్షిక ఉత్సవాల నిమిత్తం మార్చి 22 సాయంత్రం 5:00 గంటలకు ఆలయ ద్వారాలు తిరిగి తెరవబడతాయి.మార్చి 23: కొడియేట్టు (ధ్వజారోహణం)మార్చి 24: ఉత్సవ బలిమార్చి 31: పళ్ళివేట (రాజవేట)ఏప్రిల్ 01: పంపా ఆరాట్టు & పంగుని ఉత్తరం – భగవాన్ అయ్యప్ప స్వామి వారి దివ్య జన్మదినోత్సవం.ముగింపు: ఏప్రిల్ 1, 2026.ఏప్రిల్ 1వ తేదీన సన్నిధానం ఉదయం 5:00 నుండి 8:00 వరకు మాత్రమే తెరవబడుతుంది. తిరిగి పంపా ఆరాట్టు ముగిసిన తర్వాత సాయంత్రం 6:00 గంటలకు తెరిచి, రాత్రి 10:00 గంటలకు మూసివేస్తారు.(చదవండి: మహిళల శబరిమల..! ఆటుకాల్ భగవతి) -
గ్యాస్ కష్టాలు: పనుల్లేక సొంతూళ్లకు వలస కూలీలు
తిరువనంతపురం: దేశాన్ని ఎల్పీజీ కొరత అతలాకుతలం చేస్తోంది. వంట గ్యాస్ దొరక్క వందలాది హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో మరో పెను సంక్షోభం తెరపైకి వచ్చింది. ఉపాధి కోల్పోయిన వేలాది మంది వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు తిరుగుపయనం అవుతున్నారు. కేరళలోని హోటల్ రంగం ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలపైనే ఆధారపడి నడుస్తోంది.ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటం, మరోవైపు రంజాన్ పండుగ దగ్గరపడుతుండటంతో వీరంతా ముందస్తుగానే ఇళ్లకు తరలి వెళుతున్నారు. సాధారణంగా ఎన్నికల సమయానికి వారం ముందు వెళ్లే వీరు, ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల హోటళ్లు మూతపడటంతో పనులు లేక ముందుగానే సొంతూళ్లకు తరలివెళ్లిపోతున్నారు. ‘ఎల్పీజీ సంక్షోభం మధ్య చిన్న తరహా హోటల్ యజమానులు తమ సిబ్బందిని కాపాడుకోలేకపోతున్నారు. ఒక్కసారి వీరు తమ గ్రామాలకు వెళ్తే మళ్లీ రెండు మూడు నెలల వరకు తిరిగి రారు. ఇది కేరళలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతుంది’ అని కేరళ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. జయపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.కేరళలోని వలస కార్మికులలో సుమారు 50 శాతం మంది ఎన్నికలు జరగబోయే బెన్సాం, అస్సాం ప్రాంతాల వారేనని గణాంకాలు చెబుతున్నాయి. కొందరు యజమానులు గ్యాస్‌కు బదులు ఇతర ఇంధనాలను వాడుతూ పనివారిని ఆపే ప్రయత్నం చేస్తున్నా, పరిస్థితులు ఆశాజనకంగా లేవు. తిరువనంతపురంలోని ప్రముఖ మాల్స్‌కు సిబ్బందిని సరఫరా చేసే ఏజెన్సీల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గతంలో 25 మంది పనిచేసే చోట ఇప్పుడు కేవలం ఐదుగురు మాత్రమే మిగిలారు. ప్రస్తుతానికి స్థానిక మహిళలతో పనులు కానిస్తున్నా, వలస కూలీలు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. గ్యాస్ సమస్య త్వరగా పరిష్కారం అయితేనే కేరళ ఆతిథ్య రంగం తిరిగి కోలుకునే అవకాశం ఉంది.ఇది కూడా చదవండి: కాంగ్రెస్ విదేశీ శక్తుల కీలుబొమ్మ: ప్రధాని మోదీ -
గ్యాస్ లేక.. స్మశానంలో మృతదేహాల వెయిటింగ్..
కోజికోడ్: దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు స్మశానవాటికల వరకూ పాకింది. కేరళలోని కోజికోడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే ‘స్మృతిపథం’ స్మశానవాటికలో గ్యాస్ సిలిండర్ల నిల్వలు పూర్తిగా అయిపోవడంతో, శుక్రవారం నుంచి గ్యాస్ ఆధారిత దహన సంస్కారాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.సంప్రదాయ పద్ధతులే శరణ్యంగత రెండు రోజులుగా సిలిండర్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతోందని, ఎన్నిసార్లు ప్రయత్నించినా సరఫరాదారులు కొత్త స్టాక్ పంపలేదని స్మృతిపథం సిబ్బంది వాపోతున్నారు. దీంతో గ్యాస్ ఫర్నేస్‌లను మూసివేసి, ప్రత్యామ్నాయంగా కొబ్బరి పీచు, చిప్పలను ఉపయోగిస్తూ, సంప్రదాయ పద్ధతిలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ క్రీమెటోరియం కూడా సాంకేతిక కారణాలతో గత నాలుగు నెలలుగా మూలనపడింది. వారం రోజుల్లోగా దీనికి మరమ్మతులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.సామాన్యులపై అదనపు భారంసాధారణంగా మిగతా చోట్ల కంటే స్మృతిపథంలో అంతిమ సంస్కారాల ఖర్చు తక్కువ. ఇక్కడ గ్యాస్ ఆధారిత దహనానికి ₹2,000, ఎలక్ట్రిక్ పద్ధతికి ₹2,500 వసూలు చేస్తారు. గ్యాస్ కొరత కారణంగా దహన సంస్కారాల కోసం ఇప్పుడు కుటుంబ సభ్యులు పుతియాపాలం లేదా వెస్ట్ హిల్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల ఒక్కో కుటుంబంపై అదనంగా ₹500 నుండి ₹1,500 వరకు ఆర్థిక భారం పడుతోంది.ఒక మృతదేహానికి 25 కిలోల గ్యాస్సాధారణంగా ఒక మృతదేహాన్ని గ్యాస్ ద్వారా దహనం చేయడానికి సుమారు 25 కిలోల గ్యాస్ అవసరమవుతుంది. అంటే దాదాపు ఒకటిన్నర కమర్షియల్ సిలిండర్లు ఖర్చవుతాయి. దహన ప్రక్రియలో తగినంత ఒత్తిడి కొనసాగించాలంటే ఒకేసారి 12 సిలిండర్లను ఫర్నేస్‌కు అనుసంధానించాల్సి ఉంటుంది. గ్యాస్ సరఫరా తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న తర్వాతే ఇక్కడ సేవలు పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: ఆకలి తీరుస్తున్న ‘గ్యాస్ అన్డూ’.. టెక్కీల క్రేజీ ఆవిష్కరణ -
ఆకలి తీరుస్తున్న ‘గ్యాస్ అన్డూ’.. టెక్కీల క్రేజీ ఆవిష్కరణ
కొచ్చి: పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంక్షోభపు సెగ వంటగదులనూ తాకింది. కేరళలోని కొచ్చి నగరంలో ఎల్పీజీ (LPG) కొరత తీవ్రం కావడంతో సామాన్యులు, హోటల్ నిర్వాహకులు బెంబేలెత్తిపోతున్నారు. అయితే, ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తమ మేధస్సుకు పదును పెట్టారు. గ్యాస్ కొరతతో ఏయే హోటళ్లు మూతపడ్డాయి? ఎక్కడ భోజనం దొరుకుతుంది? అనే వివరాలను ఇట్టే చెప్పేసే ఒక వినూత్న వెబ్‌సైట్‌ను వారు అందుబాటులోకి తెచ్చారు.చేదు అనుభవం.. సరి కొత్త ఆలోచనవైశాఖ్ సురేష్, వి. విశ్వనాథ్ కర్త అనే ఇద్దరు టెక్కీలు ఇటీవల తమ టీమ్ సభ్యులతో కలిసి డిన్నర్‌కు వెళ్లారు. 30 మంది ఉన్న ఆ బృందానికి నగరంలోని ప్రధాన హోటళ్లలో ఆహారం లభ్యం కాలేదు. గ్యాస్ కొరత కారణంగా హోటళ్లలో వంటలు నిలిచిపోయాయని తెలుసుకున్నారు. కావాల్సిన ఆహారం దొరకక, నగరం అంతా తిరగాల్సి రావడంతో వారికి గంటల కొద్దీ సమయం, ఇంధనం వృథా అయ్యాయి. ఈ ఇబ్బంది మరెవరికీ రాకూడదనే ఉద్దేశంతో ‘గ్యాస్ అన్డూ’ ‘Gas Undo’ (https://www.gasundo.live/) పేరుతో ఒక వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి, అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు.లైవ్ మ్యాప్‌తో ఆహారం వేట సులభంఈ వెబ్సైట్ ఒక డిజిటల్ మ్యాప్ మాదిరిగా పనిచేస్తుంది. కొచ్చి నగరంలోని దాదాపు 2,488 రెస్టారెంట్ల వివరాలను ఇందులో పొందుపరిచారు. ఏ హోటల్ ప్రస్తుతం ఏమి ఆహారం దొరుకుతుంది? ఎక్కడ పరిమితమైన మెనూ మాత్రమే అందుబాటులో ఉంది? తదితర వివరాలను రియల్ టైమ్‌లో ఈ వెబ్పసైట్ ద్వారా తెneighboursలుసుకోవచ్చు. గ్యాస్ కొరత కారణంగా ఇండక్షన్ స్టౌవ్‌లు లేదా కట్టెల పొయ్యిలకు మారిన హోటళ్ల సమాచారాన్ని కూడా ఇందులో చూడవచ్చు.ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యంఈ ప్లాట్‌ఫారమ్ విశేషమేమిటంటే ఇది పూర్తిగా ప్రజల భాగస్వామ్యంతో నడుస్తుంది. ఏదైనా హోటల్‌కు వెళ్లిన కస్టమర్లు అక్కడ ఆహారం అందుబాటులో ఉందో లేదో వెంటనే మ్యాప్‌లో అప్డేట్ చేయవచ్చు. దీనివల్ల వేరే వాళ్లు ఆ హోటల్‌కు వెళ్లి, నిరాశ చెందాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నారు. సాంకేతికతను సామాన్యుల కష్టాలను తీర్చడానికి ఎలా ఉపయోగించవచ్చో ఈ కేరళ టెక్కీలు చక్కగా నిరూపించారు.ఇది కూడా చదవండి: అంతులేని ప్రేమతో.. మహిళ లోదుస్తులు చోరీ! -
ప్రియుడితో మెనాలీసా పెళ్లి : రంగంలోకి వీహెచ్‌పీ
కుంభమేళా సోషల్‌మీడియా సంచలనం మోనాలీసా భోంస్లే (Monalisa Bhosle)కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రేమ వివాహం చట్టవిరుద్దమని విశ్వహిందూ పరిషత్ ఫిర్యాదు చేసింది. ఆమెది బాల్య వివాహమని వీహెచ్‌పీ ఆరోపించింది. దీంతో ఈ పెళ్లి నెట్టింట చర్చకు దారితీసింది.ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన 2025 మహా కుంభమేళా సందర్భంగా విశేష గుర్తింపు పొందిన మోనాలిసా భోంస్లే ఇటీవల (మార్చి 11, 2026న ) తన ప్రియుడు మహమ్మద్ ఫర్మాన్ ఖాన్ (Mohammed Farman Khan)ను పెళ్లాడింది. కేరళలోని అరుణ్మనూర్‌లోని శ్రీ నారాయణ గురు ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారీ వీరు పెళ్లి చేసుకున్నారు. అయితే మోనాలీసా మైనర్శ్రీ అనీ, ఈ వివాహం చెల్లదంటూ విశ్వహిందూ పరిషత్ (VHP) కేరళ విభాగం గురువారం నాడు డీజీపీతో పాటు పూవార్ పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు చేసింది. ఈ మతాంతర వివాహం చట్టవిరుద్ధమని, ఎందుకంటే వధువు మైనర్ అని (18 ఏళ్లలోపు) విహెచ్పీ తన ఫిర్యాదులో ఆరోపించింది. బాల్య వివాహాల నిరోధక చట్టం, పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం-2012 కింద విచారణ జరపాలని,అలాగే వివాహాన్ని నిర్వహించిన వారిపైనా, అందులో పాల్గొన్న వారిపైనా చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ విహెచ్పీ కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్ విలయిల్ కేరళ డీజీపికి, పూవార్ SHOకు ఫిర్యాదు చేశారు. #WATCH | Thiruvananthapuram, Kerala: Monalisa Bhosle, the viral 'Rudraksha Girl' of the 2025 Maha Kumbh Mela, has married her boyfriend Furman KhanFurman Khan says, "This is not love jihad. Both of us follow our own religions, but we also respect all religions. We are both… pic.twitter.com/GrQyafT9J5— ANI (@ANI) March 12, 2026ఈ ఫిర్యాదు ప్రకారం.. తమ వాదనకు ఆధారంగా, జనవరి 21, 2025న జరిగిన మోనాలిసా 16వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన సోషల్ మీడియా వీడియో దృశ్యాలను వీహెచ్‌పీ ప్రస్తావించింది. కనుక 18 ఏళ్ల లోపే జరిగిన మోనాలిసా భోంస్లే వివాహం చెల్లదని, ఆ జంటపైనా, ఆలయ అధికారులపైనా, అలాగే వారికి అండగా నిలిచిన రాజకీయ పోషకులపైనా చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ డిమాండ్ చేసింది.ఇదీ చదవండి: మోజ్తాబా ఖమేనీని ఖతం చేస్తాం.. నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలుమెనాలీసా క్లారిటీతమ వివాహం చట్టబద్దమైందనీ, లవ్ జిహాద్ కాదనీ కొత్త జంట తమపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. మోనాలిసాకు 18 ఏళ్లు నిండాయని స్పష్టం చేశారు. ఇద్దరమూ ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని వివరించారు. అలాగే జనవరి 1, 2008న జన్మించిందంటూ, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జారీ చేయబడిన జనన ధృవీకరణ పత్రాన్ని కూడా వారు సమర్పించారు. అయితే మెనాలీసా కుటుంబం ఈ పెళ్లికి అంగీకరించకపోవడంతో రక్షణ కోరుతూ తంపనూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. 18 సంవత్సరాలు నిండాక, చట్టబద్ధంగా నచ్చిన భాగస్వామితో జీవించడానికి స్వేచ్ఛ ఉందని పోలీసు అధికారులు వివరించారు. దీంతో వివాహం ప్రక్రియను ముగించారు. ఇదీ చదవండి : లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!కాగా మెనాలీసా-ఫర్మాన్ ఖాన్ వివాహానికి కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్కుట్టి, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) రాజ్యసభ సభ్యుడు ఎఎ రహీం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్‌తో సహా పలువురు రాజకీయ నాయకులు హాజరైనారు. -
బావతో పెళ్లి ఇష్టంలేక ... కుంభమేళా మోనాలిసా ప్రేమకథ..
