Corona Updates
-
దేశంలో కొత్తగా 636 కరోనా కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 636 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,394కు చేరుకుంది. కరోనా బారినపడి తాజాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,364కు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఒక్కరోజే 841 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. దేశంలో గత 227 రోజుల గరిష్ఠానికి కేసుల సంఖ్య పెరిగింది. గత 24 గంటల్లో కోవిడ్ -19 నుండి 548 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 4.44 కోట్లకు పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతం కాగా, కేసు మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. అటు.. జేఎన్.1 వేరియంట్ దేశంలో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు తొమ్మిది రాష్ట్రాల్లో వెలుగు చూసిన ఈ వైరస్ కేసులు 47కి చేరుకున్నాయి. అత్యధికంగా గోవాలో 78 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేరళలో 41 కేసులు బయటపడ్డాయి. ఇదీ చదవండి: కొత్త సంవత్సరంలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి! -
వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. కొత్తగా 797 కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా 797 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4,097కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళలో రెండు, మహరాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కో మరణం నమోదైంది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరుకుంది. దేశంలో కొత్త వేరియంట్ జేఎన్.1 వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశంలో ఇప్పటివరకు 157 జేఎన్.1 కరోనా వేరియంట్‌కు సంబంధించిన కేసులు వెలుగులోకి వచ్చాయి. కేరళలో అత్యధికంగా 78, గుజరాత్ (34), గోవా (18), కర్ణాటక (8), మహారాష్ట్ర (7), రాజస్థాన్ (5), తమిళనాడు (4) కేసులు బయటపడ్డాయి. ఢిల్లీలో తొలి జేఎన్.1 వేరియంట్ కోవిడ్ కేసు నమోదైంది. ఇదీ చదవండి: Israel War: బందీలపై కాల్పుల్లో సైన్యం చేసింది సరైన పనే -
Corona New Variant: ప్రతిసారి డిసెంబర్లోనే వైరస్ వ్యాప్తి.. ఎందుకు?
2019 డిసెంబర్ చివర్లో సాంప్రదాయంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకున్నాం. తర్వాత కొద్ది వారాల్లోనే ప్రపంచమంతా చైనా నుంచి కరోనా వైరస్ వ్యాపించింది. మళ్లీ అదే డిసెంబర్లోనే మరో వేరియంట్ రూపంలో వైరస్ మనముందుకొచ్చింది. అసలు డిసెంబర్లోనే ఎందుకని వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇందుకు గల కారణాలేంటి? కరోనా ప్రధానంగా మూడు ప్రధాన మ్యుటేషన్లుగా మార్పు చెందింది. డిసెంబర్ 2020లో వ్యాప్తి చెందిన కరోనా ఆల్ఫా(B.1.1.7), బీటా(B.1.351), గామా(P.1)గా మార్పు చెందింది. మరుసటి ఏడాది 2021 డిసెంబర్లో ఉద్భవించింన ఒమిక్రాన్ వేరియంట్ భారీ నష్టాన్ని మిగిల్చింది. మరుసటి ఏడాది డిసెంబర్ 2022లో ప్రధాన వేరియంట్ వ్యాప్తి చెందనప్పటికీ ఒమిక్రాన్‌లోనే BA.2, BA.5గా పరిణామం చెందింది. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న JN1 కూడా ఒమిక్రాన్ వేరియంట్లోని ఉపరకమే. ఇది కూడా డిసెంబర్లోనే వ్యాప్తి చెందుతోంది. డిసెంబర్లోనే ఎందుకు? ప్రతి ఏడాది డిసెంబర్ మాసం నుంచి కొవిడ్-19 కొత్త రకంగా వ్యాప్తి చెందడానికి ప్రధాన కారణం వాతావరణ పరిస్థితులే. శీతాకాలంలోని చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగానే వైరస్ మార్పు చెంది వేగంగా వ్యాప్తి చెందుతుందని అధ్యయనాలు వెల్లడించాయి. డెల్టా వేరియంట్, మహమ్మారి మొదటి దశలోనూ వైరస్ వ్యాప్తికి గల కారణాలపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెల్లడయ్యాయని నేచర్ జర్నల్ పేర్కొంది. వేసవి నుంచి శీతాకాలానికి మారినప్పుడు ఉష్ణోగ్రత పడిపోతుంది. గాలి కూడా పొడిగా మారుతుంది. ఉత్తర అర్ధగోళంలోని దేశాలలో కోవిడ్-19 వ్యాప్తికి ఈ అంశాలే దోహదం చేస్తున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. చైనాలోని సిచువాన్ ఇంటర్నేషనల్ స్టడీస్ యూనివర్శిటీ పరిశోధకులు కూడా ఇదే విశయాన్ని వెల్లడించారు. వెచ్చని పరిస్థితుల్లోని వారికంటే చల్లని పరిస్థితుల్లో నివసించేవారికి కరోనావైరస్ సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉందని వారి అధ్యయనం కనుగొంది. 