దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. గత కొద్దిరోజులుగా స్థిరంగా ఉన్న కేసులు.. గురువారం ఒక్కసారిగా పెరిగాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళనకంగా మారింది.
కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 12,608 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. అదే సమయంలో వైరస్ కారణంగా 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజే 16,251 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1,01,343 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక, రికవరీ రేటు 98.56 శాతానికి చేరుకుంది. యాక్టివ్ కేసులు 0.23 శాతానికి తగ్గాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 4,42,98,864 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 4,36,70,315 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,27,206 మంది మృతి చెందారు.
ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 1652 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఇక ఆగస్టు 1వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఢిల్లీలో కరోనా బారినపడి ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య దాదాపు 50 శాతం పెరిగింది. రెండు వారాల కింద 291 మంది ఆసుప్రతిలో చేరగా.. తాజాగా 591 మంది ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. దేశంలో ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య.. 2,08,95,79,722కు చేరింది. బుధవారం ఒక్కరోజే.. 38,64,471 మందికి టీకాలు అందించారు.
ఇది కూడా చదవండి: గ్రేట్ లవర్స్.. ఫేస్‌బుక్ లవ్ మ్యారేజ్ చివరకు ఇలా..
Comments
Please login to add a commentAdd a comment