-
లవ్ జిహాద్ కాదు, ఆమె ఇష్టమే నా ఇష్టం!
మహా కుంభమేళా 2025లో పూసల దండలు అమ్ముకుంటూ ఫ్యామస్ అయిన మోనాలీసా భోంస్లే (Monalisa Bhosle) మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రియుడు నటుడు ఫర్మాన్ ఖాన్ పెళ్లాడి ఫ్యాన్స్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. అయితే ఈ పెళ్లి 'లవ్ జిహాద్' నెట్టింట తీవ్ర దుమారం రేగింది. దీనిపై ఈ జంట వివరణ ఇచ్చారు. గురువారం (మార్చి 12, 2026) తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తమ పెళ్లిపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు.తాము తమ మతాలు మార్చుకోలేదని మోనాలీసా స్పష్టం చేసింది. తాను హిందువుగా, తన భర్త ముస్లింగానే కొనసాగుతామని మోనాలీసా వివరించింది. అలాగే 'లవ్ జిహాద్' ఆరోపణలను కూడా ఆమె తోసిపుచ్చింది. ఈ వివాహం తన సొంత నిర్ణయమని తేల్చి చెప్పింది. తన తండ్రి తనతో పాటు కేరళకు వచ్చినప్పటికీ, ఈ పెళ్లి పట్ల ఆయన ఇంకా అసంతృప్తితో ఉన్నారని, త్వరలోనే ఆయనను ఒప్పించు కోగలననే ధీమా వ్యక్తం చేసింది. తన అత్త కొడుకుతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారని, కానీ తనకు ఇష్టం లేక ఫర్మాన్ ఖాన్‌ను ఎంచుకున్నానని ఆమె చెప్పారు.తల్లి దండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిన తమ మతాంతర వివాహానికి సంబంధించి విమర్శలపై స్పష్టత ఇస్తూ "ప్రేమలో మత మార్పిడి అవసరం లేదు" అని ఫర్మాన్ ఖాన్ ( Farman Khan)పేర్కొన్నాడు.. అలాగే మోనాలీసా మైనర్ అంటూ వస్తున్న వార్తలను ఫర్మాన్ ఖాన్ ఖండించారు. ఆమె ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను మీడియాకు చూపించారు. మోనాలిసా కోరుకున్న విధంగా ఆచారాలను అనుసరించడానికి తాను అంగీకరించాననీ, ఎందుకంటే ఆమె ఆనందాన్నే తన ఆనందమని చెప్పు కొచ్చాడు. ఈ సందర్భంగా తమకు కేరళ ప్రజల మద్దతు లభించడం సంతోషమని,మోనాలీసాకు ఇష్టమైతే అక్కడే స్థిరపడతా మన్నాడు.ఉత్తరప్రదేశ్‌లోని బాగ్పత్ జిల్లాకు చెందిన ఖాన్, ఇండోర్ నివాసి మోనాలీసా వివాహం కేరళలోని ఒక ఆలయంలో హిందూ ఆచారాల ప్రకారం వివాహం చేసుకున్నారు. కేరళ ప్రభుత్వానికి చెందిన K-SMART యాప్ ద్వారా వీరి వివాహం చట్టబద్ధంగా నమోదైంది. ఈ వివాహ వేడుకకు కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ లాంటి ప్రముఖ రాజకీయ నేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా 'నాగమ్మ' అనే మలయాళ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇందులో ఫర్మాన్ ఖాన్ విలన్‌గా, మోనాలీసా హీరోయిన్గా నటిస్తున్నారు. -
పెళ్లి చేసుకున్న కుంభమేళా మోనాలిసా.. వరుడు ఎవరంటే?
కుంభమేళా సమయంలో పూసలమ్ముకుంటూ ఫేమస్ అయిన యువతి మోనాలిసా భోస్లే ప్రేమ వివాహం చేసుకుంది. కేరళలోని పూవార్ అరుమనూర్‌లో ఉన్న నైనార్ ఆలయంలో ఈ వివాహ వేడుక జరిగింది. కేరళ మంత్రి వి. శివన్కుట్టి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. గోవిందన్ ఈ వేడుకకు హాజరైనట్లు కేరళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఫేస్బుక్ ద్వారా ప్రేమలో.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మోనాలిసాకు మహారాష్ట్రకు చెందిన ఫర్మాన్ ఖాన్ ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు. మతాలు వేరు కావడంతో మోనాలిసా తండ్రి జై సింగ్ భోంస్లే ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. ది డైరీ ఆఫ్ మణిపూర్ అనే సినిమా షూటింగ్ కోసం మోనాలిసా కేరళకు రాగా, తండ్రి కూడా అక్కడకు వెళ్లి ఆమెతో గొడవకు దిగారు. దీంతో ప్రాణహాని ఉందని భయపడిన ఈ జంట, తమ ప్రేమను కాపాడుకునేందుకు పోలీసులను ఆశ్రయించారు. తన తండ్రి విజయ్ సింగ్ భోస్లే తను చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మోనాలిసా ఫిర్యాదులొ పేర్కొంది. పోలీసుల సమక్షంలో పెళ్లి..తాను మేజర్ని అని..ఇష్టమైన వ్యక్తితో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మోసాలిసా చెప్పడంతో భద్రత కలిపించామని పోలీసులు చెప్పారు. శారీరకంగా ఆమెకు ఎలాంటి వేధింపులు జరగలేదని కేవలం బలవంతపు వివాహ ప్రతిపాదన వల్లే పోలీసులు జోక్యం కోరుకుందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. మోనాలిసా పెళ్లికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. Viral #KumbhMela fame #Monalisa Bhosle has reportedly married her boyfriend Farman Khan at a temple in Thiruvananthapuram. The couple has sought protection from #Kerala Police amid family opposition to their relationship.Monalisa from Indore, Madhya Pradesh, shot to fame after a… pic.twitter.com/P41vBSCLZs— Ashish (@KP_Aashish) March 11, 2026മോനാലിസക്ക് കേരളത്തിൽ കല്യാണം ❤️ #Monalisa pic.twitter.com/TIe52jPOAq— Unni Rajendran (@unnirajendran_) March 11, 2026 -
Women's Day: ఇడ్లీలు అమ్ముతూ.. రిసెర్చ్ స్కాలర్ విజయ గాథ
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ సందర్భంగా స్ఫూర్తిదాయక మహిళలను గుర్తుచేసుకోవడం మన కర్తవ్యం. కేరళకు చెందిన రేవతి విజయన్ ఓ వైపు ఉన్నత చదువుల కోసం ‘పరిశోధన’ సాగిస్తూ, మరోవైపు కుటుంబాన్ని ఆదుకునేందుకు అర్ధరాత్రి వరకు ఇడ్లీల వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఒట్టపాలం మయన్నూర్ వంతెన సమీపంలో రాత్రిపూట రోడ్డు పక్కన ఆమె నడుపుతున్న చిన్నపాటి ఇడ్లీ స్టాల్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది.త్రిస్సూర్ జిల్లా పజయన్నూర్ నివాసి అయిన 30 ఏళ్ల రేవతికి చిన్నప్పటి నుంచి చదువంటే ఎంతో మక్కువ. తండ్రి విజయన్ టైలర్ కాగా, తల్లి ప్రియ పాఠశాలలో వంట మనిషిగా పని చేస్తున్నారు. త్రిస్సూర్‌లోని విమల కళాశాలలో మలయాళంలో డిగ్రీ, అనంతరం ఒట్టపాలం ఎన్ఎస్ఎస్ కళాశాలలో రేవతి బీఈడీ పూర్తి చేశారు. తన చదువు ఖర్చుల కోసం కుటుంబంపై భారం పడకూడదనే ఉద్దేశంతో రేవతి ట్యూషన్లు చెబుతూ, ఆర్థిక స్వాలంబన సాధించారు.వివాహం, ఇద్దరు పిల్లల బాధ్యతల మధ్య తన విద్యాభ్యాసం ఆగిపోతుందేమోనని రేవతి ఆందోళన చెందారు. అయితే తిరిగి పుస్తకం చేత పట్టి, పీజీ పూర్తి చేయడమే కాకుండా, గోల్డ్ మెడలిస్ట్గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. మొదటి ప్రయత్నంలోనే ‘నెట్’ (NET) అర్హత సాధించారు. అనంతరం రేవతికి పీహెచ్డీ చేసే అవకాశం లభించింది. అయితే ఇందుకోసం ప్రతిరోజూ పజయన్నూర్ నుంచి త్రిస్సూర్ వరకు ప్రయాణించడం ఆర్థికంగా భారమైంది. దీంతో రాత్రిపూట ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్న రేవతి మయన్నూర్ వంతెన వద్ద ‘ఫ్రెష్ మూన్’ పేరుతో ఇడ్లీ స్టాల్ ప్రారంభించారు.కేవలం సాధారణ ఇడ్లీలే కాకుండా.. తట్టు ఇడ్లీ, మసాలా ఇడ్లీ, ఎగ్ ఇడ్లీ, మటన్ ఇడ్లీ, చికెన్ ఇడ్లీ, పొడి ఇడ్లీ వంటి దాదాపు 10 రకాల వైవిధ్యమైన రుచులతో వినియోగదారుల మనసు గెలుచుకుంటున్నారు. రేవతి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కళాశాలలో పరిశోధన పనుల్లో నిమగ్నమై, సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 12:30 గంటల వరకు స్టాల్ దగ్గర కష్టపడుతుంటారు. ఈ ప్రయాణంలో ఆమె భర్త అనూప్, సోదరి గౌరీ నంద ఆమెకు సాయంగా నిలుస్తున్నారు. ఇది కూడా చదవండి: రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం -
రూపాయికే బ్రాండెడ్ షూస్.. ఎగబడిన జనం
కోజికోడ్: కేరళలోని కోజికోడ్ నగరంలో ఈరోజు (ఆదివారం) ఉదయం పెను కలకలం చెలరేగింది. కేవలం ఒక్క రూపాయి నోటు ఇస్తే విలువైన షూస్ ఉచితంగా ఇస్తామన్న ప్రకటన వేలాది మందిని అమితంగా ఆకర్షించింది. కొత్తగా ప్రారంభమైన ఒక పాదరక్షల దుకాణం ప్రచార ఆర్భాటం కాస్తా లాఠీచార్జీకి దారితీసింది. తొక్కిసలాటలో పలువురు చిన్నారులు గాయపడటం ఆందోళనకరంగా మారింది.కోజికోడ్ నగరంలోని ప్రఖ్యాత మానంచిర ప్రాంతంలో ‘ట్రెండ్ ఫ్యాక్టరీ’ (Trend Factory) అనే కొత్త షూ స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా యాజమాన్యం ఒక వినూత్న ప్రకటన చేసింది. పాత ఒక రూపాయి నోటుతో వచ్చే మొదటి 100 మంది వినియోగదారులకు బ్రాండెడ్ షూస్ ఉచితంగా అందిస్తామని, ఆ తర్వాతి 100 మందికి చేతి గడియారాలు బహుమతిగా ఇస్తామని ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు.ఈ ప్రకటన క్షణాల్లో వైరల్ కావడంతో, నగరంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో యువకులు, విద్యార్థులు, చిన్నారులు దుకాణానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిజానికి స్టోర్ ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ఆఫర్ దక్కించుకునేందుకు జనం తెల్లవారుజామున 2 గంటల నుంచే క్యూ కట్టారు. దుకాణం దగ్గరకు వేల సంఖ్యలో జనం చేరుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.ఒకరినొకరు నెట్టుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన షోరూం నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు గుంపును నియంత్రించేందుకు ప్రయత్నించినప్పటికీ, జనం వెనక్కి తగ్గకపోవడంతో వారు లాఠీచార్జీ చేయాల్సి వచ్చింది. ఈ తొక్కిసలాటలో, పోలీసుల లాఠీచార్జీలో పలువురు చిన్నారులకు గాయాలయ్యాయి. పోలీసులు స్టోర్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. ముందస్తు అనుమతులు లేకుండా, ఇలాంటి భారీ కార్యక్రమాలు నిర్వహించడంపై కేసు నమోదు చేశారు.ఇది కూడా చదవండి: రష్యాలో ఆఫ్రికన్ యువత మృత్యు ఘోష -