'కొవిడ్-19 అనేది శ్వాసకోశ వైరస్. దీన్ని ఎదుర్కొనే క్రమంలో రెండు విషయాలు ప్రధానమైనవి. ఒకటి వైరస్, రెండోది మన శరీరం. వైరస్ నిరంతరం మార్పు చెంది వేరియంట్లుగా పరిణామం చెందుతోంది. మన శరీరం గత వేరియంట్‌ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తిని కల్పించుకుంటే మరో రకమైన వేరియంట్ సవాళ్లను విసురుతోంది. అంటే కొత్త వేరియంట్‌కు మన రోగనిరోధక శక్తి తగ్గుతుంది.' అని అమృత హాస్పిటల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దీపు తెలిపారు. సెలవుల్లో పర్యటనలు.. కరోనా వేరియంట్ చైనాలో డిసెంబర్లోనే ఉద్భవించింది. నెలలోనే విపరీతంగా వ్యాప్తి చెందింది. ఉత్తర, దక్షిణ అర్ధగోళంలో డిసెంబర్ నెలలో ఎక్కువగా సెలువులు ఉన్నాయి. క్రిస్టమస్ సెలవులు, చైనాలో జనవరిలో లునార్ న్యూ ఇయర్ వేడుకలు వైరస్ వ్యాప్తికి దోహదం చేశాయి. ఈ సారి జేఎన్1 వేరియంట్ కూడా సరిగ్గా ఇదే సమయంలో వ్యాప్తి చెందుతోంది. అని డాక్టర్ దీపు తెలిపారు. భయం అవసరం లేదు.. ప్రస్తుతం వ్యాప్తిస్తున్న జేఎన్ 1 వేరియంట్‌తో భయం అవసరం లేదని డాక్టర్లు చెబుతున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని పేర్కొన్నారు. మాస్కులు తప్పనిసరిగా ఉపయోగించాలని తెలిపారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు జేఎన్ 1 వేరియంట్ నుంచి కూడా రక్షిస్తాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ఇదీ చదవండి: Covid 19: దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు -
Covid 19: దేశంలో 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసులు
ఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు పెరిగింది. కరోనా ఉప వేరియంట్ JN.1 కారణంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి 4054 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 128 కొత్త కేసులు కేరళలో నమోదయ్యామని కేంద్ర వైద్య శాఖ పేర్కొంది. 24 గంటలల్లో కేరళతో కలుపుకొని దేశవ్యాప్తంగా మరో 334 కొత్త కేసులు నమోదు కావటంతో కోవిడ్ కేసుల సంఖ్య నాలుగు వేలకు చేరుకుంది. కేరళలో కోవిడ్‌తో ఒకరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 296 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,50,09,248 (4.50 కోట్లు). వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 (4.44 కోట్లు). జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. -
జయశంకర్ భూపాలపల్లిలో కోవిడ్ కలకలం
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కోవిడ్ కలకలం రేపింది. గణపురం మండలం గాంధీనగర్‌లో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధురాలికి కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో.. ఆమె కుటుంబ సభ్యులకు కరోనా టెస్టు నిర్వహించగా నలుగురికి కోవిడ్ లక్షణాలు లేకుండా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. వారిని ఇంట్లోనే ఐసోలేట్ చేశామని.. వారి ఆరోగ్యం నిలకడగానే ఉందని డీఎంహెచ్‌వో మధుసూదన్ తెలిపారు. జిల్లాలోని వంద పడకల ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు. చదవండి: Year Ender 2023: జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభణ
ఢిల్లీ: దేశంలో కొవిడ్-19 కొత్త వేరియంట్ జేఎన్.1 విజృంభిస్తోంది. రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగిపోతున్నాయి. దేశంలో కొత్తగా 752 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 24 గంటల్లో నలుగురు మృతి చెందారు. కేరళలో ఇద్దరు, రాజస్థాన్, కర్నాటకలో ఒకరు చొప్పున మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కు చేరుకుంది. అటు.. తెలుగు రాష్ట్రాల్లోనూ జేఎన్-1 వేరియంట్ వేగంగా విజృంభిస్తోంది. ఏపీలో 24 గంటల్లో నాలుగు కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8కి చేరింది. తెలంగాణలో 24 గంటల్లో 12 కేసులు నమోదయ్యయి. దీంతో తెలంగాణలో కరోనా కేసులు 38కి చేరాయి. అత్యధికంగా కేరళలో 266 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 70, మహారాష్ట్రలో 15, తమిళనాడులో 13, గుజరాత్లో 12 మంది కరోనా బారిన పడ్డారు. తాజా మరణాలతో కలిపి కరోనా తొలి వేవ్ నుంచి ఇప్పటిదాకా మొత్తంగా చూసుకుంటే.. 5,33,332 మంది చనిపోయారు. మరణాల శాతం 1.18గా ఉంది. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా నుంచి 325 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా రికవరీల సంఖ్య 4,44,71,212 కాగా.. రికవరీ శాతం 98.81గా తేలింది. జేఎన్.1 వ్యాప్తి ముందు వేరియెంట్‌లలానే వేగంగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అలాగని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కేసుల వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే చాలని సూచిస్తున్నారు. మరోవైపు కేంద్రం సమీక్ష తర్వాత.. పలు రాష్ట్రాలు కూడా జేఎన్.1 విషయంలో అప్రమత్తంగా ఉన్నాయి. ముందస్తుగా కోవిడ్ ప్రత్యేక వార్డుల్ని ఏర్పాటు చేసి.. కేసుల విషయంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదిస్తున్నాయి. ఇదీ చదవండి: Year Ender 2023: జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే! -
