సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. తగ్గుముఖం పట్టిందనుకున్న మహమ్మారి మరోసారి తన విశ్వరూపం చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 64,474 మందికి పరీక్షలు చేయగా.. 2,295 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీటిలో జీహెచ్‌ఎంపీ పరిధిలో1452,రంగారెడ్డిలో 218, మేడ్చెల్‌లో 232 కేసులు నమోదయ్యాయి.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శుక్రవారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 6,89,751కు చేరింది. మరణాల సంఖ్య 4,039కు పెరిగింది. తెలంగాణలో రికవరీ రేటు 97.98%గా ఉంది. ప్రస్తుతం 9,861 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చదవండి: ఒమిక్రాన్ కూడా ప్రాణాంతకమే డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక
Comments
Please login to add a commentAdd a comment