‘కేరళ స్టోరీ’పై రాహుల్ విమర్శలు.. తిప్పికొట్టిన తివారీ భార్య
న్యూఢిల్లీ: ఇటీవల విడుదలైన ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తోంది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎవరూ ఆసక్తి చూపడం లేదని, ఇది కేవలం విద్వేషాన్ని పెంచే సాధనంగా మారిందని ఆయన విమర్శించారు. అయితే ఈ చిత్రానికి బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ మద్దతుగా నిలిచారు.‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీ ఈ సినిమాపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘కేరళ సంస్కృతి, అక్కడి సంప్రదాయాలపై దేశ ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. అందుకే ‘ది కేరళ స్టోరీ 2’ వంటి చిత్రాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక వర్గాన్ని కించపరచడానికి, సమాజంలో చీలికలు తీసుకురావడానికి సినిమాలను వాడుకుంటున్నారు. దీనివల్ల కొన్ని శక్తులు రాజకీయ లబ్ధి పొందుతుంటే, సామాన్య ప్రజలు నష్టపోతున్నారు’ అని రాహుల్పేర్కొన్నారు. భావప్రకటన స్వేచ్ఛపై కూడా రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు.‘ఎవరైనా తమ గొంతు వినిపించాలని చూస్తే వారిపై దాడులు జరుగుతున్నాయి. అయితే కొన్ని వర్గాలకు అనుకూలమైన కథనాలను యధేచ్ఛగా ప్రచారం చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు’ అని రాహుల ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాహుల్ విమర్శలకు భిన్నంగా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ భార్య సురభి తివారీ ఈ చిత్రానికి మద్దతుగా నిలిచారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. ‘లోకం అన్న తర్వాత రకరకాల మాటలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఇంటి వద్ద కూర్చుని విమర్శలు చేసే కంటే, థియేటర్లకు వెళ్లి సినిమా చూడమని నేను కోరుతున్నాను. ఆ తర్వాతే ఇది ప్రచార చిత్రమా లేక సమాజానికి అద్దం పట్టే వాస్తవమా అనేది అర్థమవుతుంది. హిందూ అమ్మాయిలు ఎదుర్కొంటున్న వేధింపులకు ఇది నిదర్శనం. ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని ఆమె పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: డేరా బాబా కేసు.. పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు -
మహిళల శబరిమల..! ఆటుకాల్ భగవతి
కేరళ పేరు వినగానే మన తెలుగువారికి భక్తితో అయ్యప్పస్వామి గుర్తుకొస్తారు శబరిమల యాత్ర మనకి గొప్ప అనుభూతినిస్తుంది. శబరివాసుడు అయ్యప్పస్వామి దర్శనం ఇంచుమించుగా పురుషులకి మాత్రమే అయితే స్త్రీలకి మాత్రమే ఏటా ఒకసారి పొంగలి సమర్పించే దేవాలయం ఆటుకాల్ భగవతి క్షేత్రం. ఈ క్షేత్రం కేరళ రాజధాని తిరువనంతపురం నగరంలో ఉంది. ఏటా ఫిబ్రవరి, మార్చినెలలలో ఆటుకాల్ భగవతికి తొమ్మిది రోజులు పూజలు నిర్వహించి పొంగలి సమర్పిస్తారు. కేరళ రాష్ట్రం నలుమూలల నుండి అలాగే దేశ విదేశాలలో ఉండే మలయాళీ స్త్రీలు లక్షలలో భగవతికి పొంగాల (పొంగలి) సమర్పించడానికి వస్తారు. ఆరోజు కేరళ రాష్ట్ర రాజధాని స్త్రీలతో నిండిపోతుంది. పొంగాల సమర్పించడానికి పొయ్యి, వంట దినుసులు మాన్తా కోసం వంటచెరకు సిద్ధం చేసుకుంటారు. లక్షలాది మంది స్త్రీలు ఒకచోట చేరి దేవికి ప్రసాదం వండడం గిన్నెస్ బుక్ రికార్డు. ప్రతి ఏటా ఆ రికార్డు తిరగ రాయడం భగవతి శక్తికి నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ కార్యక్రమంలో కేవలం స్త్రీలు మాత్రమే పాల్గొనాలి. పురుషులకి ప్రాధాన్యత లేదు. స్త్రీలు తమ జీవిత ఐశ్వర్యం కొరకు కుటుంబ అభివృద్ధి కోసం ఆటుకాల్ భగవతికి పొంగాల సమర్పించుకుంటారు. పొంగాల స్త్రీలు నగరం వీధులలోను రోడ్డు మీద ఇంటి అరుగు మీదా చేసుకుంటారు. ఇంకా చె΄్పాలంటే... ఇందులో పాల్గొనేవాళ్ళు అందరు భగవతి స్వరూపంగా భావించి ఎంతో భక్తి, గౌరవం చూపుతారు. స్త్రీలు స్నానం చేయడానికి, బట్టలు మార్చడానికి అన్ని సౌకర్యాలు జాతిమతం;పేదా గొప్పా భేదం లేకుండా చూసుకుంటారు. ఇన్నిలక్షలమంది స్త్రీలు ఒకచోట చేరినా, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జరగడం గొప్పవిశేషం. స్త్రీలు కొత్త వస్త్రాలు ధరించి కొత్త మట్టి కుండ, కర్రలు మూడు ఇటుకలు, పాలు, బియ్యం, బెల్లం వంటివి తెచ్చుకుని తాము కూర్చునే చిన్నస్థలాన్ని శుభ్రం చేసుకుంటారు. అంతకుముందు పారిశుధ్య కార్మికులు నగర వీధులు అంతటా శుభ్రం చేస్తారు. ఇక్కడ జరిగే ఒక అద్భుతం ముహూర్త సమయానికి చిరుజల్లులు పడి ఆ ప్రదేశం అంతా పవిత్రంగా మారడం. ఇది ప్రతి యేటా కనిపించే సత్యం. దేవి చైతన్యానికి నిదర్శనం. అందరూ ముందుగా ఇటుకలు పేర్చి కొత్త మట్టికుండలో పాలు, బెల్లం, బియ్యం పోసి సిద్ధంగా ఉంచాలి. ఆటుకాల్ భగవతి ముందు పూజారి పొయ్యి వెలిగించి పొంగాల వండటం ప్రారంభిస్తారు. ఆ పొయ్యి నుండి దీపాన్ని వెలిగించి పూజారులు నాలుగువైపులా తిరుగుతూ తీర్థంతో సంప్రోక్షణ చేస్తారు. స్త్రీలు తాము సిద్ధం చేసిన పొయ్యిలో తాము తెచ్చిన దీపంతోనే అగ్ని వెలిగిస్తారు. స్త్రీలు, వారి వెంట వచ్చిన వారు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవతిని ప్రార్థిస్తారు. భగవతికి సమర్పించిన పొంగాల ఎంతగా పొంగి పొయ్యిలోకి పొర్లుతుందో అంతగా తమ జీవితాలలో ఐశ్వర్యం కలుగుతుందని నమ్మకం.ప్రతి సంవత్సరం మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి హైదరాబాద్ నగరాల నుంచి రైలు తిరువనంతపురం నగరానికి వెళ్తోంది. ఇంకా కేరళలోని ఎర్నాకులం తిరువనంతపురం చేరడానికి విమాన మార్గం ఉంది.(ఈ యేడు ఫిబ్రవరి 23న మొదలైన ఆటుకాల్ పొంగాల్ ఉత్సవాలు మార్చి 4 వరకు జరిగాయి).– ఇ.ఎస్. మాధవన్, విశాఖపట్నం చదవండి: వెలుగులతో రంగులు మార్చే భూమి..! -
శబరిమలలో ‘మహిళలకు ప్రవేశం’ కేసు.. టీడీబీ ఆఫీస్ నుంచి ఫైళ్లు మాయం
తిరువనంతపురం: శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన కేసు ఫైళ్లు.. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) ప్రధాన కార్యాలయం నుంచి మాయమైనట్లు సమాచారం. ఇటీవల సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించడానికి సిద్ధమవుతున్న సమయంలో అధికారులు పాత ఫైళ్ల కోసం వెతికిన వేళ ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు పత్రాల కాపీలు కూడా అందుబాటులో లేవని తెలియడంతో టీడీబీ అధ్యక్షుడు కె.జయకుమార్, బోర్డు ఇతర సభ్యులు షాక్ అయ్యారని తెలుస్తోంది. ఆయా రికార్డులు ఏమయ్యాయో తమకు తెలియదని అధికారులు తెలిపారు. కాగా, 2007లో శబరిమలలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతించవచ్చని వీఎస్ అచ్యుతానందన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో తమ వైఖరిని తెలిపింది.ఆ తర్వాత 2016లో ఊమెన్ చాందీ ప్రభుత్వం, ప్రయార్ గోపాలకృష్ణన్ నేతృత్వంలోని దేవస్వం బోర్డు మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేశాయి. 2016 నవంబర్‌లో పినరయి విజయన్ ప్రభుత్వం మహిళల ఆలయ ప్రవేశానికి మద్దతు ఇస్తూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. ఆ సమయంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ప్రత్యేక అఫిడవిట్ సమర్పించలేదు. -
‘కుచేలుని’ ఇఫ్తార్ విందు: వేదికపై అపురూప దృశ్యం
త్రిశూర్: కళకు మతం అడ్డుకాదని, భక్తికి ఆచారాలు సరిహద్దులు కావని కేరళకు చెందిన ఒక ముస్లిం కళాకారుడు చాటిచెప్పారు. రంజాన్ పవిత్ర మాసంలో కఠిన ఉపవాస దీక్షలో ఉన్న రషీద్ కారళం, బుధవారం సాయంత్రం తన కథాకళి అరంగేట్రానికి సరిగ్గా కొన్ని నిమిషాల ముందు గ్రీన్ రూమ్‌లో ఇఫ్తార్ విందు ముగించి వార్తల్లో నిలిచారు.కథాకళిలో అత్యంత సంక్లిష్టమైన కుచేలుడి వేషధారణలో ఉంటూనే, అజాన్ పిలుపు వినిపించగానే ఆయన తన దీక్షను విరమించి, నేరుగా రంగస్థలంపైకి అడుగుపెట్టారు. త్రిశూర్ జిల్లా ఇరింజలకుడలోని టౌన్ హాల్ వేదికగా జరిగిన ఈ అపురూప ఘట్టం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడమే కాకుండా, భారతీయ సంస్కృతిలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించింది. ప్రముఖ చిత్రకారుడు మోహన్‌దాస్‌ను సత్కరించేందుకు ‘యువకళా సాహితి’ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ‘కుచేలవృత్తం’ కథాకళి ప్రదర్శనను ఏర్పాటు చేశారు.ఈ ప్రదర్శనలో రషీద్ కారళం కుచేలుడి పాత్రను పోషించారు. కథాకళికి అవసరమైన భారీ మేకప్, ఆహార్యంతో సిద్ధమైన రషీద్.. ప్రదర్శన సమయం దగ్గరపడుతున్న తరుణంలోనే ఉపవాసం విరమించాల్సి వచ్చింది. తన గురువు కళానిలయం వినోద్ పర్యవేక్షణలో గత కొన్నేళ్లుగా కఠిన శిక్షణ పొందుతున్న రషీద్‌కు.. ప్రేక్షకుల మధ్య ఈ అరంగేట్రం చేయడం ఒక జీవితకాల స్వప్నం. ఆ కల సాకారమయ్యే క్రమంలో అటు మతపరమైన నిష్ఠను, ఇటు కళాభిమానాన్ని అద్భుతంగా సమన్వయం చేసుకున్నారు రషీద్.సామాజిక కార్యకర్త అయిన రషీద్ .. ఇరింజలకుడ కథాకళి క్లబ్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా, యువకళా సాహితి సంయుక్త కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. కేవలం కళాకారుడిగానే కాకుండా 'వీటిలె లైబ్రరీ' (ఇంటి లైబ్రరీ) పేరుతో పుస్తక పఠనాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ విశేష ప్రదర్శన సమయంలో రషీద్ కుటుంబ సభ్యులు భార్య రజియా, కుమారుడు షాహిల్, కుమార్తె డాక్టర్ షహానా , మనవరాలు కనల్ కతిర్ గ్రీన్ రూమ్‌లోనే ఉండి ఆయనకు సహకారం అందించారు.ఇది కూడా చదవండి: బాంబుల మోత మధ్య సౌదీ సర్కారు శుభవార్త -
తాళి కట్టే వేళ.. తల పైనుంచి మిసైళ్లు !