TS: ఒక్కరోజులో 12 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. శనివారం 1,322 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 12 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ వెల్లడించారు. ఈ మేరకు కరోనా బులెటిన్ విడుదల చేశారు. నమోదైన కేసుల్లో తొమ్మిది హైదరాబాదులోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సంగారెడ్డి, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం 38 మంది ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8.44 లక్షలకు చేరింది. అందులో 8.40 లక్షల మంది రికవరీ అయ్యారు. చలికాలం కావడం, ఫ్లూ జ్వరాలు కూడా ఉండటం తదితర కారణాలతో కరోనా కేసులు నమోదవుతున్నట్లు చెబుతున్నారు. పర్యాటకులకు తప్పనిసరి ఐసోలేషన్ తాజాగా రాష్ట్రంలోకి వచ్చే పర్యాటకుల కోసం తప్పనిసరి ఐసోలేషన్‌ను ప్రారంభించాలని రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ వైద్యుల ప్యానెల్ వైద్య ఆరోగ్య శాఖకు సూచించింది. పొరుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కేరళ, గోవా, మహారాష్ట్రలలో కోవిడ్ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాలని కోరింది. జేఎన్.1 వేరియంట్ పై స్పష్టమైన అవగాహనకు రావాల్సి ఉందని పేర్కొంది. కేరళ లేదా ఇతర ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి వచ్చేవారు ఎవరైనా వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. పైగా చాలా మందిలో వైరస్ లక్షణాలు కనిపించడం లేదనిడాక్టర్ల బృందం అభిప్రాయపడింది. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 40 నమూనాలు..: రాష్ట్రంలో కరోనా కేసులు ఏ వేరియంట్ అనేది తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు. గత వారం మొత్తం 40 నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం 4–5 రోజుల సమయం పట్టే అవకాశం ఉందన్నారు. సమావేశంలో మంత్రి ఆదేశాలిలా.. పని చేయని పీఎస్ఏ ప్లాంట్ల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సరిగ్గా వినియోగించాలి. అన్ని వెంటిలేటర్లను అందుబాటులోకి తీసుకురావాలి. వైద్య పరికరాలు, డ్రగ్స్, డయాగ్నస్టిక్స్ మొదలైన వాటి అవసరాలను ఆసుపత్రులు తెలియజేయాలి. మొత్తం 34 ప్రభుత్వ ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు రోజుకు 16,500 నమూనాలను పరీక్షించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. 34 ప్రభుత్వ ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లతో పాటు, రాష్ట్రంలో 84 ప్రైవేట్ ఆర్టీపీసీఆర్ ల్యాబ్‌లు ఉన్నాయి. ఆర్టీపీసీఆర్ కిట్లు మొదలైన వాటిని టిఎస్ఎంఎస్ఐడిసి సేకరించి సరఫరా చేస్తుంది. గత 2 వారాల్లో మొత్తం 6,344 నమూనాలు సేకరించారు. నెలాఖరు నాటికి పరీక్షలను వేగవంతం చేయాలి. రోజుకు 4,000 పరీక్షలు నిర్వహించాలి. గాంధీ హాస్పిటల్లోనూ జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పంపాలి కోవిడ్ రోజువారీ నివేదికను ప్రతిరోజూ సాయంత్రం 4 గంటలలోపు సమర్పించాలి. కరోనాను ఎదుర్కొనేందుకు వివిధ సంస్థల నుంచి గత నాలుగేళ్లుగా అందిన సీఎస్ఆర్ విరాళాల జాబితాపై నివేదిక అందజేయాలి. -
దేశంలో కరోనా విజృంభణ.. 3 వేలకు చేరిన పాజిటివ్ కేసులు
ఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,997కు చేరింది. ఒక్క కేరళలోనే 2,669 కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా బారిన పడి కేరళలో ఒక వ్యక్తి మృతి చెందాడు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,33,328కు చేరింది. బిహార్‌లో మొదటిసారి రెండు కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. బిహార్‌లో నమోదైన కేసులతో దేశంలో మొత్తం 10 రాష్ట్రాల్లో కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పుదుచ్చేరిలలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో కరోనా వేరియంట్ జేఎన్1 విజృంభిస్తోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 265 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 23 జేఎన్1 వేరియంట్ కేసులు ఉన్నాయి.కాగా.. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తమైంది. రాష్ట్రప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. కరోనా మార్గదర్శకాలను పాటించాలని కోరింది. ఇదీ చదవండి: మళ్లీ విజృంభిస్తోన్న కరోనా.. ఆందోళన వద్దు! ఈ లక్షణాలు కనిపిస్తే.. -
Covid Variant JN.1: కరోనా కొత్త వేరియంట్.. 21 కేసులు నమోదు
కరోనా వైరస్ మరోసారి తన పంజా విసురుతోంది. అంతమైపోయిందనుకున్న కోవిడ్ మహమ్మారి కొత్త వేరియంట్ రూపంలో ప్రపంచ దేశాలను కలవర పెడుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 కేసులు భారత్‌లోనూ నమోదవుతున్నాయి. ఏడు నెలల తర్వాత కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపిస్తోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు దేశంలో ఇప్పటి వరకు జేఎన్.1 వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ బుధవారం వెల్లడించారు. ఒక్క గోవాలోనే 14 మంది దీని బారినపడినట్లు ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కటి చొప్పున కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసుల ట్రేసింగ్‌పై దృష్టిసారించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్థితి కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వ్యాప్తి, దాని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. చదవండి: ఈడీ విచారణకు సీఎం కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా?.. కారణమిదే! కొత్త వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి తెలిపారు . వైరస్ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం సజావుగా సాగాలని ఆయన కోరారు. కోవిడ్ ఇంకా ముగియలేదని, కాబట్టి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దని కోరారు.. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. మరోవైపు ఇప్పటిదాకా జరిగిన అధ్యయనాల ఆధారంగా.. కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి ఏం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వారంతాలు.. సెలవులు కావడంతో ప్రయాణాలు చేసే వాళ్లు ఎక్కువగా ఉంటారు. కాబట్టి, తగ్గించుకోవాలని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్క్‌లు ఖచ్చితంగా వాడాలని చెబుతున్నారు. -
భారత్ లో పెరుగుతున్న కరోనా కొత్త వేరియంట్ JN-1 కేసులు
-
ఒక్కరోజులో నాలుగు కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. రాష్ట్రంలో మంగళవారం ఒక్కరోజే ఏకంగా నాలుగు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 402 మందికి కోవిడ్ పరీక్షలు చేయగా నలుగురికి వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కోవిడ్ బులెటిన్ విడుదల చేశారు. కాగా గత వారం రోజుల్లో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితులు అందరూ ఐసోలేషన్ లేదా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో పలు ప్రాంతాల్లో నమోదైన కేసులు... కరోనా ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన జేఎన్1 సబ్ వేరియంట్‌వని అధికారులు చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో నమోదయ్యే కేసుల్లో ఈ వేరియంట్‌వి ఉన్నాయా లేదా అని తెలుసుకునేందుకు జీనోమ్ సీక్వెన్సింగ్ చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. కరోనాపై మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అత్యవసర సమీక్ష నిర్వహించారు. అన్ని ఆస్పత్రులను సిద్ధంగా ఉంచాలి కొత్త సబ్ వేరియంట్ జేఎన్1 పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు. దీన్ని ఎదుర్కొనేందుకు అన్ని ఆసుపత్రులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గత అనుభవంతో పరిస్థితులను కట్టడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలనీ మాక్‌డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఇతర దేశాలు, రాష్ట్రాల పరిస్థితిపై ప్రభుత్వం నివేదిక కోరింది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లోని జేఎన్ 1 వైరస్ పరిస్థితిపై ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సమగ్ర సమాచారం అందజేశారు. భయపడాల్సిన అవసరం లేదన్న అధికారులు ప్రజలు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని మంత్రికి అధికారులు వివరించారు. అయితే ఇతర దేశాల్లో కేసులు పెరిగినందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసిందన్నారు. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్షలు విరివిగా నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అందుకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. బుధవారం నుంచి పెద్ద ఎత్తున కరోనా టెస్టులు నిర్వహించాలని భావిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఇళ్లల్లో వారిని ఐసోలేషన్‌లో ఉంచడం వల్ల ఇతరులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చంటున్నారు. మాస్క్‌లు అవసరం లేదు కానీ... మాస్క్‌లు ధరించాల్సిన ప్రత్యేక అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా చికిత్సలకు నోడల్ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రి సిబ్బంది కూడా అప్రమత్తమై కరోనా కేసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు రోగులు వచ్చినా చికిత్సలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గాంధీ ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఈ సబ్ వేరియంట్లో జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి లక్షణాలు ఉంటాయని, కొంతమందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తనున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. -
కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: కరోనా కేసుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచన మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ మే రకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఈ నెల 8న కోవిడ్ కొత్త వేరియంట్ జేఎన్1 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించా రు. రాబోయే పండుగల సీజన్ దృష్ట్యా ప్రజలంతా పరిశుభ్రతను పాటించాలని, మాస్కులను ధరిం చాలని సూచించారు. శ్వాసకోశ సమస్యలు ఉన్నవా రు మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. కాగా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొనడానికి రాష్ట్ర యంత్రాంగం సిద్ధంగా ఉందని, వ్యాధినిర్ధారణ పరీక్షలకు కావాల్సిన కిట్స్, చికిత్సకు అవసరమైన మందులు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. ప్రజలు ఆందోళన చెంద వద్దని, చలికాలం నేపథ్యంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగే విషయాన్ని గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదకారి కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తేల్చింది కరోనా గురించి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వార్తల్లో ఉన్న కరోనా వేరియంట్ జేఎన్1 ఒమిక్రాన్‌కు చెందినదే. ఇది ఇప్పటికే భారత్ సహా పలు దేశాల్లో రెండు నెలలుగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది ప్రమాదకారి కాదని ఇప్పటికే నివేదిక విడుదల చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శ్వాస కోశ సంబంధ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో వృద్ధులు, దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. – డాక్టర్ కిరణ్‌మాదల, ఐఎంఏ సైంటిఫిక్ కన్వీనర్, తెలంగాణ -
కరోనా డేంజర్ బెల్స్.. మరోసారి 12 వేలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 12,193 మంది కోవిడ్ బారినపడ్డారు. మరో 42 మంది వైరస్‌కు బలయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 67,556గా ఉంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,48,81,877కు చేరగా.. మృతుల సంఖ్య 5,31,300కు పెరిగింది. కాగా.. వైరస్ సోకిన వారిలో 4,42,83,021 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. మరణాల రేటు 1.18 శాతంగా నమోదైంది. శుక్రవారం నాటికి దేశవ్యాప్తంగా 220.66 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కొనసాగించాలన్నారు. బూస్టర్ డోసు తీసుకోనివారు ఉంటే వీలైనంత త్వరగా తీసుకోవాలని చెబుతున్నారు. చదవండి: అత్యంత ‘వేడి’ సంవత్సరం ఏదంటే..! ఆ నివేదిక ఏం చెబుతోంది? -