కొట్టాయం: పశ్చిమాసియాలో ముసురుకున్న యుద్ధ మేఘాలు ఒక కేరళ యువతి పెళ్లి కలలను నీరుగారుస్తున్నాయి. సరిగ్గా మరో వారం రోజుల్లో కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టాల్సిన ఆ వధువు ఇప్పుడు దుబాయ్‌లో చిక్కుకుని, విమాన సర్వీసుల పునరుద్ధరణ కోసం ఆందోళనగా ఎదురుచూస్తోంది.కేరళలోని చెర్తలాకు చెందిన 29 ఏళ్ల అన్మోల్ దుబాయ్‌లో ఒక ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఈ నెల 12న కొట్టాయం వడవత్తూరులోని మార్ అఫ్రెమ్ యాకోబైట్ సిరియన్ చర్చిలో మణర్కాడ్కు చెందిన ఫార్మసిస్ట్ ఆల్బిన్తో ఆమె వివాహం జరగాల్సి ఉంది. కుటుంబ సభ్యులు నిశ్చయించిన ఈ సంబంధంలో వధూవరులిద్దరూ ఇప్పటివరకు ప్రత్యక్షంగా కలుసుకోలేదు. కేవలం ఫోన్ కాల్స్ ద్వారానే తమ భావాలను పంచుకున్నారు. ఫిబ్రవరి 28న ఇండిగో విమానంలో కొచ్చికి చేరుకుని, వివాహ పనులకు సిద్ధం కావాలని ఆమె వేసుకున్న ప్లాన్ ఇప్పుడు ఇరాన్ డ్రోన్లు, మిసైళ్ల దాడులతో తలకిందులయ్యింది.దుబాయ్‌లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అన్మోల్ ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో విమానాలు నడుస్తున్నప్పటికీ, టికెట్ల ధరలు సామాన్యులకు అందనంత స్థాయికి చేరడం ఆమెను మరింత కలవరానికి గురిచేస్తోంది. చార్టర్డ్ విమానాల కోసం ట్రావెల్ ఏజెంట్లు డిమాండ్ చేస్తున్న భారీ మొత్తాన్ని చెల్లించడం ఆమెకు భారంగా మారింది. ప్రధాన వివాహ ముహూర్తం దగ్గర పడుతుండటంతో అటు దుబాయ్‌లో వధువు, ఇటు కేరళలో ఆమె కుటుంబం ఆందోళనలో చిక్కుకుంది.అన్మోల్ తండ్రి సుభాష్ కేరళలో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. తన కుమార్తె క్షేమంగా తిరిగి వస్తుందని ఆయన వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు. కేరళ ప్రవాస సంస్థ ‘నార్కా’ (NORKA) వెల్లడించిన వివరాల ప్రకారం విమానయాన సంస్థలు ఇంకా సాధారణ సేవలను పునరుద్ధరించలేదు. దీంతో కొందరు ప్రయాణికులు రోడ్డు మార్గంలో ఒమన్ చేరుకుని, అక్కడి నుండి విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు సౌదీ అరేబియా, కువైట్ మీదుగా కేరళ చేరుకోవాలని చూస్తున్నారు.ఇది కూడా చదవండి: భీకర యుద్ధం దిశగా పాక్-అఫ్గాన్?.. లక్షలాది మంది విలవిల -
పెయింటింగ్స్ రూపంలో డ్రగ్స్ రవాణా
బనశంకరి: చూస్తే ఆకర్షణీయమైన పెయింటింగ్స్ మాదిరిగా ఉంటాయి, కానీ అవి కోట్ల రూపాయల విలువజేసే డ్రగ్స్‌తో తయారైనవని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇలా బెంగళూరులో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న కేరళ జంటని పోలీసులు అరెస్టు చేసి రూ.11.50 కోట్ల విలువైన డ్రగ్స్‌ను స్వాదీనం చేసుకున్నారు. మంగళవారం నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. కేరళకు చెందిన అశ్విన్ (24), ముబీనా (25) బెంగళూరులో బీబీఏ చదవడానికి వచ్చి మధ్యలోనే చదువును ఆపేసి మత్తు పదార్థాల వ్యాపారంలోకి దిగారు. థాయ్‌లాండ్ నుంచి మత్తు పదార్థాలను తెప్పించేవారు.ఈ సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు అపార్ట్మెంట్ ఫ్లాట్‌పై దాడి చేసి అశ్విన్, ముబీనాను అరెస్టు చేసి రూ.11.50 కోట్ల విలువైన 8,335 ఎల్ఎస్డీ స్ట్రిప్స్, 5 కేజీల హైడ్రో గంజాయి, 534 గ్రాముల చరస్ తదితరాలను సీజ్ చేశారు. పెయింటింగ్స్ రూపంలో ఎల్ఎస్డీ స్ట్రిప్స్‌ను తయారు చేసి కావలసినవారికి విక్రయించేవారు. దీనివల్ల ఎవరికీ అనుమానం వచ్చేది కాదు. అలాగే చాక్లెట్లు, బిస్కెట్ బాక్సుల్లో హైడ్రో గంజాయి ప్యాక్ చేసి తరలించేవారు. -
మాజీ కేంద్ర మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత
కోజికోడ్: భారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ నేత కేపీ ఉన్నికృష్ణన్ (89) మంగళవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన 1980, 90వ దశకాల్లో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. గత కొంతకాలంగా ఆయన వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కేరళలోని కోజికోడ్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వడకర నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు లోక్‌సభకు ఎన్నికై రికార్డు సృష్టించిన ఉన్నికృష్ణన్.. విలువలతో కూడిన రాజకీయాలకు నిలువుటద్దంగా నిలిచారని చెబుతుంటారు.జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించిన ఉన్నికృష్ణన్ రాజకీయాల్లోకి ప్రవేశించి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. 1971లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా వడకర నుంచి పార్లమెంటులో అడుగుపెట్టిన ఆయన, ఆ తర్వాత 1977, 1980, 1984, 1989, 1991 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించారు. వీపీ సింగ్ కేబినెట్లో ఉపరితల రవాణా, కమ్యూనికేషన్ల శాఖ మంత్రిగా పనిచేశారు.నాడు గల్ఫ్ యుద్ధ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించే ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించి, అందరి ప్రశంసలు అందుకున్నారు.ఉన్నికృష్ణన్ ఆదర్శాలకు కట్టుబడి నడుచుకున్నారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. వి.కె. కృష్ణమీనన్‌కు అత్యంత సన్నిహితుడిగా, ఒకానొక సమయంలో ఇందిరా గాంధీకి నమ్మకస్తుడైన అనుచరుడిగా ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైన విభేదాల కారణంగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం కాంగ్రెస్ (యూ), కాంగ్రెస్ (ఎస్) పార్టీల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1981-84 మధ్య కాలంలో పార్లమెంటులో కాంగ్రెస్ (సెక్యులర్) పక్ష నేతగా, 1980-82లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. సుదీర్ఘ విరామం తర్వాత 1995లో తిరిగి సొంతగూడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.1936 సెప్టెంబర్ 20న జన్మించిన ఉన్నికృష్ణన్ విద్యాభ్యాసం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో సాగింది. చెన్నైలోనే న్యాయశాస్త్ర పట్టా పొందిన ఆయన విద్యార్థి దశలోనే సోషలిస్ట్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీల ద్వారా రాజకీయ ఓనమాలు దిద్దారు. 1960వ దశకంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి, 1962 నాటికే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (AICC) సభ్యుడిగా ఎదిగారు. ఒక జర్నలిస్టుగా, న్యాయవాదిగా, పార్లమెంటేరియన్‌గా పేరుగాంచిన ఆయన మృతికి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఖమేనీ హత్య: కేంద్రం తీరుపై నిప్పులు చెరిగిన సోనియా -
గాసిప్ మా బలం
స్త్రీలు గాసిప్ మాట్లాడుకుంటూ ఉంటారనే ఒక ప్రచారం ఉంటుంది. ఆడవాళ్ల కబుర్ల కింద వీటిని కొట్టేస్తూ ఉంటారు. కాని ‘గాసిప్’ స్త్రీల స్నేహానికి ఒక వారధి అని, స్త్రీలు ఒకరితో మరొకరు చెప్పుకునే ఈ కబుర్లే పురుషుడి పెత్తనం నుంచి బయట పడేసే ఓదార్పు అని అంటున్నారు అంజలీ కృష్ణదాస్. కేరళకు చెందిన ఈ రంగస్థల నటి మరో ఇద్దరు నటీమణులతో కలిసి ప్రచారం చేస్తున్న ‘గాసిప్’ నాటకం స్త్రీల స్నేహాలపై కొత్త దృష్టిని కలిగిస్తోంది.అర్థవంతమైన మాటలు, దేశాన్ని ఉద్దరించే మాటలు మగవాళ్లు మాట్లాడుకుంటారట... ఆడవాళ్లు ఉత్త పోచికోలు కబుర్లు చెప్పుకుంటారట. అలా అని ఎవరన్నారు? మగాళ్లే. ఆడవాళ్ల మాటలకు అర్థాలు ఉంటాయని, ఆడవాళ్ల మాటల్లో ఆలోచనలు ఉంటాయని వారికి తెలుసునా?‘తెలియ చేయాలి’ అంటారు అంజలి కృష్ణదాస్. ఈమె ‘కొచ్చి’కి చెందిన క్లాసికల్ డాన్సర్. మరో క్లాసికల్ డాన్సర్ పొన్ను సజీవ్తో కలిసి అక్కడ ‘తుడిప్పు డాన్స్ ఫౌండేషన్’ అనే సంస్థను నడుపుతున్నారు. తన సంస్థ ద్వారా అందరూ స్త్రీలే భాగస్వామ్యం వహించేలా ఒక నాటకం వేయాలని అనుకున్నప్పుడు ఆమె దృష్టికి వచ్చిన వస్తువు ‘గాసిప్’. దీనికి సరైన తెలుగు మాట లేదు. గుసగుసలు, కబుర్లు, చాడీలు, పుకార్లు... అన్నీ కలిపితే గాసిప్. ఆడవాళ్లు ‘గాసిప్’ ఎందుకు మాట్లాడతారు? వాళ్లు మాట్లాడేదంతా గాసిప్పేనా? ఆ సంగతి చర్చించడానికే 45 నిమిషాల ‘గాసిప్’ అనే డాన్స్ డ్రామా సృష్టించారు అంజలి కృష్ణదాస్, పొన్ను సజీవ్.గాసిప్‌కు మూలం ఏమిటి?‘గాసిప్’ ఇంగ్లిష్ మాటకు మూలం గాడ్సిబ్. పూర్వం నెలలు నిండిన స్త్రీలు ఇంటి బయటకు వచ్చేవారు కాదు. ప్రసవం అయ్యాక కూడా కొన్నాళ్లు వాళ్లు బయటకు రావడానికి వీలుండదు. మరి ఇంట్లో అలాగే మగ్గితే విసుగెత్తి పోతారు. అందుకే ఆ సమయంలో నమ్మకంగా ఇంటికొచ్చి ఇరుగూ పొరుగున ఏం జరుగుతుందో చెప్పే స్నేహితురాళ్లను గాడ్సిబ్ అనేవారు. నెమ్మదిగా ఆ మాట నుంచి గాసిప్ పుట్టింది. ‘గాసిప్‌ను కాలక్రమంలో చెడ్డ మాటను చేశారు. కాని అది స్త్రీల మధ్య స్నేహానికి సంబంధించిన పదం. ఆ పూర్వపు మర్యాద ఆ పదానికి తీసుకురావడమే మా ప్రయత్నం’ అన్నారు అంజలీ కృష్ణదాస్.బూట్లూ– హైహీల్సూ‘గాసిప్’ నాటకంలో చాలాచోట్ల మగవాళ్ల బూట్లు ప్రదర్శిస్తారు నటీమణులు. ‘హీరో బూట్ల మీదే షాట్ ఓపెన్ చేస్తారు ఎందుకు? బూట్లు అధికారానికి, పురుష స్వామ్యానికి, పీడనకి గుర్తు. ఈ సినిమాలో బూట్ల బరువును ఆడవాళ్లు తోటి ఆడవాళ్ల సాయం, మాట సాయం వల్లే మోస్తారు. ఆఖరున వారు బూట్ల రాసి మధ్యన తమ హైహీల్స్ బయటకు తీయడంతో నాటకం ముగుస్తుంది’ అంటారు అంజలి.‘గాసిప్’ నాటకానికి విశేష ఆదరణ లభిస్తున్నదంటే విచిత్రం ఏముంది. స్త్రీలు చేసే కొత్త ఆలోచనలకు ఎప్పుడూ ప్రశంసలే కదా. అపాయంలో ఉపాయంస్త్రీలు గాసిప్ మాట్లాడని చోటు ఉండదు. వంటిగది, బ్యూటీ సెలూన్, రేషన్ షాప్, వీధి మలుపు, ఇంటి పిట్టగోడ... ఈ పిట్టగోడ మీద అనేక కార్టూన్లు కూడా ఉన్నాయి. ‘కాని స్త్రీల కబుర్లన్నీ వారు తమ నిత్య జీవితంలో ఎదుర్కొనే వొత్తిడిని, పురుషుల పెత్తనాన్ని దూరం చేసేవే. వారు సాటి స్త్రీలతో మాట్లాడి సలహాలు తీసుకుంటారు, సూచనలు అందుకుంటారు, అపాయాల్లో ఉంటే ఉపాయాలు తెలుసుకుంటారు... పురుషుణ్ణి ఎదుర్కొనడమే వీటన్నింటి లక్ష్యం. తరతరాలుగా గాసిప్ మాట్లాడుతూ స్త్రీలు తమ నిత్య జీవితంలోని ఘర్షణలను దాటుతున్నారు’ అంటారు ‘గాసిప్’ రూపకర్తలు. -
తొలి మహిళా ఐఏఎస్ అధికారి..! ఆఖరికి పెళ్లి కూడా..
పితృస్వామ్య విధానం బలంగా ఉన్న రోజుల్లో..ఉద్యోగం చేయడం అంటేనే అతి కష్టమైన, అనితరసాధ్యమైన ఆశయం. అలాంటిది ఈ మహిళ ఏకంగా ఐఏఎస్ అవ్వాలనుకుంది. అస్సలు ఆ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఏకైక మహిళ కూడా ఆమెనే కావొచ్చు. పోనీ కష్టపడి ప్రతిష్టాత్మకమైన సివిల్స్ సర్వీస్‌లో ఉత్తీర్ణురాలైనా..కూడా ఎన్ని అవరోధాలంటే..ముఖ్యమంత్రి దగ్గర నుంచి, గవర్నర్ వరకు అందరు ఒక మహిళ ప్రజావసేవలోనా..! అని కనుబిమ్మలు, పెదవులు విరిచారు. పైగా ఆమెకు మరో హోదాని ఎంచుకోమని సూచించేవారు. కానీ ఆమె అచంచలమైన ధైర్యంతో వాళ్లందర్నీ ఒప్పించి మరి..భారతదేశపు తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి అయ్యింది. పురుషులతో సమానంగా ప్రజారంజకంగా పాలన సాగిస్తూ..అందరిచేత మన్ననలను అందుకోవడమే గాక..ఇలాంటి అత్యుతన్నపదవిలో పురుషుల కంటే మహిళలే మేటీ అని రుజువు చేసిందామె.ఆ మహిళే..అన్నా రాజమ్ మల్హోత్రా. కేరళలోని కోజికోడ్‌లో జన్మించిన అన్నా మలబార్ క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది. చెన్నైలోని ప్రెసిడెన్సీ కాలేజీ (అప్పటి మద్రాస్)లో బి.ఏ. ఆనర్స్ పూర్తి చేసింది. ఆ సమయంలో మహిళలకు కొన్ని వృత్తిపరమైన అవకాశాలు అందుబాటులో ఉండటంతో, అన్నా చెన్నైలోని అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో ఉన్నత డివిజన్ క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించింది. 1950లో తన ఇంజనీర్ బంధువు సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం దరఖాస్తు ఫారమ్‌ను ఇంటికి తీసుకువచ్చే వరకు ఆమెకు సివిల్ సర్వీస్‌లో చేరాలనే ప్లాన్స్ ఏమి లేవు. చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమెకు అంత పెద్ద ఆశయాలు మొదట్లో ఏమిలేవు. పైగా ఆ బంధువు పంపించిన ఆ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ దరఖాస్తు రుసుము రూ. 140లు. అది ఆ సమయంలో ఆమెకు పెద్ద మొత్తమే. అయితే ఆ ఫీజు కట్టేందుకు తన స్నేహితుడి తల్లి ముందుకు వచ్చింది. సరిగ్గా 1952లో ఇంటర్వ్యూ రౌండ్లో, అన్నా IAS అధికారిణి కావాలనే తన కోరికను వ్యక్తం చేసినప్పుడు, ఇంటర్వ్యూ కమిటీ ఆమెకు విదేశీ సేవ కోసం ప్రయత్నించమని సూచించింది. ఎందుకంటే అది మహిళలకు మరింత అనుకూలంగా ఉంటుంది. అంతేగాదు ఆఖరికి ఆమె ఏ పోస్ట్ ఇవ్వాలన్నిది కూడా పెద్ద చర్చనీయాంశంగా మారింది నాయకులకు, అధికారులకు. ప్లీజ్ ఒక్క అవకాశం ఇవ్వండి..ఎందుకంటే..భారతదేశ మాజీ గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి (అప్పటి మద్రాస్) ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆమెను ఇంటర్వ్యూ చేశారు. మహిళలు ప్రజాసేవలో కొనసాగడం ఇష్టం లేదని నిర్మోహమాటం లేకుండా ఆమె ముఖం మీదే చెప్పేశారు. ‘మీరు నాకు అవకాశం ఇవ్వాలి’ అంటూ ఆయన్ను ఒప్పించి మరి ఐఏఎస్ అధికారి అయ్యింది అన్నా. అయితే బాధ్యతలు తీసుకునే ముందు సైనిక శిక్షణతో సహా గుర్రపు స్వారి, రివాల్సర్ ఉపయోగించటం తదితరాలన్ని పురుషులతో సమానంగా శిక్షణ తీసుకున్నారామె. ఆమె మొదటి పోస్టింగ్‌లో తిరుపత్తూరు (తమిళనాడు) సబ్-కలెక్టర్‌గా ఉంది. అన్నా రాజంకు మద్రాస్ కేడర్ కేటాయించారు. తరుచుగా అన్నా పురుష అధికారులతో నిండిన గదిలో ఉండాల్సి వచ్చేది. ఆ టైంలో ఒక స్తీకి ఉండాల్సిన కనీస వసతులు ఏమి లేవు అన్నాకి. ఆమె ధైర్యం ఏ రేంజ్లో ఉండేదంటే..తమిళనాడులోని డెంకనికొట్టై అడవి నుంచి ఏనుగులు గుంపు దారితప్పి బహిరంగ వ్యవసాయ భూమిలోకి తిరుగుతూ..గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేస్తుండేది. దాదాపు 18 మైళ్ళు నడిచిన తర్వాత, జంతువులు హోసూర్ చేరుకున్నాయి. ఆందోళన చెందుతున్న నివాసితులు సహాయం కోసం అన్నా చక్కటి పరిష్కార మార్గం చూపారు. ఏనుగులు శబ్దానికి భయపడతాయి కాబట్టి..పెద్ద శబ్దం వచ్చే వాటితో ఆ ఏనుగుల మందవైపు సాగి తరిమికొట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆమె ప్లాన్ ఫలించి..ఆ వార్త పేపర్లో కూడా వచ్చింది. అయితే ఓ మహిళ అధికారి కావడంతో ఆమె చేసిన ఘనకార్యాన్ని అభినందించకపోగా..తీవ్రమైన అల్లర్లు చెలరేగితే ఆమె అణిచివేయగలదా? కాల్చమని ఆదేశాలు ఇవ్వగలదా?, మత పిచ్చివాళ్ళ దాడిని ఎదుర్కొనగలదా..?. అయినా అస్సలు మహిళకు ఎలా అంతటి అత్యున్నత పదవి ఇచ్చారంటూ విమర్శలు కురిపించారు. వాటిన్నంటిని అన్నా లెక్కచేయలేదు. ఇలాంటి ఎన్నో సవాళ్లను తన కెరీర్లో అధిగమించి ఉన్నతాధికారుల మన్ననలను అందుకున్నారామె. విద్యుత్ సరఫరా దగ్గర నుంచి ముంబైలోని నవా శేవా ఓడరేవు నిర్మాణం వరకు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారామె. అందుకుగానూ 1989లో అన్నాకు పద్మభూషణ్ లభించింది. తన కెరీర్లో ఎన్నో వైవిధ్యభరితమైన హోదాలను అలకరించారామె. అయినా ఎప్పుడూ కూడా ఆమె తాను ఒక మహిళగా కొన్ని విషయాల్లో మినహాయింపు ఇవ్వమని ఏ సమయంలోనూ అగడలేదామె. అంతేగాదు నియామక సమయంలో కూడా వివాహం జరిగితే మీ సేవ రద్దు చేయబడుతుందనే నిబంధన ఉండేది. దాన్ని కూడా ఆమె అంగీకరించింది. ఎందుకంటే ఆ టైంలో అవివాహిత మహిళలు లేదా వితంతువులు మాత్రమే సేవ రంగంలో ఉండాల్సి వచ్చేది. పెళ్లి, కుటుంబం..అన్నా తన ఐఏఎస్ బ్యాచ్‌మేట్ రామ్ నారాయణ్ మల్హోత్రాని పెళ్లి చేసుకున్నారు. తన వివాహం సామాజిక ప్రతీకారానికి దారితీస్తుందని పూర్తిగా తెలిసినా (వారి మతాలు వేర్వేరు) వెనకడుగు వేయలేదు. వారిద్దరూ 1975లో వాషింగ్టన్, డిసిలో వివాహం చేసుకున్నారు. రామ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ స్థాయికి ఎదిగి 1997లో మరణించారు. ఇక అన్నా 2018లో మరణించారు. ఆమె ఆనాడు ధైర్యంగా వేసిన ఒక్క అడుగు ఇవాళ ఎంతోమంది మహిళామణులు ఐఏఎస్‌లు అయ్యేందుకు మార్గం సుగమం చేసింది. ఆమె మొదట ఈ అత్యున్నత పదవిలోకి వచ్చేటప్పుడూ..మొత్తం దారి చాలా కఠినంగా ఇరుకుగా ఉంది.. ఇప్పుడది..పువ్వులతో పరిచి అందరికీ స్వాగతం పలుకుతున్నట్లుగా మారింది. (చదవండి: ఆ కమెడియన్‌కి వెయిట్‌లాస్ మందులు అస్సలు పనిచేయలేదు..! కారణం అదేనా..) -
ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసిన స్టార్ హీరో.. ప్రోమో రిలీజ్
సాధారణంగా సినీ తారలను, రాజకీయ నాయకులను జర్నలిస్టులు ఇంటర్వ్యూ చేస్తుంటారు. కానీ కేరళలో ఓ అరుదైన ఇంటర్వ్యూ జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ను మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇంటర్వ్యూ చేశాడు. దీనికి సంబంధించిన 'ప్రోమో' తాజాగా విడుదలై సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన 'క్లిఫ్ హౌజ్' ఈ ప్రత్యేక ఇంటర్వ్యూకి వేదికైంది. సాధారణంగా గంభీరంగా కనిపించే ముఖ్యమంత్రి, మోహన్ లాల్ అడిగిన ప్రశ్నలకు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చినట్లు ప్రోమో ద్వారా తెలుస్తోంది.ఈ ఇంటర్వ్యూలో వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, ప్రభుత్వ పాలన వంటి అంశాలపై ముఖ్యమంత్రి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మోహన్ లాల్ ఒక ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆయన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కూడా ఇదే తరహాలో ఇంటర్వ్యూ చేసి మెప్పించారు. ఇప్పుడు పినరయి విజయన్‌తో ఆయన చేసిన సంభాషణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ఇంటర్వ్యూ జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.ఇది ప్రభుత్వ పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్) ప్రయత్నాల్లో భాగమేనని విపక్షాలు ఇప్పటికే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఒక నటుడిగా కాకుండా, ఒక సామాన్య పౌరుడిగా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కలిగే అనుభూతి ప్రత్యేకం’ అని ఈ సందర్భంగా మోహన్ లాల్ అభిప్రాయపడ్డారు. The teaser for the special Mohanlal interview of Kerala CM Shri Pinarayi Vijayan.. Superstar-turned-interviewer at Cliff House—covering life, politics, governance & even CM’s love for films! 🔥Titled “കണ്ടും മിണ്ടിയും ഇരുവർ” (or “Iruvar”), full episode coming soon. Buzz is… pic.twitter.com/qgL6gBl9iB— John Brittas (@JohnBrittas) February 24, 2026 -
‘కేరళం’గా పేరు మార్పు.. కేంద్రంపై శశిథరూర్ సీరియస్
తిరువనంతపురం: కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మండిపడ్డారు. రాష్ట్రాలు, పట్టణాల పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ద అభివృద్ధి ఎందుకు లేదని అసహనం వ్యక్తం చేశారు. కేరళ పేరు మార్చారు కానీ.. అభివృద్ధిని మర్చిపోయారని విమర్శలు గుప్పించారు.కేరళ పేరును కేరళంగా మార్చడంతో ఎంపీ శశిథరూర్ మరోసారి స్పందించారు. ఈ సందర్బంగా శశిథరూర్.. కేంద్ర ప్రభుత్వానికి పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఎందుకు లేదు?. కేరళకు కేంద్రం ఒక్క ఎయిమ్స్ కానీ, కొత్త విద్యా సంస్థలు కానీ ఇవ్వలేదు. బడ్జెట్లో ఒక్క ప్రాజెక్టు కూడా కేటాయించలేదు. కానీ పేరు మార్చమంటే మాత్రం వెంటనే ఆమోదిస్తారు. మలయాళంలో ఇప్పటికే దాన్ని ‘కేరళం’ అనే పిలుస్తారని, ఇప్పుడు ఇంగ్లీషులోకి కూడా అదే పదాన్ని తీసుకురావడంలో అర్థం లేదు. ఇప్పుడు కేరళ ప్రజలను ఏమని పిలవాలి.. ‘కేరళమైట్’ అందామంటే అదేదో బ్యాక్టీరియాలా అనిపిస్తోంది. ‘కేరళమియన్’ అందామంటే ఖనిజంలా ఉంది’ అంటూ ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. కేరళలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, అంతకుముందే.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్.. అన్ని భారతీయ భాషల్లోనూ ‘కేరళం’ అనే పేరు ఉండాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడంతో మంగళవారం జరిగిన సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో, కేరళ పేరు మార్పు జరిగింది. -
కేరళ ‘కేరళం’.. బెంగాల్ ‘బంగో’ అయ్యేదెన్నడు?
న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రం పేరును అధికారికంగా ‘కేరళం’గా మారుస్తూ పంపిన ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయం ద్వారా దశాబ్దాల కాలంగా మలయాళీలు కోరుకుంటున్న తమ రాష్ట్ర అసలు పేరు పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. త్వరలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేరళ పేరు మార్పునకు సానుకూలంగా స్పందించిన కేంద్రం, పశ్చిమ బెంగాల్ విషయంలో కొన్ని దశాబ్దాలుగా విముఖత వ్యక్తం చేయడం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది.పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగో’ లేదా 'బంగ్లా'గా మార్చాలని నాటి జ్యోతి బసు నుండి నేటి మమతా బెనర్జీ వరకు కనీసం నాలుగు సార్లు అసెంబ్లీ తీర్మానాలు చేసినా కేంద్రం వాటిని తిరస్కరించింది. ముఖ్యంగా అక్షర క్రమం ప్రకారం అధికారిక సమావేశాల్లో తమ రాష్ట్రం(వెస్ట్ బెంగాల్) పేరు చివరన రావడం వల్ల, తమకు మాట్లాడే అవకాశం అందరికంటే చివర్లో వస్తోందని, తద్వారా రాష్ట్ర సమస్యలను వివరించే సమయానికి ఏకాగ్రత తగ్గుతోందని మమతా బెనర్జీ గతంలో వాదించారు.2016లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు పేర్లు (ఆంగ్లంలో బెంగాల్, బెంగాలీలో బంగ్లా, హిందీలో బంగాల్) విధానాన్ని కేంద్రం తిరస్కరించింది. రాష్ట్రం మొత్తానికి ఒకే పేరు ఉండాలని కేంద్రం స్పష్టం చేయడంతో, 2018లో ‘బంగ్లా’ అనే పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించినా, ఆ పేరు పొరుగు దేశమైన 'బంగ్లాదేశ్'ను పోలి ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.కేరళ ప్రతిపాదన ఆమోదం పొందడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. కేరళలో బీజేపీ, సీపీఎం మధ్య ఉన్న రహస్య ఒప్పందం వల్లే ఈ నిర్ణయం వేగంగా జరిగిందని ఆమె ఆరోపించారు. బెంగాల్‌పై కేంద్రం వివక్ష చూపుతోందని, అయినా తాము ‘బంగ్లా’ పేరు కోసం పోరాడుతూనే ఉంటామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రాల పేర్ల మార్పులో పార్లమెంటుదే తుది నిర్ణయం అయినందున ఈ విషయంలో బెంగాల్ పేరు మార్పునకు వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. ఇది కూడా చదవండి: చావబోయే పాక్ ప్రధానిని కాపాడా: ట్రంప్ -
‘ది కేరళ స్టోరీ 2’పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
‘ది కేరళ స్టోరీ2’ సినిమాపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విడుదలకు ముందే ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని చిత్రబృందాన్ని ఆదేశించింది. ఈ సినిమా సెన్సార్‌ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం కేరళ హైకోర్టులో విచారణ జరిగింది. సాధారణంగా కోర్టులు సినిమాలకు సంబంధించి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో అంతగా కల్పించుకోదు. కానీ ఈ సినిమా టైటిల్లో రాష్ట్రం పేరు ఉపయోగించారని, అందుకే ఈ కేసును విచారణకు అంగీకరించినట్లు కోర్టు తెలిపింది. ఈ నెల 25న ముందుగా ఈ సినిమాను కోర్టులో ప్రదర్శించాలని, ఆ తర్వాతే సెన్సార్ విషయంలో జోక్యం చేసుకుంటామని ధర్మాసనం తేల్చి చెప్పింది. 2023లో వివాదాల మధ్య విడుదలైన ‘ది కేరళ స్టోరి’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సెన్సార్ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమాలో కేరళను తప్పుగా చూపించారని ఆరోపణలు చేస్తూ పలువురు కోర్టు మెట్లు ఎక్కారు. ఫిబ్రవరి 25 తర్వాత హైకోర్టు తన తీర్పుని వెలువరించనుంది. ఫిబ్రవరి 27న ఈ చిత్రం విడుదల కాబోతుంది. -
"పచ్చందనమే పచ్చదనమే"..!