కోవిడ్ గుప్పిట్లో దేశ రాజధాని.. ఏకంగా 430 శాతం పెరిగిన కేసులు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ కోవిడ్ గుప్పిట్లో చిక్కుకుంది. కొత్త కేసుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. మూడు వారాల లోపే కేసుల సంఖ్య ఏకంగా 430 శాతం పెరిగిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే పాజిటివిటీ రేటు కూడా 26.54 శాతంగా ఉండటం కలవారుపాటుకు గురిచేస్తోంది. మార్చి 30న ఢిల్లీలో 4,976 కేసులు ఉండగా.. ఏప్రిల్ 17నాటికి ఆ సంఖ్య 13,200కు చేరింది. తాజాగా బుధవారం మరో 1,537 కేసులు వెలుగుచూశాయి. మరో ఐదుగురు వైరస్‌కు బలయ్యారు. ఫలితంగా ఢిల్లీలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 20,25,781కి చేరింది. మృతుల సంఖ్య 26,572గా ఉంది. దేశంలో 10వేలకు పైగా కొత్త కేసులు.. మరోవైపు దేశంలో కరోనా కొత్త కేసులు క్రితం రోజుతో పోల్చితే భారీగా పెరిగి మళ్లీ 10వేల మార్కును దాటాయి. మంగళవారం 7,633 కేసులు వెలుగుచూడగా.. బుధవారం ఆ సంఖ్య 10,542కు పెరిగింది. మరో 38 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 63,562గా ఉంది. మొత్తం మృతుల సంఖ్య 5,31,190కి చేరింది. రికవరీ రేటు 98.67శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా మంగళవారం నాటికి 220.66 కోట్ల కరోనా టీకా డోసులు పంపిణీ చేశారు. చదవండి: పెళ్లీడు పెరిగింది.. తెలంగాణ అమ్మాయిలు ఎన్నేళ్లకు పెళ్లి చేసుకుంటున్నారంటే..? -
Covid-19: దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసులు
దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసులు ఉధృతంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 9,111 కరోనా కేసుల నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,48,27,226కి చేరింది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య 60 వేల మార్క్‌కు దాటింది. ప్రస్తుతం 60,313 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో మొత్తం 6,313 రికవరీలు జరగగా మొత్తం రికవరీల సంఖ్య 4,42,35,772కి చేరుకుంది. గత కొద్ది రోజలుగా పెరుతున్న కరోనా కేసుల సంఖ్యతో పోలిస్తే తాజగా నమోదైన కేసుల సంఖ్యలో కాస్త తగ్గుదల కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అదీగాక గత 24 గంటల వ్యవధిలో గుజరాత్లో ఆరుగురు, ఉత్తర్ ప్రదేశ్, కేరళలో నలుగురు చొప్పున, ఢిల్లీ, రాజస్థాన్‌లో ముగ్గురు చొప్పున, మహారాష్ట్రలో ఇద్దరు, బీహార్, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కొవిడ్ మృతుల సంఖ్య 5,31,141కి ఎగబాకింది. ఇక ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.13శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక రికవరీ రేటు 98.68 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల (220,66,26,522) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ ఎక్స్‌బీ1.16 వల్లే దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, దేశంలో పదిరోజుల వరకు ఇలానే కొనసాగుతుందని తదనంతరం తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: ఆగని కరోనా ఉధృతి.. కొత్తగా 11,109 మందికి పాజిటివ్.. 50 వేలకు చేరువలో యాక్టివ్ కేసులు) -
Covid-19: ఆగని కరోనా ఉధృతి.. కొత్తగా 11,109 మందికి పాజిటివ్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 11,109 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేల మార్క్‌కు చేరువై 49,622గా ఉంది. కరోనా కారణంగా మరో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడినవారిలో ఇప్పటివరకు మొత్తం 4,42,16,853 మంది కోలుకున్నారు. మొత్తం 5,31,064 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే రోజువారి పాజిటివిటీ రేటు 5.01శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 4.22శాతంగా ఉంది. కాగా.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా యాంటీ ఇన్ఫెక్టివ్, రెస్పిరేటరీ డ్రగ్స్ విక్రయాలు దాదాపు 50 శాతం పెరిగినట్లు ఓ నివేదిక తెలిపింది. జ్వరం, దగ్గు, ఇతర లక్షణాలతో బాధపడుతున్న వారు మెడికల్ షాపులకు వెళ్లి ఈ మందులు కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఢిల్లీలో కరోనా కేసుల్లో వృద్ధి నమోదవుతున్న కారణంగా ఉత్తర్‌ప్రదేశ్ నోయిడా ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. స్కూళ్లు, కాలేజీలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరి చేసింది. అలాగే కార్యాలయాల్లో శానిటైజేషన్ చేసి పరిశుభ్రత పాటించాలని, కరోనా లక్షణాలు కన్పించిన ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం ఆప్షన్ ఇవ్వాలని తెలిపింది. చదవండి: స్కూళ్లు, కాలేజీల్లో మాస్కులు తప్పనిసరి.. దగ్గు, జ్వరం లక్షణాలుంటే ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం..! -
స్కూళ్లు, కాలేజీల్లో మాస్కులు.. ఆ ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం..!