కేరళలోని మున్నార్, సమ్మర్లో ఒక ప్రత్యేక ప్రదేశంగా మారిపోతుంది. పర్వత శ్రేణుల మధ్య పచ్చని టీ తోటలు తరంగాలా విస్తరించి ఉంటాయి. ప్రతి ఉదయం మెల్లగా తిరిగే ఫాగ్ కొత్త ఆకారంలో మన ముందుకు వస్తుంది. సూర్యకాంతి టీ ఆకులపై సౌమ్యంగా పడుతూ, పచ్చని రంగులను ప్రాణం పోస్తుంది.టీ తోటలుటీ తోటల మధ్య నడిచే మార్గంలో, భూమిపై ఏర్పడిన చిన్న రహదారులు ఒక రిథమ్‌లో ఉన్న మ్యూజికల్ నోట్స్‌లా అనిపిస్తాయి. ఆకుల మధ్య గాలి చిమ్మే సున్నితమైన శబ్దం, ఒక కొత్త అనుభూతిని కలిగిస్తుంది. మధ్యాహ్నం వెలుగు బంగారు వర్ణంతో పరిసరాలను చిత్రకళలా మార్చేస్తుంది. ప్రతి అడుగు ఒక కొత్త దృశ్యాన్ని తెస్తుంది, ప్రతి మూలలో కొత్త సుగంధం కనిపిస్తుంది.చిన్న గ్రామాల్లో...మున్నార్ ఇరుకులోని చిన్న గ్రామాల్లో వెళ్తే, అక్కడి సుగంధం మన మనసుకు నిలువరించకుండా చేరుతుంది. చెట్ల మధ్య కనిపించే నివాస గృహాలు, పర్వతాల దృశ్యాలు చూస్తే, ఇక్కడి జీవితం ఎంత ప్రశాంతంగా, సహజంగా ఉందో స్పష్టంగా తెలుస్తుంది. సాయంత్రం విస్తరించే ఫాగ్, ఎండాకాలాన్ని మరచి΄ోయేలా చేస్తుంది. జీవితాన్ని మరో కోణంలో చూసే, అంతులేని ప్రకృతిలో లీనమయ్యే అవకాశం ఇక్కడ లభిస్తుంది. (చదవండి: ’స్విస్ ఆల్ఫ్స్’ : వేసవిలో మంచు పరిమళం) -
కడు పేదరికం నుంచి మేయర్ రేసు దాకా, ఎవరీ నిత్య రామన్
న్యూయార్క్ మేయర్‌గా భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ రికార్డు సృష్టించగా, ఇపుడు భారత్‌కు చెందిన నిత్య రామన్ (Nithya Raman) లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో నిలిచారు. మమ్దానీ తరహాలోనే ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2026 లాస్ ఏంజిల్స్ మేయర్ రేసులో ప్రముఖంగా నిలుస్తున్న నిత్య రామన్ ఎవరు? ఆ వివరాలు మీకోసం.లాస్ ఏంజిల్స్ నగర రాజకీయాల్లో ప్రస్తుతం నిత్య రామన్ పేరు మారుమోగుతోంది. భారతీయ సంతతికి చెందిన నిత్య లాస్ ఏంజిల్స్ నగర పాలక మండలి సభ్యురాలు. ప్రస్తుతం మేయర్ పదవికి పోటీ పడుతున్నారు. కేరళలోజన్మించారు నిత్య రామన్. ఢిల్లీ , చెన్నైలలో తీవ్ర పేదరికాన్ని ఎదుర్కొంటూ, నీరు, ప్లంబింగ్ , ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాల కష్టాలు పడింది. ఆమెకు ఆరేళ్ల వయసులోనే నిత్య కుటుంబం, అమెరికాకు వలస వెళ్లింది. 44 ఏళ్ల నిత్య ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ థియరీలో డిగ్రీ, MIT నుండి అర్బన్ ప్లానింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు.ఇదీ చదవండి: సినీ ఫక్కీలో మైనర్ల దాడి, ఫుటేజ్ సోషల్ మీడియాలో పోస్ట్రాజకీయాల్లోకిరాకముందు ఆమె అర్బన్ ప్లానర్ (నగర ప్రణాళికా నిపుణురాలు) గా పని చేశారు. 2020లో లాస్ ఏంజిల్స్ సిటీ కౌన్సిల్ (డిస్ట్రిక్ట్ 4)కు ఎన్నికై చరిత్ర సృష్టించారు. లాస్ ఏంజిల్స్సిటీ కౌన్సిల్‌కు ఎన్నికైన మొదటి దక్షిణాసియా మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.కరెన్ బాస్‌కు గట్టి పోటీప్రస్తుత మేయర్ కరెన్ బాస్ (Karen Bass)కు వ్యతిరేకంగా ఆమె రంగంలోకి దిగడం అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. తన ఎన్నికల ప్రచారంలో "లాస్ ఏంజిల్స్ ఒక కీలక దశలో ఉంది, మార్పు అత్యవసరం" అని పిలుపుతో నిత్య ముందు కెళుతున్నారు. ప్రధానంగా నివాస గృహాల కొరత, నిరాశ్రయుల సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టారు. నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇళ్లను అందించాలని ఆమె పోరాడుతున్నారు. పర్యావరణ మార్పులపై ఆమె చేస్తున్న కృషికి గాను 'సియెర్రా క్లబ్' వంటి సంస్థల నుండి అవార్డులు అందుకున్నారు. భారతదేశంలోని మురికివాడల్లో మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం కూడా ఆమె కృషి చేశారు. ఇదీ చదవండి: ద్వారకలో నెమలి ఫించంతో అరుదైన చేప, నెటిజన్లు ఫిదా! -
Kerala: భారీ శబ్ధాలతో మూడు బస్సులు దగ్ధం
తిరువనంతపురం: కేరళ రాజధాని తిరువనంతపురంలోని చెంకోట్టుకోణం ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఇక్కడి త్రివేండ్రం స్కాటిష్ స్కూల్లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల ఆవరణలో నిలిపి ఉంచిన మూడు బస్సులు మంటలకు ఆహుతి కాగా, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతతో మరో వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది.తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో వాహనాల నుంచి పెద్ద శబ్ధాలతో పాటు మంటలు ఎగసిపడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు, పోలీసులకు సమాచారం అందించారు. కజకూట్టం, చాకై ఫైర్ స్టేషన్ల నుంచి అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలికి చేరుకుని, రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ఘటనపై కజకూట్టం అగ్నిమాపక కేంద్ర అధికారి తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో రెండు పాఠశాల బస్సులతో పాటు ఒక ట్రావెలర్ వాహనం పూర్తిగా కాలిబూడిదయ్యింది.ఈ ఘటనకు గల కారణాలపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా బస్సులకు ఎదురుగా పార్క్ చేసి ఉండాల్సిన ట్రావెలర్ వాహనం, ప్రమాదం జరిగిన సమయంలో బస్సుల వైపునకు కదిలి ఉండటాన్ని అక్కడి సిబ్బంది గుర్తించారు. ఎవరో కావాలనే ఆ వాహనాన్ని నెట్టి ఉండవచ్చని, మంటలు కూడా ఆ ట్రావెలర్ నుంచే ప్రారంభమైనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.ఇది కూడా చదవండి: Nepal: నదిలో పడిన బస్సు.. 18 మంది మృతి -
మెట్రో పిల్లర్‌పై మార్జాలం
కొచ్చి: కేరళలోని కొచ్చి నగరంలో మెట్రో రైల్వే పిల్లర్లపై ఒక చిన్న పిల్లి చిక్కుకుపోయింది. కొద్ది రోజుల క్రితం తొలిసారిగా ఒక ఆటో డ్రైవర్ దీనిని చూసి విషయం అధికారులకు చేరవేశాడు. అంతెత్తున్న పిల్లర్ నుంచి కిందకు రాలేక, ఆకలికి అక్కడే ఉండలేక అవస్థలు పడుతున్న పిల్లిని వెంటనే కాపాడాలని కోరారు. విషయం రంగంలోకి దిగిన కొచ్చి అగి్పమాపిక సిబ్బంది పలు మార్లు విఫలయత్నం చేసి ఎట్టకేలకు శనివారం అర్ధరాత్రి పిల్లిని పట్టుకుని పిల్లర్ నుంచి కిందకు దింపారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ చూసేందుకు గుమిగూడిన జనం ఆనందంతో కేరింతలు కొట్టారు. సంబంధిత ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పిల్లిని పట్టుకున్నారిలా.. కొచ్చిలోని కలూర్ ప్రాంతంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మెట్రో స్టేషన్ పిల్లర్ల మీద పిల్లి ఎటుపోవాలో తెలీక అటూ ఇటూ తిరుగుతోందని ఒక రిక్షా డ్రైవర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో గురువారం అధికారులు తొలిసారిగా రెస్క్యూ ఆపరేషన్‌కు ప్రయతి్నంచి విఫలమయ్యారు. అయితే ఎలాగైనా సరే పిల్లిని కాపాడాలని జంతువులపై క్రూరత్వ నిరోధక సంఘం(ఎస్పీసీఏ) శనివారం మరోమారు అధికారులకు మొరపెట్టుకుంది. దీంతో మళ్లీ అగి్నమాపక సిబ్బంది మరోమారు ప్రయతి్నంచగా భయంతో పిల్లి గిర్డార్ మధ్యలోని సందులోకి వెళ్లి దాక్కుంది. దీంతో అక్కడిదాకా హైడ్రాలిక్ క్రేన్ వెళ్లలేకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్ మరోసారి విఫలమైంది. అడ్డుగా మెట్రో హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిపివేయాలని కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్(కేఎంఆర్ఎల్)ను విజ్ఞప్తిచేశారు. వీళ్ల మొర కేఎంఆర్ఎల్ ఆలకించి ఒక 15 నిమిషాలపాటు మెట్రో సేవలను ఆపేసి విద్యుత్ సరఫరాను స్తంభింపజేసింది. అయితే ఆ సమయంలో పిల్లి ఎటుపోయిందో ఎవరికీ కనిపించలేదు. దీంతో ఈసారి వాళ్లు విఫలమయ్యారు. కొద్దిరోజులుగా తినడానికి తిండిలేక అది నీరసంగా కన్పించింది. దీంతో దానికి ఆహారంగా కొన్ని ఫుడ్ ప్యాకెట్లను అధికారులు పిల్లర్ల మీదకు చేర్చారు. ఇటీవల కేరళలో ఘన విజయం సాధించిన మంజుమ్మల్ బాయ్స్ సినిమాలో తమిళనాడులోని గుణ గుహల్లో చిక్కుకుపోయిన సుభాష్ అనే పాత్రధారి పేరును ఆటో డ్రైవర్లు ఈ పిల్లికి పెట్టారు. దీంతో సుభా‹Ùను ఎలాగైనా కాపాడాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. దీంతో ఎలాగైనాసరే ఈసారి పిల్లిని పట్టుకోవాలని అగ్నిమాపక సిబ్బంది కంకణం కట్టుకుని మరీ పిల్లర్ల మీదకు చేరారు. శనివారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టారు. పట్టుకున్నాక పెట్టడానికి ఒక బాక్స్, పట్టుకోవడానికి ఒక వలతో అన్వేషణ మొదలెట్టారు. వాళ్ల శ్రమ ఫలించి పిల్లి కని్పంచింది. వెంటనే దానిని జాగ్రత్తగా పట్టుకుని కిందకు తీసుకొచ్చారు. ఇదంతా ఉత్కంఠభరితంగా చూసిన స్థానికులు, జంతు ప్రేమికులు ఆనందంతో అధికారుల అనుకూల నినాదాలు చేశారు. వాళ్ల కృషిని మెచ్చుకున్నారు. నగరంలో ఇలా మెట్రో పిల్లర్‌పై పిల్లిని కాపాడటం ఇది మూడోసారి అని గాంధీనగర్ స్టేషన్లో ఫైర్ అండ్ రెస్క్యూ సరీ్వస్ అధికారి చెప్పారు. ‘‘మెట్రోస్టేషన్ నుంచి అది పొరపాటున పిల్లర్‌పై పడి ఉంటుంది. మెట్రో రైల్ అధికారుల సహకారంతోనే విజయం సాధించాం’’అని అధికారి చెప్పారు. -
కొచ్చిలో ఘనంగా 70వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ వేడుకలు
-
కేరళలో 9 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు
తిరువనంతపురం: కేరళలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే తర్వాత తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ముద్రించింది. 9 లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగిస్తూ తుది జాబితాను ముద్రించారు. దీంతో తుది జాబితాలో స్థానం సంపాదించుకున్న మొత్తం ఓటర్ల సంఖ్య 2.69 కోట్లు దాటింది. http:// electoralsearch.eci.gov.in వెబ్సైట్లో కేరళ ఓటర్లు తమ పేరును సరిచూసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది అక్టోబర్‌లో ఎస్ఐఆర్ సర్వే మొదలెట్టక ముందు 2,78,50,855 ఓటర్లు ఉండగా తుది జాబితాలో 2,69,53,644 మందికి చోటు దక్కిందని ఈసీ పేర్కొంది. ఎస్ఐఆర్లో ఓట్ల ప్రక్షాళన తర్వాత 8,97,211 పేర్లు తొలగించారు. తాజాగా కేరళ మొత్తం ఓటర్లలో పురుషులు 1,31,26,048 మంది ఉండగా మహిళలు 1,38,27,319 ఉన్నారు. ట్రాన్స్జెండర్లు కేవలం 277 మంది ఉన్నారు. విదేశాల్లో ఉంటున్న ఓటర్ల సంఖ్య 2,23,558గా తేలింది. సరీ్వస్ ఓటర్ల సంఖ్య 54,110కు చేరుకుంది. తప్పులు, సవరణలు, ఇతరత్రా కారణాలతో వివరణ కోరుతూ 36.88 లక్షల ఓటర్లకు నోటీస్‌లు జారీచేశామని వీళ్లలో 53,229 మంది పేర్లను తనిఖీ తర్వాత చేర్చామని ఈసీ పేర్కొంది. తుది జాబితాను వెరిఫికేషన్ కోసం రాజకీయ పార్టీలకూ అందజేయనున్నారు. శాసనసభ ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు చివరితేదీలోపు వరకూ ఓటర్ల జాబితాలోకి కొత్త ఓటర్లను చేర్చేందుకు ఆస్కారముందని ఈసీ అధికారులు స్పష్టంచేశారు. -
సోలార్ పడవలొచ్చాయ్
తిరునంతపురం: కేరళ ప్రభుత్వం మరో అరుదైన ఘనతను సాధించింది. దేశంలో తొలిసారిగా వైకోమ్ పట్టణంలో సోలార్‌తో నడిచే పడవల్ని అందుబాటులోకి తెచ్చింది. తద్వారా కేరళ ప్రభుత్వం పర్యావరణహిత రవాణా రంగంలో కీలక అడుగు వేసినట్లైంది. కేరళ.. ప్రకృతి అందాలకు నెలవు. పర్యావరణ పరంగా కేరళలో సరస్సులు, కాల్వలు, సముద్రతీరపు నీటి మార్గాలు ఎక్కువ. అందుకే అక్కడ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే పడవ ప్రయాణం తప్పని సరి. అదే సమయంలో కొబ్బరిపీచు, జీడిపప్పు, ఇటుక తయారీ, చేపల వేట వంటి సంప్రదాయ వృత్తులు సైతం నీటి మార్గాల పక్కన ఎక్కువగా ఉండంటం వల్ల రవాణా అవసరాలు పడవల ద్వారా జరుగుతుంటాయి. రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, పర్యావరణహిత రవాణా మార్గంగా పడవ ప్రయాణాలు సజావుగా జరిగేలా ప్రభుత్వం పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా వైకోమ్ పట్టణంలో ఇంధనంతో నడిచే పడవల స్థానంలో సోలార్‌తో నడిచే పడవల్ని ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి సి.బి. గణేష్ కుమార్ మాట్లాడుతూ.. వైకోమ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ హబ్‌గా అవతరించింది. ఇది కేరళ పర్యావరణహిత రవాణా రంగానికి మరో కలికితురాయి’అని పేర్కొన్నారు.ఇక ఈ జల రవాణా కేంద్రంలోని ఒక్కో పడవలో 75 మంది ప్రయాణించొచ్చు. 3.15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పడవలు 80 కిలోవాట్ల శక్తి సామర్థ్యంతో నడుస్తాయి. మొత్తం 10.8 కిలోమీటర్ల మార్గంలో ఈ పడవలు సేవలు అందించనున్నాయి. రోజుకు 15 ప్రయాణాలు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గి, పర్యాటక రంగానికి కూడా ఊతం లభించనుంది. 2017లో వైకోమ్లో మొదటి సౌర పడవను ప్రవేశపెట్టిన తర్వాత, ఇప్పుడు ఈ కేంద్రం పూర్తిగా సౌరశక్తి ఆధారితంగా మారడం కేరళలో స్థిరమైన రవాణా పరిష్కారాల వైపు ఒక పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు. -
రూ. 20 కోట్ల లాటరీ దక్కింది.. టిక్కెట్ పోయింది!
తిరువనంతపురం: కేరళలో అత్యంత విచిత్ర ఉదంతం చోటు చేసుకుంది. ఒక మాజీ పోలీసు అధికారికి లాటరీ రూపంలో అదృష్టం వరించినా.. అది చేజారిపోవడంతో ఇప్పుడు ఆయన పోలీసులను, చివరకు కోర్టును ఆశ్రయించారు. పిరవం ప్రాంతానికి చెందిన రిటైర్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) కేకే సజిమోన్, కేరళ క్రిస్మస్-న్యూ ఇయర్ బంపర్ లాటరీలో రూ. 20 కోట్ల భారీ బహుమతి గెలుచుకున్న టికెట్ (నెం. XC 138455) తనదేనని అంటున్నారు. జనవరి 24న వెలువడిన ఈ ఫలితాల్లో తన టికెట్‌కే మొదటి బహుమతి వచ్చిందని, అయితే పొరపాటున ఆ టికెట్ వేరే వారికి చేరిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పోలీసు విభాగం నుంచి రిటైరైన తర్వాత సజిమోన్ ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నారు. అతనికి చెందిన వాహనంలో ఇటీవల విశాఖపట్నం నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు శబరిమల యాత్ర చేశారు. అయితే వారు తిరిగి వెళుతున్నప్పుడు పొరపాటున తమ నెయ్యి డబ్బాను సజిమోన్ వాహనంలోనే మరిచిపోయారు. కాగా జనవరి 30న ఆ భక్తులు ఈ విషయాన్ని సజిమోన్‌కు తెలియజేయడంతో అతను ఆ నెయ్యి డబ్బాను విశాఖకు కొరియర్ చేశారు. అయితే తన వాహనంలోని నెయ్యి డబ్బా కింద భద్రంగా దాచిన రూ. 20 కోట్ల లాటరీ టికెట్‌ను తాను గమనించకుండా ఆ డబ్బాతో పాటే కొరియర్ పార్శిల్లో పంపేశానని సజిమోన్ చెబుతున్నారు.ఫిబ్రవరి 1న తన పొరపాటు గ్రహించి, కొరియర్ ఏజెన్సీని సంప్రదించినప్పటికీ, ఫిబ్రవరి 4 నాటికే ఆ పార్శిల్ విశాఖకు చేరిపోయిందదని తెలిసింది. తన బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు కంజిరపల్లిలో ఈ లాటరీ టికెట్ కొనుగోలు చేశానని, టికెట్ వెనుక తన పేరు, చిరునామా కూడా రాశానని సజిమోన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఆయన పిరవం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కొరియర్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. అలాగే కొరియర్ ఆఫీసులోని సిసిటివి ఫుటేజీని పరిశీలించాలని కోరుతూ ఆయన పిరవం ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు.ఈ వివాదంపై సమగ్ర విచారణ జరిపి, లాటరీ శాఖ వద్ద ఉన్న టికెట్‌ను సరిచూడాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. సజిమోన్ తన వాదనను గట్టిగా వినిపిస్తున్నప్పటికీ, ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.20 కోట్ల బహుమతి గెలుచుకున్న అసలు టికెట్‌ను ఇప్పటికే ఒక వ్యక్తి తిరువనంతపురంలోని లాటరీ కార్యాలయంలో సమర్పించినట్లు సమాచారం. దీంతో సజిమోన్ చెబుతున్నది నిజమా లేక ఇందులో ఏదైనా మోసం దాగి ఉందా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: మహిళ కడుపులో కత్తెర.. ఐదేళ్ల తర్వాత గుర్తించడంతో.. -
ది కేరళ స్టోరీ-2 మేకర్స్‌కు షాక్..!
ది కేరళ స్టోరీ నిర్మాతలకు షాక్ తగిలింది. ఈ సినిమా రిలీజ్ నిలిపేయాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర సమాచారశాఖతో పాటు సెన్సార్ బోర్డ్, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా ట్రైలర్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని.. కేరళ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ శ్రీదేవ్ అనే బయాలజిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.సుదీప్తో సేన్ డైరెక్షన్లో వచ్చి ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదా శర్మ కీలక పాత్రలో తెరకెక్కంచిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఎన్ని విమర్శలొచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ముగ్గురు హిందూ అమ్మాయిల కథగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహంచారు. -
60 సెకన్లలో కేరళ ట్రూ స్టోరీ : ఒట్టపాలెం కథ కావాలి స్ఫూర్తి!
సోషల్ మీడియా రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. దాన్ని ఎపుడు ఎలా వినియోగించుకుంటున్నా మన్నదానిమీదే మనుషుల విజ్ఞత ఆధారపడి ఉంటుంది. సరైన సమయంలో సరిగ్గా వాడుకోవాలి. ముఖ్యంగా ప్రమాదాల సమయంలో బాధితులను సాయం అందించేందుకు ముందుకు రావాలి తప్ప, వీడియోలు తీస్తూ కాలయాపన చేయకూడదు. క్రైసిస్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఈ విషయాన్నే ఇటీవల కేరళలో జరిగిన బస్సు ప్రమాద ఘటన నిరూపించింది. క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఎలా ఉండాలి? అతి క్లిష్టమైన సమయంలో పౌర సమాజం తక్షణమే స్పందించి బాధ్యతగా ఎలా ప్రవర్తించాలనే దానిపై ఒక వీడియో నెట్టింట ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఉన్నాయి.పాలక్కాడ్‌లోని ఒక చిన్న పట్టణం ఒట్టపాలెం, కానీ అక్కడ జరిగిన ఉదంతాన్ని ఉదాహరిస్తూ సంక్షోభ నిర్వహణలో ఒక మాస్టర్ క్లాస్ అంటూ ఎక్స్‌లో ఒక వీడియో షేర్ అయింది. దీని ప్రకారం కదులుతున్న బస్సుకు మంటలు అంటుకున్నాయి. పౌరసమాజం స్పందించిన తీరు, చూపింని ధైర్యసాహసాలను 60 సెకన్ల వీడియో చూడవచ్చు.థాయ్‌లాండ్‌లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా! True Kerala Story in 60 Seconds.Ottapalam a small town in Palakkad, but what happened there is a masterclass in crisis management.A moving bus caught fire & you can see a 60 second display of citizen bravery.10th Second: The bus doors opened. People started coming out.… pic.twitter.com/7usNBTGhyZ— FeverChills🥴 (@RebelR3volution) February 18, 202610వ సెకన్: బస్సు తలుపులు తెరుచుకున్నాయి. జనం బయటకు రావడం ప్రారంభించారు.30వ సెకన్: స్థానికంగా ఉన్న ఏ ఒక్కరూ ఈ సంఘటనను రికార్డ్ చేయడానికి రాలేదు. ప్రమాదంలో ఉన్న వారిని ఆదుకునేందుకు అగ్నిమాపక యంత్రంతో వచ్చాడు.35వ సెకన్: అగ్నిమాపక యంత్రంతో మరో ముగ్గురు నలుగురు మంటల్ని ఆర్పుతున్నారు. 50వ సెకన్: ప్రతీ ప్రయాణికులు సురక్షితంగా, క్షేమంగా బయటికి వచ్చాడు.60వ సెకన్: మంటలు ఆరిపోయాయి. ఏం జరిగిందంటే..కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో మంగళవారం (ఫిబ్రవరి 17) ఒట్టపాలెంలో ఈ ఘటన జరిగింది. పాలక్కాడ్ నుండి గురువాయూర్కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు మంటల్లో చిక్కుకుంది. వెనుక ఉన్న డోర్ తెరుచుకుంది కానీ ముందు ఆటోమేటిక్ తలుపు మూసుకుపోయింది. దీంతో తీవ్ర ఆందోళన రేగింది. ఒక పొక్క చుట్టు ముడుతున్న పొగ మరోపక్క ప్రాణాపాయంలో పదుల సంఖ్యలో ప్రయాణీకులు. అటుగా వచ్చిన డెలివరీ ఏజెంట్ ఇది చూసి వెంటనే స్పందించాడు తలుపును పగలగొట్టడంతో పెను ముప్పు తప్పింది. సమీపంలోని ఆటో-రిక్షా డ్రైవర్లు ,దుకాణదారులు అగ్నిమాపక యంత్రాలతో సాయుధంగా సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేసేందుకు కృషి చేశారు. బస్సు సిబ్బంది, ఇతర స్థానికులు సహాయక చర్యల్లో చేరి, సకాలంలో అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలునోట్ : అక్కడున్న ఎవ్వరూ తమ మొబైల్‌తో వీడియోలను తీయడం లేదంటూ ఒక ముఖ్యమైన సందేశాన్ని చెప్పకనే చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినపుడు సాధారణంగా అందరూ చేసేది స్మార్ట్‌ఫోన్‌తో వీడియో తీసే పనిలో మునిగిపోతారు. నిజానికి అది కాదు చేయాల్సింది. వెంటనే బాధితులను ఆదుకునేందుకు, ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు తమ వంతు సాయం చేయాలి. ఇలా చేస్తూనే సంబంధిత అధికారులకు సమాచారాన్ని చేయడం. తత్ఫలితంగా చాలా ప్రాణాలను కాపాడవచ్చు. ఎన్నో కుటుంబాలు అనాథలు కాకుండా కాపాడవచ్చు. ఏమంటారు? -
'ది కేరళ స్టోరీ-2'పై సీఎం పినరయి విజయన్ ఆగ్రహం
ది కేరళ స్టోరీ మూవీ విడుదల సమయంలో ఎలాంటి అభ్యంతరాలు వచ్చాయి. ఇప్పడు 'ది కేరళ స్టోరీ-2' చిత్రంపై కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ రాష్ట్రంలో మతపరమైన విభజనతో పాటు ద్వేషాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనే ఈ చిత్రం నిర్మించినట్లు అర్థమవుతుందన్నారు. ‘లవ్ జిహాదీ’ అంశాన్ని దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు, హోం మంత్రిత్వశాఖ కూడా తిరస్కరించినప్పటికీ.. ఇదే అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చి మతపరమైన విభజన సృష్టించేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయని విజయన్ మండిపడ్డారు. కేరళ రాష్ట్రాన్ని ప్రపంచం ముందు అవమానించేందుకే మరోసారి ఈ మూవీని తెరపైకి తీసుకొచ్చారన్నారు. అక్షరాస్యతలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తమ రాష్ట్రాన్ని ఇలా అప్రతిష్టపాలు చేసేందుకు సినిమాల పేరుతో కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నాయని వాటిని ఐక్యంగా ప్రజలు తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. 'ది కేరళ స్టోరీ-2' సినిమా ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అంటూనే రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని ఆయన అన్నారు. శాంతియుత వాతావరణంతో అందరూ కలిసిమెలసి ఉన్న కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించేందుకు ఈ మూవీని వాడుకుంటున్నారని ఆయన అన్నారు. ఫిబ్రవరి 27న విడుదల కానున్న ఈ చిత్రంపై అధికార ఎల్.డి.ఎఫ్‌తో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. -
ఈ చిన్నారి.. వారిలో బతికే ఉంది!