లక్నో: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ నోయిడా ఆరోగ్య శాఖ కీలక సూచనలు చేసింది. వైరస్ బారినపడకుండా ప్రజలు భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, ఇతర బహిరంగ ప్రదేశాల్లో కచ్చితంగా మాస్కు పెట్టుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. మరోవైపు పని ప్రదేశాల్లో యజమాన్యాలు కరోనా నివారణ చర్యలు చేపట్టాలని అధికారులు తెలిపారు. కార్యాలయాలను శానిటైజర్లతో శుభ్రం చేయాలని, ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ ఉష్ణోగ్రత స్కానర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే ఎవరైనా ఉద్యోగుల్లో జలుబు, దగ్గు, జ్వరం, ఫ్లూ వంటి లక్షణాలు కన్పిస్తే వాళ్లకు వర్క్‌ఫ్రం హోం ఇవ్వాలని చెప్పారు. లక్షణాలు తగ్గకపోతే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆ ఉద్యోగులకు సూచించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో దాని పక్కనే ఉన్న గౌతమ్ బుద్ధ నగర్, సహా ఇతర ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని నోయిడా అధికారులు ఈమేరకు చర్యలు చేపట్టారు. దేశ రాజధానిలో గురువారం 1,527 కరోనా కేసులు వెలుగుచూశాయి. బుధవారంతో పోల్చితే ఇవి 33 శాతం అధికం. పాజిటివీ రేటు కూడా 27.7 శాతంగా ఉంది. దీంతో ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాలు ముందు జాగ్రత్త చర్యగా చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. చదవండి: సూరత్ కోర్టులో వాదనలు.. ‘మరీ ఇంత పెద్ద శిక్షా ?’ -
కొత్తగా 10,158 కరోనా కేసులు నమోదు
-
దేశం లో కొత్త కరోనా కేసులు...
-
Covid-19: దడ పుట్టిస్తున్న కరోనా.. 7 నెలల గరిష్టానికి కొత్త కేసులు..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 7,830 మందికి పాజిటివ్‌గా తేలింది. గత ఏడు నెలల్లో నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం కావడం గమనార్హం. క్రితం రోజుతో(5,676 కేసులు) పోల్చితే దాదాపు 50 శాతం అధికం. కొత్త కేసులతో కలిపి దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 40వేల మార్క్ దాటి 40,215కు చేరింది. కరోనావ్యాప్తి మొదలైనప్పటి నుంచి వైరస్ బారినపడివారిలో 4,42,04,771 మంది కోలుకున్నారు. కోవిడ్ సోకి ఇప్పటివరకు మొత్తం 5,31,016 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్ మాజీ శాస్త్రవేత్త తెలిపారు. వైరస్ వివిధ రకాలుగా మ్యుటేషన్లు చెంది బలహీనపడుతోందని చెప్పారు. అందుకే పాజిటివ్‌గా తేలిన వారిలో స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం కూడా రావడం లేదని పేర్కొన్నారు. అయితే ప్రజలు కచ్చితంగా కరోనా జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. బూస్టర్ డోసు తీసుకోనివారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని సూచించారు. చదవండి: కోవిడ్ అంతమయ్యే అవకాశముంది.. అయినా సరే నిర్లక్ష్యం వద్దు.. బూస్టర్ డోసు తీసుకోవాల్సిందే -
గాంధీ ఆసుపత్రిలో డీఎంఈ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్
-
మళ్లీ పంజా విసురుతున్న కరోనా
-
Corona Virus: జాగ్రత్త! కేసులే కాదు.. మరణాలూ పెరుగుతున్నాయ్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తగ్గుముఖం పట్టిందనుకునేలోపే మరోసారి మహమ్మారి తన ప్రతాపం చూపుతోంది. కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 5,880 మంది కరోనా బారినపడ్డారు. కిందటి రోజుతో పోలిస్తే కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. ఇక నిన్న ఒక్క రోజే 14 మంది వైరస్ కారణంగా మృత్యువాతపడ్డారు. ఈ మేరకు సోమవారం కేంద్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 44,196,318కు చేరింది. మరణాల సంఖ్య 5,30,979కు చేరింది. మరణాలు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ముందు వరుసలో ఉన్నాయి. ప్రస్తుతం 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. రికవరీ రేటు 98.74, మరణాల రేటు 1.19గా ఉంది. మరోవైపు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కరోనా నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లోనే కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి. అంతేగాక మూడు రాష్ట్రాలు (హర్యానా, కేరళ పుదుచ్చేరి) బహరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలంటూ ఆదేశాలు జారీచేశాయి. చదవండి: తెలంగాణ పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ -
తెలంగాణలో భారీగా కరోనా కొత్త వేరియంట్ కేసులు.. దేశంలోనే టాప్-2
సాక్షి, హైదరాబాద్: ఎక్స్‌బీబీ1.16 కరోనా కొత్త వేరియంట్ కేసులు తెలంగాణలో ఇప్పటివరకు 93 నమోదయ్యాయి. కొత్త వేరియంట్ కేసులతో తొమ్మిది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఈ నెల 20వ తేదీ వరకు మహారాష్ట్రలో 104 కేసులు, కర్ణాటకలో 57, గుజరాత్లో 54, ఢిల్లీలో 19, పుదుచ్చేరిలో 7, హరియాణాలో 6, హిమాచల్ ప్రదేశ్‌లో 3 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఆ వేరియంట్ కేసుల సంఖ్య ఇప్పటి వరకు 344కి చేరుకుంది. ఈ వేరియంట్ వైరస్ అధిక వ్యాప్తిని కలిగి ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీని తీవ్రతను ఇంకా నిర్ణయించలేదని పేర్కొంటున్నారు. ఈ వేరియంట్ సోకినవారు ఇప్పటివరకు తీవ్రమైన స్థితిలో ఉన్నట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదు. ఈ కొత్త వేరియంట్ నిర్ధారణకు జీనోమ్ సీక్వెన్సింగ్ ముఖ్యం. జలుబు, దగ్గు లేదా జ్వరంతో బాధపడేవారు మాస్‌్కలు ధరించాలని, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా 23 కరోనా కేసులు నమోదు రాష్ట్రంలో మంగళవారం 5,122 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..వారిలో 23 మంది వైరస్ బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8.42 లక్షలకు చేరింది. ఒక్క రోజులో కరోనా నుంచి 52 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.37 లక్షలకు చేరింది. ప్రస్తుతం 190 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు వెల్లడించారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు! -
Covid XBB 1.16: దేశంలో కరోనా కొత్త వేరియంట్.. నాలుగో వేవ్ తప్పదా?
న్యూఢిల్లీ: దేశంలో తొలి కరోనా కేసు గుర్తించి మూడేళ్లు దాటింది. కేసులు తగ్గుముఖం పట్టడంతో ఈ మహమ్మారి నుంచి బయపడినట్లే అని అంతా అనుకున్నారు. అయితే ఇప్పుడు కరోనాతో పాటు, ఇన్‌ఫ్లూయెంజా కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితితో భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ XBB 1.16 వెలుగుచూడటం కలవరపాటుకు గురి చేస్తోంది. అత్యంత వేగంగా వ్యాపించే ఈ ఎక్స్‌బీబీ రకం వేరియంట్‌ను ఇప్పటికే చాలా దేశాల్లో గుర్తించారు. అయితే భారత్‌లో కరోనా కేసుల పెరుగుదలకు ఈ వేరియంటే కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కేసులు తక్కువగానే ఉన్నప్పటికీ మున్ముందు పెరిగి దేశంలో కరోనా నాలుగో వేవ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ కోవిడ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫాం వివరాల ప్రకారం XBB 1.16 వేరియంట్ కేసులు భారత్‌లోనే అధికంగా నమోదయ్యాయి. మనదేశంలో ఈ వేరియంట్ అధికారిక కేసుల సంఖ్య 48గా ఉంది. అమెరికా, సింగపూర్‌లో ఈ సంఖ్య 20 లోపే ఉండటం గమనార్హం. గత కొద్ది వారాలుగా భారత్‌లో ఈ వేరియంట్ కేసుల్లో సడన్ జంప్ నమోదైంది. ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మరో వేవ్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో XBB 1.16 వేరియంట్ ప్రాబల్యం ఎక్కువగా ఉంది. కోవ్‌స్పెక్ట్రం ప్రకారం XBB 1.16 వేరియంట్ XBB 1.15 నుంచి అవతరించలేదు. కానీ రెండూ XBB నుంచి వచ్చిన ఉపరకాలే. ప్రస్తుతానికి, కోవిడ్ XBB 1.16, XBB 1.15 లక్షణాల మధ్య ఎటువంటి తేడాలు లేవు. ఇది సోకినవారిలో జ్వరం, గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి, ఒంటి నొప్పులు, అలసట వంటి లక్షణాలే ఉంటాయి. ఈ వేరియంట్ జీర్ణవ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థను కూడా ప్రభావితం చేయవచ్చు. చదవండి: కర్ణాటకలో కాంగ్రెస్ చేతిలో బీజీపీ చిత్తు.. ఈసారి 70 సీట్లే.. ఫేక్ సర్వే వైరల్