పది నెలల వయసున్న ఆలిన్ షెరిన్ అబ్రహం అనే పసి పాప కేరళలో అతి పిన్న వయస్కురాలైన అవయవదాతగా నిలిచింది. మల్లపల్లి గ్రామానికి చెందిన ఆలిన్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. తల్లి, తాతలతో కలిసి కొట్టాయం నుండి తిరువల్లకు వెళుతుండగా ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఆస్పత్రిలో కొన్ని రోజుల చికిత్స తరువాత ఆలిన్ షెరిన్‌ను బ్రెయిన్ డెడ్‌గా వైద్యులు ప్రకటించారు.పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకొని తండ్రి అరుణ్ అబ్రహం, తల్లి షెరిన్ ఆన్జాన్ తమ చిన్నారి అవయవాలను దానం (Organ Donation) చేయడానికి అంగీకరించారు.ఆలిన్ షెరిన్ అబ్రహం (Alin Sherin Abraham) గుండెను తిరువనంతపురంలోని శ్రీ చిత్ర ఇనిస్టిట్యూట్‌కు, కాలేయాన్ని, ప్రభుత్వ వైద్య కళాశాలకు, కళ్లు ఐ బ్యాంక్‌కు డొనేట్ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పది సంవత్సరాల బాలిక అనిన్కు ఆలిన్ షెరిన్ మూత్రపిండాలను మార్పిడి చేస్తారు. తిరువనంతపురంలో చికిత్స పొందుతున్న ఆరు నెలల పాపకు ఆలిన్ షెరిన్ కాలేయాన్ని అమర్చుతారు.చదవండి: సింకోప్ సమస్య.. పడి లేచే ప్రమాదం -
30 ఏళ్ల కృషి, ఉద్యోగులకు రూ. 20 కోట్ల లగ్జరీ కార్లు
కార్పొరేట్ కంపెనీలు భారీ బహుమతులతో ఉద్యోగులను సర్ప్రైజ్ చేస్తుంటాయి. భారీగా నగదు, కార్లు, ఇళ్లు లాంటి కానుకలతో వార్తల్లో నిలుస్తాయి. తాజాగా తన వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా తన ఉద్యోగులకు రూ. 20 కోట్ల విలువైన 47 కార్లను బహుమతిగా ఇచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.కోజికోడ్‌కు చెందిన కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ సిబ్బందికి భారీ బహుమతులలిచ్చి వార్షికోత్సవ సంబరాలకు మరింత వన్నె తీసుకొచ్చింది. గత మూడు దశాబ్దాలుగా కంపెనీ అభివృద్ధిలో సిబ్బంది చేసిన కృషికి గుర్తింపుగా రూ.20 కోట్ల విలువ చేసే 47 కార్లు అందించినట్టు కంపెనీ ప్రకటించింది.బిజినెస్‌లైన్ నివేదిక ప్రకారం ఈ కార్లలో ప్రీమియ , ప్రసిద్ధ మోడళ్ల కార్లున్నాయి. ముఖ్యంగా రేంజ్ రోవర్లు, ఆడి క్యూ8, ల్యాండ్ రోవర్ డిఫెండర్ కార్లు ఉండటం విశేషం. ఈ జాబితాలో టాటా హారియర్, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కైలాక్ మోడళ్లు, ఇతర కార్లతో పాటు ఉన్నాయి. భారీ భవిష్యత్ ప్రణాళికలుహైలైట్ గ్రూప్ ఛైర్మన్ పి.సులైమాన్ ఈ సందర్బంగా భవిష్యత్ ప్రణాళికలను కూడా ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మరో పది మాల్స్ అభివృద్ధిలో ఉన్నాయని తెలిపారు. దాదాపు 10వేల మందికి ఉపాధి కల్పిస్తున్న కంపెనీ 2030 నాటికి సంస్థను విస్తరించి 2 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సులైమాన్ వెల్లడించారు.హైలైట్ గ్రూప్ విస్తరణహైలైట్ గ్రూప్ 1996లో కోజికోడ్లోస్థాపించబడింది. రిటైల్ అండ్ కమర్షియల్ వాణిజ్య అభివృద్ధితో ప్రారంభమై, నివాస, ఐటీ, మిశ్రమ వినియోగ ప్రాజెక్టులుగా విస్తరించింది. మూడు దశాబ్దాల ప్రయాణంలో హైలైట్ సంస్థ రిటైల్ స్పేస్ రంగంలో కేరళలో అగ్రగామిగా నిలిచింది. తరువాత కంపెనీ కోజికోడ్‌లో హైలైట్ మాల్, త్రిస్సూర్‌లోని హైలైట్ మాల్‌ను అభివృద్ధి చేసింది. క్రమంగా అంతర్జాతీయ వ్యాపారాలు,భాగస్వామ్యాలను ఆకర్షించే లక్ష్యంతో కోజికోడ్‌లో 12.5 మిలియన్ చదరపు అడుగుల వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం అంచనా వేసిన పెట్టుబడి సుమారు 680 మిలియన్ డాలర్లు (రూ. 623.06 కోట్లు) ఇదీ చదవండి: బ్లింకిట్‌కు షాకిచ్చిన ఢిల్లీ పోలీసులుఇదీ చదవండి : పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్ చేస్తే! -
శబరిమల గోల్డ్ చోరీ కేసు.. తంత్రి రాజీవరుకు బెయిల్
తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారంలో చోరీ కేసులో ఆలయ సీనియర్ తంత్రి (మాజీ ప్రధాన పూజారి) కందరారు రాజీవరుకు బెయిల్ మంజూరైంది. రాజీవరుకు నేడు కొల్లం విజిలెన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బంగారం చోరీకి సంబంధించిన రెండు కేసుల్లో ఆయనకు బెయిల్ లభించడంతో ఆయన రిమాండ్ నుంచి బయటకు రానున్నారు.కాగా శబరిమల బంగారు తాపడాల చోరీ కేసులో ఆలయ అర్చకులు కందారారు రాజీవరును సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజీవరను సిట్ అధికారులు జనవరి తొమ్మిదో తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉన్నికృష్ణన్ పొట్టితో, రాజీవరుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గుర్తించారు. విచారణలో రాజీవరు కూడా నిందితుడు అని తేలడంతో ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో, ఆయన 41 రోజులుగా పోలీసులు రిమాండ్‌లోనే ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయనకు కొల్లం విజిలెన్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. కోర్టు ఆయనపై ఉన్న ఆరోపణలను పూర్తిగా తేల్చలేదు.. కేవలం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో రాజీవరు ఏ6గా ఉన్నారు. ఇక, ఈ కేసులో ఆయన అరెస్టు 11వది కావడం విశేషం. ఏమిటి ఈ కేసు?2019లో శబరిమల గర్భగుడి ముందున్న బంగారు పూత విగ్రహాలను మరమ్మత్తుల నిమిత్తం తొలగించారు. అనంతరం వాటిని మరమ్మత్తు చేసి తిరిగి ప్రతిష్ఠించారు. బంగారు పలకలను ఇవ్వడంలో గోల్మాల్ జరిగిందని క్రితంతో పోలిస్తే బంగారం తగ్గిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేరళ హైకోర్టు సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. -
4 రాష్ట్రాల ఎన్నికలకు మార్చిలో షెడ్యూల్
ఢిల్లీ: పలు రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. నాలుగు రాష్ట్రాలు, ఒకే కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలకు మార్చి మధ్యలో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు మంగళవారం ఈ మేరకు వెల్లడించాయి. కీలకమైన పశ్చిమ బెంగాల్, తమిళనాడుతో పాటు కేరళ, అస్సాం అసెంబ్లీల గడువు మేలో, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్‌లో ముగియనున్నాయి.వాటన్నిటికీ వచ్చే ఏప్రిల్‌లోనే ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తోంది. ఇందుకు సంబంధించి మార్చిలో షెడ్యూల్ విడుదల చేస్తామని ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికల సన్నద్ధతను అంచనా వేయడంతో పాటు ముందస్తు ఏర్పాట్ల నిమిత్తం ఈసీ బృందాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నాయి. సర్ ప్రక్రియ అనంతరం అస్సాం, పుదుచ్చేరిల్లో తుది ఓటర్ల జాబితాను ఈసీ ఇప్పటికే విడుదల చేసింది.తమిళనాడులో బుధవారం, కేరళలో ఫిబ్రవరి 21న, కీలకమైన పశి్చమబెంగాల్లో 28న ఓటర్ల జాబితాలు వెలువడనున్నాయి. 2021లో పశి్చమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఏకంగా 8 విడతల్లో జరిగాయి. ఆ రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విడతల్లో పోలింగ్ జరిగిన ఎన్నికలుగా అవి రికార్డులకెక్కాయి! ఇక తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో ఒకే విడతలో, తీవ్రవాద ప్రభావిత అస్సాంలో 2 విడతల్లో పోలింగ్ జరిగింది.అస్సాంలో ఈసీ పర్యటన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్, కమిషనర్లు సుఖ్బీర్సింగ్ సంధు, వివేక్ జోషితో కూడిన ఈసీ బృందం మంగళవారం రెండో రోజు కూడా అస్సాంలో పర్యటించింది. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించింది. -
ఒక్కో ఉద్యోగికి రెండు కోట్ల కారు
-
భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని మూడేళ్ల ముందే తెలుసు: శ్రీశాంత్
మాజీ భారత క్రికెటర్ S. Sreesanth ‘Rooted For Life’ పోడ్కాస్ట్లో తన జీవిత ప్రయాణాన్ని వివరించారు. Dr. Pradeep Sethi గారితో జరిగిన ఈ సంభాషణ క్రికెట్‌కి మాత్రమే పరిమితం కాకుండా జీవితం, నమ్మకం, మనోబలం వంటి ఎన్నో అంశాలపై సాగింది. చిన్ననాటి కష్టాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, వ్యక్తిగత ఆలోచనలు, ప్రపంచ కప్ వరకు తీసుకెళ్లిన సూత్రాలు – అన్నింటినీ శ్రీశాంత్ మనస్ఫూర్తిగా పంచుకున్నారు.ఎపిసోడ్ ప్రారంభంలోనే శ్రీశాంత్ అందరినీ – మతం, కులం అనే తేడా లేకుండా గౌరవించాలనే తన నమ్మకాన్ని చెప్పారు. జీవితం ఎత్తుపల్లాలు చూపినప్పుడు నిలబడటానికి ఒక బలమైన “బేస్” ఉండాలి అని ఆయన అభిప్రాయం. వినయం, ఆత్మగౌరవం రెండూ కలిసి నడవాలి, ప్రతి ఒక్కరిని సమానంగా చూడటం గొప్పతనానికి మూలం అని స్పష్టం చేశారు.ఈ పోడ్కాస్ట్లో హృదయాన్ని తాకే భాగం ఆయన చిన్నప్పటి ఆరోగ్య సమస్యల గురించి. మొదటిసారి తనకు వచ్చిన ట్యూమర్ శస్త్రచికిత్స, ఆ సమయంలో తన తండ్రి చూపిన అచంచలమైన భక్తి గురించి శ్రీశాంత్ గారు భావోద్వేగంగా చెప్పారు.Ettumanoor Mahadeva Temple వద్ద ఒక రూపాయి కానుక, చేసిన ప్రార్థన తన జీవితాన్ని మార్చేసిందని, అది తనకు ఒక అద్భుతం లాంటిదని వివరించారు. భగవాన్ శివుడితో తన ఆధ్యాత్మిక అనుబంధం గురించి చెబుతూ, తన చేతిపై త్రిశూలం ఆకారంలో ఉన్న జన్మమచ్చను కూడా ప్రస్తావించారు.తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది సహా అందరినీ కుటుంబ సభ్యుల్లా గౌరవించాలనే విలువలు తన తండ్రి నేర్పారని చెప్పారు. మహాబలి కథ, ఓనం పండుగ ఉదాహరణగా తీసుకుని, మతం కంటే మానవత్వమే గొప్పదని పేర్కొన్నారు.సంతోషం, ఆనందం మధ్య తేడా గురించి మాట్లాడుతూ – విజయం వల్ల వచ్చే సంతోషం తాత్కాలికం కావొచ్చు, కానీ అంతరానందం మనలో నుంచే వస్తుందని అన్నారు. మంచి అయినా చెడు అయినా ప్రతి అనుభవం మనకు “తజుర్బా” ఇస్తుందని, అది మనల్ని మరింత బలంగా తయారు చేస్తుందని చెప్పారు.ICC World Twenty20 విజయానికి వెనుక ఉన్న “సీక్రెట్” గురించి మాట్లాడినప్పుడు, కప్ గెలవబోతున్నామనే నమ్మకం తనలో ముందే ఉన్నదని చెప్పారు. ట్రోఫీని చేతిలో పట్టుకున్నట్టు మూడు సంవత్సరాల ముందే ఊహించుకున్నానని వెల్లడించారు. ఆ టోర్నమెంట్లో తన కెరీర్‌కి మలుపుతిప్పిన క్యాచ్ గురించి కూడా గుర్తుచేసుకున్నారు.PRIDE – అంటే “Personal Responsibility in Delivering Excellence” – అనే తత్వం తన జీవితానికి ఆధారం అని చెప్పారు. జట్టులోంచి తప్పించబడిన సందర్భాలు, ఓటములు ఎదురైనప్పుడు కూడా క్రమశిక్షణ, రొటీన్, పాజిటివ్ సెల్ఫ్-టాక్ తనను నిలబెట్టాయని వివరించారు. తాత్కాలిక ప్రతిభ కంటే అలవాట్లు, క్రమబద్ధతే విజయానికి మూలం అని అన్నారు.తన పోటీ స్వభావం గురించి మాట్లాడుతూ, క్రీడల్లో ధైర్యం మరియు అజాగ్రత్త మధ్య ఉన్న సన్నని రేఖను వివరించారు. అస్టిగ్మాటిజం సమస్య, ఫాస్ట్ బౌలింగ్‌లో ఉన్న శారీరక ఒత్తిడి, అవుట్‌స్వింగ్ యార్కర్ సాధనలో చూపిన పట్టుదల గురించి పంచుకున్నారు.మైదానంలో తన సంబరాలు ఈగో వల్ల కాదు, ఆటపై ఉన్న నిజమైన ప్రేమ, ఉత్సాహం వల్లేనని చెప్పారు. విజయం ప్రయాణంలో ఇతరులను కూడా భాగస్వాములను చేయడం, పాజిటివ్ సందేశాలు పంచడం ఎంత ముఖ్యమో వివరించారు.ఈ పోడ్కాస్ట్లో కుటుంబం ప్రాధాన్యం, ప్రజా జీవితంలో మేనేజర్ల కంటే కుటుంబ సభ్యుల పాత్ర, ప్రపంచానికి ప్రేమ, పాజిటివ్ వైబ్స్ పంచాల్సిన అవసరం వంటి అంశాలు కూడా చర్చించబడ్డాయి. చివరగా తన నానమ్మ నేర్పిన జీవన పాఠాలు, యోగా ద్వారా సమతుల్యతను ఎలా కాపాడుకోవాలో శ్రీశాంత్ గారు సూచనలు ఇచ్చారు. -
రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి దుర్మరణం
వల్లూరు (చెన్నూరు): కడప పట్టణంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ యువతి రిషిక(23) దుర్మరణం చెందింది. వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన రిషిక, ఎమీ సుశాన్, అభి, అనుగ్రహ, భావ్యతో పాటు విశాఖ పట్టణానికి చెందిన ఠాగూర్ రెడ్డి తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) కళాశాలలో బీఎస్‌ఎమ్‌ఎస్ కోర్సు నాలుగో సంవత్సరం చదువుతున్నారు. శని, ఆదివారాలు సెలవు కావడంతో వీరు రెండు ద్విచక్ర వాహనాల్లో శనివారం ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటకు విహారయాత్రకు బయలుదేరారు. కడప పట్టణం సమీపంలోని ఆలంఖాన్ పల్లె వద్ద ఉన్న ఇర్కాన్ సర్కిల్ వద్ద ఠాగూర్‌రెడ్డి నడుపుతున్న ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. వెనుక కూర్చొన్న రిషిక రోడ్డుపై పడిపోగా ట్యాంకర్ ఆమెపై నుంచి వెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూరు పోలీసులు తెలిపారు.


